ప్రముఖ రచయిత్రి విజయ కందాళ గారు ” గిన్నిస్ బుక్” అనే పుస్తకం గురించి వారు చేస్తున్న ఆడియో ‘ మితభాషి‘ శబ్ద సంచికలో ప్రముఖ రచయిత ముక్తవరం పార్థ సారథి గారు రచించిన పుస్తకం లోనుంచి విషయాన్ని సమీక్షిస్తున్నారు వినండి , తెలుసుకోండి. నోరిస్ మాక్ విర్టర్, రాస్ మాక్ విర్టర్
కవల సోదరులు.
లండన్ లో August 1955
తొలి ప్రచురణ చేసిన గిన్నిస్ బుక్ గురించి మీకోసం..
-సంపా
Vijaya Kandala
Vijaya Kandala
రచయిత్రి పరిచయం పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది
తెలుగు భాషకు అపారమైన పదసంపద ఉంది . మనలో చాలామందికి తెలుగులో మాట్లాడడం ,రాయడం నామోషీ . తాము వాడే కాసిన్ని మాటలు తా మనుకుంటున్న అర్థాన్ని ఇస్తున్నాయా అని తెలుసుకోవడం అవమానం. తెలిసిన పెద్దవారినీ ,నిఘంటువులనూ సంప్రదించడము అనవసరమనే విశ్వాసం . ఇవన్నిటికి తోడు మనం మాట్లాడేది కల్తీ లేని తెలుగనీ అభిప్రాయం.
ఇలా నడుస్తున్న రోజులలో వచ్చిన కరొన ప్రపంచాన్ని ఓ కుదుపు కుది పింది .
దాంతో వ్యక్తుల ఆలోచన ధో రణిలో కొంత మార్పు వచ్చింది . మన చా రిత్రక , సాంస్కృతిక మూలాలను గురించి తెలుసుకోవాలనే ఆలోచన మొదలైంది . మాతృ భాష చదవడం సరిగ్గా రాకున్న విని ఆనందించడం ,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం అనేకవిధాలుగా విస్తరిస్తున్నది . ఇది శుభ పరిణామం .
ఈ నేపధ్యంలో తెలుగు భాషాభిమానిగా నాకు తోచిన రీతిలో తరచుగా వాడే పదాలలో కొన్నింటిని ఎంచుకొని ,వాటి వెనకున్న ఆసక్తికర అంశాలను క్లుప్తంగా తెలియచెప్పాలని ప్రయత్నించా .
ఒక ముఖ్య గమనిక . ఈ మాటల మూటలు నిత్య జీవితంలో మాటలను ప్రయోగించేటప్పుడు ,కాస్త తెలుసుకోవాలనే ఉత్సాహవంతులకోసమే గాని ,పండితులకు , కవులకు , రచయితలకోసం ఉద్దేశించినది కాదని మనవి .
ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ,పెరగాలని చిన్న ఆశ.
ఎక్కడినుంచి మొదలెట్టాలి అనేదే పెద్ద ప్రశ్న . మాటలమూట లు అనుకున్నాం గనుక అక్షరం నుండి మొదలెడతా .
అక్షరం అనే మాటను అక్కరం ,అచ్చరం అని కూడా అంటారు . ఇది సంస్కృత పదం . క్షరం కానిది –నశించనిది అని అర్థం . భాష అనేది ధ్వనులుగా మొదలై లిపి ఏర్పడి ,తాటాకులు ,భూర్జపత్రాలు ,రాగిరేకులు ,శిలలపై ప్రయాణం సాగించి ,కాగితాలు వరకూ సాగి, ఆ తర్వాత అనేక విధాలుగా విస్తరించింది. ఈ రకంగా భాష , సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుందని ,నశించనవి అనే అర్థంలో అక్షరాలన్నారు . కొందరి అభిప్రాయంలో అ నుండి క్ష వరకున్న వర్ణమాలలోని ఆద్యంతా లను చేర్చి , అక్షరమైందని అన్నారు .
సంఖ్య లో వెల్లడించిన సమాచారం కన్నా ,అక్షరాలలో రాసిందే ప్రామా ణీకమనే మన న్యాయ వ్య వ హారాల్లో నూ , బ్యాంక్ లా వా దేవీల్లోనూ నమ్ముతారు . అందుకే దస్తావేజుల్లో , బ్యాంక్ పత్రాల్లోనూ అక్షరా లా ఇంత అనీ మళ్ళీ రాస్తారు .అంకెలను దిద్దినంత సులభంగా అక్షరాలను దిద్దలేము కదా . అదీ సంగతి.
అంతేకాదు . ఆయన మాట అక్షరాలా జరిగి తీ రాల్సిందే అన్నప్పుడు తప్పకుండా ,మార్పు లేకుండా అనే అర్థాలు అక్షరాలా కు వర్తిస్తాయి . ఇదండీ అక్షరాలా అక్షరాల కథ .
అత్తెసరు
నిఘంటువుల ప్రకారం చూస్తే ఇది అత్తు +ఎసరు అనే రెండు పదాలతో ఏర్పడ్డ సమాసం . వంటకు సంబంధించి ముఖ్యంగా బియ్యం అన్నంగా మారే ప్రక్రియ లో వాడే మాట . ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయిగానీ ,ఒకప్పడు విడిగా వండి ,గంజి వార్చడం ఒక పద్ధతి . మరో విధానంలో నీళ్ళను మరిగించి ,తగిన పాళ్ళలో కడిగిన బియ్యం వేసి ,ఉడికించడం . ఎన్ని నీళ్ళకు ఎంత బియ్యం అనేది అనుభవసారం . దీంట్లో అన్నం వార్చే పని ఉండదు . అయితే అన్నం బిరుసు గాను,పలుకుగాను ఉండకూడదు . అలా ఉంటే నీళ్ళు తగ్గినట్లు లేదా గిన్నె సరి పడిందిగా లేనట్లు . అన్నం మృదువుగా ఉండాలి . ఎక్కువగా ఉడికి ముద్దలా కారాదు . అత్తెసరు అంటే నీరు ,బియ్యం కలిసి అన్నం మాత్రమే మిగలడం అన్నమాట . దీ నికి సారూప్యంగా అత్తెసరు మార్కులు అని వాడతారు . అంటే బొటాబోటీగా సరిపోయేటట్లుగా ,పెద్ద విశేషంగా చెప్పనక్కర్లేని అని అర్థం.
