చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో తరుణ్ అనే ఒక మనిషి ఉండెను. అతను ఒక వ్యాపారి, ఎక్కువ ధనికుడు కానప్పటికి అతను చాలా సుఖంగా జీవించాడు. అతనిది పెద్ద కుటుంబం, సోదరులు, సోదరీమణులు, భార్య మరియు పిల్లలు. అతను వారిని మంచిగా చూసుకున్నాడు. మరియు గ్రామంలోని బీదలకు కూడా చేతనయినంత సహాయం చేసేవాడు. అతను బాటసారుల కొరకు విశ్రాంతి ఇండ్లు కట్టించాడు, మరియు వాటిలో భోజన శాలలు ఉండెను. వాటిలో ఎవరైన వచ్చి మంచి భోజనం చాలా కొద్ది డబ్బుకే తినే వీలుండెను.
ఒకనాడు తన పని నుండి తిరిగి ఇంటికి వస్తున్నపుడు ఒకతను దారిలో ఒక విశ్రాంతి ఇల్లు చూచాడు. దానిలో ఒక వరండా ఉండెను, దానిలో మనుషులు ఆగి విశ్రాంతి తీసుకునేవారు. అక్కడ కూర్చొని, బాగా అలసి పోయినట్లు కల్పించి ఆకలిగా ఉన్న ఒక కొత్తతను ఉండెను. అతను పొడుగాటి మనిషి అతని దుస్తులు ప్రయాణం వలన మాసిపోయినట్లు మరియు అతను చాలా దూరం నుండి వస్తున్నట్లు కనిపించాయి. ఆయన వెంట ఒక గుఱ్ఱం ఉండెను. అది కూడా తన యజమానివలె అలసిపోయి ఆకలిగా కన్పించింది.
వారిని చూడటంతో తరుణ్ హృదయం ధ్రవించిపోయెను, మరియు అతను వారితో మాట్లాడుటకు ముందుకుపోయెను.
ఓ నా సోదరా, నీవు ఎక్కడి నుండి వచ్చావు? అతను అడిగాడు. వేడి భోజనం మరియు కొంత విశ్రాంతి కొరకు లోనికి ఎందుకు రావు?
ఆ మనిషి తనవైపు చూస్తూ చిరునవ్వుతో తిన్నాడు, ఆ విశ్రాంతి ఇల్లు చాలా పేరు గాంచినది. దాంట్లో నాకు రూమ్ లేదు, మరియు భోజనశాల నిండుగా ఉంది. నేను ఇక్కడ కొద్దిసేపు ఎదిరి చూస్తాను. అప్పుడు నేను బయలుదేరుతాను. నాకు రోజు చివరిలో తప్పక భోజనం దొరికే స్థలం దొరుకుతుంది.
తరుణ్ ఆ మాట పట్టించుకోలేదు. ఒకతను అక్కడ భోజనం చేయక, విశ్రాంతి తీసుకోక వెళ్ళిపోవటం అతని మనసుకు బాధేసింది. అతను ఆ బాటసారిని బలవంతపెట్టి తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ తన కుటుంబంతోపాటు బాటసారిని భోజనానికి ఆహ్వానించాడు. ఆ మనిషికి ప్రేమతో వడ్డించారు, అతను కడుపునిండా భోం చేశారు.
అతను భోజనం చేస్తున్నపుడు తరుణ్ మతిమరుపు మనిషని గ్రహించాడు. అతని మనసులో ఏదో వుండి ఆరాటపడుతుండెను. వారి భోజనం అయిన తరువాత చేతులు కడుగుకని బాటసారి బయలుదేరుటకు లేచాడు. అతను తరుణ్ దయాగుణం కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. మరియు అన్నాడు, నేను ఒకటి అడుగుతున్నందుకు ఏమనుకోకండి, మీరు భోజనం చేస్తున్నపుడు ఏదో విచారిస్తున్నట్లు నేను గమనించాను. నాకు తెలుసు, నేను మీకు కొత్తవాడినని, అనుకోకుండా నాతో ఆ సమస్య చెబితే మీ బాధలు కొంతవరకు తగ్గిపోవచ్చు.
కాని తరుణ్ కేవలం ఒక నవ్వు నవ్వాడు మరియు తన తల ఊపాడు.
అప్పుడు ఆ మనిషి అన్నాడు, బహుషా నేను ఎవరినో తెలుపుతే నీ రహస్యాలు నాతో చెప్పుతారు?
మరియు కొన్ని క్షణాల్లోనే అతను మారిపోయాడు. అతను ఇక ముందు అలసిపోయిన బాటసారి కాదు, కాని ఓ దేవుడు, మెరుస్తున్న ప్రకాశవంతమైన దుస్తుల్లో తలపై ఒక కిరీటంతో ఉన్నారు. అతని గుఱ్ఱం దున్నపోతుగా మారింది, మరియు ఆ మనిషి తన పరిచయం చేశాడు, నేను యముడను, మరణాలకు యజమానిని. నీ సమస్య ఏంటో ఇప్పుడు చెప్పగలవా?
ఇది చూసి తరుణ్ దాదాపు మూర్ఛిల్లింది. కొద్దిసేపటికిందనే యముడు అతనితో భోజనం చేశాడు! మి మి మీరు భూమిమీద ఏం చేస్తున్నారు రాజా? తనని రొప్పుతూ అడిగాడు, తడబడుతూ.
యముడు నవ్వాడు మరియు అన్నాడు, ఓహ్ నేను ఎప్పుడో ఒకప్పుడు రావటందుకు ఇష్టపడుతాను, మరియు ప్రతివారు ఏం చేస్తుంటారో చూస్తాను. అందువలన నీకేం బాధ?
తరుణ్ జవాబు ఇచ్చాడు. “మీరు చూడండి, నా వ్యాపారాన్ని పెంచదలచాను, కాని ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు. ఒకవేళ నాకు ఏమన్నవుతె ఎవరు నా పెద్ద కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు?
యముడు తీవ్రంగా తల ఊపాడు. విచారించకు అబ్బాయి’ అని ఓదార్చాడు.
“నీవు చాలా కష్టబోతువు. మరియు దయగల వాడవుగా నిన్ను నేను చూశాను. నీవు నన్ను ఆహ్వానించావు మరియు నీతో భోజనం చేయించావు. కేవలం నన్ను ఒక అలసట చెందిన బాటసరని, నేను ఒకటి చేస్తాను. నీవు భూమి వదలి, అందరివలె ఒకనాడు నాతో వచ్చే సమయాన, నేను హఠాత్తుగా రాను. నేను నీకు ఎన్నో రోజుల ముందు తెలుపుతాను. దాన్నిబట్టి నీవు నాతో వచ్చేముందు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగలవు!
తరుణ్ అది విని కృతజ్ఞతా పూర్వకంగా తలవంచాడు, యముడు మాయ మయినాడు.
సంవత్సరాలు గడిచాయి. తరుణ్ ఒక ముసలతను అయినాడు. అతని వ్యాపారం చాలా వృద్ధి చెందింది. అతని పిల్లలు, సోదరులు, సోదరీమణులు (అన్నా తమ్ములు, అక్కా చెల్లెండ్రు) అందరు హాయిగా వున్నారు దేవుని దయవలన. అతనికి ఏ విధమైన చింతలు మిగిలి లేకుండెను.
ఒక రాత్రి అతను నిద్రపోయాడు. నిద్రలో ఓ కలగన్నాడు. అతని ముందు యముడు నిలబడియున్నాడు. యముడు తనవైపు చేయి చూపుతూ సమయం ఆసన్నమైంది, నీవు నాతో వచ్చేందుకు రా, అన్నాడు.
