చింటూ చిన్న పిల్లవాడు. అతడు ఆడుకోవడానికి వాళ్ళమ్మ చాలా బొమ్మలు తెచ్చి యిచ్చింది. వాటితో కొద్దిసేపు ఆడుకున్న చింటూకు చిరాకు కలిగింది. అవి అన్ని తీసి బయట పడవేశాడు. వాళ్ళ అమ్మ అప్పుడు వంట ఇంట్లో ఉంది.
చింటూ ఇంటి ముందుకు వచ్చి పూల చెట్ల వద్దకు వెళ్ళాడు. అక్కడ చెట్లకు పూసిన పూలు చాలా అందంగా ఉన్నాయి. అక్కడ ఒక తూనీగ ఎగురుతున్నది .వెంటనే దాని రెక్కలను అందుకొని భూమి పైన ఉన్న ఒక చిన్న రాయి పైన దానిని ఉంచాడు. అది ఆ చిన్న రాయిని అమాంతంగా తన కాళ్లతో పట్టుకుంది. చింటూ దాన్ని పైకి లేపి ఆనందంతో కేక వేశాడు. ఇంతలోకే పక్కింటి పిన్ని అది చూసి” బాబూ! అలా తూనీగ రెక్కలు పట్టుకోకూడదు. వదిలిపెట్టు “అని అంది. ఆమెకు భయపడిన చింటూ దానిని వదిలి పెట్టాడు .అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ తర్వాత మరొక రోజు చింటూ వారి పెరట్లోకి వెళ్ళాడు .అది వర్షాకాలం. ఆ పెరట్లో అతనికి ఎర్రగా ఆరుద్ర పురుగు కనిపించింది. ఆ పురుగును చేతితో ముట్టాడు .అది తన కాళ్లను ముడుచుకుంది. మెత్తగా ఉన్న దానిపైన చేతితో నిమిరి ఒక ఖాళీ అగ్గిపెట్టెలో దాన్ని బంధించాడు. ఆ తర్వాత మరి నాలుగు ఆరుద్ర పురుగులను అలాగే అగ్గిపెట్టెలో వేసి బంధించి పక్కింటి పిన్నిగారికి చూపించాడు. ఆమె చింటూను కోప్పడి
” బాబూ! అలా వాటిని అగ్గిపెట్టెలో బంధించ కూడదు. వదిలిపెట్టు !”అని అంది .చింటూ తన అగ్గిపెట్టెలోని ఆ ఆరుద్ర పురుగులను కూడా వదిలి పెట్టాడు .
ఆ తర్వాత కొన్ని రోజులకు చింటూ ఒక సీతాకోక చిలుక రెక్కలను పట్టుకున్నాడు .అతడు దాని రెక్కల అందం చూసి” అమ్మా! ఈ సీతాకోకచిలుక అందంగా ఎంత బాగుందో” అని తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె” అలా చేయకూడదురా! దాన్ని వదిలిపెట్టు. అది దాని అమ్మ దగ్గరకు ఎగిరి వెళ్ళిపోతుంది” అని అంది .చింటూ అమ్మ యొక్క మాటను వినలేదు .ఇంటి బయటకు వచ్చాడు. అప్పుడు పక్కింటి పిన్ని” చింటూ! దాన్ని వదిలి పెడతావా! లేదా!”అని గద్దించింది. వెంటనే చింటూ ఆ సీతాకోక చిలుకను కూడా వదలిపెట్టాడు.
మరొక రోజు చింటూ ఈగను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అది దొరకకుండా తప్పించుకొని పోయింది. చింటూ వెంటనే అక్కడ పాకుతున్న ఒక ఎర్ర చీమను పట్టుకున్నాడు. అది చింటూను కుట్టింది. ” అమ్మా! చీమ కుట్టింది “అని ఏడుపు లంకించుకుంటూ తల్లి వద్దకు పరిగెత్తాడు. ఆమె “అయ్యో !మా బాబే ! ఎక్కడ కుట్టింది?” అని అంటూ అది కుట్టిన వ్రేలును బాగా మర్దన చేసింది. కొద్దిసేపటికి ఏడుపును ఆపిన చింటూతో వాళ్ళ అమ్మ ” చీమను పట్టుకోకూడదురా! చూసావా!అది నిన్ను కుట్టింది “అని అంది. “ఇకముందు దాని జోలికి పోనులే” అన్నాడు చింటూ. “అమ్మా! నాకు ఆటలు ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. పక్కింటి పిన్నిగారు ,నీవు ఆ కీటకాలతో ఆడుకోవద్దని అన్నారు.మరి నేను వేటితో ఆడుకోవాలి?”అని ప్రశ్నించాడు?
ఇంతలోకే వారి ఇంటికి ఎదురుగా కొత్తగా వచ్చిన చిన్న పాప వారి ఇంటికి వచ్చింది.చింటూ ఆ పాపను గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. ఆ పాప ఏడుపు లంకించుకుంది. వెంటనే చింటూ అమ్మ “ఆ పాపను వదలు బాబూ!” అని అంది .కానీ చింటూ ఆ పాపను అలాగే పట్టుకున్నాడు. వెంటనే పక్కింటి పిన్ని వచ్చి చింటూ చేతిలో నుండి ఆ పాపను విడదీసింది .ఆ పాపకు చింటూ అమ్మ ఒక బొమ్మను తెచ్చి ఇచ్చింది .ఆ పాప వెంటనే ఏడుపును ఆపి నవ్వసాగింది. చింటూ” అది నా బొమ్మ ” అని అన్నాడు. అప్పుడు చింటూ అమ్మ
” ఇది నీ బొమ్మనే !ఈ చెల్లి నీ కన్నా చిన్నది కదూ!ఆడుకోనీ!” అని అంది .
ఇంతలోనే ఆ పాప అక్కడ మండుతున్న నిప్పు వద్దకు వెళ్ళబోయింది. అది గమనించిన చింటూ యొక్క అమ్మ ఆ పాపను గట్టిగా కదలకుండా పట్టుకుంది. ఆ పాప గట్టిగా ఏడవసాగింది. అది చూసిన చింటూ “అమ్మా! నేను ఆ పాపను పట్టుకుంటే వద్దని అన్నావు .మరి నీవు కూడా ఆ పాపను ఎటూ వెళ్లకుండా పట్టుకున్నావుగా! “అని అడిగాడు.” ఆ పాపకు ఈ నిప్పు కాలుతుందని తెలియదురా! అందుకే పట్టుకున్నాను” అని అంది.
