Home కథలు మాఅవ్వ

మాఅవ్వ

by T.V Srinivas

మాధవిపురం (మద్దికెర) లోఅక్షరాలునేర్చుకున్నమొదటిబాలిక. ఇంకాచదువుకుంటాఅన్నమాటనిగొంతుఆపేసి, 12 ఏళ్ళకేపసుపుతాడువేసేసుకుని,మంగళంపాడేసుకుంది. పుస్తకాలటకెక్కాయి. ట్రంకుపెట్టెకిందికిదిగిఅత్తారింటికినడిపించింది. అత్తారింట్లోతనకికలిసొచ్చినదేమిటంటే , తనకన్నామూడేళ్ళుపెద్దవాడైనాసవితికొడుకుతోసహఆరుమందిసంతానం. 40 ఏళ్ళమొగుడు. మరోఆరేళ్ళకుతనపంటపండిమరొముగ్గురుసంతానంవారిలోఆఖరివాడుమానాన్న. 18ఏళ్లవయసుకిమూడుపువ్వులుఆరుకాయలుగాతొమ్మిదిసంతానంఆమెతోముడిపడిపోయింది.

మాఅవ్వజీవనప్రస్థానం  1910 నుండి 1980 వరకుఅంటేశ్రీశ్రీపుట్టినప్పటినించిశంకరాభరణంసినిమావిజయోత్సవాలవరకు.అందులోచివరిపదేళ్ళభాగంలోనేనేనున్నా. అందులోప్రత్యక్ష్యంగాచూసినేనుపదిలపరుచుకున్నదిచివరిఐదేళ్ళజ్ఞాపకాలు.అప్పటికితనుసర్వస్వతంత్రురాలావడంతోతనసహజశైలిని , తనఅనుభవాలుపోతపోసుకున్న‌వ్యక్తిత్వపరిమాళలనుఆస్వాదించగలిగాను.  ఇంట్లోమాపిల్లలకందరికితనేశ్రీరామరక్ష.  మాస్నేహితులకుమాత్రంహడల్. వాళ్ళోస్తేమేంవాళ్ళతోబయటికెళ్ళితనతోఉండమనివాళ్ళనిఎక్కవగాఇంటికిరానిచ్చేదికాదు.పనిపాటలేదాఅనివాళ్ళనిపంపించేసేది.

50 ఏళ్ళువంటింటిగుమ్మానికిదిండుపెట్టుకునిపడుకుని,  గడిపినా, రెండుప్రపంచయుద్థాలు, మనస్వాతంత్రపోరాటాలాగూర్చిమాకర్థమవ్వాల్సినరీతిలోబాగాచెప్పేది. రతన్టాటా‌ , టాటాసన్స్గ్రూప్చైర్మన్గాస్వచ్చందంగావైదొలగినట్లు, తన 65 తనవంటింటిఅధికారాలన్నిమాఅమ్మకుఅప్పగించింది.మొదట్లోమాఅమ్మచేసేవంటల్లోఎవరైనాఉప్పుతక్కువైందిఅంటెతక్కువేసిమంచిపనిచేసిందికావాలంటేకలుపుకోవచ్చుకదాఅనేది. అదేఉప్పుఎక్కువైనరోజుతనతప్పేంలేదుఈసారికొన్నఉప్పులోనేఉప్పుఎక్కువైందని, రాళ్ళఉప్పుఅమ్మేబండివాడుపళ్ళికించినపుడేతనకిఅనుమానమొచ్చిందని, ఇకరేపట్నించిఈఉప్పుకితగ్గట్టువండుతుందిలేఅనిమాఅమ్మకుభలేసపోర్ట్గామాట్లాడేది.

మాఅవ్వతనజీవితంంలోచూసినవిమూడేసినిమాలుఒకటిశ్రీవెంకటేశ్వరమహాత్మ్యంరెండవదిలవకుశమూడవదిభక్తప్రహ్లద.  మిగతాఏసినిమాలుచూడకపోయినఅమెభక్తప్రహ్లదకన్నాగొప్పసినిమాలేదు, ఇకరాదనేది‌ఆమెగట్టినమ్మకం..అమెదృష్టిలోఎన్టిఆర్కన్నారోజారమణిగొప్పనటుడు.నిఙమేనండిరోజారమణిఓనటీమణిఅనిఆమెనిఒప్పించడంకష్టం.

