బైకును స్లో చేసి చెట్టు క్రింద ఆపి అటువైపు చూసాడు కార్తీక్. సందేహం లేదు… సమీరే!
రోడ్డు కవతల కోట గుమ్మం లాంటి జైలు తలుపులకు వున్న చిన్న డోర్ లోంచి బయటికి వచ్చి, సెక్యూరిటీ గార్డ్ తో ఏదో మాట్లాడుతోంది.
అతడు నవ్వుతూ ఏదో అంటున్నాడు. అంతలోనే భుజానికి వేసుకున్న బ్యాగ్ సర్దుకుంటూ వచ్చి బైక్ పార్క్ చేసుకున్న స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
హెల్మెట్ పెట్టుకుని వున్న తనను గమనించలేదేమో అనుకున్నాడు కార్తీక్.
ఇది మూడో ఆదివారం సమీరను అలా… జైల్లోంచి బయటకు వస్తూండగా చూడడం. యాదృచ్ఛికమే ఐనా తను జిమ్‌కు వెళ్ళి వచ్చే టైమ్‌లోనే ఆమె జైలులోంచి బయటకు రావడం జరుగుతోంది.
కారణం ఏమిటో అడుగుదామని మొబైల్ మీదకు చెయ్యి పోనిచ్చిన వాడల్లా, ఒక్క, క్షణం ఆగాడు.
‘ఏం చెబుతుంది? అసలు… నిజం చెబుతుందా? తను కలిసింది నేరస్థుడినో, తీవ్రవాదినో, హంతకుడినో అని చెపుతుందా? లేకపోతే డిగ్రీ చదివే రోజుల్లోనే అతన్ని ప్రేమించాననీ, ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్లనే, నీతో పెళ్ళికి ఒప్పుకున్నాననీ చెబితే తను భరించగలడా?
తల్లిదండ్రులకు తను ఒక్కడినే కొడుకుననీ, ఎమ్.టెక్. చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిజేసే తనకు ఉమ్మడి కుటుంబంలో వుండి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలనీ అడిగినప్పుడు సమీర సంతోషంగా ఒప్పుకుందే! తను కూడా ఏదో కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరొచ్చునందే! ఇదేమిటి మరి? వాళ్ళ పేరెంట్స్‌కు తెలుసో… లేదో!
ఆలోచనలతో అసహనంగా మారడు కార్తీక్. వడివడిగా జైలువైపు నడిచాడు. వెళ్ళిన ఐదునిమిషాల్లోనే బయటికి వచ్చాడు.
‘క్షమించు సమీరా! జైలులో డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఖైదీలకు వాలంటరీగా ఇంగ్లీషు టీచ్ చేయడానికి వెళ్తున్న నిన్ను అనుమానించి మగాడిననిపించాను. నీకు అంతా విడమర్చి సారీ చెప్తేగానీ, నా మనస్సు తేరుకోదు!’ అనుకున్నాక అతని హృదయం తేలికైంది.
Rama Devi Nellutla
Rama Devi Nellutla
Rama Devi Nellutla
Poetess, Writer, Cartoonist
Senior Branch Manager ( retd), ANDHRA BANK
+91 94406 22781
ramadevi.nellutla@gmail.com
రచనలు
మనసు భాష ( కవిత్వం )
రమణీయం (కార్టూన్స్ )
మనసు మనసుకూ మధ్య ( కథలు )
ప్రముఖ రచయిత్రి గా, కవయిత్రిగా,పాఠ్యపుస్తకాల రచయిత్రిగా, సంపాదకురాలుగా, అధ్యాపకులు గా బండ సరోజన గారి జీవిత ప్రస్థానం ఎంతో ఆదర్శనీయమైనది. ఎక్కడ ఏ భేష జాలు లేకుండా సాదాసీదాగా ఉంటూ మనుషులను ప్రేమించే స్వభావశీలి. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించినా, ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినా ఆమె కామెనే సాటి. ఇటు రచయిత్రిగా అటు విద్యావేత్తగా వారి జీవిత ప్రయాణం మయూఖ పత్రిక ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాం.
ప్ర : నమస్కారం మేడమ్! లద్నూరు నుండి లండన్ దాకా …. ఎట్లా ఉంది ఈ ప్రయాణం ?!
జ : ప్రయాణం అంటేనే ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు ఉంటయి. జీవితం కూడా అంతే !! నా జీవితం కూడా అందుకు భిన్నం ఏమీ కాదు .
ప్ర : మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ? మీ వాళ్లల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ?
జ : అస్సలు లేరు . అసలు మాది ఒక పక్కా వ్యవసాయ కుటుంబం. జనగామ దగ్గరలోని లద్నూరు మా ఊరు.
ప్ర : అప్పటి రోజుల్లో వ్యవసాయ కుటుంబంలో ఆడపిల్లగా మిమ్మల్ని ఎలా చూసారు ?!
జ : మా నాయనమ్మకు నా మీద శాన ప్రేమ ఉండేది. నన్ను బడికి పంపేవారు . నేను కూడా బాగనే చదువుకునే దాన్ని. అయితే .. నా తొమ్మిదవ ఏటనే నాకు పెండ్లి అయింది.
ప్ర : అవునా ?! బాల్య వివాహమన్న మాట. మరి వాళ్ళు ఎక్కడివాళ్ళు ?!
జ : మేనోళ్లే ! మెదక్ దగ్గర సిద్దన్నపేట వాళ్ళది. మేనత్త కొడుకే !!
ప్ర: వైవాహిక జీవితం మీ విద్యాభ్యాసానికి అడ్డు తగిలిందా? లేక మేనోళ్లే కనుక సహకరించారా?!
జ : అదేగద బాధ! స్త్రీ విద్య అనేదే వాళ్లకు తెలువదు. అందులోనూ ఉన్నత కుటుంబాలలో కూడా ఆడిపిల్లలకు ఏడో, పదో చదువంగనే పెండ్లిళ్లు చేసేటోళ్లు. ఇగ మా లాంటి కుటుంబాలలో చెప్పనే ఒద్దు.
ప్ర: అప్పట్లో చిన్నపిల్లలకు పెళ్లి అయినా కూడా ఒక వయసు వచ్చేదాకా అత్తవారింటికి పంపకపోయేవాళ్లు కదా?! మరి మీ విషయంలో ఎలా జరిగింది?
జ: అయ్యో.. దగ్గరోళ్ళు గనుక తోలుకపోయేటోళ్లు. పదేండ్ల పిల్ల అంటే ఎన్నో పనులకు ఆసరా అన్నట్టే. ఏ మాత్రం జాలి ఉండకపోయేది. పెండ ఎత్తుడు , సానిపి సల్లుడు , పక్కింటి నుండి బిందెల కొద్ది నీళ్లు మోసుడు , దంచుడు , ఇసురుడు, అన్ని పనులు అప్పుడే నేర్చుకోవాలె, చేయాలె కూడ. మా అత్త పని చేయకుంటే ఊరుకోక పోయేది. అట్ల అన్ని పనులు చేసి చేసి కట్టెపుల్ల లెక్క అయిపోయిన.
ప్ర. మరి ఆ చాకిరీ నుంచి విముక్తి కలగలేదా?!
జ. మొదలే చెప్పిన గద…మా నాయనమ్మకు నేనంటే ప్రాణం. ‘ చిన్న పిల్లను గింత చాకిరి కింద చంపుతవా ఏంది ?’ అని తన కూతురితో .. అంటే మా అత్తతో గొడవ పెట్టుకుని మా నాన్నకు బండి పంపమని మతలబు చేసి బండి రాంగనే నన్ను తీసుకుని మా ఊరికి వచ్చేసింది. ‘ పిల్ల ఆగం అయింది. ఇగ అక్కడికి తోలనే వద్దు.’ అన్నది.
ప్ర. మరి అప్పటి రోజుల్లో చాలా మంది సంతానం, ఇంటి నిండా మనుషులు .. ఇదంతా ఉండేది కదా ! పెళ్లి అయ్యాక కూడా ఆడపిల్ల ఇంట్లో ఉంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా ?!
జ : అదేమీ లేదు, మా నాన్న ‘ తీగకు కాయ బరువా?! మన పిల్ల కొన్నాళ్ళు మన దగ్గర్నే ఉంటది.
‘ అన్నాడు . నేను చదువులో చాలా తెలివైనదాన్ని. నన్ను మిడిల్ స్కూల్ వరకు చదివించాలని మా నాన్న కోరిక.
ప్ర . అంటే .. మళ్ళీ చదువు మొదలు పెట్టారా ?!
జ . అవును, అయితే .. నేను తెలివయిన దాన్నే గానీ , బడి దొంగని. అయినా కూడా సెవెంత్ క్లాస్ లో నేనే స్కూల్ ఫస్ట్ వచ్చాను.
ప్ర. మీకు సాహిత్యంపై ఆసక్తి ఏ వయసులో కలిగింది?! మీ ఇంట్లో ఎవరైనా సాహిత్యం అంటే ఇష్టపడేవాళ్లున్నారా ?!
జ . మా నాన్న ఆ రోజుల్లో .. అంటే నిజాం కాలంలోనే అయిదో తరగతి చదివాడు. ఆయన ఒక్కడే కొడుకు గనుక వాళ్ళింట్లో ఏం చేసినా చెల్లేది. నులక మంచంలో పడుకుని ఏవో పుస్తకాలు చదివేవాడు, పాడేవాడు కూడా. మా ఇంట్లో ఒక పెద్ద చెక్క సందుక నిండా ఉర్దూ పుస్తకాలుండేవి .
మా నాన్న అలవాటు నాకూ వచ్చింది. పిల్లల పుస్తకాలు బాగా చదివాను . అలా నాలో పఠనాసక్తి పెరిగింది.
