ముదిగొండ ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు మెరిసింది కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాష ఉపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని తొలి ఉషస్సు మెరిసింది కవిత పై విశ్లేషణా వ్యాసం.స్పందన కవితా సంపుటిలో ముగ్గురు కవులు కవితలను రాశారు.అందులో మొదటి కవి ముదిగొండ ఈశ్వర చరణ్,రెండవ కవి మాదాడి నారాయణరెడ్డి,మూడవ కవి ముదిగొండ వీరేశలింగం.స్పందన కవితా సంపుటిలోని ఈశ్వర చరణ్ రాసిన మొదటి కవిత తొలి ఉషస్సు మెరిసింది.తొలి ఉషస్సు మెరిసింది కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.తొలి ఉషస్సు ఎలా మెరిసింది? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.తెలతెల వారుతుండగా ఆకాశంలో సూర్యబింబం యొక్క కాంతిని చూసి ఎందుకో తెలియదు కానీ మనసులో ఆనందిస్తాం.సూర్యునికి అర్ఘ్యమిచ్చి శక్తిని ప్రసాదించమని వేడుకుంటాం. తూర్పున ఉదయించిన సూర్య కాంతి రేఖలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. సూర్యోదయాన్ని చూడడం వల్ల ఒక రకమైన చైతన్యం మరియు ఉత్సాహంతో కూడిన నూతనత్వం మనిషిలో మేలుకుంటుంది.కవి ఈశ్వర చరణ్ రాసిన తొలి ఉషస్సు మెరిసింది కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది
“తరళమై సరళమై
“అరుణమై కరుణమై
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ఉషస్సు అనగా ఉషోదయం,ప్రభాతం,ప్రత్యూషం, ప్రాతః కాలం,తెల్లవారుటకు ముందు నాలుగు ఘడియల కాలం అని అర్థాలు ఉన్నాయి.ఉషస్సు ప్రపంచంలో ప్రతి రోజు తొలి వెలుగును ప్రసరింపజేస్తుంది.ఉషస్సు చీకటిని తరిమి కొడుతుంది.ఉషస్సు చెడును నిర్మూలిస్తుంది. ఉషస్సు మనిషి జీవితాన్ని చైతన్య పరుస్తుంది. ఉషస్సు తన కాంతితో ప్రకృతిలో కదలికలను తెస్తుంది.ఉషస్సు ప్రతి ఒక్కరిని వారి విధులను నిర్వర్తించుటకు ప్రేరేపిస్తుంది.సూర్యుడు అన్ని జీవులకు ప్రాణం,చర్య మరియు శ్వాస యొక్క ప్రేరేపకుడు.ఉదయాన ఆకాశాన వెలసిన సూర్యుని చూసి తొలి ఉషస్సు మెరిసింది అన్నాడు కవి.వర్షం పడే ముందర ఆకాశం మెరుస్తుంది.ఆకాశంలో మేఘాలు గర్జిస్తాయి.మేఘాలు మెరుపులతో ఆకాశమంతట వ్యాపిస్తాయి.ఉరుములు మెరుపులతో ఆకాశం బీభత్సంగా ఉంటుంది.వర్షం పడగానే నేల తల్లి పులకిస్తుంది.నెమలి పురి విప్పి ఆడుతుంది.తన మనసులో రెక్కలు విప్పిన ఆలోచనలను చూసి తొలి ఊహ విరిసింది అన్నాడు.సూర్య కాంతిని చూడగానే అతని మనసులో ముప్పిరిగొన్న ఆలోచనల్లో తొలి ఊహ వికసించింది.ఊహ అనగా మనసులో గోచరించే దృశ్యం.మనసులో కలిగే ఒక వ్యక్తీకరణ,సరదా ప్రేమ మరియు జీవితాన్ని సృజనాత్మకతతో ఆలోచించడం ఊహ.ఊహ పట్ల జాగరూకత కలిగి ఉండుట మంచిది.చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం ఊహ. జరగడానికి అవకాశం లేని ఒక ఆహ్లాదకరమైన దానిని గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటాం. అటు వంటి విషయాల గురించి ఆలోచించే చర్య ఊహగా చెప్పవచ్చు.కొన్ని సార్లు ఊహ వాస్తవ ప్రపంచం నుండి ముఖ్యంగా మధ్య యుగాల చరిత్ర నుంచి వచ్చిన ఆలోచనలు,సంఘటనలతో కూడి ఉంటుంది.ఊహ నుంచి జనించినవే మన అరువది నాలుగు కళలు.మనిషి మనస్సు నుండి తొలి ఆలోచన వికసించింది.మనిషి మనస్సును ఆలోచనలు ప్రభావితం చేస్తుంటాయి.చెట్లపై పువ్వు విరిసింది అంటాం.కవి ఇక్కడ తొలి ఊహ విరిసింది అన్నాడు.మనిషి మనసులో పుట్టిన ఆలోచన మొగ్గగా రూపు దాల్చి ఊహ అనే పూవుగా వికసిస్తుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.తరళం అంటే ప్రకాశం.ఏదైనా అతిగా కావాలనుకోకుండా జీవించడం సరళం.మానవ జీవన శైలిలో సరళత అనేది సాధారణ జీవన శైలిని కలిగి ఉండటం అని చెప్పవచ్చు.సరళత అందం, స్వచ్ఛత లేదా స్పష్టతను సూచిస్తుంది.అరుణము అంటే ఎరుపు క్రిమ్సన్ కలర్,సంధ్యారాగము అనే అర్థాలు ఉన్నాయి.ఉదయించే సూర్యుడి వర్ణం అరుణం.కరుణ అనగా కనికరం,కృషి అనే అర్థాలు ఉన్నాయి.కరుణ అనగా దయాగుణం. దుఃఖితాత్ముల యందు పరితపించుట కరుణ. మరొకరి బాధను తగ్గించాలనే కోరిక కరుణ.ఒక మనిషి దుఃఖముతో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది కరుణ.దయా దృష్టితో ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన కరుణ.కవి ఈశ్వర చరణ్ తొలి ఉషస్సు చూసిన క్షణంలో తొలి ఊహ జనించింది.మనసులో కలిగిన భావన కాంతివంతం, ప్రకాశంతో సులభం అయినదిగా,ఎరుపు రంగు దాల్చినదిగా దయాళువుగా రూపు దిద్దుకొని తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“శోకమై శ్లోకమై
“కావ్య రస హేలయై
“అంతరమ్ములను బాసి
“అంతరంగముల చూసి.
శోకం సాధారణంగా ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,బాధ కలిగినప్పుడు వచ్చేది శోకం.మనసు కలత చెందడం శోకం.ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయలేకపోవుట శోకం.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోవడం శోకం.
మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీసమాః
యత్ క్రౌంచ మిథునాదేకమ్ అవధీః కామ మోహితమ్.ఓ బోయవాడా!కామ మోహితమై యున్నటు వంటి క్రౌంచ పక్షుల జంట నుండి ఒక దానిని ఏ కారణం చేత హతమార్చితివో,ఆ కారణము చేత నీవు ఎక్కువ సంవత్సరములు జీవించియుండుట ప్రాప్తించకుండును గాక.ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం.వేదన నుండి వచ్చిన దుఃఖం శ్లోకంగా రూపు దాల్చినది.కవి హృదయంలో చెలరేగిన సంఘర్షణ శ్లోకంగా మారింది.కావ్య రస భావ వికారముల వంటి లక్షణాలు మనుషుల మధ్య గల నీది,నాది అనే తరతమ భేదాలను రూపుమాపి,మనిషిలో వెల్లువెత్తిన విశాల దృక్పథాన్ని కలిగించి మనసులను ఏకం చేస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“గానమై తానమై
“సంగీత స్నిగ్ధ సారమై
“భాషా భేషజాలను దాటి
“జాతి మతాల గోడలను దూకి.
గానము అనగా గీతము,పాట,పలుకబడినది. తానము అనగా స్నానము,స్థానము.సంగీతం Music శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది.సంగీతం సుప్రసిద్ధమైన చతుష్షష్టి కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలైన శృతి,రాగం,తాళం పల్లవి మొదలైన లక్షణాలతో కూడి ఉంది.సంగీతం ఆ దేశ సంస్కృతి సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్దిష్టమైన సాహిత్య పరంగా రచింపబడిన రాగాలకు నిబద్దితమై ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో రాగాలు అనంతమైనవి.కొన్ని
పాడే వారిని బట్టి మారుతుంటాయి.సంగీతం సాహిత్యంలో మేళవించబడి నాట్యం,నాటకం, లలిత కళలు,సినిమా మొదలైన దృశ్య కావ్యాలుగా మలచబడ్డాయి.సంగీతం అనేది శాస్త్రీయ సంగీతం,జానపద సంగీతం,భక్తి సంగీతం మరియు సమకాలీన సంగీతంతో సహా వివిధ రకాల సంగీత రూపాలను కలిగి ఉంటుంది.ఇది ధ్వని మరియు లయ కళను సూచిస్తుంది.సంగీతం తెలుగు సంస్కృతి సంప్రదాయంలో అంతర్భాగంగా ఉంది.పాట రూపంలో లయాత్మకంగా సంగీతంతో తడిసిన సారం మరియు భాషల పట్టింపుల భేషజాలను దాటి,జాతి మతాలు అనే అడ్డుగోడలు తొలగిపోయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“లోకమై నాకమై
“నాక ధునీ పూతమై
“మనిషి లోగుట్టు దాటి.
లోకం విశాల విశ్వంలో భాగం.జీవులు నివసించే ప్రదేశం.పురాణాలను అనుసరించి మొత్తం పదు నాలుగు లోకాలు ఉన్నాయి.నాకము అనగా నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.అకం అంటే దుఃఖం.అకం లేనిది నాకం పూర్తిగా ఆనందమయమైనది.నాకం అంటే స్వర్గం.ఇహ లోకంలో ఉండే శారీరక బాధలు, జరాదులు లేనిది నాకం.లోకం స్వర్గమై,గంగా నదితో పవిత్రతను పొంది మనిషి హృదయాల అట్టడుగున దాగి ఉన్న రహస్యాలను,మనసుల లోతులలో అణగి ఉన్న భావాలను స్పందింప జేయడం ద్వారా తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“క్రాంతమై శాంతమై
“సౌమనస్యపు క్రాంతియై
“విషదంష్ట్రలను పూడ్చి
“సర్ప దష్టులను గూర్చి.
క్రాంతి అంటే క్రమణం,కాంతి,విప్లవం,వెలుగు, తిరుగుబాటు.రత్నాల నుండి వెలువడే వెలుగు క్రాంతి.శాంతం ఒక రసం,శాంతి పొందినది. నూతనత్వాన్ని కలిగినది.శాంతితో కూడినది.స్నేహ కాంతుల వెదజల్లినది.విషపూరిత కోరలను కనుమరుగు చేసినది.బాధాసర్ప బాధితులను గూర్చి వివరించినది అయి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వరచరణ్ చెప్పిన భావం చక్కగా ఉంది.
“చాపమై శాపమై
“క్రోధారుణతా క్రాంతమై
“దానవతకు సమాధి కట్టి
“మానవతకు విలువ కట్టి.
చాపము అనగా ధనుస్సు,విల్లు బాణాలను విసరటానికి ఉపయోగించే ఒక రకమైన ఆయుధం.విల్లు మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఆయుధాలలో ఒకటి.విల్లు వేల సంవత్సరాల నాటిది.విల్లులు వివిధ సంస్కృతులలో,వివిధ కాలాలలో వేట, యుద్ధం, క్రీడల కోసం ఉపయోగించబడ్డవి.వేటగాడు పక్షులను జంతువులను వేటాడడానికి బాణాలను ఎక్కుపెట్టే సాధనం విల్లు లేదా చాపం.శాపము అనగా తిట్టు ఒట్టు అని అర్థాలు. ధనుస్సుగా రూపొంది దుష్టుల పాలిటి శాపం అయి,కోపపు ఎరుపుదనమును పొంది, రాక్షసత్వానికి గోరీ కట్టి మానవత్వపు విలువను పెంచడానికి తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“రుచియై శుచియై
“సర్వ జనాస్వాద్యమై
“మమతకు పందిరి వేసి
“సమతకు ప్రాణం పోసి.
రుచి మనం భుజించే ఆహార పదార్థాల ముఖ్య లక్షణం.రుచిని నాలుక గుర్తిస్తుంది.రుచులు ఆరు. వీటిని షడ్రుచులు అంటారు.అవి మధురం తీపి, ఆమ్లం పులుపు,లవణం ఉప్పు,కటువు కారం, తిక్తము చేదు,కషాయము ఒగరు.శుచి అంటే పాపహీనమయ్యే స్థితి లేక భావం.మమత అనగా అనురాగం,ప్రేమ,అభిమానం,అప్యాయత,ప్రీతి, మాతృ ప్రేమ,లోతైన బంధం.సమత కావ్య గుణములలో ఒకటి.సమత అంటే సమానత్వం. ఇంపు అయినది,శుభ్రం అయినది,ప్రజలందరికీ అనుభవ యోగ్యమై,ప్రేమ,అనురాగాలకు పందిరి వేసినది.సర్వ మానవాళి సౌభ్రాతృత్వం, సమానత్వానికి ప్రాణం పోస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం గొప్పగా ఉంది.
“రౌద్రమై భద్రమై
“విశ్వ కళ్యాణ హేతూద్భవమై
“చైతన్య స్మృతులను రేపి
“కళ్యాణ శ్రుతులను చూపి.
రౌద్రం నవరసములలో ఒకటి.రౌద్రం అంటే భయంకరమైనది,కల్యాణప్రదమైనట్టి,విశ్వ మానవ శ్రేయస్సుకు కారణమై తొలి ఉషస్సు పుట్టినది. చైతన్యంతో కూడిన జ్ఞాపకాలను రేకెత్తించినది. మంగళప్రదం,ప్రబోధాత్మకం అయిన భావాలను ప్రకటిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తరతరాలు యుగయుగాలు
“పరిఢవించ పరిప్లవించ
“తొలి ఉషస్సు మెరిసింది
“తొలి ఊహ విరిసింది.
ప్రజలు తరతరాల నుండి అన్ని యుగాలలో అభివృద్ధి పథంలో పురోగమించునట్లు ప్రేరేపిస్తూ తొలి ఉషస్సు మెరిసింది తొలి ఊహ విరిసింది అని కవి ఈశ్వర చరణ్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది. ముదిగొండ ఈశ్వర చరణ్ తేది 29 – 09 – 1937 రోజున సిద్దిపేట జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజేశ్వరి దేవి,నందికేశ్వర చరణ్.వీరు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినారు.వీరు అమ్మమ్మ మరియు మేనమామ ఇంట పెరిగారు.వీరి వివాహం పదహారు సంవత్సరాల వయస్సులో
ఇందిరా చరణ్ తో జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజా మల్లికార్జున చరణ్ భార్య శైలజ.రాజా మల్లిఖార్జున చరణ్ కిరణ్ ప్రింటర్స్ నడిపించే వారు.వీరు అనారోగ్యంతో తేది 17 – 01 – 2020 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు.రాజా మల్లిఖార్జున చరణ్ శైలజ దంపతులకు ఒక్కడే సంతానం శ్రీహర్ష.
చిన్న కుమారుడు శ్రీకాంత్ చరణ్ భార్య సంగీత. వీరికి ఇద్దరు పిల్లలు హిమాంశు,ప్రత్యూష.శ్రీకాంత్ చరణ్ మేనేజింగ్ డైరెక్టర్ గా Good Health insurance Company TPA Ltd. లో ప్రస్తుతం పని చేస్తున్నారు.
పెద్ద కుమార్తె గట్టెపల్లి అపర్ణ భర్త కుమార స్వామి. కుమార స్వామి తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సర్వీస్ లో ఉండగానే అనారోగ్యంతో తేది 01 – 07 – 1992 రోజున ఈ లోకాన్ని వీడి పోయారు.వీరికి ఇద్దరు పిల్లలు.కుమార్తె దీప్తి, కుమారుడు ధీరజ్ కుమార్.అపర్ణ కొండపాక,సిద్దిపేట జిల్లా ఎం.పి.డి.ఓ.గా పని చేసి తేది 31 – 08 – 2019 రోజున రిటైర్ అయ్యారు.
చిన్న కుమార్తె శాస్త్రుల కిరణ్మయి భర్త విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఆంధ్రా బ్యాంక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ co-ordinator గా పని చేసి రిటైర్ అయ్యారు.వీరు ప్రస్తుతం అందులో ఎగ్జామినర్ గా Part-time job చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు,కుమార్తె హిమజ,కుమారుడు మనోజ్ కుమార్. కిరణ్మయి ప్రభుత్వ పాఠశాల,దుద్దెడ గ్రామంలో ఆంగ్ల భాషా ఉపాధ్యాయిని స్కూలు అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.ఈశ్వర చరణ్ భార్య ఇందిరా చరణ్ తేది 04 – 03 – 2018 రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.ఈశ్వర చరణ్ సిద్దిపేటలో పి.యు.సి. వరకు చదివి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.వీరు ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి చదువు మీద ఉన్న ఆసక్తితో ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేటలో చేరి బి.ఏ. డిగ్రీ పూర్తి చేశారు.వీరు ట్యూటర్ గా పని చేస్తునే ఎం.ఏ. తెలుగు చదివారు.వీరు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి వివిధ హోదాలలో పని చేస్తూ లెక్చరర్ గా పదోన్నతి పొందారు.వీరు 1972లో ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ కళాశాలకు బదిలీపై వెళ్లారు.వీరి సహ అధ్యాపకులు మాదాడి నారాయణరెడ్డి,ముదిగొండ వీరేశలింగం. వీరు ఆదిలాబాద్ జిల్లా గ్రామ నామాలపై ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్.డిలో ప్రవేశం పొంది కొన్ని అనివార్య కారణాలవల్ల పూర్తి చేయ లేక పోయారు.ఈశ్వర చరణ్ విద్యా గురువులు డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య గారు,ఆచార్య పరాంకుశం గోపాలకృష్ణ మూర్తి గారు.వీరి అభిరుచులు చదవడం,వ్రాయడం,విమర్శన.
ఈశ్వరచరణ్ ముద్రిత రచనలు:
విశ్వనాథ తారావళి,శరభేశ్వర తారావళి,శ్రీగిరి శతకం,వివేక వాణి,శైవలిని,వెలుతురు (వచన కవితలు),నవమి వ్యాస సంపుటి,వ్యాసపీఠం వ్యాస సంపుటి,ఈ రెండు కాకతీయ విశ్వవిద్యాలయం వారిచే పాఠ్య గ్రంధాలుగా ఎంపిక చేయబడినవి. ఎఱ్ఱన జన జీవితము – సమాలోచన పక్ష పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది.
వీరి అముద్రిత రచనలు :
వ్యాస కాశి – ధార్మిక వ్యాసాలు,జాతి – జాతీయత, దీనదయాళ్ ఉపాధ్యాయ గారి హిందీ వ్యాసాల తెలుగు సేత.తిష్య రక్షిత (నవల) ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితం.
భారతి సాహిత్య మాస పత్రికలో ప్రచురింపబడిన వీరి వ్యాసాలు.
1)ఉదంకుని కథ వ్యాసం – 1984.
2) మినీ కవిత వ్యాసం – 1985.
3) పాత రోతయేనా వ్యాసం -1986.
వేయి పడగలు కథా నాయకత్వం వ్యాసం – 1984లో సాధన సాహితీ పక్షపత్రికలో ప్రచురింపబడినది.
సమాలోచన సాహితీ పక్ష పత్రికలో ప్రచురింపబడినవి.
1) తెలుగు సాహిత్యంలో గాంధీ వ్యాసం – 1985.
2) కవిద్వయం ద్రౌపది వ్యాసం – 1985.
3) వేయి పడగలు సామాజిక దృక్పథం వ్యాసం –
1985.
4) అచ్చ తెనుగన్న – పొన్నగంటి తెలుగన్న వ్యాసం – 1986.
స్రవంతి మాసపత్రికలో ప్రచురింపబడినవి.
1) వేయి పడగలు అంకిత పద్యం వ్యాసం – 1985.
2) వేయి పడగలు ధర్మారావు వ్యాసం – 1985.
వీరు చేసిన సాహిత్య సేవ.
సిద్దిపేట సాహితీ వికాస మండలికి వేముగంటి నరసింహచార్యులు అధ్యక్షులుగా,ఈశ్వర చరణ్ ప్రధాన కార్యదర్శిగా ఉండి సాహితీ సేవలు అందించారు.ఈశ్వర చరణ్ ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నప్పుడు అవధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అవధాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈశ్వర చరణ్ పృచ్ఛకుడిగా వ్యవహరించారు.శ్రీ నటరాజ రామకృష్ణ గారిచే సిద్దిపేటలో పేరిణి శివతాండవం,ఆంధ్ర నాట్యం ప్రదర్శనలు ఇప్పించారు.వీరు తెలుగు సాహిత్యానికి ఇతోధిక సేవలు అందించారు.వీరు పలు సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు.వీరు 54 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1992 నవంబర్ 16వ తేదీ నాడు పర లోక గతులు కావడంతో తెలుగు సాహితీ లోకం ఒక గొప్ప సాహిత్యకారుడిని కోల్పోయింది.
Narendra Sandineni
Narendra Sandineni
నా పేరు: నరేంద్ర సందినేని.మా ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ధర్మారం మండలం లోని గోపాలరావుపేట గ్రామం.కరీంనగర్ లో నివాసం. 1981-1983 నేను ఇంటర్ చదువుతున్నప్పుడు 3 కథలు, 6 కవితలు రాశాను.వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.నేను డిగ్రీకి వెళ్లిన తర్వాత నా రచనా వ్యాసంగం కొనసాగించలేదు.నేను బికాం. ఎల్.ఎల్.బి చదివాను.1994 నుండి కరీంనగర్ లో న్యాయవాది గా కొనసాగుతున్నాను. 6-6-2019 రోజున నేటి నిజం పత్రిక లో మద్యం మత్తు దీర్ఘ కవిత ప్రచురితం.కరోనా కాలం దాదాపుగా రెండు సంవత్సరాలు కోర్టులు నడవలేదు. విరామ కాలం లో 30 కవితల పై విశ్లేషణా వ్యాసాలు రాశాను.అన్ని వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.5 వ్యాసాలు సీనియర్ న్యాయవాదుల గురించి రాశాను.ప్రింట్ అయ్యాయి. ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(10)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
.ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ తనకు గల అపారమైన జీవితానుభవాన్ని, తాత్వికతను మేళవించి షాయరీ కవితను రాసిన తీరు అద్భుతంగా ఉంది,షాయరీ కవితలోని భావాలు మనసును పరవశింప జేస్తాయి.షాయరీ కవితను చదవాలనే ఆసక్తి ఉందా? తెలుసుకోవాలని మనసు తహతహలాడుతుందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.షాయరీ కవితలోని అపూర్వమైన భావాల లోకంలో విహరించండి.గొప్ప గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నన్ను ఈ చీకటిలోనే ఉండనీయ్ గాలిబ్!
“వెలుతురులో నా అనుకున్న వాళ్ళ
“ముఖాలు కనిపించి భయపెడతాయి!
చీకటి అనునది వెలుగునకు వ్యతిరేక పదం.చీకటి ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది.చీకటి అంతరిక్షంలో నలుపు రంగులో కనిపిస్తుంది.మానవుడు కాంతి గాని చీకటి గాని ప్రబలమైనప్పుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేడు.చీకటి తక్కువగా ఉంటే మసక చీకటి అంటారు.చీకటి ఎక్కువగా ఉంటే దాన్ని కారు చీకటి అంటారు.ప్రతి రోజు రాత్రి కాగానే చీకటి అలుముకుంటుంది.ఎక్కువగా నేరాలు మరియు ఘోరాలు రాత్రి సమయంలోనే జరుగుతుంటాయి. సూర్యుడు అస్తమించడంతో లోకం అంతటా అంధకారం వ్యాపిస్తుంది. జీవితంలో తనకు అత్యంత ప్రధానమైనటువంటిది దూరమైనప్పుడు జీవితం అంధకారమయంగా తోస్తుంది.చీకటి అనేది అజ్ఞానానికి ప్రతీకగా చెబుతారు.అజ్ఞానం అంటే జ్ఞానము లేదా ఒక నిర్దిష్ట విషయంపై అవగాహన లేకపోవడం అని చెప్పవచ్చు.ముఖ్యమైన సమాచారం లేదా వాస్తవాల గురించి తెలియని వ్యక్తులను అజ్ఞానులుగా తలంచ వచ్చు.అజ్ఞానం మూడు రకాలుగా పేర్కొంటారు.1)వాస్తవ అజ్ఞానం అనగా కొన్ని వాస్తవాల జ్ఞానం లేకపోవడం. 2)వస్తువు అజ్ఞానం అనగా కొన్ని వస్తువులతో పరిచయం లేకపోవడం.3)సాంకేతిక అజ్ఞానం అనగా ఏదైనా శాస్త్రబద్ధంగా ఎలా చేయాలో తెలియక పోవడం.అజ్ఞానం అంటే తెలియనితనం.ప్రసిద్ధ కవి గాలిబ్ అగ్రాలో జన్మించాడు.గాలిబ్ చిన్న చిన్న మాటలతోనే తన కవితల్లో పెద్ద భావాన్ని పలికించాడు.మనసు నుండి ఉబికి వచ్చే దుఃఖం, ఊహా ప్రేయసి,ప్రేమ,శృంగారం,విరహం,కరుణించని ప్రేయసి కాఠిన్యం,స్వీయ అన్వేషణ,నీతి, సౌకుమార్యం, జీవితపు గాఢత,మానవుడి అంతరంగపు లోతు,ఒంటరితనపు క్షోభ,బతుకు రుచి,లోక రీతి,ఏదీ శాశ్వతంగా ఉండిపోదన్న వాస్తవాలు గాలిబ్ కవితల్లో కనిపిస్తాయి.అందంతో ఆరోగ్యవంతుడిని చేసే ప్రేయసి గురించి గాలిబ్ మాత్రమే రాయగలడు.ప్రేమకు ప్రేమే బాధ,ప్రేమకు ప్రేమే చికిత్స అని గాలిబ్ చెప్పగలడు.మనలో మనం మాట్లాడుకుంటాం.మనం ఇతరుల వల్లనే మోసపోయాం అని అనుకుంటాం.కానీ వాస్తవానికి మనం మనతోనే ఎక్కువగా మోసపోయామని గాలిబ్ మాత్రమే చెప్పగలడు.ఈ షాయరీ కవితలోని భావాలు అతని హృదయం లోతుల్లో జరిగే సంఘర్షణల తాలూకు చీకటిని అజ్ఞానాన్ని తెలియజేస్తాయి.ఈ లోకంలో నివసించే ఎవరికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి.అందులో పదహారు గంటలు తాను ఏదైనా పని చేస్తూ జీవిస్తాడు.మిగతా ఎనిమిది గంటలు మాత్రం నిద్రపోతేనే అతని శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది.నిద్ర పోయే ఎనిమిది గంటల సమయంలో కూడా ఆ చిమ్మ చీకటి రాత్రిలో అతనికి ఏవేవో తెరిపిలేని ఆలోచనలు,మనసును మెలిపెట్టే సమస్యలు, బాధ,దుఃఖం,దూరమైన ప్రేయసి ఎడబాటు గుర్తుకు వచ్చి సతమతమవడం ఎంతో ఆందోళనను కలిగిస్తుంది.చీకటిలో కూడా మరిచిపోలేని దుఃఖం,వేదన,దిగులు మనసును ఆవహించి అతన్ని నీడలా వెంటాడుతుంది.తన వాళ్ళు అంటే రక్తసంబంధీకులు,తన హృదయానికి నచ్చిన వాళ్ళు,దగ్గరి వాళ్ళు,బంధువులు మరియు స్నేహితులు అందరు ధన వ్యామోహంలో కూరుకుపోయి ఆత్మీయత,అనుబంధాలను మరిచిపోయారు.వారు తన పట్ల అనురాగమున్నట్లు నటిస్తూ,ఎంతటి దుర్మార్గం చేయడానికి అయినా వెనుకాడడం లేదు.అతను తన హృదయంలో చెలరేగే భావోద్వేగపు సంఘర్షణలను తనను చుట్టుముట్టిన సమస్యల సుడిగుండాలను జీవితం విసిరిన సవాళ్లను ఎదుర్కొనలేక నన్ను ఈ చీకటి ప్రదేశంలోనే ఉండనీయమని వినమ్రంగా గాలిబ్ ను వేడుకుంటున్నాడు.తన జీవితంలో కలిగిన అలజడులు, ఆందోళనలను అవాంతరాలను తొలగించడానికి గాలిబ్ నుండి మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అతని ఆలోచన.అతని వల్లనే .తన జీవితానికి శాంతి,స్వాంతన లభిస్తుంది అనుకుంటున్నాడు.తన గుండెలో చెలరేగుతున్న భావావేశం,అలజడులు,కష్టాలు,కన్నీళ్లను గాలిబ్ కు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.గాలిబ్ నుండి మాత్రమే తాను ఓదార్పును పొందగలనని అతని విశ్వాసం.ఈ లోకంలో ఎవ్వరు తన బాధలను అర్థం చేసుకోలేరు.ఒక్క గాలిబ్ మాత్రమే అర్థం చేసుకుంటాడు.జీవితం అనే ప్రయాణంలో చీకటి నుండి బయటికి వచ్చిన తర్వాత మనకు వెలుతురు కనిపిస్తుంది. వెలుతురును చూడగానే మన బతుకు తిరిగి చిగురిస్తుందని అనుకుంటాం.కానీ అలాంటి వెలుతురులో కూడా నాకు ప్రియమైన వాళ్ళ ముఖాలు కనిపించి భయపెడతాయి.నా ప్రియమైన వాళ్ళు అనుక్షణం నన్ను వేధించిన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.భయం నీడలోకి నన్ను త్రోసిన వారిని,నా వినాశనాన్ని కాంక్షించిన వారిని చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు.ద్రోహం చేసిన వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించి నన్ను భయపెడతాయి అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఈనాడు లోకంలో మనుషులు ద్వేష భావాన్ని కనిపించకుండా ప్రేమను ఒలకబోస్తూ ఆప్తులుగా నటిస్తూ మన వెంటే ఉంటారు. ఆప్తులుగా నమ్మిన వారే మనను ఒక్కసారిగా వెన్నుపోటు పొడుస్తారు.మనకు వారి నిజస్వరూపం తెలిసినప్పుడు ఏమీ చేయలేని సందిగ్ధత నెలకొంటుంది.గుల్జార్ మనుషుల విచిత్ర మనస్తత్వాలను బాగా అర్థం చేసుకున్నాడు.అందుకే షాయరీ కవితల్లో అద్భుతమైన భావాలను పండిస్తూ లోక రీతిని చెప్పిన తీరు అసాధారణం అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(11)
గుల్జార్ షాయరీ కవితలోని పొంగి పొరలే భావాలు, ప్రేమ,అనుభూతి,అపారమైన జీవితానుభవంతో కూడిన తాత్వికత,పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. గుల్జార్ షాయరీ కవితల్లోని భావాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“పోయినేడాదిలాగే ఈ చలికాలపు
“డిసెంబర్ నెల కూడా వెళ్ళిపోతుంది
“దీనికి కూడా నీలాగే నా కోసం
“ఆగిపోయే అలవాటే లేదు !
పోయిన ఏడాదిని గడిచిపోయిన సంవత్సరం లేదా గత సంవత్సరం అని అంటారు.గత సంవత్సరం అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి?అతని జీవితంలో అనురాగం,అప్యాయతలు పంచిన మధుర క్షణాలు ఉన్నాయి.గత సంవత్సరం జీవితంలో తీరని వేదన కలిగించిన సంఘటనలు అతని తీపి జ్ఞాపకాలను ఆనందాన్ని దూరం చేశాయి.గడిచిన సంవత్సరం గుర్తుకు వస్తే అతనికి నిరాశ,నిస్పృహలు కలుగుతాయి.విషాదం, పెను చీకటి అతని వెన్నులో చలి పుట్టిస్తుంది.డైరీలోని పేజీలను తిరిగేస్తే గత సంవత్సరపు జ్ఞాపకాలు,అతని జీవితంలో జరిగిన మార్పులు తెలుస్తాయి.నిత్యం జరిగే వ్యవహారాలను డైరీలో రాసే అలవాటు అందరికీ ఉండదు.కొందరికి మాత్రమే ఉంటుంది.ఒక వేళ అతనికి డైరీ రాసే అలవాటు లేనట్లయితే రాయని ఎన్నో విషయాలు అతని మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. మరపురాని తీపి జ్ఞాపకాలు,మరిచిపోలేని చేదు అనుభవాలు,అనుభూతులు అతని బ్రతుకులో గుర్తులుగా చెరిగిపోకుండా ఉంటాయి.తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతని మనస్సు ఎక్కడా లేని ఆనందానుభూతిలో తేలి ఆడుతుంది.చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తే అతను తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోతాడు.రంగు రంగుల రమ్యమైన అతని జీవితంలో ఎన్నో మధుర స్మృతులు, ఆనందాలు,అనుభూతులు పెనవేసుకుని ఉన్నాయి.జీవిత ప్రయాణంలో అతనికి తెలియకుండానే గడియారంలోని ముళ్ళు తిరిగినట్లుగా నిమిషాలు,గంటలు,రోజులు, సంవత్సరాలు గడిచి పోయినాయి.చిత్రమైన అతని జీవితంలో మనస్సును ఆహ్లాదపరిచే సంఘటనలు, ఆనందాన్ని పంచే అనుభూతులు, అనుభవాలు వున్నాయి.ఈ లోకం ఎన్నెన్నో వింత,వింత అద్భుతాల సృష్టి.వెల్లివిరిసే ఆనందాలకు కొదువ లేదు.ఒక్క క్షణం కళ్ళు మూసి తెరవగానే అతనికి సంవత్సరం గడిచి పోయింది.గడిచి పోయిన సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలను,చేదు అనుభవాలను వెంట తీసుకొని వెళ్ళి పోయింది.ఈ సంవత్సరం డిసెంబర్ నెల మాసం వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉదయాన ఉషోదయాలు, రాత్రి వేళ చీకట్లు కలుగుతూ కాలం కరిగిపోతున్నది. శీతాకాలంలో మంచు కురుస్తూ విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి.చలి కాలంలో విస్తృతంగా వీస్తున్న చల్ల గాలుల మూలంగా శరీరానికి వణుకు పుడుతున్నది.డిసెంబర్ నెలలో జరిగిన మరపురానివి,మర్చిపోలేని కొన్ని సంఘటనలు అతని మనసుని మెలి పెడుతున్నాయి.మనసును గిలిగింతలు పెట్టే చలి,ప్రేయసి చెఃతన లేకపోవడం, ఏదో తెలియని గుబులు,అతనికి దడ పుట్టిస్తోంది. తాను అవ్యాజంగా ప్రేమించిన ప్రియురాలి ఎడబాటు,మనసును కలత పెట్టింది.ఆమె తనను ఒంటరి వానిని చేసి వెళ్లడంతో,తీవ్రమైన విషాదం తెలియని అలజడి,ఆందోళన మొదలైంది.ఆమె తన చెంత లేకపోవడం వల్ల,ఒక రకమైన నైరాశ్యం అతనిలో కలిగింది.ఆమె లేని ఎడబాటును తల్చుకుని అతని మనసు చెప్పలేని బాధతో విలవిలలాడింది. చూస్తుండగానే డిసెంబర్ నెల మాసం కరిగి వెళ్ళి పోతుంది.విరామం ఎరుగనిది కాలం.కాలం ఎవ్వరి కోసం ఆగకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది.అత్యంత గాఢంగా ప్రేమించిన నీవు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్లినట్లే డిసెంబర్ నెల వెళ్ళిపోతుంది. ఎంతగానో ప్రేమించిన నీవు నా కోసం ఆగ లేదు. డిసెంబర్ మాసం కూడా నీలాగే నన్ను వదిలి వెళ్ళిపోతున్నది.డిసెంబర్ మాసానికి ఆగిపోయే అలవాటు అసలు లేదు.డిసెంబర్ మాసం నాకు మనసులో ఎప్పటికీ గుర్తు ఉంటుంది.గాఢంగా ప్రేమించిన నీవు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు.ఈ సంవత్సరం డిసెంబర్ మాసం కూడా వెళ్ళిపోతుంది.నీ కోసం నాలాగే ఆగిపోయే అలవాటు దానికి లేదు అని కవి గుల్జార్ వ్యక్తికరించిన భావాల్లో ఎంతో సత్యం గోచరిస్తుంది. బ్రతుకులో గడిచి పోయిన కాలం నాటి చేదు జ్ఞాపకాలు,అనుభవాలు,మనసుని చుట్టుముట్టిన ఆలోచనలు,అలజడులను తట్టుకోవడం అతనికి కష్టంగా ఉంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగినవాడు. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(12)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను కవిత్వంలోకి మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.షాయరీ కవితలోని భావాల్లో నూతనత్వం, సహజ సరళి పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఎవరైనా వచ్చి నన్ను తమ
“బాహువులతో పొదువుకుంటే
“బాగుండు … చాలా కొద్దిగా
మిగిలాను .. అచ్చం ఈ
“డిసెంబర్ నెలలాగే !
మానవ జీవితం సంఘర్షణల నిలయం.అతని మనసులో చెలరేగే సంఘర్షణలు విరుద్ధ భావాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరైనా అంటే ఎవరో ఒకరు అని అర్థం.ఎవరో ఒకరు ఆపద్బాంధవునిలా వచ్చి తనను ప్రేమానురాగాలతో పలకరిస్తే బాగుంటుంది. ఎవరో ఒకరు తనకు తెలియని వారు తన దగ్గరికి ఎందుకు వస్తారు?ఎవరో ఒకరు వచ్చి అప్పుడే కలిగిన ప్రేమ,ఆకర్షణలతో తనను తన బాహువులతో అలుముకోవాలి అనే ఆలోచనలు అతనిలో కలుగుతున్నాయి.అతని మనసులోని ఆలోచనలు మనసులోనే ఉంటాయి.వాటికి రూపం ఇవ్వడం జరగదు.అతని ఆలోచనలు ఊహకు అందకుండా ఎక్కడో విహరిస్తున్నాయి.అతను తనకు తానే ఏదేదో మనసులో ఊహించుకుంటున్నాడు.అతని మనసులో చెలరేగిన ఊహలకు సమాధానం లేదు.అతను మనసులో అనుకున్నట్టుగా ఎవరో ఒకరు వచ్చి తనను బిగి కౌగిలిలో బంధిస్తే బాగానే ఉంటుంది. కానీ అలా జీవితంలో ఊహించినవి ఎలా జరుగుతాయి? ఊహించినవి జరిగితే ఊహలకే రెక్కలు వచ్చినట్టుగా ఉంటుంది.జరగని వాటిని గురించి ఎడతెగని ఆలోచనలు కలుగుతున్నాయి.అసలే అతను సున్నిత మనస్కుడు.అతడు హృదయ వేదనతో చాలా కొద్దిగా మిగిలాను అని అంటున్నాడు.అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది.ఎడతెగని ఆలోచనలతో అతని మనసు చిక్కి శల్యమైంది.సంవత్సరంలోని చివరి నెల డిసెంబర్ మాసంలాగే అతని ఆలోచనల్లో తగ్గుదల ప్రభావం కనిపిస్తుంది.తాను ఊహించినవి జరగకపోవడాన్ని తెలియజేస్తుంది.మనుషుల జీవితాల్లో కార్యాలు సంభవం అయినవి ఉంటాయి. సంభవం కాని కార్యాలు కూడా ఉంటాయి. మనిషి జీవితాన్ని సానుకూల దృక్పథంతో అడుగులు వేసి కృషి చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి. మనిషి తనలో తాను వ్యతిరేక భావాలతో మెదులుతూ అసంభవాల వైపు ఊహలు చేస్తూ ఉన్నాడు.ఇట్లాంటి ఆలోచనలు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి వెళ్ళినట్లుగా ఉంటుంది.జీవితమంటే కష్టసుఖాల కలబోత అంటారు.మానవ జీవితంలో ఏది జరిగినా సానుకూలంగా భరించాలి. సానుకూలంగా ఎదుర్కోవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది.ఒక్కోసారి కష్టపడినప్పటికీ ఫలితం రాదు.అయినా మనిషి ఓర్పుతో మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది.కష్టాలు వచ్చినప్పుడు అనుకున్నవి జరగనప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు.ఓర్పుతో తనకు తాను ప్రేరణ కలిగించుకుంటూ జీవితాన్ని సాగించాలి. ప్రేరణ మానవున్ని విజయాల బాట పట్టిస్తుంది. గుల్జార్ షాయరీ కవితలోనీ అద్భుతమైన భావాలు పాఠకుల హృదయాలను కదిలిస్తాయి.గుల్జార్ మనిషి మనసు చేసే మాయాజాలాన్ని కవిత్వీకరించడం అబ్బురపరుస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(13)
గుల్జార్ లో మానవ జీవితంలోని సంఘర్షణలను విభిన్న కోణాల్లో మలిచే అపారమైన సృజన శక్తి దాగి ఉంది.గుల్జార్ షాయరీ కవితలో పొంగి పొరలే భావాలు, అద్భుతమైన పద సంపద, జీవితానుభవం,తాత్వికతతో నిండి ఉండి పాఠకుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి.గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.
