మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

తెలంగాణ తొలి పొద్దు – కాళోజి

by Kancharla Mahesh May 9, 2023
written by Kancharla Mahesh

“నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని” అని చెప్పుకునే జీవిత తత్వానికి నిదర్శనం కాళోజీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తెలంగాణ పోరుగడ్డపై జన్మించిన మడికొండ మణిరత్నం కాళోజీ నారాయణరావు. కాలానికి అతీతమైన కవి, మన కాలపు వేమన, ఒక శతాబ్దాపు జీవన ప్రమాణంతో ప్రతి నిమిషం పోరాటాన్ని స్వాసించి కవిత్వీకరించిన వ్యక్తి, తెలంగాణ తొలి పొద్దు, తెలంగాణ ప్రతిధ్వని, రాజకీయ,సాంఘిక,చైతన్య కార్యక్రమాల సమూహాహారం మన కాళోజీ.. కరుడు కట్టిన హృదయాలను కదిలించే అక్షరాలను ఆయుధంగా మలచే కవిత్వాలు రాసిన ప్రజాకవి.

స్వయంగా కాళోజి  “నేనింకా నా నుండి మా వరకు రాలేదు“ అని తనలో ఉన్నటువంటి  సాదాసీదామైన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించాడు. కాళోజీ కవితలు ప్రజల గుండెల్లో నిరంతర ప్రవాహిలా మారుమోగుతూ ఉంటాయి. ఆయన కవిత్వాలు,కథలు,నవలలు వర్తమాన పరిస్థితులను అద్దం పట్టించే ప్రతీకలను కలిగి ఉంటాయి. ఎక్కడ అన్యాయం, ఎక్కడ అనిచివేత, ఎక్కడ ఆకలి మంటలు ఉంటాయో అక్కడ కాళోజీ యొక్క కవిత్వం వినబడుతుంది.

“ఆకలి మంటలు ఒకచోట – అన్నపు రాశులు ఒకచోట“అనే అక్షరాల పూదోటలో నేటి కాలపు ఆర్థిక అసమానతలను వ్యక్తీకరించే భావాన్ని అక్షరీకరించాడు.

“ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు పదును పెడుతుంది“విద్యా ప్రాముఖ్యతను, విద్యకున్న ఔన్నత్యాన్ని సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా అనువర్తించాడు.

“పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది“అన్న నినాదం జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మానవతా దృక్పథాన్ని, తన బాధ్యతను, ప్రజల యొక్క కర్తవ్యాన్ని కవిత్వీకరించాడు.

తెలంగాణ ప్రజల యొక్క గొడవను నా గొడవగా చేసుకొని సమాజ చైతన్యం కోసము అహర్నిశలు కృషిచేసిన తెలంగాణ పెద్దదిక్కు కాళోజీ నారాయణరావు. ఒకవైపు కవిత్వం,మరొకవైపు రాజకీయం మెలకువలు తెలిసిన మహాకవి కాళోజి. నేటి కాలపు రాజకీయ పరిస్థితులకు కూడా అనువర్తించే కవిత్వాన్ని ఆనాటి కాలంలోనే చిత్రీకరించిన గొప్ప కవి.

“అభ్యర్థి ఏ పార్టీ వాడను కాదు. ఏ పాటి వాడని చూడు“ అని రాజకీయ దుమారం లేపే సూక్తిని అక్షరబద్ధం చేశాడు. కాళోజీ  యొక్క ఎన్నో కవిత్వాలు,కథలు, నవలలు నేటి కాలపు యువకులకు యువ రచయితలకు కవులకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ముందుండి నడిపించి,తెలంగాణ భాష,యాస,సంస్కృతి పట్ల హేళన చేసిన వారిని చెంప చెల్లుమని విధంగా తెలంగాణ భాష సొగసులను ,అందాలను తన కవిత్వంలో గుభాలించాడు.

“పరాయి భావాలు

 పరాయిచూపులు

 పరాయి భాష

పరాయి చెవులు

పరాయినడక

పరాయి చేతలు

అట్లా కాకూడదని నాతిక్క” అని పరాయి అనే పదాన్ని ఏ విధంగా వ్యతిరేకించాడు కనబడుతుంది.

నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి ప్రజలను ఏకం చేయడానికి గణేశు ఉత్సవాలను నిర్వహించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకు ప్రాప్తి,సంతృప్తి కలుగుతుంది. ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి తన కవిత్వానికి పదును పెట్టి,ప్రజల్లో చైతన్యాన్ని రగులుగొల్పి, పాలకుల పట్ల తప్పులను ఎత్తి  చూపించే ప్రజాగలం కాలోజి. ఆంధ్ర మహాసభతో మొదలుపెట్టి తన ఉద్యమాన్నిఆర్య సమాజం, గ్రంధాలయ ఉద్యమంగా,క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన మహాకవి.

రాజకీయ కోణంలో అక్షర సత్యాలను జీవిత సత్యాలను నిర్మొహమాటంగా ఉద్ఘాటించే కవి కాళోజి.”అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో

ఆ అక్షరాలను ఆత్మగా చేసుకుని బ్రతికిన వారు కొందరే “అని మోసం చేసే వ్యక్తులకు,ఆత్మగా భరించి వ్యక్తులకు మధ్య సంబంధాన్ని తన కవిత్వం ద్వారా ప్రజానీకoలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తాను చేసిన సేవకులను భారత ప్రభుత్వం గుర్తించి పద్మవిభూషన్, జీవన గీతికి ఉత్తమ అనువాద అవార్డులను ప్రచురించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లి ఘటనకు చలించి పోయిన కాళోజి కాలంబు రాగానే కాటేసి తీరాలి అని అక్షరాలను ఆయుధంగా రజాకారులపై సవాళ్లు విసిరాడు..

“ఏ భాష రానిది ఏమి వేషము రా

ఈ భాష ఈ వేషమేవరి కోసము రా?

తెలుగు బిడ్డ వై తెలుగు రాదంచును

సిగ్గు లేక ఇంకా చెప్పుకుంటే0దుకురా?

అన్య భాషలు నేర్చు ఆంధ్రము రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని నెగ్గు తేల్చుతూ విశ్వాసంతో తెలంగాణ భాషా పట్ల,తెలుగు భాషా పట్ల తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు.

“చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చాటలేవు

చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చూడలేవు“సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు చలించని గుండె అది గుండె కాదు. అదే విధంగా జీవితంలో కనులు చెమ్మగిలకపోతే ఆ బ్రతుకులో ఉన్నటువంటి కమ్మదనాన్ని అర్థం చేసుకోలేడు మానవుడు.. మానవతావాదిగా తాను నిరూపించుకున్నాడు. ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 1946- 51 మధ్యలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని,తెలంగాణ భాషా సాధనకై నిరంతరం కృషి చేసిన తెలంగాణ దివిటి మన కాళోజీ.

May 9, 2023 0 comment
5 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆరాటం

by Rudrakhala Matam Prabhu linga Shastri April 29, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

ఏ లక్ష్యము కోసము
వాడున్నాడో దానిని
చేరడమే వాని పని.
వాడెలా చేరినాడనేది
అవసరం లేదంటాడు.

నిర్దేశించుకున్న పద్ధతి
ప్రకారమే చేరుకోవాలి
మరోపద్ధతి ప్రకారము
మరొకరి ద్వార లక్ష్యము
ఎప్పుడు చేరరాదంటాడు.

మొదటివానిది విశ్వాసము
వ్యక్తము కాలేనిది అందరిచే.
రెండవ వానిది పిడివాదము.
చేయబడుతుంది కొందరిచే.

విచిత్రమేమింటే ఈ రెండూనూ
అందరికి పూర్తిగా అందేవికావు.

వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి
సంపూర్తిగా తెలుసు తామిద్దరు
వాదనకు దిగితే ఏ ‘పరిష్కారము’
రానేరాదని అయినా తమ తమ
ఉనికి కోసమే ఆ ఇద్దరి ఆరాటం.
~~~
౼రుద్రాక్షల మఠం ప్రభులింగశాస్త్రి
తేది:-20-04-2023
వేళ:సాయంకాలం:గం౹౹4:43ని౹౹లకు

April 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్నేహ హస్తం

by Rapolu Sridevi April 17, 2023
written by Rapolu Sridevi

రాత్రి 11 గంటలకు అవుతుండగా శ్రీవారు హడావుడిగా బయటకు వెళ్తూ వ్యాన్ కీస్ అడిగారు ఆ కీస్ ఇచ్చేప్పుడు నా చీర కొంగు దానికి చిక్కుకుంది చూడకుండానే తీసుకొని వెళుతూనే ఉన్నారు.
అప్పుడు గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తి లా కనిపించారు.

ఎక్కడికి వెళ్తున్నరని తెలియక మా పక్కింట్లో ఉండే వారి ఫ్రెండుని అడిగాను.

పిటి సార్ వాళ్ళ ఆవిడ బాగా కడుపునొప్పి తో బాధపడుతున్న పడుతుంటే అపెండిటైటిస్ కావచ్చు అని ఆపరేషన్ చేయించాలని హడావుడిగా వ్యాన్లో తీసుకెళుతున్నారు. అని చెప్పారు.
అమ్మ! ” నాన్న ఎక్కడికి వెళ్తున్నారు” అని మా పెద్దమ్మాయి అడిగింది.
నాన్న ప్రాణ దానం చేయడానికి వెళ్తున్నారు .
అని చెప్పాను “ప్రాణదానం” అంటే? అడిగింది పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను సరైన సమయానికి హాస్పిటల్ లో చేర్చడం అంటే ప్రాణదానం చేసినట్టే కదా!….

అసలు “దానం” అంటే ఏమిటి ?
అని అడిగింది పాప
“మనం ప్రతిఫలం (తిరిగి సహాయం) ఆశించకుండా చేసే సహాయం ఏదైనా దానమే” అని చెప్పాను.
అన్నదానం, విద్యాదానం, స్వర్ణదానం, భూదానం, గోదానం, రక్తదానం, ధన దానం అంటూ చాలా ఉంటాయి అన్నాను. అవునా !అంటూ ..
నా వంక ఆశ్చర్యంగా చూసింది.
మీ నాన్నగారు చాలా దానాలు చేశారు తెలుసా? అన్నాను.

అయితే చెప్పమ్మా…అంది

ఓ రోజు ఓ సారు డిగ్రీ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు.
ఎవరికోసం?
అని అడిగితే.. సార్ “వాళ్ళ తమ్ముని కోసం” అన్నారు.
డిగ్రీ చదివే తమ్ముడు ఇవ్వరా? అని ఆలోచిస్తుండగానే ..
స్కూల్ ఆఫీస్ బాయ్ వచ్చి బుక్స్ అని అడిగితే ఇస్తూ … ఎవరికీ ఇవి ?
అని అడిగాను.
” నా కోసమే మేడం” అన్నాడు.
సార్ వాళ్ళ తమ్ముని కోసం అని చెప్పి తెప్పించారు.
అలా అన్నందుకైనా బాగా చదవాలి అని చెప్పి ఇచ్చాను.
ఇలా విద్యాదానం చేశారు.
టీచర్ గా మీ నాన్న చేసేది విద్యాదానమే అనుకో..

మొన్న మనం భువనగిరికి వెళ్ళినప్పుడు ఓ పిచ్చి ఆవిడ చూసి జాలి పడ్డాము.
కానీ ఏమీ చేయలేకపోయాం.

మరుసటి రోజు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేసి “ఆమెకు కాస్త తిండి అన్న పెట్టు లేకుంటే విషయం అన్న పెట్టరా “అని ఆవేశంలో అంటుంటే విని ..
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్నాను.
నిన్న భువనగిరిలో ఓ పిచ్చామే కళ్ళు తిరిగి పడిపోతే సోడా తాపించి ..ఇడ్లీ పెట్టించాను .
ఆమెకు మన భాష రాదు అనుకుంటా..
సోడా తాగిస్తుంటే ఏదో భాషలో తిడుతుంది.
అని చెప్తుంటే నవ్వొచ్చింది .
కానీ “నేను చేయలేని పని మీరు చేశారు” చెప్తూ ఆనందపడ్డాను.
మీ నాన్న ఇలా అన్నదానం చేశారు.

నాన్న వాళ్లందరికీ ఒక గ్రూపు ఉంది .
అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వారి వారి బ్లడ్ గ్రూప్స్ నోట్ చేసుకొని పెట్టారు.
ఎవరికైనా బ్లడ్ అవసరమైతే ఆ గ్రూపు వారికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి రక్తదానం చేస్తారు .
అలా మీ నాన్న ఎన్నోసార్లు రక్తదానం చేశారు .
మరి “ధనదానం చేయలేదా?”అని అడిగింది పాప

ఎవరికి ఏ అవసరం వచ్చినా మొదట మీ నాన్ననే అడుగుతారు. మీ నాన్న జీతం ముందే తీసుకొని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి ఇచ్చి ఏనాడు పూర్తి జీతం తీసుకోలేదు.

మనం ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాం కదా… ఓసారి రామకృష్ణ సార్ వచ్చి
“డాడీ మాకు డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇప్పించి రెంట్ కడుతూ.. పాపం డాడీ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా?” అని చెప్పే వరకు ఆ విషయం నాకు తెలియదు.
నాన్నను ఆ సార్ “డాడీ” అని ఎందుకు అంటున్నారు ?అని అడిగితే …
ఓ తండ్రిలా వారి బాగోగులు చూస్తున్నారుగా.. అందుకే అలా పిలుస్తున్నారు .
అని చెప్పాను .
మనం ఇంకో ఇల్లు తీసుకుందాం అంటే రెండు ఇళ్లకు కిరాయి కట్టడం కష్టం కాబట్టి మనల్ని ఈ ఇంట్లోనే ఉంచారు మీనాన్న.

“మరి స్వర్ణ దానం అంటే ?
బంగారం దానం చేయడం మా పెళ్లి రోజునే వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో అవసరం ఉందని అంటే వాళ్ళ అక్క పెట్టిన బంగారు ఉంగరం పసుపు బట్టల మీద ఉన్నా..తీసి ఇచ్చారు. “అలా ఇవ్వొద్దా?” అమ్మా !అని అడిగింది పాప .
ఇవ్వకూడదని అంటారు.
అయినా అవసరం కంటే ఆచారం ఎక్కువ కాదని ఇచ్చారు.

మరోసారి వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పరుగు పరుగునా..హాస్పిటల్ కి తీసుకెళ్లి వారిని డాక్టర్ కి చూపించి.. ఇంట్లో దింపి.. వారికి కార్ అవసరం ఉంటుందని మన కారు ఇచ్చి ట్రైన్ కి వచ్చాం .
చెల్లి పుట్టేముందు డెలివరీ ఖర్చుల కాని దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చారు. తీరా డెలివరీ రోజు డబ్బులు అడగడానికి వెళ్లి చెల్లి పుట్టాక ఆలస్యంగా వచ్చారు.

నాన్న సహాయం చేసిన వాళ్ళతో మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పితే బాగుండేది కదా,!.. అన్నది పాప.
అవును అన్నాను.

కొందరు మనుషులు ‘మన’ అనే మాటలో ‘మ’ మానవత్వం మరిచి ‘నా’ అనే స్వార్థంతో బ్రతుకుతుంటారు .
కానీ మీ నాన్న మానవత్వమే తత్వం గా…
మంచితనమే ధనంగా
భావించే వ్యక్తి.
ఒక వ్యక్తి మంచితనం ను ఆ వ్యక్తి కున్న స్నేహితులను జాబితాను బట్టి చెప్పొచ్చు అంటారు. అవును …నాన్నకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదూ …
అవును అన్నాను.

నాన్న ధన దానం, స్వర్ణదానం ,రక్తదానం, ప్రాణదానం, విద్యాదానం ఇన్ని చేశారా? అని ఆశ్చర్యం గా అడిగింది పాప..

మీరు పెద్దయ్యాక మీ పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం కూడా చేస్తారని చెపితే సిగ్గుల మొగ్గయింది
అమ్మాయి.

ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసు తో పాటు.. స్నేహస్తం ఇచ్చేవారు నిజమైన దాతలు..

April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చీరలోని గొప్పతనం

by Ramakrishna Manimadde April 17, 2023
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

  • రామకృష్ణ మనిమద్దె
    9494353828
April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రామ తత్వం

by V. Kameshwari April 2, 2023
written by V. Kameshwari

శ్రీరామనవమి సందర్భంగా

రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధు,
మిత్ర, పుత్ర పరివారంతో సహా సంహరించాడు. విభీషణని కి రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం చేశాడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇదంతా క్లుప్తంగా చెప్పిన రామ కథ. కానీ దీనిని మన పెద్దలు”కొట్టే, కట్టే, తెచ్చే” అనే మూడు మాటలతో చెప్పుకునేవారు. అలా అంటే రామాయణం అంతా జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడైనా ఎవరైనా పని సులువుగా చేసుకొస్తే ఈ మాటే వాడతారుపట్టాభిషేకం విధాలా మనకి. రాముడు మంచి బాలుడు అంటాం బుద్ధిమంతుడైన పిల్లాడిని చూసి . మంచి పరిపాలన చూసి రామరాజ్యం అంటాం. దంపతులను చూసి సీతారాముల ఉన్నారంట. పురుషుడు రాముని వలె ఏకపత్నీవృతుడు అయి ఉండాలంటా. సహనశీలుని రాముడు అంత సహనం కలవాడు అంటాం. ఎవరైనా కష్టాలు పడుతుంటే రాముని కష్టాల కంటే గొప్పవా అంటాం.
ఇక్ష్వాకులను గురించి వశిష్ట విశ్వామిత్రులు ఇలా అన్నారు” సదృశ్య ధర్మ సంబంధః సదృశవరూప సంపదా “అని. వేలాదిమంది బలాఢ్యులు ఎంతో కష్టపడి తీసుకువచ్చిన శివధనస్సును ఎక్కుపెట్టే సమయంలో వాల్మీకి రాముని గురించి ” పశ్యతాంనృ సహస్రానాం బహు నామ్ రఘునంద నః., ఆరోప వత్స ధర్మాత్మ సలీలమిమ దద్దను హు “. నీ పరాక్రమాన్ని చూపించు అనేటట్టుగా.
జనకమహారాజు తన కూతురిని చూపించి ” ప్రతి వ్రత మహాభాగ ఛాయావాను గత సదా ‘” అని చెప్పి కన్యాదానం చేశాడు. అందుకే సీత ఆయనను వెన్నంటి ఎప్పుడూ ఉంది. ఇప్పటికి కూడా ఉంటోంది.
లక్ష్మణుడి విషయానికొస్తే తల్లి సుమిత్ర రామునితో అడవికి వెళ్లడానికి అంగీక రిస్తూ ” రామ దశరథం విద్ధిమామ్ విద్ధి జనకాత్మజామ్ అయోధ్య మండలి విద్ధి గచ్చ తార యధా సుఖం “అంది. సుమిత్ర ఎంతటి ఔదార్యరాలో తెలుస్తోంది.
భరతుని విషయానికొస్తే కైకేయి అంది”త్వత్ కృతే మయ సర్వమేతం విధం కృతమ్.'” ఇదంతా నీ అభ్యుదయం కోసమే చేశానంది. అప్పుడు భరతుడు ” బలమైన ఎద్దు మెడపై ఉంచవలసిన కాడిని లేగ దూడ మెడ పై పెడితే మొయ్యగలదా? రాజ్య భారం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అది వహించడం రాముడే చెల్లు అన్నాను “. రాముని దగ్గరికి వెళ్లి రామపాదకులు తెచ్చుకుని వాటికి రాజ్యభిషేకం చేసి రాజ్యాన్ని పాలించసాగాడు. అంటే ధర్మాన్ని ఎంత ఎలా పాటించాడో చూడండి.
సీతా రాముని గురించి ఏముందో ఏముందో”” దధ్యాన్న ప్రతి గృ హిణి యాన్న బ్రుయాత్ కించిత ప్రియం అపి జీవిత వేతోర్వా రామః సత్య పరాక్రమః ” అతడు సత్య పరాక్రమడు. ఎవరికైనా ఇవ్వడమే తప్ప ఎవరి నుండి తీసుకోడు. ప్రాణం పోయినా ఎవరితోనూ అప్రయంగా మాట్లాడడు
