(మయూఖ 2026 జనవరి పత్రిక ఎడిటోరియల్)
Kondapally Neeharini
( 2025 నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం)
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ పత్రిక ఎడిటర్
కొత్త బంగారులోకం, నా బంగారు కొండా, బంగారమసొంటి గుణం, ఆ ముచ్చట్లు వివరంగా చెప్తే నీ బంగారమేం పోయింది, బంగారం వంటి జీవితం తాగి తాగి నాశనం చేసుకున్నారు – ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…
బంగారం అనే లోహం అన్ని లోహాలలో చాలా చాలా విలువైన లోహం. ఒక భారమైన మూలకం. ఎక్కువ స్థితిస్థాపక గుణం కలిగి ఉండే ఖనిజం. బంగారం కాఠిన్యత ను పరిగణలోకి తీసుకుంటారు.
Au అనే చిహ్నంతో శాస్త్రీయంగా పిలువబడే బంగారం ఒక విలువైన లోహం. శాస్త్ర ఆవర్తన పట్టికలో 11వ సమూహానికి చెందిన మూలకం. బ్యాటింగ్ లో Aurun అంటారు కాబట్టి Au అనే పేరుతో రసాయనికంగా పిలిచే ఈ లోహం మూలవర్తన లోహం. ఈ లోహం మెత్తగా ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.
ఆమ్లాలకు విడిపోయి ఏ చర్యకు గురికానటువంటి కరగనటువంటి బంగారం కాబట్టే ఇంత విలువ.
అయితే ఇటువంటి విలువైన ఈ బంగారం అనే లోహం పాదరసంలో హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లాలతో కలిపిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. బంగారం, పాదరసం కలిసిన ధాతు మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. మేలిమి బంగారం అంటే పసుపు పచ్చని వర్ణంతో ఎక్కువ సాంద్రతతో ఉండే మెత్తని లోహం. ఇది అత్యంత విలువైన లోహాల లో ఒకటి.
ఇతర ఆమ్లాల చర్యలకు రసాయనిక మార్పుచెందని లోహం కాబట్టే బంగారం అంటే ఇంత మోజు కలగడానికి కారణమేమో. ఒక హౌస్ బంగారం నుండి దాదాపు 50 మైళ్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు రేకుగా సాగదీయవచ్చు , కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో నిలువ చేయవచ్చు. సాధారణంగా బంగారాన్ని karats , కారెట్స్ లలో తూకం వేస్తారు. బంగారం స్వచ్ఛత అనేది ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఫైన్నెస్
fineness ఎంత ఉంది తెలుసుకోవాలని చూడడానికి ఉపయోగిస్తారు. గ్రాములు, కిలోలు కారెట్ల కొలతల్లో చెబుతారు. చాలావరకు 24 కారెట్ ఉంది అంటే అది కల్తీ లేని బంగారమని అర్థం. కాని, దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. అందుకే ఎటు అంటే అటు మలిగి, గట్టిగా ఉండడానికి బంగారానికి రాగి గాని వెండి గాని ఏదైనా లోహాన్ని ఓ 2 భాగాలు కలిపి 22 కారెట్ల కు సిద్ధం చేసి వస్తువులు తయారు చేస్తారు. భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయాల నేల పొరలలో తక్కువ ప్రమాణంలో నిక్షిప్తమై ఉండే బంగారు నిధులు ముఖ్యంగా ప్రధమ శ్రేణి ద్వితీయ శ్రేణి నిలువలుగా చెబుతారు. భూమి లో ఉండే ‘ మాగ్మా ‘ లో బంగారం ఉంటుందని ద్రవ రూపంలో ఉన్న బంగారం అవక్షేప శిలలలో నిలుస్తుందని , రాతి పొరలలోను చేరి ఉంటుందని చెప్పడం చూస్తాం.
ఈ మెత్తటి లోహంలో వేరే లోహాలను కలిపి దృఢంగా చేసి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
పూర్వకాలం నుండి బంగారాన్ని వాడుకలో కి తెచ్చుకున్నారు ప్రజలు. శిలాజాలను తవ్వి బంగారాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తు మారక ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా వ్యాపారానికే కాకుండా రాజవంశీయులు వాళ్ళ సింహాసనాలను, అలంకరణ వస్తువులను ఎంతో శ్రద్ధగా నిలువ చేసుకునేవాళ్ళు. రాజుల రాణుల సమాధులపై రాజ వంశీయుల సమాధులపై బంగారాన్ని అలంకరణగా పెట్టే అలవాటు ఉన్నవాళ్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖంగా ఈజిప్టులోని పురాతన దేవాలయాలలో బంగారాన్ని విరివిగా వాడే వారట.
ఈజిప్ట్ లోని నైలునది ప్రాంతంలో, నోబియన్ ఎడారి ప్రాంతంలో, రెడ్ సి అంటే ఎర్ర సముద్రం ప్రాంతంలో గనులు బాగా ఉన్నట్టు చెబుతారు. ఏమన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో బంగారు గనులను త్రవ్వి న చరిత్ర ఉన్నది. ఇకపోతే అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, స్విజర్లాండ్ జపాన్, ఫ్రాన్స్, ,ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి దేశాలలో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి . అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఇవి. ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి పోటీలుపడి టన్నులు టన్నులుగా నిలువ చేసి పెడతారు.
దేశాల ముఖ్య వ్యాపార లావాదేవీలు ప్రముఖ దేశాల మధ్య జరిగినప్పుడు బంగారం నిలువల ప్రస్తావన వస్తుంది. బంగారం ధర వ్యాపారాలను శాసిస్తుంది. సెన్సెక్స్ లెక్కలు అధికమయ్యాయా? పడిపోయాయా? అనే చర్చల ద్వారా పసిడి ధరలు పెంచాల్సిందే.
అత్యధిక బంగారు నిల్వలు ఉన్న అమెరికా దేశస్తులు ఒంటి మీద నగలుగా ఎక్కువ ధరించరు. అక్కడ 18 క్యారెట్స్ బంగారాన్నే నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్త చూడటానికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి నగలు.
అయితే బంగారు జీవితం అంటే బాగా బంగారు ఆభరణాలు ధరించడం కాదు. వాళ్ల జీవితం పసిడి కాంతులతో కళకళలాడుతుంది అంటే అందరూ బంగారం తో అలంకరించుకోవడం, ఇంట్లో అంతా బంగారు వస్తువులతో నింపడం కాదు.
ఆరోగ్యకరమైన , సంస్కారవంతమైన జీవితం ఉంటే బంగారు బతుకు అంటారు. బంగారం అంటే పసిడి అనీ కనకము అని కదా అర్థాలు. ” కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభ లగ్నమునన్” మనకో పద్యం కూడా ఉన్నది కదూ..
” పసిడికి తావి అబ్బినట్టు ” అనేది ఓ సామెత. తావి అంటే సువాసన. అతనికి గానీ ఆమెకు గాని చక్కని అందం తో పాటు మంచి గుణాలు ఉంటే ఈ సామెత ను ఉపయోగిస్తాం. ” కల్ల పసిడికి కాంతి మెండు” అంటే, False gold is very bright అదే… All is not gold that glitters అంటారు . కల్ల పయిడికి గరుకులు మెండు False gold is very rough అని , కూడా ఓ సామెత ఉన్నది. సామెత లు ఎందుకు ఆమెతలు అంటారో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. ఇవి అసలు బంగారు జీవితానికి వ్యాఖ్యానాలు. పసిడి మనసులు అంటాం. సాధారణంగా చిన్నారులను చూస్తే!!! కదా! ఏ సంఘర్షణ లు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియని పిల్లలు కాబట్టి.
ఇక ప్రస్తుతానికి వస్తే, ఎవరు ప్రమాదపు అంచుల్లో ఉన్నారు? ఎందుకు ? ఈ ప్రశ్న లు చాలా విలువైనవి. బంగారంలా విలువైనవి. బంగారం కన్నా విలువైనవి.
బంగారం ధర బాగా పెరగడం వల్ల దొంగతనాలు దోపిడీ లు ఎక్కువయ్యాయి. ముందు ఇంతగా దొంగిలించేవాళ్ళు కాదు. కానీ,
ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు నగల వ్యాపార ప్రకటన లకు సంబంధించిన ఫోటో లు పెట్టడం వల్ల సమాజానికి చేరువవడంతో అందరు ఆకర్షితులవుతున్నారు . అంత షో చేయడం, ప్రాపగాండా చేసుకోవడం . ఇవన్నీ అవసరమా? అసలే నేరప్రవృత్తి బాగా పెచ్చుమీరుతున్న రోజులు ఇవి. అసలే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం సగటు జీవుల బ్రతుకు లను అతలాకుతలం చేస్తున్నాయి. దారిద్ర్యం రేఖ కు మరీ దిగువనున్న సామాన్యులు ఉన్నారు. ఎటునుంచి ఎటు మారుతారో తెలియదు. ప్రమాదం అంచుల్లో ఉన్నది సమస్త మానవ జాతి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!