“ఎవరి కోసమైతే చీకటి నిండిన రాత్రులతో
“స్నేహం చేశానో ….
“వాళ్ళే ఉదయపు వెలుగులో నన్ను
“నిర్దయగా వదిలేశారు.
అతని మనసు గతం గురించిన తలపోతలు,అనుభవాలతో నిండిన ఆలోచనలు ఒక తెరిపి లేకుండా నిరంతరంగా సాగుతున్నాయి.అతని మనసులో చెలరేగిన ఆలోచనలకు ఒక క్రమం లేదు.అతను తన హృదయంలో ఆమెకు చోటు ఇచ్చాడు.ఆమెను ఎంతగానో అపురూపంగా ప్రేమించాడు.ఆమెతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నాడు.ఆమె లేకుండా తన జీవితం లేదు అనుకున్నాడు.తాను ప్రేమించిన ఆమెను గురించి చెప్పకుండా చీకటితో స్నేహం చేశాను అంటున్నాడు. రాత్రులు చిమ్మ చీకటితో నిండి ఉంటాయి. అంధకారంలో చూస్తే కంటికి ఏమీ కనిపించదు. అతను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు,కలిసి రాని కఠిన సమయం,మూర్తీభవించిన సహనం, మొక్కవోని ధైర్యం,ఆత్మవిశ్వాసాన్ని పెంచినాయి. నేను కష్ట సమయాల్లో ఎవరినైతే చేరదీశానో వారు నన్ను ప్రభాత వేళ నిర్దాక్షిణ్యంగా వదిలేశారు అంటున్నాడు.కష్ట సమయాలు ముగిసిన తర్వాత తన జీవితం నూతనత్వంతో కూడిన ప్రకాశవంతమైన సూర్యకిరణాలు సోకి అద్భుతమైన సమయం ప్రారంభమైనప్పుడు తన చెంతనే ఒకప్పుడు అనురాగం,ఆప్యాయతతో తనను ఆశ్రయించి ఉన్న వారు అక్కర తీరిన తర్వాత తనని వదిలి పెట్టారనే భావాలను చక్కగా వ్యక్తీకరించారు. మరపురానిది,మరిచిపోలేనిది స్నేహం అంటారు. ఎల్ల వేళలా స్నేహం ఒక్క తీరుగా ఉంటుంది. స్నేహంలో మార్పు ఉండదు.కఠిన సమయాలు వచ్చినప్పుడు స్నేహం మారదు.కఠిన సమయాల్లో కూడా స్నేహం,ప్రేమ,ఆప్యాయతలు పొంగి పొరలుతూ ఉంటాయి.కష్ట సమయాలు తీరి వారి పరిస్థితులు బాగుపడి నప్పుడు వారు అతనితో కలిసి మెలిసి ఉన్న స్నేహాన్ని మరిచిపోయి నమ్మక ద్రోహంతో మోసంతో పట్టించుకోనితనంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం,విడిచిపెట్టడం, స్నేహంలో గల వ్యత్యాసాన్ని స్వార్థపూరితమైన మనుషుల నైజాన్ని తెలియజేస్తుంది.అతను తన జీవితంలో ప్రత్యక్షంగా జరిగిన అనుభవాలు మరియు యదార్థమైన సంఘటనల దృశ్యాన్ని కళ్ళముందు కదలాడినట్లుగా షాయరీ కవితలో వ్యక్తం చేయడం జరిగింది.ఎవరినైతే అత్యంత ఆప్తులుగా భావించి నమ్మినాడో వారు అతని గుండె పగిలేలా చేశారు.నమ్మిన స్నేహితులు అతని నమ్మకాన్ని వమ్ము చేసినారు.తన గుండెకు కోలుకోలేని గాయాన్ని కలిగించి తీరని ద్రోహం చేశారు.స్నేహితులు ఇలా చేయడం ఎక్కడా చూడలేదు.స్నేహానికి జరిగిన అవమానం ఇది. ఎవరు కూడా కలలో ఊహించని సంఘటన.అతను వారిని తన వారని అమాయకంగా నమ్మినాడు. అతను వాళ్ళ శ్రేయస్సు కొరకు అహో రాత్రులు శ్రమించాడు.అతను ఎన్ని కష్టాలు ఎదురైనా భరించినాడు.అతను వారి జీవితాల్లో వెలుగులు నింపాడు.కష్టాలు తీరిన తర్వాత వారు అతనిని నిర్దయగా వదిలేశారు అని బాధపడుతున్నాడు. లోకంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించిన తీరు వింతగా విడ్డూరంగా ఉంది.కష్టంగా ఉన్నప్పుడు వారు అతని చెంత చేరారు.కష్టం తీరిన తర్వాత అతని అవసరం మాకు లేదు అనుకున్నారు.అతని పట్ల కనపరిచిన దయా దాక్షిణ్యం లేని వారి చేష్టలు క్షమించ రానివి.అక్కర తీరిపోయిన తర్వాత వారు అతనిని విడిచి పెట్టి వెళ్లి పోవడం ద్రోహంగా చెప్పవచ్చు.లోకంలో మనుషులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు.అవసరం ఉన్నప్పుడు మనుషులు ఒక తీరుగా ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మరో రకంగా ఉంటారు.అతని పట్ల వారి ప్రవర్తన ఎప్పటికీ క్షమించరాని ద్రోహంగా చెప్పవచ్చు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాల్లో నిజాయితీ ఉంది.కష్టాల్లో ఉన్నప్పుడు మరియు కష్టాలు తీరిన తర్వాత మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ షాయరీ కవిత తెలియజేస్తున్నది.స్నేహంలో కూడా ద్రోహం ఉంటుందని మనకు షాయరీ కవితలోని భావాల ద్వారా అవగతమవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(14)
గుల్జార్ లో సామాజిక దృక్పథం,తాత్విక చింతన,అపారమైన జీవితానుభవం మరియు లోక రీతికి చెందిన షాయరీ కవితలో వెల్లడించిన భావాలు పాఠకుల మనోఫలకంపై చెరగని ముద్ర వేస్తాయి.గుల్జార్ రచించిన షాయరీ కవిత్వం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అపూర్వమైన అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“కాకరకాయలా చేదుగానే ఉండు
“గులాబ్ జామూన్ లా తియ్యగా
“ఉన్నావనుకో …జాగ్రత్త జనం తినేస్తారు
“నిన్ను!
కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తీకరించిన భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.మనిషికి తన జీవన గమనంలో తన లోతైన జీవితానుభవం తోడ్పడుతుంది. లోకంలో మనుషులు అందరు ఒక్కలా ఉండరు. విభిన్నమైన మనస్తత్వాలు కల వాళ్ళు ఉంటారు. మనిషి చేతికి ఉండే ఐదు వేళ్ళు ఒక్కలా ఉండవు. ఒక్కో వ్రేలు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. లోకంలో నివసించే మనుషులు విభిన్నమైన వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుంది.వారు అటు వంటి సమయంలో సహనంతో మెలగాలి.మనిషి తాను ఇతరులతో ఎలా మసులుకోవాలి అనేది ఒక రకమైన కళ.అట్టి అపురూపమైన కళలో కవి గుల్జార్ నిపుణుడు అని షాయరీ కవితలోని భావాల ద్వారా వ్యక్తం అవుతున్నది.ఇవ్వాళ మంచిని చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు.మంచిని బోధించే కవితలోని భావాలు చదువుతుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.మనిషి నడవడి సవ్యమైన మార్గంలో ఉంటే జీవితం సరి అయిన బాటలో సాగుతుంది.గుల్జార్ జీవితానుభవంతో వెలిబుచ్చిన భావాలు సకల మానవాళికి అనుసరణీయం. మంచిని పాటిస్తే జీవితంలో విజయం సాధించి ముందుకు సాగడం ఖాయం.జీవితం అనే ప్రయాణంలో మనిషి జాగరూకతతో నడుచుకోవాలి. లేకుంటే బొక్కబోర్లా పడతాడు. మనిషి అడుగుల్లో తేడా వస్తే అధః పాతాళానికి దిగజారుతాడు. మనిషిగా మనం మనగలగాలంటే ఏం చెయ్యాలి అనే సందేహాలు మనని వెంటాడుతాయి.ఈ లోకంలో మనిషిగా మనుగడ సాగించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకానికి ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా,తియ్యగా,మంచిగా కనిపించేదైనప్పటికీ అందులో ఒక జాగ్రత్త అనేది తప్పకుండా ఉండాలి. అది మన జీవితానికి ఎంతో అవసరం.అందులో సందేహానికి తావులేదు.లోకో భిన్న రుచిః లోకంలో భిన్న రుచులు కల వాళ్ళు ఉన్నారు.సహజంగా మనం రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడడం జరుగుతుంది.మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మంచిది కాక పోయినప్పటికీ రుచి గల పదార్థం అయితే మనం ఇష్టంగా తింటాం. ఆరోగ్యానికి మంచి చేసేది అయినప్పటికీ రుచిగా లేకుంటే ఆ పదార్థాలను మనం తినం.రుచి లేని ఆహార పదార్థాలు తీసుకోవడం జరగదు మరియు వాటి జోలికి పోకుండా ఉంటాం.చాలా మంది కాకర కాయ పేరు వింటేనే చాలు.అమ్మో కాకరకాయ!నాకు వద్దు చేదు కూర అని పెదవి విరుస్తారు.చాలా మందికి కాకర కాయ చేదు అయినప్పటికీ మనసులో తినాలని కోరిక ఉంటుంది.కాకర కాయ చేదు అనే ఒకే ఒక్క కారణంతో దానిని తినడానికి అయిష్టత చూపుతున్నారు.ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకర కాయ మొదటిదిగా ఉంటుంది. కాకరకాయ ఉపయోగాలు తెలిస్తే దానిని తినడం ప్రారంభిస్తారు.కాకరకాయ ఓ తీగ జాతికి చెందినది కాకర కాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయ చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర కాయ చేదుగా ఉండడం వల్ల జనాలు తినడానికి ఇష్టపడరు. గులాబ్ జామూన్ అనేది ఒక తీపి మిఠాయి.గులాబ్ జామూన్ తియ్యగా ఉంటుంది.తియ్యగా ఉన్న గులాబ్ జామూన్ తినడానికి అందరు ఆశగా ఎదురు చూస్తారు మరియు ఆనందంతో తినడానికి ఎగబడతారు.అదే విధంగా మనం కూడా అందంగా,తీయగా,ముద్దు ముద్దుగా మురిపాలు ఒలకబోస్తూ మాట్లాడుతూ ఉంటే మన ప్రవర్తనను ఆసరాగా తీసుకుని జనం మనలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు. అందుకే మనిషిగా మన స్వభావాన్ని మరియు వ్యక్తిత్వాన్ని కాకర కాయలా చేదుగా ఉంచంకుంటూ జాగ్రత్తగా కాపాడుకోవాలి.మన పట్ల మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని ఇతరులు తమ స్వార్థపూరితమైన ప్రయోజనాలకు వాడుకుంటారు. మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోకపోతే ఇతరులకు మనం కేవలం వాడుకునే వస్తువుగా మిగిలి పోతాం. మనిషి వ్యక్తిత్వం అలా చేదుగా ఉన్న. చేదుగా ఉన్న మన జీవితంలోకి ఇతరులు చొరబడరు.స్వార్థపరులైన ప్రజలు కాకరకాయలా చేదుగా ఉండే మనకు దూర దూరంగానే ఉంటారు.గులాబ్ జామూన్ లా మనం తీయ తియ్యగా ముద్దులు ఒలకబోసేలా మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మనల్ని మిగలనివ్వదు.కాబట్టి ఈ కవితలో మనిషిగా మీ మీ వ్యక్తిత్వాల ప్రత్యేకతను జాగ్రత్తగా కాపాడుకొండి.
అనే ఒక గొప్ప సూచన దాగి ఉంది.కవి గుల్జార్ షాయరీ కవిత మనకు ఒక బలమైన సందేశాన్ని మరియు జాగ్రత్తలను తెలియజేస్తున్నది.మనిషిగా మీ ప్రవర్తన కాకరకాయలా చేదుగా ఉండాలి. మనిషిగా మీరు తీయ తీయగా గులాబ్ జామూన్ లా బలహీన మనస్తత్వం కలిగిన వారుగా ఉంటే తెలివైన ఈ లోకంలోని ప్రజలు మిమ్మల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు.మీ వ్యక్తిత్వంలో తేనె లాంటి తీపి పదార్థాలు గల గులాబ్ జామూన్ లాంటి స్వభావం ఉంటే అందరు మిమ్మల్ని దోచు కుంటారు. మీరు మీ జీవితం పట్ల గాడమైన అనురాగం,ఆప్యాయత కలిగి ప్రతి క్షణం మెళుకువతో జాగ్రత్తగా ఉండాలి.ఎందు కంటే ఈ ప్రపంచం మీరు గులాబ్ జామూన్ లా తీపిగా సరళంగా ఉంటే మీలోని విలక్షణతను వాడుకుంటుంది.మీరు కాకరకాయలా చేదు స్వభావం కలిగి ఉంటే ఈ విశాల ప్రపంచం మిమ్మల్ని చూసి భయపడుతుంది.మీకు దూర దూరంగా ఒదిగి ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత మనిషిగా మీ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?.మనిషిగా మీరు ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి? అనే గొప్ప సందేశాన్ని అందిస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత ఊహాత్మకమైన భావాల హెచ్చరికగా విలసిల్లుతున్నది.షాయరీ కవితలోని అపూర్వమైన భావనలు పాఠకులకు ఒక రకమైన వినూత్నమైన సందేశాలను అందజేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి *అమ్మంటే” కవిత.
*సంబరాల సంతకం
ఆత్మీయత, అనురాగం వ్యక్తం చేసే కవిత్వము ఓ విశ్లేషణ.
కవయిత్రి,సామాజిక కార్యకర్త,రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్,ఏ.ఎస్.యమ్.మహిళా డిగ్రీ & పి.జి.కళాశాల,వరంగల్,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని అమ్మంటే కవిత పై విశ్లేషణా వ్యాసం. స్నేహ గానం కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్,హైదరాబాద్ వారు బహుమతిగా ఎంపిక చేసి ప్రచురించడం ముదావహం.అమ్మంటే కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవయిత్రి రామలక్ష్మి తన తల్లిని గురించి అమ్మంటే కవితను రాసినట్లుగా తోస్తుంది. కవయిత్రి రామలక్ష్మి అంతు లేని అమ్మ ప్రేమను,అనురాగాన్ని ఇప్పటికీ పొందుతున్నది. సమాజంలో స్త్రీని తల్లి,మాత,జనని మరియు అవ్వ,అమ్మ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ.అమ్మ బిడ్డని నవ మాసాలు కడుపులో మోసి జన్మను ప్రసాదిస్తుంది.అమ్మ తన బిడ్డకు పాలు త్రాగించి, ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది. తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు..ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడా లభించదు.అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. మాతృదేవోభవ అని శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మ ప్రత్యక్ష దైవం.అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.అమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవయిత్రి రామలక్ష్మి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అమ్మ గురించిన గొప్ప అనుభూతుల లోకంలో విహరించండి.
“బతుకు బడిలో
“ఓనమాలు దిద్దించేది.
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు అని అంటారు.బడి అనగా విద్యాలయం.బడిలో పిల్లలకు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తారు. బడిలో పిల్లలకు ఉపాధ్యాయుడు అ నుంచి హ వరకు తెలుగు అక్షరాలు పలక మీద నేర్పి దగ్గర ఉండి ఓనమాలు దిద్దిస్తాడు.అమ్మ తన పిల్లలకు జీవితం అనే పాఠశాలలో ఓనమాలు నేర్పుతుంది. ఈ లోకమనే ప్రపంచంలో ఎలా గడపాలి అనే సంగతులను అక్షరాలు అవసరం లేకుండానే అమ్మ బతుకు పాఠాలను అరటి పండు ఒలిచినట్లుగా విడమర్చి చెబుతుంది.అమ్మ నేర్పిన ఓనమాల వల్లనే ఒడిదొడుకులు లేకుండా పిల్లవాడి జీవితం సాఫీగా సాగుతుంది.జీవితం అనే పాఠశాలలో అమ్మ ఓనమాలు నేర్పి పిల్లల జీవితాన్ని చక్కదిద్దుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవాల్లోంచి
“జీవిత పాఠాలను నేర్పించేది.
అనుభవంను ఆంగ్లంలో Experience అని అంటారు.ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు.ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు.ఒక పనిలో అనుభవం ద్వారా నైపుణ్యాన్ని సాధించిన వారిని అనుభవజ్ఞులు అంటారు.మనిషి నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల పనులు చేయడం ద్వారా అనుభవం వస్తుంది. మనిషి పని చేయడం వల్ల కలిగే అనుభవం ద్వారా జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. మనిషి తన చుట్టూ నివసిస్తున్న వారి జీవితాలను నిశితంగా పరిశీలించినట్లయితే అవి గుణ పాఠాలుగా గుర్తుండిపోతుంది.పిల్లలకు తొలి గురువు ఎవరు? అంటే అమ్మ అని సమాధానం వస్తుంది.పిల్లలు బతుకు బాటలో సవ్యంగా నడుచుకునేలా అమ్మ జీవిత సారాన్ని అనుభవాల రూపంలో తెలియజేస్తుంది.రామాయణం,భారతం వంటి ఇతిహాసాలు,పురాణాలు చదివితే మనం ఎలా జీవించాలి? అనే విషయాలు తెలుస్తాయి. జీవితం వడ్డించిన విస్తరి కాదు.జీవితం మనకు విలువైన పాఠాలు నేర్పుతుంది.రంగులతో కూడిన జీవితం నేర్పే ప్రతి పాఠం మనల్ని మరింత తెలివైన,బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అమ్మ తన అనుభవాల ద్వారా పిల్లవాడికి జీవిత పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆత్మీయతానుభూతులను
“అందించేది.
దగ్గర బంధువుల నుండి ఆత్మీయత మనకు లభిస్తుంది. ఆత్మీయత అనేది వ్యక్తిగత సంపద. ఆత్మీయత అనే గుణం పెంపొందించుకోవడానికి ప్రతి మనిషి జీవితంలో ప్రయత్నం చేయాలి.ఆత్మీయత మన బలమునకు కీలకంగా చెప్పవచ్చు.ఈనాడు సమాజంలో గల వ్యక్తుల్లో నైతికత లేకపోవడం వల్ల విశ్వాసం లేకపోవడం వల్ల ఆత్మీయతతో కలిసిమెలిసి ఉండడం లేదు.ఈనాడు మనిషి ఆత్మీయతకు దూరం అవుతున్నాడు.అనుభూతి అనేది భావోద్వేగం యొక్క చేతన ఆత్మాశ్రయ అనుభవాన్ని సూచిస్తుంది.ఏదైనా విషయం గురించి తెలుసుకునే భావన అనుభూతి.ఏదైనా పని చేసి ఉన్న జ్ఞానముతో వచ్చినది అనుభూతి.అనుభూతి ఒక మానసికమైన ఆనంద భావన.అనుభవంతో కూడిన భావన అనుభూతి. పిల్లలకు తల్లి ఆత్మీయత గురించి ఉగ్గుపాలతో రంగరించి నేర్పుతుంది.అమ్మ కంటే మించిన దగ్గరి వాళ్లు ఎవ్వరు ఉండరు.తల్లికి పిల్లల పట్ల ఉండే ప్రేమ ఆత్మీయత.అమ్మ తన పిల్లల పట్ల మమతానురాగాలను కలిగి ఉంటుంది.అమ్మ వల్ల పిల్లలకు ఆత్మీయత మరియు గొప్ప అనుభూతి లభిస్తుంది అని కవయిత్రి రామలక్ష్మి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనురాగామృతాన్ని
“కురిపించేది.
బలమైన అభిమానంను అనురాగం అంటారు. అనురాగంను ప్రేమకు పర్యాయపదంగా వాడతారు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం.అమ్మలో అనురాగం,ఆప్యాయత అన్నీ కలబోసి ఉంటాయి. హిందూ పురాణాలలో అమృతం అనగా అమరత్వాన్ని ప్రసాదించే పానీయం అంటారు.అమ్మ వల్ల పిల్లవాడికి ప్రేమ,అనురాగాలతో అమృతం సేవించకుండానే ఆయుష్షు పెరుగుతుంది. అనురాగం,అమృతం కురిపించేది అమ్మ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“బిడ్డల మనసును గ్రహించేది
“వారిని మనసారా ఆశీర్వదించేది.
తల్లికి పిల్లలు మనసులో ఏమనుకుంటున్నది? తల్లికి పిల్లల మనసులోని భావాలు ఎలా తెలుస్తాయి? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.తల్లికి పిల్లల మనసులోని భావాన్ని గ్రహించే అపూర్వమైన శక్తి ఉంది.పిల్లలు అడగకుండానే తల్లి వారికి కావాల్సినవి అన్ని ప్రేమతో చేసి పెడుతుంది.తల్లి పిల్లలను ప్రేమతో మనసారా ఆశీర్వదిస్తుంది.ఇవ్వాళ పిల్లలను మనసారా ఆశీర్వదించే వాళ్లలో తల్లికి మొదటి స్థానం ఉంటుంది.దేవుడు మనం కోరితేనే ఆశీర్వదిస్తాడు అంటారు.పిల్లలు కోరకుండానే తల్లి ఆశీర్వాదాలు అందిస్తుంది.అమ్మ బిడ్డల మనసును గ్రహిస్తుంది.అమ్మ బిడ్డలను మనసారా ఆశీర్వదిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“తాను కరుగుతూ
“కుటుంబానికి వెలుగు నిచ్చేది.
మైనముతో చేసిన దీపాన్ని కొవ్వొత్తి అంటారు. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు మైనము కరుగుతూ దానికి అమర్చిన వొత్తి మండటం ద్వారా వెలుగును ప్రసరింపజేస్తుంది.అమ్మ కుటుంబం కొరకు రోజంతా శ్రమిస్తూ గడుపుతుంది.అమ్మ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పని చేస్తూ కుటుంబంలో వెలుగులు నింపుతుంది.పిల్లలు పని మీద బయటకు వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం అమ్మ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది.అమ్మ తాను కొవ్వొత్తి వలె కరుగుతూ కుటుంబానికి వెలుగును ఇస్తుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“ప్రయోజకులైన బిడ్డలను చూసి
“సంతసించేది.
తల్లి బిడ్డ చదువుకొని విజయాలు సాధించినప్పుడు చూసి ఆనందంతో పొంగిపోతుంది.ప్రయోజకులైన బిడ్డలను చూసి పరవశురాలు అవుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆశయ సాధనకు
“ఆధారమై నిలిచేది.
ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరిక కలిగి ఉండడం ఆశయం.ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి పిల్లవాడు నిరంతరం శ్రమించేలా అమ్మ తోడ్పడుతుంది.అమ్మ పిల్లలను మీరు ఇంకా జీవితంలో ఎంతో సాధించాల్సినది ఉంది అని గుర్తు చేస్తుంది.అమ్మ వల్లనే జీవితానికి ఆశయం,అర్థం ఉన్నాయి.ఆశయ సాధనకు అమ్మ ఆధారమై నిలిచింది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“పిల్లల తప్పులెన్నింటినో సహించేది
“ గొప్ప మనసుతో క్షమించేది.
పిల్లలు తెలిసి తెలియని వయసులో ఎన్నో తప్పులు చేస్తారు.పిల్లలు చేసిన తప్పులను చూసి అమ్మ సహనంతో మెలుగుతుంది.పిల్లలు చేసిన తప్పులను అమ్మ గొప్ప మనసుతో క్షమిస్తుంది.పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్లు దండిస్తారు.అమ్మ మాత్రం పిల్లలను దండించదు.అమ్మ ప్రేమతో వారు చేసిన తప్పులను చెబుతుంది.అమ్మ పిల్లలు చేసిన తప్పులు సరిదిద్దుకునేటట్లు చేస్తుంది.ఇక ముందు పొరపాటున కూడా పిల్లలు అలాంటి తప్పులు చేయకూడదు అని అమ్మ ప్రమాణం చేయిస్తుంది. పిల్లల తప్పులను అమ్మ సహిస్తుంది.పిల్లల తప్పులను గొప్ప మనసుతో అమ్మ క్షమిస్తుంది అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“ఎప్పటికప్పుడు
“సంయమనం పాటించేది
“సంక్లిష్టతల ముడి విప్పేది.
సంయమనం అనే పదం వివిధ కారణాలవల్ల కొన్ని విషయాలను త్యజించడం మరియు నివారించడం అనే ఆలోచనను కలిగి ఉంటుంది.మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం సంయమనం అంటారు. జీవితంలోని వివిధ అంశాలలో సంయమనం పాటించాలనే వ్యక్తి యొక్క ఎంపిక వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం మరియు గౌరవించడం చాలా ముఖ్యం.సంయమనం ఇది తరచుగా వ్యక్తిగత నమ్మకాలు,సాంస్కృతిక నిబంధనలు లేదా ఆరోగ్య పరిగణనలను ప్రతిబింబిస్తుంది.కాలక్రమేణా జీవితం క్లిష్టంగా మార వచ్చు.అమ్మ అవసరమైనప్పుడు ఆవేశానికి గురి కాకుండా సంయమనం పాటిస్తుంది.జీవితంలో ఎలాంటి చిక్కు పరిస్థితులు ఎదురైనప్పటికీ అమ్మ తెలివితో మరియు అనుభవంతో పరిష్కరిస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి అమ్మంటే కవిత ద్వారా అమ్మ పట్ల గల అవ్యాజమైన ప్రేమను మరియు అనురాగాన్ని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి ‘సంబరాల సంతకం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.
కవయిత్రి,డాక్టర్ కొమర్రాజు రామ లక్ష్మి కలం నుండి జాలువారిన స్నేహ గానం కవితా సంపుటిలోని సంబరాల సంతకం కవిత పై విశ్లేషణా వ్యాసం. సంబరాల సంతకం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.సంబరాల సంతకం కవితను తన తండ్రిని గురించి కవయిత్రి రాసినట్లుగా తోస్తుంది.సంబరాల సంతకం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.సంబరం అంటే అది ఒక శుభకార్యం.సంబరాన్ని వేడుక వలె ఘనంగా జరుపుకుంటారు.మనిషి మనస్సు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన సంబరం. ఒక నిర్దిష్ట సందర్భంలో సంబరాలు జరుపుకోవడం, సంబరాలు చేసుకోవడం,ఆనందించే కార్యక్రమాలలో పండుగలు,వేడుకలు,జాతరలు అన్ని కలిసి ఉంటాయి.ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేని పైన సంతకం చేసాడో దానిని సృష్టించాడని గాని లేదా దాన్ని ఆమోదించాడని గాని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని భావన జనిస్తుంది.కవయిత్రి కవిత శీర్షిక సంబరాల సంతకం అని పేరు పెట్టింది.నాన్నతో గల అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ అధికారంతో కూడిన సంబరాల సంతకం నాన్న అని గుర్తు చేసుకుంటున్నట్లు తోస్తుంది.నాన్నతో గడిపిన తీపి క్షణాలను సంబరాల సంతకం అని అంటున్నది. కుటుంబంలో సంతానానికి కారకులు తల్లిదండ్రులు.వీరిలో పురుషున్ని తండ్రి,అయ్య,నాన్న ఆంగ్లంలో Father అని అంటారు.మన సంఘంలో పిల్లలను కని పెంచే బాధ్యత తల్లిది,పిల్లలను పోషించే బాధ్యత తండ్రిది అని భావిస్తారు.తండ్రి మూలంగా పిల్లలకు సమాజంలో గుర్తింపు,గౌరవం,ఆస్తి హక్కులు లభిస్తాయి.మన సమాజంలో తల్లిని భూదేవి, తండ్రిని ఆకాశం అంటారు.నాన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడే వాడు.నాన్నను జీవిత చుక్కాని అంటారు.నాన్న అంటే ప్రత్యక్ష దైవం.కనిపించే దేవుడు నాన్న.సంబరాల సంతకం కవితకు సంబంధించిన కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందా? కవయిత్రి రామలక్ష్మి రాసిన కవితా చరణాల్లోకి వెళ్లి ఒక్కసారి మనసు పెట్టి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతి తరంగాలలో తేలియాడండి.
“నాన్న ప్రేమ
“సృష్టిలో అమూల్యం.
అమూల్యమైనది అంటే చాలా విలువైనది అంటారు.ఎవరు దానిని విక్రయించడానికి లేదా కొనడానికి ఇష్టపడరు.అమూల్యమైన వస్తువులు, ద్రవ్య విలువ లేని వస్తువులు అంటే స్నేహం, ప్రేమ,గౌరవం మొదలైనవి.తల్లిదండ్రులు తమ పిల్లలను అమూల్యమైన వారిగా భావించి ప్రేమిస్తారు.లెక్కించలేని ద్రవ్య విలువను కలిగి ఉండటం అమూల్యం అంటే విలువ కట్టలేనటువంటిది.
.అమూల్యమైనది అనే పదం తరచుగా చాలా విలువైన దానిని వివరించడానికి ఉపయోగపడుతుంది.అమూల్యమైన దాని విలువను సాధారణ ద్రవ్య విలువతో నిర్వచింపలేం.ఏదైనా ధరకు మించిన విలువను కలిగి ఉండటం అమూల్యమైనది.నాన్న అందించే ప్రేమ సృష్టిలో ఎక్కడా లభ్యం కాదు. పిల్లల పట్ల నాన్నకు గల ప్రేమ,అనిర్వచనీయమైనది మరియు అమూల్యమైనది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“నాన్న మనసు “ఉప్పొంగే సముద్రం.
మనసు అంటే అంతరంగం.మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనలో భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మన మనసు ఆలోచిస్తుంది.మన మనసు అనుభూతి చెందుతుంది.మన మనసు గ్రహిస్తుంది.మన మనసు ఊహిస్తుంది.మన మనసు గుర్తు చేస్తుంది.భూమి పైన పెద్ద పెద్ద జల రాశుల గురించి చెప్పడానికి వాడే పదం సముద్రం. విస్తారంగా నీరు కలది సముద్రం.నీళ్లు నిండుగా ఉండే ప్రదేశం సముద్రం.ఉప్పు నీటితో విశాలమైన భూభాగాన్ని ఆక్రమించినది సముద్రం.నీటి పరిమాణం,లోతు చాలా ఎక్కువగా ఉన్న ప్రదేశం సముద్రం.నాన్న మనసు ఉప్పొంగే సముద్రం. ఉప్పొంగే సముద్రమును చూసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది నాన్నను చూస్తే ఉప్పొంగే సముద్రాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది.నాన్న మనసు వెన్నలాంటిది.నిర్మలమైన నాన్న మనసు ఉప్పొంగే సముద్రం వలె ఉంటుంది అని కవయిత్రి వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“కష్ట సుఖాల కలబోత నాన్న.
నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు,వేదనలు అనుభవించాడు.నాన్న జీవితంలో సుఖాలను కష్టాలను అనుభవించాడు.నాన్న కష్టాలకు బెదిరి పోలేదు సుఖాలకు పొంగి పోలేదు.కష్టం వెంట సుఖం,సుఖం వెంట కష్టం ఉంటాయి.కష్ట సుఖాలు జీవిత చక్రంలో ఒక భాగం అని చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు.కష్ట సుఖాల కలబోత నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కలిమిలేముల కలనేత మా నాన్న.
కలిమి అంటే ఉండుట,కలుగుట సంపద అని అర్థం.లేమి అంటే లేకుండుట,దారిద్ర్యం అని అర్థం.మంచి,చెడు లాగే సంపద ఉండటం,సంపద లేకపోవడం అనేది కావడికి ఉన్న రెండు కుండల వంటివి.కావడి కుండలు సమానమైన బరువు కలిగి ఉంటేనే ఆ కావడి మోసే మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుంది.కావడి సరిగా లేకపోతే మనిషి పడిపోతాడు.మనిషి జీవితంలో మంచి,చెడు, కష్టం,సుఖం రెండు ఉంటాయి.అప్పుడే మనిషికి మంచి ఏమిటి?చెడ్డ ఏమిటి?కష్టం ఏమిటి?సుఖం ఏమిటి? అనే దాని విలువ అవగతం అవుతుంది. ఐశ్వర్యం,పేదరికం అనేవి మానవ జీవితంలో తారసపడుతుంటాయి.అప్పుడే మనకు మంచి విలువ,సంపద విలువ తెలుస్తుంది.కలనేత అంటే రెండు రంగులు కలిపి నేయడం..కలనేత చూడ్డానికి చాలా బాగుంటుంది.పట్టు, కాటన్, సిల్క్ మిక్స్ చేసి కలనేతతో తయారు చేస్తారు.రెండు రంగులు అవటం వలన కలనేత అంటారు.సంపద,దారిద్ర్యం రెండు కలనేత వలె నాన్న జీవితంలో కలిసి ఉన్నాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“బతుకు బాటన పయనించే బాటసారి.
నాన్న బతుకు కొరకు బాటసారి వలె ఎక్కడా ఆగకుండా పయనం కొనసాగించాడు.బాటసారి ప్రయాణం నిరంతరంగా కొనసాగుతుంది.ఏ ప్రయోజనం ఆశించి వెళుతున్నాడో ఆ ప్రయోజనం నెరవేరే వరకు బాటసారి పయనం కొనసాగుతుంది. బాటసారిది నిర్విఘ్నమైన ప్రయాణం.బాటసారికి ఎక్కడ అలసట కలిగినప్పుడు కొంత సేపు ఎక్కడో ఒకచోట సేద తీరి ప్రయాణం కొనసాగిస్తాడు. బాటసారి తన మానాన తాను బతుకు కొరకు సాగిపోతాడు.ఎన్ని ఆటుపోటులు ఎదురైనా బాటసారి తన పయనం ఆపడు.నాన్న గురించి కవయిత్రి బతుకుబాటన పయనించే బాటసారి అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“బరువు బాధ్యతలను వెరవని శ్రమజీవి.శ్రమ చేసేటటువంటి వ్యక్తిని శ్రమజీవి అంటారు.శ్రమజీవి ఎప్పటికైనా విజయం పొందుతాడు. ఇతరుల కొరకు శారీరక శ్రమ చేసేవాడు శ్రమజీవి.నాన్న అలుపు ఎరుగని శ్రమజీవి.నాన్న బరువు బాధ్యతలను నెత్తి మీద వేసుకొని కుటుంబ భారం మోసిన శ్రమజీవి. నాన్న కుటుంబం కొరకు బరువు బాధ్యతలను మోసి కుటుంబాన్ని గట్టెక్కించిన శ్రమజీవి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“కష్టాన్ని చెప్పుకోని కర్మ జీవి.
మనిషి రోజు చేసే కార్యక్రమాలను కర్మలు అంటారు.కర్మను ఒక యోగం లాగా చేయడాన్ని కర్మయోగం అంటారు.కర్మ చేసే మనిషిని కర్మయోగి అంటారు.మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం అనుభవించి తీరాలి.మనిషి చేసే మంచి కర్మలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది.మనిషి చేసే చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.కర్మ అంటే మనిషి మానసికంగా గాని శారీరకంగా గాని చేసిన కార్యకలాపాలు.సర్వ సామాన్యమైన పనులు చేసి ఆ పనుల నుండి సుఖ సంతోషాలను విశ్రాంతిని,ప్రశాంతతను పొందగలిగితే అతనిని కర్మ యోగి అంటారు.ఒక పని చేసినప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో అని దాని ఫలితం కోసం ఆలోచించకుండా పని చేయాలి.నాన్న తనకు జీవితంలో ఎదురైనా కష్టాలను గురించి ఎవరి వద్దకు వెళ్లి చెప్పుకోలేదు.కష్టాలను ధైర్యంతో అధిగమించాడు.ఒక కర్మ జీవిలా కష్టాలను అనుభవించాడు.కష్టాలను గురించి ఎవరికీ చెప్పుకోని కర్మజీవి నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సమస్యలను ఛేదించే మహా జ్ఞాని.
సమస్యల పరిష్కారం అనేది చాలా కార్యకలాపాలను తరచుగా భాగమయ్యే అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాలను సాధించే ప్రక్రియ.జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను తెలివిగా పరిష్కరించగలడు.సాధారణ సామర్థ్యానికి మించిన జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను గుర్తించడం,విశ్లేషించడం మరియు పరిష్కరించడం జరుగుతుంది.సమస్య పరిష్కారం అనేది జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారాలను కనుక్కునే ప్రక్రియను సూచిస్తుంది.మనం వ్యక్తిగత జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాం.కొన్ని సమస్యలు చిన్నవి.వాటిని మనం త్వరగా పరిష్కరించుకోవచ్చు.సంక్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి సహకారం,సృజనాత్మకత అవసరం ఉంటుంది.కవయిత్రి నాన్న గురించి చెబుతూ సమస్యలను ఛేదించే మహా జ్ఞాని నాన్న అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
క్రమశిక్షణను నేర్పే
“ఆది గురువు.
క్రమశిక్షణ అనే పదాన్ని జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని అందించడం మరియు బోధించడం అని నిర్వచింపబడింది.క్రమశిక్షణ అనేది శిష్యుడికి ఇవ్వబడిన క్రమబద్ధమైన సూచనలను తెలియజేస్తుంది.ఒక నిర్దిష్టమైన ప్రవర్తన నియమావళిని అనుసరించమని ఒక వ్యక్తికి సూచించడం క్రమశిక్షణ.క్రమశిక్షణ అనేది నియమాలు లేదా ఆదేశాలను పాటించాల్సిన అవసరము మరియు కష్టమైన పనిని కొనసాగించగల సామర్థ్యం ద్వారా పొందే స్వీయ నియంత్రణ.క్రమశిక్షణ అంటే బోధించడం,సరిదిద్దడం అని చెప్పవచ్చు.పిల్లలకు క్రమశిక్షణ తండ్రి వద్ద నుండి అలవడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అంచనాలు, మార్గదర్శకాలు మరియు సూత్రాల గురించి బోధించడానికి క్రమశిక్షణను ఉపయోగిస్తారు.క్రమశిక్షణ పిల్లలకు చిన్నతనం నుండి అలవాటు చేయాలి.ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది.రాత్రి,పగలు, నెలలు,రుతువులు,సంవత్సరాలు ఇలా ఒక క్రమ పద్ధతిలో వస్తాయి.అలాగే గ్రహాల గతి కూడా క్రమానుగతంగా తన విధులను నిర్వహిస్తుంది.అదే విధంగా మానవులు తమ విధులను నిర్వహించాలి. ప్రతి వ్యక్తి తనకు తానే స్వయంగా క్రమశిక్షణకు పాటుపడాలి.దీనిని అంతర్గత క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు.పిల్లల క్రమశిక్షణకు సజీవ రూపాలు.చక్కని క్రమశిక్షణతోనే దేశ ప్రగతికి పునాదులు వేయబడ్డాయి.గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే వ్యక్తిగా చూడబడతాడు.మన భౌతిక ఆది గురువులు తల్లిదండ్రులు.మనను కన్న తల్లిదండ్రులను గౌరవించాలి,ఆదరించాలి,సేవించాలి.క్రమశిక్షణ నేర్పిన ఆది గురువు తండ్రి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మరెవ్వరితోని పోల్చలేని
“ఆత్మబంధువు.
