యుద్ధమేఘమెప్పుడూ
రక్తాన్నేవర్షిస్తుంది
అశాంతినేమొలకెత్తిస్తుంది
యుద్ధకారకులకేం ?
ఏసిగదుల్లోకూర్చొని
తామురేపినయుద్ధపుసెగ
ఎన్నిదేశాలకుతగులుకుందో
తామురగిల్చినఆవేశపుటగ్నిలో
ఎన్నిదేహాలుమాడిపోయాయో
తమఆధిపత్యపుపాదాలకింద
ఎన్నిశరీరాలునలిగిపోయాయో
తామునూరినవిద్వేషపుకత్తులకు
ఎన్నితలలుతెగిపడ్డాయోలెక్కిస్తూ
బాగానేవుంటారు
యుద్ధంముగిసినా
యుద్ధంచేసినగాయపుగుర్తులు
గతాన్నెప్పుడూతవ్విపోస్తూ
తమవాళ్ళతోగడిపినక్షణాలను
తమవాళ్ళతోపంచుకున్నజ్ఞాపకాలను
పదేపదేగుర్తుకుతెచ్చి
గుండెనుబరువెక్కిస్తాయి
పోయినవారికిగుర్తులుగామిగిలినవారిని
జీవశ్చవాలుగామారుస్తాయి
యుద్ధవిధ్వంసంతో
బీటలువారిననేలపై
కొన్నితరాలదాక
మనుషులకుమాత్రమేసొంతమైన
నవ్వులపువ్వులు
ఏ పెదాలపైనావికసించవు
సంతోషానికికారణమయ్యేప్రశాంతతకు
ఎవరిహృదయంలోనూతావుదొరకదు
ప్రతీకారవాంఛలేని
ఏ ఒక్కఅడుగూముదుకుకదలదు
కొత్తఆశలనురేకెత్తించే
ఏ శాంతిగీతమూవినిపించదు
ఎందుకంటే
యుద్ధమేఘమెప్పుడూ
రక్తాన్నేవర్షిస్తుంది
అశాంతినేమొలకెత్తిస్తుందికదా!
కవితలు
ఆ వలపు నావలెందుకోమరి
గెలుపు తీరం చేరకున్నాయి!
స్వాభిమానాలతో
సజల నయనాలతో
ఓటమి దీవులకేసి
వెను తిరుగుతున్నాయి!
అనుబంధాల తెరచాప చిరిగి
ఆత్మగౌరవ చుక్కాని విరిగి !
అహం త్రాసులో
తూగుతూ నిరాశా నిస్పృహలు!
అపార్ధాల గాలి వానకు
తునాతునకలై మనోకుసుమాలు!
కన్న పేగుల్ని కానివాళ్లుగా
నిలబెట్టిన కఠిన నిర్ణయాలు
న్యాయస్థానాలు నివ్వెరపోయే
బంధ విమోచన సంతకాలు !
ఎప్పుడో ఎద గోపురంపై వాలిన
ప్రేమ పావురాళ్ళకిప్పుడు
ఆ చల్లని గూడే
నిప్పులగుండమైతే?!
నిర్ణయలోపమైతేనేమి
నిస్సహాయతైతేనేమి
కాలం కాటుకు పచ్చని చెట్లకు
ఆకులే బరువైన చందం
శిశిరాన్ని మోస్తున్న బంధం!
సంసార గోడల్ని బీటలు వారనీక
ఒకరుండి ఇంకొకరులేని లోటు
పాపం పసివాళ్ళకు
సంక్రమింపచేసేది
ఆ ఒక్కసంతకమే అయితే..!?
మరొక్కమారు
సమస్యల కోణాల్ని తరచి
సహృదయ ద్వారాల్ని తెరచి
సానుకూలతో యోచించితే
సహనంతో గమించితే
సమాజ వేదికపై
సగర్వమై చాటదా వివాహవ్యవస్థ !
తాను విచ్ఛిన్న బంధం కాదనీ
పచ్చని సంప్రదాయానికి
మూలకందమని…!
కాస్సేపు అక్షరాలు
ఆరుబయట ఆరేసిన వెలుతురు మైదానంలో
పచ్చిక వాస్తవాల ఊహలు నెమరువేస్తూ
రంగులను పలవరిస్తూ
నదినీటి తాకిడిలో గులకరాళ్లగలగలై
నిశ్శ్బ్దంగానేనినదిస్తున్నవేళ ….
