Home బాల‌సాహిత్యం శ్రవణ్‌ కుమార్‌

”శ్రవణ్‌ కుమార్‌ ఎవరు?” అని సుమన్‌ అడిగాడు, ఎప్పటిలా ఆగలేక. ఆ రాత్రి తాతగారు కథను చెప్పడం ప్రారంభించారు.

శ్రవణ్‌ కుమార్‌ ఒక బ్రాహ్మణ అబ్బాయి. అతని తల్లిదండ్రులు చాలా ముసలి వాళ్ళు, ఇద్దరూ గ్రుడ్డివారు. వారికి ఒక్కడే కుమారుడు శ్రవణ్‌ కుమార్‌. అతను చాలా ఓపికతో తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. తన తల్లిదండ్రులను చాలా భక్తి, ప్రేమతో చూసేవాడు. వారు కూడా అతని గురించి గర్వంగా ఉండేవారు.

ఒకరోజు శ్రవణ్‌ కుమార్‌ తన తల్లిదండ్రులు మాట్లాడుకోవడం విన్నాడు.

”ఓహ్‌ా, నేను బనారస్‌ మరియు పుణ్యక్షేత్రాలు ఎలా వెళ్ళగలను” అని తల్లి అన్నది. ”అవును అది మాకు అసంభవమైన కథ”.

మనకు శ్రవణ్‌ కుమార్‌ వంటి కొడుకు ఉండటం మన అదృష్టం. అతను మనల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. మన కోరికల్ని అతని మీద మోపి అతనికి భారం కాకూడదని తండ్రి సౌమ్యంగా సమాధానం ఇచ్చాడు.

శ్రవణ్‌ కుమార్‌ తన తల్లిదండ్రుల కోరిక ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. దూర ప్రయాణానికి అన్నీ సమకూర్చడం మొదలెట్టాడు. అతను వాళ్ళకు యాత్రలకు తీసుకుని పోగలడు. వారిని తన భుజాల మీద మోసుకుపోగల బలిష్టుడు శ్రవణ్‌ కుమార్‌. అతను వెదురుతో రెండు బుట్టలు తయారు చేసాడు. వాటిని ఒక కర్రకు అటూ ఇటూ కట్టాడు. తల్లిదండ్రులను చెరొక బుట్టలో కూర్చోబెట్టాడు. ఆ కఱ్ఱను తన విశాలమైన భుజాల మీద ఎత్తుకుని బయలుదేరాడు. (దీన్ని మనం కావడి అంటాం.)

శ్రవణ్‌ కుమార్‌ తన తల్లిదండ్రులను మోసుకుంటూ చాలారోజులు ప్రయాణం చేశాడు. అతను అడవులు, పర్వతాలు, గ్రామాలు, పట్టణాలను దాటి నడిచాడు. అతను అలసిపోయేంతవరకు ఆగకుండా నడిచాడు. అతను తన తల్లిదండ్రులను దింపి వారికి తినేందుకు ఏమైనా తేవాలనుకున్నాడు. ఆ అడవిలో తినేందుకు పండ్లు, దుంపలు ఉన్నాయి. రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత శ్రవణ్‌ కుమార్‌ మళ్ళీ తల్లిదండ్రులతో సహా కర్రను లేపి మళ్ళీ నడక ప్రారంభించాడు.

వారు దారిలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. అలా వారు అయోధ్య చేరుకున్నారు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. వారు అయోధ్య దగ్గరి అడవిని దాటుతునానరు. అతని తల్లిదండ్రులు దాహంతో తాగేందుకు నీళ్ళు అడిగారు. అతను వెంటనే వారిని జాగ్రత్తగా ఒక చెట్టునీడలో దింపి నీళ్లను వెతుక్కుంటూ వెళ్ళాడు.

