ఏ వారం లేని వారమండి
మేము ఆడవారమండి
మాకు తిధి వార మాసాలు లేవండి
అన్ని వారాలు మావే నండి విరామం అంటూ ఎరుగని వారమండి
జీతం లేని పని వారమండి సంవత్సరమంతా మా పరివారమే నండి
ఎన్నో కలలకు ఎన్నో కళలకు సాకారమండి
జీవిత గమనం గమ్యం మేమే నండి
నిస్వార్ధ ప్రేమకు నిదర్శనం అండి అన్నింటికీ అంకురం మేమే నండి
జీవనయానంలో ఎన్నో సౌరభాలు వెదజల్లే సుమాలమండి
ఆడపిల్ల నుండి ఈడపిల్ల వరకు ఎవరూ కనలేని మనస్కుల మండి
అదేనండి…
మేము ఆడవారమండి …
“ఏదో అభిమానమండి”!!