వెంటనే అక్కడకు వచ్చిన పక్కింటి పిన్ని గారు ఈ మాటలను విని ” ఒరేయ్ !ఈ పాపనూ, చిన్న ప్రాణులైన తూనీగ, ఆరుద్ర పురుగులు, సీతాకోకచిలుక, ఈగ ,చీమలను పట్టుకోగూడదురా!తెలిసిందా! ఎందుకంటే వాటి స్వేచ్ఛను మనం అరి కట్టరాదు. ఈ పాపకు నోరు ఉంది కాబట్టి అది ఏడ్చింది. కానీ అవి మూగజీవులు. అందుకే వాటి ఏడుపు నీకు వినిపించలేదు. వాటిని చూసి ఆనందించాలి తప్ప పట్టుకోకూడదు! అర్థమైందా!” అని అంది. చింటూకు అప్పుడు అర్థమైంది. “అయితే వాటిని ముట్టుకోకుండా ఆడుకోవచ్చు కదా !”అని అడిగాడు.”ఓ! భేషుగ్గా ఆడుకో” అని అంది చింటూ అమ్మ .వెంటనే చింటూకు తనను నిన్న తన మిత్రుడు గోపి వదలకుండా, ఎక్కడికీ పోకుండా గట్టిగా పట్టుకున్నందుకు తాను కూడా బాధపడి ఏడ్చిన అనుభవం సంగతి జ్ఞాపకం వచ్చింది.
” అవును పిన్ని గారూ! నన్ను కూడా గోపి నిన్న గట్టిగా పట్టుకుంటే నేను కూడా ఏడ్చాను” అని అన్నాడు.వాడి మాటలు విని చింటూ అమ్మ ,పక్కింటి పిన్ని నవ్వుకున్నారు.
బాలసాహిత్యం
రమ – సుమ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు . రమ మంచి గుణం కలది . కాని సుమ మాత్రం అత్యాశ కలది . ఒక రోజు రమ వాళ్ళ నాన్నకి చాలా జ్వరం వచ్చింది . పొలం దగ్గరికి వెళ్ళలేకపోయాడు . స్కూల్ నుంచి రాగానే రమ వారి నాన్నను చూసి చాలా బాధపడింది . ఆమె నాన్న రమను చూసి
” రమ ,కాస్త పొలం దగ్గరికి వెళ్ళి రామ్మా “అని అన్నాడు .
“అలాగే నాన్నా ” అంది రమ.
రమ సుమ ఇంటికి వెళ్ళి “సుమ , మా బావి దగ్గరికి వెళ్లి పోలానికి నీళ్ళు పెట్టి వద్దాము, వస్తావా “. అని అడిగింది .
” సరే వెళ్ళి వద్దాం “అని ఇద్దరువెళ్ళసాగారు. పాలానికి చేరుకున్నారు . పొలానికి నీళ్ళు పెట్టి వచ్చేటప్పుడు ఒక పక్షి కాలు విరిగి ఉండడం రమ చూసింది . ఆ పక్షి బాధను చూస్తూ తను చాలా జాలిపడింది . వెంటనే రమ ఆ పక్షిని చేతిలోకి తీసుకొని అక్కడే ఉన్న చెట్ల నుండి రసం మందు తయారు చేసి కాలికి కట్టు కట్టింది . అలాగే ఒక మూడు రోజులు పసరు రాసింది . మూడు రోజుల్లో గాయం తగ్గిపోయింది . దానికి కృతజ్ఞతగా పక్షి ఒక చిన్న పెట్టె ఇచ్చింది .
రమ దాన్ని తెరిచి చూసింది . అందులో గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి .వాటిని తీసుకెళ్ళి పక్కనున్న పెరట్టిలో నాటింది.అవి ఒక మూడు నెలలో కాయలు కాసాయి .రమ కాయలను పగలగొట్టి చూసింది . అందులో బంగారు నాణాలు కనిపించాయి . రమ వీటిని చూసి చాలా ఆశ్చర్యపోయింది . ఈ విషయము వెళ్ళి సుమ కి చెప్పింది . సుమ మనసులో వెంటనే దురాశ కలిగింది . అదే పక్షి వచ్చి సుమ వాళ్ళ ఇంటి గోడ పైన వాలింది . వెంటనే సుమ పక్షిని చేతిలోకి తీసుకుని దాని కాలు విరగగొట్టింది .
తరువాత దానికి రమ వలె మందు తెచ్చి మళ్ళీ కట్టు కట్టింది. ఇప్పుడు కూడా దానికి ఒక మూడు రోజులకీ తగ్గిపోయింది .అలా సుమకి కూడా ఆ పక్షి ఒక చిరు పెట్టె ఇచ్చింది . అందులో కూడా గుమ్మడికాయ విత్తనాలు ఉన్నాయి.వాటిని తీసుకెళ్ళి సుమ కూడా పెరట్లో నాటింది.అలానే మూడు నెలలకి చెట్టుకి కాయలు కాసాయి సుమ ఎంతో ఆనందంతో ఆ కాయను పగలగొట్టింది . వెంటనే వాళ్ళ ఇల్లు పేలి పోయింది.
అప్పుడు అర్థమయింది సుమకు అత్యాశ పనికిరాదు అని . అందుకే అత్యాశ వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి .
నీతి : – అత్యాశ అంధకారానికి దారితీస్తుంది .
***
వెన్నెల అమూల్య
9 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
జక్కాపూర్, సిద్దిపేట జిల్లా
సెల్ : 9963864140
రామా పురం అనే గ్రామంలో రాజు అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి అమ్మ,నాన్న ఎవరు లేరు .అతను ఒక అనాధ. రోజు ఊరివారందరి దగ్గర అడుక్కుని తినేవాడు. ఒక రోజు అతనికి చాలా ఆకలి వేసింది.అతనికి ఎవరు ధర్మం చేయలేదు. పాపం ఆ అబ్బాయి వీదులన్ని తిరిగాడు .అయినా తనకు ఎవరూ ధర్మం చేయలేదు .
ఆకలితోనే నడుచుకుంటూ ఆ గ్రామం చెరువు ఒడ్డుకు వెళ్లాడు .అక్కడికి వెళ్ళగానే తను కళ్లు తిరిగి పడిపోయాడు .అప్పుడే అక్కడికి ఒక పెద్దావిడ వచ్చింది. అతనిని చూసి చాలా జాలివేసి వెంటనే అతని పైన కొన్ని నీళ్ళు చల్లింది .అతను వెంటనే లేచి చాలా కృతజ్ఞతలు అని ఆ పెద్దావిడకు చెప్పాడు .
