అదొక అడవి . ఆ అడవికి రాజులేడు. అప్పుడు మరొక అడవి నుండి ఒక చిరుత పులి అక్కడికి వచ్చింది. అది తన ఇష్టము వచ్చినట్లు జంతువులపై దాడి చేయ సాగింది .దాని బాధ పడలేక జంతువులన్నీ తప్పించుకొని తిరగసాగాయి. ఆ చిరుత పులి ఆగడాలకు అంతే లేదు.
ఇలా ఉండగా ఆ జంతువులన్నీ ఈ చిరుతపులి బాధలు భరించలేక అవి కుందేలుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ కుందేలు” మీరు నేను చెప్పినట్లు చేయండి. మీ బాధలు నివారణ అవుతాయి” అని వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సరేనన్నాయి.
కుందేలు చిరుతపులి వద్దకు వెళ్లి “ఓ చిరుతపులి రాజా !నీవు పరిగెత్తి వేటాడే అవసరం లేకుండా ఆ జంతువులు నీ ముందరే ప్రత్యక్షమయ్యే మంత్రం నా వద్ద ఉంది. ఒక మునీశ్వరుడు ఈ మంత్రాన్ని పఠించగా నేను దానిని విని నేర్చుకున్నాను. ఇదిగో చూడు “అని తన కళ్ళు మూసుకుని ” టుర్ర్ ర్ర్ కాంజి” అని అంది. వెంటనే అక్కడ ఒక జింక ప్రత్యక్షమైంది .అప్పుడు చిరుతపులి దానిని వేటాడబోయేంతలో కుందేలు దానిని ఆపి “ఆగండి చిరుత పులిరాజా! ఇంకా కొన్ని జంతువులు కూడా ఇలాగే మీ ముందు ప్రత్యక్ష మవుతాయి. మీరు దేనిని కోరుకుంటారో చెప్పండి. ఆ జంతువు ఇక్కడ మీ ముందు వెంటనే ప్రత్యక్షమవుతుంది. చూడండి . మీకు ఇంకా ఏ జంతువు కావాలి “అని అడిగింది . అప్పుడు చిరుతపులి” కోతి” అని అంది. వెంటనే కుందేలు ” టుర్ర్ ర్ర్ తికో ” ” అని అంది. వెంటనే ఒక కోతి వాటి ముందు ప్రత్యక్షమైంది.
తర్వాత చిరుతపులి “అడవి దున్న” అని కోరింది. అప్పుడు కుందేలు ” టుర్ర్ ర్ర్ న్నదువిడఅ ” అని అంది .వెంటనే అక్కడ అడవిదున్న ప్రత్యక్షమయింది. అలాగే ఎలుగుబంటి, దుప్పి, జిరాఫీ కూడా కుందేలు ఆ మంత్రం చదవగానే ప్రత్యక్షమైనాయి. చిరుతపులి సంతోషించి” ఓ కుందేలా! నాకు ఈ మంత్రం చెప్పవా! నేను నిన్ను ఏమీ చేయనులే!” అని అంది.
అప్పుడు కుందేలు “చిరుతపులి రాజా! ఈ మంత్రం చాలా మహిమ గలది. ఇది పనిచేయాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఒక నెల రోజుల వరకు మీరు ఏ జంతువును చంపకూడదు. అలా చేస్తేనే మీకు ఈ మంత్రం పనిచేస్తుంది “అని అంది. అందుకు చిరుత పులి సరేనంది .
ఇలా నెల రోజులు గడిచాయి. తర్వాత ఆ చిరుతపులి ఆ మంత్రాలను చదివింది. కానీ ఒక్క జంతువు దాని ముందర నిలువలేదు. ఇదేదో కుందేలు తనను మోసగించిందని దానికి అప్పుడు అర్థమైంది. వెంటనే అది కోపంతో కుందేలు కోసం ఎంత వెదికినా అది కనబడలేదు. అదే కాదు. ఆ అడవిలో ఒక్క జంతువు కూడా కనిపించలేదు .
అవి అన్నీ పక్క అడవికి పారిపోయి మృగరాజు సింహాన్ని శరణు వేడాయి . వెంటనే ఈ చిరుతపులి ఆ అడవికి కుందేలును వెదకుటకై వెళ్లింది. ఆ అడవికి వెళ్ళిన చిరుతపులిని సింహం తరిమి తరిమి కొట్టింది. చివరకు ఆ చిరుతపులి తన అడవికి తిరిగి వచ్చి అక్కడ ఒక్క జంతువు కూడా లేకపోవడంతో చేసేది లేక అది అక్కడనుండి మరొక కొత్త అడవిని వెతుక్కుంటూ బయలుదేరింది .
ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ తిరిగి ఆ అడవికి వచ్చి సుఖంగా ఉండసాగాయి. అవి కుందేలుతో ” ఆ మంత్రం ఏమిటి? మాకు కూడా చెప్సవా!” అని అడిగాయి. అప్పుడు కుందేలు నవ్వి ” అయ్యో! అది మంత్రం కానే కాదు. అక్షరాలను తలక్రిందులుగా చేసి అన్నాను. అంతే! ఆ తెలివి తక్కువ చిరుత పులి నమ్మింది ” అని అంది.
ఆ తర్వాత అవి తమను కాపాడిన సింహాన్నే తమ అడవికి రాజుగా ఉండమని కోరాయి . అందుకు సింహం అంగీకరించి ఈ రెండు అడవుల్లో ఏ జంతువుకు ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చింది. కుందేలు తెలివి వల్ల చిరుతపులి బాధ తొలగి జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అందుకే పిల్లలూ! ఆపద వచ్చినప్పుడు ఇతరులకు చెప్పి వారి సాయాన్ని కోరాలి.
బాలసాహిత్యం
నీతి కథ
ఒక అడవి లో ఒక జామతోట నోరూరించే చక్కని ఫలాలతో ఎప్పుడూ రకరకాల పక్షులతో సందడిగా ఉండేది. ఆతోటలో అన్ని పక్షులతో పాటు రామచిలుక లు కూడా ఉండేవి. ఆకలి వేసినప్పుడు చెట్టు పండ్లు తింటూ ఏ చీకూచింతా లేకుండా ఉండేవి. తోటలో పండ్లు కోయడానికి వచ్చే తోటపని వాళ్ళు జామ పండ్లను దగ్గరలో ఉన్న నగరం లో అమ్మితే చాలా గిట్టుబాటు అవుతుంది అంటూ” నగరాన్ని అక్కడి వాతావరణాన్ని గొప్పగా చెప్పుకునే వారు. “
ఆ పక్షుల గుంపు లో ఉన్న సోమూ ,భీమూ అనే రెండు రామచిలుక లు వారి మాటలు విన్నాయి.
వాటికి నగరాన్ని చూడాలని ఆశ కలిగింది.
ఒక రోజు ఆపక్షుల తల్లిదండ్రి పక్షులు మేము అలా బయటకువెళ్ళొస్తాము అని సోము,భీమూ లను “జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి తోట దాటి బయటకు వెళ్ళొద్దని చెప్పి విహారానికని వెళ్ళాయి.”
వాటికి ఇదే మంచి సమయం అనుకున్నాయి.
“మనం ఈ పనివాళ్ళు వెళ్ళే దిశగా మనమూ వెళ్ళి నగరమంతా చుట్టి వద్దామనుకుని
జామకాయలు తీసుకుని వెళ్ళే వాహనంపై కూర్చుని వెళ్ళాయి.”
*
పెద్దపెద్ద మేడలు, క్షణం తీరిక లేకుండా తిరిగే వాహనాలు, పెద్దపెద్ద సెల్ఫోన్ టవర్లు, ఎక్సిబిషన్ లో తిరిగే చక్రాల వాహనాలు,అన్నీ చిత్రవిచిత్రంగా కనిపించాయివాటికీ.
ఎగురుతూ వెళ్ళి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని అన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ మైమరచిపోయాయి. కాస్తా చీకటి పడేసమయానికి
సోము, భీముతో ” నాకు ఆకలేస్తుంది భీము …” అంది. నాకు కూడా ఆకలేస్తుంది సోము అని భీమూ అంది, చుట్టూ చూసాయి.