యావత్ ప్రపంచ సౌందర్య స్వేచ్చకు సంకెళ్లు వేస్తూ
మూడో పాదంలా మొలిచిన విషక్రిమి
కనిపించని కత్తులూ కరవాలాలూపట్టుకు
మృత్యుహేల సాగిస్తున్న క్షణాన …
గోరువెచ్చనిప్రేమప్రవాహాన స్నిగ్ధ వలయాలుగా
గడిచిన యుగాల మధ్య
కంట్లోనలకలుగా కలతలు రేపిన చారిత్రిక ఘట్టాలు
ఒకదాని వెనక ఒకటి చేతులు కట్టుకుని
శిలా విగ్రహాలై ఎదుట క్షణం మెరిసి
మురిసిసమసి పోయిన మరకలు
వెన్నుతట్టి ధైర్యం ఉగ్గుపాలు తాగించినట్టు
నిజమే
ఎన్ని తాకిళ్ళకుఎదురునిలిచి
స్థిరపడిన జాతి నాది!
పరిసరాలు చిలికి చిలికిపైకెగసిన గరళాలు
కుత్తుక నడుమ బిగించి కొనసాగే మనుగడ కదా మనది
ఆశల ఎదురుచూపులుఅద్దలుగాతగిలించుకు
ఓపిక మెత్తని పట్టు తువ్వాళ్ళ మధ్య
జీవితాన్ని అద్దుకుంటూ
వెనకెనకే అనుసరిస్తూ
నీడల సందుల మధ్య దోబూచులాడే
బూచి నేస్తాల చేతులకందకుండా
అమృత భాండానికి సాగించే అన్వేషణే కదా తుది గమ్యం
పుట్టిన క్షణం మొదలు రేపటి జాతికి
బాట చదును చేసే పరిశ్రమే కదా ఉనికి
పదండి ఒంటిగా కాదు కదిలి సాగాలి
పదికాలాల మనిషి చరిత్ర నిలిపేందుకు
పదండి ముందుకు.
నీ చీకటి గర్భంలో నవమాసాలు మోసి
నీ రక్తధారలను పాలుగా పంచి
కని పెంచి పెద్ద చేసినా నీ జీవితాన్ని
చీకటిమయం చేసిన రాక్షసత్వాన్ని
నీ పెద్ద మనసుతో మన్నించు…..
కొడుకు పుట్టాడని ఆనందంతో మురిసి
తన చివరి మజిలీలో గుండెల్లో పెట్టుకొని
అమ్మ రుణం తీర్చుకుంటాడనుకున్నవాడు
మృగంగా మారుతాడనుకోని ఆ తల్లి
మాతృ హృదయాన్ని మన్నించు…
అమ్మవై, అక్కవై, చెల్లివై, అర్ధాంగివై
సర్వ దేవతల ప్రతిరూపమైన నిన్ను
నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి
పశువాంఛను తీర్చుకున్న
మగజాతి మృగత్వాన్ని మన్నించు…
ఎక్కడ ఏం జరిగినా నాకెందుకులే
నేను, నా వాళ్ళు, నా సుఖం అంటూ
కళ్ళు మూసుకుని కదిలిపోయే
చైతన్యం లేని చేతకాని సమాజ
నపుంసకత్వాన్ని మన్నించు…
జన్మనిచ్చిన తల్లి రుణాన్ని
రాఖీ కట్టిన చెల్లి శీలాన్ని
పక్క పంచిన సతీ ప్రాణాన్ని
రక్షించుకోలేని మా మగజాతి
పరికితనాన్నిమన్నించు…
అమ్మా భారతీ! మాయమ్మా భారతీ॥
విస్మరించక స్మరిస్తుంది నిన్ను ఈ నేల
అమృత మహోత్సవ వేళ
భారత్, పరిసర ప్రాంతాలు ఏక దేహంగా
ఖండ లక్షణాలతో ఉపఖండ పరిమాణమై
అనాదిగా మానవావతరణ పరిణామాలతో
ద్రావిడ, ఆర్య జాత్యాదులను నీ అమూల్య
గర్భాన ధరించి తరించి, తరింపజేస్తున్నవ్
జన పదాలుగా, మహా జనపదాలుగా,
రాజ్యాలు వీరభోజ్యాలుగా విస్తరిస్తూ