రామ రావణ యుద్ధంలో ఇంద్రుడు వస్తే పోయిన వారిని బతికించమని ఇలా అడిగాడు”” మమ హే తో పరాక్రా నా ఏ గతా యమ సాధనమ్, తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరః “” ఎంత దయాద్ర హృదయుడో ఈ రాముడు కదా.
ఒకసారి లక్ష్మణుడితో”‘” ధర్మాన్ని పాటించడం వలన అర్థ కామాలు వెంటనే లభించకపోవచ్చు. అటువంటి అప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి. అర్ధాన్నే ప్రధానంగా చూసేవారిని లోకం ద్వేషిస్తుంది. కామమే ప్రధానంగా ప్రవర్తించే వాడికి గౌరవం ఉండదు.”’ అంటాడు. ఋజు స్వభావాన్ని ఎలా విశదీకరించాడో కదా. “” ఆత్మా నామ్ మనుషo మన్యే రామం దశరదాత్మజం ”” అన్నాడే కానీ నేను భగవంతుని ఎప్పుడూ చెప్పుకోలేదు శ్రీకృష్ణుని వలె.
సుగ్రీవుణ్ణి మా నలుగురికి నువ్వు ఐదవ సోదరుడివి అని చెప్పాడు. . ఆఖరికి హనుమంతుడిని “” తేజోధృతి యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయః, పౌరుషం విక్రమో బుద్ధిర్ యాస్మిన్నే తాని సర్వదా.” అని పొగిడాడు అంటే ఎవరికి ఎప్పుడు తేజస్సు, నేర్పు, ధైర్యం, యశస్సు సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి కలవాడు. రాముని యొక్క వినయానికి ఇదొక నిదర్శనం.
“” ఏ మమే తత్పురా వృత్తా మా ఖ్యా మ్ భద్ర మస్తవః ప్రవ్యహరత విస్ర బ్ద ం బలం విష్ణు ప్రవర్ధితాం “” అని వాల్మీకి చివర రామ కథకి ప ల శృతి కూడా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే”” ప్రజలారా! ఈ రామాయణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ కథను దృఢ విశ్వాసంతో చెప్పండి. మీకు క్షేమం కలుగుతుంది. ఆ మహావిష్ణువు యొక్క బలం తేజస్సు వృద్ధి చెందుగాక!.
కనుక మనందరం రామ మార్గంలో నడుస్తూ ఈ కష్టమైన కలియుగంలో కాస్త ద్వాపరయుగంలోని రామరాజ్యాన్ని అనుసరిదాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ” పుంసాం మోహన రూపాయ ” అయిన ఆ రామచంద్రునికి మంగళాలు పలుకుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు.x

April 2, 2023 11 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

స్పృహ

by Shanthi Prabodha Valluripalli April 2, 2023
written by Shanthi Prabodha Valluripalli

స్పృహకి ఐదేళ్లు. ఈ మధ్యనే బడికి పోవడం మొదలు పెట్టింది. 
ఆ రోజు ఉదయం బద్దకం గా లేచింది. 
అమ్మ లేపగా లేపగా లేచింది.  వెళ్లి హాల్ లో  అటు ఇటు పచార్లు చేసింది.  
అబ్బా.. ఇప్పుడు తయారై బడికి పోవాలా .. ! 
ఏంటో .. అమ్మానాన్న రోజు బడికి పోవాలని చెప్తారు. బడి అంటేనే బోర్.  ఎంచక్కా ఆడుకుంటే ఎంత బాగుంటుంది. టీవీ చూస్తే ఎంత బాగుంటుంది… ఈ పెద్ద వాళ్లకేం తెలియదు
వెళ్లి టీవీ ముందు కూర్చుంది స్పృహ.  ఆ వేళ బడికి పోవద్దు అని నిర్ణయించుకుంది. 
“బడికి టైమ్ అవుతున్నది.  గబగబా తయారవ్వు” అని అమ్మ తొందర పెట్టింది. 
“నేను ఈ రోజు బడికి పోను. ఇంట్లోనే ఉంటా”. ఎదురుగా కనిపించిన రిమోట్ తీసుకుని టీ వీ పెట్టింది.  సోఫాలో కూలబడింది స్పృహ. 
అమ్మ నాన్న మారు మాట్లాడలేదు.  స్పృహని ఒక సారి అలా చూసి వదిలేశారు. 
పది నిమిషాలు ఆగితే తానే బయలుదేరుతుంది అనుకున్నారు. 
కానీ స్పృహ  కదలడం లేదు. 
అమ్మ నాన్న ఉదయం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ఆమెని  పట్టించుకోలేదు. 
స్పృహ సంతోషంగా టీవీ చూడడంలో బిజీగా ఉంది .  కిడ్స్ ఛానెల్ లో కార్టూన్స్ చూసింది కాసేపు. ఆ తర్వాత ఛానెల్స్ అటు ఇటు పైకి కిందకి తిప్పింది. 

కాసేపటికి పొట్టలో ఆకలి మొదలైంది.  కిచెన్ లోంచి కమ్మటి వాసన వస్తున్నది.  స్పృహకి ఆకలి మరింత పెరిగింది.  నెమ్మదిగా లేచి వెళ్లి బ్రష్ చేసుకుంది . 
అప్పటికే అమ్మ తమ్ముడికి టిఫిన్ పెట్టింది. వాడు తింటున్నాడు. 
తనకి కూడా పెడుతుందేమోనని కొంచెం సేపు  ఎదురు చూసింది. టిఫిన్ ప్లేట్ అమ్మ ఇవ్వలేదు. 
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం స్పృహకి ఇష్టం ఉండదు.  అయినా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి తమ్ముడు పక్కన కూర్చుంది. 
అప్పుడు కూడా అమ్మ టిఫిన్ పెట్టలేదు. తన ప్లేట్ తీసుకుని పెట్టుకుందామని చూసింది. కానీ ఆ గిన్నె టేబుల్ పై లేదు . 
ఎలా .. ?
నాన్న కిచెన్ లోంచి ప్లేట్ లో పెట్టుకొచ్చుకున్నాడు. వచ్చి స్పృహ పక్కనే కూర్చుని తిన్నారు. కానీ స్పృహని పలకరించలేదు. టిఫిన్ తినమని అనలేదు. 
రోజు ప్లేట్ లో పెట్టి పిలిచే అమ్మ పిలవడం లేదు.  తినకపోతే బతిమాలి తినిపించే నాన్న పట్టించుకోవట్లేదు. స్పృహకు ఏడుపొచ్చింది.  
ఆకలితో పొట్టలో పేగులు అరుస్తున్నాయి. ఆఖరికి పాలు కూడా తాగలేదు. 

అంతలో తమ్ముడు పాలగ్లాసుతో అక్కడికి వచ్చాడు.  అది చూసి ఉక్రోషంతో ఉడికిపోయింది స్పృహ. 
పాపం అక్క.  అమ్మ అక్కకి ఏమీ పెట్టలేదు.  
అక్క మొహంలోకి చుశాడు. అయ్యో..  అక్కకి ఆకలేస్తుంది అని బాధపడ్డాడు. 
అక్కా.. పాలు తాగు అంటూ తన పాల గ్లాస్ ఇవ్వబోయాడు. 

ఉక్రోషంతో ఉడికిపోతున్న స్పృహ ఆ పాల గ్లాస్ ని  ఒక్క తోపు తోసింది. పాలు కింద పోయాయి . 
తమ్ముడు భయంతో కెవ్వు అన్నాడు.  ఆ ఏడుపుకి ఏమైందని అమ్మ నాన్న అటు చూశారు. 
 
ఇల్లంతా చెల్లాచెదురైన పాలు .. 
తమ్ముడు ఏడుస్తూనే వెళ్లి ఇల్లు తుడిచే పాత గుడ్డ తెచ్చాడు.  చిట్టి చేతులతో తుడుస్తున్నాడు. 
అమ్మ నాన్న ఏమి అనలేదు.  అక్కడేమి జరగనట్లే తమ పనిలో వాళ్ళున్నారు. 

స్పృహ నెమ్మదిగా వెళ్లి తమ్ముడికి సారీ చెప్పింది.  ఆ తర్వాత, తమ్ముడితో కలిసి తాను కూడా బట్టతో శుభ్రం చేసింది. 
ఆ పని చేస్తూ తనను అమ్మ నాన్న చూస్తున్నారో లేదో అని ఓరగా చూసింది. 
అమ్మ నాన్న అదేమీ పట్టించుకోనట్టు ఉన్నారు.  
అమ్మ మరో గ్లాసులో పాలు తెచ్చి తమ్ముడికి ఇచ్చింది.  

అక్కడే ఉన్న స్పృహని ఒక్క మాట కూడా అనలేదు. కోప్పడలేదు. తినమని చెప్పలేదు. బడికి పంపలేదు. 
తనను నిర్లక్ష్యం చేస్తున్నారని  ఆమె కి అర్థమైంది . 
హూ .. నేను కూడా వాళ్ళని పట్టించుకోను అనుకుంది.  మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ విసవిసా ఇంట్లోంచి బయటకు నడిచింది. 
 
ఇంటి వెనుక జామ చెట్టు కింద కూర్చుంది.  ఆకలి వేస్తుంది కదా.. !
చెట్టుపై చూసింది. జామపండు కోసం కళ్ళతో వెతికింది స్పృహ. 
  
“చిట్టి తల్లీ .. ఆకలేస్తుందా ..  అయ్యో ఒక్క పండు కూడా లేదే తల్లీ.. నీ కడుపు నింపడానికి” అని జామచెట్టు  స్పృహని చూసి బాధ పడింది.  
జామ చెట్టు మాటలకు స్పృహ లోపలున్న దుఃఖం పొంగి పొర్లింది. 
ఏదో అయినట్టు బిగ్గరగా  ఏడ్చేసింది. అయినా అమ్మ నాన్న తనని పట్టించుకోలేదు. 
స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. తమ్ముడు పొట్టనిండా తిన్నాడు. పాలు తాగాడు. 

అమ్మకి నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని బాధ తన్నుకొచ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది.  వెక్కి వెక్కి ఏడ్చింది. 

ఆ  ఏడుపు విని “ఎందుకు పాపా ఏడుస్తున్నావ్? అమ్మ కొట్టిందా .. నాన్న తిట్టారా ..? ” అని అడిగింది చెట్టుపై ఉన్న రామచిలుక . 
వెక్కి వెక్కి ఏడుస్తూనే  చెప్పింది స్పృహ . 
“అయ్యో .. మీ అమ్మ నాన్నలకి నీమీద ప్రేమ లేదని ఎవరన్నారు?” అడిగింది రామచిలుక  
“నేనే అంటున్నా. లేకపోతే నన్ను బతిమాలి తినిపించాలి గా.. బడికి పంపాలిగా..” కళ్ళనుండి కారుతున్న నీరు గౌను తో తుడుచుకుంటూ అన్నది  స్పృహ. 
“ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఒక్క మాటైనా అన్నారా.. ఒక్క దెబ్బైనా వేశారా.. కనీసం కోపంగా చూశారా..?” ప్రశ్నించింది రామచిలుక 
“ఊహూ .. లేదు” అంటూ తల అడ్డంగా ఊపింది స్పృహ
“అంటే నీ పై కోపం లేనట్లేగా.. “అన్నది రామచిలుక  
“మరి నాకు స్నానం చేయించలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు. టిఫిన్ పెట్టలేదు” దిగులుగా చెప్పింది పాప. 
“నువ్వు అమ్మ నాన్న చెప్పిన మాటలు వినలేదు.  బడికి పోవాల్సిన సమయంలో టీవీ ముందు కూర్చున్నావు. అది తప్పు కదా. 
ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. లేకపోతే నీకే కష్టం. నష్టం  ” అన్నది జామచెట్టు. 
అవును, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. 
పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళింది. అమ్మకి, నాన్నకి సారీ చెప్పింది.  
నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయను మాట ఇచ్చింది స్పృహ. 
నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దిచ్చారు అమ్మా నాన్న. చప్పట్లతో అక్క పక్కన చేరాడు తమ్ముడు. 

April 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నమిలికొండ బాలకిషనరావు గారికి నివాళి

by పొట్లపల్లి శ్రీనివాసరావు April 2, 2023
written by పొట్లపల్లి శ్రీనివాసరావు

.ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం … కవి న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు (జననం 6-9-50చివరి శ్వాస 30-3-2023) మధ్యాహ్నం హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమయ్యారు
