కొంతమందికి పేరెందుకు వస్తుందో తెలియదు. కానీ పేరొచ్చిన వాళ్ళేం చేసినా చెల్లుబాటవుతుందని శంకర్రావును చూశాక ఎవరికయినా అర్ధమవుతుంది. అతనేం చేస్తుంటాడో మాకెవరికీ తెలీదు కానీ మా కాలనీలో పండగ వచ్చిందంటే మాత్రం శంకర్రావు లేకుండా జరగదు. వినాయక చవితితో మొదలు పెడితే ఉగాది వరకూ ఏ పండగైనా అతని కనుసన్నల్లోంచి బయటపడలేదు. చందాలు వసూలు చేస్తాడు.పూజలు ఆర్గనైజ్ చేస్తాడు.ప్రసాదాలు పంచుతాడు. ఆర్కెస్ట్రాలు పెడతాడు.నిమజ్జనం అంటే పిల్లా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్కచోట చేరుస్తాడు.అతను జై శ్రీరామన్నా, జై భారతమాత అన్నా తిరుగులేదు.ఒకసారెవరో చందా ఎందుకివ్వాలి అని అడిగినట్టున్నారు, అలా అడిగినందుకు ఆ వ్యక్తిని ఉతికి ఆరేశాడు.అలా ఇలా కాదు, మరక మంచిది కాదన్నట్టు సంస్కారవంతంగా ఆరేశాడు.ఆ దెబ్బకు మళ్ళీ ఇంకొకరు అలాంటి ప్రయత్నం చేయలేదు.ఒక్క మాటలో చెప్పాలంటే He is a law unto himself… తను చెప్పిందే చట్టమన్నట్టు ప్రవర్తించే శంకర్రావంటే కోపమున్నవాళ్ళూ లేకపోలేదు. అయితే వాళ్ళందరూ అర్భకజీవులు మా కాలనీలో. అసోసియేషన్ పెత్తనమంతా శంకర్రావు, ఇంకా అతని బృందానిదే కాబట్టి మెజారిటీ అతని వైపే ఉండేవారు. మాలాంటి వారు మైనారిటీ వర్గం కిందే లెక్క.
శంకర్రావు ఏ రోజూ లెక్కలు చెప్పిన పాపానపోడు. ‘అన్నా నువ్వేం చెప్పక్కర్లేదు ఎవడికీ’ …. అనే కోరస్ డిజిటల్ సౌండ్ తో వినిపిస్తుంటే అడిగే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది …. చూశారా నా వెంట ఎంతమందున్నారో అనే అతని తిరస్కార చూపు మాకు ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ ఉండేది… ఎప్పుడూ లేంది ఈ సారి సంక్రాంతికి కూడా సంబరాల పందిరేశాడు శంకర్రావు. రోజూ కాలనీ వాళ్ళతో ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టించాడు … పోటీలన్నాడు …ఈసారి డబ్బుల వసూలు గొడవలేదన్నాడు … అందరూ ఊపిరి పీల్చుకున్నారు … సంక్రాంతి సరదాలంటూ మగవాళ్ళకూ పోటీలు పెట్టాడు. పోటీలకు వెళ్ళని మాలాంటి వాళ్ళం ఉడుక్కుంటూ కూర్చున్నాం … ప్రతి సంక్రాంతికీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే శంకర్రావు ఈ సారి ఇలాంటి హింస పెట్టాడెందుకా అని మాలో మేం కొట్టుకు చస్తుంటే శంకర్రావు ఎవరితోనో కొట్లాడుతూ ఉండటం మమ్మల్ని ఉలిక్కిపడేలా చేసింది …
సంక్రాంతి పండగ చివరి రోజున అయ్యవార్లను పిలిచి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు శంకర్రావు. తెల్లటి లాల్చీతో ఎర్రటి బొట్టుతో మెళ్ళో పచ్చని కండువా వేసుకుని కొత్త దేశభక్తుడిలా ధగధగమంటున్నాడు. ఆ ధగధగలలో ఈ బుసబుసలేమిటా అని చూద్దుము కదా ఒక గంగిరెద్దు వాడితో గొడవపడుతున్నాడు శంకర్రావు.
మేం చూడని శంకర్రావు ఆ అవతారంలో ముక్కంటిలా కాల్చేస్తున్నాడు… దూర్వాసుడిలా దూషిస్తున్నాడు… ఇంతకీ ఆ గంగిరెద్దు అతను కాస్త ఇనాము ఇప్పించు సామీ అని వేడుకుంటున్నాడు …. మరి దానికి ఇంత సీరియస్ అయిపోయి కొట్లాట స్థాయికి ఎందుకొచ్చాడు శంకర్రావు … అర్ధంకాని అయోమయంలో మేమంతా ఉండగా శంకర్రావు తిట్లతోకూడిన గాలి తరంగాలు దుర్గంధంలా మమ్మల్ని చేరుతున్నాయి.
