కవితలు మనసు – మాట by Aruna Dhulipala July 29, 2024 written by Aruna Dhulipala July 29, 2024 వాళ్లిద్దరూ….ఎంతో ఆత్మీయులుఅప్పుడప్పుడువిడదీయలేని శత్రువులు అంతరంగ జగత్తుకుఒకరు సాధికారులుశబ్దాశ్రయంగాబహిరంగ స్వరాధికారులువేరొకరు లోతుల్లోని భావాలమర్మం ఒకరైతేభావ వినిమయ ప్రసారాలచతురులు మరొకరు ఆలోచనల సూక్ష్మతఒకరిదైతేపెదవుల వాహకంగాపరుగులు తీసేధ్వని తరంగాలు ఇంకొకరివి మనసు చెప్పినామాట పలుకదు ఒక్కోసారివద్దంటున్నాపలుకక ఉండదు మరోసారివీటి మధ్య మౌనంమింగుతుంది కాలాన్నిఅనేకసార్లు మనసు, మాటకు నడుమకావాలి మేలనంఅదే కరువైతేవ్యక్తిత్వపు చిరునామాకుతప్పవు అవమానాలుఅనుభవం ఎంతటిదైనా-!! దాచుకోవాల్సినవి కొన్నిదాపరికం ఉండకూడనివి మరిన్నిఏది తగునో?ఏది తగువో?పెదవి దాటడమంటేమనసు స్వచ్ఛమై వికసించడమే !! 0 comment 0 FacebookTwitterPinterestEmail Aruna Dhulipala previous post ఆషాఢం – విశిష్ఠత next post The Learned You may also like సహన ధాత్రి September 29, 2024 కల్తీయుగం September 29, 2024 ఆత్మ సౌందర్యం September 29, 2024 అంగూరు గుత్తులు September 29, 2024 వలసకూలి (కధాకవిత) September 28, 2024 వృక్షమాత September 28, 2024 బాట July 31, 2024 ఆషాఢ జాతర July 31, 2024 ధన్వంతరీ స్వరూపం July 31, 2024 గ్రీష్మ తాపము July 30, 2024 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.