ఎండకు వేగీ వానకు తడిసీ చలికి వణికీ
ఎడతెగని శ్రమ గీతాలమై సాగుతుంటాం
పహారా కాస్తున్నప్పుడు కాళ్ళు నేలలో పాతిన స్తంభాలై
గస్తీ తిరుగుతున్నప్పుడు కళ్ళు సెర్చి లైట్లయి
కవాతు చేస్తున్నప్పుడు క్రమశిక్షణే దేహభాషయి
కఠిన శ్రమకోర్చే కార్మికులం
సమాజం లోని కలుపు మొక్కల్ని ఏరి పారేసే కర్షకులం
దొరల్లో దొంగల్ని గుర్తించే మనస్తత్వ వేత్తలం
చల్లని నీడ పట్టునో చలువ యంత్రాల క్రిందనో
సేద తీరే అవకాశమే లేని వాళ్ళం
విధి నిర్వహణలో విలువైన క్షణాలెన్నో కోల్పోయినా
వీసమెత్తు సానుభూతి పొందని ఉద్యోగాల వాళ్ళం
ఉత్సవాల్ని క్యూ లైన్ల లోనూ
పండుగల్ని పదిమందిని అదమాయించడం లోనూ గడిపే వాళ్ళం
వేనవేల చెమట చుక్కల్ని కార్చి
వందల జనసభల్ని విజయవంతం చేసే వాళ్ళం
కోరుకున్నదో ఎన్నుకున్నదో
విధి లేకనో విధి నిర్ణయమో
వృత్తి ధర్మమో బతుకు తెరువో గానీ
లోలోపలి మనసుని కప్పి పెట్టి
కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళం
కఠినత్వాన్ని ఖాకీ యూనిఫామ్ గానూ
ఆత్మ విశ్వాసాన్ని తల టోపీ గానూ ధరించిన వాళ్ళం
సౌందర్య శిల్పాలుగా కాక ఇనుప చువ్వలుగా
శరీరాల్ని మార్చుకున్నవాళ్ళం
ఉషోదయాల ఊసే లేకుండా
సాయం సంధ్యల సాయం పొందకుండా
కాలాన్ని కర్తవ్యానికి కుదువ బెట్టిన వాళ్ళం
నేర చరితుల మధ్య నిరంతరం గడుపుతున్నా బురద అంటకుండా
ఉండాల్సిన పద్మాలం
ప్రమాదంలో మీకోసం పరిగెత్తుకొచ్చే
తక్షణ సహాయకులం
అసహాయులకు అండగా నిలిచే
రక్షణ కవచాలం
భయం తోనో అపార్ధం తోనో
దూరం చేయకండి
మేము మీలాంటి పౌరులం
ఫ్రెండ్లీ మహిళా పోలీసులం
ఎందుకో ఈరోజు కొత్తగా వుంది
పూల గాలి ఒకింత మత్తుగా ఉంది
పుడమి అంతా బంగారు తాపడం చేసినట్టు
నవ కాంతులతో గమ్మత్తుగా ఉంది
కొమ్మలు వింత రంగుల లతాంతాలను ప్రసవించాయి
సూర్యుని లేత కిరణాలు పూలపై ప్రసరించాయి
జగతిలోని సహజ అందాలు నవ్వుతున్నాయి
ధరణిపై దివ్య దీప్తులు ప్రకాశించాయి
చెట్లు కొత్త చిగుళ్ళకు జన్మనిచ్చాయి
ఆకులకు తీగలు ప్రాణమిచ్చాయి
తోట పరిమళపు విరులకు క్రొంగొత్త ఊపునిచ్చాయి
తేటి పాటలకు ఆతిథ్యం ఇచ్చాయి
అగ్నిపూలు అడవంతా ఎర్రని హంగులనద్దాయి
దిరిసెన పూలు పసుపుపచ్చని వింత శోభలు దిద్దాయి
ముందే వచ్చిన వసంతోత్సవ సంబరాలు
వనాలన్నింటికీ ఆకుపచ్చని రంగులు రుద్దాయి
వేపకొమ్మ తెల్లని పువ్వులను సింగారించింది
మామిడి వృక్షం పిందెల హారాలు సవరించింది
చింత చెట్టు వోనగాయల లోలకులు ధరించింది
పొలం చెరుకుగడల వరుసలను అలంకరించింది
పండి వంగిన వరి చేలు పచ్చని శోభలీనాయి
నింగిలోని నక్షత్రాలు మిల మిలలాడాయి
కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
కొత్త రాగాలు ఆలపించాయి
మల్లె పూలు మత్తిల్లే సువాసనలు వెదజల్లాయి
ప్రకృతి కాంత వింత శోభతో ఒప్పింది
మావి చెట్టుపై మాధవీలతను
మంచుతెర కప్పేసింది
ఉగాది వచ్చిందని నా మది
పదేపదే చెప్పింది!!!
ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది
నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది
ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా
అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం
రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం
మూడు సముద్రాల మధ్యనున్న మానవ మహా సముద్రం
కోహినూర్ వజ్రంతో బాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ
వేదాలను అందించడమే కాదు వేదాంతాన్ని తెలియజేసిన నేల
సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి
తిరిగొచ్చే దారి తెలియక పోయినా పద్మవ్యూహం లోకి
చొచ్చుకు పోయే యోధులు పుట్టిన గడ్డ
హంసను బాణంతో బాధించిన దేవదత్తుడి పేరు చరిత్రలో మాసిపోయినా
లేపనం పూసి ఊరడించిన సిద్దార్ధుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల
గాయం చేసిన వాడిని మరిచినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం కల జాతి
హంసలు నడయాడిన అవని
పరమ హంసల బోధనల పావని
ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకుని తిరిగినప్పుడు చీనాంబరాలు ధరించిన ధరిత్రి
సింధు నదీ లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత
సప్త సాగరాలకు సప్తస్వరాలను బహూకరించిన భరత మాత
కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ ను కన్న మాతృ మూర్తి
జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు
కట్టుబడిన పురుషోత్తముల సౌభ్రాతృత్వం
నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం
మొక్కల్నీ కుక్కల్నీ పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం
నీళ్లకూ పూలకూ హారతులిచ్చే ధరణి
పుట్టలనూ గుట్టలనూ పూజించే పుడమి
ఎలుకలకూ , ఏనుగులకూ ఒకేలా దండం పెట్టే దేశం
ఆహారమడిగిన డేగకు సైతం తొడను కోసి ఇచ్చిన శిబి దాతృత్వం
పర్యావరణ స్పృహ లేనప్పుడే ‘వృక్షో రక్షతి రక్షిత ‘అని చాటిన ధరిత్రి
జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి
నల్లని రాళ్ళనూ , నల్లని దేవుళ్లనూ ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ
యోగాతో ఆరోగ్యాన్నీ గీతతో వైరాగ్యాన్నీ గీతాంజలితో సాహిత్యాన్నీ
బహుమతి నిచ్చిన మహీమండలం
చుట్టుపక్కల మానవబాంబులు పుట్టుకొస్తున్న వేళ
మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల
నెత్తురోడుతున్న దేశాల దేహాలకు
శాంతి లేపనాన్ని పూసిన శ్వేత కపోతం
బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన
కారుణ్య మూర్తిని కన్న తల్లి
జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృత మూర్తి నా భరత మాత !!
ఏడు దశాబ్దాల క్రితమైనా .. ఇప్పుడైనా నా దేశ పతాకానికి మూడే రంగులు
సత్యం .. శాంతి … అహింస ..
నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే !
నా జాతి లక్ష్యం శోకమే లేని సరి కొత్త ప్రపంచమే !!
నిలబడ్డ నేలా తల మీది ఆకాశం నీది కానప్పుడే
స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుస్తుంది
పీలుస్తున్న గాలీ పలుకుతున్న పదమూ
నీ స్వంతం కానప్పుడే స్వతంత్ర్యం విలువ తెలుస్తుంది
ఏడు దశాబ్దాల క్రితం ఎర్ర కోట మీదే కాదు
ఎన్నో కోట్ల హృదయ మైదానాల్లో ఈ జెండా ఎగిరినపుడు
ఎన్ని దేహాలు రోమాంచితమైనాయో …ఎన్ని రక్త నాళాలు ఉప్పొంగినాయో ….
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని సమర్పణలు ఎన్ని బలిదానాలు ఈ దేశం చూసిందో –
చిన్న మూటల్తో వర్తకానికి వచ్చి మూటలకు మూటలు రత్న రాసులు దోపిడి చేసినవారు
గొంతులు నొక్కి శ్రమను దోచి రాజ్యాలు గెలిచి హక్కులు కబళించి ఆధిపత్యం చెలాయించిన వారు
మూటా ముల్లె సర్దుకుని పోవడానికి ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగాయో …ఎలా మరుస్తాం ?
రాజ్య వారసుడు పోయినా ప్రజా స్వేచ్ఛ కోసం ‘ ప్రాణమిస్తా , ఝాన్సీ నివ్వను ‘ అన్న ప్రధమ స్వాతంత్ర్య పోరాట జ్వాలనీ ,
గుండె అక్కడ కాదురా ఇక్కడ కాల్చమంటూ శత్రువు కెదురు నిల్చిన మన్నెం వీరుడినీ ,
‘ఇంక్విలాబ్ జిందాబాద్ ‘ అన్న భగత్ సింహాన్నీ , ‘ స్వాతంత్ర్యం జన్మహక్కు ‘అన్న బాల గంగాధరుణ్ణీ
‘వందే మాతరం ‘ అంటూ నినదించిన వంగ భూమి పుత్రుడు బంకిం చంద్రుడినీ ..
‘రుధిరమివ్వండి. స్వరాజ్యమిస్తా ‘ నన్న ఆజాద్ ఫవుజ్ సుభాష్ బోస్ నీ ఎలా మర్చిపోతాం ?
‘నా దేశ ప్రజలు నిండా బట్టలు కట్టేదాకా నేనూ చొక్కా తొడగనన్న’ ఒక బక్క పలుచని దేహం
ఆచ్ఛాదన లేని ఛాతీ విరుచుకుని ఎముకలు కొరికే చలిలో రౌండ్ టేబుల్ సమావేశానికి
సత్యాహింసలను ఊతకర్రలుగా మార్చి ‘డూ ఆర్ డై ‘ అంటూ నడిచి వెళ్లడం ఎలా మరుస్తాం ?
ఉప్పు పిడికిలిని ఉక్కు పిడికిలిగా మార్చిన శాంతి మాంత్రికుడు
భరత భూమికి స్వేచ్చనూ ప్రపంచానికి అహింసనూ బహుమతిగా ఇచ్చిన బోసి నవ్వుల తాతనూ
‘ఆరాం హరామ్ హై ‘ అంటూ జాతి నిర్మాణానికి నడుం కట్టిన చాచానూ గుర్తు పెట్టుకోకుంటామా ?