ఆటవిడుపు
ఈ రోజుల్లో చదువుల్ని ఆటపాట ల రూపంలో నేర్పించాలనే పద్ధతికి ఆదరణ పె రిగింది . అదివారాలు , పండుగలు , వేడుకలప్పుడు పరీక్షల తరువాత సెలవులు ఉంటూనే ఉంటాయి . మరి వెనకటి రోజుల సంగతి ఏంటి ?అని ఆలోచిస్తే వారికీ మరో విధంగా సెలవులు ఉండేవి .అలా అడుకోవడానికి కేటాయించే సమయమే ఆటవిడుపులు . ఒకప్పుడు ఆశ్రమాలకు , గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు . అ చదువంతా చెట్ల కిందనే జరిగేది . అందువల్ల ముసురు పట్టినా ,ఆశ్రమానికి ప్రముఖులు ,గురువులు వచ్చినా సెలవులే .దాంతో బాటు పౌర్ణమి దానికి ముందు రోజు ,అమావాస్య ,దానికి ముందు రోజు ఇలా నాలుగు రోజులూ అనధ్యయనపు దినాలు .అయితే , ఆ రోజుల్లో దినమంత ఆటల్లో వృధా చేయకుండా ,కొంత చదువు , కొంత వినోదం కలిసొచ్చేలా కొన్ని కంట స్థ పద్యాలనిచ్చి నేర్చుకొమ్మనే వారు . ఇలా సాధారణంగా సుమతీ ,వేమన , కృష్ణ ,దాశరధి శతక పద్యాల నిచ్చి నేర్చుకునేలా చేసేవారు . క్రమంగా అసలర్ధం మరుగున పడిపోయింది . విశ్రాంతి ,పనిలేకపోవడం ,పని చేయకపోవడం అనే కొత్త అర్ధాలు స్తిరపడిపోయాయి .
ఇంగితం
ఇంగితం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం . ఒకప్పుడయితే నుదురు చిట్లించడం ,బొమముడి అనే అర్థంలో కూడా వాడేవారు . ఈ పదాన్ని విశేషణంగా తీ సుకుంటే చలించిన ,కదిలిన అనే అర్థాలు ఏర్పడుతాయి . నామవాచకంగా తీసుకుంటే కదలిక , చలనం ,మనోభావం ,అభిప్రాయం అనే అర్థాలు వస్తాయి .
ఇంగితజ్ఞు డు అంటే ఇతరుల అభిప్రాయం తెలుసుకోగలిగినవాడని భావం . అయితే ఇంగిత జ్ఞానం అనే మాటకే వాడు కెక్కువ ఇంగితం లేదంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వాడ న్నమాట . పాత అర్థాల స్థానంలో కొత్త అ ర్థా లొచ్చేశాయి .
ఈసడించు
ఇది క్రియా పదం . డి క్షనరీల్లో వెతికేతే ,రోతపడు , కోపించు ,నిరసించు ఇలా ఎన్నో అర్థాలు . నేటి కాలంలో తగ్గించి , తీసివేసి ,తక్కువ చేసి మాట్లాడు అనే అర్థాలు మిగిలా యి . ఈసడించారు ,ఈసడించి మాట్లాడారు . అనేవే నేటి ప్రయోగాలు .
ఉడుం పట్టు
ఉడుం అనేది బల్లి జాతికి చెందిన ప్రాణి . పాతకాలంలో అంటే రాజరికపు రోజుల్లో సైనికులు దీన్ని పెంచి , తర్ఫీదు నిచ్చి యుద్ధాలలో ,ముట్టడులలో ఉపయోగించేవారు ఉడుం నడుముకు మోకుకట్టి ,బలంగా కోట గోడలమీదికి విసిరేవారు . దాని నాలుకకు తేనె రాసేవారు . ఏ పాటి పట్టు దొరికినా అది గోడను కరిచి పట్టుకుంటుంది . ఎంత బలంగా అంటే వేలాడే మోకును పట్టుకుని సై నికులు పైకి పాకి కోట గోడ పైభాగానికి చేరి ,లోపల్నుంచి తలుపులు తెరిచేవారు . బయటి నుండి సైన్యం లోనికి చేరి, రాజనగరును ముట్టడించి స్వాధీనం చేసుకునేవారు .
ఇప్పుడు అలాంటి అవసరాలు లేకున్నా పట్టినపట్టు వీడని ,వదలని మొండి పట్టును సూ చించడానికి ఉడుం పట్టు అనే మాటను వాడు తున్నాం .
ఊదరపెట్టు
అదే పనిగా నస పెట్టు , పొగ బెట్టు అనే అర్థం లో వాడుతాము . ఎలుకల వంటి వాటిని బయటికి వెళ్ళ గొట్టడానికి పొగబెట్టడాన్ని ఉదరబెట్టడం అంటారు . చుట్టలను , సిగరెట్లను ఒకదానికొకటి ఆ నించి నిప్పు అంటించడాన్ని ఊదరబెట్టడమంటారు . అగ్గిపెట్టలు అందుబాటులోకి వచ్చాక దీ నీ అవసరం తీ రిపోయింది . మామిడి వంటి కాయలను త్వరగా పళ్ళుగా మార్చడానికి పెట్టే పొగను ఊదర అంటారు . ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండ డాన్ని ఈ రోజుల్లో ఊదరపెట్టుగా అంటున్నాం
ఋ జువు
ఋ కారాన్ని పలకడం , రాయడం ఎప్పుడో మానేసాము . అయితే వినిపించే కొద్ది మాటల్లో ఎక్కువగా వినిపించే మాట ఋ జువు . సంస్కృతం లో ఈ పదానికి సత్యం , సూటి అనే అర్థాలున్నాయి . నిదర్శనం అనే అర్థం లో తెలుగులో ఉపయోగిస్తున్నాం . ఈ అర్థంలో వాడే ఈ మాట పర్షియన్ నుంచి హిందీ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది .
ఎద్దు
సరే దీని గురించి తెలియనిదేవరికి ? కాబట్టి దీనికి సంభందించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం . ఎద్దు అనగానే నాకు స్పెయిన్ దేశం గుర్తొస్తుంది . అక్కడ ఎద్దుల్ని రెచ్చగొట్టి ,వాటితో పొడిపించుకుంటూ ,తొక్కించుకుంటూ ఆడే ,ఆడించే Bull Fighting ఆటను జనాలు వెర్రెత్తినట్లు ఆ డుతారు . ఎ ద్దులమీద కుక్కల్ని ఉసిగొల్పి ,బుల్ రింగ్ లో ఆడించే ఆట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది .
పూర్వం వేటాడడానికి ఎద్దుల్ని ఎరగా చూపించి , సింహల్ని , పులులని వేటాడేవారు . దుక్కిటె ద్దుని హాలికం అని ,బండికి కట్టే ఎద్దుని అన ద్యాహమ్ అనీ అంటారు . సాధు ఎద్దుని గంగిరెద్దు అంటారు .
నంద్యాల , నందిగామ , మహానంది వంటి గ్రామాలు మనకు ఎద్దులకూ ఉన్న అనుభందాన్ని గుర్తు చేస్తాయి .
ఏ బ్రాసి
ఈ మాటను రోత మనిషి , అమాయకుడు , చేతగానివాడు మొదలైన అర్థాల్లో ఉపయోగిస్తారు . అసహ్యమైన వ్యక్తి అనే అర్థంలో సంస్కృతంలో ఏభ్య రాశి అనే పదం ఉంది . ఈ మాట నుంచి ఏర్పడ్డ తెలుగు పద్యం ఏబ్రాసి . ఏబ్రాసి వెధవ ,ఏబ్రాసిగాడు అనే వ్యవహారం
ఐ రావతం
ఐ రావతం అంటే భా రీ కాయంతో తెల్లటి మేని ఛాయ తో ,మెరి సి పోయే ఏనుగు . ఇది క్షీర సాగర మధనంలో పుట్టింది . ఇo ద్రు నికి వాహనం . దీ న్ని మేఘాల ఏనుగు ,సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తారు . మాతంగ లీల అనే గ్రంధం ప్రకారం బ్రహ్మ వరంతో 8 మగ 8 ఆడ ఏనుగులు పుట్టాయి . మగ ఏనుగులకు ప్రతినిధి ఐ రావతం .
