Home కథలు “మా ఊరి కథలు”

“మా ఊరి కథలు”

by Charu Sri

పల్లె పరిచయం

పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు… అప్పుడైనా.. ఇప్పుడైనా .. ఎప్పుడైనా..కాకపోతే నేడు పల్లెలను కుళ్లు రాజకీయం పట్టి పీడిస్తోంది.‘మనీ‘ విషవలయంలో మానవ సంబందాలనూ చిక్కి శల్యం చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే పల్లె వాతావరణం పట్టణీకరణ అయిపోయింది. అయితే 70వ దశకంలో పల్లెలు స్వచ్ఛమైన అమాయకత్వానికి, ఐకమత్యానికి అద్దం పట్టేవి. పల్లె వాతావరణం ఉమ్మడి కుటుంబాన్ని తలపించేవి. కష్టసుఖాలను , ఒకరికి ఒకరు కలిసి పంచుకునేవారు. పశు, పక్షాదులతో సహజీవనం చేసేవి పల్లెలు. పల్లెప్రజలు ప్రకృతి ఒడిలో సేదదీరేవారు. అందుకే పల్లె ప్రజలు ఆరోగ్యంగా జీవించే వారు. అనారోగ్యం వారి దరికి చేరేది కాదు. జలుబు, జ్వరం లాంటి వాటికి అమ్మలే డాక్టర్లు. వంటింటి వైద్యం చాలా రోగాలకు పరిష్కారం.

నేటి తరానికి నాటి పల్లెల మట్టి వాసనలు, మంచితనం, అమాయకత్వం, సమైక్యత , సహృదయత గురించి తెలియవు…అందుకే నేటి యువతరానికి నాటి గ్రామీణ వాతావరణాన్ని,గ్రామీణ భారతాన్ని పరిచయం చేయాలన్నదే.. “మా ఊరి కథలు”ఉద్దేశం!
( ప్రతి మయూఖ సంచికలో ఈ ” మా ఊరి కథలు ” శీర్షిక తో ఒక్కో విషయాన్ని రచిస్తారు రచయిత . చాలా ఆసక్తికరంగా సాగింది ఈ రచన . పల్లెలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక అవగాహన అవసరం. మీరు తప్పక చదవాలి రచనను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను.

– మయూఖ పత్రిక సంపాదకులు.


వరంగల్ వైపు కారు దూసుకెళ్తోంది. ఒక మీటింగ్ లో పాల్గొనేందుకు మిత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ బయలు దేరాను. రహదారి పై మా ప్రయాణం . డ్రైవర్ కు మంచి అనుభవం ఉన్నట్లుంది. మనసే విహంగమా అన్నంత జోరుగా దూసుకెళ్తోంది కారు. హైవే సైడున ఉన్న కీలోమీటర్ రాళ్ళు వెనక్కి పరుగెడుతన్నాయి. అంటే వేగం వంద క్రాస్ అయింది.

“మల్లేషన్నా..కారు స్పీడు తగ్గించే..మీటింగ్ కు కాస్త లేటయినా ఫరక్ పడదే” అన్నా డ్రైవర్ తో..! మెల్లగ కారువేగం తగ్గించాడు డ్రైవర్. రోడ్ పక్కన ఉన్న సైన్ బోర్డులు స్పష్టంగా కనబడుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే జనగామ అనే సైన్ బోర్డ్ కనిపించింది.. జనగామ వెళ్ళాలంటే హై వే దిగి లోనికి వెళ్ళాలి.. ఇక్కడ జనగామ ప్రస్థావన ఎందుకంటే… ఆ సైన్ బోర్డు చూడగానే అందరి మదిలో ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి మెదిలాడు. ఎందుకంటారా …
జనగామకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ అధికారి స్వగ్రామం. అంతే కాదండోయ్ తాను పుట్టి పెరిగిన ఊరు, జన్మ నిచ్చిన తల్లి రుణం తీర్చుకున్న ధన్యజీవి ఆ ఐఎఎస్ అధికారి. అందుకే జనగామ బోర్డు చూడగానే ఆ ఐఎఎస్ అధికారి, ఆయన స్వగ్రామంమం ఓబులకేశవ పురం మదిలో మెదిలాయి. గతంలో ఆయన గురించి, ఊరుగురించి విన్నాను కాబట్టి ఓబులకేశవ పురం గ్రామాన్ని , అధికారి కట్టించిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం చడాలనిపిన్చింది.. అదే మాట కార్లో ఉన్న మితృలతో చెప్పా. వాళ్లు సరే అన్నారు.. కాకపోతే తిరుగు ప్రయాణంలో వెళ్దాం అన్నారు..సాయంత్రం లేటు అయితే ఎట్లా ? .. అనే సందేహం కలిగింది… వెంటనే ..”మల్లేశన్న కారు వేగం పెంచే.. వచ్చేప్పుడు ఓబులకేశవ పురం చుసివెళ్ళాలి అన్నాను … అంతే మల్లేశన్న కారు స్పీడు పెంచిండు.. ..”గాల్లో తేలి నట్లుందే…అన్నట్లు ముందుకు దూసుకుపోయిందీ.