హృదయానికి చాలా దగ్గరగా ఉండే బంధువు లేదా సంబంధం ఉన్న వారిని ఆత్మ బంధువు అని అంటారు.ఆత్మకు బంధువు నాన్న.పిల్లలకు ఆత్మబంధువు నాన్న.మరెవ్వరితోని పోల్చలేని ఆత్మబంధువు నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“పిల్లల
“గెలుపు సాధనం నాన్న.
పోటీలో నెగ్గుట గెలుపు అంటారు.నాన్న పిల్లలను విద్య నేర్పించడం కొరకు పాఠశాలలో చేర్పిస్తాడు. నాన్న ఎన్నో పనులు చేస్తూ తాను పడ్డ కష్టాలను మర్చిపోతాడు.పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు.పిల్లలు చదువులో ఉద్యోగంలో రాణించడానికి ఎంతో తోడ్పడుతాడు.పిల్లల గెలుపు సాధనం నాన్న అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఓటమితో ఊరటనిచ్చే
“ధైర్యం నాన్న.
గెలుపుకు వ్యతిరేకం ఓటమి.పోటీలో ఒకరిపై ఓడిపోవడం ఓటమి.గెలువకపోవడం ఓటమి.ఓటమి అంటే పోరాటాన్ని విడిచి స్తబ్దంగా ఉండడం.ధైర్యం అంటే వేదన,నొప్పి,ప్రమాదం,అనిశ్ఛితి లేదా బెదిరింపులను ఎదుర్కొనే ఎంపిక మరియు సుముఖత.ధైర్యం అంటే కష్టాలను ఆపదలను ఇష్టపూర్వకంగా ఎదుర్కోవడం.ఊరట అంటే బాధా నివారణ.ఓడిపోయినప్పుడు పిల్లవాడికి మనో ధైర్యం ఇచ్చి ఓటమిని ఎదుర్కొనే ధైర్యం తండ్రి ద్వారా కలుగుతుంది.ఓటమితో ఊరట నిచ్చే ధైర్యం నాన్న అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కరుణ చూపే ఆ కళ్ళు
“అలసి సొలసిన ఆ కాళ్లు
“ఆయన వాత్సల్యానికి ఆనవాళ్ళు.
కరుణ అంటే కనికరము,దయ,జాలి అనే అర్థాలు ఉన్నాయి.వాత్సల్యం అంటే ప్రేమ,ఆప్యాయత, అనురాగం.బిడ్డల మీద తండ్రి చూపే ప్రేమ, ఆప్యాయత,అనురాగం.తల్లి ఆవు తన దూడపై చూపే ఆప్యాయత.ప్రేమ పూర్వక ప్రవర్తన అనేది తల్లిదండ్రుల పోషణ మరియు ప్రవర్తన నుండి వస్తుంది.నాన్న కళ్ళల్లో పిల్లల పట్ల కరుణ తొణికిసలాడుతుంది.నాన్న కుటుంబం కొరకు మరియు అందరి ఆనందం కోసం శ్రమించడం ద్వారా ఆ కాళ్లు అలసి సొలసిపోయినాయి.పిల్లల పట్ల నాన్న చూపించిన ప్రేమ,అనురాగం,ఆప్యాయత గుర్తులుగా నిలుస్తున్నాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“కుటుంబమే నాన్నకు ప్రాణం
“దాని క్షేమానికి ఆయన
“జీవితం అంకితం.
కుటుంబం అనగా ఒక ఇంటిలో నివసించే కొంత మంది మనుషుల సమూహం.కుటుంబ సభ్యులు పుట్టుకతో లేదా వివాహంతో సంబంధం ఉన్న వారు. కుటుంబంలో సంబంధాలు అనుభవాలు, అనుభూతులు,కాలానుగుణంగా మారుతూ ఉంటాయితల్లిదండ్రులు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం,సంస్కృతిని వారికి అందజేయడం జరుగుతుంది.పిల్లలు చిన్న వయసులో తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. కుటుంబం అంటే నాన్నకు ప్రాణంతో సమానం. కుటుంబ సభ్యుల క్షేమానికి నాన్న జీవితం అంకితం చేశారు.తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నాన్న చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది వెలకట్టలేనిది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నంటే కురిసే వెన్నెల
“విరిసే నవ్వుల వాన వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు.ఆంగ్లంలో Moon Light అని అర్థం. చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతిని వెన్నెల అంటారు.వర్షం లేదా వానను ఆంగ్లంలో Rain అని అర్థం.ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన ఆవపాతం వాన.రాత్రి పూట ఆకాశంలో కురిసే వెన్నెల రాత్రి ఎంతో హాయిగా ఉంటుంది.నాన్న ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మోములో సంతోషాలు విరబూస్తాయి.నాన్న కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సరదాగా గడపితే అందరి ముఖారవిందాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. నాన్నంటే కురిసే వెన్నెల విరిసే నవ్వుల వాన అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది.
“ఇంటి సంబరాల సంతకం నాన్న
“కంటి వెలుగులకు
“చిరునామా నాన్న.
ఇంటిలో నెలకొన్న సంతోషాలకు,సంబరాలకు నాన్న అధికారంతో కూడిన సంతకం వలె ప్రేమ, ఆప్యాయత,అనురాగం నెలకొంటాయి.ఇంటి కుటుంబ సభ్యుల కళ్ళలో వెలుగులు విరజిమ్మడానికి చిరునామా నాన్న అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషి తనానికి
“ఆ నిలువెత్తు సాక్ష్యానికి
“ప్రేమతో వందనాలు !
భూగోళం పై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మనుషులు చాలా పురోగతి సాధించారు. మానవులలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడం వల్ల సాధ్యపడినాయి.మానవులు భావవ్యక్తీకరణ,సమాచార పద్ధతులను వాడడంతో పాటు అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు.ప్రతి మనిషి జీవితానికి అర్థం ఉండాలని కోరుకుంటాడు. నాన్న న్యాయమైన అర్జన చేశాడు.నాన్న ఎలాంటి అవినీతి,అవకతవకలకు పాల్పడ లేదు.నాన్న ఎవరికి ఏ కోశాన హని తలపెట్ట లేదు.నాన్న ఉన్నంతలో ఇతరులకు సహాయం చేశాడు.నాన్న కుటుంబ నావను మునిగి పోకుండా గట్టెక్కించాడు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం నాన్నది. మంచితనానికి,మనిషి తనానికి నిలువెత్తు సాక్ష్యం అయిన నాన్నకు ప్రేమతో వందనాలు చెప్పడం ద్వారా తండ్రిని దేవుడిగా తలచిన తీరు మనస్సులో మెదులుతుంది.కవయిత్రి రామలక్ష్మి కి నాన్న పట్ల గల అపార ప్రేమకు నిదర్శనంగా సంబరాల సంతకం కవిత నిలుస్తుంది.కవయిత్రి రామలక్ష్మి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
వారాల అంజయ్య తేది 28 – 05 – 1935 రోజున పెద్ద గడియారం వీధి కరీంనగర్ లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు నరసమ్మ,నరసయ్య.వారాల నరసయ్య,నరసమ్మ దంపతులకు నలుగురు సంతానం.1) వారాల వెంకటస్వామి భార్య శారద.వెంకటస్వామి వ్యాపారం చేసి జీవనం సాగించాడు.2) వారాల జగన్నాథం భార్య సత్యమ్మ.జగన్నాథం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.3) వారాల సత్యనారాయణ భార్య ఊర్మిళ. సత్యనారాయణ ఫారెస్ట్ గార్డ్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.4) వారాల అంజయ్య భార్య రాధ. అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది.అది కరీంనగర్ పట్టణంలో మొదటి మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ గా పేరు గాంచింది.మిఠాయి సత్తమ్మ వారాల అంజయ్యకు పెద్దమ్మ.సత్తమ్మకు పిల్లలు లేరు.మిఠాయి సత్తమ్మ మరిది నరసయ్య తోటి కోడలు నరసమ్మ పిల్లలను తన పిల్లలుగా చూసుకునేది.మిఠాయి సత్తమ్మది సంపన్న కుటుంబం.సత్తమ్మకు స్వీట్ హౌస్ తో పాటు గాజుల దుకాణం కూడా ఉండేది.సత్తమ్మ స్వీట్ హౌస్ మరియు గాజుల దుకాణంలో 30 మంది వర్కర్లు పని చేసే వారు.మిఠాయి సత్తమ్మ నిజాం కాలంలో గుర్రం ఎక్కి ప్రయాణం చేసేది.
అంజయ్య గడియారం వద్ద గల కానిగి బడిలో 1,2,3 వ తరగతులు చదువుకున్నాడు.ఆ రోజుల్లో కానిగి బడి పంతులుగా యెంబెరు స్వామి 35 మంది పిల్లలకు అత్యుత్తమమైన విద్యను బోధించే వాడు.యెంబెరు స్వామి పిల్లలకు విద్య,వినయం నేర్పించే వారు.కానిగి బడి పంతులు గారి పేరు 40 సంవత్సరాల తర్వాత యెంబెరు స్వామి అని తెలిసింది.ఆ రోజుల్లో టీచర్లు అంటే అంత గౌరవం ఉండేది.మా సారు అని గౌరవంగా చెప్పే వాళ్ళం.కానీ సారు పేరు మాత్రం తెలియదు.అంజయ్య తాహతీయ గంజి స్కూల్ పాఠశాలలో 4 వ తరగతి వరకు చదువుకున్నాడు.గంజి పాఠశాలలో హసన్ అలీ ఉర్దూ చక్కగా బోధించే వాడు.అంజయ్య 5 వ తరగతి నుండి 10 వ తరగతి మెట్రిక్ వరకు గవర్నమెంట్ హై స్కూల్ (పురాణ) కరీంనగర్ లో ఉర్దూ మీడియంలో చదివాడు.ఆ రోజుల్లో గవర్నమెంట్ హైస్కూల్ లో ఆర్.వి.రావు ఇంగ్లీష్ చక్కగా బోధించేవాడు.అంజయ్య ప్రైవేట్ గా చదువుకొని బి.ఏ విద్యను పూర్తి చేశాడు.అంజయ్య బీఈడీ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వరంగల్ లో చదివాడు.అంజయ్య మెట్రిక్ 1952వ సంవత్సరంలో ఉత్తీర్ణులు అయ్యాడు.ఆ రోజుల్లో 10వ తరగతిని మెట్రిక్ అని పిలిచే వారు.మెట్రిక్ విద్య పూర్తి కాగానే అంజయ్య 1952 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల వీణవంకలో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు.వీణవంక పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండేది. ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.
ఆ రోజుల్లో టీచర్లకు జీతం తక్కువగా ఉండేది.అంజయ్య ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పుడు 56 రూపాయల నెల జీతం లభించేది.అంజయ్య గొప్ప గొప్ప హెడ్మాస్టర్ల కింద పని చేశాడు.హెడ్మాస్టర్లకు అంజయ్య పై సదభిప్రాయం ఉండేది.ఆంగ్లము చక్కగా బోధిస్తాడు అనే పేరును అంజయ్య సంపాదించుకున్నాడు.నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు.అంజయ్య పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో వీణవంక గ్రామంలో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడే ఉండే వాడు.వారానికి ఒక రోజు ఇంటికి వస్తూ ఉండే వాడు.అంజయ్యకు 1953 సంవత్సరంలో రాధతో వివాహం వేములవాడలో జరిగింది.అంజయ్య మామగారు మంగారి సుబ్రహ్మణ్యం వేములవాడ దేవస్థానంలో ఆయుర్వేద డాక్టర్ గా పని చేశాడు.సుబ్రహ్మణ్యం వేములవాడలో గొప్ప డాక్టర్ గా ప్రసిద్ధి పొందాడు. అంజయ్య రాధ దంపతులకు ఐదుగురు సంతానం. ప్రథమ సంతానం : వారాల ఆనంద్ భార్య ఇందిరా రాణి.ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ లో లైబ్రేరియన్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు.ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,ప్రముఖ కవి,సినిమా విశ్లేషకులు,అనేక కవితా సంపుటి పుస్తకాలు, అనువాద సాహిత్యం,సినిమా సమీక్షలు,పుస్తకాలు రాసి ప్రసిద్ధి పొందాడు.ఆనంద్ ఇందిరా రాణి దంపతులకు ఇద్దరు సంతానం.ప్రథమ సంతానం కూతురు రేల భర్త వేణుమాధవ్.రేల,వేణుమాధవ్ దంపతులకు ఒక్కరే సంతానం.పేరు ప్రద్యుమ్న. ఆనంద్,ఇందిరా రాణి దంపతుల ద్వితీయ సంతానం. కుమారుడు అన్వేష్. అంజయ్య ద్వితీయ సంతానం : పసుపునూటి మంజుల భర్త శ్యాంసుందర్.శ్యాంసుందర్ వ్యాపారంలో కొనసాగుతున్నాడు.మంజుల శ్యాంసుందర్ దంపతులకు ఇద్దరు సంతానం.1) కూతురు అఖిల భర్త విజయ్.విజయ్ వ్యాపారం చేస్తున్నాడు.2) కుమారుడు నిఖిల్ బాబు ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు. అంజయ్య తృతీయ సంతానం : సాయిని అనురాధ భర్త వెంకటేశ్వర్లు.వెంకటేశ్వర్లు రేకొండ గ్రామానికి చెందినవాడు.ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.అనురాధ వెంకటేశ్వర్లు దంపతులకు ఒక్కతే పాప.పేరు కీరవాణి. అంజయ్య చతుర్ధ సంతానం : వారాల అర్జున్ భార్య ఉషారాణి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అర్జున్ హైదరాబాదులో పని చేస్తున్నాడు.అర్జున్ ఉషారాణి దంపతులకు ఇద్దరు సంతానం :1) కూతురు చరిష్మా 2) కుమారుడు ఆరుష్.ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు.
అంజయ్య పంచమ సంతానం : వారాల అమర్ భార్య శ్రీలత.అమర్ ఫోటో డిజైనర్ గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.అమర్ కరీంనగర్ లో నివాసం ఉంటున్నాడు.అంజయ్య యు.పి.ఎస్. ధనగర్వాడి పాఠశాలలో హెడ్మాస్టర్ గా పని చేశాడు.అంజయ్య యు.పి.ఎస్. ప్రభుత్వ పాఠశాల,సావరాన్ స్ట్రీట్ లో హెడ్మాస్టర్ గా పని చేశాడు. తర్వాత కార్ఖానా గడ్డ హై స్కూల్,ధన్గర్ వాడి హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పని చేశాడు. అంజయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల గవర్నమెంట్ హై స్కూల్ నుండి 1993 వ సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాడు.అంజయ్య 1983 వ సంవత్సరంలో కరీంనగర్,మంకమ్మ తోట వీధిలో స్వగృహం నిర్మించుకున్నాడు.అంజయ్య భార్య రాధ 1987 వ సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.అంజయ్యను భార్య గురించి అడిగితే కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు.ఎందుకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నావు?బాధగా ఉంది అన్నాడు.మీ భార్య ఉన్నప్పుడు ఎలా ఉండే వారు? అని అడిగితే ఆమె ఉన్నప్పుడు ప్రశాంత జీవనం ఉండేది అని తెలియజేశాడు.జీవితంలో కలయికలు, ప్రేమ,దుఃఖం అన్నీ ఉండేవి.అంజయ్య ఉపాధ్యాయుడిగా బాధ్యతగా పని చేశాడు. అంజయ్యకు పాఠశాలలో బోధన తప్ప మరే వ్యాపకం ఉండేది కాదు.అంజయ్య రిటైర్ అయిన తర్వాత ఎక్కడా పని చేయలేదు.1969 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి అడిగితే చదువుకున్న వాళ్లలో మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉండేది.మామూలు జనాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి వారికి అంతగా తెలియదు.
2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం.టీచర్లు ప్రశాంతంగా ఉన్నారు.టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియజేశాడు.మీకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందా? అని అడిగితే ఎలాంటి అవార్డు రాలేదు.అవార్డు రావాలని కూడా ఏనాడు కోరుకోలేదు.ఉపాధ్యాయుడిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను.అంతే అదే నాకు సంతోషం.అది చాలు అన్నాడు.చిన్నప్పటినుండి అంజయ్య సైకిల్ నడిపేవాడు 88 సంవత్సరాల వయసు వరకు సైకిల్ నడిపాడు.ఈ మధ్యనే ఇంట్లో జారి పడ్డాను.కాలు విరిగింది.కాలు విరిగిన తర్వాత ఎక్కడికి పోవడం లేదు.ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పాడు.సైకిల్ ను ఈ మధ్యనే అమ్మేశాను అని చెప్పాడు. మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది అని అడిగితే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుంటాను.ఏ దేవునికి పూజ చేయను.సూర్య నమస్కారం చేయను.దేవుని మనసులోనే తలుచుకోవాలి అని చెప్పాడు.ప్రశాంత జీవనం ఉండేది.చిన్నప్పటినుండి హిందీ పాటలు వినడం అలవాటయింది హిందీ సినిమాలు చూసేవాన్ని అని చెప్పాడు రచయిత నరేంద్ర సందినేని 1978 – 1981 సంవత్సరంలో మంకమ్మ తోటలో గల ధన్గర్ వాడి హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అంజయ్య సారు నాకు పదవ తరగతిలో ఇంగ్లీష్ బోధించే వాడు. క్లాసులోని విద్యార్థులు అందరికీ గ్రామర్ చక్కగా నేర్పించారు.నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు బెత్తం తీసుకుని క్లాసులోకి వచ్చే వారు.సరిగా నేర్చుకోని విద్యార్థులకు బెత్తం దెబ్బలు పడేవి.ఆనాటి ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కొరకు పాటుపడేవారు.నాకు విద్య నేర్పిన గురువు అంజయ్య సారు గురించి ఆర్టికల్ రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.అంజయ్య సారును ఇంటికి వెళ్లి కలిశాను.అంజయ్య సారు కుమారుడు అమర్ నా వెంట ఉండి సహకరించాడు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (1).
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
గుల్జార్ రాసిన షాయరీ కవితల్లో దాగిన అంతర్లీనమైన భావాలు ఒక్క సారిగా పాఠకుల హృదంతరాలను తట్టి లేపుతుంది.ఏదో తెలియని లోకంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది.కవి గుల్జార్ కు సమాజంలోని సాటి మనుషుల పట్ల అనన్య సామాన్యమైన ప్రేమ ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు హృదయాన్ని కదిలిస్తాయి. గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? షాయరీ కవితాచరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.సరి కొత్త అనుభూతులను సొంతం చేసుకోండి.
“నిన్ను చందమామతో పోల్చడం
“నాకెందుకు ఇష్టం కాదు కానీ …
“ఈ జనం ఉన్నారే … రేయంతా నిన్ను
“చూడడమే నాకు అభ్యంతరం మరి !
చందమామను ఆంగ్లంలో Moon అని అంటారు. రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది చందమామ.ఒక గ్రహానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహం చందమామ.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం చందమామ.చంద్రుడు సూర్యుని ప్రకాశం వల్ల వెలుగుని ఇస్తున్నాడు.చిన్నతనంలో అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావె,జాబిల్లి రావె,కొండెక్కి రావె,గోగి పూలు తేవె అని పాడుతూ చందమామను చూపించడం మనం ఎరిగిన కథ. ప్రేయసిని నీవు అందంగా ఆకాశంలోని చంద్రబింబంలా ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్నావు అని అలనాటి ప్రబంధ కావ్యాల్లో చదివాం.జనం అనే పదం సాధారణ ప్రజానీకాన్ని, జాతీయ సమూహం,సమిష్టి లేదా సంఘాన్ని సూచిస్తున్నది.ఒకరి కన్నా ఎక్కువ మంది గల సమూహమును జనం అని కూడా అంటారు. సమాజంలో నివసించే వారిని జనం అంటారు. సూర్యుడు అస్తమించిన సమయం రేయి అంటారు. రేయి అనగా ఒక దినంలో విభాగం,సాయం సంధ్య వేళ నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలం. అతను తన ప్రేయసితో మాట్లాడుతూ ఆప్యాయతతో అనురాగం పల్లవించి దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు.నీవు ఎంతో అందంగా, అపురూపంగా కనిపిస్తున్నావు.అసలు దివి నుండి భువికి దిగి వచ్చిన మేలిమి బంగారు రంగు ఛాయతో అప్సరస వలె అగుపిస్తున్నావు.నిన్ను ఆకాశంలోని జాబిలితో పోల్చడం సరైనదిగా అనిపిస్తుంది.ఎందుకో తెలియదు కాని నీవంటే నాకు మరీ మరీ ఇష్టం.నీ అందచందాలకు సొగసు, సౌందర్యానికి దాసోహం అయ్యాను.ప్రేయసీ నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నాకు గడవదు.నిన్ను విడిచి ఉండ లేని మోహం కమ్ముకుంది.అది నీ పట్ల గల గాడమైన బంధం అంటారో,కామం అంటారో, అనిర్వచనీయమైన ప్రేమ అంటారో నాకైతే తెలియదు.కానీ ఈ లోకంలోని జనులు స్వార్థపరులు,విశాల దృక్పథం కొరవడిన చాలా చెడ్డ వారు.రేయంతా జనులు ఆకాశంలోని చందమామను చూస్తారు.అలాగే చందమామను చూసినట్లు నా ప్రేయసివి అయిన నిన్ను జనులు కామంతో కళ్ళు మూసుకుపోయి అదే పనిగా చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు.నాకు అభ్యంతరంగా తోస్తుంది.ఇంద్ర సభలోని దేవ కన్యలను తలపించే అందంతో అలరిస్తున్నావు. నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దానివి.నీవు నన్ను గాఢంగా ప్రేమించే అందమైన ప్రేయసివి. ప్రేయసిగా నా గుండెలో నీకు మాత్రమే చోటు ఉంది. నా గుండెలో నివాసం ఏర్పరచుకొన్నావు.నా హృదయం విప్పి చూస్తే అందులో నీవే రూప లావణ్యాలతో మెరుస్తూ కనిపిస్తావు.నిన్ను చందమామతో పోలుద్దామని ఉంది కానీ ఈ చెడ్డ జనులు ఆకాశంలోని చందమామను అదో రకమైన కామ భావనతో చూడడం నాకు నచ్చలేదు.అందుకే నిన్ను చందమామతో పోల్చడం నాకు నచ్చడం లేదు.ఈనాటి జనులు పర స్త్రీల జోలికి వెళ్ళకూడదు.పర స్త్రీలను కన్నతల్లి వలె భావించాలి అనే సుగుణాలను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏది సత్యం,ఏది అసత్యం,ఏది చేయాలి,ఏది చేయ కూడదు అనే ఇంగిత జ్ఞానంను జనులు ఎందుకో మర్చిపోయినారు.ఈనాటి జనులకు ఏ క్షణంలో ఎలా ప్రవర్తించాలి అనే వివేకం కొరవడింది.తల్లి పిల్లలకు సుగుణాలను ఉగ్గుపాలతో రంగరించి నేర్పిస్తుంది.తల్లి నేర్పిన సుగుణాలను మర్చిపోవడం వల్లనే లేని పోని అనర్థాలు,ఘోరాలు సంభవిస్తున్నాయి.గుల్జార్ కు జనుల విపరీత వింత స్వభావం మరియు అనైతిక చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.జనుల అసభ్య ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం తగినది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావం అద్భుతంగా ఉంది. గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (2).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ గొప్ప కవి,షాయరీ కవితల ద్వారా అద్భుతమైన భావాలను పండించాడు.గుల్జార్ షాయరీ కవితల్లోని పద సంపద,శిల్పం,పాఠకుల హృదయాలను అలరిస్తుంది.కవి గుల్జార్ కు హిందీ మరియు ఉర్దూ భాషలపై అద్భుతమైన అధికారం ఉన్నట్లుగా తోస్తోంది.గుల్జార్ రాసిన షాయరీ కవితల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. సహజత్వం ఉట్టి పడే షాయరీ కవిత్వం యొక్క అనుభూతిని సొంతం చేసుకోండి.
“నా కన్నీళ్ళకి నువు లెక్క
“కట్టైతే చూడు !
“కొన్ని కోట్లు ఉండకపోతే చెప్పు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు.కన్నీరు స్రవించే ప్రక్రియను ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం,సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.ఏడవటం వలన కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి,తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు స్రవిస్తుంది.కన్నీరు వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.ఏదైనా బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చుతూ కుమిలిపోతూ చేసే క్రియ దుఃఖం.దుఃఖం వల్ల ఏదైనా పనిలో మనసు నిమగ్నం చేయ లేక పోవటం జరుగుతుంది. అనుకున్నది జరగనప్పుడు మనకు కలిగేది దుఃఖం. మనసు కలత చెందడం వల్ల దుఃఖం వస్తుంది.బాధ కలిగినప్పుడు దుఃఖం పొర్లుకు వస్తుంది.దుఃఖం వల్ల మనిషి హృదయం విలవిలలాడుతుంది.కంటి నుండి వచ్చేవి కన్నీళ్లు అంటారు.ఆమె కన్నీళ్ళతో తన గుండెలోని బాధను తెలియజేస్తున్నది.ఒక్క సారిగా మనసులో కలిగిన బాధను తల్చుకుని దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది.అనంత లోకాలకు వెళ్లిన అతను లేడు అనే విషయం తలుచుకొని గుర్తుకు వచ్చి ఆమెకు కన్నీళ్ల ధారలు ఆగవు.మనిషి దుఃఖముతో కన్నీళ్లు కార్చడం అనేది బాధల నుండి కోలుకునే ప్రక్రియలో ఒక భాగం.ఆత్మీయులను కోల్పోయిన ఆమె కళ్ళనుండి కన్నీళ్లు కాలువలై ప్రవహిస్తున్నాయి.కన్నుకు దెబ్బ తగిలి బాధకు గురి అయినచో వెంటనే కన్నీళ్లు వస్తాయి.మనిషి భావోద్రేకమైన కన్నీళ్లతో విలపించుట మనం ఎరిగినదే.కన్నీళ్లు ఎందుకు వస్తాయో అనే భావన అంతగా తెలియదు.ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు దుఃఖముతో కన్నీళ్లు కారుస్తాం. కన్నీళ్లు మన కన్నులని తేమగా ఉంచి కంటికి కనురెప్పలకు నడుమ రాపిడి లేకుండా చేస్తాయి. కన్నీళ్లు కూడా సహజమని దుఃఖించడం ద్వారా మనిషి యొక్క మనసు స్వాంతన పొందుతుంది. విచారం,దుఃఖం,కలతలతో కన్నీరుకు సంబంధం ఉంది.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కన్నీళ్లు కాలువలై పారిన సంగతులు చూసిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.ప్రజల గుండెలను పిండి చేస్తున్న సంఘటనలతో కన్నీళ్లు కార్చడం,హృదయాన్ని ద్రవింప జేస్తుంది.దుఃఖం ఒక సహజమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ.ఇది ప్రియమైన వ్యక్తి మరణము సంభవించినప్పుడు వ్యక్తుల జీవితంలో మార్పులు ఏర్పడతాయి.మనిషి జీవితంలో దుఃఖం విడదీయ లేని ఒక భాగంగా మారింది.దుఃఖంతో విలపించడం కూడా ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటుంది.దుఃఖం బాధాకరమైనదిగా చెబుతారు.జననం దుఃఖం. వృద్ధాప్యం దుఃఖం.అనారోగ్యం దుఃఖం.మరణం దుఃఖం.ముఖ్యంగా ఎవరినైనా ఆత్మీయుని కోల్పోయినప్పుడు విచారం,దుఃఖం మనిషిని నీడలా వెంటాడుతాయి.యుద్ధం వలన దుఃఖం కలుగుతుంది.యుద్ధం మొత్తం మానవాళిని ప్రభావితం చేస్తుంది.మనం ఇష్టపడే వ్యక్తి చనిపోయినప్పుడు కలిగే దుఃఖం ఉంటుంది. వైఫల్యం వల్ల నిరాశ వల్ల కూడా దుఃఖం కలుగుతుంది.తీవ్రమైన దుఃఖముతో నా కళ్ళ నుండి ప్రవాహంలా కారుతున్న నీటి ధారలు మామూలుగా వచ్చే కన్నీళ్లు కావు.అవి బతుకు వేదన నుండి వచ్చిన కన్నీళ్లు.ఎంతో విలువైనవి.నేను కార్చిన కన్నీళ్లు హృదయపు లోతుల్లో నుండి వచ్చినవి.నా జీవితంలో నేను కార్చిన కన్నీళ్ళకు నువ్వు లెక్క కట్టి చూడు.మనిషి జీవితం అనేకమైన కష్టాలతో కూడుకుని ఉన్నది.జీవితంలో తాను అనుభవించిన కష్టాలతో పాటు లెక్కలేనన్నీ కన్నీళ్లు కూడా ప్రవాహమై పారినాయి.కన్నీళ్ళ విలువ లెక్క కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.కన్నీళ్ల విలువ అసాధారణమైనదిగా చెప్పవచ్చు.కన్నీళ్లను లెక్క కట్టడానికి ఇంత వరకు ఏ తూకం కనిపెట్టబడ లేదు. కన్నీళ్లు మనిషి జీవితంలో ఎంతో విలువైనవి.మనిషి జీవితంలో కన్నీళ్లు అమూల్యమైనవి.అనంతమైన ఆకాశంలోని చుక్కలను లెక్క పెట్టడం సాధ్యం అయ్యే పని కాదు.అదే విధంగా మనిషి జీవితంలో కార్చిన కన్నీళ్ల విలువ కోటాను కోట్లు ఉంటుంది అనేది వాస్తవమని తోస్తోంది.నా కన్నీళ్ళు కొన్ని కోట్లు ఉండక పోతే చెప్పు అని కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి అను సృజన చేసిన కవయిత్రి డాక్టర్ గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(3)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేశారు.గుల్జార్ సమాజాన్ని ఔపోషణ పట్టిన వాడు.షాయరీ కవితలోని భావాలు ఒక్క సారిగా మనసును తట్టి లేపుతాయి.షాయరీ కవిత చదవగానే ఒళ్ళు పులకరిస్తుంది.మనలను ఆలోచింపజేస్తుంది. గొప్ప అనుభూతిని కలిగింపజేస్తుంది.గుల్జార్ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతుల సౌందర్యాన్ని ఆస్వాదించండి.
“బతకడానికి ముక్తసరిగా ఉండడం
“కూడా అవసరమే దోస్త్ … అది నీ
“పొగరనుకుంటే అనుకోనీ !
“ఎక్కువ వొంగి
“నడుచుకున్నావనుకో … ఈ లోకం నీ
“వీపుని కూడా ముక్కాలి పీట వేసి
“ఎక్కి తొక్కుతుంది !
ముక్తసరిగా అంటే టూకీగా అని ఆంగ్లంలో Briefly అని అర్థం.ఈ లోకంలో మనిషి ఎలా జీవిస్తున్నాడు? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.కొందరు బతకడం కొరకు జీవిస్తున్నాడు అంటారు.మరి కొందరు మరో రకంగా చెబుతారు.
ఎవరు ఎలా చెప్పినా కూటి కొరకు కోటి విద్యలు అనే సామెత నిజం అనిపిస్తుంది.మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నెన్నో పనులు చేయవలసి ఉంటుంది.మనిషి కుటుంబ పోషణ కొరకు కష్టపడి పని చేయాలి.మనిషి బ్రతకడం కొరకు ఎక్కువగా కష్టపడి పనులు చేయనవసరం లేదు. మనిషి మితిమీరి కష్ట పడితే అనారోగ్యం పాలవుతాడు.మనిషి తనకు ఉన్న దానిలో తృప్తిగా బతకాలి.ఇతరులతో తన బ్రతుకును పోల్చడం వల్ల నిరాశ కలుగుతుంది.ఈ నిరాశ వల్ల మనిషి జీవితం వెతల పాలవుతుంది.ఈ లోకంలో ఎవరి బ్రతుకు వారిదే.ఈ లోకంలో ఎవరి జీవితం వారిదే.మనిషి ఇతరులు బ్రతకడానికి చేతనైనంత సహాయం చేయాలి.మనిషి ధర్మం ప్రకారం నడుచుకోవాలి. మనిషి తాను చేయవలసిన పని చేయడం ధర్మం అంటారు.ప్రతిరోజు మనిషి తాను చేయవలసిన విద్యుక్త కర్మలు నిర్వర్తించాలి.జీవితమంటే తమాషా కాదు. మనిషి జీవితంలో అది చేయాలి,ఇది చేయాలి అని అనుకుంటూ కాలాన్ని వృధా చేయ కూడదు.జీవితంలో మనిషి అనుకున్నది అనుకున్నట్లు అన్ని పనులు అప్పుడే జరగవు.మనిషి జీవితం గురించి గొప్పగా ఊహించుకోవడం వద్దు.మనిషి జీవితాన్ని సాధారణంగా భావించాలి.మనిషి తామరాకు మీది నీటి బొట్టులా జీవించాలి.మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సహనం వహించడం నేర్చుకోవాలి.మనిషి జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి అనే ఆశాభావ దృక్పథంతో జీవించాలి.మనిషి జీవితంలోని కష్టాలు ఆకాశంలోని మబ్బుల వలె తేలిపోతాయి అనే భావన కలిగి ఉండాలి.మనిషికి జీవితంలో ఎందరో తారసపడతారు.ఎందరో తనకు తారసపడ్డారని మనిషి బెంబేలు పడి పోకూడదు.మనిషి అందరితో సౌమ్యంగా సంభాషించాలి.ఇతరులు మనిషి ఓపికను పరీక్షించాలని చూస్తారు.ఏవేవో మనకు సంబంధం లేని విషయాల గురించి అడుగుతూ చిక్కుల్లోకిలాగాలని చూస్తారు.ఇతరులు అడిగిన ఏవేవో విషయాలు వాటి అన్నిటికి విపులంగా జవాబు చెప్పవలసిన అవసరమైతే లేదు.ఇతరులు అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానం చెప్పాలి.మనం జీవిస్తున్న సమాజంలో మనిషి మనుగడ సాగించడానికి ముక్తసరిగా మాట్లాడాలి. ముక్తసరిగా సమాధానం ఇవ్వడం అవసరం స్నేహితుడా అని చెబుతున్నాడు.నీవు ఇతరులు అడుగుతున్న విషయాల గురించి వాటి అన్నిటికీ సరే చూద్దాం అంటూ ముక్తసరిగా సమాధానం ఇవ్వడం సరైనదే స్నేహితుడా.నీవు ఇతరులకు ముక్తసరిగా సమాధానం ఇవ్వడం చూసి ఇతరులు నిన్ను పొగరు గల వాడు అనుకుంటారు.ఇతరులు పొగరు కల వాడు అనుకుంటే అది వారి తప్పు. ఇతరులు పొగరు కల వాడు అన్నంత మాత్రాన వారి ప్రవర్తన గురించి పట్టించుకోవద్దు.నిన్ను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో అలా మాట్లాడి ఉండవచ్చు.వాక్కుని నియంత్రించడం,మాట్లాడడం తగ్గించడం వల్ల మౌనం వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం జరగదు.వాక్కు అపూర్వమైన కళ,తపస్సు.వాక్కుని దైవమిచ్చిన వరంగా భావించి ముక్తసరిగా సంభాషించడం సర్వదా శ్రేయస్కరం. అహంకారంతో కూడుకున్నది పొగరు.నేనే గొప్ప వాడిని అనే భావం పొగరు.అహంకారం కలిగి ఉన్నందుకు చూపించే వైఖరి పొగరు.జీవరాశులకు సహాయం చేసేవాడు స్నేహితుడు.మైత్రి కలవాడు స్నేహితుడు.ఎవరైనా మనలో భాగం అయ్యే వాడు స్నేహితుడు.స్నేహితులు స్నేహంతో కలిసిమెలిసి ఉంటారు.ఆపద సమయంలో స్నేహితులు సహాయం చేస్తారు.నీవు ఎక్కువగా వంగి ఉంటే నీ వీపుపై కూర్చుండి సవారు చేస్తారు.లోకం అంటే ప్రపంచం.లోకం విశాల విశ్వంలో ఒక భాగం.జీవులు నివసించే ప్రదేశం లోకం.ముక్కాలి పీట అంటే మూడు కాళ్ళ పీట.మనిషి ఎలా జీవించాలి? మనిషి జీవితంలో ఎలా ఉండకూడదు? అనే విషయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి.మనిషి నిటారుగా నిలిచి ఉన్నట్లుగా నడుచుకోవాలి.మనిషి ఇతరులు చెప్పినట్లు విని ఎక్కువగా వంగి నడుచుకొనకూడదు.మనిషి ఇతరులు చెప్పిన దానిలో నిజం ఏమిటో గుర్తించి నడుచుకోవాలి. మనిషి ఇతరులకు భయపడి వారు చెప్పినట్లుగా నడుచుకుంటే లోకంలోని జనులు అతనిని ముక్కాలి పీటగా చేసి ఎక్కి తొక్కుతారు అనే జీవన సత్యాన్ని కవి గుల్జార్ తెలియజేసిన తీరు చక్కగా ఉంది. చక్కటి అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (4)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది. షాయరీ కవితలోని భావాలు నాకు నచ్చాయి. షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ఓస్ …ఖుదా !
“ఈ మెహబ్బత్ ని ఎంత వింతైన
“పదార్థంతో తయారు చేశావు ?
“నువ్వు సృష్టించిన మనిషి నీ ముందు
“నిలబడి ఇంకెవరి కోసమో విల
“విలల్లాడుతూ దుఃఖిస్తుంటాడు !