తరుణ్ భయపడిపోయాడు. కాని రాజా, నీవు నా చావుకు కొన్ని రోజులముందు తెలుపుతానని వాగ్దానం చేసియుంటివి గదా! నేను ఇప్పుడే ఎట్లు రాగలవా అకస్మాత్తుగా?
యముని పెదాలమీద చిరునవ్వు కనిపించింది. కాని అబ్బాయి, నేను నీకు హెచ్చరికలు ఇచ్చాను. నేను నీ వెంట్రుకలను తెలుపుగా మార్చాను. నీ వయసును ఒట్టి నీ వెన్నెముక వంగేట్లు చేశాను, నీ పండ్లు ఒకటి తరువాత ఒకటి ఊడిపోయేట్లు చేశాను. వీపు భూమి మీద వుండేకాలం దగ్గర బడుతుందనే సూచన్లు ఇవ్వన్ని.
అనువాద సాహిత్యం
కేవలం ప్రశ్న
కుట్టూరావ్ కి విపరీతమైన కోపం వస్తోంది.
ఇవాళ రాత్రి ఆయన తన కుమారుడికి ఎలాగైనా ఒక గుణపాఠం నేర్పాలని, బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.
ఆయన భార్య సరస్వతి. ఆమెకి తన భర్త కోపం గురించి బాగా తెలుసు. ఆమె తన చిన్న కుమారుణ్ణి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. నాడు నిద్రకు ఉపక్రమించాడు. ఆ తల్లి మనసు తన పెద్ద కుమారుడి భవిష్యత్ గురించి ఆలోచించసాగింది. నిజానికి ఆమె మనసు తప్పే చేస్తున్నది.
‘ఛెళ్’ మన్న చెంప దెబ్బ విని సరస్వతిరావు ఆలోచన్లల నుంచి హఠాత్తుగా బయటపడింది. దానితోబాటే ఆమె భర్త మాటలు వినబడసాగాయి. ఆమె భర్త గొంతు చించుకుంటూ అరవసాగాడు.
“ఒరేయ్! నువ్వో వెధవ్విరా. త్రాగి ఇంటికొచ్చావ్! ఎంత ధైర్యంరా నీకు? పో! నీ మొహం నాకు చూపించకు. ఇక నా ముందుకి ఎప్పుడూ రావద్దు.”
పెద్దబ్బాయి వాళ్లనాన్నని విచిత్రంగా చూసాడు. తరువాత పడుకోడానికని లోపలికి వెళ్ళాడు. కాని చిన్నబ్బాయి ఇంకా మేలుకునే ఉన్నాడు.
“ఏంటమ్మా! అన్న తాగొచ్చాడా ఏంటి? నాన్న అలా అరుస్తున్నాడు?”
సరస్వతి ఏమీ జవాబివ్వలేదు.
చిన్నబ్బాయి మళ్ళీ అడిగాడు – “దీనికోసమని అన్నని నాన్న ఎందుకు కొడుతున్నాడమ్మా? మరి…. ఆయన కూడా ఇంటికి అప్పుడప్పుడు త్రాగివస్తాడు; మనమీద అరుస్తాడు కదా! ఆయన్నెవరూ ఏమీ అనరా?”
“అంతే! ఆ రోజున మొదటిసారిగా కుట్టూరావ్ తన చిన్నబ్బాయి మీద కూడా చెయ్యి చేసుకున్నాడు.
ఆలోచన
నిన్ననే జరిగిన సంఘటన. నేను నా స్కూటర్ తో సహా ఒక ట్రాఫికంలో చిక్కుపడిపోయాను. బండిని మెల్లిగా చాలా మెల్లిగా నడుపుతూ వెళ్తున్నా, నాకెదురుగా ఒక గుర్రబ్బండి (టాంగా) ఉంది. దానిపై కొంతమంది స్కూల్ పిల్లలు కూర్చుని ఉన్నారు.
నిజానికి ఇతరుల సంభాషణ వారికి తెలియకుండా వినడం అనేది సభ్యత కాదు కదా! అయినా… ఇప్పటి నా పరిస్థితి ఎలా ఉందంటే…. ఆ పిల్లల మాటలు, వాటంతట అవే, నేను వినాలని అనుకోకపోయినా… నా చెవుల్లో పడసాగాయి.
వాళ్ళంతా 8-9 సంవత్సరాల వయసున్న ఉన్న పిల్లలు. ఓ పది మంది దాకా ఉండి ఉంటారు. “మా అన్న గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెదకుతూనే ఉన్నాడు. ఎం.ఏ. పాసయినాడు. ఓ గోల్డ్ మెడలు కూడా వచ్చింది అని ఒకడనగా – ఇంకొకడు – “అవును! అందుకే ఈ చదువులవల్ల మనకే లాభమూ ఉండదని, దండగని నేను అంటూ ఉంటాను. మా అన్న ఉన్నాడు. పదో క్లాసు తప్పాడు. అయితే నేం….? వాడి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తోంది. ప్రతినెలా “దాదాగిరి”తో చాలా డబ్బు సంపాదిస్తాడు”. ఇప్పటికే చాలా డబ్బు వెనకేశాడు.”
బంగారు పతకం
రాజీవ్ కి ఇవ్వాళెందుకో పాతరోజులు గుర్తుకొస్తున్నాయం. బంగారు పతకాన్ని చేతిలోకి తీసుకోగానే వళ్ళంతా పులకరిస్తోంది. ఇదే పులకరింత అతనికి. ఆ పతకం ముఖ్య అతిథుల చేతులమీదుగా, చప్పట్ల మధ్య తీసుకుంటున్నప్పుడు కలిగింది. ఆ రోజున “మీ అందరికీ నువ్వు గర్వకారణం చాలూ! నీవల్ల కేవలం నీ గౌరవమే కాదు, ఈ విద్యాలయం ప్రతిష్ఠ కూడా రెట్టింపు అయింది” అని ఆ ముఖ్య అతిథి అన్న ప్రశంసావాక్యాలు తలచుకున్నప్పుడల్లా అతని ఛాతీ విస్తరించేది.
ఇది జరిగి పదేళ్ళయింది. ఈ పదేళ్ళలోనూ ఏమీ జరగలా. రాజీవ్ తండ్రి మరణించాడు, తల్లి మంచం పట్టింది. తనేమో ఈ రోజుకు ఉద్యోగంకై అన్వేషిస్తూనే ఉన్నాడు. ఇవాళైతే అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. రాజీవ్ దగ్గర పాపం మందులు కొనేందుకు డబ్బులు లేవు. చివరికి ఇవాళ తన బంగారు పతకాన్ని అమ్మకానికి పెట్టాలని నిశ్చయించుకున్నాడు.
నేను మెల్లిగా ఆ టాంగా వెనకే వెళ్తున్నా. నాకు ఆశ్చర్యం, బాధ, జాలి, వాళ్లందరి మీదా కలిగాయి. అసలు వీళ్ళకి విద్య ఉద్దేశ్యం ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా ఈ పిల్లలకి అర్థం అవుతున్నాయా అనే ఆలోచనలో మునిగిపోయాను.
మెడలో జేబులో పెట్టుకుని భారమైన గుండెలతో, ఇంట్లోంచి బయలుదేరాడు రాజీవ్. ఈ లోకంలో నీతి, న్యాయం, మానవత్వం, మంచితనాలు లేవని అనిపించింది అతనికి. బంగారు పతకం, అన్ని సర్టిఫికేట్లు, ప్రథమశ్రేణి కేరియరం. కాని ఉద్యోగం హుళక్కు. ఎక్కడా చేసేందుకు పనే దొరకలేదు.
ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు తను బంగారు నగల దుకాణం దగ్గరికొచ్చాడో తెలియనే లేదు.
“ఏం కావాలి సార్! అనే పిలుపుతో అతడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.
ఎదురుగుండా యజమాని. పెద్ద నగల దుకాణం ఉంది.