జైన ,బౌద్ధ మతాలలో కూడా ఐ రావతం ప్రస్తావన ఉంది . థా య్ లాండ్ ,లావోస్ వంటి దేశాలలో దీన్ని ఆరాధిస్తారు . అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాలమీద మూడు తొండములతో ఉండే ఐ రావతం బొమ్మ చిత్రించబడి ఉంటుంది
ఒంటికంటి రామలింగం
ఓ అనగానే నాకు ఒంటికంటి రామలింగం గుర్తొస్తాడు . ఆయనెవరు ? అని ఆడక్కండి . నాకూ తెలీదు . ఇంకోలా చెప్పాలంటే ఎవరైనా కావచ్చు . ఎందుకంటే ఇక్కడ రామలింగం అనే మాట పేరులా కాక ఒక గుణా నికి ,స్వభావానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం . ఒంటి కన్ను అంటే ఒక కన్నున్న వాడని గాక ఇతరుల సుఖశాంతులను చూసి ఓర్వలేని వాడని అర్థం .అసూయపరుడిని ఒంటికంటి రామలింగం అని సంభో ధిస్తూంటారు
ఓంకారం
ఓ అనగానే ఓంకా రం మెదులుతుంది మదిలో . ఇది అకార ,ఉకార ,మకారాల సమ్మేళనం . సృష్టిలో మొదట వినబడ్డ శబ్దం ఓమ్ . దీన్ని పదేపదే జపించడం వల్ల శరీరంలో ప్రాణవాయువు శా తం పెరుగుతుంది .కంఠ నాళంలోని అడ్డంకులను తొలగిస్తుంది . స్పష్టమైన ఉచ్చారణకు తోడ్పడుతుంది . సనాతన హిందూ ధర్మంలో ఓంకారా నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . పరమశివుని నాద రూపమే ఓంకారం . వేద సారం ఓంకారం. ఓమ్ అనేది ఏకాక్షర మంత్రం . ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు .
నిత్యం సాధన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది .. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దీన్ని జపించే సమయంలో వచ్చే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి . ఏకాగ్రత మెరుగుపడుతుంది .
ఔచిత్యం
నీవు చెప్పిన మాట ఔచిత్యం గా లేదు. పెద్ద మనుషులున్నప్పుడు ఔచిత్యంగా మాట్లా డా లని తెలీదూ అంటూ ఔచిత్యం ప్రదర్శిస్తూ ఉంటాం . కానీ నిఘంటువులలో ఉచితత్వం , యోగ్యత ,సత్యమనే అర్థాలే ఉన్నాయి . తగినవిధంగా ,యుక్తంగా ,యోగ్యతగా అనే అర్థాల్లోనే వాడుతున్నాం . సందర్భానికి తగినట్లు మాట్లాడుట ,ప్రవర్తించుట అనే సందర్భంగా ప్రస్తుతం వాడుతున్నాం .
అం –అః
0 ( అః వీటిని వ్యాకరణ పరిభాషలో ఉభయాక్షరాలు అంటారు . ప్రస్తుతం బండి ఱ ను , అరసున్న ను వాడుకలోంచీ పక్కకు జరిపేసాము . మిగిలిన రెంటికీ విడిగా ప్రయోగం లేదు .
అంబరం అంటే ఆకాశం సాధారణ అర్థం . అయితే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడు అని అర్థం చెప్పుకుంటాం . ఇక్కడ అంబరంఅంటే వస్త్రం . నిఘంటువుల్లో దీనికి దూది , అనుస్వారం అనే అర్థాలను ఇచ్చారు .
అంతఃపురం
విసర్గ కు సంస్కృతంలో బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి . తెలుగులో విసర్గ అనగానే టక్కున గుర్తొచ్చే పదము అంతఃపురం . రాజుగారికి సంభంధించిన స్త్రీలు ఉండే ప్రాంతం అని అర్థం . రాణివాసం అని కూడా అనవచ్చు గానీ మనకు అంతఃపురమే నచ్చుతుంది ..
ఇ దండీ అచ్చంగా అచ్చులే చిరు వ్యాసం. కేవలం వ్యాకరణ పరిభాషలో కాకుండా కాసింత ఉప్పు , పులుపు ,కారం కలిపి గుచ్చెత్తి , వండి వార్చిన వంటకం .
మన ఇళ్లల్లో వేడుక ,పండుగ ,పర్వం, శుభకార్యం ఏదైనా తోరణాలు కట్టడంతోనే మొదలవుతాయి . తోరణాలు పంది ళ్ళతో ఇంటికి కొత్త అందం వచ్చి చేరుతుంది . సంబరాలను వెంట తీసుకొని వచ్చేవే తోరణాలు. అంతెందుకు వీధిలో అలా నడిచి వెళ్తున్నప్పుడు ,ఏ గుమ్మానికో మామిడాకుల తోరణం కనిపిస్తే చాలు, వీరి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అనుకుంటారు దారి ని పోయేవారు . అది తోరణ మహా త్యం. ఇందులో ఇంకొక విశేషం ఉంది .మన అలవాటులో తోరణం అంటే మామిడాకులదే.
అసలు తోరణాలు ఎందుకు ?వాటికి మామిడాకులే ఎందుకు? అని ఆలోచిస్తున్నారు కదూ ! నేను అలానే అనుకున్నా సుమండీ . అనుకోవడంతో ఊరుకోలేదు .జవాబు కోసం ప్రయత్నించా. ఆ వివరాలు క్లుప్తంగా మీకోసం .
ఒకప్పుడు తోరణాలు అంటే ముఖద్వారానికి మామిడాకులను ఓ పు రి కొ సతో బంధించడమే. ఇప్పుడు కాలం మారింది. వస్తువులో , విధానాల్లో ,వైవిధ్యం చోటు చేసుకున్నది. రంగురంగులతోరణాలు రాజ్యమేలుతున్నాయి .పండగల సీజన్ మొదలైంది గా యూట్యూబ్ లో వేలెట్టండి .ఇంకేముంది వందలాది ఉపాయాలు .వేలాది లైకులు . మూడు పువ్వులు ఆరు కాయలుగా విభిన్నతకు అర్థం చెప్పే కంటెంట్లు .
ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాల గురించి ఓ మంచి మాట చెప్తుంటారు పెద్దలు .నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటే ఆ .దేవాలయంలో సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుందన్నమాట .ముహూర్తాలు సరైనవి దొరక్కపోయినా ,కుటుంబ పరమైన సమస్యలు ఎదురైనా ,చాలామంది పుణ్యక్షేత్రానికి వెళ్లి పెళ్లి చేస్తారు. స్వామివారి కల్యాణం జరిగినందువలన అక్కడ విడిగా వధూవరుల జాతకం ఆధారంగా ముహూర్తాలు పెట్టకున్న, పెట్టిన దానిలో ఏవైనా దోషాలు ఉన్నా, స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయన్నమాట.
సరే ఇప్పుడు మనకు బాగా తెలిసిన మామిడి తోరణాల దగ్గరికి రండి .