ఎందరు త్యాగ ధనులు , చరిత్ర కెక్కని ఘనులు
కారుణ్యం లేని శత్రువుకు చిక్కి కాలాపానీ కారాగారాల్లో మగ్గారు
తమ రక్తంతో జాతి చరిత్రకు ప్రాణం పోశారు
దేశం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చటం కోసం
దేహం నుంచి చెమట చుక్కల్ని రాల్చినంత సునాయాసంగా ప్రాణాల్ని వదిలారు
సమర యోధులారా అమర వీరులారా
మీ సమాధులపై వెలుగుతున్నది ఆ కొవ్వొత్తులే కాదు మా హృదయ దీపాలు కూడా
మీ కోసం రాలుతున్నవి ఆ చెట్ల పూలగుత్తులే కాదు మా కన్నీటి చుక్కలు కూడా
మీ కోసం మా శాల్యూట్ లూ జోహార్లూ , వీరగంధాలూ పూల దోసిళ్ళు కూడా
ఏడు దశాబ్దాల క్రిందటే కాదు , జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు కూడా !!
ఆమె మళ్ళీ రావడం కనిపించింది .
ఎప్పట్లాగే భుజానికో బ్యాగు తగిలించుకుని , కుడి చేత్తో ఆ పెద్దావిడ చేయి పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చింది .చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ ముసలామెను కస్టమర్స్ లాంజ్ లోని కుర్చీలో కూర్చోబెట్టింది .
ఆవిడ కూర్చున్నాక తన భుజానికున్న బాగ్ లోనించి నీళ్ల సీసా బయటికి తీసి మూత తీసి పదిలంగా ఆమె నోటికి అందించింది . పెద్దావిడ వద్దన్నట్టుగా తల తిప్పింది . అయినా వదలకుండా బుజ్జగిస్తున్నట్టుగా ముసలామెతో కొన్ని మంచినీళ్లు తాగించింది .
ఆ తరువాత స్టాండ్ దగ్గరికి వెళ్లి ఒక విత్ డ్రా ఫామ్ తీసుకుని ఏదో రాసింది . పెద్దావిడ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పి ఆవిడతో పెన్ను పట్టించి చిన్న పిల్లలతో అక్షరాలు దిద్దించినట్టుగా జాగ్రత్తగా సంతకం చేయించింది . మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్లి పాస్ బుక్ తో బాటు వోచర్ ఇచ్చి పెద్దావిడను చూపిస్తూ ఏదో చెప్పింది .
వాళ్ళూ నవ్వుతూ పలకరించి ఏదో అంటున్నారు . టోకెన్ తీసుకుని కాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది . క్యాషియర్ నవ్వుతూ డబ్బులు లెక్కబెట్టి ఇచ్చాడు . ఆమె కూడా చిరునవ్వుతో మాట్లాడుతోంది .
నేను ఈ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన గత అయిదు నెలలుగా చూస్తున్నాను , ప్రతీ నెలా ఆఖరి వారం లోనే ఆమె బ్యాంక్ కి వస్తుంది . అది కూడా ఉదయం బ్యాంకు తెరచిన అయిదు నిముషాల్లోపే వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తుంది . ఆ రోజుల్లో .. అందునా ఆ టైం లో అయితే రష్ ఉండదని కాబోలు !
ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది . ఎందుకో తెలీదు గానీ ఆమెను చూస్తూంటే ఎంతో ఆత్మీయురాలనిపిస్తుంది . సౌమ్యంగా , నెమ్మదిగా తన పని చేసుకువెళ్తుంది . ఆమె రాగానే మా స్టాఫ్ కూడా ఎంతో బాగా పలకరించడం , గబగబా ఆమెకు పనులు చేసి పెట్టడం నేను గమనించాను .’ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ‘ , ఇదే కాబోలు !
ఇవాళ రిలీజ్ చేయాల్సిన ఒక లోన్ గురించి ఫీల్డ్ ఆఫీసర్ తో చెబుదామని నా కేబిన్ లోంచి బయటికి వస్తూంటే ఆమె తన చేత్తో ఆ ముసలావిడను పట్టుకుని నడిపించుకుని వెళ్తూ కనపడింది .
” నమస్తే మేడమ్ !” చక్కటి చిరునవ్వుతో కుడి అరచేయి ఛాతీకి ఆనించి తల కొద్దిగా వంచి విష్ చేసింది .
” నమస్తే ! మీ అమ్మగారా ?” పెద్దావిడ వైపు చూస్తూ అడిగాను . చిన్న పిల్లను పట్టుకుని నడిపించినట్టు ఆమె ఎంతో అపురూపంగా ఎడమ చేత్తో ఆమెను పొదివి పట్టుకుని తీసుకువెళ్తూంది .
” లేదండీ , మా అత్తగారు !” అంది ఆమె అదే వినయంతో .
ఆశ్చర్యపోవడం నా వంతయింది .
వాళ్ళు నెమ్మదిగా బయటికి వెళ్ళగానే , ఓ ఆటో వచ్చి ఆగింది . ముందే ఆటో అతన్ని పోనూ రానూ మాట్లాడుకున్నట్టున్నారు . ముందు జాగ్రత్తగా అత్తగారిని ఎక్కించి ఆ తరువాత తాను వెనకాల నుండి తిరిగి వచ్చి అటుపక్కనుండి ఎక్కిందామె . ఆటో కదిలింది . ‘ ఎంత జాగ్రత్త !’ అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాను .
********
ఎట్టకేలకు ఆ ఇల్లు దొరకపట్టగలిగాను . అతని కోసం దాదాపు నెల రోజుల్నించి తిరుగుతున్నాను. కుమార్ అనే అతను వీడియో కెమెరాకు లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుండి . పెళ్లిళ్లకు, పుట్టిన్రోజులకు , ఇతర ఫంక్షన్లకు వెళ్తూ సంపాదించుకుని తక్కువ మొత్తంతో ఎక్కువ ఇన్ స్టాల్ మెంట్స్ లో మూడేళ్ళలో కట్టుకునేలాగా ఏర్పాటు చేశారు మా బ్యాంకు వాళ్ళు .
మొదట్లో ఒకట్రెండు నెలలు సరిగానే కట్టినట్టున్నాడు . ఆ తరువాత నుండీ ఏమీ చెల్లింపులు లేవు . నేను ఈ బ్రాంచ్ లో మేనేజర్ గా చేరిన కొద్ది రోజులకే అతని లోన్ ఖాతా మొండి బకాయిగా సిస్టమ్ లో కనపడుతోంది .
సహజంగా నేను చిన్నదైనా , పెద్దదైనా లోన్ రికవరీ కోసం ఒకట్రెండు సార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండకపోతేనే ఇంటికో , పని చేసే చోటికో , షాపుకో వెళ్తాను . పైగా లోన్ ఇచ్చినప్పుడు మధ్య మధ్య యూనిట్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది .
ఈ కుమార్ అనే అతను అస్సలు దొరకలేదు . ఇప్పటికి మూడిళ్లు మార్చాడు . ఎలాగో ఆచూకీ తీసి దొరకపట్టాను . తీరా చూస్తే ఇంట్లో ఘోరమైన పరిస్థితి ! అతడు ఇంట్లో లేడు , ఏ రాత్రికో బాగా తాగి వస్తాడట . మొదట్లో ఎవరో వీడియో గ్రాఫర్స్ దగ్గర పనిచేసినప్పుడు బాగానే డబ్బులు వచ్చేవట . అయితే తాగుడు ఎక్కువై ఇంట్లోకి డబ్బులేమీ ఇవ్వకపోగా రెండు లక్షల విలువైన ఆ వీడియో కెమెరా కూడా కుదువబెట్టి మరీ తాగేవాడట .
ఇప్పుడు ఆ కెమెరా కూడా ఉందో అమ్మేశాడో తెలీదు , ఎక్కడా పెద్దగా షూటింగ్స్ కూడా ఉన్నట్టు లేదని అతని భార్య ఏడుస్తూ చెప్పింది . ఆమె షిఫ్ట్ పద్ధతిలో ఏదో మాల్ లో పని చేసి తెచ్చే డబ్బులే ఇంటికి ఆధారమట . తల్లికి వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా బెదిరించి తీసుకుంటాడట . లోన్ కట్టమని అతని భార్యని అడగలేక పోయినా , అతను ఇంట్లో ఉండే టైంకు వస్తానని ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని బయటికి వచ్చాను .
” నమస్తే మేడమ్ ! ఏంటి ఇలా వచ్చారు ?” పలుకరింపుతో స్కూటీ స్టార్ట్ చేస్తున్న నేను అటు చూసాను . రెగ్యులర్ గా వాళ్ళ అత్తగారిని తీసుకుని బ్యాంక్ కి వచ్చే ఆమె నవ్వుతూ పలుకరిస్తోంది .
” ఓ ! మీ ఇల్లు ఇక్కడేనా ?” అడిగాను . కూరగాయల బండి దగ్గర కూరలు కొన్నట్టుంది , చేతిలోని బుట్టలో కూరగాయలున్నాయి .
” ఆ రెండో ఇల్లే , మీకు ..ఇక్కడ తెలిసినవాళ్లున్నారా ?”
” కస్టమర్లందరూ మా చుట్టాలూ , ఫ్రెండ్సే కదా ! ఒక లోన్ రికవరీ కోసం వచ్చా !” చెప్పాను .
” మీరు కూడా తిరగాల్సిందేనా మేడమ్ ! మీ ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళరా ?” అడిగిందామె .
” వెళ్తారు , నేను కూడా రావాల్సి ఉంటుంది ”
” ఇంత దూరం వచ్చారు కదా , మా ఇంటికి రండి మేడమ్ , ఆ కన్పించేదే ”
” అయ్యయ్యో , వద్దు లెండి ” అన్నానే కానీ .. ఆమె ద్వారా ఈ కుమార్ ఉన్నప్పుడు తెల్సుకుని రావచ్చనీ , ఈమెతో టచ్ లో ఉంటే మంచిదనీ వెళ్లాను .
చిన్న ఇల్లే కానీ శుభ్రంగా బావుంది . ” అత్తయ్యా ‘ ఇదిగో , మనింటికి బాంక్ మేనేజర్ గారొచ్చారు ” అంటూనే ముందు రూమ్ లో ఆగిపోయిన నన్ను చూసి ” లోపలికి రండి !” అంటూ తీసుకెళ్లింది . పెద్దావిడ అప్పటి దాకా టీవీ చూస్తున్నట్టుంది , నన్ను చూడగానే ఆఫ్ చేసింది .
“ మీ కోసం రెండు రకాల ఆకు కూరలు తీసుకున్నాను . మీకిష్టమని మునక్కాయలు కొన్నాను . ” అంటూనే ” అయ్యో , ఇదేంటీ , ఈ పళ్ళ ముక్కల్ని ఇలా వదిలేశారు ?” అంటూ అత్తగారిని అడిగిందామె .
” చాలా ఇచ్చావు , కొన్ని తిన్నానులే .. అవన్నీ నేను తినలేను ” అంది పెద్దావిడ .