“నా బంగారు పతకం ఒకటి అమ్మాలనుకుంటున్నా సేఠ్ జా! అన్నాడు రాజీవ్.
సేఠ్ గారు మెడలం చేతిలోకి తీసుకున్నాడు. అటూ ఇటూ త్రిప్పాడు. ఏదో రాయికి దాన్ని సరసరా అటూ ఇటూ గీచాడు పరీక్షించాడు.
“బాబూ! నా టైం చాలా విలువైంది. ఇలా వృధా చెయ్యకు. ఇది బంగారం కాదు. పైన పూత ఉంది అంతే. దీని విలువ పది రూపాయలకన్నా ఎక్కువ చేయదు” అని అన్నారు.
వైరం
సాధారణంగా నేను తక్కువగా మాట్లాడుతా. అంతే మితభాషిని. మంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటా… ఇతరులతో కలవడాలు, రాసుకుపూసుకు తిరగడాలు కూడా తక్కువే. ఇలా దూరం దూరంగా ఉండడం వల్ల నా ప్రాణానికి హాయిగా ఉంటుంది.
నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తా. మా ఆవిడతో కలిసి జమునాదాస్ గారింటికి వెళ్ళాను. కొద్దిసేపు పిచ్చాపాటీ అయ్యాక, మా వీధిలో ఎవరెలాంటివారు అన్నదానిపై చర్చ మొదలైంది. నేనైతే ఇక తప్పదన్నట్టుగా బలవంతంగా కూర్చుని వాళ్ళ మాటలు వింటూ ఉన్నా.
కొత్త వ్యక్తి అయిన బిహారీబాబు గురించి చర్చ మొదలైంది. జమునాదాస్ ఆయన్ని ఉతికి ఆరేస్తూ, చివరికి అతగాడికి అసలు సభ్యతంటే ఏమిటో తెలీదు. ఎప్పుడూ మనల్ని గుర్తించినట్టే ఉంటాడు. నమస్తే అంటే జవాబుచెప్పడు. ఎటో చూస్తూ ఉంటాడు. రాత్రిళ్లయితే మరీ బడాయిపోతాడు. మనల్నసలు చూడనే చూడడు. బహుశా మత్తులో మునిగి తేలుతూ ఉంటాడేమో”
హఠాత్తుగా నావైపు తిరిగి – “మీరేమంటారు డాక్టర్ గారూ!” అని అన్నాడు.
“ఇక నేను చెప్పక తప్పలేదు. బిహారీ బాబూ పాపం చాలా మంచివాడు. రాత్రిళ్ళు సరిగ్గా చూడలేదు – ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాడు. కొద్ది రోజుల్లో తగ్గి పోవచ్చు”,
“ఆరోగ్యవంతుడైపోతాడు” అన్నాను నేను.
తర్వాత మాటలన్నీ మరొకరి దోషాల్ని వెదకసాగాయి.
దర్యాప్తు
ప్రజల గగ్గోలు పెడుతూంటే భరించలేక మంత్రిగారు రూపాయల కుంభకోణం వ్యవహారంపై ఒక దర్యాప్తు కమిటీ వేయగా ఆ కమిటీ చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా తన పని ప్రారంభించి ఆ శాఖకి చెందిన అందరికన్నా పెద్ద అధికారిపై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకి ఒక పెద్దమనిషిగా, గొప్ప ధనికుడిగా పేరుంది. మొత్తానికి ఆయన ఆ ఐదు లక్షల కుంభకోణం నిర్దోషిగా బయటపడ్డాడు. తరువాత ఆయన సహచరుడి వంతు వచ్చింది. ఆయన ఈ మధ్యనుంచే గొప్పవాడైపోతున్నాడు. ఆయనో వకీలు కూడా తన తెలివితేటల్తో, ఆయన బయటపడ్డాడు. చివరికి ఆ విభాగం బంట్రోతు వంతు రాగా ఆ కమిటీ మంత్రిగారికి తన నివేదిక అందజేసింది.
మర్నాడు మంత్రిగారు వార్తాపత్రికల్లో చేసిన ప్రకటన ఇలా ఉంది.
“దర్యాప్తు సంఘం తన విచారణ పూర్తి చేసింది. వారి ప్రకటన ఇలా ఉంది-
మేము దర్యాప్తు చేసాక ఈ శాఖ బంట్రోతు ఈ కుంభకోణానికి మూలం అని తేలింది. మేము ఆ వేరుని మొదలంట తొలగించాం. కాండం, ఆకులు పూలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇక వారు ఈ శాఖని ప్రగతి మార్గంలో పరుగులు పెట్టిస్తారు!!
Poet – Gurijala Rama Seshaiah,
O, Citizens of the world!!
Don’t forget the flowers, colours and birds
Live forever happily
Invite spring and moonlight
every moment into your life
Forget the wars and warfare!
We take the journey of the world
With all our colourful wings
In order to remind you of
Your cheerful mood and laughter
Our rainbows try to suggest you
With our curved colourfullines
To effervesce the sea of heart
Please preserve the rainbow
In your soulful sky
The soul speaks colourful language
The affection has a humane conversation
I’m a butterfly
I’m a colourful sapling of Telugu letters of the alphabet
(Translated from Original Telugu Poem PagaleRangulaVennelaPaata by Dr. PalakurthyDinakar)
ఓ ప్రపంచ జనులారా !!
పూవులనూ రంగులనూ పక్షులను మరచిపోకుండా జీవించండి
అనునిత్యం బతుకులోకి వసంతాన్నీ వెన్నెలలనూ ఆహ్వౕనించండి
యుద్ధాలను మరచిపోండి !!
మా రంగురంగుల రెక్కలన్నీ
మీ ఆనంద దరహౕసాల
రంగు’హొరంగుల ముచ్చట్లేనని’చెప్పటానికే
మా నిరంతర ప్రపంచ ఉద్యాన విహౕరయాత్ర !
వక్రతాసుందర రేఖతో
రంగులను ఎంచి వంచి చూపేందుకే
మా-మీ కోసమే ఇంద్రధనుసు యత్నమంతా
హృదయ సముద్రాన్ని పొంగించుకోండి
మనో ‘ఆకాశంలో ఇంద్రధనుసు ను పదిలపరచుకోండి !
మనసుదంతా రంగులభాషే !
మమతదంతా మానవత్వ సంభాషణే !
నేను సీతాకోకచిలుక ను
తెలుగుపలుకుల రంగులమొలక ను.
—– గురిజాల రామశేషయ్య
సుకుమార వినికిడి ఫోన్📲 70326 79471
ఒక అందమైన కల…
తుషార స్నాత ప్రభాత వేళ ఆత్మ యొక్క సుగుణం ఇంద్రజాల కిరణంలా శోభిల్లుతోంది
రేయంతా వెన్నెల కాంతులు వెదజల్లే దివిటీ యై నిరీక్షిస్తూ వీక్షిస్తూ కాలుతున్న హృదయం నుండి కరిగి కరిగి సుగంధాలు విడుదల అవుతోంది
మరియు ఆమె శీతల శిశీరంలో అవని దశదిశలా వసంతమై ప్రకాశిస్తూ మరులు గొలుపుతుంది
ఎద సముద్రమంత లోతు గలదై ఆకాశమంత విశాలమైనది ఇది ప్రేమ కు శక్తి కలుగ చేస్తుంది
జీవిత పరమార్ధం గ్రహించటానికి ఇంకేం కావాలి ఆమె ముఖారవిందం నిండు పున్నమి లా విరియగా
ఆమె చెలిమి తరం తరం నిరంతరం ఒక అందమైన కలగా మిగిలే వుంటుంది
ఆమె ప్రేమ అనునిత్యం వెన్నంటి మేల్కొలుపు తుంది
మది ఊయలలూపుతుంది. అదర మధుసేవనంలో మదురసాలను ఒలుకుతుంది…
తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,
వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…
విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది
విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది
గుడిసె కప్పు మీద గలగలమనే
ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ
కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ
అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం
వంటగదిలో భయంకరమైన చీకటి,
ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…
ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!