అక్కడ అయోధ్యను పాలిస్తున్న థరథ మహారాజు ఆ అడవిలో వేటకు వచ్చాడు. అతను ఉదయం నుండి వేటకు తిరుగుతున్నాడు కానీ, ఏ జంతువు కూడా కనబడలేదు. ఆయన గొప్ప విలుకాడు. అతని వేట సామర్థ్యంపై విల్లు, బాణం కూడా ఎంతో గర్వపడేవి. వేటకోసం వెళుతూ తన పరివారాన్ని దాటి చాలాముందుకు వెళ్ళి ఒక్కడే అయినాడు.

శ్రవణ్‌ కుమార్‌ ఈలోపు సరయూనది యొక్క చిన్న కాలువను చూసాడు. అతను తన కుండలో నీళ్ళు నింపుకుంటున్నాడు. అక్కడికి దగ్గరలో వున్న థరథ మహారాజుకు నీళ్ళ శబ్దం విన్నాడు. ఆ ధ్వని వస్తున్న వైపుకు బాణం వేసాడు. వెంటనే ఒక మనిషి నొప్పితో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినబడింది. ఆ రాజు భయపడి ఆవైపు వేగంగా వెళ్ళాడు. ఆయన భయం నిజమైంది. అతను శరీరంలో గుచ్చుకున్న బాణంతో రక్తంలో పడి ఉన్నతన్ని చూసాడు.

”అయ్యో నేనెంత పని చేశాను? ఓ దేవుడా, నేనేమి చేశాను?” అని థరథ మహారాజు ఆ యువకున్ని తన ఒడిలోకి తీసుకుని తాగేందుకు నీళ్ళు ఇచ్చాడు. ఆ యువకుడు గాయపడి, కొద్దిపాటి ధ్యాసతో ఉన్నాడు.

”కుమారా, నీవెవరు? ఎక్కడినుండి వచ్చావు? త్వరగా చెప్పు, నేను నీ బాధ్యతను తీసుకుంటాను” అని ఎంతో విచారంగా అడిగాడు రాజు. దయతో నన్ను క్షమించు, నేను వేటకు వచ్చాను. ఈ అడవిలో ఎవరూ ఉండరనుకున్నాను. నేను థరథ మహారాజును, ఇప్పుడు నిన్ను నాతో తీసుకపోగలను.

నొప్పిలో కూడా శ్రవణ్‌ కుమార్‌ చిరునవ్వు నవ్వాడు. అతి కష్టంగా ”ఓ థరథ మహారాజా, మిమ్ముల చూడటం నాకు సంతోషం. మీ గురించి గొప్పగా విన్నాను. నేను మీరు తప్పు చేశారని అనుకోవడం లేదు. నాకు తెలుసు అది ఒక పొరపాటు. నా బాధ ఒకటే. అది నా తల్లిదండ్రులను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. ఇద్దరు గుడ్డివారు, వృద్ధులు. నేను వాళ్ళను యాత్రలకు తీసుకెళ్తున్నాను”

ఆ మహారాజు ఇది విని ఇంకా ఎక్కువ బాధపడినాడు. అతను తన చుట్టూ చూశాడు. మనుషుల జాడ కనపడలేదు.  ఆ రాజు ఆ అడవిలో శ్రవణ్‌ కుమార్‌ కు సహాయపడేందుకు ఎవరూ లేనందున నిస్సహాయుడయ్యాడు.

”కుమారా, చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు” అని అడిగాడు.

ఎంతో ప్రయత్నంతో శ్రవణ్‌ కుమార్‌ తల్లిదండ్రులను కూర్చోబెట్టిన వైపు చూపాడు. అతను  చాలా నొప్పితో ఉన్నాడు. ”నీ తల్లిదండ్రుల గురించి బాధపడకు” థరథ మహారాజు అన్నాడు. ఇప్పటి నుండి వారి సంరక్షణ నేను చూసుకుంటాను. నేను వారి బాగోగులు నీ స్థానంలో ఉండి చూసుకుంటాను. శ్రవణ్‌ కుమార్‌ చూపిన వైపుకు గాయపడిన ఆయనను రాజు తన చేతులపై మోసుకుంటూ వెళ్ళాడు.

