తరుణి యూట్యూబ్ చానెల్ ను చూడండి, మీరు తప్పకుండా నచ్చుతారు. తొలి ప్రయత్నం ఇది . మీ సహకారం అందించండి. ఈ చానెల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి, షేర్ చేయండి !థాంక్యూ – డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు .
ఇంద్రధనుస్సు
“సు”- మంచి , “లక్ష్య ” – లక్ష్యం
ట్యాగ్ లైన్ – సర్వే సుజనా సుఖినోభవంతు
నేపధ్యం :
2008 – 2013 వరకు వివిధ సేవా కార్యక్రమాలను చేసిన తరువాత ,ఈ కార్యక్రమాలన్నింటిని ఒక గొడుగు కిందికి తీసుకురావాలనుకొని అనుకున్నాం.
మన అభ్యున్నతికి కారణమైన ఈ సమాజానికి కొంతైనా తిరిగివ్వాలనే సదుద్దేశంతో మిత్రులమంతా ఒక బృందంగా ఏర్పడి ఉగాది పర్వదినాన ( ఏప్రిల్ 11 2013 ) న సులక్ష్య సేవా సమితి కి అంకురార్పణ చెయ్యడం జరిగింది. రానున్న ఉగాదికి ఒక దశాబ్దం పూర్తి చేసుకోబోతుంది.

ముఖ్య లక్ష్యాలు – చేపట్టిన కార్యక్రమాలు
అందరికి విద్య – ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కొరవడుతున్నాయి – ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత చాలా మంది కూలి – నాలి చేసుకునే తల్లితండ్రుల్లో లేదు . దీని వల్ల చాలా మందికి సరైన విద్య అందడం లేదు , కొంత మంది మధ్యలోనే చదువు ఆపేసి ఎక్కడో బాల కార్మికులుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు .
ఈ పరిస్థితిని కొంతైనా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. 1 . 2 లక్షలతో శ్రీ వ్యాస అవాసంలో గ్రంధాలయం ఏర్పాటు చెయ్యడం జరిగింది . 1 లక్ష రూపాయల విలువగల పుస్తకాలను వివిధ ఆశ్రమాల్లో ఇవ్వడం జరిగింది . ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు వారి ఫీజులు మరియు ఇతర అవసారాలకై ఆర్ధిక సహాయం సహాయం చెయ్యడం జరిగింది . వివిధ ఆశ్రమాల్లో స్కూల్ యూనిఫార్మ్స్, వారు చదువుకోవడానికి కావలసిన ఇతర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. వైద్యం – ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు . కానీ నేటి రోజుల్లో చాలా మంది జీవన విధానం వల్ల , ఆరోగ్య అలవాట్ల వల్ల, కల్తీ ఆహరం వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలైతున్నారు తాము సంపాదించే డబ్బులో ఎక్కువ భాగం వైద్యులకు , మందులకు పెట్టడమే కాక తీవ్ర అశాంతికి గురవుతున్నారు . అందుకే పాఠశాలల్లో , కళాశాలల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయం మీద సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .
కరోనా వ్యాధి ప్రబలి ప్రపంచమంతా స్తంభించిందినప్పుడు , ఫ్రంట్‌లైన్ వారియర్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడారు . వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని డాక్టర్లకు , ఆరోగ్య కార్యకర్తలకు,పోలీస్ సిబ్బందికి , పారిశుధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు రెండు లక్షల నలభై వేల విలువగల ఆరు వస్తువులతో కూడినటువంటి రెండు వేల సేఫ్ ఎనర్జీ కిట్లను అందివ్వడం జరిగింది .
అలాగే ఒక లక్షా ఎనభై వేల రూపాయల విలువగల మూడువేల పైగా మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసాము

పర్యావరణ పరిరక్షణ – వృక్షో రక్షతి రక్షితః , మట్టి గణపతులను ప్రతిష్టిద్దాం – పర్యావరణ పరిరక్షణకై పాటుపడడం , ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్య నివారణకై కృషిచేద్దాం .
వివిధ కారణాల వల్ల పర్యావరణం రోజు రోజుకి వినాశనం అయితున్నది. దీని వల్ల మనం అనేక సమస్యలకు గురవుతున్నాం . ఈ లక్ష్యంలో భాగంగా 1000 కి పైగా మొక్కలను వివిధ పాఠశాలలో , రోడ్లపై నాటడమేకాక వాటిని పెంచడం జరిగింది . అదే కాకా ప్రముఖ పర్యావరణవేత్త , కోటి మొక్కలు నాటిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత , వనజీవి దారిపల్లి రామయ్య గారితో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.
గత తొమ్మిది సంవత్సరాలుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చెయ్యడం జరిగింది . యువత సాధికారత – ఒక వంద మంది యువకులను ఇవ్వండి – భారత దేశాన్ని బలమైన దేశంగా మారుస్తా అని స్వామి వివేకానంద అన్నారు . భారత దేశంలో 65 % జనాభా యువకులే . ఇది మనకు చాలా పెద్ద ఆస్తి . కానీ అనేక మంది యువకులు సరైన అవగాహన లేక , చెడు అలవాట్లకు బానిసై , అవకాశాలు దొరకక , చదువుకునే స్థోమత లేక వారి గమ్యానికి చేరలేకపోతున్నారు .ఇందుకు గాను సివిల్ సర్వీసెస్ మరియు ఇతర పోటీ పరీక్షాలలో విజయం సాధించడం ఎలా , వ్యక్తిత్వ నిర్మాణం, ఒత్తిడిని అధిగమించడం లాంటి వివిధ అంశాల మీద పలు కళాశాలల్లో , పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది .కనీస అవసరాలు తీర్చడం – భారత దేశంలో ఒకవైపు అపర కుబేరులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే , కోట్లాది మంది పేదరికంతో మగ్గుతూ వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు .
నగరంలోని వివిధ ఆశ్రమాలకు నిత్యావసర వస్తువులు వితరణ చేసి తోడ్పాటు అందించడం జరిగింది . చలి కాలంలో నిరాశ్రయులకు , పేదవారికి , అనాధలకు , వృద్ధులకు వెచ్చదనం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 4 .8 లక్షల విలువైన 2400 బ్లాంకెట్ల్లను నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు , అనాధలకు , వృద్ధులకు పంపిణి చెయ్యడం జరిగింది . మేము చేసిన అన్ని కార్యక్రమాల్లో మాకు నిజంగా సంతృప్తిని ఇచ్చింది కరోనా మహమ్మారి ప్రబలినప్పుడు మా సంస్థ ద్వారా చేపట్టిన సహాయక కార్యక్రమాలు. ప్రజలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురైతున్న పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది మాకు జీవితాంతం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే అనుభవాన్ని మిగిల్చింది. ఈ అనుభవంతో ముందు ముందు ఇంకా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టే శక్తి మాకు కలగాలని మా ఆశ.