గంటల్లో గమ్యస్థానం చేరుకొని, పని ముగించుకొని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయనమయ్యాము. నేను కారు కిటికీల్లోంచి బయట ప్రకృతిని చూస్తూ కూర్చున్నా. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, చేలు …వాతావరణం ఆహ్లాదంగా మారింది. . అంత వరకు తీక్షణమైన ఎండ… అంతలోనే మేఘాలు కమ్ముకున్నాయి. అంతే వాతావరణం చల్లబడింది. అంతలో కారు వేగం తగ్గి హైవే దిగి కుడివైపు టర్న్ తీసుకుంది. మేము వేరే ఆలోచనలో ఉన్నా డ్రైవర్ మర్చి పోలేదు..ఓబుల కేశవపురం వెళ్ళాలని అనుకున్న విషయం. అందుకే జనగామ బోర్డ్ కనిపించగానే టర్న్ తీసుకుండు… నేను ఆలోచిస్తుండగానే జనగామ వచ్చేసింది.. టౌన్ మధ్యలోంచి కారు ఓబుల కేశవపురం వైపు పరుగు పెడుతోంది. ఆ ఊరు చిన్నదే అయినా రోడ్డు మాత్రం బాగుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చేలు..మధ్య మధ్యలో గుట్టలు.. నల్లని తారు రోడ్డు..జవ్వని వాల్జడలా ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతోంది. అలా కొంతదూరం వెళ్ళాక కారు లెఫ్ట్ టర్న్ తీసుకుంది,, కారు మళ్లిన దగ్గర ప్రసన్న వెంకటేశ్వర స్వామీ దేవాలయం, ఓబుల కేశవా పురం అని సైన్ బోర్డు ఉంది.. అంటే ఒక పదినిమిషాల్లో గమ్యస్థానం చేరుతమన్న మాట. అంతవరకు ఎవరి ఆలోచనల్లో వారుగా ఉన్న మిత్రులం అలర్ట్ అయ్యాము. ముందుసీట్లో కూర్చున్న ప్రియ మేడం మరింత అలర్ట్ అయింది . లోకేషన్ మ్యాప్ ఆన్ చేసింది.. రూట్ మ్యాప్ సాయంతో సాఫీగా సాగున్న కారుకు ఒక్కసారి బ్రేకులు పడ్డాయి. అప్పుడే గుడి వచ్చిందా అని చూస్తే.. ఎడమ వైపున గ్రామపంచాయతి కార్యాలయం, కుడి వైపున పెద్ద చెట్టు.. దానికింద ఆంజనేయస్వామి గుడి.

లోకేషన్ మ్యాప్ ఎడమ వైపు దారి చూపుతోంది. రోడ్ మాత్రం ఫర్లాంగ్ దూరంలో కుడివైపునకు మళ్ళింది. ఎడమవైపున పంచాయతి కార్యాలయం కంపౌండ్ వాల్ ఆనుకోని చిన్న సందు ఉంది. అతికష్టం మీద కారు వెళ్ళొచ్చు. కాని కారు దిగి చూస్తే ఎదురుగ ఒక ఇల్లు కనిపిస్తుంది. అవతలకు కారు వెళ్ళే చాన్స్ లేదు. దీంతో గుడికి వెళ్ళాలంటే ముందుకెళ్ళి కుడివైపు వేళ్ళలా? లేక పంచాయతి ఆఫీసు పక్కెంట ఎడమవైపు వెళ్ళాలా అనే మీమాంసతో డ్రైవర్ కారు ఆపిండు, కార్లో ఉన్న వాళ్ళందరం కొత్తోళ్ళమే కింకర్తవ్యం? ప్రియ మేడం గారు ఆ వూరి వ్యక్తికి కాల్ చేయక తప్పింది కాదు. ఆ కాల్ తో లోకేషన్ మ్యాప్ చెప్పిందే కరెక్ట్ అని తేలినది. మల్లేష్ కారును కంపౌండ్ వాల్ పక్కెంట ముందుకు పోనిచ్చాడు. కొద్ది ముందుకు వెళ్ళగానే ఎదురుగ ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళక ముందే కుడివైపున ” ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ” అని రాసిఉన్న ఆర్చ్ దర్శనం ఇచ్చింది.

