Home ఇంద్రధనుస్సు పెండ్యాల రాఘవరావు జీవితంపై ‘ది ఫర్గాటెన్ మావెరిక్’ పుస్తకావిష్కరణ సభ

పెండ్యాల రాఘవరావు జీవితంపై ‘ది ఫర్గాటెన్ మావెరిక్’ పుస్తకావిష్కరణ సభ

by mayuukha

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, వరంగల్ జిల్లా తొలి ఎం.పి..1952–1957, పెండ్యాల రాఘవరావు జీవితం ఆధారంగా మను నెల్లుట్ల రచించిన “The Forgotten Maverick” (A Biographical Fiction) పుస్తకావిష్కరణ సభ ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సోమాజిగూడ, హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించనున్నారు.
ఈ పుస్తకాన్ని వరంగల్ జిల్లా ఎంపీ శ్రీమతి కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించనున్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి , తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట రమణ గౌరవ అతిథులుగా, కాళోజి అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి సభకు అధ్యక్షత వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పెండ్యాల శ్రీకృష్ణదేవరావు, ప్రెస్ అకాడమీ పూర్వ చైర్మన్ దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు, వీక్షణం ఎడిటర్ నెల్లుట్ల వేణుగోపాల్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాలకుర్తి దినకర్ పాల్గొననున్న ఈ సభకు అందర్నీ ఆహ్వానిస్తున్నారు –
పెండ్యాల రాఘవరావు కుమారులు డాక్టర్ శ్యామ్ సుందర్ రావు, పెండ్యాల విజయ రామారావు, పెండ్యాల రామచంద్రరావు; కుమార్తెలు నెల్లుట్ల ఇంద్రాణి, కొండపల్లి నీహారిణి.

You may also like

Leave a Comment