విచిత్రంగా ఆ గంగిరెద్దు వాడు కూడా తగ్గటం లేదు. అదే స్థాయిలో నేనేమన్నా దొరా అని శిలా ప్రతిమలా నుంచున్నాడు. చూసేవాళ్లకు అది వినోద స్థాయిలో ఉందేమో కానీ శంకర్రావంటే కోపమున్న మాకు కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించింది. ఈలోగా రంకెలేస్తున్న శంకర్రావుని పక్కకు తీసుకెళ్లారెవరో …
మాలో ఒకరం కదిలి ఆ గంగిరెద్దు వాడిని సముదాయించి వాడి చేతిలో నూట పదహారు పెట్టి ఇక మమ్మల్ని వదల్రా నాయనా అని బతిమాలాం…
నాకెందుకో చిన్న అనుమానమొచ్చి వాడిని ఫాలో అయ్యాను. నన్ను గమనించినట్టున్నాడు ఆ గంగిరెద్దువాడు. నాకో దండం పెట్టాడు. వాడితో మాటలు కలపటం మొదలుపెట్టాను…
‘ఏ ఊరు స్వామీ మీది ….నీ పేరేంది’
‘పక్కనే మారాజా … ఇక్కడికి 20 కిలోమీటర్లుంటది… నన్ను రాములంటారు’
‘మీరు రోజూ వచ్చివెళ్తూ ఉంటారా’
‘లేదు మారాజా … మా ఊరోళ్లందరం ఒకచోట ఉంటున్నాం కలిసి, పండగ అయినంక ఎల్లిపోతాం’
‘గిట్టుబాటవుతుందా … చూస్తే ఎవరూ ఇస్తున్నట్టులేరు’
‘ఇచ్చే మారాజులు ఇస్తరు సారూ’
ఈ సంభాషణ ఎటూ సాగటం లేదనిపించి అడగదలుచుకున్న విషయం అడిగేశాను.
‘మా శంకర్రావు సారూ ఎందుకో నీ మీద కోపంగా వున్నాడు …. ఆయన ఎవరినీ అట్లనడే … నువ్వు తెలుసా ఆ సారుకి’ అలా చీకట్లో బాణమేసాను కానీ, తగులుతుందనుకోలేదు…
‘నాకెరికే సారూ, శంకరన్న అంటాం మేమా సారుని’ అన్నాడు రాములు
‘నువ్వు తెలిస్తే మరెందుకు నీమీద కోప్పడ్డాడు’
‘అదా సార్ … ఆ సారు మా ఊర్లో పొలం కొనబట్టిండు … తక్కువ ధరిచ్చి కొన్నాడు సార్. ఆ పొలం మా పెదనాయన కొడుకుది… మా MLA సార్ కి చెప్పి బెదిరించాడు … అందుకే ఆయనంటే మా ఊర్లో అందరికీ కోపం’
‘ఆయన ఇక్కడే ఉంటాడని తెలుసా నీకు’ ఆశ్చర్యంగా అడిగాను
‘తెలిసే వచ్చినా సారూ’ …
రాములు ధైర్యానికి నాకు ముచ్చటేసింది.
ఇదా శంకర్రావు అసలు రూపం … ఎందుకో రహస్యం తెలుసుకున్నానన్న సంతోషం కన్నా అన్యాయం చేశాడన్న బాధే కలిగింది…
‘ఆయన నిన్ను గుర్తు పట్టాడా ?’ జాలిపడుతూ అడిగాను…
‘గుర్తు పట్టిండు సార్ …అందుకేగా ఎల్లగొడదామని చూసిండు … అందుకే నేనూ వదల్లే’
ఈ రాములు లాంటి వాళ్లకి ఎలా అర్ధమవుతుంది. క్రూర జంతువులు బయట ఎక్కడ్నించో రావని, మన మధ్య ఉండే మనుషులే ఆ రూపం దాలుస్తారని ఎలా చెప్పగలుగుతాం అనిపించింది… పర్సుదీసి చూస్తే కొన్ని నోట్లు కనిపించాయి. అవి అతని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాను.
నిత్యం గంగిరెద్దులా కనిపించే ఈ శంకర్రావు గంగిరెద్దు వేషం వేసుకున్న గుంటనక్క అని ఎలా చెప్పాలి అన్న ఆలోచనలో పడ్డాను.
అప్రయత్నంగా ప్రయాణీకులకు ముఖ్య గమనిక అని రైల్వే స్టేషన్ లో జేబుదొంగల గురించిన ప్రకటన గుర్తుకొచ్చింది. శంకర్రావు లాంటి వారికి కూడా వర్తించే ఆ ‘గమనిక’ అందరికీ చెప్పాల్సిందే అనుకుంటూ దుఃఖంతో నిండిన మనసును ఊరడిస్తూ ముందుకు సాగాను ….