ఆర్చ్ కింది నుంచి ఆలయం వద్ద వెళ్లి ఆగింది.. అంతకు ముందే ఓక వాహనమ ఆగి ఉంది అక్కడ . అయితే అది మోడిఫై చేసిఉంది. చాన్నాళ్ళుగా అది అక్కడే ఉందన్న సంగతి ఆ జీప్ ను చూస్తే అర్ధమైంది. దాన్ని ఉత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కు వినియోగిస్తారని గుడికి కాపలాగా ఉండే వ్యక్తి ద్వారా తెలుసుకున్నాము. కార్ పార్క్ చేసి గుడిలోకి వెళ్లేందుకు మున్దుకు కదిలాము.అయితే గుడి ప్రాంగణంలోకి వెళ్లేందుకు అక్కడ ఒక చెక్క గేటు ఉంది. ప్రాంగణం చుట్టూ కంచే. గేటు తీసుకొని లోపలి వెళ్తుంటే గుడి వరకు నాపరాతి బండలతో దారి ఉంది.. ఆ దారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా కుడా ఏర్పాటు చేసారు. లోనికి వెళ్తుంటే..కుడివైపున ఒక కట్టడం ఉంది. దాని పైకప్పు పిరిమిడ్ లా ఉంది. కింద నాపరాతి బండలతో ఫ్లోరింగ్ . చుట్టూ కూర్చునేందుకు వీలుగా రెండు ఫీట్లంత గోడ, మధ్యలో హోమాలు, యజ్ఞాలు చేసుకునేందుకు వీలుగా ఆ నిర్మాణం ఉంది.. అదే విషయాన్ని కాపలాదారు ధ్రువీకరించారు. గుడిలోకి ప్రవేశించకముందు కనిపించిన మోడిఫై చేసిన వాహనం, హోమాలకోసం చేసిన నిర్మాణం నిర్మించిన నిర్మాత ముందు చూపు అద్దం పడుతోంది.

ఇంకాస్త ముందుకు వెళితే యజ్ఞ మండపం వెనకాల ఒక కోనేరు. మధ్యలో చక్రతల్వార్ శిలా విగ్రహం.. అంటే ఉత్సవాల చివరిరోజు చరస్నానం కోసం దీని నిర్మించారు. కోనేరు ఏడు అడుగులు ఉంటుందనుకుంట.. ఆలయం లోకి ప్రవేశించే దారికి ఎడమ వైపున చక్కని పూదోట. తోటకు మధ్యలో మరో కోనేరు.. దాని మధ్యలో కాళీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని శిల్పం చూడ ముచ్చటగా ఉంది. అందులో జీవకళ ఉట్టిపడుతోంది. రెండు కోనేర్లు దాటుకొని ముందుకు వెళ్తే ఆలయ ముఖమండపం. ఎదురుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గర్భాలయం. స్వామి గర్భాలయానికి ఇరువైపులా శ్రీ దేవి, భూదేవిల అనుబంధ ఆలయాలు. మేము వెళ్ళే సమయానికి పూజారి లేడు . కాకపోతే ఆలయం తలుపులు తీసి ఉన్నాయి. కాని ఇనుప సువ్వలతో చేసిన జాలి వేసి ఉంది.. జాలి రంధ్రాల్లో నుంచి స్వామిని దర్శించుకున్నాము. స్వామీ నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే ఏదో ఆధ్యాత్మిక భావన. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ప్రణమిల్లి ముఖ మండపంలో కూర్చున్నాము. ఇంతలో ఆలయ కాపలాదారు వేడి వేడి కాఫీ అందించారు. అప్పటికి అదే ప్రసాదం అనుకొని ..హాయిగా సేవించాం.

