గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (19)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
“జాగ్రత్త దోస్త్ ! ఇక్కడ మనిషి
తీసుకునే శ్వాస కూడా నకిలీదే !
చలాకీగా తిరిగే ప్రతి మనిషి ప్రాణంతో
ఉన్నట్లు మాత్రం అనుకోకు !
నిత్య జీవితంలో మనకు ఎందరో మనుషులు తారసపడతారు.నిత్యం కనిపించే వాళ్లు అయినప్పటికీ వాళ్లు అందరు మనకు కావాల్సిన వాళ్ళు కారు,మనకు కావలసిన వాళ్లు కొందరు మాత్రమే ఉంటారు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఈ షాయరీ కవితలోని భావాలు సమాజంలో మనుషుల నిజ స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.బాహ్యంగా మనుషులు ఎలా కనిపిస్తున్నారో అలా ఉండరు.పైపై మెరుగులు అంటే అందం,తీయ తీయని చిలుక పలుకుల ముద్దు ముద్దు మాటలతో జనాన్ని ఆకట్టుకొని బుట్టలో వేసుకునే వారిని చూసి తక్షణమే వారిపై ఒక అభిప్రాయానికి రాకూడదు.అపరిచితుల జోలికి వెళ్లకూడదు.అపరిచితులను వెంటనే నమ్మకూడదు. అపరిచితుల మాటలకు చిక్కి బోల్తాపడకూడదు. మనకు తెలియని మనుషులు కనుక వారు ఎలాంటి వారో?అని తక్షణమే వారిపై ఒక నిర్ణయానికి రాకూడదు.వారు చెప్పేది మంచి మాటలా? బూటకపు మాటలా?వారి గురించి నిదానంగా ఆలోచించాలి.అసలు వారెవరు?వారితో గల మన సంబంధం ఏమిటి?అని దృష్టి సారించాలి అనే సూచన దాగి ఉంది.షాయరీ కవితలో మనిషి జీవితంలోని నాటకాలను,మోసాలను,వాస్తవికతను దార్శనికతతో చూపించడమైంది.షాయరీ కవితలో దాగి ఉన్న లోతైన భావం ఒక గొప్ప అర్థంతో కూడుకొని మనసుకు తాకి హాయిని గొల్పుతుంది. ‘జాగ్రత్త దోస్త్ ఇక్కడ మనిషి తీసుకునే శ్వాస కూడా నకిలీదే/’అంటే స్నేహపూర్వకమైన హెచ్చరికగా ఉపయోగిస్తారు.ఎవరైనా స్నేహితునికి ఏదైనా ముఖ్యమైన విషయం తెలియజేయడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండడం మరియు జాగ్రత్తతో వ్యవహరించమని తెలియజేస్తుంది.దోస్త్ ఇది హిందీ పదం సంభాషణలో స్నేహపూర్వకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు.జాగ్రత్త దోస్త్ అని చెప్పడం మీకు తనపై గల అపారమైన ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తుంది.నేటి సమాజంలో ఉన్న మనుషుల మనసుల్లో నెలకొని ఉన్న కృత్రిమతను, మాయ మాటలను తప్పుడు ప్రవర్తనను సూచిస్తుంది.ఇక్కడ నకిలీ శ్వాస అనే భావన మనిషిలో వాస్తవికత లేక పోవడాన్ని, మోసపూరితంగా వ్యవహరించడాన్ని తెలుపుతుంది. ఇవ్వాళ సమాజంలో వ్యక్తుల నడత దోషభూయిష్టమై,కలుషితమై కంపు కొడుతోంది. సమాజంలో ఉండే చాలా మంది తమ నిజమైన స్వభావాన్ని దాచుకొని కృత్రిమమైన రూపంలో కనిపిస్తారు. ‘చలాకీగా తిరిగే ప్రతి మనిషి/ప్రాణంతో ఉన్నట్లు మాత్రం అనుకోకు’/అని చెప్పడం ద్వారా జీవితంలో మనకు కనిపించే వాళ్లు నిజంగా,ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అని, భావించకూడదని హెచ్చరిస్తోంది.కవి జీవితంలోని అంతర్ముఖ పరిస్థితులపై దృష్టి చూపించారు.అనేక మంది బాహ్యంగా,శక్తివంతంగా,ఆనందంగా ఉన్నట్లు మనకు కనిపించవచ్చు.కానీ,వారి లోపల నిండి ఉన్న విషాదపు ఛాయలు,నిరాశ,నిర్లిప్తతతో పాటు, ఎదుటి వారిని బురిడీ కొట్టించే నయ వంచన, మోసం కూడా దాగి ఉండ వచ్చు.అందు వల్ల సమాజంలోని మనుషులతో వ్యవహరించే సందర్భంలో ఎటు వంటి దగా,మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది.ఈ పంక్తి లోని లోతైన భావం మన హృదయాలను కదిలిస్తుంది.మనం ఎటువంటి సంకోచం లేకుండా మరొక సారి మన జీవితంపై దృష్టి పెట్టేలా ఆలోచింప జేస్తుంది.జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గుర్తించడంలో ఏమరుపాటు,అశ్రద్ధ తగదు.మనిషి తాను సందర్భానుసారంగా,స్వతంత్రమైన ఆలోచనతో ఇతరులతో వ్యవహరించాలి.తాను జీవితంలో సరియైన యుక్తి మరియు నేర్పుతో అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఉంది.ఈ షాయరీ కవిత ద్వారా మనం చూసే ప్రతి మనిషి ఎలా ఉన్నాడో,ఎట్లాంటి స్వభావం ఉందో అని తక్షణం అర్థం చేసుకోవడం కష్టం అని తెలుస్తోంది. మనిషి స్వభావంలోని కృత్రిమతను,అవగాహన లేక పోవడాన్ని విమర్శిస్తూ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తుంది.ఈ కవితలోని భావం మన మనసులను తట్టి లేపుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (20)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి డాక్టర్ భారతి తెలుగులోకి అను సృజన చేసింది.
“ఏదైనా మంత్రం వేసి … నన్ను చలాకైన
“వాడిగా మార్చి పడేయ రాదు ?
“ నా ఈ అమాయకత్వం నాకు చాలా
“కష్టాల్ని తెచ్చి పెడుతోంది మరి !
మంత్రం అంటే మన మనసును నియంత్రించే సాధనం.అంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసే మార్గం.ఇందులో మంత్రం అంటే ఒక అద్భుతమైన మార్పు లేదా ప్రత్యేకమైన శక్తి సాధనతో తన స్వభావాన్ని మార్చుకోవడం.మంత్రాలతో లేదా మాయాజాలంతో మన జీవితాలను వెంటనే మార్చడం సాధ్యం కాదు,కానీ,తన ఆలోచనా విధానం ద్వారా తన స్వభావాన్ని మెరుగుపరుచు కోవచ్చు.చలాకైన వాడిగా ఉండాలి అంటే తాను బాగా అనుభవాల నుండి నేర్చుకున్న కార్యాచరణతో సమర్థత చూపించే వ్యక్తిగా మారాలి అని సూచిస్తుంది.కానీ,వ్యక్తి మానసికంగా ఉన్న అమాయకత్వం నుండి ఒత్తిడిని అనుభవిస్తూ బ్రతుకు ఒక సవాలుగా నిలుస్తుంది. ‘నా ఈ అమాయకత్వం నాకు చాలా/కష్టాల్ని తెచ్చి పెడుతోంది’/ మరి ఇక్కడ తాను తన అమాయకత్వంతో బాధలను అనుభవిస్తున్నాడు. అమాయకత్వం వల్ల అపరిచిత వ్యక్తుల చేతిలో సులభంగా మోసపోతున్నాడు.మరియు తాను ఏమి చేయాలో తెలియక పోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.తనలోని అమాయకత్వం తనకు కష్టాలను,సమస్యలను తెచ్చి పెడుతుంది.అతను తన సహజమైన అమాయకత్వం విడిచిపెట్టాలని,తన స్వభావాన్ని సమర్థమైన చలాకీతనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.కానీ,అతనికి ఆ మార్పును ఎలా పొందాలో తెలియకపోవడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నాడు.చలాకిగా ఉండాలంటే ముందుగా తన మీద తనకు పూర్ణ విశ్వాసం ఉండడం అవసరం.తాను సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తుంచుకోవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.తన మనసులోని భావాలను,స్పష్టంగా,ధైర్యంగా చెప్పాలి.తాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసు కోవడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందుగా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా తమను తాము పరీక్షించుకోవాలి.దాని ద్వారా అమాయకత్వం తగ్గి చలాకితనం ఉప్పొంగుతుంది. ఉత్సాహం,ఉత్తేజం పెరుగుతుంది.ఎవరైనా తమ జీవితంలో తప్పులు చేయడం సహజం.తాను ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకొని అమాయకత్వాన్ని విడిచి పెట్టి జీవితంలో ముందుకు సాగాలి.అప్పుడే విజయాలు సాధించడం సాధ్యం అవుతుంది అని గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (21)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను రంజింప చేస్తాయి.
“నిర్దయుడా … నేను మరణించాక కనీసం
“నీకు ఆ కబురు కూడా చేరకూడదు !
“నువ్వు పిచ్చివాడిలా నా కోసం
“వెతుకుతునే ఉండు …
“నీకు నా సమాధి ఆచూకీ కూడా దొరక
“కూడదు !
ఈ కవితా పంక్తులు తన హృదయంలోని గాఢమైన బాధను మరియు ఆవేదనను,లోతైన భావోద్వేగాన్ని,అంతులేని కోపాన్ని, వ్యక్తపరుస్తోంది. నిర్ధయుడా అంటే నీలో ఏ మాత్రం దయా దాక్షిణ్యం, ప్రేమ,అభిమానం కనిపించడం లేదు.అందుకే తాను దయ లేని వాడా అని అతనిని సంబోధిస్తున్నాడు.ఈ పదం వ్యక్తి గుండెల్లో నెలకొన్న తీవ్రమైన గుబులును, మనస్సులో దాగి ఉన్న బాధను స్పష్టంగా తెలియజేస్తుంది.తాను అత్యంత ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ తన పట్ల నిర్దయగా ప్రవర్తించాడని, తన లోపలి బాధను,ప్రేమను అర్థం చేసుకోలేదు అనే ఆవేదన వ్యక్తం అవుతోంది. నిర్దయుడా నేను మరణించిన తర్వాత కూడా నీకు ఆ వార్త కూడా తెలియకూడదు అనే నిర్ణయం కనబడుతుంది. ఇది ఒకింత ప్రతీకార భావాన్ని తనలో గల ఆవేశాన్ని వ్యక్తం చేస్తుంది.నేను జీవితంలో నీకు ఎంతో ముఖ్యం అని తెలుసు. అయినప్పటికీ తనను అసలు పట్టించుకోని విధంగా వ్యవహరించడం చేత తన మరణం గురించి అతనికి తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు అనే విషయం ఇందులో కనబడుతుంది.
‘నువ్వు పిచ్చివాడిలా తిరుగుతూ నా కోసం వీధుల్లో వెతుకుతూనే ఉండు’/అంటే ఇక్కడ తాను అనుభవించిన బాధతో పాటు తనకు ప్రియమైన వారు తన ప్రాముఖ్యతను మరణించిన తర్వాత అయినా గుర్తించాలి అని కోరుకుంటున్నాడు.తాను చేసిన తప్పును గ్రహించాలి.అతడు పిచ్చివాడిలా తన కోసం వెతుకుతునే ఉండాలి అనే భావం వ్యక్తం అవుతుంది.నీకు నా సమాధి ఎక్కడ ఉందో అనే ఆచూకీ కూడా దొరకకూడదు.ఇది ఒక అంతిమ ఆవేదన.తాను మరణించిన తర్వాత కూడా తన కోసం గుండె నిండా గుబులతో తహతహలాడుతుండాలి అనే ఆకాంక్ష వ్యక్తం అవుతుంది.ఇది ఆ వ్యక్తి గుండెల్లో పొంగి పొర్లుతున్న బాధను తెలియజేస్తుంది.ప్రియమైన వ్యక్తి మీద బాధతో,తీరని ఆవేశంతో,ఆగ్రహంతో చెప్పిన భావోద్వేగపూరితమైన భావాలు ఇందులో కనిపిస్తున్నాయి.ఇది ఒక విధంగా మనసులోని గూడు కట్టుకున్న బాధను మరియు తన జీవితంలో మిగిలిపోయిన శూన్యతను వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తులు ప్రేమతో కూడిన ఆవేదన,ఎడతెగని కోపం మరియు విరహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది ప్రియమైన ఆప్తుడు తన పట్ల చేసిన ఘోరమైన నిర్లక్ష్యానికి,ద్రోహానికి ప్రతిగా ఆవేదనతో కూడిన బాధను వ్యక్తం చేస్తున్నది.కవి గుల్జార్ తనలోని ప్రేమను,బాధను,ఈ షాయరీ కవితలో అద్భుతంగా పండించారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (22)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి ( డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“అతను నా కోసం
“వెతుకుతున్నాడు … బహుశా అతనికి
“అవసరం ఉందేమో !
“ఆ నేల కిందే నా సమాధి ఉందని అతనికి
“తెలియదు !
ఈ కవితా పంక్తులు గాఢమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
అతను నా కోసం/వెతుకుతున్నాడు/అంటే అతను నన్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ కవితా చరణం వ్యక్తిలోని గాఢమైన ప్రేమతో చేసే అన్వేషణను సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి మరొకరి కోసం ఎంతో ఆతృతగా వెతకడం మరియు అందు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజేస్తుంది.ఇది కేవలం తాను శారీరకంగా వెతకడం మాత్రమే కాక, ఆత్మీయంగా,భావోద్వేగాలపరంగా కూడా అతనిని కనుగొనాలని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది.
‘బహుశా అతనికి/అవసరం ఉందేమో/ అంటున్నారు.అంటే అతనికి నాతో ఏదో సంబంధం ఉండాలి,అయినా ఏదైనా అవసరం ఉండవచ్చు అనే సందేహాం వ్యక్తం అవుతున్నది.ఇది అతని పట్ల గల ప్రేమ లేదా జాలితో కూడిన భావన. ‘ఆ నేల కిందే నా సమాధి ఉందని/అతనికి తెలియదు/అంటే అతనెక్కడైతే నిలబడి ఉన్నాడో ఆ స్థలంలోనే నా సమాధి ఉంది అనే సంగతి అతనికి ఎలా తెలుస్తుంది?అతను నా సమాధిని కూడా చూడ లేదు.కాబట్టి అతనికి సమాధి ఎక్కడ ఉందో తెలియదు.ఈ పంక్తి అత్యంత భావోద్వేగభరితమైనది.ఇది జీవితానికి సంబంధించిన ఒక విషాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది.అతను నన్ను వెతుకుతున్నప్పటికీ నా ఆత్మకి ఎలా తెలుస్తుంది?నా ఆత్మకి తెలియదు లేదా నా పరిస్థితి అతనికి తెలియదు.అతను నిలబడి ఉన్న నేల కిందే నా జీవన గమనం ముగిసింది అని తెలియని స్థితి.ఇది ఒక వ్యక్తి తన ఆత్మను లేదా తన జ్ఞాపకాలను గురించి చెప్పినట్లుగా అనిపిస్తుంది.దీన్ని ఒక భావోద్వేగపు స్వరూపంగా చూడవచ్చు.దీనిలో ఒక మౌనమైన వేదన,అర్థం కాని దురవస్థ వ్యక్తం అవుతున్నాయి. ఇది తనకు ఎదురైన జీవితం,చేదు అనుభవాలను కవితాత్మకంగా వ్యక్తీకరించినాడని చెప్పవచ్చు.ఒకరి కోసం వెతికినా ఆ వ్యక్తి ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును లేదా గమనం ముగిసిన దశను గుర్తించ లేని పరిస్థితిని ఇది సూచిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (23)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇంత అలక దేని కోయి ….
“నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు !
“నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా
“నీ అలక తీర్చడానికి !
ఇష్టం లేక మొహం చాటు చేయడం అలక.తాను ప్రేమించే వ్యక్తి తన పట్ల అపరాధం చేసినప్పుడు, కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం అలక.మనిషి అలకను అధీనంలో పెట్టుకోవడం కష్టం.అలక అంటే ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి ఓ పథకం ప్రకారం ఆ పని సాధించేందుకు కోపం వహించడం,ఆ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది.ఆవేశంతో కూడిన కోపం కాదు.
ఈ కవితా పంక్తులు తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో వ్యక్తీకరించిన భావనలను సూచిస్తుంది.ఇది అంతా సున్నితమైన ప్రేమతో కూడిన భావనగా తోస్తోంది.తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో తన ప్రేమను అంకితభావాన్ని గాఢంగా వ్యక్తికరించాడు.
“ఇంత అలక దేని కోయి…/అతను తన ప్రియమైన వారిని ప్రశ్నిస్తూ అలక వెనక గల కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అతను ఆశ్చర్యాన్ని, ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంత పెద్ద అలక ఎందుకు?దీనికి ఏమి కారణం?అనే ప్రశ్నలతో అలక గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వ్యక్తం అవుతుంది.అలక ప్రేమికుల మధ్య సంభాషణలో అనేక సార్లు వినిపించే మాధుర్యమైన ప్రశ్న.
‘నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు/’అతను ఎంతో వినయంతో ఆమె అలకను తీర్చటానికి మార్గం చెప్పమని అడుగుతున్నాడు.అతను తమను దూరంగా ఉంచిన కారణాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.తనను తాను నిరూపించేందుకు అలక తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాడు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.దీనికి ఏదైనా సాధ్యం అయ్యే సులభమైన మార్గం చెప్పమని కోరడం ద్వారా అతను తన సరళతను,నిజాయితీని చూపిస్తున్నాడు.
‘నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా/నీ అలక తీర్చడానికి/ అంటున్నాడు.అతనికి ఆమె మీద ఎంతో ప్రేమ ఉంది.ఇది ప్రేమ యొక్క గాఢతను,అంకితభావాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తుంది.అతను తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి ఆమె అలకను తీర్చాలనుకుంటున్నాడు.తన ప్రియమైన వారి సంతోషం కోసం అతను ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధమని తన ప్రాణం త్యాగం చేయగల శక్తిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది.ఇవన్నీ అతను తన ప్రేమను వ్యక్తపరిచే తీరును గాఢమైన ప్రేమ,భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయే భయంతో వారి మనసును తిరిగి పొందడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని సూచిస్తున్నాయి.ఇది ప్రేమ,దానిలోని భావోద్వేగాలను బలంగా చూపించే ఉదాహరణగా నిలుస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (24)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“కొద్ది వెలుతురు అడిగా ఈ జీవితాన్ని !
“చూడండి … నేను ప్రేమించిన వాళ్ళు
“మొత్తానికే …. నిప్పు రాజేశారు !
ఈ కవితా పంక్తులు జీవితంలోని నమ్మకద్రోహం, ఆవేదన మరియు ఆకస్మికంగా ఎదురయ్యే మార్పులను అత్యంత గాఢంగా ప్రతిబింబిస్తాయి.
‘కొద్దిగా వెలుతురు అడిగా జీవితాన్ని’!/ఈ పంక్తి ద్వారా కవి చెప్పదలచిన భావం ఇది.జీవితంలో తాను తక్కువగానే ఆశించాను అని,కేవలం కొద్దిగా సంతోషం లేదా ఆశ కోసం మాత్రమే తపించాను అని,తన ఆశలు పెద్దవేమి కాదు అని,తను కోరుకున్నది ఒక సాధారణ వెలుగు మాత్రమే అని అంటున్నాడు.
‘చూడండి … నేను ప్రేమించిన వాళ్లు/అనే పంక్తి ద్వారా కవి తనకు అత్యంత సన్నిహితమైన వారితో,నమ్మిన వారితో గల ప్రేమతో కూడిన అనుబంధాలను సూచిస్తున్నాడు.ఇది ఒక గాఢమైన భావోద్వేగంతో కూడుకొని ఉంది.
‘ మొత్తానికే … నిప్పు రాజేశారు !/అంటే అతనికి ఎదురైన పరిస్థితులు మారాయి.ఆశ్చర్యంతో,బాధతో తాను ప్రేమించిన వారు,తనకు మద్దతుగా ఉండాలి అని భావించిన వారు, అనుకోకుండా తన జీవితాన్ని నిప్పుల బారిన పడేసినట్లుగా నడుచుకున్నారు. తాను ఎంతో ప్రేమించిన వారు,నమ్ముకున్న వాళ్ళే తీరా తన జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యారు అని,నిప్పు రాజేశారు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నది.అంటే జీవితం అంతా దహించుకుపోయినట్లు,అన్ని తారుమారు అయినట్లు తెలుస్తున్నది.ఇది నమ్మక ద్రోహం, అవిశ్వాసం మరియు ఆత్మీయ సంబంధాల్లో ఎదురయ్యే కఠిన అనుభవాలకు ప్రతిరూపం.ఇది జీవితంలో కలిగిన నమ్మక ద్రోహాన్ని,ఆకస్మిక ఆవేదనను ప్రతిఫలిస్తుంది.ఈ కవితలోని భావం ప్రతి మనిషి జీవితంలో బాధలు ఎదుర్కోవాల్సిన స్థితికి ప్రతినిధిగా నిలుస్తుంది.మనం జీవితంలో కొద్దిగా ఆనందం కోరుకుంటే అప్పుడప్పుడు నిరాశ, నమ్మకద్రోహం,భరించలేని తీవ్రమైన అనుభవాలు, కలలో కూడా ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఇది నమ్మకంతో ముడిపడిన సంబంధాల పట్ల కలిగే బాధను నిశితంగా చూపిస్తుంది.కవితలోని ఈ భావనలు తన అనుభవాలకే కాక సమాజంలో నెలకొన్న వాస్తవిక స్థితిగతులకు వర్తిస్తాయి. ఎందుకంటే మనం ఆశించే వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చే సందర్భాలు అనేకం ఉంటాయి.కవి కోరుకున్న వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చిన కఠోర సత్యాన్ని ఈ పంక్తులు సూచిస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (25)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇదెలాంటి విషమో … ఏమో హృదయాల్లో
“నిండి పోయింది ?
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే
“ఉన్నాయి !
ఈ కవితలోని భావాలు చాలా లోతుగా భావోద్వేగంగా ఉన్నాయి.
“ఇదెలాంటి విషమో …ఏమో హృదయాల్లో/“నిండి పోయింది ?/ ఈ కవితా పంక్తి చాలా తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది మనసుకు చెప్పలేని బాధను,తీవ్రమైన కలతను కలిగించే ఏదో ఒక సంఘటన లేదా పరిస్థితి హృదయాలను ప్రభావితం చేస్తోంది.ఇది అనుభవంతో తాను ఎదుర్కొన్న చిన్నపాటి సమస్యను,అంతు లేని విషాదాన్ని సూచిస్తోంది.ఒక వైవిధ్యమైన అసహనాన్ని మనసులో నిలుపుతుంది.
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే/ ఉన్నాయి/’ అంటే ఈ కవితా పంక్తి ధార్మికతను మరియు ప్రగాఢమైన తాత్విక భావనను వ్యక్తపరుస్తుంది.మనిషి మరణం అనగా శరీర రూపంగా అతను లేకపోవడం,కానీ,అతను చేసిన పనులు,ఆలోచనలు,జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంటాయి.ఇక్కడ నీడలు అనగా మనిషి శరీరాన్ని విడిచి పోయిన తర్వాత కూడా అతని జ్ఞాపకాలు, అతని ప్రభావం లేదా అతని చేష్టలు,ఇంకా మన జీవితాల్లో కొనసాగుతాయి అని చెప్పవచ్చు.నీడలు అనేది ఆ వ్యక్తి ప్రాముఖ్యతను,ప్రభావాన్ని తెలుపుతాయి.ఇది మన మరణానంతరం కూడా మిగిలి ఉండి,జ్ఞాపకాల ప్రాధాన్యతను చూపిస్తుంది. ఇది మనిషి జీవితం మరియు మరణం మధ్య ఉండే సంబంధాన్ని మరియు మన దైనందిన జీవితాలపై అది చూపించే ప్రభావాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ షాయరీ కవిత మన జీవితం,మరణం వాటి మధ్య సంబంధం మరియు తన జీవితం ముగిసినా అతని జ్ఞాపకాలు,ప్రభావాలు ఎలా కొనసాగుతాయో ఆవిష్కరించేందుకు చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (26)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న
“ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని
“అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం
“కురవాలని కోరుకున్నారు చూడండి !
ఈ కవితా పంక్తిలో ఆంతర్యం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది.కవి గుల్జార్ హృదయంలో చెలరేగే భావాలను ప్రతీకాత్మకంగా చెప్పిన విధానం కనిపిస్తుంది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న/ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని/”దీని అర్థం ఏమిటంటే నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇంకా పచ్చిగా,తడిగా ఉంది. ఇక్కడ ‘ఇల్లు పచ్చిగా ఉండటం’ అనేది కొత్తగా నిర్మించిన ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు అని సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి సొంత జీవితంలో కొత్తగా ప్రారంభించిన పని లేదా పరిసరాల గురించి చెప్పే ప్రతీకగా కూడా భావించవచ్చు. “అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం/కురవాలని కోరుకున్నారు చూడండి/అంటున్నారు.ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది.కానీ,వర్షం కోసం ప్రార్థనలు చేయడం అంటే జనాలు తమ అవసరాలు కోసం ప్రయత్నించడం మరియు ప్రకృతి సహకారం కోరుకోవడం సూచిస్తుంది.జనాలు వర్షం కురవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.వర్షం అనేది బాహ్య పరిస్థితే అయినా,వర్షం వల్ల ఇల్లు తడిసి నష్టం కలిగించవచ్చు.ఏదైనా జరిగితే ఇల్లు తడిసిపోయే అవకాశం ఉందని కూడా అర్థం అవుతుంది.ఈ కవితా పంక్తులు వ్యక్తిగత మరియు సామాజిక స్థితి మధ్య విరుద్ధతను చూపిస్తున్నాయి.అతను పచ్చగా ఉన్న తన కొత్త ఇల్లును సంరక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ,జనాలు తమ అవసరాల కోసం కోరుకునే కోరికల వల్ల తనకు సమస్యలు,వచ్చే అవకాశాన్ని తెలియజేశారు.కవి వ్యంగ్య రీతిలో వ్యక్తిగత జీవితం మరియు సామాజిక ప్రవర్తన మధ్య గల సున్నితమైన సంబంధాన్ని కవిత ద్వారా ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది భిన్నమైన సందర్భాల్లో మనుషుల తీరును ప్రతిబింబించే ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పిన కవి గుల్జార్ భావాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (27)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“చూడు ! నా మీద అలిగితే … మా “అమ్మలాగే అలుగు !
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది
“సాయంత్రానికల్లా మరిచిపోయి నన్ను
“దగ్గర తీసేది !
ఈ పంక్తిలో కవి తన భావాన్ని చెప్పే విధానం అర్థపరంగా,ఆసక్తికరంగా ఉంటుంది.ఇందులోని భావం చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా ఉంది.కవితలోని ప్రధాన భావం అమ్మ ప్రేమ పై ఆధారపడి ఉంటుంది.
“నా మీద అలిగితే … మా అమ్మలాగే అలుగు”/కవి తన సహచరునితో లేదా తనకు ఎదురుగా ఉన్న వారితో చెబుతున్నారు.అంటే నువ్వు నా మీద అలిగినా,మా అమ్మలా ఆ అలక తక్కువ సేపే కలిగి ఉండాలి అనే భావాన్ని అందిస్తున్నారు.మా అమ్మకు అలక రావడం సహజం.కానీ,ఆ అలక ఎక్కువ సేపు నిలవదు.ఇక్కడ అమ్మ అనేది ప్రేమకు ప్రతిరూపం. అమ్మను అనురాగం,నిస్వార్థత,క్షమకు ప్రతీకగా ఉపయోగించారు.
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది/సాయంత్రానికల్లా మరిచిపోయి/నన్ను దగ్గర తీసేది/అని అంటున్నారు.
ఇది ఒక ఉదాహరణగా కవి తన అమ్మను గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు.తాను ఉదయం అలిగినా, సాయంత్రానికి ఆ అలక పూర్తిగా మరిచిపోయి, తనను తిరిగి ప్రేమగా దగ్గర తీసుకునేది.అంటే అమ్మ ప్రేమతో,క్షమతో తనను స్వీకరించేది.ఇక్కడ ‘మరిచిపోయి’ అనే పదం క్షమకు సూచన.ఇది అమ్మ ప్రేమలో సహజమైన లక్షణం అని చెప్పవచ్చు.ఇక్కడ అమ్మ ప్రేమను,దయను,క్షమను గుర్తు చేస్తూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు.కవి ఈ పంక్తి ద్వారా ఎవరితోనైనా సంబంధాన్ని మధురంగా కొనసాగించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మలా ప్రేమతో మెలగాలి.అమ్మలా అలక తక్కువ సేపు ఉండాలి,తర్వాత ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే సందేశాన్ని తెలియ చేస్తున్నాడు.అమ్మ ప్రేమ ఎంతో గొప్పది.అమ్మలో స్వార్థం అనేది ఇసుమంత కూడా కనిపించదు.మనం కూడా అమ్మలాగే నిస్వార్థంగా ఉండాలి అని సూచిస్తున్నాడు.ఈ కవితలో వ్యక్తిత్వం,సంబంధాల కొనసాగింపుల గొప్పతనం వ్యక్తం అవుతుంది.ప్రత్యేకంగా ఏవైనా కొట్లాటలు,ఆగడాలు,అలకలు కలిగినప్పుడు కూడా ప్రేమతో మెలగాలి అని చెప్పడమే ప్రధానమైన ఉద్దేశ్యం.ఈ కవితలోని అద్భుతమైన భావాలు
పాఠకులను హృదయాలను రంజింప చేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (28)
తెలుగులోకి అను సృజన ; కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నిప్పు రాజేసే వాళ్లకు ఏం తెలుసు !
“గాలి దిశ మార్చుకుంటే వాళ్లు కూడా కాలి
“బూడిదవుతారని ??
ఈ కవితా పంక్తులలో లోతైన భావనతో కూడిన ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది.ఇది జీవిత సత్యాన్ని తెలిపే సున్నితమైన సామెతలా కనిపించడమే కాదు,పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.
“నిప్పు రాజేసే వాళ్లకు’/అంటే ఇతరులకు సమస్యలు సృష్టించే వాళ్ళు,అకారణంగా కలహాలు రేపే వాళ్ళు, తప్పుడు పనులు చేసే వాళ్ళు,ఎదుటి వాళ్లకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.స్వార్థపరుల తలంపులు,ఆలోచనలు, చేసే పనులు ఎల్లప్పుడు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడాని కోసమే ఉంటాయి.సమాజంలో స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఇతరుల జీవన విధానంలో కలిగించుకుని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తారు.
“గాలి దిశ మార్చుకుంటే/”అంటే గాలి అనే పదం ఇక్కడ పరిస్థితులను లేదా సమయాన్ని సూచిస్తుంది.జీవితంలో ఏదీ ఒక్క చోటే స్థిరంగా ఉండదు.సమయాన్ని బట్టి పరిస్థితులు అప్పటికప్పుడు మారుతాయి.కన్ను మూసి తెరిచేలోగా క్షణం మారినట్టు,కాలచక్రం గిర్రున తిరుగుతుంది.గాలి దిశ అంటే పరిస్థితుల గతి.గాలి దిశ మారిపోతే ఎవరి స్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?జీవితం ఏ వైపున పయనిస్తుందో ఎవరికి తెలియదు.తాము రాజేసిన మంటలు దిశ మార్చుకుని తమను కూడా కాల్చి బూడిద చేయ వచ్చు.మారిపోయే పరిస్థితిని ఊహించడం ఎవరి తరం కాదనేది స్పష్టం అవుతున్నది.
“వాళ్లు కూడా కాలి బూడిద అవుతారని “/ఎవరైనా వారు చేసే చర్యల ప్రభావం ఒక్క సారిగా తిరగబడితే అది వారి మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది.ఇది కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తుంది. దుర్మార్గంగా చేసే పనుల ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు తమ పైన కూడా పడుతుందని చెప్పడం, ఎవరైనా దానవుల వలె రాక్షస ప్రవృత్తితో నడుచుకుంటే తాను తీసిన గోతిలో తానే పడడం జరుగుతుంది.దాని వల్ల కలిగే ఫలితం తనకే హాని కలిగిస్తుంది.సామాజికంగా లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా హాని చేసే పని చేయడం వల్ల చివరికి అది వాళ్ళకే బెడిసికొట్టి తీరని నష్టంగా మారుతుంది అనే సందేశం తెలియజేస్తుంది.దుష్ట కార్యాలు చేయడం తాత్కాలికంగా లాభం కలిగించినప్పటికి,దీర్ఘ కాలంలో వాటి ప్రభావం తిరగబడి,ఆ దుష్కా.ర్యాలు చేసిన వారికే కష్టాలు కలుగుతాయి.అందు వల్ల ఇతరులకు మంచి చేయడం,న్యాయంగా నడుచుకోవడం,మనకు సమాజానికి మంచిది అని తెలియజేస్తుంది.ఎవరికైన హాని చేయడానికి ప్రయత్నించే ముందు ఆ కర్మల ప్రభావం తిరిగి తమ పైనే దాడి చేస్తుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి అనే సందేశం కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతోంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (29)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు …
“ఎవరికి తెలుసు …ఎప్పుడు ఏ వీధి మలుపులో
“జీవితం అస్తమిస్తుందో ….?
ఈ కవితా పంక్తులు జీవితం యొక్క అస్థిరతను, దాని ఆవశ్యకతను తెలియజేస్తుంది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు”
అనే చరణంలో ఒక వ్యక్తి తన మనసుకు సంబంధించిన ముఖ్యమైన జ్ఞాపకాలను ఎప్పటికీ తనతో ఉండాలని కోరుకుంటున్నాడు.ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు.’ఉదయం’ అన్నది దినచర్యలో ఒక భాగం,ఇది రోజు వారి జీవితంలో కొత్త ప్రారంభాలకు సూచనగా నిలుస్తుంది.ఆ జ్ఞాపకాలతో కొత్త జీవన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని జీవనం గడపాలనే భావనను వ్యక్తం చేస్తుంది.
“ఎవరికి తెలుసు … ఎప్పుడు ఏ వీధి మలుపులో/జీవితం అస్తమిస్తుందో … /అనేది జీవితం యొక్క అనిశ్ఛితి,అస్థిరతను, తాత్కాలికతను సూచిస్తుంది.మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితిని తెలుపుతుంది. మనకు ముందు ఏం జరుగుతుందో ?ఎక్కడ ఎలా మార్పులు చోటు చేసుకుంటాయో? అనే దానిని ఎవరు ఊహించ లేరు.జీవితం క్షణికం కాబట్టి అది ఎక్కడ ముగుస్తుందో? తెలియదు.జీవితాన్ని సమర్థంగా, గౌరవంగా కొనసాగించాలని,ప్రియమైన జ్ఞాపకాలను,హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి అని తెలియజేస్తున్నది.జీవితం మనకు అందించే ప్రతి క్షణాన్ని,విలువైన కానుకగా భావించి, మధురమైన గత జ్ఞాపకాలను మనసులో నిలుపుకొని,వర్తమానాన్ని ప్రేమతో,ఆసక్తితో ఆస్వాదించాలనే గాఢమైన సందేశం కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (30)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన ; నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు …
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు “కలుగుతుంది.
ఈ పంక్తి ద్వారా ప్రేమకు సంబంధించిన ఒక విలువైన సందేశాన్ని అందిస్తున్నారు.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు”అనేది ప్రేమ యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. ప్రేమను స్వచ్ఛమైనదిగా ఎంచి,స్వార్థం లేకుండా ప్రేమించాలి అని ఇక్కడ సూచిస్తున్నారు.ప్రేమ అనేది నిర్మలమైనది,స్వచ్ఛమైనది.ప్రేమలో స్వార్థం లేకుండా ఉండాలి.ప్రేమించడం అంటే మన హృదయాన్ని ఇతరుల కోసం తెరవడం,వారి మీద మమతను చూపించడం.అయితే దీనికి ప్రతిఫలంగా వారి నుంచి ప్రేమ లేదా గుర్తింపును ఆశించడం,మన దుఃఖానికి కారణం అవుతుంది.
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు”అని చెప్పడం,ఎవరైనా నిస్వార్ధంగా ప్రేమిస్తే దుఃఖం కలగదు.ప్రేమ సహజంగా స్వచ్ఛతతో కూడి ఉండాలి.ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించ కూడదు.నిస్వార్థంగా ప్రేమిస్తే దుఃఖం కలుగదు.కానీ మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి తిరిగి ప్రేమను ఆశించి అది లభించకపోతే దుఃఖం కలుగుతుంది.