జ్యోతిశ్శాస్త్రం లో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెప్తారు. అందుకే వేడుక ఏదైనా మావిడాకులని వాడుతారు . చెట్లు ,మొక్కలను పూజించడం మన సంస్కృతిలో ఒక భాగం .దీనికి గొప్ప ఉదాహరణ కార్తీకం లో ఉసిరి చెట్టును, క్షీరాబ్ది ద్వాదశి కి తులసి పూజను చేయడం ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయం.
మామిడి చెట్టు, దాని భాగాలు అనేక విధాలుగా మన సంస్కృతిలో భాగం . ఒకప్పుడు తోట ఉంది అంటే చాలు మామిడి తోటనా అని మొదటి ప్రశ్న ,మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి ?అనేది రెండవ ప్రశ్నగా అడిగేవారు. మామిడి చెట్లు ఆర్థిక వనరులకు చిహ్నం ఒకప్పుడు . మామిడి చెట్టు ఆకులు, లేత చిగుళ్ళు ,పళ్ళు, కాయలు, బెరడు అన్ని ఆయుర్వేదంలో , గృహవైద్యంలో ఉపయోగకారులు .మామిడి ఆకులను తోరణాలుగా మాత్రమే కాక, కలశం లోను వాడుతా రు .అవి దొరక్కపోతేనే తమలపాకులను ఉపయోగిస్తారు .
మామిడాకుల తోరణాల వెనకున్న నమ్మకాలను గురించి కాస్త చెప్పుకుందాం.
మామిడాకులను తోరణాలుగా వేలాడదీయడం వల్ల, ఇంటికి చెడు దృష్టి నుండి రక్షణ, సానుకూల శక్తికి ఆహ్వానం అనేది ఓ ముఖ్యమైన నమ్మకం. ఈ తోరణాల వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి తో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులఉ వాచ .
ఈ ఆకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది . తోరణాలు ఎక్కువమంది గుమికుడినప్పుడు ,ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి .ప్రధాన ద్వారం పైన కట్టినప్పుడు ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందని ఒక విశ్వాసం . వెనకటి రోజుల్లో గ్రామాల్లో బావిలోకి దిగి, శుభ్రం చేయవలసిన సమయంలో ,ఎక్కువ ఆకులు ఉన్న మామిడి కొమ్మను బావిలోకి చుట్టూ కొంత సేపు తిప్పమని చెప్పే వారు . దాంతో బావిలోని విషవాయువులు తొలగిపోతాయట .ఇది నిరూపించబడింది కూడా .
మామిడి ఆకులలో ఒక ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది అందువలన తోరణాల పరిసరాలు సువాసన , తాజాదనంతో నిండి ఉంటాయి.
మామిడి ,జువ్వి , రావి , మర్రి , ఉత్తరేణి ఈఐదు చెట్ల ఆకులను పంచ పల్లవాలంటారు .వీటిని శుభకార్యాల్లో వాడుతారు .అయితే తోరణం లో నిలిచేది మాత్రం మావిడే . యజ్ఞయాగాదుల లో మామిడి ఆకులను వాడి ధ్వజారోహణం చేయడం సంప్రదాయం .ధ్వజారోహణం అంటే దేవతలకు ఆహ్వానంపంపడమే. మావిడాకులు అంటే దేవతలకు ఇష్టమేనన్న మాట .
శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని , అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని పెద్దవారంటారు .
ఇంకో ముఖ్య విషయం ఇక్కడ తప్పక చెప్పుకోవాలి . మన వైపు పెద్ద పండుగలు ,ఉత్సవాలు ఎక్కువగా సంవత్సరంలోని రెండో భాగంలోనే వస్తాయి .దీనికి మామిడి తోరణానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మామిడి పూత సాధారణంగా శీతాకాలం చివరలో మొదలవుతుంది . వేసవిలో కాత మొదలవుతుంది. కత్తిరింపు మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుందని మీకందరికీ తెలుసు కదా! అయినా ఈ విషయం తెలుసుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞుని వరకు వెళ్ళనక్కరలేదు . ఏ తోటమాలి అయినా చెప్తాడు .పండుగలప్పుడు మామిడి తోరణాలను కట్టడానికి ఇదొక మంచి కారణం .
ఈ కారణాలన్నింటినీ విస్తృతంగా అధ్యయనం చేయకున్నా సంప్రదాయ పద్ధతుల ఆధారంగా తరతరాలుగా జనం ఆచరిస్తున్నారు . విశ్వసిస్తున్నారు కూడా.
తోరణాల గురించి ఇన్ని మాటలు చెప్పుకుని ఆగిపోతే అది అసంపూర్తి అవుతుంది .తోరణం అనగానే మామిడి ఆకుల తర్వాత గుర్తొచ్చేవి కాకతీయ శిలా తోరణాలు . అందమైన ఈ తోరణాలు మన శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు .వీటిని తోరణ ద్వారాలు ,తోరణాస్తంభాలు, కీర్తితో రణాలు ,హంస ద్వారాలు ఇలా రకరకాలుగా చరిత్రలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రధాన కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించే నమూనా స్వాగత దారాలు ఇక్కడివే .
వరంగల్ కోటలో ఈ కీర్తి తోరణాలు నాలుగు ఉన్నాయి . నాలుగూ వేర్వేరు రాజుల కాలంలో నిర్మించబడినా ఆ తేడాలను మన చూపులు పట్టుకోలేవు. వీటిపై అధోముఖ పద్మాలు, హంసలు అందంగా అమిరాయి . కోటలోని అపార సంపదను , శత్రువులు దోచినా ఈ అమూల్య సంపద మనకు దక్కింది .చూసేవారికి రాచహోదాను , ఆత్మవిశ్వాసాన్ని నేటికీ అందిస్తున్నాయి . ఇవి యుద్ధాల్లో సాధించిన గెలుపును తెలిపే విజయ చిహ్నాలు అని చరిత్రకారుల వివరణ .మన బోటి సామాన్యులకు తోరణం అంటే నెగిటివ్ ఎనర్జీతో , చెడు దృష్టితో , చెడుగాలితో రణమే . పోరాటమే .దాన్ని ఎదుర్కోవడానికి తోరణాలను కడదాము . ఆ సువాసనలను ,ప్రాణ శక్తిని మనసారా జీవితాల్లోకి ఆహ్వానిద్దాం .
ప్రపంచ భాషల వ్రాత లిపుల్లో మొదటి ఉత్తమ లిపి కొరియా దేశానిది కాగా , రెండవ ఉత్తమలిపి తెలుగు కావడం మనకు గర్వకారణం .
కాలికి బలపం
అవసరం ఉన్నందున దూరభారాలు లెక్కించకుండా తిరిగినప్పుడు కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అంటారు . బలపం అనేది రాతిముక్క. పలకాబలపం అనే వి ఒకప్పుడు విడదీయలేని జంట పదాలు . ఒకప్పటి విద్య విధానానికి ఆనవాళ్ళు . ఒక్కసారి పలక కొంటె ఒకరి తర్వాత మరొకరు వాడుకునే సౌకర్యం ఉన్న సాధనం . తిరగలేక బాధపడుతున్నట్లు ,తిరగక తప్పదన్నట్లు చెప్పడమే దీనిలోని అసలు ఉద్దేశ్యం .