అప్పుడు కానీ వాటికి గుర్తుకు రాలేదు. అవి ప్రయాణం చేసి వచ్చిన వాహనం దరిదాపుల్లో కూడా లేదని …. వాటికి ఏం చేయాలో పాలుపోలేదు.
కిందికి చూసాయి.
ఆ రెండు పక్షులు కూర్చున్న చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.అతని ముందు ఒక పంజరం దాని ముందు కొన్ని కార్డు లు వేసి ఉంచాడు.
పక్కనే రెండు జామపండ్లు ఉన్నాయి. ఎవరో కొందరు వ్యక్తులు ముందు కూర్చుని ఏవో అడుగుతుంటే పంజరం లోని చిలుక బయటకు వచ్చి కార్డు తీసి లోపలికి వెళ్తుంది. చిలుక తీసిన కార్డులోని విషయం ఆ వ్యక్తి చదివి వాళ్ళకు చెప్తున్నాడు. పరిహారాలు కూడా చెప్పి పాటించమని సలహా ఇస్తున్నాడు.
భీమూ,సోము లు మాత్రం ఏమీ ఆలోచించకుండా పక్కనున్న జామకాయలు చూసి అవి మనవాళ్ళవే కాబోలు వెళ్ళి తిందాం అని ఎగురుతూ కిందికి వాలాయి.
****
జామకాయ ను కొరుకబోతున్న సోము ను జ్యోతిష్యుడు ఒడుపుగా పట్టి తన పంజరం లోని ఒక అరలోకి నెట్టాడు.
“ఒక్కసారి గా అతని చేతికి చిక్కిన సోము భయపడిపోయి వణకసాగింది.
బయట ఉన్న భీము ” రక్షించండీ రక్షించండీ” అని అరుస్తుంది.
“దాని భాష అర్థం కావడానికి ఎవరైనా వచ్చి రక్షించడానికి అది తన నివాసం దగ్గర ఉందా…?”మానవారణ్యంలో ఉంది.
ఇక్కడున్నవారందరూ మనుషులు.
లోపలున్న సోము మాత్రం” మిత్రమా ఇతను చిలుక లను బందించి పంజరం లో పెట్టిన జోస్యం చెప్పుకుని బ్రతికేవాడు మనం మోసపోయాం.
నేను వీడికి బందీగా చిక్కి ఇలాగే ఉండవలసిందే అన్నది ఏడుస్తూ…!!
మనం అమ్మానాన్నలకు చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. అని భీమూ ఏడవసాగింది ఏంచేయాలో పాలుపోలేదు వాటికి.
***
పంజరం లోని మరో చిలుక కల్పించుకుని ” నాపేరు రాము ” నేనుకూడా మీలాగే నామిత్రునితో కలిసి అడవిలో తిరుగుతుంటే ఇతనికి దొరికి పోయాను.
అప్పటినుండి ఈ పంజరం లో నన్ను బంధించి రోజుకు రెండు జామపండ్లు పెట్టి నాతో జాతకం చెప్పిస్తూ రెండు వేలు సంపాదిస్తున్నాడు.
ఇంట్లో చెప్పకుండా వచ్చి వీడి చెరలో చిక్కాను అంటూ బోరున ఏడ్చింది.
ఇప్పుడు ఏం అనుకున్నా ఏం లాభం ఇంకా మన గతి ఇంతేనా ..!!
అనుకున్నాయి.
వాటికి ఆలోచన రావడం లేదు.
మిత్రమా నీవు భయపడకు నీకు నేనున్నాను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను అంటూ భీము ధైర్యం చెప్పింది.
దానికి ఒక ఆలోచన తట్టింది.
హా ఐడియా…. నీవు ఇలా చేయి అని దూరం నుంచే తన భాషలో చెప్పింది.
లోపలున్న రాము నన్నుకూడా మీతో తీసుకుని వెళ్ళండి .అని బతిమలాడింది. మరి మాకు మా ఇంటికి వెళ్ళే దారే తెలియదు కదా …?
అంది సోము.
ఈ జ్యోతిష్యుడు రోజూ ఊరిబయట ఉండే ఒక జామతోటమీదుగా వస్తాడు.
అది మీరుండే ప్రాంతమో కాదో నాకు తెలియదు… కానీ అక్కడ చాలా పక్షులు ఉన్నాయి.
ఆదారి నాకు బాగా తెలుసు అంది.
సరే మరి నీవు చెప్పినట్లే చేద్దాం అనుకున్నాయన్నీ…!!
***
జ్యోతిషం చెప్పించుకోవడానికి వచ్చిన వారికి చిలుక తో కార్డులు తీయిస్తున్నాడు జ్యోతిష్యుడు.
అది మెల్లిగా కార్డులు కిందిది ఒకసారి పైది ఒకసారి తీస్తూ కన్ఫ్యూజ్ అయినట్లు పరిశీలించసాగింది.
ఎదుటి వారితో జ్యోతిష్యుడు “మీకు ఎంతో కష్టం వచ్చేటట్లు ఉంది” అందుకే మా చిలుక ఏంతీయాలో అర్థం కానట్లు చూస్తుంది అన్నాడు.
బాబ్బాబు ఎంత డెబ్బై నా సరే మంచిగా తీయించండి పరిహారాలు చెప్పండి అన్నారు వాళ్ళు ….!
అంతలోనే సోము గిలగిలా కొట్టుకోసాగింది.
అరరే కొత్త రామచిలుక కు ఏమయ్యింది…?
ఆలా పడిపోయి కొట్టుకుంటుంది… అనుకుంటూ పంజరం సందులోంచి వేలితో కదిపాడు.
అది కదలలేదు. పంజరం తెరిచి చేతితో బయటకు తీసి అంటూ ఇటూ కదిపాడు.
ఇంక లాభం లేదు దాన్ని పక్కనే ఉంచి. నీళ్ళు చల్లి చూద్దామని
తన బస్తాలోని నీళ్ళ సీసా బయటకు తీయడానికి వొంగాడు అంతే ఇదే అదను అనుకుని రాము సోము బుర్రున లేచి తుర్రున ఎగిరిపోయాయి.
****
ఇది మేముండే తోటనే రా రాము అంటూ సోమూ, భీము రాము ను తీసుకుని వెళ్ళి తోటి పక్షులకు పరిచయం చేసి జరిగిందంతా చెప్పాయి.
అక్కడున్న పెద్ద పక్షులు “పెద్దలమాట చద్ది మూట అన్నారు” పెద్దలు మీకింకా లోక జ్ఞానం రాలేదు
ఇప్పటికి తప్పించుకుని బయటపడ్డారు ఎప్పుడూ ఇలాగే ఉండదు.ఇలాంటి పనులు మరెప్పుడూ చేయకండి అని కోప్పడ్డాయి.
దూరపు కొండలు నునుపు అనుకుని అపోహ పడకూడదు అన్నాయి.
తప్పైందమ్మా మరోసారి ఇలా చేయుము మీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళము మమ్మల్ని క్షమించండి అన్నాయి మూడు చిలుకలు
మరో కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తూ……!!
(నీతి:- చెప్పుడు మాటలు విని మోసపోకూడదు , దూరపు కొండలు నునుపు అని గుర్తుంచుకోవాలి.)
ఉడుతా ఉడుతా .. ఊచ్
అనగనగా ఒక చెట్టుంది. ఆ చెట్టుకేమో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో ఉడుత జంట కాపురం ఉంటున్నది.
ఉడుత త్వరలో తల్లి కాబోతున్నది. బిడ్డల్ని కనబోతున్నది. నార, మెత్తటి గడ్డి లాంటివి ఏరుకొచ్చి సన్నగా చీల్చి మెత్తగా దూదిలాగా చేసి, గుండ్రంగా సర్ది, గూట్లో పరుపులా తయారు చేసాయి ఉడుత జంట. పిల్లలకు ఒత్తిడి తగలకుండా, సౌకర్యంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు చేసాయి.
ఆ ఉడుత జంటకి నాలుగు పిల్లలు పుట్టాయి.
ఆ తొర్ర ఇంట్లో పిల్లలతో కాపురం ఉంటున్నాయి ఆ జంట.
ఉడుత పిల్లలు చాలా చిన్నవి. బుజ్జి బుజ్జి గా ఉన్నాయి. వాటిని ముందే తయారు చేసి పెట్టుకున్న మెత్తటి గడ్డి పరుపుపై వాళ్ళమ్మ పడుకోబెట్టింది.