మాట నుడివి మౌనాన్ని ఛేదించు
తుఫాను రోదన నీ కనురెప్పల్ని
భారంగా మూసేసిందా?
రాట్నపు మృవైన రొద
నీకోసం జోలపాట పాడిందా?
నా యౌవన వసంతపు ప్రియురాలా!
నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!
మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం
మద్యం మనలో మోదాన్ని నింపుతుంది
దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా
అన్నీ మరచి గానం చెయ్
వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో
ఆలపించే పాటను పాడవా?
తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,
వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…
విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది
విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది
నా యౌవన వసంతపు ప్రియురాలా!
నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!
మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం
మద్యం మనలో మోదాన్ని నింపుతుంది
రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్
ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి
తెలుగు సేత: ఎలనాగ
***
1930లో జన్మించి తన పద్దెనిమిదవ ఏట కవిత్వం ప్రారంభించి 1993లో నోబుల్ బహుమతిని పొందిన డెరెక్ వాల్కాట్ కవితలు ఈ ఫిబ్రవరి 2022 ‘అనువాద కుసుమాలు..’
మరణశాసనం
మనోవేదనంతా రెండు పద్ధతులతో మెలితిప్పుతోంది
ఒకటి అద్దెగుర్రాలను అనుసందానించిన గద్యం ,
నేను సంపాదించిన నా బహిష్కరణ.
మసకవెన్నెల ప్రకాశంలో సుదీర్ఘ సముద్రతీరాన ప్రయాసతో ప్రయాణం
కమిలి, కాలిన
చర్మాన్ని విడిచి
ఈ సముద్రపు ప్రేమ – అదే స్వీయ ప్రేమ.
మీ మాటలను మార్చుకోవాలంటే.. మీ జీవితాన్ని మార్చుకోక తప్పదు.
పాత తప్పిదాలను సరిదిద్దలేను నేను
అలలు దిగంతాలను అలంకరించి తిరిగి వస్తున్నాయి
సముద్రపు కాకులు అరుస్తున్నాయి ఛాందసపు మాటలతో
ఎగువ రేవులో కుళ్ళిపోతున్న దోనెలు
విషపుముక్కుల పక్షులగుంపులతో ఆ ద్వీపాంతరం నిండిపోయింది..
ఒకప్పుడు దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను, ఇప్పుడు, నేను వేరే మార్గం ఎంచుకున్నా, స్థలమే లేదు ఆ దోనెలో
నేను ఎదురు చూశాను కుక్కల వంటి ఉత్తమ మేధావుల
రవ్వంత సహాయం కోసం
నాకు వయసు మీద పడుతుండగా, కాలిన చర్మం
కాగితం వలె నా చేతి నుండి రాలుతుంది,
సన్నని ఉల్లిపొరలా
*పీర్ జింట్ చెప్పే పొడుపు కథల వలె
హృదయంలో ఏమీ లేదు,
చావును గురించి భయం కాదది.
ఎందరో చనిపోయారని నాకు తెలుసు.
వారందరూ సుపరిచితులే, అన్ని పాత్రల్లో ఉన్నారు,
కానీ.. అగ్నిలో వారు ఎలా మరణించారు..,
ఆ దేహాలకు ఇక పై ఏ భయాలుండవు
కొలిమిలా మండే భూమి వలన
ఆ సూర్యుని బట్టీ వంటి బూడిదకుప్ప,
ఈ మేఘావృతమైన, మేఘరహితమైన నెలవంక ప్రకాశంతో
ఈ రేవు మళ్లీ ఖాళీ పేజీలాగా తెల్లగా మారుతుంది
దాని సమానత్వమంతా అసమాన ఆగ్రహమే.
(*పీర్ జెంట్ నార్వేకి చెందిన కవి, నాటకకర్త)
***
ఆంగ్ల మూలం: డెరెక్ వాల్కాట్ట్ (Derek walcott)
తెలుగు సేత : జ్వలిత
Codicil
Schizophrenie, wrenched by two styles, one a hack’s hired prose, I earn my exile. I trudge this sickle, moonlit beach for miles,
tan, burn
to slough off
this love of ocean that’s self-love.
To change your language you must change your life.
I cannot right old wrongs.
Waves tire of horizon and return.
Gulls screech with rusty tongues
Above the beached, rotting pirogues,
they were a venomous beaked cloud at Charlotteville.
Once I thought love of country was enough, now, even if I chose, there’s no room at the trough.
I watch the best minds root like dogs
for scraps of favour.
I am nearing middle
age, burnt skin
peels from my hand like paper, onion-thin
Peer Gynt’s riddle.
At heart there’s nothing, not the dread
of death. I know many dead.
They’re all familiar, all in character,
even how they died. On fire,
the flesh no longer fears that furnace mouth
of earth,
that kiln or ashpit of the sun
nor this clouding, unclouding sickle moon
whitening this beach again like a blank page.
All its indifference is a different rage.
***
ముగించబోతున్నాం
నేను నీటిపై జీవిస్తున్నాను,
ఒంటరిగా.. భార్యా పిల్లలు లేకుండా..
నేను ఈ స్థితికి రావడానికి చుట్టుముట్టిన ఎన్నో కారణాలు
చుట్టూ బూడిద నీరున్న చిన్న ఇల్లు,
పాత సముద్రపు దిశగా ఎల్లప్పుడూ తెరిచుండే కిటికీలు, అలాంటి వాటిని మనమెప్పుడూ కోరుకోము,
కాని మనంతట మనమే తయారు చేసుకున్నవవి.
మేము బాధపడుతున్నాము..,
సంవత్సరాలు గడుస్తున్నాయి, సరుకులు దింపుతుంటాం,
కానీ మన అవసరానికి కాదు
సమస్యలలో… ప్రేమ అనేది పాలిన నీటికింద సముద్రగర్భంలో స్థిరపడిన రాయి.
ఇప్పుడు, నాకు ఏమీ అవసరం లేదు
కవిత్వం నుండి నిజమైన అనుభూతి కానీ,
జాలి లేదు, కీర్తి లేదు, చికిత్స లేదు. నిశ్శబ్దంగా భార్య,
మేము బూడిద నీటిని చూస్తూ కూర్చుంటాము,
మరిక అతి మామూలుగా జీవితంలో కొట్టుకు పోతూ చెత్తతో నిండిపోయి శిలల్లా జీవిస్తూ..
నేను అనుభూతిని మరచిపోవాలి,
నా బహుమతిని మరచిపోవాలి,
అది నాకు జీవితంలో అన్నిటి కంటే పెద్ద కష్టం..
***
ఆంగ్ల మూలం: Derek Walcott
తెలుగు సేత: జ్వలిత
Winding Up
I live on the water,
alone. Without wife and children.
I have circled every possibility
to come to this:
a low house by grey water,
with windows always open
to the stale sea. We do not choose such things,
but we are what we have made.
We suffer, the years pass,
we shed freight but not our need
for encumbrances. Love is a stone
that settled on the seabed
under grey water. Now, I require nothing
from poetry but true feeling,
no pity, no fame, no healing. Silent wife,
we can sit watching grey water,
and in a life awash
with mediocrity and trash
live rock-like.
I shall unlearn feeling,
unlearn my gift. That is greater
and harder than what passes there for life.