ఖుదా ఉర్దూ భాషకు సంబంధించిన పదం.ఖుదాను తెలుగులో దేవుడు అని అంటారు.ఖుదా అనే పదం అరబిక్ మరియు పర్షియన్ భాషకు సంబంధించిన మూల పదం.ఉర్దూ మరియు హిందీలో కూడా సర్వాంతర్యామి అయిన దేవుని ఖుదా అని అంటారు.తెలుగులో ఖుదాను దేవుడు, భగవంతుడు,పరమేశ్వరుడు అని అంటారు.దేవుడు అనగా సృష్టికర్త.సృష్టికర్త ఎవరు అంటే సృష్టిని సృష్టించిన వాడు.దేవుడు సర్వాంతర్యామి.దేవుడు నిష్కలంకుడు.దేవుడు మానవుల పాపాలను క్షమించే వాడు.దేవుడు నిజమైన మార్గాన్ని చూపించే వాడు.దేవుడు పాపాలను క్షమించి స్వర్గాన్ని ఇచ్చే వాడు.దేవుడు జగతిని నడిపే వాడు.దేవుడు ఒక్కడే.దేవుడు ఆది అంతము లేని వాడు.దేవుడు పవిత్రుడు.దేవుడు ఎటు వంటి పాపము చేయని వాడు.దేవుడు సృష్టి కర్త.దేవుడు జగమంతా వ్యాపించి ఉన్న వాడు.మొహబ్బత్ అనే ఉర్దూ పదం తెలుగులో ప్రేమ,అభిమానమును తెలియజేస్తుంది. మొహబ్బత్ అనే పదానికి తెలుగులో ప్రేమ, గాఢమైన అభిమానం,ఆదరణ,వాత్సల్యం అను అర్థాలు ఉన్నాయి.ఓ దేవుడా ! సృష్టిలోని వింత వింత అద్భుతాలను చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.ప్రభూ సృష్టి రచనను చేసినది నీవే కదా ! ప్రభూ నీవు చేసిన అద్భుతాలలో మొహబ్బత్ ప్రేమ కూడా ఉంది. ప్రభూ ఈ ప్రేమని ఎంత వింతైన పదార్థంతో తయారు చేసావు? అని ప్రశ్నిస్తున్నాడు.ప్రభూ నీవు సృష్టించిన వాటిలో మనిషి కూడా ఉన్నాడు.ప్రభూ నీవు సృష్టించిన మనిషి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి వినయంగా మోకరిల్లినప్పటికి కూడా ఇంకా అతని మదిలో వేరే ఎవరి కోసమో మనసు నిలిపి ఆమె కొరకు విలవిలలాడుతూ దుఃఖిస్తుంటాడు.వేరే ఎవరి పైనో గాఢమైన ప్రేమ, అభిమానం ఉన్నట్లుగా తోస్తుంది.మనిషిలో పేరుకు పోయిన ద్వంద నీతి ప్రభూ నీకు అర్థం అయి ఉండాలి.ప్రభూ మీ ముందు నిలబడి మనిషి చేస్తున్నది ఏమిటి?లోకంలోని మనుషుల రీతి రివాజు ఎలా ఉంది?మనిషి చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటిగా ఉంటున్నది.మనిషి ఆచరణలో
తేడా కొట్ట వచ్చినట్లు కనిపిస్తున్నది.మనిషి లోకంలోని పద్ధతిని మీరి నడకలు సాగిస్తున్నాడు. మనిషి తనలోని విలువలని మరిచిపోయినాడు. మనిషి పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదు.మనిషి నీతి నియమాలు,పరంపరగా వస్తున్న ధర్మాన్ని ఏ నాడో వదిలి వేసినాడు.ప్రభూ నీవు రాత రాసి లిఖించిన మనిషి చేస్తున్నది ఏమిటి? ప్రభూ నిజంగా అతను నీ ముందు నిలబడి ఉన్నాడు.అతని దృష్టి ఎవరి పైన ఉండాలి? సృష్టి చేసిన బ్రహ్మ ముందే నిలబడి కూడా మనిషి మనసులో నిలకడ లేదు. మనిషి ఎందుకిలా ఇంతగా మారి పోయాడు? మనిషి వింతగా విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.సృష్టి కర్తవైన నీ మీద అతను దృష్టిని సారించాలి.అతని దృష్టి నీ మీద ఉన్నట్లు కనిపించడం లేదు.ప్రభూ నీ ముందు నిలబడి కూడా నీ మీద దృష్టిని సారిస్తున్నట్లు నటిస్తున్నాడు.ఇంకా ఎవరి కోసమో ఆరాటంతో మనసు పెట్టి విలవిల్లాడుతూ దుఃఖిస్తుంటాడు అనేది సత్యంగా తోస్తుంది.గుల్జార్ సమాజంలో గల మనుషుల నడవడిని మానసిక స్థితిని అవగాహన చేసుకుని లోకంలోని మనుషుల తీరును సరిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తున్నది.గుల్జార్ షాయరీ కవిత లోకంలోని మనుషుల తీరుతెన్నుల గురించి తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (5)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన
చేసింది.గుల్జార్ కు లోకానుభవం మెండుగా ఉన్నట్లు షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి. గుల్జార్ షాయరీ కవితలోని భావాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మనసు పెట్టి ఒక్క సారి గుల్జార్ షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల
లోకంలో విహరించండి.
“నా హృదయంపై
“సంతకం చేయడానికి ఎవరు
“బయలుదేరారు ?
“ఈ ఎడారిలో …. ఎవరో నడిచిన
“అడుగుల సవ్వడి వినిపిస్తోంది !
గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.గుండె చాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.హృదయం అనేది ప్రేమకు గుర్తుగా చెబుతుంటారు.హనుమంతుడి హృదయం చీల్చితే అందులో రాముడు కనిపిస్తాడు అంటారు.హనుమంతుడు నిరంతరం రామ నామ స్మరణం చేసే వాడు అంటారు.ప్రేమికులు తమ హృదయంలో ప్రియురాలు నిండి ఉంటుందని చెబుతారు.ప్రేమికుల ధ్యాస ఎప్పుడు ప్రియురాలు పైనే నిలిచి ఉంటుంది.అతను తన మనసులో కలుగుతున్న సంఘర్షణల గురించి చెబుతు నా హృదయం పై సంతకం చేయడానికి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నిస్తున్నాడు.అతని హృదయం పై సంతకం చేయ గల అధికారం ఎవరికి ఉంటుంది? అనే సందేహాలు మనలో పొడసూప వచ్చు.అతని హృదయానికి ఆమె నచ్చిన వ్యక్తి అయి ఉంటుంది.హృదయానికి నచ్చిన వ్యక్తిని గురించి ఎవరు బయలుదేరారు? అని ప్రశ్నించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.అతని హృదయాన్ని ఆకర్షించిన వ్యక్తి ఆమెనే అయి ఉండవచ్చు అని మనకు తోస్తుంది.హృదయం యొక్క ఆలోచనను దాని రూపక లేదా సంకేత అర్థంలో ఉపయోగించే ఒక హృదయ చిహ్నం.ప్రేమ ముఖ్యంగా శృంగార ప్రేమతో సహా భావోద్వేగ కేంద్రాన్ని సూచించడానికి హృదయ చిహ్నం తరచుగా ఉపయోగపడుతుంది.గాయపడిన గుండె,విరిగిన హృదయం,బాణముతో గుచ్చబడిన హృదయ చిహ్నం.ఇది ప్రేమకు వేదనను సూచిస్తుంది.తెలుపు రంగు హృదయం అంతులేని ప్రేమను సూచిస్తుంది.ఎరుపు రంగు హృదయం నిజమైన ప్రేమను సూచిస్తుంది.నలుపు రంగు హృదయం దుఃఖానికి ప్రతీకగా ఉపయోగించబడుతుంది.పసుపు రంగు హృదయం స్నేహం ఆనందం కోసం ఉపయోగిస్తారు.ఆకుపచ్చ హృదయం ఆరోగ్యకరమైన జీవనం కోసం ఉపయోగిస్తారు.పర్పుల్ కలర్ హృదయం సున్నితమైన ప్రేమకు,సంపద కోసం ఉపయోగించబడుతుంది.ప్రేమ అంటే ఇద్దరి హృదయాల కలయిక.ఇద్దరి ఆలోచనల కలయిక. స్నేహం,చెలిమి అని అర్థాల్లో వాడుతారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణము లేదా మంచి అలవాటు.ప్రేమ లోతైన వ్యక్తుల మధ్య అనురాగం,సరళమైన ఆనందం,బలమైన మరియు సానుకూల భావోద్వేగం,మానసిక స్థితిని కలిగి ఉంటుంది.సర్వ సాధారణంగా ప్రేమ బలమైన ఆకర్షణ,భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తుంది.ఇద్దరి మధ్య గల అనుబంధం,ఇద్దరి మనసుల మధ్య గల పరస్పర ప్రేమను సూచిస్తుంది.ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సు ప్రాంతం సారవంతమై నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.ఎడారులు అంటే ఇసుకతో నిండి ఉన్న ప్రాంతాలు అంటారు.మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారి అనేది ప్రకృతి దృశ్యం.వాతావరణ ప్రక్రియల ద్వారా ఎడారులు ఏర్పడతాయి.ఎందుకంటే పగలు మరియు రాత్రి మధ్య ఉష్ణోగ్రతలు పెద్ద వ్యత్యాసాలు కలిగి ఎడారులపై ఒత్తిడిని కలిగిస్తాయి.ఫలితంగా రాళ్లు ముక్కలుగా విరిగిపోతాయి.ఎడారులలో వర్షాలు అరుదుగా కురుస్తాయి.ఈ ఎడారిలో అతనికి ఎవరో నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది.ఈ ఎడారిలో అతనికి ఆమె ఎవరో తెలియదు.కాని అతనికి ఎడారిలో ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది అంటే అతనికి ఆమె పట్ల అనురాగంతో కూడిన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.అతనికి ఆమె ఎవరో తెలియనప్పటికీ ఆమె నడిచిన అడుగుల సవ్వడి వినిపించడం ఆమె పట్ల గల ప్రేమ,అనురాగం ఉన్నట్లు తోస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.గుల్జార్ కు మనుషుల హృదయాలను ఇట్టే పసిగట్ట గల నేర్పు ఉంది.గుల్జార్ లో మానవత్వం పొంగి పొరలుతుంది మరియు మనుషుల హృదయాలను అర్థం చేసుకునే సహృదయం ఉంది అని షాయరీ కవితలోని భావాలు వెల్లడి చేస్తున్నాయి.గుల్జార్ షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(6)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి ( డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.గుల్జార్ రచించిన షాయరీ కవితను తెలుగులోకి గీతాంజలి (డాక్టర్ భారతి) అను సృజన చేసింది.గుల్జార్ లోకానుభవంతో వైవిధ్యమైన షాయరీ కవితలు పండించారు.గుల్జార్ షాయరీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.షాయరీ కవిత నన్ను ఆలోచింపజేసింది.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? షాయరీ కవితా చరణాలపై దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“కన్నీరు కార్చేటప్పుడు …ఎవరూ
“తోడు ఉండరని కాబోలు ….
“కన్నీళ్ళకి ఏ రంగు ఉండదు !
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి వాటిని తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని ఆశ్రువులు లేదా
కన్నీరు అంటారు.సాధారణ పదజాలంగా కన్నీరు ఏడవటం అనే చర్యను సూచిస్తుంది.దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది.భావోద్వేగాల కారణంగా కన్నీరు కార్చే వ్యక్తి మానవుడు అని భావిస్తున్నారు.కంటిని శుభ్రం చేసే కన్నీరు కార్నియాను తడిగా శుభ్రంగా ఉంచుతుంది.కంటిలో దుమ్ము ఉండకుండా నివారించుతుంది.కంటికి పోషక పదార్థాలు అందించడానికి కళ్ళు నిరంతరం స్రవిస్తాయి.కలక లేదా ఏదైనా ధూళి వంటివి కంటికి
తగిలినప్పుడు కన్నీరు స్రవిస్తుంది.ఏడవడం వలన
కన్నీరు వస్తుంది.బలమైన భావోద్వేగాలు,నొప్పి తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది.మనుషులలో దుఃఖం వలన ముఖం ఎర్రబడడం,గొంతులో గద్గదత,శరీరం కంపించడం కూడా జరుగుతుంది.ఏడిస్తే అనారోగ్యం వల్ల కలిగే బాధ కొంత దూరం అవుతుంది మరియు ప్రశాంతత చేకూరుతుంది.ఉద్వేగాలను అణచుకొని బాధపడటం కంటే వెక్కి వెక్కి ఏడవడం మంచిది అంటారు.కన్నీళ్ళలో ప్రోటీన్,మాంగనీస్, పొటాషియం,హార్మోన్లు,ప్రోలాక్టిన్ ఉంటాయి. ఏడవడం వల్ల శరీరంలో నొప్పి,ఒత్తిడి తగ్గుతాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది కన్నీరు శారీరకమైన కుంగుబాటును సూచించే సంకేతం.మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది.బాధ,దుఃఖం, కన్నీరు ఎదుటివారిని తృప్తి పరుస్తుంది.కన్నీరు శత్రువుల నుంచి సానుభూతిని సంపాదిస్తుంది. కన్నీరు బంధాన్ని,స్నేహాన్ని పెంచుతుంది.ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి.ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుంది.కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య విభేదాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది.ఏడుపు అనేది చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్ళతో ముడిపడి ఉంటుంది.కన్నీరు విలక్షణమైన ఏడుపు శబ్దాలతో కూడి ఉంటుంది.చాలా తరచుగా విచారం మరియు దుఃఖం,ఏడుపు,కోపం,నవ్వు లేదా హాస్యం,నిరాశ,పశ్చాత్తాపం లేదా తీవ్రమైన భావోద్వేగాల ద్వారా కన్నీళ్లు ప్రేరేపించబడతాయి. నిజాయితీ లేని పశ్చాత్తాపం యొక్క కపటమైన ప్రదర్శనను మొసలి కన్నీరు అని పిలుస్తారు.మనిషి మనసులో తీవ్రమైన బాధ కలిగినప్పుడు భావోద్వేగంతో కన్నీరు కార్చడం జరుగుతుంది. దుఃఖంతో కళ్ళ నుండి కన్నీరు కార్చేటప్పుడు అతను ఒక్కడే ఉంటాడు.కన్నీరు కార్చిన సమయంలో అతని వెంట ఎవరూ లేరు.అతని లోపల కలిగే దుఃఖాన్ని దిగమింగుకొని ఒక్కడే అనుభవిస్తాడు.అతని దుఃఖంలో తోడుగా ఎవరు ఉండరు అనే వాస్తవం తెలియజేయడం,కళ్ళనుండి కురిసే కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు కాబోలు అని ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజంగానే కళ్ళ
నుండి కార్చే కన్నీళ్లకు ఏ రంగు ఉండదు.మనిషి
ఎందుకు కన్నీళ్లు కారుస్తాడు? మనిషి దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అతనితో పాటు తోడుగా ఎవరు ఉండరు.కన్నీళ్ళకు ఏ రంగు ఉండదు అని
భావోద్వేగంతో కూడిన కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.తెలుగులోకి షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(7)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.గుల్జార్ షాయరీ కవితను గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“నేను తన వాడిని … ఈ రహస్యం
“ఆమెకి తెలిసిపోయింది !
“కానీ …ఆమె ఎవరిదో ….
“ఈ సవాలు నన్ను నిద్ర
“పొనివ్వట్లేదు !
నేను అనేది తెలుగు భాషలో ఒక మూల పదం.నేను అనే పదం సర్వ నామంగా వాడుతారు.ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.తన వాడిని అనగా తనకు స్వంతం అనే అర్థం వస్తుంది.అతను తనకు సంబంధించిన వాడు అని అర్థం.ఎవరికి తెలియకుండా దాచబడినది రహస్యం.మనకు తెలిసిన ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉంచటం రహస్యం.ఇతరులు ఎవరికి తెలియని విషయం రహస్యం.గుప్తంగా ఉండిన విషయం రహస్యం.ఆమె అనే తెలుగు పదం ఒక ఆడ మనిషిని గురించి వేరొకరికి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు.ఆమె ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామం.జవాబుకు వ్యతిరేకమైనది సవాలు.ప్రత్యుత్తరాన్ని కోరే వాక్యం సవాలు. ప్రశ్నకు జవాబు ఇవ్వ లేక పోవడం సవాలు.శత్రువు యొక్క సవాలును తోసి పుచ్చి వెళ్ళడం సవాలు.నిద్ర లేదా నిదుర ఆంగ్లంలో Sleep అని అర్థం.శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి నిద్ర.మనుషుల దైనందిన జీవితంలో నిద్రకు ముఖ్య భాగం ఉంది.మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. శారీరకపరంగా నిద్ర అత్యంత ముఖ్యమైనది.నిద్ర పౌరుల ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆరోగ్యకరమైన జీవనానికి నిద్ర చాలా అవసరమైనది.నిద్ర, విశ్రాంతి,ఆరోగ్యరీత్యా మానవులకు తప్పనిసరి అవసరం ఉంది.నేను తన వాడిని అని ఆమె మనసులో అనుకుంటున్నది. అతను తనకే స్వంతం అని మరియు అతను తనకు సంబంధించిన వాడు అని ఆమె మనసులోనే ఆరాధిస్తున్నది. ఆమె నన్ను అమితంగా ప్రేమిస్తున్నది.ఆమె నాపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నది.ఆమె అనురాగంతో చూపుల బాణాలు వేస్తున్నది. ఆమెను చూడగానే నా మనసు వశం తప్పినది.ఆమెకు నా మనసు అంకితం అయిపోయినది.ఆమె తెలివైనది.నేను నా మనసులో దాచి పెట్టిన రహస్యం ఆమెకు తెలిసిపోయింది. ఆందాలు చిందే రూప లావణ్యాలతో ఆమె మెరిసిపోతున్నది. సౌందర్యవతి అయిన ఆమె ఎవరిదో అనే విషయం నాకు నా జీవితంలో ఒక సవాలుగా మారింది.జీవితంలో సవాలు వేయడం అనేది మామూలు విషయం కాదు.అలనాడు శ్రీరామచంద్రుడు జనక మహారాజు పెట్టిన పరీక్షలో శివధనస్సును అవలీలగా విరిచినాడు.శ్రీరాముడు ఆ పరీక్షలో నెగ్గాడు. సీతమ్మను వివాహం ఆడినాడు.నా ఆలోచనల్లో ఆమె నిండి ఉన్నది.ఆమె గురించిన ఆలోచనలు తనను నీడలా వెంటాడుతున్నాయి.అందాలరాశి అయిన ఆమె తనకి చెందాలని మనసులో తీరని కోరికగా ఉంది.కానీ ఆమె తనకు దక్కుతుందా? ఎవరికి దక్కుతుంది? ఎవరిదో ఈ సవాలు ? ఎవరు నెగ్గుతారు ? అనే విషయంలో నిద్ర కూడా పోవటం లేదు అని కవి గుల్జార్ వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింప జేస్తాయి.షాయరీ కవిత పాఠకులను ఏదో తెలియని లోకంలోకి విహరింప చేస్తుంది.గుల్జార్ షాయరీ కవితను చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(8).
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.మానవ జీవితంలోని సంఘర్షణలను భావస్ఫోరకంగా కవితాత్మకం చేయడంలో కవి గుల్జార్ దిట్ట అని చెప్పవచ్చు.గుల్జార్ షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే షాయరీ కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతులను సొంతం చేసుకోండి.
“ నేనెంత వెర్రి వాడినో చూడు !
“ఎక్కడైతే …. కనీసం ప్రేమ అన్న పదం కూడా
“అలవాటుగా లేదో … అలాంటి నగరంలో
“కూడా ప్రియా నీ కోసం నిరీక్షించాను !
ఒక మనిషి తన గురించి తాను చెప్పే సందర్భంలో
నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు.ఎంత అనేది పరిమాణాన్ని తెలిపే పదం.వెర్రి వాడు అంటే మానసిక అనారోగ్యం కలవాడిగా,మూర్ఖుడిగా ఉన్న వాడు.అసహజమైన వింత కోరికలు కోరడం వెర్రివాని చేష్టగా అనిపిస్తుంది.ఎక్కడ అనేది ఒక ప్రదేశాన్ని సూచించడానికి ఉపయోగించే పదం.
కనీసం ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం పొందవలసి ఉంటుంది.ప్రేమ అనేది ఉన్నతమైన ప్రేమ స్థాయిని సూచిస్తుంది.ప్రేమ అంగట్లో దొరికే వస్తువు కాదు.అది స్వతహాగా మనసులో నుండి పుట్టుకు రావాలి. ప్రేమించడానికి హృదయం ఉండాలి. ప్రేమించబడడానికి వ్యక్తిత్వం ఉండాలి.జీవితం పువ్వు లాంటిది.పువ్వులోని మకరందమే ప్రేమ. శరీరంలో చోటు చేసుకునే రసాయనిక మార్పుల ప్రభావమే ప్రేమ.ఒక వ్యక్తిని క్షణం కూడా విడిచి ఉండ లేక పోవటం ప్రేమ.ఎంత చూసినా,ఎంత మాట్లాడినా,తనివి తీరకపోవడం ప్రేమ.పదే పదే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం,గుండె వేగంతో కొట్టుకోవడం,ఇలా ఒక్కో చర్యకు ఒక్కో హార్మోన్ ప్రభావం ఉంటుంది.వ్యామోహం అంటే కామం. కామం శారీరక వాంఛలు తీర్చుకునే వరకు మాత్రమే ఉంటుంది.అమ్మాయి అందంగా ఉంటే ప్రేమించడం అన్నది ఒక రకంగా ఆకర్షణ కిందకు వస్తుంది. అనుబంధం ఉన్నప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఎక్కువ కాలం నిలుస్తుంది.ఎన్నో రకాల ప్రేమలు ప్రకృతిలో అగుపిస్తాయి.కాలానికి కరగని కొవ్వొత్తి ప్రేమ.మనసుకు నచ్చిన మధురానుభూతి ప్రేమ. ప్రేమంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం.స్త్రీ పురుషుల మధ్య ఉండే అభిమానం ప్రేమ.ప్రేమికుల మధ్య నడిచే వ్యవహారం ప్రేమ.ప్రేమ ఏదేని వస్తువు కొరకు లేదా మాట కోసం పడిగాపులుగాయడం నిరీక్షణ.ఆమె కొరకు ఆతను ఎదురు చూడటం నిరీక్షణ అని చెప్పవచ్చు.నేను ఎంత వెర్రి వాడిని చూడు అని తన గురించి తాను చెప్పుకోవడంలో ఆశ్చర్యంతో కూడిన ప్రేమ,అనురాగం అతనిలో దాగి ఉందేమో అనిపిస్తుంది.అతను తనలో తానే మధన పడడం బాధను కలిగించే విషయంగా పరిగణించాలి.అతను ఎందుకు అలా మాట్లాడ వలసి వచ్చింది? అనేది ఆలోచించాల్సిన విషయంగా తోస్తుంది.ఇందులో ఏదో మతలబు ఉంటుంది.ఏదో అతని హృదయానికి తగిలిన బాధ అయి ఉంటుంది.అందుకే అలా అతను తనకు తానే వెర్రివాడిగా చెప్పుకోవడం జరిగింది.ఎక్కడ అయితే? అని ఆ ప్రదేశం గురించి తెలుపక పోవడం,ఖాళీని పూరించక పోవడం,ఎవరికైనా సందేహాలు పొడ చూపుతాయి.ఎక్కడ? ఏ ప్రదేశం? అనేది ఉంటుంది.అది ఇక్కడ కనిపించడం లేదు.అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు అనే భావన ఎదుటి వారికి కలుగుతుంది.కనీసం ప్రేమ అనే పదం కూడా ఉచ్చరించని చోటు ఉంటుందా? ప్రేమ కోసం పరితపించని చోటు ఉంటుందా? అని సందేహాలు ముప్పిరిగొంటాయి.ఏదైనా మళ్లీ మళ్లీ చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన ప్రేమికునిలో అలవాటుగా కనబడుతుంది.అతను ప్రేమికుడిగా ఆమె గురించి మనసులో ఆవేదన చెందుతున్నాడు.అలాంటి ప్రేమ తెలియని నగరంలో కూడా ఆమె రాక కోసం, మృదువైన మాట కోసం,చల్లని పిలుపు కోసం పడిగాపులు పడ్డాడు.తాను ప్రేమించిన ఆమె కొరకు నిరీక్షించడం ఎంత బాధాకరమో,అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. ఆమె కొరకు నిరీక్షించిన తనకు అది ఒక స్వీయ శిక్షలా ఉంది.నిన్ను ప్రేమించినందుకు ప్రేమ లేని నగరంలో నీ రాక కొరకు నా సమయం వెచ్చించి వెర్రివాడిలా నిరీక్షించాను అని వ్యక్తం చేసిన కవి గుల్జార్ భావం అద్భుతంగా ఉంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకులను ఆలోచింపజేస్తుంది.షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(9)
తెలుగులోకి అను సృజన : గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవిత జీవంతో తొణికిసలాడుతుంది.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? మనసు పెట్టి షాయరీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అపారమైన అనుభూతులను ఆస్వాదించండి.
“ఈ కళ్ళున్నాయే అవి చెరువులో … కొలనులో
“కావు.కానీ నీళ్ళతో నిండిపోతాయి !
“హృదయం కూడా గాజు ముక్క కాదు
“అయినా విరిగి ముక్కలై పోతుంది
“కానీ ఈ మనిషున్నాడు చూడండి … తాను
“ఋతువు కానే కాడు
“కానీ అన్ని కాలాల్లో మారిపోతూనే ఉంటాడు !
కన్ను కాంతిని కంటి నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం.కన్ను మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం.కండ్లు మానవుని ముఖానికి రెండు వైపులా అమర్చబడి ఉంటాయి.కళ్ళు మనుషులకు కెమెరా వలె పని చేసి బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నవి ఉన్నట్టుగా మెదడుకు పంపుతాయి.కళ్ళు మనిషికి చాలా ప్రధానమైనవి.కళ్ళు లేని జీవితాన్ని ఊహించడానికి కూడా ఎవ్వరు సాహసించరు. మనిషి కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.నదుల నుండి వచ్చే వరదల ద్వారా చెరువులు నీటితో నిండుకుంటాయి. చెరువులు సాధారణంగా మంచి నీటితో కళకళలాడుతుంటాయి.చెరువులు తరచుగా మానవ నిర్మితములైనవిగా ఉంటాయి.చెరువులు అత్యంత జీవవైవిధ్యం కలిగి ఉంటాయి.చెరువులు వ్యవసాయానికి,పశువులకు మరియు మానవులకు నీరు అందించడంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి.చాలా వరకు చెరువులు వర్షం మీద ఆధారపడి ఉంటాయి.అనేక గ్రామాలలో చెరువు నీటిని త్రాగడానికి ఉపయోగిస్తారు. కొలనులు కూడా నీటికీ నిలయాలుగా ఉంటాయి. గుల్జార్ లోకంలోని మనుషుల కళ్ళ గురించి చెబుతున్నాడు.మనుషుల కళ్ళున్నాయే అవి నీటితో కళకళలాడే జలాశయాల వంటి చెరువులు, కొలనులు కావు అని చెబుతున్నాడు.కానీ మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోతాయి అని వ్యక్తం చేసినాడు.మనుషుల కళ్ళు నీళ్లతో నిండిపోవడం ఏమిటి?అని మనలో సవాలక్ష సందేహాలు పొడ చూప వచ్చు.ఏదైనా బాధ కలిగినప్పుడు మనుషుల కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతాయి అనేది ఎవ్వరు కాదనలేని వాస్తవం.గుండె లేదా హృదయం మానవ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం.హృదయంలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బతికిస్తున్నాయి.హృదయం చాతీకి ఎడమ వైపు ఉంటుంది.గాజు అనేది స్పటికాకారం కాని ఘనం. గాజు పారదర్శకంగా మరియు రసాయనికంగా జడత్వంతో ఉంటుంది.మనిషిలో నిండి ఉన్న హృదయం కూడా గాజు ముక్క కాదు.అయినా విరిగి ముక్కలు అయిపోతుంది అన్నాడు.మనిషి హృదయానికి గాయం అయ్యేంత వరకు తెలియదు. నిజంగానే మనిషి హృదయం గాజు వస్తువు కానప్పటికీ ఏదో తెలియని బాధకు గురి అయి మనసు గాజు వస్తువు వలె విరిగి ముక్కలై పోతుంది అనేది వాస్తవం.తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి ఆరు ఋతువులుగా పేర్కొన్నారు.1) వసంత ఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం.ఈ కాలంలో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి.2) గ్రీస్మ ఋతువు :జ్యేష్ఠ మాసం,ఆషాడ మాసం.ఈ కాలంలో ఎండలు మెండుగా ఉంటాయి.3) వర్ష ఋతువు : శ్రావణ మాసం,భాద్రపద మాసం.ఈ కాలంలో విరివిగా వర్షాలు కురుస్తాయి.4) శరదృతువు : ఆశ్వయుజ మాసం,కార్తీక మాసం.ఈ కాలంలో వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.5) హేమంత ఋతువు: మార్గశిర మాసం,పుష్యమాసం.ఈ కాలంలో మంచు కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.6) శిశిర ఋతువు : మాఘమాసం,ఫాల్గుణ మాసం.ఈ కాలంలో చెట్లు ఆకులు రాల్చుతాయి.భూగోళంపై నున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే మానవులు చాలా పురోగతిని సాధించారు అని చెప్పడంలో సందేహం లేదు.మానవునిలో వివేకం,ఆలోచన,భాష వంటి విషయాలు మెదడు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడినాయి.కానీ ఈ మనిషున్నాడు చూడండి… తాను ఋతువు కానే కాడు.కానీ అన్ని కాలాలలో మారిపోతూనే ఉంటాడు అని చెబుతున్నాడు.మనుషులలో పేరుకొని పోయిన విచ్చలవిడితనం,విశృంఖలత్వం,వింత ప్రవర్తనను పరిశీలించి కవి గుల్జార్ చెప్పినట్లుగా తోస్తోంది.మనిషి అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉండక మారిపోవడం ఏమిటి?అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మనుషుల ప్రవర్తన ఋతువుల కాలాలకు కూడా అందకుండా మార్పు పొందడం సహజం అనిపిస్తుంది. మనుషులకు ఏమైంది? మనుషుల్లో మానవత్వం మృగ్యం అయి పోయింది.మానవత్వం లేని స్వార్థంతో కూడిన మనుషుల ప్రవర్తనను చూసి కలిగిన ఆవేదన షాయరీ కవితగా రూపు దిద్దుకొన్నట్లుగా తోస్తోంది.మనుషులలోని విశాల భావాలు మానవతకు దోహదం చేస్తాయి.మనుషుల్లో విశాల భావాలు కొరవడడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది.గుల్జార్ మనుషుల వింత ప్రవర్తనను నిశితంగా పరిశీలించి చెప్పినట్లుగా ఉంది.మనిషి ఎందుకు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు.మనిషిలో కలిగిన మార్పుకు కారణం ఏమిటి? అనేది అంతు పట్టకుండా ఉంది.మనిషిలో కలిగిన వినూతన మార్పు ఋతువులకు కూడా అందకుండా ఉంది అని వ్యక్తం చేసిన భావం పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవితను తెలుగులోకి చక్కగా అను సృజన చేసిన కవయిత్రి గీతాంజలిని (డాక్టర్ భారతిని) అభినందిస్తున్నాను.
గుండు రమణయ్య హృదయ రోదన కవిత. హృదయం పై కవిత్వం ఓ విశ్లేషణ.
కవి,చిత్ర కళా ఉపాధ్యాయుడు.వాణీ నికేతన్ బాల విహార్ పాఠశాల,తెలుగు మీడియం,కరీంనగర్, గుండు రమణయ్య కలం నుండి జాలువారిన తొలి మెట్టు కవితా సంపుటిలోని హృదయ రోదన కవిత పై విశ్లేషణా వ్యాసం.హృదయ రోదన కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావాలు నాకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసింది.రమణయ్య తాను రాసిన కవితలకు తానే చిత్రం గీసినాడు. డాక్టర్ కాలువ మల్లయ్య ముందు మాటలో ముందొచ్చే కవితా సంపుటుల్లో రచనల్లో కవిత్వం పాలు మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను అని అన్నాడు.కవిత శీర్షిక హృదయ రోదన ఏమిటి?హృదయం రోదిస్తుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.హృదయము లేదా గుండె మన శరీరానికి రక్తాన్ని పంపిణి చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బ్రతికిస్తున్నాయి.గుండె ఛాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.రక్తాన్ని సరఫరా చేసేది గుండె.ప్రాణులకు ముఖ్యమైన భాగం గుండె. గుండెకు మనసు,ప్రేమ,జాలి,ఆత్మసారం,రహస్యం అని అర్థాలు.రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు.మనసునకు బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది.మన శరీరంలో హృదయం సున్నితమైనది. ఎట్టి పరిస్థితిలోను హృదయానికి బాధ కలిగించకూడదు.హృదయానికి బాధ కలిగితే వచ్చేది రోదన.హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం,ఆవశ్యకత ఎంతైనా ఉంది.హృదయ రోదన కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవి రమణయ్య హృదయ రోదన కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నా పవిత్ర దేశపు గడ్డ పై
“సమస్యల కాన్వాసు పై
“పదిలంగా చిత్రించిన రూపం !
నా స్వచ్ఛమైన దేశం గడ్డ పై సమస్యల చిక్కు ముళ్ళు చుట్టు ముట్టి కలవరం కలిగిస్తున్నాయి. హృదయాన్ని ఆవరించిన సమస్యలు మబ్బుల వలె ఆకాశంలోని దూదిపింజలా తేలిపోవడం లేదు. సమస్యలు ఒక్కొక్కటిగా సుందరమైన కాన్వాసు మీద చిత్రించినట్లు హృదయం కళ్ళకు స్పష్టంగా ఆగుపిస్తున్నాయి.పవిత్రమైన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు జటిలమై హృదయంలో కదలాడుతున్నాయి.గుండెలో చెలరేగుతున్న సమస్యలు అన్నింటిని కాన్వాస్ పై స్థిరంగా గీయగానే అద్భుతమైన చిత్రం రూపు దాల్చింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆనంద రోదనలో
“ఆవేదనా కోలాహలం
“తరచి చూస్తే తెలుస్తుంది
“నిలిచి చూస్తే కనిపిస్తుంది !
ఒకరి సంతోషం గురించి ఆలోచించడం ఆనందం.ఆలోచించడం లేదా తెలుసుకోవడం ఆనందం.మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళ నుండి బాష్పాలు రావడం సహజం.ఆనందం అనే పదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు.ప్రజలకు ఆనందం అనుభవించాలనే ప్రాథమిక భావన హృదయంలో కలుగుతుంది.సంతోషకరమైన సంతృప్తి,ఆనందానికి మూలం.ఒక కల్పిత ప్రదేశం ఆనందం.అద్భుత లోకంలో వింతలు జరగడం ఆనందం.మనుషుల జీవితంలో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం.మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన ఆనందం.ఎటు వంటి బాధలు లేకుండా హాయిగా ఉండటం ఆనందం. రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు. మనసులోని బాధ వల్ల కళ్ల వెంట ధారగా వచ్చేది రోదన.ఆవేదన అనగా తీవ్రమైన బాధ, తెలియచేయుట అని అర్థాలు.ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు గంతులు వేయడం కోలాహలంను సూచిస్తుంది.ఎక్కువ శబ్దం లేదా గట్టిగా అరవడం కోలాహలం.ఉత్సవాలలో శుభకార్యాలలో ఉండే జన సమూహం చేసే సందడి కోలాహలం.వీధిలో జరుగుతున్న కోలాహలంను చూసి ఏదో పండుగలా అనిపించింది.ఆనంద రోదనలు,ఆవేదన కోలాహలం సంగతుల గురించి ఒక్కసారి మనస్సు పెట్టి హృదయపు లోతులను తరచి చూస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. హృదయానికి ఏం జరిగింది? ఒక్కసారి హృదయం పట్ల దృష్టి సారించి చూస్తే కళ్ళకు కట్టినట్లుగా రోదన కనిపిస్తుంది అనే భావం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“కళాకారుల మెదడుల్లో
“కదులుతున్న నిజాన్ని చూడు
“మేధావులు దూషణల్లో
“నలుగుతున్న న్యాయాన్ని చూడు !
ఒక కళను సృష్టించేది కళాకారుడు.కళలను అభ్యసించినది కళాకారుడు.కళాకారుడు కళను సాధన ద్వారా సృష్టించగలడు మరియు ప్రదర్శించ గలడు.కళాకారునికి కళ పట్ల నేర్పు మరియు కళా నైపుణ్యం ఉంటుంది.లలిత కళలు,డ్రాయింగ్, పెయింటింగ్,శిల్పం,నటన,నృత్యం,రచన,చిత్ర నిర్మాణం,కొత్త మీడియా,ఫొటోగ్రఫీ,సంగీతం వంటి కార్యకలాపాలను ఉపయోగిస్తు కళాకారుడు కళను నిర్వహిస్తాడు.కళాకారుడు చురుకుగా తన నైపుణ్యాన్ని సాధిస్తాడు.మెదడు మానవుని తల భాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు అన్నింటికీ మెదడు ఒక ముఖ్యమైన కేంద్రం.మెదడు తనకు తానే మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది.మెదడుకి ఏం చెయ్యాలో ఆలోచించడం,నిర్ణయాలు తీసుకోవడం,గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి గుణం ఉంటుంది.మెదడు మానవ నాడీ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం.వెన్నుపాముతో కేంద్ర నాడి వ్యవస్థ ఏర్పడుతుంది.మెదడులో సెరెబ్రమ్,బ్రెయిన్ స్టెమ్ మరియు సెరిబెల్లమ్ ఉంటాయి.మెదడు శరీరం యొక్క చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది.నిజం లేదా సత్యం ఆంగ్లంలో Truth అని అర్థం.నిజం అనగా సత్యమైన,పరమ ప్రమాణం,నిజమని తెలియ జేయుట.నిజం అంటే నిజాయితీ,త్యాగం మనం పాటించవలసిన విధిగా చెప్పవచ్చు.సత్యం వద అంటే సత్యమును చెప్పుము.నిజం మాట్లాడటానికి మించిన దైవత్వం లేదు.నిజం పలకడానికి ధైర్యం కావాలి.ఏదైనా నిజం అయితే అది కనిపెట్టబడడం లేదా ఊహించిన విషయం కాకుండా వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది.నిజం ఖచ్చితమైనది మరియు నమ్మ దగినది.మేధావులు అంటే సమాజం యొక్క వాస్తవికత గురించి విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన,సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తులు.సంస్కృతి ప్రపంచం నుండి వచ్చిన సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా మేధావి రాజకీయాల్లో పాల్గొంటారు.ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనను సమర్పించడం లేదా అన్యాయాన్ని ఖండించడం,సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం,విలువల వ్యవస్థను ఖండించడం ద్వారా మేధావులు సమాజంలో ముందు ఉంటారు. తప్పు ఒప్పులలోని నిజాలను నిర్ధారించేది న్యాయం.న్యాయం జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు.న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది.నీతి,సత్యం,హేతువులు,చట్టం,ప్రకృతి నియమాలు,సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడినది.వ్యక్తులు సమానమైన న్యాయ పద్ధతిలో వ్యవహరించాలి.న్యాయం అనేది నైతిక మరియు చట్టపరమైనది.న్యాయం సమానంగా మరియు సమతుల్యంగా వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.సమాజం యొక్క అత్యంత ముఖ్యమైనది,చర్చించబడేది న్యాయం.న్యాయం మానవ జీవనానికి పునాది.ప్రజలు అందరికీ న్యాయమైన పంపిణి మరియు సమానత్వం న్యాయమైన ప్రయోజనాలను అందించాలి.ప్రజలు చేస్తున్న స్వార్థపూరిత కార్యకలాపాలను నియంత్రించడానికి న్యాయం అవసరం ఉంటుంది. కులం,మతం,రంగు,ధనిక,పేద అని ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని వ్యక్తులందరికీ సామాజిక న్యాయం అందించాలి.దూషణలు అనగా అపవిత్రమైన మాటలు,అసందర్భమైన ప్రేలాపనలు, అశ్లీల మాటలు వల్ల మనిషికి శారీరక గాయాల కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి.దేశంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు పేద,ధనిక తేడాలు, కులం,మతం పేరిట మారణ హోమం జరుగుతున్నది.పసి పిల్లల నుండి పండు ముదుసలి వరకు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న దారుణ ఆకృత్యాలు చూసి కళాకారుల హృదయం కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతున్నవి.ఇలాంటి దారుణ దృశ్యాలు చూసిన తర్వాత కళాకారులు చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా గజ్జె కట్టి పాటను ఆయుధంగా చేసుకుని పాడుతూ వీధుల్లో బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లి నిరసనలు, ప్రదర్శనలు చేస్తూ పోరుబాటలో ముందుకు సాగుతున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘోరాలను చూసి మేధావులు స్పందనతో గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్నారు.మేధావులు అన్యాయాలు, అక్రమాలను ఖండిస్తూ దూషణలు చేస్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడం కలవరపెడుతున్నది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“బడా రాజుల సంపాదనలో
“ధర్మం దాచుకుంటున్నదెంత ?
“నిరుపేదల గుండెల్లో
“దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత?