చిట్టి చిట్టి ఉడుతలు అమ్మని కరుచుకు పడుకున్నాయి.
అవి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతాయి. తర్వాఉడుతా ఉడుతాత నిద్దుర పోతున్నాయి.
పిల్లలు పడుకున్నాయి కదా… అవి లేచే లోపల తన పిల్లలకు ఆహారం తెద్దామని అమ్మ ఉడుత బయటకు చూసింది.
తనను ఎవరు గమనించడం లేదు అని నిర్ధారించుకుంది. బయటకు వెళ్ళింది.
టమాటో తోటలో టమాటా కొద్దామని చూసింది. తియ్యటి పెప్పర్ మెంట్ వాసన వస్తోంది . మొహం ఎట్లాగో పెట్టుకుని దూరం జరిగింది.
వెల్లుల్లి వాసనంటే గిట్టదు . మిరియాల ఘాటు అంటే కూడా ఉడుతకి అస్సలు నచ్చదు. జాగ్రత్తగా వెతికి వెతికి కూరగాయలు, పళ్ళు తెచ్చింది అమ్మ.
పగలంతా మొక్కజొన్న, పుట్టగొడుగులు, ఆకుకూరలు, జామకాయలు వెతికి తెచ్చాడు నాన్న. అన్నిటినీ తెచ్చి చక్కగా ఆ తొర్రలో భద్ర పరిచారు అమ్మానాన్న.
ప్రతిరోజూ అంతే.
వెలుతురు ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు తెస్తారు. వెలుతురు పోయే లోపల పనులు ముగించుకుని ఇంటికి చేరుతారు. రాత్రిపూట ఇంట్లో నుంచి బయటకు రారు. విశ్రాంతి తీసుకుంటారు.
ఉడుత పిల్లలు రోజు రోజుకు పెరిగి పెద్దగా అవుతున్నాయి. నిద్ర లేచిన పిల్లలు అమ్మ కోసం వెతుక్కోవడం మొదలు పెట్టాయి. తొర్రలో అమ్మ కనిపించటం లేదు . నాన్న లేడు.
పిల్లలు నిద్ర పోకుండా అమ్మ నాన్న ఎటు వెళుతున్నాయో చూడాలని అనుకున్నాయి. రెండు రోజులు పిల్లలు నిద్రపోవడం లేదని వాటికి జాగ్రత్తలు చెప్పి అమ్మ నాన్న ఉడుతలు బయటికి వెళ్లడం మొదలు పెట్టాయి.
ఓ రోజు “అమ్మ నాన్న రోజు ఎటో వెళ్లి వస్తారు. కానీ మనకు మాత్రం ఇక్కడ నుంచి కదలొద్దు అని చెబుతున్నారు. బయటకు తొంగి చూడవద్దని చెప్పి వెళ్తున్నారు.
బయట ఎలా ఉంటుందో, ఏమి చేస్తారో చూడాలని ఆత్రంగా ఉంది” అన్నది ఓ ఉడుత పిల్ల.
“అవును నిజమే, రోజంతా గూట్లో కూర్చుంటే విసుగు వస్తున్నది. మనం కూడా ఎంచక్కా బయటకు పోతే.. ” అన్నది మరో ఉడుత పిల్ల.
“అబ్బ !.. బయటికి పొతే… ” కళ్ళు మెరిపిస్తూ అన్నాయి మిగతా రెండు ఉడుత పిల్లలు.
“ఇంకేం, అయితే పదండి పోదాం” ఉత్సాహంగా అన్నది మొదటి పిల్ల
అంతలో ఒక పిల్ల అదిగో అమ్మ అటు వెళ్ళింది అంటూ తొర్ర పైకి చూపింది
అందరూ తొర్ర పైకి వచ్చారు. అంతలో అమ్మ ఆహారం తీసుకుని వచ్చింది.
పిల్లల్ని చూసి “అయ్యో .. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు” కంగారుగా అడిగింది
“నువ్వు ఇటే వెళ్లావుగా .. అందుకే నీకోసం మేము బయలు దేరాం” అని చెప్పారు పిల్లలు.
“మీరింకా చిన్న పిల్లలు. అట్లా రాకూడదు. ఇంట్లోనే ఉండాలి” బుజ్జగింపుగా చెప్పింది అమ్మ
“ఏం ఎందుకని ..? ” మొదటి పిల్ల వెంటనే ప్రశ్నించింది.
“బయట ఎలా మెసలాలో మీకు తెలియదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు తెలియదు. రకరకాల ప్రమాదాలు వెన్నంటి ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు పోయాక నేనే తీసుకుపోయి అన్నీ చూపిస్తా, సరేనా .. ” అని చెప్పింది అమ్మ ఉడుత.
అంతలో తండ్రి ఉడుత తోక తో ఏదో సంకేతాలు పంపింది . నోటితో ఏవో శబ్దాలు చేసింది. తల్లి ప్రమాదం పసికట్టింది .
గప్ చిప్ గా పిల్లల్ని లోపలికి తీసుకుపోయింది తల్లి.
ప్రతి రోజూ చెట్టు తొర్రలో ఉండే ఉడుతలను గమనించే చిన్నూకి చాలా ఆశ్చర్యంగా ఉంది.
తండ్రి ఉడుత తోక ఊపగానే తల్లి పిల్లల్ని ఎందుకు లోపలికి తీసుకుపోయిందో అర్థం కాలేదు.
“ఉడుత ఉడుతా ఊచ్ .. ఎక్కడికెళ్ళావోచ్ ” పాడుతూ చెట్టు తొర్ర కేసి చూస్తున్నాడు చిన్నూ.
చెట్టు తొర్ర దగ్గర లో పాము కనిపించింది. కొమ్మ పైన ఉన్న తండ్రి తోక ఊపుతూ మళ్ళీ ఏదో శబ్దం చేసింది.
ఇప్పుడర్థం అయింది తండ్రి ఉడుత ఎందుకు తోక ఊపిందో ..
మరి మీకు అర్ధమైందా ..
చెప్పండి చూద్దాం .
స్పృహకి ఐదేళ్లు. ఈ మధ్యనే బడికి పోవడం మొదలు పెట్టింది.
ఆ రోజు ఉదయం బద్దకం గా లేచింది.
అమ్మ లేపగా లేపగా లేచింది. వెళ్లి హాల్ లో అటు ఇటు పచార్లు చేసింది.
అబ్బా.. ఇప్పుడు తయారై బడికి పోవాలా .. !
ఏంటో .. అమ్మానాన్న రోజు బడికి పోవాలని చెప్తారు. బడి అంటేనే బోర్. ఎంచక్కా ఆడుకుంటే ఎంత బాగుంటుంది. టీవీ చూస్తే ఎంత బాగుంటుంది… ఈ పెద్ద వాళ్లకేం తెలియదు
వెళ్లి టీవీ ముందు కూర్చుంది స్పృహ. ఆ వేళ బడికి పోవద్దు అని నిర్ణయించుకుంది.
“బడికి టైమ్ అవుతున్నది. గబగబా తయారవ్వు” అని అమ్మ తొందర పెట్టింది.
“నేను ఈ రోజు బడికి పోను. ఇంట్లోనే ఉంటా”. ఎదురుగా కనిపించిన రిమోట్ తీసుకుని టీ వీ పెట్టింది. సోఫాలో కూలబడింది స్పృహ.
అమ్మ నాన్న మారు మాట్లాడలేదు. స్పృహని ఒక సారి అలా చూసి వదిలేశారు.
పది నిమిషాలు ఆగితే తానే బయలుదేరుతుంది అనుకున్నారు.
కానీ స్పృహ కదలడం లేదు.
అమ్మ నాన్న ఉదయం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ఆమెని పట్టించుకోలేదు.
స్పృహ సంతోషంగా టీవీ చూడడంలో బిజీగా ఉంది . కిడ్స్ ఛానెల్ లో కార్టూన్స్ చూసింది కాసేపు. ఆ తర్వాత ఛానెల్స్ అటు ఇటు పైకి కిందకి తిప్పింది.
కాసేపటికి పొట్టలో ఆకలి మొదలైంది. కిచెన్ లోంచి కమ్మటి వాసన వస్తున్నది. స్పృహకి ఆకలి మరింత పెరిగింది. నెమ్మదిగా లేచి వెళ్లి బ్రష్ చేసుకుంది .