****
డెరెక్ వాల్కాట్ ఇరవయ్యవ శతాబ్దపు కవి, అతను జనవరి 23, 1930న లెస్సర్ యాంటిల్లెస్‌లోని సెయింట్ లూసియా ద్వీపంలో జన్మించాడు. అతను కవలశిశువుగా జన్మించాడు. అతని తండ్రి, పెయింటింగ్ చేసేవాడు కవిత్వం రాసేవాడు, డెరెక్ మరియు అతని కవల సోదరుడు ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అతడు మరణించాడు.
అందువల్ల, కుటుంబం సభ్యులు చెప్పిన కథలు తప్ప వాల్కాట్కు తన తండ్రి గురించి ఏమీ తెలియదు. అతని తల్లి కళలను ఇష్టపడే ఉపాధ్యాయురాలు. ఆమె తన పిల్లలకు కవిత్వం చెబుతుండేది. తన జీవితంలోని ప్రారంభ దశల్లో, వాల్కాట్ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు మరియు కొన్నింటిని స్వయంగా ఎదుర్కొన్నాడు. ఈ కష్టాలలో కొన్ని ఎంపిక చేయబడినవే అతని కొన్ని కవితలకు ప్రేరణగా మారాయి. ప్రత్యేకించి, వాల్కాట్ యొక్క నానమ్మ అమ్మమ్మ బానిసత్వ యుగంలో జీవించారు. బానిసత్వం గురించి అతను తన రచనలలో చాలాసార్లు ప్రస్థావించాడు. అతని తల్లి స్థానిక మెథడిస్ట్ చర్చిని నడిపించడంలో నిమగ్నమై ఉంది, అయితే అక్కడి ప్రధానమైన కాథలిక్ సంస్కృతితో కుటుంబం మసకబారినట్లు భావించింది. అతను రాయబోయే కవిత్వంపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది, అలాగే సాధారణంగా వాల్కాట్ విద్యాభ్యాసం సెయింట్ మేరీస్ కళాశాలలో గడిపిన సమయం, అతను వెస్ట్ ఇండీస్ విశ్వవిద్యాలయం కళాకారుడిగా అతనికి స్ఫూర్తిదాయకంగా నిరూపించబడింది. కళ పట్ల ఉన్న ఈ అభిరుచి అతన్ని థియేటర్, ఆర్ట్ క్రిటిక్‌గా ఉద్యోగం చేయడానికి 1953లో ట్రినిడాడ్‌కు వెళ్లేలా చేసింది. అతని మొదటి ప్రధాన సాహిత్య విజయం 18 సంవత్సరాల వయస్సులో వచ్చింది, అతను తన తల్లి నుండి డబ్బు తీసుకున్నాడు మరియు యంగ్ XII కాంటోస్ (1949) కోసం 25 కవితలు (1948) మరియు ఎపిటాఫ్ను స్వయంగా ప్రచురించాడు. సుమారు ఆరు సంవత్సరాలు ట్రినిడాడ్‌లో నివసించిన తర్వాత, వాల్కాట్ ట్రినిడాడ్ థియేటర్ వర్క్‌షాప్‌ను స్థాపించాడు. అతని నాటకాలలో ఎక్కువ భాగాన్ని తయారు చేస్తుంది, దీని తరువాత, వాల్కాట్ తన సమయాన్ని చాలావరకు ప్రయాణాలలో గడిపాడు.
ఆ తర్వాత అతడు ప్రపంచం మరియు కరేబియన్ సాహిత్యానికి ఒక సాంస్కృతికవేత్తగా మారాడు. అతను బోస్టన్ యూనివర్శిటీలో సాహిత్యం యొక్క ప్రొఫెసర్‌గా బోధిస్తూ గడిపాడు. 1992లో అతని సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకోవడమే ఇప్పటి వరకు ఆయన సాధించిన గొప్ప విజయం.
***
ఇష్మెంట్ టు డా 1992లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
కవిత్వం
డెరెక్ వాల్కాట్ రచనలలోని సాధారణ ఇతివృత్తాలు కరేబియన్ సంస్కృతి మరియు చరిత్రపై దృష్టి కేంద్రీకరించబడింది, వలసవాదం యొక్క ప్రభావాలు, భాషతో సంబంధం తెలుస్తోంది. అతను కొన్నిసార్లు ఇంగ్లీష్ నుండి కరేబియన్, పాటోయిస్ నుండి ఫ్రెంచ్ వరకు మిక్స్ భాషలను ఉపయోగించాడు. అదనంగా, వాల్కాట్ యొక్క కవిత్వం వివిధ కాలాల ప్రదేశాలలో విస్తరించి ఉంటుంది మరియు కరేబియన్‌లోని సంస్కృతులు మరియు ప్రజల మధ్య సంక్లిష్టమైన సంబంధాలను చూపే సంఘటనలుంటాయి.
“ది సీ ఈజ్ హిస్టరీ” అనే కవితలో వాల్కాట్ నాటి భయానక పరిస్థితులను పరిశోధించడం ద్వారా ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించి కరేబియన్ చరిత్రను వివరించగలిగాడు.
ఈ కాలపు చరిత్ర చాలా వరకు సముద్రంలో బంధించబడిందని, “ఆ గ్రే వాల్ట్‌లో” మరణించిన ఆఫ్రికన్ ప్రజల జీవితాలలో: బానిస ఓడలు మిడిల్ పాసేజ్ లో మునిగిపోయాయని ఆయన సూచించారు. వాగ్దాన భూమిని వెతుకుతూ బైబిల్ (నిర్గమకాండము)లో యూదుల పారిపోవడానికి బలమైన పోలికలను కూడా తన కవిత్వం లో చెప్పాడు.
***
హిందీమూలం: డా. విష్ణు సక్సేనా, తెలుగు సేత: డా.సీ.భవానీదేవి
జ్వలన రాత్రులుగానీ
కన్నీటితో తడిసే పగళ్లుగానీ ఉండవు
ప్రేమకు బదులుగా
నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే!
ఎప్పుడైనా గుసగుసలాడితే
ప్రభాత ప్రేమగానమై
స్వతఃస్సిద్ధంగా ప్రవహించసాగింది
శబ్ద గోదావరిలో
ఆహ్లాదస్సర్శను పొందిన దేహం
అసంఖ్యాక గీతాలుగా మారిపోయింది
శరీరమైతే మేలుకొని ఉందిగానీ
మననూ….ఆత్మా… రెండూ నిద్రించాయి
చీకటి వెలుగుల నుండి
మొహం దాచుకుని సంతోషించలేవు
ప్రేమకు బదులుగా
నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే…
ఆహ్లాదస్పర్శను పొందిన దేహం
అసంఖ్యాక గీతాలుగా మారిపోతుంది!
ఒడిలో సేద తీరిన నా తలపై
మెల్లగా నువ్వు నిమురుతున్నప్పుడు
కన్నీళ్లు తుడుచుకుంటాయి
వెక్కిళ్ళు ఆగిపోతాయి
గుండెచప్పుళ్ళు…. శ్వాస నిశ్వాసలు… చూపులు
అన్నీ…. అతి సహజంగా మారిపోతాయి
కానీ… నీ ఒకే ఒక్క మాట
అన్ని భ్రమలనూ తొలగించింది
పువ్వులు పెడమొహం చేయవు
కంటకాలు కొంగుల్ని లాగవు
ప్రేమకు బదులుగా
నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే!
కన్నీళ్ళు తుడుచుకుంటాయి
వెక్కిళ్ళు ఆగిపోతాయి!!
పూల చెవిలో
సీతాకోక చిలుక ఏదో చెప్తోంది
ఇక ఋతువును అర్థం చేసుకో!
అన్నింటితోబాటు వసంతం కూడా వచ్చేసింది
నువ్వు రాతిని తాకితే కూడా
దేవతలూ మారిపోతుఁది
నిన్న రేపటి పొరపాట్లన్నీ….
లోన దాగిన గాయాలన్నీ….