అప్పుడు ఆ పెద్దావిడ ” నీవు ఎవరు బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావు ,కళ్లు తిరిగి ఎందుకు పడిపోయావు “అడిగింది.. అప్పుడు ఆ అబ్బాయి నేను ఒక అనాధ నని చెప్పాడు . తనకున్న కష్టం అంతా చెప్పాడు.అప్పుడు ఆ పెద్దావిడ
” అయ్యో పాపం ,జరిగినదంతా ఒక పీడ కలలా మర్చిపోయి నువ్వు నాతో వస్తే, నేను నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను .పాఠశాలలో మంచి చదువు చదివిస్తాను.ఇంకా నువ్వు సంతోషంగా బ్రతుకచ్చు “అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళింది.
అతను ఆ పెద్దావిడ తో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాడు. పెద్దావిడ రాజు ను పాఠశాలలో చేర్పించింది.కొన్ని సంవత్సరాలలో అతని జీవితం మారిపోయింది.తరగతిలో ఎంతోమంది స్నేహితులు పరిచయమయ్యారు.ఆ అబ్బాయిని పెద్దావిడ తల్లి లా పెంచుతుంది. ఇప్పుడు అతను అనాధ కాదు.
***
పర్స మౌనిక
8 వ తరగతి
ZPHS జక్కాపూర్
సిద్దిపేట జిల్లా, తెలంగాణా
సెల్ :9989488156
గీతా, ఎక్కడున్నవు? నా మెడిసిన్ కొరకు నువ్వు మెడికలం షాపుకు త్వరగా వెళ్ళి రావాలి, రా, నా దగ్గరికి, అని గీత తాతగారు గీతను పిలిచాడు. గీత ఎక్కడ ఉండింది? ఆమె ఓ పుస్తకం చదువుతూ బెడ్లో ఉండెను. చాలాసేపు వరకు ఆమె ఏమి విననట్టు నటించింది. ఆ పుస్తకం చాలా ఉద్రేకపరిచేట్టు ఉండెను. దీనికి తోడు బయట చాలా వేడిగా నుండెను, అందుకు ఆమె బెడ్ నుండి కదలదలచుకోలేదు.
గీతా! ఈసారి తన తల్లి మాట కూడా వినవచ్చింది రమ్మన్నట్లు. అమ్మాయి ఒక నిట్టూర్పు తీసి బెడ్ నుండి బయటికి వచ్చి ఏం కావలెనో తెలుసుకోదలచింది. ఆమె తాతగారు కొంత డబ్బు చేతిలో పెట్టి, తనకు చాలా తలనొప్పి బాధ ఉదయం నుండి ఉందని చెప్పాడు. నాకు ఈ మందులు తేగలవా? అన్నాడు.
గీత డబ్బులు తీసుకొని మెడికల్ స్టోర్ వైపు వెళ్లింది. దారిలో ఒక స్పీట్ షాపు పక్క నుండి వెళ్ళుతుండెను. ఓహ్, ఏం చెప్పాలి, ఎంతమంచి గులాబ్ జామున్, లడ్డూలు, జిలేబిలు ఘుమ ఘుమ వాసనలు. ఆమె కొన్ని తీసుకోదలచింది. ఆమెకు చెప్పిన పని మరిచిపోయి షాపులోకి వెళ్ళి స్వీట్లను తీసుకొని తన ఒడిలో పెట్టుకోసాగింది. అప్పుడే ఓ ఫ్రెండు అటు వచ్చి ఈమెతో కలిసింది. ఆ ఇద్దరు అమ్మాయిలు స్వీట్లు తిని చాలాసేపువరకు మాట్లాడుకున్నారు. గీత తన దీన తాతగారి తలనొప్పి గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చిన పని జ్ఞాపకం వచ్చేవరకు మధ్యాన్న నుండి సాయంత్రం అయి మెడికల్ షాపు ఆ రోజుకు మానేశారు. ఆమె ఇంటికి త్వరపడిపోయిందో, తన తాతగారు ఎంతో బాధపడినాడు. ఎప్పుడు పెద్దదానివి మరియు బాధ్యత రాలువు అవుతావు గీతా అని అతను నిట్టూర్చి అడిగాడు.
గీతా వాస్తవంగా చాలా బాధపడింది, కాని తన పద్ధతులు మార్చుకుందా? లేదు. ఆమె ఎప్పటిలాగే మతిమరుపు మనిషి. ఎప్పుడైతే ఆమె తల్లి బయట ఆరేసిన బట్టలు తెమ్మందో, ఆమెకు మరుసటి రోజు ఉదయాన జ్ఞాపకం వచ్చింది. అప్పటివరకు రాత్రంతా కురిసిన వానకు బట్టలు తడిసి ముద్దయినాయి. మరొక రోజు తన చెల్లెలుకు లంచ్ బాక్సు స్కూలుకు తీసుకపోవలసియుండె. దారిలో సర్కస్ డేరాలను చూసింది. ఉదయమంతా సర్కస్ టెంటు చుట్టు తిరుగుతూ జంతువులు తినగా మరియు అవి చేయవలసిన పాత్రలకు జరిగే ట్రేనింగ్ కుతూహలంగా చూస్తూ గడిపింది.
కేవలం తనకు ఆకలి అయినపుడే తన చేతిలోని బాక్సు చూసి తన చెల్లెలు స్కూలులో దినమంతా ఏమీ తినకుండా ఇల్లు చేరి ఉంటుందని అనుకుంది.
ఇంకకసారి తన తండ్రి పనికి పోయే తొందరలో షర్టు ఇస్తే చేయమని గీతకు చెప్పిండు. గీత షర్టు తీసుకని వేడి ఇస్తీపెట్టె దగ్గర పెట్టింది. ఇంతలో బజారులో పెద్దవి రుచికరమైన మామిడి పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్మేవాడి కూత వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి పండ్లు ఏరడం మదలు పెట్టింది. ఇంతలో షర్టు కాలుతున్న వాసన వచ్చింది. ఆ రోజు తండ్రి చాలా విచారపడినాడు.
ఈ సంఘటన తరువాత కొన్ని రోజులకు స్కూలు నుండి వచ్చి మరుసటి రోజు స్కూలు నుండి పిక్ నిక్ వెళ్ళగలమని చెప్పింది గీత. పిక్ నిక్ కు వెళ్ళేటప్పుడు తలా ఒక అయిటమ్ తీసుకెళ్ళాలని, తను సాంబారు తేగలనని నిర్ణయించింది. తన తల్లి మంచి రుచికరమైన సాంబరు చేస్తుందని తన ఫ్రెండ్సు బాగా సంతోషిస్తారని అనుకుంది. తల్లి పెద్ద కుండలో సాంబరు చేస్తానని ఒప్పుకుంది. గీత రాత్రి సంతోషంగా పడుకుంది, మరునాటి మంచి పిక్ నిక్ రోజు బాగుంటుందని ఊహిస్తూ.