మా లక్ష్యాల్లో ఒకటైన కనీస అవసరాలు తీర్చటం లో భాగంగా గుడిసెల్లో నివసించే పేదవారికి , సంచార జాతులకు ,చెత్త సేకరించే కార్మకులకి , అనాధాశ్రమాలకి , వృద్ధాశ్రమాలకు , వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలిలకి , భవన నిర్మాణ కార్మికులు , పానీ పూరి బండి వాళ్ళు , గుత్తి కోయలకు, నేపాల్ నుంచి వచ్చిన గురఖాలు , అనాధ వృద్ధులు ,దినసరి కూలి కార్మికులు , తదితర వెయ్యి కుటుంబాలకు ఆరు లక్షల విలువగల పదమూడు వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్లను పంపిణి చెయ్యడం జరిగింది.
తమ స్వస్థలాలకు వెళ్లాలనే తలంపుతో ఎర్రటి ఎండలో వందలాది కిలోమీటర్స్ నడుస్తున్న వలస కార్మికుల గోసను దృష్ఠ్టిలో ఉంచుకుని వారికి రెండు లక్షల విలువ్ కల పన్నెండు వస్తువులతో కూడిన మైగ్రంట్ రెఫ్రెషమెంట్ కిట్లను వెయ్యి మందికి పంపిణి చెయ్యడం జరిగింది . అలాగే కొందరికి మా స్వంత ఖర్చులతో వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది .ప్రేమ , వాత్సల్యాలను పంచడం – అనాధ, వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారు తమ అనుకున్న వాళ్ళ ప్రేమను నోచుకోక నిరాదరణకు గురవుతుంటారు. వారికి కావలసిందల్లా ఆత్మీయ స్పర్శ , మేమున్నామనే భరోసా , వారితో సరదాగా గడిపేందుకు కొద్ది సమయం .
ఈ ఉద్దేశంతో సమయం దొరికినప్పుడల్లా అనాధాశ్రమాల్లో నివసిస్తున్న పిల్లలతో సమయం గడపడం, సినిమాలకు ( బాహుబలి, ఏషియన్ మాల్ లో ) , విహార యాత్రలకు తీసుకెళ్లడం ( రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్ , వేయి స్థంబాల దేవాలయం, జూ పార్క్ , సైన్స్ సెంటర్ , హైదరాబాద్ లోని వండర్ లా ) , హోటళ్ళకి తీసుకెళ్లి వారికి ఇష్టమైనవి తినిపించడం , ఆట వస్తువులు కొనిపెట్టడం , వారి పుట్టిన రోజులు జరపడం చేస్తుంటాము . వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వారికి సాంత్వన కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ మాతృదినోత్సవాలు , సంగీత విభావరులు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది .

డిగ్నిటీ అఫ్ లేబర్ – మన జీవనం సాఫీగా సాగుతుందంటే అందులో ప్రతి ఒక్కరి కృషి ఉంటుంది. కానీ డబ్బు , హోదా ఉన్న వాళ్లకు ఇచ్చే మర్యాద , గుర్తింపు కింది స్థాయిలో ఉండదు . అమెరికా లాంటి దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని ఎలా చూస్తారో , ఒక సామాన్య గుమాస్తాను కూడా అలానే చూస్తారు .
అందుకనే కింది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికులు మరియు ఇతర పనులు చేసే వారిని గుర్తించి , సత్కరించి వారికి కావాల్సిన సహాయం అందించడం జరుగుతుంది . సుపరిపాలనకై పాటుపడడం – భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశం ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉంది . అవినీతి , మత విద్వేషాలు , అవకాశవాద ధోరణి , లాంటి ఎన్నో సమస్యలు మనన్ని పట్టి పీడిస్తున్నాయి . అందుకనే వివిధ పాఠశాలల్లో , కళాశాలల్లో, ఓటు హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం , పౌరుడిగా మన హక్కులు లాంటి వివిధ విషయాల మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది .
భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించడం – యావత్ ప్రపంచానికి దిక్సూచిగా, దిశా నిర్దేశం చేసిన ఘనత మనది . కానీ యాంత్రిక జీవన విధానం వల్ల , మనం మన పురాణాలను , ఇతిహాసాలను రాబోయే తరాలకు అందివ్వలేకపోతున్నాం , మన చారిత్రిక కట్టడాలను పరిరక్షించుకోలేకపోతున్నాం. అందుకనే విద్యార్థులకు మన ఇతిహాస , పురాణాల గురించి తెలియచేసి , మన చారిత్రక కట్టడాల సందర్శనకు తీసుకువెళ్లడం జరుగుతుంది .
గ్రామీణ భారతంలో పరివర్తన తీసుకురావడం – ఇప్పటికి 65 % కన్న ఎక్కువ ప్రజలు పల్ల్లెలో నివసిస్తున్నారు . పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని నానుడి . కానీ ప్రపంచీకరణ తో పల్లెల్లో నివసిస్తున్న అన్నదాతలు ,ఇతర వృత్తి నైపుణ్యం గల వారు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు , ఇతర దేశాలకు వలస పోతున్నారు, అక్కడ కూలీలుగా వారి బతుకు బండిని నెట్టుకొస్తున్నారు . దీని వల్ల వారి జీవితాలు చీకటిమయం అవ్వడమే కాకుండా దేశ ప్రగతి కూడా స్తంభించి పోతుంది. అందుకనే పల్లెలకు వెళ్లి వాళ్లకు సేంద్రియ వ్యవసాయం , చేనేత , హస్తకళల లాంటి రంగాల్లో ప్రోత్సాహాం అందించి , వారిలో ఉన్న ఇతర నైపుణ్యాలను వెలికి తీసి వారికి కావలసిన సహాకారం అందించడం జరుగుతుంది .

భవిష్యత్ ప్రణాళిక
“ఎడ్యుకేట్ , ఎంపవర్ , ఎన్ లైటెన్” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో, కళాశాల విద్యార్థుల్లో మరియు యువతలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము .
మేము చేసే కార్యక్రమాలకు మొదటినుంచి ఆర్థికంగా సహకరిస్తున్న దాతలకు , మా గురించి కధనాలు ప్రచురిస్తున్న మీడియా ప్రతినిధులకు, మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాలకు విచ్చేస్తున్న అతిథులకు మా హృదయపూర్వక అభినందనలు .
మాకు పెద్ద మొత్తంలో సరకులను ఇస్తున్న వ్యాపారులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము
మా చిహ్నం
- భారతీయత ప్రతిబింబించేలా మన జాతీయ పతాకం లో త్రివర్ణాలను మాయా చిహ్నంలో వాడాము.
- మన రెపరెపలాడినట్టున్న మూడు “S ” లు సులక్ష్య , సేవ , సమితి ని స్ఫురించేలా పెట్టడం జరిగింది .
- మధ్యలో ఉన్న 4 మా ప్రధాన లక్ష్యాలకు సంకేతాలు .
- ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకుని ఉన్న చిత్రం “టీం వర్క్ ” కి సంకేతం , 11 మందిని పెట్టడానికి ఉద్దేశం , మన దేశంలో క్రికెట్ ని ఎంత ఆరాధిస్తారో , సమాజ సేవని కూడా అంతే ఆరాధించాలని చెపుతుంది




ముఖ్య సభ్యులు :
మండువ సంతోష్ , కౌశిక్ భూపతి. మండువ శివ సంపత్., బొల్లం రాహుల్, దేవులపల్లి జయంత్, కోడం వినయ్, సాయి కిరణ్, విష్ణు.
మరెంతో మంది మిత్రులు మంది మిత్రులు మాకు వెన్ను దన్ను గా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు .


కుటుంబ నేసథ్యం
పేరు : మండువ సంతోష్
తండ్రి : కీ. శే. మండువ వెంకట రమణ రావు
తల్లి : పసునూరి వెంకట రాఘవ శాంత , విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు
తమ్ముడు : మండువ శివ సంపత్ , అమెరికా లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్
విద్యార్హత : ఎంబిఏ , మార్కెటింగ్, కాకతీయ విశ్వవిద్యాలయం
సొంత ఊరు : పెగడాపల్లి ,హాసనపర్తి మండలం
ప్రస్తుత నివాసం : శ్రీనగర్ కాలనీ , హన్మకొండ
నిధుల సమీకరణ : మా కార్యక్రమాలను చూసి భాగస్వామ్యం అవ్వదలచిన కొద్ది మంది దగ్గరి మిత్రుల ద్వారానే నిధుల సమీకరించడం జరుగుతుంది . మేము చేసే కార్యక్రమాల వివరాలను మా పేస్ బుక్ పేజీ పేజీ మరియు వెబ్ సైట్ లో పొందుపరచటం జరుగుతుంది .
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
పల్లవి :
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ముందడుగే వేశారు ..
పదిమందికి జీవనమిచ్చారు
సేవే ధర్మాంగా ..
సేవే వేదంగా ..
మదితోనే చూసారు
సాయానికి ముందుగ నిలిచారు
అణగారిన బతుకుల్లోనా
ఆనందపు వెలుగయ్యారు
అనాధలకు బలమయ్యారు
ఆసరాగా నిలిచారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా
చరణం 1 :
బడిపిల్లల భవితను మార్చగ
విద్యాబుద్ధులనందించారు
పాఠశాలలను మెరుగు పరచగా
విశ్వాసాన్నిస్తూ కదులుతున్నారు
నవసమాజ నిర్మాణానికై
పట్టుదలగా పయనిస్తున్నారు ..
కూడూ … గుడ్డా .. లేనివారికై
శాయశక్తులా శ్రమిస్తున్నారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
చరణం 2 :
యువతకు మార్గం చూపిస్తూ
సదస్సులెన్నో నిర్వహిస్తూ
భవిష్యత్తును అందిస్తూ
ముందుకు గమనం సాగిస్తూ
అందరు బాగుండాలని
ఆరోగ్యాంగా బతకాలని
పేదరికం నిర్మూలనకై
కనీస అవసరాలనందిస్తున్నారు
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
చరణం 3 :
అనాధ వృద్ధుల బాసటగా
ప్రేమా కరుణ లోగిలిగా
ఆత్మీయంగా పలకరిస్తూ
పలు సంతోషాలను అందిస్తూ
శ్రమైక జీవనాన్ని గుర్తిస్తూ
సత్కారాలను అందిస్తూ
సమానత్వాన్ని పంచేస్తూ
సమాజ శ్రేయస్సు నినదించే ..
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
బీదజనుల ఆశాజ్యోతి
సులక్ష్య సేవా సమితి
సులక్ష్య సేవా సమితి
నిత్యసేవ సుజనా వసతి
సేవే మార్గంగా ..
సేవే లక్ష్యంగా ..
ఆచార్య రవ్వా శ్రీహరి గారిని నేను తొలుత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వారు తెలుగు శాఖాధ్యక్షులుగా ఉన్నప్పుడు, కలుసుకొని నా తొలి గ్రంథం “ముకుంద శతకం” ప్రతిని అందజేసాను. రవ్వా శ్రీహరి గారు, మా మాతామహులు శ్రీమాన్ ఆచి వేంకట నృసింహాచార్యులు గారు దాదాపు 90 ఏళ్ళ క్రితం చదువుకొన్న సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలోనే – 60 ఏళ్ళ క్రితం చదువుకొన్నారు. ఆ తరువాత పూర్వ విద్యార్థులైన ఈ ఇరువురే సీతారాంబాగ్ స్వామి వారైన శఠకోప రామానుజాచార్యులు గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇది శ్రీహరి గారు నాకు స్వయంగా చెప్పిన విషయం.

రవ్వా శ్రీహరి గారు 1943 సెప్టెంబరు 12 వ తేదీ నాడు ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా (ఇప్పటి
యాదాద్రి భువనగిరి జిల్లా) లోని వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్న నాడే తల్లి మరణించడంతో, ఆ వయసులోనే ఆయన కుటుంబ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. వారు తొలుత 1967 లో
ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా పనిచేసారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగు రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973 లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పుచ్చుకొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించారు.
సంస్కృతాంధ్ర భాషలలో అగ్రశ్రేణి పండితులైన శ్రీహరి గారితో తరువాతి కాలంలో .. చాల సభలలో కలిసిన సౌభాగ్యం నాది. మా యువభారతి సభలలో కూడ వారు చాల ప్రసంగాలు చేసారు.
అసమగ్రంగా మిగిలిన మన తెలుగు నిఘంటువులను సమగ్రం చేసే ప్రయత్నంగా నిర్మించిన “శ్రీహరి నిఘంటువు” వారు తెలుగు భాషకు చేసిన ఉత్కృష్టమైన సేవ.
ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూడ బాధ్యతలను నిర్వహించిన శ్రీహరి గారు ఆచార్య సి. నారాయణరెడ్డి గారి “ప్రపంచ పదులు” కృతిని సంస్కృతంలోకి అనువదించి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. గుర్రం జాషువా గారి “గబ్బిలం”, “ఫిరదౌసి” కావ్యాలను కూడ సంస్కృతంలోకి అనువదించారు. వారు ఎంతటి సంస్కృత పండితులో, అంతగా .. అనేక తెలుగు మాండలికాలలో విశిష్టమైన కృషి చేసిన మహా భాషా శాస్త్రవేత్త. ఐదారేళ్ళ క్రితం తెలుగు అకాడమీలో నేను తెలంగాణ భాషా సాహిత్యాలపై చేసిన ప్రసంగాన్ని వారు ప్రశంసించడం నాకెంతో ఆనందాన్ని, తృప్తిని కలుగజేచేసింది.
ఆచార్య శ్రీహరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి “మహామహోపాధ్యాయ” బిరుదాన్ని స్వీకరించిన ఘనులు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశారు.