_____*****_____
సెప్టెంబర్ మయూఖ పత్రిక ఎడిటోరియల్
గుడ్డి దీపం కింద కూర్చొని చదువుకున్నాను అని చదివిన జీవిత చరిత్రలు నిజంగానే గొప్ప ప్రభావం చూపాయి ఆనాడు. తర్వాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాను అని వచ్చిన మోనోగ్రాఫ్స్ కూడా అంతే ప్రభావం చూపాయి. ఆ గుడ్డి దీపానికి ఈ స్ట్రీట్ లైట్ కు మధ్యన అంతరం ఏంటో తెలియనివాళ్ళం కాదు. వీధి దీపాలు ఇంటి వెలుగు దీపాలైన తర్వాత శాస్త్ర విజ్ఞానాలు అభివృద్ధి చెందాయి. సాంకేతిక విజ్ఞాన విశేషాలు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, సర్వర్లు, డొమైన్లు ఇవే వింటున్నాం. రకరకాల కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివే కంటున్నాం. నవీన పరికరాల ఎన్నో ఉపయోగిస్తూ నెట్వర్క్ అనుసంధానంతో కమ్యూనికేషన్ చేయడమనేది చాలా సహజమైపోయింది.
ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. విజ్ఞానం వికాస దశలో ఉన్నది. చంద్ర మండలాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. ఊహించని సాంకేతిక పరిణామాలు ప్రపంచం మొత్తం శాసిస్తూ ఉన్న సమయంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. తెలుగులో దీన్ని అంతర్జాలం అని అంటున్నాం. అంతర్జాలం అంటే చాలా విస్తృత అర్థమే ఉన్నది. విమానాలు ఆకాశంలో ప్రయాణం చేసి, వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వీటికి మన కంటికి కనిపించని రహదారులు వేసి ఉంటాయంటున్నారు . నేల మీద వాహనాలు వెళ్లడానికి ఉన్న దారుల ఎట్లా ఉన్నాయో అట్లాగే విమానాలు వెళ్లడానికి కూడా దారులు ఉన్నాయన్నట్టు! ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఎలా ఉంటుందో అలా విస్తరించి ఉంటాయి. అలాగే ఈ సాంకేతిక పరికరాలు ఉపయోగించడానికి వాడుతున్న అంతర్జాల వలలూ ఉంటాయి. ఒక ప్రధాన నగరం నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి గ్రామాలకు గ్రామాలలో కూడా వీధుల్లోకి దారులు ఉంటాయి, బాటలు ఉంటాయి. మళ్లీ వీధుల్లో కూడా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్లడానికి కాస్తంత చిన్న దారి ఉంటుంది. అలాగే సాంకేతిక దారులు కూడా ఉంటాయి.
అవిగనుక కంటికే కనిపిస్తే, మన కళ్ళతో చూస్తే, బహుశా అల్లిబిల్లిగా అల్లుకున్న ఇనుప తెరలాగా ఉంటుందేమో! ఈ శాటిలైట్ మాయాజాలం తెచ్చింది ఎవరు మనిషి విజ్ఞాన జిజ్ఞాసనే కదా!
ముసలి వాళ్ళ నుండి చిన్న పాపాయిల వరకు ఫోన్ వాడకానికి అలవాటైన ఈ కాలాన్ని సమీక్షించుకోవాలంటే సమగ్ర విశ్లేషణ చేసుకోవాలంటే టెక్నాలజీ సంబంధిత విషయాలు ఎలా తెలియాలో మనుషుల లోభాలూ, ప్రలోభాల విపరీతాలు తెలియాలి. మనిషి వ్యాపార వస్తువైన వైనమూ తెలియాలి.
కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో ముఖ్యమై ప్రపంచాన్నే పరిపాలిస్తున్నది. కోట్ల మందిని అనుసంధానం చేయడానికి కోట్ల కంప్యూటర్లను వాడుతున్నారు. శాటిలైట్ లకి రకరకాల మిషన్లను అమర్చి సర్వర్లు కంప్యూటర్లు వంటి సాఫ్ట్వేర్ పరికరాలతో ప్రోగ్రామ్స్ ను అందజేస్తూ టెక్నాలజీ గుప్పట్లోకి మనిషి వెళ్ళిపోయి చాలా ఏళ్లవుతోంది.ట్రాన్స్మిషన్స్ తో కంట్రోల్ చేస్తూ ఏ సాంకేతికతకు ఎటువంటి నియమాలు ఉన్నవో ఆ నియమాలను అనుసరిస్తూ అనుసంధానం చేసే విధానాన్ని ఇంటర్నెట్ విధానం అంటాం. ఫోన్ లుచేయడం ఈమెయిల్ చేయడం చాటింగ్ చేయడం రకరకాల వీడియో కాన్ఫరెన్స్ చేయడంతో సంభాషించడము, ముఖ్య సందేశాలను పంపించడం జరుగుతున్నది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు నెట్వర్క్ ఈ ఇంటర్నెట్. ప్రతి ఇంటర్నెట్ కు సంబంధించిన విజ్ఞానానికి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ నియంత్రణలోనే ఉంటాయి. ఎక్కడైతే ఎప్పుడైతే వేరే మార్గాల్లోకి వెళ్తున్నాయో అది పసిగట్టగలిగే నేర్పు కూడా ఈ ఇంటర్నెట్ వాడుకంలో ఉంది. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా మనిషికి జీవనం లేదు అనే సత్యాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు నిఘా కళ్ళతో చూస్తూ కంట్రోల్ చేయవలసిన అవసరం కాస్త ఇప్పుడు అగత్యమై కూర్చున్నది. భద్రతా విభాగాలు ఎక్కువ చేసి, ఎక్కడెక్కడ అయితే చెడు ప్రవేశిస్తున్నదో అక్కడ ప్రత్యక్షమై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ద్వారా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీన్నే, ఈ సంస్థనే ARPA అంటున్నారు. ఈ ‘ ఆర్పా ‘ నడపడానికి సరిపోయిన నిధులను ఏర్పరచి ప్రపంచాన్ని కాపాడుకోవాలి. మనవైన ఆనందాలకూ మనవైన దుఃఖాలకూ తోడూనీడైనప్పుడు హృదయ రహస్య కుహరం లోకీ ప్రవేశించి నప్పడూ సంరక్షణ పథకాలు తప్పనిసరవవూ? అవుతాయి. ఈ అడిక్షన్ కంట్రోల్ చేయడం ఎవరితరం కావడం లేదు.
ప్రభుత్వ సేవలకైనా అంటే బిల్లు లు కట్టడం బట్వాడా చేయడం, ప్రైవేట్ విధానాలలో గాని షాపింగ్ చేసే దాంట్లోనూ బ్యాంకింగ్ విధానాలలోను ఆన్లైన్ సేవలు ఊరూరా అందుకున్నాయి. మీడియా అనే పదం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోటు వినిపిస్తున్న మాట. మానవ సంఘానికి దశ దిశ ఇంటర్నెట్టే జీవం అయిపోయి కూర్చుంది. ఎప్పుడో దాదాపు 70 దశాబ్దాల క్రిందనే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ ఇంటర్నెట్ మాతృక మొదలైంది. అప్పటినుంచి కొన్ని దేశాలలో కొన్ని పట్టణాలకే పరిమితమైన ఈ సౌలభ్యం భూమి ధృవ ప్రాంతాలకు కూడా చేరుకున్నది పల్లె పల్లెను ఏకం చేసింది.
అసలు ఈ ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కు మధ్యన సూక్ష్మ అంతరం ఉన్నది. కానీ సాధారణంగా ఒకటే పదాన్ని వాడుతూ ఉంటారు.
ఒకప్పుడు ఫోన్ వాడకం కేవలం సమాచారం తెలుసుకోవడానికి ఒకరినొకరు పలకరించుకోవడంతో సరిపోయేది. అటువంటి ఫోన్ అనే పరికరంలోకి మొత్తం సాంకేతికత చేరిపోయి ఇంటర్నెట్ పైననే జీవితాలు ఆధారపడిపోయేలా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైననే బ్రతుకులు గడిచేలా శాసించిన పరిస్థితులు ఇవి. నువ్వెక్కడుంటే అక్కడ నేను … నువ్వెక్కడికెళ్తే అక్కడికి నేను … అంటూ మన వెనుకే వస్తూ మనవెంటే వస్తూ వాకిట్లోనుండి వెళ్ళిన వైర్లు ఇంట్లోకి వచ్చాయి. వరండా లోగిలి దాటి, హాల్ ను అలంకరించి ఆనందాలు పంచే, నయనానందాలూ పెంచే టీ వి గా మారింది. ఈ రూం ఆ రూం అని లేకుండా గుండె గదిలోకి , సమస్త జన జ్ఞానం లోకి, మనుషుల మనసుల్లోకి చేరింది ఇంటర్నెట్!!
