ఇక పెద్దమ్మ చెప్పిన దానిప్రకారం….ప్రతి పల్లెటూరు ప్రకృతితో మమేకమై.. పశుపక్షాదులను సైతం తమ జీవితాల్లో బాగం చేసుకొని జీవిస్తుంది. అందుకే రోగాలు నొప్పులు పల్లెదరి చేరవు. కాకులు, మేకలు, కోళ్ళు , కుక్కలు ఇత్యాదివి పల్లె ప్రజల జీవితాల్లో భాగం. వేకువ జామున కోడి కూతతో నిద్రలేచిన పల్లె సాయం సంధ్జ్యవేళ ఆవులు, గేదెలు ఇల్లుచేరడంతో ఆ రోజుకు సెలవిచ్చి.. నిద్రాదేవిని ఆశ్రయిస్తుంది. ఇక్కడ నేటి తరం గమనించాల్సింది ఏమిటంటే,..పెందలకడ పడుకొని, పెందలకడ లేవడం అన్నది మనిషి ఆరోగ్యానికి మొదటి సూత్రం అన్న మాట.
అసలువిశాయానికి వస్తే ….కొక్కరోకో ……అన్న కోడికూతతో పల్లె నిద్ర లేస్తుంది. అంటే…కోడి కూతతో పల్లె దినచర్య ప్రారంభమవుతుంది. 70 దశకంలో ఎక్కువగా సజ్జ, జొన్న ఆముద లాంటి పంటలే పండించేవారు. ]అయితే కొందరు రైతులు మాత్రం బావుల దగ్దర వరి సాగు చేసే వారు. కూరగాయలు పండించేవారు. అయితే ఇప్పటిలాగా రసాయనిక ఎరువులు వాడేవారు కాదు.సేంద్రియ ఎరువులే వాడేవారు. అంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఆర్గానిక్ పంటలన్న మాట.
బావుల దగ్గర సాగుచేసే రైతన్నలు కొడికుతతో నిద్రలేచి ..ఎద్దులను తోలుకొని బావిదగ్గరకు బయలు దేరుతారు. ఒక పక్క ఎద్దుల మెడలో కట్టిన గంటలు,గజ్జెల సవ్వడి..మరో పక్క పల్లె అలికిడితో నిద్దుర లేచిన చెట్టు కొమ్మల్లోని పక్షుల కిలకిల రావాలు.. పల్లె తల్లికి వీనుల విందైన సుప్రభాత సంగీతం. అప్పట్లో ఇప్పటిలా ట్రాక్టర్లు ఉండేవికావు. అందుకే రైతులు పశువులపెంపకం వారి జీవనయాత్రలో ఓ భాగంగా ఉండేది. వ్యవసాయం లేని వారు సైతం పాడి కోసం గేదెలను పెంచుకునేవారు. అందుకే పల్లెల్లో పాడికి కొదువ ఉండేది కాదు.
రైతన్నలు బావులదగ్గరకు వెళ్లిన తర్వాత..ఇళ్ళల్లో ఆడవాళ్ళ హడావిడి మొదలవుతుంది. ఇంటి ముందు ఊడ్చి,పేడతో కళ్ళాపి చల్లి..ఏర్ర మన్నుతో అలికి..ముగ్గులు పెట్టడం..నిత్య కృత్యం..ఆ తర్వాత ఇల్లు ఊడ్చి వంటింట్లో పోయ్యిని శుభ్రం చేసి..అలికి ముగ్గులు వేసి..అంట్లు తోమడంతో ఇళ్లల్లో ఆడపడుచుల హడావిడి మొదలవుతుంది. పల్లెల్లో దాదాపు అన్ని ఉమ్మడి కుటుంబాలే. మనం ఎ ఇంటిలోకి తొంగి చూసినా ఉమ్మడి కుటుంబాల మమకారాల మకరందం, నాన్నమ్మ, తాతయ్యలతో మనుమడు, మనుమరాళ్ళ పరిహాసాలు.. ముసలివాళ్ళ చీవాట్లు .. అందులో కనుపించే ప్రేమ ఇట్టే అర్ధం అవుతుంది.
“లచ్చిమి ఇంకెంత సేపు పంతవే…..లే” అంటూ లక్ష్మి వాళ్ళ అమ్మ ..వంటింట్లోంచి..కేకేసింది.
తల్లీ పిలుపు వినగానే నుసులు కుంటు..దుప్పటిలో మళ్లీ ముడుచుకు పడుకుంది కూతురు లక్ష్మి..