” ఈ మాత్రం తినకపోతే ఎలా ? పళ్ళు బాగా తినాలని డాక్టర్ చెప్పలేదూ ! ” అంటూ ప్రేమగా మందలిస్తూనే కాస్త పైకి పోయిన పెద్దామె చీరను కిందికి జరిపి కాళ్ళు కన్పించకుండా సవరించడం నా దృష్టిని దాటి పోలేదు .
” నీ ఆరాటం గానీ , పోయిన వయసూ , ఆరోగ్యం మళ్ళీ వస్తాయా ? సరే గానీ వారికి కాఫీ ఇవ్వు !” అంది అత్తగారు .
” అయ్యయ్యో ! ఇప్పుడేమీ వద్దండీ ! నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళాలి ” అన్నాను .
ఆమె అప్పటికే కిచెన్ లోకి వెళ్లనే వెళ్ళింది .
” మీ ఆరోగ్యం బాగుందా ?” అన్నాను నేను ఏం మాట్లాడాలో తెలీక .
” నా కోడలుండగా నాకేం లోటమ్మా ! నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది . నా కన్న తల్లి కన్నా ఎక్కువ . నా కూతురు కూడా ఇంత బాగా చూసుకునేదో లేదో ! అయినా వయసై పోయాక ఏముందమ్మా , ఆ పై వాడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్లిపోవడమే !” అంది .
” అదిగో ! హాస్యానికైనా ఆ మాట అనొద్దన్నానా !” ఎప్పుడు వచ్చిందో కోడలు .. కాఫీ తీసుకొచ్చింది .
” మీకు కాఫీ ఇవ్వనా ?” అత్తగారిని అడిగింది .
” ఇప్పుడొద్దు లేమ్మా , ఇందాకేగా తాగాను ” అంది పెద్దావిడ .
కాఫీ బాగుంది , మంచి రిలీఫ్ ఇచ్చింది . దానికన్నా ముందు ఆ అత్తా కోడళ్ల అనుబంధం నచ్చింది .
ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్నట్టుగా లేకుండా , చాలా సహజంగా .. నటనేమీ లేకుండా , ప్రేమగా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది .
నేను బయల్దేరి వస్తుంటే ఆమె మర్యాద కోసం బయటి దాకా వచ్చింది .
” నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూంటే ! నిజంగా ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఉండే అత్తా కోడళ్ళు అరుదు . ముఖ్యంగా ఆవిడ్ని కన్న తల్లిలా చూసుకుంటున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి ” అన్నాను మనస్ఫూర్తిగా .
” చూసుకోవాలి , తప్పదు .. అవసరం !” అందామె అదో రకంగా .
” అదేంటీ ?” అన్నాను నేను ఆశ్చర్యపోతూ .
” అదంతే ! మా మామగారు స్వాతంత్ర్య సమర యోధులు , ఆయన పెన్షన్ ముప్పై వేలు మా అత్తయ్యకు వస్తుంది .”
” అది సహజమే కదా !” అన్నాను అయోమయంగా .
” అదే మాకు ఇల్లు గడవడానికి ఆధారం . ఆ పెన్షన్ ఆవిడ ఉన్నన్నాళ్ళేగా వచ్చేది . అందుకని ఆమె ఆరోగ్యంగా , ఆనందంగా చాలా ఏళ్ల పాటు ఉండడం మాకు తప్పనిసరి .”
” అది సరే ! బెదిరించో , బ్లాక్ మెయిల్ చేసో పెద్దవాళ్ళ పెన్షన్ లాక్కునే వాళ్ళున్న రోజుల్లో మీరు చాలా ప్రేమగా చూసుకోవడం గొప్ప విషయమే కదా !”
” నాకు మొదట్నుంచీ ఆవిడంటే గౌరవమే , ఇష్టమే ! అత్తయ్య కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు . రానురానూ నాక్కూడా ఆమెను వదిలి ఎటూ వెళ్లాలనిపించదు . నా అమ్మ కన్నా ఆమెనే ఎక్కువ ఇష్టపడ్తాను . కాకపోతే హైదరాబాద్ లో ఉన్న మా ఆడపడుచు అడపా దడపా తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని పంపిస్తూండేది . తను కూడా మా అత్తయ్యను బాగా చూసుకుంటుంది ”
” మరి .. సమస్యేమిటి ?” నాకు అవసరమా కాదా అని ఆలోచించకుండా కుతూహలంతో అడిగాను , మనుషులు ఇంత ప్రేమల్తో ఉన్నా ఇబ్బందేమిటో అనుకుంటూ .
” మధ్య తరగతి మనుషుల సంగతి మీకు తెలియనిదేముంది ? మా అత్తయ్య అక్కడున్నన్నాళ్ళూ పెన్షన్ డ్రా చేయడానికి కుదరదు . మేము వెళ్లి అడగలేము .ఆ డబ్బు లేకపోతే ఇల్లు గడవదు . అందుకే తాను అక్కడికి వెళ్లకుండా ..ఎప్పుడైనా కూతురే వచ్చి నాల్రోజులు ఉండి వెళ్తే సరి .. అని మా అత్తయ్యకే అనిపించేలా చూసుకుంటాను ” శుష్క హాసం ఆమె పెదవులపై !
” మరి మీ వారు ?” ఏం చేస్తారు అని అడగలేక సగం లో వదిలేసాను .
” డిగ్రీ దాకా చదివారు . ఏ పనీ స్థిరంగా చేయరు . కుదురు ఉండదు , బద్ధకం ఎక్కువ . గొప్పలకు పోయి అప్పులు చేస్తారు . ప్రైవేట్ జాబ్స్ ఎన్నో చేసి మానేశారు . దేంట్లోనూ మూడ్నెల్లకు మించి పని చేయరు . అసలు ఎప్పుడు మానేసింది కూడా ఇంట్లో చెప్పరు . పూర్తిగా చెడ్డవాడని కాదు కానీ .. ఆ మనిషి మీద ఆధారపడి బతకలేం ”
“మా మామగారికి ఫ్రీడమ్ ఫైటర్ కోటా లో ఐదెకరాల భూమి ఇచ్చారు . సిటీ శివార్లలో ఉన్న ఆ భూమికి ఇప్పుడైతే మంచి రేటు వచ్చేది . కానీ ఎనిమిదేళ్ల క్రితమే ఆ భూమిని అమ్మి అడ్వాన్స్ తీసుకున్నారు మా ఆయన . ఇక కొడుక్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర పరువు పోతుందని మా అత్తయ్య సంతకం పెట్టారు . నేనూ ఆవిడా కల్సి మిగతా డబ్బులు మేమే తీసుకుని ఆవిడ పేరుతో ఈ ఇల్లు కొన్నాం . మాకు ఒక్కర్తే అమ్మాయి. మిగిలిన డబ్బుల్తో మా అమ్మాయి పెళ్లి చేసాం . ”
” మరి ..మీరు …ఏదైనా చేయొచ్చు కదా !”
ఆమె ఓ క్షణం ఆగింది . ” నేను ఎమ్మే బీ ఎడ్ చేసి జాబ్ వెతుక్కుంటుండగా పెళ్లి అయి ఇక్కడికి వచ్చాను . చాలా ఏళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసాను . మా అమ్మాయి పెళ్లి ముందు నాకు కాన్సర్ వచ్చింది .మాస్ట్రక్టమీ చేశారు . ఆ తరువాత మా అత్తయ్య , మా ఆయనా ..నన్ను జాబ్ చేయనివ్వట్లేదు .”
” మీరు ప్రతి సారీ బ్యాంక్ కి వచ్చే బదులు ఏటీఎం కార్డు తీసుకోవచ్చుగా !”
” అదీ అయింది . మా అత్తయ్య కొచ్చే ముప్పై వేల పెన్షన్ లో పదిహేను వేలతో ఇల్లు గడుపుతాను . ఏవన్నా పండుగలూ , పబ్బాలో , చుట్టాలు రావడమో జరిగితే మరో అయిదు వేలు .అంతే ! మిగతా డబ్బులు అలా ఖాతాలోనే ఉన్నాయనుకునే వాళ్ళం . ఈయన ఏటీఎం కార్డు తో ఎప్పటికప్పుడు మొత్తం డ్రా చేసాడని ఓ సారి లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకు కు వెళితే తెలిసింది .ఇక కార్డ్ సరండర్ చేసి మేమే వెళ్లి తెచ్చుకుంటున్నాం . మిగతా డబ్బులు మూడు , నాలుగు నెలలు కాగానే మా అత్తయ్య పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేస్తాం . నామినేషన్ నా పేరిటే ఉంటుంది . ఆవిడ తదనంతరం మాకు కావాలిగా !” గొంతు వణికినట్లనిపించింది .
లోపలికి చూసాను , పెద్దావిడ ఏదో చదువుకుంటోంది . ఆమె ముఖంలో నిశ్చిoత , సంతృప్తి !
” ఏదేమైనా … మీరు ఆవిడ్ని ఇంత అపురూపంగా చూసుకోవడం చాలా సంతోషం ! మిమ్మల్ని మెచ్చుకోవాలి ” మనస్ఫూర్తిగా అన్నాను .
” మీరలా అనకండి . నాకు చాలా గిల్టీగా ఉంటుంది . నేను చేసేది త్యాగమూ కాదు , చూపేది అనురాగమూ కాదు . కేవలం స్వార్థం , అవసరం అనాలి ! ఆవిడ లేని రోజున మేము వీధిలో పడతాం . నా మందులకు కూడా డబ్బులుండవు . ఆవిడ జీవితం చాలా ఏళ్ళు పొడిగించాలి , అందుకోసం ఆవిడ ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి . మా అత్తయ్యని కాపాడుకోవడమే నా ఉద్యోగం అని అర్థం చేసుకున్నాను గనకే ఆవిడని బాగా చూసుకుంటున్నాను . ప్రేమ , గౌరవం లేవని కాదు . ఈ డబ్బులే లేకపోతే మాకు ఎంత ప్రేముంటే ఏముంది చెప్పండి ?” నీటితో నిండిన ఆమె కళ్ళు మరెన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాయి .
“మీ ఆరోగ్యం జాగ్రత్త ! మీ అవసరం ఆవిడకు చాలా ఉంది .” అని వచ్చేసాను .
తెలంగాణా తొలితరం రచయిత్రులలో అగ్రగణ్యులు , సాహిత్య పరిశోధకులకు దారి చూపే దీపధారి , బహు గ్రంథకర్త డా . ముదిగంటి సుజాతా రెడ్డి . ఆమె మాట మెల్లన , మెత్తన !మనసు తెల్లన ,చల్లన !