వేదాల పురాణాదుల పురుడుపోసుకున్నవ్
నాలుగు వర్ణాల హైందవ వృక్షరాజానివైనవ్
హింసను ద్వేషిస్తూ, అహింసను ఆరాధించే
జైన, బౌద్ధ మతాది నదీపాయల పారించినవ్
శైవ, వైష్ణవాల పరస్పర దాడుల భరించినవ్
ముస్లింల, ఆంగ్లేయాదుల రాజ్యంగా మారి
కబీర్దాస్, వేమనాదుల భావ చైతన్యంతో
ఆర్యసాజ్, బ్రహ్మ సమాజాదుల వెలుగుల్లో
స్వాతంత్య్ర ఆకాంక్ష పుష్పాలు పూయించినవ్
ఎందరో సర్వమూ ఫణంగా సమర్పించి
ఇంకెందరో ప్రాణాల్ని సైతం అర్పించి
దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించి
భిన్న విభిన్న జాతుల మతాల పుష్పగుచ్ఛ
లౌకిక రాజ్యంగా మార్చిన దేశభక్తుల దేశాన
డెబ్భై ఐదు వసంతాలుగా స్వేచ్ఛ వికసిస్తూ
మత సహనానికి మారు పేరైన తరుణాన
మౌఢ్య విషయ విషాల విశాల విస్తరణతో
మానవత్వానికే ప్రాధాన్యమిచ్చే వారు
దేశద్రోహులు, సంఘ వ్యతిరేకులుగా చిత్రిత,
చిత్రహింసల గమనాన్ని గమనిస్తున్నవ్
దేశమే దేహం, దేహమే దేశంగా పరిగణిస్తూ
ద్వేషాన్ని విద్వేషాన్ని ప్రదర్శించక
దేహాన ఏ భాగాలు నిమ్నోన్నతలు కానట్లే
దేశాన ఏ వ్యక్తులూ నీచోన్నతులు కారనే స్ఫురణ స్ఫూర్తితో
పర్యావరణాన సమశీతోష్ణం వాంఛనీయమైనట్లే
సర్వ మానవుల పట్ల సమభావనే చాటుతూ
మమ్మల్ని మేమే సంస్కరించుకోవాలనే
సందేశాన్ని దేశం ఆదేశంగా
అమృత మహోత్సవాన అందిస్తున్నవ్
అమ్మా భారతీ! మాయమ్మా భారతీ!!
అండాన్ని పిండంగా మార్చి
గండాలెన్నో అధిగమించి
రుధిరాన్ని చిందించి..
మరణపు అంచున నిలబడి
నన్ను నేలకుపరిచయంచేసింది ఆమె..!
క్షీరాన్నిపట్టి.. సారాన్ని పెంచి..
భారాన్ని మోసి..
బ్రతుక్కిబాసటగా నిలిచింది ఆమె.!
ఉషోదయానికి సలాం కొట్టి
వెలుగు దివిటి చేత పట్టి
వంటింటి గిన్నెల్లో మనోహరమైనసంగీతాన్ని ఆలపిస్తుంది.
ఎద గదిలో ఉబికిన లావా
అక్ష ద్వయం
వెంటపరుగులెడుతుంటే..
చీర కొంగులో
దుఖఃసంద్రాన్ని దాచుకున్న
స్థితప్రజ్ఞతకు చిరునామా ఆమె..!
తన ఆశల్ని త్యాగం చేసి
ఆకాంక్షల్ని ఆవిరి చేసి
రక్తం పంచిన గువ్వలకు
వెండి బువ్వనందించేందుకు
ఎన్నోవెన్నెల రాత్రుల్నికోల్పోయింది ఆమె.!
బిడ్డల్ని అడ్డాల్లో మోసి
గడ్డాలు వచ్చాక మురిసి
సరి జోడు గువ్వతోజతకలిపి
మొగ్గతొడిగిన
తన వంశాoకురాన్ని చూసి
పుచ్చ పువ్వులా
స్వచ్చంగానవ్వుతుందిఆమె.
డాలర్ల వేటలో పడి
రెక్కలొచ్చిన గువ్వలు
దిక్కుల్లోకి ఎగిరిపోయి
వృద్ధ విహంగాల గూట్లో తనని బంధిస్తే..
రెక్కలు తెగినజటాయువులా రోదిస్తూ..