రాజు మాటలు విని తృప్తి చెందాడు. శ్రవణ్‌ కుమార్‌ రెండుచేతులు ఎత్తి రాజుకు నమస్కరించాడు. రాజు తన తల్లిదండ్రులను చూసుకుంటాడని తృప్తి చెంది, ప్రశాంతంగా శ్రవణ్‌ కుమారుడు చివరి శ్వాస విడిచాడు.

ఈలోపు శ్రవణ్‌ కుమార్‌ తల్లిదండ్రులు కుమారుని కోసం వేచి చూస్తున్నారు. ఇద్దరు గ్రుడ్డివాళ్ళు, తెలియని చోటు కాబట్టి కుమారుని కొరకు ఎటువైపుకు వెళ్ళాలో తెలియడం లేదు. ఒకరినొకరు పట్టుకుని శ్రవణ్‌ కుమార్‌ ను ఎన్నోసార్లు పిలిచారు. కానీ ఏ జవాబు రాలేదు. వారి అబ్బాయికి ఏదో ప్రమాదం జరిగి వుండవచ్చని భయపడ్డారు. కొన్ని నీళ్ళు తెచ్చేందుకు ఇంత సమయం పట్టదు.

థరథ మహారాజు వారి ఎదురుగా వచ్చేవరకు తమ కుమారున్ని పిలుస్తూ ఉన్నారు. అడుగుల చప్పుడు విని తల్లి ”ఇది నీవేనా నా అబ్బాయి? నీకు ఇంత సమయం ఎందుకయ్యింది. అక్కడ జవాబు లేదు. ”మేము భయపడుతున్నాము” దానికీ సమాధానం లేదు. అడుగుల చప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు అది వారి కుమారుడు కాదని గ్రహించారు. ఏదో తప్పు జరిగిందని గ్రహించారు.

”ఆగు అక్కడ!” శ్రవణ్‌ కుమార్‌ తండ్రి అరిచాడు. ”నీవెవరవు? శ్రవణ్‌ కుమార్‌ ఎక్కడ?”

థరథ మహారాజు తెలియకుండా తాను చేసిన పనికి మానసిక క్షోభ పడ్డాడు. వారి కుమారుని మరణం గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదతనికి. కళ్ళల్లో నీరుతో ఆయన మర్యాదపూర్వకంగా ”నాన్నగారు, నేను అయోధ్య రాజు థరథుడను. నా వద్ద మీకొక దుర్వార్త ఉన్నది. దయచేసి కూర్చోండి వార్త వినేముందు. ఇది మీ కుమారుని గురించి”.

”ఏమంటున్నావు? మా కుమారున్ని ఏం చేశావు?” ఇద్దరూ భయంతో అడిగారు.

థరథ మహారాజు ముందుకు అడుగేసి మర్యాదగా శ్రవణ్‌ కుమార్‌ శరీరాన్ని వారి ముందు ఉంచాడు. ఆ రాజు శ్రవణ్‌ కుమార్‌ తల్లిదండ్రుల పాదాలపై పడి ”నాన్నగారు, అమ్మగారు దయచేసి మొదట నేను చెప్పేది వనండి. తర్వాత మీ ఇష్టమొచ్చినట్లు చేయవచ్చు. ఏం జరిగిందో నన్ను చెప్పనీయండి”.

అతను వారిని చెట్టునీడకు తీసుకపోయి కూర్చోబెట్టాడు. నేను ఈ అడవిలో వేటకు వచ్చాను. నీటి శబ్దం విన్నానో….” అతను మొదలు పెట్టి, వారికి జరిగినదంతా వివరించాడు.

”మా అబ్బాయి, నా కుమారుడు ఎక్కడ?” శ్రవణ్‌ కుమార్‌ తండ్రి అడిగాడు.

”ఒక తప్పు జరిగింది. అది తెలియక చేసినప్పటికీ, దయచేసి నా జీవితాంతం మీ సేవ చేయనీయండి” అని థరథ మహారాజు అన్నాడు.