ధర్మం అనగా చేయవలసిన పని ఆంగ్లంలో Duty అని అర్థం.మనకు కేటాయించిన పనిని చేయడాన్ని ధర్మం అంటారు.మనిషి ప్రతి రోజు చేయ వలసిన విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి.ధర్మం అంటే మానవత్వాన్ని రక్షించే గుణం.సకల ప్రాణి కోటిలో మానవ జన్మ ఉత్తమమైనది.మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో సాటి మానవుల పట్ల ప్రేమ, ధర్మంతో మెలిగితే సాధ్యమవుతుంది.ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషంగా మానవులకు ఉంది. మానవులకు యుక్తాయుక్త విచక్షణా శక్తితో పాటు జ్ఞానం ఉంది.ఆలోచనకు రూపం ఇవ్వగల తెలివితేటలు ఉన్నాయి.మానవులు బుద్ధి ద్వారా ఉత్తమ గుణం అయిన ధర్మాన్ని సాధించవచ్చు.ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది.కవి బడా రాజుల సంపాదనలో ధర్మం దాచుకుంటున్నదెంత అని ప్రశ్నించారు.బడా రాజులు అంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు.బడా రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉంది.బడా రాజులు కాల గర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కొత్తగా నయా బడా బాబులు పుట్టుకు వచ్చారు.బడా బాబులు ప్రజాస్వామ్య దేశంలో పాలనాధికారం చేపట్టి రాజ్యాన్ని ఏలుతున్నారు. బడా బాబులు అంటే ఈనాటి రాజకీయ నాయకులు అనే విషయం అందరికీ తెలుసు.రాజకీయ నాయకులు పారదర్శకంగా పరిపాలిస్తున్నాం అని చెబుతు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు ఏది చెబితే అది ధర్మంగా కొనసాగుతుంది.బడా బాబులు అధికారం చేపట్టినారు మరియు రాజకీయంగా ఎదిగినారు.బడా బాబుల పాలనలో వంచనతో అధర్మం రాజ్యమేలుతుంది.బడాబాబులు ధర్మం సంగతి ఏనాడో మర్చిపోయారు.ధర్మం అంటే ఏమిటి?అని ముందు ముందు అడిగే రోజులు రానున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు విదేశీ బ్యాంకుల్లో అవినీతి సొమ్ములు దాచుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలచే పరిపాలింపబడిన పాలన అని మనకు తెలుసు. ప్రజాస్వామ్యం ఇప్పుడు అపహాస్యం పాలైంది. ప్రజాస్వామ్యాన్ని ఈనాటి నాయకులు,అధికారులు భ్రష్టు పట్టించారు.ఆనాటి నేతలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు అని కాంక్షించారు.ప్రజలందరు సౌఖ్యంతో జీవనం సాగిస్తారు అని ఆశించారు.ఆనాటి నేతలు ప్రజల సంక్షేమం కొరకు పోరాటం సాగించారు.పరాయి దేశపు పాలన నుండి దేశానికి విముక్తి కలిగించారు. ఆనాటి నేతలు ఇప్పుడు పర లోక గతులు అయ్యారు.ప్రజలకు చేరాల్సిన అభివృద్ధి ఫలాలు పరిపాలకులైన రాజకీయ నాయకులు,అధికారులు కాజేసి దండుకుంటున్నారు.బడా బాబులకు ఇహలోక చింతన పట్ల వ్యామోహం పెరిగింది. ఇప్పుడు సంపాదించినదే డబ్బు అని సంపన్నులు అక్రమార్జనతో ప్రజలను దోచుకుంటున్నారు. సంపన్నులు సక్రమంగా సంపాదించుకుంటున్నారా? అంటే? లేదు అని సమాధానం వస్తుంది.ఇప్పుడు ఎటు చూసినా అధర్మం రాజ్యమేలుతుంది. అన్యాయాలు,అక్రమాలు మితిమీరి పోయినాయి.రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించే వారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.రాజకీయ నాయకుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.ప్రజలకు అది చేస్తాం,ఇది చేస్తాం అని శుష్క వాగ్దానాలు గుప్పిస్తున్నారు.ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజకీయ నాయకులు సంపన్నులకు దోచిపెడుతున్నారు.రాజకీయ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కొరవడింది.రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం కొరకు ఏమీ చేయరు? అని ప్రజలకు తెలిసిపోయింది.ఇవ్వాళ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.ఇందు గల డందు లేడంటూ అవినీతి సర్వత్రా రాజ్యమేలుతుంది.నిరుపేదలు చాలా సాధారణ వ్యక్తులు.నిరుపేదలు డబ్బు లేని వారు. నిరుపేదలు ఎప్పుడు సమస్యలతో ఎందుకు బాధపడతారు. నిరుపేదలు ఎల్లప్పుడు బాధలలో ఎందుకు ఉంటారు.నిరుపేదలు ఎందుకు అశాంతితో జీవితాన్ని గడుపుతున్నారు. కవి నిరుపేదల గుండెల్లో దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత అని ప్రశ్నించాడు.నిరుపేదల శ్రమను దోచుకుంటున్నది దరిద్ర దేవత కాదు.నిరుపేదల శ్రమను సంపన్నులు దోచుకుంటున్నారు. నిరుపేదలు పేదరికంలో మగ్గుతున్నారు.నిరుపేదల గుండెల్లో పేదరికం వల్ల బతుకు పట్ల ఆందోళన ఉంటుంది.నిరుపేదలు రేపటి రోజున బతుకును ఎలా గడపాలి? అనే ఆందోళన ఉంటుంది. నిరుపేదలు ఆకాశం పందిరి కింద చెట్ల నీడన నివసిస్తున్నారు.నిరుపేదలు తినడానికి తిండి లేదు.నిరుపేదలు కట్టుకోవడానికి బట్టలు లేవు. నిరుపేదలు నివసించడానికి ఇల్లు లేదు.సంపన్నుల దేవత అని నిరుపేదల దేవత అని ఎక్కడ రాసి లేదు.మనం కల్పించుకున్నవే దేవతా రూపాలు.మన హృదయంలోనే నిండి నిబిడీకృతమై దేవుడు ఉన్నాడు.మన హృదయంలోని దేవుడిని మర్చిపోయినాము.మనం ఆ దేవత,ఈ దేవత అంటూ గుడుల వెంట పరుగులు తీస్తున్నాము.మన హృదయంలోనే దేవుడు కొలువై ఉన్నాడు.ఏ దేవత అయినా సమస్త మానవాళి సుఖ సంతోషాలను, సౌఖ్యాన్ని కోరుకుంటుంది.ఆ విషయం మర్చిపోయి నిరుపేదల ఇంట దరిద్ర దేవత దోచుకుంటున్నది ఎంత అని తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనాలను తప్పుడు మార్గంలో పయనింప జేస్తున్నారు.జనాలు అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ దోపిడీ విధానం కొనసాగుతుంది.
“ఐనా – నా భారతం కన్నులకింపైన “చిత్రం’
“ఎందుకనగా నాది ‘హిమముల నేత్రం’
“అదొక ‘రసార్డ్ర సాగర గాత్రం’.
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు,దక్షిణాన హిందూ మహా సముద్రం,పశ్చిమాన అరేబియా సముద్రం,తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.భారతదేశం సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు.హిందూ,బౌద్ధ,జైన,సిక్కు మతములకు జన్మనిచ్చింది.బహు భాషలు మాట్లాడే జనం ఉన్నారు.బహుళ జాతుల సంఘం ఉంది.వివిధ వన్య ప్రాణులకు నిలయమైన దేశం.భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఇరవై తొమ్మిది రాష్ట్రాలు,ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉంది.అతి పెద్ద పార్లమెంట్ వ్యవస్థ ఉన్న ఒక సమైక్య దేశం. చిత్రం అనేది చదునైన ఉపరితలంపై రంగుల బిందువుల సమూహం.అది వేరొక దాని వలె కనిపిస్తుంది.చిత్రాలు, డ్రాయింగులు,పెయింటింగ్ లు లేదా ఛాయాచిత్రాలు కూడా కావచ్చు.అలాంటి చిత్రాలను రూపొందించే వ్యక్తులను కళాకారులు, చిత్రకారులు అంటారు.విశాల భారతదేశం మనది. హిమాలయాలకు నిలయం ఇది అని చిన్నప్పుడు పాఠశాలలో చదివి ఉన్నాం.అయినప్పటికీ నేను నివసించే భారతదేశం కన్నులకు కట్టినట్లు చిత్రం వలె కనిపిస్తుంది.చిత్రం గురించి చెబుతూ రసములతో తడిసిన సముద్ర రూపాన్ని దాల్చిన శరీరం వలె కనిపిస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకే
“నా ‘సహనం’ ‘సద్యోఘృతం’
“నా విశ్వాసం’ ‘విద్యుద్ఘాతం’
“నా ‘నిర్ణయం’ ‘నిశ్చల దృఢం’.
సహనం క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.మనకు అగౌరవం కలిగినప్పుడు కోపంతో ప్రతి స్పందించకుండా రెచ్చగొట్టడాన్ని సహించగల ఓర్పు ఉండాలి.ఒత్తిడికి గురైనప్పుడు సహనంతో వ్యవహరించాలి.ఇబ్బందులు ఎదురైనప్పుడు సహనంతో ఉండాలి.చిరాకు కలిగినప్పుడు విసుగు చెందకుండా సహనంతో వేచి ఉండాలి.క్షీరసాగర మధనంలో దేవతలను రక్షించుటకు గరళం మింగిన పరమ శివుని వలె సహనంతో మెలగాలి.విశ్వాసం అనగా వ్యక్తి వస్తువు లేదా భావనపై విశ్వాసము లేదా నమ్మకం కలిగి ఉండాలి.విశ్వాసం మనకు నమ్మకం మరియు నిశ్చయత యొక్క భావాన్ని ఇస్తుంది.విద్యుత్తు ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతం అంటారు.కరెంట్ షాక్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ షాక్ ను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది.మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు.విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల పాలవుతాడు.నా విశ్వాసం విద్యుద్ఘాతం అని హృదయం బాధకు లోనైంది అని తెలియజేయడం చక్కగా ఉంది.మనిషి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మనిషి అనేక అవకాశాలు మరియు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి.నిర్ణయం నిశ్చలమైనది మరియు దృఢమైనది అయి ఉండాలి.ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీలు కాదు. నా నిర్ణయం నిశ్చలమైనది దృఢమైనది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవి రమణయ్య చిత్రకారుడు మరియు తాను రాసే కవిత్వం పట్ల శ్రద్ధ చూపాలి.ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు రాసిన కవిత్వంను అధ్యయనం చేయాలి.గట్టి కృషి చేస్తే గొప్ప కవిగా రమణయ్య రాణించే అవకాశం ఉంది.కవి రమణయ్య మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) *ఊహా సుందరి కవిత..
*ఏకతకు పరిష్కారం కవిత.
*ఏదీ కొత్తదనం కవిత.
కవిత్వం ఓ విశ్లేషణ. . ప్రముఖ కవి,ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల సేకరణ కర్త,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఊహా సుందరి కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊహా సుందరి కవితను ఆసక్తితో చదివాను.చదవగానే కవితలోని భావం నన్ను కదిలించింది.నాలో ఆలోచనలను రేకెత్తించింది.వ్యక్తి మనసుకి గోచరించే దృశ్యాలు ఊహలు.వ్యక్తి కల్పనలు చేయడం,చూడని వాటిని చూచినట్టు వినని మాటలను వినినట్టు మనసులో అనుకోవడం,భావించడం ఊహ. వాస్తవమైనదిగా గుర్తింపబడని,ఇంద్రియాలకు గోచరించని దాని యొక్క చిత్రం మనసులో ఏర్పడటం ఊహ లేక కల్పనగా చెప్పవచ్చు.ఊహా సుందరి ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు.నిద్రలో మనం కలలు కంటాం.కలలో కనిపించిన అతిలోక సుందరినే పెళ్లి చేసుకుంటాను అని ఎవరైనా చెబితే అది సాధ్యమయ్యే పనేనా?అనిపిస్తుంది.కవి నారాయణ రెడ్డి (మానారె) 1968 సంవత్సరంలో రాసిన కవిత ఇది.అట్టి ఊహా సుందరి కవిత గురించిన కథా కమామీషు ఏమిటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే ఊహా సుందరి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“విరిగిన హృదయం చెదిరిన మనస్సు
“కదిలే కుంచె చిత్రిస్తున్నా
“వర్ణాలను మేళవించి సోయగాల నెన్నో నించి
“రేఖామయ సౌందర్యం రేకులు విచ్చిన చందం
“రాసేస్తున్నా !
మనిషి హృదయం లోతులో ఏం జరిగింది? అనేది ఎవ్వరికీ కాన రాదు.అసలు ఎవరికి తెలియదు. అతనేంటి అలా దిగులుగా ఉన్నాడు అనుకుంటారే కాని అతని గురించి అంతగా ఎవరు పట్టించుకోరు. అసలు విషయం ఏమిటి? అని అతనిని అడిగే ప్రయత్నం ఎవ్వరు చేయరు.అతని గురించి సంగతి ఏమిటో అతను చెబితేనే తెలుస్తుంది.కాని అతడు ఎందుకో నోరు విప్పడు,చెప్పడు.అతని హృదయం ఎందుకు విరిగింది? హృదయం విరగడం ఏమిటి? అని మనలో సందేహాలు పొడ చూప వచ్చు.విరిగిన హృదయం అనగా అస్తవ్యస్తమైన హృదయం అని చెప్పవచ్చు.హృదయం బాధకు గురి అయినట్లుగా తోస్తుంది.అతని మనస్సు ఎందుకు చెదిరింది? ఏదో చిత్రం అతని కళ్ళకు గోచరమైనట్టుగా తోస్తుంది. ఏదేని ప్రాణి,జీవి యొక్క మనసు కింపైన సౌందర్యాన్ని అందం అంటారు.శరీర అవయవ సౌందర్యాన్ని మనసుతో చూస్తాము.కావున ఒక మనిషి యొక్క అందం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ విశ్వంలో ఎన్నెన్నో జీవులు ఎన్నో వస్తువులు ఉన్నాయి.దేని అందం దానికే ప్రత్యేకం.పువ్వుల అందం అందరిని ఆనందపరుస్తుంది.చిత్రకారుడు తన కుంచెతో రేఖామయ సౌందర్యం గీస్తాడు.రేఖా చిత్రం వివిధ రకాల చిత్ర కళకి సంబంధించిన పరికరాలను ఉపయోగించి చిత్రించే ఒక దృశ్య కళ.కాన్వాసు పై చిత్రాలను గీయడం,ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులను అద్దడమే చిత్రలేఖనం.దృశ్యపరమైన కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను,ఆలోచనలను చిత్రము ద్వారా వ్యక్తపరచడమే చిత్రలేఖనం.కాన్వాస్ పై సాధారణంగా కుంచెలను ఉపయోగించి చిత్రలేఖనం చేస్తారు.చిత్రాలను గీసే వారిని చిత్రకారులు అంటారు.చిత్రకారుని చేతిలో కుంచె కదులుతుంది. మనసులో ఏదో తెలియని అలజడి చెలరేగింది. మనసు ఎందుకో స్పష్టత లేకుండా అస్పష్టత కొనసాగుతుంది.అటు ఇటు చంచల స్వభావంతో తిరుగుతున్న మనసును ఒక్కసారిగా అదుపులోకి తెచ్చుకొన్నాడు.కదులుతున్న కుంచెతో ఒకానొక ఊహా చిత్రాన్ని చిత్రిస్తున్నాను అని కవి అంటున్నాడు.రంగులను కలిపి సోయగాలను,సరి కొత్త అందచందాలను ఎన్నింటినో ఆ రంగులతో నింపి రేఖలతో రూపుదిద్దుకున్న అపూర్వమైన సుందర రూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు.మొగ్గలుగా ఉన్న సుమాలు క్రమక్రమంగా విచ్చుకొని సౌరభాలను వెదజల్లినట్లుగా కుంచెతో నగిషిలు చెక్కినట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నానని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఎర్ర రంగు తన రాగాన్ని చిత్రానికి అందిస్తున్నది
“అనురాగము క్షాళితమై ఆ కాలిమ నంటిస్తున్నది
“అధరాలు నఖాంకురాలు ఆ రాగమునే పొందెను
“చెక్కిలిపై ఆరాగమె అనురాగము పొంగించెను.
రక్తం ఎరుపుగా ఉంటుంది.ఎరుపు రంగు చారిత్రాత్మకంగా త్యాగం,ప్రమాదం,ధైర్యంతో ముడిపడి ఉంటుంది.ఎరుపు రంగు సాధారణంగా వేడి,కార్యాచరణ,అభిరుచి,లైంగికత,కోపం,ప్రేమ, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.భారత దేశంలో ఎరుపు రంగును ఆనందాన్ని,అదృష్టాన్ని సూచించే రంగుగా చెబుతారు.ఎరుపు విప్లవపు రంగుగా మారింది. ఎరుపు రంగు ఉత్తేజాన్నిస్తుంది.ఎరుపు రంగు ఉత్సాహభరితమైనది.ఎరుపు రంగు ప్రేమ యొక్క రంగుగా పరిగణించబడుతుంది.సంధ్యా సమయం ఎరుపు రంగును తెలుపుతుంది.రోడ్డుపై సిగ్నల్ పడగానే ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు. ఎరుపు రంగు ధైర్యాన్ని ఇస్తుంది.ఎరుపు రంగు బలాన్ని శక్తిని సమకూరుస్తుంది.ఎరుపు రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది.ఎరుపు రంగు నిశ్చింతగా నిబ్బరంగా ఉండేలా చేస్తుంది.ఎరుపు రంగు తేజస్సుకు ప్రతీక.ఎరుపు రంగు ప్రేమకు,దయకు సంకేతం.ఈ ప్రపంచమంతా అనేకమైన రంగులతో కూడి ఉంటుంది.రంగులు లేని లోకం మన ఊహలకు అందదు.మనిషి దేన్ని తలుచుకున్నా ఏదో ఒక రంగు కళ్ళ ముందు నిలుస్తుంది.కుంచె ఎరుపు రంగును తీసుకుని ఆ ఎర్ర దనాన్ని చిత్రానికి అందిస్తున్నది.కుంచెకు గల ఎర్ర రంగు కడిగి వేయబడి నల్ల రంగును చేర్చుకొని చిత్రాన్ని సరి కొత్తగా రంగులతో అద్దుతున్నది.కుంచెకు గల ఎరుపు రంగుతో పెదవులు,గోళ్లు ఎర్రగా మెరుస్తూ సహజత్వాన్ని పొందినాయి.చెంపలపైని ఎర్రని నిగారింపు తనలోని ప్రేమను పొంగింపజేసింది. ఎరుపు రంగు బుగ్గలకు నిండుదనాన్ని చేకూర్చినట్లు తోస్తోంది.
“జడ లోపల కనుపాపల లోతులలో పాతుకొనియె
“కారు నలుపు కాగిన కాలపు క్రీడలు
“కుంచె మీద క్షణికములవి చంచలాక్షి కవె నిత్యము.
వాలు జడ లోపల గడచిన కాలపు విలాసవంతమైన నలుపు రంగు శోభిస్తున్నది.కనుపాపల లోలోపల పూర్తిగా నిండిన నలుపు రంగు కాంతులు కనిపిస్తున్నాయి.జడ,కనుపాపలు నల్ల రంగుతో తీర్చబడి ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నాయి.
గడిచిన కాలపు విలాసాలైన మిక్కిలి నల్లని ఛాయలు శోభతో మెరుస్తూ వైభవాన్ని చాటుతున్నాయి.ఎరుపు రంగు గాని,నలుపు రంగు గాని ఎందుకో ఏమిటో కుంచె మీద నిలవడం లేదు. ఆ రంగులు కుంచె మీద తాత్కాలికంగా ఉంటున్నాయి.కుంచె మీద నిలవని రంగులు క్షణికములవుతున్నాయి.చంచలాక్షి చిత్రానికి అవి చెదరకుండా శాశ్వతములై ఉన్నట్లు శోభిస్తున్నాయి.
“సుఖ దుఃఖాల ప్రతీకలు సుందరతరమీ రేఖలు.
జీవితంలోని ఈ రంగుల వెలుగులు సుఖదుఃఖాలతో కూడినవి.సుఖాలకు దుఃఖాలకు ఈ రేఖల గుర్తులు చెరిగిపోనివిగా కనిపిస్తున్నాయి.ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు ఎరుపు రంగులను పోలి సుఖాలకు గుర్తులుగా ఉన్నాయి.నలుపు రంగు జీవన గమ్యంలో ఎదురైన కష్టాలను,దుఃఖాలను తలపింపజేస్తున్నది.చిత్రకారుడు గీసిన రేఖలు ఎంతో సుందరతరంగా ఉన్నాయి.చిత్ర సౌందర్యపు రేఖలు మరీ మరీ చూడాలనేంత తహతహను కోరికను కలిగించేవిగా ఉన్నాయి.
“పసిపాపను చూచు తల్లి పరవశత్వమే యబ్బెను
“నా సృష్టి యలౌకికమై నా కన్నుల ముందు నిల్చె.
కాన్వాసు పై గీచిన సుందర చిత్రాన్ని చూడగానే పసిపాపను గారాబంగా అపురూపంగా చూసుకునే తల్లి పొందే పారవశ్యం,తెలియని మైమరుపు కలిగింది.సృష్టి కర్త వలె కలలో తాను గీసిన వర్ణ చిత్రం.స్వప్నంలో చిత్రించిన ఆ చిత్రం లోకంలో గాలించి వెతికినా కనిపించదు.చిత్రకారుడు గీసిన చిత్రం అలౌకికం,అపురూప కళాఖండంగా ఒక్కసారిగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
“అదిగదుగో ! ఆ సుందరి కదలినట్లు,పెదవి విప్పి
“పదములనే పాడినట్లు భ్రమ చెందితి.
అదిగో కళ్ళు బాగా తెరిచి చూడు.ఆ సుందరి చైతన్యంతో కదలాడినట్లు పెదవి విప్పి మధురమైన పాటలను పాడినట్లుగా ఒక రకమైన తీయని అనుభూతి కలిగింది.
“ఎవడా పోకిరి ? ఓహో ! నాగరికత నడుమంత్రపు
“ముద్దుబిడ్డ ; గడుసరియై భారతీయ భావనకే
“గోరి” కట్టు గొప్పవాడు పర సంస్కృతి తొత్తువాడు.
ఎవడా పోకిరి ?ఎవడా దుష్టుడు ?ఓహో ! అతడా! విశృంఖలంగా వెఱ్ఱి తలలు వేసిన నేటి నడు మంత్రపు నాగరికత యొక్క ముద్దు బిడ్డ.అనాదిగా మన దేశస్తులు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు,సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన అవసరము,ఆవశ్యకత ఎంతైనా ఉంది.సమాజంలో నాగరికత పేరున వెర్రి తలలు వేస్తున్న దుష్ట సంస్కృతిని అనుసరిస్తున్న ప్రియాతి ప్రియమైన పుత్రుడు వీడు.గడుసరిగా పెడసరిగా మారి బండ బారిన మనసుతో మొండితనంతో భారతీయ సంస్కృతికి ముగింపు పలికే వాడు.గొప్పదైన భారతీయ ధర్మానికి సమాధి కట్టే గొప్ప వాడు.పాశ్చాత్య సంస్కృతికి బానిసగా మారినాడు.తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని మర్చిపోయినాడు.పరాయి దేశస్తుల విష సంస్కృతి వ్యామోహానికి లోను అయినాడు. పరాయి దేశస్తుల కట్టు,బొట్టు,ఆలోచనా సరళి,మాట తీరు,సంస్కృతి,ఆహార్యాలను అనుసరించి విలువలు లేని జీవన విధానాన్ని అనుసరిస్తున్న వాడు ఈ పోకిరి.
“చిత్రమునే చూచె వాడు,చిత్రముగా చూచినాడు
“సకిలించెను,ఇకిలించెను వెకిలి చూపు మకిలి చూపు
“చూపుల తూపులు రువ్వెను లేని మీసములు దువ్వెను
“ప్రేయసియని పిల్చినాడు సభ్యతనే కాల్చినాడు
“కనుల మేఘములు చేరెను అశ్రుధారలై జారెను
“సుందరి వదనాంబుజమున శోకార్తియై “స్ఫురియించెను. చిత్రించిన ఆ చిత్రాన్ని చూచి అట్టి సంస్కారహీనుడు పర స్త్రీలను తల్లుల వలె చూడక అశ్లీల భావనతో చూసే ఒక నీచుడు.ఆ మాతృత్వం ఉట్టిపడే చిత్రాన్ని చూసిన తర్వాత అతని చూపులు చిత్రాతి చిత్రములుగా కనిపిస్తున్నాయి.చిత్రం చూసిన తర్వాత అతడు గుర్రంలాగా సకిలించినాడు.నోరు తెరచి పండ్లు కనిపించే విధంగా ఇకిలించినాడు. వెకిలి చూపులతో అపవిత్రమైన చూపులతో చూపులనే బాణములను రువ్వినాడు.అతను మీసాలు లేనప్పటికీ మీసాలు ఉన్నట్లుగా లేని మీసాలు దువ్వినాడు.మీసాలు మనిషి ప్రతాపానికి పరాక్రమానికి గుర్తులు.బలహీనుడు అయిన ఆ వ్యక్తి మీసాల పై చేయి వేసి దువ్వినాడు మరియు లేని వీరత్వాన్ని చూపడానికి ప్రయత్నించాడు.ఆ చిత్రంలోని స్త్రీ మూర్తిని ప్రేయసీ అని పిలిచి మన జాతి సంస్కారానికి కళంకం తెచ్చాడు.ప్రేయసీ అనే పిలుపుతో ఆమె నయనాల్లో మేఘం వర్షించింది.ఆ స్త్రీ మూర్తి కళ్ళల్లో వేదనాభరితమైన కన్నీళ్లు కాలువలై పారినాయి.చిత్రములోని ఆ సుందరి ముఖ కమలంలో దుఃఖభరితమైన ఆవేదన కొట్టవచ్చినట్లు కనిపించింది.
“భరత భూమి పతనానికి పరులెత్తు పతాకవీడు
“కామముతో కనుగానని నేటి యువత రూపు వీడు
“భరతమాత భవితవ్యం దుష్టాన్వయమయ కావ్యం
“త్రుళ్ళిపడితి ఏదీ సుందరి?పోకిరి యువకుండెక్కడ? భ్రమయేనా ? “మనసులోని రేఖా మాత్రపు చిత్రమో !
“చిత్రమైన చాంచల్యమో ! ఏమో మరి !
భారతదేశం సరిహద్దు ఆక్రమణ కొరకు తచ్చాడుతు పొరుగు దేశపు విరోధులు ఎగరేసిన జెండా వీడు. భారతదేశం ధార్మికతకు కరుణ,దయ,జాలి,ప్రేమ, సహకారము,సోదర భావన మొదలగునవి భగ్నం చేయడానికి శత్రు దేశస్థులు మన దేశానికి పంపిన ఆటంకవాది.భారతదేశంలోని శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నీచుడు వీడు.కామంతో కళ్ళు మూసుకుని పోయి వావి వరసలు మరిచిన మానవ మృగం వీడు.దయా దాక్షిణ్యం లేని నరరూప రాక్షసుడు.నేటి దుర్మార్గులైన యువత మొండి స్వరూపం వీడు.భరతమాత భవితవ్యం గురించి ఆలోచన చేయగా భారత మాత భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నది.దుష్ట వంశ చరిత్ర గల మహాకావ్యంగా గోచరిస్తున్నది.ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి అకస్మాత్తుగా తుళ్ళిపడ్డాను.ఊహా లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చాను.ఆ పూర్ణిమ నాటి చంద్రుని వలె శోభించిన ఆ సుందరి ఏది ?ఆ ఊహా సుందరి ఎక్కడుంది ? ఆ పోకిరి యువకుడు ఎక్కడ ఉన్నాడు? మనసులో రూపొందిన రేఖలతో కూడిన ఊహా చిత్రమేనా ? తాను కల కన్నాడా ? కలా ఇది వాస్తవం కాదా? చిత్రమైన మనసు యొక్క చంచలమైన ఆలోచనా విధానమా? ఇది నిజమా ? ఇది బ్రాంతియా ? ఎటు తేల్చుకోలేని సందిగ్ధ స్థితి డోలాయమానంగా కొనసాగుతుంది.దేశ సంస్కృతిని వదిలి పెడత్రోవ పట్టిన సమాజంలోని యువత సన్మార్గంతో నడుచుకోవాలి.అప్పుడే దేశంలోని యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని ఊహా సుందరి కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఊహా సుందరి కవితలోని భావాలు పఠితులను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.స్వప్నంలో కూడా ఊహా సుందరి పట్ల నిజాయితీతో కూడిన భావనలు వ్యక్తం చేయడం మనలను తెలియని ఊహా లోకంలోకి తీసుకెళ్ళిన తీరు అబ్బురపరుస్తాయి.కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రతిభకు ఊహ సుందరి కవిత నిదర్శనంగా నిలుస్తుంది.కవి మాదాడి నారాయణ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి (మానారె) “ ఏకతకు పరిష్కారం “ గేయం పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,రిటైర్డ్ ప్రిన్సిపల్,ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ఏకతకు పరిష్కారం గేయం పై విశ్లేషణా వ్యాసం.ఏకతకు పరిష్కారం అనే గేయంను ఆసక్తితో చదివాను.ఇది నాకు నచ్చిన గేయం.గేయం చదవగానే నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏకతకు పరిష్కారం ఉంటుందా? అని మనలో సందేహాలు పొడచూపవచ్చు.ఏకత అంటే ఐక్యత,కలిసి ఉండటం.దీనికి ఆంగ్లంలో Unity అని అర్థం.దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఐక్యత ఉండాలి.దేశం బాగు కోరి ఏమైనా చేయాలి అంటే దాని అంతిమ ఫలితం ఐక్యత వలన సాధ్యపడుతుంది.సంఘీభావం,ఏకత మనిషిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి.ఇవాళ దేశంలో లేనిది ఐకమత్యం అని చెప్పవచ్చు.దేశంలో కులం పేరిట,మతం పేరిట మారణహోమం కొనసాగుతుంది.ప్రపంచంలో కూడా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులు చేస్తూ బాంబులు ప్రయోగిస్తూ ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నాయి.ప్రపంచంలో శాంతిని స్థాపించుట కొరకు ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ఉన్నప్పటికీ నామమాత్రంగానే విధులు కొనసాగిస్తూ ఉంది.అగ్ర రాజ్యాల యుద్ధకాంక్షలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నది.మానారెకు దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంది.మానారె ఏ రాజకీయ పార్టీకి చెందని వారు. మానారె విద్యార్థిగా ఎం.ఏ. (తెలుగు) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో చదివారు.చదువు పూర్తి కాగానే ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.మానారె వివిధ హోదాలలో పని చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు.ఏ సమస్యకు అయినా పరిష్కారం ఉన్నట్లుగా ఏకతకు పరిష్కారం ఉంటుంది అని మానారె తన గేయంలో పేర్కొనడం ఆనందంగా ఉంది.దేశంలో కులం పేరిట మతం పేరిట జరుగుతున్న మారణకాండ ఆవేదన కలిగిస్తుంది.దీనికి పరిష్కారం ఏమిటో తెలియదు. ఏకత సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఏకత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.పరిష్కారం అంటే సమస్య చిక్కుల నుండి విముక్తి చెందే మార్గం తీర్పు అని చెప్పవచ్చు.పరిష్కారం అనేది సులువుగా దొరకని విషయం.సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా దేశంలో నలుగుతున్న ఏకత సమస్యను పరిష్కరించడం కొరకు దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.సమస్యకు పరిష్కారం అనేది అడ్డంకులను అధిగమించడం ద్వారా లక్ష్యాన్ని సాధించే ప్రక్రియ.దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య ఏకత.దానిని ఎంతో సులభంగా పరిష్కరించవచ్చు అని మానారె తెలియజేయడం ఆశ్చర్యం కలుగుతుంది.మానారె రాసిన ఏకతకు పరిష్కారం చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.దేశ భవితకు మూలమైన ఏకతకు పరిష్కారం తెలుసుకొని దానిని సాధించే ప్రయత్నం చేద్దాం.
“ భేద భావం పురులు విచ్చిన
“ స్వార్థ శక్తులు నడుము కట్టిన
“ వాని వ్యాప్తిని అణచి పెట్టిన
“ జాతి బలమును పుంజుకొనును.
ఇవ్వాళ దేశంలో పురులు విచ్చిన భేద భావం కోరలు సాచి ఎల్లెడలా విస్తరించి ఉంది.పౌరులు భేదభావంతో జీవనం సాగిస్తున్నారు.పౌరులు భేదభావం విడిచిపెట్టి సఖ్యతతో మెలిగితే విభేదాలు తొలగిపోతాయి.ఎవరికీ అందకుండా నాకే చెందాలనుకోవడం స్వార్థం.మనిషి తోటి మనిషికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహకారం అందించడం నిస్వార్ధం అని చెప్పవచ్చు.జంతువుల సమూహంలో కూడా జంతువులకు పరస్పర సహకారం ఉంటుంది. పర్వాలేదు మనం సుఖంగా ఉంటే చాలు.నాది అనుకున్నది నాకే దక్కాలి.పరులది కూడా నాకే కావాలి.మరెవరికి దక్కకూడదు అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు సమాజంలో తారసపడుతూనే ఉంటారు.అలాంటి వారిని చూస్తే ఉద్వేగం కలుగుతుంది.అలాంటివారు స్వార్థ శక్తులకు ప్రతిరూపం అని చెప్పవచ్చు.స్వార్థం అనేది ఇతరులతో సంబంధం లేకుండా తన కోసం లేదా ఒకరి సొంత ప్రయోజనం ఆనందం లేదా సంక్షేమం కోసం అధికంగా లేదా ప్రత్యేకంగా ఆందోళన చెందడంగా చెప్పవచ్చు.ఇవ్వాళ దేశంలో స్వార్థ శక్తులు విశృంఖల విహారం చేస్తున్నాయి.స్వార్ధ శక్తులు అలజడులకు అల్లరులకు ప్రాణం పోస్తున్నాయి.స్వార్థ శక్తుల వల్ల దేశం విచ్ఛిన్నమైపోతుంది.స్వార్థ చింతన లేని పౌరులు నడుము కట్టి పూనుకొని అలాంటి వారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి.స్వార్థ శక్తులపై ఉక్కు పాదం మోపి వాటిని అడ్డుకోవాలని మానారె అంటున్నారు. నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది.స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ పెరుగుతుంది.భేదభావంతో మెలుగుతున్న స్వార్థపరులైన ప్రజల దురాగతాలను అణిచివేయాలి అని మానారె పిలుపు ఇస్తున్నారు.భేద భావంతో ప్రవర్తించే జనుల,స్వార్థ శక్తుల ఆగడాలు అరికట్టి వేసినచో జాతి బలాన్ని పుంజుకుంటుంది అని మానారె భావిస్తున్నారు.
“ సర్వమానవ సౌభ్రాతృత్వం
“ సర్వ మతాల సమానత్వం
“ అన్ని కులాల అభేద (భావం) తత్వం
“ వెల్లి విరియాలి మన జాతిలో నిత్యం.
కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు.వృత్తి, ఆచారాలు,సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి.ఇవి వంశ పారంపర్యంగా పాటించబడతాయి.సాధారణంగా కులవృత్తులు, కులవివాహాలు,సంస్కృతి,సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.దేశంలో ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతున్నది.కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి.భారత దేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది.ఆకృతి,ధర్మము మొదలైన వాటిలో సమాన దృష్టితో ఆలోచించి చేసే విభాగం జాతి. వంశపారంపర్యంగా వచ్చే కుల సంప్రదాయం జాతి. పూర్వీకుల నుండి వచ్చు వర్గం లేక సమూహం జాతి.అనేక ఉపజాతులు గల వర్గం జాతి. సౌభ్రాతృత్వం అనునది సోదరత్వం.సాధారణంగా ఈ పదం సమాజంలో గల విభిన్న మతాలకు వర్గాలకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ,గౌరవాల భావనలనే సౌభ్రాతృత్వం అని నిర్వచిస్తారు.సర్వ మానవ ప్రేమ,మానవ కల్యాణం,విశ్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం మున్నగు ఉన్నత భావనలు,సత్ – నీతి,ప్రకృతి నియమాలు,విశ్వజననీయ మానవ సూత్రాలు,సమ్మిళిత సామాజిక స్పృహలు మూల వస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే సౌభ్రాతృత్వంగా చెప్పవచ్చు.విద్య,వృత్తి నైపుణ్యాలు,నీతి,జాతి,మతాలు,రాజకీయాలు, దానధర్మాలు,వ్యక్తిగత ఆదర్శాలు,సేవారంగం, కళలు,కుటుంబ అధికారాలు మున్నగు అనేక రంగాలలో పెంపొందించవచ్చు.సౌభ్రాతృత్వం వలన పరస్పర అవగాహన,సహకారం,ఉత్పాదకతల అభివృద్ధిని శాంతియుత జీవనాన్ని సాధించవచ్చు. సౌభ్రాతృత్వం వలన ధర్మబద్ధమైన జన జీవనం అనే కొత్త వరవడిని సృష్టించవచ్చును.సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్ని అయినా సాధించగలిగే శక్తి ఉంది.సౌభ్రాతృత్వం మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాని ఉన్నతమైన భావన.మనసు నుండి జనించే ఓ విశాల దృక్పథం.దానిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కొలవనువచ్చు.సౌభ్రాతృత్వం వలన మానవునికి అనేక రంగాలలో దూసుకుని వెళ్లే అద్భుతమైన నైతిక స్థితి ఏర్పడుతుంది. భారతీయులం మనం అందరం ఒకటే అనే భావనతో మెలగాలి.మనం అందరం భారతమాత బిడ్డలం.కష్టసుఖాలలో అందరం కలిసి మెలిసి ఉండాలి.మనం అందరం ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనం అందరం అన్నదమ్ముల వలె ఐక్యతతో మెలగాలి.తల్లి బిడ్డలు ఎలా కలిసిమెలిసి ఉంటారో, సుఖదుఃఖాలను ఏ రీతిగా కలిసి పంచుకుంటారో, అదే విధంగా సర్వమానవులు సౌభ్రాతృత్వంతో సోదర సోదరీ భావంతో ప్రవర్తిల్లాలి.ఎదుటి వారికి కష్టం వస్తే వారి కష్టాలలో పాలు పంచుకొని వారి దుఃఖాన్ని దూరం చేసి సహాయపడాలి.మన భారతదేశంలో హిందూ, ఇస్లాం,క్రిస్టియన్ మొదలైన ఎన్నో మతాలు వ్యాపించి ఉన్నాయి.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అవలంబిస్తారు. భారతదేశం లౌకిక దేశంగా ప్రసిద్ధి పొందింది.మన దేశ పౌరులు తమకు ఇష్టమైన దైవాలను పూజించుకుంటారు.భారతదేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ కల్పించబడింది. భారతదేశంలో నివసించే ప్రజలు నా మతమే గొప్పది,నా మతమే శ్రేష్టమైన మతం,నా దేవుడు గొప్పవాడు అంటే, లేదు.నా దేవుడే గొప్పవాడు అని కలహించుకోకుండా ఉండాలి.అన్ని మతాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయి.అన్ని మతాల పూజా విధానాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి.అన్ని మతాలు సమానం అనే ఆలోచన భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్లో నెలకొంటే శాంతియుతమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. మనదేశంలో అనాదిగా అనేక రకాల కులాలు ఉన్నాయి.విభిన్న కులాలుగా శాఖోపశాఖలుగా కుల వ్యవస్థ వేళ్ళూని ఉంది.భారతదేశంలోని ప్రజలు కుల విద్వేషాలు,కుల వైష మ్యాలు తొలగి సోదర భావంతో సఖ్యతగా మెలగాలి.మా కులమే గొప్ప అనే ఆలోచనలు జనుల మనస్సులలో నాటుకుపోయినాయి.అంతే కాక ప్రతి కులంలో మరిన్ని ఉప కులాలు ఏర్పడి మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.మానవులందరిది ఒకే కులం.అన్ని కులాలు సమానం అనే భావనతో మానవ కులంగా రూపుదిద్దుకోవాలి.కులాల మధ్య చెలరేగే కులాల కుంపట్లు అనే భేద భావం తొలగిపోవాలి.మంచి అన్నది మాల అయితే మాలనే అగుదును అని మహాకవి గురజాడ అప్పారావు తన గేయంలో పేర్కొన్నారు.గురజాడ అందించిన స్ఫూర్తిని ప్రజలు అనుసరిస్తే అన్ని కులాల రూపురేఖలు మారిపోతాయి.మన అందరిది ఒకే కులం అనే భావన వస్తే గొప్ప సమాజం రూపు దాల్చుతుంది అనుటలో సందేహం లేదు. భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరు తమది భారత కులంగా తలంచాలి.మన దేశ ప్రజలంతా ఇటు వంటి గొప్ప ఆలోచనలతో మెలగాలి.మన దేశంలోని ప్రజల్లో మార్పు వస్తే గొప్ప జాతిగా ఖ్యాతిని పొంది ప్రపంచమంతటా విస్తరిస్తుంది.మన దేశంలోని ప్రజల్లో సర్వ మానవ సౌభ్రాతృత్వం అనే భావన ఆచరణలోకి రావాలి.మన దేశ ప్రజల్లో సర్వ మతాల సమానత్వం అనే భావన ప్రోది చేసుకోవాలి. మన దేశ ప్రజల్లో నెలకొన్న భేద భావాలు తొలగిపోయి అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలి. విశాల భావాలతో నిండిన మన దేశ ప్రజల్లో సుఖసంతోషాలు వెల్లి విరిసి జాతి ఖ్యాతి ఇనుమడిస్తుంది అని కవి మానారె చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రక్త పిపాసి రాక్షస మూకల
“ అడ్డు కొనాలి శౌర్యపు వాకల
“ లంచం కోరే నీచుల చేతుల
“ బంధించాలి నీతుల గొలుసుల.