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు కలుగుతుంది”/అని సూచించడం వల్ల మన దుఃఖానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ప్రేమకు ప్రతిఫలం ఆశించడం ద్వారా ఆశలు పెరుగుతాయి. కానీ ఆ ఆశలు తీరకపోతే బాధ కలుగుతుంది. అందుకే ప్రేమ ఏ ప్రతిఫలాన్ని ఆశించనిదై ఉండాలి. ఈ భావం మనకు ఇతరులతో సంబంధాలను మరింత మంచిగా దృఢంగా నిలిపే మార్గాన్ని చూపుతుంది.మొత్తానికి ప్రేమను స్వార్థరహితంగా ప్రకటిస్తే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. అందు వల్ల ప్రేమను పంచడమే కానీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకూడదనే భావన అని కవి గుల్జార్ కవితలో వ్యక్తం అవుతున్నది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (31)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీతో విసిగి వేసారిపోయామన్న వారిని
“వదిలివేయి
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి
“పోవడమే మంచిది.
ఈ పంక్తులు అందంగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది మరియు లోతైన భావనను కలిగి ఉంది.దీనిలో వ్యక్తిగత సంబంధాల మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యతను గురించి చర్చించబడింది.
“నీతో విసిగి వేసారి పోయామన్న వారిని వదిలివేయి’/ఎవరు మనతో విసిగి వేసారి పోతారో, మనను అంగీకరించలేకపోతారో,అలాంటి వారిని వదిలి వేయడం మంచిదని సూచిస్తోంది.ఈ పంక్తిలోని భావన ఏమిటంటే,మన సమీపంలో ఉన్న వారు మనపై విసుగు చెంది,మనతో ఉండటానికి ఇష్టపడకపోతే,వారిని బలవంతంగా మనతో ఉంచడం అవసరం లేదని,ఎవరు మనకు అనుకూలంగా వ్యవహరించరో వారిని విడిచి పెట్టడమే సరైనదని అర్థం.
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి/ పోవడమే మంచిది.”/ఎందు కంటే మనం వారికి భారంగా అనిపించడం కన్నా,మనతో గడిపిన మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవడం మంచిది.మన కుటుంబంలో,స్నేహితులలో లేదా ఇతర సంబంధాలలో మనం బలవంతంగా ఉండి వారికి మనం భారంగా మారడం మంచిది కాదు.ఒక వ్యక్తికి చెందిన గొప్ప జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉంటాయి.అందు వల్ల సంబంధాన్ని బలవంతంగా కొనసాగించకుండా గౌరవంగా ముగించడం మంచిదని చెప్పే ప్రయత్నం ఇది.ఇతరులతో మన సంబంధాలు బాగా ఉండాలి.ఇతరులతో మన సంబంధాలు భారంగా మారితే శాంతియుతంగా దూరమవడం కూడా ఒక మంచి నిర్ణయం.ఇది సంబంధాలను హాని లేకుండా,గౌరవంగా ముగించుకునే సమర్థమైన మార్గం అని కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (32)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“దోస్త్ …గుర్తుంచుకో ! కాలం గడిచే కొద్దీ నేనేమో
“అందరిలా మారిపోతాననుకోకు !
“నిన్నెప్పుడు కలిసినా … గతంలోలాగే ఉంటుంది
“నీతో నా వ్యవహారం.
ఈ కవితా పంక్తులు స్నేహానికి,బంధానికి గల అవినాభావ సంబంధాన్ని సూచిస్తాయి.
“కాలం గడిచిన కొద్దీ నేనేమో/అందరిలా మారిపోతాననుకోకు/ అని స్పష్టంగా చెప్పడం,కాలం ఎంత మారినా,తాను తన వ్యక్తిత్వాన్ని,తన స్వభావాన్ని మార్చుకోనని స్పష్టం చేస్తున్నాడు.ఇది అతని నిజాయితీకి,స్థిరత్వానికి నిదర్శనం.కాలం ఎంత గడిచినప్పటికీ నేను మారిపోనని నిన్ను చూసిన ప్రతి సారి,మన అనుబంధం,మన స్నేహం గతంలో ఎలా ఉందో,ఇప్పుడు అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాడు.
నిన్నెప్పుడు కలిసినా .. గతంలోలాగే ఉంటుంది”/ అని అంటున్నాడు.స్నేహం ఎంత కాలం గడిచినా మారదు.స్నేహితుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడు పూర్వం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది అనేది వాస్తవంగా తోస్తుంది.
“నీతో నా వ్యవహారం”/ఈ కవితా పంక్తి సంబంధం మీద ఉన్న విశ్వాసాన్ని తెలియ జేస్తుంది.నా నడవడి నీతో ఎప్పుడు నిస్వార్థంగా,నిజాయితీతోనే ఉంటుంది.నా స్వభావం ఎప్పటికీ మారదు.నీతో నా స్నేహం ఎప్పటికీ అదే తరహాలో ఉంటుంది అని చెప్పే ఓ హామీగా చూడవచ్చు.ఈ షాయరీ కవితలోని భావన ఒక వ్యక్తి తన మిత్రుడితో గల అనుబంధాన్ని,మారని వ్యక్తిత్వాన్ని,కాలం ఎంత మారినా స్నేహం వారి మధ్య గల అనుబంధం ఎప్పటికీ మారదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. అసలుసిసలైన స్నేహం కాలంతో మారదు.అది కేవలం హృదయానికి సంబంధించినది.కవి గుల్జార్ స్నేహానికి, అనుబంధానికి గల గాఢతను షాయరీ కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (33)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నేను అమాయకుడినే కావొచ్చు కానీ,
“నేనెలాంటి
“వాడినో తెలియదు నీకు !
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి
“ముక్కలవగలను !
ఈ కవితా పంక్తిలోని భావం ఒక వ్యక్తి తన అంతర్ముఖ భావనలను వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ చెప్పినది.
ఇది ప్రస్తుతానికి అతని ప్రాధాన్యతల గురించిన లోతైన ఆలోచనను తెలియజేస్తుంది.
“నేను అమాయకుడినే కావొచ్చు/కానీ,వ్యక్తి తన అమాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాడు.ఇది అతనిలోని నిజాయితీని సూచిస్తుంది.ఈ పంక్తిలో అతను తనను నిందించే వారికి సమాధానమిస్తున్నట్లు ఉంది.
“నేనెలాంటి వాడినో తెలియదు నీకు”/కానీ,అతను నిజానికి ఎలా ఉంటాడో,అతని గొప్పతనాన్ని, త్యాగపరత్వాన్ని ఇతరులు గుర్తించడం లేదని తపన పడుతున్నాడు.తన మనసులోని భావాలను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.తన వ్యక్తిత్వం గురించి,తన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియని తీరును తెలియజేస్తున్నాడు.
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి/ ముక్కలవగలను/అని అంటున్నాడు.ఇది తన ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. అతడు తన ఆనందం కోసం ఎంత గొప్ప త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు.అవసరమైతే వంద సార్లు విరిగి ముక్కలైనప్పటికీ తన ఆనందాన్ని దక్కించుకోవడంలో వెనుకాడడు.ఇది అతని త్యాగానికి,తన భావోద్వేగాలకు అద్దం పడుతుంది. ఈ కవితా పంక్తి తన బాధ్యతాయుతమైన ప్రేమ పూర్వక స్వభావానికి ప్రతీక.అది తన లక్ష్యాలకు ఆటంకంగా వచ్చిన ఎన్నింటినైనా ఎదిరించి,తన ఆనందాన్ని సాధించడంలో వెనుకడుగు వేయని తత్వాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో ఒక వ్యక్తి తన అసలైన స్వరూపాన్ని తెలియజేసే ప్రయత్నం కనిపిస్తోంది.అతను అమాయకుడిగా కనిపించినప్పటికీ,అతని భావోద్వేగాలు లోతైనవి. తాను స్వార్థ రహితమైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.తన ఉన్నతమైన లక్ష్యాలను, ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారని స్పష్టం చేస్తున్నాడు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావాలు బాగున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(34)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఈ జీవితం నా మీద ఎందుకో
“అలిగినట్లుంది
“పోనీయ్ …ఇంకా వదిలేయ్ …
“ఇదేమి మొదటి సారి కాదుగా
“అలగనీ
ఈ కవితా పంక్తుల్లో జీవితాన్ని ఒక కష్ట సాధ్యమైన ప్రయాణంగా చూడటం కనిపిస్తుంది.
“ఈ జీవితం నా మీద ఎందుకో అలిగినట్లుంది”/అంటే జీవితంలో కొన్ని కష్టాలు, నిరాశలు ఎదురవుతు కలవరం కలిగిస్తున్నాయి. కానీ,ఆ కష్టాలు,సమస్యల గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం,బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.నష్టమే ఎక్కువగా ఉంటుంది.ఈ కవితా పంక్తి తన మనసును పిండేస్తున్న నిరాశను,ఒత్తిడిని,జీవితం ఎందుకో ఇంత అన్యాయంగా ఉంది అనే భావనను వ్యక్తం చేస్తోంది.
“పోనీయ్ … ఇక వదిలేయ్ …”/ అని తాను మనసులో అనుకోవడం ఒక రకమైన బాధ నుంచి విముక్తి పొందటానికి చేసే ప్రయత్నం.ఇది అన్ని వదిలివేయడం కాదు,అన్ని పట్టించు కోకుండా ఉండడం కాదు.తాను జీవితాన్ని ఒక కొత్త కోణం నుండి చూసే ప్రయత్నం.తాను తన మనసులో నిండిపోయిన బాధను తేలికగా మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించవచ్చు.ఇందులో ఓ రకంగా జీవితంలోని కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా వాటిని మరిచిపోయి ముందుకు సాగమనే సూచన దాగి ఉంది.
“ఇదేమి మొదటిసారి కాదుగా”/అని వ్యక్తం చేయడం వెనుక తాను ఇప్పటికే జీవితంలో ఇలాంటివి ఎన్నో సవాలక్ష సవాళ్లను సులభంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయిన తీరు కనిపిస్తుంది.కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ధైర్యంగా ఉంటూ ఈ క్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మంచిది. ఇదేమి మొదటి సారి కాదుగా అనే చరణం చాలా కీలకంగా తోస్తుంది.తనకు జీవితంలో ఇప్పటికే అనేకానేక కష్టాలు,సమస్యలు ఎన్నో ఎదురైనాయని వాటిని ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉందని తెలియజేస్తున్నాడు.తన జీవితం తాత్కాలికంగా విసిగి ఉన్నదని అంటున్నాడు.తన జీవితం అన్యాయానికి లోనైందని దానిని సరిదిద్దడానికి తాను తన ఎదలోపల ఒక పరిష్కారం కోసం చేసే తపన,ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇదేమి మొదటిసారి కాదుగా అనే మాటలు,గతంలో కష్టాలను అధిగమించిన అనుభవాలను గుర్తు చేస్తాయి.ఈ షాయరీ కవితలోని ప్రధాన ఉద్దేశం తాను కష్టాలను స్వీకరించి వాటిని అధిగమించ గల శక్తి తనకు ఉందని తెలియజేయడం.జీవితానికి అర్థం ఏమిటి?అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.ఇంత వరకు తాను కష్టాలను ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉంది.మళ్లీ కూడా తాను అదే శక్తితో ముందు కెళ్లగల సాహసం ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును కూడా స్వీకరించాలి.అప్పుడే తనను తాను నిరూపించుకోవడం జరుగుతుంది.జీవితం ఎప్పుడో ఒక్కోసారి పరీక్షకు గురి చేస్తుంది.నిరాశ, నిట్టూర్పులు,అదో రకం బాధ ఏదోలా అనిపించినప్పుడు,మనసుకు శాంతి నిచ్చే పని చేయడం,ధైర్యంగా ముందుకు సాగడం అనివార్యం అని కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(35)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు
“క్షణాలు భద్రంగా దాచిపెట్టుకున్నాను !
“కానీ అవి ఎక్కడ … ఎప్పుడు
“ఖర్చైపోయాయో కూడా తెలీనే లేదు …
ఈ కవితా పంక్తులు జీవితం మీద లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు క్షణాలు భద్రంగా దాచి పెట్టుకున్నాను/అంటున్నాడు. జీవించడానికి కొన్ని తన కాలపు క్షణాలను భద్రంగా దాచి పెట్టుకున్నా.జీవితంలోని అతి ముఖ్యమైన, విలువైన క్షణాలను జాగ్రత్తగా దాచి ఉంచుకున్నాడు అని అర్థం. “అవి ఎక్కడ … ఎప్పుడు/ఖర్చయి పోయాయో కూడా తెలీనే లేదు”/అని అంటున్నాడు.జీవితం అనేది ఎన్నో ఆకాంక్షలతో,ప్రయాణాలతో నిండిన ప్రక్రియ.మనం అప్రమత్తంగా లేకపోతే సమయాన్ని ఎలా గడిపామో కూడా తెలియదు.ఇది కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో,మళ్లీ తిరిగి రానిదో అనే విషయాన్ని గుర్తు చేస్తుంది.జీవితంలో కొన్ని మంచి అపురూపమైన సమయాలను భద్రంగా దాచి ఉంచాలని అనుకుంటాం.కానీ, కాలం ఎవరికి చిక్కక విలువైన క్షణాలు తెలియకుండానే ఇట్టే గడిచి పోతాయి.ఇది జీవితం ఎంత క్షణభంగురమైనదో, సమయం ఎంత విలువైనదో తెలియజేస్తుంది.మన జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంది,దానిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ కవితా పంక్తి తెలియ జేస్తుంది.కాలం అనేది నిరంతరం కదులుతూనే ఉంటుంది.మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.మనం తెలియకుండానే అనవసర విషయాల్లో తలదూర్చితే అత్యంత విలువైన సమయాన్ని కోల్పోతాం.జీవితంలో ప్రతి క్షణాన్ని చురుకుగా ప్రయోజనకరంగా వినియోగించాలని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి అనే ప్రేరణను కలిగిస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (36)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను
“సిగ్గుపడేట్లు ఎందుకు చేసావు ?
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు?
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో .. అదిగో
“అలానే నా పరిస్థితి !
ఈ కవితా పంక్తులు లోతైన భావోద్వేగాలతో నిండినవి.తాను జీవితంలో ఎదుర్కొంటున్న బాధను,బాధ్యత లేకుండా వదిలేసిన వారి చర్యల వల్ల కలిగిన హృదయ వేదనను తెలుపుతున్నాయి
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను/సిగ్గు పడేట్లు ఎందుకు చేసావు?/అంటే మాట్లాడుతున్న వ్యక్తి తన జీవితంలో కలిగిన బాధను ప్రతి రోజు గుర్తు చేయడాన్ని మళ్లీ మళ్లీ వినలేకపోవడం వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.తాను తన పరిస్థితిని ఎల్లప్పుడు గుర్తు చేయడం వల్ల తనలో ఉన్న బాధ మరింత రెట్టింపు అవుతుంది.ఇది తనకు కలిగిన మానసిక ఆవేదనను స్పష్టం చేస్తోంది.
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు ?/అని అంటే ఇంకా నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా. ఇప్పుడు నీవు ఇంతకు పూర్వం నన్ను చూసిన విధంగానే బాధలను అనుభవిస్తూ ఉన్నాను.నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో తిరిగి అదే స్థితిలో ఉన్నాను అనే భావనను తెలియజేస్తున్నాడు..
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో… అదిగో అలానే నా పరిస్థితి/అంటే ఇక్కడ తన జీవితం ఎలాంటి మార్పు లేకుండా ఎటువంటి పురోగతి లేకుండా అదే స్థితిలో కొనసాగుతుందని అతను తెలుపుతున్నాడు.తనను పట్టించుకోనట్టి బాధ్యతాహీనతను స్పష్టంగా ఎత్తి చూపుతున్నాడు. ఇది తాను ఎవరో ఒకరిని నమ్మినారు,ఆ నమ్మిన వ్యక్తి వారిని మధ్యలో వదిలి వేయడం వల్ల ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని,బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుపుతుంది.ఈ పంక్తులు ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోని లోతైన బాధలను ప్రతిబింబిస్తాయి.అతను వదిలిపెట్టడం వల్ల తాను అనుబంధాన్ని కోల్పోవడం,ఒంటరితనం ఎదుర్కోవడం జరిగింది.ఈ కవితలో భావోద్వేగాల తీవ్రత మరియు సంబంధం పట్ల బాధ్యత అనేది లేకపోవడం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (37)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి
“ఎవరైనా …
“ఆమె కలలో కొచ్చిన రాత్రి మెలకువ
“వచ్చేస్తుంది ….
“హృదయం ముక్కలవుతుంది?!
ఈ కవితా పంక్తులు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి/ఎవరైనా…/ఇది ఒక ఆకాంక్షను,ఒక విజ్ఞాపనను వ్యక్తం చేస్తోంది.ఆమె అంటే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి అని,ఆమె గురించి తనకు బలమైన భావనలు ఉన్నాయని తెలియ జేస్తున్నాయి.నా కళ్ళల్లోకి రావద్దని అంటే ఎందుకో తెలియదు?ఆమె చూపులు తన మనసుని కలవరం కలిగిస్తాయి.ఆమె గుర్తుకు వచ్చి ఆమెకు చెందిన ఆలోచనలు వేధించి,వెంటాడుతాయి.తాను ఆమెను ఎంతగానో గాఢంగా ప్రేమించాడు.కాబట్టి తన ఆవేదనను ఈ కవిత పంక్తులలో వ్యక్తం చేస్తున్నాడు.
“ఆమె కలలోకొచ్చిన రాత్రి మెలకువ వచ్చేస్తుంది …/ ఎందు కంటే ఆమె కలలో వచ్చినట్లయితే తన నిద్రకు భంగం కలుగుతుంది.ఆ ఆలోచన వల్లనే తన హృదయం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇది ఒక చిధ్రమైన అనుభవాన్ని చెప్పే పంక్తి.ఆమె కలలోకి వచ్చి తన నిద్రను దూరం చేస్తోంది.ఇది మనసు ప్రశాంతతను కోల్పోయిన పరిస్థితిని సూచిస్తుంది.
“హృదయం ముక్కలవుతుంది?!/అంటే ఇది ప్రేమ,వ్యథ,అసహనాన్ని వ్యక్తపరిచే పదాలుగా కనిపిస్తున్నాయి.ఇది తన మనసులోని బాధ లేదా విరహాన్ని సూచిస్తుంది.ఆమెపై తన ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉందో ఆమెని గుర్తు చేసుకునే ప్రతి సారి హృదయం బాధపడుతుందని ఇది తెలియజేస్తుంది.
ఈ షాయరీ కవితా పంక్తులు ప్రేమ,విరహం,బాధల నడుమ ఉండే అంతరంగిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక వ్యక్తి తన మనసులోని అలజడిని, హృదయంలోని బాధను వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.కవి గుల్జార్ ఎవరో తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ తనలో కలిగే భావోద్వేగాలను షాయరీ కవితా రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (38)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా
“ఉంటుందనుకున్నావు ?
“నీతోనే మొదలవుతుంది …
“నీవుగానే ముగుస్తుంది !
ఈ కవితా పంక్తులు మనసులో ఊహ ప్రపంచం గురించి,వ్యక్తిగత భావోద్వేగాలను,ఆత్మీయ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి.ఇందులోని ఒక్కో పదం ఒక లోతైన భావనను వ్యక్తపరిచేలా ఉండటం గమనించవచ్చు.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా/ ఉంటుందనుకున్నావు?/ఊహ ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు.మన ఊహా ప్రపంచం మనకి ఎంతో ప్రత్యేకమైనది.దీన్ని వేరొకరితో పంచుకోవాలనుకోవడం ఒక భావోద్వేగం.ఆ వ్యక్తి తన ఊహలకు సంబంధించిన కేంద్ర బిందువుగా ఉందని చెప్పే ప్రయత్నం ఇది.
“నీతోనే మొదలవుతుంది …/అంటే ఇది జీవితంలోని ఆరంభం,స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుందో చూపుతుంది.తన ఊహలు,తన కలలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తితోనే ప్రారంభం అవుతాయన్న భావన గోచరిస్తుంది.ఇక్కడ ఆ వ్యక్తి ప్రాముఖ్యత,ప్రేమను వ్యక్తం చేస్తుంది.
“నీవు గానే ముగుస్తుంది !ఇది తన జీవిత ప్రయాణం.ఆ వ్యక్తితోనే ముగుస్తుందన్న భావనను సూచిస్తుంది.నీతోనే మొదలవుతుంది..నీవుగానే ముగుస్తుంది.ఇది ప్రేమ భావనను ఆ వ్యక్తి ప్రాముఖ్యతను వ్యక్తపరుస్తుంది.ఆ వ్యక్తి లేకపోతే తన ఊహా ప్రపంచానికి,తన కలలకు,తన జీవితానికి ఎలాంటి అర్థం ఉండదని స్పష్టంగా చెప్పడం.తన ఊహల ప్రపంచం ఆ వ్యక్తితోనే ప్రారంభమై అదే వ్యక్తితో ముగిసేంతగా బలపడిందని అర్థమవుతుంది.ఈ షాయరీ కవితా పంక్తులు ఒక సునిశితమైన ప్రేమను,ఆత్మీయతను,అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక్క స్నేహం,ప్రేమ లేదా బంధానికి సంబంధించిన భావంగా భావించవచ్చు.ఈ భావాలు తన జీవితంలో సహజమైన సంబంధం ఎలా ఉంటుందో తెలుపుతాయి.ఈ కవితలో తాను ఎవరినైతే అంత గాఢంగా ప్రేమిస్తాడో వారికే తన జీవితం అంకితం అవుతుంది అనే భావన వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (39)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా
“ఉంది …
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా !
ఈ కవితా పంక్తి ఒక రూపకం (metaphor) ద్వారా వ్యక్తీకరించబడింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా/ఉంది/అని చెప్పడం ద్వారా ఆ ప్రేమ అత్యంత విలువైనదిగా లేదా అందరికీ సులభంగా అందని దానిగా అభివర్ణించబడుతోంది.
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా/అంటే మీ ప్రేమ చాలా విలువైనదిగా అనిపిస్తుంది.అది రోజు రోజుకి పెరిగే ఖరీదైన వస్తువుల ధరల మాదిరిగా ఉంది. అంటే,అది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా లేదు.కానీ ఎంతో విలువైనదిగా ఉంది.ఇది ప్రేమ విలువ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పడమే కాకుండా దాన్ని పొందడం కష్టతరంగా మారుతోందనే భావనను కూడా సూచిస్తుంది.ప్రేమ ఎంత ఎక్కువ ఆత్మీయతను కలిగిస్తుందో,అది అంత విలువైనదిగా భావించబడుతుంది.రోజు రోజుకు ప్రేమలో కలిగే కొత్త అనుభూతులు,మధురమైన క్షణాలు,ఆ ప్రేమ విలువను మరింత పెంచుతాయి. ప్రేమను సాధించడం లేదా దానిని పొందడం చాలా కష్టం అవుతుందనే భావన కూడా ఇందులో దాగి ఉంది.ప్రేమ రోజు రోజుకు పెరిగి అది సాధించలేనిదిగా అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు ఆ ప్రేమ విలువను, ప్రేమలో దాగి ఉన్న విశిష్టతను,ప్రేమ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది.అలాగే ప్రేమను పొందడం ఎంతో కష్టం అనే వాస్తవాన్ని వ్యక్తం చేస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావనలు అద్భుతంగా ఉన్నాయి.పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయి.
Narendra Sandineni
Narendra Sandineni
నా పేరు: నరేంద్ర సందినేని.మా ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని ధర్మారం మండలం లోని గోపాలరావుపేట గ్రామం.కరీంనగర్ లో నివాసం. 1981-1983 నేను ఇంటర్ చదువుతున్నప్పుడు 3 కథలు, 6 కవితలు రాశాను.వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.నేను డిగ్రీకి వెళ్లిన తర్వాత నా రచనా వ్యాసంగం కొనసాగించలేదు.నేను బికాం. ఎల్.ఎల్.బి చదివాను.1994 నుండి కరీంనగర్ లో న్యాయవాది గా కొనసాగుతున్నాను. 6-6-2019 రోజున నేటి నిజం పత్రిక లో మద్యం మత్తు దీర్ఘ కవిత ప్రచురితం.కరోనా కాలం దాదాపుగా రెండు సంవత్సరాలు కోర్టులు నడవలేదు. విరామ కాలం లో 30 కవితల పై విశ్లేషణా వ్యాసాలు రాశాను.అన్ని వివిధ పత్రికల్లో ప్రింట్ అయ్యాయి.5 వ్యాసాలు సీనియర్ న్యాయవాదుల గురించి రాశాను.ప్రింట్ అయ్యాయి. ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను.
ముదిగొండ ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్,ముదిగొండ ఈశ్వర చరణ్ కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.భారతదేశం పసిడి పంటలకు నిలయం.ఎందరో మహర్షులకు జన్మ నిచ్చిన తపో భూమి.భారతదేశం వేదాలు, ఉపనిషత్తులు,పురాణాలు,కావ్యాలు,రామాయణ, మహాభారత,భాగవతాదులు వ్యక్తుల జీవనాడులలో విజ్ఞానవాహినులుగా ప్రవహించిన పుణ్యభూమి. పూలు,పండ్లతో,పక్షుల కిలకిలరావాలతో అలరారే ఉద్యానవనంలోనికి గుడ్లగూబలు చొరబడి తోట విధ్వంసమైనట్లుగా మన దేశంలోకి విదేశీయులు అక్రమంగా అడుగు పెట్టడంతో దేశ పూర్వ వైభవమంతా నశించింది.పూర్వపు ప్రాభవంతో విలసిల్లుతున్న మన దేశ గడ్డ పై విదేశీయులు అడుగు పెట్టి మన సంస్కృతిని,మట్టిలో కలిపిన తీరునకు ప్రతీక ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత.జాతికి గ్రహణం పట్టడం అనే పదం ఒక వ్యక్తి లేదా సమాజంలో జరిగిన ఒక కీలకమైన సంఘటనను సూచిస్తుంది.గ్రహణం అంటే ఒక మార్పు వచ్చే సమయంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన రోజులలో జాతికి అత్యంత ముఖ్యమైన మార్పులు లేదా సంఘటనలు జరుగుతాయి.బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి వీడి భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో జాతికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.దేశంలో సాంఘిక,రాజకీయ పరిణామాలు సంభవించి సమాజము మరియు జాతిలో మార్పులు కలిగినాయి.సమాజంలో కొనసాగుతున్న అన్యాయాలు,అసమానతలకు సంబంధించి ప్రజలలో కలిగిన మౌలికమైన చైతన్యం,దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం,అభివృద్ధి వంటి అంశాలు జాతి ప్రగతిని ప్రభావితం చేస్తాయి.జాతికి గ్రహణం పట్టిన రోజున జరిగే సంఘటనలు,జరగవలసిన మార్పులు అనేకం ఉంటాయి.జాతికి గ్రహణం పట్టడం అనేది సమాజానికి సంబంధించిన ప్రతి అంశంలో చోటు చేసుకునే మార్పుల సమాహారాన్ని సూచిస్తుంది.ఇది జాతిలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేయ గల సందర్భంగా చెప్పవచ్చు.