”ఓ రాజా, నీకు క్షమాపణ లేదు. నీ అశ్రద్ధ ఒక్కడిని తీసుకోలేను. కానీ ముగ్గురు ప్రాణాల్ని. మేము సంపూర్ణంగా మా కుమారునిపై ఆధారపడి ఉన్నాము. అతను లేకుండా మేము చచ్చినవారితో సమానం. ఓ రాజువై నీ బాధ్యత మనుషులను, జంతువులను రక్షించుట నీ కర్తవ్యం. దానికి బదులుగా నీవు అమాయక జంతువులను నీ వినోదం కోసం చంపుతున్నావు. అవి నీకు ఏం హాని చేశాయని వాటిని నీవు చంపుతున్నావు?”

ఆ వృద్ధుని మాటలు రాజు కండ్లు తెరిపించాయి. అతను ఇకముందు ఎప్పుడూ జంతువులను వేటాడనని ఒట్టు పెట్టుకున్నాడు. ”దయతో నన్ను ఆశీర్వదించండి” అని రాజు థరథుడు అన్నాడు.

నీవు ఏమి చేసినా, మా అబ్బాయిని బతికించగలవా? అతను మా ప్రాణాలకు ధనాగారం నీకు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుండి మమ్మల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసా? అతని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. ఓ రాజా, నీవు కూడా.

మీరు అనేది నేను ఒప్పుకుంటాను, ఎవరు కూడా శ్రవణ్‌ కుమార్‌ లా ఉండరు. అతను నిజంగా కర్తవ్యపాలకుడు మరియు బాగా ఇష్టపడే కుమారుడు. మరియు అతను అందుకు ఎప్పుడూ గుర్తుకుంటాడు” అని రాజు అన్నాడు.

దయచేసి నన్ను మిమ్మల్ని చూసుకోనీయండి. నేను మిమ్ముల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీ శ్రవణ్‌ కుమార్‌ కు మాటిచ్చాను”

”ఓ రాజా, మా కుమారున్ని పోగొట్టుకున్నాక మేము బతకడం వ్యర్థం? ఈ వయసులో మా అబ్బాయిని తీసేసుకున్నావు. నీవు కూడా ఇదే మాదిరిగా నీ పిల్లలు ఎవరూ నీ సంరక్షణకు దగ్గర లేనప్పుడు చనిపోతావు” అని శ్రవణ్‌ కుమార్‌ తండ్రి శపించాడు. మేము ఇప్పుడు పడుతున్న బాధ నీవు అప్పుడు అర్థమవుతుంది”

భరించలేని బాధతో శ్రవణ్‌ కుమారుని తల్లిదండ్రులు చనిపోయి తమ కుమారుని శవం పక్కనే పడిపోయారు.

థరథ మహారాజు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. అతను శ్రవణ్‌ కుమార్‌, అతని తల్లిదండ్రుల అంత్యక్రియల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంతలో రాజు మనుషులు అతన్ని కలిశారు. వారు కూడా ఆ దురదృష్ట సంఘటన గురించి బాధపడినారు. తర్వాత వేటకు వెళ్ళిన అందరూ అయోధ్యకు తిరిగి చేరుకున్నారు. థరథ మహారాజు ఎంతో నిరుత్సాహంతో, విచారంతో దేనిపై ఆసక్తి లేకుండా ఉన్నాడు. అతన్ని శ్రవణ్‌ కుమార్‌ మరణం బాధిస్తుంది. ప్రజా సేవ కూడా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది.

అనుకున్నట్లే శ్రవణ్‌ కుమార్‌ తల్లిదండ్రుల శాపం కార్యరూపం ధరించింది. అతని చివరి రోజుల్లో థరథుని కుమారులు ఎవరూ అతనితో లేరు. రాముడు మరియు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళారు. భరతుడు మరియు శత్రఘ్నుడు కూడా అతని మరణ సమయంలో అతనితో లేరు.

చివరికి రామా రామా అంటూ బాధతో ప్రాణాలు వదిలాడు థరథ మహారాజు.

ఈరోజు కూడా తల్లిదండ్రులపై చూపిన ప్రేమ మరియు చేసిన సేవ గురించి శ్రవణ్‌ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటారు.

You may also like

Leave a Comment