మరుసటి రోజు ఉదయం తల్లి త్వరగా లేచి సాంబారు చేయడం మొదలు పెట్టింది. ఆమె పప్పు ఉడకపెట్టింది. కూరగాయలు, కొబ్బరి మరియు అన్ని మసాలాలు వేసి కుండను మండే స్టౌపై పెట్టింది. గీత బెడ్ లో ఉన్నపుడే మంచి ఘుమ ఘుమ వాసన రాబట్టింది. గీత కదలికలను చూసి, నా ప్రియమైన గీతా లేవమ్మా ఇప్పుడు. చూడు, సాంబారు దాదాపు కావచ్చింది. నేను గుడికి పోతున్నాను, కాబట్టి కొద్దిసేపు అయ్యాక ఐదూ స్పూన్ల ఉప్పు దాంట్లో వెయ్యి. మరిచిపోకు ఇప్పుడు. లేచి త్వరగా తయారుగా అంది.
తిట్లు అనుకుంటూ హడావిడిగా ఆమె వెళ్లిపోయింది. గీత నాయనమ్మ ఎవరైతే వంట గదిలో వుండెనో. అదంతా విన్నది మరియు తనలోనే తానే అనుకుంది, తన కోడలు ఎప్పుడు గీత మతి మరుపు పిల్ల అని తెలుసుకుంటుందో యని. నాకు గట్టి నమ్మకం ఉంది, ఆ అమ్మాయి ఉప్పు వేయడం మరిచిపోతుందని. అప్పుడు అమ్మాయిని ఆమె ఫ్రెండ్సు ఆట పట్టిస్తారు. జాగ్రతగా ఉండటమే మేలు అనుకుంటూ వెళ్ళి కుండలో ఉప్పు కలిపింది.
గీత తాతగారు వరండాలో కూర్చొని వార్తా పత్రిక చదువుతుండేది. అతనికి గీత తన తల నొప్పికి మెడిసిన్ తెమ్మని పంపుతె ఆమె మరిచి పోవడం తను బాగా తలనొప్పితో బాధపడటం జ్ఞాపకం ఉంది. గీత ఏదైన జ్ఞాపకం ఉంచుకోవడమే? అది కాని పని, అని తనలో తానే ్నుకుంటు వంట గదిలోకి వెళ్ళి సాంబరులో ఉప్పు వేశాడు.
గీత చెల్లెలు తల దువ్వుకుంటుండెను. స్కూలుకు పోయేందుకు తయారు అవుతూ ఆమెకు గుతా గీత లంచ్ బాక్సు తేవడం దారిలో సర్కస్ డేరాలు చూస్తూ మరిచిపోయి తను ఆ రోజు ఆకలితో ఇల్లు చేరడం బాగా జ్ఞాపకం ఉండింది. గీత ఉప్పువేయడం తప్పక మరిచిపోయే ఉంటుంది, దానితో తన స్నేహితురాళ్ళు నవ్వుతారు. అనుకుంటూ తను త్వరగా వంటగదిలకి వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు సాంబరులో కలిపింది.
గీత తమ్ముడు పండ్లు తోముకుంటూ తల్లి తన అక్కకు చెప్పిన మాటలు ఉప్పు గురించి తప్పక మరిచే ఉంటుంది. అతను కిచెన్ లోకి వెళ్ళి కొన్ని స్పూన్ల ఉప్పు కుండలో వేసి వెళ్ళిపోయాడు.
గీత తండ్రి బహు జాగ్రత్తగా తన షర్టును ఇస్త్రీ చేసుకుంటుండెను. అందరి వలె అతను కూడా కిచెన్ లోకి వెళ్ళి సాంబారు కుండలో ఉప్పు వేశాడు.
ఇప్పటికి గీత లేచింది, ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఉప్పు వేయడం ఆమెకు జ్ఞాపకం ఉండింది. అందుకు ఆమె కూడా వెళ్ళి ఐదు స్పూన్ల ఉప్పు తల్లి చెప్పినట్లు కలిపింది.
ఇప్పటివరకు తల్లి వచ్చి సాంబారు ఒక కంటే నీరులో పోసింది. దాన్ని తన కూతురుతో పిక్ నిక్కు పంపించింది.
పిక్ నిక్ ప్రాంతంలో పిల్లలు బాగా సంతోషంగా ఆడుకున్నారు కొంతసేపు. కాబట్టి ఇక ఏమి చేయలేక ఆకలితో ఉండిరి. ప్లేట్లు, స్పూన్లు బయటికి తీశారు. కంటెనర్సు పదార్థాలతో నిండి వుండెను. ప్లేట్లలో రైసు, చట్నీలు, కూరలు, పూరీలు, మరియు తీరు తీర్ల మిఠాయిలతో నిండిపోయినవి. అందరు ఎక్కువ ఎక్కువ గీత చేతితో సాంబారు పోయించుకున్నారు. కాని ఒక స్పూను నోట్లో పెట్టుకున్నారో లేదు, హా, హా, నీళ్లు, నీళ్లు అని మొత్తుకోవడం మొదలయింది. ఆశ్చర్యపడింది. గీతకు ఏమైందో తెలుస్తలేదు. అల్లం వాసన రైసం మరియు సాంబరు తన ప్లేటుతో వచ్చిన కూలి. అది చాలా అయిష్టంగా ఉండెను. అది తన తల్లి సముద్రంలోని ఉప్పంతా సాంబరులో వేసినట్లు తోచింది. అప్పుడు గీతకు జ్ఞాపకం వచ్చింది. తన తల్లి ఉప్పు కలుపలేదు, తనే కల్పింది. అయితే ఎక్కడ తప్పు జరిగింది?
ఆ రోజు గీత ఇంట్లో అందరు ఆతురతతో గీత స్కూలు నుండి వచ్చి సంతోషానికి బయటికి వెళ్ళిన సమాచారం కొరకు ఎదిరి చూస్తుండేది. కాని ఇదేమిటి? ఆమె చాలా అలసిపోయినట్లు, ఆమె ముఖం రంధితో మరియు కన్నీరు పెట్టుకున్నట్లు కనిపించింది. ఏం జరిగింది? గీత వారిమీద అరిచింది, ఇంకెవరయిన సాంబరులో ఉప్పు వేశారా?
నేను వేసిన, నాయనమ్మ అంది
నేను వేసిన, తాతగారు అన్నారు
నేను వేసిన తండ్రిగారు అన్నారు
నేను కూడా అన్నాడు తమ్ముడు
మరియు నేను అంది చెల్లెలు.
భయంతో అందరూ ఒకరి ముఖం చూసుకుంటూ కూర్చున్నారు. గీత రంధితో ఉండటం ఆశ్చర్యం కాదు. ఆమె ఫ్రెండ్సు ఆమెను సాంబరులోని ఉప్పు గురించి హేళణ చేసి యుండవచ్చు!
