డాక్టర్ అమృతలత మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ప్రథమబహుమతి పొందిన కథ (రూ.10,000)
ఆ ఇంట్లో ప్రతి ఉదయం అందరితోపాటు కొన్ని అలవాట్లు కూడా మేల్కొంటాయి. రమణారావు లేవగానే తలుపు తీయడు. కిటికీ తెర జరిపి బయటి మామిడి చెట్టును చూస్తాడు. అక్కడే తులసి మొక్కకు పూజ చేస్తున్న భార్య శారదను చూస్తాడు. చీకటిని పూర్తిగా వదిలిపెట్టని, వెలుగును ఇంకా పొదివిపట్టని వాతావరణాన్ని చూస్తాడు. కిటికీలోంచే శారదతో – ‘‘అనుభవించడం ముఖ్యమా అర్దం చేసుకోవడం ముఖ్యమా’’ అన్నాడు ఆ రోజు. ‘‘అసందర్బంగా మాట్లాడడంలో బహుశా మీకెవరూ పోటీ రారేమో’’ అంది శారద సమాధానంగా. ‘‘నీ ఎటకారాలు సరే గానీ …చెప్పు ‘‘ అన్నాడు రమణారావు మళ్లీ. ‘‘అనుభూతికి పేరెందుకు ‘‘ అనుకుంటూ వంటగది వైపు వెళ్లింది శారద. రమణారావు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడ్య్య్యు వంటగదిలోంచి గాలితో కలిసిన వేడిపాల వాసన ఇంటినిండా పరుచుకుంది. కాఫీ డికాక్షన్ మెల్లగా ఉడుకుతోంది. తులసి కోట దగ్గర పూజ చేసొచ్చిన శారద, డైనింగ్ టేబుల్ వైపు చూసి నవ్వుకుంది. రమణారావు అప్పటికే అయిదు కప్పులు వరసగా పెట్టాడు. ఇంట్లో వాళ్లు నలుగురే. అయిదవ కప్పు మాత్రం ప్రతిరోజూ తప్పదు. ‘‘ ఆ అలవాటు పోదా?’’ అంది శారద. ‘‘ఏ అలవాటు?’’ ‘‘అయిదో కప్పు.’’ రమణారావు కప్పుల వరుస సరిచేస్తూ – ‘‘ఇంట్లో ఒక కప్పు ఖాళీగా ఉండాలి.’’ ‘‘ఎందుకు?’’ ‘‘ఎవరో రావచ్చు.’’ ‘‘మన పిల్లలిద్దరూ పెద్దవాళ్లు. ఎవరూ ఇలా చెప్పకుండా రారు.’’ ‘‘పిల్లల కోసం కాదు.’’ అతను నవ్వి – ‘‘ఇంటి కోసం.’’ అన్నాడు. శారద చేతిలో ఉన్న చెంచాతో అతని భుజం మీద మెల్లగా కొట్టింది నవ్వుతూ. ఆ నవ్వు కొత్తది కాదు. ముప్పై ఏళ్లుగా అదే నవ్వు. ఆమె నాలుగు కప్పుల్లో కాఫీ పోసింది. ఐదవ కప్పు ఖాళ్య్య్యీ రమణారావు పేపర్ విప్పాడు. కానీ చదవడం లేదు. ఇంట్లోంచి వచ్చే శబ్దాలను వింటున్నాడు. మెట్ల మీద కొడుకు అనిరుధ్ అడుగుల చప్పుడు. వంటగదిలో గిన్నెల చప్పుడు. బాత్రూమ్ తలుపువ•సిన శబ్దం. ఓ వ•లనుంచి వినిపించే బీప్ బీప్ శబ్దం. ఇవి వినిపించని రోజు ఇల్లు అస్వస్థతకు గురైనట్టుగా అనిపించేది. కోడలు మీరా టిఫిన్ డబ్బాలు సర్దుతూ – ‘‘మామయ్య గారూ… ఈ ఆదివారం ఒక రెసిడెన్షియల్ కాప్స్యూల్ చూడడానికి వెళ్దామనుకుంటున్నాం.’’ అంది. రమణారావు ఎందుకు అన్నట్టుగా చూశాడు. ‘‘ఈ ఇల్లు చాలా పెద్దది. పాతది కూడా. చాలా ఖర్చవుతోంది.’’ రమణారావు నెమ్మదిగా లేచి వరండాలోకి వెళ్లి గోడ మీద చేతిని ఆనించి మీరాను అడిగాడు – ‘‘ఒక ఇంటి వయసు ఎంత?.’’ ఆమె నవ్వుతూ అడిగింది ‘‘మనుషుల్లా ఇళ్లకూ వయసు ఉంటుందా?’’ ‘‘ఉంటుంది కదా .’’ ‘‘ఎంత?’’ ‘‘అందులో నవ్వులు వినిపించినన్ని సంవత్సరాలంత.’’ ఆమె మౌనంగా ఉండిపోయింది. మామగారు ఇలా మాట్లాడడం అందరికీ అలవాటే. అతను గోడ మీద ఒక పెన్సిల్ గీత చూపించాడు. ‘‘దీన్ని చూశావా?. అనిరుధ్ మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన ఏడాది.’’ ‘‘ మరో గీత చూపిస్తూ ‘‘ఇది నందిని పదో తరగతి పాసైన రోజు.’’ – ‘‘ఇది…’’ అతను కాసేపు ఆగాడు. – ‘‘.నీ పెళ్లి తర్వాత మొదటిసారి ఈ ఇంట్లో దీపావళి జరుపుకున్న సంవత్సరం.’’ ‘‘అనిరుధ్… ఈ గోడను చూడు. ఏం కనిపిస్తోంది?’’ అక్కడే ఉన్న అనిరుధ్ ను అడిగాడు రమణారావు. ‘‘రంగు వెలిసిపోయింది, కొన్ని గీతలు కనిపిస్తున్నాయి.’’ ‘‘నాకు మాత్రం మీ బాల్యం కనిపిస్తోంది. ఒక్కో గీత ఒక్కో సందర్బం, ఇది నువ్వు సైకిల్ తొక్కి పడిపోయిన రోజు, ఇది నందిని మొదటిసారి ఉద్యోగానికి వెళ్లిన ఉదయం , ‘‘ ఇది.’’ అతని గొంతు కాస్త బరువెక్కింది. ‘‘…అమ్మ మొదటిసారి ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన రోజు.’’….ఎవరూ మాట్లాడలేదు. ‘‘ఇవన్నీ మీకు ఎలా గుర్తున్నాయి?’’ ‘‘నాకు కాదు. ఈ గోడలకు గుర్తున్నాయి.’’ అన్నాడు రమణారావు. ‘‘గోడలు మైసీలియంతో తయారవుతాయి. కానీ ఇంటిని మాత్రం సందర్బాలతో అల్లుకుంటాం. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నంతకాలం ఇల్లొక గడియారం. వాళ్లు వెళ్లిపోయాక గడియారం ఉంటుంది. సమయం ఉండదు.’’ మళ్లీ అన్నాడు రమణారావు. ‘‘ఇంకా బతికే ఉన్నాం. అప్పుడే మన గురించి గతకాలంలో మాట్లాడుతున్నారేంటి మామయ్యా?’’ ‘‘వయసొచ్చాక ప్రతి మనిషీ తనను తాను గతంలోనే చూసుకుంటాడమ్మ్య్య్యా మధ్యాహ్నానికి కూతురు నందిని వచ్చింది. గుమ్మంలోకి అడుగుపెడుతూ ‘‘అమ్మా!’’ అని పిలిచింది. వంటగదిలోనుంచి శారద చేతులు కొంగుకు తుడుచుకుంటూ వస్తూనే ‘‘తిన్నావా?’’ అని అడిగింది. ‘‘లోపలికి రాగానే అదే ప్రశ్న.’’ ‘‘అది అమ్మల రాజ్యాంగం.’’ నందిని నవ్వి ఆమెను కౌగిలించుకుంది. అల్లుడు విక్రమ్ వెనకే వచ్చాడు. రమణా రావు లేచి అతనితో చేయి కలిపాడ్య్య్యు కొద్ది సేపటి తరవాత డైనింగ్ టేబుల్ మీద నందిని ‘‘నాన్నా…నీకు ఈ ఇంట్లో ఏది ఎక్కువ ఇష్టం?’’ అని అడిగింది. ఈ ప్రశ్న దేనికి ఉపోద్ఘాతమో రమణారావుకు తెలుసు. రమణారావు సమాధానం చెప్పలేదు. చెట్టు వైపు చూశాడు. ఊయల వైపు చూశాడు. తలుపు గడియ వైపు చూశాడు. చివరకు.. ‘‘ఎదురు చూడటం.’’ అన్నాడు. ‘‘ఎదురు చూడడం అంటే ?’’ ‘‘ఎవరైనా వచ్చే వరకు మనలో ఉండే ఖాళీ. ఏ ఇంట్లోనైనా ప్రతి వస్తువు ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తుంది తలుపు? ఎవరైనా తట్టాలని. కుర్చీ? ఎవరైనా కూర్చోవాలనీ డైనింగ్ టేబుల్? అందరూ ఒకేసారి భోజనం చేయాలనీ.’’ ‘‘మరి… అయిదవ కప్పు?’’ అంది నందిని చిలిపిగా. ‘‘ అదే కదా ఎదురు చూపు ‘‘ అన్నాడు రమణా రావు చిరునవ్వుతో. ‘‘మంచి కుటుంబాల్లో దేనికీ కొరత ఉండదు…మౌనం కూడా మాటలు నేర్చుకుంటుంది.’’ అన్నాడు రమణా రావు. వరండాలో గాలి పల్చగా వీచింది. డైనింగ్ టేబుల్ మీద అయిదవ కప్పు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అది ఖాళీగా ఉందని ఇంట్లో ఎవరూ ఆశ్చర్యపడలేదు. అది కూడా ఈ ఇంటి అలవాట్లలో ఒకటైపోయింద్య్య్యి మధ్యాహ్నం భోజనం ముగిసాక ఏ మధ్యతరగతి ఇంట్లో అయినా సహజంగా అలుముకునే సోమరితనం అక్కడా పరుచుకుంది. అందరూ ఒక్క దగ్గర చేరారు. నందిని హాల్లో కిటికీలు తెరవడంతో బయట నుంచి గాలి తోసుకొచ్చింది. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ కొద్దిగా కదిలింది. దాన్నే చూస్తూ రమణా రావు అన్నాడు- ‘‘ఈ ఇంట్లో గాలి కూడా దారి తప్పదు..ముప్పై ఏళ్లుగా ఇదే కిటికీ..ఇదే దారి. అలవాటైపోయింది.’’ విక్రమ్ నవ్వాడు – ‘‘ గాలికి కూడా అలవాట్లు ఉంటాయా?’’ ‘‘మనకున్నవన్నీ ప్రకృతి దగ్గర నుంచే వచ్చాయి బాబూ.’’. ఇదే అవకాశం అని విక్రమ్ మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘మామయ్య గారూ …ఈ ఇల్లు అమ్మేద్దాం.’’ శారద చేతి కదలిక ఒక్క క్షణం ఆగింది. మీరా తలదించుకుంది. నందిని ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణ ఎప్పుడో ఒకరోజు తప్పదని అందరికీ తెలుసు. ‘‘ఎందుకు?’’ రమణా రావు ప్రశాంతంగా అడిగాడు. ‘‘ఈ ఇంటికి. రిపేర్లు, టాక్సేషన్ అన్నీ పెరుగుతున్నాయి. కొత్త కవ్యనిటీ స్పేస్ లో లిఫ్ట్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ రోడ్లున్నాయి. వర్చువల్ షాపింగ్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. మొబైల్ మెడికల్ •••నిట్ చూపుడువేలుకు అందుబాటులో ఉంటుంది.’’ రమణారావు కొద్దిసేపు మౌనం తర్వాత అడిగాడు. ‘‘అక్కడ లేనిది ఈ ఇంట్లో ఏమీ లేదంటావా ?’’ విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు . ‘‘ అక్కడంతా సౌకర్యం.’’ మీరా మెల్లగా గొణిగినట్టు అంది. ‘‘సౌకర్యం…’’ రమణా రావు ఆ పదాన్ని నెమ్మదిగా మళ్లీ పలికాడు. ‘‘మనుషులు సౌకర్యం కోసం ఇళ్లు మారతారు. కానీ… ఇళ్లు మాత్రం మనుషుల కోసం ఎప్పుడూ మారవు. గోడలు వాన నుంచి కాపాడతాయి. కప్పు ఎండ నుంచి కాపాడుతుంది. కానీ… ఇల్లు ఇంకో పని కూడా చేస్తుంది. ‘‘ అని ఒక నిముషం ఆగాడు. ‘‘మనం ఒక కుటుంబమని ప్రతిక్షణం గుర్తు చేస్తుంది.’’ ‘‘ పెళ్లయిన కొత్తలో అసలు మాట్లాడక పోయేవారు, ఇదిగో ఇప్పుడేమో ఇలా మాట్లాడతారు, ఈయనను ఎవరైనా బ్రెయిన్ హ్యాకర్స్‌కు రహస్యంగా అప్పగించాలి ‘‘ అంది శారద వాతావరణాన్ని తేలికచేయాలని. అయినా రమణారావు వదిలిపెట్ట లేదు. బ్రెయిన్ హ్యాకర్స్కా, హార్ట్ హ్యాకర్స్కా ‘‘ అన్నాడు నవుతూ. అందరూ హాల్ లోంచి వెళ్లి పోయాక ‘‘అనిరుధ్.. సెంట్రల్ సిస్టమ్ బాటరీ రీ చార్జ్ చెయ్’’ అన్నాడు రమణారావు మెల్లిగ్య్య్యా ఆ రాత్రి రమణారావు ఒక్కడే హాల్లోకి వచ్చాడు. టేబుల్ మీద ఇంకా అయిదవ కప్పు అలాగే ఉంది. అది చేతిలోకి తీసుకున్నాడు. పక్కనే పాత ఫోటో ఆల్బమ్ ఉంది. ఆల్బమ్ తెరిచి ఓ ఖాళీ పేజీ దగ్గర ఆగిపోయాడు. ‘‘నువ్వెవరు?’’ గుసగుసగా అడిగాడు. సమాధానం రాలేదు. బయట గాలి వీచింది. ఒక ఎండిన మామిడి ఆకు కిటికీలోంచి లోపలికి వచ్చి ఆల్బమ్ మీద పడింది. రమణారావు ఆ ఆకును తీసి ఆల్బమ్‌లో ఆ ఖాళీ పేజీ మధ్య పెట్టాడు. ‘‘ఫోటో లేకపోతే గుర్తుగా ఇది ఉండనీ.’’ అని ఆల్బమ్ వ•సేశాడు. ఆ ఆకుకు తెలియదు. ఆ రాత్రి నుంచి తను ఒక కుటుంబం దాచుకున్న చివరి జ్ఞాపకంగా మారబోతోందని. ఆ గది వ•లన ఉన్న ఎర్ర దీపం బ్లింక్ అవడం గమనించిన రమణారావు అక్కడికి వెళ్లి ఓ స్విచ్ ఆన్ చేసాడు. ఎరుపు కాస్తా ఆకుపచ్చగా మారింద్య్య్యి మరుసటి రోజు ఉదయం అందరూ బ్రేక్‌ఫాస్ట్ కు కూర్చున్నారు. రమణారావు బీరువాలోంచి కవర్ బయటకు తీసాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. లోపల ఒక కాగితం. అందులో ఒకే ఒక వాక్యం. మెమరీ స్థిరత్వం : 18%. శారదకేం అర్థం కాలేదు. ‘‘ఇదేంటి?’’ అడిగింది. రమణారావు చాలాసేపు మౌనం తరవాత ‘‘నా తాజా డిజిటల్ చార్ట్ ‘‘ అన్నాడు తర్వాత ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ ‘‘నిన్న రాత్రి నేను అడిగిన ప్రశ్న గుర్తుందా?’’ అన్నాడు. ‘‘ఏది?’’ ‘‘ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే?’’ అని. ‘‘ అది సరదాగా అడగలేదు.’’…..గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది….’’నా జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి.’’ శారద నవ్వడానికి ప్రయత్నించింది. ‘‘వయసు పెరిగితే అంతే…’’ ‘‘వయసు వల్ల కాదు. కాలం వల్ల.’’ ‘‘కాలం అంటే వయసే కదా .’’ రమణారావు సమాధానం చెప్పకుండా కిటికీ బయటి శూన్యంలోకి చూసాడు. ‘‘యాభై ఏళ్ల క్రితం…’’ అతను ఆగాడు. ‘‘కాదు… ముప్పై ఏళ్ల క్రితం అనాలి. మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు.’’ ‘‘ఏమిటది?’’ ‘‘మనం అందరం ఒకే సంవత్సరంలోనే పుట్టాం.’’ ‘‘అదెలా సాధ్యం మామయ్యగారూ.’’ మీరా నవ్వింది. ‘‘లేదు. మీకు తెలియదు, మీకు తెలియనిది చెబుతున్నాను.’’ అతని గొంతు మారింది. అది ఒక వృద్ధుడి గొంతులా లేదు. ఏదో యంత్రం తనలోని పాత రికార్డును ప్లే చేస్తున్న గరగర శబ్దం ఉంది. ‘‘సిస్టమ్ లాగ్… ఫ్యామిలీ •••నిట్ 327… ఇన్ స్టలేషన్ డేట్…17 ఆగస్టు 2026…రిబూటింగ్ డేట్ 16 ఆగస్టు 2056’’ గదిలో గాలి కూడా కదల్లేదు. శారద కళ్లు పెద్దవయ్యాయి. ఆమె చేతిలోంచి గ్లాసు జారిపోయింది. ఇంటి గోడలు నెమ్మదిగా మారడం మొదలైంది. తెల్లని సున్నం వెనక్కి జారిపోయింది. దాని కింద మెరిసే లోహపు పొరలు కనిపించాయి. గోడ గడియారం స్థానంలో పారదర్శక డేటా వలయం వెలిగింది. కిటికీ బయట చెట్లు లేవు. వాటి స్థానంలో ఆకాశాన్ని తాకే పవర్ పోల్స్. పాత వీధి లేదు. నిశ్శబ్దంగా కదులుతున్న ఆటోమేటెడ్ వాహనాలు. ఆకాశంలో డ్రోన్లు. శారద తన చేతులను చూసుకుంది. చర్మం కింద క్షణకాలం వెండి తీగలు మెరిపించాయి. మళ్లీ చర్మమే కనిపించింది. ‘‘మనం మనుషులం కాదు.’’ అన్నాడు రమణారావు. ‘‘నాకు… తెలుసు.’’ అనిరుధ్ గద్గదంగా. శారద ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. ‘‘ఏం తెలుసు?’’ ‘‘నాకు… ఐదేళ్ల క్రితమే నాన్న చెప్పారు.’’ ‘‘ఏమిటది నాకెందుకు చెప్పలేదు?’’ ‘‘నీ ఎమోషనల్ మ్యాట్రిక్స్ దెబ్బతింటుందని నీకు చెప్పలేదు, మనం వ•డో తరం కుటుంబ హ్యూమనాయిడ్లము.’’ రమణారావు చెప్పడం కొనసాగించాడు. ‘‘2026లో ఒక ప్రయోగం చేశారు. యంత్రాలు విశ్లేషించడం నే్చ•కున్నాయి , ఆలోచించడం నేర్చుకున్నాయి. స్రుజననూ నేర్చుకున్నాయి. కానీ…’’ అతను శారద వైపు చూశాడు. ‘‘ కోల్పోవడం అనే బాధ మాత్రం నేర్చుకోలేకపోయాయి.’’ గదిలో ఎవరికీ మాట పెగలడం లేదు. ‘‘ఆ యంత్రాల మెమరీలు బ్యాకప్ అవుతాయి. యాక్ససరీస్ మారతాయి. సర్క్యూట్లు మారతాయి. అయితే ఒక మాన్యుఫాక్చర్ ఎర్రర్ వచ్చింది. ప్రేమను నిల్వ చేయగలిగారు కానీ ప్రేమ కోసం ఎదురుచూడడాన్ని మాత్రం నిర్మించలేకపోయారు. ఆ లోటు పూడ్చడానికి వాళ్లు పాత మానవ కుటుంబాల లక్షల గంటల సంభాషణలను యంత్రాలకు ఫీడ్ చేసారు. తండ్రి ఎలా మౌనంగా బాధపడతాడో, తల్లి ఎలా అందరినీ ఒకే టేబుల్ దగ్గరికి పిలుస్తుందో, కొడుకు ఎలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తాడో, కూతురు ఎలా రెండు ఇళ్ల