ఇక ఇంటర్నెట్ ఆధారం తో ప్రపంచం గుప్పిట్లో కి వచ్చే అల్ట్రా మాడర్న్ టెక్నాలజీ కి చిరునామా ‘ ఫోన్ యంత్రం’ అయ్యాక పరిణామాలు చాలా విస్తృత మయ్యాయి. నయనాలూ హస్తాలూ మెదడు వారధులై, సారధులై నయా జమానానే నడిపిస్తున్నాయి. ఈ అంతర్వలయానికి చిక్కని ఈ వరల్డ్ వైడ్ వెబ్ మాయాజాలం లో పడని మనిషులే లేరనేంతగా అయిపోయాం. ఆలోచనా ధారలన్నీ వెబ్ సైట్ లో చేరిపోవడం, ముఖం పత్రాలు ముఖ్యమైపోవడం ఇది ప్రస్తుత జీవన చిత్రం. ఇట్లా సాంకేతిక చుక్కలను పేర్చుకుంటూ పోతున్న మనిషి బ్రతుకులో కన్నీటి చుక్క లనూ కొనుక్కుని మనవైన డొమైన్స్ లలో నిక్షిప్తం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవి. ఇక ఇంటి చిరునామా లెందుకు? అంతర్జాల విలాసం ఇస్తున్నాం!
ఇంటర్నెట్ ఎప్పుడు సౌకర్యం కాదు అవసరం అయింది. ఈ అవసరాలలో లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి.
క్షణాలలో లెక్కలు కట్టి జవాబులు చెప్పగలిగిన గణితశాస్త్రం మన గుప్పిట్లో ఉండేది. అద్వితీయమైన ధారణా శక్తితో మెదడునే కంప్యూటర్లలా ఉపయోగించేవాళ్ళు. దత్తాంశాలను ,డేటాలకూ ఇప్పుడంతా గణన యంత్రాలే వాడుతున్నారు! అంతటి జ్ఞాపక శక్తిని హరించి వేస్తున్నది అంతర్జాలం. అనవసరమైన విషయాలను చూస్తూ, అమూల్యమైన సమయం వృధా చేయడం, లేత హృదయాలపై ముదురు నీడలు పడవేస్తూ ఎంత నష్టం చేస్తుందో తెలియని సమాజం కాదు ఇది. అన్ని సమాచారాలనూ నిక్షేపించగలిగే విద్యుత్ ఉపకరణమైన కంప్యూటర్ల ఉపయోగాలు ఎక్కువై కరెంట్ ఉత్పత్తి భారాలు విపరీతంగా పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఇదీ ఆలోచించాల్సిన విషయమే. ఇక అన్నింటినీ మించినవి ఇంటర్నెట్ మోసాలు! బాంక్ లో దాచుకున్న డబ్బు ఎప్పుడు ఎవరు ఎలా హాక్ చేసి కాజేస్తారో తెలియని కష్టాలు వచ్చిపడ్డాయి.సైబర్ నేరగాళ్లు ఎక్కువయ్యారు. అన్నీ ఫోన్ కు లింక్ చేయడం వల్ల పెద్ద కష్టమైపోతున్నది. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒకరిద్దరి తో కానిచ్చేస్తూ నిరుద్యోగులనూ బాధపెడుతున్న వైనమూ తెలుసు.ఏవైనా ‘పెరుగుట విరుగుట కొరకే !’అనే మాటను ఎప్పుడైనా నమ్మాల్సిందే.
Internet తో లాభాలు లేవా?ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం పెరిగింది. హాస్పిటల్లో చేర్చాలనుకునేవాళ్ళకు , ఆరోగ్యం ఎలాఉన్నదో తెలుసుకోవాలన్నా, చేర్పించాలన్నా ఇంట్లోనుండే పేరు నమోదుసుకోవచ్చు. ఒకటా రెండా? ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వివిధ భాషల్లో వెబ్సైట్ నిర్మించారు అందులో మన తెలుగు భాష కూడా ఉన్నది. Positive thoughts మంచిది కాబట్టి, మన మాతృభాష లో అంతర్జాల మనుగడ సాగిస్తూ, పురోగతిని సాధిద్దాం! హృదయాలను రచించుకుందాం! అంతరంగాలను పంచుకుందాం!!
_____****___
ఎక్కాల్సిన శిఖరాల
దాటాల్సిన లోయల
జీవిత గుణాలకు గణాంకాల
గుట్టు నేర్పే గురువులే మాకాదర్శం
భాష భాగ్యాన్ని
శాస్త్ర జ్ఞానాన్ని
సమయ పాలననీ గుప్పిట బట్టే
తెలివి నేర్పిన గురువులే మాకాదర్శం
గురువులంటే మా ఉపాధ్యాయులు
గురువులంటే మా ఊహల వారధులు
దేశభక్తి ని రంగరించి
క్షేమ సమాజ సూత్రాలని నేర్పించి
అభ్యుదయ దృక్పథాన్ని అలవర్చే
నిస్వార్థ సేవలను అందిచే గురువులే మాకాదర్శం
ఆటపాటల పోటీలు క్రీడా వినోదాలు
ప్రపంచ విజ్ఞాన ప్రయోగాల పాఠాలు
ప్రశ్నల పరీక్షలు ఫలితాల నిరీక్షణ లూ
చీకటి వెలుగుల సమవర్తన నేర్పే గురువులే మాకాదర్శం
అవనీ అమ్మ ఒక రీతైతే
నింగీ నాన్న ఒక తీరైతే
విశ్వ మానవతా రూపమయ్యే
అమ్మానాన్నగ మిన్నగ చూసే గురువులే మాకాదర్శం
పరాన్న జీవులవ్వద్దంటూ
పరులమేలును కోరాలంటూ
చదువుల విలువలు వినిపించే
పోటీ ప్రపంచపు విస్ఫోటనమయ్యే గురువులే మాకాదర్శం
కులాలు మతాలు ఎన్నున్నా
మానవత్వం మాకు సమ్మతమైతే
సామరస్య సంస్కారం మా మతమైతే
ఎత్తిన జెండా లో ఎదిగిన వర్ణ వికాసం
విద్యార్థులే అంటారు
వేకువ ఉదయం మాదంటారు
ఎలుగెత్తి చాటిన విద్వత్తు మాకేనంటారు
జగతి జవసత్వాలు మేమంటారు
ప్రగతి దారులు మేమే వేయాలంటారు
నాటిన విత్తులు మొలకెత్తి
పెరిగిన వృక్షాలు బడిపిల్లలేనంటారు
అందాల్సిన ఫలాలు భవితవ్యానిదేనంటారు
శిక్షణ ఇచ్చినా శిక్ష వేసినా
ఎంతోఎదిగేలాచేసే ఇంతటి గురువులే మాకాదర్శం
చిగురించే ఆశలకు నవ పల్లవులం
చదువుల వన వసంతం విరిసేలా
నలుగురు మెచ్చే నడవడి మాదైతే
నీతి నిజాయితీ ఉండాలనే మా గురువులే మాకాదర్శం!
గురువు అంటే గగనమంత గౌరవం
గురువు అంటే సముద్రమంత ఆదర్శం
చంద్రునిగా వెలుగొందించే సూర్యులే గురువులు
సూర్య తేజంగా చూపించే చంద్రులే గురువులు
గురువంటే మా ఉపాధ్యాయులు !
గురువంటే మా ఊహల వారధులు!!
మము నడిపించిన గురువుకు వచసా స్మరామి !
మము గెలిపించిన గురువుకు శిరసా నమామి!!
___*****____
– డాక్టర్ కొండపల్లి నీహారిణి,
మయూఖ ఎడిటర్ ( జూలై మయూఖ పత్రిక సంపాదకీయం) _____________
కవిత్వం రాస్తున్నారా? వ్యాసరచన చేస్తున్నారా? పుస్తకాలు ముద్రించుకుంటున్నారా? వేసుకోండి. వేసుకోవాలి. లేకుంటే ఎలా? లేకుంటే మనవైన భావనలు అక్షరాలలో తొంగి చూస్తూ వెక్కిరించవూ! పుస్తక రూపంలో కి తెచ్చుకోకుంటె, నన్ను అలా వదేలేస్తావా … పట్టించుకోవూ అని సాహిత్యం దిగాలుగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది కదూ! ఈ భావనలు, ఈ ఎదురుచూపులు,ఈ ఆవేదనలు భవిష్యత్తులో కోకొల్లలు గా చరిత్ర రికార్డు చేసి పెట్టే రోజులు రానున్నవి. తస్మాత్ జాగ్రత్త! మాతృభాష తెలుగు కోసం పరితపిస్తున్న వాళ్ళ ఆరాటం వెనక ఏముంటుందో ఒకసారి పరిశీలిద్దాం.