అప్పటికే అమ్మ తమ్ముడికి టిఫిన్ పెట్టింది. వాడు తింటున్నాడు.
తనకి కూడా పెడుతుందేమోనని కొంచెం సేపు ఎదురు చూసింది. టిఫిన్ ప్లేట్ అమ్మ ఇవ్వలేదు.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం స్పృహకి ఇష్టం ఉండదు. అయినా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి తమ్ముడు పక్కన కూర్చుంది.
అప్పుడు కూడా అమ్మ టిఫిన్ పెట్టలేదు. తన ప్లేట్ తీసుకుని పెట్టుకుందామని చూసింది. కానీ ఆ గిన్నె టేబుల్ పై లేదు .
ఎలా .. ?
నాన్న కిచెన్ లోంచి ప్లేట్ లో పెట్టుకొచ్చుకున్నాడు. వచ్చి స్పృహ పక్కనే కూర్చుని తిన్నారు. కానీ స్పృహని పలకరించలేదు. టిఫిన్ తినమని అనలేదు.
రోజు ప్లేట్ లో పెట్టి పిలిచే అమ్మ పిలవడం లేదు. తినకపోతే బతిమాలి తినిపించే నాన్న పట్టించుకోవట్లేదు. స్పృహకు ఏడుపొచ్చింది.
ఆకలితో పొట్టలో పేగులు అరుస్తున్నాయి. ఆఖరికి పాలు కూడా తాగలేదు.
అంతలో తమ్ముడు పాలగ్లాసుతో అక్కడికి వచ్చాడు. అది చూసి ఉక్రోషంతో ఉడికిపోయింది స్పృహ.
పాపం అక్క. అమ్మ అక్కకి ఏమీ పెట్టలేదు.
అక్క మొహంలోకి చుశాడు. అయ్యో.. అక్కకి ఆకలేస్తుంది అని బాధపడ్డాడు.
అక్కా.. పాలు తాగు అంటూ తన పాల గ్లాస్ ఇవ్వబోయాడు.
ఉక్రోషంతో ఉడికిపోతున్న స్పృహ ఆ పాల గ్లాస్ ని ఒక్క తోపు తోసింది. పాలు కింద పోయాయి .
తమ్ముడు భయంతో కెవ్వు అన్నాడు. ఆ ఏడుపుకి ఏమైందని అమ్మ నాన్న అటు చూశారు.
ఇల్లంతా చెల్లాచెదురైన పాలు ..
తమ్ముడు ఏడుస్తూనే వెళ్లి ఇల్లు తుడిచే పాత గుడ్డ తెచ్చాడు. చిట్టి చేతులతో తుడుస్తున్నాడు.
అమ్మ నాన్న ఏమి అనలేదు. అక్కడేమి జరగనట్లే తమ పనిలో వాళ్ళున్నారు.
స్పృహ నెమ్మదిగా వెళ్లి తమ్ముడికి సారీ చెప్పింది. ఆ తర్వాత, తమ్ముడితో కలిసి తాను కూడా బట్టతో శుభ్రం చేసింది.
ఆ పని చేస్తూ తనను అమ్మ నాన్న చూస్తున్నారో లేదో అని ఓరగా చూసింది.
అమ్మ నాన్న అదేమీ పట్టించుకోనట్టు ఉన్నారు.
అమ్మ మరో గ్లాసులో పాలు తెచ్చి తమ్ముడికి ఇచ్చింది.
అక్కడే ఉన్న స్పృహని ఒక్క మాట కూడా అనలేదు. కోప్పడలేదు. తినమని చెప్పలేదు. బడికి పంపలేదు.
తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె కి అర్థమైంది .
హూ .. నేను కూడా వాళ్ళని పట్టించుకోను అనుకుంది. మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ విసవిసా ఇంట్లోంచి బయటకు నడిచింది.
ఇంటి వెనుక జామ చెట్టు కింద కూర్చుంది. ఆకలి వేస్తుంది కదా.. !
చెట్టుపై చూసింది. జామపండు కోసం కళ్ళతో వెతికింది స్పృహ.
“చిట్టి తల్లీ .. ఆకలేస్తుందా .. అయ్యో ఒక్క పండు కూడా లేదే తల్లీ.. నీ కడుపు నింపడానికి” అని జామచెట్టు స్పృహని చూసి బాధ పడింది.
జామ చెట్టు మాటలకు స్పృహ లోపలున్న దుఃఖం పొంగి పొర్లింది.
ఏదో అయినట్టు బిగ్గరగా ఏడ్చేసింది. అయినా అమ్మ నాన్న తనని పట్టించుకోలేదు.
స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. తమ్ముడు పొట్టనిండా తిన్నాడు. పాలు తాగాడు.
అమ్మకి నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని బాధ తన్నుకొచ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆ ఏడుపు విని “ఎందుకు పాపా ఏడుస్తున్నావ్? అమ్మ కొట్టిందా .. నాన్న తిట్టారా ..? ” అని అడిగింది చెట్టుపై ఉన్న రామచిలుక .
వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది స్పృహ .
“అయ్యో .. మీ అమ్మ నాన్నలకి నీమీద ప్రేమ లేదని ఎవరన్నారు?” అడిగింది రామచిలుక
“నేనే అంటున్నా. లేకపోతే నన్ను బతిమాలి తినిపించాలి గా.. బడికి పంపాలిగా..” కళ్ళనుండి కారుతున్న నీరు గౌను తో తుడుచుకుంటూ అన్నది స్పృహ.
“ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఒక్క మాటైనా అన్నారా.. ఒక్క దెబ్బైనా వేశారా.. కనీసం కోపంగా చూశారా..?” ప్రశ్నించింది రామచిలుక
“ఊహూ .. లేదు” అంటూ తల అడ్డంగా ఊపింది స్పృహ
“అంటే నీ పై కోపం లేనట్లేగా.. “అన్నది రామచిలుక
“మరి నాకు స్నానం చేయించలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు. టిఫిన్ పెట్టలేదు” దిగులుగా చెప్పింది పాప.
“నువ్వు అమ్మ నాన్న చెప్పిన మాటలు వినలేదు. బడికి పోవాల్సిన సమయంలో టీవీ ముందు కూర్చున్నావు. అది తప్పు కదా.
ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. లేకపోతే నీకే కష్టం. నష్టం ” అన్నది జామచెట్టు.
అవును, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను.
పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళింది. అమ్మకి, నాన్నకి సారీ చెప్పింది.
నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయను మాట ఇచ్చింది స్పృహ.
నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దిచ్చారు అమ్మా నాన్న. చప్పట్లతో అక్క పక్కన చేరాడు తమ్ముడు.
Once there lived a boy named James. He was good at Football . But one day there came a new boy to their street
named John . James and his friends tried to be friends with
him but he was not good at sports so
they were teaseing him but John did not
Care about them. One day they were challengeing him about Football match
he agreed he was opposite team of James team and in the match James
kicked the ball so hard and John was the
goalkeeper he was not able to stop the ball that James kicked and John team lost the match.John’s team were teaseing
him .One day there was a singing competition in their street John sang better than all of them in tha street he won the prize
everyone was amazed by his song and everyone said sorry to him and became
his friends.

Moral of the story is don’t tease anyone that they are not good at something everyone has there own talent .
అడవిలో రెండు కోతి పిల్లలు బయటకు వచ్చి అడవంతా తిరుగసాగాయి. అవి దారితప్పి తమ నివాసం ఎక్కడ ఉందో తెలియక కంగారు పడ్డాయి. ఇంతలో వాటికి ఒక పెద్దపులి ఎదురయింది .వెంటనే అవి భయపడి అక్కడే దగ్గర లోనే ఉన్న ఒక చెట్టును ఎక్కాయి. కానీ ఆ చెట్టు పైన ఇదివరకే ఒక పెద్ద చిరుత పులి ఉంది. దానిని చూసి అవి గజగజ వణకసాగాయి. తమకు ఎలాగూ చావు తప్పదని అవి నిర్ణయించుకున్నాయి .వాటి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. “క్రిందికి దిగితే పెద్దపులి పొట్టన పెట్టుకుంటుంది. ఇక్కడ ఉంటే చిరుత పులి చేతిలో చావు తప్పదు ” అని అవి అనుకున్నాయి . చివరకు అవి ఆ చెట్టు పైననే ఉండాలని నిర్ణయించుకున్నాయి.