హనుమకొండలో నమలికొండ సాహితీపరుల కొండంత అండదండగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం.చైతన్య సాహితి ,సాంస్కృతిక సమాఖ్య,సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం,కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా,రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించారు.ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతనతరానికి వేదిక కల్పించాడు.

06 సెప్టెంబరు కరీంనగర్ జిల్లా పూడూరులో నమలికొండ నారాయణరావు రత్నబాయి దంపతులకు జన్మించారు,
ఎం. ఏ, ఎల్ .ఎల్. బి, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండ లో న్యాయవాద వృత్తి చేపట్టారు, వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించారు,

నమలికొండ బాలకిషన్ ప్రసారిక పత్రికతో పాటు తన స్వీయ రచనలైన యువస్వరం (1981) అక్షర చిత్రాలు (1986) శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006) ప్రసారకీయ కుసుమాలు(2010), మొదలైనవి వెలువరించారు,
షష్టిపూర్తి సందర్భంగా
శ్రీరంగస్వామి సంపాదకత్వంలో “బాల గోకులం అక్షర వసంతం” అనే ప్రత్యేక సంచిక వెలువడింది… మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్బం లో సుక్కపొడుపు సంకలనం సాహితిసమితి ద్వారా ప్రకటించారు.
బహుశా మలిదశ ఉద్యమానికి ఇదే తొలి సంకలనం అనుకుంటాను.
సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా నేను (పొట్లపల్లిశ్రీనివాసరావు) కార్యదర్శిగా మరికొందరం కలిసిఅనేక సభలు సమావేశాలు కవి సమ్మేళనాలు నిర్వహించి పుస్తక ప్రచురణలు కావించాము.రాష్ర్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాహితీ ప్రయాణం చేసాము.
ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఇక్కడి కవులకు చాలామందికి సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది.ఇందుకు బాలకిషన్ రావు గారి కృషి, ప్రోత్సాహము ,ప్రేరణ,వితరణ మాటలతో చెప్పలేనిది.
దేవులపల్లి రామానుజ రావు,చేతన వార్త కవులు,కాళోజి సోదరులతో,ప్రత్యక్ష పరిచయం ,విడదీయరాని అనుబంధం నమలికొండ గారిది.సాహితీ సభలకు నభారా ఒక ఎస్సెట్ గా ఉండేవాడు.వివాదరహితుడు సాహితీపోషకుడు నమిలికొండ ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.నమిలికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ…ఇలాంటి విపత్కర పరిస్థితి నుండి త్వరగా వారంతా కోలుకోవాలనికోరుకుంటూ…నభారాకు నివాళి.

April 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

పులిస్వారీ

by Gannavarapu Narsimha Murty March 31, 2023
written by Gannavarapu Narsimha Murty

ఆ రోజు మాధ‌వ్ ఆఫీసుకొచ్చేస‌రికి “స‌ర్కిల్ ఇన‌స్పెక్ట‌ర్  గౌతమ్ ని ఎవరో దారుణంగా హత్యచేసారన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. మాధ‌వ్‌, గౌత‌మ్ ఇద్ద‌రూ పోలీసు శాఖ‌లో ఒకేసారి ఎస్సైలుగా చేరారు. ఇద్ద‌రూ ఒకే కాలేజీలో డిగ్రీ చ‌దివారు. గౌత‌మ్‌కు పోలీసు శాఖ‌లో చాలా స్ట్రిక్ట్   పోలీసు ఆఫీస‌ర్ అన్న పేరుంది…

మాధ‌వ్ వెంట‌నే  డీయ‌స్పీ రఘుని  క‌లిశాడు.

“చాలా ఘోరం జ‌రిగిపోయింది మాధ‌వ్‌… ఇలా జ‌రుగుతుంద‌నీ మేమెవ్వ‌రం అనుకోలేదు“ అన్నాడు రఘు.

“ సార్ ! మీరెవ్వ‌రూ అనుకోలేదు గానీ మా బేచ్‌లోని వాళ్ళంతా అత‌ని ప్రాణానికి ముప్పు ఉంద‌నీ  అనుకుంటునే  ఉన్నాము“ అన్నాడు మాధ‌వ్‌.

“మీ కెందుకొచ్చిందా అనుమానం…? అలాంట‌ప్పుడు ఎస్పీ గారికి గాని, నాకు గానీ ఆ విష‌యం ఎందుకు చెప్ప‌లేదు“ అన్నాడు  రఘు.

“సార్‌! మీరు 20 సంవ‌త్స‌రాల నుంచి పోలీసు శాఖ‌లో పనిచేస్తునారు. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌న్ని మీకు తెలుసు. మొన్న‌టి దాకా గౌత‌మ్ ఎన్నో సెన్సిటివ్ పోస్ట్‌ల‌లో ప‌నిచేసాడు. కొన్నాళ్ళు ఏంటీ న‌క్స‌ల్ స్వాడ్‌లో, కొన్నాళ్ళు సీఐడీలో, మరి  కొన్నాళ్ళు టౌన్ సీఐగా, కొన్నాళ్ళు లా అండ్ ఆర్డ‌ర్లో  ప‌నిచేసాడు. అత‌ని ముక్కు సూటిత‌నం ,ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని మనస్తత్వాలవల్ల   ఎందరికో శత్రువయ్యాడు; ఏసీబీలో  ఉన్నప్పుడు  అవినీతి ప‌రుల గుండెల్లో నిద్ర‌పోయాడు. టౌన్ సీఐగా ఉన్న‌ప్పుడు రౌడీలు, ఎమ్మెల్యేల అనుచ‌రుల ఆగ‌డాల‌ను అణిచివేసి క‌ట‌క‌టాల్లోకి  నెట్టాడు. అంత‌ర్రాష్ట దొంగ‌ల భ‌ర‌తం ప‌ట్టాడు. కాలేజీ అమ్మాయిల‌ను ఏడిపించే  వాళ్ళ‌ను న‌గ‌ర బహిష్కరణ  చేయించాడు. స్మ‌గ్ల‌ర్ల‌ను ఉక్కుపాదంతో అణిచివేసాడు. ఈ చ‌ర్య‌ల వల్ల ఎంద‌రో శత్రువుల‌ను మూట‌కట్టుకున్నాడు. అటువంటి వాడిని ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఆఫీసులో వేసి అత‌ని అధికారమ‌నే కోర‌ల్ని పీకేసింది.. దాంతో    శత్రువులు కక్ష గట్టి  అతన్ని హత్య చేశారు;“ అన్నాడు మాధ‌వ్‌.

“నువ్వు చెబుతున్న‌ది ఆశ్చ‌ర్యంగా ఉంది.  అత‌న్ని ఆఫీసులో వెయ్య‌డానికీ, హ‌త్య‌కూ  సంబంధం ఏంటి? నువ్వు బోడిగుండుకీ,  మోకాలికీ ముడిపెడుతున్నావు“ అన్నాడు ర‌ఘు ;

“సార్‌! నేను స‌రిగ్గానే చెప్పాను. మీకు అర్ధం కాలేదో లేక  అర్థంకాన‌ట్లు   న‌టిస్తున్నారో తెలియ‌టం లేదు.. అత‌ను 10 సంవ‌త్స‌రాలుగా ఎంద‌రో సంఘ విద్రోక శ‌క్తులు, రౌడీల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకొనీ వాళ్ళ‌కి కొర‌క‌రాని కొయ్యిగా త‌యార‌య్యాడు;ఇన్నాళ్లూ  ఫీల్డ్ పోస్ట్‌లో వున్న  రక్షణ వల్ల  వాడిని ఎవ్వ‌రూ ముట్టుకునే సాహ‌సం చెయ్యలేదు… ఎప్పుడైతే వాడిని ఆఫీసులో వేసారో వాడికి ర‌క్ష‌ణ క‌రువైంది. ఒక్క‌సారిగా  అడ‌విలోంచి బ‌య‌ట‌కొచ్చిన పులిలా త‌యారైంది వాడి ప‌రిస్థితి. అందుకే ఈజీ టార్గెట్ అయ్యాడు“ అన్నాడు మాధ‌వ్‌. 

“నీ ఉద్దేశ్యంలో ఆఫీసుకి ఎవ్వ‌ర్ని బ‌దిలీ చెయ్య‌కూడ‌దా? ఇదెక్క‌డి న్యాయం“ అన్నాడు ర‌ఘు ‌.

“సార్‌… చెయ్యొచ్చు. మాధ‌వ్ లాంటి స్టిక్ట్ ఆఫీస‌ర్ల‌ను మన పోలీస్ శాఖ సంవ‌త్స‌రాల‌కు సంవ‌త్స‌రాలు రౌడీలు, స్మ‌గ్ల‌ర్లు లాంటి సంఘ‌విద్రోహ శ‌క్తుల ఆట క‌ట్టించ‌డానికి బాగా వాడుకుని ఆ త‌రువాత వాళ్ళ క‌ర్మ‌కు వాళ్ళ‌ని వదిలేస్తుంది. అలా కాకుండా ప్ర‌తీ రెండేళ్ళ‌కు ట్రాఫిక్‌లోనో, ఆఫీసులోనే పోస్ట్ చేస్తే అప్పుడీ స‌మ‌స్య ఉండ‌దు. నేను  చెప్పిన విష‌యం అర్థం అయింద‌నుకుంటాను“ అన్నాడు మాధ‌వ్‌.

“అర్థం అయింది మాధ‌వ్‌… నువ్వు చెప్పింది వింటే నిజ‌మే న‌నిపిస్తోంది. బ‌దిలీ చేసే ముందు ఇవ‌న్నీ ఆలోచించాలి లేక‌పోతే మ‌నం మ‌రింత మంది మంచి ఆఫీస‌ర్ల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది“ అన్నాడు ర‌ఘు ‌.

“సార్‌! చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏమిటి ఉప‌యోగం…? ఇప్పుడ‌త‌నికి ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు.. ఇద్ద‌రూ డిగ్రీ చ‌దువుతునారు. అత‌ను నిజాయితీ అన్న పేరు త‌ప్పా ఇంకేమి సంపాదించుకోలేదు.. ఇప్పుడా కుటుంబం అత‌ని మ‌ర‌ణంతో వీధిన ప‌డుతుంది. అలా జ‌ర‌గ‌కుండా మ‌న శాఖ ఆదుకోవాలి… అత‌ని భార్య డిగ్రీ చ‌దువుకుంది. ఆమెకు వుద్యోగం ఇ‌చ్చి, ఆ పిల్ల‌ల్ని మ‌న డిపార్ట్‌మెంట్ చ‌దివిస్తే అత‌ని ‌ ఆత్మ శాంతిస్తుంది“ అనీ చెప్పాడు మాధ‌వ్‌.

“త‌ప్ప‌కుండా మాధ‌వ్… ఎస్పీ గారికి నేనీ విష‌యాల‌న్నీ చెబుతాను. మీరంద‌రూ కూడా అత‌న్ని క‌లిసి చెప్పండి. అత‌ని కుటుంబాన్ని త‌ప్ప‌కుండా ఆదుకుందాం“ అన్నాడు ర‌ఘు ‌;

ఆ త‌రువాత మాధ‌వ్ వెళ్ళిపోయాడు.

… … … … …                         … … … … …                        … … …

వారం త‌రువాత ఎస్పీ స‌క్సేనా గారి ద‌గ్గ‌ర్నుంచీ మాధ‌వ్‌కి త‌న‌ని క‌ల‌వాల‌నీ క‌బురొచ్చింది. ఆ సాయంత్రం అత‌ని ఛాంబ‌ర్‌కి వెళ్ళి క‌లిసాడు మాధ‌వ్‌;

ఎస్పీ  అప్పుడు ఛాంబ‌ర్లో వంట‌రిగా ఉన్నారు  .

 అతను  చిన్న‌వాడు. ఆరేళ్ళ క్రితం సివిల్స్ రాసి ఐపీయ‌స్ అయ్యాడు. ఎవ‌రికీ త‌ల‌వంచ‌ని వాడ‌న్న పేరుంది. ఇంత‌లో ఎటెండెంట్ వ‌చ్చి టీలు తెచ్చాడు. మాధ‌వ్ టీ తాగుతూ ఎందుకు త‌న‌ని ఎస్పీగారు పిలిచారోన‌ని ఆలోచించ సాగాడు.

ఇంత‌లో ఎస్పీగారు టీ క‌ప్పుని టేబుల్ పై పెట్టి “మాధ‌వ్‌! నిన్నెందుకు పిలిచానో తెలుసా?“ అనీ అడిగాడు.

మాధ‌వ్ త‌లఎత్తి అత‌ని వైపు ఆశ్చ‌ర్యంగా చూసాడు.

“మ‌న‌ది ఒడిషాకి బోర్డ‌ర్‌ జిల్లా కాబట్టి  ఈ మ‌ధ్య‌న గంజాయి స్మ‌గ్లింగ్ బాగా పెరిగిపోయింది. మొన్న ముఖ్య‌మంత్రి గారు డిజీపీ గారిని పిలిచి దాన్ని ఎట్టి ప‌రిస్థులుల్లోనూ అరికట్ట‌మనీ చెప్పారు. ఇప్ప‌టికే మ‌న రాష్ట ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు మీడియా వాళ్ళంతా గంజాయిని అరిక‌ట్ట‌లేద‌నీ ఆరోపిస్తున్నారు… అది రాష్ట ప్ర‌భుత్వానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. అందుకే డీజీపీ గారు ఆ గంజాయి స్మ‌గ్లింగ్‌ని అరిక‌ట్ట‌డానికి మంచి డైన‌మిక్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను పోస్ట్ చెయ్య‌మ‌న్నారు. మ‌న జిల్లాలో అటువంటి వాళ్ళు  న‌లుగురే ఉన్నారు. అందులో నువ్వొక‌డ‌వి  కాబ‌ట్టి నిన్ను అక్క‌డికి పోస్ట్ చేస్తున్నాను. నువ్వు వెంట‌నే ఛార్జి తీసుకొని దాన్ని అరిక‌ట్టే ప‌ని మొద‌లెట్టు“ అనీ చెప్పాడు…

అత‌ను చెప్పింది వినీ ఏం చెప్పాలో తెలియ‌క మాధ‌వ్ కొద్దిసేపు మౌనం దాల్చేడు. ఆ త‌రువాత తేరుకొని “ సార్‌! ద‌య‌చేసి న‌న్ను ఆ పోస్ట్‌లో వెయ్యొద్దు. నేను దానికి న్యాయం చెయ్య లేను…“అనీ అన్నాడు.

అత‌ని మాట‌ల‌కు ఎస్పీ సక్సేనా ఆశ్చ‌ర్య‌పోయి ముందుకు వంగి “ పోస్టు చెయ్య‌వ‌ద్దా? ఆశ్చ‌ర్యంగా ఉందే! ఇది నీ లాంటి మంచి ఆఫీస‌ర్లు అన‌వ‌ల‌సిన మాట‌ కాదు.. నువ్వు వ‌ద్ద‌న‌టానికి కార‌ణం?” అనీ అడిగాడు.

