Nampalli Sujatha
Nampalli Sujatha
నా తల్లిదండ్రులు శ్రీమతి కేదారమ్మ,కీ.శే.అన్నవరం దశరథం ఉపాధ్యాయులు. సహచరులు ..శ్రీ నాంపల్లి రాములు హెచ్ ఎమ్ టి రిటైర్డ్ ఎంప్లాయ్ హైదరాబాద్. జన్మస్థలం పోతారం(S), మండలం హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట. చదువు ప్రైమరీ అంతా పోతారం లోనే,సెకండరీ విద్య హుస్నాబాద్, డిగ్రీ మరియు పిజి హైదరాబాద్, వృత్తి.. స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ZPHS బస్వాపూర్ మం.కోహెడ,జిల్లా సిద్దిపేట. నివాసము.. హైదరాబాద్. పిల్లలు ఇద్దరు అబ్బాయిలు.. సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ హైద్రాబాద్ ప్రచురించిన పుస్తకాలు 1) నెమలీకలు --2006 నానీలు 2) మట్టి నా ఆలాపన --2009 కవిత్వం 3) మట్టి నానీలు --2015 నానీలు 4) జొన్నకంకి --2020 కవిత్వం 5) హోమ్ మేకర్--2023 కవిత్వం 6) కుదురు--2025 సాహిత్య వ్యాసాలు - సమీక్షలు పురస్కారాలు సీనియర్ సిటిజన్స్,లైన్స్ క్లబ్,ప్రేరణా వారి ఉత్తమఉపాధ్యాయకవి అవార్డు --2018 కొండూరు రాఘవరావు,రాజ్యలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి మొల్ల అవార్డు --2017 పాత రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయినీ పురస్కారం --2018 --- కవయిత్రి మొల్ల కళావేదిక,తాండూరు వారి మొల్ల సాహిత్య పురస్కారం--2022 ---- లలిత కళాభిరామ పించము వారి ఉత్తమ కవయిత్రి పురస్కారం--2022 ----- శాలివాహన జాతీయ విశిష్టవనితా పురస్కారం-- 2023 ----- సైమన్ ఫౌండేషన్ పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం--2023 ----- తెలంగాణ ప్రభుత్వం వారి మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మొదలగునవి - కుటుబనేపత్యం..సృజన కారుడైన నాన్న మార్గదర్శకత్వం లోనే -అన్నయ్య అన్నవరం దేవేందర్ తెలంగాణలోని ప్రముఖ కవి నాకు ప్రేరణ.. -తమ్ముడు అన్నవరం శ్రీనివాస్ ప్రముఖ ఆర్టిస్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడు -కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సుప్రసిద్ధ మహాకవి డాక్టర్ ఎన్.గోపి గారి స్ఫూర్తి వల్లే నానీల ప్రక్రియ ద్వారానే సాహితీ ప్రపంచానికి సుపరిచయం -చిన్నప్పుడే వివాహం జరగడం వల్ల నా ఉన్నత విద్య అంతా వివాహం తర్వాతనే - నాలోని సంకల్పము,అంకితభావానికి మా వారి ప్రోత్సాహం నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించాయి. -చదువుకోవాలనే కోరిక మనలో ఉన్నట్లయితే పేదరికమూ,వివాహమూ,పిల్లలూ పెద్ద ఆటంకాలు కావనిపిస్థాయి నా సబ్జెక్టు సాంఘిక శాస్త్రం కాబట్టి నేను హక్కులు బాధ్యతలు స్వేచ్ఛా సమానత్వాల గురించి మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు చెపుతుంటాను. -మహిళల వెనుకబాటుకు కారణాలు సాధికారత చదువు శాస్త్రీయ అవగాహన లేకపోవడమే నని విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటాను. - విద్యార్థులకు కవిత్వం,కథలూ రాయడంలో మెలకువలను నేర్పుతూ ఉంటా -ఎందరో విద్యార్థులను కవులుగా తీర్చిదిద్ది ప్రోత్సహించాను. నాకు నచ్చిన కవిత్వం ... -అభ్యుదయ కవిత్వం ముఖ్యంగా శ్రీశ్రీ 'అలిశెట్టి ప్రభాకర్ , డా.గోపి గార్లవి, -నచ్చనివి మూడ నమ్మకాలు, మహిళలను చిన్న చూపు చూడడం, లింగ వివక్ష మొదలైనవి -కోరుకునేది ప్రతివాళ్ళు అజ్ఞానాన్ని తొలగించుకొని మానవత్వాన్ని పెంచుకుని నలుగురికి మార్గదర్శకులుగా ఉండాలనీ..కోరుకుంటా..