‘’మీరంతా అలా ఎందుకు చేశారు? అమ్మనా ఒక్కతికే గదా చెప్పంది’’ అని ఏడ్చింది గీత.
ఓహో ప్రియమైన గీత, నీకు ఏది చేయమని చెప్పినా మరిచిపోతవు గదా అని, ఈసారి కూడా మరిచిపోతావని, అనుకొని… అందరు విచారం వ్యక్తపరిచారు.
ఇప్పుడు తల్లి గీతను దగ్గరకు తీసుకని కన్నీరు తుడిచి నీవు ఏదైనా నాల్గు సార్లు జ్ఞాపకం చేయండి మరిచిపోగలవని ఇట్లు జరిగింది. ఇక ముందు జాగ్రతగా వుంటానని వాగ్ధానం చెయ్యి. మేమంతా నీవు నీ పనులు సక్రమంగా చేయగలవని నమ్ముతాము.
గీత ముక్కు చీదుకని, సరేనని తల ఊపింది. అటు తరువాత తమ తమ పనులు చాలా జాగ్రతగా చేసుకుంటుండేది. ఎంతో సదిరి చెప్పాక తన ఫ్రెండ్సు తన ఇంటికి ఒక నాడు లంచ్ కు వచ్చారు. తల్లి చేసిన రుచికరమైన సాంబరుతో లంచ్ బాగా ఆరగించి, ఇంత రుచికరమైన సాంబరు అన్నం ఎన్నడు తినలేదని ఒప్పుకున్నారు. అందరూ బాగా ఆనందించారు.
రచయిత రెండు మాటలు
మా నాయనమ్మ క్రిష్ణ, అందరు కిష్టక్క అని పిలిచేవారు. ఆమె చాలా తెలివయినది మరియు చాలా దయగలది. ఆమె కథలు గొప్పగా చెప్పేది కూడా ఆమె మాకు ఎప్పుడూ నీతులు చెప్పేది కాదు. కాని జీవిత విలువలను కథల రూపంలో చెప్పేది. మేము చిన్నపుడు చాలా ఫ్రీగ కుటుంబంలోని తోటి అమ్మాయిలతో మరియు తాతయ్య, నాయనమ్మలతో ఉత్తర కర్నాటకలోని హడావిడి లేని నగరం షిగాన్ (Shiggaon), లో ఉంటిమి. ఏదైన మేమందరం సంతోషంగా పంచుకునేవారము. మా అందరి కలయికకు మా నాయనమ్మే మూలం (Binding force). నాయనమ్మ చెప్పిన కథల ప్రభావం నా మీద ఇప్పటికి ఉంది. ఏవో చిన్న చిన్న మార్పులతో ఈ కథల పుస్తకం వ్రాశాను. కానీ చాలావరకు వాటి ప్రభావమే.
ఎప్పుడైతే నా మనుమరాలు క్రిష్న పుట్టిందో ఆమె నన్ను అమ్మమ్మ స్థాయికి లేపింది. నేను అన్నీటికన్న కథల విలువ ఎక్కువని గ్రహించాను. అవి పిల్లల విజ్ఞానం పెంపుదలలో ఎంతో సహాయపడుతాయి. అందుకే ఈ పుస్తకం.
ఈ కథలు పిల్లలు, తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మలు మూడుతరాలవారు ఒకరితో ఒకరు ప్రేమతో కలిసి ఉండేందుకు దోహదపడుతాయి.
పెంగ్విన్ బుక్స్ ఇండియా నా పుస్తకాల ప్రచురణకు ఉత్సాహం చూపుతున్నందుకు ధన్యవాదాలు. నేను సుదేశ్నా షోం ఘోష్ కు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆయన నాకు గత పదేండ్లలో కథలు రాయడంలో ఎడిటర్ గాక మంచి మిత్రుడయినాడు.
సుధామూర్తి
బెంగళూరు
మనిషికి బాల్యం పునాది వంటిది. పిల్లలు కదా వారికి ఏమి తెలుసు అని అనుకోవడం పొరపాటు. వారి పరిశీలన , అవగాహన లోతుగా ఉంటుంది. బాల్యం లో ఏర్పడిన అభిప్రాయాలు, అభిరుచులు, మనిషి వయసుతో పాటు పరిణతి చెందుతుంటాయి. అందుకే వారికి చిన్న వయసులోనే అంటే మూడేళ్ళ వయసు లోపే ఏది , మంచి , ఏది చెడు అనేది చెబుతుండాలి. ఆ వయసులోనే వారి అభిరుచులు ఏమిటో తెలుసుకోవచ్చు . ఈ దిశగా పెద్దలు పిల్లలను అవగాహన చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలి. అంతే కాకుండా. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమం లో పిల్లల మానసిక ఎదుగుదల కూడా పెరిగింది. వారు ఎంత వేగంగా ఆలోచిస్తున్నారు గమనించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
అదే విధముగా రచయితలూ కూడా తమ రచనల్లో మార్పులు తీసుకు రావాలి. బాల్యం లోనే సృజన అమోఘంగా ఉంటుంది. దాన్ని పదును పెట్టడానికి పెద్ద్లు కృషి చేయాలి . కానీ మీరు అనుకున్నది వారు చేయాలి. మీరు చెప్పింది వారు వినాలి అనే ధోరణి ఉంటే వారు రెంటికి చెడ్డ రేవడిగా మారి పోతారు. వారి ఆలోచనలు మారుతున్న కాల పరిస్థితులను అవగాహన చేసుకుని పెద్దలు కూడా తమ రచనల్లో మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు చందమామ , బాల మిత్ర కథలు కాదు ఈ తరానికి తగిన రచనలు చేయాలి. ప్రపంచ బాలలతో పోటీ పడి ఎదగాలంటే బాల సాహితీ వేత్తలతో పాటు ప్రభుత్వాలు, సమాజ ఆలోచనల్లో తగిన మార్పు రావలసి వుంది.
ఇలా పెద్దల్లో మార్పు వస్తే భావితరానికి బంగారు బాట వేసిన వారమవుతాము.
ప్రతి ఏటా ఉపాధ్యాయులకు , రచయితలకు కార్యశాలలు ఏర్పాటు చేయాలి. సమాజ ఆలోచనా విధానాలు కూడా మారాలి. మారుతున్న కాలం తో పాటు మనుషులు కూడా మారాలి. ఆ మేరకు పిల్లల ఆలోచనలకు అనుగుణంగా అవగాహన పెంపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలి , మొక్కు బడి ఆలోచనల నుంచి బయట పడాలి. రచనలు చేయడం ఒక్కటే సరిపోదు , మీరు రాసేది ఎందరు చదువుతున్నారు , ఎంతమందికి ఉపయోగ పడుతుంది ఆలోచించాలి. లేకుంటే మీ లక్ష్యం నెరవేరనట్టే .