జాతికి గ్రహణం పట్టిన రోజు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.అందమైన ఆ రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.గతించిన ఆ అందమైన రోజును మరువ లేకున్నాం.అది ఇప్పటికే మనసులో మెదులుతూనే ఉంది.అందమైన ఆ రోజు ఇంకా జ్ఞాపకం ఉన్నది.అందమైన ఆ రోజు సాంప్రదాయికంగా ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన సంఘటనల సందర్భాన్ని సూచిస్తుంది.అందమైన ఆ రోజు భావోద్వేగాలతో కూడిన జ్ఞాపకాలను మరియు వ్యక్తిగత అనుభవాలను అందిస్తుంది.ఆ రోజు నూతనమైన ఆరంభాలను అనుభవాలను, విజయాలను గుర్తు చేస్తుంది.అందమైన ఆ రోజు ఒక రకమైన సంతోషాన్ని,మనసుకు శాంతిని కలిగించేది. అందమైన ఆ రోజు సాహిత్యం,కళలు మరియు సాంస్కృతిక రంగాలలో కలిగిన గొప్ప మార్పును ప్రతిబింబిస్తుంది.భారతీయ సంస్కృతిలో భాగమైన సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,పండుగలు, వివాహాలు,వేడుకలు,అందమైన రోజులుగా గుర్తించబడతాయి.అందమైన ఆ రోజు అనేది కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు.జాతి జనులకు ఆ రోజు అందించిన అనుభూతులను,జ్ఞాపకాలను, ఆలోచనలను,కదిలించే సందర్భం.అందమైన ఆ రోజు జీవితంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక,భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. అందమైన ఆరోజు అనగానే మనసులో ఒక మధురమైన జ్ఞాపకం మిగిలినట్లు ఉంటుంది.ఆ రోజు ఎంతో ప్రత్యేకమైనది.అందమైన ఆ రోజు ఒక పండుగలా మన హృదయాన్ని గులాబీల పరిమళాలు తాకినట్లుగా,సంతోషాన్ని నింపినట్టుగా, మనసుకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని పంచుతుంది. అందమైన ఆ రోజుకు చెందిన జ్ఞాపకం మనలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.మన జీవితంలో ఒక మధురమైన కథలా,అద్భుతమైన చిత్రంలా మన హృదయంలో నిలిచి ఉంటుంది.నీలి జలతారు నీడల్లో/నింగి దోబూచులాడిన రోజు/అంటున్నారు. నీలి రంగు బంగారు అంచు కలిగిన వస్త్రపు నీడలో నింగి దాగుడుమూతలాడిన దినం.మనసులోని అనుభవాలను ప్రతిబింబించే జ్ఞాపకాలను చూపించడానికి కవి తమ కలం నుండి వివిధ రకాల పద చిత్రాలను ఉపయోగిస్తాడు.నింగి జలతారు నీడల్లో అనేది ఆకాశంలోని నీలిమతో కూడి ప్రకృతిలోని సౌందర్యాన్ని సూచిస్తుంది.నింగి దోబూచులాడిన రోజు అంటే ఆకాశం ఉల్లాసంగా కదులుతూ ఆడి పాడిన రోజు.ఆ రోజున ప్రకృతిలోని సొగసైన అందాన్ని వర్ణిస్తూ ఆకాశంలో మబ్బులు కదులుతూ చూడ ముచ్చటగా అందంగా అలంకరించినట్టుగా ఉన్నాయి.వాన చినుకులు పడే ముందర ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం,వాన వెలిసిన తర్వాత మబ్బులు తేలిపోవడం వంటి ప్రక్రియను అందమైన దృశ్యాన్ని తెలుపుతుంది. చుక్కల కాటుక కన్నుల్లో/ముత్యాలు/తళతళలాడిన రోజు/అంటున్నారు.నక్షత్రాల కాటుక కనులలో ఆనందం కారణంగా కన్నీటి ముత్యాలు తళతళ మెరిసిన రోజు.ఒక అందమైన అనుభవాన్ని చెబుతున్నారు.ఒక మనిషి కన్నుల్లో కాటుకను పెట్టుకున్నప్పుడు కళ్ళు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.అప్పుడు కళ్ళు తళతళలాడతూ ముత్యాల వలె ప్రకాశిస్తాయి. చుక్కల కాటుక కన్నుల్లో ఆనంద భాష్పాలు అనే ముత్యాలు తళ తళ లాడిన రోజు.చుక్కల కాటుక కన్నుల్లో ముత్యాలు ధగధగ మెరిసిన రోజు.ఇది ప్రకృతిలోని ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,కొత్తగా వెలువరించే సందర్భాన్ని తెలుపుతుంది.ఇది ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించేందుకు చేసిన ఒక ప్రయత్నం. ఇది మనసులో దాగి ఉన్న అందమైన జ్ఞాపకాలను సృజించగల సామర్థ్యానికి ప్రతీక.ప్రకృతిలోని దృశ్యాలు మనసులోని నిశ్శబ్దతను ఉత్తేజితం చేస్తాయి.కమ్మ తెమ్మెరలు/విందుగా పసందుగా/ కితకితలు పెట్టిన రోజు/కన్నె మబ్బులు/మెల్లగా చల్లగా/తేలిపోయిన రోజు/అంటున్నారు.తీయనైన కమ్మని ఇంపైన పిల్లగాలులు,రుచికరమైన,పసందైన విందును సమకూర్చినట్టుగా గిలిగింతలు పెట్టిన రోజు.కన్నె మబ్బులు మందగమనంతో చల్లదనాన్ని కూర్చుతూ ఆకాశమున తేలిపోయిన దినం.ఈ కవితా పంక్తులు ప్రకృతి అందాన్ని మరియు అనుభూతుల మేళవింపును బలంగా పాఠకుడికి అందిస్తున్నాయి.కమ్మ అంటే అందమైనది, ఆకర్షణీయమైనది.కమ్మ తెమ్మరలు అంటే ఇంపైన పిల్ల గాలులు.ప్రకృతి యొక్క అందాన్ని,సుందరమైన దృశ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి ఉపయోగపడతాయి.ఇది ఒక పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.విందుగా పసందుగా అనేది సంతోషకరమైన మాధుర్యమైన అనుభూతిని అందిస్తున్నది.ఇది ప్రాతః కాలంలో ఒక శుభ సమయంలో జరుగుతున్న సన్నివేశాన్ని మరియు పండుగలు,వేడుకల వంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది.కితకితలు హాస్యానికి లేదా ఆహ్లాదానికి సంకేతంగా చెప్పవచ్చు.పండుగ వేడుకల్లో జరిగే సంఘటనలు,ఆటలు,పాటలు, సంబరాలు ఒక గొప్ప అనుభవాన్ని,ఆనందాన్ని, సందడి వాతావరణాన్ని కల్పిస్తాయి.కన్నె మబ్బులు అనగా మెల్లగా ఆకాశంలో కదలుతున్న మబ్బుల దృశ్యం,నిశ్శబ్దమైన ప్రకృతిని,ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది.మబ్బులు ఆకాశాన్ని కమ్ముకొని కదులుతూ ఉంటే వాతావరణంలో ఒక రకమైన ప్రశాంతత వ్యాపిస్తుంది.తేలిపోయిన రోజు అనేది ఆ దినం గడిచినట్లుగా లేదా ఉత్సవ సమయంలో ఘనంగా జరిగే వేడుకలు,ఒక శ్రేష్టమైన అనుభూతిని వ్యక్తపరుస్తుంది.ఇది వాతావరణంలోని ఉత్సాహం మరియు ఆనందాన్ని,ప్రకృతి అందాన్ని,ఆనందాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.పూల బాలలు/కాళ రాత్రి కరిగిందని/మురిసి మురిసి విరిసిన రోజు/ అంటున్నారు.పూల బాలికలు భయంకరమైన రాత్రి గడిచిందని ఎంతో ముద్దుగా మురిపంగా వికసించిన రోజు.ప్రకృతి అందం చేత మరియు పుష్పంల ద్వారా కవికి కలిగిన అనుభూతి దృశ్యాలు భావాల ద్వారా వ్యక్తమవుతున్నాయి.పూల బాలలు అనేది పువ్వులు లేదా మొగ్గలు అంటే ప్రకృతిలోని సౌందర్యాన్ని,కొత్త జీవనాన్ని సూచిస్తుంది.పూలు తేటగా అందంగా ఉండడం,నవ జీవనాన్ని సూచిస్తుంది.కాళ రాత్రి అనేది భయంకరమైన రాత్రి. రాత్రి వేళలో వికసించే పుష్పాలు రాత్రి సంస్కృతికి సంబంధించిన ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,సంబరాల విశేషాలను వివరించడంలో సహాయపడతాయి. మురిసి మురిసి అనేది అనంతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.మురిసి మురిసి విరిసిన రోజు అనేది మనసులో ఒక రకమైన కొత్త దనాన్ని,ఉత్తేజాన్ని, పూసిన పువ్వుల సౌందర్యాన్ని,కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తుంది.ప్రకృతిలోని పువ్వుల అందాన్ని,

ఆనందాన్ని,సజీవంగా చిత్రిస్తుంది.ప్రకృతి యొక్క రమణీయతను,పుష్పాల పరిమళాల్ని, ఆత్మీయ అనుభూతుల్ని అందిస్తుంది.ఆకసానికి సింధూరం పూసి/చీకటి గుయ్యారం చీల్చుకొని/ సూర్యుడి బింబం చొచ్చుక వచ్చిన రోజు/ అంటున్నారు.ఆకాశానికి సింధూరపు ఎరుపు రంగును పులిమి చీకటి గుహ నుండి చీల్చుకొని సూర్యబింబం లోకములోనికి చొచ్చుకు వచ్చి తన దివ్య తేజస్సుతో లోకాన్ని వెలిగించిన రోజు. ప్రకృతి,సూర్యుడు ప్రజల ఆనందాన్ని,అనుభూతుల సౌందర్యాన్ని,ప్రభావశీలంగా వ్యక్తపరుస్తున్నాయి. సింధూరం అనేది ఎరుపు రంగు.ఉదయ కాంతి రావడంతో ఆకాశం ఎరుపు రంగు పులుముకొని మెరుస్తున్నది.ఉదయం పూట సూర్యుడు తన కాంతితో చీకటిని తొలగించి వెలుగును ప్రసరింప జేస్తున్నాడు.సూర్య కాంతి ఒక అందమైన ఉదయాన్ని,జీవన శక్తిని ప్రతిబింబిస్తుంది.చీకటి గుయ్యారం అనేది రాత్రి పుడమిలో అలుముకొన్న చీకట్ల ఆధిక్యతను సూచిస్తుంది.సూర్యుడి కాంతి చీకట్లను చీల్చుకుంటూ పుడమిపై వ్యాపిస్తుంది. సూర్య శక్తి మానవులకు జీవనాన్ని,బతుకు పట్ల ఎనలేని ఆశను కలిగిస్తుంది.సూర్యుడు జీవం కలిగించే శక్తిగా నిత్యం కొత్తదనాన్ని అందిస్తాడు.ఇది మానవుని దిన చర్యలో కొత్త అనుభూతిని, ఆనందంతో కూడిన చైతన్యాన్ని నింపే రోజు.సూర్య కాంతి ప్రకృతిని,జీవుల జీవితాన్ని,వాటి ఆశను అత్యంత మనోహరంగా పునరుత్తేజాన్ని కలిగిస్తున్నాయి.అంతేగాక ప్రకృతిలోని అందాన్ని, మార్పులను,కవితా పంక్తులు అద్భుతంగా వివరిస్తాయి.కాషాయపు రోచిస్సులు/కాంతి రేఖలు/ క్రాంతి రేఖలు/నింపిన రోజు/ఆ రోజు/అందమైన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు. కాషాయపు అందమైన కిరణ సముదాయపు కాంతులు విరజిమ్మి అభ్యుదయపు వెలుగులను జగమంతా నింపిన రోజు.ఇంకా మనసులో కదలాడుతూనే ఉంది.ఆ అందమైన రోజు ఎంతో ప్రత్యేకమైనది.మనసులో ఎంతో హాయిగాను, సంతోషంగాను గుర్తుండి పోయింది.ఆ రోజులో జరిగిన సంఘటనలు,ఆ అనుభవాలు,అందమైన జ్ఞాపకాలు,మనసును ఆహ్లాదపరుస్తాయి.మనసుకు జ్ఞాపకాల రుచి చూపిస్తూ ఎప్పటికీ గుర్తుండి పోతాయి.ఒక మహోన్నతమైన భావజాలాన్ని,ఒక గొప్ప చైతన్యాన్ని మరియు మన దేశ సాంస్కృతిక, రాజకీయ చరిత్రను ప్రతిఫలిస్తుంది.కాషాయపు రోచిస్సులు సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు అందించే ప్రకాశాన్ని ప్రకృతిలో కనిపించే అందాన్ని సూచిస్తాయి.ఈ సూర్యకిరణాలు జీవ చైతన్యానికి,ప్రకృతి సౌందర్యానికి ఒక చిహ్నంగా ఉంటాయి.కాషాయపు రోచిస్సులు అనేది త్యాగానికి,ధైర్యానికి మరియు సంకల్పానికి సంకేతం.దేశ భక్తితో ప్రణాళికలు,లక్ష్యాలు ఏర్పర్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న భౌగోళిక,సాంఘిక,రాజకీయ పరిణామాలను సూచిస్తుంది.మన దేశ అభివృద్ధిని సుఖ శాంతులతో కూడిన జీవన సౌభాగ్యాన్ని ఈ కవితా పంక్తులు నిరంతరం గుర్తుచేస్తాయి.ఆ రోజు/అందం కుసుమించిన రోజు/అంటున్నారు. అందం పుష్పించిన రోజు.పువ్వు ఎప్పుడు వికసిస్తుందో,ఆ రోజు ప్రత్యేకమైనది.అన్ని రంగాలలో విస్తరించిన దేశ సౌందర్యం,ప్రకృతి యొక్క అందచందాలు చక్కగా విలసిల్లిన రోజు.ప్రతి రోజు పూసే పువ్వుల వలె దేశవాసుల జీవితం సౌందర్యంతో ప్రకాశించిన రోజు.అందం కుసుమించిన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన దినంగా భావించబడినది.ఆనందం పల్లవించిన రోజు/అంటున్నారు.ఆనందం అనే చెట్టు చిగురించి కొత్త ఆకులతో విలసిల్లిన రోజు.ఆనందం పల్లవించడం అంటే ఆనందం వెల్లి విరిసిన రోజు. మన జీవితంలో ఒక ముఖ్యమైన అద్భుతమైన క్షణాన్ని కొత్తకోణంలో అనుభవిస్తున్నప్పుడు ఆ రోజును ఆనందం పల్లవించిన రోజు అని చెప్పవచ్చు.మన హృదయంలో పల్లవించిన సంతోషాన్ని,సున్నితత్వాన్ని,సౌందర్యాన్ని ఈ కవితా పంక్తి సూచిస్తుంది.స్వచ్ఛంగా స్వచ్ఛందంగా/ మెరుస్తున్న సూర్యున్ని చూచి/కళ్ళు మండి రాహువు/దుమ్మెత్తి పోసిన రోజు/అంటున్నారు. కల్మషం లేని రీతిలో స్వతంత్రంగా మెరుస్తున్న సూర్యుని చూసి కళ్ళు మండిన రాహువు(తాము దేవతల పంక్తిలో కూర్చుండి అమృతం తాగుతున్న రాహువు కేతువులను అమృతం తాగకుండా చేసిన సూర్యచంద్రులను పగతో మింగ ప్రయత్నిస్తుంటారు, దాన్నే గ్రహణం పట్టడం అంటారు).సూర్యునిపై పగతో దుమ్మెత్తి పోసిన రోజు అంటే చక్కగా సుఖ సంతోషాలతో శాంతంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సుసంపన్నమైన సుభిక్షమైన మన భారతదేశంపై విదేశీయులనే రాహువుల ఆక్రమణ మొదలైన రోజు అది.సూర్యుడు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మెరుస్తున్నాడు.సూర్యుడు శక్తిని, వెలుగును,జ్ఞానాన్ని అందించి లోకాన్ని ప్రకాశింప జేస్తున్నాడు.సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ లోకానికి ప్రశాంతతను,విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. సూర్యుడు ఎవరో కాదు భారతదేశం కళ్ళు మండటం అంటే ఆ వెలుగును,సత్యంను, విజయంను చూడలేని శత్రువులైన విదేశీయుల స్థితిని సూచిస్తుంది.కళ్లు మండడం అంటే అసూయ, ద్వేషం లేదా ఇతరుల విజయాన్ని చూడ లేని మనసులోని నెగటివ్ భావాలను తెలుపుతుంది. రాహువు దుమ్మెత్తి పోసిన రోజు అంటే భారతదేశపు విజయాన్ని,శోభను దెబ్బ తీసిన రోజు అని చెప్పవచ్చు.ఒకప్పుడు అత్యంత శోభతో వెలుగుతున్న దేశ సౌభాగ్యాన్ని ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించిన రోజు.చీకటితో చేయి కలిపి/ మసి బూసిన రోజు/అంటున్నారు.చీకటితో స్నేహం చేసి మసిబూసి మాయలు పన్నిన రోజు.చీకటి అనేది అజ్ఞానానికి,చెడు మరియు పాపపు చింతనకు ప్రతీక.అనైతికంగా తప్పుడు మార్గంలో పయనించడాన్ని చీకటి శక్తులకు లోబడినట్లుగా తలచవచ్చు.కట్టెలు కాల్చగా ఏర్పడిన బూడిద మసి.మసి బూయడమంటే విదేశీ శత్రువులు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి వాస్తవానికి మసి బూసి పౌరులను బలహీనులుగా చేసిన రోజు.ఒక వ్యక్తి, సమాజం సత్యంపై నడకలు సాగిస్తున్నప్పుడు తర్వాత అట్టి చక్కగా విలసిల్లుతున్న సమాజం చీకటి లేదా చెడు శక్తుల ప్రభావానికి లోనై స్వచ్ఛతను కోల్పోయి అనైతిక మార్గాలకు అలవాటైన ఆ రోజును మసి బూసిన రోజుగా భావించవచ్చు.కోటి కోటి రావాలు/కుమిలి కుమిలి/ రోదించిన రోజు/అంటున్నారు.కోట్ల కొలది మంది భారతీయులు తమకు కలిగిన బానిసత్వపు దుర్దశకు కుమిలి కుమిలి దుఃఖించిన రోజు.ఇది గంభీరమైన భావనతో కూడుకొని ఉన్నది.మనసులో అణిచివేయబడిన బాధ,దుఃఖం మరియు తీవ్రమైన వేదనను ప్రతిబింబిస్తున్నది.కోటి కోటి అనేది సంఖ్యాపరంగా ఎంతో ఎక్కువ అనేక కోట్లు.రావాలు అంటే వేదనతో కూడిన జీరవోయిన కంఠ ధ్వనులు. కోటి కోటి రావాలు అంటే దుఃఖపూరితమైన కోట్ల కొలది వ్యక్తుల కంఠ ధ్వనులు అసహనం,వేదన యొక్క పరాకాష్టను సూచిస్తుంది.ఇది వ్యక్తులను, సమాజం యావత్తును అణిచివేయబడిన తీరును ప్రతిబింబిస్తుంది.కుమిలి కుమిలి అనే పదం శరీరం బాధతో,దిగులుతో విపరీతంగా విచారం చెందడం వల్ల కలిగే వేదనను తెలుపుతుంది.దీర్ఘకాలంగా అణిచివేయబడిన వారి బాధ,దుఃఖం,మనస్సును ఎలా కలవరపరచినాయో ప్రతిబింబిస్తుంది.ఆ రోజు/మనిషి చచ్చిన రోజు/మనసు చచ్చిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.ఆ రోజు మనిషి చచ్చిన రోజు అంటే మనిషిలో మానవత్వం నశించి రాక్షసత్వం విజృంభించిన రోజు. అసాధారణమైన ఒక ప్రత్యేకమైన రోజు.జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు.ఆ రోజు జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అనుభూతిని కలిగిస్తుంది.మనిషి చచ్చిన రోజు.ఇది భౌతిక మరణాన్ని సూచించే వాక్యం. మనిషి మరణించడం అంటే ఆ వ్యక్తి శరీరం మాత్రమే కాదు,అతని ఆలోచనలు,స్వభావం, అనుభవాలు అన్ని హరించబడతాయి.మనసు చచ్చిన రోజు అంటే మంచి మనసు చచ్చిన రోజు. మనిషి జీవితం సంక్లిష్టమైనది,మనసు బాధకు లోనవడం యాదృచ్ఛికం.ప్రతి వ్యక్తికి మరణం అనేది చెట్టుకు పూసిన పువ్వు రాలినట్లుగా సహజమైనట్టిది.మరణం అనేది శరీరంతో పాటు మనసును కూడా చంపుతుంది.ఇక్కడ మనసు చచ్చిపోవడం అనే వాక్యం మరణం కన్నా ఎక్కువ బాధను వ్యక్తం చేస్తుంది.ఒక వ్యక్తి యొక్క ఆశయాలకు,ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలడం, విలువలు విధ్వంసం కావడాన్ని తెలియజేస్తుంది. మనిషి మనస్సులో పొడముతున్న భావోద్వేగాలు పతనం అవుతున్న సామాజిక విలువల్ని గుర్తు చేస్తుంది.ఇంకా జ్ఞాపకం ఉన్నది అంటున్నారు.ఆ సంఘటన గాఢంగా మనసులో నిలిచిపోయి ఎన్నటికీ మరిచిపోలేని ఒక భయంకర అనుభవంగా మిగిలిపోయింది.సమాజంలో జరిగిన దుష్ట సంఘటనల వల్ల సంక్రమించిన బాధ,దుఃఖం, అంతరంగంలో వేదనను ప్రతిబింబించడం సహజం.మనిషి చచ్చిన రోజు,మనసు చచ్చిన రోజు అనేది కేవలం శారీరక మరణం మాత్రమే కాదు. మానవ విలువలు లుప్తమై భవిష్యత్తు పట్ల ఆశలు అడుగంటిన రోజు అని చెప్పవచ్చు.ఆ రోజు/ అందాన్ని హత్య చేసిన రోజు/ఆనందాన్ని అణగార్చిన రోజు/అంటున్నారు.ఆ రోజు దేశ సౌభాగ్య సౌందర్యాన్ని హత్య చేసిన రోజు.దీనిలోని భావం ఎంతో సున్నితమైనది.కవి భావోద్వేగపూరితమైన సంఘటన గురించి వ్యక్తీకరిస్తున్నాడు.అందాన్ని హత్య చేసిన రోజు అలంకారంతో కూడిన వాక్యం.అందం లేదా అందమైన క్షణాలను,స్నేహాన్ని,ప్రేమను, సృజనాత్మకతను నాశనం చేసిన ఒక సంఘటనను సూచించవచ్చు.సమాజంలో నెలకొన్న దారుణమైన సంఘటనల కారణంగా అందమైన దృశ్యాలను, అనుభూతులను కోల్పోవడం జరుగుతుంది.అందం అంటే మిరిమిట్లు గొలుపుతూ కనులకు గోచరించేది మాత్రమే కాక.మనసునకు శాంతిని,సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి.అందమైన ఆనందాలకు ఆటంకం కలిగితే,జీవితంలో సుఖ సంతోషాలు కరువు అవుతాయి.అందం అంటే మన చుట్టూరా అల్లుకున్న సంతోషాల వెల్లువని,శాంతిని తెలియ జేస్తుంది.ఆ రోజు జరిగిన సంఘటనలు,దుర్ఘటనలు, సంతోషాన్ని నశింపజేసినాయి.ఆనందాన్ని అణగార్చిన రోజు.ఆ రోజు ఎదుర్కొన్న కష్టాలు,చేదు అనుభవాలు,భావోద్వేగాలను పెంచినాయి.బాధలో ఉన్నప్పుడు మనిషికి ఆనందం ఉండదు.గడ్డు సమయం ఎదురైనప్పుడు మనిషికి మనో ధైర్యం,శక్తి అవసరం.ఒక్కో సారి మనిషి జీవితం నిరాశ అనే చిక్కు ముళ్ళలో కూరుకుపోతుంది.మనిషికి ఎదురైన నిరాశ కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది.నిరాశ నుండి తేరుకుంటేనే మనం మరింత బలంతో ముందుకు సాగగలం.ఆనందం అంటే సంతోషం,ప్రశాంతత.ఆ రోజు జరిగిన సంఘటనలు,ఆనందాన్ని అణగార్చినాయి.ఆ రోజు అందాన్ని హత్య చేసిన రోజు,ఆనందాన్ని అణగార్చిన రోజు అంటే అందరి ఆనందాలను రూపుమాపిన రోజు అని భావం.సూర్యుడికి గ్రహణం పట్టిన రోజు/రాహువు నెత్తిన/చీకటి మొత్తిన రోజు/ అంటున్నారు.దేశంలోని వికాసం అనే వెలుతురును సకల సంపదను దోచుకుని వెళ్లి మన దేశం బయట మనవి కాని దేశాలలో విదేశీయులు సంపదను భద్రపరుచుకున్నారు.సూర్యుడు చుట్టు తిరిగే చంద్రుడు,సూర్యునికి మరియు భూమికి మధ్యలో అడ్డుగా వచ్చి సూర్య కాంతిని అడ్డుకోవడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది.ఈ సమయంలో సూర్యబింబంలోని ఒక భాగం లేదా మొత్తం కాంతి భూమి మీది కనిపించదు.దాన్ని గ్రహణంగా చెప్పుకుంటాం.పూర్వ కాలంలో ఇది ప్రజల్లో భయాన్ని కలిగించేది.గ్రహణం ముగిసిన తర్వాత సూర్యుడి ప్రకాశం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. సూర్యుడికి గ్రహణం పట్టడం అంటే ప్రజల, సంతోషాన్ని,జీవితంలోని చైతన్యాన్ని,చీకటి ఆక్రమించుటకు ప్రతీక.జీవితంలో ఎదురైన ఏదో ఒక అడ్డంకిని కష్టాన్ని సూచిస్తుంది.రాహువు వల్ల జీవితంలో సమస్యలు,అంతరాయాలు, ఏర్పడతాయని ప్రజల విశ్వాసం.భారతీయ పురాణాలలో రాహువు ఒక చీకటి,అధర్మానికి, అపశకునానికి ప్రతీక.రాహువు సూర్యుడిని మింగడం వల్ల దుష్ట శక్తులు విజయం పొంది జీవితాలను కష్టాలలోకి నెట్టుతుంది.ఆ రోజు జరిగిన సంఘటనల వల్ల దేశం ఒక పెద్ద సంక్షోభాన్ని,గడ్డు స్థితిని ఎదుర్కొవాల్సి రావడాన్ని,రాహువు,చీకటి వంటి ప్రతీకల ద్వారా కవి వ్యక్తపరిచారు.దిగంతాల కావల/వెలుతురు విశ్రమించిన రోజు/మింగలేక కక్కలేక/గొంతు మూగ వోయిన రోజు/జాతి బుద్ధిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.వెలుతురు దిగంతాల బయట విశ్రాంతి తీసుకుంటుందని, తమకు కలిగిన బాధలను క్రక్క లేక మింగలేక దేశ ప్రజల గొంతులు మూగవోయినవని,కవితలోని పంక్తులు గాడమైన భావాలను వ్యక్తపరుస్తున్నాయి. ఈ కవితలోని వెలుగు దేశం యొక్క అనంతమైన సంపద.దీనిని విదేశీయులు కొల్లగొట్టి తమ దేశాలకు తరలించి భద్రపరచుకోవడం అనేది వెలుగులు దిగంతాల ఆవల విశ్రాంతి తీసుకుంటున్నాయని ప్రతీకగా కవితలో చెప్పబడినది.జాతి సిగ్గుతో తలవంచిన రోజు/అంటున్నారు.సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల జాతి గౌరవాన్ని,ప్రతిష్ఠను కోల్పోవడం,ఆందోళనను,ఆవేదనను కలిగిస్తుంది. జాతి సిగ్గుతో తలవంచిన రోజు అంటే మన దేశం స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన రోజు.విదేశీయుల పాలనలో భారతీయులు బానిస బ్రతుకులు గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.భారత జాతి ప్రజల స్వాభిమానం దెబ్బతినడం,సిగ్గును కలిగిస్తుంది.అది ఒక భయంకరమైన సంఘటనకు నిదర్శనం.ఆ రోజున భారత జాతి గౌరవం మంట కలిసి పోయింది.భారత జాతి సిగ్గుతో తలవంచుకున్నది. మన దేశంలో ఆ రోజు జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనలు,జాతిని సిగ్గుపడునట్లు చేసినాయి. మన దేశంలో స్వాతంత్ర్యానంతరం,ఇలాంటి సంఘటనలు తరచుగా జరిగి మానవతా విలువలు మంట కలవడం,దేశానికి ఒక మచ్చగా నిలుస్తున్నది. మన దేశ ప్రజలు నైతిక విలువల పరిరక్షణ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.జనం బుద్దిగా చేతులెత్తిన రోజు/అంటున్నారు.జనం బుద్ధిగా అంటే నిస్సహాయ స్థితిలో చేరి చేతులెత్తిన రోజు. సమాజంలో మనిషి తనకు తానే ఆత్మ వంచన చేసుకోవడం,నిర్లిప్తతను సూచిస్తుంది.బుద్ధిగా చేతులు ఎత్తడం అంటే పోరాటం లేకుండా స్థబ్దంగా ఉండడం అని అర్థం.ప్రజలు తమ కర్తవ్యాన్ని మరిచి పోవడం,సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం,బాధని కలిగిస్తుంది.తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలు,ప్రకృతి, సమాజం అన్ని ఎలా ప్రభావితమవుతాయో, మనిషిలో తెలియని నిర్లిప్తత,నిస్సహాయత ఎలా వ్యాప్తి చెందుతుందో కవి భావాల్లో అద్భుతంగా వెల్లడించారు.ఆ రోజు/చీకట్లు ముసిరిన రోజు/ఇంకా జ్ఞాపకం ఉన్నది/అంటున్నారు.చీకట్లు ముసిరిన రోజు అంటే దేశం యావత్తు స్వాతంత్రం కోల్పోయి పరాయిపాలనలోకి జారుకున్న ఆ దుర్ధినాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నాం.ఆ రోజు జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు,జ్ఞాపకాలు,అనుభవాలు, జాతిని ఎంతగానో ప్రభావితం చేసినాయి.ఆ రోజు జరిగిన తీవ్రమైన సంఘటనలు,మనిషికి అనుభవాన్ని,సామూహిక చైతన్యాన్ని కలిగింప జేసినవి.ఆ రోజు జరిగిన సంఘటన వల్ల సమాజంలో ఆనందపు వెలుగులు అన్నీ మాయమై చుట్టూ చీకటి కమ్ముకున్నది.మనిషి జీవితంలో జరిగిన దుర్భరమైన,బాధాకరమైన సంఘటనలు మనసును గాయపరిచిన విధానం ఈ కవితలో ప్రతిబింబిస్తున్నది.ఇంకా జ్ఞాపకం ఉన్నది/ అంటున్నారు.ఆ రోజు సంఘటన గడిచిపోయింది. అయినప్పటికీ,ఆ రోజు సంఘటనకు సంబంధించిన అవశేషాలు ఇంకా మనసులో నిలిచి ఉన్నాయి.ఆ అనుభవం ఎంతో ప్రభావాన్ని చూపింది.ఆ రోజును పూర్తిగా మరిచిపోలేని విధంగా మనసులో నిలిచిపోయింది.బంగారు భారతదేశం పరాయి పాలనలోకి వెళ్లి అన్ని విధాల దుర్దశను పొంది మ్రగ్గిపోయిన ఆ రోజును తలుచుకుంటూ జాతికి గ్రహణం పట్టిన రోజుగా ఎంతో మధనపడి కవి ఈశ్వర చరణ్ తన మానసిక క్షోభనంతా ఈ కవితలో వ్యక్తం చేశారు.కవి ఈశ్వర చరణ్ జాతికి గ్రహణం పట్టిన రోజు కవితలోని భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.కవి ఈశ్వర చరణ్ భౌతికంగా లేరు.కాని వారు అందించిన జాతికి గ్రహణం పట్టిన రోజు కవిత పాఠకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
ముకుంద రామారావు . వలస పోయిన మందహాసం కవిత ప్రముఖ కవి,అనువాదకుడు,ముకుంద రామారావు కలం నుండి జాలువారిన వలస పోయిన మందహాసం కవితా సంపుటిలోని వలస పోయిన మందహాసం కవిత పై విశ్లేషణా వ్యాసం.వలస పోయిన మందహాసం కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నన్ను ఆలోచింపజేసింది.కవిత శీర్షిక పేరు వలస పోయిన మందహాసం చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది.మందహాసం వలస పోతుందా? మనం ఎన్నడు కని విని ఎరుగం.అంతా ఏదో కొత్త కొత్తగా వింత వింతగా అనిపించింది.విలక్షణమైన భావాలు హృదయానికి తాకేలా ఉన్నాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు.కరువు కాటకాలకు నిలయాలుగా మారినాయి.కరువు తాకిడికి పల్లెలు విలవిలలాడుతున్నాయి.పల్లెలో జనాలకు ఉపాధి కరువై పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి.కొందరు జనాలు పల్లెలో ఉపాధి లేక విదేశాలకు వలస వెళుతున్నారు.మన దేశంలో విద్యార్థులు చదువుకున్న చదువుకు సరైన ప్రోత్సాహం లేక ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేస్తూ బతుకు గడుపుతున్నారు. అడవుల్లో స్వేచ్ఛగా జీవించే పశువులు,పక్షులు, జంతువులు అడవుల నరికివేత వల్ల వాటి మనుగడ కరువై జనావాసాల్లోకి చొరబడుతున్నాయి.ముకుంద రామారావు కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన సందర్భంగా అతనిలో కలిగిన భావాలు ప్రేరణగా నిలిచాయి. గుండె లోతుల్లో నుండి పొంగి పొరలే భావాలతో కవిత అక్షర రూపం దాల్చింది.ఇది కూతురు వివాహం చేసి అల్లునితో వియ్యంకుని ఇంటికి సాగనంపుతు కలిగిన దుఃఖము,వేదన నుండి జాలువారిన కవిత.వేదన నుండే కవిత్వం పుడుతుంది అంటారు.కవి ముకుంద రామారావు అనుభవించిన తీయని వేదనగా తోస్తోంది. కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసి భర్తతో పంపించడం తల్లిదండ్రుల బాధ్యత.తండ్రిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినాడు.మనుషులు వలస పోవడం తెలుసు.పక్షులు,జంతువులు వలస పోవడం తెలుసు.మందహాసం వలస పోవడం ఏమిటి? అని మనలో సందేహాలు రేకెత్తవచ్చు.వలస పోయిన మందహాసం కవితా సంపుటిలో సుప్రసిద్ధ విమర్శికుడు చేకూరి రామారావు చేరా గారి ముందు మాటలోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో అచ్చయిన వలస పోయిన మందహాసం అనే కవిత ఖండిక ద్వారా తెలుగు కవితాభిమానుల దృష్టిని ఆకర్షించిన వై. ముకుంద రామారావు గారు ఈ దశాబ్దంలో గొంతు విప్పిన కొత్త కవి.తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపథ్యం.ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు.సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు.భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది.పారదర్శకత్వం ఉండదు.పదౌచిత్యం ఉంటుంది.పదాడంబరం ఉండదు.భావ గాంభీర్యం ఉంటుంది.భాషా క్లిష్టత ఉండదు.పురోగమన శీలత ఉంటుంది.

సిద్ధాంత వలయం ఉండదు.అనుభవం వైయుక్తికమే. దృక్పథం విశ్వజనీనం.ఇది ఈయన తొలి కవిత సంకలనమే కాని తొలి నాటి కవితల సంకలనం కాదు అని చక్కటి ముందుమాట రాశారు.వలస పోయిన మందహాసం కథా కమామీషు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా?అయితే కవి ముకుంద రామారావు వలస పోయిన మందహాసం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతి/నాకే వీడ్కోలిస్తున్నప్పుడు/ ఇన్నాళ్లు/గుండె గదిలో వొదిగి వొదిగి/కళ్ళకేదో మంచు తెర కప్పి/చూస్తూ చూస్తూనే/గువ్వలా ఎగిరిపోయినట్టుంది/అంటున్నారు.వీడ్కోలు మరియు సంతోషకరమైన సమయాల్లో మనం మళ్ళీ కలుద్దాము అని విడిపోతున్నప్పుడు చెప్పుకుంటాం. విడిపోతున్నప్పుడు శుభాకాంక్షల వ్యక్తీకరణ వీడ్కోలు.ఇది అభిమాన పూర్వకంగా ఉంటుంది. వీడ్కోలు అంటే ఎవరైనా బయలుదేరడం.సుదీర్ఘ ప్రయాణం,పదవీ విరమణ సందర్భంలో వీడ్కోలు చెప్పబడుతుంది.అతడు ఆమె ఆనందాల కలయికకు ప్రతిరూపంగా చైతన్యం వెల్లి విరిసి అద్భుతమైన ఒక పాప రూపం దాల్చింది.అతని భార్య నవ మాసాలు మోసి ఓ సుందర చైతన్య రూపం గల పాపకు జన్మనిచ్చింది.అతని కూతురు పెరిగి పెద్దయి వివాహం జరిగిన సందర్భంగా తండ్రి అయిన తనకు వీడ్కోలు చెబుతూ భర్త వెంట బయలుదేరడం చూసి తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి.చిన్నారి పాపాయి ఇన్నాళ్లు ఈ ఇంట్లో బుడిబుడి నడకలతో మెదిలి తన హృదయపు గదిలో ఒదిగి ఒదిగి ఉన్నది.ఆ ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.పెళ్లి సందడితో భాజా భజంత్రీలతో రంగు రంగుల తోరణాలతో ఆ ఇల్లు ఆనందంతో బంధు,మిత్రుల సందడి సమాగమంతో ఒక రకమైన హడావుడి కొనసాగుతుంది.ఒక పక్క సంతోషం మరొక పక్క ముప్పిరిగొన్న బాధ ఆ తండ్రిలో కనబడుతుంది. రేపటి నుండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి కనిపించదు. తన కళ్ళకేదో మాయ కమ్మినట్లు మంచు తెర కప్పినట్లుంది.చూస్తూ చూస్తూ ఉండగానే తన ముందు నుండి గువ్వలా రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుంది.తన కళ్ళను తాను నమ్మలేక పోతున్నాడు.అమ్మాయి గువ్వవలె ఎగిరిపోయినట్లుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.“తెలిసి తెలిసి/సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది/సందడిని సంబరాన్ని మూట కట్టుకు పోయిందేమో!/అంటున్నారు.వలసను ఆంగ్లంలో Migration అంటారు.అనగా రుతుక్రమంగా,జంతువులు పక్షులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం చూస్తుంటాము.గుడ్లు పెట్టే స్థలాల కోసం,ఆహార సేకరణ కోసం వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని పక్షుల వలసలు జరుగుతాయి.చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైన మార్గాలలో వలస పోతాయి.వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలస పోయి గుడ్లను పెట్టి పొదిగి పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగి వస్తాయి.సైబీరియన్ పక్షులు,పొడవాటి ముక్కు, భారీ రెక్కలు,అందంగా,ఆకర్షణీయంగా కనిపించే ఈ కొంగలు వచ్చి చెట్లపై విడిది చేస్తాయి.5000 వేల కిలోమీటర్ల దూరం నుండి జనవరి మాసంలో వచ్చి జూన్ చివరి నాటికి వెళ్లిపోతాయి.ఈ సైబీరియన్ పక్షులు ఒంటరిగా వచ్చి గుడ్లు పెట్టి పిల్లలతో పాటే తిరిగి సైబీరియాకు వెళ్లిపోతాయి.ఇది అందరికీ తెలిసిన సంగతి.వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతో వెళ్లడం కొత్తది ఏమీ కాదు.ఆ విధంగానే అమ్మాయి వివాహం చేసుకొని అత్త వారింటికి వెళ్లడం,సుదూర ప్రాంతాలకు సైబీరియన్ పక్షిలా వలస పోయినట్టుంది.తమ ఇంట్లో మెదులుతూ తన మాటలతో ఆటలతో పాటలతో మందహాసంతో అలరించిన అమ్మాయి సందడిని సంబరాన్ని మూటగట్టుకొని వెంట తీసుకొని పోయింది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.“ఇంతలోనే మేము మనుష్యుల మధ్యే లేనట్టుంది/ అనుభవానికొస్తేగాని/ఏ వేదనైనా అర్థం కాకుండా ఉంది/అంటున్నారు.వేదన అనగా తీవ్రమైన మానసిక బాధ.ఆవేదన అనగా తీవ్రమైన బాధ.పెళ్లి కాగానే అమ్మాయి అత్త వారింటికి వెళ్ళింది. అమ్మాయి ఇంట్లో లేక పోవడం వల్ల మేము మనుషుల మధ్య లేనట్లుగా తోస్తుంది.అమ్మాయి లేని వెలితి మా ఇంటిలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది.వివాహ బంధం వల్ల అతనితో అమ్మాయి వెళ్లిపోవడం చేత తీవ్రమైన మానసిక బాధ ఏర్పడింది.అమ్మాయి ఇంట్లో కనిపించక పోవడం వల్ల తీవ్రమైన బాధ కలిగింది.ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి లేని లోటు అనుభవం ద్వారా తెలిసింది.పెళ్లిలో అప్పగింతల కార్యక్రమం చేసి అమ్మాయిని పంపించిన తర్వాత అనుభవం ఏర్పడింది.తీవ్రమైన మానసిక బాధ,అనుభవం ద్వారా తనకు తెలిసింది. ఇది అంతా అయోమయంగా అర్థం కాకుండా ఉంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.”చెంగు చెంగున గెంతులు/చిన్నప్పటి గుజ్జెన గూళ్ళు/చిలిపి చేష్టలు/ఇళ్ళంతా నింపిన అలంకరణలై/ఇంటందరికీ గుర్తు చేస్తూనే ఉంది/అంటున్నారు.గుజ్జన గూళ్ళు దీనిని బువ్వలాట అని కూడా అంటారు. బువ్వలాటను పూర్వము ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు కలిసి ఆడుకునే వారు.పిల్లలు ఇంటిలో తమ పెద్ద వాళ్లను అడిగి బియ్యము,పప్పులు,బెల్లం, చక్కెర తెచ్చుకొని వాటిని పొయ్యి మీద పెట్టినట్లు నటిస్తూ వంట తయారు కాగానే పొయ్యి మీద నుంచి దించినట్లు నటిస్తూ కొంత సేపటికి అందరు కలిసి తింటారు.గుజ్జన గూళ్ళు ఆటను ఆడినప్పుడు బొమ్మల పెళ్లి చేసి రెండు జట్లుగా ఏర్పడి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు.బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దాని గుజ్జును గుల్ల చెడకుండా పూర్తిగా తీసివేసి ఆ గుల్లలో బియ్యం పోసి దానిని మండుచున్న పొయ్యిలోకి కుమ్ముతోనే పెట్టి ఉడికిన తర్వాత పిల్లలు గుజ్జన గూళ్ళు అని వేడుకగా తింటారు.పిల్లలు ఇల్లంతా తిరుగుతూ చెంగు చెంగున గెంతుతారు.తోటి పిల్లలతో కలిసి గుజ్జన గూళ్ళు బొమ్మల ఆటలు ఆడతారు.పిల్లల చిలిపి చేష్టలతో కోతుల వలె ఇల్లంతా గెంతుతూ ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ అలరిస్తారు.

అమ్మాయి ఆడిన బొమ్మలు ఇంటిలో అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.అమ్మాయి నడయాడిన ఇల్లు ఆడిన బొమ్మలతో ఆ నేల అంతా ఒక రకమైన పరిమళంతో నిండి ఉంది.అమ్మాయి ఇంటి వారందరికీ అనుబంధాలను గుర్తు చేస్తూనే ఉంది అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. “ఎగిరిపోయిన ఛాయా లెక్కడా లేవు/కనిపించక కలవరం తప్ప/లేకుండా ఉండలేని నిర్లిప్తత తప్ప/ నువ్వైనా నేనైనా/మొలకెత్తిన చోటే మొక్కలన్నింటిని ఉండనీయం/పూచిన పూలనీ,పండ్లనీ,చెట్టుకే వదిలేయం/ఎంత లేదన్నా కాదన్నా/విడిచిపోలేని బాధ/విడదీస్తున్న చేతులకంటదు/అంటున్నారు. అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా జీవితం గడపడానికి అత్త వారింటికి వెళ్లిపోయింది.