“సార్‌! వారం క్రితం నా కొలీగ్ గౌత‌మ్ హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌న్ని గంజాయి స్మ‌గ్ల‌ర్లో, రౌడీ షీట‌ర్లో చంపి ఉండొచ్చు. ఇంకా కేసు ప‌రిశోధ‌న‌లో ఉంది కాబట్టి వాస్తవాలు తెలియవలసి వుంది;. ఏదైనా అత‌ని వ‌ల్ల జైలు కెళ్ళిన నేర‌స్తులే హ‌త్య‌ చేసి ఉంటార‌న్న‌ది నిష్టుర స‌త్యం. అత‌న్ని మ‌న పోలీసు శాఖ అవ‌స‌ర‌మైనన్నాళ్లూ  బాగా వాడుకొని త‌రువాత వ‌దిలేసింది. ప‌ది సంవ‌త్స‌రాలు అత‌ను స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్‌గా, స‌ర్కిల్ ఇన‌స్పెక్ట‌ర్‌గా వివిధ శాఖ‌ల్లో ప‌నిచేసి నేర‌స్థుల‌కు చుక్క‌లు చూపించాడు… నేర‌స్తుల‌కు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకునే పోలీసు ఉద్యోగం అంటే పులి మీద స్వారీ లాంటిది. ఆ పోలీసు ఆ పులి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఎప్పుడూ దానిమీద  స్వారీ చేస్తుండాలి… స్వారీ చేస్తున్నంత‌కాలం ఆ పులి అత‌న్ని ఏమి చేయ్య‌లేదు. కానీ పొర‌పాటున అత‌ను ఆ పులి మీద నుంచి కింద‌కు దిగాడో దానికి ఆహారం అవ‌క తప్ప‌దు..  గౌత‌మ్ మ‌న డిపార్టుమెంటు చేసిన బదిలీ వల్ల ఆ విధంగా కిందకు దిగీ నేర‌స్థుల‌న‌బ‌డే పులికి ఆహారం అయ్యాడు. పులి మీద అంటే అధికారం ఉన్న పోస్ట్‌లో ఉన్నంత‌కాలం అత‌న్నెవ్వ‌రూ ఏమి చెయ్య‌లేక పోయారు. ఆ విధంగా ఆ పులి  మీద అత‌ను స్వారీ చేస్తూ ఇన్నాళ్ళూ గ‌డిపాడు కానీ మ‌న‌వాళ్ళు అత‌న్ని ఆఫీసులో పోస్ట్ చేసారు. దాంతో అత‌ని అధికారం అనే రెక్క‌లు తెగిపోయిన జ‌టాయువులా మారిపోయి నేర‌స్తుల‌నే రావ‌ణుల బారిన ప‌డి చ‌నిపోయాడు.“ అనీ చెబూతూ ఆగాడు మాధ‌వ్‌.

అత‌ను చెబుతుంటే ఎస్పీ స‌క్సేనా శ్ర‌ద్ద‌గా  వింటున్నాడు.

“రేపు మీరు చెప్పిన‌ట్లు నేనా ఉద్యోగంలోకి చేరితే నా ప‌రిస్థితీ అంతే… నేను ప‌ద‌వీ విర‌మ‌ణ దాకా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే న‌న్ను రక్షణ  ఉండే ప‌ద‌వుల్లో కొన‌సాగించాలి. అలా కాకుండా ఏరు దాట‌గానే తెప్ప త‌గ‌లేసిన‌ట్లు న‌న్ను ఆఫీసులో ప‌డేస్తే గౌత‌మ్ లాగే ఆ పులుల‌కి ఆహారం అయ్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి మీరు అలాంటి హామీ ఇస్తే నేను ఆ ఉద్యోగంలో చేర‌తాను. లేక‌పోతే నేను ట్రాఫిక్‌ లోనే కొన‌సాగుతాను. ద‌య‌చేసి ఇది అధికార ధిక్కారంగా భావించ‌కుండా నా వైపు నుంచి ఆలోచించ‌వ‌ల‌సిందిగా కోరుతునాను“ అనీ చెప్పి బ‌య‌ట‌కొచ్చేసాడు మాధవ్ ;        

                                                                       … … …

రెండు రోజుల త‌రువాత ఎస్పీ స‌క్సేనా మాధ‌వ్‌కి  ఫోన్‌చేసి పాత ప‌ద‌విలోనే కొన‌సాగ‌మ‌ని చెప్ప‌డంతో మాధ‌వ్ ఆనంద‌ప‌డ్డాడు.

(స‌మాప్తం)

March 31, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తెలంగాణ కావ్య ప్రతిభ

by గురిజాల రామశేషయ్య March 18, 2023
written by గురిజాల రామశేషయ్య

గురిజాల రామశేషయ్యగారు కవిపండితులు. రాశేకలం గా తెలుగు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. తెలుగు భాషాభిమానులు. ముఖ్యం గా మాతృభాష తెలుగు లోనే కాదు సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిష్ణాతులు.తెలుగు భాషాసాహిత్యాల బోధన లో నలభై ఏళ్ల పైబడిన అనుభవం కలిగినవారు. ముఖ్యంగా భాషా విషయికంగా వాక్య భేదాలు, సంధులు , సమాసాలు‌ , అలంకారాలు , ఛందస్సు వంటి వ్యాకరణ విశేషాలు అన్నీ ఔపోసన పట్టిన వారు. గేయ సాహిత్యం , ఆధునిక వచన కవితా వ్యూహనిర్మాణాలు తెలిసినవారు.
ఇవన్నీ ఉండగానే సరిపోదు. ఇటువంటి వారికి తమ సహాయాన్ని అడిగిన వారికి , సమాజం కోసం సాహిత్య పరంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచన తపన కూడా ఉండాలి… ఈ అంశాలు కూడా కలిగి ఉన్నవారు రామశేషయ్య గారు. కాబట్టే వీరు పాత తరం కొత్తతరం అనే భేద భావన లేకుండా అందరి రచనలూ బాగా అధ్యయనం చేస్తుంటారు .ప్రత్యేకంగా తమ ఇష్టానుసారం సమకాలీన సామాజిక కోణంలో విశ్లేషణ చేస్తూ స్పందిస్తూ ఉంటారు . ఇందులో భాగంగానే ఈ తెలంగాణ కావ్య ప్రతిభ శీర్షిక ద్వారా తెలుగు పద్యాలను , వచన కవితలను , సంస్కృత శ్లోకాలను పఠించి సంక్షిప్తంగా సమీక్ష చేస్తున్నారు . విని ఆనందించండి. సంపాదకులు మయూఖ

ఒద్దిరాజు సోదరుల పద్యం
దాశరథి రాజునందన చరిత్ర
గంగాదేవి
పాల్కురికి సోమనాథుడు
March 18, 2023 3 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రముఖ పేరిణీ నాట్య కళాకారులు చేగొమ్మ పవన్ కుమార్ తో ముఖాముఖి

by Aruna Dhulipala March 18, 2023
written by Aruna Dhulipala

పవన్ కుమార్ గారు..నమస్తే…ఈరోజు మిమ్మల్ని ఇలా

కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను…

చెప్పండి….

1. మీరు ఎక్కడ జన్మించారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ  జరిగింది? మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పండి..

జ: అందరికీ నమస్కారాలు. ముందుగా పాఠకులందరికీ కళాభివందనాలు. నేను పుట్టింది హైదరాబాద్ లో కానీ మా నాన్నగారి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి జిల్లా రామన్నపేట గ్రామం. నేను 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ కి వచ్చాను.ఇక మిగిలిన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగింది.మా నాన్నగారి పేరు చేగొమ్మ రమేశ్ శర్మ. మా అమ్మగారి పేరు సుభద్ర. మా నాన్నగారు రామన్నపేట మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పని చేసారు. సుమారు 4,5 గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు.

2. అసలు మీరు ఈ నాట్య రంగాన్ని ఎంచుకోవడానికి మీ పూర్వీకుల సంస్కారం ఏమైనా ఉందా? నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?

జ: మా ఇంట్లో ఎవరు కూడా నాట్యం నేర్చుకున్నవాళ్ళు

లేరు. పూర్వీకుల నుండి వచ్చింది కూడా కాదు. కానీ మా కుటుంబమంతా కళాభిమానులు. ముఖ్యంగా నేను ఈ నాట్యరంగానికి రావడానికి కారణం సాగర సంగమం చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సాగర సంగమం చిత్రం లోని కమలహాసన్ డాన్స్ చూసి ప్రభావితుడినై నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా మూడవ ఏటనే ఆ చిత్రంలోని ఓం నమశ్శివాయ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే మా తాతగారు (మా అమ్మగారి నాన్నగారు) మధ్వాచారి శ్యామ్ సుందరశాస్త్రి గారు, ధర్మపురి వాస్తవ్యులు, ఆయన ధర్మపురి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆయన నన్ను ఎలాగైనా కళాకారునిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నన్ను హైదరాబాద్ తీసుకువచ్చారు. నాట్య శిక్షణ ఇప్పించారు.

3. మీరే కాకుండా మీ కుటుంబంలో ఇంకెవరైనా ఈ కళను నేర్చుకున్నారా?

జ: నేను కాకుండా మా ఇంట్లో మా పెదనాన్నగారి కూతురు కూడా కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేసింది. కాకపోతే తనద్వారా అని చెప్పలేను. ఎవరి తోవ వారిదే. నేను నేర్చుకున్న పద్ధతికి, తన పద్ధతికి వ్యత్యాసం ఉంటుంది. ఇంక ఎవరూ లేరు.

4. ప్రముఖ నాట్యకారులు, భరత నాట్యానికే మకుటాయమానమైన నటరాజ రామకృష్ణ గారు మీ గురువులని విన్నాం…ఆ దిశగా మీ ప్రయాణం ఎలా జరిగింది?

జ : ముందు చెప్పినట్టుగా మా తాతగారు శ్యామ్ సుందర్   గారు 15, 20 రోజులు కారణ రీత్యా మా ఊరిలో ఉండవలసి వచ్చింది. అదే సమయంలో గ్రామస్తులు నా ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చూసిన మా తాతగారు ఏ శిక్షణ లేకుండానే నా మనవడు ఇంత బాగా

చేయగలుగుతున్నాడు. ఇక శిక్షణ ఇప్పిస్తే ఒక మంచి కళాకారుడిగా ఉన్నత స్థానాన్ని పొందుతాడని, ఎలాగైనా నాట్యకళను అభ్యసింప చేయాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితులైనటువంటి ప్రముఖ నటి జమున గారిని సంప్రదించడం, ఆమె సలహా మేరకు, ఆమె సహకారంతో వారి కుతురైన స్రవంతి, నేను ఒకేసారి నటరాజ రామకృష్ణ గారి వద్ద నాట్య శిక్షణ ప్రారంభించడం జరిగింది. 1986 లో ఆ మహనీయుని వద్ద తొలిపూజ జరిపించుకొని ప్రదర్శన ఆరంభించాను.

5. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? విదేశాల్లో కూడా ఏమైనా ప్రదర్శించారా?

జ: ఇప్పటి వరకు సుమారుగా దేశ విదేశాల్లో కలిపి ఆంధ్రనాట్యం, పేరిణి, అర్ధనారీశ్వర రూపాలలో 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. విదేశాలలో అయితే అమెరికా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, జపాన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. ఇక జపాన్ లో 15రోజులు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.

6.మీ నాట్య కళాభిమానాన్ని మీ భార్య, కూతురు కూడా వారసత్వంగా తీసుకున్నారని తెలిసింది…ఆ ఆసక్తి వాళ్ళల్లో ఎలా కలిగింది?

జ: నా వారసత్వంగా నా కూతురు నాట్యం నేర్చుకుంది. నా శ్రీమతి కాదు. ఆమె తన చిన్నప్పటి నుంచీ అంటే మూడేళ్ళ వయసు నుండే నాట్యాన్ని నేర్చుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను డాన్సర్ ని కావడం, తను కూడా అప్పటికే ప్రముఖ నర్తకి అయి ఉండడం వల్ల జీవిత భాగస్వామి డాన్సర్ అయితే బాగుంటుందనే ఇద్దరి అభిప్రాయాలతో మాకు పెళ్లి నిశ్చయం జరిగింది. మా వారసత్వంగా మా అమ్మాయి కూడా నాట్యం నేర్చుకొని మాతో పాటు ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తోంది.