ఇంతలో భయపడుతున్న ఆ కోతి పిల్లలను చూసి చిరుతపులి” పిల్లల్లారా!భయపడకండి .నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఉండగా మిమ్మల్ని ఏ జంతువు చంపలేదు. ఆ పులికి మీరు భయపడవద్దు” అని వాటికి ధైర్యం చెప్పింది. నేలపైన ఉన్న ఆ పెద్దపులి చెట్టు పైన ఉన్న చిరుతపులిని చూసింది. అది కొద్దిసేపు ఆ కోతిపిల్లలు క్రిందికి దిగుతాయేమోనని వాటి కొరకు ఎదురుచూసింది. చివరకు అవి దిగకపోవడంతో ఆ పెద్దపులి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయింది.
చెట్టు పైన ఉన్న చిరుత పులి మొదట ఆకలిచే ఈ కోతి పిల్లలకు హాని చేయాలని అనుకొంది. కానీ ఆ పులి వెళ్ళిన తర్వాత ఆ కోతి పిల్లలు ఆ చిరుతను తమను కాపాడిన దేవతగా, అమ్మగా స్తుతించాయి. భయంతో వణుకుతున్న ఆ కోతి పిల్లలను చూడగానే దానికి తన పిల్లలు గుర్తుకు వచ్చి దానిలోని మాతృ హృదయం పెల్లుబికింది. వాటి మాటలు విన్న ఆ చిరుత పులికి ఆ పిల్లల పై జాలి కలిగి తన మనసును మార్చుకుంది .
ఆ కోతి పిల్లలు తర్వాత చెట్టును దిగి చిరుత తమకు తోడు రాగా అవి తమ నివాసానికి ఎట్టకేలకు చేరాయి .అవి తమ తల్లిని కలుసుకొని ఈ చిరుత పులి తమకు ప్రాణదానం చేసిందని తమను పెద్దపులి నుండి కూడా కాపాడిందని చెప్పాయి. ఆ తల్లి కోతి ఎంతో సంతోషించి చిరుతపులికి తన ధన్యవాదాలను తెలిపింది.
చిరుతపులి వెళ్లి పోయిన తర్వాత అది ఈ విషయాన్ని తోటి జంతువులన్నింటికీ చెప్పింది .మరొకసారి తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లవద్దని అది తన పిల్లలను హెచ్చరించింది. అవి అలాగేనన్నాయి.ఈ వార్త సింహానికి చేరింది. అది చిరుతపులిని పిలిపించి దానిని ఘనంగా సత్కరించింది.
తాను చేసిన మంచి పనికి ఆ చిరుత పులి ఎంతగానో సంతోషించి ఇక ముందు పిల్లల పట్ల క్రూర స్వభావాన్ని విడనాడి ఇదే మంచితనాన్ని కొనసాగించాలని అనుకుంది. ఆనాటి నుండి అది పిల్లల జోలికి వెళ్లవద్దని నక్క ,తోడేలు వంటి జంతువులను కూడా హెచ్చరించింది.
1. దొంగ – బాలుడు
రహదారిపై ఒక దొంగ ఒక మహిళ చేతిలోని పర్సును దొంగిలించి పరిగెడుతున్నాడు. అది గమనించిన ఒక బాలుడు ఆ దొంగ వెంట పడ్డాడు. ఆ దొంగ పరిగెత్తి పరిగెత్తి చీకట్లో మాయమయ్యాడు. ఆ బాలుడు ఒక చెట్టు చాటు వరకు వెళ్లి ఆగిపోయాడు. ఆ దొంగ కొద్దిసేపు చీకట్లో దాక్కొని దప్పికతో తిరిగి అక్కడ ఉన్న కుళాయిలో నీరు త్రాగుదామని ఆ బాలుడు ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. ఆ బాలుడు చెట్టుచాటునుండి ఆ దొంగను చూశాడు. ఆ దొంగ తాను దొంగిలించిన పర్సును చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్దారించుకొని అక్కడ దానిని నేలపై దూరంగా పెట్టి నీటిని త్రాగసాగాడు. వెంటనే ఆ బాలుడు ఆ పర్సును తీసుకొని పరిగెత్తసాగాడు .అప్పుడు అది గమనించిన ఆ దొంగ ఉపాయంతో ఆ బాలుని వెంటపడి ‘ దొంగ దొంగ ‘అని గట్టిగా అరవసాగాడు .అక్కడ ఉన్న జనం ఆ దొంగ మాటలు నిజమని నమ్మి ఆ బాలుని పట్టుకున్నారు. ఆ దొంగ సంతోషించి ఆ బాలుడు తన పర్సును దొంగిలించాడని బాలుడికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నవారు వారి ఇద్దరినీ పట్టుకుని గ్రామాధికారి వద్దకు తీసుకుని వెళ్లారు.
ఆ దొంగ తన పర్సును ఈ బాలుడు దొంగతనం చేశాడని ఆరోపించాడు. అప్పుడు గ్రామాధికారి ఆ బాలునితో “ఏం బాబూ! ఇతరుల పర్సును దొంగిలించడం తప్పు కదా!” అని అన్నాడు. ఆ బాలుడు నవ్వి ” అయ్యా! ఇది అతని పర్సు అయితే ఇందులో ఏమున్నదో చెప్పుకోమనండి” అని అన్నాడు. ఆ దొంగ నీళ్ళు నమిలాడు. అప్పుడు ఆ గ్రామాధికారి “మరి నీవైనా చెప్పు” అని ఆ బాలుని అడిగాడు .”మా అమ్మా, నాన్న ఫోటోలండీ. ఇతడు దొంగిలించింది మా అమ్మ పర్సే. కావాలంటే చూడండి “అని ఆ గ్రామాధికారికి దానిని తీసి చూపించాడు .వెంటనే అక్కడ నుంచి పారిపోతున్న ఆ దొంగను గ్రామ ప్రజలు వెంటనే పట్టుకున్నారు.
ఇంతలో అక్కడికి ఆ బాలుని తల్లి ఏడ్చుకుంటూ ఆ గ్రామాధికారి వద్దకు వచ్చి ఆ బాలునితో “బాబూ! మన పర్సు పోతేపోయింది. వెధవ పర్సు. దొంగ వల్ల నీకు ఏమీ ముప్పు అవలేదు కదా “అని అంది .అప్పుడు ఆ గ్రామాధికారి ఆ బాలుని మెచ్చుకొని “నీ కొడుకు ఈ గజదొంగని పట్టించాడమ్మా! మాకు ఈ దొంగ పీడ లేకుండా చేశాడు! మా గ్రామంలో ఎన్నో రోజులుగా దొంగతనం చేసిన ఈ దొంగను ఈ బాలుడు పట్టుకోవడం నిజంగా చాలా ధైర్యంతో కూడిన పని. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ బాలుని నేను అభినందిస్తున్నాను” అని ఆ బాలునికి మంచి కానుకను ఇచ్చి సత్కరించాడు.వారి మాటలు విని ఆ తల్లి ఎంతో మురిసిపోయింది.
కావేరీని తన సోమరిపోతు భర్త ఎప్పుడూ చికాకు పెట్టేవాడు. ఆమె పొలం దున్నడం, నీళ్ళు పెట్టడం, భూమిని నాటు పెట్టుటకు గాడిదవలె చాలా శ్రమ పడుతుండేది. అప్పుడు ఆమె భర్త ఇంట్లో హాయిగా గుర్రుకొడుతూ నిద్రించేవాడు. ఎందుకు ఒకసారి ఎవరో కొత్తతను అన్నం మరియు నీళ్ళు అడుగుతూ వంటగది చూపించి నిద్రించేందుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ కొత్తతను ధన్యవాదాలు తెలుపుతూ కావాలసినంత మాత్రమే తనకు తన గుబ్దానికి తీసుకున్నాడు.
కావేరి చిన్న ఇంట్లో దొంగతనం చేయుటకు ఎక్కువేమి లేదు. వాళ్ళు బీద కర్షకులు. కేవలం కొద్ది భూమే పండించుటకు ఉంది, కాని అక్కడ ఏమి పండక పోయేది. ఏదో తీరుగ కావేరీ పొలం దున్ని పక్క ఇండ్లల్లో అవో ఇవో పనులు చేస్తూ ఇల్లు గడిపేది.