అమ్మాయి గువ్వవలె ఆకాశంలోకి ఎగిరిపోయిన ఛాయలు ఎక్కడ కనిపించడం లేదు.అమ్మాయి పెళ్లి చేసుకుని కన్న వారిని వదిలి అత్తవారింటికి వెళ్ళిపోయింది.ఇక కన్న వారి ఇంటిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి జాడ కనిపించదు.కాబట్టి తండ్రికి ఆ కుటుంబంలో అమ్మాయి లేదనే కలవరం ఏర్పడింది.అమ్మాయి కన్నవారి ఇంటిలో లేదు. అమ్మాయి లేకుండా ఉండలేని ఒక రకమైన నిర్లిప్తత ఇంటిల్లిపాదికి ఏర్పడింది.నువ్వు,నేను,ఎవరు అయినప్పటికీ మన ఇంటి పెరట్లో మొలకెత్తిన మొక్కలు అన్నింటిని ఒక్కచోట ఉండనీయం. మొక్కలను మన ఇంటి పెరట్లో అనువైన చోట నాటుతాం.మన ఇంటి పెరట్లో కాసిన కాయలను పక్వం రాగానే పండ్లను తెంపుతాం.చెట్టుమీద కాచిన పండ్లను చెట్టుకే వదిలి వేయడం జరగదు.ఎంత లేదు కాదు అని చెప్పినప్పటికీ అమ్మాయిని విడిచి ఉండలేని ఒక రకమైన బాధ ఆ ఇంటిలో కొనసాగుతుంది.అమ్మాయిని అత్త వారింటికి పంపించిన బాధ కన్నవాళ్ళ చేతులకు అంటదు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.లేదంటే చూడు/ పోగొట్టుకున్న వాడి ముందు/గెల్చుకున్న వాడి గర్వంలా/ఆ చేతిలో చేయి అభయ హస్త మవునో కాదో/మందహాసమై మెరుస్తోంది/సరిగ్గా ఒకప్పటి నాలాగే/అంటున్నారు.నవ్వు,మందహసం,దరహాసం ఒక విధమైన ముఖ కవళిక.నవ్వుతో ముఖంలోని వివిధ కండరాలు ముఖ్యంగా నోటికి రెండు వైపులా ఉండేవి సంకోచిస్తాయి.మానవులలో నవ్వు, సంతోషం,ఆనందానికి బాహ్య సంకేతం. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. సంఘంలోని వ్యక్తుల మధ్య సంబంధాలలో, సంభాషణలలో,ఉత్తేజాన్ని కలిగిస్తుంది నవ్వు. ఇతరుల నుండి కలయికను కాంక్షిస్తుంది నవ్వు. అనేక రోగాలను దూరం చేసే టానిక్ నవ్వు.
నవ్వు శారీరకంగాను,మానసికంగాను,ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.నవ్వు వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నవ్వడం వల్ల బాధను మరిచిపోతాం.నవ్వు శారీరక మానసిక రుగ్మతులను దూరం చేసి ప్రశాంతతను పోషిస్తుంది.చిరునవ్వు,మందహాసం అనగా పళ్ళు కనిపించకుండా పెదవులు విరిసి విరవకుండా నవ్వడం.అతనితో పెళ్లి చేసి పంపించి అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రిలో వేదన కనబడుతుంది. అమ్మాయిని దూరం చేసుకున్న తండ్రి ముందు వివాహం చేసుకొని అమ్మాయిని గెలుచుకున్న అతనిలో ఒక రకమైన గర్వం కనబడుతుంది. అమ్మాయికి అతను చేతిలో చెయ్యి వేయడం చూసినాడు.అమ్మాయికి అతను రక్షణగా ఉంటాడో లేదో అనే సందేహం కలిగింది.పెళ్లి చేసుకుని అమ్మాయిని వెంట తీసుకొని పోతున్న అతని ముఖంలో చిరునవ్వు వలె మెరుస్తోంది.అమ్మాయి తండ్రి కూడా వివాహం చేసుకొని తన భార్యను తన వెంట తీసుకు వచ్చాడు.అమ్మాయి తండ్రి తన వివాహం రోజు నాటి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉన్నాడు.ఒకప్పటి తనలాగే అమ్మాయి వివాహం జరిగింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వలస పోయిన మందహాసం అనే చక్కటి కవిత రాసిన ముకుంద రామారావును అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలను విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
యల్లపు ముకుంద రామారావు తేది 09 – 11 – 1944 రోజున పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్ లో జన్మించాడు.తల్లి ఎరుకలమ్మ,తండ్రి యెల్లయ్య. తండ్రి రైల్వే ఉద్యోగి.ముకుంద రామారావు ఎమ్మెస్సీ మ్యాథ్స్, డి.ఐ.ఐ.టి., పి.జి.డి.సి ఎస్. ఖరగ్పూర్ లో చదివారు.వీరు రైల్వే శాఖ లో కంప్యూటర్ రంగంలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి భార్య పేరు సుభాషిణి.ముకుంద రామారావు, సుభాషిణి దంపతులకు ముగ్గురు సంతానం;1) లావణ్య 2)చైతన్య, 3)కళ్యాణ చక్రవర్తి.
వీరు రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభించి కవిగా స్థిరపడ్డారు.వీరు అనువాదకుడిగా రాణించారు.
ముకుంద రామారావు వెలువరించిన గ్రంథాలు స్వీయ కవిత్వం.
1) వలస పోయిన మందహాసం – 1995/2) మరో మజిలీకి ముందు – 2000./3) ఎవరున్నా లేకున్నా – 2004/4) నాకు తెలియని నేనెవరో – 2008/5) నిశ్శబ్దం నీడల్లో – 2009/6) విడని ముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – 2013./7) ఆకాశయానం – 2014/.8) రాత్రి నదిలో ఒంటరిగా – 2017/9) నిశ్శబ్దంలో శబ్దం – 2024.
ముకుంద రామారావు వెలువరించిన స్వీయ అనువాద రచనలు :1) అదే ఆకాశం – 52 మంది కవుల పరిచయం,70 కవితలతో 23 దేశాల అనువాద కవిత్వం.తొలి ప్రచురణ – 2010.మలి ప్రచురణ – 2023/ 2)అదే గాలి (2000 మంది కవుల పరిచయం,500 కవితలు,560 పేజీలు, వందకు పైగా ప్రపంచ దేశాల కవిత్వం – నేపథ్యం) – 2016/3)అదే నేల (3000 మంది కవుల పరిచయం, 700 కవితలు,900 పేజీలు,నలబైకి పైగా భారతీయ భాషల కవిత్వం – నేపథ్యం)2019/ 4)అదే కాంతి (210 మంది కవుల పరిచయం,1200 కవితలు,750 పేజీలు,మధ్యయుగంలో భక్తి కవిత్వం సామాజిక నేపథ్యం) – 2022/ 5) అదే నీరు – వంద మంది కవుల 700 కవితల జాతీయ అంతర్జాతీయ కవుల కవిత్వం,పరిచయం విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురితం) – 2023.
6)శతాబ్దాల సూఫీ కవిత్వం – 52 మంది కవుల 121 కవితలు -2011./7)1901 నుండి నోబెల్ కవిత్వం (37 మంది కవుల 171 కవితలు, 320 పేజీలు, నోబెల్ కవుల కవిత్వ – జీవితవిశేషాలు) – 2013/ 8)1901 నుండి సాహిత్యంలో 13 మంది నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015)/ 9) భరత వర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం – (2017)/ 10) చర్యా పదాలు – 23 మంది కవుల 50 కవితలు (అనేక భాషల ప్రథమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) -2019/ 11) మిణుగురులు ( టాగూర్ Fireflies కు తెలుగు అనువాదం) కినిగె ఈ – బుక్ – (2022)/ 12)ఇసుక నురగ (ఖలీల్ జిబ్రాన్ Sand and Foam కు తెలుగు అనువాదం) – కినిగె ఈ బుక్ – (2022./13) మియా కవిత్వం – అసోమియా ముస్లిం అస్తిత్వ స్వరం (2022)./
14)బెంగాలీ బౌల్ కవిత్వం – 80 మంది బౌల్ కవుల 170 బౌల్ కవితలు – (2023)/వీరి కవిత్వం ఇతర భాషల్లోకి అనువాదాలు :1)వలస హోద మందహాస – మొదటి రెండు కవిత్వ సంకలనాల్లోని కవితల కన్నడ అనువాదం (2005)/2)The Smile That Migrated And Other Poems – మొదటి మూడు కవిత్వ సంకాలనాల్లోని కవితల ఆంగ్ల అనువాదం – (2011/).వీరు రచించిన కథలు/ ఇతరాలు : (విశాలాంధ్ర/ నవచేతన ప్రచురణలు) :1) దేశ దేశాల కప్పల కథలు – (2010)./2) నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015)/3) వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) -(2018)/4) అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019).
వీరు రాసిన పుస్తకాలు ప్రచురణలో ఉన్నవి/ 1) నిశ్శబ్దంలో శబ్దం – స్వీయ కవిత్వ సంకలనం./2) నా ఇల్లెక్కడ? – కథల సంకలనం./3) ఆసక్తి – వ్యాస సంకలనం./ 4) విశ్లేషణ – సమీక్షలు సమాలోచనలు./5) అనామక ప్రతిబింబాల ప్రవాహం (టాగూర్ చిత్రాల కవిత్వం కు తెలుగు అనువాదం)
వీరు పొందిన పురస్కారాలు :1) వలస పోయిన మందహాసం కవితా సంకలనానికి శ్రీ రమణా సుమన శ్రీ పురస్కారం – (2000)./2) వచన కవిత్వానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం – (2009)/.3)C.P. బ్రౌన్ పండిత పురస్కారం (హ్యూస్టన్ USA లో) – (2015)./4) అదే గాలి ఉత్తమ సాహిత్య గ్రంధానికి గంగిశెట్టి స్మారక మహాంద్రభారతి పురస్కారం (2017)./ 5) నోబెల్ కవిత్వ గ్రంథానికి అనువాద ప్రక్రియలో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – (2017)6) అదే నేల (భారతీయ కవిత్వం – నేపథ్యం) గ్రంథానికి తాపీ ధర్మారావు పురస్కారం – (2020)./ 7) కవి సంధ్య ప్రతిభ పురస్కారం (అనువాదానికి) – 2021/.8) అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం,సామాజిక నేపథ్యం) గ్రంథానికి పెమ్మరాజు లక్ష్మీపతి గారి స్మారక పురస్కారం – 2022/.9) మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కారం – 2022/.10) కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ వేములపల్లి కేశవరావు, శ్రీమతి విశాల గార్ల అనువాద ప్రతిభా పురస్కారం – 2022/.11)అజో- విభో -కందాళం ఫౌండేషన్ వారి 2024 ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం/12) విజయనగరం విజయ భావన 2024 ఉగాది పురస్కారం/.వీరు రాసిన ఇతరాలు :
1) ఆంగ్లం పోలిష్,హిందీ,ఉర్దూ,బెంగాలీ,కన్నడం, తమిళం,మలయాళం,ఒడియా,సంతాలీ, మరాఠీల్లో కి ఎన్నో కవితల అనువాదాలు./2) వివిధ సంకనాల్లో,కవిత వార్షికల్లో,కవితా దశాబ్ది సంచికల్లో,/అనేక వెబ్సైట్లలో కవితలు/ 3) ప్రతిష్టాత్మక the little magazine సంకలనం India in Verse – Contemporary poetry from 20 Indian Languages and 167 Poets సంకలనంలో అనువదించబడ్డ కవిత ప్రచురితం./4) మధురై నుండి ప్రచురితమయిన Kavya Bharathi 2008 -Study Centre for Indian Literature in English and Translation,American College సంకలనంలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం. 5) ఈ క్రింది సంకలనాలలో అనువదించబడ్డ ఆంగ్ల కవితలు ప్రచురితం./ I)Pride of Place – An anthology of Telugu Poetry. 1981 -2000 with 117 Poets – K.Damodhar Rao/.ii)Voices on the Wing – Telugu Free Verse – 1985 – 95 – V.V.B.Ramarao/iii)VIRTUOO -A refereed Transnational Bi -Annual Journal of Language and Literature in English /iv)San Diego Poetry Annual 2011 – 12,2015 -16 (The Best Poems from every corner of the Region)/v)Wakes on the Horizon – A Selection of Poems translated from Telugu – N.S.Murthy./6) వలస పోయిన మందహాసం కవితా సంకలనం మీద వార్త దినపత్రికలో సంపాదకీయం./7) కేంద్ర సాహిత్యఅకాడమీ,తెలుగు విశ్వవిద్యాలయం/,Hyderabad Literary Festival లాంటి సంస్థల్లో పత్ర సమర్పణ, కవిత్వ పఠనం. 8) ఆకాశవాణి రేడియో కేంద్రాలలో, టీవీలలో,కవితల ప్రసారం, పరిచయ ప్రసంగాలు/9) కేరళ తుంజన్ 2013 కవితోత్సవాలకు తెలుగు కవిగా ప్రత్యేకాహ్వానం./10)”రాత్రి నదిలో ఒంటరిగా” కవిత్వ సంకలనం మీద మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్. పట్టా ప్రదానం – 2018./వివిధ గ్రంథాలలో వీరు రాసిన పరిచయ వ్యాసాలు :/1)Modern Poetry in Telugu – వడలి మందేశ్వర రావు./2) సాహిత్య మహిళావరణం, కవిత్వానుభవం – చేరా/.3) సాహిత్యకీయాలు – ఏ.బి.కె/.4) అభివ్యక్తి – గుడిపాటి/.5)సాలోచన – గోపి./6) గుండెతడి – జింబో/.7) ఈ కాలం కవులు – సౌభాగ్య./8) సాహితీ మంత్ర నగరిలో సుస్వరాలు – మునిపల్లె రాజు./9) తెలుగులో ఆధునిక నవల – ఇతర వ్యాసాలు – అంపశయ్య నవీన్.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
“నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
“జీవితమా …
“ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
“ఎంత గారాల బిడ్డనో నేను ? “
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది.అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు. మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది. స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు,బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి.స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు. మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది. ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం.మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు.జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది.తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (17)
తెలుగులోకి అను సృజన ;గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఎందుకు ఎప్పుడు నా వెంటే
“నడుస్తుంటావని నా నీడను అడిగాను
“మరి ఇంకెవరున్నారు నీకు తోడుగా
“ చెప్పు .. అంటూ చిన్నగా నవ్వేసింది నా నీడ !
నీడ ఇది ఒక మూల పదం.నీడ లేదా ఛాయకు ఆంగ్లంలో Shadow అని అర్థం.మనం నీడ కోసం గొడుగులు వాడతాము. ఇవి వేసవి కాలంలో మనల్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి.కాంతి ప్రసారాన్ని వస్తువు అడ్డగించినప్పుడు,అడ్డగించిన ఆకారాన్ని పోలిన నల్లటి ఆకారం నీడ.పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడను ఉపయోగించి సమయాన్ని కనుగొనేవారు.తోలుబొమ్మలాటలు బొమ్మల నీడలను ఉపయోగించి జన రంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో ఉంది.ఖగోళంలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి.సూర్యుని వెలుతురు పడని స్థలం నీడ.సూర్యుని ప్రకాశానికి ఏదైనా వస్తువు అడ్డుగా వచ్చినప్పుడు నీడ ఏర్పడుతుంది. ఎండా కాలంలో బాటసారి చెట్టు నీడలో చేరి సేద తీరుతాడు.ఒక వస్తువు యొక్క ప్రతిబింబం కనిపించుట నీడ.వెలుతురు ఉన్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి కనిపిస్తుంది.అది నీడ.ఈ కవిత ఒక భావోద్వేగంతో కూడిన భావనను ప్రతిబింబిస్తుంది.ఇందులో కవి తనకు నీడతో ఉన్న అనుబంధాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరిస్తాడు.వ్యక్తి తన నీడను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ”ఎప్పుడు నా వెంటే నడుస్తుంటావు ఎందుకు?దానికి నీడ సమాధానం ఇస్తుంది.నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చిన్నగా నవ్వుతూ అంటుంది.ఈ వాక్యం మనుషుల జీవితాలలో తోడుగా ఉండే ఒంటరితనాన్ని,అనుబంధాలను ప్రతిబింబిస్తుంది.నీడ ఇక్కడ కేవలం శారీరకంగా ఉండే దృగ్విషయం మాత్రమే కాదు.మన జీవన ప్రయాణంలో నీడ అణుకువగా ఉన్న తోడు అని భావించవచ్చు.నీడను అడగడం ద్వారా తనను ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా?అనే ఆలోచనను వ్యక్తం చేస్తాడు.ఇది మనిషి జీవితంలో సహజంగా ఎదుర్కొనే ప్రశ్నలను ప్రతిబింబిస్తుంది.నీడ సమాధానం చెబుతూ నాకు తోడుగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం ద్వారా వ్యక్తికి సానుభూతిని కలిగిస్తుంది.నీడతో చెప్పిన మాటలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి.ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది.ఒంటరిగా ఉన్న సమయంలో మనిషి తనకు తానే తోడుగా నిలుస్తాడు.నీడ ఎక్కడైనా నవ్వుతుందా?అనే ప్రశ్నలు మనలో చెలరేగుతాయి.
నీడ చిన్నగా నవ్వడం అనేది కవితలో ఒక తేలికపాటి దార్శనిక భావనను సూచిస్తుంది.ఇది మనం సాధారణంగా చూసే విషయాలను ప్రత్యేక దృక్పథంలో పరిశీలించవల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.ఈ కవితలోని భావనలు మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి.మన జీవిత ప్రయాణంలో కొన్ని సార్లు మనకు మనమే తోడుగా నిలవాలి.నీడ మనకు స్నేహం,నమ్మకం,ధైర్యం కలిగిస్తుంది.నీడ మనకు ఎప్పుడు తోడుగా మన వెన్నంటి ఉంటుంది.నీడ ఎప్పుడు మనలని వదిలి పెట్టదు.మనుషుల ఒంటరితనం అలాగే మన ఆత్మ బలాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ వ్యక్తం అవుతున్నది.ఇందులో జీవితంలోని సహజమైన అనుబంధాలను చక్కగా తెలియజేసిన తీరు బాగుంది.ఈ కవిత మన జీవితంలో నీడ వలె ఉండే వ్యక్తుల గురించి చెబుతుంది.నీడ ఎల్లప్పుడు మన వెంట ఉంటుంది.అదే విధంగా మన జీవితంలో నీడ వలె కొంత మంది వ్యక్తులు ఎల్లప్పుడు మన వెంట ఉంటారు.ఈ కవిత మనల్ని మన జీవితంలోని వ్యక్తుల గురించి ఆలోచింపజేస్తుంది.మన జీవితంలో వారి పాత్రలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ కవితలో నీడ ఒక ప్రతీకగా ఉపయోగించబడింది. నీడ అనేది మన జీవితంలో ఎల్లప్పుడు మన వెంట ఉండే వ్యక్తులను సూచిస్తుంది.ఈ కవితలో భాష సరళంగా ఉన్నందు వల్ల అర్థం చేసుకోవడం సులభం.గుల్జార్ షాయరీ కవితలోని శైలి ప్రత్యేకతను కలిగి ఆకర్షణీయంగా ఉంది.షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసం కలిగిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (18)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవిత ఇది.దీనిని గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రతీ సంధ్య వేళలో నా కుశలం
“కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా …
“లేక … మీ ఊర్లో అసలు సాయంత్రమే “కాదా ఏంటి?”
రాత్రి ముగిసి సూర్యోదయం అయ్యే మధ్య కాలాన్ని అలాగే సాయంత్రం ముగిసి సూర్యాస్తమయం అయ్యే మధ్య కాలాన్ని సంధ్యా సమయం అంటారు. రాత్రి వేళ చలి మంట కాచుకుంటూ చంద్రుని నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తుంటే ఎంతో కను విందుగా ఉండేది.ఆ సంధ్య వేళ వీచే చిరు గాలి చుట్టూ ఉన్న మొక్కల నుండి మోసుకొచ్చే పరిమళాలు ఇంపుగా ఉండేవి.సాయంత్రం అనేది పగటి పూట ముగింపుతో ప్రారంభమయ్యి మరియు రాత్రి మొదలు కావడంతో ముగుస్తుంది.ఈ కవిత ఒక వ్యక్తి తన స్నేహితుడితో సంభాషించడం గురించి చెబుతుంది.కవితలోని భావం హృదయానికి తాకేలా ఉంది.”ప్రతీ సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా?మర్చి పోయావా? లేక మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా? ఏంటి?అని కవితాత్మకంగా అడుగుతున్నాడు.ఈ కవిత మన జీవితంలోని స్నేహ ప్రాధాన్యతను వ్యక్తం చేస్తుంది. స్నేహితులు మన జీవితంలో ఎల్లప్పుడు మన వెన్నంటి తోడుగా రక్షణ కవచంలా నిలుస్తారు. స్నేహితులు ఎప్పుడు మన యోగ క్షేమాలపై దృష్టి సారిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైంది.స్నేహితులు మనల్ని సరి అయిన గమ్యంలో నడిపిస్తారు.స్నేహం అనేది మన జీవితంలో మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది.ఈ భావన స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని తెలుపుతుంది.స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయతతో అడగడం,సమాధానం ఇవ్వడం వంటి విషయాలు మనం ఎరిగినదే.ఇది స్నేహితుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.వారు పరస్పరం మరిచిపోని వారై ఒకరిపై ఒకరి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు.సాయంత్రం అనే కాలమానానికి మానవ సంబంధాలను అన్వయిస్తూ మనసులోని వ్యధను ఈ విధంగా వ్యక్తీకరించడం బాగుంది.ఈ కవిత ఒక వ్యధతో కూడిన ప్రేమను, ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేమ,దూరం కావడం మరియు మరిచిపోవడంపై కవి గుండెలో చెలరేగుతున్న అనేక అనుభూతులను వ్యక్తీకరిస్తుంది.ఈ కవితలోని ప్రతి పంక్తి లోతైన భావాలతో నిండి ఉంది.ప్రతి సంధ్య వేళలో నా కుశలం కనుక్కుంటున్నావు కదా మర్చిపోయావా? ప్రతి సాయంత్రం తనను గుర్తు చేసుకుంటున్నావా అని కవి ప్రేమతో,ముద్దుగా మనసులో నెలకొన్న సందేహంతో ప్రశ్నిస్తున్నాడు.మర్చిపోయావా అనే ప్రశ్న వేదనతో కూడిన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. ఇది ప్రేమలో ఉన్న అపార్థాలను అంతర్గత భయాన్ని సూచిస్తుంది.లేక,మీ ఊర్లో అసలు సాయంత్రమే కాదా ఏంటి? అని కవి ప్రశ్న ద్వారా సార్వజనీనమైన ప్రకృతిని కూడా వ్యక్తిగతంగా అన్వయిస్తున్నాడు. సాయంత్రం అనే సమయాన్ని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి తన గురించి ఆలోచించడం లేదని భావించి,అది నిజమా?కాదా?అని ప్రశ్నిస్తున్నాడు.ప్రేమికుల మధ్య ఎడబాటు మరియు దూరం వల్ల ఉత్పన్నమైన ఆత్మీయతను కోల్పోవడం మరియు ప్రేమలో కలిగే నిరాశకు ప్రతీకగా ఉంది.ఈ కవితలో ప్రేమికుల మధ్య పెరిగిన దూరం,సాయంత్రం వంటి ప్రత్యేక సమయాలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నాడా?లేదా?అనే అనుమానాన్ని, మరిచిపోయాడేమో అనే బాధను ప్రతిబింబిస్తుంది. ఇది వేదనతో కూడిన భావన.మీ ఊర్లో సాయంత్రమే కాదా ఏంటి?అనే ప్రశ్న ద్వారా కవితలో గంభీరతతో కూడిన భావన మరింతగా హృదయాన్ని తాకుతుంది.ఈ పంక్తి గుండెలో నెలకొన్న బాధను, అసహనాన్ని మరియు ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని సూచిస్తుంది.కవి ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని లేదా స్పందన లేకపోవడాన్ని గమనిస్తున్నాడు. సాయంత్రమే లేక పోతే అని రూపకాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి జీవితంలో ప్రేమను, ఆత్మీయతను తాను కనుగొనలేక పోతున్నట్లు భావిస్తున్నాడు.ఇది ఆ వ్యక్తిలోని అజాగ్రత్తను, స్పందన లేనితనాన్ని ప్రతిబింబిస్తుంది.సాయంత్రం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని,ప్రశాంతతను, ఒక ప్రత్యేకతను గుర్తు చేస్తుంది.అయితే మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనే ప్రశ్న ద్వారా కవి ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయతకు చోటు లేదని పేర్కొంటున్నాడు.అది వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం వల్ల వచ్చిన కోపాన్ని,నిరుత్సాహాన్ని సూచిస్తుంది.మీ ఊర్లో సాయంత్రమే కాదా? అనే ప్రశ్న వ్యంగ్యంగా ఉంది.ఇది ఎదుటి వ్యక్తిలోని నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే పద్ధతిగా భావించ వచ్చు.అది నిజంగా సాయంత్రం లేక పోవడం గురించి కాదని, అతను సాయంత్రం గురించి ఆలోచించట్లేదని స్పష్టం చేస్తున్నాడు.ఈ పంక్తి ప్రేమలో నిర్లక్ష్యం లేదా మర్చిపోవడాన్ని సూచిస్తుంది.మనం మన ప్రియమైన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడం మరియు వారి కోసం ఆలోచించడం మన సహజమైన బాధ్యత. సాయంత్రం ప్రకృతిలో నిరంతర చక్రం కాగా అది వారిలో ఉండకపోవడం అంటే ప్రేమ,ఆత్మీయత లోపించినట్లు కవి భావిస్తున్నాడు..మీ ఊర్లో సాయంత్రమే కాదా?అనేది వ్యక్తిగత బాధను, అపేక్షను మరియు అంతర్మధనాన్ని వ్యక్తీకరించే అద్భుతమైన ప్రశ్న.ఇది ప్రేమలో గోచరమయ్యే దూరం,నిజమైన భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను అద్భుతంగా వ్యక్తీకరించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.కవి గుల్జార్ లోక రీతిని ఎరిగిన వాడు.షాయరీ కవితలో పొందుపరిచిన భావాలు పాఠకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
కవిత్వం పై పుస్తక సమీక్ష.
ప్రముఖ కవి,కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,విశ్రాంత లైబ్రేరియన్,ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కరీంనగర్,వారాల ఆనంద్ మనిషి లోపల no man’s land కవిత్వంపై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని తన భార్య ఇందిరా రాణికి అంకితం ఇవ్వడం ముదావహం.ఆనంద్ కవితా సంపుటిలో కలిసి బతుకుని పంచుకుందామని వచ్చి నాకు జీవితాన్నే ప్రసాదించిన సహచరి ఇందిరకు అని రాసుకున్న అంకిత వాక్యాలు అతనికి తన భార్యపై ఉన్న గౌరవాన్ని ప్రకటిస్తున్నాయి.ఈ పుస్తకానికి అన్నవరం శ్రీనివాస్ చక్కటి ముఖచిత్రం అందించారు.దర్భశయనం శ్రీనివాసాచార్య ముందు మాటలో ఆగస్టు 2013 నుంచి ఇటీవల దాకా ఆయన రాసిన కవిత్వమే ఈ సంపుటి.నేను ఈ కవితల్ని చదివి ఆశ్చర్యపోయాను.క్లిష్ట వేదనా సమయంలో ఇంత రాశిగా కవిత్వం రాసాడా అని నిదానంగా ఆలోచిస్తే,ఇది పెద్దగా ఆశ్చర్య పడాల్సిన విషయం కాదనిపించింది.వ్యక్తీకరణ తెలిసిన సాహిత్యశీలి కనుక తన లోపలి ప్రపంచాన్ని,

ప్రకంపనల్నీ,నిశ్శబ్దాన్నీ,అలజడిని రికార్డ్ చేశాడు. ఐతే కుదురైన వచన వాక్యాన్ని రమ్యంగా రాయగలిగే శక్తీ,అలవాటు ఉన్న ఆనంద్ తన భావాల్ని వచన రూపంలోకి కాక,కవిత్వ రూపంలో ఎందుకు పెట్టి వుంటాడు?తాను తన వేదనను వ్యక్తీకరించాలి.వేదనను అధిగమించే ప్రయత్నాన్ని వ్యక్తీకరించాలి.ఒక emotoional సందర్భం.దానికి కవిత్వమే సరైన మాధ్యమని భావించి వుంటాడు. వ్యక్తీకరణకు అవసరమైన మూలకాలు తనలో ఎలాగు వున్నాయి.వేదనా సమయంలో మనిషి ఆలోచనలు పలు దిశలకు ఎలా సాగుతాయో ఈ సంపుటిలో కవితలు చెబుతాయి.మనిషికి మెలిక అవసరాలైన ప్రేమ,స్నేహం,తోడు,సంభాషణల పలవరింత ఆనంద్ కవితల్లో అగుపడుతుంది. దుఃఖాన్ని అధిగమించడానికి మనిషి చేసే ధైర్య చింతనకు దాఖలాలు ఇందులో వున్నాయి. నిజానికి,రెండు మూడు కవితల్ని మినహాయిస్తే, మిగతా అన్ని కవితల్లో సాగిన చింతనలో ఏక సూత్రత వుంది.అరమరికలు లేని సూటి దనముంది.వ్యక్తీకరణలో స్పష్టత ఉంది.కవిలోని శిల్ప ధ్యాస వస్తువుతో మిళితమై రాణించిన కవితలు బలంగా సాగాయి.వస్తు ప్రధానమైన కవితలు భావ ప్రకటన అనే ఏక లక్ష్యంతో కదలాయి.సున్నితంగా మనిషిలో సాగే ప్రకంపనలు దాదాపు అన్ని కవితల్లోనూ వుండడం ఒక వాస్తవాంశమే కాకుండా విశేషాంశం కూడా.ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపం ఈ సంపుటి.దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు.అనుభవంతో తాత్విక స్థాయి కెళ్ళి దుఃఖపు జీర లేకుండా ఏదైనా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖ్యానించాడు ఆనంద్.ఈ సంపుటిలో దుఃఖం అనే మాట కనిపించినంతగా మరే మాట కనిపించదు.ధైర్యం అనే భావం పలికినంత మరే భావము పలక లేదు.వారాల ఆనంద్ సినిమా ప్రపంచంలో కదుల్తూనే కవితా ప్రపంచాన్ని వెంటేసుకు తిరగాలని ఆకాంక్షిస్తూ .. దర్భశయనం శ్రీనివాసాచార్య అన్నాడు.ఆనంద్ మనిషి లోపల కవిత్వం గురించి తెలుసుకోవాలని తహతహగా ఉందా?అయితే ఒక్క సారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. గొప్ప గొప్ప కవితానుభూతుల లోకంలోకి వెళ్ళి విహరించండి.లోపలా – బయట కవితలో గది లోపల/మిరుమిట్లు గొలిపే కాంతిలో/ఆకులన్నీ పేర్చి విస్తరి కుట్టినట్టు/గ్లౌజులు తొడుక్కున్న చేతులు/ చకచక కదిలి పోతున్నాయి/సైగలే అక్కడి భాష/ నిశ్శబ్దానిదే రాజ్యాధికారం/గది బయట/ ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టు/అలలు అలలుగా అక్కడొకరు ఇక్కడొకరు/చేతులు కట్టుకుని ఒకరు/జేబుల్లో చేతులు పెట్టుకొని ఒకరు/ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆగని వెక్కిళ్ళు/నిశ్శబ్దాన్ని మంద్రంగా చేదిస్తున్నాయి/అంటున్నారు.ఆనంద్ తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నాడు.హాస్పిటల్ గది లోపల ఏం జరుగుతుంది?హాస్పిటల్ గది బయట ఏం జరుగుతుంది? అనే విషయాలను ఎంత అద్భుతంగా కవిత్వంలోకి మలిచాడో చదివితే హృదయం ద్రవిస్తుంది.ఆనంద్ వేదనామయ జీవితాన్ని కవిత్వంలో చక్కగా వ్యక్తీకరించిన సాహసిగా చెప్పవచ్చు.వేదన నుంచి కవిత్వం పుడుతుంది అంటారు.కాలం కవితలో గతం, వర్తమానం,భవిష్యత్తు కాలాన్ని తడుముతూ నడుస్తున్న కాలం/మనిషికి జీవ ధాతువు/ అంటున్నారు.నడుస్తున్న కాలంలో మనిషి తాను జీవనం కొనసాగించాలి.నడుస్తున్న కాలం మనిషికి జీవాన్ని అందించే ధాతువు అంటూ కాలం విలువను తెలియజేసారు.కవి ఆత్మవిశ్వాసంతో బతుకు పట్ల ఆశను కలిగిస్తూ ప్రేరణను అందిస్తున్న తీరు బాగుంది.ఇమ్మ్యునో సప్ప్రెస్సర్స్ కవితలో శరీరంలో ప్రతిఘటించే గుణాన్ని/నియంత్రించేదేదో/రక్తనాళాల్లో సుళ్లు తిరుగుతోంది/ప్రతిఘటనా నియంత్రణ/ శరీరానికే కానీ ఆలోచనకు కాదు కదా/మనసులో ముంచిన ఆలోచనలకు/పదును పెడుతూ/తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు/ఎంతయినా మనసున్న మనిషి కదా/అంటున్నారు.ఇమ్మ్యునో సప్ర్పెస్సర్స్ అంటే శరీర రోగ నిరోధక వ్యవస్థను తగ్గించే ఔషధాలు.రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలతను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.అవయవ మార్పిడి సమయంలో శరీరం కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు వైద్యుల పర్యవేక్షణలో దీనిని ఇస్తారు.దురదృష్టవశాత్తు ఆనంద్ మూత్రపిండాలు పాడై పోయినాయి.తన సహచరి ఇందిర మూత్రపిండం ఇచ్చి తన భర్త ఆనంద్ ను ప్రేమతో కాపాడుకుంది.ఈ కవితలో తన శరీరంలో మూత్రపిండం అవయవ మార్పిడి జరిగినప్పుడు మనసున్న మనిషి కదా అని తన గురించి తాను నిభాయించుకుంటున్నాడు.ఈ వాక్యాలు ప్రాణం పోతున్నవారికి ప్రాణం పోసేలా ఉన్నాయి.విజయ తీరం కవితలో మూసినా తెరచినా/కళ్ళు కలల్ని/తోడ్కొని వస్తాయి/కురిసిన ఆరినా/కన్నీళ్లు/మనసును కడిగేస్తాయి/వేకువా చీకటీ/ఒక దాని వెనక మరోటి/ఏది ముందు వస్తుందో/ఏమి ఎరుక/అంటున్నారు.మనిషి కాలంతో పాటు పయనించి విజయ తీరాలకు చేరుకోవాలనే భావన స్ఫూర్తిని కలిగిస్తుంది.నాని గాడు కవితలో ఇన్నేళ్లూ/వాడు నాకర్థం కాలే/అవును ఎవరయినా/ ఎందుకు అర్థం అవుతారు/మనం ప్రయత్నిస్తే కదా/ ఇన్నేళ్లూ నాకు తెలియనిదేదో/తెలుస్తున్నట్టు/వాడి అంతరంగమేదో/ఆవిష్కృతమవుతున్నట్టు/వాడి కలలేవో రూపు దిద్దు కుంటున్నట్టు/అంతరిక్షం నుంచి సృజన వైపు/వాడి ప్రయాణం/సారీ రా నాని/నువ్వు అర్థం కాలేదనుకున్నా/కాని నేనే అర్థం చేసుకోలేదు/ అంటున్నారు.పిల్లలు తల్లిదండ్రుల కలలకు రూపాలు.పిల్లలు దైవ స్వరూపాలు అంటారు. అందులో సందేహానికి తావులేదు.తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు గ్రహిస్తారు,అర్థం చేసుకుంటారు.తల్లిదండ్రులు తమ గురించి ఏమనుకుంటున్నారు?అనే వాస్తవాన్ని పిల్లలు గ్రహిస్తారు.తల్లిదండ్రులే పిల్లలను సరిగా అర్థం చేసుకోరు అనిపిస్తుంది.ఆనంద్ తన కుమారుడు అన్వేష్ కు సృజనాత్మకమైన కళల పట్ల గల ఆసక్తిని తెలుసుకొని తండ్రిగా ఎంతో సంతోషిస్తాడు.నా కలలూ నీ కలలూ/ప్రోది చేసుకుని/విశ్వంలోకి దూసుకెళ్ళు/నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు/ అంటున్నారు.ఆనంద్ అవధులు లేని తన సంతోషాన్ని వ్యక్తం చేసిన తీరు బాగుంది.నిష్టూరం కవితలో ఎవరికీ ఎవరి మీదైనా/నిష్టూరం ఎందుకు/ముడుచుకోవడం/విచ్చుకోవడం/ పరిమళించడం/వారి వారి జీవ లక్షణం కదా/కలిసి రావడం/కలిసి నడవడం/కలిసి జీవించడం/ఎవరికి వారు గీసుకున్న/వృత్త పరిధిలోనే కదా/అయినా ఎవరి మీదయినా/నిష్టూరం ఎందుకు/కలిసొచ్చే అంశాల్లో కలిసిపోయి/కాని విషయాల్ని వదిలేసి/చిరునవ్వులు చిందిస్తూ/ప్రవాహమయి పోతే సరి/అంటున్నారు.నిష్ఠూరం అనగా నిందనీయమైన మాటలు.ఇతరుల మాటలను అపార్థం చేసుకుని సరైన కారణం లేకుండా నిందిస్తుంటారు.ఇతరులు ఏ సందర్భంలో అలా మాట్లాడారు అనే విషయాన్ని గ్రహించాలి.నిష్ఠూరపు మాటల వలన మనకు కావాల్సిన దగ్గరి వాళ్ళు మనసు నొచ్చుకొని దూరమవుతారు.కవి నిష్ఠూరం ఎందుకు?అని ప్రశ్నిస్తున్నారు.కలిసి వచ్చే అంశాల్లో కలిసి పోవాలి.పనికిరాని విషయాలను వదిలి వేయాలి.మనసులో ఏ కల్మషం లేకుండా చిరు నవ్వులు చిందిస్తూ కలిసిమెలిసి ఉండాలి.మనలో సానుకూలమైన ఆలోచనలు కలిగేలా ప్రోత్సహించి ఇతరులతో సామరస్య ధోరణిలో కలిసిమెలిసి సాగాలి అని వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.మనస్సు తేలికపడింది కవితలో దేన్నయినా/కోల్పోవడానికి/దూరం చేసుకోవడానికి/ సిద్ధంగా లేదు మనసు/ప్రేమనీ ద్వేషాన్నీ/కోపాన్నీ ఆప్యాయతనీ/విచ్చుకున్న పూలనీ/విరగ కాసిన చెట్టునీ చెట్టు బెరడునీ/చుక్కల ఆకాశాన్ని హత్తుకున్న దేన్నయినా సరే/వదులుకోవడానికి సిద్ధంగా లేదు మనసు/నేనే అశాశ్వతం కదా/ అన్నాను గుసగుసగా/ఉలిక్కిపడింది మనస్సు/ నువ్వు నేనూ లేకున్నా/నీ కవిత్వం ఉంటుందిగా/ తేలికపడింది మనస్సు/అంటున్నారు.మనస్సు చేసే మాయాజాలం మనం ఎరిగినదే.మనలను ఆలోచనా తరంగాల్లో తేలియాడ జేసిన భావాలు చక్కగా ఉన్నాయి.సహచరి కవితలోఆమె/ఒక భోళా/తనకు తెలిసినదేదో తెలిసినట్టు/తోచిందేదో తోచినట్టు/ స్వపర భేదాల్లేవు/ముందు వెనకల్లేవు/కుళ్ళూ లేదు కుతంత్రం లేదు/మా ఇద్దరి గమనంలో రహస్యం లేదు/ప్రేమలో మాలిన్యం లేదు/ఆమె స్నేహంలో/ వెన్నెల కురుస్తుంది/త్యాగంలో ఆకాశాన్ని స్పృశిస్తుంది/ఆమెతో జీవితం/బతుకంత లోతయింది/విశ్వమంత విశాలమయింది/ అంటున్నారు.ఇందిర కిడ్నీని దానం చేసి తన భర్త ఆనంద్ ను కాపాడుకుంది.నేటి సమాజంలో కుటుంబ సంబంధాలు బీటలు వారుతున్న ఈ రోజుల్లో తన భర్త పట్ల అపారమైన ప్రేమానురాగాలను చూపిన ఇందిర తన కుటుంబానికి,సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆనంద్ సహచరి ఇందిర గురించి వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.ఆపరేషన్ థియేటర్ కవితలో శీతల గదిలో తెల్లటి మంచం మీద/కాళ్లు బార్లా జాపి/శవాసనంలా వున్నాడతను/ అకస్మాత్తుగా/కళ్ళు మిరుమిట్లు గొలిపే/కాంతి ప్రసరించింది/అతని కాళ్లూ చేతులూ/తలా శరీరమూ అన్నీ/మాట్లాడటానికి నోళ్ళు తెరిచాయి/గానం చేయడానికి గొంతు సవరించుకున్నాయి/కాని అన్నీ చలనరహితమయి మూగవయిపోయాయి/అతని మనసొక్కటే మేల్కొని/కళ్ళ కిటికీలోంచి మంచు గదిని చూడ్డం మొదలు పెట్టింది/అంటున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఏం జరిగింది?అనే దానిని స్పష్టంగా గమనించి తన మనసులోని భావాలను కవితలో చక్కగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. ఎట్లా…కవితలో నాకేదీ నచ్చడం లేదు/నన్నసలు ఏదీ ఆకర్షించడం లేదు/అవును మరి/కళ్ళల్లో మెరుపు లేకుండా/పెదాలపై చిరునవ్వు ఏం బాగుంటుంది/అందుకే/గుండె లోతుల్లోంచి రాకుండా/పైపైన ఏమి వస్తే మాత్రం/ఎట్లా నచ్చుతుంది/ఆత్మ లోతుల్లోంచి లేకుండా/ ఎంత అందమైతే మాత్రం/ఎట్లా ఆకర్షిస్తుంది/అంటున్నారు. ఇవ్వాళ మనుషులు వ్యవహరించే తీరులో ఎంతో మార్పు వచ్చింది.మనిషి బతుకు నటనగా మారింది.హృదయం లోతుల్లో నుంచి వచ్చే ఆత్మీయత కావాలి.మనుషుల్లో ఈనాడు ఆత్మీయత కొరవడింది.నాకేది నచ్చడం లేదు.నన్ను అసలు ఏది ఆకర్షించడం లేదు.పై పై ప్రేమలు నీటి బుడగ లాంటివి.అవి నటనగానే కనిపిస్తాయి.నటనలు వద్దు.హృదయపూర్వకమైన ప్రేమ కావాలి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నో మాన్స్ లాండ్ కవితలో సరిహద్దుకు అవతల/అది ఎవరికీ చెందిన స్థలం కాదు/నన్ను చూడ్డానికి వచ్చావు/గాలి నియంత్రించిన గదిలో/పడి ఉన్నాను/నిన్ను చూస్తూనే ఉన్నాను/కూడబలుక్కున్న మాటలు/నీ కళ్ళల్లోఓ కన్నీటి చార/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన బంధువులు,మిత్రులతో ఆ ప్రాంతం సందడి సందడిగా ఉంది.దుఃఖము వద్దు.వేదన వద్దు.

