మళ్ళీ ఎప్పుడు పుడుతుందో ఈ గాత్రం….సంగీతం పరవశించింది ఈమె గళం లో….సప్తస్వరాలు తమ జన్మ ధన్యమైందని మురిసి పోయాయి ఈ మహా గాయని కంఠం లో….పదిహేడు భాషల పాటలు ఈమె గాత్రాన్ని అని నిత్యం స్తుతించాయి….అమ్మా జానకమ్మ ఏమి వ్రాయగలను నీ గురించి …ఒక సంగీత అభిమాని ఆయుష్షు లో ఒక్కో సంవత్సరం ఆయుష్షు ను తీసి భగవంతుడు నీకు ఇచ్చి ఇంకా కొన్నేళ్ళు మి మ్ముల్ని ఈ భూమి మీద ఉండేలా చేయలేకపోయాడా ఆ దేవుడు…..విధి ఎంత కర్కశ మయినది.. మంచి సంగీతానికి రాళ్ళు కరిగి పోతాయని అంటారు….మా అమ్మ జానకమ్మ కంఠం లోని ఏ పాటకయినా రాళ్ళు కాదు గుట్టలు కూడా అంతకన్నా కఠినమైన మనిషి గుండె కూడా కరిగి పోతుంది……50 వేల కు పైగా పాటలు ఎంత పుణ్యం చేసుకున్నాయో ….అమ్మా జానకొమ్మా సామ వేదం నీకు నమస్కరిస్తుంది…గంధర్వ లోకం నిన్ను ప్రతి నిత్యం కీర్తిస్తుంది….మా తరం లో నీ పాట వినిపించినందుకు మేము ధన్యులమే….మా తరం కళ్ళకి అమృత తుల్యమైన గళం గల నీ రూపం కన్నులారా చూసినందుకు మేము చరితార్థులం తల్లీ …ఇవే నీకు మా వేల వేల ప్రణామాలు అమ్మా జానకమ్మ త్యాగరాజ కీర్తనల తో మా మనసు లను రంజింప జేశావు..అన్నమయ్య కీర్తనలతో మమ్ముల్ని పులకింప జేశావు….. మధుర సినీ గీతాలతో మాకు మధురాలు భూతుల్ని అందించావు… ఏ పాట ను విన్నా జానకమ్మ….మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా వుంటాయి నీ ఆణిముత్యాలు…. తాన్ సేన్ అనే సంగీత విద్వాంసుడు ద్రుపద రాగం లో పాట ను వినిపిస్తే గుడిలో గంటలు మ్రోగేవి అని అది కళ్ళారా చూసిన అక్బర్ చక్రవర్తి ఆ సంగీత విద్వాంసుణ్ణి తన ఆస్థాన పండితునిగా నియమించు కున్నాడని చరిత్ర లో ఉంది….ఆ విషయం ఏమో గాని మా జానకమ్మ పాట దేవుడే వచ్చి పాట విని వెళ్లిపోతాడు..
గాన గంధర్వుడి ని చిన్న పిల్లాడి లా చూస్తూ వీడు చిలిపి చిలిపి పిల్లోడు అల్లరి బాలుడు అంటూనే ఎన్ని మధుర మైన పాటల్ని ఆ అల్లరి బాలుని తో మాకు అందించావు జానకమ్మ…..ఎంత చెప్పనమ్మా నీ ఘనతను..ఆకాశం దాటింది నీకీర్తి….అష్ట దిక్కులకు ఆవల కు వెళ్ళి పోయిందమ్మ నీ ఖ్యాతి.. ప్రళయ కాలం లో ఆకాశం భూమి సూర్యచంద్రులు ఏమీ ఉండవట….అంతా జలమయమై వుంటుంది….అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏడాది బాలుడు గా వట పత్ర శాయి యై (మర్రి ఆకు పై) తన కుడి కాలు బొటన వేలు ను నోటిలో పెట్టుకుని ఆడుతూ వుండగా అప్పుడు సనక సనందన (వీరికి మరణం లేదు) మునులు స్తుతించగా స్వామి దివ్య తేజము కలిగి విష్ణు రూపుడై శివ బ్రహ్మ లను సృష్టించి అప్పుడు సృష్టిని ప్రారంభిస్తాడని విష్ణు పురాణం చెప్తున్నది…మా జానకమ్మ గళం లోని ఈ పాట ను వినినట్లయితే ఆ విష్ణువు బాలుడిగా మారి సృష్టిని మరచి పోయి ఊయల లో ఊగుతూనే ఉంటాడు…….అది మా జానకమ్మ సంగీత ప్రతిభ… ఈ పాట మైకం లో పరమ శివుడు పార్వతిని కూడా మరచి పోతాడు…. ప్రళయ కాలం లో లయకారుడు తాండవం చేయగా అంతా లయమై పోతుంది……ప్రళయ కాల రుద్రుడు నిర్నిదృడై చేసే తాండవ సమయం లో మా జానకమ్మ పాట వింటే తాండవం ఆపి ధ్యానం లో ఉండవలసిందే…అప్పుడు ఏ జీవికి మరణం ఉండదు…..కైలాసం కూడా విడిచి పాట కోసం పరుగులు తీయవలసిందే……ప్రమాద గణాలు కూడా సర్వమూ మరచి పాటలో లీనమై పోవాల్సిందే….అమ్మా జానకమ్మ నువ్వు మా తెలుగు నెలలో జన్మించడం మా తెలుగు భాష అదృష్టం…..కొంత కాలం కరీం నగర్ జిల్లా సిరిసిల్ల లో ఉన్నావంటా….ఆ నగరం ఎంత పునీతురాలు అయిందో…..నీవు జన్మించిన పల్లపట్ల గ్రామం ఎంత అదృష్ట వంతురాలు….ఎప్పుడూ నవ్వుతూనే సామ వేదాన్ని ఔపాసన పట్టి ఆ రసాన్ని సంగీతాభిమానులకు పంచినావు జానకమ్మ…ఆ రసాన్ని రోజూ చవి చూస్తున్న మేము ఎంతో ధన్యులం అయ్యాము.. బృందావన విహారి రాధా సమేతుడై యమునా తీరం లో తన వేణువు తో మోహన రాగం లో రాగాన్ని ఆలపించగా రాదా దేవి ధ్యాన నిమగ్నురాలై ఐహిక ఆముష్మిక సుఖ భోగాలను వదిలి కృష్ణుడిలో కలిసి పోతుందని కృష్ణ చరితం ఒక మాట..ఇక్కడ కృష్ణుడు భగవంతుడు ….రాదా దేవి జీవుడు…మోహన రాగం అనేది జీవుడు దేవుని కై చేసే స్తుతి…… కాని మా జానకమ్మ పాడిన ప్రతి పాట అది పాట కాదు ఒక స్తుతి…. అంతే కాదు ఒక్కో వేద మంత్రం…..కృష్ణుని మోహన రాగం వేణువు అన్నీ కూడా మా జానకమ్మ రాగం ముందు ఎంత…ఆమె పాట విన్న ప్రతి చోటు బృందావనమే…