ఆమె భూమి దేవాలయానికి పక్కనే ఉంది. కొన్ని రోజులు ఆమెకు సహాయం చేసి నటనతో వచ్చి ఆమె వెంట తిరిగిన వెంటనే తిరిగి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో కాళ్ళు జాచి వచ్చిపోయే వారితో గప్పాలు కొట్టేవాడు భర్త.
ఒకనాడు, ఆమె పొలంలో పనిచేస్తునప్పుడు, విత్తనాలు చల్లేందుకు భూమిని తవ్వుతున్నపుడు ఒక బక్కపలుచటి మనిషి పెద్ద మీసాలవాడు ఆమె ప్రక్కన ప్రత్యక్ష
మైనాడు. అతను ఒక దొంగ మరియు ఎందుకు పనికిరాడు. కావేరికి ఇది తెలియదు. ఆమె మర్యాదగా దండం పెట్టి తన పనిలోకి తిరిగిపోయింది.
ఇప్పుడు దేవాలయంలో విగ్రహంపై ఉన్న ఆభరణాలు, కానుకలుగా అర్జించిన నాణాలు దొంగిలించాలనుకున్నాడు. గుడిలోకి వెళ్ళేందుకు కేవలం కావేరి పొలంలో నుండే దారి. కాని ఆ తెలివైన మరియు గట్టి ఆవిడకు తెలియకుండ చేయడం ఎలా?
కావేరికి డబ్బులు సరిగా లేవని ఊహించి ఆమెకు గుసగుసగా “చెల్లీ, నీవు ఈ పంట పండని భూమిని పట్టుకొని ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను, నాకు అమ్మేసెయి” అన్నాడు.
కావేరి కనురెప్పలు లేపింది. అతను అన్ని రూపాయలకు ఈ భూమి ఎందుకు కొంటాడు? కచ్చితంగా ఏదో లోపం ఉంటుంది.
ఆ దొంగ ఆమె అమ్మదని ఊహించాడు. కాబట్టి అతని ధర పెంచాడు. వెయ్యి మరియు యాభై? లేదు? రెండు వేలు? లేదు మరల? ఐదువేలు? లేదు.
కావేరి తల అడ్డం తిప్పుతుంటుంది. ఆమె ఆ కొద్ది భూమికి అంత డబ్బు ఇచ్చే పనికిరాని మనిషిని ఇష్టపడలేదు. తప్పనిసరిగ అతనిలో చెడు ఆలోచనలు ఉంటాయి. చివరకు, అతని నోరు మూయించేందుకు, ఆమె ఒక కథ ఆలోచించింది. నేను ఎన్నటికి కూడా ఈ భూమి అమ్మను. ఎందుకంటే ఇది మా పూర్వీకులది. ఇప్పుడు మేము బీదవారిమి. కాని నాకు తెలిసింది ఏమంటే మా కుటుంబం ఒకప్పుడు చాలా ధనికులది. మేము చాలా ధనం పోగొట్టుకున్నప్పటికి, అందులో ఎక్కువ
భాగం ఈ భూమిలోనే మా పూర్వీకులలో ఒకతను దొంగల నుండి రక్షించుకునేందుకు పాతిపెట్టాడట. ఎన్నో ఏండ్ల క్రితం మనుషులు అది మరిచిపోయారట. కొద్ది రోజుల క్రితమే నా భర్త దాచిన ధనం లం గురించి ఒక ఉపాయం తెలుసుకున్నాడు. నేను ఇంత గట్టి నేలను ఎందుకు తవ్వుతున్నానని అనుకుంటున్నావు? విత్తనాలు వేసేందుకు కాదు, ఓహో కాదు, అందరూ అదే అనుకుంటారు. నేను కేవలం దాచబడిన సొమ్ము కొరకు తవ్వుతున్నాను!
ఆ దొంగ ఆశ్చర్యచకితుడైనాడు. ఈ ఆడమనిషి ఇంత విలువైన సమాచారాన్ని ఎవరో కొత్త మనిషికి తెలుపడం, ఉట్టి అమాయకురాలు అనుకున్నాడు. నేను ఈ పరిస్థితిని నా లాభం కొరకు ఎందుకు వాడుకోకూడదు? ఇక్కడ అతను ఉండి ఆలయంలోని నాణాలను దొంగిలించుదామని ఆశించాడు మరియు ఈ ఆడమనిషి ఇక్కడ ధనం దాచిన సంగతి చెప్పుతున్నది! అతను చాలా నమ్రతగా ‘అవును చెల్లీ, నాకు అర్థమయింది, కేవలం అది మీ కుటుంబ సొమ్ము. నీవే దాన్ని పొందాలి’ అతను వెళ్ళిపోతున్నట్లు నటించాడు. కొంతదూరం పోయి ఆ రోడ్డు పక్కన దాక్కున్నాడు.
రాత్రి అయింది, కావేరి తన పనిముట్లు తీసుకొని ఇంటివైపు వెళ్ళింది. ఆలయం కూడా ఖాళీ అయింది. మరియు పూజారి ఆ
రాత్రికి తాళం వేశాడు. అప్పుడు మధ్యరాత్రి, అంతా నిశ్శబ్దం మరియు రాత్రి కీటకాలు వాటి ఇండ్ల నుండి బయటికి వస్తున్నవి, ఆ దొంగ ఆ పొలంలోకి పాకాడు.
రాత్రంతా అతను తవ్వాడు, తవ్వాడు, తవ్వాడు సొమ్ము కొరకు. కాని అక్కడ సొమ్ము ఉన్న గుర్తు ఏమీ లేకుండెను. అసలు అక్కడ సొమ్మే లేదు. తెల్లవారే వరకు కావేరి తనను ఫూల్ చేసిందని గ్రహించి ఇక చేయవలసింది అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడమే.
ఎప్పుడైతే కావేరి పొలం వద్దకు వెళ్ళిందో ఆమెను ఆమెనే మెచ్చుకుండి. ఆమె ఊహించినట్లే పొలం ఆ దొంగ రాత్రంతా మంచిగా త్రవ్వాడు ఆమె కొరకు. ఇప్పుడు ఆమె చేయవలసింది కేవలం గింజలు నాటడమే. ఆమె పొలంలో కొన్ని నెలలు బాగా కష్టపడింది మరియు మంచి పంట పండించింది. ఆమె ఆ పంట అమ్మేసింది. ఖర్చులు పోను వారి వద్ద కొంత డబ్బు మిగిలింది. దాంట్లో నుంచి కొంత డబ్బుతో కావేరి సొమ్ములు కొనుక్కుంది.
చాలా నెలల తరువాత, ఆ దొంగ ఆ గ్రామంలో ముఖం చూపించ దలిచాడు. అతను తన మారువేషంలో జాగ్రత్తగా ఉండేవాడు. అతను తన పొడుగాటి
మీసాలు కత్తిరించుకొని అందంగా తయారు అయినాడు, రంగు రుమాలు కట్టుకుని వ్యాపారస్తుని వలె నటించాడు. అతను గ్రామంలో అడుగు పెట్టగానే పనికి పోతున్న కావేరిని చూశాడు. కాని ఇదేంటి… మామూలు అమ్మాయి ఏ ఆభరణాలు వేసుకొని, ఇప్పుడు వెనుకటి నుండి సంపన్న కుటుంబందాని వలె కనిపించింది. తప్పనిసరిగ వాళ్ళ కుటుంబం భూమిలో దాచుకున్న ధనం దొరికి ఉండవచ్చు చివరకు. అతను ఆమె ఇంటికి పోయి మిగతా డబ్బు, సొమ్ములు చూద్దామని నిశ్చయించుకున్నాడు.
ఆ రాత్రి అతను కావేరీ ఇంటికిపోయి ఆమె భర్తతో ఇలా అన్నాడు. నేను ఒక బాటసారిని కాని నాకు ఈ రాత్రి గడుపుటకు స్థలం దొరకలేదు. దయతో నాకు ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి’ అని.