వీడ్కోలు తెలియని సాంగత్యంలో ఇక నిర్భయంగా కలిసి ఉందాం అనే ఓదార్పు మాటలు ఎవరికైనా తృప్తిని కలిగిస్తాయి.మనిషి జీవితం ఒక్కో సారి సరిహద్దు అవతల పని చేస్తున్న సైనికుని జీవితం వలె మారడం సహజం అనిపిస్తుంది.ఆనంద్ ఆనాటి తన మానసిక స్థితిని చక్కగా కవిత్వీకరించారు. విషాదం కవితలో ఎటూ కదలడానికి వీల్లేదు/ఎటూ మెదలడానికి వీల్లేదు/మైళ్ళకు మైళ్ళు నడవాలనిపిస్తది/ఉరుకులు వేయాలనిపిస్తది/ అందరిలో కలవాలనిపిస్తది/అందరిని అవ్వాలనిపిస్తది/మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం/మనం అనుకున్నట్టుగా ఉండ లేకపోవడం/మరణం కన్నా విషాదం/అంటున్నారు.ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. మనిషి జీవితం చిత్రమైనది.ఒక్కోసారి మనిషి జీవితం తెలియకుండానే విషాదంలోకి నెట్టబడుతుంది.మనిషి జీవితం మరణం కన్నా విషాదం అని తెలిపిన భావాలు వాస్తవానికి అద్దం పడుతున్నాయి.ఒక్కోసారి కవితలో ఒక్కోసారి నిలిచిపోవడం/కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడి పోవడం/మంచిదేనేమో/ఒక్కోసారి/నిలిచిపోవడం లోంచే/నిలువెత్తుగా ఎగిసిపడడానికి సత్తువ వొస్తుంది/తలెత్తుక తిరగడానికి/ప్రాణమొస్తుంది/ అంటున్నారు.ఒక్కోసారి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది?కూలబడిపోయిన మనిషికి కూడా స్వస్థత చేకూరుతుంది.మనిషి సంకట సమయంలో ధైర్యంతో వ్యవహరిస్తే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్య వంతుడవుతాడు.మనిషిలోని నిర్జీవమైన అవయవాలు చైతన్యం పుంజుకుని ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు అనే ధైర్యం కలిగిస్తున్నాడు.ప్రేమ స్నేహం కవితలో తొలి చూపులో ప్రేమించడం/మొదటి పరిచయంలోనే స్నేహించడం సులభమే/ సహజంగా స్వచ్ఛంగా వాటిని కొనసాగించడమే కష్టం/ప్రేమలోనూ స్నేహంలోనూ/ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ ఉంటాయి/ప్రేమకు అనంతమైన భావోద్వేగమూ/ స్నేహానికి నిర్మలమైన స్వచ్ఛతా కావాలి/ అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రేమ,స్నేహంలో కూడా తేడాలు కనబడుతున్నాయి.ప్రేమ,స్నేహం లేకపోతే దిక్కులేని వాన్నవుతాను.ప్రేమ,స్నేహం లేకపోతే ఈ లోకమే దిక్కులేనిది అవుతుంది అంటూ నిర్మలమైన ప్రేమ,స్నేహం ఆవశ్యకతను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.సమయమిదే… కవితలో లోపలెక్కడో దాగి వున్న/పిసరంత ధైర్యాన్ని కూడగట్టుకుని/నిలబడాల్సిన సమయమిదే/సరిగ్గా ఇప్పుడే ఇక్కడే/నీ కాళ్లపై నువ్వు నిలబడాలి/ఓటమి అంచుని తాకి,విజయ తీరాల వైపు సాగాలి/ అంటున్నారు.ఆరోగ్యం బాగాలేదని ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు.ధైర్యాన్ని కూడగట్టుకొని నిలబడాల్సిన సమయం ఇదే అని చెప్పిన భావాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ కవితలో నిరాశ నిండిన జీవితం/ప్రేమ కోసం ఎంతగా ఆశపడుతుంది/నిరాశ నిండిన రోజున/వెలుగు కిరణాల మెట్లపై/గాలి కెరటాల వోలె ఉప్పొంగితే/చిరునవ్వులు విరబూస్తూ ప్రేమ చిగురిస్తుంది/చిరుజల్లు వోలె రోజంతా వర్షిస్తుంది/అంటున్నారు.నిరాశ కమ్ముకున్న రోజున ప్రేమ కోసం ఆరాటపడతాం.సూర్యకిరణాలు ప్రసరిస్తే,సముద్రంలోని కెరటాలు ఉప్పొంగితే మనలో సంతోషం ఎగసిపడుతుంది.ఆశావహ దృక్పథంతో మనలో ప్రేమ చిగురిస్తుంది.ప్రేమ చిరుజల్లు వలె కురుస్తుంది అని వ్యక్తం చేసిన భావాల తీరు బాగుంది.ఇంకా మిగిలే వుంది కవితలో నేస్తమా/జీవితాన్ని శోధించాలి/కొంచెం వేదనను వదిలేయి/ఇంకొంచెం ఆశ్చర్యాన్ని విడిచేయి/గుప్పిట విప్పి గుండె లోతుల్లోని/స్వప్నాల్ని మేల్కొల్పాలి/ కళ్ళు తెరిచి కన్నీటి/సముద్రాలు దాటాలి/ఎత్తు పల్లాల్ని దాటుకుంటూ/మనం పయనం సాగించాల్సిందే/మనం కలిసి గడపని/క్షణం ఇంకా మిగిలే వుంది/అంటున్నారు.మన ప్రయాణం ఇంకా మిగిలే ఉంది అంటూ స్నేహితునికి ప్రేరణ కలిగిస్తున్నారు.ఆత్మగల మనుషులు కవితలో ఏదో ఒక క్షణాన/సంక్షోభం ఆవరిస్తుంది/తెలియని సంక్లిష్టత/చుట్టు ముడుతుంది/ధైర్యం కొడిగడుతుంది/దైన్యం ముప్పిరిగొంటుంది/ఆత్మ గల మనుషులే/అన్ని శక్తుల్ని కూడదీసుకుని/ కూలిపోకుండా నిలదొక్కుకుంటారు/చేతులు బార్లా జాపి/అందర్నీ నిలబెడతారు/అంటున్నారు.ఆత్మగల మనుషుల గురించి వ్యక్తీకరించిన భావాలు వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.బతుకు కవితలో బతుకు కష్టంగా ఉందా/నిరాశ చుట్టూ/ఓ వృత్తాన్ని గీయి/ఆశ దాని చుట్టూ తిరిగి తిరిగి/నిటారుగా/ నీ ముందు నిలుచుంటుంది/అంటున్నారు.మనిషి బతుకులో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి.బతుకులో కష్టాలు ఉన్నాయని నిరాశతో బెదిరిపోకూడదు. మనిషి ఆశను శ్వాసగా చేసుకుని జీవించాలి అని బతుకు అర్థం చెప్పిన తీరు బాగుంది.ఎక్కడ కవితలో దుఃఖమూ సంతోషమూ/మొదలెక్కడ చివరెక్కడ/చీకటీ వెల్తురూ/దారెక్కడ దరెక్కడ/నిద్రా మెలుకువా/పోరెక్కడో బతుకక్కడ/ అంటున్నారు. ఎక్కడ అంటూ ప్రశ్నించి సమాధానం చెప్పిన తీరు బాగుంది.మిత్రమా కవితలో మనం మాట్లాడుకోవడం మానేసి/చాలా రోజులైంది/ పలకరించుకోవడమే మిగిలింది/అవును మరి మాట్లాడుకోవడానికి/మనసులుండాలి,ఆత్మలుండాలి/ఎదురు ఎదురుగ్గా మనుషులుండాలి/ అంటున్నారు.ఈనాటి సమాజంలో మిత్రుల మధ్య పొరపొచ్చాలు,విభేదాలు పొడచూపుతున్నాయి. ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాల్సిన మిత్రుల మధ్య సఖ్యత కొరవడింది.మిత్రులు మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది అంటూ ఆవేదన చెందుతున్నారు.కలిసిపోయే మనసులు ఆత్మలు ఉండాలి.మిత్రమా మనుషులు ఎదురు ఎదురుగా ఉండాలి అంటూ చెప్పిన భావం చక్కగా ఉంది.మలుపు కవితలో సాఫీగా గడిచిపోతున్న/జీవితంలో/ఓ పెద్ద కుదుపు/అది మొదటిది కాదు/చివరిది కాదు/మిగిలిన జీవితానికో/పెద్ద మూల మలుపు/అంటున్నారు. ఆనంద్ మూత్రపిండాలు పాడయిపోయి హాస్పిటల్ లో చేరడం అతని జీవితానికి అది కోలుకోలేని ఓ పెద్ద దెబ్బ.అతని బతుకులో పెద్ద మూల మలుపు అని పేర్కొన్న భావాలు అద్భుతంగా ఉన్నాయి. మాట్లాడటమే కవితలో అన్ని అనివార్యతలకి/అన్ని నిర్బంధాలకి/అన్ని మౌనాలకి ఒకే సమాధానం/ నిశ్శబ్దాన్ని ఛేదించుకు మాట్లాడ్డమే/గుండెను గొంతులోకి తెచ్చుకొని విచ్చుకోవడమే/ అంటున్నారు.మాట్లాడ లేనప్పుడు మౌనంగా ఉంటాం.మాట్లాడటం అవసరమైనప్పుడు మాట్లాడటమే అని చెప్పిన తీరు బాగుంది. మొదలయింది.. కవితలో ఏదైనా మొదలు పెట్టడమే కష్టం/మనసుని కూడ దీసుకోవాలి/ఆలోచనల్ని సరి చేసుకోవాలి/అందమైన పువ్వుల్ని కూర్చాలి/కలల్ని చల్లాలి కన్నీళ్ళని చల్లాలి/మొదలైంది ఏదీ ముగియకుండా వుండదు/అది బతుకయినా.. కవితయినా!/అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తనలో కలిగిన స్పందనలకు రూపం ఇది.ఏదైనా పని మొదలు పెట్టడం కష్టం.పని మొదలు పెట్టడానికి మన మనసు సిద్ధం కావాలి.మన మనసును సమాధాన పరుచుకుని పనిలోకి నిమగ్నం అవ్వాలి.పని చేయడం మొదలు పెట్టిన తర్వాత ఏ పని అయినా పూర్తి అవుతుంది.మనం బతుకడం కొరకు పని చేస్తాం.కవి రాసిన కవిత అయినా రాయడం మొదలు పెడితేనే పూర్తి అవుతుంది.మనిషి బతుకుకు,కవితకు పోల్చి చెప్పిన భావం అద్భుతంగా ఉంది.భావ లయ కవితలో సూర్య చంద్రుల సాక్షిగా/కాలం గడుస్తూనే వుంటుంది/ జీవితంలో/అనుభవం మాత్రం మిగులుతుంది/ చీకటి,శూన్యము/అమితంగా భయపెడతాయి/కానీ వాటిలోంచే/వెల్తూరు సృష్టీ మొదలవుతాయి/ అంటున్నారు.ఎంత మాట్లాడినా మిగిలేదేముంది? అని ప్రశ్నిస్తున్నారు.మాట్లాడే విషయం మన
గురించి మరియు అసంఖ్యాక జనం గురించి అయినా అయి ఉండాలి.లేకుంటే మనం మాట్లాడే మాటల్లో పనికిరాని ఉబుసుపోక కబుర్లతో ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ వ్యక్తం చేసిన భావం ఆలోచింపజేస్తుంది.దుఃఖం కేంద్రీకృతమయింది కవితలో కదలడానికి చేతులూ/నడవడానికి కాళ్లూ/ఏడిచేందుకు కళ్ళూ.. అన్నీ/ఇసుక పొరల కింద కమ్మేసినట్టు/ఇనుప చెరల కింద బందీ అయినట్టు/మనసంతా ఆవరించిన దుఃఖం/ ఆలోచనల్నీ నియంత్రిస్తోంది/ అంటున్నారు.బంగాళాఖాతంలో తుఫాను కేంద్రీకృతమైంది.అందుకే భారీ వర్షాలు పడుతున్నాయి అంటాం.ఆనంద్ మనసు పొరల అడుగున అవధులు లేని దుఃఖం కేంద్రీకృతమైంది. బతుకు మళ్లీ కొత్త దోవలోకి మళ్ళింది.ఆనంద్ దుఃఖాన్ని అధిగమించాడు అనే భావం బాగుంది. నేను కవితలో నాకు నటించడం చేతకాదు/కష్టాలూ కన్నీళ్లూ తెలుసు/ప్రేమించడం స్నేహించడమూ తెలుసు/అందుకే/నేను మరెవ్వరిలానూ ఉండలేను/ అంటున్నారు.నేను కవితలో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్టు పలికించడం అద్భుతంగా ఉంది.శేషం కవితలో దుఃఖాన్ని ఆనందంచే/భాగించేసా/శేషంగా మిగిలింది/నేనూ నా కవిత్వం/అంటున్నారు.ఒంటరితనం – ఏకాంతం కవితలో ఒంటరితనం ఓ సంఘర్షణ/ఒంటరితనం ఓ అనివార్యత/ఏకాంతం ఓ తపస్సు/ అనిర్వచనీయమైన/అవిభాజ్యమైన మానసిక స్థితి/ఒంటరితనంలోంచి పరిణామం చెందిన/ ఏకాంతం/అంతం లేనిది/అనంతమయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొంటాడన్న అద్భుతమైన భావాలు అలరింపజేస్తున్నాయి. వోటమి గెలుపు కవితలో కను చూపు మేరలో/ఓటమి అంచు కనిపిస్తూ వుంటే/నిలదొక్కుకోవడం ఎంత కష్టం/కళ్ళు బైర్లు కమ్ముతాయి/గుండెలు జారిపోతాయి/మొత్తంగా ఊపిరి/లయ తప్పుతుంది/వెనక్కి నడవలేం/పక్కకి కదలలేం/వున్న చోటా వుండలేం/అంటున్నారు. ఓడిపోతున్నామని మనకు తెలిసినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది?అప్పుడు మనిషి ధైర్యంతో తనను తాను నిభాయించుకొని ముందుకు సాగాలి.జీవితంలో గెలుపు ఓటమి ఓ భాగం.నిటారుగా నిలబడి ఓటమిని జయించడానికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. మౌనం కవితలో నా మౌనం ఒక మౌనం కాదు/నా మౌనం వెనకాల దృశ్యాల పరంపర/నా మౌనం ఒక ఆంధీ/ఆంధీ గలీలు దాటుకుంటూ/జిందగీని/తవ్వుకుంటూ/చౌరంఘి లేన్ లో స్థిరపడింది/మౌనమే గొప్పది కదా/మౌనమే గొప్ప సంభాషణ కదా/అంటున్నారు.ఒక్కోసారి మనిషి మౌనంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు తటస్థ పడతాయి.మౌనంలో కూడా గొప్ప భావాలు దాగి ఉంటాయి.మౌనాన్ని కవితామయం చేయడం బాగుంది.ప్రకృతి మనుషులు కవితలో నిజంగానే ప్రకృతిలో/నవ యవ్వనం ప్రతిఫలిస్తుంది/వేల ఏళ్లుగా ఇంతే/ప్రకృతికేమో వయసు తెలీదు/ఈ మనసులకే/ యవ్వనమూ ముసలితనమూ/ అంటున్నారు.ప్రకృతితో మనుషులను పోల్చిన తీరు అద్భుతం.సత్యం కవితలో ఏదో ఒకటి/దేనికోసమో ఒక దాని కోసం/నిరంతరం వెతుకుతూనే వుంటాం/ అనవరతం తిరుగుతూనే వుంటాం/అది సత్యం కావచ్చు/సౌందర్యం కావచ్చు/అన్వేషణ కొనసాగుతూనే వుంటుంది/జీవితం నిరంతరం చలనంలో వుంటుంది/చలనం వైరుధ్య భరితం అవుతుంది/వైరుధ్యంలోంచి సంఘర్షణ/ సంఘర్షణలోంచి సత్యం బయటపడుతుంది/ అంటున్నారు.సత్యం అనగా నిజాయితీ,త్యాగం వలె ఆచరించదగినది.సత్యం మనం పాటించవలసినట్టిది.సత్యం కోసం పాటు పడిన సత్య హరిశ్చంద్రుడు మనకు గుర్తుకు వస్తాడు. ఎందుకైనా మంచిది కవితలో ఎందుకైనా మంచిది/హృదయం తెరిచే వుంచాలి/మనసు గల ఏ మనిషో/తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు/ప్రేమ సంతకం చేసి పోవచ్చు/అంటున్నారు.ఎందుకైనా మంచిది అంటూ హృదయాన్ని తెరిచి ఉంచు అంటూ మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు.వెల్తురు ముక్కలు కవితలో ఆ వెల్తురు ముక్కల్ని/చేతిలోకి తీసుకున్నా/ఒళ్లంతా వెల్తురు ప్రవహించింది/గది సంగతేమో కాని/నా లోపలి చీకటి అంతా పటాపంచలయింది/ అంటున్నారు.మనిషి జీవితంలో వెలుతురు కోసమే ఆరాటపడతాడు.వెలుతురుతోనే మనిషిలో చైతన్యం పొంగి పొరలుతుంది.వెలుతురు తోనే మనిషి ఏదైనా సాధించ గలుగుతాడు.కవి ఆనంద్ తాను వెలుతురులోకి వచ్చినట్లుగా చెప్పిన తీరు బాగుంది.బతికి పోదు కవితలో ప్రేమను పంచ గల/మనిషి ఎవరయినా కనిపిస్తే/అక్షరాలు వాక్యాలయి సంభాషణై/నిశ్శబ్దం పటాపంచలై పోను/నే బతికి పోదు/అంటున్నారు.ప్రేమ అనేది అత్యంత ఉత్కృష్టమైన సద్గుణం లేదా మంచి అలవాటు.లోతైన వ్యక్తుల మధ్య అనురాగం నుండి సరళమైన ఆనందం వరకు బలమైన భావోద్వేగ మరియు మానసిక స్థితిని కలిగి ఉంటుంది. సర్వసాధారణంగా ప్రేమ,బలమైన ఆకర్షణ మరియు భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది.ప్రేమను పంచగల మనిషి కావాలి అప్పుడే సృజన ఆవిష్కృతమవుతుంది అని చెప్పిన తీరు బాగుంది. ప్రాణ వాయువు కవితలో నిద్రా మెలకువా/ రెంటిలోనూ కలలే/కలలు నిండా/ఆశలూ ప్రేమలే/ అవి మనకు ప్రాణవాయువులే/అంటున్నారు. మనిషికి నిద్రలోను కలలు వస్తాయి.మనిషికి మెలకువగా ఉన్నప్పుడు కలలు వస్తాయి.కలలు మనిషి జీవితానికి ప్రాణ వాయువులు.కలలలోనే మనిషి బతుకుతాడు.కలలు,ఆశలు,ప్రేమలు,మనిషి జీవితంలో పెనవేసుకుని ఉంటాయి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఎప్పటికప్పుడు కవితలో ఎప్పటికప్పుడు/దరి కోసమో దారి కోసమో/ ఊపిరి కోసమన్నంత ఆర్తిగా/వెతుకుతూనే వున్నా/చీకటి తుఫానులో/చిక్కుకున్న ప్రాణానికి/రాత్రి లేదు పగలు లేదు/నిద్ర లేదు మెలకువా లేదు/అంటున్నారు.ఎప్పటికప్పుడు అంటూ మనిషి బతుకుకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగుంది.కవలలు కవితలో దుఃఖం నాలో వున్నదో/నేను దుఃఖంలో వున్నానో/నాకు తెల్వదు/ నా కవిత్వం లాగే/భూమికీ ఆకాశానికీ మధ్య/నాకు నా అంతరంగానికి మధ్య/దుఃఖం అంటిపెట్టుకునే వుంటుంది/రోడ్డుమీదో కాగితం మీదో/నడుస్తూ ఉంటానా/ఒకడుగు నేల మీద/మరోటి ఆలోచనల్లో/అంటి పెట్టుకునే వుంటుంది/నాకు తెల్సు/దుఃఖమూ కవిత్వమూ కవలలని/ అంటున్నారు.దుఃఖము కవిత్వము రెండు కవలల వలె అంటిపెట్టుకొని ఉంటాయి అని చెప్పిన తీరు బాగుంది.కలలు కవితలో కళ్ళు మూసుకుంటానా/ కనురెప్పల తెరపై నీ/రూపం సాక్షాత్కరిస్తుంది/ చుట్టూ వేగంగా వీస్తున్న గాలిలో/నీ పాదాల సవ్వడి వినిపిస్తుంది/అంటున్నారు.నిద్రకు చెందిన స్థితిలో కొన్నిసార్లు అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని కలలు అంటారు.మనిషి కలలు కంటాడు.కలలో ఆమె రూపం కనబడుతుంది.ఆమె పాదాల సవ్వడి వినిపిస్తుంది.కలల గురించి
కవిత రూపంలో వ్యక్తం చేయడం బాగుంది.లంగరు కవితలో నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు/సగం శబ్దం సగం నిశ్శబ్దం/ శబ్దమేమో బతుకు ఏడుపులోంచి/ఎగిసిపడుతున్న ఎక్కిళ్ళు/ నిశ్శబ్దమేమో బతుకు చేతగాని తనంలోంచి/ వ్యక్తమవుతున్న మౌనం/నిజానికి నాకు కవిత్వం/ కేవలం కవిత్వం మాత్రమే కాదు/సంక్షోభ కాల ప్రవాహంలో/నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప/బతుకు సమరంలో/నిలబెట్టే లంగరు/అంటున్నారు.కవి ఆనంద్ జీవితంలో కవిత్వం ఎంతగా పెనవేసుకుపోయిందో తెలియజేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.నిశ్శబ్దం కవితలో నీకూ నాకూ మధ్య/నిటారుగా నిశ్శబ్దం/ మాటలుంటాయి/మమతలు కరువు/నీకు నాకు మధ్య/ట్రాన్స్పరెంట్ నిశ్శబ్దం/అంటున్నారు.మన నుంచి మనసుకు చేరిన మంచును ఎలా కరిగించాలి?కలల్ని బతుకుల్ని పండించుకునేదెట్లా అని చెప్పిన తీరు బాగుంది.పెద్ద తేడా లేదు కవితలో చుట్టూ ఉన్న చెట్లన్నీ గాలికి/ఊగి నాదాలు పలుకుతుంటే/మౌన నినాదమై నిలుచున్నాడతను/ ప్రశాంత సరస్సుపై కురుస్తున్న/చినుకుల సవ్వడి/ నేలరాల్తున్న ఆకుల గలగల/శబ్దం అంటని మౌనముని అతను/అతనికి నాకూ/పెద్ద తేడా లేదు/అంటున్నారు.అతనికి మౌనమునికి ఎలాంటి తేడా కనిపించడం లేదు అని చెప్పిన భావాలు విస్మయం కలిగిస్తాయి.జీవితం విసిరిన సవాలు అతనిని మునిగా మార్చింది.చిరు ప్రేమలు కవితలో నా మల్లెపూల బాల్యాన్ని/వదిలి వచ్చింది ఇక్కడే/ తెలియని తనాన్ని తెలిసినతనంగా/భ్రమ పడిందీ ఇక్కడే/ఇష్టమయిన వారి కోసం వెతుక్కుంటూ/ చౌరస్తాలో నిలబడిందిక్కడే/కాలం విసిరిన/వెలుగు కిరణాల దారులెంట/పడుతూ లేస్తూ నడుస్తూనే వున్నా/నడక నా గమ్యం కాదు/నా జీవనశైలి/ అంటున్నారు.చిరు ప్రేమలు కవిత బాల్యం నాటి సంగతులను గుర్తుకు తెస్తున్నాయి.మాట్లాడ కూడదు కవితలో ఒంటరితనంతో దిగాలు పడ్డ/బతుకు కెరటంపై/జంట పక్షుల కిలకిల రావాల్ని కురిపిస్తూ/స్నేహంగానో ధైర్యంతోనో/ఏదైనా మాట్లాడకూడదూ/మాటలు ఉట్టి మాటలే కాదు/ భావాల్ని మోస్తున్న/బాధ్యతా తరంగాలు/మనిషికీ మనిషికీ/మధ్య ధ్వని బంధాలు/అంటున్నారు.కవి ఆనంద్ మాటల గురించి అద్భుతమైన భావాల్ని పండించారు.కర్తవ్యం కవితలో యుద్ధం జరుగుతూనే ఉంది/లోపలా బయటా/గెలుపును చేరుకోలేను/ ఓటమిని అంగీకరించనూ లేను/కొనసాగుతున్న యుద్ధంలో గెలుపు ఓటములు ఎట్లా నిర్ణయిస్తావు/ముగియని యుద్దంలో/విజేత లెవరు పరాజితు లెవరు/పోరు అనివార్యమయిన చోట/యుద్ధమొక్కటే సిద్ధాంతం/కాలు కదపడమే కర్తవ్యం/అంటున్నారు.మనిషి లోపల మనసు లోపల జరుగుతున్న సంఘర్షణను కర్తవ్యం కవితగా మలిచిన తీరు అద్భుతం.రాత్రి కవితలో విరామం కావలసిన రాత్రి/నిద్రా మెలకువా కాని/సందిగ్ధ సందర్భమవుతుంది/అన్ని స్థితుల్నీ పటాపంచలు చేస్తూ/తూర్పున వెలుగు కిరణం/వేకువ ఒకటే/ రాత్రులు ఎన్నో/అంటున్నారు.ఒక్కోసారి విరామం తీసుకోవలసిన రాత్రి కళ్ళ మీద కునుకు లేకుండా చేస్తుంది.మనిషి జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి.కాని వేకువ ఒకటే అంటూ పాఠకులను ఆలోచింపజేస్తున్నాడు.నీడ కవితలో నీడది ఎప్పుడూ/వెల్తురుకు వ్యతిరేక దిశే/వెల్తురు చిమ్మితే విజృంభిస్తుంది/దీపం ఆరితే/ దిగాలుగా అదృశ్యమవుతుంది/పెరుగుతూ తరుగుతూ/నీడ ఒక బహు రూపి/నిలబడ్డానికైనా/అంతరంగ దర్శనానికైనా హృదయపు నీడే/ అంటున్నారు.నీడ మనిషి వెన్నంటే ఉంటుంది.చూడు చూడు నీడలు అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు.నీడను కవితామయం చేయడం బాగుంది.అతను కవితలో మాటల పరిమళాల్ని/వెదజల్లుతూ/అతనొస్తాడు/నా ముఖం వికసిస్తుంది/విలువల పూల గంపని/నా ముందు బోర్లిస్తాడు/గదంతా పరిమళభరితమవుతుంది/ ఆయన నన్ను ఇష్టపడ్డాడో/నేను అతన్ని ప్రేమించానో/సుఖ సమయంలో కాదు కాని/దుఃఖ కాలాల్లో/నాలుగు ధైర్యపు చినుకుల్ని రాల్చాడు/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను చూడడానికి వచ్చేవాడు.అతని సహచర్యంలో కలిగిన అనుభూతులు కవిత ద్వారా వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.తల్లి వేరు కవితలో మనిషన్నంక/గాయపడ్తాం/కత్తులూ కటార్లతోనే కాదు/మాటలతో చేతలతో/మూతి విరుపులతో/గాలికి గాయాలను మాన్పే మర్మం తెలుసు/గాలి విశ్వవ్యాప్తం/మనస్సే మరింతగా/ విస్తరించాలి/తడితోనూ ప్రేమతోనూ/మనిషి తనానికి మనసు లోపల తడి/తల్లి వేరు/అంటున్నారు. మనస్సు విశాలం చేసుకుంటే అపార్థాలకు తావు ఉండదు,గొడవలకు ఆస్కారం ఉండదు.మనిషి మనస్సును అర్థం చేసుకోవాలి అంటూ తల్లి వేరు కవిత ద్వారా గొప్ప భావాలను పలికించారు.ఆమె కవితలో ఆమె/నడిచినంత మేరా/స్నేహ పరిమళాలు/సీతాకోకచిలుకల్లా విహరిస్తాయి/ పూలన్నీ తలవంచి/సలాములు చేస్తాయి/ లోకంలోని ధైర్యమంతా/నాలోకి ప్రవహిస్తుంది/ఆమె/ సాన్నిహిత్యం నిండా/ ప్రేమలు విరబూస్తాయి/ అంటున్నారు.ఆమెతో గడిపిన అనుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి.ఇల్లు కవితలో వాకిలీ పెరడూ/పెద్దర్వాజా/రెండు తలుపులు తీసుకుని వెళ్తే/రెండు లోకాలు/కాపురం ఒక్కటే/ దేహాలు రెండు/బతుకు ఒకటే/భాషలే రెండు/ఒకటి ఆకాశమూ/మరోటి నేల/మాట మాటకు ఉరుము/ ఛత్ ఒక్కటే/మనసులే రెండు/ఎప్పుడూ విడిపోవు/ నిరంతరం సమాంతరం/ అంటున్నారు.ఇల్లుతో మనిషి బతుకును పోల్చిన తీరు అద్భుతంగా ఉంది.పులకరింత కవితలో గాలి అలల్నిండా/ సంగీతమే/శరీరం నిండా పులకరింతే/నా చెవుల్నిండా జీవితమే/ అంటున్నారు.అస్తమిస్తున్న సూర్యుడు, లోకాన్ని తడుముతున్న చిరుగాలి,గాలి అలల నుండి వినిపించే సంగీతం,ప్రకృతిలోని అందాలు చూడగానే శరీరం నిండా పులకరింత,నా చెవుల నిండా జీవితమే అంటూ పరవశించిపోవడం బాగుంది.కిష్టాపురం కవితలో గంగవతల అడవిలో/పొందిచ్చిన ఊరు/కిష్టాపూర్/నిజంగానే కిష్టాపురం/నాకు శ్వాసనిచ్చింది ఆత్మ నిచ్చింది/ సరికొత్త లోకాన్ని దర్శనమిచ్చింది/పట్నం గాలి నుంచి/విశాల ప్రపంచం వైపు/దారులు తీసింది/ అంటున్నారు.కిష్టాపురం గ్రామంలోఆనంద్ పెద్దమ్మ ఉండేది.కిష్టాపురం సందర్శించిన ఆనంద్ కు కలిగిన అనుభూతులు మధుర మనోహరంగా ఉన్నాయి. రూం నెం. 213 కవితలో నేను నిలబడే ఉన్నాను/ హృదయం పగిలిపోయింది/నాకెదురుగా కూర్చుని తలవంచుకుని/మాటల కోసం వెతుక్కుంటున్నావు నువ్వు/ఏదో చెప్పాలని ఎంతో చెప్పాలని/నాకు తెలుసు/నీ కళ్ళ వెనక అశ్రు పర్వతాలున్నాయని/నీ గుండెల నిండా అగ్నిగుండాలున్నాయని/ భవిష్యత్తుంతా శూన్యమయినట్టు/నీ కాళ్లు చేతులు ఆడటం లేదని/నేను నిలబడే ఉన్నాను/నిరర్థకమైన మాటల కంటే/నీ చేయిని నా చేతుల్లోకి తీసుకుని/ భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను/ అంటున్నారు.ఆనంద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు రూమ్ నెంబర్ 213 గదిలోకి తనకు కావలసిన ఆప్తుడు వచ్చినప్పుడు కలిగిన స్పందనగా తోస్తోంది. అతడితో ఆనంద్ ఏమీ మాట్లాడలేదు.ప్రేమగా అతడి చేయిని తన చేతిలోకి తీసుకొని భవిష్యత్తులోకి నడవడం మొదలు పెట్టాను అని చెప్పిన మాటలు బాగున్నాయి.దాఖలా కవితలో కాలానికి/నిరంతర గమనమే/గమ్యాల్ని మనమే నిర్దేశించుకోవాలి/వేగాన్ని మనమే అందుకోవాలి/ కాలానికి పోటీపడి/నడవడం అభ్యసించాలి/ అప్పుడు కదా/కాల పాదముద్రికల్లో/మన గుర్తులు మిగుల్తాయి/పలానా కాలంలో/ జీవించామనడానికి/దాఖలాలు మిగుల్తాయి/ అంటున్నారు.కాలం యొక్క విలువను తెలియజేసిన తీరు అద్భుతంగా ఉంది.నింగికి ఎగిరిన తార కవితలో కలాలకూ గళాలకూ బేడీలు ముసురుకుంటున్న కాలంలో/ఆయన అక్షరాలు కూర్చుకుంటూ/నిర్మలంగా నిల్చున్నాడు/కరీంనగర్ క్లాక్ టవర్ సాక్షి గా/వచ్చే వాళ్ళకూ పోయే వాళ్ళకూ/మిత్రులకూ యోధులకూ/యువకులకూ మేధావులకూ/దిక్సూచిగా నిర్భయంగా నిల్చున్నాడు/అంటున్నారు.జీవగడ్డ విజయ్ కుమార్ స్మృతిలో రాయబడ్డ కవిత ఇది.ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంది.వీడ్కోలు కవితలో మనం కలిసున్న క్షణాల కంటే తల్చుకున్న క్షణాలే అధికం/మన స్నేహానికి/వయసంతరాల్లేవు దూరభారాల్లేవు/ అంటున్నారు.వీడ్కోలు కవిత కూడా నరేందరు స్మృతి కవిత.మనిషి లోపల కవితా సంపుటిలోని కవితలు అన్ని ఆనంద్ హృదయం నుండి ఉబికి వచ్చిన భావాలు.వాటిని చక్కగా చదువుకోవచ్చు. చెరబండ రాజు రాసిన కవితా పంక్తి ఒకటి గుర్తుకు వస్తుంది.అనారోగ్య బాధితుడిని అయినా నేను యోధున్నే అని అన్నాడు.నిజంగా ఆనంద్ కలం యోధుడు.అతనిని మనసారా అభినందిస్తున్నాను. కవి ఆనంద్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను..