నిన్ను చూడగానే మాయమవుతాయి!
ప్రేమకి బదులుగా
నువ్వు ప్రేమను ఇవ్వటం నేర్చుకుంటే
నువ్వు రాతిని తాకితే కూడా
దేవతలా మారిపోతుంది!
పూజ
పోద్దార్ కుటుంబం ఇద్దరు సోదరులతో విడిపోయింది. మృణాల్ అన్న, సత్యజీతం తమ్ముడు వీరి మధ్య పంపకాలకు, భాగాలకు లోను కాని వాడు వారి కుటుంబాలకు గత 40 సంవత్సరాలుగా సేవచేస్తున్న నౌకరు ధర్మా ఒక్కడే.
ఈ సంవత్సరం రెండు కుటుంబాలవారు ఒకరికొకరు తీసిపోని విధంగా చేస్తున్నారు.
‘దేవీ పూజలు’.
‘అమ్మ అందరికన్నా మిన్న. ఆమెకి అన్న మృణాల్ గారింటిలోనే స్వాగతం చెప్పి పూజ చెయ్యాలి. మీరంతా వంగి ప్రణామాలు చేయండి’ – అని ప్రకటించాడు పూజారిగారు. వాతావరణంలో ప్రశాంతత ఒక్కసారిగా నెలకొన్నది. ఇంతలో తమ్ముడు సత్యజీతం ఇంట్లోంచి కూడా అలాంటి ప్రకటనే వెలువడింది. అక్కడున్న వాళ్లంతా వంగి దణ్ణాలు పెట్టారు. ధర్మా ఆలోచనలో పడిపోయాడు. తను ఇప్పుడు ఏ దుర్గమ్మకు నమస్కరించాలి? అన్న దుర్గమ్మకా? తమ్ముడి దుర్గమ్మకా? తనకైతే ఇద్దరూ పుత్ర సమానులే….
“అమ్మా! నేనెక్కడ చెయ్యాలి పూజ? ఇక్కడా? అక్కడా?” అరిచాడు ధర్మ.
“ఈ అన్నదమ్ముల ఆస్తులైతే పంచుకున్నారుగాని నిన్నెలా పంచుకుంటారమ్మా? నేనలా చేయను చేయలేను. నేనిద్దరి ఇళ్ళ మధ్యనా నమస్కరిస్తా. నా దుర్గమ్మ ఇక్కడా, అక్కడా అన్నిచోట్లా ఉంది”
ధర్మ వంగి నమస్కరించి, తిరిగి మరి లేవనే లేదు.
ఋణం
డా. నాయక్ తన గదిలో ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో ముణిగి ఉన్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్న రోగి పరిస్థితి విషమగా ఉంది. తరువాత లేచి అటూ ఇటూ తిరగసాగారు. ఇంతలో ఫోన్ ట్రింగ్, ట్రింగ్ అనగానే ఆయన మొహంతో నవ్వు విరిసింది. “హమ్మయ్య” అనుకుని.
‘ఎవరైనా దొరికారా?’ అని అడిగాడు.
‘సారీ సర్? దొరకలేదు, తిరుగుతూనే ఉన్నాం’-
అంతే! డాక్టర్ మొహం మారిపోయింది. మళ్ళీ విషాదం అలముకుంది.
‘ఆశ’కు తగిన బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు.
ఎందుకు దొరకడం లేదో కూడా ఆయనకు తెలుసు.
డా. నాయక్ దేవుణ్ణి నమ్మడు. కాని ఇవాళ ఆయన దేవునికి నమస్కరించాడు తలవంచి.
“ఆశ” కోసమై ఆరాధిస్తున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. వెంటనే అందుకున్నాడు.
“నేను, ఇన్స్ పెక్టర్ ఖన్నా. పేపర్లో మీ ప్రకటన చూసాను. నా దగ్గర ఉన్న ఖైదీల్లో ఒక ఖైదీ రక్తం గ్రూపు మీ “ఆశ’ పేషెంటుతో ‘మ్యాచ్’ అవుతుంది. అతను రక్తం ఇవ్వాలనుకుంటున్నాడు.
ఆఁ అలాగా! తప్పకుండా?
ఆ ఖైదీ పేరు?
“కిషన్”
డాక్టర్ నాయక్ గారి కళ్ళనుండి కన్నీళ్ళు జలజలా రాలాయి. వాటి మధ్యనుంచే ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు.
ఇంతకీ…
ఆ కిషన్ అనేవాడే ‘ఆశ’ తండ్రిని హత్యచేసి, దానికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు.
అద్దాల ఇల్లు
శ్రీరాంసేవకంగారి మూడ్ ఇవ్వాళ అస్సలు బాగా లేదు. ఆయన భార్య హాస్పిటల్ లో ఉన్నది. గత ఐదు రోజులుగా ఆయన ఆందోళనగానే ఉన్నాడు. ఇవ్వాళ ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నా ఇవ్వాళే మరి రాంసేవక్ గారి మనసు చాలా క్రుంగిపోయి ఉంది.
ఆయన మనసు పాడైపోడానికి కారణం సుస్పష్టమే. ఈ హాస్పిటల్ ఆయన లాంటివారికి తగినది కాదు. ఆయన నాతో – “చూడండి, ఈ హాస్పిటల్ ఎలా ఉందో? శ్రద్ధగా గమనించండి. అసలు ఇది హాస్పిటలేనా? బాత్ రూంలు మురికిగా ఉన్నాయ్. ఎక్కడ చూసినా బ్యాండేజీలు, గుడ్డలు, మందుల ప్యాకెట్లు – చెత్త, చెదారం ఎంతైనా సిగ్గు పడాల్సిన విషయం ఇది.”
ఆయన మాటలో నిజం ఉందని నాకూ అనిపించి ఆయనతో ఏకీభవించసాగాను. మేమిద్దరం అప్పుడు హాస్పిటల్ వరండాలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా నాకు హఠాత్తుగా నిజంగానే అక్కడక్కడ చెత్త – చెదారం కనబడ్డాయి.
తర్వాత నేను రామసేవక్ గారిని గమనించసాగాను. ఆయన తన జేబులోంచి ఒక బీడి తీసి వెలిగించాడు. దాని బూడిద నేల మీద దులిపాడు. అంతకుముందే ఆయన నోట్లో తాంబూలం (పాన్) ఉంది. మధ్య మధ్య తుఫుక్కున నేలమీద ఉమ్ముతూనే గచ్చుని రంగు మయం చేస్తున్నారు. తర్వాత ఎంతో నిబ్బరంగా నా భుజంపై చెయ్యేసి – “ఈ హాస్పిటల్ లోని మురికి, చెత్తల గురించి నేను చెప్తున్నా కదూ! అసలు మనందరం కలిసి దీన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.
భాషా జ్ఞానం
ఒక రోజున నేను సైకిల్ మీద ఇప్పటికి వస్తున్నా. దారిలో ఓ మూల ఓ పెద్ద గుంపు కనబడగా నేను కూడా ఆగిపోయి కుతూహలఁగా వాళ్ళ మాటలు వినసాగాను.
అక్కడ ఒకాయన జనం మధ్య నిలబడి ఏవో పళ్ళు అమ్ముతూ ఉన్నాడు. పళ్ళన్నీ చకచకా, చూసూ్త ఉండగానే పెద్ద సంఖ్యలో అమ్ముడుపోసాగాయి.
ఆ వ్యక్తి తన తియ్యని మాటల ధోరణిలో ఒక మరాఠి మహిళతో – నమస్తే అమ్మా! “ఇదేఫలం చాంగలే భేట్ తాత్ ఫారచ్ స్వస్త్” అని అన్నాడు.
అలాగే, ఒక సర్దార్జీతో – ‘సత్ శ్రీ అకాల్! ఏ చంగే ఫల్ నే, సస్తేనే” అని అన్నాడు.