ఖండితం
ఈ సంస్కృత పదానికి నరకబడినది అని నిఘంటు అర్థం . యుక్తులు చెప్పి ,ఒక వాదాన్ని నిరాకరించడం కూడా ఖండించడమే . ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుని ఏ విషయంలో అభిప్రాయం అడిగినా యదుటివారు చెప్పింది ఖండిస్తున్నాను అనే అంటారు . దేన్ని ఖండిస్తున్నాడు ,ఎందుకూ ఖండిస్తున్నాడు అతనికే తెలియదు . అతనికే తెలీనప్పుడు మనకు తెలిసే అవకాశం లేనేలేదు . ఖండితంగా చెప్పడమంటే స్పష్టంగా ,దాపరికం లేకుండా అనే అర్థంలోనే నేడు వాడుతున్నాం
గుడ్డి గవ్వ
కొన్ని ఏళ్ళ క్రితం గవ్వలు నాణాలుగా చెలా మణిలో ఉండేవి. అంటే గవ్వలిచ్చి ,కావలసిన సరుకులను కొనేవాళ్ళు . గవ్వ విరిగిన ,పగిలిన అది గుడ్డిగవ్వ . అది వ్యాపార వ్యవహారాలలో చెల్లుబాటయ్యేది కాదు . ఎందుకూ పనికిరానిదని అర్థం . బీదవారిని గుడ్డిగవ్వ పాటి ఖరీదు చేయడని భావించేవారు .
ఘంటాపథం
తెలుగులో ఈ పదానికి నొక్కి చెప్పుట , బల్ల గుద్ది చెప్పుట అనే అర్థాలున్నవి . తాను నమ్మిన దాన్ని ఎదుటివారు సంశయించినప్పుడు వారికీ బోధ పడేలా నొక్కి చెప్పడం ఘంటాపథం .
చిరునామా
చి రునామా అనేది ఇ ప్పుడెక్కడా వాడటం లేదు . ఆ స్థానం లో Address వచ్చి , పీఠం వేసుకుని కూర్చున్నది .ఈ అడ్రసునే ఒకప్పుడు చిరునామా , విలాసం అనే వారు . ఇది హిందీ నుంచి వచ్చిన మాట అని సి. పి బ్రౌన్ అభిప్రాయం . అన్యదేశ్యం అని మరికొందరి భావన . ఇ వన్నిటిని పక్కకు నెట్టి అడ్రసు స్థిరపడింది . సులువుగా చెప్పాలంటే క్లుప్తంగా ఒక వ్యక్తి నామ , నివాసస్తలాల వివరం చిరునామా.
జరిగిన కథ
నిజంగా సంఘటిల్లిన కథను జరిగిన కథ అంటారు . అయితే మనం ఇ ప్పుడీ అర్థంలో వాడటం లేదు . వార , మాస పత్రికలు పెద్ద కథలను ,ధారావా హికలను ప్రోత్సహించడం ,ప్రచురించడం మొదలె ట్టాక కథలోని కొద్ది భాగాన్ని ప్రచురించి ,మిగిలిన కథను తరువాతి సంచికలో చదవమని సూచించే అవసరం ఏర్పడింది . మిగిలిన భాగాన్ని ప్రచురించేటప్పుడు అంతవరకూ జరిగిందాన్ని క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్తితి ఏర్పడింది . దానివల్ల సత్యమైన ,గడచిన అనే అర్థంలో జరిగిన కథ వాడటం తప్పనిసరైంది .
టిప్పణి
ఒ క గ్రంధంలోని విశేషాలను వివరిస్తే అది టీక అనీ ,కటిన పదా లకు అర్థాన్ని వివరిస్తే అది టిప్పణీ అని సామాన్యమైన అర్థం . పద్యాల్లోని పదాలను ,అర్థాలను వచన క్రమంలో పెట్టడమే తాత్పర్యం . తెలుగులో టీ కా తాత్పర్యాలకే ప్రచారం ఎక్కువ . ఒకనాటి సాహితీ సంప్రదాయాలను పరిచయం చేసుకోవాలంటే ఇ లాంటి పదాల పరిచయం అవసరం .
TLAYINCHU
ఇది హిందీ /ఉర్దూ నుంచి వచ్చిన పదం . తెలుగులో పని ఎగ్గొట్టు ,మోసగించు అనే అర్థాలున్నాయి . అయితే నేడు మనం తప్పించుక తిరుగు ,తప్పుదారి పట్టించు ,మోసగించు అనే అర్థాలతో బాటు కావాలని ఆలస్యం చేయు అనే అర్థంలోనూ వాడుతున్నాం .
డ బ్బాకొట్టు
డబ్బా అనేది హిందీ మాట దానికి తెలుగు నిఘంటువుల్లో తుపాకీ మందు ఉంచుకునే తోలుపెట్టే అని అర్థం ఉంది దీనికి కోతలు కోయు ,పొగడు అనే వ్యవహారిక ఆర్గాలు ఉన్నాయి. నేటి వాడుకలో చప్పుడు చేస్తూ పోవడం, పొగడుకోవడంతో పాటు అనవసరంగా పొగడు ,అతిగా పొగడు అనే అర్థాలు ఉన్నాయి నేడు.
అణాకాణీ
రూపాయికి 100 పైసల విధానం వచ్చాక రకరకాల పాత నాణా లు వాటి లెక్కలు మరుగున పడిపోయాయి .పేర్లు కొన్ని వ్యవహారంలో నిలిచిపోయా యి . అలాంటి వాటిలో అణాకాణీ 40 , 50 ఏళ్ల క్రితం వరకు పలుకుబడిలో ఉండేది. ఒకప్పుడు రూపాయికి 16 అణాలు అంటే 96 పైసలు ఉండేవి . దాన్నిబట్టి పదహారణాల ఆంధ్రుడు అనే మాట ఎక్కువగా వినబడేది. అంటే మాట,లో కట్టుబొట్టులో తెలుగు లక్షణాలున్న వాడని అర్థం. రూపాయిలో 16వ వంతు అణా దాంట్లో నాలుగవ వంతు కాణీ . అందువలన చిల్లర మనిషి అనే అర్థంలో అణాకాణీ మాట వాడేవారు. ఇలా వాడే రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా పెళ్లి చేశాడు అనే మాటలు పుట్టాయి . అణా అనేది సత్తు నాణెం.
తాహతు
తెలుగు సినిమాల్లో తరచూ వినిపించే మాట ఇది . హిందీలో తాకత్ అనే శబ్దం నుంచి పుట్టిన మాట. హిందీలో ఈ మాటకు బలం , శక్తి , అధికారం అనే అర్థాలు ఉన్నాయి తెలుగులో అధికారంతోపాటు హోదా,స్థాయి అనే అర్థాలు కూడా ఉన్నాయి
ఆయన తాహతు ఎక్కడ ? మనది ఎక్కడ ? ఈ మాటలు మన సినిమాల వల్ల రాజకీయ నాయకుల వల్ల ప్రజల నోళ్లలో నానుతున్నాయి.
దుంప నాశనం
తెలుగువారికి ప్రత్యేకమైనది ఈ తిట్టు . మొక్కల పుట్టుకకు ,పెరుగుదలకు మూల కారణమైంది దుంప . అది నశిస్తే , ప్రస్తుతమున్న మొక్క వంశమే నశించినట్లు లెక్క. ఎదుటి వ్యక్తి గాక అతని వంశమంతా నశించాలని దీనికి అర్థం . ఇంగ్లీష్ తిట్లు అలవాటయ్యాక తెలుగు తిట్లు మరిచిపోతున్నాము అ.యినా కొన్ని పదాల యొక్క అసలు అర్ధాన్ని తెలుసుకోవాలి .