“ఒసేయ్.. పోరీ అమ్మపిలుస్తోంది. లేవరాదే .”అంటూ కోడలికి వంత పాడింది లక్ష్మి నాన్నమ్మ.
“పెల్లీడుదకొచ్చిన పిల్ల ఇప్పటిదాకా పంతే గెట్లనే..ఇంటికి దరిద్రం”.అంటూ కంటిన్యూ చేసింది అప్పటికే లేచి ముంగిట్లో కూర్చొని..బొగ్గుతో పల్లు తోము కుంటున్న ముసలమ్మ. చికాకు పుట్టి దుప్పటిని పక్కన వేసి మంచంలో కూర్చుంది లక్ష్మి.
.”ముసల్డాన నీకెందుకు..ముఖం కడుగుతున్నావుగా..వెళ్లి అమ్మపోసే చాయ్ నీళ్ళు తాగి చావక..”అంటూ కసురుకుంటు మంచం దిగింది. లక్ష్మి. “చస్తా లే. చావకుండా నీ సూరు పట్టుకు వెలాడతాన ఎన్ది” అంటూ పెరట్లో గాబు దగ్గరకు వెళ్లి ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది ముసలమ్మ.
“అత్తమ్మా..పొద్దున్నే దాని నోట్లో నోరు ఎందుకు పెడ్తవ్..దానికి నోరెక్కువ..” అత్తకు టీ అందిస్తూ అందీ కోడలు. “ఇది రోజు ఉందేదేగా..కొత్త కాదుగా” అంటూ టీ తాగింది అత్త..
“నానమ్మను అన్నది చాలు గానీ..నువ్వు ముఖం కడుక్కొని రా..వేడినీళ్లు గొంతులో పోసుకుంది” అంటూ కూతురును అరిచింది తల్లి.. తల్లి అరుపుతో ముఖం కడుక్కొని వచ్చి టీ తాగింది లక్ష్మి నాన్నమ్మ పక్కనే కూర్చొని.
“ఏంది నానమ్మ సంకలో దూరినవ్..మల్లేమి లొల్లి లేదుగా “అని ముసి ముసిగా నవ్వుతూ వంటింట్లో వంట పనిలో మునిగి పోయింది తల్లి.
తల్లి మాటల్లోని అంతరార్ధం తెలిసిన లక్ష్మి నాన్నమ్మను గట్టిగ వాటేసుకొని ముసల్ది చాలా మంచిది తెలుసా ? అంటూ తల్లిని ఉడికించింది. నాన్నమ్మను బిగ్గర వాటేసుకున్నట్లు నటిస్తూనే ముసలమ్మా బొడ్లో దోపుకున్న చేక్కుడు సంచిని లాగేసుకొని దూరంగా వెళ్ళింది లక్ష్మి.
“ఓస్ దొంగ ముండా సంకలో దూరి గారాలు పోయింది సంచి కోసమా?.. నీ సాద్యంగూలా” అంటూ కర్ర సాయంత్ఘో లేచి లక్ష్మిని పట్టుకునే ప్రయత్నం చే యబోయింది.
“ఓయ్ ముసల్దానా ఆ మూడుకాల్లేసుకొని నువ్వు లేసిరాకు.. నువ్వు పడి కాలో చెయ్యో పుటుక్కు అన్నదనుకో.. మా అయ్య అదే నీ కొడుకు నన్ను బతక నీయడే ” అని వ్యంగంగా దెప్పి మాట్లాడుతూ నానమ్మ దగ్గరకు వచ్చింది. చేక్కుడు సంచి నకన్నమ్మకు ఇచ్చింది. మళ్ళీ ఆమె పక్కన కూర్చోంది. ” ముసలీ ..మొన్న మీ తమ్ముని దగ్గరకు వెల్లొచ్చావుగా .. ఏమ్పెట్టిండే” అందీ.
“నీ ఏటకారం చాల్లే .. ఏదో వాడికి ఉన్నంతలో వాడు మర్యాద చేసిండు. అక్క చీర కొనుక్కోమని నాలుగు డబ్బులిచ్చుండు.” అంది నాన్నమ్మ.
” నిజమా నీ తమ్ముడు మంచోడేనే..నీకు ఈ వయసులో కూడా చీరా, సారే పెడుతుండు. అంటూ నాన్నమ్మ ఇగోను తట్టి లేపింది లక్ష్మి.
:”అత్తమ్మ అది కావాలనే రెచ్చగొడుతోంది. నువ్వు దానికి డబ్బుసంగతి చెప్పెసావు. నిన్ను ఇంకా అది బతుక నిస్తుందా ” అంది అప్పుడే వంటింట్లోంచి బయటకు వచ్చిన లక్ష్మి వాళ్ళ అమ్మ.