రచన లోతయిన, సమగ్రమైన పరిశోధన ! బోధన స్పష్టమైన , సులువైన జ్ఞాన వితరణ !
తన జీవితం గురించీ , వృత్తి గురించీ , ప్రవృత్తి గురించీ మయూఖ ముందు డా . సుజాతా రెడ్డి గారు పంచుకున్న అనుభవాలూ , జ్ఞాపకాలూ మీ కోసం ….
మీరింత గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా ! మీ పూర్వీకులలో ఎవరైనా రచయితలు ఉన్నారా ?
లేరు . అసలు విద్యావంతులే లేరు . ఇక రచనలు కూడానా ? ఆడపిల్లలకు చదువులే వద్దనే కాలం అది . ఎక్కువ మంది నిరక్షరాస్యులు , కొద్ది మంది చదివినా ప్రాధమిక విద్య కాగానే పెళ్లి చేసేవారు .
మీ కుటుంబ నేపథ్యం , పుట్టిన ఊరి నేపథ్యం చెబుతారా ?
మాది వ్యవసాయదారుల కుటుంబం . నాన్న రాంరెడ్డి , అమ్మ వెంకటమ్మ గార్లు . ఎంతో కష్టపడితే గానీ .. తిండిగింజలు పండని పరిస్థితి . ముగ్గురు ఆడపిల్లలం , ఇద్దరు అన్నదమ్ములు .నేను రెండవదాన్ని .
అప్పట్లో తెలంగాణా లోని అన్ని పల్లెల్లోలాగానే మాదీ చిన్న పల్లెటూరు . నల్గొండ జిల్లా నకిరేకల్ మండల్ లోని ఆకారం మా ఊరు . అసలు మా ఊరి పేరు అర్కవరం . ఊరి చెరువు కట్ట క్రిందనే సూర్యుడు , “శివుడు , విష్ణువు” కొలువుదీరిన త్రికూటాలయం ఉండేదట . కాకతీయుల కాలంలో చాలా ఊర్లల్లో త్రికూటాలయాలే ఉండేవి . అర్కుడు ఉన్నందువల్ల అర్కవరం అయి రానురానూ వాడుక భాషలో ఆకారం అనేవారు .
మరి ఆడపిల్లలకు చదువే అబ్బని రోజుల్లో మీరెలా చదువుకున్నారు ?
మొదట్లో ఊళ్ళో బడికి పంపారు . అయితే అప్పుడు నల్గొండ జిల్లా ప్రజా పోరాటాలతో అగ్ని గుండంలా ఉండేది. ఉద్యమంలో భాగంగా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు ఊళ్ళల్లో దొరల భూములు , ఇళ్ళూ ఆక్రమించడం , ఆస్తులు ధ్వంసం చేయడం చేస్తూ ఉండేవారు . ఆకారం లో మా భవంతి కూడా కూలగొట్టారు . బెదిరింపులు తీవ్రమవడంతో మా కుటుంబం ఆంధ్రా ప్రాంతంలోని నరసరావుపేటకు వెళ్ళింది . 1948 -49 ప్రాంతంలో నేను అక్కడ స్కూల్లో చదువుకున్నాను .
ఆ తరువాత తెలంగాణాకు వచ్చాక కూడా నల్గొండకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో .. వరంగల్ జిల్లాలోని మా అమ్మమ్మగారి ఊరైన వెంకటాద్రిపేటకు వచ్చి అక్కడ రెండేళ్ళున్నాం . అక్కడ ఓ పంతులు చెప్పే వీధిబడి లో నన్ను చేర్పించారు .
అక్కడే అఆలు , ఎక్కాలు ,గుణింతాలు నేర్చుకున్నాను . సిరి , చుక్క ఇవన్నీ భయంతో చదివేదాన్ని .ఏదైనా నేర్చుకోకపోతేనో , త్వరగా జవాబు చెప్పకపోతేనో ఒంటి కాలి మీద నిలబెట్టడం , గోడకుర్చీ వేయించడం వంటివి చేస్తూ ఉండేవాడాయన . అప్పట్లో జొన్న పేలాలు తినేవాళ్ళం . బియ్యం , మొక్కజొన్న కంకులు , కూరగాయలు వంటివి చదువు చెప్పినందుకు పంతులుకు ఇస్తూ ఉండేవాళ్ళం .
మళ్ళీ నల్గొండకు వెళ్లలేదా ? మీ హై స్కూల్ విద్య ఎలా కొనసాగింది ?
1950 లో కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక నల్గొండకు వెళ్లాం . అయితే , మా నానమ్మ , బాపు ( నాన్న ), తాతమ్మ ( మా బాపుకు నాన్నమ్మ ) మాత్రం ఊర్లో ఉండి వ్యవసాయం , పాడి చూసుకునేవారు . మా అమ్మ , మేము అయిదుగురం పిల్లలం ఒక కిరాయి ఇంట్లో నల్గొండ లో మా చదువుల కోసం ఉండేవాళ్ళం .
నేనక్కడి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుకున్నాను . పది మంది అమ్మాయిల్లో నేనొక్కదాన్నే టెంత్ పాస్ అయ్యాను .
అప్పటికీ , ఇప్పటికీ చదువులో .. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల్లో విద్యాపరంగా , సామాజిక పరంగా మీరు గమనించిన మార్పులేమిటి ?
చాలా ఉన్నాయి . అప్పట్లో ఏడో తరగతి లేదా పదో తరగతి కాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు .పై చదువులు చదివించడం తక్కువ . అందులోనూ కృష్ణా , గుంటూరు జిల్లాల తాలూకూ ఆంధ్రా అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా బోర్డర్ ప్రాంతాలైన నల్గొండ , కోదాడ , సూర్యాపేటల్లో ఉండేవారు . వాళ్ళను బాగానే చదివించేవారు .
అప్పటికీ ఇప్పటికీ చదువుల్లో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే ..అప్పుడు తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా , తమ పిల్లల చదువు గురించి అంతగా తెలియకపోయినా , పాఠశాలల్లో ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ చూపించేవారు . పిల్లలతో తరగతి పుస్తకాలతోబాటు సాహిత్యపఠనం చేయించేవారు . మరి ఇప్పుడు తల్లిదండ్రులు విద్యావంతులై ఉండి కూడా పిల్లలు అకడమిక్ గా బాగా గొప్పగా ఉండాలని చూస్తున్నారే తప్ప .. చాలా మందికి సాహిత్యం అన్న మాట కూడా తెలియదు .
స్కూల్ లో మాకు డ్రాయింగ్ , క్రాఫ్ట్ నేర్పేవారు . చెట్టునో , పూలకుండీనో , టేబుల్ నో గీయమనీ , పడవలు చేయమనీ , రంగు కాగితాలతో రకరకాల డిజైన్లు కత్తిరించమనీ .. ఇలా సృజనాత్మక శక్తిని పెంపొందించే కళలు నేర్పేవారు . స్కూల్ ఆవరణలో మడులు చేసి కూరగాయల మొక్కలు , పూల మొక్కలు వేసి మా చేతే నీళ్లు పోయించేవారు . ఎవరి మొక్క ఎక్కువ పూస్తే , కాస్తే .. వాళ్లకు అదో సంతోషం కలిగేది .
అప్పట్లో తెలంగాణలో నెలకొని ఉన్న దారిద్ర్య పరిస్థితులు , కరువు , తక్కువ ఆదాయాలు , లాభం లేని వ్యవసాయం , ఇతర కులవృత్తులు … వీటన్నిటి వల్లా ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేసి భారం వదిలించుకోవాలనుకునేవారు . 1950 నుండీ బళ్ళల్లో ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం వచ్చింది . 1952 నాటికి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళ నాయకత్వం లో కమ్యూనిస్ట్ పోరాటాలు సాగుతూనే ఉండేవి.
మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటయింది ? మీ ఇంట్లో ఎవరైనా పాఠకులు ఉండేవారా ?
మా ఇంట్లో ఎవరూ పుస్తకాలు చదివేవాళ్ళు లేరు . అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా మాకు మంచి గ్రంధాలయం ఉండేది . వారానికి ఒకట్రెండు లైబ్రరీ క్లాసులుండేవి . టీచర్స్ మాతోనే పుస్తకాలు పైకి పెద్దగా చదివించేవారు . కొన్ని మాకు మేము చదువుకునేవాళ్ళం .వేయి పడగలు , నారాయణ రావు , గోన గన్నారెడ్డి వంటి పుస్తకాలు స్కూలు రోజుల్లోనే చదివాను . అర్థం కాకపోయినా శరత్ నవలల అనువాదాలు చదివేదాన్ని . సంజీవరావు గారి ‘ మొగలాయి దర్బారు ‘ నాలుగు భాగాలు పూర్తిగా ఎంతో ఉత్కంఠతో చదివాను . తరువాతి రోజుల్లో వివిధ సాహిత్య అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి అదే పునాది అనుకుంటాన్నేను .
మీకు చదువు చెప్పిన టీచర్లు , మీతోబాటు చదువుకున్న విద్యార్థినులు గుర్తున్నారా ?
ఎందుకు లేరు ? బాల్య జ్ఞాపకాలు మరువలేనివి కదా ! 1950 లో తెలంగాణా స్కూల్స్ లో తెలుగు మీడియం ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన టీచర్లు రిక్రూట్ అయ్యారు . ఆగ్నెస్ అనే టీచర్ చాలా బాగా పాఠాలు చెప్పేది . అలాగే మాకు హెడ్ మాస్టర్ గా మృగశిర అన్న టీచర్ ఉండేది . ఆమె పెళ్లి చేసుకోలేదు . రోజులో అధికభాగం స్కూల్ లోనే గడిపేది .వాళ్ళ అక్కచెల్లెళ్ల పేర్లు కూడా నక్షత్రాల పేర్లు ఉండేవి . విశాఖ .. అలాగన్నమాట . మృగశిర టీచర్ మా బడిలో మంచి లైబ్రరీ ఏర్పరచడానికి ముఖ్య కారణం . హిందీ బోధించే సత్యవతి టీచర్ నన్ను బాగా ప్రోత్సహించేది . వాళ్ళ చెల్లెలు ఇందిర నా క్లాసుమేట్ . అయినా అప్పుడలాంటి భేదాలు లేవు .
ఇక తరువాతి కాలంలో నల్గొండలో మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న డా . ప్రేమలత కూడా నా క్లాసే . రోజూ బగ్గీలో స్కూల్ కి వచ్చేది .
మరి మీకు టెంత్ అవగానే పెళ్లి చేయకుండా ఎలా చదివించారు ?