ధనియాల జాతి
తిట్టి, కొట్టి బాధిస్తే ,గాని దారికి రాని, పని చేయని వ్యక్తులను గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు . ధనియాలను ఉన్నవి ఉన్నట్లు పాతేస్తే మొలకెత్తవు. వాటిని చెప్పు కింద నలిపి, నాటాలనేది విశ్వాసం అలా పీడించి, హింసించి, భాధిం చినప్పుడే గాని మర్యాదగా చెప్పితే, పనిచేయని వాళ్లని ధనియాల జాతి అంటారు.
నదీ నదాలు
ఇది ద్వంద్వ సమాసం . ఇందులోని నది, నదం రెండూ సంస్కృత పదాలే. నదం అంటే తూర్పున పుట్టి, పడమటికీ ప్రవహించేది . మనదేశంలో నర్మదా, తపతి నదాలు . నది అంటే పడమట పుట్టి, తూర్పుకు ప్రవహించేది. ఇంత సూక్ష్మమైన విషయాన్ని గమనించి , ప్రత్యేకంగా పేరు పెట్టిన మన పూర్వీకుల పరిశీలనా శక్తికి నమస్కారాలు .
పాలు
పాలు అనగానే మనకు ఆవు , గేదె ,మేక ,గాడిద గుర్తొస్తాయి కదా ! ఇవన్నీటిని మరిపింప చేసేది అమ్మ .ఆమె ప్రేమ . ఇవాళ పాలుకు ఉన్న ఎన్నో అర్థాలలో కొన్నింటిని చెప్పుకుందాం పాలతో కలిసి కోపాలు ,తాపాలు ,శాపాలు ,మురిపాలు ఇలా ఎన్నో రకాలు .
కృష్ణుడు రాయబారంలో పాండవులకు సగపాలిమ్మని అడిగాడు. ఇక్కడ పాలు అంటే భాగం . రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నప్పుడు రాళ్ళల్లో కలిసిపోయాయని అర్థం . దేవా నా పాల రావా అంటే నన్ను రక్షించడానికి రావా అని భావం . జిల్లేడు పాలు అంటే రసం అనే అర్థం .ఇలా పాలు అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి .
ఫల సాయం
ఫలసాయం అన్న మాటకి పంట అనే అర్థం ఉంది . వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయం ఫలాయం . కానీ నేడు పంట దిగుబడిని సూచించడానికి ఫలసాయం అనే మాటను వాడుతున్నాము .
బాదరబందీ
ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో ఉద్యోగులు పొడుగాటి అంగీ ధ రించడం సంప్రదాయం . వాటికి ఇప్పట్లో లాగా గుండీలు ఉండేవి కావు .ఓవైపు తాళ్లు ,మరోవైపు వాటిని దూర్చడానికి రంద్రాలు ఉండేవి . ఎదురెదురుగా వాటిలో నుంచి దూ ర్చిన తాళ్ళను ముడి వేసేవారు . ఇవి 12 ఉండేవి . ఈ పద్ధతిని బారాబంది , బారాబుంది అనేవారు .ఇది చాలా సమయం తీసుకుంటుంది .విసుగు పుట్టిస్తుంది .అలా ఈ బారాబంధి కాస్త బాదర బందీగా మారిపోయింది . సరిగా కట్ట కుంటే నలుగురిలో నగుబాటు . ఇలా 12 ముళ్ళు వేయడం . విప్పటం చికాకు పుట్టించేది .ముళ్ళు సరిగా వేయకుంటే , విప్పడం మరి కష్టం . ఇలా విసుగు పుట్టించే వ్యవహారం ,అనవసర శ్రమ అనే అర్థంలో బాదరబందీ అనే పదాన్ని వాడతారు .
భత్యాలు
పనిచేసినప్పుడు ఇచ్చేది జీతం .తర్వాత వచ్చేది పింఛన్ . బత్తా అనే హిందీ లేదా ఉర్దూ మాటకు తెలుగు మాట భత్యం .ఇది తాత్కాలిక , ప్రత్యేక సేవలకు ప్రతిఫలంగా ఇచ్చేది . రాను రాను భత్య మనేది జీతానికి భిన్నంగా , అదనంగా ముట్ట చెప్పేది అనే అర్థం వచ్చింది . అప్పటినుంచి కరువు భత్యం ,దిన భత్యం ,ప్రయాణ భత్యం , అదనపు భత్యం ఇవన్నీ వచ్చి చేరాయి .ఒకప్పుడు జీతభత్యాలు ధన రూపంలోనే గాక వస్తు రూపంలో కూడా ఉండేవి
మందలింపు
తప్పుగా మాట్లాడిన వారిని , తప్పుడు పనులు చేసిన వారిని సుకుమారంగా హెచ్చరించడాన్ని మందలింపు అంటారు . తెలంగాణ ప్రాంతంలో ఈ మాటకు పరామర్శ , ఓదార్పు అనే అర్ధాలు ఉన్నాయి . మిత్రులు , బం ధువులు ,ఆత్మీయుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పలకరించి , ఓదార్చి , కష్టసుఖాలు విచారించడాన్ని మందలించడం అని అంటారు ఈ ప్రాంతంలో .
యక్ష ప్రశ్నలు
సమాధానం చెప్పడం సాధ్యం కానీ చిక్కు ప్రశ్నలు ఎవరైనా అదేపనిగా అడుగుతూ ఉంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నాడయ్యా అని అంటారు . ఈ జాతీయానికి సంబంధించిన కథ మహాభారతంలో ఉన్నది . పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో , ఈ సంఘటన జరిగింది .ఒకసారి పాండవులు అందరికీ అలసట , దాహం కలిగాయి . అప్పుడు చెరువులోని నీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి యక్షుడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పితే ,ఈ నీళ్లు తాగడానికి అనుమతి ఇస్తాను అని చెప్పాడు . యక్షుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు అడిగాడు . అన్నిటికీ ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు . తన తమ్ముళ్లందరినీ కూడా కాపాడుకున్నాడు.
రాజధాని
రాజులు ఉండే ప్రధాన నగరం రాజధాని . ఇప్పుడు రాజులు లేరు గాని , రాజభోగాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఉన్నాయి . వాటికి పరిపాలనా కేంద్రాలుగా ముఖ్య పట్టణాలు ఉన్నాయి .వాటిని కూడా రాజధానులనే పిలుస్తున్నాము . రాజు లేకున్నా పాత అలవాటు ప్రకారం ప్రధాన నగరాన్ని రాజధాని అంటున్నాము .
