మనిషికి బాల్యం పునాది వంటిది. పిల్లలు కదా వారికి ఏమి తెలుసు అని అనుకోవడం పొరపాటు. వారి పరిశీలన , అవగాహన లోతుగా ఉంటుంది. బాల్యం లో ఏర్పడిన అభిప్రాయాలు, అభిరుచులు, మనిషి వయసుతో పాటు పరిణతి చెందుతుంటాయి. అందుకే వారికి చిన్న వయసులోనే అంటే మూడేళ్ళ వయసు లోపే ఏది , మంచి , ఏది చెడు అనేది చెబుతుండాలి. ఆ వయసులోనే వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవచ్చు . ఈ దిశగా పెద్దలు పిల్లలను అవగాహన చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి. అంతే కాకుండా. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమం లో పిల్లల మానసిక ఎదుగుదల కూడా పెరిగింది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారు గమనించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
అదే విధముగా రచయితలూ కూడా తమ రచనల్లో మార్పులు తీసుకు రావాలి. బాల్యం లోనే సృజన అమోఘంగా ఉంటుంది. దాన్ని పదును పెట్టడానికి పెద్ద్లు కృషి చేయాలి . కానీ మీరు అనుకున్నది వారు చేయాలి. మీరు చెప్పింది వారు వినాలి అనే ధోరణి ఉంటే వారు రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతారు. వారి ఆలోచనలు మారుతున్న కాల పరిస్థితులను అవగాహన చేసుకుని పెద్దలు కూడా తమ రచనల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు చందమామ , బాల మిత్ర కథలు కాదు ఈ తరానికి తగిన రచనలు చేయాలి. ప్రపంచ బాలలతో పోటీ పడి ఎదగాలంటే బాల సాహితీ వేత్తలతో పాటు ప్రభుత్వాలు, సమాజ ఆలోచనల్లో తగిన మార్పు రావలసి వుంది.
ఇలా పెద్దల్లో మార్పు వస్తే భావితరానికి బంగారు బాట వేసిన వారమవుతాము.
ప్రతి ఏటా ఉపాధ్యాయులకు , రచయితలకు కార్యశాలలు ఏర్పాటు చేయాలి. సమాజ ఆలోచనా విధానాలు కూడా మారాలి. మారుతున్న కాలం తో పాటు మనుషులు కూడా మారాలి. ఆ మేరకు పిల్లల ఆలోచనలకు అనుగుణంగా అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి , మొక్కు బడి ఆలోచనల నుంచి బయట పడాలి. రచనలు చేయడం ఒక్కటే సరిపోదు , మీరు రాసేది ఎందరు చదువుతున్నారు , ఎంతమందికి ఉపయోగ పడుతుంది ఆలోచించాలి. లేకుంటే మీ లక్ష్యం నెరవేరనట్టే .
మారుతున్న కాలం తో పాటు బాల సాహిత్యం లో మార్పు రావాలి
previous post