ఉభయ భారతి, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య భాషా వైభవం, తెలుగులో అలబ్ధ వాఙ్మయం, సాహితీ నీరాజనం, తెలుగు కవుల సంస్కృతానుకరణలు, వాడుకలో తెలుగులో అప్రయోగాలు, తెలంగాణ మాండలికాలు – కావ్యప్రయోగాలు,
నల్లగొండ జిల్లా ప్రజలభాష వంటి విమర్శ గ్రంథాలు మరియు సిద్ధాన్త కౌముది, అష్టాధ్యాయీ వ్యాఖ్యానం వంటి వ్యాకరణ గ్రంథాలు వీరి ఇతర ప్రధాన రచనలు.
ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఎంతటి పండితులో, అంతకు మించిన సహృదయులు. నన్ను పుత్ర సమానునిగా ఆదరించేవారు.
79 ఏళ్ల వయస్సులో రవ్వా శ్రీహరి గారు గుండెపోటుతో హైదరాబాదులో 2023, ఏప్రిల్ 21నాడు పరమపదించారు.
ఆ మహనీయుని మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు.
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇది ప్రముఖమైన శాంతి మంత్రము. వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినది. అందరికీ శాంతి సౌభ్రాతృత్వాలుండాలనే ఆశయంతో ఈ మంత్రము చదువబడుతుంది. భారతదేశ సంస్కృతిలో ఇది ఒక భాగం. ఈ మతం ఆ మతమని లేకుండా విశ్వ జనులందరికీ శాంతి చేకూరాలని ఆకాంక్ష గలిగిన గొప్ప సంస్కృతీ భారతదేశానిది. మునులు ఋషులచే విరచితమై శాంతి మంత్రాలు గొప్ప ఆదరణ పొందినవి. యజ్ఞ యాగాదులలో పూజలలో ఈ మంత్రాలను చదువుతారు.
పై మంత్రం భావార్ధం ‘సర్వే ‘అంటే అందరికీ, ‘భవంతు సుఖినః ‘సుఖంగా ఉండాలని కోరుతున్నాము. ‘సర్వే సంతు నిరామయా ‘అంటే అందరూ నిరోగులవ్వాలని, సర్వే భద్రాణి పశ్యన్తు‘అంటే అందరూ మంచి చూడవలెనని, మా కశ్చిత్ దుఃఖ భాగభవేత్ ‘అంటే ఎవరికీ ఏ విధమైన బాధలు కష్టాలు ఉండకూడదని ఆశయం. ఇది ఏ ఒక్క సమూహానికి సంబంధించినది కాదు. ఇది అందరి గురించి ఆశించినది. పై మంత్రం శాంతి మంత్రాలలో ఒకటి. అందరికీ శాంతి చేకూరాలని ముమ్మారులు జపించబడినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః అంటే అన్ని లోకాలలోను శాంతి కలగాలని కోరుతున్నారు.
మనుష్యులకు కాకుండా జంతువులకు పశు పక్ష్యాదులు కూడా ఇది వర్తిస్తుంది. సర్వత్రా అందరికీ మంచి జరగాలనే భావన ఈ మంత్రం వలన తెలుస్తున్నది.
ప్రాచీన కాలంలో సంస్కృతం వాడుకలో ఉండేది. కాబట్టి చాలా వేద మంత్రాలు సంస్కృతంలో రచింపబడినవి. ఈనాటి కాలంలో సంస్కృత భాష వాడుకలో లేదు కాబట్టి చాలా మందికి మంత్రాల అర్థ తాత్పర్యాలు తెలియకపోవడంతో వాటి ప్రభావం కానీ, విలువ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మంత్రాల భావార్థాలు తెలుస్తే వాటిని తప్పక ఆచరిస్తారు. వాటిని పూజలలో హృదయపూర్వకంగా చదువుతారు. మంత్రం అంటే మననాటి త్రాయతే ఇతి మంతః అంటే మంత్రాలను మననము చేస్తూ చదివితే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది. మంత్రం అంటే మరొక అర్థం మనసునకు లభించే ఒక గొప్ప శక్తి. మంత్రాలను ఉచ్చ్చరించడం వలన జీవితానికి గొప్ప పరమార్థముూ సత్యమైన మహత్తు లభిస్తుంది. అన్ని మంత్రాలలో శాంతి మంత్రం ఇంకా గొప్పది. ఎందుకంటే శాంతి మంత్రాలు విశ్వ శాంతిని కోరతాయి. ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చదువవచ్చు,. ధ్యానం లో కూడా. మంత్రాలు సాధారణంగా గురువుల నుండి నేర్పబడతాయి. ఉచ్చ్చారణ దోషాలు లేకుండా చదవడం చాలా ముఖ్యం. అర్థాలను తెలుసుకొని మంత్రాలను మననం చేస్తే వాటి ప్రభావం, లాభం మనసుపై సరియైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మంత్రం భావార్థాన్ని ఆశయాన్ని తెలుసుకొని దీనిని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారని ఆశిద్దాం.
అయితే ఈ మంత్రం పూర్వకాలంలో యజ్ఞ యాగాలలో నే కాదు ఈ ఆధునిక కాలంలో నూ చాలా మంది చాలా చోట్ల చదువుతున్నారు. దీనికి ప్రధాన కారణం సామాజికం గా ఆలోచించి అందరూ బాగుండాలి అనేదే ఈనాటి యజ్ఞం. కాబట్టి మనమూ ప్రతి రోజూ చదువుకుందాం!
చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..
అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!
చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.
ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.
చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..
ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.
మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు
ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.
చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.
జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ
కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!
నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది
కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.
పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..
గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..
ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.
విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.
- రామకృష్ణ మనిమద్దె
9494353828
.ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం … కవి న్యాయవాది నమిలికొండ బాలకిషన్ రావు (జననం 6-9-50చివరి శ్వాస 30-3-2023) మధ్యాహ్నం హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికి పరిమితమయ్యారు
హనుమకొండలో నమలికొండ సాహితీపరుల కొండంత అండదండగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం.చైతన్య సాహితి ,సాంస్కృతిక సమాఖ్య,సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం,కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా,రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం క్రియాశీల సభ్యుడిగా విశేష సేవలు అందించారు.ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతనతరానికి వేదిక కల్పించాడు.

06 సెప్టెంబరు కరీంనగర్ జిల్లా పూడూరులో నమలికొండ నారాయణరావు రత్నబాయి దంపతులకు జన్మించారు,
ఎం. ఏ, ఎల్ .ఎల్. బి, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండ లో న్యాయవాద వృత్తి చేపట్టారు, వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక అనే మాసపత్రికను స్థాపించారు,
నమలికొండ బాలకిషన్ ప్రసారిక పత్రికతో పాటు తన స్వీయ రచనలైన యువస్వరం (1981) అక్షర చిత్రాలు (1986) శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006) ప్రసారకీయ కుసుమాలు(2010), మొదలైనవి వెలువరించారు,
షష్టిపూర్తి సందర్భంగా
శ్రీరంగస్వామి సంపాదకత్వంలో “బాల గోకులం అక్షర వసంతం” అనే ప్రత్యేక సంచిక వెలువడింది… మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్బం లో సుక్కపొడుపు సంకలనం సాహితిసమితి ద్వారా ప్రకటించారు.