కు ఈ వయసులో ఏది చెబితే అది అర్థం చేసుకుంటారు, అనుసరిస్తారు. లేకుంటే పెద్దలను చూసి అనుకరిస్తారు. చిన్నపిల్లలే కదా. అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. పెద్దల మనస్తత్వాలు, అలవాట్లు వారు నిరంతరం గమనిస్తుంటారు. పిల్లల పెంపకం విషయం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మారుతున్న కాలానికి అనుగుణంగా బాలల అభిరుచుల్లో, అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి మార్పులకు అనుగుణంగా పెద్దలలో కూడా మార్పు రావాలి. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. పరిసరాలు, జంతువులు , పళ్ళు , కూరగాయలు, చెట్లు, పూలు, .. ఇలా ఒక్కటొక్కటిగా పిల్లలకు చెబుతుండాలి , నడవడిక, మర్యాద, స్నేహం, మిత్రులు, బంధువులు ,దుస్తులు. పరిశుభ్రత తదితరాలను పరిచయం చేస్తుండాలి.
విదేశాల్లో పిల్లలకు పాఠశాలకు వెళ్లక ముందే. డే కేర్ కు పంపిస్తారు. అక్కడ ఇవన్నీ అలవాటు చేస్తారు. ఇంగ్లీష్ భాష కూడా బాగా వస్తుంది. ఐదేళ్ల కు స్కూల్ కు వెళ్ళగానే నేర్చుకోవడం సులువవుతుంది.
ఇక మనకు గతం లో చదివిన చందమామ, బాల మిత్ర, బొమ్మరిల్లు కథలు ఈ తరం పిల్లలకు నచ్చక పోవచ్చు . వారికి తగిన కథలు, అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం వుంది. వారు ఇష్టపడే మాధ్యమాల ద్వారా చెప్పాలి. మనం అనుకున్నట్టుగా వారు ఉండాలనుకోవడం తగదు. వారి అభిరుచులకు అనుగుణంగా చదువులు, ఉండాలి. ఈ విషయం లో మనం విదేశాల వారు అనుసరించే విధానాలను అధ్యయనం చేయవలసిన అవసరం వుంది. మన దేశం లో పిల్లల అభివృద్ధిని కాంక్షించే వారంతా భవిష్యత్ కు అందమైన రూపు రేఖలు దిద్దేవారే. కానీ అటు సమాజం, ఇటు తల్లి తండ్రులు, మరో వైపు ఉపాధ్యాయులు, రచయితలు బాల్యాన్ని విస్మరిస్తున్నారు. మరో మాటలో చెప్పాలం

కాలం తో పాటు మనుషులు, అవసరాలు, ఆలోచనా విధానాలు మారుతుంటాయి. అదే విధానంగా ఈ తరం బాలల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది. కానీ వారి అవసరానికి సరిపడా వనరులు లేవు. ఈ మధ్య కరోనా వలన పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వచ్చింది. మరి వారి కోసం ఎవరు ఏమి ఆలోచిస్తు
ప్రస్తుతం బాల సాహిత్య రచనలు చేసే వారు కేవలం తమకు పేరు రావాలని, అవార్డులు కావాలని రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ఇంగ్లీష్ లో ఆర్కే నారాయణ్, మార్క్ ట్విన్ వంటి వారి పుస్తకాలు ఎవరైనా చదివారా. ఎక్కడో జె. కె. రోలింగ్ లండన్ లో ఉంటూ హరీ పాటర్ పుస్తకాలు రాస్తే హైదరాబాద్ లో క్యూ ల్లో నిలబడి పుస్తకాలు కొనుగోలు చేసిన సంఘటనలు వున్నాయి కదా.మరి పిల్లలను ఆకట్టుకునే రచనలు ఎందుకు రావడం లేదు.
తెలుగు బాల సాహిత్యం లో రాసి పెరుగుతుంది కానీ వాసి ఉండటం లేదు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రభావం మరింత పెరిగితే తెలుగు బాల సాహిత్యం మనుగడ కష్టం.
ఈ విషయం లో నిజాయితీ గల బాల సాహితీ వేత్తలు ముందుకు వచ్చి ఒక కార్యాచరణ రూపొందించు కోవాలి. పాత కథలను ఆధారం చేసుకుని పిల్లలకు అర్థం అయ్యే రీతిలో మార్చి రాయాలి, ఈ తరం పిల్లలు ఇష్టపడే రచనలు చేసి వారిని ఆకట్టుకోవాలి . అందరు కలిసి కట్టుగా ముందుకు వచ్చి మంచి సాహిత్యం కోసం కృషి చేయాలి, అలాంటి వారిని, సమాజం, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
|
ReplyForward
|
అనగనగా రామాపురం అనే ఊరిలో రాధమ్మ అనే స్త్రీ ఉండేది .ఆమె చాలా మంచిది,తెలివైనది. ఆమె భర్త పేరు గోపాల్. అతడు చాలా మంచివాడే కానీ అహంకారం ఎక్కువ. అతడు బ్యాంకులో పని చేస్తూ ఉండేవాడు. వారు ఇద్దరికీ నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు. వారి పేర్లు. రవి, ఆనంద్, ఊర్మిల, శృతి. ఆనంద్ వాళ్ళ అమ్మ పోలిక. కాబట్టి అతడు చాలా మంచివాడు. కానీ ఆనంద్ కు కోపం ఎక్కువ. తనముందు తప్పు జరిగితే అక్కడికక్కడే వారిని శిక్షిస్తాడు.అతనికి అమ్మ మీద ప్రేమ ఎక్కువ. రవి,ఊర్మిల, శృతి వాళ్ళ నాన్న పోలిక కాబట్టి వారికి అహంకారం ఎక్కువ. రవి రాధమ్మ మీద ఎప్పుడూ కోప్పడుతూ ఉండేవాడు. తను మంచి చెప్పినా చెడు చెప్పినట్లుగానే అర్థం చేసుకునేవాడు. రవి ఎప్పుడూ రాధమ్మను తిడుతూనే ఉండేవాడు. ఆ మాటలకు రాధమ్మ చాలా బాధపడేది. ఊర్మిల తనకు ఎవ్వరూ సరిలేరు అంటూ గర్వపడుతూ ఉండేది. తను రాధమ్మతో తల్లి అని కూడా చూడకుండా తనతోనే అన్ని పనులు చేయిస్తూ ఉండేది. రాధమ్మ తనకు గర్వపడడం తప్పు అని చెప్తున్నా కూడా తను వినిపించుకునేది కాదు. ఊర్మిల ఏదైనా తప్పు చేసినా రాధమ్మ మీదకు నెట్టేసేది. ఇంట్లో వాళ్ళందరూ రాధమ్మను అవమానించేవారు. ఆ తిట్లు విని ఊర్మిల సంతోషించేది. రాధమ్మ తనలో తాను కృంగిపోయేది.
