కవితలు నా విధి by Tummala Ankita September 28, 2026 written by Tummala Ankita నన్ను బీడి అంటారు.కొంత మంది చుట్ట అంటారు.ఇంకా కొంత మంది సిగరెట్ అంటారు.ఎవరు ఎన్ని విధాలుగా పిలుచుకున్నా,నా విధి మాత్రం ఒక్కటే. ఆరోగ్యవంతుని శరీరంలోకి చేరి,అనారోగ్యంగా మారుస్తా. పెళ్ళాం మాట విని నన్ను వదిలేస్తే ఆదాయం వస్తుంది,నేనే కావాలనుకుంటే అపాయం వస్తుంది. పిల్లల ముఖం చూసి నన్ను పీల్చకుండా ఉంటావో, నన్ను చూసి నీ ముఖం మల్చుకుంటావో నీ ఇష్టం. ధనవంతుడు ఎంత బలవంతుడో చూపించాలని నన్ను కాల్చిన,నేను మాత్రం తనను కాలుస్తూ బలహిణుణ్ణి చేస్తా. బీదవాడిని నేను బీడినే పట్టి పొగా ఊదుతా అంటే, నేనేం చేస్తా తన ఊపిరినే ఊదేస్థా. నాకు అంతం ఉందనుకుంటారేమో.ఈ మానవులు నన్ను మరుగున పడనిస్తారా? ఆకలికి అన్నం ఎలాగో,అన్నింటికి నేను అలాగే. ప్రతి రోజు నేనే కావాలి,ప్రతి పూట నేనే కావాలి,ప్రతి చోటా నేనే కావాలి. నన్ను ఆదిలోనే అంతం చేయకుంటే,నేను చితిలోన తోడునవుతా. September 28, 2026 2 comments 3 FacebookTwitterPinterestEmail