చెప్పడం మరిచాను .. ఆర్చ్ నుంచి లోనికి వచ్చేప్పుడు ఎడమ వైపున ఒక గది ఉంది. అది కాపలా దారుని కోసం నిర్మించింది. కాస్త ముందుకెళితే ఒక పాక. అది నిర్మాణంలో ఉన్న గోశాల అని చాడు కాపలా దారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక కళ్యాణ మండపోం నిర్మాణంలో ఉంది. ఇక ఆర్చి నుంచి లోనికి వచ్చేప్పుడు.. కుడివైపున ఒక పార్కు. పిల్లలు ఆడుకోడానివీలుగా… ఇక పార్క్ కు వెంక భాగంలో విశాలమిన్ స్థలం. అందులో ఒక అందమైన ఇల్లు.. గుడి లోంచే అందులోకి వెళ్లేందుకు మార్ఘం ఉంది.. అది ఐఎఎస్ అధికారి గెస్ట్ హౌస్ అని చెప్పాడు. మాకు సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ. మేము గుడికి వస్తున్నామని తెలిసి బుర్రా వెంకటేశం గారు అతన్ని మాకు తోడుకోసం పురమాయించారు. . సదరు అధికారి చిన్నప్పుడు ఇక్కడే పెరిగాడా అని ఆరాతీస్తే.. ఆ స్థలం సారు చిన్నప్పుడు ఆడుకున్న పొలాలు. గుడికోసం అక్కడ దాదాపు ముడు ఎకరాలు సేకరించి గుడితో పాటు గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్న మాట. ఈ విషయం తెలియడంతో బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇల్లు చూడాలన్న ఆత్రుత. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఊరిలో ఉన్న సార్ ఇంటికి తీకేళ్ళా రు.

ఇంటితో పాటు ఊరు చుదోచ్చన్న ఆలోచనతో కారును గ్రామపంచాయతి ఆఫీసు వద్దకు తీసుకు రమ్మని మల్లేష్ కు చెప్పి.. నడుచుకుంటూ బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇంటికి వెళ్ళాము.. మేము వెళ్ళిన దారి ఎక్కువగా చిన్న చిన్న సందులు. బుర్రా వెంకటేశం గారి ఇల్లు న్ముదర్రాలు ఉంది అయితే దాన్ని మోడిఫై చేశారు. ఇంటిముందు రేకులతో వసార.. లోనికి వెళితే ఎవరయినా వస్తే కూర్చునేందుకు హాలు.. దానికి వెనకాల వంట గది.. పక్కనే బెడ్ రూం ..బొత్ రూ కూడా కలిప[ఐ ఉంది.. బొత్ రూం ముందు డ్రెస్సింగ్ రూం.. ఇదంతా వింటుంటే ఒక భవనం లా అనిపిస్తది. కాని ముడు అర్రాల విస్తీర్ణం లోనే చాలా పొందికగా తల్లి కోసం నిర్మించారు. ఇంటి ముందు బాతుంది పైకి వెళ్లేందుకు.. ఇంటి ముందు మాత్రం చెలక ఉంది, అందులో రెండు చింత మానులు ఉన్నాయి. ఎదయినా ఫంక్షన్ జరిగోఇతే చెట్ల కింద శుబ్రం చేసి ..షామియానాలు వేస్తే ఒక వందమందికి ఒకేసారి భోజనం వద్దిన్చెంత ఖాళి స్థలం అది. బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూసి బయటకు రాగానే ఇల్లు కుడివైపున ఉన్న వాళ్ళ దాయాదుల ఇల్లు చూసాము. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది. ఎందుకంటే తస్న పెళ్ళయిన దగ్గర నుంచి, కొడుకు పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న మూడు అర్రల మిద్దెను వదిలి విశాలమైన ఇంట్లోకి కొడుకుతో పాటు వెళ్లేందుకు తల్లికి ఇష్టం లేదు. అందుకే తల్లి కోసం గెస్ట్ హౌస్ కట్టించినా.. తాను పుట్టిపెరిగిన ఇంటిని తల్లి కోసం మోడిఫై చేయిన్చారు బుర్రా వెంకటేశం గారు. అంతే కాదు తాను ఐఎఎస్ అధికారి అయినప్పటికీ ఊరికి వస్తే ఆ చిన్న ఇంటిలోనే తల్లి తోపాటు భోజనం చేసేవాడట… ఢిల్లీ కి రాజయినా ఆ తల్లి కొడుకే కదా.

బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూశాక ఆయన చదువుకున్న బడి చూడాలని ఆకాంక్ష. కారు దగ్గరకు వెళ్లి అందులో బడి వద్దకు వెళ్ళాము. ఆ రోజు బడికి సెలవి. బుర్రా వెంకటేశం గారు చదివినప్పుడు అది ప్రాధమికోన్నత పాత శాల. ఇప్పుడు ఉన్నత పాటశాల. ఇపుడు బిల్డింగులు బాగానే ఉన్నాయి.. అప్పట్లో మాత్రం ఒకే బిల్డింగ్.. బుర్రా వెంకటేశం గారు అక్కడ ఐదు వరకే చదివారు. ఆ తర్వాత ఆరు నుంచి సర్వేలు గురుకులంలో చదివారు.. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ చెప్పే కొన్ని విషయాలు విన్నాక పల్లెటూరి కబుర్లు తెలుసు కోవాలన్న ఉత్సుకతను నాలో పెంచాయి.. అంతే మాకు హెల్ప్ చేసేందుకు వచ్చిన వ్యక్తికీ చెప్పి అరవై ఎండ్ల వయసున్న వ్యక్తితో మాట్లాడుతాను ఎవరైనా ఉంటె పిలిపించమని అడిగాను. అతను సరే అని ఒక అరవై యేండ్ల పెద్దమ్మను బడి దగ్గరకు తీసుకోచ్చాడు .
ఆమె వచ్చే వరకు నేను తరగది ముందున్న అరుగు మీద కూర్చొన్నా.. ఆ పెద్దమనిషిని చూసి ..పెద్దమ్మా దా ..అంటూ పిలిచా. ఆమె ఎలాంటి అరమరికలు లేకుండా వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమెది పుట్టిన ఊరు అది కాదు. పదవ ఏట పెళ్ళయి అత్తగారింటికి వచ్చింది. అంటే ఓబుల కేశవాప్పురంతో పెద్దమ్మ అనుబందం యాబై ఏళ్లు. ఆమె యాబై ఏళ్లుగా ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు పూసగుచ్చి నట్లు చెబుతోంది. నేనే కాదు మా మిత్రులు కూడా ఆశ్చర్యంగా వింటున్నారు.

ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ. అందుకు పెద్దమ్మే సాక్ష్యం. ఇక గ్రామాల్లో పెళ్ళిళ్ళు పెరంటాల్లప్పుడు తప్ప పెద్దగ కు;లం పట్టింపులు లేవు. పైగా చిన్న పెద్ద అని లేకుండా వరసలు పెట్టి పిలుచుకోవడం వళ్ళ ప్రజల మధ్య వారికే తెలియకుండా ఆత్మీయతతో కూడుకున్న అనుబంధం ఉండేది. అక్క , చెల్లి, చిన్నమ్మ, పెద్దమ్మ , మామయ్య, చిన్నాన్న, పెద్దమ్మ ,ఇలా వరుసలు పెట్టి పిలిచుకోవడం మూలంగా ఊరంతా ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది . అంతెందుకు నేను ఆ పెద్ద మనిషి పేరు అడగలేదు. పెద్దమ్మ అని పిలువగానే వచ్చి సాంత్కొడుకు;లా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ముందు, వెనుక ఆలోచించకుండా సమామాదానాలు చెప్పింది. అప్పట్లో జానపదులు మనస్సుల్లో కల్మషం ఉండేది కాదు. ఆ పిల్లోడయితే చిన్నప్పుడు ఎలా పలుకరించేవాడో..ఇప్పుడు కలెక్టరు అయ్యాక కూడా అంతే అప్యాయంగా పలుకరిస్తాదంటు… బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారి గురించి చెప్పిన తీరు అందుకు అద్దం పడుతోంది. యాబై ఏళ్ళ క్రితం ఊరిగురించి, ఊళ్ళల్లో జరిగే పండుగలు , శుభకార్యాలు, వ్యక్తుల గురించి పెద్దమ్మ చెబుతుంటే చెవులు రిక్కించి వినడం మా వంతయింది.
_**

You may also like

3 comments

Alison1260 November 27, 2025 - 2:35 pm Reply
Audrey2052 November 27, 2025 - 5:22 pm Reply
Lola2904 November 28, 2025 - 12:11 pm Reply

Leave a Reply to Audrey2052 Cancel Reply