7. పేరిణి శివతాండవంతో పాటు అర్ధనారీశ్వర రూపాన్ని అభినయించడం మీ ప్రత్యేకత. దీన్ని గురించి పూర్తిగా అర్థమయ్యేట్లు చెప్పండి…అది మీకు ఎలా సాధ్యమైంది?

జ: నేను ఆంధ్ర, పేరిణి ఈ రెండు నృత్యాలు నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే కళాకృష్ణ గారి శిక్షణ కూడా పొందాను. ఇవే కాకుండా కొంతకాలం కథక్, కూచిపూడి నేర్చుకున్నాను. అంతగా కాదు కానీ అవగాహన కోసం కొంత కొంత నేర్చుకున్నా. అయితే కళాకృష్ణ గారు ‘సప్త తాండవాలు’ అని తన ఆధ్వర్యంలో కొత్తగా ప్రదర్శించాలి అనుకొని ఆ కాన్సెప్ట్   డిజైన్ చేశారు. అందులో ఈ అర్ధనారీశ్వరం ఒకటి. దీన్ని ప్రదర్శించడానికి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటినుండీ నాట్యం – లాస్యం, పేరిణి- తాండవం రెండూ చేయడం అలవాటు నాకు. అంటే అటు నవ జనార్దన పారిజాతం, ఇటు భామా కలాపం రెండింటిలో ఆడవేషం వేసేవాన్ని. రెండూ సమానంగా ప్రదర్శిస్తూ ఉండడం, నాకు ఆయన అర్ధనారీశ్వర నృత్యం నేర్పించడానికి ముఖ్య కారణం. ఆయన నన్ను ఎంచుకున్నందుకు, ఇప్పుడు నేను దాన్ని ప్రచారం చేస్తూ ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

అందరికీ తెలిసిన అర్ధనారీశ్వర ప్రదర్శన అంత సులువైంది కాదు. ఒకవైపు లాస్యం, మరోవైపు తాండవం రెండింటినీ ఏక కాలంలో, క్షణాల వ్యవధిలో అభినయం మారుస్తూ, ఇటు పార్వతి, అటు శివుని అనుకరిస్తూ వారి తత్వాన్ని చూపిస్తుండాలి.  మొదటి నుండీ స్త్రీలను గౌరవించడం నా లక్షణం. ముఖ్యంగా ప్రేరణ కలిగించింది ఏంటంటే శివుని తత్వం. ఎందుకంటే స్త్రీ సమానత్వాన్ని చాటుతూ తన శరీరంలోని అర్ధ భాగాన్ని భార్యకిచ్చి ఋజువు చేయడం జరిగింది. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి అద్భుతమైన తత్వాన్ని ప్రదర్శించడం నాకు ఎంతో ఇష్టం. అదే దిశగా వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రదర్శించ డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను. భగవంతుని దయ వలన నా ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి అంతటి స్పందన రావడం, ఆప్రదర్శనలకే ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒక అర్ధనారీశ్వర కళాకారునిగా  గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.

8. మీరు కాక ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?

జ: అర్ధనారీశ్వర  నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వున్నారు. లేరని కాదు. కానీ వేళ్లల్లో లెక్క బెట్టగలిగేంత మంది మాత్రమే వున్నారు. అందులో నాకు బాగా తెలిసినంతవరకు అర్ధనారీశ్వరం వెంకట్ మరియు వెంపటి చినసత్యం గారి అబ్బాయి వాళ్ళిద్దరి అర్ధ నారీశ్వర నృత్యం చూడడం జరిగింది. అయితే వారిద్దరూ కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శిస్తారు. నాది నటరాజ రామకృష్ణ గారి పద్ధతి. అలా ఎందుకంటున్నానంటే ఇందులో సాహిత్యం గానీ జతులు గానీ ఆయన రూపకల్పన చేసినటువంటిది. ఆయన రచించిన ‘ పేరిణి శివతాండవం’ లో ఈ జతులు, సాహిత్యం మనం చూడొచ్చు. ఆయన శిష్యుడిగా ఇదే నేను చేసేది. కాబట్టి ఈ పద్ధతిలో  చేసే వాణ్ణి నేనొక్కడినే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా ఉన్నారా అంటే ఉండొచ్చు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణ్ణి మాత్రం నేనే. కళాకృష్ణ గారు 20 సంవత్సరాల క్రింద ఈ అర్ధ నారీశ్వర నృత్యాన్ని (ఇప్పుడు నేను ప్రదర్శిస్తున్న పద్ధతిలో) లండన్ టెలివిజన్ కోసం రికార్డింగ్ చేయించడం జరిగింది. దాన్నిఆయన లండన్ టెలివిజన్ కోసం ప్రదర్శించి, ఆ రికార్డింగ్ ని, ఆ కాస్ట్యూమ్స్ ని నాకు ఇవ్వడం జరిగింది.అప్పటినుండీ దాన్ని కొనసాగిస్తూ వాటిని ఆయన వారసత్వంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాను.

9. నాట్య శాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఎలాంటివి?

జ: నాట్యం నేర్చుకోవడంతో అనుభవమంటే అదొక ప్రత్యేకమైన మార్గం. మిగిలిన విద్యలు అంటే ఉ:- సంగీతం. దీనికి గొంతు బాగా ఉండి, రాగాలు, తాళాలు, శ్రుతుల పైన పట్టు ఉంటే అద్భుతమైన కళాకారులు అవ్వొచ్చు. కాకపోతే నాట్యానికి అవన్నీ ఉండడంతో పాటుగా ఇటు శరీరాన్ని కూడా సరియైన పద్ధతిలో కదిలిస్తూ ఉండగలగడం, ముద్రలు, అభినయాలు ప్రదర్శించడం చాలా అవసరం. చతుర్విధ అభినయాల్లో ఏ ఒక్కటీ సరిగ్గా లేకున్నా ఆ ప్రదర్శన రక్తి కట్టదు. అందువల్ల ఆ చతుర్విధ అభినయాలు నేర్చుకోవడం వల్ల నాట్యం రాణించడమే కాక మన జీవితంలో ఎన్నింటికో కూడా అది ఉపయోగపడుతుంది. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది. మనం వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా నాట్యంలో ఆహార్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడ, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి అన్నది తెలుస్తుంది. ఇంకొకటి సంస్కారం మెరుగు పడుతుంది. ఒక నాట్యమే కాదు. భారతీయ శాస్త్ర కళలు ఏవైనా అవి సంస్కారాన్ని పెంచుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.లలితకళలే కావొచ్చు, వాయిద్య పరికరాలే కావొచ్చు..ఏదైనా భారతీయ శాస్త్ర కళలు నేర్చుకున్నవారిలో అద్భుతమైన సంస్కారం కనిపిస్తుంది. అది మన భారత శాస్త్రీయ కళల గొప్పదనం. ఇది అభ్యసించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులను నేను కూడా ఎదుర్కొన్నాను. ప్రతీ రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే నేనూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం ఒక్కొక్కసారి అనుకూలించకపోవడం అంటే నాట్యంలో తల నుండి పాదాలదాకా అనుకూలంగా ఉండాలి. అయితేనే మనం ఈ నాట్యాన్ని చక్కగా ప్రదర్శించగలుగుతాం. ఒక్కొక్కసారి కాళ్లు గాని, చేతులు గాని సరిగా పనిచేయకపోవటం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు. అన్నింటినీ తట్టుకోగలగాలి. మన బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి వేదిక మీద ప్రదర్శించే ముందు ప్రేక్షకుల ముందు వాళ్ళని మెప్పించగలిగేలా, వాళ్లకు సంతోషం కలిగించేలాగా మనం మారి ప్రదర్శించాలని నా ఉద్దేశం. మన వ్యక్తిగత సమస్యలు వేదిక మీద చూపించకూడదు. ఒక్కసారి వేదిక మీదకు ఎక్కామంటే కళాకారునిగా మారిపోవాలి. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలగాలి. అప్పుడే ప్రేక్షకులను రక్తి కట్టించగలుగుతాము. అలా చేయడం కోసం ఎన్నోసార్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కాకపోతే అన్నింటిని అధిగమించి ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఇంకా అధిగమించాల్సింది చాలా ఉంది ప్రస్తుతం ఈ స్థాయికి రావడం ఆ భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నాను.

 10. సహజంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో నాట్యం నేర్చుకోవాలంటే ఎలాంటి సాధన అవసరం? పరిపూర్ణ నాట్య కళాకారులు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

జ: పరిపూర్ణమైన నృత్యకారుడవడం అనడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. వాళ్ళు నేర్చుకునే నృత్యాన్ని బట్టి, వాళ్ళ గురువులను బట్టి, వారి శరీర అనుకూలతలను బట్టి అంటే అన్నింటిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కొందరు రెండేళ్లలోనే మంచి కళాకారులుగా ప్రదర్శనలు ఇస్తుంటారు. మరి కొంతమంది అయిదు, పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నా  కూడా ఏదో ప్రదర్శిస్తారు.  కానీ వాళ్ళ ప్రదర్శన అంత రక్తి కట్టించేలాగా ఉండదు. మరి కొంతమంది నేర్చుకోకుండా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే వాళ్లయి ఉంటారు. అంటే ఇది ఒక సమయం అంటూ చెప్పలేము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా.  ఇప్పుడు విద్యారంగంలో మన ఈ కళలు కూడా చేర్చడం వల్ల ఏదైతే మనకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలలో కోర్సులు పెట్టడం జరిగిందో, ఆ కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సు చేయడానికి నాలుగు సంవత్సరాలు, డిప్లొమా కోర్సుకి మరి రెండు సంవత్సరాలు కలిపి మొత్తం ఆరు సంవత్సరాలు సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు సాధించడానికి టైం పడుతుంది. కనుక ఆ ఆరు సంవత్సరాలు శ్రద్ధగా నేర్చుకున్నట్టయితే ఒక మంచి కళాకారుడు అవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.

 10. వాగ్దేవి ఆర్ట్స్ అకాడెమీ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా రూపుదిద్దుకొంది?