అంతలోనే అక్కడికొక సూట్ బూట్ లో వచ్చిన పెద్దమనిషితో – గుడ్ మార్నింగ్ సర్! నైస్ ఫ్రూట్స్ హియర్, వెరీ చీప్!”
ఇలా చాలాసేపు అమ్మకాలు కొనసాగాయి. గుంపు కొంత చెదిరిపోగా – ఆ మనిషి చూపు నాపైన పడింది. వెంటనే బెంగాలీలో – “నమొష్కార్ మోశాయ్! ఎ ఖానౌ భాలో ఫౌల్ ఆచే – భూబ్ హే శౌస్తా!”
నేను కొన్ని పళ్లు కొన్నా ఆ మనిషి భుజంపై చెయ్యివేసి – ‘ఎన్ని భాషలొచ్చు నీకు భయ్యా” అని అడిగా.
కన్నార్పకుండా ఆ వ్యక్తి – ‘మన దేశంలో మాట్లాడే భాషలన్నీ సుమారుగా నా కొచ్చు అని అనగా – నేనాశ్చర్యపోయి ‘అన్నీనా?’ అని అన్నా. ఆయన నవ్వి – సుమారుగా ప్రతిభాషలోనూ ‘నమస్కారం. ఇక్కడ అన్ని రకాల పళ్లూ చాలా చౌకగా దొరుకుతాయి” అనే మాటల్ని మాత్రం నేర్చుకున్నా”.
“దీనివల్ల ఏమిటి లాభం?” నేనడిగాను.
చందు అనే పేరున్న ఆయన – “బాబుగారూ! నేనిలా వాళ్ళ భాషలో చెప్తే వాళ్ళు ఆనందం పొందుతారు. ఇలా చెయ్యడంతో వాళ్ళ మనసులో నాకు ముందుగా చోటు దొరుకుతుంది. తర్వాత వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను నా పళ్ళు తూస్తూ ఉంటా” నన్నాడాయన.
సరిపోని సమయం
మంచం మీద పడి ఉన్న ఆ పెద్ద మనిషి పరిస్థితి పాపం! దయనీయంగానే, విషమంగానే ఉంది. బుగ్గలు పీక్కుపోయి ఉన్నాయి. పెద్ద బొజ్జ. ఆయనకి గుండెజబ్బు. అలాగే పోర్టల్ సిరహోసిసంతో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇటువంటి దుస్థితిలో కూడా ఆయనకు ఫోనుమీద ఫోను అలా వస్తూనే ఉన్నది. అస్సలు తీరిక లేకుండా, ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి వ్యాపార సంబంధమైన వ్యవహారాలపై ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇంటికొచ్చిన డాక్టర్ – “మీకింత తీరిక లేకుండా ఉంది కద! మరి ఈ జబ్బెలా వచ్చింది మీకు? నిజానికి ఇది ఎక్కువగా అతిగా త్రాగే వాళ్ళకే వస్తుంది”. ఏం చెప్పమంటారు? డాక్టర్! తీరిక లేనందువల్లే నేను తిండి తినలేను. ఏదో ఇలా మద్యపానం చేస్తూ కాలం గడుపుతా త్రాగడానికైతే నాకు తక్కువ టైం పడుతుంది సార్!” అన్నాడు.
ఆంగ్లం : కె.సచ్చిదానందన్, తెలుగు : చింతపట్ల సుదర్శన్
మొట్టమొదటి తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది
నేను మీ నాన్నను
తలుపు తెరిచాను
సూర్యుడు లోపలికి వచ్చాడు
ఉదయపు లేత సూర్యకిరణం
రెండవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ ప్రేయసిని
తలుపు తెరిచాను
మల్లెల పరిమళం వెదజల్లుతూ
చల్లని గాలి లోపలికి వచ్చి
నన్ను కౌగలించుకుంది
మూడవసారి తలుపుచప్పుడు
విని అడిగాను
ఎవరది?
నేను నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
వర్షం లోపలికి వచ్చి
నన్ను పూర్తిగా తడిపేసింది
మళ్ళీ తలుపు చప్పుడు
విని అడిగాను
ఎవరది?
నీ స్నేహితుడ్ని
తలుపు తెరిచాను
బురద పూసుకున్న మేఘపు ముక్క
లోపలికి వచ్చి కూర్చోమనకుండానే
కుర్చీలో కూర్చుని
పొగలూగుతూ
ఇంద్రధనస్సును సృష్టించింది
అప్పుడొచ్చింది
అయిదవ తలుపు చప్పుడు
ఎవరది విని అడిగాను
నీ మృత్యువును
తలుపు తెరవలేదు
అడిగాను
సుదీర్ఘకాలంగా
ఒంటరిదైన ఈ భూమ్మీద ఉన్నాను
నాకేం బహుమతి ఇస్తావు
నీకు స్వేచ్ఛనిస్తాను
సారవంతమైన మట్టిగా మారుస్తాను
తమలపాకు మొక్కలన్నీ
లిల్లీ పువ్వుల్నీ నీలో పెరగనిస్తావు
నువ్వొక బిందువువై
సముద్రంలో కలుస్తావు
ముత్యానివీ, ఉప్పువీ అవుతావు
నువు మళ్ళీ మళ్ళీ
భూమి ఉన్నంత కాలమూ
మొలకెత్తుతావు
సముద్రం ఉన్నంతవరకూ
అలవై ధ్యానిస్తావు
ఈ మాటలు చివరగా
నన్ను ప్రలోభ పెట్టాయి
తలుపు తెరిచాను
ఇప్పుడు –
మీరు చూస్తున్నది
నా నీడను మాత్రమే
కె.సచ్చిదానందన్ అంతర్జాతీయ కవి. ఆంగ్లంలోనూ మళయాళంలోనూ అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. ఆయన 20 సంపుటాల కవిత్వం 119 ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేరళ సాహిత్య అకాడమీ అవార్డును 5 సార్లు అందుకున్న కవి. తులనాత్మక సాహిత్యంలో కె.కె.బిర్లా ఫౌండేషన్ ఫెలోషిప్ పొందిన సచ్చిదానందన్ కు N.T.R జాతీయ అవార్డు కూడా లభించింది.
1.”వాన కురిస్తే,మెరుపు మెరిస్తే,/ ఆకసమున హరివిల్లు విరిస్తే,/
అవి మాకే-అని ఆనందించే/ పిల్లల్లారా!” అంటాడు మహాకవి
శ్రీశ్రీ తన ‘మహాప్రస్థానం’ సంపుటిలోని ‘శైశవగీతి’ కవితలో.
2.అట్లాగే అమాయకులు, ప్రకృతి ప్రేమికులు అయిన మన ప్రాచీనులు ప్రకృతిలోని
వివిధ ఘటనలను,వింతలను చూసి ఆనందాశ్చర్యాలకు లోనై ప్రకృతిశక్తులకు దైవత్వాన్ని,తనకు లేని,తాను కోరుకొనే అనేక శక్తులను వారికి ఆపాదించి,స్తోత్రాలు,సూక్తాలు, పురాణాలు రచించారు. ఈ క్రమంలోనే సంపదకు అధిదేవతగా లక్ష్మిని,విద్యా విజ్ఞానాలకు అధిదేవతగా సరస్వతిని,దుర్మార్గాలను నిర్మూలించే ‘శక్తి’గా కాళికను (పార్వతిని)తన ఆకారంతోనే రూపొందించుకున్నాడు. వారికి తాను కల్పించిన, ఊహించిన శక్తులకు అవసరమైనట్టుగా ఎక్కువ తలలను,చేతులను,వివిధ ఆయుధాలనుకూడా వారికి కల్పించాడు. మన నిష్క్రియా పరత్వానికి విదేశీయుల దండయాత్రలో, పరాయిపాలనో కారణమని సర్దిచెప్పుకోవడం సరికాదు.