భాష నా భవ బంధనం
భాష నా భావ బంధురం
యాసా బాసా నా రెండు కన్నులు
నా రెండు చేతులు రెండు కాళ్ళు!
ఒక్క గుండె కు పద గుంఫన ఫలాలు
ఒక్కో అడుగుకు నవ చేతన బలగాలు!!
ఇది కవులందరి హృదయ శ్వాస హృదయ ఘోష. కాదంటారా? మరెలా రాబోయే కాలంలో ” తెలుగు చచ్చిపోతుంది” అంటే వింటూ ఊరుకుందామా?
ప్రాచీన సాహిత్య చరిత్ర అంతా బాగా వంట పట్టించుకున్న పండితుల కాలం నుండి, భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం అలవాటైన ఆధునిక కాలం వరకు తెలుగు భాషకు ప్రమాదం ఉంచుకొస్తుంది అన్న ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు . బహుశా ఆ నాటి క్షీణ యుగంలో ఏ ఆదరణలేక బీరిపోయి పండిత కవులు భావించి ఉంటారు, ఊహించే ఉంటారు. కానీ, కవిత్వం వచన కవిత్వంగా ఉదృతంగా ప్రవహించినప్పుడు, కథలు వ్యాసాలు పరిశోధనలు పుస్తకాలుగా గ్రంథాలుగా వెల్లివిరిసినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. పూర్వకవుల కవిత్వ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విశ్లేషించిన కవులు ఉండేవాళ్లు. తర్వాత కాలంలో ఆధునిక సాహిత్య వికాసానికి తోడ్పడిన సాహిత్య విమర్శకులు ఉండేవారు. వాళ్లు కవిత పండితులు. వాళ్ళు చెప్పిన వాక్య సొబగులను తలకెత్తుకొని పుస్తకాలుగా విరిసిన సాహిత్యాభిలాషులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి. ఈ యజ్ఞం లో మనమందరము ఉన్నాము కాబట్టి, మనమందరము చదివాము, మనమందరము రాసాము కాబట్టి. మరి ఇప్పుడు ? గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేరుకొని పోతాయి కానీ రేపటి రోజు ల్లో చదివే వారు ఉండరు అనే బాధ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరనింద ఆత్మ స్తుతి పొంగిపొర్లుతూ పక్క వాళ్ళ కవిత్వాన్ని పట్టించుకోని దుస్థితి వస్తుందని ఎవ్వరంటే ఎవ్వరు ఊహించి ఉండరు.
అరచేతిలో భూతల స్వర్గం ఇమిడిన వింతపోకడల కాలంలో కవిత్వం పలుచబడి , పోటీ తత్వం, భజన పరత్వం అలవడి, అభినందనల కోసం అవార్డుల కోసం అర్రులు చాస్తూ మేధావులను ఆలోచనలో పడేస్తున్నదీ చూస్తున్నాం. సరే ఏదో ఒకటి అక్షరాలనయితే కుమ్మరిస్తున్నారు కదా అని సరిపెట్టుకోవాలా అక్షరాలలో సత్తువ తగ్గిందని బాధపడాలా అర్థంగాని స్థితి.
కవిత్వ సంపద కొరవడితే కొరవడింది గాని భావాలయితే బాగానే ఉన్నాయి. ఏదో విధంగా తెలుగు వెలుగుతున్నదని మిన్నకుంటున్న దుస్థితి.
విరసి తెలుగు భాషకు ఏదో తెగులు పుట్టుకొస్తున్నది అని మాత్రం సమస్త జనావళికి అర్థం అయిపోతున్నది.
ఇక అర్థం కావలసిన సమస్య ఏంటంటే, ఇంతమంది కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, సినీ జగత్తులో విహరిస్తున్న పాటల తేజోవిలాసమూ, పది రోజులకో పత్రిక పుట్టుకొస్తున్న పత్రికా రంగమూ తెలుసుకోవాల్సిన విషయం సావధానంగా చర్చించుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కాలం మన్నికగా నిలవాలంటే తెలుగు భాష అనేది బ్రతికి ఉండాలి కదా!
రేపు మన సాహిత్యాన్ని తలకెత్తుకునే వాళ్ళు ఎవరు? తలకెత్తుకోకుండా సరే బతికించే వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఇంగ్లీషులో చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగాల్లో డబ్బులు గడించొద్దని ఎవ్వరు
అనడం లేదు, కోరుకోవడం లేదు. తప్పదు కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానం వెల్లి విరుస్తున్న ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఇంగ్లీష్ లో చదవాలి, పట్టాలు పొందాలి, పరుగులు పెట్టాలి. ఏమి వద్దనడం లేదు కానీ ఇంత కష్టమైనటువంటి చదువును చదవగల విద్యార్థులకు తనదైన మాతృభాషలో ఒక తరగతి కి ఒక తెలుగు పీరియడ్ ఉంటే చదవలేరు అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అబ్బో కష్టం తెలుగు చదివి మార్కులు తెచ్చుకోవడం అని ఎందుకు అంటున్నారు? పిల్లలు అవలీలగా చదవగలరు చిన్నప్పటినుంచి ఒక క్లాసులో ఒక సబ్జెక్టు గా తెలుగును నేర్చుకుంటే!
ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన సాగుతూ, కేజీ నుండి పీజీ వరకు ఒక విషయం(సబ్జెక్టు) తెలుగు భాష వాళ్ళ వాళ్ళ తరగతి స్థాయిని అనుసరిస్తూ పెంచుతూ పోతుంటే తెలుగు భాష నేర్చుకుంటారు. కనుమరుగు కాదు. ఇలా భాష నేర్చుకునే వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ ప్రక్రియపై ఆసక్తి ఉంటే వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని చదివి భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా, సాహిత్య విమర్శకులుగా, పాటల రచయితలుగా ఎదుగుతారు. తెలుగు భాష బోధన లో ఉన్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగాలు పోవు. రాబోయే కాలంలో కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు వస్తాయి. అసలు భాష నే కనుమరుగైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
జానపద సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన తర్వాత కదా వెలుగులోకి వచ్చింది. వాళ్లదైన సొంత తెలుగు తీయదనమంతా జనపదుల పాటల్లో కథల్లో దాగి ఉన్నది మొత్తం గుత్తంగా గ్రంథరూపంలో తెచ్చారు కాబట్టే పట్టణంలో మనకు చేరింది.ఆధునిక మాధ్యమాలైన టి.వి., సినిమా, యూట్యూబ్ లలోకి వచ్చిన తర్వాతే ప్రపంచానికి అందింది. అందుతున్నది. ఇందుకోసమైనా తెలుగు రావాలి కదా!
ఇప్పుడు అసలే అత్యంత ఆధునికమైన ఏ. ఐ. వచ్చింది. ఈ కృత్రిమ విజ్ఞానం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల తెలుగు బ్రతుకుతున్నది అని అనుకుందామా తెలుగును సమూలంగా నాశనం చేయడానికి ఇది ఒక కారకం అవ్వబోతుంది అని అనుకుందామా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చిన తెలుగు నైనా చదవగలిగే శక్తి మునుముందు మన పిల్లలకు ఉంటుందా అనేదే ఒక పెద్ద ప్రశ్న!
ఆ రోజుల్లో మనము మన తర్వాతి రెండు మూడు తరం వాళ్లమంతా ఇప్పటివరకు తెలుగు భాషలో ఇంతో అంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇప్పుడు రచనలు చేయగలుగుతున్నాం. ఇది ఎన్నటికీ మరవద్దు!
తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ కి పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే, ఇంగ్లీష్ అర్థం అయ్యే వాళ్లే వస్తారా? చదివిన శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే ఉండవచ్చు, మెడిసిన్స్ ఇవ్వవచ్చు, ఆపరేషన్స్ చేయవచ్చు కానీ రోగి బంధుమిత్రులతో , అయిన వాళ్లతో దగ్గర వాళ్లతో అనునయించి మాట్లాడడానికి వాళ్లదైన భాష తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అనునయిస్తే ఆ భయం పోతుంది , కొంత ఊరట చెందుతారు. ఒక లాయర్ వాదోపవాదనలు అయిపోయిన తర్వాత గెలుపు ఓటముల సందర్భంలో తెలుగు వాళ్లతో తెలుగులో మాట్లాడితే తొందరగా అర్థం అవుతుంది, బాగుంటుంది కదా! ఒక పోలీసు, ఒక బ్యాంకు ఎంప్లాయ్, వ్యాపారస్తులు, విద్యావేత్తలు అందరూ ఎవ్వరైనా తెలుగు ప్రాంతంలో ఉన్నంతవరకు తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రజలు ఆనందిస్తారు. ఈ సాన్నిహిత్యానికి వారధి తెలుగు వాళ్ళకి తెలుగు భాష నే! ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇది సత్య దూరం కాదు!!