శృతి చాలా బద్ధకస్తురాలు.తను ఎప్పుడూ బయటనుండి ఏదైనా ఆహారం తెప్పించుకుని తింటూనే ఉండేది. తను ఎంత తినేదంటె రోజూ సుమారు ₹2000/-దాకా తిండి కోసం ఖర్చు చేసేది. రాధమ్మ తనకు“అమ్మా శృతి అలా తినవద్దు అమ్మా”,అని చెప్పినా వినిపించుకునేది కాదు. పైగా తను దొంగచాటుగా తినేది ఎందుకంటే గోపాల్ తను తినడం చూస్తాడని. ఒకవేళ గోపాల్ చూస్తే శృతి“నాన్న!నన్ను ఇవన్నీ అమ్మ తినమని చెప్పింది”,అని చెప్పేది. గోపాల్ ఆ మాటలను నమ్మి రాధమ్మను తిడతాడు. శృతి మాత్రం అమాయకురాలిగా నటిస్తూ ఉండేది. రోజూ ఇలా గొడవ జరుగుతుండడంతో ఇరుగు-పొరుగు వాళ్ళు గోపాల్ ఇంటికొచ్చి“మీరిలా గొడవ పడితే మా పిల్లలకు నిద్ర పట్టడం లేదు కాబట్టి మీరు గొడవ పడకండి”,అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ విషయంలో కూడా గోపాల్ రాధమ్మదే తప్పు అన్నట్లు రాధమ్మను తిడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ అలాగే జరుగుతుండేది. రాధమ్మ ఇవన్నీ చూసి“నేనెవ్వరికీ అవసరం లేదు”,అని అనుకుంటూ బాధపడేది. రాధమ్మ తన పిల్లలెవ్వరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా తను వారికి సేవ చేసి మామూలు స్థాయికి తీసుకొచ్చేది. కొన్ని రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం వచ్చింది. ఆనంద్ చాలా బాధపడుతూ ధైర్యం చెబుతున్నాడు. ఆనంద్ గోపాల్ దగ్గరకు వచ్చి“నాన్న అమ్మకు జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి”,అంటూ కంగారుగా చెప్పాడు.గోపాల్ వినలేదు. ఎందుకంటే తనకు మాధవపురం అనే ఊరికి బదిలీ చేశారు. ఆనంద్ ఏడుస్తూ ఉన్నాడు. గోపాల్ అక్కడి నుండి మాధవపురానికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కు ఏం చేయాలో తెలియక శృతి,ఊర్మిలల దగ్గరకు వెళ్ళాడు వారు నిద్రపోతున్నాడు. ఆనంద్ ఎంత నిద్ర లేపినా వాళ్ళు లేవలేదు. ఆనంద్ తన అన్నయ్య అయిన రవి దగ్గరకు వెళ్ళాడు. తను కూడా నిద్ర పోతున్నాడు. ఆనంద్ తనను లేపి జరిగిందంతా చెప్పి“అన్నయ్య! డాక్టర్ కు ఫోన్ చేయి అన్నయ్య,”అని వేడుకున్నాడు. రవి కోప్పడుతూ“జ్వరం మాత్రమే కదా వచ్చింది రెండు రోజులైతే అదే తగ్గిపోతుంది”, అనన్నాడు. ఆనంద్ బాధపడుతూ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి డాక్టర్ నంబర్ తీసుకుని, డాక్టర్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. కొద్ది సేపుతర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి రాధమ్మను చూసి“పని ఎక్కువగా చేయడం వల్ల ఈ జ్వరం వచ్చింది”,అని చెప్పింది. మందులు ఇచ్చి డబ్బులు అడిగింది. ఆనంద్ తను రాధమ్మ ఇచ్చి దాచిపెట్టుకోమన్న డబ్బులను ఇచ్చాడు. డాక్టర్ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళింది. ఆనంద్ డాక్టర్ ఇచ్చిన మందులను రాధమ్మకు వేసాడు. తను పడుకుంది. రవి, ఊర్మిల, శృతిలు నిద్రలేచి పాలు, బూస్ట్, హార్లిక్స్ అంటూ గట్టిగా అరిచారు రాధమ్మ ఆ మాటలు విని వెంటనే లేచి ఆనంద్“లేవొద్దమ్మా!”,అని చెబుతున్నా వినకుండా పాలు, బూస్ట్, హార్లిక్స్ సిద్ధం చేసి వారి దగ్గరకు వెళ్ళి పాలు, బూస్ట్, హార్లిక్స్ ఇచ్చింది. ఊర్మిల, శృతి లు బూస్ట్, హార్లిక్స్ తాగుతంటే రవి మాత్రం పాలు తాగి“జ్వరం వస్తే ఆలస్యంగా తీసుకొస్తారా?!”,అంటూ గట్టిగా అరిచాడు. రాధమ్మ ఏడుస్తూ రవి గదిలో నుండి వెళ్ళిపోయింది.కొద్ది రోజుల తర్వాత రాధమ్మకు జ్వరం తగ్గింది.గోపాల్ మాధవపురంలో బ్యాంకులో పని చేస్తుండగా రాజు అనే వ్యక్తి వచ్చాడు.అతడు ఒక రౌడీ అతడు చాలా చెడ్డవాడు. అతడు గోపాల్ దగ్గరకు వచ్చి అప్పు కావాలని అడిగాడు. గోపాల్ పక్కనే ఉన్న ఒక వ్యక్తి“ఇదిగో గోపాల్ గారు! ఇతని పేరు రాజు ఇతను చాలా చెడ్డవాడు,ఇతనొక రౌడీ,”అని మెల్లగా చెప్పాడు. గోపాల్ “రాజు గారు మీరు ఏ పని కోసం అప్పు అడుగుతున్నారు”,అని అడిగాడు. రాజు“ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా! ”, అంటూ బెదిరించాడు. గోపాల్ జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పమని అంగరక్షకుడికి సైగ చేశాడు. పోలీసులు వచ్చి రాజును తీసుకుబోతుండగా రాజు“రేయి గోపాల్!నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను,”అని బెదిరించాడు. గోపాల్ ఆ మాటలను విని కంగారుపడి తన పై అధికారులతో మాట్లాడి మళ్ళీ రామాపురాని బదిలీ చేపించుకున్నాడు. గోపాల్ ఇంటికొచ్చాడు. ఇంట్లో చూస్తే రాజు ఎప్పుడో వచ్చేశాడు. గోపాల్ లోపలికి వచ్చాడు. రాజు“రా గోపాల్! రా, జైలులో నుంచి ఎలా వచ్చాను అని అనుకుంటున్నావా, ఇదంతా నాకు మామూలే”,అని అన్నాడు. గోపాల్ “ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు?”,అని అడిగాడు. రాజు“నీ కుటుంబాన్ని చంపేయడానికి వచ్చాను”,అని అన్నాడు. గోపాల్ ను రాజు మనుషులు బంధించారు. ఆ సమయంలో రాధమ్మ వంటగదిలో వంట చేస్తుంది. ఆనంద్ లెక్కలు వ్రాస్తున్నాడు. రవి ఆట ఆడుతున్నాడు. ఊర్మిల టీ.