“ఓమ్మా ఏందీ నువ్వేమో సపోర్టు వస్తున్నావ్ .. మీ అన్న నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళడు. నానమ్మ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి చీరకు డబ్బులిచ్చిండు. గొప్ప కదా. అది నాన్నమ్మ చెప్పుకోవద్దా ఏంటి. నీకు లేనీ పుట్టింటి ముచ్చట ముసల్దానికి ఉందని నీకు కడుపు మంట..”అంటూ నాన్నమ్మను గ పొగిడేసింది…వాళ్ళ అమ్మ తమ మధ్య వస్తే తన పాచిక పారాదని! అంటూ
లక్ష్మి వాళ్ళ నాన్నమ్మను వాటేసుకున్న సీన్ చూసిన లక్ష్మి తల్లికి ఓ వైపు నవ్వు వస్తున్నా ఆపుకొని ” వామ్మో నాన్నమ్మ, మనుమరాలి మద్ష్య నేనేన్డుకులే. మీరు మీరు ఏమయినా చేసుకోండి. అత్తమ్మా అది నీ దగ్గర ఉన్న డబ్బులకు పుటమేస్తుంది జాగ్రత్తా” అంటూ అక్కడి నుంచి లోనికి వెళ్ళింది.
తల్లి లోనికి వెళ్ళగానే ” ముస్లీ ముస్లీ ..సారీ నానమ్మా.. మా బంగారు నానమ్మా.. ఇంతకు మీ తమ్ముడు ఎన్ని డబ్బులు ఇచ్చిండే” అంటూ నానమ్మ ఒల్లో పడుకొని గోముగా అడిగింది…
” ఎహే ఆ డబ్బుల గురించి ఇప్పుడెందుకే. అయినా గారాలు పోతున్నవెంది కథ ” అంది నాన్నమ్మ.. ఏమిలేదు నాన్నమ్మ నాకు జడ రిబ్బన్లు ఒక జతే ఉన్నాయి. నువ్వు ఒక్క పదిరూపాయలు ఇస్తే ఇంకో జత కొనుక్కుంటా..” అంది లక్ష్మి ..
” దొంగ ముండా ..మీ అమ్మచెప్పింది నిజమే. నా డబ్బులమీద కన్నేసి.. నా దగ్గర ఒయ్యారాలు పోతున్నవన్న మాట. నాదగ్గర డబ్బులు లేవు ఏమి లేవు.. నా మీదు నుంచి లేవే ముందు” అంటూ మనుమరాలిని తన మీదినుంచి లేపి కూర్చోపెట్టింది. అలా నానమ్మ చేయడం, తిట్టడం మనుమరాలికి మామూలే. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళ తిట్లు ప్రేమగానే ఉంటాయి. వాళ్ళ కోపం పిల్లలకు ఓ సరదా..
” ముసల్దాన ప్రేమగా ఒల్లో పడుకుంటే లేపెసినావ్ కదా .. ఇక మీద నీతో మాట్లాడ. ” అంటూ అలిగినట్లు నటిస్తూ ఇట్లోకి వెళ్ళింది. అలా మనవరాలుచుసిన నాన్నమ్మ మనస్సు అదోలా అయింది. బెట్టు చేసినట్లు కాసేపు తాను నటించింది. కాని మనమరాలితో పోట్లాడకుండా.. మాట్లాడ కుండా ఉండలేదు ముసలమ్మ. ” ఒసేయ్ పోరి ఇక్కడకు రావే” మనవరాలిని పిలిచింది వాళ్ళ నాయనమ్మ. ” ఎందే ఇందాక గెంటేసి మల్లి పిలుస్తున్నావ్ ” అంటూ వచ్చింది లక్ష్మి.
లక్ష్మి రాగానే చేక్కుడు సంచిలోంచి పది రూపాయలు తీసి మనుమరాలికి ఇచ్చింది ముసలమ్మా. ఇదంతా వంటిన్తిలోంచి గమనిస్తున్న లక్ష్మి వాళ్ళ అమ్మ.. ” ఇద్దరు ఇద్దరే ” మనసులో అనుకోయి బయటకు అనేసింది. “అమ్మా నువ్వేమి కుల్లుకోవద్దు. నువ్వేమన్నా మా నాయనమ్మ బంగారం” అంటూ నాన్నమ్మకు ముద్దిచ్చి అక్కడ నుంచి తుర్రుమంది లక్ష్మి.
