విజేత

by Cheedella Seetha Lakshmi

చిన్నారి అంజలి పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బడికి వెళ్ళడానికి సిద్ధమైంది.
వాళ్ళ నాన్నమ్మ
“ఏంటి తల్లి ఈ రోజు ఇంత పొద్దున లేచినవ్” అంది.
ఏం లేదు నాన్నమ్మ ” చాచా నెహ్రూ పుట్టిన రోజు.బాలల పండుగ కదా .తొందరగా వెళ్ళాలి బడికి.ఏవేవో కార్యక్రమాలు ఉన్నాయి.ఎవరో పెద్ద ఆఫీసర్ కూడా వస్తాడంట మా బడికి”అన్నది అంజలి.
అంజలి ఒక్కగానొక్క కూతురు.ఎనిమిదవ తరగతి చదువుతున్నది.క్లాస్ లో ఎపుడు ఫస్ట్ .
చదువులో మాత్రమే కాదు పెయింటింగ్ వేస్తుంది.బొమ్మలు వేస్తే జీవం ఉట్టిపడుతుంది.ఒకసారి పరుగెత్తే జింకలను చూసి ఇంటికి వచ్చి గీసింది.కళ్ళకు కట్టినట్లు ఉంది. ఆ రంగుల ఎన్నిక,బొమ్మలు గీయడంలో నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
కరాటే నేర్చుకుంది చిన్నప్పటినుండే.జిమ్నాస్టిక్స్ నేర్చింది.డాన్స్ చేస్తుంది.చక్కగా పాటలు పాడుతుంది.ఈత వచ్చు.ఒక విద్యన ఒక కథన అన్నింటిలో ముందే ఉంటుంది. కాలం అసలు వృధా చేయదు.పొద్దున లేచినప్పటి నుండి బిజీగా ఉంటుంది.అట్లా అని చదువు లేదా అంటే దానిలో ఫస్ట్.ఒక్క రోజు కూడా స్కూల్ డుమ్మా కొట్టదు.


చాలా తెలివిగల పిల్ల.
స్కూల్లో టీచర్లకు కూడా చాలా ఇష్టం.
పొద్దున్నే టిఫిన్ తిని స్కూల్ కు బయలు దేరింది.
ఎంతో ఆనందం,ఉత్సాహంతో వెళ్ళింది.
ఆరోజు స్కూల్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఆ స్కూల్ బోర్డు చైర్మన్ వచ్చాడు.విద్యాశాఖ మంత్రి వచ్చాడు.

చాచా నెహ్రూ గురించి పిల్లలంటే ఆయనకు ఎంత ఇష్టమో ఇందిరాగాంధీకి రాసిన లేఖల ప్రస్తావన ఎన్నో విషయాలు వాటితో పాటు పిల్లల హక్కులు,బాధ్యతలు వాళ్ళు దేశం కోసం ఏం చేయాలో అనేక విషయాలు వక్తలు తమ ప్రసంగాల్లో చెప్పారు.పిల్లలు శ్రద్ధగా విన్నారు.
చివరికి ఆటలు,పాటలు, వక్తృత్వ,వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు పెద్దల చేతుల మీదుగా.
ప్రతి విషయంలో మొదటి స్థానం అంజలిదే .స్కూల్ ఛాంపియన్ ,విజేత అంజలి.
మినిస్టర్ అతిథులు ఆశ్చర్యపోయారు.పిల్లలు మీరు గమనించారా?కాలాన్ని మనం కాపాడితే ఎన్నో విద్యలు నేర్చుకుని భావి జీవితంలో గొప్పగా ఎదుగుతారు.సమయం వృధా చేస్తే జీవితాంతం బాధపడతారు.అంజలి దీనికి ఉదాహరణ.
అనగానే అందరూ చప్పట్లు కొట్టగా సభ దద్దరిల్లింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.ఎప్పుడైనా స్కూల్ పాఠాలే కాక కన్నవారు పిల్లలకు ఏది ఇష్టమో గమనించి నేర్పిస్తే వాళ్ళు రాణిస్తారు.సంఘంలో గొప్పగా ఎదిగి దేశానికి పేరు తెస్తారు. ఆరోజు హాయిగా నిద్రపోవడమే కాదు తన భవిష్యత్తు జీవితానికి ప్రణాళికను వేసుకుంది తెలివిగా.


You may also like

Leave a Comment