ముసుగు కప్పేస్తుంది ఏ దారిన వెళ్ళినా నాని ముద్దవుతున్నాను తడిసిపోయి ఏమారుతున్నాను చుట్టూ వలయమై తిరుగుతున్నాను కాస్త ఆగుదామని ప్రక్కకు నిల్చుంటే… దారి మారిపోయి గమనం అగుపించడమే లేదు విచిత్రంగా గుర్తులైనా వెతుకుదామని బయలుదేరా అక్కడ … దొరికిందో పుస్తకం గ్రహణం పట్టిన బ్రతుకుకు గమనం ఏదో చెప్పింది
మనసుతెరుచుకుంది ఈ క్షణం చుట్టూ మనుషులు మూసుకుపోతున్న వేళ సంతోషం పెదవులు దాటి కాదు హృదయం దాటి అక్షరంలా పరుచుకుంది టెక్నాలజీ నన్ను లోబరుచుకుంది ఆకర్షణీయమైన హాంగులతో నా చూపుల గాలాలతో మెరిసిన జీవితంలో అంధకారం కనిపించలేదు కానీ …. తెలిసినది ఇపుడే జ్ఞానం ప్రకాశించిన వేళ పుస్తకం తెరిచిన వేళ సాహిత్యం నాలోనూ ప్రవాహంలా సాగుతున్న వేళ ఒక్కో పదబంధం నా నాడులను ఉత్తేజితం చేస్తూ మనిషివలె తిరిగి మానవతవైపు లోకం వదిలేసిన చేయూత వైపు చేరువగా పల్లె వైపు కన్నతల్లి లాలనలో పుస్తకం ఊయలలో హాయిగా నా మస్తకం
1 comment
https://shorturl.fm/2PHqQ