పుస్తకం : మనిషి లోపల no man’s land
రచయిత : వారాల ఆనంద్
ప్రచురణ : ప్రోజ్ పోయెట్రీ ఫోరమ్
కరీంనగర్.
పేజీలు : 122
వెల. :₹ 60/-
ప్రతులకు :
వి.ఇందిరా రాణి,
ఇం.నెం. 8 – 4 – 641, హనుమాన్ నగర్,
కరీంనగర్ -505001.
సెల్ నెంబర్: 9440501281.
and
All leading Book sellers.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది. అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు.మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది.స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు, బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు.మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది.ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం. మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు. జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది. తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.
ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని కవి మల్లారెడ్డి తమ తండ్రి లింగారెడ్డికి అంకితం ఇవ్వడం ముదావహం.ఈ పుస్తకానికి వి.లక్మి నారాయణ చారి చక్కటి ముఖచిత్రం అందించారు.కవి మల్లా రెడ్డి ఈ పుస్తకానికి ఒక మాట – కవి బాట అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు.కవిత్వం ఇలా ఉండాలని నిర్వచించను నేను.దానికి హద్దు ఉంటుందని అనుకోను.అది వివిధ కళారూపాలలో ఉంటుందని నమ్ముతాను.కవిత్వానికి పరమార్థం ఉండాలని నమ్మే వాళ్ళలో నేను ఒకన్ని.

ఈ చిన్న పుస్తకములో ప్రచురించిన గేయాలు,కవితలలో ఉన్నది కవిత్వమో,కాదో సహృదయులైన పాఠక మిత్రులు,కవులు,రచయితలు,విమర్శకులే నిర్ణయించాలి.నా గుండె చేస్తున్న లయకి,మనస్సు కంపనాలకి,సమాజములో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలకి నాకు తెలిసిన పదాలలో రూపకల్పన చేశాను.ఇవన్నీ నా అనుభూతి గీతికలు.నా కళ్ళు చూసిన నిజాలు,మనస్సు కనే కలలు.కవిత్వానికి సామాజిక స్పృహ,మానవతా దృక్పథం ఉండాలని, సమస్త మానవజాతి కళ్యాణం కోసం,సుఖ శాంతుల కోసం మానవున్ని కార్యోన్ముఖున్ని చేయాలని ప్రగాఢంగా వాంఛిస్తాను. ఉపనిషత్తులలో మన పూర్వీకులు నుడివినట్లుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతం గమయ అనే నానుడి కవిత్వానికి ఊపిరి కావాలి. మానవుడు అనంతంగా దోపిడీ చేయబడుతూనే ఉన్నాడు.దోపిడీ నశించాలి.మనుషులందరు స్వతంత్రులై ఆర్థిక,రాజకీయ,సాంఘిక,సమానత పొందాలని ఎన్నో కలలతో,ఆశలతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము.కాని జరిగింది ఏమిటి? సమానత్వం వచ్చిందా?రూల్ ఆఫ్ లా దేశములో పాటించబడుతుందా?దేశములో పోలీసులు,కోర్టులు ఆలోచనాసరళి,నడవడి ఏ విధంగా ఉంది?అని తోటి మనుష్యుల్ని ఆలోచింపజేయాలని ఈ కవితా సంపుటిని ప్రచురిస్తున్నాను.ఈ పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిని ఆదరించగలరని సహృదయులైన పాఠక మిత్రులను కోరుకుంటాను.ఇందులో ప్రధానంగా సామ్యవాదం,చైతన్యం గూర్చి చెప్పబడిన గేయాలే అధికంగా యున్నవి. ఇందులో కనిపించే ఇజం మానవ నైజం.మానవత అదే నా అంతరాంతరాలలో అనునిత్యం పారాడే అనుభూతి.ఈ చిన్న కవితా సంపుటిని ఆదరించగలరని కోరుకుంటూ సహృదయులైన పాఠకులను సాహితీ మిత్రులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అని కవి మల్లారెడ్డి అన్నారు. కవి మల్లారెడ్డి రచించిన విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి అంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం ఈ కవిత్వంలో చూడొచ్చు. దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హాలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు.వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్ట పడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్టపడే వాళ్ళు ఎవరు?అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా?లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.పల్లె పొలిమేరల్లోకి కవితలో నా వాళ్లంతా/నాగళ్లకు సిలువ వేయబడి/తరతరాలుగా/నెత్తురుని/నెత్తురు కంటే అమూల్యమైన చెమటని/సమాజం కోసం ధారపోస్తున్నప్పుడు/అంటున్నారు.మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటు పడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం.భారతదేశంలో రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధారపోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో నలభై సంవత్సరాల కింద రాయబడింది.ఇది కవితా సంపుటిలోని మొదటి కవిత.దేశంలో రైతులను నాగళ్ళకి సిలువ వేసినప్పటికీ దుక్కి దున్నడం మాన లేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండిని పెడుతున్నాడు.రైతే రాజు,జై కిసాన్, అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్లుగా ఉంది.వర్తమాన గీతం కవితలో గాలిలా/ సూర్యరశ్మిలా/విశాల విశ్వములో/నీలాల నింగిలా/ నేలా/నీరు/అందరిది/భౌగోళిక హద్దులు లేవు/స్వంత పద్దుల ఆలోచనే లేదు/అప్పుడు మనిషంటె/సమిష్టి మానవ సంఘంలో/ఒక అంగం – అంతర్భాగం/ నేడు/మనిషంటె/కులం/మతం/వర్గం/దేశం/ఖండం అంటూ/విశ్వ మానవాత్మని/ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు/మానవతని సమూలంగా హత్య చేస్తున్నారు/చీ!చీ!/ఏం దుర్గతి పట్టింది మానవ జాతికి/చీదరించుకుంటున్నవి/మిగతా నోరులేని విగత జీవులు/విప్పి చెప్పలేని సత్యాన్ని/విడమరిచి ముచ్చటించుకొంటున్నవి/మరి మనసున్న/ మనకెందుకు రాదు?/ఆ మంచి ఆలోచన/రండి కూర్చుందాము/తీరికగా చర్చిద్దాము/విశ్వ మానవ తత్వాన్ని/మంచి చెడుల/వెలుగునీడల/జాడల్ని వాడల్ని/గుండె మూలల్లో వెదుకుదాము/ అంటున్నారు.విశాల విశ్వంలో పంచ భూతాలు అందరివి.ఆ రోజుల్లో మనుషులందరు సమిష్టిగా కలిసి మెలిసి ఉండే వారు.నేడు మనిషి కుల మతాల పేరిట వర్గ విభేదాలను సృష్టిస్తున్నాడు. అధిపత్యం పేరిట దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి.మానవతను సమూలంగా హత్య చేస్తున్నారు.ఈనాటి మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది?మనుషులు విశ్వ మానవ తత్వాన్ని ఎరిగి మసులుకోవాలి అనే భావన అద్భుతంగా ఉంది. ఎంత హాయి కవితలో ఇప్పుడు రోజు పాడుతున్నాను/అదే పాట/జైల్లొ – రైల్లొ/బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి/అంటున్నారు.తెలంగాణలో ధనవంతులైన ఆసాములకు పోలీసులు దాసులుగా పని చేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి.ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు,జడ్జీల ముందు, ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కత్తి – డాలు కవితలో కాలం ఒక్కటే నాకున్న డాలు/నిజం ఒక్కటే నాకున్న కత్తి/నీకు ఎన్నెన్ని ఆయుధాలు/ అయినప్పటికి/గెలుపు నీకు సందేహమే?/ఎందుకో తెలుసా?/నా డాలు మానవత్వపు లోహపు ముద్ద/ నా కత్తి కమ్యూనిజంలో పదును పెట్టింది/ అంటున్నారు.డాలు పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించే ఆయుధం.వర్తులాకారంగా ఉండి మధ్యలో వుబ్బెత్తుగా ఉండును.వెనుక పక్కన చేతితో పట్టుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు కత్తి వేటును అడ్డు కొనుటకు డాలును అడ్డుగా ఉంచెదరు.కత్తి – డాలు జంట పదాలు.ఈ కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నేనెవరో తెలుసా?కవితలో ఇంతకి నా పేరు చెప్పనేలేదు/గౌతముడు నా రూపమే/జీసస్ నా ప్రతిరూపమే/గాంధీ నా వారసుడే/పేరు మానవత/ ఊరు విశాల విశ్వం/అంటున్నారు.సర్వ మానవాళి సుఖశాంతులు కాంక్షించడం,గౌతముడు,జీసస్, గాంధీ నా వారసుడే అని పేర్కొనడం,పేరు మానవత,ఊరు విశాల విశ్వం అని వ్యక్తపరిచిన భావాలు నిజాయితీని చాటుతున్నాయి.నేనెవరో తెలుసా?అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెప్పిన తీరు చక్కగా ఉంది.నిజం కవితలో ఇవాళ్ల పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ఎందుకో తెలుసా?/నేను అక్కపల్లిలో పుట్టినందుకు/అక్కపల్లిలో ఇరవై సంవత్సరాలు నుండి పెరిగినందుకు/స్వేచ్ఛగా గాడుపు పీల్చి నందుకు/దొరల మాట విననందుకు/అంటున్నారు.అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్ళతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా మలిచారు.దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పుకుంటారు.దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు అవునా?కాదా?అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందువులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపుదిద్దుకున్నాయి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.నడవడి కవితలో అయితె నేమి ఆ కామ్రేడు నడవడి/భావితరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమదూతల ఒరవడిలో/అంటున్నారు.సమాజంలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు కొనసాగుతున్నాయి. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగిపోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు.అత్యాచారాలు,అరాచకాలు,దోపిడీల గురించి ప్రశ్నించినందుకు,పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు.పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు.సమాజం కోసం పాటుపడుతున్న ఆ కామ్రేడు నడవడి,భావితరాలకి రహదారి,పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి?అని అడుగుతాడు.తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఎంత వరకు సబబు,ఏ శిక్షా స్మృతిలో ఉంది. పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మ శోధనలేని బతుకు అది ఏమి బతుకు?పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు,కళాకారులు ప్రజలను సరైన నడవడి కల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చేదు మాత్ర కవితలో ఏదో అన్యాయం జరిగి/వాడిలో ఆవేశం పెరిగి/ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమటని వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/ఆని పోకడేంది?/పటేలు ఎవ్వడు?/ ఆని పటాటోపం ఏంది?/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు?/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి?/కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను/అంటున్నారు.ఈ కవితను వ్రాసిన మల్లారెడ్డి న్యాయవాది,మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచేవాళ్లు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి. దొరలకి,పటేండ్లకి, పెండ్లిండ్లకు మరియు పేరంటాలకి జీవాలు ఇనాంగా ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై, పటేండ్లపై మరియు పోలీసులపై కక్ష ఎందుకు ఉంటుంది?ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి?అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం,దొరలు,పటేండ్ల ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి శిక్ష వేయడం ఎంత వరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కానీ తీరా శిక్ష పడ్డాక జడ్జీలలో కూడా పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర.జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జీలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదుమాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.ఖైది సంకల్పం కవితలో ఖైది కళ్ళలో/తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది/ అంటున్నారు.జైలులో ఉన్న ఖైదీ కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖశాంతులు లభించడం లేదు.ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది. పాలకవర్గాలు చేస్తున్న దోపిడీని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదీలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్ళలో కవి మల్లారెడ్డి ఒకరు. అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైదీ సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 164 Cr.P.C. STATEMENT (స్టేట్ మెంట్) కవితలో కాని/నిరాశ వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/ మర్మ సిద్ధాంతాన్ని/మాయ సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి వున్న/చీమలకు మాత్రం/చస్తే చెప్పలేను/ అంటున్నారు.చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య, నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను,గళాలను చంపుతున్నారు.

అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని,మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను.చీమలను ఉదాహరణగా చెబుతూ 90% ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద,తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షించే వారిలో ఒకరని కవిత చదివితే తెలుస్తుంది.కవి మల్లారెడ్డి ప్రజలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే కవితను అందించారు. ఇదెక్కడి న్యాయం కవితలో పాలకవర్గమా!/చట్టం, నువ్వు/ఇద్దరు నా శత్రువు చుట్టాలే అని చెబుతున్నా/చట్టం చెప్పినట్టు వింటామంటావేమిటి?/ఇదెక్కడి న్యాయం?/ అంటున్నారు.సాధారణంగా అన్యాయమును ప్రశ్నించే సందర్భంలో ఇదెక్కడి న్యాయం అని ఉపయోగిస్తాం.న్యాయం అనేది సమానత్వం, సత్యం,ధర్మం మీద ఆధారపడినది.కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో అన్యాయం చోటు చేసుకుంటుంది.అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా సమాజంలో ఇతరుల పట్ల జరగడం కావచ్చు.
అన్యాయం జరిగినప్పుడు మనలో ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి.కోర్టు వ్యవస్థలో ఆలస్యాలు మరియు న్యాయం ఆలస్యం కావడం వలన బాధితులకు న్యాయం దక్కడం లేదు.సత్వర న్యాయం జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.సమాజంలో ధర్మంపై న్యాయంపై ఆలోచింప జేస్తుంది.చట్టం,పాలకులు,సామాన్య మనిషి మధ్య ఉన్న విరోధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కవి న్యాయ వ్యవస్థ మరియు పాలకులపై ప్రశ్నలు లేపుతున్నాడు.ఇదెక్కడి న్యాయం?అని ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు.అన్యాయానికి గురి చేసిన పరిస్థితిని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలకు న్యాయం అందడం లేదు.సామాన్య ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అనే భావనను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.చట్టాలు తయారుచేసి అమలు చేసే పాలకులను ఉద్దేశించి పాలకవర్గమా?అని ప్రశ్నిస్తున్నాడు.పాలకులు సామాన్యుల అవసరాలను పట్టించుకోవడం లేదు. పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారనే భావం వ్యక్తం అవుతుంది.చట్టం మరియు పాలకులను శత్రువులుగా చూపించారు.చట్టం దుర్వినియోగం చేస్తున్నారు.పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు.ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.ఈ దేశంలో సామాన్యులకు న్యాయం అందుబాటులో లేదు.ఇది ఎలాంటి చట్టం?చట్టం వల్ల సామాన్యులకు మేలు జరగడం లేదు.ప్రజలు చట్టాలను గౌరవించడం తప్పనిసరేనా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు న్యాయస్థానాలు నిరాశను, పాలకుల తీరుపై వేదనను కలిగిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటూ కవి మల్లారెడ్డి న్యాయం గురించి ఆలోచింపజేస్తున్నారు.తేడా కవితలో చెలీ!/అప్పుడు నీవు నవ వసంత యామినివి/నాడు కనిపించినవన్ని/మల్లియలు – గులాబీలు/నేడు కనిపిస్తున్నవన్ని/పల్లేరులు – జిల్లేడులు/ ఎండమావులు – బండ బతుకులు/కన్నీళ్లు కష్టాలు/ పంతాలు సాధింపులు/నేడు వినిపిస్తున్నవన్ని/పిల్లల రోగాల గానం/దైనందిన జీవిత నిశ్శబ్ద భయంకర రావాలతో/నీవు నాడు అంది అందని ప్రేయసివి/ కలల ఊర్వశివి/నేడు అందిన యిల్లాలివి/నిరాశల నీడవి/నిట్టూర్పుల జాడవి/అంటున్నారు.చెలీ నీవు కనిపించినప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంది.నాడు అంది అందని ప్రేయసివి.నేడు అందిన ఇల్లాలివి,నిరాశల నీడవి నిట్టూర్పుల జాడవి అంటూ జీవితాన్ని కాచి వడబోసినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మానవుడే మరో దేవుడై గేయంలో మానవుడే మరో దేవుడై భూతలమ్మున స్వర్గము సృష్టించే/దేవుని మించిన దేవుడై సకల చరాచర జగతిని పాలించే/ కులాల గోడలు కూల్చి – మతాల ముళ్లను కాల్చి/మానవులందరికి మానవతయే గొప్ప మతమని చాటెను/శాంతి అమృతం పంచుతూ లోకమంత స్వర్గము చేయ తలంచే మానవుడు/అంటున్నారు.మానవుడే మరో దేవుడై అనే గేయ వాక్యం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.మానవుడు దేవుడితో సమానమైన వ్యక్తిగా భావించబడుతున్నాడు.భూమి మీద స్వర్గాన్ని సృష్టించగల సత్తా మానవునికి ఉన్నది. మానవుని ఆలోచనలు గొప్పవి.మానవుడు సృష్టికి శాంతిని,సంతోషాన్ని ప్రపంచానికి అందించగలరని చెప్పబడింది.మానవుడు దేవుని కంటే గొప్ప శక్తిపరుడు,సమస్త చరాచర జగతిని పాలించగలవాడిగా చూపబడ్డాడు.కులాల మధ్య ఉన్న గోడలు,మతాల మధ్య ఉన్న విభేదాలు తొలగించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కవి ఆశిస్తున్నాడు.మానవుడు శాంతి,సామరస్యం, సహనం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఈ లోకాన్ని స్వర్గంగా మార్చాలని తలుస్తున్నాడు.ఈ గేయంలో మానవతా విలువల్ని ప్రోత్సహించి సమాజం అంతట శాంతిని వ్యాప్తి చేయాలనే భావన వ్యక్తం అవుతుంది.మానవుడిని మహోన్నతునిగా గేయంలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. మనుష్యులారా! కోయిలలై గేయంలో మనుష్యులారా కోయిలలై/యిలపై వసంత గానం చేయండి/సమ సమాజానికి ఊపిరి పోయండి/ ఓరిమి పంచి కూరిమి పెంచి/మనిషి అంటే మంచి తనమని చాటుతూ/నవ వసంత గానం చేయండి/ అంటున్నారు.మనుష్యులను కోయిలలతో పోలుస్తూ సమాజంలో వసంతాన్ని తీసుకురావాలని వసంతం కొత్త ఆశలకి సంతోషానికి చిహ్నం. మనుష్యులు కోయిలలా మారి ప్రేమతో ఐకమత్యంతో జీవించాలని కోరుతున్నారు. సమాజంలో అందరికీ న్యాయం,సమానత్వం, అందరు స్నేహంతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ సమాజాన్ని మంచి దిశలో నడిపించాలని సూచిస్తున్నారు.మనుష్యుల మధ్య ప్రేమను, ఆత్మీయతను,సౌభ్రాతృత్వం భావనను, మంచితనాన్ని పెంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండి సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని కోరుతున్నారు.మనిషి అంటే మంచితనానికి మారు పేరు.మనిషి నిరంతరం కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి.కొత్త మార్పులకు స్వీకారం చుట్టాలి. మంచితనాన్ని చాటాలి.నవ వసంతాన్ని గానం చేయాలి అంటూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.రెండు తరాలు కవితలో నేను నా చుట్టూరా పల్లె జనమంతా/పట్టుకూడుపు పిల్లలం/పొట్ట పోసుకోని దరిద్రులం/ఓరిమితో ఊరుకోవడం అలవాటె మాకు/ కాని మా పిల్లలు పొట్ట పోసుకోని దరిద్రులు కాదు/ పోరంటే,వెను తిరిగని పొట్టేళ్లు వాళ్ళు/గమ్యం తప్పా గతులు తెలియని సూర్యుళ్లు వాళ్ళు/అంటున్నారు. మొదటి తరం వాళ్లు బానిస బతుకులు బతికారు. రెండవ తరం వాళ్ళు వెను తిరుగకుండా పోరు బాటలో సాగే పొట్టేళ్లు వాళ్ళు.తరాల మధ్య మార్పును వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. ఎవరన్నారు కవితలో ఎవరన్నారు మీరు మంచి వారు కాదని?/అంటున్నారు.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది?ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడిపోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.గది – హృది కవితలో ఆ గది/ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/ బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/అమృత లోకాల కోసం బాణం సంధిస్తా/అంటున్నారు.విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసమానతలకు చరమ గీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లో దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు.కొందరు విద్యార్థులు భారతమాత ముద్దుబిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు.ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం. పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతాం.ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది.ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు.దొరలు పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.ప్రేయసీ! కవితలో నిన్ను చూశాక తెల్సింది నాకు/అజంతా అడుగులేస్తుందని/ఎల్లోరా కదలాడుతుందని/హంపీ స్వరం విప్పుతుందని/మల్లియలు మాట్లాడగలవని/ వాడని గులాబీలు ఉంటాయనీ/అంటున్నారు.కవి తన ప్రేయసిని చూసిన తర్వాత తనలో పొంగిపొరలే భావాలను అనుభూతులను కవితగా మలిచిన తీరు బాగుంది.ప్రేయసి అందాన్ని,మనసుని కవి భారతీయ సాంస్కృతిక సంపదలైన అజంతా, ఎల్లోరా,హంపీల శిల్ప సౌందర్యంతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలు,గులాబీ పూలతో పోల్చడం అద్భుతంగా ఉంది.అజంతా అడుగు లేస్తుందని అంటే అజంతా గుహల నైపుణ్యాన్ని సూచిస్తుంది.ప్రేయసిని అజంతా లాంటి అపూర్వమైన శిల్ప కళారూపంతో పోలుస్తున్నాడు. ఆమె సౌందర్యం అజంతా శిల్ప సౌందర్యంలా అద్భుతంగా ఉంది.ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి.ప్రేయసి నడకను, సొగసును ఎల్లోరా శిల్పాలతో పోలుస్తున్నాడు. హంపీ అపూర్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందినది.
ప్రేయసి మాటలు స్వరం హంపి శిల్పాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నాడు.సువాసనలు వెదజల్లే మల్లెపూవులను ప్రేయసి మాటల మాధుర్యంతో పోలుస్తున్నాడు.ఆమె మాటలు సుగంధాలు వెదజల్లుతాయి అని సూచిస్తున్నాడు. తన ప్రేయసి అందం వాడని గులాబీ వలె ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని అంటున్నాడు.తన ప్రేయసి ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గులాబీ వలె అందంతో మెరుస్తూ ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నాడు.ప్రేయసి అందాన్ని భారతీయ సాంస్కృతిక సంపదలతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలతో,గులాబీలతో పోలుస్తూ తన ప్రేమను సున్నితంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. మల్లారెడ్డి ABOUT MY BETTER HALF అని ఆంగ్లంలో రాసిన కవిత గొప్పగా ఉంది. సర్వాంతర్యామితో మనవి కవితలో ప్రజాకంటకులు/ జాతి ద్రోహులు/స్వార్థం మోసం పెంచుకున్న వాళ్లు/ అధికారాన్ని పంచుకుంటున్న వాళ్ళు/అందలాలు ఎక్కుతున్నారు/ఇదెక్కడి న్యాయం ప్రభూ!/ అంటున్నారు.బాధలో ఉన్నప్పుడు భరించలేక గిలగిలా కొట్టుకుంటాం.మన ఆత్మ తృప్తి కొరకే దేవునికి మొర పెట్టుకుంటాం.దేవుడు మన మొరలు ఆలకిస్తాడా?అనేది ప్రశ్నగానే తోస్తుంది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను,ఇబ్బందులను సర్వాంతర్యామితో కవిత ద్వారా మనవి చేయడం చక్కగా ఉంది.సత్యము స్వప్నము కవితలో కలల సౌధంలో – కళ్యాణమందిరం/అంటున్నారు. విద్యార్థులు కంటున్న కలలో కలలసౌధం ఉంది. అందులో కళ్యాణమందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాటను ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా?ఇప్పుడు లక్షల రూపాయలు కల్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా?అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త, మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వరకట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురి చేస్తున్నారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు.స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది. సుప్రభాతం ఆగుతుందా?కవితలో ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని,కుట్రని/మా కలాలకు – చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం ఆగుతుందా?అంటున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వాళ్ళ హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజా క్షేమం కాంక్షించి పాటల ద్వారా,కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు,కళాకారులు,ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు.ప్రజల కోసం పాటుపడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు,చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా?సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు,దీక్షలు ఏనాడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపథంగా చెబుతున్నాడు.జంపాల ప్రసాద్ కవితలో నేస్తం/క్యాంపస్ విద్యార్థివైన నీవు/ కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/మూఢ సంస్కృతిపై నీవు పురోగమించి/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా/చెట్టుకు కట్టి/బందూకు గురి పెట్టినపుడు/కొండల గుండెలు జాలువారినవి/కన్నీటి జాలువారినవి/చెట్ల కొమ్మలు – ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకి గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది/అంటున్నారు.జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం. ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు. అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు.నీవు పుట్టిన నేల కూడా పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు,విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు,సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి.శిఖరంగా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు, కొమ్మలు,ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో మాట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవము లేని బొగ్గుగా మారింది.ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవితలో ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/ నూతన నవ వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు/అంటున్నారు.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.ఎక్కడిది చైతన్య సమీరం కవితలో ఎక్కడిదీ చైతన్యపు సమీరం?/ఎక్కడిదీ ప్రభంజనం హోరు?/ఎక్కడిదీ ఝం,ఝం తుఫాను/ దీనికి మొదలెక్కడ?తుది యెక్కడ?/ఏ దూర తీరాల నుండి వీస్తుందీ ప్రభంజనం/ఏ దెస నుండి వీస్తుంది/ ఏ కొస నుండి వీస్తుంది/ అంటున్నారు.ఇది ప్రకృతి మరియు జీవితం యొక్క అంతర్లీన శక్తి చైతన్యాన్ని ప్రశ్నిస్తూ రాయబడిన కవిత.కవి తన ప్రశ్నల ద్వారా చైతన్యపు మూలాన్ని దాని ఆరంభాన్ని,అంత్యాన్ని విశ్లేషించడాన్ని తెలుపుతుంది.చైతన్యపు సమీరం అంటే జీవన శక్తి, ప్రాణ శక్తి.ఈ జీవన శక్తికి మూలం ఎక్కడుంది?ఇది ఎక్కడినుండి ఉద్భవించింది? ప్రభంజనం హోరు అంటే గొప్ప గాలుల తుఫాను. ప్రభంజనానికి పుట్టుక ఎక్కడ ఉంది?ఝం ఝం తుఫాను అంటే ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది.జీవితం మరియు ప్రకృతి శక్తుల ఆరంభం,ముగింపు ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభంజనం ఎక్కడి నుండి మొదలైంది?అది ఏ సుదూర ప్రాంతాల నుండి ఉద్భవించింది?జీవన శక్తి ఎటు నుండి వీస్తుంది?దాని ప్రయాణం ఏమిటి? అంటూ కవి వ్యక్తికరించిన భావాలు చక్కగా ఉన్నాయి.శిల్ప సుందరి కవితలో చూడాలి నా దేవి!నీ చూపు వాడి/కనికరించి కడవ దించి కాలు కదిలించి/మెరుపుతీగవై – వెలుగు రేఖవై/పూల బాణమై – విద్యుల్లతవై/కోడె నాగిణివై – రస రాగిణివై/భువన మోహినివై – నవమోహన నాట్యంల తేలించు/లాలించు పాలించు ఓ శిల్ప సుందరీ!/ ఇదిగో!నీ పాదపద్మాల ఉండనీ/నా కవితా మంజరీ/ అంటున్నారు.శిల్ప సుందరిపై వ్యక్తీకరించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.జ్ఞాపకాలు కవితలో నీ జ్ఞాపకాల వాకిట/నీ గుండె లోగిలిలోనే/దోసిట మల్లియలతో/మజ్నునై నిలుస్తాను/అందినట్టే అంది/అందకుండా – అందే అంత దూరములోనే ఉంటూ/మల్లియలా – మౌనంగా నిలచిన/నా జీవన నెచ్చలి – కలల ఊర్వశికి/బతుకంతా నైవేద్యం/ అంటున్నారు.కవి జ్ఞాపకాలను పంచుకొని ఆమెను సజీవం చేసిన తీరు బాగుంది.సాగువాటు కవితలో నా దీన జనావళీ కన్నీళ్లను మాటి మాటికి తుడవ లేక/నేను సామ్యవాద పద్ధతిలో సాగువాటు చేద్దామనుకుంటున్నాను/తిరుగుబాటు చేసి అయినా సరే/భూముల్ని కబ్జా చేసుకుంటాను/ ప్రాణమే ఆయుధంగా బయలుదేరుతున్నాను/ కృత్తిక ఎండలు మండి/కుటిల విషం కక్కినా సరే/ రోహిణి వడలు తడలు/పెడబొబ్బలు పెడుతూ/ కబలించాలని వచ్చినా సరే/తిరుగుబాటు చేస్తాను/ సామ్య వాదం కోసం సాగువాటు చేస్తాను/నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను/మరో స్వర్గం సృష్టిస్తాను/అంటున్నారు.సమాజంలో అన్యాయాలు, అక్రమాలు,అసమానతలు మనసును కలవరపెడుతున్నాయి.దీన జనావళి కన్నీళ్లను తుడవడం అనేది ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించడం.సామ్యవాద పద్ధతి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరి అవకాశాలు తీరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం అవుతుంది.నందన కేదారవనం ఇది ఒక ప్రకృతి అందాల పూతోట.ఇది శాంతి,సౌందర్యం,న్యాయం, సమాజానికి చిహ్నంగా నిలుస్తుంది.సమాజాన్ని నందన కేదార వనం లాంటి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.మరో స్వర్గం సృష్టిస్తాం అంటే ప్రపంచాన్ని మార్చేందుకు అందరి శ్రేయస్సు కలిగించే సమాజం నిర్మించేందుకు దోహదపడతానని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సామాజిక మార్పును సమానత్వం మరియు ప్రజలకు శ్రేయస్సును అందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేరణ కలిగించేది.ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది.నగరంలో కన్నెలు కవితలో కన్నెలు .. కన్నెలు . నగరమంతా వన్నె వన్నెల కన్నెలు/సాయం సమయంలో నగరమంతా/ కన్నెల మేని కాంతితో ఎరుపెక్కుతుంది/ఎరుపెక్కిన సంధ్యలో రాగ రంజిత వేళలో/వెచ్చవెచ్చని చల్లగాలి సైక్లోనొకటి/ఆ గుమ్మల ఆ అమ్మల ఆ బొమ్మల/ఆ కొమ్మల పైట చెంగుల విసరులోయన/ముచ్చటగా ముద్దిడుతుంది/గిలిగింతల కవిత్వాన్ని వ్రాయమంటుంది/అంటున్నారు.నగరంలో కన్నెలను కవితామయం చేయడం అద్భుతంగా ఉంది.ఇది నా దేశం గాథ కవితలో ఇక నా దేశం నాగరికత/ఇక్కడ పార్టీకి క్యాడర్ కాని వాడు లీడరు/ఆశయాలు చంపుకున్నవాడు/ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు/మానవత్వం ఎరువు తెచ్చుకున్నవాడు/ తోకవాల్చడం నేర్చుకున్నవాడు/ బట్రాజుగా మారినవాడు/వందిమాగధిగా ఎదిగిన వాడు/కాకా పట్టేవాడు/బాకాలూదేవాడు/నా దేశ ప్రజా ప్రతినిధి/నా దేశ నాయకుడు/అంటున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న నాయకుల దిగజారుడుతనాన్ని ఎండగట్టుతున్నాడు.నా దేశంలో ప్రజా ప్రతినిధి మరియు దేశ నాయకుడు ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన వాళ్ళు స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరును చూసి కవి తీవ్రమైన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని కవితలన్ని అభ్యుదయ భావాలతో అలరారుతున్నాయి. మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు పొంగిపొరలే భావావేశం అద్భుతమైన కవితలుగా రూపు దాల్చాయి.కవితలను హాయిగా చదువుకోవచ్చు. ఇవి పాఠకుల హృదయాలను రంజింప జేస్తాయి. చక్కటి కవితలు రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.
కవితా సంపుటి పై పుస్తక సమీక్ష
కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల,తెలుగు బాషోపాధ్యాయుడు,కసిరెడ్డి జలంధర్ రెడ్డి కలం నుండి జాలువారిన ఆశ నిండిన శ్వాస కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.కవి జలంధర్ రెడ్డి తొలి కవితా సంపుటి జనవరి 2023 సంవత్సరంలో భవానీ సాహిత్య వేదిక నుండి ప్రచురింపబడింది. ఇందులో ముప్పై అయిదు కవితలతో అలరారుతూ ఉంది.ఈ పుస్తకాన్ని కవి జలంధర్ రెడ్డి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు కసిరెడ్డి రుక్కమ్మ బాల్ రెడ్డి గారలకు అంకితం ఇవ్వడం ముదావహం.వైరాగ్యం ప్రభాకర్ ముందుమాటలో ఆశ నిండిన శ్వాస కవితా సంపుటిలో సమకాలీన అంశాలు,సందేశాత్మక కవితలతో పాటు నిత్య సత్యాలు,మానవుడు అనుసరించదగు మార్గాలు ఉన్నాయి. సామాన్యుడిగా కనిపించే జలంధర్ రెడ్డిలో ఒక అసాధారణ కవి ఉన్నాడని ఈ సంపుటి నిరూపిస్తుంది.వారి కలం నుండి మరిన్ని కవితా సంపుటులను ఆశిస్తునన్నారు.లేదాళ్ళ రాజేశ్వర రావు ముందు మాటలో మానవత్వం నిండిన అచ్చమైన అమాయకత్వం అతడు.ఆ సగటు మనిషి ఆశ నిండిన శ్వాసలే ఈ కవితలు అన్నారు. విశ్వ మానవాళికి కరోనా రూపంలో పెద్ధ విపత్తు వచ్చింది.చైనాలోని ఊహన్ నగరం నుండి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది.కరోనా వైరస్ గాలి ద్వారా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.కరోనా వైరస్ మొదటి వేవ్ లో పెద్దగా ప్రభావం లేకున్నప్పటికీ,సెకండ్ వేవ్ లో లక్షలాది మంది విగత జీవులయ్యారు.