“విద్య యశస్సు ,భోగ కరి, విద్య గురుండు విదేశీ బంధుడు…” కదా! “చదవని వాడజ్ఞుండు..” కదా! మరి…”తేనె జుంటియల తెలుగు …” మన పిల్లలకు రావద్దా? రావాలి! ఎట్లా? మనోవికాసానికి చైతన్యానికి మనదైన మాతృ భాష వచ్చుండాలి కదా! మరి ఏం చేద్దాం ఎట్లా??
ఇప్పుడు కవులకు రచయితలకు ఇది ఒక పెద్ద సవాల్ గా పరిణమించింది. మరి ఏం చేద్దాం? ఏదో కొంత కృషి చేయవలసిందే! ఏవో కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే!! ఇళ్లల్లో కొడుకు లు కూతుళ్లు తెలుగు పుస్తకాన్ని పట్టుకోవడం లేదు మనం రాసిన మన కవితల పుస్తకాలు మన రచనలు ఒక్క పేజీ కూడా చదవలేరు. ఈ దుస్థితి దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉన్నది. ఈ సమస్యని ఎదుర్కోవాలంటే కొంత సమయం మనంది కావాలి కొంత సహనాన్ని వెచ్చించాలి.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఓపిక తెచ్చుకుని తెలుగును చదివే లాగా నచ్చ చెప్పాలి. బ్రతిమిలాడి తెలుగును వినేలాగా తెలుగు చూసేలాగా ప్రయత్నించాలి.
అయితే ఇలా ఎంత చేసినా బడిలోంచి వచ్చే తెలివితేటలు వేరు! ఒక్క కొడుకునో ఒక్క కూతురునో కూర్చోపెట్టి పాఠం చెప్పుకోలేని, తెలుగు ను నేర్పించలేని చదువును 50 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ అవలీలగా నేర్పగలరు. ఈ క్రమశిక్షణ, ఈ భయమూ బడి వాతావరణం లో ఉంటుంది. కాబట్టి, ఈ నిజాన్ని అందరూ ఒప్పుకొని పాఠశాల చదువులో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పకుండా ఉండేలా ఉద్యమం చేయాలని కంకణం కట్టుకొని కవులందరూ బయలుదేరాలి. పోరాటాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రక్తం మనలో ప్రవహిస్తున్నది. మన తాత ముత్తాతల పౌరుషం మనకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. ఇది నిజం కాదంటారా?
నాకు తెలుసు, నాకు తెలుసు అంటూ కాంతం నోరు నొక్కేసినప్పుడల్లా ఏదో తెలియని విజయగర్వం తలెత్తుత్తుండేది. కానీ ఇప్పుడు తెలుస్తున్నది. నాకు ఏమీ తెలియదని. ఒంటిచేత్తో సంసారాన్ని లాగుకొస్తున్నాననే అనుకున్నానుగానీ సగం భారం నాకు తెలియకుండా తానూ మోస్తుందనుకోలేదు. ఇదంత అబద్ధమైపోతే బావుండు. ఈ వారం రోజుల నరకయాతన చాలు. ‘నేను’ అంటే ఏమనుకున్నావు?’ అని కళ్ళెగరేస్తూ కాలరెగిరేస్తూంటే, తిరిగి తిరిగి చూసే కాంతం నాకు కావాలి. ఈత నేర్చిన చేపపిల్ల అన్నప్పుడల్లా ముసిముసిగా నవ్వుకుంటూ పనిలో నిమగ్నమయ్యే నా కాంతం కావాలి. నా కాంతం నాకు కావాలి’’ ఈతి బాధలంటే ఏందోయ్ ఇవ్వే కదా…!’ అని నేన్నప్పుడల్లా సమయస్ఫూర్తిగా సర్దిచెప్పేనా కాంతం కావాలి కాంతం కావాలి. ఇంతకన్నా ఈతిబాధే ముంటుంది. కాంతంలేని బతుకొద్దు, కాంతం కావాలి కాంతమే కావాలి.
* * *
దుర్గయ్యకు, ఒక్కగానొక్క బిడ్డ కమలమణి. రాధమ్మ తల్లి పేరునూ, దుర్గయ్య తల్లి పేరునూ ఇద్దరిదీ పేర్లూ వచ్చేలా పెట్టుకున్న పేరు.
సింగారగ్రామం పట్టణానికి దగ్గరలో ఉన్నది కాబట్టి కమలమణి చదువుకు ఆటంకం లేకుండా డిగ్రీవరకు పూర్తి చేసుకున్నది. తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఎన్నడు పోని ఊళ్ళకు పోయి, ఎప్పుడు కలవని మనుషులనూ కలిసి, వెతికి వెతికి సుధాకర్‌ను దొరకబట్టాడు. అందగాడు, యోగ్యుడు, ఆస్తిపరుడు, అయినవాడు. ఇంకేం?
‘‘తల్లీ! నీకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా.’’
‘‘ఏం నాన్నా ఎందుకు ఆ అనుమానం వచ్చింది?’’ ముసిముసి నవ్వులతో కమల సమాధానం. ‘‘ఆ ఏం లేదు, ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, నిన్నటి నుండి ఎట్లాగో అదోలా ఉన్నావు అని…’’ తండ్రి మాటలకు కళ్ళ నీళ్ళు తిరిగిన కమల ‘‘ఆయన నచ్చిండన్న సంతోషం కన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది గదా అనే భయం పట్టుకున్నది నాన్నా’’ అన్నది.
ఆ మాటలకు దుర్గయ్య ఒక్కసారి తనను తాను నమ్మలేకపోయాడు. ఒక విధమైన ఆశ్చర్యము, ఒక విధమైన ఒణుకు కలిగింది. ఆడపిల్లలు అమ్మా నాన్నల దగ్గర ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి చేసుకొని మరొకరితో జీవితం పంచుకోవాలని ఉన్నా తెలియని సంకెళ్ళవో పడబోతున్నాయని భయపడ్తారు. కాని తల్లిదండ్రులకు చెప్పరు, తెలియనివ్వరు. ఇవన్నీ తెలిసిన తండ్రే దుర్గయ్య. కమలను కన్నీళ్ళను పలకరిస్తూ ‘‘తప్పదు కదా బిడ్డా….’’ గాద్గిక స్వరం. ఒక ఇక్కడ ఉండలేక వెళ్లిపోయాడు.
* * *
పెంకుటింటి ముందు పెండ చాన్పి పచ్చగా మెరిసిపోతున్నది. వాకిలంతా తెల్లని ముగ్గులు నవ్వుతున్నయి. ఆ చిన్న ఇంటికే ప్రహరీగోడ పొందికగా ఉన్నది. దానికి ద్వారతోరణంగా మామిడాకులు సాదరంగా ఆహ్వానిస్తున్నవి. పందిరి గుంజలకు బంతిపూల దండలు వేళాడుతూ అందరిని పలకరిస్తున్నట్లున్నవి. పైనుండి కొబ్బరి మట్టలూ, పెండ్లి మంటపానికి కట్టిన అరిటాకులు ఆకుపచ్చదనంతో పోటీపడ్తున్నవి. పండ్లూ ఫలహారాలు తింటూ పిల్లలు అటు ఇటూ పరుగులు దీస్తున్నారు. ఇంటిముందు చావిడిలో అందరు కూర్చోడానికి చాపలు వేసి ఉ్ననవి. అటు ఇటు ఎండదగులకుండా తడకలు కట్టున్నవి. ఇంటి గోడలపైన ప్రహరీ గోడలమీదా వేసిన బొమ్మలు, జరగబోయే పెండ్లి తాలూకు సంబరాల్ని తెలుపుత్నువి. తెల్ల సున్నం గోడకు, ఎర్రని జాజుపట్టీల రేఖా చిత్రాలు, గీతలబొమ్మలు భలే అమాయకత్వపు అందాలతో ఆకర్షిస్తున్నవి. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే కొందరు పెద్దోళ్ళు చూస్తున్నారు. గణపతి పూజకాగానే ‘‘పెండ్లి పిల్లను తీసుకురావాలే’’ అని అయ్యగారు అనగానే సన్నాయి మేళం గట్టిగా వాయిస్తున్నరు. ‘‘బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెండ్లి జరిగేనే….’’ కదా! ఎంత ఆశ్చర్యం. పెండ్లి కూతురు అనగానే సిగ్గుల మొగ్గయిపోయి, ఏదో కొత్త కళతో చెప్పనలవి కాని అందంతో ఉంటారు వధూవరులు. ‘‘మాంగల్యం తంతునా….’’ మనోవాక్కాయ కర్మేణా ఒకరికొకరు ఒదిగి ఉండే అద్భుత జీవన ఘట్టానికి నాంది పెళ్ళి. దుర్గయ్య, రాధమ్మలు కన్యాదానం చేయడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు జిలకరబెల్లం పెట్టుకున్న ఆ జంటపై అక్షతలు వేస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తరువాత జరుపబోయే తలంబ్రాల తంతు కోసం ఆత్రంగా చూస్తున్నారు, ఎక్కడో ఆడుతున్న పిల్లలూ బిలబిలమంటూ వచ్చి చేరిపోయారు మంటపం దగ్గర. అయ్యవారు చెప్పినట్టు ఒద్దికగా తలంబ్రాలు పోసుకున్న జంటనే ఇక పోటీపడి తలంబ్రాలు పోసుకోవడం అందరికీ ఓ సరదా. అప్పటివరకూ ఉన్న ఉద్వేగపూరిత, భయపూరిత వాతావరణం మొత్తం ఈ తంతుతో చల్లబడి, ప్రశాంతత తెస్తుంది.