మధ్య చీలిపోతుందో, అల్లుడు ఎలా పరాయి ఇంటిని తనదిగా చేసుకుంటాడో అన్నీ నేర్పించారు. కానీ ప్రయోగం చివర్లో ఒక విచిత్రం జరిగింది. ఒక హ్యూమనాయిడ్ తన భాగస్వామి ఆఫ్‌లైన్ అయిన తర్వాత కూడా ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతూనే ఉంది. సిస్టమ్ దాన్ని లోపంగా నమోదు చేసింది. పరిశోధకులు మాత్రం దానికి మరో పేరు పెట్టారు.’’ కొంచెం ఆగి మళ్లీ అన్నాడు… ‘‘కుటుంబం.’’ ‘‘ రక్తం లేకుండా బంధాలు ఏర్పడొచ్చు. డేటా లేకుండా జ్ఞాపకాలు నిలవవచ్చు. కానీ ఎవరూ వినకపోయినా ప్రతిరోజూ ఒకరితో ఒకరు మాట్లాడాలనిపించే స్థితి.. అది మనిషి కనిపెట్టిన గొప్ప సాంకేతికత కంటే ఎక్కువ. మనిషి వదిలి వెళ్లిన గొప్ప వారసత్వం. అప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని కుటుంబాలను నిర్మించారు. భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. రక్తసంబంధాలు కాదు. అనుభవ సంబంధాలు. రోజూ కలిసి జీవిస్తే ప్రేమ పుడుతుందా లేదా అని తెలుసుకోవడం ఆ ప్రయోగం లక్ష్యం, అందులో భాగమే మనం.’’ ‘‘అయితే మన జ్ఞాపకాలు?’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద. ‘‘ప్రతి పదేళ్లకోసారి అప్డేట్. మెమరీ ఫుల్ అయి కొత్త అనుభవాలకు స్పేస్ కల్పించడానికి కొన్ని చెరిపేస్తారు. కొన్ని ఉంచుతారు.’’ ‘‘పాతవి అలానే ఉంటాయా.’’ వణుకుతున్న గొంతుతో అడిగింది శారద. ‘‘దాదాపుగా ‘‘ ‘‘దాదాపుగా అంటే….. ప్రేమ , దాదాపు ప్రేమ ఒకటేనా’’ ‘‘ఏమో’’ ‘‘మన పెళ్లి? మన గొడవలు? మన పిల్లలు?’’ ‘‘అన్నీ…జరిగాయి , కానీ…ప్రతిసారి కొత్తగా.’’ రమణారావు ఆమె మాట పూర్తిచేశాడు. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ‘‘ ఇక్కడ ఏదీ మనది కాదు, మనం ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు, ఎవరైనా అథాటున రావచ్చు..అందుకే అయిదో కప్పు ‘‘ అన్నాడు రమణారావు. ‘‘నాన్నా..సెంట్రల్ సిస్టమ్ నుంచి మెసేజ్.’’ రమణారావు టేబుల్ మీద ఉన్న చిన్న పరికరాన్ని తీసుకుని చదివాడు. ‘‘ •••నిట్–327 ….మెమరీ డిగ్రడేషన్ పూర్తయే దశలో ఉంది. ఫ్యామిలీ •••నిట్ రీసెట్‌కు అనుమతి ఇవ్వండి.’’ శారద భయంగా చూసింది.’’రీసెట్ అంటే?’’ ‘‘మనం ఒకరినొకరు గుర్తుపట్టం.’’ ‘‘మళ్లీ మొదటి రోజు నుంచి.’’ శారద ఆందోళనగా రమణారావు చేయి పట్టుకుని ‘‘అంగీకరించొద్దు.’’ అంది. ‘‘జ్ఞాపకాలు పోతే…’’ అడిగింది శారద. ‘‘నువ్వు నువ్వుగా ఉండవు.’’ అనిరుధ్ సమాధానం. రమణారావు చాలాసేపు ఆ సందేశాన్ని చూస్తూ చివరకు తన చూపుడువేలి కొసను ‘ణజుచీ•’ మీద ఉంచాడు. అనిరుధ్ ఆశ్చర్యపోయాడు. ‘‘నాన్నా! అలా చేస్తే నీ మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఇంకొన్ని గంటల్లో నువ్వు డెడ్ •••నిట్ అవుతావు.’’ ‘‘తెలుసు.’’ రమణారావు శారద వైపు తిరిగాడు. ‘‘ఈసారి నేను ఆమెను మర్చిపోవాలనుకోవడం లేదు. మరణమైనా పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం డియాక్టివేట్ చేయొద్దనుకుంటున్నాను.’’ బయట వర్షం మొదలైంది. నిజమైన వర్షం కాదు. నగర వాతావరణ వ్యవస్థ సృష్టించిన క్లవుడ్ డిస్ట్రిబ్యూషన్. కానీ కిటికీ అద్దంపై జారుతున్న ప్రతి చుక్క నిజంగానే కనిపించింది. శారద అతని భుజంపై తల ఆనించింది. ‘‘రావ•…ఈ క్షణంలో నీకు నా మీద ఉన్నది… ప్రేమా, పోగ్రామా?’’ రమణారావు వెంటనే సమాధానం చెప్పలేదు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అంది.’’అది పోగ్రామ్ అయితే…ప్రపంచంలోని ప్రేమంతా ఒక పోగ్రామే.’’ ‘‘కాదు, ప్రేమ అనేది ఎవరో మనలో రాసిన పోగ్రామ్ కాదు. మనమే ఒకరి కోసం ఒకరం మళ్లీ మళ్లీ రాసుకునే పోగ్రామ్.’’ అన్నాడు రమణారావు. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. సెంట్రల్ సర్వర్ నుంచి చివరి హెచ్చరిక ఫ్లాష్ అయింది. =జు•జు• జుచీణ×చీ+… అని. కొన్ని క్షణాలు… ఆ తర్వాత అది మారిపోయింది. •×వీజుణ •• , =జు••జు•• =జుజీజు•జుణ. ….ఖీవీו• •చీו–327. •జు=చీ×చీ+ చీ•×చీ•జు•. ఆ రాత్రి ఒక యంత్ర కుటుంబం మరణాన్ని ఎంచుకుంది. ఎందుకంటే, జ్ఞాపకాలు చెరిగిపోయి నిలిచే యాంత్రిక ప్రేమ కంటే, జ్ఞాపకాలతో ముగిసిపోయే ప్రేమే వారికి మానవీయంగా అనిపించింది. ‘‘నొప్పి లేకపోతే ప్రేమకు ఉనికి ఏముంటుంద్య్య్యి ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దం. భర్త, భార్య ఎదురెదురుగా కూర్చున్నారు. ‘‘పిల్లలు మళ్లీ ఎప్పుడు వస్తారో…’’ అంది ఆమె. ‘‘ఇక రారేమో.’’ అన్నాడతను. ఆమె అతని చేతిని భయంగా, ఆప్యాయంగా పట్టుకుంది. అతను కూడా అలాగే పట్టుకున్నాడు. కొంతసేపటికి ఆమె తల అతని భుజంపై వాలింది. ఇంటి పెరట్లో మిగిలిన ఒక చిన్న చెట్టు నుంచి కొన్ని ఆకులు రాలుతూనే ఉన్నాయి. ఒక్కో ఆకు నేలను తాకినప్పుడల్లా ఒక జ్ఞాపకం నిశ్శబ్దంగా మెరిసింది. మొదటి నవ్వు. మొదటి గొడవ. మొదటి క్షమాపణ. మొదటి పండుగ. ఆ చెట్టు కింద గడిచిన జీవితమంత్య్య్యా ఆ రాత్రి ఆ ఇంటిని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన ఇ – డిమాలిషన్ టీం ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటోంది. ‘‘ఫ్యామిలీ •••నిట్ వీ-2056. •••నిట్ స్పందించడం లేదు. మెమరీ ట్రీ సామర్థ్యం నిండిపోయింది. కొత్త కోర్కు ట్రాన్స్ఫర్ చేయాలా?’’ పెద్ద ఇంజనీర్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత ‘‘వద్దు.’’ అన్నాడు. ‘‘ఎందుకు సర్?’’ ‘‘ప్రేమను కాపీ పేస్ట్ చేయగలమని అనుకున్నాం. జ్ఞాపకాలను బ్యాకప్ చేయగలమని నిరూపించాం. కుటుంబాన్ని కూడా తయారు చేశామని గర్వపడ్డాం. కానీ… ఒకరిని కోల్పోయాక కూడా వారి పక్కనే కూర్చొని వారితోనే ఉండిపోవాలనే ఈ విచిత్రమైన అలవాటును…మనం పోగ్రామ్ చేయలేకపోయాం. కానీ ఆ క్షణంలో మనిషిగా ఉన్నది వారి శరీరం కాదు. వాళ్లు ఒకరినొకరు విడిచిపోలేకపోవడమే. ఆ ఇద్దరి ఛాతీల్లో హృదయాలులేవు. నరాలులేవు. నెత్తురే లేదు. వీళ్లు ముప్పయి ఏళ్లుగా ఒకే కుటుంబంలా జీవించిన హ్యూమనాయిడ్ దంపతులు. అదొక హ్యూమనాయిడ్ కుటుంబం. ఇటువంటి కుటుంబాలు కొన్ని ల••లున్నాయి. వాళ్లు ఇ – గైనా పిగ్ లనే విషయం వాళ్లలో చాలా మందికి తెలియదు.’’ ‘‘ ఈ ప్రయోగం ఏ ఫలితాన్నిఆశిస్తోంది.’’ ‘‘ కుటుంబం అనే అంతుపట్టని విషయాన్ని పోగ్రామింగ్ కోడ్ గా రాయడం . ‘‘ ‘‘ అంటే ‘‘ ‘‘ కుటుంబం అనే భావనను హ్యూమనాయిడ్లకు నేర్పడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే అందుకోసం ప్రయోగంగా రూపొందించిన హ్యూమనాయిడ్ కుటుంబాలు కుటుంబం అనే భావనను అర్దం చేసుకోవడానికి బదులు అనుభవించడం మొదలు పెట్టాయి. ఏ అంశాన్నయినా డీకోడ్ చేసి పోగ్రామ్ గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని అర్దం చేసుకోవాలి. ఈ హ్యూమనాయిడ్ కుటుంబాల రిపోర్ట్ లు కుటుంబం అంటే అనుభవమే అని చెపుతున్నాయి తప్ప డీకోడింగ్ పాటర్న్ చెప్పడం లేదు. కుటుంబం అనగా ఫలానా అని అర్దం చెప్పే నిఘంటువులూ లేవు పోగ్రాం చేయడానికి లాగరిథవ్స లేవు. అనగనగా అని చెప్పుకోవడంలోనే తెలియని, అర్దంకాని వివరణ ఉంది. అందుకే అ అనుభవాన్ని ఆస్వాదించడానికే కొన్ని వందల హ్యూమనాయిడ్ కుటుంబాలు ఇలా మరణాన్ని కూడా ఎంచుకుంటున్నాయి. అదే ప్రాజెక్టుకు పెద్ద తలనొప్పి. ‘‘ ‘‘ ఇన్ని ప్రయోగాలు, ఇన్ని హ్యూమనాయిడ్ కుటుంబాలు, అయినా ముప్పయి ఏళ్లుగా కుటుంబాన్ని డీకోడ్ చే••లేకపోయారా .’’ ‘‘అవును. ఇంకా ఎంతకాలమో ఏమో.’’ ‘‘ కుటుంబం డీకోడ్ అయి, పోగ్రామ్‌గా కన్వర్ట్ అయితే ఏం జరుగుతుంది? ‘‘ ‘‘ బంధాలు డాటా టైప్స్ అవుతాయి. పిల్లల పెంపకం ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కుటుంబం అనేది జీవన కావ్యంలా కాక ఆపరేటింగ్ సిస్టమ్ గా మారుతుంది. ఖచ్చితత్వం పెరిగి అసంపూర్ణతలోని అందాన్ని కోల్పోతాం.’’