కొన్ని మాటల మూటలువిప్పి
మమతలుపంచే తోడు కోసం
బిక్కుబిక్కుమంటూ
దిక్కులేని పక్కిలా
ఎదరు చూస్తుంది ఆమె.!!
నదికి సాటి నదేనని
ప్రాణి ప్రపంచపు పుట్ట పగిలింది
నది పరీవాహకం పొట్టలోంచేనని
నరుడు నాగరికత నేర్చుటలో
ప్రముఖ పాత్ర వహించినది
నదేనని విన్నాను
నదిని తల్లిలా కీర్తిస్తూ
దేవతలా పూజిస్తున్న ఆస్తికుల్ని చూశాను
నదులను భూమండలానికి నరాలుగాను
నీటిని రక్తంతోను పోల్చిన
వైజ్ఞానిక వేత్తలను చదివాను
ధరించినవి పుట్ట గోచీలే అయినా
తింటున్నవి కారం గొజ్జు మెతుకులే అయినా
రేపటిని గూర్చి ఆలోచనల్లేని మనుషులున్నంత వరకు
అవరోధముల భారిన పడకుండా
సురక్షితంగా., సుఖోజయంగా ఉరకలెత్తి
కడలి కౌగిట కరిగిపోయింది నది
లోకజ్ఞానం మచ్చుకు తెలియని
ఒంటరి మహిళ నది
నిస్వార్ధం నేలపై ప్రవహిస్తే నదిలానే ఉంటుంది
ఉన్నవి, ఉత్తమమైనవి, ఉత్తవి చేయడమే
ఉత్తమ పురుషుల లక్షణమైపోయాక
నది ఆస్తి తప్ప అలజడులు తెలియని దొంగలంతా
దొమ్మీ చేసినట్టు తోడేళ్ల గుంపులా మీద పడిపోయి
అధికార దర్ప ఇనుప పంజాలతో
నది ఇసక కండరాలను చచ్చిన ఎద్దు మాంసంలా
పర్రచింపుకు పోయాక
నదిది పాదాల్లేని నడక, క’న్నీళ్లు’ లేని ఏడుపైంది
నదిని దోచుకోవడం అంటే
తల్లి గర్భసంచిని కోసుకెళ్లడమని
తనను, తోటి పరివారమును వరుసపెట్టి
చేజేతులా చంపుకోవడమేనని
వంతులేసుకొని గొంతు చించుకుంటున్న
ప్రకృతి ప్రేమికుల హిత వచనాలు
కొమ్ములు తిరిగిన కంత్రీగాళ్ళ కర్ణభేరికి
అడ్డంగా పెరిగిన దుర్మాంస పొరల ముందు
శబ్ద రహితమయ్యాయి
దుష్టునికి ధర్మాత్ముడికి
ఒకే రకం ఆతిథ్యమిచ్చే చెట్టులాగ
తనలో నుంచొని ఒంటేలికి పోసిన వారిని
తన కోసం ఒంటికాలిపై నుంచొని తపస్సు చేసిన వారిని
ఒకేలా చూసి తప్పు చేసింది నది
పర్యవసానం వందితలు పెరిగి
నది ఇప్పుడు కంపచెట్ల పొదల మధ్య
మట్టి పడకేసిన మా తాత సమాధిలా ఉంది
ఇంకా చెప్పాలంటే..,ఇవాల్టి చాలామంది మదిలా
డంపింగ్ యార్డుకు డబల్ రోల్ లా అగుపిస్తోంది
నదుల విలువ వాటిని పోగొట్టుకున్న వారికి
నదులంటూ లేని వారికే కదా తెలుస్తుంది.
బుడిబుడి అడుగులతో
అవనమ్మ గుండెలపై పారాడుతూ
నెమ్మదిగా సాగిపోయే పిల్ల కాలువ
పిల్లలకే కాదు పెద్దలకూ
ఆట విడుపుల అల్లరి కాలువ…
వీపున గోగ్గర్రల మోపునో
నడుముకి బిగించిన టైరో లేకుండా
బుడుబుంగలా మునుగుతూ తేలుతూ
చేప్పిల్లోలే ఈతల ఆరితేరించే
బుడ్డ పోరగాళ్ళ దోస్తు గీ పిల్ల కాలువే…
బుడ్డ పరకలు చంద మామలు
తళుకు తళుకు మని కవ్విస్తుంటే
ఒడుపుగా గాలం లేకుండానే
పట్టుకోవడం నేర్పిన పంతులమ్మ
గీ పిల్ల కాలువే…
పొలాల కడుపు నింపేందుకు
బాటపొంటి పోయే జనాల దూప తీర్చేందుకు
గంగమ్మ తల్లి నుండి జాలువారిన పాలధార,…
ఎగుసం చేసే రైతన్నలకు
కాయ కష్టం చేసే కూలినాలి తల్లులకు
వస్తా పోతా సేద తీర్చి
ఒళ్ళునూ మనసును
కడిగిన ముత్తెంలా చేసే తల్లి కాలువ..