స్వార్థపరులుగా మారి హింసా మార్గంలో పయనిస్తూ రక్త దాహానికి అలవాటు పడ్డ కనికరం లేని రాక్షసుల సముదాయాన్ని అడ్డుకోవాలి.మనిషిలోని రాక్షస ప్రవృత్తిని మానిపించాలి.స్వార్థపరులను దయాపరులుగా,పరోపకారులుగా,గొప్ప మనసున్న మనుషులుగా మార్చాలి.సరియైన చదువు, సంస్కారం లేక రాక్షసులుగా తయారయ్యారు. పెద్దలు,గురువుల శిక్షణ లేక సరైన మార్గదర్శనం లేక స్వార్థపరులుగా,అసాంఘిక శక్తులుగా తయారై సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నారు. మనుషులుగా జన్మించినప్పటికి కఠిన చిత్తులుగా, కర్కోటకులుగా,కాముకులుగా,హంతకులుగా,రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.సమాజానికి చేటు చేస్తున్న నరహంతక రాక్షసులను శౌర్యవంతులై ఎదుర్కోవాలి.ధైర్యవంతుల శౌర్యపు ప్రవాహాలే ఇలాంటి దుర్మార్గుల పాపపు పనులకు అడ్డుకట్టగా నిలుస్తాయి.రాక్షస ప్రవృత్తి గల మనుషుల మనస్సులను మార్చడం శౌర్యవంతుల వల్లనే సాధ్యమవుతుంది.సమాజంలో విచ్చలవిడిగా లంచగొండితనం పెరిగిపోయింది.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే జరగని దుస్థితి ఏర్పడింది.మంచి పూల తోటలోనికి ఒక్క గుడ్లగూబ చొరబడితే చాలు, ఆ పూల తోట అంతా నాశనం అవుతుంది. అటువంటిది కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు గుడ్లగూబలు ఉంటే ఆ పూల తోట పూర్తిగా విధ్వంసం కాకుండా ఉండగలదా? పూల తోట లాంటి సమాజంలోకి కలుపు మొక్కలాంటి దుర్మార్గులు ప్రవేశిస్తే ఏమవుతుంది? పూల తోటలోకి దుర్మార్గులు ప్రవేశిస్తే తోటను విధ్వంసం చేస్తారు. పూల తోటలోనుండి కలుపు మొక్కలను ఏరివేయాలి.పూల తోటలోకి గుడ్లగూబ వచ్చి చేరినట్లయితే దానిని తరిమి వేయాలి.పూల తోట లాంటి సమాజాన్ని కాపాడుకోవాలనే సందేశం చక్కగా ఉంది.అన్నిచోట్ల సర్వత్రా ఇందు గలడు అందు లేడు అని చెప్పినట్లు అంతటా లంచగొండితనం వ్యాపించి ఉంది.సమాజంలో నెలకొన్న లంచగొండితనంను పూర్తిగా అరికట్టాలి. లంచగొండితనం ఏ రూపంలో ఉన్నా దానిని పారదోలితేనే సమాజం పూర్తిగా అభ్యుదయ పథంలో కొనసాగుతుంది.లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని అవినీతి నిరోధక శాఖ నామమాత్రంగా కేసులు పెట్టి వదిలివేస్తున్నారు. లంచం తీసుకున్న అవినీతిపరులకు ఎలాంటి శిక్షలు పడటం లేదు.అవినీతి నిరోధక శాఖ లంచగొండులపై కేసులు పెట్టినప్పటికీ సరియైన సాక్ష్యాలు చూపించకపోవడం వల్ల కేసులు వీగిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ లంచగొండులను ఏమీ చేయదు అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అవినీతి నిరోధక శాఖ గుట్టు ప్రజలకు తెలిసిపోయింది.లంచగొండులను నీతిపరులుగా, ధర్మపరులుగా మార్చాలి.లంచగొండుల చేతులకు ఇనుప సంకెళ్లు వేయడం ద్వారా కాకుండా నీతులు అనే గొలుసులతో బంధించాలి.సమాజంలోని ప్రతి ఇంటిలోని వారిని నీతిపరులుగా మార్చాలి.అప్పుడు సమాజంలో లంచగొండులనే వారు ఉండరు.
“ జాతి జీవం దాని సంస్కృతి
“ జాతి చేతన దాని విస్తృతి
“ జాతి వేదన కేది నిష్కృతి
“ జాతి ఏకతయే పరిష్కృతి.
జాతి చక్కగా మనుగడ సాగించడానికి సనాతన కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు,ధార్మిక అంశాలతో కూడిన ప్రవర్తన ప్రధానం.జాతి యొక్క సంస్కృతి సంప్రదాయాలే జాతిని సజీవంగా నిలుపగలుగుతాయి.జాతి చేతన జాగృతమయితే జాతి చేతనత్వాన్ని పొందితే తమదైన సంస్కృతిని తిరిగి ఆచరణలోకి పెడితే ఆ జాతి వ్యాప్తిని పొందుతుంది.ఇటువంటి లోపాల చేత మానవ జాతి అంతా ఆపదలకు కష్టాలకు లోనవుతున్నది.జాతి ఎదుర్కొంటున్న బాధలకు నిస్కృతి ఏది? భారతదేశం ఎదుర్కొంటున్న భేద భావన, కులమతాల చిచ్చు,మానవ మృగాల రాక్షస కృత్యాలు,అవినీతి కరాళ నృత్యం మొదలైన వాటి వల్ల సమాజం అనుభవిస్తున్న బాధలు అన్ని తొలగిపోవాలి.ప్రజల మేలుకోరే నీతివంతమైన సుపరిపాలన అందించే రాజ్యం రావాలి.ప్రజా శ్రేయస్సు కోరే నీతి గల,ధర్మం గల రాజ్యం రావాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే దివ్యమైన మార్గానికి దేశ ప్రజల సమైక్యతే దారి చూపాలి.ప్రజలందరు కుల మత భేదాలను మరచి పోయి తాము అందరం ఒకటే.ఈ దేశం మనది.మనం అందరం మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కుల మతాలకు అతీతులమై ఐక్యమత్యంతో మెలగాలి అనే ఏకాభిప్రాయానికి రావాలి.భారతదేశ ప్రజలకు కలిగే బాధలన్ని క్రమ క్రమంగా తొలగి పోతాయి. ప్రజలందరు సుఖసంతోషాలతో అలరారుతూ ప్రశాంతమైన జీవనం సాగిస్తారు.ఏకతకు పరిష్కారం అనే చక్కటి గేయం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందిస్తున్న కవి మాదాడి నారాయణరెడ్డిని (మానారెని) అభినందిస్తున్నాను.మానారె మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాదాడి నారాయణ రెడ్డి ” ఏదీ కొత్తదనం?”
కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి, ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్,మాదాడి నారాయణ రెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన “ఏది కొత్తదనం? కవిత పై విశ్లేషణా వ్యాసం.కవిత
ఏమిటని ఆసక్తితో చదివాను.నాలో ఆలోచనలు
రేకెత్తించింది.కొత్తదనం యొక్క అర్థం కొత్తగా ఉండే స్థితి లేక భావము.The quality of being new and original not derived from something else.కొత్తదనం అంటే నూతనత్వం.
“తమ్ముడూ! పాత రోతగా ఉంది కదూ!
సామెత: కొత్త ఒక వింత… పాత ఒక రోత అనేది నిజం. ఎందుకంటే కొంత మందికి పరిచయం అయిన కొత్తలో మన మీద ఉన్నంత గౌరవం తర్వాత ఉండదు.కొత్తగా ఏదైనా వచ్చాక పాత దాని విలువ మర్యాద పోతుంది.అదే వస్తువు అయినా,ప్రేమ అయినా,మనిషి అయినా,కొత్త వింత…పాత ఒక రోత.ఇది నిజం.కొత్త బంధువులకు,కొత్త స్నేహితులకు,ఇచ్చే విలువ పాత బంధువులకు, పాత స్నేహితులకు,ఇవ్వరు.పాత రోత అనిపిస్తుంది. ఇది లోక నైజం.ఈనాటి నవీన మానవుడు నిత్య నూతనంగా జీవిస్తాడు.ఏదైనా కొత్త అనుకోకుండా ఆశ్చర్యపరిచేలా జరిగితే అదో వింత విడ్డూరం? కానీ ఇదంతా సహజమేగా అనిపిస్తే అది సర్వసాధారణం!!
“నీవీ క్షణంలో కొత్త అనుకుంటున్నది “మరు క్షణంలో పాత కాదా మరి
మనం ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే ఈ క్షణంలో కొత్త అనుకుంటున్నది మరు క్షణంలో పాత అవుతుంది.నిజమే.ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.నారాయణరెడ్డి (మానారె) కవి భావన అద్భుతం…
“సూర్యుడూ చంద్రుడూ “గ్రహాలు తారలూ “వెలుగులు చీకట్లూ “ఆ ఆకాశం ఈ భూమి. “అన్నీ పాతవే గదా.
సూర్యుడు సౌర వ్యవస్థలో మధ్యలో ఉన్న నక్షత్రం. పగటిపూట వెలుగులు ఇచ్చే గ్రహం.తూర్పు నుండి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకట్లు పారిపోతాయి.చంద్రుడు రాత్రి పూట నక్షత్రాలతో పాటు కనిపించేది.భూమి చుట్టూ తిరిగే ఒక గ్రహం. చంద్రుడు సూర్యుడి ప్రకాశం వలన వెలుగుని ఇస్తున్నాడు.గ్రహం అంటే అంతరిక్షంలో ఒక ఆకృతి. ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటుంది. బరువును గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. గ్రహాలు తొమ్మిది.ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు.బుధుడు,శుక్రుడు,భూమి, కుజుడు (అంగారకుడు),బృహస్పతి (గురువు), శని,యురేనస్ (వరుణుడు),నెప్ట్యూన్. (ఇంద్రుడు), ఫ్లూటో (యముడు). తారలు అంటే ఆకాశంలో రాత్రిపూట ప్రకాశించేవి అని అర్థం.భూమి నుంచి చాలా దూరంగా ఉన్న కారణంగా చుక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.వెలుగులు అంటే కాంతులు. వెలుగు కిరణాలు పరిసరాలను కనిపించకుండా ఆవరించిన చీకట్లను పారద్రోలి వాటిని సుస్పష్టంగా కనిపింప చేస్తాయి.వెలుగు ప్రసరించడం చేత ప్రకృతి శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.వెలుగు ప్రశాంతమైన సుఖమయమైన జీవితానికి ప్రతీక. చీకటి అర్థం వెలుతురు లేని స్థితి.సూర్యుడు అస్తమించడంతో అంతట అంధకారం అలుముకుంటుంది.ఈ చీకటి మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంది.చీకటి అర్థం ఖాళీగా ఉండడం.ఉదాహరణకు భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం ఏర్పడింది. దుఃఖమయమైన అతని బ్రతుకు అందకార బంధురమైందని చీకటిమయమైందని చెప్పుకుంటాం.అంటే సుఖాలకు వెలుగు ప్రతీక అయినట్లుగా,కష్టాలకు చీకటి ప్రతీక అని చెప్పవచ్చు.ఆకాశం ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశం వికృతి పదం ఆకసము.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలి రంగులో కనబడుతోంది.కానీ నిజానికి ఆకాశం ఏ రంగును కలిగి ఉండదు.అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశంలో సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది.ఆ చీకటిలో అనంత దూరంలో ఉన్న నక్షత్రాలు,గ్రహాలు,చిన్న చిన్న చుక్కలుగాకనిపిస్తాయి.ఆకాశం భూమి ఇతర గ్రహాలు మరియు నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం. నక్షత్రాలు,చంద్రుడు,సూర్యుడు మొదలైనవి ఉండే శూన్య ప్రదేశం.వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.పంచ భూతాలలో ఆకాశం ఒకటి. అంతు తెలియజాలనిది ఆకాశం.భూమి సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి.మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే.భూమి 450 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడిందని తెలుస్తోంది.భూమి గురుత్వ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది.భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకి ఒక్కోసారి పరిభ్రమిస్తుంది.దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది.దీన్ని భూ భ్రమణం అంటారు. భూమి నీరు లేకుండా ఉండే ప్రదేశం. భూమండలంలో మూడవ వంతు భాగం భూమి. ప్రాణులు ఉన్న ఒకే ఒక గ్రహం.చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం.భూమి మనం నివసించు ప్రదేశం.అది మనకు తల్లి వంటిది.భూమిలో పండే పంటలే జీవులకు జీవనాధారం.అవును సూర్యుడు, చంద్రుడు,గ్రహాలు,తారలు,వెలుగులు,చీకట్లు,ఆ ఆకాశం,ఈ భూమి,అన్నీ పాతవే కదా అని కవి నారాయణరెడ్డి (మానారె) భావాల్లో ఎంతో బలం ఉంది.మనం ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది.
“నిన్ను కన్న తల్లీదండ్రీ
“హితులూ సన్నిహితులూ
“పాత వారు కారూ?
అని నారాయణ రెడ్డి (మానారె) మనల్ని ప్రశ్నిస్తున్నారు.తల్లిదండ్రి కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు.సృష్టిలో ప్రాణికి మూల కారణం అమ్మ.కన్నతల్లి బిడ్డను నవ మాసాలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన స్త్రీ మూర్తి.ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. నిజమే.కన్న తల్లిదండ్రులు,మన హితం కోరే హితులు,మన మేలు కోరే సన్నిహితులు,పాత వారే అని ఒప్పుకోవాల్సిన విషయంగా తోస్తుంది. అయినప్పటికీ కన్న తల్లిదండ్రులను,హితులను, సన్నిహితులను,పాతవారని తీసిపారేయాల్సిన వ్యక్తులు కాదని మనలను ఆలోచన తరంగాలలో తేలియాడ జేస్తున్నారు.
“ఎంతగానో నీవభిమానించే
“నిత్యం కొత్తగా ఊహించే
“నీ శరీరం పాతది కాదూ?
మనని మనం ప్రేమించుకుంటాం.మనని మనం అభిమానించుకుంటాం.మనల్ని మనం కొత్తగా ఊహించుకుంటున్న మన శరీరం పాతది కాదు అని ప్రశ్నిస్తున్నారు.అవును మన శరీరం పాతదే.మనం
అభిమానించుకుంటున్నది నిజమే.కాదనలేని సత్యం నారాయణరెడ్డి (మానారె) కవి భావన వాహ్…
” నీవు ఆడే ఆట పాడే పాట
“తినే తిండి చదివే చదువు
“ప్రియాతిప్రియంగా నీవు భావించే
“ఇల్లాలు మరి పిల్లలు
“కొత్తవారేనంటావా? మనం నిత్యం ఏదో ఒక ఆట ఆడుతుంటాం.మనం ప్రతి రోజు ఏదో ఒక పాట మనకి ఇష్టమైనది పాడుతుంటాం.మన ఇష్టంగా తినే తిండి,మనం ఇష్టంగా చదువుతున్న చదువు,మనకు ప్రియాతిప్రియంగా మనలో బాగమని భావించే ఇల్లాలు హృదయేశ్వరి,మన సంతానమైన పిల్లలు కొత్త వారేనంటావా అని కవి నారాయణ రెడ్డి (మానారె) ప్రశ్నిస్తున్నారు.కొత్త వారు కాదని మనం తెలుసుకోవాల్సిన విషయంగా తోస్తుంది.కవి భావనలో సత్యం ఉంది.
“కొత్త మాటల్లో లేదు
“మాటలకు మూలమైన భావనలో ఉంది
కొత్త అనేది మనం మాట్లాడే మాటల్లో లేదు మాటలకు మూలమైన భావనలో ఉంది అని మనకు గుర్తు చేస్తున్నారు.కవి నారాయణరెడ్డి (మానారె) చక్కటి భావం వ్యక్తం చేసిన తీరు అబ్బురపరుస్తుంది.
“ఈర్ష్యా – ద్వేషం – కసి
“నిరాశ- నిస్పృహ- నిరీహల్ని
“దూరంగా సుదూరంగా త్రోలి
“అందరికీ ఆనందం పంచు
“అందరితో కలిసి బ్రతుకు
ఓర్వలేనితనం మరియు శత్రుత్వం,పగ,కోపం,ఆశ లేనితనం,స్పృహ లేకపోవడం,తనకు తాను మరిచిపోవడం,కోరికలు లేకుండా ఉండటం, వీటినన్నిటిని దూరంగా,సుదూరంగా పంపించి మంచి మనసుతో అందరికీ ఆనందం పంచుతూ అందరితో కలిసి బ్రతుకు అని కవి ప్రబోధిస్తున్నాడు.
“అప్పుడు నీవు కోరే కొత్త
“అంతటా అన్నిటా లభిస్తుంది
నీవు ఒక మంచి మనిషిగా మారతావు.అప్పుడు నీవు కోరే కొత్తదనం అంతటా అన్నిటా లభిస్తుంది.నీ జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి.నీవు కోరుకునే కొత్తదనం నీకు లభిస్తుంది.ఏది కొత్తదనం కవిత ద్వారా చక్కని సందేశం అందించారు.కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలానికి వందనాలు చేస్తున్నాను.మానారె కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయాలని మనసారా కోరుకుంటున్నాను.
హిందీలో కుంవర్ నారాయణ్ రచించిన కవిత.
ఆంగ్ల అనువాదం : డేనియల్ వేయిన్ బోర్డ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కుంవర్ నారాయణ్ కొత్త మార్గం కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత ఇది.డేనియల్ వేయిన్ బోర్డ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు.తెలుగులోకి అనువాదం చేసిన కొత్త మార్గం కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.కొత్త మార్గం కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావం నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కొత్త మార్గం ఏమిటి? అని మనలో సందేహాలు కలుగ వచ్చు.దారిని మార్గం అని ఆంగ్లంలో Way అని అంటారు.దారి అనగా ఒక నిర్దిష్టమైన గమ్యానికి త్రోవ చూపేది.ఇది సాధారణంగా జనులు ఉపయోగించే దారి.ఒక ప్రదేశం చేరుకొనుటకు వీలు కల్పించే మార్గం దారి అంటారు.రహదారి అనగా ప్రజలు,చక్రాల వాహనాలు ప్రయాణించే మార్గం.దారి గమ్యస్థానాన్ని చేరడానికి ఉపయోగపడే భూభాగం. కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నేను జీవితాన్నుంచి
“తప్పించుకోవాలనుకోవడం లేదు
“అందులో భాగమవ్వాలనుకుంటున్నాను.
నేను ఈ విశాల ప్రపంచంలో జీవించడానికే నిర్ణయించుకున్నాను.నేను జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలను అయినా ధైర్యంతో ఎదుర్కొంటాను.ప్రతి రోజు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని,బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాను.ఒక పిరికివాడిలా,వ్యసనపరుడిలా జీవితం నుండి తప్పించుకోవాలనే కోరిక అసలు నాలో లేదు. అలాంటి ప్రతికూల ఆలోచనలకు నా హృదయంలో చోటు లేదు.జీవితం అనేది జీవించడానికి మనిషి ఏర్పరచుకున్న ఒక పద్ధతి.అసలు ఎందుకు జీవితం? అని నేను ఎన్నడు మనస్సులో ఏనాడు అలాంటి తలంపులు చేయను.జీవితం అంటే జీవించడమని మరియు మనిషి యొక్క ఉనికి అని నా తల్లి మానవతా విలువలను తెలియ జేసింది.నా తల్లి కడుపులో నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చింది. నేను అంటే అమ్మకు ప్రాణం.చిన్నతనంలో నేను మల విసర్జన చేసినప్పటికీ అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమతో నా తల్లి మలాన్ని తీసివేసేది. ఆప్యాయతతో తాను నన్ను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకునేది.జీవితంలో కష్టాలు ఏర్పడ్డాయని నేను ఊరికే బాధ పడుతూ కూర్చుని ఉండను.కష్టాల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం ఎన్నడు నాకు కలగ లేదు.సుందరమైన జీవితాన్ని ఇచ్చిన నా తల్లి కష్టాలను ఎలా అధిగమించాలి? అని సాహస వీరుల గాధలను,ధైర్యాన్ని నాకు నూరిపోసింది.సాహస వీరుల కష్టాల ముందు నేను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు చాలా చిన్నవి. కష్టాలను తలుచుకొని ఒంటరిగా కూర్చుండి విచారించడం లేదు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను మొక్కవోని ధైర్యంతో సాహసంతో ఎదుర్కొంటాను. కష్టాల నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోను. జీవితాన్నుంచి జీవితం ఏర్పరిచిన సవాళ్ల నుంచి తప్పించుకోవాలనే ఆలోచన నాలో లేదు.జీవితం అంటే ఉనికి యొక్క రూపమని జీవించడానికే నిర్ణయించుకున్నాను.జీవించడానికే అంకితం అయిపోతాను మరియు జీవితంలో ఒక భాగం అవుతాను.జీవితం యొక్క గ్రంథంలో నాకంటూ ఒక పేజిని ఏర్పరచుకుంటాను.అందులో నా పేరు కూడా నమోదు అయి ఉండటం చాలా సంతోషంగా ఉంది. జీవితం అనే నాటకంలో అందులో నా పాత్రను చక్కగా రక్తి కట్టిస్తాను అనే ఒక సూచన కనబడుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
“కవిత్వానికి
“అనుమానాస్పదంగా వున్నా
“స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి.
ఇరుసు అనేది తిరిగే చక్రం లేదా గేర్ కోసం కేంద్ర షాఫ్ట్.గేరు భ్రమణం కోసం అమర్చబడుతుంది. చక్రాలు కలిగిన వాహనాలకు ఇరుసు బిగించబడి ఉంటుంది.బేరింగ్ వ్యవస్థ లేని ఇరుసు చక్రంతో పాటు తిరుగుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న ఇరుసు చుట్టూ చక్ర భ్రమణం చెందుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న చక్రంలో బేరింగ్ లేదా బుషింగ్ ఉంటుంది.చక్రం లోపలి రంధ్రంలో అమర్చబడి ఉంటుంది.దీని యందు చక్రం లేదా గేరు ఇరుసు చుట్టూ భ్రమణం చెందుతుంది.నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు.కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ.కవిత్వము ఒక నిరంతర సాధన.కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా సజీవంగా అనుభూతికి అందివ్వడమే కవిత్వ ధ్యేయం.అసంబద్ధమైన వాటి మధ్య సంబంధమే కవిత్వానికి అర్థం చేకూరుస్తుంది.గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేది కుదుపు.ఒక్కసారిగా కుదుపు వచ్చిన కారణంగా శరీరంలో కంపన మొదలవుతుంది.కుదుపు కారణంగా పనులకు ఆటంకం కలుగుతుంది.జీవితం నుండి వచ్చిన దుఃఖము,ఆవేదన నుండి కవిత ప్రాణం పోసుకుంటుంది.జీవితం నుండి ఊహాత్మక ప్రపంచంలో జరిగిన సంఘటనలకు అతను మథన పడిపోయాడు.జీవితంలో తాను చూసిన, అనుభవించిన తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోని బాధ,వేదనలు చూసిన తర్వాత తన మనసులో కుదుపు వచ్చినట్లుగా తోస్తుంది.కవి ఊహాత్మక దృక్పథంతో ఇరుసు పై ప్రయాణం సాగుతున్న వ్యక్తుల జీవితాల్లో కుదుపులు ఉంటాయి.కవిత్వం నేల మీద సాము చేయకూడదు అంటారు.
తాను ఎవరో తెలియకుండా అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతున్న అతన్ని అట్టి స్థలాన్ని మరియు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక్క సారిగా వాహనం అటు ఇటు ఊగుతూ కుదుపులు రావడం సహజమే.అట్టి వ్యక్తులు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే కుదుపులకు వాహనం కింద మీద పడిపోయినట్లుగా జర్క్ ఇవ్వడం వల్ల ఒళ్ళంతా నొప్పులు ఏర్పడడం సహజమే కదా అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకు మొదట
“జీవితపు శక్తి మూలాన్ని
“క్రియాశీలం చేయాలి.
శక్తి అనే పదం బహుళ ఆలోచనలను సూచిస్తుంది. విశ్వం యొక్క సృష్టి,నిర్వహణ మరియు విధ్వంసానికి బాధ్యత వహించేది శక్తి.సృష్టికి శక్తి బాధ్యత వహిస్తుంది.భౌతిక శాస్త్రంలో శక్తి అంటే వస్తువు లేదా భౌతిక వ్యవస్థకు బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం.ఏదైనా పని చేసిన శక్తి లభిస్తుంది.ఏదైనా పని చేసిన దాని ఫలితంగా ఉష్ణం,కాంతి లాంటి రూపాలలో శక్తిని గుర్తించవచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించ లేము.శక్తిని నాశనం చేయలేము.శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలము. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శక్తిని జౌల్స్ లో కొలుస్తారు.కదులుతున్న వస్తువు కలిగి ఉండే గతి శక్తి,ఏదైనా ఒక ప్రత్యేక స్థానం వల్ల వస్తువు కలిగి ఉండే స్థితి శక్తి, సాగదీయబడిన ఘన పదార్థానికి ఉండే స్థితి స్థాపక శక్తి,రసాయనిక చర్యలకు సంబంధించిన రసాయనిక శక్తి,విద్యుదయస్కాంత వికిరణాలు మోసుకెళ్ళే వికిరణ శక్తి మొదలైనవి శక్తికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.జీవించే అన్ని జీవులు శక్తిని స్వీకరిస్తూ విడుదల చేస్తూ ఉంటాయి.క్రియా శీలత వల్లనే స్థిరంగా మానవులు సవాళ్లతో కూడుకున్న పనులలో నైపుణ్యం సాధిస్తారని అనుభవం తెలుపుతుంది.క్రియాశీలత వల్లనే మనిషి నిర్దిష్టమైన పనిని ఎంపిక చేసుకొని పనులు చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మరియు పనులలో అనుభవం కూడా సంపాదిస్తారు.జీవితంలో ఏదైనా కష్టం వచ్చిన తర్వాత మనిషి ధైర్యంతో ముందుకు సాగాలి. మనిషికి కష్ట పడి పని చేసే క్రియా శీలత వల్లనే మళ్ళీ సంతోషంగా విజయవంతంగా ఉండే సామర్థ్యం అలవడుతుంది. lకష్టాల వల్ల మనసుకు దెబ్బ తగిలినప్పటికీ మనిషి మనస్సుకు తట్టుకునే శక్తి గుండె నిబ్బరం ఉంటుంది.క్రియా శీలం అనేది చాలా శక్తివంతమైన పనిని కలిగి ఉండటంగా చెప్పవచ్చు.మనిషి వ్యక్తిగత కృషి వల్ల మరియు శ్రద్ధతో పనిచేయడం వల్లనే చురుకైన జీవితం ఏర్పడుతుంది.మనిషి తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఆటంకాలను ఎదుర్కొంటాడు. అయినప్పటికీ మనిషి కష్టాలు వచ్చాయని బెదిరిపోకూడదు.మనిషి తాను మనుగడ సాగించడానికి జీవితంలో శక్తి యొక్క మూలాలను తెలుసుకొని తాను చేయవలసిన పనులు చేస్తూ నిర్విఘ్నంగా ముందుకు సాగిపోవాలి.కష్టాలు మనిషికి రాకుండా మానులకు వస్తాయా? మనిషి గుండె నిబ్బరంతో తన జీవితపు శక్తి మూలాలను క్రియాశీలంగా పనులు నిర్వహించి ముందుకు సాగాలి అనే భావనను కవి వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది..
“తర్వాత ఆ శక్తిని
“బతుకు కక్షకున్న ఇరుసుకు
“జత చేయాలి.
తర్వాత మనిషి తనలో నిండి నిబిడీకృతమై ఉన్న అపారమైన శక్తిని క్రియాశీలం ద్వారా తట్టి లేపాలి. మనిషి తనలో ఉన్న అనంతమైన శక్తిని బతుకు చక్రంలో తిరుగుతున్న ఇరుసుకు జత చేస్తూ చేతనతో ముందుకు సాగాలి అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అప్పుడు
“గతంలో లాగా
“యాంత్రికత” లేని
“మానవత్వం” వైపు మరలిన
“కొత్త మార్గం ఆరంభమవుతుంది.
జరిగిపోయిన కాలాన్ని గతం అంటారు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్ని మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి. మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింస, మానవ ప్రేమ మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్నగా భావిస్తారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి.మానవతా వాదం, సాంప్రదాయక మత సిద్ధాంతాలకు విరుద్ధమైనది. మానవతా వాదం పరిణామ సూత్రం అన్ని విధానాలను అధిగమిస్తుంది.మానవత్వం అనేది మానవ స్థితి నుండి ఉద్భవించిన పరోపకార నైతికతో ముడివడి ఉన్న ధర్మం.జీవితంలో మనిషి ముందుకు సాగటానికి జరిగిపోయిన కాలంలో లాగా ఏదో బతుకుతున్నాం.రొటీన్ గా మొక్కుబడిగా దినచర్య కొనసాగుతున్నట్లుగా కాకుండా తనలోని శక్తులను మేల్కొల్పుతూ ఇష్టపడి పని చేస్తూ మానవత్వంతో మెదలాలి.మనిషి మానవత్వంతో నడక సాగించిన రోజున సాటి మనుషులకు తోటి వారికి ఆదర్శంగా ఉంటుంది.మనిషి ఎలాంటి యంత్రాలు లేకుండా పనులు నిర్వహించిన రోజులు చూశాము.ఆ రోజుల్లో అందరు కలిసిమెలసి వ్యవసాయ పనుల్లో పాల్గొనే వారు.సబ్బండ కులాల వారు సఖ్యతతో మెలిగేవారు.మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా శ్రమైక జీవన సౌందర్యానికి సాటి లేదన్నట్లుగా మెలిగే వారు.యాంత్రికత లేని సమాజం వల్ల మనుషులు పరస్పర అనురాగంతో కలిసిమెలిసి ఉంటూ మానవత్వంతో జీవిస్తారు. అందరు మనుషులు కష్టపడి జీవిస్తూ సాటి మనుషుల పట్ల మానవత్వంతో మెలగడం వల్ల కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సూచన కనబడుతుంది.మనుషుల జీవితాల్లో కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సందేశాత్మకంగా కవితను రచించినట్లుగా తోస్తుంది.మనిషి నడుస్తున్న బాట సమాజానికి కొత్త మార్గం అవుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
మంగారి రాజేందర్ జింబో కవిత్వం సామాజిక సమస్యలకు అద్దం పడుతుంది. మంగారి రాజేందర్ జింబో అనగనగా … కవిత
ప్రముఖ కవి,రిటైర్డ్ జిల్లా జడ్జి,ప్రస్తుతం తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మంగారి రాజేందర్ జింబో కలం నుండి జాలువారిన చూస్తుండగానే … కవితా సంపుటిలోని అనగనగా…కవిత పై విశ్లేషణా వ్యాసం.అనగనగా కథ ఒకప్పుడుతో మొదలవుతుంది.అనగనగా అనే తెలుగు పదానికి నిర్దిష్టమైన,ప్రత్యక్షమైన అర్థం లేదు.అనగనగా సమాజంలో జరిగిన సంఘటనల సరళిలో ప్రారంభమయ్యే కథలను కవిత రూపంలో వ్యక్తం చేయడం కొత్తగా వింతగా ఉంది.అనగనగా ఇది కచ్చితంగా అని కాకుండా భావాన్ని లేదా భావోద్వేగాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడుతుంది.అనగనగా సాధారణంగా తెలుగులో ఒక నిర్దిష్ట అర్థాన్ని తెలియజేయడానికి కాకుండా లయను సృష్టించడానికి ఉపయోగిస్తారు. అనగనగా అని కథను ప్రారంభించడానికి మొదట ఉపయోగిస్తారు.కథను ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా తరతరాలుగా సమాజంలో వ్యాప్తిలో ఉన్నాయి.అనగనగా ఎప్పుడో ఒక కాలంలో జరిగాయి.అవి జనంలో వాడుకలో ఉన్నాయి.చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్ద వాళ్ళు అనగనగా ఒక రాజు ఉండే వాడు అని కథ చెప్పి పిల్లవాడిని నిద్రపుచ్చడం లోకం ఎరిగినదే.ఇప్పుడు మనం నివసిస్తున్న వర్తమాన సమాజంలో లోకంలో జరుగుతున్న రీతి రివాజులను బట్టబయలు చేస్తూ కవి జింబో పిల్లలకు కథ చెప్పినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.సమాజంలో ఏం జరుగుతుంది? సమాజంలోని జనాలను జాగృత పరచడం కోసం అనగనగా కవిత రాసినట్లుగా తోస్తుంది.జింబో రాసిన అనగనగా కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అపారమైన అనుభూతిని సొంతం చేసుకుందాం.
“అనగనగా …
“ఓ వాగుండేది
“ఏ నగరం దాని మీద దాడి చేసిందో
“ఏమో –
“నీళ్ళే కాదు
“ఇసుక కూడా లేకుండా పోయింది.
వాగు అంటే కొండల మీది నుండి ప్రవహించే చిన్న నీటి ప్రవాహం.ఇది మంచి నీటి సెలయేరు.నగరం విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం.నగరం జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. నగరాలు చారిత్రక ప్రాధాన్యత,ప్రత్యేక అధికారం కలిగి స్వయం పరిపాలన అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.నగరాలు వసతులు కల్పించడంలోను,మురుగునీటి కాలువల నిర్వహణ,విస్తృతంగా రవాణా సౌకర్యాలు,నివాస గృహ సముదాయాలు కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస పట్టణాలు నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులు ఉద్యోగాలు లభించడం వలన పరిశ్రమలు పరస్పరం లబ్ధి పొందుతూ ఉండటం వలన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి.ప్రజలు అధికంగా ఉండటం, వ్యాపార అభివృద్ధికి,కళా,వినోదం,పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి.ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలు,విద్యను అభ్యసించడానికి విద్యాసంస్థలు,ఇలా ఒక దాని కొకటి అనుబంధంగా వృద్ధి చెందాయి.ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి.నీళ్ళు ఘన రూపం,మంచు గడ్డల రూపంలో మరియు ద్రవ రూపంలో సముద్రాలు,నదులు,తటాకములు ఉన్నాయి.భూతలంపై ఆవిరితో వాయు రూపంలో మేఘాలు ఉన్నాయి.మహా సముద్రాలు,నదులు, తటాకాలు ఉపరితల జలాలతో నిండి ఉంటాయి. ఇసుక అనేది విచ్ఛిన్నమైన రాతి ఖనిజ కణాలతో ఏర్పడిన మిశ్రమం.ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థం.ఇది పరిమాణం ద్వారా నిర్వచింపబడింది. కంకర కంటే చిన్నదిగా,మెరుగ్గా,ఓండ్రు మట్టి కంటే గరుకుగా ఉంటుంది.కాంక్రీట్ తయారీకి అనువైన ఇసుకకు అధిక డిమాండ్ ఉంది.నదులలో వాగులలో ఇసుక ఎక్కువగా ఉంటుంది.సిమెంటు, నీటిలో కలిపి తడపటం వలన అది గట్టి బండలాగా తయారవుతుంది.నిర్మాణ రంగంలో ఇసుకను ఎక్కువగా వాడుతారు.పునాదులలో మొదటగా ఇసుకను ఒక పొరగా వేసి కూరుతారు.దీని వల్ల నిర్మాణాలలో పగుళ్లు రాకుండా ఉంటాయి. చిన్న వాగులు,వంకలు మొదలుకొని నదుల్లోని పెద్ద రీచ్ ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతుంది.అక్రమార్కులు రాత్రి,పగలు తేడా లేకుండా వేల కొద్ది లారీల్లో,ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికి అని అనుమతులు తీసుకోవడం,లారీలు,ట్రాక్టర్లతో పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవడం పరిపాటి అయింది.ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఇసుక మాఫియా చెలరేగుతుంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి.డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాధికారులు చూసి చూడనట్టు వదిలి వేయడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతున్నది. ఇసుక దందా అంతా రాజకీయ నాయకుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.కవి జింబో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్లుగా అనగనగా ఒక వాగు ఉండేది.అలాంటి వాగుపై ఏ నగరం దాడి చేసింది ఏమో అని అంటున్నాడు.నగరం విస్తరణలో భాగంగా వాగులోని నీళ్లు అన్ని తోడేశారు.వాగులోని ఇసుకను కూడా తరలించారు అని కవి జింబో తీవ్రమైన ఆవేదనకు గురి అయినట్లుగా తోస్తుంది. వాగు కింద వేల ఎకరాల పొలాలకు నీళ్లు పారేవి. అట్టి వాగు ఎన్నో గ్రామాలకు త్రాగు నీరుగా ఉపయోగపడేది.వాగు ఇసుకతో ఎంతో మంది గ్రామాల జనాలు ఇల్లు కట్టుకున్నారు.అక్కడి జనాల బాగోగుల కొరకు తాగు నీరు మరియు సాగు నీరు కోసం ఉన్న వాగును నగరం వాళ్ళు వచ్చి నీళ్లను, ఇసుకను దోపిడీ చేయడం వల్ల వాగులో నీళ్లు లేవు. వాగులోని ఇసుకను తరలించి వాగు లేకుండా చేసిన స్థితిని,దుర్మార్గాన్ని,దోపిడిని ఎండగడుతూ కవి జింబో వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.
“అనగనగా
“ఓ చెరువుండేది
“ఎవరి కాంక్షకి బలయ్యిందో
“ఏమో –
“దాన్నిండా సర్కారు తుమ్మల్లా
“ఇండ్లు మొలిచాయి.