అప్పటి పరిస్థితుల దృష్ట్యా నాకు వెంటనే పెళ్లి చేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో తర్జనభర్జనల అనంతరం నన్ను హైదరాబాద్ నారాయణ్ గుడాలోని రెడ్డి విమెన్స్ కాలేజ్ లో పి యూ సీ లో ఇంగ్లీష్ మీడియం సైన్స్ లో జాయిన్ చేశారు . ఇంటికి దూరంగా ఉండటమో మరి ఎందుకో నేను అక్కడ అంత బాగా చదవలేకపోయాను .
పీ యూ సీ తర్వాత మళ్ళీ నల్గొండకు వెళ్ళిపోయి బి ఏ లో చేరాను . హైదరాబాద్ లో మా కాలేజ్ లెక్చరర్ అయిన పోతుకూచి వెంకట్రామయ్య గారే నల్గొండ డిగ్రీ కాలేజ్ లో మాకు సోషల్ స్టడీస్ బోధించేవారు .
మీ వివాహం ఎప్పుడు జరిగింది ? పెళ్లి వల్ల మీ చదువుకు ఏమైనా ఆటంకం వచ్చిందా ?
డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవగానే నా పెళ్లి జరిగింది . మా అమ్మమ్మ తల్లిగారిల్లు కరీంనగర్ లోని పొతకపల్లి . ఆమె బంధువులే మా అత్తగారింటి వారు . ఈ సంబంధం చూసింది కూడా ఆమే . మా మామగారు కొండల్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్ర తొలి అసెంబ్లీలో ఎమ్మెల్యే గా పనిచేశారు . ఆయనకూ , మా వారికీ కూడా ఆదర్శ భావాలుండేవి . ఆర్యసమాజ్ విధానాలను అనుసరించేవారు . ఇక మా వారు గోపాల్ రెడ్డి హరిద్వార్ లో సంస్కృతం లో ఎమ్మే చదివారు . ‘ ఓ డాక్టరో , ఇంజనీరో , లాయరో కాదు , సంస్కృతం లో ఎమ్మే చేసి ఏం చేస్తాడు ?’ అన్నారు మా బంధువుల్లో కొందరు .
కట్నం వద్దన్నారనే ఒక్క కారణం తో నేను పెళ్ళికి ఒప్పుకున్నాను . పెళ్లయ్యాక కూడా నేను చదువుకోవచ్చని వారు చెప్పడంతో చాలా సంతోషపడ్డాను .
మరి అనుకున్నట్టుగా మీ చదువు కొనసాగిందా ?
1960 లో గోపాల్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ లో సంస్కృత శాఖలో ఉద్యోగం వచ్చింది . నేను కోఠి విమెన్స్ కాలేజీలో చేరి బీ ఏ పూర్తి చేసాను . తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చి 1963 లో ఎమ్మే చేశాను . 1963 లోనే మా పాప వాసవిక పుట్టింది . తనను మా అమ్మ చూసుకోవడంతో నా చదువుకేమీ ఇబ్బంది కాలేదు . ఆ తరువాత ఏడాదికే బాబు ఉదయన పుట్టాడు .
మీరు ఉద్యోగం చేయాలని అనుకోలేదా ?
ఎందుకు లేదూ ? నాకు
ఉద్యోగం చేయడం ఇష్టమే ! అయితే ఊరిలో మా మామగారు హత్యకు గురికావడంతో, అక్కడి ఒత్తిడుల వల్ల ఓ సంవత్సరం మా ఊరిలో ఉండాల్సి వచ్చింది .ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఫ్రెంచ్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ భోగ్లే గారని .. ఆ తర్వాతి కాలంలో క్రికెట్ కామెంటేటర్ గా పేరు తెచ్చుకున్న హర్షా భోగ్లే తండ్రి …ఉండేవారు . ఆయన రెకమండేషన్ తో ఆ తరువాతి సంవత్సరం 1964 లో నృపతుంగ స్కూల్ లో హైస్కూల్ సెక్షన్స్ కి టీచర్ గా చేరాను .
మీరు జర్మనీ వెళ్లడం ఎలా జరిగింది ?
ఉస్మానియా యూనివర్సిటీ లో మా వారు సంస్కృత శాఖ లో పని చేస్తూనే భోగ్లే గారి ద్వారా జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు . అదే శాఖలో ఉన్న జర్మన్ దంపతులు జీమెన్స్ గార్లతో పరిచయం అయి , వారి ప్రోత్సాహంతో ఉస్మానియాలో లెక్చరర్ ఉద్యోగానికి ఓ సంవత్సరం పాటు వేతనం లేని సెలవు పెట్టి జర్మనీ వెళ్లారు . ఆ సంవత్సరం మా ఇద్దరు చెల్లెళ్ళనీ , తమ్ముళ్ళనీ ఓ పనివాడినీ మా ఇంట్లో ఉంచుకుని చదువు చెబుతూ ఉండేదాన్ని .
ఇక ఆయన ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండాలనుకోవడంతో .. 1965 లో మా బాబుని అమ్మ దగ్గర వదిలి , పాపను మాత్రం తీసుకుని మొదటిసారిగా మ్యూనిచ్ విమానం ఎక్కాను . అప్పుడు జర్మనీ వెళ్ళడానికి వీసా అవసరం లేకుండేది .
మీ జర్మనీ జీవితం
ఎలా ఉండేది ? ఎన్నాళ్ళున్నారక్కడ ?
జర్మనీకి వెళ్ళగానే బేసిక్ జర్మనీ నేర్చుకున్నాను . ఏదైనా ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా జర్మనీ వచ్చి ఉండాలి . అందుకని నైట్ స్కూల్ లో చేరి జర్మనీ నేర్చుకున్నాం . గోపాల్ రెడ్డి గారికి సంస్కృతం బాగా వచ్చును గనుక గ్రామర్ సహితంగా జర్మనీ నేర్చుకోవడం తనకు సులభమైంది . అందువల్ల ఆయనకు ఏ భాషైనా తొందరగా వచ్చేది . నాకూ జర్మనీ నేర్పుతూండేవారు . నేనక్కడ ఒక లైబ్రరీలో ఉద్యోగం చేశాను . ఆ సమయంలో చాలా ఇంగ్లీష్ , జర్మన్ , సంస్కృతం పుస్తకాలు చదివాను .
మాకు అక్కడ ఏ వార్తలూ తెలిసేవి కాదు . అప్పుడు టీవీలూ లేవు . ఎప్పుడన్నా ఓ సినిమా చూసేవాళ్ళం .ఇండియా నుండి అప్పుడప్పుడూ ఉత్తరాలు వచ్చేవి అంతే ! మా సమయంలో ఎక్కువ భాగం పఠనం , పరిశోధనకే వినియోగించే వాళ్ళం . అవన్నీ నోట్స్ గా రాశాను . తిరిగి 1969 లో ఇండియా వచ్చేసాం .
ఇండియా వచ్చాక ఏం చేశారు ? రాగానే మళ్ళీ ఉద్యోగం చేయాలన్పించిందా ? విశ్రాంతిగా ఉండాలనుకున్నా
రా?
మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు గానీ , మేమొచ్చిన సమయానికి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నది . బళ్ళు , కాలేజీలు ఏవీ నడవడం లేదు . ఇక కరీంనగర్ జిల్లా పొతకపల్లి దగ్గర మా ఇంటి పరిస్థితులూ ఏమంత బాగా లేవు . మేము జర్మనీ వెళ్తూ వ్యవసాయం చూసుకోమని మా దగ్గరి బంధువుకు అప్పజెప్పి వెళితే ఆయన మొత్తo అప్పులు చేసి నానా గందరగోళం చేసి పెట్టాడు . ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే ఉండి , ఆ సమస్యలన్నీ తీర్చుకుని మళ్ళీ హైదరాబాద్ చేరాం .
అప్పట్లో జర్మనీకీ , ఇక్కడికీ తేడా ఎలా ఉండేది ? ఎందుకొచ్చాంరా అనిపించిందా ?
అట్లా ఏమీ అనుకోలేదుగానీ , తేడా మటుకు చాలా ఉండేది . ఎక్కడ జర్మనీ .. ఎక్కడ ఇండియా ! మనం ఆ స్థాయికి ఎప్పుడు వస్తామో అనిపించేది . ముఖ్యంగా మన దగ్గర అపరిశుభ్రత చాలా ఎక్కువ . చాలా మందికి విద్య అందుబాటులో లేదే అనిపించేది .
జర్మనీ లో అప్పటికే ప్రతిదీ ‘ రెడీ టూ కుక్ ‘ లాగా దొరికేది . ఉదాహరణకు అక్కడ చికెన్ రెడీమేడ్ గా దొరికితే ఇక్కడ కో
డిని కొనాలి , బూరు తీసి కొయ్యాలి , అప్పుడు గానీ వండుకోలేము . బోలెడు సమయం దానికే పోయేది . మేము యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర ఉండేవాళ్ళం . కనీసం కోడి గుడ్లు కావాలంటే సుల్తాన్ బజార్ నుండి రాంకోఠి మధ్యలో ఓ షాప్ లో మాత్రమే దొరికేవి . అప్పటికి వంట గ్యాస్ సౌకర్యం వచ్చింది గానీ , కూపన్ సిస్టం .. దానికి పెద్ద క్యూలో నిలబడాల్సి ఉండేది . ప్రతిదానికీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉండేది .
ఇప్పుడు విదేశాలకు వెళ్లేవాళ్లకూ , యాభై అయిదేళ్ల క్రిందట వెళ్లిన మీకూ ముఖ్యమైన తేడా ఏమిటి ?
మేము డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళలేదు . మా వారికి కొత్త భాషలు నేర్చుకోవడం పట్ల ఉన్న ఆసక్తి , ఇతర భాషల సాహిత్యం , సంస్కృతీ అధ్యయనం చేయాలన్న తృష్ణ .. ఈ రెంటి వల్లనే యూనివర్సిటీలో జీతం, సీనియారిటీ నష్టపోయి కూడా జర్మనీ వెళ్ళాం తప్పితే మరొకటి కాదు . తిరిగి వచ్చాక కూడా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తే తప్ప వీలు కాని పరిస్థితులే ఉండేవి .
ఇక ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఉన్నత విద్య కోసమో , పరిశోధనల కోసమో , ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకనో , మెరుగైన
జీవితం కోసమో , కేవలం డబ్బు కోసమో .. ఇలా ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు .
మీరు యూనివర్సిటీ ఉద్యోగం కొరకు ప్రయత్నించలేదా ?