కథలు
ట్రింగ్ …ట్రింగ్ ..
ఫోన్ మోగడం తో వంట గదిలో నుంచి వచ్చింది సుజాత “హలో, హలో ,నేను అమ్మా నీ శీను ని మాట్లాడుతున్నాను.”
” చెప్పు బాబూ, ఏంటి సంగతి అంత ఆనందంగా ఉన్నావు?”
” ఆ అవునమ్మా ! ఆనందం కాదు అంతకు మించి. నా (నీ) కల నెరవేరింది అమ్మా. నేను కలెక్టర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను.
ఈ క్షణం నీ పక్కన ఉండి ఉంటే బాగుండు. నీ కళ్ళల్లో ఆ వెలుగులు చూస్తే బాగుండు అనిపిస్తోంది అమ్మా. రాత్రి ట్రైన్ కి బయలుదేరి వస్తాను.”
“ఏంటి శ్రీనూ, నువ్వు చెప్పేది నిజమా? మన కల నెరవేరిందా? సో గ్రేట్ నాన్నా! కంగ్రాట్యులేషన్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఎంతో గర్వంగా ఉంది. సరే వెంటనే బయలుదేరిరా.
నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన బొబ్బట్లు, ఆవ పెట్టిన పులిహోర చేసి ఉంచుతాను. మీ స్నేహితులను కూడా భోజనానికి పిలువు. ఈ ఆనందం వాళ్ళ అందరితో షేర్ చేసుకుందువు గానీ.”
“అలాగే అమ్మా. అలా అయితే ముద్దపప్పు ఉంచు. ఆ వెంకట్ గాడికి మన ఇంట్లో ముద్దు పప్పు ఆవకాయ అంటే ప్రాణం. మీ అమ్మ అంత బాగా ఆవకాయ ఎవరూ చేయలేరు రా అంటాడు. ఇక ఉంటాను మరి. వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. బై,”
” బై శీను, జాగ్రత్త. బయలుదేరినప్పుడు ఫోన్ చెయ్,” చెప్పింది సుజాత.
ఫోన్ పెట్టేసి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. మనసు గతంలోకి జారిపోయింది అప్రయత్నంగా.
“అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు భర్తను వదిలేస్తే ఈ పిల్లాడిని పెట్టుకుని ఎలా బతుకుతావు? నువ్వు చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ సంపాదనతో పిల్లాడిని చదివించడం సాధ్యమవుతుందా? మంచో చెడో పిల్లాడి కోసమైనా నువ్వు సర్దుకుపోవాలి అతడితో,” తన తల్లి మాటలు.
“లేదమ్మా అతనితో కలిసి ఉంటే నా పిల్లాడికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అతడి చెడు ప్రవర్తన పిల్లాడి పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నా శ్రీనూని ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను.సాధ్యమైతే వాడిని కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను. నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు. అతనితో కలిసి ఉండమని చెప్పకు, ప్లీజ్.”
ఏ ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తిరుగుబోతు గా మారాడని తెలియగానే అతడితో విడాకులకు సిద్ధమైంది.
కానీ అమ్మ చెప్పిన మాట నిజమే. తన ప్రైవేట్ టీచర్ ఉద్యోగం తో కొడుకుకి మంచి చదువు చెప్పించడం కష్టం. కనుక దీనికి ఏదైనా చేయాలి. శ్రీను ని బాగా చదివించాలి. ఎలా? ఏం చేయటం? ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఉపాయం తట్టింది సుజాతకి.
అవును కరెక్ట్ అలా చేస్తే తనతోపాటు తన లాంటి మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చు. సంపాదన పెరుగుతుంది కనుక ఇబ్బంది ఉండదు.
కానీ తను అనుకున్నది ఆచరణలో పెట్టి ఫలితం రావడానికి కనీసం ఒక ఏడాది కాలం పడుతుంది, అప్పటి వరకూ తనూ, పిల్లాడు బ్రతకడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోతుందా? మళ్లీ ఆలోచనలో పడింది సుజాత.
తన ఆలోచనని, ప్రణాళికను అన్నగారితో చర్చించింది. చిన్ననాటి నుంచి అన్నయ్య తను మంచి ఫ్రెండ్స్. తన ప్రతి సంతోషంలో, కష్టంలోనూ తోడు ఉన్నవాడు అన్నయ్య. ఇది కూడా తన ధైర్యానికి కారణం కావచ్చు.
“చాలా బాగుంది సుజాతా. నీకు ఎలాగు వంట చేయడం ఇష్టం కదా. నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది కాబట్టి తప్పక విజయం సాధిస్తావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా వదినలు ఉన్నారని మర్చిపోకు,” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు అన్నయ్య.