లక్షణ
మీరు సరిగానే చదివారు ఇది లక్ష్మణుడు కాదు . లక్షణ . శ్రీకృష్ణుని అష్టభార్యలలో చివరిది లక్షణ . ఈమెను కృష్ణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ,వివాహం చేసుకున్నాడు . ఈ సంగతి అన్నమాచార్యుల వంశానికి చెందిన తాళ్లపాక తిరువేంగళ నాథుడు అష్టమహిషి కళ్యాణం అ నే కావ్యంలో చాలా చక్కగా వర్ణించాడు .మత్స్య యంత్రాన్ని కొట్టడం అనగానే అందరికీ అర్జునుడు మాత్రమే గుర్తొస్తాడు . ఈ లక్షణ స్వయంవరంలో భీముడు , కర్ణుడు కూడా ప్రయత్నించారు , కానీ సాధ్యం కాలేదు . చివరగా శ్రీకృష్ణుడు వెళ్లి మత్స్య యంత్రాన్ని ఛేదించి ,లక్షణను వివాహం చేసుకున్నాడు
వారాలబ్బాయి
ఇప్పటిలాగా వసతి గృహాలు , ఉచిత వేతనాలు లేని రోజుల్లో పేద విద్యార్థులు ఏ బడి పంచలోనో తలదాచుకుని , సంపన్న గృహస్తులను ఆశ్రయించి , భోజన వసతి సంపాదించేవారు . ఏ ఒక్కరి మీదనో ఆధారపడక ,పూటకో ఇంట్లో తింటూ , బట్టల కోసం కొందరినీ ,పుస్తకాల కోసం మరికొందరిని , ఆశ్రయించి , చదువుకునేవాళ్లు . అలా దుర్భర జీవితం గడుపుతూ , చదువుకునే వారిని వారాలబ్బాయి అనేవారు .అమ్మాయిలు ఇలా చదివే పద్ధతి లేనట్టుంది . అందుకే వారాల అమ్మాయి అనే పదం పుట్టలేదు . ఇప్పుడు ఈ రకంగా చదివే వాళ్ళ సంఖ్య చాలా అరుదు .
శాఖాహారం
చాలా భోజనశాలలను శాఖాహార భోజనశాల అని రాయడం , పలకటం మన అలవాటు . శాఖ అంటే కొమ్మ . శాకం అంటే కూర .మాంసాహారం దొరకదని కూరగాయల వంటలు ఉంటాయని సూచించడానికి శాకాహారమనే మాట సరియైనది . అయితే మనము శాఖహారం అంటే కొమ్మలనే ఆహారంగా తీసుకుంటాము అని ఆ బోర్డు ద్వారా తెలియజేస్తున్నాం . అది సరైనది కాదనుకోండి కానీ , మనకు బాగా అలవాటైపోయింది . అయితే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి . ఏది శాకాహారం అనే విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి , ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి అలవాటులో ఉంది .అది చాలా పెద్ద విషయం తర్వాత దాని గురించి చెప్పుకుందాం .
షికారు
ఈ పదానికి వేట ,సంచారము అనే అర్థాలు ఉన్నాయి . ఇది పార్శీ మాట .హిందీ ,ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చింది మూల భాషలో భక్ష్యం, లక్ష్యం , వేట అని అర్థాలు ఉన్నాయి తెలుగులో వేట , స్వారీ ,వా హ్యాళి అనే అర్థాలు ఉన్నాయి . అడవులు తగ్గి ,క్రూర మృగాల సంఖ్య తగ్గిన తర్వాత ,వనభోజనాలకు , వినోద వ్యవహారాలకు పరిమితమైన సామాజిక జీవనంలో వేట అనే అర్థం కన్నా విహారం వాహ్యాలి అని అర్థాలకే ఎక్కువ ప్రసిద్ధి రూపంలో , అర్ధాల్లో మార్పు వచ్చిందని గుర్తుంచుకోవాలి .
సాము గరిడీలు
సాము గరిడీ అనే రెండు మాటలు ఒకదానికొకటి పర్యాయపదాలు అనే అర్థం లో ఈ ద్వంద్వ సమాసాన్ని వాడుతుంటాము . సిగ్గు బిడియం , అందం చందం అటువంటిదే ఇది కూడా అనుకుంటాము . అయితే సాము అంటే వ్యాయామం . గరిడీ అంటే సాము నేర్చుకునే చోటు . కాబట్టి సాము నేర్చే నేర్పే ప్రదేశాలని అర్థం. తెలుగుదేశంలో ఒకప్పుడు తాలింఖానాలు ఉండేవి అక్కడ వ్యాయామ విద్యలు మాత్రమే నేర్పేవారు . స్వాతంత్రం వచ్చాక ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి వీటిని గరిడీలు అని కూడా అంటారు కాబట్టి వ్యాయామశాలలు అని అర్థం .
హక్కు
ఇది ఉర్దూ లేదా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మాట . . శబ్ద రత్నాకరం ప్రకారం దీనికి బాధ్యత అని అర్థం నేటి రాజ్యాంగ ,రాజకీయ వ్యవహారాల్లో హక్కు అంటే అధికారమే గాని బాధ్యత కాదు . పదవి వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల సంక్రమించే స్వామ్యం అధికారం హక్కు . సదరు హక్కు పొందినందువల్ల కర్తవ్యం గా భావించి చేయవలసిన పనులు బాధ్యతలు .నేటి భాషలో ఈ రెండు వేరు వేరు . హక్కు వేరు బాధ్యత వేరు .
అందరమూ భాషను మాట్లాడుతున్నాము కానీ దానిమీద పట్టును సంపాదించుకోలేకపోతున్నాము . కారణం శ్రద్ధ తగ్గిపోవడమే . సామెతలు ,నానుడులు , జాతీయాలు , పదబంధాలు , పొడుపు కథలు ఇలాంటివి తెలుసుకున్నప్పుడు భాష మీద పట్టు దొరుకుతుంది . అలా దొరికినప్పుడు అభిమానము పెరుగుతుంది . అయితే ,కొన్ని పదాల వెనక ఉండే అంతరార్థం కూడా తెలుసుకోవడం అనేది మన భావాలను మరింత స్పష్టంగా వెలిబుచ్చడానికి సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతోటి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది .ఇది రెండు భాగాలుగా రాయడం జరిగింది . ఈ రెండింటిని చదవండి .చదివించండి . అందమైన భాష మనది .దాన్ని మరింత అందంగా మన భావాలను వెల్లడి చేయడానికి వాడుకుందాం .
విజయ కందాళ
ఉద్య మాలకు పురుటి గడ్డ వరంగల్లు. చరిత్ర కందని కాలం నుంచి ప్రజాఉద్యమా లు ఈ ప్రాంతంలో ఊ పిరి పోసుకున్నాయి . ఒక రంగం అని కాదు . శిల్ప కళ ,కవిత్వం నాట్యం ,నీటి పారుదల ,భవన నిర్మాణం మొదలుకొని సామాజిక ఉద్యమాల వరకు ఎందరో కళా కారులను,ఉద్యమకారులను, నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది.
కాకతీయ చక్రవర్తులయిన గణపతి దేవుడు ,రుద్రదేవ మహారాజు , ప్రతాపరుద్రుడు మొదలుకొని బమ్మెర పోతన వంటి కవులు ,జాయప సేనాని వంటి యుద్ధ వీరుల వరకూ -ఆధునిక కాలంలో మాజీ ప్రధాని నరసింహ రావు గారు,కాళోజీ నారాయణరావగారు,,దాశరధి సోదరులు నేరెళ్ళ వేణు మాధవ గారు ఇలా ఎందరో వరంగల్లు ప్రాంతా నికే వన్నె తెచ్చారు . ఇలా ఎందరో . తెలియని మరెందరో .