బహుశా మలిదశ ఉద్యమానికి ఇదే తొలి సంకలనం అనుకుంటాను.
సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా నేను (పొట్లపల్లిశ్రీనివాసరావు) కార్యదర్శిగా మరికొందరం కలిసిఅనేక సభలు సమావేశాలు కవి సమ్మేళనాలు నిర్వహించి పుస్తక ప్రచురణలు కావించాము.రాష్ర్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాహితీ ప్రయాణం చేసాము.
ప్రముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన ఇక్కడి కవులకు చాలామందికి సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది.ఇందుకు బాలకిషన్ రావు గారి కృషి, ప్రోత్సాహము ,ప్రేరణ,వితరణ మాటలతో చెప్పలేనిది.
దేవులపల్లి రామానుజ రావు,చేతన వార్త కవులు,కాళోజి సోదరులతో,ప్రత్యక్ష పరిచయం ,విడదీయరాని అనుబంధం నమలికొండ గారిది.సాహితీ సభలకు నభారా ఒక ఎస్సెట్ గా ఉండేవాడు.వివాదరహితుడు సాహితీపోషకుడు నమిలికొండ ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.నమిలికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ…ఇలాంటి విపత్కర పరిస్థితి నుండి త్వరగా వారంతా కోలుకోవాలనికోరుకుంటూ…నభారాకు నివాళి.
గురిజాల రామశేషయ్యగారు కవిపండితులు. రాశేకలం గా తెలుగు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. తెలుగు భాషాభిమానులు. ముఖ్యం గా మాతృభాష తెలుగు లోనే కాదు సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిష్ణాతులు.తెలుగు భాషాసాహిత్యాల బోధన లో నలభై ఏళ్ల పైబడిన అనుభవం కలిగినవారు. ముఖ్యంగా భాషా విషయికంగా వాక్య భేదాలు, సంధులు , సమాసాలు , అలంకారాలు , ఛందస్సు వంటి వ్యాకరణ విశేషాలు అన్నీ ఔపోసన పట్టిన వారు. గేయ సాహిత్యం , ఆధునిక వచన కవితా వ్యూహనిర్మాణాలు తెలిసినవారు.
ఇవన్నీ ఉండగానే సరిపోదు. ఇటువంటి వారికి తమ సహాయాన్ని అడిగిన వారికి , సమాజం కోసం సాహిత్య పరంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచన తపన కూడా ఉండాలి… ఈ అంశాలు కూడా కలిగి ఉన్నవారు రామశేషయ్య గారు. కాబట్టే వీరు పాత తరం కొత్తతరం అనే భేద భావన లేకుండా అందరి రచనలూ బాగా అధ్యయనం చేస్తుంటారు .ప్రత్యేకంగా తమ ఇష్టానుసారం సమకాలీన సామాజిక కోణంలో విశ్లేషణ చేస్తూ స్పందిస్తూ ఉంటారు . ఇందులో భాగంగానే ఈ తెలంగాణ కావ్య ప్రతిభ శీర్షిక ద్వారా తెలుగు పద్యాలను , వచన కవితలను , సంస్కృత శ్లోకాలను పఠించి సంక్షిప్తంగా సమీక్ష చేస్తున్నారు . విని ఆనందించండి. సంపాదకులు మయూఖ
(అమెరికా, కెనడా)
ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం నయాగరా జలపాతం. ఈ జలపాతాన్ని ఎన్ని సార్లు వీక్షించినా తనివి తీరదు. ఋతువులు మారుతుంటే వాటితోపాటు తన రూపాన్ని మార్చుకునే నయాగరా గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందుకే కవులంటారు ప్రపంచంలోని జలపాతాలన్నింటిని ఒక్కచోట కుప్పపోసి చూస్తే కనిపించేదే నయాగరా అని. నయాగరాను చూస్తే ఆ కవి వర్ణన తప్పుకాదేమో అనిపిస్తుంది. అందుకే ఈ నయాగరా అందాలని వీక్షించేదుకు మూడుసార్లు వెళ్ళి వచ్చాను.
ఈ మూడు సార్లు ఎటువైపు నుండి (కెనడా, అమెరికా) చూసినా తన అందాలతో కట్టిపడేసి, తనలో తడిసిముద్దయ్యేలా చేస్తుంది. ఇన్ని సార్లు చూసేందుకు అంతలా ఎముంటుంది అనేగా మీ ప్రశ్న.. దాని గురించి తెలిస్తే దాన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు. అంత అద్భుతమైనది ఆ నయాగరా..
నయాగరా గురించి…
భూతల స్వర్గమని మనం పిలుచుకునే అమెరికా, కెనడా సరిహద్దులలో ఉందీ. జలపాతం. వరల్డ్ లో అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం తర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్నరకు పైబడి పర్యాటకుల సందర్శనతో ఈ జలపాత ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి.
నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, అంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!
నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి. జూన్, జులై, ఆగస్టుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
కెనడా వైపు కన్నా అమెరికా వైపు జలపాతం వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ ఉంటుంది. అమెరికా వైపు సుమారు 1060 అడుగుల వెడల్పుతో 175 అడుగుల లోతులో నీరు పడుతుంటే, కెనడా వైపు సుమారు 2000అడుగుల వెడల్పుతో గుర్రపు ఆకారంలో 140 అడుగుల లోతులో నీరు పడుతుంది. అంత ఎత్తు నుండి కిందకు దూకే పరవళ్లతో నయగరా జలపాతం మహా ఆద్భుతంగా ఉంటాయి. తన సోయగాలతో ప్రపంచ వింతల్లోనే ఒకటిగా చోటు సంపాదించుకున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు.
మొదటి ప్రయాణం…
నయాగరా జలపాతాన్ని చూసేందుకు 1999లో మొదటి సారి వెళ్ళాను. అమెరికాలోని ఓహియో () నగరంలో మావారి బాల్య స్నేహితుడు సుదర్శన్ రెడ్డి, జయ దంపతులు నివసిస్తుంటే వాళ్ళను కలిసేందుకు వెళ్ళినప్పుడు మొదటి సారి
నయాగరాని చూడటం.
చిన్ననాటి స్నేహితులు కాబట్టి చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. వాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడికీ ట్రాన్స్ఫర్ అయినా అక్కడికి వెళ్ళివచ్చేవాళ్లం. వీళ్ళు కలకత్తాలో ఉంటే కలకత్తాకు, బాంబేలో ఉంటే బాంబేకి దూరంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వాలిపోయేవాళ్లం. అంతంటి స్నేహం మా ఇరు కుటుంబాలది. చివరకూ అమెరికాలో ఉన్నారని తెలిసినా చూడటానికి వచ్చేశాం.
మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి గ్రే గ్రౌండ్ బస్‌లో ఓహియో చేరుకున్నాం. ఓహియో అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ముఖ్య నగరం. ఓహియో అనే పేరు సెనెకా పదం నుండి వచ్చింది. ఓహియో అంటే ‘గొప్ప నది’ లేదా ‘మంచి నది’ అని అర్థం.
మొదటి సారి వచ్చినప్పుడు వారం రోజులు వాళ్లింటోనే మకాం. ఆసలు వారం రోజులు వాళ్లతో ఎలా గడిచిపోయిందో తెలియనే తెలిదు మాకు. వాళ్ళకు సొంత వెహికిల్ ఉంది కాబట్టి హ్యాప్పిగా అన్ని ప్రాంతాలని చుట్టి వచ్చాం. మొదటి సారి నయాగరాను చూసేందుకు వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రి వేళలో నయాగరాను వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ టైంలో తీసుకెళ్ళారు. అక్కడే దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో ఏం కనిపిస్తుంది. ఏం చూస్తాం అనుకుంటాం కానీ నిజానికి రాత్రి వేళల్లో నయాగరా జలపాతాన్ని వీక్షించడం ఓ అద్భుతమే అనవచ్చు.
జలపాతాలని పగలు దర్శించడం వేరు. కానీ చీకట్లో చూడటమే వింత. అందుకే ఆ వేళలో చూడటం. నయాగరా జలపాతం చీకటి పడగానే మొత్తం దృశ్యం ఏదో స్వప్నలోకంలో ఉన్నట్లు మారిపోయింది. తారాజువ్వలు ఆకాశంలో నుంచి విచ్చుకొని రంగురంగుల పువ్వులను వర్షిస్తున్నట్లుగా, దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు ఫైర్ వర్కు ప్రదర్శన సాగుతుంది అక్కడ.
ఎక్కడో దూరం నుంచి ఫోకస్ చేసిన లేజర్ కిరణాలు ఈ నీటి ధారలను రంగులమయం చేసి నీటి తుంపర్ల మీద ఇంధ్రధనస్సులా పడి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంత విశాల ప్రాంతంలో జలపాతంలో రంగులు మారుతున్నట్లు చేసిన ఏర్పాట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ దృశ్యాన్ని చూస్తూ టూరిస్టులంతా హర్షాతిరేకంతో బిగ్గరగా అరుస్తువుంటే…అ రాత్రి అద్భుతమనే చెప్పవచ్చు.
ఆ వెండి వెన్నెల్లో తారాజువ్వల మధ్య నయాగరాను వీక్షించాక హెూటల్‌కు వెళ్లి పోయాం. తిరిగి ఉదయం కెనడా బార్డర్ నుండి నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లాం. ఇదంతా కూడా ఓ రెయిన్ ఫారెస్టు. చినుకులతో, నీటి తుంపర్లతో ప్రదేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి నుండి చాలా ప్రదేశాలను చూపించారు. చూపించడమే కాకుండా ప్రతి ప్రదేశం గురించి చక్కగా వివరించారు. వారి అతిథ్యం మేం ఎప్పటికీ మరిచిపోలేం.
రెండోసారి (2004) స్నేహితురాలు శ్రీలతో కలిసి నయాగరా జలపాతాన్ని చూసేందుకు వెళ్ళాం. ఆమె, డాక్టర్ సుదర్శన్ గారు న్యూయర్క్ క్యాపిటల్ అయిన ఆల్బమాలో ఉంటుంది. తనతో మేం వారం రోజులు పాటు గడిపాం. వారం రోజుల్లో మేం అక్కడే ఉండే చిన్న చిన్న ప్రదేశాలకు పిక్నిక్ లాగ వెళ్ళేవాళ్లం. ఉదయం పూట మమ్మల్ని కార్లో తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళేది. మాబాబు మాతోపాటు వచ్చాడు కాబట్టి తనకు చూపిద్దామని అందరం కలిసి వెళ్ళాం. రాత్రికి దగ్గర్లో ఉన్న హెూటల్లో రూమ్ తీసుకొని మర్నాడు ఉదయం కూడా నయాగరా చూడటానికి వెళ్ళాం. మా బాబుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని దగ్గరుండి నయాగరా అందాలను దగ్గరుండి మరీ చూపించాపించాలని జలపాతం దగ్గర ఉన్న టేబుల్ రాక్ కాంప్లెక్స్‌కు వెళ్ళాం. అదో వ్యూ పాయింట్. లిఫ్టులో 125 అడుగుల కిందకి తీసుకెళ్ళి ఒక గ్లాసు డోరులోంచి జలపాతాన్ని చూడవచ్చు. నీటి మట్టానికి 25 అడుగుల ఎగువన ఒక బాల్కనీ కట్టారు. మూడువైపులా రైయిలింగ్స్ ఉంటాయి. నిమిషానికి సుమారు 20కోట్ల లీటర్ల నీరు 175 అడుగుల లోతుకు పడి, వందల అడుగుల ఎత్తుకు లేచిన చల్లటి నీటి తుంపర్లు ముఖాన్ని తడుపుతుంటే…. ఆ మనోహర దృశ్యాలను వివరించడానికి మాటలు చాలవనుకోండి.
మైడ్ ఆఫ్ ది మిస్ట్….
వెళ్ళిన వెంటనే అందరం కలిసి నయాగరా జలపాతాన్ని చూశాక ఆ జలపాత పరవల్లను మరింత దగ్గర నుండి చూడాలని టికెట్లు కొనుక్కొని ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. సుమారు 100 మంది పట్టే డబుల్ డెక్ మోటార్ బోటు ఇది. అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళు ఇస్తే అందరం వాటిని వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. అది రెండస్తుల బోటు. అది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ | అదొక అందమైన అనుభవం.
ఒక రకంగా జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హెూరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా గట్టిగా తాకుతుంది. నదిపై బోటులో వెళుతుంటే… ఒక వైపు భయంగా ఉన్నా… మరో వైపు సాహసం చేస్తున్న థ్రిల్ కలుగుతుంది. అంత ఎత్తు నుండి నీటి ఉధృతి, తుంపర్లతో తడిసి ముద్దయిపోవలసిందే…!
ఆ అద్భుత దృశ్యాలను చాలా మంది తమ కెమెరాల్లో, సెల్ఫోన్లలో బంధిస్తుంటే మేము కూడా ఫొటోలు తీసుకున్నాం. ఇక్కడ పిల్లా, పెద్ద అనే తేడా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం అక్కడ.
డాక్టర్ సుదర్శన్ గారు లీవ్ పెట్టి మరీ మాతో వచ్చిన ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆ దంపుతులిద్దరు సాయంత్రం పూట బర్బిక్ తో తయారు చేసిన చికెన్, మటన్, మొక్కజొన్న కంకులతో వేడి వేడిగా స్నాక్స్ తినిపించేవాళ్లు. చాలా రుచిగా అనిపించేవి. మమ్మల్ని ఫై స్టార్ హెూటల్‌కు తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలో ఒక్క పైస కూడా మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వలేదు. వారి అతిథ్యాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం.
