మారుతున్న కాలానికి అనుగుణంగా బాలల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మార్పులకు అనుగుణంగా పెద్దలలో కూడా మార్పు రావాలి. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. పరిసరాలు, జంతువులు , పళ్ళు , కూరగాయలు, చెట్లు, పూలు, .. ఇలా ఒక్కటొక్కటిగా పిల్లలకు చెబుతుండాలి , నడవడిక, మర్యాద, స్నేహం, మిత్రులు, బంధువులు ,దుస్తులు. పరిశుభ్రత తదితరాలను పరిచయం చేస్తుండాలి.
విదేశాల్లో పిల్లలకు పాఠశాలకు వెళ్లక ముందే. డే కేర్ కు పంపిస్తారు. అక్కడ ఇవన్నీ అలవాటు చేస్తారు. ఇంగ్లీష్ భాష కూడా బాగా వస్తుంది. ఐదేళ్ల కు స్కూల్ కు వెళ్ళగానే నేర్చుకోవడం సులువవుతుంది.
ఇక మనకు గతం లో చదివిన చందమామ, బాల మిత్ర, బొమ్మరిల్లు కథలు ఈ తరం పిల్లలకు నచ్చక పోవచ్చు . వారికి తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం వుంది. వారు ఇష్టపడే మాధ్యమాల ద్వారా చెప్పాలి. మనం అనుకున్నట్టుగా వారు ఉండాలనుకోవడం తగదు. వారి అభిరుచులకు అనుగుణంగా చదువులు, ఉండాలి. ఈ విషయం లో మనం విదేశాల వారు అనుసరించే విధానాలను అధ్యయనం చేయవలసిన అవసరం వుంది. మన దేశం లో పిల్లల అభివృద్ధిని కాంక్షించే వారంతా భవిష్యత్ కు అందమైన రూపు రేఖలు దిద్దేవారే. కానీ అటు సమాజం, ఇటు తల్లి తండ్రులు, మరో వైపు ఉపాధ్యాయులు, రచయితలు బాల్యాన్ని విస్మరిస్తున్నారు. మరో మాటలో చెప్పాలం
కాలం తో పాటు మనుషులు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతుంటాయి. అదే విధానంగా ఈ తరం బాలల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కానీ వారి అవసరానికి సరిపడా వనరులు లేవు. ఈ మధ్య కరోనా వలన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మరి వారి కోసం ఎవరు ఏమి ఆలోచిస్తు
ప్రస్తుతం బాల సాహిత్య రచనలు చేసే వారు కేవలం తమకు పేరు రావాలని, అవార్డులు కావాలని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఆర్కే నారాయణ్, మార్క్ ట్విన్ వంటి వారి పుస్తకాలు ఎవరైనా చదివారా. ఎక్కడో జె. కె. రోలింగ్ లండన్ లో ఉంటూ హరీ పాటర్ పుస్తకాలు రాస్తే హైదరాబాద్ లో క్యూ ల్లో నిలబడి పుస్తకాలు కొనుగోలు చేసిన సంఘటనలు వున్నాయి కదా.మరి పిల్లలను ఆకట్టుకునే రచనలు ఎందుకు రావడం లేదు.
తెలుగు బాల సాహిత్యం లో రాసి పెరుగుతుంది కానీ వాసి ఉండటం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రభావం మరింత పెరిగితే తెలుగు బాల సాహిత్యం మనుగడ కష్టం.
ఈ విషయం లో నిజాయితీ గల బాల సాహితీ వేత్తలు ముందుకు వచ్చి ఒక కార్యాచరణ రూపొందించు కోవాలి. పాత కథలను ఆధారం చేసుకుని పిల్లలకు అర్థం అయ్యే రీతిలో మార్చి రాయాలి, ఈ తరం పిల్లలు ఇష్టపడే రచనలు చేసి వారిని ఆకట్టుకోవాలి . అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి మంచి సాహిత్యం కోసం కృషి చేయాలి, అలాంటి వారిని, సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
ReplyForward
|