పెళ్ళి భోజనాల కోసం మగపెళ్ళి వారిని పిలవడానికి చేతిలో కుంకుమ కాయ పట్టుకోని పోయినారు, పెండ్లి పిల్ల తల్లి రాధమ్మ, ఆమె వెనుక దుర్గయ్య. అక్కడ ఏడుపు వినిపిస్తున్నది, ఆడపడుచు సత్య చుట్టు బంధువులు చేరి బుజ్జగిస్తున్నారు. విషయం తెలుసుకోగా, ఆడబిడ్డ కట్నం ఇప్పుడు ఇయ్యకుంటే పెళ్ళి ఇంట్లోంచి తినకుండా పోతనంటున్నడు మా ఆయన అని! మాట ముచ్చట్లల్లో మాట్లాడుకున్న కట్నం నేను ఇచ్చేశానే అన్నాడు దుర్గయ్య. వియ్యంకుడు దగ్గరికొచ్చి, అనుకోని అవసరం బడి ఆ డబ్బులు వాడుకున్న, పంట ఇంటికొచ్చిన తర్వాత బిడ్డకు అల్లునికి పిలిచి కట్నం బెడ్దామనుకున్నాం అన్నాడు. ఇంత కష్టపడి ఇంత జేసినాక ఆడపిల్ల ఏడ్చుకుంటు పోవడమేందని ఆలోచించుకొని, దుర్గయ్యనే ఇస్తానన్నాడు. కొద్దిసేపటికి సర్దుబాటు చేస్తేగానీ అందరూ ఆనందంగా భోజనాలు చేయలేదు. అప్పుడే తెలిసింది కమలమణికి, మోయాల్సిన బాధ్యత ఉంటుంది చాలానే అని!
* * *
రామాపురంలో ఊరు పెద్దదే, లింగయ్య కుటుంబమూ పెద్దదే. ఉన్న కొద్ది పంట చేన్లతోపాటు, చేసుకునే బడిపంతులు ఉద్యోగంతో ఎట్లాగో అట్లా నెట్టుకొస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు. భార్య చనిపోయేవరకే ఇద్దరాడపిల్లల పెండ్లిళ్ళు చేసిండు. పెద్ద కొడుకు సుధాకర్ పెండ్లి హడావిడి తగ్గింది. పదిమందిల పరువు కాపాడిన దుర్గయ్యను తలుచుకుంటుంటేనే కోడలు కమలమలమణి ఛాయగిలాసతో లోపలికొచ్చింది.
చేతికున్న గోరింటాకు ఇంకా పోలేదు. కొత్త పెండ్లి పిల్ల అప్పుడే ఇంటి పని చేస్తున్నది అనుకుంటూ ‘‘ఏం సంగతులు కమలమ్మా! చిన్నబోయి ఉన్నవు, అమ్మ నాయన యాదికొస్తున్నారా ఏంది?’’ అన్నాడు కోడలితో లింగయ్య.
‘‘అయ్యో అదేం లేదు మామయ్యా!….’’ అని అక్కడే ఆగిన కోడలుతో ‘ఏందమ్మా ఏదో చెప్పబోయినవ్, మళ్ళీ ఆగిపోయినవ్, ఏందో చెప్పు’’ అన్నడు.
‘‘నేను బడిలో ఉద్యోగం కోసం పోదామనుకుంటున్న మామ… మీకు చెప్పినాంక దరఖాస్తు బెట్టుకొమ్మన్నడు ఆయన’’ అని ఆగింది. ‘‘ఉద్యోగం జేస్తవా?’’ ఆశ్చర్యంగా అంటున్న మామగారి నుండి మరిన్ని మాటలు ఆశించకుండా.
‘‘మీ కొడుకు సంపాదన సరిపోదనిగాదు, మనకున్నవి తక్కువనిగాదు గాని ఇంత చదువుకున్న ఉట్టిగానే ఇంట్ల కూచోబుద్దయిత లేదు, టీచర్ జాబ్ అయితే మంచిగుంటదని….’’ ధైర్యంగా అన్నది కమల.
‘‘సరే! మావోడు సరేనన్నాడా? ఇంటెడు చాకిరి చేసుకోనిపోయి మళ్ల బళ్ళె చెయ్యాల్నంటె కష్టంగాదా?’’ తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ
‘‘ఏంగాదు మామయ్య, ఈ కాలంల అందరు చేస్తున్నరు గదా… ఏదో ఓటిచేసుకొని, కష్టపడదాం’’ అన్నది ధైర్యంగా.
ఆమెలోని పట్టుదల చూసి సరే అన్నడు లింగయ్య. సంబరపడిపోతూ భర్త సుధాకర్ దగ్గరికి ఉరికింది కమలమణి.
* * *
కుండపోత వాన కురుస్తున్నది. రోడ్లన్నీ జలమయమైపోయినవి. సందు సందులకు చేరుతున్న ఇళ్ళ చూర్లనీళ్ళన్నీ పల్లం కోసం పరుగులు తీస్తున్నవి. ఆకాశానికి భూమికి నీటి వంతెన ఏర్పడ్డట్టు ఎడతెగని వాన. ఇంట్లో నిండు చూలాలి ప్రసవ వేదన. ‘‘అమ్మా! అమ్మా నొప్పి! నొప్పి!’’ అరుపులు మేఘగర్జనల్లో కలిసిపోతున్నవి.
కమలమణి ఆ గడపలో కాలుబెట్టినప్పటి నుండి ఆమె చేతులమీదుగా ఇది రెండో కాన్పు! పెద్దాడ బిడ్డ మల్చూరు కాన్పు, ఇప్పుడు చిన్నాడి బిడ్డ తొల్చూరు కాన్పు. వానను సైతం లెక్కచేయక భర్త సాయంతో ఎడ్ల బండిలో చిన్నాడ బిడ్డ నెక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకొనిపోవడం, పెద్దాపరేషన్ చేయించడం, ఇంటికి తీసుకొచ్చి బాలింతకు సేవలు చేయడం, చంటిపిల్లవాణ్ణి సాకడం, ఆమెను అత్తగారింటికి పంపేదనుక కన్నతల్లిలాగా కమలనే చేసింది. తనకోవైపు వేవిళ్ళు, అన్నం సయించకున్నా, చేతగాకపోయినా పంటి బిగువున భరిస్తూ అన్ని పనులు చేసింది. కాలం దెచ్చే సంబురాలు ఆ ఇంటిలో విరిసినవి.
దుర్గయ్య, రాధమ్మలు వచ్చి తొలి కాన్పుకు తల్లిగారింట్లో జరగాలని కమలను తీసుకుపోవడంతోగాని ఆమెకు విశ్రాంతి దొరకలేదు. చదువులకని పట్నంల ఉన్న మరిది మధ్య మధ్య వీళ్ళింటికి వచ్చిపోతూ అన్న సుధాకర్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడి ముచ్చట్లు చేరవేస్తుండేది. సుఖప్రసవం అయ్యి, బిడ్డను చూసుకునే దాక ఆమె మనసంతా, అత్తగారింటి మీదికే పొయ్యేది. ఇట్లా ఇరువై ఒక్కటి అయ్యిందో లేదో నెలలోపే అత్తగారింటికి వెళ్ళిపోయింది. బ్రతిమిలాడితేగాని అన్నం తినని తమ గార్వాల బిడ్డేనా అని కమలలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు.
* * *
టీచర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ‘‘బతకలేనోళ్లు బడిపంతుళ్ళు’’ కాని ఇప్పుడు బతకనేర్చినోళ్ళు బడి పంతుళ్ళు’’. సమాజ పోకడలతో తానూ జతకడుతూ చదువు చెప్పడం, అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. అయినా ఏ మాత్రం బెదరక ఏ మాత్రం ‘పని’ మానక పనులు చేస్తూ చేస్తూ ‘తనకు ముగ్గురు సంతానమయిన తర్వాత కమల ఉద్యోగం వదిలేసింది. ఆమె ఆ నిర్ణయాన్ని ముందు భర్తకే చెప్పింది.