ఎమ్మే లో కాలేజీ వాళ్ళు పొరపాటుగా నా ఇంటర్నల్ మార్కులు యూనివర్సిటీ వారికి పంపలేదు .అందుకని నాకు పీజీ లో హయ్యర్ థర్డ్ క్లాస్ వచ్చింది . అందులో నా పొరపాటు ఏ మాత్రం లేకపోయినా ఫలితం నేను భరించాల్సి వచ్చింది . అలా యూనివర్సిటీ జాబ్ రాలేదు . 1970 లో మళ్ళీ విద్యాసంస్థలు తెరిచాక కొన్నాళ్ళు తార్నాకా లోని సెయింట్ ఆన్స్ లో పనిచేశాను . 1971 లో ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి నారాయణ్ గూడా రెడ్డి కాలేజీ లో పార్ట్ టైం లెక్చరర్ గా చేరి , ఆ తరువాత ఫుల్ టైమర్ గా మారాను . 2000 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశాను . అప్పుడు ఎయిడెడ్ కాలేజీగా ఉండేది , తరువాత అటానమస్ అయింది .
మీకు సాహిత్య సృజన పట్ల మక్కువ ఎలా కల్గింది ?
చిన్నప్పుడు స్కూల్ రోజుల్నుంచీ వివిధ పుస్తకాలు చదవడం అలవాటయిందన్నాను కదా ! ఎమ్మే లో నా సబ్జెక్టు తెలుగు గనుక అలా కూడా బాగా సాహిత్యం చదివాను . ఇక జర్మనీ లో ఉన్నప్పుడు జర్మన్ , ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్లెలా రాశారు , వీళ్ళేం చెప్పారు అని క్షుణ్ణంగా పరిశీలించడం , ఆ అధ్యయనాల్ని నోట్స్ గా రాయడం అలవాటయింది . పర్షియన్ , ఈజిప్షియన్ వంటి ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని చదవడం , ఆయా రచనల్ని మన తెలుగుతో , సంస్కృతంతో పోల్చడం , రాయడం .. అలా అప్పుడు కలిగిన ఆసక్తి కొనసాగింది .
కాల్పనిక సాహిత్యం .. ముఖ్యంగా స్త్రీలు రాసిన నవలలు పాఠకులను ఉర్రూతలూగిస్తూ , డబ్బు కూడా తెచ్చిపెడుతూన్న రోజుల్లో మీరు పరిశోధనాత్మక ,వాస్తవిక చిత్రణతో కూడిన రచనల్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి ?
ఎందుకో మరి నాకు తెలియకుండానే పరిశోధన , అధ్యయనం అంటే నాకు ఇష్టం ఏర్పడింది . దానికి తోడు జర్మనీ లో సంస్కృత
విభాగం ఇంచార్జిగా ఉన్నప్పుడూ , ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీ సంస్కృత శాఖ లోనూ పనిచేసిన మా వారు గోపాల్ రెడ్డి కూడా ఈ విషయంగా చాలా సహకరించారు . ఆయన సహకారమే లేకపోతే వెయ్యి పేజీల ‘ సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథం రాయడం సాధ్యపడేది కాదు .
అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖాధిపతిగా ఉన్న ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి పర్యవేక్షణలో నేను రచించి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక పరిశోధనము ‘ నాకు 1975 లో పీ హెచ్ డీ తెచ్చిపెట్టడమే కాక పాఠకుల , విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో నా తరువాతి రచనలు ఆ దిశగానే సాగాయి ..
చాలా పుస్తకాలు రచించిన మీరు వాటిని ఎలా ప్రచురణ లోకి తీసుకొచ్చారు ? శ్రమతో బాటూ ఇదంతా ఎంతో ఖరీదైన వ్యవహారం కదా !
అవును . రాయడానికి ఎంత శ్రమైనా పడతాం గానీ , ప్రచురణ కష్టమైన పని . డబ్బుతో కూడుకున్నది కూడా! చాలా పుస్తకాలు నా స్వంత ఖర్చుతో వేసుకున్నవే !అయితే గోపాల్ రెడ్డి గారూ , నేనూ కల్సి రాసిన ‘సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు మొదట 1986 లో ప్రచురించారు . కాగితం ఖర్చుల క్రింద రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చారు . ఆ తరువాత అదే పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వాళ్ళు ఏడు సార్లు పునర్ముద్రించారు . ఆఖరి ముద్రణ 2000 కాపీలు తీసారు .
అలాగే 1991 లో ‘ తెలుగు నవల -అనుశీలనం ‘ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్ధిక సహాయంతో ముద్రింపబడింది . శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే 1993 లో ప్రచురింపబడిన ‘ ‘వేమన -నాట సంప్రదాయం ‘ గ్రంథానికి గాను టిటిడి ధర్మ ప్రచార పరిషత్ వారు నాకు కొంత డబ్బు ఇచ్చారు .
ఇక 1975-76 నాటి నా పిహెచ్డీ గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక అధ్యయనము ‘ 1981 లో తెలుగు యూనివర్సిటీ వారు అచ్చు వేశారు .అలాగే నేను ఎమ్మే లో రాసుకున్న నోట్స్ ను యధాతథంగా 1982 లో ‘శ్రీనాథుని కవితా సౌందర్యము ‘ పుస్తకంగా వెలువరించాను .అదే విధంగా రెడ్డి విమెన్స్ కాలేజీ లో పని చేస్తున్నప్పుడు ఎమ్మే క్లాస్ కోసం ‘తెలుగు సాహిత్య చరిత్ర ‘ బోధించమన్నారు . అందుకోసం ఎంతో అధ్యయనం చేసి చారిత్రిక , సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అంశంపై నోట్స్ రాసుకుని విద్యార్థులకు బోధించడం జరిగింది .ఇది 1996 లో పుస్తకంగా వచ్చి 2004 లో పునర్ముద్రణ జరిగింది .
ఎన్నో యూనివర్సిటీలకు నా పుస్తకాల్లోని అధ్యాయాలు పాఠ్యఅంశాలుగా ఎంపిక చేయబడ్డాయి .యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులకూ , పోటీ పరీక్షల వారికీ ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయని సంతోషం కల్గింది .
రసావిష్కరణ అనే మాట సాధారణంగా కావ్య ప్రసక్తి వచ్చినపుడు మాట్లాడుతాం కదా ! మీరు రచించిన ‘ రస చర్చ -ఆధునికత ‘ అనే పుస్తకం గురించి చెప్పండి .
రస చర్చ నిజానికి కావ్య గ్రంథాల విషయంలోనే జరుగుతుంది . కానీ ఆధునిక సాహిత్యంలో కూడా బహు పాత్రలు , ఎక్కువ సందర్భాలు , అనేక సన్నివేశాలు కలిగి ఉండే నవలల విషయంలో రసపుష్టి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాను .ఈ పుస్తకం 2010 లో వచ్చింది . సాహిత్య ప్రక్రియ వేరు కావచ్చు గానీ , ప్రాచీన కావ్యాలలోలాగానే నవలల్లో కూడా ఒక సమగ్ర జీవితం , లేదా కొన్ని జీవితాలకు సంబంధించిన పూర్తి చిత్రణ , విశ్లేషణ ఉంటాయి . ఒక కవి కావ్యంలో ఏమి చెప్పాడో అదే మాదిరిగా ఒక రచయిత తన నవలలో వర్ణించిన భావాలను పాఠకుడు పూర్తిగా మమేకమై అనుభవించడమే రసావిష్కరణం . ఇది కవితలో , కథలో , నాటకంలో కూడా ఉంటుంది గానీ ,నిడివి దృష్ట్యా నవలలో ఎక్కువ .
పరిశోధనాత్మక సైద్ధాంతిక రచనలకే పరిమితమైన మీరు కాల్పనిక నవలలు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు ? మీ నవలల గురించి చెబుతారా ?
ముందే చెప్పినట్టు నవలలో సమగ్ర జీవన చిత్రణ ఉంటుంది . అయితే నా నవలలు పూర్తిగా కాల్పనికమైనవి కావు . వాస్తవ జీవితాల ఆధారంగా వ్రాయబడ్డవే . తొలి తెలంగాణా ఉద్యమం , రజాకార్ల ఆగడాలు , ఆ రోజుల్లోని సాంఘిక , ఆర్ధిక జీవన స్థితిగతులు , కొన్ని అనుభవాలు , జ్ఞాపకాలూ … వీటి నేపథ్యంతో 1990 లో ‘ మలుపు తిరిగిన రథచక్రాలు ‘ నవల రాశాను . దాశరథి రంగాచార్య గారికి చూపిస్తే ‘ ఇట్లాoటి నవలలు ఇప్పుడెవరూ వెయ్యరు , మీరు స్వంతంగా ప్రచురించుకోవడం మంచిది ‘ అని సలహా ఇచ్చారు . ఆ తరువాత 1994 లో ‘ సంకెళ్లు ‘నవల రాశాను .
స్త్రీ వాదం ఉధృతంగా తలెత్తిన రోజుల్లో మీరు రచించిన ‘ ఆకాశంలో విభజన రేఖల్లేవు ‘ ఏ విధంగా ప్రత్యేకమైనదని భావిస్తారు ?
జ : స్త్రీ పురుషులిద్దరూ సమానమే ! ఏ ఒక్కరు ఇతరుల స్వేచ్ఛను , వ్యక్తిత్వాన్ని కించపరిచి అణగదొక్కాలని చూసినా అది దోపిడీనే అవుతుంది . అయితే , స్త్రీ వాదం స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు . స్త్రీ ఆధిక్యత రావాలంటే కూడా సరికాదు .మొత్తం సమాజానికి సంబంధించిన విషయం ఇది . పురుషులు మారితేనే , స్త్రీని తమతో సమాన హక్కులున్న వ్యక్తిగా గుర్తించి , గౌరవిస్తేనే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది . మహిళా ఉద్యమాల ఆశ , ఆశయం ఇదే అని చెప్పే ప్రయత్నం చేశాను .
ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది ? దాని గురించి చెప్పండి .
జ : నేను పుట్టి పెరిగిన తెలంగాణా వాతావరణం ఇతర తెలుగు ప్రాంతానికి పూర్తిగా భిన్నమైనది . స్వరాజ్య పోరాటం , బీదరికంతో పోరాటం , చదువుకోవడం కోసం పోరాటం ఆ కాలంలోని ఆడపిల్లలందరికీ సమానమే అయినా ఇక్కడ , నిజాం పాలన నుండి విముక్తి కోసం పోరాటం అదనం . రజాకార్ల దుశ్చర్యలు , రైతాంగ పోరాటాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం , ఆ తరువాతి రోజుల జ్ఞాపకాలు అందరితో పంచుకోవాలనిపించి ‘ ముసురు ‘ పేరుతో నా ఆత్మకథ రాసి 2010 లో ప్రచురించడం జరిగింది . తెలంగాణా స్త్రీలలో ఆత్మకథ రాసిన తొలి వ్యక్తిని నేనే అని పరిశీలకులు అన్నారు .