నేనుఇంట్లోఅందరికన్నాచిన్నఅవ్వడంతోనన్నెప్పుడుతనపక్కనేపడుకోపెట్టుకునేది,  రోజూకథలు , కబుర్లుఎన్నోచెప్పేది. హోమ్వర్క్లుగట్రాలుఅన్నిసాయంత్రమేచెయ్యించేది, రాత్రిఏడింటికిభోజనం , ఎనిమిదింటివరకుమాఅవ్వతోకథాకాలక్షేపం, తరువాతముసుగెట్ట్టేయ్యడం.అప్పుడప్పుడు 10 గంటలప్రాంతంలోఘంటసాల, సుశీలపాటలురేడియోలోమంద్రస్థాయిలోవినిపించేవి.

 1979 లోఓరోజు.

మానాన్నగారుతనస్నేహితులుకొందరినిభోజనాలకుపిలిచారు. ఆయనేమెనుకూడాస్వయంగారాసిచ్చారు. కొంతవరకుమాఅవ్వసలహాలమేరకువంటావార్పుతరువాతఅన్నసంతర్పణపూర్తిఅయ్యింది.వంటలన్నిఅద్భుతంగాఉన్నాయ్యన్నారు,  కానికొంచెంతక్కువయ్యాయి.. చాలమందిమరిమరివడ్డించమన్నారు, కానిసర్దడంసాథ్యమవలేదు.  మానాన్నగారికితలకొట్టేసినట్టయింది..అందరువెళ్ళిపోయాకఅమ్మనుఅవ్వనుబాగాచివాట్లేసారు, మాఅవ్యకిమాట్లాడేదానికిపెద్దగాఅవకాశం దొరకలేదు.

ఆనాటిరాత్రిమాఅవ్వఎక్కువగామాట్లాడలేదు, చాలదీర్ఘాలోచనలోఉండిపోయింది. ఎప్పుడోఅర్ధరాత్రినాచెంపమీదకొన్నికన్నీటిబొట్లురాలాయి.

తరువాతరోజుమాఅవ్వనాకు 1930 కాలంనాటిఆకలిరాజ్యంగురించిచెప్పింది.  కొన్నినెలలతరబడిఇంట్లోడబ్బులుఉండేవికావట. వంటసామాగ్రికొనేదానికిచాలకష్టంగాఉండేదట. ఇంట్లోఉండేవాళ్ళుకాకావచ్చిపోయేబంధువులుబాగాఉండేవాళ్ళట.ఓపడి(1.3 Kg) బియ్యంరోజుకిసరిపోయేదికాస్తఓపూటకుకూడాతక్కువయ్యేది. దానితోమాఅవ్వేకష్టపడిఎలాగోఅందరికిసర్దివడ్ఢిచ్చేది, ఆలాతనకుపొదుపుగావండడంబాగాఅలవాటుఅయ్యిందట. దానివల్లతనకుమానాన్నతోమాటలుపడవలసివచ్చిందనికొంతబాధపడిఇకమానాన్నగారిసలహామేరకు, ఇంట్లోభోజనాలవిషయంలోతనింకతలదూర్చనని, తనకిష్టమైనపనులుచేసుకొంటానని, తనకునచ్చినపుస్తకాలుకొన్నితెచ్చిపెట్టమనినాకుచెప్పింది.ఆలామాఅవ్వనన్నుమొదటిసారిగాతెచ్చివ్వమనిఅడిగినపుస్తకంగురజాడవారికన్యాశుల్కం. ఓరోజురాత్రిఆపుస్తకంగురిoచిచెబుతూ. తనలాంటివాళ్ళకోసమేఈపుస్తకంరాసారనిచెప్పేది.

తరువాతచలంరాసినపువ్వుపూసింది, కన్నీటికాలువ, మునిమాణిక్యంనరసింహరావురాసినకాంతంకథలుఇలాఎన్నోపుస్తకాలుమాఇంటిదగ్గరలోఉన్నగ్రంధాలయంనుండితెచ్చిచ్చేవాళ్ళం.  ఆపుస్తకాలగురించిమాఅమ్మతో, పిల్లలతోచాలగొప్పగాచెప్పేది. నాకంతఅర్థమయ్యేదికాదు. 