చెరువు అనేది నిశ్చలమైన మంచి నీటితో కూడిన చిన్న ప్రాంతం.ఇది ఒక నది లేదా ప్రవాహానికి భిన్నంగా ఉంటుంది.చెరువు సంస్కృతికి అనుకూలం.ప్రతి ఊరిలో చెరువులు ఉన్నాయి. చెరువు వద్ద బతుకమ్మ ఆటను ఆడుతారు.ఆట పూర్తి కాగానే ఊరి జనాలు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.చెరువులో వినాయకులను నిమజ్జనం చేస్తారు.పల్లెటూరి కల్పవల్లి చెరువు. పల్లెలో చెరువు మీదుగా పక్షులు ఒక వరుసలో ఆకాశంలోకి ఎగురుతాయి.చెరువును జలాశయం అని అంటారు.చెరువు మంచి నీరు నిలువ చేయు ప్రదేశం.చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరి కొన్ని చెరువులు అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి.చాలా గ్రామములలో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు.కొన్ని పెద్ద చెరువులు పంట పొలాలకు నీరు అందిస్తున్నాయి.పూర్వ కాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి చెరువులు త్రవ్వించారు.ఊర చెరువులు పశువులు కడిగేందుకు చాకలి వాళ్లు బట్టలను ఉతికేందుకు వినియోగిస్తారు.చెరువులు చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం,సూక్ష్మ ఇతర పోషక పదార్థాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.చెరువు మట్టి ఎర్ర చల్క,దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి,నేలల్లో సమపాళ్లలో గాలి,నీరు ఉండేట్లు చేస్తుంది.చెరువులు అనేక రకాల జీవులను సంరక్షిస్తాయి.చెరువుల వల్ల వ్యవసాయానికి నీరు దొరుకుతుంది.కొన్ని గ్రామాలకు చెరువు నీరే మంచి నీరు.చెరువు నీరును ఊరి జనాలు త్రాగుతారు. కొన్ని చెరువులలో ఊరి ప్రజలందరు స్నానం చేస్తారు.చెరువులోని నీరు పక్షులకు,పశువులకు తాగడానికి స్నానం చేయడానికి,శరీరం చల్లబడడానికి ఉపయోగపడతాయి.వేసవికాలంలో పిల్లలు చెరువులో ఈత నేర్చుకుంటారు.చెరువుల దగ్గర భూమి సారవంతంగా ఉంటుంది.అనగనగా ప్రతి గ్రామంలో ఓ చెరువు ఉండేది.అన్ని గ్రామాల్లో చెరువులు మాయమై పోయినాయి.చెరువు మీద చెరువు కట్ట చక్కగా చూపరులకు కనువిందు చేసేలా ట్యాంక్ బండ్ లాగా అగుపిస్తుంది.చెరువు నిండా నీటితో పక్షులతో కళకళలాడుతుండేది.చెరువు నీరు రైతులు తమ పొలాలకు పారించి అద్భుతమైన పంటలు పండించే వారు.ప్రతి గ్రామంలో చెరువు ఉండేది.వర్షాలు లేక కరువు కాటకాలతో గ్రామాల్లో చెరువులు ఎండి పోయాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన చెరువు కింద భూములు బీడుపోయాయి.పశువులు మేత లేక కబేళాకి వెళ్ళి పోయాయి.చెరువు ఎండిపోవడం వలన కొందరు కబ్జాదారులు చెరువు కింద ఉన్న గ్రామస్తుల భూమిని స్వార్థంతో కబ్జా చేసి ప్లాట్లు చేసి ఇళ్ల స్థలాలకు అమ్మేశారు.కబ్జాదారులకు స్వార్థపర రాజకీయ నాయకులు మరియు అధికారుల అండదండలు ఉన్నాయి.కబ్జాదారులు పెట్రేగి పోయి చెరువు స్థలాలను స్వాధీనం చేసుకొని అక్రమంగా అమ్మడం వల్ల చెరువు స్థలంలో ఇండ్లు ఏర్పడ్డాయి. చెరువు ఎండి పోతే ఏం జరుగుతుంది?చెరువు స్థలంలో సర్కారు తుమ్మలు మొలవడం ఆనవాయితిగా జరుగుతుంది.కాని ఇప్పుడు కబ్జాదారుల కాంక్ష వల్ల చెరువులు బలి అయిపోవడం జరిగింది.చెరువులో ఉండాల్సిన సర్కారు తుమ్మల స్థానంలో ఇల్లు మొలిచాయి. సమాజంలో కబ్జాదారుల కుట్రలకు అనుగుణంగా వారికి గల రాజకీయ నాయకుల,రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో చెరువులు మాయమై పోవడం వింతైన విషయం ఏమీ కాదు.ఈనాటి సమాజంలో గ్రామస్తుల జీవన ఆధారమైన చెరువు మాయమైపోవడం చూసి ఆవేదనతో కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా
“ఓ ఇల్లుండేది
“ఎందరి స్పేస్ ప్రాబ్లమో
“ఏమో –
“దాని గుండె బరువుకు మించి
“ప్లాట్లు కట్టారు.
ఒక ఇల్లు మానవుల నివాసానికి ఉపయోగించే నిర్మాణం.ఇల్లుని గృహం అని కూడా అంటారు.ఇల్లు మనం నివసించే ప్రదేశం.ఇల్లు అనేది ప్రజలు నివసించే భవనం.ఒకే కుటుంబమునకు చెందిన వ్యక్తులు కాపురము ఉండిన దానిని ఇల్లు అని అంటారు.ఇల్లు గాలి,వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది.కవి అనగనగా అని చెబుతూ ఓ ఇల్లు ఉండేది.రోజులు గడుస్తున్నాయి.కుటుంబం పెరిగింది.ఆ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులకు నివాసం ఉండటానికి ఆ ఇల్లు ఇరుకుగా ఉండి సరిపోవటం లేదు.ఆ ఇంటిలోని వ్యక్తులు ఆ జాగలో అపార్ట్మెంట్ కట్టి అగ్గిపెట్టెలాగా ఒక దాని మీద ఒకటి బహుళ అంతస్తుల నిర్మాణం చేసి ప్లాట్లు కట్టారు.ఎప్పుడో కట్టిన ఆ పాత ఇంటికి కూడా గుండె ఉంటుంది అని ఆ ఇల్లుకు గుండెకు బరువు మించిన ప్లాట్లు కట్టారని ఆ ఇల్లు తన స్వగతం చెప్పినట్లుగా కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ వూరుండేది
“ఎవరి కండ్లు పడ్డాయో
“ఏమో –
“ఊరు మాయమైపోయింది.
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది,పట్టణం కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం.కవి జింబో అనగనగా అని చెబుతూ ఓ ఊరు ఉండేది అని అంటున్నాడు.మరి ఆ ఊరి సంగతులు కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.ఇవ్వాళ పట్టణాల్లో నివసించే వాళ్లంతా ఏదో ఒక ఊరికి చెందిన వారే.పాడి పంటలతో కళకళలాడుతున్న ఊరు కరువు బారిన పడింది.ఆరుగాలం కష్టం చేసి పంట పండించిన రైతులు సంవత్సరాల తరబడి కరువు రాజ్యం ఏలుతుంటే బతుకు గడవక ఊరిని విడిచి వలస బాట పట్టారు.ఊరి జనాలు తిండి లేక పస్తులతో ప్రాణాలు తీసుకోరు కదా! ఊరి జనాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడో ఒక చోట బతుకు సాగుతుందనే ఉద్దేశంతో వలసలకు పాల్పడ్డారు.అన్నమో రామచంద్ర అని జనాలు కడుపు చేత పట్టుకొని ఊరు విడిచి వలస బాట పట్టినారు.కరువు కాటకాలు ఒక వైపు,స్వార్థపూరిత రాజకీయ నాయకుల అనైతిక చర్యల వల్ల ఊరిలో ఉండాల్సిన జనం ఊరు విడిచి వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.కవి జింబో అనగనగా ఓ ఊరు ఉండేది అని చెప్పిన భావంతో కవితకు ప్రాణం పోశారు.ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల మరియు ప్రకృతి ప్రకోపం వల్ల మానవాళికి శాపంగా మారి ఊరి జనాలు గ్రామం విడిచి వెళ్లారు.పాడువడిన ఊరు దుస్థితిని తలుచుకుంటే కళ్ళనుండి కన్నీరు ఊబికి వస్తుంది. ఎవరి కన్నులు పడ్డాయో ఏమో ఊరు మాయమైపోయింది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ కోడి వుండేది
“అది ఉదయాన్నే నిద్ర లేపడం
“ఎవరికి నచ్చలేదో
“ఏమో –
“దాని గొంతు నొక్కేశారు.
కోడి ఒక పెంపుడు పక్షి.కోడిని ఆహారం కోసం ఇళ్లలో పెంచుకుంటారు.కోడి గుడ్లు,కోడి మాంసం ఆహారంగా తీసుకుంటారు.మగ కోడిని కోడిపుంజు అని ఆడ కోడిని కోడిపెట్ట అని అంటారు.కోడి ఉదయాన్నే లేచి తన గూటి నుండి కొక్కరోకో అని కూస్తుంది.కోడి కూయగానే ఊరిలోని జనాలు తెల్లవారుతుందని నిద్ర నుండి లేస్తారు.పట్టణాల్లో అయితే కోడి ఇళ్లలో ఉండదు.కోడి కూత విన రాదు.చదువుకునే పిల్లలు మరియు ఉద్యోగానికి వెళ్లే పెద్దలు అలారం పెట్టుకుంటారు.అలారం మోగ గానే నిద్ర నుండి లేస్తారు.ఊరిలో కూడా పట్టణ సంస్కృతి వచ్చింది. బాయిలర్ కోళ్ల పెంపకం పెరిగింది.చికెన్ సెంటర్ కి వెళ్లి చికెన్ కొంటున్నారు.పూర్వకాలంలో అలారం వలె పని చేసి ఉదయాన్నే నిద్ర లేపే కోడిని ఎవరికి ఇష్టం లేదో ఏమో దాని గొంతు కూడా నొక్కేశారు అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజం చెబితే నిష్ఠురంగా ఉంది అంటారు.కోడి కూతతో నిద్ర లేచి రైతులు తమ వ్యవసాయ పనులకు వెళుతారు. రైతులు పొలానికి మరియు పెరట్లో చేనుకు నీళ్లు పారిస్తారు.పొద్దున నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కోడి కూస్తే నిద్ర చెదిరిపోతుందని కోడిని లేకుండా చేసే దుర్మార్గపు సంస్కృతి మనకు ఎల్లెడలా కనిపిస్తుంది.కోడి గొంతు నొక్కేశారు అని కవి జింబో కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ సంస్కృతి వుండేది
“ఏ పడమటి గాలి కాటేసిందో
“ఏమో –
“అది శిల్పారామంలో అవశేషమై పోయింది.
ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు సంస్కృతిలోకి వస్తాయి.ఈ సంస్కృతికి హద్దులు లేవు.అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానం అన్ని కలిపి సంస్కృతి అంటారు. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు,వస్త్రధారణ,ఆటలు,విశ్వాసాలు, కళలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి.గతించిన కాలం గురించి,భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి.ఒక సమాజం చేసిన,వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు,వారి సంగీతం,కళ,జీవన విధానం,ఆహారం,శిల్పం,చిత్రం,నాటకం,నాట్యం, సినిమా ఇవన్ని ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం,సంపన్నత,జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావించబడతాయి. తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న వినాయక చవితి, ఉగాది,ఏరువాక,అట్లతద్ది,భోగి, సంక్రాంతి,కనుమ, బోనాలు,బతుకమ్మ,దీపావళి,గ్రామదేవతల పూజలు.తెలంగాణ భాషలోని యాస సొగసులు, కట్టు బొట్టులలో సంస్కృతి విలువలు ఉన్నాయి. ఊరి వారి పిలుపులో బంధుత్వాలు,అనుబంధాలు ఉన్నాయి.ఇక్కడి రైతులు,వృత్తి కార్మికులు చాలా ప్రతిభావంతులు.మానవతా విలువలకు దర్పణాలు. తెలంగాణ పల్లెలు సంస్కృతికి పట్టుకొమ్మలు.ఇక్కడ నివసించే ప్రజలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఊరి కింద చెరువులో నీళ్ళు ఊరి వాగులో నీళ్లు తాగి జీవించే వారు.కుమ్మరి కుండలు తయారు చేస్తాడు.కమ్మరి ఇనుప వస్తువులు తయారు చేస్తాడు.వడ్రంగి కర్ర పని చేస్తాడు.బతుకమ్మ పండుగలో ఆట పాట ఉంది.ఊరి వారంతా చెరువు దగ్గరకు చేరి బతుకమ్మ ఆడుకునే వారు.కుండను దేవుడుగా పూజించే సంస్కారంతో కూరాడును ఇంటిలో నిలుపుకుంటారు.గిర్నీలు లేని కాలంలో వడ్లను దంచి బియ్యం తీసేవారు.రోట్లో వడ్లను పోసి కుందెన పెట్టి రోకలితో దంచే వారు.రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజును సాగువాటు అంటారు. రైతులు జీవితంలో భాగంగా నాగలి కట్టి మొక్కుకుంటారు.ఎద్దుల్ని బాగా కడిగి కొమ్ములకు నూనె రాస్తారు.దేవుడిని మొక్కుకుంటారు. సాగువాటును రైతులు శుభకార్యంగా చేసే వారు. చెరువు పంటలకు నీరు అందించేది.ఊరిలోని బర్రెలు ఒకసారి చెరువులో మునిగేవి.ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి.మంచి చెడ్డలు పంచుకునే సంస్కృతి అంతరించి పోతుంది.ఊరి జనాలు రాత్రంతా మెలకువగా ఉండి నాటకాలు చూసే వారు. రాత్రంతా ఆడే ఆటలతో పాటలతో విలసిల్లిన పల్లె సంస్కృతి మాయమైపోతుంది.కుటుంబ సభ్యులు ఎవరికి వారే విడిపోతున్నారు.శిల్పారామం హైదరాబాదులోని మాదాపూర్ గ్రామంలో తెలంగాణలో ఉంది.సాంప్రదాయ భారతీయ చేతి పనుల పరిరక్షణకు వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో ఈ గ్రామాన్ని రూపొందించారు.ఏడాది పొడవునా రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్ హబ్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సంప్రదాయం సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది.భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయబడింది.అనగనగా అని చెబుతూ ఓ సంస్కృతి ఉండేది.ఆ సంస్కృతి ఏమైంది? ఇప్పుడు ఆ సంస్కృతికి సంబంధించిన వాతావరణం మరియు రూపురేఖలు ఎక్కడ కనబడడం లేదు.అట్టి ఘనమైన సంస్కృతి ఎక్కడినుండో తుఫాను వలె దూసుకు వచ్చిన పడమటి గాలి కాటుకు గురై పోయింది ఏమో అని అంటున్నాడు.మన ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయం యొక్క వారసత్వం శిల్పారామం లోకి చేరిపోయింది అని ఆవేదనతో కవి జింబో వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.
“అనగనగా …
“ఓ మనిషి ఉండేవాడు
“అతని మీద అతనికే కోపమొచ్చి
“తలని తీసి మానిటర్ ని
“తగిలించుకున్నాడు.
క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం.మన మనసుకి నచ్చక పోయినా లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారి పై మనకు కలిగే వ్యతిరేకతానుభూతిని,ఉద్రేకం లేదా కోపం అనవచ్చు.కోపం పర్యవసానంగా ఎదుటి వారిపై దాడి చేయటం,ఎదుటివారిని దూషించటం వంటి వికారాలు కలుగుతాయి.కోపం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపరచుకోవడం ఎంతైనా అవసరం.కోపం ప్రకృతి పరమైన సహజ ఉద్వేగం.ఇది జీవుల శరీర భౌతిక ధర్మం.నేల మీద మనుగడ సాగించే ప్రతి జీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చకునే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం.కోపం వచ్చినప్పుడు మనుషులు అరవటం,తిట్టడం,అవమానపర్చటం, చేయి చేసుకోవటం,దాడి చేయడం, పగులగొట్టటంతో పాటు మౌన పోరాటం,నిరాహార దీక్ష, అలగటం,సహాయ నిరాకరణ అలాంటి రూపాలతో కోపాన్ని చూపుతారు.కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమిష్టి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు బందులు,దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు,మానవహారాలు కూడా ఉంటాయి. అనగనగా అని చెబుతూ ఓ మనిషి ఉండే వాడు.మనిషి అంటే ఎవరు?మనిషి అంటే ఒక వ్యక్తి.ఎందుకో తెలియదు? కొన్ని సమయాల్లో మనిషికి తన మీద తనకే కోపం వస్తుంది.అలాంటి కోపంలో మనిషి తన తలను తీసి కంప్యూటర్లో గల మానిటర్ కు తగిలించుకున్నాడు.అప్పటి నుండి మనిషి మెదడు ఉన్నప్పటికీ ఆలోచించడం లేదు. మనిషి తయారు చేసిన కంప్యూటర్ లోని మానిటర్ చెప్పినట్టల్లా పని చేస్తున్నాడు.మానిటర్ అనగా కంప్యూటర్ స్క్రీన్ లేదా పదాలను చిత్రాలను చూపగలిగే పరికరం.అనంతమైన జ్ఞానం ఉన్నప్పటికీ మనిషి తన మెదడుతో ఆలోచించడం మానేశాడు. కంప్యూటర్లోని మానిటర్ కు తన తలను తగిలించుకున్నాడు అని కవి జింబో కవితలో వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ ఓ కల వుండేది
“ఏ పీడ కల దాన్ని కాటేసిందో
“ఏమో –
“కంప్యూటరే కలగంటుంది నేడు.
చాలా కలలు దృశ్యమానంగా ఉంటాయి.అంటే వాసన లేదా స్పర్శ వంటి ఇతర ఇంద్రియాలు, చిత్రాలు కలలలో ముందంజలో ఉంటాయి.నిద్రకు చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు అంటారు. కలలు యొక్క అంతరార్థం ఏమిటో వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాదు.కల నిజం కావాలని కోరుకుంటాం.కాని ఆ కల జరిగే అవకాశం ఎక్కువ లేదు.మనలో చాలా మంది కునుకు తీయడం ప్రారంభమైన కొద్ది సేపటికే ఏవేవో కలలు వస్తుంటాయి.ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు,వింతలు,విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కలలు కనడం రాత్రంతా జరుగుతుంది.మనం నిద్ర పోయే ముందు ఏమి ఆలోచిస్తామో లేదా మేల్కొన్న సమయంలో మనం చేసిన పనుల ద్వారా కల ప్రభావితం అవుతాయి.మరి కొందరికి పీడ కలలు వస్తుంటాయి.పీడ కల రాగానే నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు.పీడ కలలు భయానకంగా లేదా కలవర పెట్టే కలలు.దాదాపు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సారి పీడ కలను కని ఉంటారు.పీడ కలలు రావడానికి కారణం అంటూ ఉండదు.భయానకంగా ఏదో చూడటం లేదా చదవడం,నిద్రలేమి,అనారోగ్యంతో ఉండటం, మరణం,శారీరక హింస,వెంబడించడం,వేటాడటం వంటి కారణాలు ఈ పీడకలలకు మూలం.కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలోని భాగం ఈ కలలు సాధారణంగా నిద్రపై ఎటు వంటి ప్రతికూల ప్రభావాలను చూపవు.అనగనగా అని చెబుతూ ఓ కల ఉండేది అని అంటున్నాడు.మనిషి నిద్రలో కల కనడం సహజమే.మనిషి నిద్రలో ఉండగా కలను ఏ పీడ కల వచ్చి కాటేసిందో ఏమో అని అంటున్నాడు. కలపై పీడ కల దాడి చేయడం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.రోజులు మారాయి.కాని మనిషి ఇప్పుడు కల కనడం మానేశాడు.మనిషి ఎందుకు కల కనడం మానేశాడు అనే ప్రశ్నలు మనకు తలెత్తవచ్చు.ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి తయారు చేసిన కంప్యూటర్ కల గంటుంది.కంప్యూటరే మనిషిలా పని చేస్తుంది. మనిషి మాత్రం కంప్యూటర్ వచ్చినంక కలలు కనడం మానేశాడు అనే వాస్తవాన్ని లోకంలో జరుగుతున్న తీరును తెలియజేయడం అద్భుతంగా ఉంది.నేటి ఆధునిక కాలంలో కంప్యూటరే కల గంటుంది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ కథ వుంది
“వినే నాథుడే లేడు.
కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ.కథ అనగా కల్పిత గద్య గ్రంధం.మన రాష్ట్రంలో చిన్న పిల్లలు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్న కథలు చెప్పడం బాగా అలవాటు.కథ ప్రకృతి అయితే కత వికృతి.జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతిలో నింపి పదే పదే వినాలనిపించేది, చదవాలనిపించేది గొప్ప కథ.ఎవరైనా లేనిది కల్పించి మాట్లాడితే కతలు చెప్పకు అంటాం.కల్పిత వృత్తాంతం కలిగినది కథ.అనగనగా అని చెబుతూ ఓ కథ ఉంది అని అంటున్నాడు.మనిషి జీవితంలో వేగం పెరిగింది.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైనాయి.వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి. ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.ఎవరి సెల్ ఫోన్ వారిదే.ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత కుటుంబాల్లో పెద్ద వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు గా ఉంటున్నారు. వాళ్లు తమ పిల్లలతో గడిపే సమయం తక్కువ. తక్కువ సమయంలో కథలు చెప్పే ఓపిక వాళ్లకు లేదు.కథలు చదివే వాళ్ళు కూడా తగ్గిపోయారు.ఒక రచయిత ఇంకో రచయిత రాసిన కథలు చదవడం లేదు.ఎవరి కథలు వారే రాసుకుంటున్నారు.కథ చెబితే వినే నాథుడే లేడు.కుటుంబంలో కూడా ఒకరి మాట ఒకరు వినడం లేదు.ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వారు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటారు.ఒకరి గదిలోకి ఇంకొకరు వెళ్ళరు.ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం అరుదు.సెల్ ఫోన్ తో జీవితాలు గడుపుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్ లో గేములు ఆడుతున్నారు. పెద్దలు సెల్ ఫోన్ ద్వారా కాలక్షేపం చేస్తున్నారు బంధువులు,ఇరుగు పొరుగు వారితో కలవడం కూడా తగ్గిపోయింది.అనగనగా ఒక కథ ఉంది.కథ వినే నాథుడే లేడు అని కవి జింబో కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.కవి జింబో మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అనిశెట్టి రజిత కవిత్వం కొత్త సొబగులతో శోభిస్తున్నది.
*ప్రయాణం కవిత.
*మా నాన్నే విశాల ప్రపంచం కవిత.
*ఊరు బంధం కవిత.
అనిశెట్టి రజిత ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.
కవయిత్రి, అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన
కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ప్రయాణం కవిత పై విశ్లేషణా వ్యాసం.ప్రయాణం కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.ఏదేని ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లడం ప్రయాణం.సుదూర భౌగోళిక ప్రాంతాల మధ్య ప్రజల కదలిక ప్రయాణం.జీవితాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి చేసే ప్రయాణం, మతపరమైన తీర్థ యాత్రల కోసం చేసే ప్రయాణం. మిషన్ యాత్రల కోసం చేసే ప్రయాణం.ఇవి అన్ని ప్రయాణం కిందికి వస్తాయి.ఏదైనా ప్రక్రియ లేదా పురోగతి ప్రయాణంతో పోల్చబడుతుంది.ప్రయాణం ముఖ్యంగా ఇబ్బందులు లేదా వ్యక్తిగత అభివృద్ధిని కలిగి ఉంటుంది. కవయిత్రి రజిత ప్రయాణం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? అయితే కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నీ చేతులకు రెక్కలు తగిలించుకొని
“నీ రెక్కల్ని ముక్కలు చేసుకుంటూనే
“శకలాలను మళ్లీ బతికించుకుంటూ
“బతుకులోకి భరోసాగా ఎగిరిపోతూ ..
ఎవరి ఆందోళననైనా తగ్గించడానికి ఉద్దేశించిన సలహా ఓదార్పు మాటలు భరోసా.మనిషి జీవిత ప్రయాణంలో తన చేతులకు రెక్కలు తగిలించుకొని ఆరుగాలం తన రెక్కల్ని ముక్కలు చేసుకుంటూ కష్టపడి శ్రమిస్తాడు.మనిషి తన బతుకు పోరాటంలో తన శరీరంలోని రెక్కలతో పాటు మిగిలిన అవయవాలను కూడా బతికించుకుంటాడు.మనిషి గడుపుతున్న జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుంటూ గుండె నిబ్బరంతో తనకు తానే ఓదార్చుకుంటాడు.మనిషి తన శరీరంలో గల అన్ని అవయవాలను రెక్కలను కాపాడుకుంటూ ఆకాశంలో విహరించే పిచ్చుక వలె ఎగిరిపోతూ స్వేచ్ఛగా తన జీవిత ప్రయాణం కొనసాగిస్తాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నీలోని మనో వికారాలను బయటికి చిమ్మేసి
“నీ మనో వికాసాలను ఎగదోసి నవ్వేసి ..
మనిషి మనసులో ఉత్పన్నమైన భావన మనో వికారంగా చెప్పవచ్చు.మనిషి తన మనసులో చెలరేగే భావాలను బయటికి ఊడ్చి చిమ్మేస్తేనే శుభ్రంగా ఉంటుంది.మనిషి తన మనో భావాలను నియంత్రణ చేయడం చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు.విద్య,వైద్యం,విజ్ఞానం,మనోవికాసం కోసం పుస్తక పఠనం ఎంతో ముఖ్యం.పుస్తక పఠనం వలన మనో వికాసం కలుగుతుంది.మనిషి తనలో కలిగే మనో వికాసాన్ని వ్యక్తం చేస్తూ నవ్వుతూ జీవిత ప్రయాణాన్ని సాగించాలి అంటూ కవయిత్రి స్ఫూర్తిని పొందేలా చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జీవితం నిత్య ప్రయాణమే
“దారి పొడుగునా మజిలీలే ..
జీవితం అనేది మనిషి కొనసాగిస్తున్న జీవనం మరియు అతని ఉనికిని తెలియజేస్తుంది.జీవితం అనేది మనిషి సాగించే ప్రతి రోజు ప్రయాణంగా చెప్పవచ్చు.మనిషి తాను చేస్తున్న ప్రయాణంలో దారి పొడుగునా ఎన్నో అడ్డంకులు,ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగి పోవాలి.మజిలీ అంటే మార్గ మధ్యంలోని తాత్కాలిక నివాసం, మకాముగా చెప్పవచ్చు.మనిషి చేస్తున్న జీవన ప్రయాణంలో మజిలీ ముఖ్యమైనది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“విసుగే గాని విరామం లేని అడుగులు
“తీరీ తీరని కలలకు పట్టే గొడుగులు ..
మనిషి సాగించే జీవిత ప్రయాణంలో విసుగు ఉండవచ్చు.కానీ విరామం ఉండదు.మనిషి చేస్తున్న ప్రయాణంలో తాను వేస్తున్న అడుగులు గమ్యస్థానం వైపు సాగుతూ ఉంటాయి.మనిషి తన కోర్కెలను తీర్చుకోవడానికి ఒక్కో అడుగుతో ప్రయాణం మొదలు పెడతాడు.తీరీ తీరని కలలు సాకారం చేసుకోవడానికి మనిషి తన తోటి వారితో సంయమనంతో మెలగాలి.మనిషి తోటి వారు అందించే సాయంతో తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆనందంతో ముందుకు సాగుతుంటాడు అని చెప్పిన భావం చక్కగా ఉంది.
“కోర్కెలను పొదుముకున్న ఊహలు
“ఆ ఊహలకు మొలిచే వ్యూహాలు ..
కోరిక అనగా ఏదైనా వస్తువు,పదార్థం లేదా వ్యక్తికి కావాలని అనిపించడం.కోరిక అనేది బలమైన భావన.కోరికలను తీర్చుకోవడానికి ఏదైనా సాధించడానికి భావం తోడ్పడుతుంది.విజయం కోసం మనిషికి కోరిక అవసరం.ఆసక్తి కలిగి ఉండటం,ఇష్టం కలిగి ఉండటం కోరిక.ఏ పనినైనా చేయడానికి మనసులో కలిగే ఆశ కోరిక.దేనిపైనైనా ఏకాగ్రత చూపించడం కోరిక.ఊహ అనగా ఒక రకమైన ఆలోచన.ఊహ మనిషి మనసుకి గోచరించే ఒక దృశ్యం.ఊహ ఒక దృక్పథం,దానిని ధ్యానంతో అనుసంధానిస్తుంది.ఊహ అనేది తనకు తానుగా తెలియజేసే అనుభూతుల భావాలు మరియు ఆలోచనల ఉత్పత్తి.ఈ అనుభవాలు ఊహా జనిత మార్పులతో కూడిన స్పష్టమైన జ్ఞాపకాలు.కల్పనకు శిక్షణ ఇచ్చే మార్గం కథ చెప్పడం,వినడం.వ్యూహం అనేది ఒక కళ.వ్యూహం అనేది ఒక పనిని సాధించడానికి ఏర్పాటు చేసుకునే ప్రణాళిక.మనిషి కోరికలను తనలోకి ఆహ్వానిస్తూ స్వాగతిస్తున్న ఊహలను మనం చూడవచ్చు.అట్టి ఊహలకు రూపుదిద్దే వ్యూహాన్ని అనుసరించి నిర్దిష్టమైన ప్రణాళికలతో మనిషి ప్రయాణం ముందుకు సాగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“తొడుగుల్లోని తోలుబొమ్మలాటల్లా
“రంగుల దేహాల్లోంచి నటనలు ..
తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోను,పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషలో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రక రకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు.కదులుతున్న ఆ జీవం లేని బొమ్మలతో జీవ నిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నటన అనేది నటి లేదా నటుడు చేయు పని.ఇది నటన, రంగస్థలం,సినిమా,దూరదర్శన్ లేదా కథా కాలక్షేపాలతో ఒక వ్యక్తి మరొకరిని అనుకరించడం. నటన అనేది బహుళ ప్రాచుర్యం పొందిన కళ. నటులకు ఉండవలసిన లక్షణాలు మూడు. అంగికము అందమైన రూపం.వాచకం మంచి కంఠస్వరం.అభినయం హావ భావాలతో ప్రేక్షకులను ఆకర్షించుకోగల సామర్థ్యం.తత్వవేత్తలు మనిషిని ఒక నటుడిగా ఈ ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా పోలుస్తారు.నటన అనేది బాగా అభివృద్ధి చెందిన ఊహ.భావోద్వేగ సౌలభ్యం,శారీరక వ్యక్తీకరణ, ప్రసంగం యొక్క స్పష్టత,విస్తృతమైన నైపుణ్యాలను కలిగి ఉంటుంది.తొడిగించిన తోలుబొమ్మల ఆటల వలె మనిషి జీవిత ప్రయాణం కొనసాగుతున్నది. మనిషి రంగురంగుల దేహాలతో కూడిన నటనలు కొనసాగుతున్నాయి.కొంత మంది మనుషులు నిజ జీవితంలో కూడా నటిస్తుంటారు.దీని మూలంగా ఆత్మవంచనతో వీరు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు.మనిషి జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే.మనిషి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగాలి.నటనతో మనిషి విలక్షణంగా తన ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ మూడు నాళ్ళ జీవితానికి నటనలు మనిషికి అవసరమా? అనిపిస్తుంది.నటనలు మనిషి బతుకులో భాగమయ్యాయి.కావాలని నటనలు చేయడం వల్ల జీవితం యొక్క లక్ష్యం మాయతో మోసంతో తీర్చిదిద్దబడుతుంది.నటన కొరకు మనిషి బతుకును కొనసాగించవద్దు.నటనలతో తమ తోటి వారిని మోసగించవద్దు అని చెప్పిన భావం అద్భుతంగా ఉంది. .
“లోలోంచి ఒక నేపథ్య సంగీతం
“అపస్వరంలోనో సప్త స్వరాల్లోనో గీతం ..
సంగీతం సుప్రసిద్ధమైన కళలలో ఒకటి.సంగీతం ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం,తాళం,పల్లవి మొదలైనవి.సంగీతం శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది.ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. భారతీయ సంగీతంలో సప్త స్వరాలు స,రి,గ,మ,ప,ద,ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది. ‘స’షడ్జమము,‘రి’ రిషభం,’గ’ గాంధారం,’మ’ మధ్యమము, ’ప’పంచమం,‘ద’ దైవతం,’ని’ విషాదం అని సప్త స్వరాల పేర్లు.సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. మనిషి గుండె లోతుల్లో ఒక నేపథ్య సంగీతం మేళవించి ఉంది.మనిషి పాడే పాట స్వరబద్ధంగా లేక ఒక్కోసారి అపస్వరంగా వినిపించవచ్చు.మనిషి లోపల నుండి ఒక్కోసారి సప్త స్వరాలతో కూడిన గీతం వెల్లువలా ఉబికి వస్తుంది.జీవితమన్నాక మనిషి పాడే పాట ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. సంతోషంగా ఉన్నప్పుడు పాడిన పాట స్వరబద్ధంగా ఉండి రంజింప చేస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఆగేదెక్కడో ఆగేదెప్పుడో పరుగులు
“చిక్కులు బడ్డ సహజీవన తంత్రులు ..
తంత్రులు అంటే స్ట్రింగ్స్ అనుకోవచ్చు.ముడులు వేసిన కిరణాలు అని అర్థం.కిరణాలు అంటే తంత్రులు.కిరణాలను తంత్రులతో పోల్చడం.తంత్రి అంటే తీగె,వీణ మొదలైన వాయిద్యాలు.తీగెలను తంత్రులు అంటారు.సితార్ యొక్క తీగలాగా ఉండేది తంత్రి.సహజీవనం అనేది పెళ్లి కాకుండానే యువతీ యువకులు కలిసి జీవించడం.ఇది పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది.సహజీవనంపై హద్దులు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.ఇవి స్నేహం వరకు లేదా శారీరక సంబంధం వరకు కూడా ఉంటాయి.సహజీవనం ఇరువురి అంగీకారం పై ఆధారపడి ఉంటుంది. సహజీవనం వివాహం కాని వ్యక్తులు సాధారణంగా జంటలు కలిసి జీవించే ఏర్పాటు.సహజీవనంలో వారు తరచుగా దీర్ఘకాలికంగా లేదా శాశ్వత ప్రాతిపదికన శృంగార లేదా లైంగిక సన్నిహిత సంబంధంలో పాల్గొంటారు.మనిషి కొనసాగిస్తున్న ప్రయాణంలో పరుగులు ఆగేది ఎప్పుడో,ఆగేది ఎక్కడో తెలియదు.ఆనందంగా కలిసి సహజీవనం సాగిస్తున్న జంటలు అభిప్రాయ భేదాలు ఏర్పడి తంత్రులు చిక్కుబడ్డ వీణలా బాధలకు లోనవుతారు.చిక్కుల్లో చిక్కుకున్న బంధం ఇరువురు మధ్య సాగుతున్న సహజీవన ప్రయాణంలో ఆగేది ఎక్కడో ఆగేది ఎప్పుడో అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“విధి విసిరే వియోగ గాలం
“తీరం చేరనివ్వదు తిరగబడ్డ కాలం ..
విధి తప్పకుండా జరగబోవు సంఘటన.విధిని ఎవ్వరు మార్చలేరు అంటారు.ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీరు చేయవలసిన పనిని చేయడం విధి. చేపలు పట్టడానికి ఉపయోగించే సాధనం గాలం. మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ధి పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.
మనకు ఇష్టమైన వ్యక్తి దూరమైనప్పుడు అనుభవించే బాధ వియోగం.ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తులు దూరం కావడం వియోగం.తీరం అనగా సాగర తీరం,నదీ తీరం,తీర ప్రాంతం.భూమి సముద్రంలో కలిసే తీర ప్రాంతంగా నిర్వచింపబడింది. తీరాలు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి దృశ్యం యొక్క స్థలాకృతి, అలల వంటి నీటి ప్రేరిత కోత ద్వారా ప్రభావితం అవుతాయి. కాలం అనగా సమయాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరుచుటకు ఉపయోగించే పదం.గడియారం తెలిపేది కాలం.ఏదైనా పని చేయుటకు ఇచ్చు సమయం కాలం.నిమిషాలు గంటల గురించి చెప్పబడేది కాలం.ఆగమన్నా ఆగనిది కాలం.విధి చేస్తున్న మాయాజాలం తప్పకుండా జరగబోవు సంఘటనను మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి వియోగం అనే గాలానికి చిక్కి విలవిలలాడుతాడు.సముద్రంలోని అలలు తీరం చేరాలని తహతహలాడుతుంటాయి.కాలం ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు.కాలం ఎదురు తిరిగినప్పుడు మనిషి బాధను అనుభవిస్తాడు.సముద్రంలోని అలలను తీరం చేరనివ్వకుండా ఏదో ఒక శక్తి ఆపుతున్నది.విధి రాత వల్లనే వియోగం ఏర్పడింది అని మనిషి తెలుసుకుంటాడు.ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో ఎడబాటు కలుగుతుంది.తీరం చేరని అలల ప్రయాణంలాగే తిరగబడ్డ కాలం వల్ల విడిపోవటాలతో ఒడిదుడుకుల ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఒంటరి మనిషిగా సమూహంలోకి
“సమూహంలోనే ఒంటరిగా నిలిచి ..
ఏకాంతం అంటే కోరుకుని,కావాలని ఒంటరిగా ఉండటం.ఒంటరితనం అంటే ఏకాంతంగా ఉండటం. ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఏకాకి అని లోకులు అంటారు.ఒక లక్ష్యం కోసం ఒక పథకం కోసం ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం జన సమూహం నుంచి ప్రవాహ వేగం యొక్క సుడుల జడుల నుంచి పక్కకు జరిగి విడిగా ఉండటాన్ని ఏకాంతం అంటారు.మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు.మనిషి పోయేటప్పుడు ఒక్కడిగానే పోతాడు.ఈ నడుమ మనిషి గడిపే జీవితమంతా పది మందితో ముడిపడి ఉంటుంది.సమాజంలోకి వచ్చాక మనిషికి ఎందరి అవసరమో సహకారమో కావాల్సి ఉంటుంది.సమాజంలో ఎంతో మందితో ఆత్మీయంగా మెలగవలసి ఉంటుంది.వెలుగు నీడల్లా మిట్టపల్లాల దారిలా ఆటుపోటుల సముద్రంలా కష్టసుఖాలను అనుభవించ వలసి వస్తుంది.కొందరు ఊహల్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉంటే అక్కడ ఎవరు బాధపెట్టరు.ఎవరు మోసం చేయరు.ఎవరు అవమానించరు. నిజానికి ఒంటరిగా ఉండడమే మంచిది.ఒంటరిగా ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకుంటాం.మన గురించి మనం ఆలోచించుకుంటాం.సమూహంలో అంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు. కొంత మంది జనాలతో ఉండటానికి ఇష్టపడరు. విశాల ప్రాంగణం అయినా సరే అందులో ఊపిరి సల్పనట్లు అనిపిస్తుంది.ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి.ఒంటరితనం పొందిన వ్యక్తి గుంపులో నివసిస్తున్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.ఒంటరి మనిషి ఒక్కోసారి ఏమీ తోచక సమూహంలోకి వెళతాడు. సమూహంలో ఉన్నప్పటికీ కూడా అతను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తాడు.జీవితం అనే ప్రయాణంలో ఒక్కోసారి మనిషికి ఏమీ తోచదు.అట్లాంటి సమయంలో కొంత సేపు ఒంటరిగా గడిపినట్లయితే స్వాంతన దొరుకుతుంది.ఒంటరితనంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి సానుకూలంగా ఆలోచిస్తాడు.అనుభూతి చెందుతాడు.తాను ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను ఒంటరిగా ఉన్నప్పుడు అందిపుచ్చుకుంటాడు. సమూహంలోని వ్యక్తుల మధ్య భిన్న అభిప్రాయాలు,భిన్న మనస్తత్వాలు చూసి సమూహంలోనే గడిపినప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు.మనిషి జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయి.మనిషి జీవితంలో ఒంటరితనం ఒక భాగం అనిపిస్తుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“తన్లాట ! వెతుకులాట ! వేట !
అన్నింటా వికటించే బతుకాట ..
మెరుగైన సమాజం కోసం మనిషి పడే తపన తండ్లాట.పసి పిల్లవాని కొరకు తల్లి పడే తపన తండ్లాట.ఆరుగాలం కష్టించిన అన్నదాత పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక బతుకు కొరకు పడే తపన తండ్లాట.చదువుకున్న వ్యక్తి ఉద్యోగం కొరకు పడే తపన తండ్లాట.ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్న యువతి తన భర్త వ్యసనాలకు బానిస అయితే అతని మార్చడానికి పడే తపన తండ్లాట.ప్రేమ పేరిట మోసగించిన ప్రియుడి గురించి తలుచుకొని బాధపడుతూ గడపడం తండ్లాట.ఏదేని ప్రత్యేకమైన వస్తువును పొందడానికి చేసే అన్వేషణ వెతుకులాట.మనిషి బతుకులో వెతుకులాట కూడా ఉంటుంది.మనిషి బతుకులో వేట కూడా ఉంటుంది. బతుకు గడపడం కొరకు తండ్లాట ఉంటుంది. బతుకును సాగించుట కొరకు వెతుకులాట ఉంటుంది.బతుకులో వేట కూడా ఉంటుంది. ఒక్కోసారి బతుకు పోరు సాగే ప్రయాణంలో ఎదురు తిరగడం కూడా ఉంటుంది అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి సంపూర్ణమయిన అల్పజీవి !