2.మన దేశంలో ప్రాచీనకాలంలోనే గార్గి, మైత్రేయి వంటి బ్రహ్మవాదినులు ఉండేవారు-
అని గర్వించడం సరే. కాని అంతటితోనే సరిపెట్టుకోకూడదు కదా! ఆధునికకాలంలో సావిత్రీబాయి
ఫూలేగారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు (ఉపాధ్యాయిని)అయ్యేదాకా
మన సరస్వతీ దేవికి వారసులు లేకపోవడం బాధాకరమేకదా!
3.మనకు వైద్యాధిదేవుడుగా ధన్వంతరి,ప్రాచీనకాలంలోనే గొప్ప వైద్య శాస్త్ర వేత్తలైన చరకుడు,సుశ్రుతుడు ఉన్నా గత శతాబ్దంలో విదేశాలలో ఆధునిక వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన డాక్టర్ ఆనందీబాయి జోషి గారి వరకు మనకు ఆధునిక మహిళావైద్యులు లేరు-అంటే ఆ మధ్యకాలంలో మన సమాజం ఎంత నిద్రావస్థలో, అచేతనంగా ఉందో అర్థం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి,ఆ లోపాలు పునరావృత్తి కాకుండా చూసుకోవాలి. వీరు ఇద్దరు కూడా ఆంగ్లేయుల పాలనాకాలం లోనే తమను తాము నిరూపించుకొన్న వారు కావడం గమనార్హం, ప్రశంసార్హం.
4.మరో ప్రధానమైన అంశం- నిత్యం లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని-వారి అనుగ్రహాన్ని
కోరుతూ -పూజించే మనం మనను కనిపెంచిన తల్లి, జీవితాన్ని పంచుకున్న భార్య,అక్క చెల్లెళ్ళు,కూతుళ్ళ, కోడళ్ళగురించి ఎట్లా ఆలోచిస్తున్నామో,వారిపట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నామోకూడా ఆత్మావలోకనం చేసుకొని,
వాళ్ళను గౌరవించడం,ప్రేమను పంచడం నేర్చుకోవాలి. మన కుటుంబ సభ్యులలోనే, మన చుట్టూ ఉన్న సమాజంలోనే ఆ ‘ముగ్గురు అమ్మలను” చూసుకోగలగాలి.
5.మహాకవి గురజాడ అప్పారావుగారు చెప్పిన- “మగడు వేల్పన పాతమాటది,
ప్రాణమిత్రుడ నీకు…” అనే పంక్తుల సారాంశాన్ని ఒంటబట్టించుకొని మనం కొత్తమనుషులముగా
రూపాంతరం(మెటా మార్ఫోసిస్/Metamorphosis)చెందాలి. ప్రయత్నపూర్వకంగా భూస్వామ్య,పితృస్వామ్య
భావజాలాన్ని,పురుషాహంకారాన్ని పాము కుబుసంలాగా వదులుకోవాలి.అప్పుడే మన జీవితాలకు సార్థకత.
మన స్తోత్రాలు అర్థవంతం అవుతాయి.
सरास्वती प्राथना
जय जय हे भगवति सुरभारति !
तव चरणौ प्रणमाम: ।।
नादतत्वमयि जय वागीश्वरि !
शरणं ते गच्छाम: ।।1।।
त्वमसि शरण्या त्रिभुवनधन्या
सुरमुनिवन्दितचरणा ।
नवरसमधुरा कवितामुखरा
स्मितरूचिरूचिराभरणा ।।2।।
आसीना भव मानसहंसे
कुन्दतुहिनशशिधवले !
हर जडतां कुरू बुद्धिविकासं
सितपंकजरूचिविमले ! ।।3।।
ललितकलामयि ज्ञानविभामयि
वीणापुस्तकधारिणि ! ।।
मतिरास्तां नो तव पदकमले
अयि कुण्ठाविषहारिणि ! ।।4।।
जय जय हे भगवति सुरभारति !
तव चरणौ प्रणमाम: ।।
భారతీ వందన గీతం
జయ జయహే భగవతి సురభారతి,
తవ చరణం ప్రణమామహః|
నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి,
శరణం తే గచ్చామః|
త్వమసి శరణ్య త్రిభువన ధన్య,
సురముని వందిత చరణా|
నవ రస మధురా కవితా ముఖరా,
స్మిత రుచి రుచి భరణా| ||జయ జయ జయహే||
ఆసినా భవ మానస హంసే,
కుంద తుహిన శశి ధవలే|
హర జడతాం కురు బోధి వికాస్|
సిత పంకజ తను విమలే| ||జయ జయ జయహే||
లలిత కళామయి జ్ఞానవిభామయి,
వీణాపుస్తక ధారిణీ|
మతి రాస్తామ్ నౌ తవ పద్ కమలే,
అయికుంఠా విషహరిణీ|| ||జయ జయ జయహే||
పంక్తులవారీగా శ్లోక భావము
1.(భగవతి=పార్వతి,లక్ష్మి, సరస్వతి,పూజ్యురాలైన స్త్రీ).
పూజ్యురాలవైన ఓ సంస్కృత
(సుర/దేవ)భారతీ!
నీకు జయము జయము (కలుగుగాక)!
నీ చరణాలకు ప్రణామం!
2.నాదబ్రహ్మమయివి,భాగేశ్వరివి(ఒక రాగం)(వాక్కులకు
అధిదేవతవు-వాక్ ఈశ్వరివి
=వాగీశ్వరివి) అయిన నీ
పాదాలను నేను శరణు వేడుతున్నాను/చేరుకుంటున్నాను.
3.మూడు లోకాలను ధన్యము
చేయగల,మునులచే,దేవతలచే నమస్కరింపబడే పాదాలు
గల నువ్వే నాకు శరణం/దిక్కు.
4.నవ రసములతో కూడిన,
మధురమైన కవితలను ధ్వనింపజేసే,అందమైన చిరునవ్వును,కాంతిమంతమైన
ఆభరణాలను ధరించిన అమ్మా!నీకు జయము జయము (కలుగుగాక).
5.(నా)మానస హంసపై ఆసీనురాలవైన,మొల్లలు,
మంౘు,చంద్రునివంటి ధావళ్యము గల తల్లీ!
6.శ్వేతకమలం వంటి స్వచ్ఛమైన శరీరం వర్ణంగల
అమ్మా!నా జాడ్యాన్ని (జడతను,మాంద్యాన్ని,మంద
బుద్ధిని)తొలగించి,బుద్ధి
వికాసాన్ని కలిగింౘు.
నీకు జయము జయము (కలుగుగాక).
7.అమ్మా!నీవు లలితకళామయివి(లలిత కళా
స్వరూపిణివి),జ్ఞానకాంతితో
ప్రకాశిస్తున్నదానివి,వీణను,
పుస్తకాన్ని ధరించినదానివి.
8.నీ పాద పద్మాల దగ్గర నా మతిని (బుద్ధిని) సమర్పిస్తున్నాను.నా సోమరి
తనం అనే విషాన్ని తొలగించే
(హరించే)అమ్మా!నీకు జయము, జయము (కలుగుగాక).
నాగరలిపిని తెలుగు అక్షరాలలో రాయడంలో అక్షర దోషాలు దొర్లుతాయి. నాగరలిపి ఆధారంగానే ఈ కింది అర్థ,తాత్పర్యాలు రాశాను. మూల కవితలోని అంత్యప్రాసలను తాత్పర్యంలోనికి తీసుకురాలేము. అవి రావాలంటే మళ్ళీ మనం దానికి కవితారూపాన్ని ఇవ్వవలసిందే.అందుకు చాలా చాలా శ్రమించాలి.