ఆలాకొన్నాళ్లతరువాతఓరోజునన్నుదగ్గరికిపిలిచిఒరేయినీకుమీస్కూల్లోఎదోబాగాచదివావనిమొదటబహుమతివచ్చిందటగా, మీఅమ్మఅందరికిచెప్పిఆనందపడుతోంది. నీవునాకుఇంకఈకథలపుస్తకాల్నిచదివివినిపించరా, రోజుకొన్నిపేజీలు, అర్థమయ్యిందాఅనిఆజ్ఞాపించింది.ఆలాకొన్నాళ్ళకునేనుచదవాల్సివచ్చినపుస్తకంగురజాడగారువ్రాసినముత్యాలసరాలు, అందులోనుండిఓరోజుకన్యక, చదివినతరువాతమాఅవ్వకంటనీరు, నాకుకూడాఎదోతెలియనిఓబాధ

ఆరోజుపూర్ణమ్మచదవాల్సివచ్చింది. ఇంట్లోఎవరులేరుఅందరుదసరాపేరంటాలకువెళ్లారు. నేనుఅవ్వమాత్రమేవున్నాము.నేనుచదవడంమొదలుపెట్టాను..

కాసులకులోనైతల్లితండ్రి

నెనరున్యాయంవిడనాడి

పుత్తడిబొమ్మనుపూర్ణమ్మనుఒక

ముదుసలికిచ్చిముడివేసిరి

పెనిమిటికాంచిననిమిషమున

కన్నులక్రమ్మెనుకన్నీరు

చదివినవెంటనేఓసారిఅప్రయత్నంగాకన్నెత్తిఅవ్వనుచూసాను

తనముఖంప్రశాంతతకన్నాచాలనిర్వేదంగాకనిపించింది.

నాచేయిపట్టుకునికొంచెందగ్గరగాతీసుకుంది, తనుమాట్లాడలేదు

కానీనాకర్థమయ్యింది.నేనుతరువాతభాగంచదవాలని

అటపాటలోతోటికన్నియలు

మొగుడుతాతయనికేలించ

పూర్ణమ్మదుర్గనుచేరిదుఃఖించే

నాకుతెలియకుండానేఆగిపోయాను. మాఅవ్వచేయిఆలాగేనన్నుపట్టుకుంది, మాఅవ్వభావాలూఅన్నినాకుఅర్థమయ్యాయి, పూర్ణమ్మలాతనమనుసులోఆదుర్గమ్మనుచేరిరోజుఇన్నేళ్లుదుఃఖించిందిమాఅవ్వ.

ఇప్పుడునాక్కూడాఇంకాచదవాలనిపించింది. కానీమాటగొంతుపెగలిరాదనిఅక్షణంతెలియలేదు. కానీచదవసాగాను

అన్నతమ్ములకప్పుడుపలికెను

అన్నల్లారాతమ్ముళ్ళరా

అమ్మనుఅయ్యనుకాయండి

నలుగురికూచొనినవ్వేవేళ

నన్నొకపరితలవండి

మీమీకన్నబిడ్డలనొకతెకు

ప్రేమనునాపేరివ్వండి

ఇకమాటపెగల్లేదు, కంట్లోనీళ్లుయధేచ్చాగాబలబలరాలాయి.మాఅవ్వఒడిలోతలదూర్చుకున్నాను, ఆమెచేతులునాతలనిమురుతుండగా, ఆలాఎంతసమయంగడిచిందోతెలియలేనేలేదు. ఆమెకంట్లోఇంకిపోయినకన్నీరు, నాకంటప్రవహించిందేమో!

ఆతరువాతనన్నెప్పుడుఏకథకానీ, కవితకానీచదవమనలేదు.

మంచిసాహిత్యంమనసునికదిలిస్తుందని, అటువంటిసాహిత్యంపైనాఆసక్తికిబీజంవేసిందిమాత్రంమాఅవ్వే.

ముగింపు :

తనకెదురైనఅన్నిఅవాంతరాలను, తనకున్నవిచక్షణతోతనకనుకూలంగామార్చుకున్నమాఅవ్వమాకెప్పటికీస్ఫూర్తిదాయకమే. జీవితాన్నిపూర్ణమ్మలాత్యజించలేదు, మరేపోరాటాలుచెయ్యలేదు.  తనతోముడిపడ్డకుటుంబాలకుఆలంబనగానిలబడింది. అదిఅప్పటికాలంలోకట్టుబాటైన, ఓరకంగామంచిబాటే.

You may also like

Leave a Comment