జ: నేను సుమారుగా 10 ఏళ్లకు పైగా నాట్యం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న స్కూల్స్ లో,  ఊర్లో కొంతమందికి నాట్యం నేర్పించడం ప్రారంభించాను. నాకు వచ్చినటువంటి విద్యను వాళ్లకు నేర్పించేవాడిని. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ‘కళాపరిచయం’ అని అప్పట్లో ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను ప్రతీ సంవత్సరం అందులో ఎంతో మంది విద్యార్థులకు నృత్యాన్ని పరిచయం చేయడం జరిగింది. అలా అలా స్కూల్స్ లో వార్షికోత్సవాలకు పిల్లల చేత నాట్య ప్రదర్శనలు చేయించేవాడిని. పెళ్లయిన తర్వాత ఆ భగవంతుని దయవలన నా జీవితంలో ప్రవేశించిన నా భార్య కూడా నర్తకి అవ్వడం వలన ఇద్దరము కలిసి వాగ్దేవి అకాడమీ స్థాపించాము. దీని ద్వారా మాకు తెలిసిన ఈ నృత్య కళను పదిమందికీ పంచాలని, అలా ఈ కళను తర్వాతి తరాల వారికి నిలబెట్టాలనే సదాశయంతో దీన్ని స్థాపించి సంతృప్తులమయ్యాము. వాగ్దేవి అని ఎందుకు పెట్టుకున్నాను అంటే ఆ పేరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కావడం, విద్యా దేవత అయిన సరస్వతి పేరు పెట్టుకోవడం వలన ఆ తల్లి అనుగ్రహం మామీద పరిపూర్ణంగా ఉండాలని అకాడె మీకి ఆ పేరు పెట్టడం జరిగింది.

 11. ప్రస్తుతం ఈ అకాడెమీలో ఎంతమంది నాట్యకళను  అభ్యసిస్తున్నారు? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉంది? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు?

 జ:  ఈ అకాడెమీ ద్వారా సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి  అన్ని రంగాలతో పాటు కళా రంగంలో ఉన్న వారిని కూడా చాలా దెబ్బతీసింది.  ప్రదర్శనలకు సరైన అవకాశాలు రాకపోవడం, విద్యార్థులు భయపడి క్లాసులకు రాకపోవడం… ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. కరోనాకి ముందు సుమారు మా దగ్గర 30 నుండి 40 మంది విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ఉండేవారు. కరోనా తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. పదుల సంఖ్యలో ఇప్పుడు విద్యార్థులు రావడం జరుగుతుంది. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అకడమిక్స్ లో ఇంతకుముందు విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. రెండు సంవత్సరాల అకడమిక్స్ దెబ్బ తినడం వలన చిన్న చిన్న స్కూల్స్ నుంచి పేరుపొందిన స్కూల్స్ వరకు చదువు పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయించడం, దాని కోసం పిల్లలను ఎక్కువ సమయం స్కూల్స్ లో ఉండేలా చేయడం, హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటి వాటివల్ల ఆక్టివిటీస్ కి సమయం ఎక్కువ కేటాయించలేకపోవడం వల్ల ఇలాంటి అకాడెమీలకు రావడం తగ్గింది. రాను రాను పరిస్థితులు  మెరుగు పడతాయని అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా మార్పు రావాలి. ఎవరికైతే వీటిపట్ల అవగాహన ఉందో వారే తమ పిల్లల్ని శిక్షణ కోసం పంపిస్తున్నారు.మేము  ప్రైవేట్ గా కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆంధ్రనాట్యం, పేరిణి, కూచిపూడి ఈ మూడు నృత్యాలలో చేయించడం జరుగుతోంది. నేను ప్రస్తుతం శ్రీ భక్త రామదాస ప్రభుత్వ నృత్య కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా పేరిణి అధ్యాపకునిగా పని చేస్తున్నాను. అక్కడ పేరిణి నృత్యానికి సంబంధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి శిక్షణ ఇస్తున్నాను. కళాశాల విద్యార్థులే కావచ్చు అకాడెమీ విద్యార్థులే కావచ్చు. అందరూ కూడా నా ప్రతి ప్రదర్శనలో పాల్గొంటూ మా అకాడెమీ ద్వారా ఇచ్చే ప్రదర్శనలన్నింటిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే వాగ్దేవి ఆర్ట్స్ కేవలం నాట్యం నేర్పించడమే కాక కళా రంగంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి నేర్పించే ఉద్దేశంతో స్థాపించినటువంటిది కాబట్టి మా వంతుగా మా శక్తికి మించి ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది.2019వ సంవత్సరంలో మా సంస్థ తరఫున ‘నర్తన’ అనే చిత్రాన్ని నిర్మించాము. ఆ చిత్రంలో..ఒక నాట్యమే ఆధారంగా జీవిస్తున్న కుటుంబంలో ఉండే ఎమోషన్స్ అంటే ఒక గురువుకి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనివి ఏమిటి? నాట్యం నేర్చుకోవాలనుకునే విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?  అనే ముఖ్యమైన అంశాలే కాకుండా ఒక కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాం. దీనికి ఎంతో గొప్ప గుర్తింపు వచ్చింది ఎవరైతే కొంతమంది గొప్ప పేరు గడించిన నాట్య కళాకారులు ఉన్నారో వారు ఈ చిత్రాన్ని చూసి విశ్వనాథ గారి జోనల్లో చేయడం జరిగిందని మెచ్చుకున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి మీ యొక్క అభిమానాన్ని తెలుపుతారని అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. మా శక్తికి మించి ఈ చిత్రాన్ని నిర్మించాము. ‘నర్తన ఇండిపెండెంట్’ అనే చిత్రం మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను, నా భార్య, నా కూతురు నటించిన ఈ చిత్రంలో నా కూతురుకు తాతగా కళా కృష్ణ గారు నటించడం గొప్ప విషయం.

12. భవిష్యత్తులో ఈ అకాడెమీని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తిలోకి తేవాలనుకుంటున్నారా?

జ: మా అకాడెమీ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అలా పరిమితం చేయాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్తపేటలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ, అలాగే అంబర్ పేటలో నా శ్రీమతి సంధ్య వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ లో క్లాసులు తీసుకుంటుంది. అలాగే నా శిష్యురాలు ఒకరు అమెరికాలో కూడా ఈ అకాడెమీ పేరు మీద నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఇంకా మా శక్తిని బట్టి వీలైనంత మేరకు బ్రాంచ్ లు ఓపెన్ చేసి విస్తృత పరచాలని అనుకుంటున్నాము.

 13. నాట్య కళా ప్రావీణ్యత పొందిన మీకు ఎటువంటి సత్కారాలు లభించాయి? పొందిన పురస్కారాలు ఏవి?

 జ: నాకు ఇప్పటివరకు మంచి గుర్తింపు, గౌరవం నాట్యకుల ద్వారా లభించింది. ‘నాట్య కుమార’ అనే బిరుదు ‘పేరిణి నాట్య రత్నాకర’, ‘యువ కళా రత్న’ మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిభా పురస్కారం నేను పొందడం జరిగింది. ఇంకా అనేక ఇతర సంస్థల నుండి ప్రశంసలు, సన్మానాలు పొందడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా ‘నాట్య శిరోమణి’, ‘యువ కళారత్న’ వంటి అనేక అవార్డులను సన్మానాలను పొందడం జరిగింది. నా కూతురు శ్రీ నర్తన సి.సి.ఆర్.టి స్కాలర్ షిప్ ను పొందింది. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదువుతోంది.

14.రామప్ప దేవాలయం ముందు 1985 ,86 లలో అనుకుంటా… వందమంది కళాకారులు ఒకే వేదికపై ఒక్కసారి పెద్ద నాట్య ప్రదర్శన చేసారు. అప్పుడు మీరు పాల్గొన్నారా? ఆ విశేషాలు ఈనాటి తరానికి తెలియచెప్పండి.

జ. అవును జరిగింది. అప్పుడప్పుడే నేను నటరాజ రామకృష్ణ గారి దగ్గర నృత్య శిక్షణ ప్రారంభించి ఉన్నాను. అప్పుడు కేవలం నా వయసు ఐదు సంవత్సరాలు ఉండడం వలన వారు నన్ను రామప్పలో జరిగిన ఆ కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఆ ప్రదర్శన చూడడం మాత్రమే జరిగింది. అలాగని అవగాహన లేదు అనలేను.  కాకపోతే లీలగా కాస్త గుర్తుంది. ఒక జాతర లాగా వేల మంది ప్రజలు అక్కడికి రావడం, ఆ వేదిక పైన 100 మంది ఒకేసారిగా అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడం, ఒక ముగ్గురు, నలుగురు మార్దంగీకులు మృదంగాన్ని వాయిస్తూ ఉంటే అద్భుతమైన ధ్వని రావడం.. ప్రజలందరిలో ఒక వైబ్రేషన్ కలిగించడం.. ఆ కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటే ప్రకృతి అంతా పులకించి పోవడం.నిజంగా ఆ వయసులో  అంతకుమించి అనుభవం కూడా ఉండదు.  కానీ ఇవన్నీ లీలగా నాకు గుర్తున్న విషయాలు. అప్పటికే ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యకళాకారులు విఠల్ గారు ఆ ప్రదర్శనలో పాల్గొనడం గుర్తుంది. అప్పుడు నటరాజ రామకృష్ణ గారి వద్ద ఉన్న శిష్యుల్లో నేను చిన్నవాడిని కనుక అందరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు.

15. భరత నాట్య రీతుల్లో ఏవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి?

జ: భారత శాస్త్రీయ నృత్యాల్లో అంటే క్లాసికల్ డాన్స్ అనగానే మన భారత దేశంలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సి, కథాకళి, మోహినీ ఆట్టం ముందుగా గుర్తొస్తాయి. అయితే ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా గుర్తింపు లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. వాటిలో పేరిణి ఒకటి, ఆంధ్రనాట్యం కూడా ఒకటి. గుర్తింపు ఉన్నప్పటికీ సంగీత నాటక అకాడెమీ గుర్తింపు కోసం మేము మా శాయ శక్తులా కృషి చేస్తున్నాము. అలాగే పేరిణి నాట్యానికి కూడా మంచి గుర్తింపు వచ్చి సంగీత నాటక అకాడెమీల ద్వారా గుర్తింపు పొంది భావితరాల వారికి భారత శాస్త్రీయ నృత్యాల్లో ఇవి కూడా చేర్పించి మంచి స్థానాన్ని పొందే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఒక శుభకరమైన విషయం ఏంటంటే ఇటీవల సంగీత నాటక అకాడమీ ఇచ్చేటువంటి యువపురస్కారాలు ఏవైతే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఇస్తున్నారో, తొలిసారిగా పేరిణి నాట్యానికి గాను రాజ్ కుమార్ గారికి ఆ పురస్కారం రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒకసారి ఇచ్చారంటే దానిని గుర్తించారనే కదా!  అలాగే ఇంకా  ఎన్నో పురస్కారాలు పేరిణి కళాకారులకు రావాలని ఆశిస్తూ అలాగే కళాకారులతో పాటుగా నాట్యానికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.

16. మీరు ప్రదర్శించే నాట్యంలో కొత్త విధానాలను ఏమైనా ప్రవేశపెట్టాలనుకుంటున్నారా ?