మనిషి బిక్కుబిక్కుమంటూ భయం భయంతో జీవనం సాగిస్తూ ఉంటాడు.మనిషికి అసాధారణమైన తెలివితేటలు ఉన్నప్పటికీ కొందరు మనుషులు భయస్తులుగా,పిరికితనంతో తమ జీవితాన్ని నెట్టుకు వస్తారు.భయం,పిరికితనం జాడ్యం అతనిని జీవించి ఉన్నన్ని నాళ్ళు వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది.మనిషి భయాన్ని,పిరికితనాన్ని వదిలిపెట్టాలి.ధైర్యంతో మనిషి కొండనైనా ఢీకొట్టే శక్తి తనలో ఉంది అనే జ్ఞానంతో మెదిలితే అతడు అల్పజీవి కాదు.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అనేది చిత్ర విచిత్రమైన డోలాయమైన పరిస్థితిని తెలియజేస్తుంది.మనిషి సంపూర్ణమైన అల్పజీవి అని వ్యక్తం చేసిన తీరు బాగుంది.
“చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి !
ఎడారి అనగా ఎటువంటి వృక్ష సంపద నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం.భూమిపై ⅓ వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సుల్లో నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. ఎడారులు జీవకోటి మనుగడకు సహకరించవని పేరుంది.ఎడారులు చాలా ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ వర్షపాతం మరియు కొరత లేదా వృక్ష సంపద లేని భూమి యొక్క బంజరు ప్రాంతాలు.ఎడారిలో పగటిపూట వేడిగా ఉంటుంది. రాత్రిపూట చల్లగా ఉంటుంది.చెమ్మగిల్లని కన్నులు ఉంటాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మనిషికి దుఃఖం పొర్లుకు వచ్చినప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎడారి భూముల్లో నీరు కనిపించదు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమిలా కన్నీళ్లు వేదనతో ఏర్పడి మనిషి సాగిస్తున్న జీవిత ప్రయాణంలో ఇంకిపోయినాయి. ఎడారి భూమిలో కళ్ళు చెమ్మగిల్ల కుండా ఉండే స్థితి వస్తుందా?అని మనలో మనకు సందేహాలు పొడచూపవచ్చు.చెమ్మగిల్లని కన్నుల్లాంటి ఎడారి భూమి అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ప్రయాణం సుదీర్ఘం !
జీవించడానికి మనిషి చేసే ప్రయాణం సుదీర్ఘమైనది. అట్టి ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనిషి ప్రయాణం విరామం లేకుండా నిర్విరామంగా కొనసాగుతుంది. మనిషి జీవన యానంలో సుదీర్ఘ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది అని కవయిత్రి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అనుభవం అత్యల్పం.
ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఆటు పోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. పనులు/విషయాలు చేయడం,చూడటం లేదా అనుభూతి చెందడం ద్వారా జ్ఞానం లేదా నైపుణ్యం పొందడం,నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం అనుభవం.పనులు చేయడం ద్వారా తెలుసుకొను భావన అనుభవం.ఏదైనా పనిని చేసి ఉన్న జ్ఞానంతో వచ్చినది అనుభవం.అనుభవం అనేది సాధారణంగా స్పృహతో కూడిన సంఘటనలను సూచిస్తుంది.మరింత ప్రత్యేకంగా అవగాహనలకు లేదా ఈ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆచరణాత్మకమైన జ్ఞానం మరియు పరిచయాన్ని సూచిస్తుంది. విశాలమైన అర్థంలో ఒక చేతన సంఘటనగా అర్థం చేసుకోబడిన అనుభవం వివిధ అంశాలను ప్రదర్శించేదిగా ఉంటుంది.అనుభవం అత్యల్పం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అయినా ప్రయాణం ఎడతెగనిదే
“కడుపు నిండా కష్టాలున్న కడలి లాంటిదే ..
మనిషి చేస్తున్న జీవన ప్రయాణం ఎడతెగకుండా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది.మనిషి సాగిస్తున్న ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి.బ్రతుకులోని కష్టాలతో, సముద్రంలోని ఆటుపోటుల వలె మనిషి జీవన ప్రయాణం కొనసాగుతుంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“తడి లేని మనసు గుహల్లోకి చొరబడి
“తొలుచుకుంటూ పోవాల్సిందే …!
మనస్సు అంటే అంతరంగం,మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం.మనస్సు అనేది తరచుగా అనుభూతి, అవగాహన,ఆలోచన,తార్కికం,జ్ఞాపకశక్తి,నమ్మకం, కోరిక,భావోద్వేగం మరియు ప్రేరణ వంటి మానసిక దృగ్విషయాలతో అర్థం చేసుకోబడుతుంది.మనలో భావోద్వేగాలు,అనుభూతులు,కోరికలు కలిగించేది మనసు.ఏదైనా వస్తువు లేదా జీవరాశి పై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం.మనిషి యొక్క భావాలు, అనుభూతులు,అభిప్రాయాలు వారి మనసు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది.మనిషి ప్రవర్తన,నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.మనిషి యొక్క గ్రహణ శక్తి,ఆనందం మరియు బోధ,నమ్మకం,కోరిక,ఉద్దేశం మరియు భావోద్వేగాలను అనుభవించడంలో మనసు కూడా ముడిపడి ఉంటుంది.తడి లేని మనసు గల వ్యక్తులు ఉంటారా? అనే సందేహం మనలో పొడచూపుతుంది.మనకు ఇష్టం ఉన్నా లేకున్నా తడి లేని మనసు గుహలోకి చొరబడి తొలుచుకుంటూ మనిషి తన జీవన ప్రయాణం కొనసాగించాల్సిందే.భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు.తడి లేని మనసు గుహల్లోకి చొరబడి తొలుచుకుంటూ పోవాల్సిందేనని మనిషి తన ప్రయాణం కొనసాగించాల్సిందేనని కవయిత్రి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అనిశెట్టి రజిత మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని మా నాన్నే విశాల ప్రపంచం కవిత పై విశ్లేషణా వ్యాసం.కవితను ఆసక్తితో చదివాను.కవిత నాకు నచ్చింది.కవితలోని భావాలు నన్ను ఆలోచింపజేశాయి.కవిత శీర్షిక పేరు మా నాన్నే విశాల ప్రపంచం.కవయిత్రి తండ్రిని విశాల ప్రపంచంతో పోల్చడం,ఆమెకు తండ్రి పట్ల గల అపారమైన ప్రేమను, అనురక్తిని తెలియజేస్తుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన ఈ రోజుల్లో తండ్రిని ఎంత మంది ప్రేమిస్తున్నారు? అనే సందేహాలు మనలో పొడచూపుతాయి. కవయిత్రికి తండ్రి పట్ల గల ప్రేమను వ్యక్తీకరిస్తూ కవిత రాయడం గొప్పగా ఉంది.ప్రపంచం అనగా విశాల విశ్వంలోని భాగం,జీవులు నివసించే ప్రదేశం.సాధారణంగా ప్రపంచాన్ని భూగ్రహంగా వ్యవహరిస్తారు.మా నాన్నే విశాల ప్రపంచం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించి కవితానుభూతిని పొందండి.
“మా నాయినమ్మకు మా నాన్న
“బంగారు కొండ
“మా తాతయ్యకు మా నాన్న
“కొండంత అండ
“మా అమ్మకు మా నాన్న
“నిండైన కుండ
“మా కేమో మా నాన్న
“ప్రపంచం నిండా ..
నాన్న తల్లిని నాయనమ్మ అంటారు.మా నాయనమ్మకు తన కొడుకు అయిన మా నాన్నను పంచ ప్రాణంగా భావించేది. నాయనమ్మ నవ మాసాలు మోసి పెంచిన తన కొడుకును ఆప్యాయంగా బంగారు కొండ అని పిలుస్తుండేది.నాయనమ్మ నాన్నను బంగారు కొండ అంత విలువైన వానిగా భావించేది. నాన్న తండ్రి తాతయ్య.మా తాతయ్యకు తన కొడుకు అయిన మా నాన్న కొండంత అండగా ఉండే వాడు.మా నాన్న కూడా తాతయ్య కనుసన్నులలో మెలుగుతూ చెప్పిన పనులు చేస్తుండే వాడు.తాతయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఎల్లవేళలా నాన్న అందుబాటులో ఉండే వాడు.నాకు మా చెల్లెళ్లకు ప్రపంచంలో మా నాన్నను చూసిన అనుభూతి కలిగేది.మాకేమో ప్రపంచం నిండారా నాన్న ఉన్నట్లు అగుపిస్తుండేది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఎన్ని కతలు ఎన్ని వింతలు
“విడ్డూరాలతో హాస్యపు జల్లులు
“లోకం తెలిపిన నాన్న చెప్పే
“విశేషాలు విషయాలూ వింటూనే
“లోకం పోకడలు తెలుసుకున్న వాళ్ళం.
కత అనగా సాహిత్య ప్రక్రియ.కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధం.చిన్న పిల్లలు నిద్ర పుచ్చడానికి కథలు చెప్పడం అలవాటు.ఏదైనా కొత్త విషయం,వస్తువు,అపురూపమైనది వింత.ఒకింత సంబ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం,వస్తువు, వింత.ఆశ్చర్యం కలిగించేటటువంటిది వింత. అసాధారణ మాటలు విన్నప్పుడు చూసినప్పుడు కలిగే భావన వింత. విస్మయము కలిగించే వస్తువు వింత.లోకం పోకడ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఎప్పుడు మారుతునే ఉంటుంది.మన తాతల తరంలో ఎలాంటి సదుపాయాలు,సౌకర్యాలు లేకుండానే జీవితాన్ని గడిపారు.మన తండ్రుల తరంలో కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.మన తరంలో ఇంకా కొన్ని సదుపాయాలు,సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఇప్పటి తరంలో చెప్పలేనంత మార్పు వచ్చింది.నేటి తరంలో అన్ని సౌకర్యాలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మనం చిన్నప్పుడు ఉన్నట్లు ఈనాటి మనుషుల్లో ఆత్మీయత, అనురాగం ఆప్యాయతలు కనిపించడం లేదని బాధ పడుతుంటారు.పాత తరం లాగా ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు.నేటి కొత్త తరంలో మనుషులు అంతా కొత్తగా వింతగా ఉన్నారు అంటే ఎలా? కొత్త తరం కొత్తగానే ఉంటుంది.ప్రతి వారు లోకం పోకడ బాగా లేదని వాపోతుంటారు.వర్తమాన లోకంలో మనము కూడా ఒక భాగమే అని అనుకోరు.మనం కూడా లోకంలో మార్పుకు కారణం అని మనకు తెలుసు.అయినప్పటికి పాత రోజులు తలుచుకొని ఎంతో ఆనందంగా గడిపాం అంటే ఎలా? ఇప్పటి మనం నివసిస్తున్న వర్తమానాన్ని ఆహ్వానిస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలి.నాన్న నిద్ర పోయే ముందు సాహస వీరుల కథలు చెప్పే వారు.ధైర్యాన్ని నూరి పోసే వారు.నాన్న వెంట బజారుకు వెళితే లోకంలో జరిగే ఎన్నో వింతలు చూపించే వారు.నాన్న లోకంలోని విడ్డూరాలు తెలుపుతూ నవ్వుల జల్లులు కురిపించే వారు.లోకం గురించి అన్ని విషయాలు నాన్న తెలుపుతుంటే విని ఆశ్చర్యపోయేవాళ్ళం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“నాన్నను చూసి మానవ సంస్కారం
“అలవర్చుకున్నాం
“నాన్న వల్ల సమాజాన్ని పరిచయం చేసుకున్నాం
“ఆడపిల్లలమైన మేము స్వేచ్ఛగా
“రెక్కలల్లార్చి విహంగించాం
“నాన్న ప్రజాస్వామికత వల్ల
“నిశ్చింతగా నియమబద్ధంగా ఎదిగాం …
సంస్కారములు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు.ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతం వివిధ దశలలో జరుపబడతాయి. వ్యక్తుల జననము,మరణము తదనంతరం ఆత్మ పరలోక శాంతి నొందు వరకు సంస్కారములు జరుపబడును.సంస్కారములు మొత్తము పదహారు.వీనిని షోడశ సంస్కారాలు అంటారు. సమాజం అంటే మానవులు కలిసి మెలిసి పరస్పర సహకారం అందించుకుంటూ సమిష్టిగా జీవిస్తూ ఉండే నిర్దిష్ట సమూహం.ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘంతో కూడిన నిర్దిష్ట సమూహాలు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని సూచిస్తుంది. వ్యక్తిగా సాధ్యమయ్యే దాని కంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలోని అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాల్లో పాల్గొంటారు.సమాజంలో ప్రజలు ఒకరికొకరు పరస్పర అనురాగం,ఆప్యాయతలను కలిగి ఉంటారు.నాన్న లోని గొప్ప సంస్కారం ఏమిటంటే పెద్ద వారిని చిన్న వారిని అందరిని తన వాళ్లుగా భావించి ఆప్యాయంగా పలకరించే గొప్ప సుగుణం ఉండేది.ఎవ్వరి పట్ల కూడా నాన్నకు ద్వేష భావం ఉండేది కాదు.ఎప్పుడు నాన్న పెదాలపై చిరునవ్వు విరబూసేది.నాన్నకు శత్రువులు, మిత్రులు అని తేడాలు ఉండేవి కాదు.అందరి పట్ల ప్రేమ,సమ భావంతో ఉండే వారు.పెద్ద వాళ్లు,పేద వాళ్లు కనబడ్డా వారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసే వారు.నాన్న సమాజంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. నాన్న వెంట నాతో పాటు చెల్లెలు కూడా పాల్గొనేది. నాన్న మమ్ములను ఆడ పిల్లలం అని మా పట్ల ఎలాంటి భేద భావం చూప లేదు.మేము ఆడ పిల్లలం అయినప్పటికీ మమ్ములను సమ దృష్టితో చూసే వారు.నాన్న చూపించిన ప్రేమ, అనురాగం, ధైర్యం,మొక్కవోని ఆత్మవిశ్వాసం మాకు అలవడింది.నాన్న మేము ఆడపిల్లలం అయినప్పటికీ మమ్ములను బడికి పంపించారు. విద్యా వినయం నేర్పించారు.నాన్న వల్లనే మేము స్వేచ్ఛగా విహరించే పావురాలవలే ఆడుతూ పాడుతూ చదువుకున్నాం.నాన్న ఇచ్చిన ప్రేరణతో ఇప్పటికీ ధైర్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం.నాన్న ప్రజాస్వామ్యవాది.ప్రగతిశీల భావాలతో నిండి ఉండే వాడు.సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వాడు కాదు.సాటి వానికి న్యాయం జరిగించే వరకు పోరాటం చేసే వాడు. నాన్న న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.సమాజ అభ్యుదయం కాంక్షించిన వ్యక్తి.పెద్ద మనుషుల పంచాయతీలో పాల్గొని నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరించే వాడు.నాన్న అందించిన మార్గదర్శకత్వం మరియు చూపిన బాటలో మేము కొనసాగుతున్నాం.చిన్నతనం నుండి ఉగ్గుపాలతో మంచి నడవడిని,సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని ఎదిగాను.ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నారీమణులకు అండగా ఉంటున్నాను.రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్నాను. సామాజిక కార్యకర్తగా నాన్న వల్లనే ఎదిగాను అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మా నాన్న జన ప్రేమికుడు
“నిత్య చిరునవ్వుల రేడు
“తన భుజాల మీద మమ్మల్నే కాదు
“మా ఇంటిని ఎత్తుకున్న ధీరుడు
“సున్నితమైన హృదయాంతరంగుడు
“జీవనోత్సాహ రాగానికి సాక్షీభూతుడు ! సమాజంలో నివసించే వారిని జనం అని అంటారు. ఇవ్వాళ సమాజంలో స్వార్థపరులే ఎక్కువగా ఉన్నారు.నిస్వార్థపరులైన నాయకులు ఒక్కరు కూడా కాన రావడం లేదు.మా నాన్న జనాన్ని ప్రేమించే వాడు.సమాజంలో జరుగుతున్న అవినీతి, ఆశ్రిత పక్షపాతంకు వ్యతిరేకంగా పోరాడే వాడు.మా నాన్న ఎల్ల వేళలా సామాన్య జనుల హక్కుల కోసం పరితపించే నాయకుడు.మా నాన్న నిత్యం చిరునవ్వులు చిందించే రాజుగా పేర్కొనడం ఆమెకు తండ్రి పట్ల గల అవ్యాజమైన ప్రేమను తెలియజేస్తుంది.లోపల ఎంత బాధగా ఉన్నా బయటకు కనిపించకుండా చిరునవ్వులు కురిపిస్తూ అందరితో ఆప్యాయతగా మెలగడం కవయిత్రి నాన్నగారికే సాధ్యమని కవితలోని వాక్యాలు తెలియజేస్తున్నాయి.చిన్నతనంలో నాన్న మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ప్రేమగా తిరిగేవాడు.మా ఇంటి బాధ్యతలను ఎత్తుకుని భుజాల పై మోసే ధీరుడు.ధీరుడు అంటే ధైర్యం కలవాడు.ధీరుడు అంటే ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా కష్టాలు వచ్చినా చలించకుండా అత్యంత ధైర్యం కలిగి ఉండేవాడని అర్థం.నాన్న సున్నితమైన హృదయం కల వాడు.నాన్న మనసులో ఏది దాచుకునే వాడు కాదు.భోళా మనస్తత్వంతో జీవితాన్ని ఉత్సాహంగా రాగాలు పలికించినట్లు నాన్న గడిపే వాడు.ప్రకృతిని ప్రపంచం యొక్క సుస్థిరతను జీవితం కోరుకుంటుంది.ఉత్సాహం అనేది ఒక వ్యక్తి ద్వారా వ్యక్తీకరించబడిన తీవ్రమైన ఆనందాన్ని సూచిస్తుంది.నాన్న ఎల్లవేళలా ఉల్లాసభరితంగా ఉండే వాడు.ఆశావాదం ఆయన ఊపిరి.సప్త స్వరాలను అనేక రీతులలో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి.నాన్న జీవితాన్ని సప్త స్వరాలతో రాగాలు మేళవించినట్లుగా జీవనోత్సాహ రాగానికి సాక్షిభూతుడుగా ఉన్నట్లు వ్యక్తికరించడం చక్కగా ఉంది.
“బతుకు వ్యవసాయంలో కష్టాలతో
“అలంకృతుడైన మా నాన్న
“నిఖార్సైన కార్మికుడు కర్షకుడు !
జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన బతుకు. వ్యవసాయం చేస్తూ రైతులు ఆరుగాలం కష్టించినా కడుపారగా తిండి దొరకక ఆకలితో మలమలలాడుతున్నారు.కార్మికులు ఎంత శ్రమించినప్పటికీ సరియైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలు గడుపుతున్న స్థితిని చూస్తున్నాం.మా నాన్న బతుకు వ్యవసాయం చేస్తూ కష్టాలతో నిండి ఉన్నప్పటికీ ధైర్యంతో జీవనాన్ని సాగించాడు.కార్మికుని వలె కర్షకుని వలె కష్టము చేస్తూ శ్రమను నమ్ముకుని నాన్న జీవనం సాగించాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మాకు మా నాన్నే ఈ సుందర
“సువిశాల ప్రపంచం అనిపిస్తాడు.
మా నాన్న మాకు ఈ లోకం గురించి పరిచయం చేసి మాలో ఉత్సాహాన్ని శక్తిని నింపినాడు.ఈ లోకాన్ని మాకు చూపించిన మా నాన్న సువిశాల ప్రపంచం అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.చక్కటి కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అనిశెట్టి రజిత ఊరు బంధం కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవయిత్రి,అనిశెట్టి రజిత కలం నుండి జాలువారిన కాలం కాన్వాస్ మీద కవితా సంపుటిలోని ‘ఊరు బంధం’ కవిత పై విశ్లేషణా వ్యాసం.ఊరు బంధం కవితను ఆసక్తితో చదివాను. కవిత నాకు నచ్చింది.కవిత నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవిత శీర్షిక పేరు ఊరు బంధం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.కవయిత్రి రజిత ఊరుకు బంధం ఉంటుంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.కవయిత్రి రజిత ఊరు బంధం కవిత చదవగానే మనలను మన ఊరులోకి తీసుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుంది.కవయిత్రి రజిత ఊరు పట్ల గల ప్రేమను కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అని సామెత వాడుకలో ఉంది.కన్న తల్లి జన్మభూమి అయిన ఊరు బంధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవయిత్రి రజిత కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. గొప్ప అనుభూతిని పొందండి.
“ఊరంటే ఉట్టి మట్టి కాదు
మట్టీ ! మనిషి ! ఉత్పత్తీ !
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు.తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది, పట్టణము కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం అని అర్థం.మట్టిని నేల,నేలలు అని కూడా అంటారు.మట్టిని భూమి,దూళి అని కూడా అంటారు.మట్టి జీవానికి ఆధారమైన సేంద్రీయ పదార్థం.ఖనిజాలు, వాయువులు,ద్రవాలు,జీవ పదార్థాల మిశ్రమం. భూమిలోని మట్టి భాగాన్ని పెడోస్పియర్ అని అంటారు.పెడోస్పియర్ పొర మొక్కల పెరుగుదలకు మాధ్యమంగా,నీటి నిల్వ,సరఫరా,శుద్ధీకరణ సాధనంగా,భూ వాతావరణాన్ని పరివర్తింపజేసేదిగా ఉంటుంది.మట్టి జీవులకు ఆహారం,భూమి మీద ఉండే పదార్థం.మనిషి అనగా ఒక వ్యక్తి.ఉత్పత్తి సేవ లేదా వస్తువు కావచ్చు.ప్రతి ఉత్పత్తి ఖర్చుతో కూడి ఉంటుంది. ప్రతి ఉత్పత్తి ధరకు అమ్మబడుతుంది. ఊరు అంటే ఉత్త మట్టి కాదు.ఊరులో నివసించే మనిషికి మట్టితో అనుబంధం ఉంటుంది.ఊరులో నివాసం ఏర్పరచుకొని నాటి ఆదిమానవుడు మొదలుకొని ఈనాటి నవీన మానవుడు కూడా జీవనం సాగిస్తున్నాడు.మనిషి మట్టితో పంటలు పండించి ఉత్పత్తి చేస్తాడు.ఊరిలో నివసించే రైతులు అనాదిగా మట్టిని నమ్ముకుని పంటలు పండించి జీవనం సాగిస్తున్నారు.రైతులు పండించిన పంటల వల్లనే మనం ఆహారం స్వీకరిస్తున్నాం. ఊరులో మట్టి ఉంటుంది.ఊరిలో మనిషి ఉంటాడు.ఊరిలో మనిషి పండించిన పంటల ఉత్పత్తులు కూడా ఉంటాయి.ఊరుతో మట్టి బంధం ఉంటుంది.ఊరిలో మనిషికి మట్టితో బంధం కూడా ఉంటుంది.మట్టిని నమ్ముకుని బతుకుతున్న రైతుకు ఉత్పత్తితో కూడిన బంధం ఉంటాయని కవయిత్రి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.
“ఊరంటే జనజీవన తంత్రం.
ఊరిలో నివసించే వారిని ఊరి జనం అంటారు. ఊరిలో సబ్బండ వర్ణాల ప్రజలు నివసిస్తున్నారు. ఊరిలో వివిధ కులాలు ఉన్నాయి.వివిధ కులాలకు సంబంధించిన జనాలు ఉన్నారు.ఊరిలోని జనులు వివిధ వృత్తులు చేపట్టి జీవనం సాగిస్తున్నారు.ఊరి జనులు ఏ వృత్తి చేపట్టినప్పటికీ అందరు పరస్పర సహకారంతో తమ పనులను చక్కబెట్టుకుంటారు. ఊరి జనులు అన్నదమ్ముల వలె ఐకమత్యంతో మెలుగుతూ మనుగడ సాగిస్తున్నారు.ఊరంటే జనజీవన తంత్రం అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“సూర్యునితో కలె దిర్గే శ్రమ యంత్రం.
ఊరిలోని జనులు ప్రాతః కాలంతోనే నిద్ర లేస్తారు. సూర్యోదయం కాగానే జనులు పనులు ప్రారంభించి సూర్యాస్తమయం వరకు అలసట అనేది ఎరుగక తమ వృత్తికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై కొనసాగిస్తారు.ఎండ,వాన,చలిని భరిస్తూ పనులు చేస్తారు.సూర్యుని పొద్దుపొడుపు నుంచి మొదలై సూర్యుడు పడమటి దిశకు చేరుకునే వరకు శ్రమ యంత్రాల వలె జనులు పనులు చేపడుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మనిషికి ఊరు చిరునామా
“ఊరు బంధాల సంబంధాల కల్నేత
“ఊర పిశికెలు అల్లుకున్న గూడు
“ఊటబాయిల ఊరే తేట నీరు ..
చిరునామా లేదా అడ్రస్ అనగా భూమి మీద ఒక వ్యక్తి నివాస సంబంధమైన వివరములు ఉంటాయి. తెలుగులో కూడా చిరునామా అంటే అడ్రస్ అనే ఆంగ్ల పదమే అధికంగా వినియోగంలో ఉంది. తపాలా వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి అవసరమైన వివరాలను సూచిస్తూ చిరునామా పదం వాడుతారు.నివాస స్థలం తెలిపే పదం చిరునామా.ఒక నివాసాన్ని కనుగొనడానికి చిరునామా ఉపయోగపడుతుంది.మనిషిని ఏ ఊరు అని అడిగితే ఫలానా ఊరు వాడు అని చెబితే అది అతని చిరునామా అవుతుంది.ఊరితో బంధాలు ఏర్పడతాయి.ఊరులో ఏర్పడిన బంధాలు సంబంధాలు రంగురంగుల పోగులతో అల్లుకున్న వస్త్రం వలె చక్కగా పొందికగా ఉంటాయి.ఊర పిశికెలు అల్లుకున్న గూడులాగా ఊరి జనాలు పరస్పర అనుబంధాలతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు.ఊర పిచ్చుకలు చూడ ముచ్చటగా ఉంటాయి.పల్లెల్లో ఊర పిచ్చుకలు ఇంటి ముందుకు వస్తాయి.పల్లె జనాలు ఊర పిచ్చుకలకు ధాన్యం వేస్తే తింటాయి.ఊట బాయిల ఊరే తేట నీరు చేదుకుని జనాలు తాగుతారు.ఊట బావి నీరు చల్లగా తీయగా ఉంటుంది.ఊట బావిల ఊరే తేట నీటిని ఊరి జనం ఎంతో ప్రీతిగా తాగుతారు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఊరంటే సేద్యగాళ్ళ రంగస్థలి
“పని చేసే చేతులు సృష్టించే
“సకల సంపదల భాండాగారం
“వాయి వరుసల కమ్మని పల్కరింపు …
నాయిక,నాయకుడు అభినయించు చోటు రంగస్థలం.నాటక ప్రదర్శనశాలను రంగస్థలం అంటారు.ధాన్యాన్ని నిలువ ఉంచు ప్రాంతాన్ని భాండాగారం అంటారు.మానవుడు సంఘజీవి.అన్ని బాగున్నప్పుడు పలకరించినా పలకరించక పోయినా పరవా లేదు.మనిషి బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్లి పలకరించడం కనీస మానవ ధర్మం.అదే మనం అనుబంధానికి ఇచ్చే విలువ. బాగున్నావా అనే తీయని పలకరింపు కోసం మనిషి ఆరాటపడతాడు.ఈనాడు మనుషుల్లో ఆత్మీయత కరువైంది.ఒక కమ్మని పలకరింపు ద్వారా మనుషుల్లో ఆనందాన్ని కలుగజేయాలి.ఊరిలో రైతులు వ్యవసాయ భూముల్లో చేసేది సేద్యం. రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తారు.రైతులు అందరు కలిసి వ్యవసాయ భూముల్లో సేద్యపు పనుల్లో రంగస్థలంలోని నటుల వలె నిమగ్నమై పనులు చేస్తారు.రైతులు ఆరుగాలం కష్టించి,శ్రమించి వ్యవసాయం ద్వారా తమ భూముల్లో పంటలు పండిస్తారు.రైతులు చెమటోడ్చడం వల్లనే పండించిన పంటలతో ధాన్యాగారాలు నిండుతాయి.ఊరిలోని రైతులు అందరు అన్నదమ్ముల వలె అక్క చెల్లెళ్ల వలె అప్యాయతతో కమ్మగా పలకరించుకుంటారు.ఊరి వారందరు అరమరికలు లేని స్నేహంతో ఆత్మీయతతో మెదులుతారు.ఊరిలోని ప్రజలంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి అప్యాయతగా మసులుకుంటారు.ఊరి జనాల స్నేహం,ఆత్మీయత,కమ్మని పలకరింపు గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరంటే చెట్లు పనిముట్ల స్నేహం.
ప్రతి సంవత్సరం చిగురిస్తూ,పుష్పిస్తూ,కాయలు, పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు.చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలు చేకూర్చడంలోను వ్యవసాయం లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొలకెత్తడం,పెరిగి పెద్దవి అవటం,పుష్పించి, ఫలాలను ఇవ్వడం,కొంత కాలానికి వయస్సు ఉడిగి నశించడం,ఇవన్ని చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది.ప్రకృతి అందాలకు నిలయమైన ఈ భూమిపై వృక్షాలను నాటుదాం. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ కూడా ఒక్కటి.వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. పనిముట్టు అనేది సాధనం,పరికరం,ఉపకరణం. ఏదైనా పనిని త్వరగా సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువు పనిముట్టు.వ్యక్తి యొక్క సామర్థ్యం పనిముట్ల ద్వారా పెరుగుతుంది.చెట్టు యొక్క కలపతో పనిముట్లు తయారు చేస్తారు. అరక,మడక,నాగలి ఇది కొయ్యతో చేసినది. మేడి,నొగ,కాడిమాను.ఎద్దులతో భూమిని దున్నుతారు.భూమిని దున్నడానికి రెండు ఎద్దులు,ఒక మనిషి అవసరం.ఊరులో చెట్లు ఉంటాయి.చెట్ల కలపతో తయారు చేసిన పనిముట్లతో ఊరి వారికి స్నేహం ఉంటుంది అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషిని మనిషి పట్టించుకునే ఆరాటం
“మట్టి పువ్వుల పైరు పచ్చని యవుసం.
ఊరిలో మనిషి తోటి మనిషిని పట్టించుకునే ఆరాటం ఉంటుంది.ఊరిలో మనుషులు కలివిడితనంతో,ఆప్యాయతతో మెలగడం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.రైతు సాగుచేసిన వ్యవసాయం ద్వారా మట్టిలో పెరిగిన పైరు పువ్వులు పూచి పచ్చదనంతో కళకళలాడుతుంది. వ్యవసాయం అనేది ఒక్కరు చేసే పని కాదు. సమిష్టిగా ఊరి వారందరు కలిసిమెలిసి ఉండి పరస్పర సహకారంతో పనులు చేసుకుంటారు. రైతులు ఒకరిని ఒకరు పట్టించుకునే ఆరాటం ఉంటుంది.రైతులు నారు పోసి నీరు పెట్టి పెంచి కలుపు తీసి మట్టిలో పువ్వులు పూయించి పైరును పచ్చదనంతో కళకళలాడింపజేస్తారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“భూమిని మధించి పూజించడం …
“ఊరు సబ్బండ జాతుల సంస్కృతి !
భూమిని ఆరాధించడం వల్ల శ్రేయస్సు మరియు అదృష్టం లభిస్తుంది అంటారు.భూమి పూజ తర్వాత విత్తనాలు నాటడం వంటి ఆచారాలు ఉంటాయి. మన సంస్కృతిలో ప్రజలు ఏదైనా ముఖ్య కార్యాన్ని లేదా పనిని పూజతో అంటే దేవతలను ఆరాధించడంతో ప్రారంభిస్తారు.ఏదైనా కొత్త ఇల్లు నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు ప్రజలు భూమి పూజ చేస్తారు.ఎప్పుడు మనిషి నేను అనే భావన కన్నా నలుగురితో మనం అనే భావన ఆనందాన్ని ఇస్తుంది.మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగగా భావిస్తారు. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకున్న సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.పొలాల నుంచి ఇంటికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు.ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తారు.సమాజంలో ముఖ్యమైన పద్ధతులు,నిర్మాణాలు, వ్యవస్థలు,సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి.సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు. అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతూ ఉంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్ని కలిపి సంస్కృతి అంటారు.గతించిన కాలం గురించి భవిష్యత్తు తరాలకు అందించే వారధి సంస్కృతి.ఊరిలో భూమిని పూజించే ఆచారాలు,వ్యవహారాలు అనాదిగా కొనసాగుతున్నాయి.ఊరిలో సకల జాతులు,సబ్బండ వర్ణాల ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“మనిషి ప్రకృతితో జత కట్టే నియతి.
భూమి,నీరు,అగ్ని,గాలి,ఆకాశం పంచభూతాలు. వీటికి ప్రకృతి మూలం.ప్రకృతి అనగా మనం కళ్ళతో చూడగలిగే,మనసుతో భావించే,శరీరంతో గుర్తించే వాస్తవ ప్రపంచం.ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం,విస్తృత కోణంలో ఉంది. వాతావరణం,పర్యావరణ వ్యవస్థ,వృక్షజాలం, జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్నిచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి.ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి,మనల్ని పోషిస్తుంది.మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది. మనం తినే ఆహారం,మనం పీల్చే గాలి,మనం ధరించే బట్టలు,మనం నివసించే ఇల్లు అన్ని ప్రకృతి మాత అందించిన బహుమతులు.ప్రకృతి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి.ప్రకృతి మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా మనశ్శాంతికి, ఆనందం,ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.ప్రకృతిని పరిరక్షించడానికి మనం కృషి చేయాలి.ప్రకృతిలో ఉన్న అనేక చెట్లు రోజు వారి ఉపయోగాలతో పాటు ఔషధ ప్రయోజనాల కోసం సహాయపడుతాయి.ఊరు బంధంలో నివసించే మనిషి ప్రకృతితో జతకట్టి నియతిగా జీవనం కొనసాగిస్తున్నాడు అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“మౌఖిక కథన కావ్యాల గుమ్మి.
మౌఖికంగా కథ చెప్పుతున్న కథకుడు మరియు శ్రోతల మధ్య ఒక పురాతన సన్నిహిత సాంప్రదాయం కొనసాగుతున్నది.కథకుడు,శ్రోతలు శారీరకంగా దగ్గరగా ఉంటారు.మౌఖిక కథన సౌలభ్యం ద్వారా సాన్నిహిత్యం,సంబంధం హాయిగా ఉంటుంది.మౌఖిక కథా కథనాలను అనేక రూపాల్లో ప్రదర్శించవచ్చు.పాటగా,నృత్యంతో పాటు ఒక రకమైన నాటక ప్రదర్శనం.మౌఖిక కథ మానవ భాష ఉన్నంత కాలం ఉండి ఉండవచ్చు.తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం.తాను స్వయంగా అనుకరించలేని జానపద కావ్యాల్లోనూ పురాణాల్లోనూ వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు.తన భాషలో మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు.రకరకాల విన్యాసాలు వాటిచేత చేయించాడు.తాను స్వయంగా వెనక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న జీవం లేని బొమ్మలతో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.నృత్య దశ నుండి మానవుడు నాటక దశలోకి ఎదిగే పరిణామ క్రమంలో తోలు బొమ్మలాట ప్రముఖ పాత్ర వహిస్తుంది.జానపదుని మొదటి రంగస్థలం ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని చెప్పవచ్చు.తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది.జానపద ప్రదర్శన కళలు,తెలుగు నేలను సుసంపన్నం చేశాయి.ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించినవి,జానపద ప్రదర్శన కళలే. వృత్తి జానపద కళారూపాలు ఒగ్గు కథలు,హరి కథలు,నాటకాలు,యక్షగానాలు,చిందు బాగోతం, కోలాటం,తోలుబొమ్మలాటలు మొదలైనవి,ఊరులో ప్రదర్శించే వారు.మౌఖిక కథన కావ్యాల గుమ్మి అని ఊరు గురించి ఊరు బంధం కవిత ద్వారా కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల గోకులు పంచె అమ్మి !
పాలు శ్రేష్టమైన బలవర్ధక ఆహారం.ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి.పాలు అన్ని వయసులవారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం.పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు,బర్రెలు,మేకలు,గొర్రెలు.టీ,కాఫీలను పాలను ఉపయోగించి తయారు చేస్తారు.పాలు తోడబెట్టినచో పెరుగు తయారవుతుంది.పెరుగును పల్చగా నీటితో బాగా కలిపితే మజ్జిగ తయారవుతుంది.పెరుగును బాగా చిలికితే వెన్న తయారవుతుంది.వెన్నను మరగబెట్టినచో నెయ్యి వస్తుంది.పాలతో పాలకోవా,మిఠాయిలు తయారు చేస్తారు.బిస్కెట్లు,చాక్లెట్లు,ఐస్ క్రీములు,రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను ఉపయోగిస్తారు.ఊరులో ఏ ఇంట చూసినా పాడి పోషణ ఉంటుంది.ఊరిలో పాలు,పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు.ఊరిలో పాలగోకులు ఉచితంగా అందరికీ పంచే అమ్మిని గురించి కవయిత్రి రజిత వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఊరు అప్యాయతలు పొంగే అవ్వ !
ఊరు అప్యాయతలు పంచే అవ్వ.మనం నివసించే ఊరు కన్నతల్లి లాంటిది.కన్నతల్లి నవమాసాలు మోసి మనలను కంటుంది.ఊరు మనకు నిలువ నీడను చోటును ప్రసాదించి జీవితాంతం తోడుగా ఉంటుంది.ఊరులో నివసించే జనులు అప్యాయత, అనురాగాలతో కలిసిమెలిసి ఉంటారు.కష్టం వచ్చినా సుఖం వచ్చిన తోడుగా ఉంటారు.ఊరు తల్లి అప్యాయత వల్లనే మన మనుగడ చక్కగా సాగుతుంది.ఊరులో తెల్లవారు జామున కను విందు చేసే మధురానుభూతులు జీవితాంతం నిలిచిపోతాయి.పక్షుల కిలకిలారావాలు,కోయిలల కుహు కుహు రాగాలు మధుర మనోహరంగా ఉంటాయి.మమతలు పంచే బాల్య స్నేహితుల పలకరింపులు మనసును కట్టి పడవేస్తాయి. బంధువులు,స్నేహితులు,అత్తయ్యలు, మామయ్యలు,బాబాయి,పిన్ని,అక్క,చెల్లి, ఇరుగుపొరుగు వాళ్ళ మాటలు,మమకారాలతో ఆనందాల సందడిగా ఉంటుంది.ఊరు అప్యాయతలు పొంగే అవ్వ అని కవయిత్రి రజిత చెప్పిన తీరు చక్కగా ఉంది
“ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ !
ఊరిలోని రైతులు పండించిన పంట వల్లనే కమ్మని ఆహారం తింటున్నాం.ఊరు మనకు ఉనికిని ఇచ్చింది.ఊరు లేకుంటే ఉనికి లేదు.ఊరు లేకుంటే ఊరులోని జనం లేరు.ఊరు మనకు సకలం ప్రసాదించిన తల్లి.ఊరు తల్లి ఉనికి వల్లనే మన ప్రాణాలు నిలుస్తున్నాయి.ఊరు తల్లి ఉనికి వల్లనే మనం మనుగడ సాగిస్తున్నాం.ఊరు ప్రాణాలు నిలిపే కమ్మని బువ్వ అని కవయిత్రి రజిత వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.ఊరు బంధం కవిత ద్వారా ఎన్నో విషయాలు పంచుకున్న తీరు అద్భుతంగా ఉంది.ఊరు బంధం కవితను రాసిన కవయిత్రి రజితను అభినందిస్తున్నాను.కవయిత్రి రజిత మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.