2014లో ఇంకోసారి….
2014లో మేం కెనడా వెళ్లాం. ఈ ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి వయా ట్రైన్. వాస్తవానికి మేము అక్కడికి వెళ్ళే వరకూ కూడా దాని గురించి తెలియదు. ఒక హెూటల్లో రూమ్ తీసుకొని ఓ రాత్రి ఉన్నప్పుడు అక్కడున్న ఓ అమ్మాయి అడిగింది. “మీరు ఎక్కడికెళ్తున్నారని”. మేం ఇక్కడ దగ్గర్లో ఉన్న ప్రదేశాలను చూడటానికి అని చెప్పాం. అవి ఎప్పుడైనా చూడోచ్చు కానీ. ముందు మీరు కెనడా వచ్చేరంటే కచ్చితంగా మీరు వయా ట్రెయిన్ ఎక్కాలి. ఇది కెనడా వాళ్ల జీవిత కాలపు స్వప్నం. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ ట్రైన్ ఎక్కడం మీస్ కాకుండా చూసుకొండని” అమ్మాయి చెప్పింది. ఆమె ఇచ్చిన ఓ సలహాకు వెంటనే ఆమెనే టికెట్లు బుక్ చేయమని అడిగాం. “మీరు ఒక టూ నైట్స్‌కు తీసుకొండి. చాలా తక్కువలో వస్తుంది. అంటే లాస్ట్ మినిట్ సేల్ ఉంటాయి. అది నేను బుక్ చేస్తానని” చెప్పింది. అలా చాలా తక్కువ ధరలో మాకు ట్రెయిన్ బుక్ చేశారు. నిజంగా ఎంత ఆనందించానో.. మనం వెళ్లాలని ఆశ, కోరిక ఉంటే చాలా మనకు అలాంటివారే తటస్థ పడతారు. మనల్ని ప్రోత్సాహించేవాళ్లు, దారి చూపించేవాళు మన చుట్టు ఉంటే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వయా ట్రెయిన్ ఎక్కాం. ఆ అమ్మాయే మాకు కెనడాలో ఏయే ప్రదేశాలు చూస్తే బాగుంటుందో చక్కగా చెప్పారు.
వయా ట్రైన్ కొందరి స్వప్నం….
కెనడాలో ఇది అతి ముఖ్యమైన జర్నీగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ ట్రెయిన్ ఎక్కడం అక్కడి ప్రజలు జీవిత కలగా భావిస్తారు. వయా ట్రైన్ అనేది కెనడాలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
మేం పొద్దున్నే స్టేషన్‌కు వెళ్లి ట్రెయిన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రెయిన్ ఉదయం ఐదింటికి ఉంది. కానీ మేం నాలుగింటికే ప్లాట్ పామ్ దగ్గరకు వెళ్లాం. మేం వెళ్లేసరికే మాకన్నా ముందే ఒక ముసలావిడ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె వయసు 84 ఏండ్లు. ఆమె దగ్గరకు వెళ్ళి నేను కాసేపు మాట్లాడాను. ట్రెయిన్ కోసం తాను మూడింటి నుండి వెయిట్ చేస్తున్న అని చెప్పింది. అమె అలా చెబుతుంటే కాస్త వింతగా అనిపించింది. ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చిందో అని. అదే అడిగాను. మూడింటికే ఎందుకు వచ్చారు మీరు. ఐదింటికి రావొచ్చు కదా? అని. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా “నాకు ఈ ట్రెయిన్ ఎక్కలన్నది నా కల, ఈ కోరిక కొన్ని ఏండ్లది. అందుకే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఉత్సహంలో నాకు రాత్రాంత నిద్ర కూడా పట్టలేదు. అందుకనీ రెండింటికే నిద్రలేచి రెడీ అయి మూడింటికల్లా స్టేషన్ దగ్గర కొచ్చి ట్రెయిన్ కోసం ఎదురిచుస్తున్నాను” అని అంది. ఆమె అలా చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తానోక టీచరట. తాను సంపాందించిన సంపాదనలో కొంత భాగం ఈ ప్రయాణం కోసం దాచిపెట్టుకుందని చెప్పింది. అలా ఆమె జీవిత కాలపు కలను నేరవేర్చుకుంటోన్నది. మేం కూడా ఆ చలిలో తనతో పాటు కూర్చున్నా.
ఆమెను చూసిన తర్వాత ఈ వయసులో కూడా ఎంత సాహసం, ఎంత ఉత్సహాం కదా అనుకున్నాం. నిజానికి ప్రయాణికులకు కావాల్సింది ప్రోత్సాహాం కాదు, ఇలాంటి వాళ్ల అనుభవం ఉంటే చాలు ఎంత దూరమైన సరే వయసుతో సంబంధం లేకుండా తిరిగేయొచ్చు. ఇలా వాళ్ల జీవితమే కదా మాలాంటి వాళ్ళకు ప్రోత్సహం. ఆమెను చూసి మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలా ఆ రోజంతా మేం ట్రెయిన్లో గడిపాం. సహజంగా ట్రెయిన్ జర్నీ అనగానే ఎవరికైనా ఆనందమే కదా!. అలాంటిది మేం వెళ్లే ట్రెయిన్ అన్నీ ట్రెయిన్స్ కన్నా భిన్నమైనది, ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.
వయా ట్రైయిన్….
జనరల్‌గా ఏ ట్రెయిన్ అయినా ఐరన్ ఉంటాయి. మహా అయితే కాస్త లక్జరిగా ఉంటాయి. హంగూ ఆర్భాటాలత మూస్తాబు చేసి ఉంటాయి. కానీ ఈ ట్రెయిన్ అలాంటి ఇలాంటి ట్రెయిన్ కాదు. అందుకే కదా ఆ ముసలావిడ ఆ వయసులో కూడా తను కూడా దీన్ని ఎక్కాలని తహతహలాదింది.
కెనడా ప్రభుత్వం ప్రకృతి అందాలను వీకించేందుకు ప్రత్యేకంగా గ్లాస్‌తో నిర్మాణం చేయించింది ఈ ట్రెయిన్‌ను. ఈ ట్రైయిన్‌లో ప్రయాణం చేస్తూ ఎంచక్కా జర్నీ పొడవునా బయటి ప్రదేశాలను, ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. బోగిలు అంతా గ్లాస్‌తోనే ఉంటాయి. కింది వైపు, పక్కవైపు, పైని వైపు ఎటూ చూసిన గ్లాస్గోనే ఉంటాయి. అందుకే బయట కనిపించే వాటిని స్పష్టంగా చూడవచ్చు. చూస్తూనే మన కంటికి కనిపించే దృశ్యాలను ఎంచక్కా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ట్రెయిన్ కాస్త కాస్లీ అని చెప్పవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది ఈ ట్రెయిన్ జర్నీకి. మా తర్వాత వెళ్ళి, ఆ ట్రెయిన్ ఎక్కిన మా స్నేహితులు లక్ష రూపాయాలు ఖర్చు పెట్టామని చెప్పారు. అంత ఎందుకైంది. మేం వెయ్యి రూపాయాల్లో చూసొచ్చామని చెప్పాను. అయితే వాళ్లు బుక్ చేసుకున్నది పూర్తిగా అక్కడే ఉండి చూడటానికి. మేం నార్మల్ ట్రెయిన్ మాదిరి బుక్ చేసుకొని అక్కడి ప్రదేశాలను చూడటం జరిగింది.