కావేరి భర్త వెంటనే అంగీకరించాడు. కావేరీ ఎట్లాగో అతడిని లోపలి నుండి చాటుగా అతడు మారువేషంలో ఉన్నది కనిపెట్టింది. ఆమెకు ఎరుకే, అతను ఏదో దొంగిలించాలనే ప్లాలో వచ్చాడని, కాబట్టి ఆమె పెద్ద గొంతుతో ఆ యాత్రికుడు వినేట్లు పలికింది. “ఓ నా ప్రియుడా, మీ ప్రియమైన అత్త ఒక్కతే రాత్రంతా ఉంటుంది మరియు మనను ఆమెతో ఉండేందుకు రమ్మంది. నీకెరుకే, మీ మామయ్య లేనప్పుడు చీకటి ఆమెను ఎలా భయపెడుతుందో” అంది. “రా, ఈ రాత్రికి అక్కడికే పోదాం.” అప్పుడు తన మాట శబ్దం కొంత తగ్గించి ఆమె మాట్లాడుతూ, ‘మన సొమ్ముల గురించి విచారించకు. నేను వాటిని ఇంటి గోడ రంధ్రాల్లో దాచిపెట్టాను. ఎవరు కూడా దాచిన చోటను అనుమానించరు. అప్పుడు ఆమె తన సహజ శబ్దంతో దొంగకు చెప్పింది. అన్నా, మీరు వరండాలో నిద్రించవచ్చు. ఇల్లు తాళం వేయబడు తుంది. ఇక్కడ నీ కొరకు కొంత అన్నం, నీరు ఉంది. మేము రేపు ఉదయం రాగలము’ అంది. ఆ దొంగ తనలోనే అమాయకపు కావేరి గురించి నవ్వుకున్నాడు.
ఆమె భర్త నోరు తెరిచి ఆమె ముఖం వైపు కనురెప్ప వాల్చకుండా చూశాడు.
ఎక్కడి అత్త మరియు ఎక్కడి సొమ్ములు ఆమె మాట్లాడుతున్నది అని ఆశ్చర్యపడినాడు. ఎప్పుడైతే ఆమె గట్టిగా నడువసాగిందో, ఆయన విధేయుడుగా వెంట నడిచాడు.
ఆ దొంగ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. ఆయనకు రాత్రంతా గోడలు కొట్టి చూసేందుకు, మరియు దాచిన బంగార ఆభరణాలు చూసేందుకు సమయం దొరికింది. అందుకు ఆయన మొదలుపెట్టాడు. ట్యాప్, ట్యాప్, ట్యాప్. చెయ్యితో గుద్దాడు మరియు గట్టిగా నెట్టాడు. నగలు ఉన్న చోటు దొరుకుతుందని అతను ఇల్లంతా గాలించాడు, ట్యాప్ చేశాడు, గోడలను తన్నాడు, నెట్టాడు. చివరకు గోడలన్నీ కూల్చేశాడు. కాని అక్కడ అతనికి ఏమీ దొరకలేదు. బాగా అలసిపోయి నిద్రలోకి పోయాడు. మరియు కోడికూత, సూర్యోదయం అప్పుడు లేచాడు. త్వరగా తన వస్తువుల మూట తీసుకొని పరుగెత్తాడు. కొన్ని నిముషాల్లోనే కావేరీ మరియు ఆమె భర్త తిరిగివచ్చారు.
“ఓహ్ కావేరీ, చూడు ఆ చెడ్డమనిషి మర ఇంటిని ఎలా చేశాడో, నీవు అతనికి భోజనం మరియు చోటు ఇచ్చావు మరియు రాత్రి ఒకడికే ఇల్లు వదిలిపెట్టావు, నన్ను వెంట తీసుకుపోయావు” అని భర్త ఏడ్చాడు. కానీ కావేరి నవ్వుతున్నది. అప్పుడు ఆమె నవ్వులు నవ్వుతూ అంది “విచారపడకు, నేనే ఇదంతా ప్లాన్ చేశాను. నీవు చూడు. నేనే ఇల్లు కట్టుకునేందుకు గత పంట డబ్బు నుండి కొంత దాచాను. నేనే కూలీలను పిలిచి గోడ కూలగొట్టి దామనుకున్నాను, కాని మన చుట్టం ఆ పని చేశాడు! మనం ఇప్పుడు మన కోసం ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఎప్పుడూ మనం అనుకున్నట్లు”.
గ్రామమంతా ఈ కథ విని ఆమె అద్భుతమైన తెలివిని మెచ్చుకున్నారు. ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఆ దొంగ ప్రతీకారం తీసుకోవాలని మండిపోతున్నాడు. ఎంత ధైర్యం గ్రామస్త్రీ నన్ను మోసగించేందుకు, అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు! ఆమె చాలా తెలివైనదని గ్రహించాడు.
ఒకరోజు అతను గాజుల బేరగాని వలె డ్రెస్ వేసుకొని గ్రామంలో తిరుగు తున్నాడు. కావేరీ అతడిని చూసింది మరియు వెంటనే అతను ఎవరో గ్రహించింది. గాజుల బేరగాని చుట్టూ మూగిన తన స్నేహితురాళ్ళతో కావేరి అంది. “ఓహ్ మిత్రులారా, నేను కూడా కొన్ని వేయించుకునేందుకు ఇష్టపడేదాన్నే. కాని ఎప్పుడైతే ఈ పనికిరాని దొంగమా ఇల్లు కూలగొట్టి మా డబ్బంతా దోచుకోవాలని ప్రయత్నం చేశాడో, అప్పుడు నేను నా డబ్బంతా అడవిలోని ఒక చెట్టు తొజ్జలో దాచాను.” అంది.
“ఏ చెట్టు?” తన స్నేహితులు అడిగారు.
“ఓహ్ కాదు, ఏ చెట్టని చెప్పను, కాని అడవిలో ఆ డబ్బంతా భద్రంగా ఉంటుంది.
ఆ దొంగ ఆమె వైపు చూశాడు. అవును కావేరీ మామూలు చీర కట్టుకుంది, ఏ ఆభరణాలు వంటిమీద లేవు.
గాజుల బేరగాడు గాజులు అమ్మిన డబ్బు కిందపడేసి ఎగిరి అడవివైపు పోవడం చూసి ఆమె మిత్రులు ఆశ్చర్యపడినారు. కేవలం కావేరియే ఆమె ముఖం చిట్లించి జాగ్రత్తగా చూసింది.
అడవిలో ఆ దొంగ కింద మీద సొమ్ముల కొరకు బాగా వెదికాడు. అతను చెట్లు ఎక్కాడు, పొదల్లో కట్టెతో పొడిచి చూశాడు. ఏదో కుట్టింది,
గోక్కున్నాడు మరియు కోపంతో అరిచాడు, కాని అతను వదలలేదు. ఆ సొమ్ములు ఇక్కడే ఎక్కడనో ఉంటాయి. వాటిని అతను తెలుసుకోవాలి.
అతనిది కాని సొమ్ము కొరకు వెదికేవాడిని వదిలిపెడుదాము. కావేరి సమయస్ఫూర్తితో గ్రామాన్ని దొంగ నుండి రక్షించినందుకు అందరు పొగిడారు.
ఆమె కష్టపడి పనిచేస్తూ ఆమె పొలంనుండి బాగా డబ్బు సంపాదించి చాలా ధనవంతురాలయింది. ఆమె భర్త కూడా చేతకాదనే నటన విడిచి ఆమెకు సహాయపడే వాడయ్యాడు. దొంగ గురించి ఎవరికి ఎరుక, బహుశా అతను తనది కాని దాని గురించి వెతుకుతుండవచ్చు. ఇప్పుడు అతను కూడా కావేరీ వలె కష్టపడి పని చేసుకుంటే అతను కూడా ధనికుడు అయి వుండేవాడు.
కథ అయిపోయాక పిల్లలు నవ్వారు, మరీ నవ్వారు. ‘అయ్యో పాపం దొంగ’. మీను మరియు క్రిష్ణ చిలిపిగా నవ్వారు. అతను పులి నోట్ల పడి ఉండవచ్చు!
అమ్మమ్మ సీరియస్ గా అంది, కొద్ది అదృష్టం మరియు తీసిపారేసిన గడ్డి పరకలతో వారి పరిస్థితిని మార్చుకోవచ్చు.