కవి జలంధర్ రెడ్డి ఆ బాధాకర దృశ్యాలను కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోయి వేదనతో ఆశ నిండిన శ్వాస పుస్తకాన్ని అక్షరీకరించారు.కరోనా వైరస్ భయానికి గృహ నిర్బంధంలో ఉండాలి.ఎప్పటికప్పుడు సానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకోవాలి. తుంపర్ల ద్వారా గాలి ద్వారా వ్యాపించే వైరస్ మానవాళికి పెను ముప్పుగా మారింది.ఇప్పటికీ ఆ భయానక దృశ్యాల జాడ వీడ లేదు.ఆ విపత్తు వల్ల సర్వమానవాళి బాధలను ఎదుర్కొన్నారు.కవి కరోనా వైరస్ చూపించిన పెనుభూతాన్ని కళ్ళకు కట్టినట్లు ఆశ నిండిన శ్వాస కవిత ద్వారా తన భావాలను చక్కగా వ్యక్తీకరించారు.మనిషిని ఆవహించిన నిర్వేదం/ఘనీభవించి అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది/అచేతనున్ని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది/కరోనా వైరస్ మనల్ని ఆవహించినప్పుడు కరోనాతో అనుదినం సహజీవనం చేయవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అలాంటి మనిషిని నిర్వేదం అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది.వేదం అంటే ప్రమాణం,ఆచరించదగినది. వేదం కానిది నిర్వేదం అని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే మౌన రోధన,మానసిక క్షోభ,ఒక విధమైన వైరాగ్య స్థితి.కవి కరోనా రక్కసి వల్ల కలిగిన భయానక స్థితిని కళ్ళకు కట్టినట్లు కవితలో చెప్పారు.కరోనా వైరస్ మనిషిని స్పృహ లేని వ్యక్తిని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది.భయంతో ఉన్న వ్యక్తి అభద్రతాభావపు సుడిగుండంలోకి జారిపోతాడు. సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడు.నదుల్లో సరదాకని ఈత కొడుతూ ఉంటారు.ఒక్కోసారి నదిలో ప్రమాదవశాత్తు ఈత నేర్చిన వాళ్లు సైతం సుడిగుండంలో చిక్కి ప్రాణాలు కోల్పోతారు.శవం కూడా లభ్యం కాదు.భయం ఎలాంటిదంటే అభద్రతా భావపు సుడిగుండం లాంటిది అని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఊపిరాడని వేళ/గుప్పెడు ప్రాణ వాయువు కోసం/ఆశతో దేహం తల్లడిల్లుతుంది/కరోనా సోకిన వ్యక్తికి ఊపిరాడదు.ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలుస్తుంది.కరోనా వైరస్ బారినపడి వేలాది మంది హాస్పిటల్లో సరైన ఆక్సిజన్ లభ్యం కాక ప్రాణాలు కోల్పోయారు.ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.ప్రభుత్వాల నిర్లక్ష్యం,చేతగానితనం వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.ఒంటరి గదిలో ముసిరిన చీకట్లు/కరిగి పోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంటాయి/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా చీకటి ముసిరిన గదిలో ఉండాలి.ఆ వ్యక్తికి ఒంటరితనం కరిగిపోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంది అన్నది నిజం అని చెప్పవచ్చు.ఈ చీకట్లో కొత్త వెలుగులు/మోసుకొస్తాయేమోనన్న ఆశ వెంటాడుతుంది/ఈ చీకట్లో ఉన్న వ్యక్తికి కూడా కొత్త వెలుగులు వచ్చి బతకాలనే ఆశ ఉంటుంది.ఆశే మనిషిని బతికిస్తుంది.బతుకులో వెలుగును వెతుకుతాం.ఇవ్వాళ కాకున్న రేపైనా వెలుగు వస్తుందనే ఆశతో మనిషి బతుకుతాడు.ఒంటరి ప్రస్థానపు చేదు నిజాలు/చితాగ్ని కెరటాల్లా/ అనాధృతంగా దహన మౌతున్న దేహాలు/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా ఉండి కోలుకుంటాడంటే కరోనా తీసుకుపోయింది.చేదు నిజాలు అంటే జీర్ణించుకోలేని వాస్తవాలు.అనుకున్నది ఎప్పుడు జరగదు.అనుకోలేనిది జరుగుతుంది.చనిపోయిన వ్యక్తిని మనం చితిని పేర్చి దహనం చేస్తాం.కానీ అనాధృతంగా దహనమౌతున్న దేహాలు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కరోనా వైరస్ దాడిలో ప్రాణహాని కలిగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లి పోయారు.చనిపోయిన లక్షలాదిమంది బాధితుల కుటుంబాలకు ఆ సంఘటనలు సరి కొత్త భాష్యాలు చెపుతాయి అంటున్నారు.జీవితంలో మనం ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం.కొన్ని సంఘటనలు మనను సన్మార్గం వైపు నడిపిస్తాయి.కొన్ని సంఘటనలు మనను చెడు మార్గం వైపు నడిపిస్తాయి.కరోనా దాడి మనందరికీ ఒక గుణపాఠం నేర్పింది అని కవి ఘంటాపథంగా చెపుతున్నారు.కాలజ్ఞానం వ్రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గాలి ద్వారా వ్యాధులు వ్యాపించి లక్షలాదిమంది చనిపోతారని వ్రాశారు. మహానుభావుడైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట నిజం అయింది.అన్ని మరణాలకు ఆర్త నాదాలు ఉండవు/కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా ఇవ్వరు.హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకుపోయి దహనం చేస్తారు. బంధువులు అందరు ఇక్కడ శవాన్ని చూసి విలపించే అవకాశం లేదు.కొన్ని దుఃఖాలు నిశిత నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి/కొన్ని విషాదాలు కారు చీకట్లో కళ్ళు తెరుచుకు చూస్తుంటాయి/ఈ వాక్యాలు ప్రతీకలా ఉన్నాయి.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు/రేపటి ఆశ శ్వాసల కోసం/దాచిపెట్టుకోవాలి/వేదనల నుండి కూడా శక్తి వెలువడుతుందని,అలాంటి శక్తిని రేపటి ఆశా శ్వాసల కోసం దాచిపెట్టుకోవాలి అని కవి ఎంతో అనుభవంతో మనకు చెబుతున్నారు.మనలను ఆశ శ్వాసలపై దృష్టి పెట్టాలని మనలో చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.శ్వాస మీద ధ్యాస పెట్టు అని పతంజలి మహర్షి మరియు మొదలగు యోగి పుంగవులు తెలియజేశారు.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు రేపటి ఆశ శ్వాసల కోసం దాచి పెట్టుకోవాలి అన్నది అద్భుతంగా ఉంది. మాతృమూర్తి కవితలో అమ్మ అంటే ఆత్మ/ మమకారపు మాధుర్యం/నవ మాసాలు మోసి, పురుటి వేదనలో/మరో జన్మ ఎత్తి/తాను మరో జీవికి జన్మనిస్తుంది/మైమరచి తన్మయత్వం పొందుతుంది అని అంటారు.మనం పురాణాల్లో మాతృదేవోభవ అని చదువుకున్నాం.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించే దైవం.అమ్మ మనల్ని కని పెంచుతుంది.అమ్మ లేని జన్మ లేదు.అమ్మ లేని లోకం లేదు.అమ్మంటే ఆత్మ.ఆత్మ అంటే జీవుడు మరియు జీవాత్మ స్వరూపం.అమ్మ స్వరూపంతోనే మనం భూమి మీదికి వస్తాం.ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అమ్మంటే మమకారపు మాధుర్యం అన్నారు. మమకారం అంటే బలమైన అభిమానం.అమ్మ ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.అమ్మ యొక్క మమకారపు మాధుర్యాన్ని మనమంతా ఎరిగి యున్నాం.తల్లి జంతువులు మరియు తల్లి పక్షులు ఎంతో ప్రేమగా మమకారపు మాధుర్యంతో మెదులుతాయో మనమంతా చూసి యున్నాం. అమ్మ యొక్క మమకారపు మాధుర్యం వర్ణించడానికి కలం సరిపోదు.స్వార్థం లేని బలమైన ప్రేమతో కూడుకొని ఉంటుంది.అమ్మ నవ మాసాలు కడుపులో మోసి పురిటి నొప్పులను భరించి మరో జన్మ ఎత్తుతుంది మరియు మరో జీవికి జన్మ నిస్తుంది.అమ్మ ఆ పసి పాప లాలనలో తనను తాను మైమరిచి తన్మయత్వం పొందుతుందనే భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.అమ్మకు కలిగిన ఆనందాన్ని మైమరిచిపోయిన తన్మయత్వం కవుల కల్పనలకు కూడా అందదు.మన ఇంటి దేవాలయాల్లో అమ్మ దేవతగా కొలువై ఉంటుంది. మన అమ్మను మనం ప్రేమతో నిత్యం వెలిగించుకుందాం.అమ్మను దేవ దీపంగా వెలిగించుకున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయని మనమందరం ఎరిగినదే.కవి అమ్మలో దైవాన్ని చూస్తున్నాడు.అమ్మలు అందరు దైవ స్వరూపాలే అమ్మపై సాటిలేని ప్రేమను వ్యక్తం చేసిన తీరు అద్భుతం.ఇంకెన్నడు ? కవితలో మనుషుల్లో కుల మత ద్వేషాలు మాసి/వసుధైక కుటుంబముగా విలసిల్లు రోజు/ఐక్యభావమున సహజీవనం గడిపి/ శాంతి సౌఖ్యములను నెలకొల్పు రోజు/ ఎన్నడు..ఇంకెన్నడు/అని అంటున్నారు.మనుషులు కుల మతాల పేరిట ద్వేషంతో మెలుగుతున్నారు. మనుషుల్లో ద్వేష భావం సమసిపోయి విశ్వమంతా ఒకే కుటుంబముగా కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటే శాంతి, సౌఖ్యములు నెలకొంటాయి.శాంతి సౌఖ్యములు ఎన్నడు,ఇంకెన్నడు అని ప్రశ్నించడం చక్కగా ఉంది. చిరంజీవులు కవితలో మాతృభూమి రక్షణలో/మీ వీరత్వం విజయ సంకేతం/ మీ ధీరత్వం ఆత్మ విశ్వాస కేతనం/మీ పట్టుదల,నిబద్ధత మాకు నిత్య స్ఫూర్తి/మీ నిస్వార్థం,నిజాయితీ మాకు నిరంతర దీప్తి/మీరే మా ధైర్యం,స్థైర్యం/మీరే మా బలం, భవిత/శాంతిని స్థాపించే సమరంలో/మీ మరణం చివరి చరణం కారాదు/మీ త్యాగం ఆఖరి వాక్యం కారాదు/చిరంజీవులు మీరు/అని అంటున్నారు.దేశ రక్షణ కొరకు సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండి కృషి చేస్తున్నారు.కవి సైనికులను చిరంజీవులు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఇంటి దీపాలు కవితలో ఇంటర్ ఫలితాల్లో లోపాలు/ఆరిన ఇంటి దీపాలు/అపజయం విజయానికి పునాది/పడరాదు మనాది../ఈ దేశానికి మీరే భవిత/విద్యార్థులారా!/ఎవరికుండదు బాధ/ చెట్లకు లేదా బాధ/శిశిరంలో ఆకులు రాలి మోడులై/ వసంతంలో చిగురిస్తాయి/పుడమికి లేదా వ్యథ/ గ్రీష్మంలో పగులు బారి/తొలకరితో పులకరిస్తుంది/ మరల ప్రయత్నం మానవ లక్షణం/నిరాశ నిస్పృహలతో/జారిపోయిన గుండెలతో/ రాలిపోవద్దు../మేధావుల్లో కూడా కొందరు మొదట పరాజితులే అని అంటున్నారు.ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేక నిరాశ నిస్పృహలతో కొందరు విద్యార్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించడం మంచిది కాదు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మరల ప్రయత్నించి పరీక్షలు రాసి విజయం సాధించాలి అని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.ఋతువిలాపం కవితలో కాలాన్ని నమ్మి/నార్లు పోసిన రైతుతో పాటు/చాలీచాలని తడితో/భరించలేని ఎండల వేడి/తట్టుకోలేని నారుమడుల/విలాపం/దున్నిన దుక్కులు/వర్షించని మేఘాల వంక/బేల దృక్కులు/అని అంటున్నారు. ఋతువిలాపాన్ని అతివృష్టి,అనావృష్టి,కరువు కాటకాలతో రైతులు అనుభవిస్తున్న కష్టాలను వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.సాంత్వన కవితలో మనుగడ ప్రశ్నార్థకమై/మనసుకు సాంత్వనము లేక/నిరాధార బాధాకర జీవనం/ దురాచారంగా మారిన/ప్రాచీనాచారం చివరకు/ చారిత్రక పతనం/హృదయ వేదనగా మిగిలిన/ సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లదు/అని అంటున్నారు.సుప్రీంకోర్టు తలాక్ విధానం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.ముస్లిం స్త్రీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయానికి అడ్డుతెర.సమానత్వ సామాజిక న్యాయానికి విజయం అని కవి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.అంతరంగం కవితలో అందం../వదనంలో ఉండదు/అంతరం ఆవిష్కరిస్తుంది/నలుగురితో నవ్వుతూ మాట్లాడు/ నలుగురిని నవ్వుతూ పలుకరించు/ఆ పలుకరింపుతో/అనురాగ పరిమళం పంచు/ పలుకరింపు చిన్నది అయినా../మనస్ఫూర్తిగా పలుకరిస్తే చాలు../నీకన్నా అందంగా/ ఎవరూ కనిపించరు/ఆనందమే అందం/ఆనందమే../జీవిత మకరందం/మనిషి కన్నా/మనసు గొప్పది/అని అంటున్నారు.మనిషి అంతరంగాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.కాలం శ్రమ కవితలో మానవుల్లో కొందరు/శ్రమను నమ్ముతారు/మరి కొందరు/ కాలాన్ని నమ్ముతారు/లక్ష్యంతో శ్రమించి/విజయం సాధించే వారు కొందరు/మరి కొందరు/కాలానుగుణంగా శ్రమిస్తూ/విజయం సాధిస్తారు/కాలం గమ్యం వైపు అడుగు వేయిస్తే/శ్రమ గెలుపుకి దగ్గర చేస్తుంది/ మనిషి జీవితంలో/కాలం – శ్రమ/జీవన గమన చక్రాలు/ అని అంటున్నారు.మనిషి జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు శ్రమను నమ్ముకుంటేనే విజయం వైపు అడుగులు పడతాయి అని చెప్పిన తీరు బాగుంది.జాగరూకత కవితలో ఓటరన్నా!జర పదిలం/మైకానికి,పైకానికి ఆశ పడకు/మనిషిని చూడు వాని నడవడి చూడు/ చేసిన బాసలు మరచి/ముఖం చాటేసే కపట నాయకుల/కనిపెట్టుకుని వుండని తరుణంలో/ రాజకీయాల్లో జరిగెడి/తప్పులే పునరావృతం/ నిన్నటి నీడలు రేపటి జాడలు/అని అంటున్నారు. ఓట్ల కోసం వచ్చే కపట రాజకీయ నాయకులు చూపించే నక్క వినయాలు నమ్మకూడదు. అమాయకంగా వారిని నమ్మి ఓటు వేయకూడదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకుల పట్ల జాగరూకతతో ఉండాలి.లేకుంటే మోసపోతావు అని తెలియజేసిన హెచ్చరిక ఒక చురకలాగా ఉంది. అపర చాణక్యుడు కవితలో శతవసంతాల సౌమ్యవాది/ఆర్థిక సంస్కరణల సారధి/నిరాడంబర జీవి,పి.వి./తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని,జాతి గౌరవాన్ని/దిగంతాలకు చాటి/రాజనీతికి మెరుగులద్దిన/విప్లవ తపస్వి/అపర చాణక్యుడు/ బహు భాషా కోవిదుడు/మనీషిగా,హిమనగమంతా ఎదిగిన సామాన్యుడు/ అని అంటున్నారు. తెలంగాణకు చెందిన పి.వీ.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించారు.అలాంటి మహనీయుని స్మరించుకోవడం మరియు కవితలో అపర చాణక్యుడు అని పేర్కొన్న తీరు చక్కగా ఉంది. జనమెరిగిన కాళోజి!కవితలో తెలంగాణ వాడుక భాషను/తన భాషగా కాక జన భాషగా/మలచిన మన గొడవ’అతడు/పరభాష వ్యామోహంలో మ్రగ్గే/తెలుగు వాళ్ళని/తల్లి భాషను నేర్చుకొమ్మని/ చురకలంటించగలడు/అని అంటున్నారు.కాళోజి నారాయణరావు స్మృతిలో రాసిన కవిత బాగుంది. తెల్ల కొలనులో నల్ల కలువలు కవితలో ప్లీజ్ ఒదలండి ఊపిరాట్టం లేదు/నిరాయుధ జార్జి ఫ్లాయిడ్ వేదనాభరిత ఆవేదన/పెడ రెక్కలు విరిచి,సంకెళ్ళతో బంధించి/మెడపై మోకాలితో నొక్కి/ఊపిరి తీసిన తెల్ల పోలీస్/మరణ యాతన/ సోషల్ మీడియా సాక్షిగా దారుణ ద్వేషం/అని అంటున్నారు.అమెరికాలో జాతి వివక్షకు బలి అయిన జార్జి ఫ్లాయిడ్ మరణం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.తెల్ల జాతి వాళ్లు నల్లజాతి వాళ్లపై వివక్ష ఇంకా కొనసాగడం తీవ్రమైన బాధను కలిగిస్తుంది. జాతి వివక్ష సమసి పోవాలి.అప్పుడే తెల్లకొలనులో నల్ల కలువలు వికసించేది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.అశ్రునివాళి కవితలో మారుతున్న జీవనశైలిలో/అసహనంతో/మనుషుల్లో పురుడు పోసుకుంటున్న/ఉన్మాద మనస్తత్వం/ విచక్షణను కాలరాస్తున్న ఆవేశం/విధి నిర్వహణలో నున్న అధికారిని/పట్టపగలు/కార్యశాలలో సజీవ దహనం/కౌలు రైతుకూ,భూ యజమానికి/మధ్య వైరం/విజయా రెడ్డిని బలిగొన్న ప్రతీకార జ్వాల/ అభం శుభం ఎరుగని పసి మొగ్గలు/మాతృ ప్రేమకు దూరమైన అభాగ్యులు/అని అంటున్నారు.రెవెన్యూ అధికారి విజయా రెడ్డి తాను పనిచేస్తున్న ఆఫీసులో సజీవ దహనం చేశారు.అట్టి దుర్ఘటన వల్ల విజయా రెడ్డి పిల్లలు తల్లి ప్రేమకు దూరమై పోయిన అభాగ్యులు అని ఆవేదనతో అశ్రునివాళి కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.ఆలోకనం కవితలో నా ఆలోచనలు/అనుభవాలు/అనుభూతులుఅన్నీ/ ఎవరితోనూ పంచుకోలేను/నాలో నేనే నదిలా ప్రవహించుకుంటూ/నిశ్శబ్ద నిశీధిలో స్వప్నిస్తూ/ దోసెడు భావాల్ని/పిడికెడు మనస్సులో సొగసుగా నింపుకుంటాను/ఒక్కొక్కటిగా నిన్నటిని నెమరేచుకుంటూ/వ్యోమ గామినై జగాలన్నీ చరిస్తుంటాను/విశ్వ యవనికపై/ప్రేమనై ఆవిష్కరించబడుతాను/అని అంటున్నారు.

తన మనసులో కలిగిన భావాలను కవి చెప్పిన తీరు బాగుంది.గ్రీష్మ హవనం కవితలో తన విశ్వ రూపంతో/నిప్పుల కొలిమిలా జ్వలిస్తున్న భానుడు/ ఎండలు నిదాఘమై నిప్పులు చెరుగ/జల
ఊటలు తగ్గి,బీటలు వారి/ఎండిపోయిన పంట పొలాలు/హాలికుల మనో వేదన/తిండి లేక,దాహార్తి తీరక/జీవన ప్రస్థానంలో/చావు బతుకుల నడుమ/ కొట్టుమిట్టాడుతున్న మూగజీవుల దైన్యం/దినమొక గండముగ సామాన్యుల కష్టాలు/తీవ్ర వడ గాడ్పుల విసురులు/తట్టుకోలేని రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు/పిట్టల్లా రాలుతున్న దారుణస్థితి/అని అంటున్నారు.ఎండల వల్ల రైతులు సామాన్యులు పశు పక్షులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వాళ్లు అనాథలు కవితలో వాళ్ల మనసులు/రాళ్ల మధ్య అద్దంలా/ముళ్ళ మధ్య పువ్వుల్లా/విచ్చుకుంటాయి /వాళ్ల ప్రేమ సముద్రమయితే/ఆకాశమంత ఆకలి/ పగలంతా తీరని వేదన/రాత్రంతా ఒడువని దుఃఖం/ బతుకంతా కాయ కష్టం/కళ్ళ మీద వాలిన ఆకలిని/కడివెడు నీ(కన్నీ)ళ్లతో నిద్ర పుచ్చుకుంటూ/ సజీవ సమాధుల్లో జీవిస్తుంటారు/వాళ్ల గుడిసెల్లో ఆకలి గిన్నెల భాష తెలుస్తుంది/వాళ్లు అనాథలు/ అని అంటున్నారు.ఒక వ్యక్తికి ఎవరు లేని స్థితి అనాథ.అనాథల గురించి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.ఆనంద రహస్యం కవితలో కొన్ని పుట్టుకతో వొస్తాయి/కొన్ని నేర్చుకుంటాం/కొన్నింటిని నేర్చుకుంటేనే వికాసం/ఎగరడం పక్షులకు/ఈదడం చేపలకు సహజాతాలు/మనం అభ్యసించవలసింది ఆనంద సృజన/అది అంగట్లో దొరికేది కాదు/మనపై మనం చల్లుకునే కర్పూర సుగంధమూ కాదు/ అందుకే ఇపుడు మనిషి/చేయాల్సింది ఆనంద సృజన/ఏ క్షణం నుండి మన మనసు/ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో./ఆ క్షణం నుండి ఆనందం మొదలవుతుంది/అదే అసలు,సిసలు బ్రతుకు రహస్యం/అని అంటున్నారు.మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం. ఆనందం అనేది ప్రియమైన వారితో సమయం గడపడం లేదా ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనడం వంటి సానుకూల జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటుంది.ఆనందం అనేది శ్రేయస్సు మరియు మొత్తం జీవితం సంతృప్తికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.ఆనందం అనగా మనసుకు ఆనందంగా ఉండే స్థితి,అభిరుచి, సంతోషం అని అర్థాలు.పారమార్థికంగా ఎనిమిది ఆనందాలు ఉన్నాయి.బ్రహ్మానందం,విషయానందం, ఆత్మానందం,అద్వైతానందం,నిత్యానందం, యోగానందం,సహజానందం,పరమానందం ఉన్నాయి.ఆత్మలేని శరీరం కవితలో సడి లేని నడి రాత్రి/శిథిల కుటీరం/మదించిన మానవ మృగం/ అసహాయపు ఒంటరి అబలపై/పాశవిక పంజా/వద్దని వారించినా/ఆర్తిగా అర్థించినా/రాతి గుండెలో కనిపించని/ఆర్ద్రత/అక్రమ ఆక్రమణలతో/వలువలు తొలగిస్తూ/తనువును నలిపేస్తుంటే/ప్రతిఘటించ చేవలేక గట్టునపడిన/చేప పిల్లలా తల్లడిల్లిన/ హృదయ విదారకత/సుప్త చేతనలో/నగ్న శీలాన్ని పాశవికంగా/ హరిస్తుంటే/గుండె గొంతుకలో ప్రతిధ్వనించిన/దుఃఖరోదన/దైహికంగా, మానసికంగా/కుంగిపోయిన మౌనమై/సజల నేత్రాలతో విడిచిన దౌర్భాగ్యపు/నిట్టూర్పు ఆమె/ తనను తాను సాంత్వన పరచుకోవడం/ఎలాగో తెలీని అఘ్రాణిత పుష్పం/ఉనికి కోల్పోతున్న దీపశిఖ/జీవన నైరాశ్యంలో విసుగును,విరక్తిని/ నింపుకొని/మృత్యు స్పృహతో/ఆమె ఒక ఆత్మలేని శరీరం/అని అంటూ కవి వ్యక్తీకరించిన భావాలు స్త్రీల పట్ల సానుభూతిని తెలియజేస్తున్నాయి. సమాజంలో స్త్రీలపై దుర్మార్గుల అత్యాచారాలు, ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం జలదృశ్యం కవితలో కాళేశ్వరం జలదృశ్యం/అవుతున్నది ఆవిష్కృతం/అనవరతం జనపదాలు/జల సిరులతో మురిసిపోవగ/ తెలంగాణ వర ప్రదాయిని/ఎత్తిపోతల ప్రాజెక్టు/ కాళేశ్వరం శుభారంభం/అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట పొలాలకు నీళ్లు అందాయి అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.మిత్రుడు కవితలో నవ్వుతూ నవ్విస్తూ/ కాలాన్ని నడిపించే మిత్రుడు కనబడితే/ మహదానందంలో కాసింత సేపు/మనసంతా బాల్యంలోకి జారిపోతుంది/కలతలు కనుమరుగవుతాయి/దిగులు చీకట్లు కరిగి,పున్నమ రేయి/ఆదమరిచి నిదురించినంత హాయి/స్వార్థ మెరుగని స్నేహారామంలో/ఓ పువ్వునై పరిమళించినట్టు/మనసంతా పులకరింపులతో తేలిపోతుంది/మన ప్రతి అడుగులో/వెన్ను తట్టే వారుంటే/జీవితం ఒక పూల చెట్టు/సృష్టిలో స్నేహం కన్నా తీయనిదేమున్నది/ఆత్మీయుని కౌగిలి/ అనుబంధాల లోగిలి/అని అంటున్నారు.ఒక మంచి మిత్రుడు ఉంటే మనిషి జీవితం నందనవనం అవుతుంది అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.అగోచర శత్రువు కవితలో కరోనా సృష్టించిన విలయం/కళ్లారా చూచిన పిమ్మట/ నాకిప్పుడు పరదేశాలకు కాదు/మాతృ గర్భంలోకి పోవాలనిపిస్తోంది/కరోనా ఈ కాలానికి మార్గ నిర్దేశనం చేస్తూ/నా నేత్రాలను తెరిపించింది/నా అపరిశుద్ధ చేతులను,చేతలను/శానిటైజ్ చేసుకొమ్మని/ కనిపించని కరోనా నేర్పిన జాగరూకత/తల్లి ఒడిలో హాయిగా/ తలదాచుకున్నట్టున్న నా ఉనికి/నాకై నేను విధించుకున్న గృహనిర్బంధం/జైలు జీవితంలా ఉంది అని అంటున్నారు.కరోనా పెనుభూతాన్ని చూసిన కవి అగోచర శత్రువు పట్ల జాగరూకత ఉండాలని కవితలో వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి. మధుర భావన కవితలో నా చెలి లేని శీతల రాత్రి/
శయన మందిరమొక మంచు గుహ/నా పాన్పు కఠిన హిమ శకలము/నిద్దుర కన్నుల నిరీక్షించు/ఈ ఏకాంత చీకటి శిథిల రాత్రి/నన్నే జాలిగా వీక్షిస్తూ/కాలమై నా కనుల ముందు కరిగిపోతున్నది/ నాకు కావాల్సినదిప్పుడు/మధు కలశము కాదు/ ఇప్పుడొక/ఉష్ణ స్పర్శ నన్నాశ్రయించిన/ఎంత బాగుండును/నా చెలి నా చెంతనే వున్నంత/వెచ్చని మధుర భావన/నన్నలుముకున్నట్లు/ అంతర్నిహితమైన అలజడి/అని అంటున్నారు. కవితలోని భావాలు ఒక్కసారిగా మనిషి మనస్సు మధుర భావనలు తేలియాడుతున్నట్లుగా ఉంది. ప్రగతి పథంలో కవితలో స్మార్ట్ సిటీ ముసుగులో/ అందమంతా ఒళ్ళో దాచుకొని/నగరం అభివృద్ధి చెందుతూనే వుంది/కార్లల్లో బైకుల్లో/గజిబిజిగా, గందరగోళంగా/పరుగులు తీస్తూనే వుంది/రాచ పుండ్లలాంటి గుంతల రహదారులతో/కంపుగొట్టే కాలనీల హట్టవాహినీలతో/పరుల కష్టార్జితాన్ని/ జుర్రుకొని బతికే పరాన్న జీవులతో/అభివృద్ధి చెందుతూనే ఉంది/అని అంటున్నారు.రాజకీయ నాయకులు,అధికారులు,కాంట్రాక్టర్లు కుమ్ముక్కై స్మార్ట్ సిటీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.పేరుకే స్మార్ట్ సిటీ అని పేరు నిధులు మాయం అవుతున్నాయి.ఈ దుస్థితి మారాలని కవి ఆవేదన చెందుతున్నారు.భూమి పూజ కవితలో బాల రామునికి భవ్య మందిరమట/శ్రీరామ ధామానికి శ్రీకరమట/భక్తి పారవశ్యంలో భరత వర్షమట/రామ నామ స్మరణతో పంచభూతాలు/పరవశించే వేళ/పులకరించిపోతున్న అయోధ్యాపురి/అని అంటున్నారు.కవి అయోధ్యలో జరిగిన భూమి పూజకు స్పందిస్తూ రాసిన కవిత ఇది.రగిలే భావుటాలై కవితలో నేటి రాజకీయం వెర్రి తలలు వేస్తున్నది/నాయకుల గోముఖ వ్యాఘ్ర రూపాలు/బయటపడుతున్నాయి/ధరల ప్రవాహంలో/సామాన్యుని బతుకు/అగమ్య గోచరమౌతున్నది/ సంపన్నుల కొమ్ముకాస్తూ/ కష్టజీవులపై ఉక్కు పాదం మోపుతూ/ రాజకీయాలిప్పుడు భ్రష్టు పట్టి పోయాయి/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయాల్లో విలువలు నశించిపోయాయి అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు రగిలే నిప్పుల భావుటాలై పోరు బాటలో సాగాలి అని స్ఫూర్తిని కలగజేస్తున్నారు.ప్రజా పోరాట యోధుడు కవితలో ఆ పేరు వింటేనే నిజాం నవాబుకు సింహ స్వప్నం/రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి అని అంటున్నారు.గట్టెపెల్లి మురళి ప్రజా పోరాటయోధుడు,తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.అట్లాంటి ఆదర్శమూర్తి ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు.మహానీయుడు గట్టెపల్లి మురళిని స్మరించుకోవడమే మనం వారికి అందించే నివాళి.ఆపాత ఘుమ ఘుమలు కవితలో ఆపాత/ఘుమ ఘుమలు/ వంటింటి పరిమళాలు/అమ్మ పోపు పెడితే/వాడంతా కమ్మని వాసన/గుప్పుమనేది/అమ్మ ఏ కూర వండుతుందో వాసనబట్టి/ఇట్టే గుర్తించే వాళ్ళం/ చిటికెడు లవంగాల పొడి వేసి సాంబారు చేస్తే/ఆ ఘాటుకు జలదోషం తోకముడిచేది/వంటింటితో అనుబంధం/ఓ మధుర స్మృతి/అని అంటున్నారు. కవి అమ్మ చేసిన వంట ఘుమఘుమలను మరిచిపోకుండా గుర్తు చేసుకున్న అనుభూతి చక్కగా ఉంది.అమరుడు అలిశెట్టి కవితలో సాహితీ కొలనులో/ఎర్రెర్రని అక్షర కలువలు పూయించి/అలతి అలతి పదాలతో/అనంత భావాలను పలికించినవాడు/దోపిడీ సమాజంపై/ మెరుపుల వంటి పదజాలంతో/కవిత్వ శర పరంపరలు సంధించి/విప్లవ సాహితీ పతాకమెగరేసినవాడు/మరణం నా చివరి చరణం కాదంటూ/ ఆఖరి క్షణం వరకు తన రచనలతో/ సామాజిక రుగ్మతలపై/ అలుపెరుగక పోరాడిన అభ్యుదయ వాది/సంపాదన కోసం ఆరాటపడక/ పీడితుల పక్షాన/నా కలం కుంచె రెండు వుంటాయని/సగర్వంగా ప్రకటించుకున్న సాహసి/ కవితాకాశంలో/రవి అస్తమించని/అక్షర సామ్రాజ్యం/ అలిశెట్టిది అని అంటున్నారు.అలిశెట్టి స్మృతి కవిత బాగుంది.గెలుపు కవితలో ప్రయత్నంలో ఎన్ని అవమానాలు/ఎన్ని అవరోధాలు ఎదురైతే/విజయం అంత గొప్పగా మలచబడుతుంది/ ఓడిపోతున్నానని/తెలిసిన క్షణంలో కూడా/పోరాడే వాడే నిజమైన ధైర్యశాలి/తీరం చేరాలంటే/ఎన్ని అలల్ని ఎదురీదాలి/వెలుగును వీక్షించాలంటే/ఎన్ని చీకట్లలోకి తలవాల్చాలి/అడుగడుగునా అడ్డుగోడలు/కాంతిలో కూడా కనిపించని చీకటి నీడలు/వాటి లోపల మెత్తని మోసాలు/ వెంటాడుతూనే వుంటాయి/వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే/ప్రతి విజయం వెనక/లోకానికి తెలియని కష్టం వుంటుంది/జీవితాన్ని పోరాడకుండా/గెలిచినోడు వున్నాడా..?/అని ప్రశ్నిస్తున్నాడు గెలుపుకు కావలసిన స్ఫూర్తిని అందిస్తున్నాడు.అడవి కవితలో అమ్మలా అక్కున చేర్చుకుని/మన నుండి విషవాయువులను గ్రహించి/ప్రాణవాయువుని ప్రసాదించే/అడవి..జీవ వైవిధ్యం/సకల జీవులకు తోడు,నీడ/అవనికి సారం అందించే వర్ష ఋతువు/స్వచ్ఛమైన వాయువు, వానలు/మంచి జీవనమునిచ్చే అడవికి/హాని చేయకుండా/పర్యావరణాన్ని పరిరక్షిస్తూ/ప్రకృతిని ఆకుపచ్చగా ఉంచాలి/చెట్టు నుండి గుణాన్ని గ్రహిస్తూ/ఆకుల నుండి మార్పును గమనించాలి/ మానవ జీవితం అన్నిటికి ఆకర్షించబడే/ఒక అయస్కాంతం/దేనిని ఆకర్షించాలో వికర్షించాలో/ తెలుసుకోవడమే విచక్షణ/అడవిని రక్షించుకుంటూ/ మనుగడకు బాటలు వేసుకోవాలి/అలా కానినాడు./మనిషి ఒక్కడే తనకు తానే చివరకు/ అనంతానంత తిరస్కారంగా../మిగిలిపోతాడు/ అని అంటున్నారు.అడవి అంటే వృక్షాలు,మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారం తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం.అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం.అనేకమైన ఆహార పదార్థాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం.జల వనరులకు ఆలవాలం.భూమి ఉపరితలం మీద 9.4% అడవులు ఆక్రమించి ఉన్నాయి.అడవులు జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి.కలప గృహ నిర్మాణంలో,పరిశ్రమలలో ముడి పదార్థంగా వినియోగిస్తారు.మానవులు స్వార్థంతో అడవులు నరికి వేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయి.అడవులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.మనిషి – మానవత్వం కవితలో మన కోసం మనం జీవించడం గొప్ప కాదు/సాటివారి కోసం మన జీవితం/కొంత అంకితం చేయగలిగితే/అంతకు మించిన మానవత్వం/మరేముంటుంది?/ఒక మనిషి కన్నీరు తుడువ/రక్త బంధమో,స్నేహబంధమో/ఉండాల్సిన అవసరం లేదు/పిడికెడు గుండెలో/చిటికెడు మానవత్వముంటే చాలు/అంతులేని కోరికల దాహాన్ని అదుపు చేసి/పరులకు కడు మేలు కలిగేలా/తమ జీవనశైలిని రూపొందించుకొని/ మనిషికి.. మనిషి/మానసిక శాంతిని ఇవ్వగలిగాలి అని అంటున్నారు.మనిషి మానవత్వం అలవర్చుకోవాలి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నువ్వే నా లోకం కవితలో నీ ప్రేమలో తల మునుకలై/తనువంతా పులకించి,రేపవళ్లు/హాయిగా గడిచిపోవాలనిపిస్తుంది/నీ కళ్ళు ఒక్క క్షణమైనా,నా కలల నుంచి/ఎడబాయక ఉండిపోవాలనిపిస్తోంది/ నువ్వు నా దానవనే నమ్మకాన్నే/ఎదలో నింపుకొని/నీ జ్ఞాపకాలను ధ్యానిస్తున్న/నీ తలపై ఓ గడుసు పులకింత/ఒక్క గడియ నువ్వు నాకు ఎడమైతే/ యుగయుగాల ఏకాకి తనమేదో/ నాకు తెలియకుండానే నాలోకి/ఇంకిపోయినట్లుంటది/ నువ్వు లేక ఏకాంతముగా/నక్షత్రాలను వీక్షించలేను/ వెన్నెలను ఆస్వాదించ లేను/అని అంటున్నారు.కవి తనలో కలిగిన ప్రేమ భావనలను చక్కగా వ్యక్తీకరించారు.సంవేదన కవితలో మన ప్రేమ అమరం/అయినా!ఎందుకో నాకీ భయం/నా జీవన నేస్తమా!మదిలో ఏమిటీ కలవరం/పంచిన ఆనందానికి బదులుగా/మళ్లీ ఆ ఆనందం దొరుకదు.. ఎందుకని పంచిన నవ్వులకు మారుగా మళ్లీ ఆ నవ్వులు లభించవు ఎందుకనీ?/వ్యథను పెంచడమే గాని ఒక్క నిమిషం/శాంతి లభించదు ఎందుకనీ?/ నిరీక్షణల కెరటం మీద/ఎంతకాలమని తేలిపోను/ అని అంటున్నారు.వియోగం కవితలో ఏ నయనాలు నీ కోసం/నవయవ్వన సుందర స్వప్నాలు కన్నాయో/ఆ కళ్ళు..నిన్నెడబాసి దిగులుగా విలపిస్తున్నాయి/అని అంటున్నారు.ఆమె కొరకు తాను అనుభవించిన వేదనను వియోగం కవితలో చక్కగా వ్యక్తీకరించారు.