ఆ ట్రెయిన్లో జర్నీతో ప్రయాణికులకు కావాల్సిన భోజనం, టీ, కాఫీ, బ్రెడ్ ఇంకా చాలా పదార్థాలను సప్లయ్ చేస్తారు. మేం మాత్రం ఎక్కువగా వేటిని ఆర్డర్ చేయకుండా కేవలం ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగి అలా అందులోనే కూర్చుండిపోయి నాలుగు గంటలు ప్రయాణం చేసి తర్వాత మళ్లీ తిరిగొచ్చి భోజనం ఆర్డర్ చేసుకొనే వాళ్లం. అలా రోజంతా ట్రెయిన్‌లోనే గడిపేవాళ్లం. అందుకని మాకు కాస్త తక్కువనే ఖర్చు అయింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకు ఈ ట్రెయిన్ జర్నీ అద్భుతమనే చెప్పాలి.
మేయి ఈ ట్రెయిన్ జర్నీలో మొదటగా అలస్కా కు చేరుకున్నాం. అక్కడి నుండి విక్టోరియా, తర్వాత విజిలర్స్, తర్వాత క్యూబెక్ ఇలా రెండు రోజుల పాటు ఆ ట్రెయిన్లో ప్రయాణం చేయడం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనే చెప్పవచ్చు.
ఆ ట్రెయిన్ జర్నీ తర్వాత క్యూబెక్ నుండి టొరంటోకు బస్సులో వెళ్ళిపోయాం. బస్సులో వెళ్లేందుకు అమెరికాలో ఉన్న కుమార్ అనే అబ్బాయి బస్ బుక్ చేసి మాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఓసారి కెనడా వైపు నుండి నయాగరా చూడాలని బయలు దేరాం.
ఈ సారి ప్రయాణంలో మాకు నయాగరా వద్ద ఇండియా నుండి వచ్చిన డాక్టర్ రమా, ప్రసాద్ దంపతులు కలిసారు. మేము నలుగురం కలిసి అక్కడే డబుల్ బెడ్ రూం తీసుకొని అక్కడే ఉండి ఆ ప్రాంతాలనన్నీంటిని చూడాలని ప్లాన్ చేసుకున్నాం.
ముచ్చటగా మూడోసారి…
ఎలాగూ రూం తీసుకున్నాం కాబట్టి స్వయంగా వండుకొని ప్రశాంతంగా ఆ ప్రాంతాలనన్నీంటినీ చూడాలని బయలు దేరాం. ఈ సారి మా ప్రయాణంలో కేవలం నయాగరా జలపాతాన్ని చూడటమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా కవర్ చేయాలని అనుకున్నాం. అందుకే నయాగరా చూశాక చుట్టుపక్కల వంతెనలు ఉన్నాయంటే వాటిని చూద్దామని వెళ్ళాం.
జలపాత మార్గంలో ఉన్న ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి. ఈ వంతెనలన్నీ కెనడా, అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మితమయ్యాయి. నాలుగు చక్రాల వాహనదారులు,పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు. వీటిలోనే ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.
అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.
టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ కొత్తవి ఉంచింది.
జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం. రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి. అవి.. పీస్ బ్రిడ్జ్, రెయిన్బో బ్రిడ్జ్, వర్ల్ుల్ బ్రిడ్జ్,లూయిస్టన్-క్వీన్స్ట్రన్ బ్రిడ్జ్, మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.
అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.
టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ
కొత్తవి ఉంచింది.
జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం.
పదకిరణ కలనం-10

అడ్డం
**
01. రవికుల తిలకుడు (5)
04. ముక్కెర (4)
07. కోతి జెట్టి (2)
08. యుద్ధం (2)
11. కచ్ఛపం (3)
13. వజ్రాయుధం (3)
15. చాటింపు (3)
17. కిరణం రోగం (2)
18. తల (2)
19. కండోలం (2)
21. జంతువు పిల్ల (2)
23. పోటి పగ (2)
25. లోటు తక్కువ (2)
26. తేలిక (3)
27. ఏమరుపాటు (3)
28. వరుసకు ముందు చుట్టరికం (2)
29. సన్నము కానిదా? ఉష్ణద్రవము (2)
30. పందెం (2)
31. భ్రాంతి ఓ ప్రముఖకవి ఇల్లు (3)
33. తొమ్మిది పదులు (3)
35. పిల్లలను తల్లి లాలించే వెచ్చని పానుపు (2)
36. సుమంత్రుని తొలి విరి (2)
38. వెలితి (2)
39. గెలుచు (2)
40. కూడు కొరివి పెట్టేవాడు (3)
41. శ్రీరామునకు విశ్వామిత్రుడు ప్రసాదించిన ఒక అస్త్రం (4)
43. జతకుదురు సరిపోవు (2)
44. ఇల్లు పీకి వేసేది (3)
45. సదా (3)
46. పెరుమాళ్ళు కెఱుక (3)
**
నిలువు
01. మాధవుని మామ (5)
02. తాలింపులో వాడే సుగంధద్రవ్యం (3)
03. దీనిని దీనితోనే తీయాలట (2)
05. పెంచు బొట్టుదినుసు (2)
06. పూదేనె (3)
08. తీగెలు, మొక్కలకు తావు (2)
10. ఇతరుల తిండితో బ్రతికేది (5)
12. మురికి లప్పం (2)
13. గోడ (3)
14. యుద్ధభూమి ఒకప్పటి రంగూన్ (2)
16. పాకు (2)
20. భాషలో పదిమందిలో ప్రాముఖ్యత (5)
22. దేవతలు మెచ్చి కురిపించేది (4)
24. రాత్రితో ఉపవాసం (3)
26. ఆ విధంగా (2)
27. పందెం (2)
28. తరువాత తన ఆస్తికి అర్హుడు (4)
30. సతికి తనతో సగం ఇచ్చినవాడు (2)
32. అత్యుష్ణం దుఃఖం (4)
34. స్త్రీ నేర్పరి ఇల్లు (3)
35. వంచు వశమగు (2)
37. తాను కోరినదే కావాలని పట్టే మొండితనం (4)
39. రెండుపక్షాలతో తీగసాగిన స్త్రీ (3)
40. స్త్రీ పూలను తురిమేది ఇక్కడ (3)
41. శత్రువు (2)
42. వేరే చోట నివాసం చేసేది (2)