ఒకసారి ఒక అడవిలో పాడే పక్షుల సమావేశం జరుగుతుంది. కోకిల కూడా ఒక పాడే పక్షిగా ఉన్నది. దాని “కూహ్ కూహ్” పాట తీయనిది. ఇతర పక్షులు దాన్ని ఇష్టపడలేదు. ఎవరు కూడా దాని తీయని పాటనూ కూడా ఇష్టపడలేదు. ఏది ఎట్లైనా వీలు చేసుకొని, కోకిల మాట్లాడింది : “ప్రియమైన మిత్రులారా, మనం భూమి మీద ఉండే జనుల హృదయాలను సంతోషపెట్టే పాటను కనిపెట్టాలి. వాళ్ళు పాటలను వినడానికి సంతోషపడుతారు. అప్పుడు ప్రపంచం అంతా ఆనందమయ మవుతుంది” అన్నది.
వెంటనే “అది ఎట్లా సంభవం? అటువంటి పాటను ఎట్లా వెదకాలి? అది అంత సులభం కాదు” అన్నది హంస. (హంస = పొడుగైన మెడగల చైనా బాతు)
“ఎందుకు కాదు? మనందరమూ దూరపు ప్రాంతాలకు ఎగిరిపోదాం, వేరేవి చాలా పాటలను తెలుసుకుందాం. దాని తరువాత మనం మళ్ళీ అడవిలో కలుసుకొని ఒక్కొక్కరం విడివిడిగా పాడుదాం. అప్పుడు అన్నింటిలో చాలా బాగున్నదాన్ని ఎన్నుకొని దాన్ని ప్రపంచానికి విరాళంగా ఇద్దాం” అన్నది కోకిల.
పక్షులన్ని అంగీకరించాయి, వేరు వేరు ప్రాంతాలకు ఎగిరిపోయాయి. కూకూ, భ్రష్ అనే తీయని పాట పాడే పక్షులు మంచి ఊపులో ఉన్నాయి. ఆ చిన్నపక్షి కోకిల చాలా గ్రామాలు, పట్టణాలు దాటిపోయింది. ఎక్కడ కూడా శ్రావ్యమైన కంఠధ్వని వినలేదు. అవ్వన్ని కర్ణకఠోరంగా ఉన్నాయి, ఏమాత్రం తీయగ లేవు. అప్పుడు అది ఎత్తైన గుట్ట దగ్గరకు వచ్చింది. కానీ దాని రెక్కలు బాగా నొప్పి పెట్టడం వలన అది బాగా నీరసపడింది. అది ఒక బలహీనమైన పక్షి. చాలా నిరుత్సాహపడింది. అక్కడికి ఒక గద్ద వచ్చింది. ఆ సమయాన కోకిల రంధిగా ఒక పాట పాడుతున్నది.
“చెల్లీ, నీవు ఇంత రంధిగ ఉన్నావు ఎందుకు?” అని గద్ద అడిగింది.
“నేనేమి చేయగలను? నేను ఒక కొత్త పాటను వెదుకాలి, అది జనులందరిని సంతోషపెట్టాలి” ఆ చిన్న పక్షి అంది.
“నీకు ఆ పాట ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగిన గద్దతో
“ఒకవేళ ఆ ఎత్తైన కొండను దాటితే నేను వెదికే పాట నాకు దొరుకుతుంది” అన్నది కోకిల.
“ఓహ్! చెల్లీ. అదానీ సమస్య. నీవు ఒక పనిచేయి. నేను రేపు ఉదయాన ఎత్తైన పర్వతం దాటుతాను. నీవు నా మెడ రెక్కలను గట్టిగా పట్టుకో. నేను నిన్ను మంచుకొండల వరుసలు దాటిస్తాను. నీవు అక్కడ రెండు మూడు రోజులు వుండు. నీ పని అయిన తరువాత నేను నిన్ను తిరిగి తీసుకవస్తాను” అన్నది గద్ద.
ఆ చిన్నపక్షి అంగీకరించింది. మరునాడు ఉదయమే గద్ద ఆ చిన్నపక్షిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. గద్ద చాలా ఎత్తుకు ఎగిరింది. ఆ గద్ద చిన్నపక్షిని పర్వత శిఖరాన దింపింది.
ఆ చిన్న కోకిల కుతూహలంగ చుట్టూ చూసింది. ఆ శిఖరంపై ఒక చిన్న గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ఋషి ఉన్నాడు. అతడు వృద్ధుడు, తెలివైనవాడు కూడా.
ఆ ఋషి మాట్లాడాడు. “నాకు తెలుసు నువ్వు ఎవ్వరివో. నీవు ఒక చిన్న పక్షివి. కాని ఎందుకు ఆలస్యం చేశావు. చాలాకాలం నుండి నీ కొరకు ఎదిరి చూస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు.” అన్నాడు.
“ఓహ్! నా అదృష్టం! ఋషి వర్యా, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. కాని మీకు ఎట్లా తెలిసింది” అని అడిగింది.
ఓ పక్ష్మీ నేను భగవంతుని అన్వేషణలో ఉన్నాను. అతడు అతిబలవంతుడు. నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసు. నీవు ఒక పాట అన్వేషణలో వచ్చావు. నీవు మనుషుల హృదయాలను సంతోషపెట్టడానికి ఓ పాట నేర్చుకుందామని అనుకుంటున్నావు. కాని అది సామాన్యమైన పని కాదు. దానికొరకు చాలా ఓపికతో ఉండాలి” ఋషి సమాధానమిచ్చాడు.
“సార్, నేను రెడీ. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఓపిక కల్గి ఉండటం అవసరం. ఎడతెగని ప్రయత్నం చేయకుంటే ఎవరు గొప్పవారు కాలేరు. దయతో నాకు బోధించండి” అన్నది ఆ పక్షి.
“సరే, నీవు ఈ తీరుగ చెయ్యి. నీ గుడిసె వెనుక ఒక ముళ్ల చెట్టు వుంది. అక్కడికి వెళ్ళి ముళ్ళ మీద కూర్చో. సహజంగానే ముళ్ళు నీకు గుచ్చుకుంటూ బాధపెడతాయి. నీవు ఆ బాధను ఒక వారం సహించాలి. నీ రక్తం బయటికి వస్తుంది, తప్పదు. కాని రోజు రోజుకు నీ గానం మెరుగు పడుతుంది. వారం రోజుల చివరన నీ గానం చాలా బాగుంటుంది. అది జనుల హృదయాలను సంతోష
పెడుతుంది. నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. నేను నా మహిమలతో నీ గాయాలను నయం చేస్తాను. గద్ద నిన్ను నీ స్థలానికి తీసుకుపోతుంది” అని చెప్పాడు ఋషి.
ఆ పక్షి అంగీకరించి ఋషి చెప్పినట్లు చేసింది. అది మొదటిరోజే పాడటం మొదలుపెట్టింది. దినం తరువాత దినం దాని పాట మెరుగయ్యింది. వారం చివరిలో గాయాలతో బాధపడుతున్న కోకిల తన పాటను చాలా శ్రావ్యంగా పాడగలిగింది. ఆ వయసు మళ్ళిన ఋషి అవస్థ పడుతున్న పక్షిని తన చేతుల్లోకి తీసుకొని తన మహిమతో దాని గాయాలను ముట్టుకొని నయం చేశాడు.
“పక్షి, నీవు ఇప్పుడు భూమి మీదికి తిరిగిపో, అక్కడ ఈ కొత్త పాట పాడు. జనాలు కూహ్ కూహ్ అను నీ తీయని స్వరం విని ఆశ్చర్యపడుతారు” ఋషి అన్నాడు. కోకిల ఋషికి ధన్యవాదాలు చెప్పి గద్ద కోసం ఎదురు చూస్తూ ఉన్నది.
గద్ద అన్నమాట ప్రకారం మరుసటి రోజు వచ్చింది. కోకిలను ఎత్తుకు పోయింది. కోకిల దాని ఇంటికి తిరిగి వచ్చింది. సమావేశంలో అది బహు శ్రావ్యంగ పాట పాడింది. అది ఒక గొప్ప సంతోష సంఘటన. పక్షులన్ని భళా భళా అని మెచ్చుకున్నాయి.
ఈ రోజు కూడా కోకిల గానం విన్న వాళ్ళందరి హృదయాలను సంతోషపెడుతుంది.