వీ చూస్తుంది. శృతి తింటుంది. రాజు గోపాల్ పిల్లల గదిలోకి వెళ్లి పిల్లలను లాక్కొచ్చి వారి మీద కత్తి పెడుతూ“నీ పిల్లలను నేను చంపేస్తాను”,అంటూ గట్టిగా అరిచాడు.ఆ అరుపులు విని రాధమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. రాధమ్మ బాబు! నీకు దండం పెడతాను, వయసులో నీకంటే పెద్దదాన్ని అయినా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను,నా పిల్లలను వదిలేయి”,అని వేడుకుంది.రాజు వినకుండా కత్తితో పొడుస్తుండగా రాధమ్మ అడ్డుగా వచ్చింది. కత్తి రాధమ్మకు బలంగా గుచ్చుకుంది.రాధమ్మ క్రింద పడింది. అందరూ కంగారు పడ్డారు. రాజు శృతిని పొడవబోతుండగా గోపాల్ రాజును కిందకి తోసాడు. కత్తి రవికి గుచ్చుకుంది రవి కూడా కింద పడ్డాడు. రాజూకి బల్ల తాకి క్రింద పడ్డాడు. గోపాల్ రాజు మనుషుల నుంచి తప్పించుకుని రాధమ్మను, రవిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. రవికి ముందే రక్తం చాలా తక్కువ. డాక్టర్ వచ్చి“గోపాల్ గారు రవికి రక్తం ఎక్కించాలి”,అని చెప్పింది. గోపాల్ కు మిగతా వారికి రవి యొక్క రక్తం లేదు. రాధమ్మ స్పృహలోకి వచ్చింది. డాక్టర్ జరిగిన విషయమంతా రాధమ్మకు చెప్పింది. రాధమ్మ వద్దన్నా వినకుండా రవికి రక్తం ఇచ్చింది. కొన్ని గంటల తర్వాత రవి స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ జరిగిన విషయమంతా రవితో పాటు అందరికీ చెప్పింది. అందరూ కొన్నేళ్లుగా చేసిన తప్పులను తెలుసుకుని రాధమ్మకు క్షమాపణలు చెప్పారు. రాధమ్మ సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత అందరూ ఇంటికొచ్చారు.రవి రాధమ్మ మీద కోప్పడడం మానేశాడు. ఊర్మిల గర్వపడడం మానేసి తల్లిని గౌరవించడం మొదలుపెట్టింది. శృతి ఎక్కువగా తినడం మానేసి తల్లిమాట వింటుంది. గోపాల్ కూడా తనను అర్థం చేసుకున్నాడు. అలా కుటుంబం అంతా సంతోషంగా ఉంది.
నీతి:అమ్మ ఏం చెప్పినా అది మన
మంచి కోసమే. కాబట్టి అమ్మ
ఏం చెప్పినా వినాలి.
శ్రీరామచంద్రమూర్తి
శ్రీ గురుభ్యోన్నమః. సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల శ్రీ రంగ సిద్ధార్థ. నేను ఎనిమిదో తరగతి, ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, గుడవల్లేరు, విన్నకోట గ్రామము, కృష్ణాజిల్లా, ఆంధ్రపదేశ్ నుండి వచ్చాను. నేను ఈరోజు రామాయణంలోని శ్రీరామచంద్రమూర్తి పాత్ర గురించి చెప్పబోతున్నాను.
మనిషి ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు ఎంత గొప్పవాళ్లు అవుతారో యుగాలు మారిపోయిన శ్రీ రామచంద్రమూర్తి యొక్క జీవిత వృత్తాంతం నేటికీ పసిపిల్లలకు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా చెప్పబడుతోంది. అందులోని పాత్రలు, స్వభావాలు నేటి మానవాళికి మచ్చు తునకలు.
రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్. అయోధ్య నగరానికి రాజయిన దశరథ మహారాజు, కౌసల్యదేవిల పుత్రుడు, శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఒక రాశి భూతమైన ధర్మము. ఆయన సత్యము చేత లోకాన్ని గెలిచాడు. శుశ్రూష చేత గురువులను గెలిచాడు. తన యొక్క దాన గుములతో దీనులను గెలిచాడు. శ్రతువులను తన యొక్క పౌరుష పరాక్రమాలు చేత గెలిచాడు. ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు. ఇలా 16 గుముల కలయికతో నరునిగా నడయాడిన పరిపూర్ణ అవతారఁ శ్రీరామావతారం. బుద్ధి, సాత్వికత, మధురమైన భాష, నిరాడంబర జీవితం, నిర్మలమైన మనస్సు తత్వం, నిస్వార్థత, మితభాషి, నిగర్వి, ఏకపత్నీవ్రతుడు, పరాక్రమవంతుడు, సదాచారాము పాటించేవాడు, సమయస్ఫూర్తి కలవాడు, పిత్రు ఆజ్ఞాపరిపాలకుడు, గురువు మాట శాసనం, తండ్రి మాట శిలాశాసనంగా భావించేవాడు, ఇన్ని సుగుణాలను మకుటంగా ధరించి ప్రజారంజకంగా పాలించి రామ రాజ్యంగా పేరొందిన శ్రీరామచంద్రమూర్తి గురించి మూడు నిమిషాలు కాదు మూడు గంటలు చెప్పినా చాలదు.
శ్రీరాముని గురిఁచి నేను మీకు ఇచ్చే సందేశం
ఒకటవ తరగతి నుండి ఐఏఎసం, ఐపీఎసంవరకూ రామాయణాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి.
రాముని నమ్ముకున్నవారికి అంతా విజయమే ఉదాహరణకు హనుమంతుడు.
రాముని ఆశ్రయించిన వారు కీర్తిని, ఉత్తమ గతులను పొందుతారు. ఉదాహరణకు జటాయువు పక్షి.
ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
ఇంతటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారములు. ధన్యవాదములు తెలుపుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగ్రదక్ష.
జై శ్రీరామ్