జ: పేరిణి నృత్యం లో మూడు నూతన అంశాలను గురువు కళా కృష్ణ గారి నేతృత్వంలో నేను, నా శ్రీమతి కలిసి రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో సప్త తాళ రాగ స్వర నర్తన ఒకటి. అలాగే హంసగతి రెండవది. మూడవది సూర్య నమస్కారాలు. ఈ మూడు అంశాలని మేము కొత్త రీతులుగా మా విద్యార్థులకు నేర్పించి, ప్రదర్శిస్తున్నాం. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి అంటే పిల్లలకు ఇతరములైన వాటి పట్ల సమయం చాలా తక్కువ అయింది. అకడమిక్స్ వైపు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వేరే శిక్షణకు సమయం లేకుండా పోయింది. కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందే విధంగా, యోగాభ్యాసం ముందు తరాలకు తెలిసే విధంగా, నాట్య రూపంలో మేము యోగాలో ఉపయోగించే సూర్యనమస్కారాలను నృత్య సంప్రదాయాల్లో చేయాలనుకున్నాం. సహజంగా యోగాలో సూర్య నమస్కారాలకి రాగం,తాళం,లయ ఉపయోగించరు. మేము అలా కాకుండా ఐదు గతులలో,జతులతో సహితంగా ఈ సూర్య నమస్కారాలను మిళితం చేసి ఈ అంశాన్ని రూపకల్పన చేశాము. అలాగే సంగీతంలో గాని, నాట్యంలో గాని ఒకే అంశంలో లేదా ఒక కీర్తనలో లేదా ఒక జావళిలో గాని ఏడు తాళాలను ఉపయోగించడం చాలా అరుదు. అలా మేము ఒకే అంశంలో సప్తతాళాలని ఉపయోగించి, వాటికి అనుకూలమైన ఏడు రాగాలని తీసుకొని వాటికి సంబంధించిన స్వరాలు, ఆ తాళాలకు సంబంధించిన జతులను రూపకల్పన చేసి దానిని ప్రదర్శించడం జరిగింది. ఇక మూడవ అంశం హంసగతి .దీనిలో పేరిణి పంచాంగాలుగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భావాశ్రయమంటే అనుకరణ. మనుషుల లాగా కాకుండా జంతువులుగా పక్షులుగా అనుకరించడం అనేది భావాశ్రయం ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హంస బ్రహ్మ లోకంలో సరస్వతి అమ్మవారు అద్భుతంగా వీణను వాయిస్తూ ఉంటే ఆ వచ్చే నాదాన్ని విని మైమరచి ఒక నర్తకి గా మారి ఆ వీణా నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తే ఎలా ఉంటుందన్న  ఒక కాన్సెప్ట్ తీసుకొని హంసగతి అన్న అంశాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూడు నృత్యంశాలు కూడా మాకు మంచి గుర్తింపును తెచ్చాయి. దీనిని తిలకించిన కళాకారులందరూ ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది ఇంకా దీన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.

17. ఆరోగ్య పరమైన విధానంలో ఈ నాట్యకళ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ వయసు నుండి ఈ కళను అభ్యసిస్తే బాగుంటుందో చెప్పండి.?

జ: మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యం కోసమని జిమ్ అని, యోగా అని, మెడిటేషన్ అని రకరకాల వ్యాయామ శాలలకు, ధ్యాన కేంద్రాలకు వెళ్తున్నారు. అంటే మనం మన ఆరోగ్యం కోసం మనకు మనం చేసుకునే వాటిని కాకుండా ఇతరులపై ఆధారపడుతున్నాం. ఇక నాట్యం విషయానికొస్తే అది ఏదో చూసి ఆనందించే కళ కాదు. దీని ద్వారా శరీరమే కాకుండా మానసిక దృఢత్వం కలుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిరకాల వయస్సుల వారికి మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఎలాగంటే క్షణాల్లో హావభావాలను ఒలికించడానికి, కళ్ళు, చేతులు, తిప్పడం, అనుగుణంగా అడుగులను వేయడం.. వీటివల్ల ధ్యాస అంతా అక్కడే ఉంచాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక కళను నేర్చుకున్నవారికి,

లేనివారికి జీవన విధాన శైలిలో చాలా తేడా మనం గమనించవచ్చు. సభ్యత, సంస్కారం, వినయం, మాటతీరు, అణకువ ఇవన్నీ కళతోటే కళాకారునికిఅబ్బుతాయి. అది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక వయసు అంటారా! ఐదేళ్ళ వయసు నుండి నేర్పడం మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే

ఆ వయసులో మనం చెప్పే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే వీలు ఉంటుంది.

18.  ప్రస్తుత సమాజంలో లలితకళల పట్ల ఉన్న ఆదరణ ఎలాంటిది?

జ: ప్రస్తుత సమాజంలో లలిత కళల పట్ల ఆదరణ బాగానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక కాలచక్రం అంతే. కొంతకాలం కొన్ని నడుస్తాయి. అవి పోయి మళ్ళీ పాతవి ముందుకు వస్తాయి. తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం. మొన్నటిదాకా మనం చూసాము విదేశీ సంస్కృతికి బాగా అలవాటు పడి మళ్ళీ మన శాస్త్రీయ కళల పట్ల ,మొగ్గు చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రీయ కళా ప్రదర్శనలు పెరుగుతూ వస్తున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు వాటిలో శిక్షణ ఇప్పించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా శాస్త్రీయ నృత్యాలలో శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ కళలను నేర్చుకునే దిశగా ముందుకు వస్తున్నారు మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా భారత దేశ శాస్త్రీయ నృత్య సంగీత సంప్రదాయాలకి ఆదరణ చాలా ఉంది. మనం దాని నిలబెట్టుకొని ఇంకా ముందుకు వెళ్లాలి. నేను తల్లిదండ్రులందరినీ కోరుకునేది ఒక్కటే. మీ ఇంట్లో ఉన్న  ప్రతి చిన్నారికి ఏదో ఒకటి.. సంగీతమైనా, నృత్యమైనా ఏదో ఒక భారత శాస్త్రీయ కళని నేర్పించి, ముందు తరాల వారు ప్రపంచవ్యాప్తంగా  ప్రచారం చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను

19. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళలు నేర్చుకునేవారికి భవిష్యత్తు వుందంటారా?

జ: తప్పకుండా ఉందని చెప్పగలను. ప్రభుత్వం కూడా శాస్త్రీయ కళల అభివృద్ధికి దోహదం చేస్తోంది. కాకపోతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా కళాకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం, అవార్డులను ఇప్పించడం, గుర్తింపు తేవడం,  ఆర్థికంగా సహాయం చేయడం,  తెలుగు యూనివర్సిటీ నుండి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేక సంస్థల నుండి కావచ్చు,కళాశాలల్లో కోర్సుల రూపంలో పి. హెచ్.డి ల వరకు పరీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నాయి. వీటి ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థి దానిని నమ్ముకుని ముందుకు వెళ్తే గనుక భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. అవకాశాలు కచ్చితంగా లభిస్తాయి. ఎంతోమంది కళాకారులు అదే ఉపాధిగా మంచి స్థాయిలో జీవితాలను గడుపుతున్నారు. దానికి నేను కూడా ఒక సరియైన ఉదాహరణగా చెప్పవచ్చు. నేను నా శ్రీమతి కేవలం నాట్యాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళం. నేను ఆంధ్ర నాట్యంలో డిప్లొమా పూర్తి చేయడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శ్రీ సత్య సాయి విద్యా విహార్ డి.డి కాలనీలో ఉన్న స్కూల్లో గత 15 సంవత్సరాలుగా నాట్యం నేర్పిస్తూ డాన్స్ టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఒక మంచి స్థానాన్నిచ్చి పర్మినెంట్ చేయడం జరిగింది. స్కూల్లో మంచి గుర్తింపు లభించింది. నేను కూడా ఒక నర్తకుడిగా, గురువుగా మంచి గుర్తింపు పొందాను మా కుటుంబం అంతా ఆ కళామతల్లి సేవలో ముందుకెళ్తున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో ఇక ముందు కళాకారులు, కళాభిమానులు కూడా మమ్మల్ని ఇంకా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

20. మీరు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మీ కాస్ట్యూమ్స్ మీరే తయారుచేసుకుంటారని, మేకప్ కూడా మీరే వేసుకుంటారని విన్నాం… నిజమేనా? దానికి సమయం కుదురుతుందా?

జ: (నవ్వుతూ) అవునండీ.. మీరు విన్నది నిజమే.. నేను నాట్యంలోనే కాక, ఫ్యాషన్ డిజైనింగ్ లో లకోటియా సంస్థ నుండి పి.జి.డిప్లొమా చేసాను. అందువల్ల నా ప్రదర్శనలకు మొత్తం నేనే డిజైన్ చేసి,  తయారుచేసుకుంటా..ప్రస్తుతం దుస్తుల మీద వేసే అనేకరకాల డిజైన్ లను నేను వేయగలుగుతాను. సమయం అంటారా…తప్పదు..వీలు చేసుకుంటా.. మేకప్ కూడా మా టీమ్ లో నాతో సహా దాదాపుగా అందరికీ నేనే వేస్తా..ఇతరులతో చేయించడం ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు అంతే…

21. చివరగా మీరు సమాజానికి చెప్పదలచుకొన్న సందేశం ఏమిటి?

జ: సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ప్రపంచమంతా ఎంతో గౌరవించే మన భారత శాస్త్రీయ కళలని మనం చిన్న చూపు చూడకుండా మన చిన్నారులందరికీ నేర్పిస్తూ, దాన్ని గౌరవిస్తూ మనం ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్తే ప్రపంచంలో అంత గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. దయచేసి దీనిని అందరూ గమనించి కళల యొక్క అభివృద్ధికి మీరందరూ దోహదపడతారని, కళాకారులను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుండే కావచ్చు ప్రైవేట్ సంస్థల నుండి కావచ్చు. అటు అభిమానులు, కళా పోషకులు,కళారాధకులు ఇటువంటి నృత్య ప్రదర్శనలను, కళాకారులను ప్రోత్సహించడానికి ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు..

ధన్యవాదాలు పవన్ కుమార్ గారు..మీ నాట్యప్రస్థానం గురించి, మీ గురించి ఎన్నో విషయాలను ఓపికగా మాతో పంచుకున్నందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము…నమస్కారాలు.

March 18, 2023 1 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us