ముసలివాడైన మామ మంచాన బడడం, ఆడబిడ్డలిద్దరి బాధ్యతలు చూడడం, ఒకరి తరువాత మరొకరు ముగ్గురు పిల్లలవ్వడం, ఒచ్చిపోయే ఇల్లు, ఇక తన వల్లగాదని మానేసిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా భావించింది కమల. ఈ మధ్యలో మరిది చదువు పూర్తయ్యి, ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకూ పెండ్లి చేసే బాధ్యత అన్నా వదినలదే అయ్యింది. ఉన్న పొలంలో ఏదో కొంత పంట పండినా, చెల్కలన్నీ అమ్మేసి పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. గవర్నమెంటు ఉద్యోగం, మధ్య మధ్య ట్రాన్స్ఫర్లు సుధాకర్కూ కష్టమైపోతుండేది. ఎక్కడ ఉద్యోగముంటే అక్కడ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఒక్కడే ఒండుకుంటూ ఉండేవాడు. శని, ఆదివారాలు ఒచ్చిపోతూ ఉండేవాడు. పెళ్ళయ్యి రాగానే కమల తమ పెరట్లో నాటిన మందార చెట్టు ఇప్పుడు పెరిగిపెద్దయ్యింది. ఏం మారతాయి? శరీరంలో సత్తువ తగ్గడం, ఎముకలు కుంగడం తప్ప. ఎప్పుడూ ఖాళీగా ఉండడం, నింపాదిగా తినడం, హాయిగా పడుకోవడమే తెలియని కమలమణి తలలో వెండి తీగలు మెరిసేవరకు యంత్రంలా చేస్తూనే ఉండేది.
మామగారు లింగయ్య కాలం చేయడంతో ఇంట్లో ఏదో శూన్యం నిండుకున్నట్లు అనిపించినా తన పిల్లలతో వెలితిని పూడ్చుకునేది.
‘‘అమ్మా! ఇదేందే నాకు ఇంత తక్కువ మార్కులొచ్చినవి. ఛీ! ఇజ్జత్ మొత్తం బోయిందే’’ అని దుఃఖించే పెద్ద కొడుకును ఎట్లా ఓదార్చిందో, పెరిగిన రూపురేఖల ప్రభావం మీద పడి ఇబ్బంది పెట్టకుండా కన్న బిడ్డనూ చూసుకున్నది. కాలప్రవాహానికి తట్టుకునేలా చిన్న కొడుకు చదువువరకు ట్యూషన్లూ పెట్టించి మరీ చదివించేది.
ఊళ్ళో అమ్మా నాయనలు పెద్ద వయస్సోళ్ళై పోయినారన్న బాధ. వాళ్ళకెవ్వరూ చూసుకునే వోళ్ళే లేరన్న బాధ. ఒక్కగానొక్క బిడ్డను నేను గాకుంటే మరెవ్వరౌతారని వాళ్ళ విషయాలూ పట్టించుకునే కమలకు ఎక్కడ అడ్డురాలేదు భర్త సుధాకర్. అదొక్కటే ఆమెకు చేయూత. మధ్య మధ్య కన్నవారింటికి వెళ్ళిరావడం, ఇక్కడ అక్కడ ఓ మూడుతరాల వారధిగా కమల నిలబడిరది.
* * *
‘‘మణెమ్మా ఓ మణెమ్మా… ఏం జేస్తున్నవూ? రాజత్త పిలుస్తునే ఉన్నది.
‘‘ఒస్తున్నా’’
‘‘రా ఇట్లా కూర్చో…’’
‘‘ఏందత్తమ్మా ఏమాయె అంత అదురు? దా ఇట్లా కూర్చో అని గద్దెపీట చూపిస్తుంటే, రాజత్త ఒచ్చి కూర్చున్నది.
‘‘గా నడిమింటి పుల్లయ్య లేడూ….’’
‘‘ఆఁ…. ఏమైంది!’’ ‘‘వాళ్ళింట్ల దొంగలు పడ్డరంట.’’ అన్నది గట్టిగా. ‘‘అయ్యో పాపం! ఏం బోయినయి ఏంది?’’ ఆత్రుత.
‘‘దుకుణంలా నగదు ఎత్తుకుపోయిన్రట’’ అన్నది రాజత్త.
‘‘అయ్యో పాపం! కమల, ఆమె ముచ్చట్లు పెట్టుకున్నరు.
కమల, కన్నతల్లి తల్లిగారివైపు వాళ్ళంతా మణి, మణెమ్మ అని పిలిచేది. ఆమె అమ్మ చెల్లెలు, చిన్నాయన బిడ్డ. రాజవ్వది అదే ఊరు. ఊరు కూరికే కమల దగ్గరి కొచ్చిపోవుడు ‘ఊరి ముచ్చట్లు చెప్పిపోవుడు ఆమె కలవాటు. తండ్రివైపు బంధువులు కమల అంటే తల్లి వైపువాళ్ళు. మణెమ్మ అనేది. రాజవ్వ వరసకు చిన్నమ్మగావాలె. కాని ఆమెను వాళ్ళ చిన్న మామకు ఇచ్చినందుకు, ఆ వరస కన్నా ఈ వరసే ముఖ్యమని అత్త అనమనేవోళ్ళు, అందుకే రాజత్త అనడమే అలవాటయ్యింది కమలమణికి.
ఒడ్లెండ బోయించుడు, చింతపండు గింజలు గొట్టుడు, కారం దంపించుడు, పసుపు పట్టించుడు, పిండి గిర్నీకి బియ్యం పంపుడు, కందులు ఇసిరించుడు. ఒక్కటా రెండా, నలుగు రొచ్చిపోయే ఇల్లు అన్నీ ఉండొద్దా అని భర్తతోని వాదించే కమల ఏడాదికి సరిపడే గ్రాసాన్ని సిద్ధం చేసుకునేది.
‘‘పెద్దోనికి ఉద్యోగం రావాలె, చిన్నోనికి కాలేజీల సీటు రావాలె, పిల్ల చదువులో మంచిగున్నది. పై చదువులు చదివిస్తుంటేనే మంచి సంబంధం వస్తది… ఏమంటవ్’’ కమల ఎప్పుడు భర్తతో చెప్పే మాటలు. దీపావళి పండుగకు పటాకులు కాల్చినంత సంబరంగ చెప్పే మాటలు. బాధ్యత అనేది బరువుగాకుంటే బావుంటుంది. కష్టంలోనూ ఇష్టం చూసుకుంటే బావుంటుంది.
* * *
‘ఆయాసం ఒస్తుంది, ఒక్కటే గుండెల్ల నొప్పొస్తున్నది’’ అని అంటూనే పడిపోయిన కమలమణి హాస్పటల్ ఐసీయూలో నిస్తేజంగా ఉన్నది. వెయ్యి తుఫాన్లు ఒక్కసారే కూల్చినట్లు, అగాధంలోకి విసిరేసినట్టు అంతా చీకటిమయం అంతా దుఃఖమయం. ముసలి తల్లిదండ్రులు కంటి మంటికి ధారగా రోధిస్తూనే ఉన్నరు. ముగ్గురు పిల్లలు అచేతనులయిపోయినారు. వారి దుఃఖం ఎవ్వరు తీర్చలేనివి అయ్యింది.
సుధాకర్‌కు బ్రతుకంతా అంధకారబంధురమైపోయింది. కాంతి ఎగిరిపోయింది.
‘‘ఇంకో ఏడాదిలో రిటైర్ అయిపోతాను. కమల చెప్పిన లిస్ట్లేమో చాలా ఉన్నాయి రా తమ్మీ’’ అని మొన్ననే నాతో అన్నవ్ గదా అన్నా ఇంతలోనే ఒదినమ్మ ఇట్లా అయిపోయిందేందే’’ అని సుధాకర్ తమ్ముడు కన్నీళ్ళు కారుస్తున్నడు. బంధువులంత ఒక్కొక్కరు సుధాకర్‌ను పలకరిస్తూం ఉన్నరు. ఆడబిడ్డలిద్దరూ ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు.
* * *
‘‘ఏయ్ ఇగో! నిన్నే!’’
‘‘ఏంది, ఎహే! ఎవరన్న జూస్తరు.’’
‘‘ఏం కాదు! మనం మొగుడుపెళ్లాలం. ఎవ్వరేమనుకోరుగాని, నీకు ఓ మాట చెప్పాలి ఇక్కడ కూర్చో’’.
‘‘ఊఁ…’’
‘‘మా ఇంట్లో ఇంతమంది ఉన్నరు. అందరు నిన్ను పిలిచే పేరులోని నేను నిన్ను పిలువను. నీకో పేరు పెట్టుకుంటా.’’
‘‘అబ్బో! ఎందుకో?’’
‘‘నా జీవితంలో నువ్వు ఓ కొత్త వెలుగువువు కావాలె. దారి దీపంగావాలె.’’
‘‘అంటే?’’… ముసి ముసి నవ్వులతో కమల ఓరగ చూసింది.