గలగలమనే చిరుసవ్వడితో
గట్లు చెట్ల వెంబడి సాగిపోతూ
సబ్బండ జనాల క్షేమం కోసం
నిత్యం కలవరించే నీళ్ళమ్మ..
మనిషి బతుక్కీ మెతుక్కీ
పేగు బంధమీ పిల్ల కాలువ
సొచ్చమయిన మనసున్న
పల్లె జనాలకు అమృత జల ధార..
ఆ చేతిలో అచ్చులు పరుసవేదులు
హల్లులు మల్లెలు మొల్లలు
ఆ ఊహలు ఉయ్యాల్లు ఉషోదయాలు
ఆ మేధస్సు ఇంద్రధనుస్సు
భావాలు కురంగాలు తురంగాలు
ఆ మనసు నిండా మ్రోస్తుంటాయి సదా మృదంగాలు
అతడొక స్వేచ్ఛా విహంగం
ప్రేయసి వలపులు ప్రేమ తలపులు
ఆ మస్తిష్కంలో క్రొంగొత్త చిగుళ్ళు తొడుగుతాయి నిరుపేదల నిట్టూర్పులు ఆకలి కేకలు
లావాలు చిమ్ముతాయి
సమతా సౌమ్యత అతని రెక్కలు
చుక్కల్లో విహరిస్తాడు
మరుక్షణం కన్నీటి చుక్కై కరుగుతాడు
నేల రాలతాడు
కటిక దారిద్ర్యాలు పలకరిస్తాడు
ముక్కంటి శూలం తను
ముక్కోటి వేదం తను
దామోదరుడి చక్రం ఉపేంద్రుడి వజ్రం తను సౌందర్యాల్ని స్వప్నించి ఔదర్యాలు వర్ణించి
ఔచిత్యాల ప్రశ్నించి నిప్పులు వర్షించడం
అతడి బలం
ప్రణయాలు ప్రణవాలు
ప్రళయ లయలు విలయ ఝంఝలు
అతడి పరికరాలు
అతని కలం పరమేష్టి హలం
అక్షరాలు నాటి అక్షరసస్యాల పండిస్తాడు
పిల్లగాలుల ఆస్వాదన
భీకరార్భటుల ఆలాపన ప్రేలాపన
అలకపాన్పులు ఆక్రందనలు
అతని రంగస్థలాలు
మనస్చితిలో ప్రాయోపవేశం చెయ్యడం
అతనికే చెల్లు
వాస్తవానికి అతడో మహా మల్లు
అతడు కవి
భావనోత్తుంగ తరంగరంగితానురంజిత
ప్రతిభా ప్రభాభాసుర మణిరత్న గవి
మహా ఠీవి మహా జీవి.
————
కాదనగలవా? ..వాతంకమ్మి నబాలింత లాంటి పుడమి తల్లిని ప్రకృతి వైపరీత్యాలేవో/
నిత్యమూపొడుచుకుతింటుంటే..నెపమేదో ../వంచనఎరుగనిపంచభూతాలపైతోసేసి../
రాసుకున్నఒప్పందాలూ..ఒడంబడికలూనేడువధ్యశిలపైవేలాడుతుంటే../
క్షిపణులువాలుతున్ననేలపైఇప్పుడిక ../
నీకంటూమిగిలేదినిశ్చలశ్మశానవేదికనేనని..!/
కాదనగలవా?..శివారుప్రాంతాలమురికిబూడిదకుప్పల్లో ../
చెదలుపట్టినఅంకురమేదోలోనికి..లోలోనికికుంగిపోతుంటే../
పొగగొట్టాలవిసర్జకాలవిసురుకు../
సిమెంటువృక్షాలకతీతంగావిస్తరించినహరితశ్వాసకోశాలు../
కరకుగొడ్డళ్ళధాటికివంటచెరకుగా..
