మనసు పాటల కవి
సాహిత్యపు మర్మమెరిగిన
మన ‘సుకవి’
అలతి పదాలతో
అమోఘమైన
పాటలల్లి
జనహృదయ పీఠమెక్కిన
మేటి గీతాచార్యుడు
నాటక రచనలో శిఖరం
సంభాషణల కూర్పులో
ఆ ప్రతిభ అనితర సాధ్యం
భావోద్వేగాల ప్రగతిశీల వీచిక
గుండె బరువును దించే
చల్లని పాటల పేటిక
అంతా మట్టేనని
అదీ ఒక మాయేనని తెలిసి
మనిషి విలపించుట
ఎందుకన్న తాత్విక యోగి
చెరగని మనసు ముద్ర
సతతం ఆయన కీర్తి సముద్రమంత
(ఆచార్య ఆత్రేయ వర్ధంతి…)

3 comments
https://shorturl.fm/XG0Cd
https://shorturl.fm/01041
https://shorturl.fm/4D34t