మీ ఇతర రచనలన్నీ ప్రచురణకు నోచుకున్నాయా ? ప్రస్తుతం ఏమి రాస్తున్నారు ?
నేను రాసిన నవలలే కాకుండా , కథలు కూడా సంపుటాలుగా ముద్రించబడ్డాయి . 1998 లో విసుర్రాయి , 2001 లో ‘ మింగుతున్న పట్నం ‘ 2005 లో ‘ వ్యాపార మృగం ‘ 2010 లో ‘ మార్క్స్ పుట్టాలి ‘ 2014 లో ‘ నిత్య కల్లోలం ‘ పుస్తకాలుగా వచ్చాయి .ఇప్పుడయితే ఏమీ రాయడం లేదు .
ప్రస్తుతం దినపత్రికలో సీరియల్ గా వస్తున్న ‘ తెలంగాణా తెలుగు సాహిత్య చరిత్ర ‘ గురించి చెబుతారా ?
ఇది 2015 లోనే రాశాను . నమస్తే తెలంగాణా లో సీరియల్ గా ప్రస్తుతం వేస్తున్నారు . చాలా మంది తెలంగాణా అభిమానులే కాక , పరిశోధక విద్యార్థులు , పోటీ పరీక్షలకు చదివే వారు ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు . తెలంగాణా గడ్డ మీద ఉద్భవించిన సాహిత్యం చాలా విలువైనది . అయితే ఎక్కువ భాగం గుర్తింపుకు నోచుకోకుండా పోయింది . దానిని వెలికి తీసి వెలుగు లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది .
ఒక ప్రక్కన పరిశోధన , మరో ప్రక్కన ఉద్యోగం , ఇంకొక ప్రక్కన రచనా వ్యాసంగం , అన్నిటికన్నా ముఖ్యం ఇంటి పని , పిల్లల పెంపకం .. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి ?
మొదట్లో మా పాపను కొన్నాళ్ళు , మా బాబును చాలా ఏళ్ళు మా అమ్మే పెంచింది . ఇక నేను ఉద్యోగం చేస్తున్నప్పుడూ , తరువాత కూడా రాములు అన్నతడు మా ఇంట్లో వంట చేయడమే కాదు , పనులన్నీ చేసి పెట్టేవాడు . ఆడవాళ్ల. వ్యాసంగాలన్నీ వంటిల్లు మింగేస్తుంది .ఆ విధంగా రాములు నా బరువును చాలా మటుకు తగ్గించాడు . అందరికీ ఆ అవకాశం దొరకదు .అందుకే , నా ఫ్లాట్ పక్కనే …అతనికి కూడా ఒక ఫ్లాట్ కొనిచ్చాను .
మీరు ఎన్నో దేశాలు పర్యటించారు కదా , యాత్రా రచనలేవైనా చేశారా ?
అవును , జర్మనీ మొదలుకొని ఈజిప్టు , ఇంగ్లాండ్ , స్పెయిన్ , ఇటలీ , జపాన్ , చైనా దేశాలన్నీ తిరిగాను . 2011 లో ‘ అద్భుత చైనా యాత్ర ‘ రచించాను .
మీ పిల్లలకు మీ సాహితీ వారసత్వం వచ్చిందా ? పుస్తకాలు చదువుతారా ? రచయితల పిల్లలకు కూడా పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే ఇతరులెలా చదువుతారు అన్న మాటతో మీరు ఏకీభవిస్తారా ?
లేదు . మీ మూడు ప్రశ్నలకూ నా సమాధానం ఇదే ! ఒక వృత్తిలో ఉన్నవారి పిల్లలు అదే వృత్తి చేపట్టాలని లేదు . పైగా రచన వృత్తి కాదు , ప్రవృత్తి . ఇక పోతే పుస్తక పఠనం లాంటి అభిరుచులు ఎవరికి వారు పెంపొందించుకోవాలి. ఇప్పటి వేగవంతమైన జీవన విధానంలో డబ్బు సంపాదించడం , అనుభవించడం .. వీటికే జీవితం సరిపోతోంది . ఎవరి పిల్లలయినా ఇంతే ! అయితే పాఠకులు , పుస్తక ప్రేమికులు ఎప్పుడూ ఉంటారు .
సాహిత్యం బతికి బట్ట కట్టాలంటే ఏమి చేయాలి ? వర్ధమాన రచయితలకు , పరిశోధకులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
ప్రస్తుతం ప్రపంచ సాహిత్యంతో పోటీ పడుతూ తెలుగు రచనలు బాగానే వస్తున్నాయి .నవలలు తగ్గినా కవిత్వం , కథలు చాలా వస్తున్నాయి .ఈ మధ్య కాలంలో సాహిత్యంలో కొత్త వాదాలేవీ రాలేదు . అయితే విదేశాల్లోలాగా రచనను వృత్తిగా తీసుకునే పరిస్థితి మన దగ్గర లేదు . ప్రింట్ పత్రికలు మూతబడుతున్నాయి. ఆన్ లైన్ వెబ్ మ్యాగజైన్లు వస్తున్నాయి . ఎలాంటి రెమ్యూనరేషన్ లభించడం లేదు. ఒకప్పుడు పత్రికలు ఆడవాళ్లే ఎక్కువగా చదివేవారు . వాళ్లంతా ఇప్పుడు టీవీ సీరియల్స్ కీ , రకరకాల గేమ్ షో లకీ అలవాటు పడ్డారు . అయితే నిరాశపడవల్సిందేమీ లేదు . చదివేవాళ్లే చదువుతారు .
మన విద్యావిధానం సరిగా లేదు . నిరుద్యోగం ఎక్కువగా ఉంది . ఉపాధి లేనపుడు పుస్తకాలేం కొంటారు , ఏం రాస్తారు ? పాఠశాల , కళాశాల స్థాయిలోనే సాహిత్యానికి కొంత ప్రోత్సాహం ఉండాలి . సెలవుల ముందు కొన్ని పుస్తకాలు కేటాయించి సెలవుల్లో చదవమని స్కూల్స్ తెరిచాక వాటిపై వ్యాసరచన , ఉపన్యాస , చర్చ , క్విజ్ లాంటి పరీక్షలు పెట్టి వాటికి కొన్ని మార్కులు కేటాయించాలి . అప్పుడే పిల్లలకు సాహిత్యంతో పరిచయం ఏర్పడుతుంది .
రచనలు చేయాలనుకునే వారు ముందు బాగా చదవాలి . ఏమీ చదవకుండానే రాయాలనుకోకూడదు . వివిధ రచనా ప్రక్రియల్ని అర్థం చేసుకోవాలి . నిఘంటువులను చూడాలి . దానివల్ల భాషాసంపత్తి పెరుగుతుంది . చాలా మంది ఇవేవీ చేయడం లేదు . తప్పులతో రాస్తున్నారు . తప్పు పదప్రయోగాలు చేస్తున్నారు . తప్పు ఉపమానాలు వాడుతున్నారు . ఇక యూనివర్సిటీ వాళ్ళు కూడా సరిగా అధ్యయనం చేయడం లేదు . ముందు వాళ్ళు రాసిన వాటిల్లోంచి అందులోంచి కొంత .. ఇందులోంచి కొంత ముక్కలు తెచ్చి పేర్చి వ్యాసాలూ , పుస్తకాలూ రాసేస్తున్నారు . ఈ ధోరణి మారాలి . అప్పుడే తెలుగు సాహిత్యం నిలబడుతుంది .
డాక్టర్ అమృతలత ఒక మంచి రచయిత్
1 .ప్రశ్న : మీకు సాహిత్యం పట్ల ఇ
జ : చిన్న తనంలో మా పెద్దన్నయ్య
2 .ప్రశ్న : మీ పాఠశాల విద్యాభ్యా
జ : అరవై ఏళ్ల క్రితం తెలంగాణా
అప్పట్లో గురువులు విద్యార్థుల
ఇక సాహిత్యం అంటారా … అప్పటి
3 .ప్రశ్న :సమాజాన్ని బాగా చదివి
జ : ఊహ తెలిసిన నాటి నుండీ ఎవరై
4 .ప్రశ్న : మీరు చిన్నప్పుడు పు
జ : నచ్చిన రచయితలు ఒకరిద్దరని
5 .ప్రశ్న : తెలంగాణాలో యాభై ఏళ్ల
జ : నన్ను డాక్టర్ గా చూడాలని మా బాపు ఎంతో ఆశించారు . కానీ , నా చిన్నతనంలో ఆక్సిడెంట్ లో చేతి
6 ప్రశ్న : చిన్నప్పటినుండీ మీ
జ : మా పూర్వీకుల్లో కవులూ , రచ
7 ప్రశ్న :తెలంగాణలో కవిత్వం రా
జ : నేను మొదట రాసింది కవితనే అ
8 ప్రశ్న : కాలేజీ జీవితపు మాధు
జ : చదువులో వెనుకబడిన మా నిజా
9 ప్రశ్న : మీరు వ్యవసాయ కుటుం
జ : కష్టాల్ని కొందరు సవాలుగా తీ
10 ప్రశ్న : మిగతా ప్రైవేట్ పా
జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే
11 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవా
జవాబు : చాలా ఏళ్లుగా నా పరిశీ
12 .ప్రశ్న :మీరు ముందు రచయిత్రి ,
జ : నాకు అన్నిటి కన్నా టీచర్ పా
13 .ప్రశ్న :మీరు ‘ అమృత కిరణ్ ‘ అ
జ : నాకు ఇవాళ కొద్దో గొప్పో సా
14 ప్రశ్న :‘ అమృతలత -అపురూప అవా
జవాబు : చాలా ఏళ్లుగా నా పరిశీ
15 ప్రశ్న :మిగతా ప్రైవేట్ పా
జవాబు : నిజమే , ఒక సాహిత్యమనే
16 ప్రశ్న :‘ ఇచ్చుటలో ఉన్న హా
జవాబు : మన జీవితం చాలా చిన్నది
17 ప్రశ్న . తెలంగాణా తొలి ఉద్యమం లో విద్
జ : మనం ఆశించిన తెలంగాణా వచ్చిం