ముక్కలుచెక్కలైఆక్రందనలతోనేలకొరుగుతుంటే../
నీఖననానికైనాఒకకట్టెకూడాదొరకనిశూన్యశవపేటికలో..నీవిప్పుడునిర్జీవదేహానివని..!/
కాదనగలవా?..ఒకచెట్టునుహత్యచేయడమంటే..
వేలమనుషులనుఖననంచేసినట్టేననీ../
కాదనగలవా?..తగులబడ్డఅమెజాన్అడవులపొత్తికడుపుకార్చిచ్చులోమాడిపోయిన../
లక్షలపక్షులవిశ్వదుఃఖపుఅశ్రుసమీక్షణననువేటాడినశిఖండుడిగా../
కృత్రిమమేధస్సుతోజినోమ్..క్లోనింగ్ ల నీడన/ జబ్బలుచరుస్తూవిర్రవీగేనీబోన్సాయ్బతుకుకిక../
శాశ్వతచిరునామానిర్జనఎడారిలోనిర్వాసితమేనని..!/
ఒప్పుకుంటావా?..చనిపోయినప్రతిచెట్టూ..కొన్నివేలపిట్టలమృత్యుగీతాల్నిఆలాపిస్తుందని..!/
ఇప్పుడిక ఏ మలయమారుతమూసోకనినీరాతిదేహాన్నిమోసుకుంటూ/ ప్రాణవాయువులింకినసిమెంటురాస్తాలలో ../అలసటతో ఏ చెట్టునీడనకూలబడతావు??/
స్వర్గారోహణంమొదటిమెట్టులోనేఒరిగిపోయిన/ సహదేవుడిలా ..సాకునేదోనలగ్గొట్టకముందే../
సమ్మతిస్తావా?..మూలమిదేనంటున్న..మట్టిలావిస్తరించిరాబోయేతరాలకికనైనానాలుగుపచ్చనిచెట్లనురాసివ్వాలని../
ఒప్పుకుంటావా?..ప్రతిరోజూకూలుతున్నప్రతిచెట్టూ..తగ్గుతున్ననీఆయుఃప్రామాణికసూచికిసంకేతంలా../
నేటిపరాన్నజీవులసమతౌల్యతాచక్రంలో..నేలకొరుగుతున్నప్రతిచెట్టుసాక్షిగా../
ఇకనైనాసమ్మతిస్తావా?..
అగ్గిపెట్టెల్లాంటిఆకాశహర్మ్యాల్లో ..
ప్లాస్టిక్మొక్కలతోఅందాన్నినింపుకునేబోన్సాయ్బతుకులకేంతెల్సు..?/
ఒకపచ్చనిచెట్టువిలువయని.!/
ఋతువుమారినప్పుడల్లా..నవనవలాడేతనపత్రహరితంతో..
అదిపంచేమాతృసదృశచల్లనిస్పర్శ..!/
దిక్కులేనిసముద్రంలోఒంటరికొయ్యపడవపైని..
చివరిపక్షొకటితప్పెవరిదంటూ ..??
తనరెక్కలతెరచాపనెత్తకమునుపే../
సమ్మతిస్తావా?..నదిలాబాహువులుచాచిపచ్చనిపొదుగులా../
మనఆకుపచ్చనిస్వప్నాల్నితలాదోసెడుకన్నీళ్ళుపోసైనాసరేపండించుకోవాలని../
పరాజితఆక్రందనలాప్రతిధ్వనించే “ఆ ఒక్కఆకూరాలకమునుపే..!”/
సమ్మతిస్తావా?..లక్షలఉల్కాపాతాల్నిమోస్తున్న../ ఆకాశంలోనిగుడ్డిసూర్యునిలామిగిలిపోక../
“సమాయత్తంకావలసినవేళగా..!!”
తరుణమిదేనంటూ..
కోట్లప్రాణాలచక్రభ్రమణంలో../
కొన్నివేలసార్లుమరణించైనాసరే..ప్రకృతిప్రసాదించినవరంగా../
“వృక్షాందేహీ..!” అంటున్నజీవనోత్సవపుమురిపాలపచ్చనికలనొకటిని../ విప్పార్చుకొనేందుకుఇంకొక్కసారైనాపునర్జన్మించాలని…!!!!