Meenakshi Srinivas
Meenakshi Srinivas
స్వపరిచయం : మీనాక్షీ శ్రీనివాస్. స్వస్థలం కాకినాడ. జననీ, జనకులు... కీ.శేలు. శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు. జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్, ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు. ఇది నా కుటుంబం. కథల ప్రయోజనం సమాజపరంగా, ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వం పెంపొందించేవిగా ఉండాలన్నదే నా నమ్మకం, ఆశ. ఆంధ్రాబ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణిని. ఉద్యోగపర్వ ప్రారంభదశలో, విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్ గా ఎంపికయి, కొన్ని ఏళ్ళ పాటు కొనసాగి, తరువాత బదిలీల కారణంగా విరమించడం జరిగింది. నా తొలిరచన రేడియో నాటకంతోటే ప్రారంభమై, ఏడు రేడియో నాటికలు, కొన్ని కవితలు, సుమారు 345 పైగా కథలు అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథలు ఒక సంకలనంగా 'నిశీథిలో నక్షత్రం' అక్టోబర్ 2016 లో వెలువడింది. నా రచనలు కొన్ని కథానిలయంలో (కోడ్ 2295) చోటు కల్పించిన కారా మాష్టారికి నా నివాళి. వంగూరి చిట్టెన్ రాజుగారి సాహితీ సభల్లో కాకినాడ, ఖతారుల్లో పేపర్ ప్రెజెంటేషన్ మరువరాని అనుభవం. మరచిపోలేని అనుభూతి, 03 ఏప్రిల్ 2024 న లేఖినీసంస్థవారు, డాక్టర్ వాసాప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం ఇప్పటికి 23 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి, ప్రతిలిపిలలో ప్రచురణ, బహుమతులు. రవళి, సహరి, అచ్చంగా తెలుగువంటి అంతర్జాలపత్రికల్లో కూడా కథలు బహుమతులు పొందాయి. విశాలాక్షి సముద్రం కథల పోటీలో ప్రథమ బహుమతి. 2024 వెల్చేరి వారి కథలపోటీలో ద్వితీయ బహుమతి. తపస్వీ మనోహరం వారి కథలపోటీలో గెలుపొంది యిరవై ఐదు కథలతో 'బహుమతి' కథా సంకలనం బహుమతిగా పొందడం. వారిచే అపరాథ పరిశోధన నవల ప్రచురితం. 2025 లో శ్రీమతి మంథా భానుమతి, ప్రమదాక్షరీ సంయుక్త నిర్వహణలో తృతీయ బహుమతి నవల సంచికలో ధారావాహికగా వెలువడింది. అస్పష్ట నీడలు మినీ నవల తపస్వీ మనోహరంలో ఎంపిక అయింది. పత్రికలు కరువైన ఈ మధ్యకాలంలో నా రచనలు ప్రతిలిపి వేదికగా అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు పొందడం ముదావహం. ప్రతిష్టాత్మకమైన ముల్కనూర్ కథాపీఠం లో ప్రత్యేక బహునతి, సిరికోన నవలల పోటీలో విశిష్ఠ నవలా పురస్కారం. అమృతలతా, మయుఖా పత్రిక సంయుక్త కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన అనుభూతి మరువలేనిది. పద్యరచన, శ్రీమతి నండూరి సుందరీ నాగమణిగారి నవఛందస్సులో ఓనమాలు దిద్ది, ఆమె ప్రోత్సాహంతో పద్యరచనలో షార్వాణి పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందడం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కథల ప్రసారం, విజయవాడ కేంద్రంలో సరసవినోదినీ, విశాఖలో కవనవిజయంలలో సమస్యాపూరణములలో పాల్గొనే భాగ్యం. శ్రీమతి వీణా జోషీ గారిచే రెండు కథలు కన్నడ అనువాదం, శ్రీమతి రాజీ రఘునాథన్ గారిచే రెండు కథలు తమిళ అనువాదం పొందాయి. ఇది క్లుప్తంగా నా సాహితీ ప్రయాణం. Ph. 9492837332, 9110723232 ; ch.meenakshidevi@gmail.com
