చంద్రకళ దీకొండ
చంద్రకళ దీకొండ
దీకొండ, స్కూల్ అసిస్టెంట్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. చరవాణి : 9381361384 నా పరిచయం పేరు:చంద్రకళ.దీకొండ, బి.ఎస్.సి.,బి.ఎడ్.,ఎం.ఎ.(తెలుగు), స్కూల్ అసిస్టెంట్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. చరవాణి:9381361384 హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాను. జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా ప్రభుత్వ పాఠశాలలలో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలను నిర్వహించాను. పేరడీ గేయాలు,నాటికలు వంటివి రచించి..విద్యార్థులతో, సహ ఉపాధ్యాయినిలతో కలిసి పాఠశాల కార్యక్రమంలో ప్రదర్శించాను. సైన్స్ ఫేర్ లలో, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలోవిద్యార్థులను పాల్గొనేలా శిక్షణనిచ్చి, బహుమతులను, జ్ఞాపికలను అందుకున్నాను. సాహిత్య ప్రస్థానం :- రెండు జాతీయ స్థాయి పొటీలలో ప్రథమ,ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను. చాలా కవితా సంకలనాలలోనూ, పలు ప్రముఖ అంతర్జాల , వారపత్రికలలోనూ నా కవితలు ఎన్నో ప్రచురించబడ్డాయి. .విహంగ,భూమిక,తరుణి,*మానవి, మనోహరి వంటి మహిళా ప్రత్యేక పత్రికలలోనూ నా కవితలు ప్రచురించారు. వివిధ సాహితీ సమూహాలు నిర్వహించిన కవితా పోటీలలో పలుమార్లు విజేతగా నిలిచి నగదు బహుమతులు, జ్ఞాపికలు,బిరుదులు , ప్రశంసాపత్రాలనూ అందుకున్నాను. నా ముద్రిత రచనలు:- 1."సున్నిత చంద్రికలు" అనే లఘుకవితా ప్రక్రియలో రచించబడిన 250 కవితల కవితా సంపుటి ప్రచురించాను. 2.రోజుకొకటి చొప్పున సాహితీ సమూహంలో వ్రాసిన శత వచన కవితా సంపుటి సాహితీ చంద్రికలు , 3.వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురించబడిన 125 పైగా స్వీయ వచన కవితలను కలిపి సంపుటి కవితా చంద్రికలు ప్రచురించాను . బహుమతులు, ప్రశంసా పత్రాలు:- తానా వారు అమృతోత్సవ్ సందర్భంగా నిర్వహించిన గేయ,కవితల పొటీలలో ఎంపిక కాబడి, కవి సమ్మేళనంలో పాల్గొని,ప్రశంసాపత్రాలను అందుకున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూడు సార్లు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒకసారి నమోదు అయ్యాను.GATA వారు సిరివెన్నెల గారి స్మృతిలో నిర్వహించిన కవితల పొటీలలో మూడవ బహుమతిగా 2000 రూపాయలను స్వీకరించాను