ఆశ నిండిన శ్వాస కవిత్వం
రచన : కసిరెడ్డి జలంధర్ రెడ్డి
ప్రచురణ : భవానీ సాహిత్య వేదిక,సీతారాంపూర్, కరీంనగర్ 505001.
పేజీలు : 78,
వెల:₹ 100/-
ప్రతులకు :
కసిరెడ్డి జలంధర్ రెడ్డి,
ఇంటి నెం. 8 – 3 – 159,
భగత్ నగర్,కరీంనగర్ – 505001.
స్టేట్ : తెలంగాణ,
కవి,చిత్రకారుడు,కళ్యాణం శ్రీనివాస్ కలం నుండి జాలువారిన పిడికిలి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ కవితా సంపుటిని మే 1998 సంవత్సరంలో ప్రచురించారు.కవి శ్రీనివాస్ తాను స్వయంగా చిత్రకారుడు కాబట్టి పుస్తకానికి తానే ముఖ చిత్రాన్ని చేకూర్చుకున్నారు.ఈ కవితా సంపుటిని తనకు కళాశాలలో తెలుగు బోధించిన ఎ. గజేందర్ రెడ్డికి అంకితం ఇచ్చి గురువు ఋణం తీర్చుకున్నాడు.ఈ పిడికిలి శ్రీనివాస్ రచించిన రెండవ కవితా సంపుటి.డాక్టర్ సి.నారాయణ రెడ్డి ముందు మాటలో ఎత్తిన పిడికిలి ప్రతిఘటన చైతన్యానికి చిహ్నం అని. కళ్యాణం శ్రీనివాస్ కవితా సంపుటి పేరు “పిడికిలి’.ముఖ చిత్రంలో ఉన్నది పిడికిలే.పిడికిలి ఎలా రూపొందుతుందో “చర్య” అనే కవితలో శ్రీనివాస్ సునిశితంగా చెప్పాడు.”నమ్మొద్దు” అనే శీర్షికతో రాజకీయులకు సంబంధించిన నిష్టుర సత్యాన్ని చెప్పాడు.శ్రీనివాస్ కవితల్లో ఆవేదన ఉంది.అంతకు మించిన ఆందోళన ఉంది.సామాజిక చిత్రాన్ని ఏ రంగుల పులుముడు లేకుండా నలుపు తెలుపుల్లో గీసి చూపాడు.శ్రీనివాస్ కవితలకు తగ్గ బొమ్మలు తానే చిత్రించాడు.శ్రీనివాస్ కవితల్లోని పదునుకు నా ఆశీరాభినందన అని సి నారాయణ రెడ్డి అన్నారు.ఎ.గజేందర్ రెడ్డి ముందు మాటలో కళ్యాణం శ్రీనివాస్ కొద్ది కాలం క్రితం నా విద్యార్థి. అచిర కాలంలోనే ఆత్మీయుడైనాడు.ఈ కావ్యాన్ని అంకితమిస్తానన్నప్పుడు ఆశ్చర్యం,ఆనందం కలిగాయి.ఊహించని సంఘటన ఇది.విద్యార్థులకు సత్సంబంధాలు విలుప్తమవుతున్న ఈ రోజుల్లో సహృదయుడైన ఒక విద్యార్థి రాసిన కావ్యాన్ని అంకితం గైకొనడం మరిచిపోలేని మనోహర దృశ్యం.సామాజిక దృక్పధం గల కావ్యాన్ని అంత సమర్థవంతంగా రాయగలడని ఈ పిడికిలి నిరూపించింది.అతనికి నా ఆశీస్సులు అని అన్నారు.డాక్టర్ జి.లక్ష్మణ్ రావు ముందు మాటలో శ్రీనివాస్ కవీ,చిత్రకారుడు,ఒక బాపు,ఒక అలిశెట్టి ప్రభాకర్ ల ఒరవడిలో స్వీయ కవితలకు స్వీయ రేఖా చిత్రాలు గీసి అత్యాధునిక వైఖరిలో పిడికిలి బిగించాడు శ్రీనివాస్ అన్నారు.ఆ పై అభినందిస్తూ, ఆశీస్సులు అంద జేశారు.చేతి వేళ్ళను బొటన వేలితో సహా ముడుచుకొని ఉన్న ముష్టిని పిడికిలి అంటారు.సాధారణంగా రాజకీయ రంగంలో నాయకులు పదవుల కోసం పోట్లాడే సమయంలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు,ముష్టి యుద్ధాలు జరుగుతాయి.పిడికిలి అనేది తిరుగుబాటు,ప్రతిఘటన మరియు ఐక్యతకు చిహ్నం.పిడికిలి కవితా సంపుటి యాభై ఒక్క కవితలతో అలరారుతూ ఉంది.పిడికిలి కవితా సంపుటిలో నలుబది ఆరు మినీ కవితలతో పాటు మిగతా ఐదు కవితలు కాస్త పెద్దవిగా ఉన్నాయి. కవితలన్ని భావస్ఫోరకంగా,పాఠకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి.

కవితలను ఆసక్తితో చదివాను.కవితలలోని భావాలు నా మనస్సుకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసాయి. శ్రీనివాస్ నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్సాహం ఉరకలెత్తి పొంగి పొరలే భావాలతో రాసిన ఈ మినీ కవితలు పాఠకుల హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటాయి.ఆల్ఫాక్షరాల్లో అనల్పమైన భావాన్ని పలికించాడు.ఆ కవితలకు తానే చిత్రం గీశాడు.ఈ కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి.కవి శ్రీనివాస్ కవితల్లోని భావాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సాంఘిక దురాచారాలు, సామాజిక సమస్యలు,స్త్రీలపై జరుగుతున్న కుటుంబ హింస,వరకట్న దురాచారాలు,స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు,అణచివేత,దోపిడీ విధానం,అవినీతి,ఆశ్రిత పక్ష పాతం,యంత్రాలు వచ్చిన తర్వాత కులవృత్తులు విధ్వంసం కావడం, కరువు కాటకాలతో పల్లె ప్రజలు ఉపాధి కరువై వలస బాట పట్టడం,ఇవన్నీ చూస్తుంటే హృదయం ఉన్న మనిషికి బాధను కలిగిస్తాయి.పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు.పల్లెలో అతివృష్టి,అనావృష్టి ఏర్పడి కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తున్నది.పల్లె ప్రజలు ఉపాధి అవకాశాలు కరువై పట్టణాలకు వలస బాట పట్టినారు.ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతకే తిండి కరువై సబ్సిడీ బియ్యం కొనుక్కుని తింటున్నాడు.రైతులు మరియు చేనేత కార్మికులు కుటుంబ భారం మోయలేక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి కొనసాగుతున్నది.ఈ దేశంలో సామాన్యుల జీవితాలు కునారిల్లి పోతున్నాయి.పల్లె వాసుల పట్ల సరైన అవగాహనతో సమస్యలకు పరిష్కారాలను కూడా అందించాడు.కవి శ్రీనివాస్ చుట్టూ ఉన్న సమాజాన్ని దగ్గర నుండి చూసి పొందిన స్పందనకు ప్రతిరూపమే పిడికిలి.శ్రీనివాస్ ఉబుసుపోక కోసం మరియు కాలక్షేపం కొరకు ఆషామాషీగా రాసిన కవితలు కావు ఇవి.కవి,చిత్రకారుడిగా సమాజం పట్ల తన బాధ్యతను కవితల ద్వారా చక్కగా నెరవేర్చినాడు.కవి శ్రీనివాస్ పిడికిలి కవితలో ఆకలి/అరుణమైతే/అది కొందరికే ఎరుపు/ అరుపు/ ఉరుమైతే/అది కొందరినే కుదుపు/పిడికిలి/ఓ దుముకైతే/అది అంతటినీ కదుపు/అని అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో ప్రజలు తినడానికి తిండి కరువై పేదరికంలో మగ్గుతున్నారు. పేద వాడి ఆకలి కాంతి అయితే ఆ కాంతి కొందరికే ఎరుపు అని చురుకు అంటిస్తున్నారు.పేదవాడి అరుపు ఉరుములా గర్జిస్తే దోపిడీదారులను కదిలిస్తుంది.పేద వాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడిదారుల దోపిడీ వ్యవస్థ అంతమవుతుంది అని వ్యక్తం చేసిన భావం విప్లవానికి నాంది పలికింది.నగ – పగ కవితలో పొగ/తాగే వాడికి/ సిగరెట్టు ఒక నగ/రక్తాన్ని/శుద్ధి చేసే/గుండె కది పగ /అని చెప్పారు.సిగరెట్టు తాగే వాడు సిగరెట్టును నగలా భావిస్తాడు.సిగరెట్టు తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే గుండెకు పగ అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సిగరెట్టు తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు చేస్తారు.సిగరెట్ తయారు చేస్తున్న కంపనీలను నిషేధించకపోవడం,ప్రభుత్వం యొక్క ద్వంద నీతిని వెల్లడిస్తుంది.సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడి పోతాయి.ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి.ఆకలి కవితలో వికటించేది/ విస్ఫోటించేది/ప్రపంచంలో/ఎప్పుడో ఒక నాడు/విశ్వాన్ని శాసించేది/ఒకే ఒక్కటి/అదే ఆకలి/అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన.ఆహారం లేకపోవడం వల్ల కలిగే బాధ లేదా మరణం.
పేదలు ఆకలి మంటలు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో మలమల మాడి చస్తున్నారు.ఈ దేశంలో పేదల ఆకలి చావులు మనసుని కలత పెడుతున్నాయి.దోపిడి కవితలో ఒక/రక్తపు చుక్క/కోట్ల/చెమట చుక్కల్ని/సృష్టిస్తుంది -/ఒక దోపిడీ చెయ్యి/కోట్ల/రూపాయలుగా/పరివర్తింప చేసుకుంటుంది/అని అంటున్నారు.పేదవాడి రక్తం చిందించి చెమట చుక్కలు కారుస్తాడు.చెమటను దోచి పెట్టుబడుదారు కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. పెట్టుబడిదారుని దోపిడీ స్వభావం గురించి తెలిపిన తీరు చక్కగా ఉంది.పవిత్రులు కవితలో బ్రహ్మ రాసిన రాత వల్ల కర్మచేసి బతుకులు సాగిస్తున్నాం. అందుకే మేము దరిద్రులం,ఈ ధరిత్రి పై మేమే పవిత్రులం.ఎన్నాళ్లు కష్టపడినప్పటికీ ఫలితం లేదు.దోపిడీ చేసిన వారే సుఖాలు అనుభవిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నటన కవితలో అంతా కృత్రిమత్వం/ అనంతమవుతున్న నాటకత్వం/ప్రగతైనా… ప్రతిభైనా…/ కుత్రిమత్వమే/మనిషికీ/సర్వాంగానాం నయనం ప్రధానం/ నేటి బతుక్కి/సర్వానందానికి నటనం ప్రధానం/అంటున్నారు.మనిషి జీవితంలో ఉదయం లేచిన వేళ నుండి రాత్రి పడుకునే వరకు నటన కొనసాగుతుంది.మనిషి జీవితం నటన అయింది అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.తేల్చుకో కవితలో పేద వాడి ఆకలి కేక ధనికుడి అధికారపు కేక పోల్చుకో అంటూ కలుషిత హృదయమెవ్వరిదో కఠిన పాషాణమెవ్వరిదో తేల్చుకో తెల్సుకో అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు.పర్యవసానం కవితలో బుక్కెడు బువ్వ దొరకక/డొక్కలు ఎండుతేనే/ఆకలి నిప్పులు కక్కేది/రెక్కలు ముక్కలైనా/చేతికి రొక్కం రాక పోతేనే//వేళ్లు పిడీకిలిని బిగించేది…/మబ్బు తర్వాతే …/ఉరుము/ఆ తర్వాతే/పిడుగు/ అంటున్నారు.ఏదైనా పని చెయ్యడం ద్వారా చివరకు లభించు ప్రయోజనం పర్యవసానం అంటారు.ఏం జరిగింది?దాని పర్యవసానం ఏమిటి?అని మాట్లాడుతూ ఉంటాం.కాలే కడుపులు ఎందుకు మాట్లాడతాయి?తినడానికి బుక్కెడు బువ్వ దొరకక పోతే డొక్కలు ఎండుతాయి. కడుపులో ఆకలి మంటలు చెలరేగుతాయి.రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించినా చేతికి కూలి డబ్బులు ఇవ్వక పోతేనే కోపంతో శ్రామికుని వేళ్లు పిడికిలి
బిగుసుకుంటుంది.ఆకాశంలో మబ్బు తర్వాతే ఉరుము ఉరుముతుంది.ఉరుము తర్వాతే ఫెళ ఫెళమంటూ పిడుగు విరుచుకుపడుతుంది అనే భావంలో ఉద్యమాలు ఎలా రూపు దాలుస్తాయో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.సూచిక కవితలో మనిషి జీవితంలో కాల చక్రం ప్రభావం ఎంతో ఉంటుంది.కాలాన్ని అనుసరించి సాగితేనే జీవితానికి ఆధారం లభిస్తుంది అని కాలం విలువను తెలియజేసిన తీరు చక్కగా ఉంది.అద్దంలో నువ్వు
కవితలో నిశ్చలత్వంలో/బురద గుంట కూడా/ ప్రతిబింబాన్నిస్తుంది/అనిశ్చలత్వంలో/మంచి నీరైనా/ ప్రతిబింబాన్నివ్వదు/హృదయం శుద్ధయితేనే/ పరిణతి ఉంటుంది/ఆకారమెలా చెప్తుంది/అంతర్గత వికృతాన్ని? అంటూ అద్దంలో నువ్వు కవిత ద్వారా పాఠకులను ప్రశ్నిస్తున్నాడు.ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది.ధీరుడు కవితలో ఈ సృష్టి/ చీకటి రేకులు/కప్పుకున్నంత వరకు/చీకటి పురుగులు/ నిష్క్రమించవు/పేద డొక్క/ఆకలి కేకలు/ వినిపిస్తున్నంత వరకు/విప్లవ వీరుడు/ విశ్రమించడు/అంటున్నారు.ధీరుని యొక్క గొప్ప గుణాలను చక్కగా వ్యక్తికరించారు.కార్మికుడు కవితలో రాయి కొట్టినా/రత్నం పండించినా/కూలి వాడే చేయాలి/కండ కరిగించినా/ఇంకోడి కండ పెంచాల్సినా/కార్మికుడే చేయాలి/ఓట్లు ఒదిగినా/ పదవి తూట్లో ఇమిడినా/శ్రామికుడే కావాలి/ అంటున్నారు.కార్మికుని యొక్క ప్రాధాన్యతను చెప్పిన తీరు బాగుంది.నమ్మొద్దు కవితలో రాయి/ శిల్పమయ్యిందంటే నమ్మొచ్చు/కానీ/రాజకీయుడు/ రంతీ దేవుడయ్యాడంటే నమ్మొద్దు/రాళ్ళు/రాగాలు పలుకొచ్చు/కానీ/రాజకీయుడు/నిజాయితీని మాత్రం కక్క లేడు/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయుడు రంగుల ఊసరవెల్లిలా మారి సమాజాన్ని దోపిడీ చేస్తున్నాడు.రాజకీయుడిని నమ్మొద్దు అనే నిష్ఠుర సత్యాన్ని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.ఆకలి రాజ్యం కవితలో అధికారుల చేతుల్లో/ఆ బతుకులు/అంధకారపు ఛాయల్లో/ఈ మెతుకులు/ఆ బతుకుల చెరవీడదు!/ఈ మెతుకులు దొరికి చావవు!/ అందుకే వాడికెప్పుడూ/ఆయుధమే గుర్తొస్తుంది/ ఆకలి రాజ్యంలో/ వాడినెపుడూ/ తిరుగుబాటు దారునిగానే గుర్తిస్తారు/అంటున్నారు. ఇందులో ఆకలి రాజ్యం ఎలా ఉంటుందో గొప్పగా వ్యక్తీకరించారు.వ్యధ! కవితలో లచ్చిగా…/ రాష్ట్రం లచ్చలు/కేంద్రం కోట్లు/పలు పథకాలకు/విడుదల చేస్తే…/చారెడు సద్వినియోగం/బారెడు దుర్వినియోగం/నీ యవ్వ!/ ఇంకెక్కడ్రా…/మన బతుకులు/మారేది ?/మెతుకుల వ్యధ/ తీరేది?! అంటున్నారు.ప్రజా సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు.రాజకీయ నాయకులు మరియు అవినీతి అధికారులు ప్రభుత్వ పథకాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.సామాన్య ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిధులు అందడం లేదు అని తెలంగాణ మాండలికంలో వ్యధ కవిత రాసి ప్రభుత్వ పథకాల గుట్టు విప్పిన తీరు చక్కగా ఉంది.గుండె గాయాలు కవితలో ఒక/ కన్నీటి పొరను/విశ్లేషించు/వేదనా ప్రపంచమంత/ గోచరిస్తుంది/ఒక/ఆకలి కేకను/ పరీక్షించు/దరిద్రం ఎంత వైశాల్యం/విస్తరించిందో/అర్థమవుతుంది/ఒక సారి/బాధాతప్త హృదయాన్ని తట్టి పరిశీలించు/ గుండె గాయాలెన్నో/ ప్రతిబింబిస్తాయి/ అంటున్నారు. పేదల కన్నీటి పొరను,ఆకలి కేకను,దరిద్రాన్ని, బాధపడుతున్న హృదయాన్ని పరిశీలిస్తే గుండెకు తగిలిన గాయాలు కనబడతాయి అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.చర్య కవితలో భాస్వరానికి/ రాపిడి జరిగితే/ అగ్గిపుల్ల భగ్గుమంటుంది/ గుండెకు/ దెబ్బ తగిలితేనే/ఐదేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి/అంటున్నారు.చర్య అనగా క్రియా పదం.చర్య ద్వారా భాస్పరానికి రాపిడి జరిగి అగ్గిపుల్ల భగ్గున మండుతుంది.చర్య ద్వారా గుండెకు దెబ్బ తగిలి మనిషి ఐదు వేళ్లు పిడికిలిగా బిగుసుకుంటాయి అని చెప్పిన తీరు బాగుంది. పెన్ను – గన్ను కవితలో శక్తి,యుక్తే /కాదు/విలువ గలవి/విధ్వంసం చేయగలవి/సమాజంలో ఉన్నవి/రెండే రెండు/ఒకటి పెన్ను/రెండోది గన్నూ/ మిత్రమా!/మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా!/మలినం కాకుండా/మీరైనా నిలవండి/సమాజ ప్రక్షాళనకు/సన్నద్ధం కండి/ అంటున్నారు. నిజాయితీగా పెన్ను పట్టి వార్తలు రాస్తున్న జర్నలిస్టులను తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు.గన్ను పట్టి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల కొమ్ము కాస్తున్నారు.రక్షక భటులు భక్షక భటులుగా తయారయ్యారు.అంతం వరకు కవితలో ఐదు వేళ్ల ఐక్యత/ఒక పిడికిలని మర్చిపోకు/ఆరంభం అంతం వరకు/విడిపోవన్నది విస్మరించకు/ దరిద్రుడి/ అరచేతిలోనే ‘నీ’అదృష్టం/ఇమిడి ఉందని గుర్తించు/ప్రతి ఆకలి కేకకు/అంతర్మధనాన్ని గమనించు/ నేడో,రేపో…/నీ ఉనికి/ పరిసమాప్తమన్న/వాస్తవాన్ని గ్రహించు/ అంటున్నారు.ఐక్యతతో పేదవాడు పిడికిలి బిగిస్తే పెట్టుబడుదారుడు ఉనికి లేకుండా పోతాడు అన్న వాస్తవం తెలియజేయడం చక్కగా ఉంది.పిశాచం కవితలో ఎన్ని నక్కలు/ఏ పార్టీ రంగు పులుముకుని/ఎన్నికల్లో నిలబడ్డా!/ప్రజని గొర్రెను చేసి/పుర్రెలు ఊపేస్తూనే ఉన్నాయి/ఎన్నికల బొక్కలు/ఎన్నిసార్లు ఎంత కొరికినా/ఏలికలోని అరాచకత్వంలో/ఇసుమంత కూడా మార్పుండదు/ ఓట్ల తూటాలను/ఎంత జాగ్రత్తగా/బ్యాలెట్ పెట్టెలో పేల్చినా!/ప్రసవించిన ప్రతి నాయకుడు/పిశాచ గుణాలతోనే పుడుతున్నాడు/అంటున్నారు.ఇవ్వాళ సమాజంలో రాజకీయ నాయకులు పిశాచాల రూపు దాల్చి ప్రజలను పట్టి పీడిస్తున్నారు అని గొప్ప భావాన్ని కవితలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. అర్ధ నగ్నం కవితలో చీర కట్టుకే/చొంగ కార్చే/చీమలు వేలుండగా/చెరిచే సెక్సు బిట్టుకి/ప్రేక్షకులు/వేన వేలు తగలడరా/వంద రోజుల పండుగను/అర్ధ నగ్నంగా ప్రదర్శించరా!/అంటున్నారు.సినిమాల్లో స్త్రీలను చెరిచే దృశ్యాలను ప్రదర్శించడాన్ని,అర్ధ నగ్నంగా ప్రదర్శించిన సినిమాలు వంద రోజుల పండుగను జరుపుకోవడాన్ని నేటి సినిమాల తీరుతెన్నులను గురించి వ్యంగ్యంగా వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిరుద్యోగం కవితలో లేలేత/పచ్చని విద్యార్థి/ హృదయాల్ని/పుస్తకాల పురుగులు/పత్ర హరితం తినేసి వదిలేస్తే/విద్యాలయాలు/ఉద్యోగాలయాలు/ నిరాకరించి నెట్టేసిన/బజారు బాటసారులే నేటి/ నిరుద్యోగులు/అంటున్నారు.మన దేశంలో నిరుద్యోగం ఎంతగానో పేరుకుపోయింది.చదివిన చదువులకు ఉద్యోగాలు లేక బజారు బాటసారిగా తిరుగుతున్నారు అనే వాస్తవాన్ని నిరుద్యోగం కవిత ద్వారా వ్యక్తం చేయడం చక్కగా ఉంది.పెళ్లి కవితలో ముగ్ధ మోము/ముద్దు మాట/మాకెందుకు/ మంచి మనసు/మెచ్చే నడత/అసలెందుకూ/ఇచ్చే కట్నమెంత?వచ్చే కానుకలెన్ని?కరెక్ట్ గా చెప్పు/ మావోడికి పెళ్లి చేస్తాం/మీ కూతుర్ని/మేం కోడలిగా స్వీకరిస్తాం!/అంటున్నారు.పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చే కోడలు ఎంత కట్నం కానుకలు తీసుకువస్తున్నారు అనే విషయాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు.అమ్మాయి చక్కగా ఉందా?మంచి మనసు,మంచి నడత,మంచి అలవాటు,చక్కగా కుందన బొమ్మలా ఉండాలి అని ఆలోచించడం లేదు.పెళ్లిని ఒక తంతుగా భావిస్తున్నారు.పెళ్లి కవితలోని భావాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సమాజంలో వచ్చిన ఈ మార్పు ఆడపిల్లల తల్లిదండ్రులకు శాపంగా మారింది.విప్లవం కవితలో గుండె గదుల నిండా/బాధా తంత్రులు మోగుతున్నప్పుడు/గొంతు ద్వారాలందు/దగా పడిన పదాలు పచార్లు చేస్తున్నప్పుడు/హృదయ పొరలందు/కన్నీటి తెరలు నిండుకొన్నప్పుడు/ కనుపాప ఎర్ర జీరను పుంజుకుంటుంది/ అణువణువూ తూలుతూ/ఆవేశాన్ని రాజుకుంటుంది/అపుడే/ఒక ఆలోచన విప్లవరూపం దాల్చుతుంది/ఒక ఆశయమై రూపొందుతుంది/ లక్ష్యసిద్ధికి ఉపక్రమిస్తుంది/అంటున్నారు.విప్లవం కవిత విప్లవానికి నిర్వచనంలా ఉంది.మూలం కవితలో మనం కలిపిన/మట్టి పెళ్లే/వాడికి మేడై నిలిచింది/మనం పిసికిన/పిండి ముద్దే/వాడి పొట్టను పెంచింది/మనం ఉతికిన/బట్ట ముక్కే/వాడికి అందాన్ని తెచ్చింది/అంటున్నారు.ధనికుని సుఖ సంతోషాలకు మూలం ఏమిటి?శ్రామికుని శ్రమ మూలాల వల్లనే ధనికుడు సుఖాలు అనుభవిస్తున్నాడు అని కవితలో వివరించిన తీరు అద్భుతంగా ఉంది.సమైక్యం కవితలో సాటి మనిషి కష్టాల్లో ఉండి కన్నీళ్లు కార్చితే చూసే వాళ్ళ కళ్ళకు కూడా కన్నీళ్లు ఉబికి వస్తాయి.కానీ కొందరు మాత్రం సాటి వాడు కష్టాల్లో ఉంటే చూసి మొసలి కన్నీరు కారుస్తారు.ఎలాంటి సాయం అందించక కన్నీరు కార్చే వాళ్లంటే నాకు అసహ్యం అంటున్నారు. కాకులు చూడు తోటి కాకులతో కూడి కమ్మగా కలిసి తింటాయి.పక్షి అయిన కాకులంటేనే నాకు ఇష్టం అని చెప్పిన తీరు అద్భుతం.సాటి వాడికి సహాయం చేసే స్థితిలో ఉండి కూడా మనిషి ఎలాంటి సాయం చేయకుండా మొసలి కన్నీరు కార్చడం వింతగా అనిపిస్తుంది.సాటి మనిషికి సాయం చేసి ఓదార్చాలి.పక్షుల్లో ఉన్న సమైక్యత మనుషుల్లో శూన్యమై మానవత్వం కొరవడడం బాధను కలిగిస్తుంది.అగ్గి పోరు కవితలో సమాజంలో వరకట్నం దురాచారం ఇంకా కొనసాగుతున్నది. వరకట్నం సంతలో వధువు వరుణ్ణి కొనుక్కోవడం జరుగుతున్నది.కోడలు తెచ్చిన కట్నం ఎంత?కొడుకు తూగే బరువెంత?బేరీజులో తేడా వస్తే మనం సృష్టించిన బ్రహ్మ అయినా ఆప లేడు.వరకట్నం కొరకు అత్తమామలు,ఆడపడుచుల వేధింపులు కొనసాగడం నిత్య సత్యం కూడా.రాజుకున్న అగ్గి పోరు ఆగదు.వధువు ప్రాణాలు మంటలకు ఆహుతి అయి గాలిలో కలిసిపోతున్నాయి అనడం చక్కగా ఉంది.అనుమానం కవితలో ఏ వస్తువైనా/దగ్ధం చేయడానికి/ఒక అగ్గిపుల్ల చాలు/ఏ క్షణమైనా/సంసారం విచ్ఛిన్నమవడానికి/ఒక/ అనుమానం చాలు/అది ఒకసారి దహించి వేస్తే/ఇది క్షణక్షణం దహించి వేస్తుంది.అనుమానం కవిత సంసారంలో అనుమానానికి తావివ్వకూడదు అనే సందేశాన్ని అందిస్తుంది.అరాచకం కవితలో క్షీణిస్తున్న/వివాహ వ్యవస్థ/పూజిస్తున్న/వరకట్నపు సిస్టం/అబలనెపుడూ/అవస్థకు గురిచేస్తున్న/ ఆచారాలే/వ్యవస్థను పట్టిపీడిస్తున్న/అరాచకమే ఇది!/అంటున్నారు.వరకట్నం వ్యవస్థను పట్టిపీడిస్తున్న అరాచకం అని వ్యక్తం చేయడం చక్కగా ఉంది.బూజు కవితలో నేటి/మేటి పేపరు ప్రకటన!/ఒక ‘తార’/తెరపై వెలగటానికి/ఒక ప్రేక్షకుడి/ మతిపోగొడితే/చాలట!?/అయితేనే/హీరోయిన్ గా అవకాశమట!/ సినీ పరిశ్రమకు పట్టిన/ బూజును/ భూతద్దంలో ప్రకటించారట!/అంటున్నారు. సినిమాలో హీరోయిన్ అందాలు ప్రదర్శించి ప్రేక్షకుల మతి పోగొట్టి డబ్బులు సంపాదిస్తున్నట్టి సినీ పరిశ్రమకు పట్టిన బూజును వదిలించాలని వ్యంగ్యంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది.’రాత’ కవితలో ఈ పూట గడిస్తే/అంతే చాలు/ఈ ఆకలి తీరితే/ఎంతో మేలు/ఏం రాసావురా/బ్రహ్మ/ఇలా ఎందుకురా/మా కర్మ!/చాటుకు ఉండి ఇలాగే రాస్తే/ నిలదీసేందుకు/సన్నద్ధమవుతారు/నిగ్గు తేల్చుకునేందుకు/సంసిద్ధమవుతారు/జాగ్రత్త!! అంటున్నారు.ఈ కవితలో రాత రాసిన బ్రహ్మనే ప్రశ్నిస్తున్నారు.బ్రహ్మను ప్రశ్నించడం మరియు జాగ్రత్త అని హెచ్చరించడం అద్భుతంగా ఉంది.అవస్థ కవితలో ఇద్దరిదీ/ఒకే అవస్థ/కాలు తీసి కాలు/ వేయలేని పరిస్థితి/కాకుంటే/వాడు/బలిసి/వీడు/ చితికి/అంటున్నారు.ఇది ఎంత అద్భుతమైన పోలిక.మధనం అంచున కవితలో మధనం నుంచే ఆలోచన ఉద్భవిస్తుంది/ఆ ఆలోచన పరిపక్వమే పోరాటమవుతుంది/అంటున్నారు.పరిణామం కవితలో అభాగ్యుల్లో/ఆలోచనా స్రవంతులు సాగుతున్నాయ్/అందని నింగిని సైతం/ అందుకోవడానికి ఎగసిపడుతున్నాయ్/ అంటున్నారు.శంఖారావం కవితలో ఇప్పుడు/ఒక శరీరంలోని అణువులు మాత్రమే/అజ్ఞానం మత్తు వదిలి మేల్కొన్నాయ్/వర్తమానం వంచన పైకి/ విచ్చుకత్తులై లేస్తున్నాయ్/ అంటున్నారు.సూర్యుని బావుటాలు కవితలో పీడితులారా!తాడితులారా!! ఏకంకండి/ఈ తరుణం మళ్ళిక రాదు/గుంపులు, గుంపులు,గుంపులుగా కదలండి/నింగిన సూర్యుడు మనతో కలిసి/ఎర్రబావుటాన్ని ఎగురేశాడు/ అంటున్నారు.ఎవరమ్మా!నువ్వు కవితలో ఎవరమ్మా నువ్వు!/కన్నీటి సముద్రానికి/కేంద్ర స్థానం/నీ గుండె అయినట్లు…/నీ బుగ్గలపై కన్నీటి చారికలేంటమ్మా!/ నీ సహనాన్ని/అవకాశంగా తీసుకుని/చలనం లేకుండా చేయకముందే/నీలో కదలిక రావాలి…/మౌనంగా భరించే/బాధలు… బాధ్యతలూ…/ బాకులా దూకాలి/అంటున్నారు. సమాజంలో స్త్రీల స్థితి ఆకాశంలో సగం అవకాశంలో శూన్యం అన్నట్లుగా ఉంది.కవి శ్రీనివాస్ స్త్రీల పట్ల గల ప్రేమతో ఎవరమ్మా నువ్వు అంటూ ఓదారుస్తున్నారు మరియు వారిలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. సమాజ అభ్యుదయాన్ని కాంక్షించి చక్కటి మినీ కవితలు రాసిన కవి శ్రీనివాస్ ను అభినందిస్తున్నాను.కవి శ్రీనివాస్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

కళ్యాణం శ్రీనివాస్ తేది 02 – 06 – 1971 రోజున కరీంనగర్ జిల్లాలోని ఆర్నకొండ గ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు రాజవ్వ, రాజయ్య. తండ్రి రాజయ్య చేనేత మగ్గంపై చీరలు నేసేవాడు. వీరి తండ్రి రాజయ్య 1994 సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకం వీడిపోయారు.శ్రీనివాస్ కు ఒక అన్నయ్య.పేరు వాసుదేవ్.వీరు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి అన్నయ్య ఆర్నకొండ గ్రామంలో నివాసం ఉంటున్నారు.శ్రీనివాస్ కు ఒక అక్క ఉంది.పేరు భారతి.వీరు చొప్పదండి గ్రామానికి చెందిన వారు. శ్రీనివాస్ 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు ఆర్నకొండ గ్రామంలో చదివారు.వీరు 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చొప్పదండి జడ్.పి.ఎస్.ఎస్.ప్రభుత్వ పాఠశాలలో చదివారు. వీరు ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల,చొప్పదండి గ్రామంలో చదివారు.వీరు ఐ.టీ.ఐ. ఫిట్టర్ కోర్సును ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ,(ఐటిఐ)మంచిర్యాలలో చదివారు.వీరు బి.ఏ. తెలుగు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివారు.వీరు ఎం.ఏ.తెలుగు నాగార్జున యూనివర్సిటీలో చదివారు.వీరు యానిమేషన్ కోర్సును హార్ట్ యానిమేషన్ అకాడమీ,హైదరాబాదులో చదివారు.వీరికి చిన్నప్పటినుండి సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది.వీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి కవితలు రాయడం ప్రారంభించారు.వీరు చిన్నతనం నుండి బొమ్మలు గీయడం, కార్టూన్లు వేయడం చేస్తున్నారు. వీరు ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పని చేసారు. వీరు అందులో పొలిటికల్ కార్టూన్లు వేసేవారు.వీరు ప్రస్తుతం రెండు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. . శ్రీనివాస్ ప్రచురించిన పుస్తకాల వివరాలు:
1) హృదయం గేయ సంపుటి,ఆగస్టు,1996.
2) పిడికిలి కవితా సంపుటి,మే 1998.
వీరు పలు సాహితీ పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు.వీరు తెలంగాణ కార్టూనిస్టుల వెల్ఫేర్ సంఘానికి ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు.వీరు అంతర్జాతీయ స్థాయిలో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ నరసింహారావు పై క్యారికేచర్ పోటీ నిర్వహించడం జరిగింది.అందులో 20 దేశాల కళాకారులు పాల్గొన్నారు.వీరు యానిమేషన్ డైరెక్టర్ గా రాణించారు మరియు పలు అవార్డులు కూడా అందుకున్నారు.వీరు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో ఉంటున్నారు.
