Home కవితలు నీవెక్కడ నేనెక్కడ!!

నీవెక్కడ నేనెక్కడ!!

by ChittiProlu Venkata Ratnam

నా జీవన మాధుర్యం నీవు
నీ మనుగడ లోని చేదు నేను

నా అశాంతి కుపశాంతివి నీవు
నీ హృదయాని కశాంతిని నేను

నా అలపున విశ్రాంతివి నీవు
నీకొక తీరని అలసట నేను

నను నిమిరే అతిమృదులత నీవు
నేను కసిరే మతికఠినత నేను

తల్లివి, చెల్లివి, మల్లివి నీవు
కల్లను, పొల్లును, డొల్లను నేను

నా స్వేచ్ఛకు చలనానివి నీవు
నిను కట్టే శృంఖలాన్ని నేను

దీనమైన ధీరురాలు నీవు
ధీమాగల దీనుణ్ణి నేను

నా కాలంబన బలిమివి నీవు
నీ కాలంబన భంగిమ నేను

నను నిలిపిన మహాకరుణ నీవు
నిను నలిపిన మృషాచరిత నేను

కాలం ప్రేమకు పాత్రవు నీవు
కాల క్రుద్ధనేత్రాన్ని నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా

ప్రథితోన్నత హిమశైలం నీవు
వట్టిరాళ్ల చిరుగుట్టను నేను

తలెత్తి చూసేందుకసలు తరం గాని ఎత్తు నీవు
చూడలేక నీ తల వేలాడించే జిత్తు నేను

మహావ్యక్తి! మహామూర్తి! మహిళా ఓ మహిళా!
నీవెక్కడ నేనెక్కడ! భావిస్తే ఇలా ఇలా

You may also like

1 comment

రావి రంగారావు గుంటూరు June 7, 2024 - 4:18 am

బాగుంది

Reply

Leave a Reply to రావి రంగారావు గుంటూరు Cancel Reply