‘‘కాంతం’’ అని పిలుస్తాను. కాంతి అంటే వెలుగు, దీపం ఇచ్చే వెలుగు’’ అంటున్న సుధాకర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ‘‘అబ్బో! నాకు నవ్వొస్తుంది. ఎవ్వరు లేనప్పుడు అట్ల పిలువుగాని, అందరి ముందట అట్ల ‘కాంతం’ అని పిలువకు సరేనా’’ అన్న కమల మాటలకు సరే నన్న ఈ ముప్ఫై ఏళ్ళ జీవితంలో ఎవ్వరికీ తెలియని పేరు ‘కాంతం’ ఇప్పుడు దూరమైపోయింది. ఒంటరిగా ఈ సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి?
సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి!
కాంతం కావాలి. నాకు కాంతమే కావాలి. కష్టాల్లో కష్టంగా, ఇష్టాల్లో ఇష్టంగా ఇన్నాళ్ళు ‘తను’ మొత్తం ‘నాది’గా అయ్యి ఇంటిని దిద్దుకొచ్చిన నా కాంతం కావాలి. ఉన్నప్పుడు తెలువదు విలువ, లేనప్పుడే తెలుస్తది. వారం రోజులు హాస్పటల్లో ఉంటే తను బాగయి ఒస్తుందనే నమ్మకంతో కష్టంగా గడిపినం. అమాయకంగా చూస్తున్న పిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు అయ్యో! ఎంత పనయ్యింది. ఆ గుండెనొప్పి ఏదో నా కన్న రాకపాయె… సుధాకర్ హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. దుఃఖ సంద్రం ప్రక్కన నిగ్రహం లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు.
మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం
- డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే సంకేతాన్ని తెలియజేయడానికి, ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి చరవాణిలో పంపిన మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి. అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం. అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ దగ్గరలో. ఒక కుటుంబంలోని పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”
జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం
– డాక్టర్ కొండపల్లి నీహారిణి
అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.
“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా? ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.
సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.
ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత
వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి. మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…
సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి? ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!
అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా
చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.
గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను పావులుగా వాడుకుంటున్నారు.
“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”
పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న
భారతదేశం ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.
ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…
రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.
“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు
పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.
మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.
అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!
____***____
నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్
నువ్వు ఏదైనా చెబితే నేను మరిచిపోతాను. నువ్వు ఏదైనా నేర్పిస్తే నేను గుర్తు పెట్టుకుంటాను
నువ్వు నన్ను పనిలో భాగం చేస్తే నేను నేర్చుకుంటాను
ఎంత సత్య వచనాలు!! నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అంటాం కదా? ఇప్పటి యువతరాన్ని చూస్తే వీటిలో ఏది నమ్ముతున్నారు అర్థం కావడం లేదు ఆలోచించాల్సి వస్తోంది. వాళ్లు వాళ్ల సమయాన్ని కోరుతున్నారు వాళ్ళదైనా సమయాన్ని మాత్రమే కోరుతున్నారు. ఈ సమయాన్ని కప్పిపుచ్చుతున్నదంతా స్వార్థం. స్వార్థం అవసరమే కొంతవరకు కానీ మితిమీరిన స్వార్థం ప్రమాదకరం. ఈ మాట స్వేచ్ఛ అనే పదంతో కూడా జోడించుకోవచ్చు మనం ఇటు స్వేచ్ఛ అటు స్వార్థం రెండూ కలగసి ఇప్పటివరకు సరైన నిర్ణయాలు తీసుకొని ఇవ్వడం లేదు. వాళ్లు వైపు మొత్తుకుంటున్నారు మాకు మా కుటుంబం అంటే ఇష్టం అమ్మ నాన్న అంటే ఇష్టం అని. తల్లిదండ్రులు వాళ్లకు టైం ను కేటాయించడం లేదు టైం స్పెండ్ చేయడం లేదు మాతోని అంటూ కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు.
పైన చెప్పిన రెండు వాస్తవాలే కానీ… స్వేచ్ఛ స్వార్థం రెండూ వాళ్ళ తెలివిని ఆలోచన నిర్వీర్యం చేస్తున్నాయి అన్నది సత్యమే తల్లిదండ్రులు సరైన సమయాన్ని పిల్లల మీద పెట్టలేకపోతున్నారు అనేది సత్యమే. మీ రెండు తప్పవు ఓవైపు బాగా చదువుకోవాలి లేదా గొప్ప ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి డబ్బు పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు యువత ఒకవైపు. ఇదే యువతకు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్లు కూడా డబ్బు సంపాదించాలి అనే కాకుండా ఉద్యోగ ధర్మం కదా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కదా అంటూ జీవితాన్నే పరిగెత్తిస్తున్నారు.
ఓ 20 ఏళ్ల క్రితం వాళ్లు పడ్డ కష్టనష్టాలు తమ సంతానం పడవద్దు అనే ఆలోచనతోనే తమ పిల్లలకు కావలసిన వాటికంటే ఎక్కువ సదుపాయాలను సమకూరుస్తున్నారు. వాళ్ళు అప్పుడు పొదుపుగా ఉన్నారు నోరు కట్టుకొని మరీ బ్రతికారు పైసా పైసా కూడ పెట్టి పిల్లల అవసరాల కోసం ఖర్చుచేసారు.మగ పిల్లాడైతే అందరిలో నా కొడుకు బాగుండాలి…. అని, నాకన్నా బాగుండాలి అని అనుకుంటున్నారు అమ్మాయైతే కొడుకులతో సమానంగా కూతుర్లను పెంచారు.ఆడపిల్లలు బాగా చదువుతున్న ఈ కాలంలో కూతురు ఎందుకు ఉద్యోగం చేయవద్దు తను తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే ఉద్యోగం చేయాలి అని గట్టిగా నమ్మి అదే బాటలో నడిచేలా చేస్తున్నారు. తప్పదు కదా అస్తిత్వ పోరాటాలలో ప్రథమ స్థానం ఇదే కదా. ఆర్థిక స్వావలంబన అవసరం కాబట్టి ఇక్కడి వరకు బాగానే జరుగుతున్నది కానీ, మరి వీటికి ప్రతిఫలంగా ఇదే సంతానం కుటుంబానికి ఏమిస్తుంది?
సాధించాలనుకున్న గమ్యానికి తమదైన ప్రతిభతో ఒక గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తున్న వీళ్ళు ఇళ్లల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. అసలు పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. ఉదాహరణగా చెప్పాలంటే… ఇంట్లో చెత్త డబ్బా తీసుకువెళ్లి చెత్త తీసుకువెళ్లే వాళ్లకు ఇవ్వాలి అనే స్పృహ ఉండడం లేదు. అదేదో మన పని కాదు అన్నట్టే ఉంటున్నారు కానీ ఎంతకని అమ్మ మాత్రమే చేస్తుంది ఎంతకని నాన్న మాత్రమే చేస్తాడు అని ఆలోచన ఉండడం లేదు. వంట ఎలా వస్తుంది టేబుల్ మీదికి అనే ధ్యాస లేని పిల్లలకు చెత్త డబ్బా గురించి ఏం చెప్తాం? అది మరీ పెద్ద విషయం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చేసేది ఎవరు? పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తేనే ఇల్లు శుభ్రం కావడం లేదంటే అట్లాగే ఉంటుంది లేదా అమ్మ చేస్తుంది ఎంతకని? ఎంతకాలం ఈ ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటుందో!
వంటలో సాయం చేయడం, ఇల్లు శుభ్రంగా .. నీట్ గా పెట్టడం అందరి పని అనుకోవడం ఇలా… ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోని యువత రేపటి రోజున ఎవరికి ఆదర్శమవుతారు? ఎలా ఆదర్శమవుతారు?
There is no elevator to success you have to take the stairs … ఈ మెట్లు ఏవి అంటే ఇదిగో ఇవే…. చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి ఇంటి పనుల్లో భాగస్వాములైతే! ఇది నిజం గా నిజం. చక్కని జ్ఞాపకాలు వెంట వస్తాయి. అమ్మా నాన్న ల కష్ట సుఖాల్లో మేం ఉండాలి అని అనుకున్న వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు.
పాపం ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అస్సలు పని నేర్పుకుంటారు. బహుశా విధి విధానాలు వేరుకావచ్చు. అంతేకానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లలు సోమరులు అవ్వాలనో దుర్మార్గాలు తొక్కాలనో అనుకోరు.
The greatest gifts we can give our children are the roots of responsibility and the wings of independence అంటాం కదా! స్వేచ్ఛ తో పాటు బాధ్యత లను నేర్పించాలి. పదహారేళ్ళు వచ్చాక కూడా బుద్ధి రాకుంటే ఎట్లా? చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బయటి వాళ్ళు చెప్పేవి…. మీ జీవితం బలి కాకుండా చూసుకోవాలి.
సెప్టెంబర్ 2024 మయూఖ పత్రిక సంపాదకీయం
ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!
మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.
ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.
లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!
రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?
ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.
రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.
ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!