ఈ list ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఆ గడ్డలో పుట్టిన ఓ మహానుభా వుని గురించి గుర్తు చేసుకుందాం. వారే శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు . 15 మార్చి 1917 నాడు వరంగల్ జిల్లా లోని చిన్న పెండ్యాల గ్రామంలో జన్మించారు .హై స్కూల్ చదువంత వరంగల్ లో సాగింది . బాల్యం గురించిన వివరాలు ఎక్కువగా దొరకట్లేదు . కానీ నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమమే ఆయన మాట,బాట ,గమ్యం కూడా .1935-36 నుండే మతమార్పిడులను వ్యతిరేకించారు. అందులో భాగంగా హరిజన వా డలకు వెళ్ళి ,వాళ్ళతో స్నేహం చేసి , నచ్చచెప్పే వారు . వారిలో నమ్మకం , విశ్వాసం కలిగించడానికి సహ పంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు . నిరక్షరాస్య తను పోగొడితే వారిలో మార్పు మరింత త్వరగా వస్తుందని , హరిజన పాఠశాలను ప్రారంభించారు .
అగ్ర వర్ణాల పురుషులకే అరకొరగా వసతు లున్న ఆ రోజులలో హరిజనుల విద్య కోసం పాటుపడడం ఓ సాహసం . ఇలా ఎన్నో సాహసాలకు లకు ఆయన జీవితమే ఓ చిరునామా .
కుల వ్యవ స్థను ఖండిస్తూ, పోరాడారు . ఆజంజాహీ మిల్లు కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు.
తెలంగాణా సాయుధ పోరాటానికి మూలం అ యిన విసునూరు పోరాటం లో ముఖ్య భూమిక వహించారు .
వెట్టి చాకిరీనీ నిరసించారు .
గుండాలను సంస్కరించారు .
రజాకార్ ఉద్యమానికి వ్యతిరేకంగా సుధీ ర్ఘ మైన పోరాటం జరిపారు .
1938 లో కాంగ్రెస్స్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష తో బాటు 300 రూ జరిమానా విధించింది. 90 సంవత్సరాల క్రితం 300 రు అంటే ఆలోచించండి . తర్వాతి కాలంలో ఆంధ్ర మహా సభలో చేరారు .1946 లో దాన్ని రద్దు చేసినప్పుడు ఆజ్యత వాసం చేశారు . ఆయిన జీవితమే ఓ సాహసాల పందిరి .
వితంతు వివాహాలతో నైజాం రాజ్యంలో చైతన్యాన్ని జ్వలింప చేశారు .
గ్రం ధాలయ ఉద్యమం లో పా లు పంచుకున్నారు .
ఎన్నికల్లో విజయం వారి జీవితంలో ఒక అధ్భుత ఘట్టం . ఈ రోజుల్లో ఎలక్షన్లలో గెలవడం కోసం అన్నీ పార్టీలు ,అందరు అభ్యర్థులు
అనుచరుల సాయంతో వీధి వీధి తిరిగి వోట్లను అడుగుతున్నారు . వారికి ప్రజలపై నమ్మకంలేదు . అందుకే దేశ ఆర్థిక ప్రగతిని తలకిందులు చేసేలా తాయిలా లను ప్రకటిస్తున్నారు . అలానే ఓటర్లకు నాయకులపై నమ్మకం లేదు . ఇచ్చినవన్నీ పుచ్చుకొంటున్నారు . కొసరు కోసం బేరసా రాలను సాగిస్తున్నారు . ఫలితాలను ప్రకటించే వరకూ నేతలను టెన్షన్ లో ముంచెత్తుతున్నారు . ఇ లాంటి వ్యవస్థలో ఉంటూ ఇదే నిత్యాసత్యమనే భ్రమలో బ్రతికేస్తున్నాం మనం . 1952 సాధారణ ఎ న్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగా ఒక అపురూప రికార్డ్ ను సాధించారు . రాఘవరావు గారు వరంగల్ లోకసభ స్థానం తో బాటు హన్మకొండ ,వర్ధన్నపేట శాసన సభా స్థానాలనుంచి పోటీ చేశారు . మూడింటి లోనూ గెలిచారు . వరంగల్ లోకసభస్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
అవునా?
అంతేకాదు . ఈ ఎన్నికలలో నామినేషన్ ను జైలు నుంచి వేశారు .
ఎందుకలా?
ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది . ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రజనాయకునికి ప్రజల తీర్పు అది .
నిజంగానా ?
అంతేకాదు ఈ విజయం సాధిం చేనాటికి ఆయన వయస్సు 35 ఏళ్ళే . దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు . నా టి నుంచి ఒకేసారి 3 స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల గెలిచిన నేతలు ఇద్దరే . ఒకరు పెండ్యాల రాఘవరావు గారు ,మరొకరు నందమూరి తారక రామారా వు గారు .
అంటే
మీ అనుమానం నిజమే . 1952 లో నెలకొల్పిన రికార్డ్ సమానం కావడానికి 33 సంవత్సరాలు పట్టింది.
రాఘవరావ్ గారిది ఆకర్షణీ యమైన విగ్రహం . ముఖంలో చెరగని చిరు మందహాసం . మాటల్లో చా తుర్యం ,చమత్కారం ఉట్టిపడేవి . సమాజం లోని దుర్మార్గాన్ని ,అన్యాయాలను ప్రతిఘటించడానికి తీ వ్రవాదిగా మరి తుపాకి పట్టినా , కంఠంలో కారుణ్యం ,మనసులో మానవతా తొణికిసలాడేవి.
,అత్యున్నత చట్టసభలో ఎన్నో కీలకమైన చర్చల్లో పా లుపంచుకున్నారు . ఆయన ప్రసంగాలు శక్తి నిండిన ప్రవా హాలు .
M P గా పని చేసినంత శ్రద్ధగా గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను పని చేశారు. గ్రామ వికాసానికి తా గు నీరు ,సాగునీరు, విద్యుత్ సౌకర్యం అతి ముఖ్య మైనవి . వీటి ప్రాధాన్యతను ఆనాడే గుర్తించి , కృషి చేసిన ప్రజానాయకుడు.
ఒక ఉత్కృష్టమైన జీవితం తన కధనాన్ని తానే రాసుకుంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ వారి ఆత్మ కథ . దాని పేరు నా ప్రజాజీవితం . ఆయనకు తన కన్నా ,తన కుటుంబం కన్నా ప్రజలంటేనే మక్కువఎక్కువ . అందుకే భగవంతుడు ఆయన ఆత్మకధను అసంపూర్తిగా ఆపేశాడు .
ఏ నాయకుని జీవితము అసంపూర్తిగా మిగిలిపోదు . మరెన్ని ఉద్యమాలకో ఊపిరి పోస్తుంది . మరేందరికో స్ఫూర్తినిస్తుంది.
అలాంటి త్యాగమూర్తుల కృషి అనే పునా దులపైనే మనమీ నాడు జీ విస్తున్నాము .
కొస మెరుపు
మన ప్రియతమ సోదరి శ్రీమతి కొండపల్లి నీహరిణి గారు వీరి సుపుత్రికే . అవే లక్షణాలు వీరిలో శా ఖో ప శాఖలై పుష్పించి, ఫలిస్తున్నవి ఈ నాడు.