అదిగో ఆరోజు తన ఆలోచనల్లో మొదలైనది “అమ్మ చేతి వంట” అనే క్లౌడ్ కిచెన్. పూర్తి శాకాహార ఆంధ్ర భోజనం.
ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేసింది తను. భర్త (తను) ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలి. అయితే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి చెప్పింది తను వస్తున్నానని.
తన స్నేహితురాలు సీత ఎంతో సహాయం చేసింది. ఉండేందుకు ఇల్లు చూసి పెట్టడమే కాక ఆమె భర్త వ్యాపారంలోనే ఉండడంవల్ల తను వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన సరుకులు వస్తువులు వంటివి అతని స్నేహితుల వద్ద హోల్ సేల్ ధరలకు ఇప్పించడం వంటి ఎన్నో.
చివరికి తను విడాకులకు అప్లై చేసేందుకు లాయర్ గారిని కూడా పరిచయం చేసింది సీత. ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.
ఆ విడాకుల ప్రహసనం మామూలుగా జరిగిందా? తను మగవాడిని కనుక ఎంతమందితో తిరిగినా తప్పులేదనే అహంకారంతో ఉన్న భర్త, అంతే గొప్పగా అతనికి వత్తాసు పలికే అత్తగారు ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నించారు!
తనకు తెలియకుండా
పిల్ల వాడిని కలుసుకుని వాడి బుర్రలో తనకు వ్యతిరేకంగా విషం నూరి పోయడానికి కూడా సిద్ధపడ్డారు.
పాపం శీను, చిన్న పిల్లవాడు. తల్లా,తండ్రా అంటే ?కానీ వాడు చాలా తెలివైనవాడు. అంతేకాక చిన్ననాటి నుండి తానే లోకంగా బ్రతుకుతున్న తన తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. తన తోటే ఉన్నాడు. తనని పూర్తిగా నమ్మాడు.
తన భర్త లాంటి మగవారిని ఏం చేయాలి అసలు? కాలం ఎంత మారినా తాము మారమని, మగవాడు అంటే అదేదో దేవుడు అన్నంత అహంకారం. తాను విడాకులు అనే సరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తల్లీ కొడుకులు. అయినా తన తప్పు ఒప్పుకునేంత ఔన్నత్యం లేదు కదా!
అతని తప్పు మూలానే తాను విడాకులు కోరుతున్న విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
తన అన్నయ్య స్నేహితుడైన ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించగలిగింది.
కేవలం విడాకులతో వదిలేయాలా లేక తనను మానసికంగా ఇంత బాధపెట్టిన అతడినిజైలుకు పంపించాలా? ఎన్నో ఆలోచనలు.
కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం ఒకపక్క, కోర్టు కోసం తిరగటం ఒకపక్క. ఈ మధ్యలో బంధువులలో గుసగుసలు. వీటన్నిటినీ అధిగమిస్తూ శ్రీను చదువుకు ఏమాత్రం అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తన వ్యాపారంపై దృష్టి పెట్టలేక పోతోంది.కానీ పోరాడాలి, గెలవాలి అన్న తపన, గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసం ఏనాడు విడవలేదు సుజాత.
ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో విజయం సాధించడం సినిమాలో చూపించినంత సులువైన విషయం కాదు అని అర్థమైంది సుజాతకు.
అందులోనూ తన లాంటి ఒంటరి మహిళలకు ఆ పోరాటం ఇంకా ఎక్కువ. కానీ పోరాడితే విజయం తప్పక సాధించగలం అని నిరూపించింది కూడా తను.
తను ఆనాడు ఒక శాఖగా ప్రారంభించిన “అమ్మ చేతి వంట” తన అయిన వాళ్ళు, స్నేహితుల ప్రోత్సాహం తో పాటు హైదరాబాద్ నగర వాసుల ప్రోత్సాహంతో, వారి శాఖాహార అవసరం తీరుస్తూ, వారిచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ వలన ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో 8 శాఖలుగా విస్తరించింది.
అన్ని శాఖలలో కలిపి దాదాపు 50 మందికి పైగా ఆడవారు పనిచేస్తున్నారు. వారంతా తనలాగా జీవితంలో ఏదో విధంగా దెబ్బతిన్నవాళ్లే.
కొత్త శాఖను ప్రారంభించినప్పుడల్లా కనీసం ఒక నెల రోజులు తను అక్కడే ఉంటూ అక్కడ వంట చేయడానికి వచ్చిన వారికి ప్రతి ఆహారం తను అనుకున్న రుచి వచ్చేలా ఎలా చేయాలో కొలతలతో నేర్పించడం చేసింది .
అందువల్ల అన్ని శాఖలలోనూ ప్రతి రోజూ ఒకే రుచి. రుచి, శుచి, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తను అనుకున్న విధంగా విజయం సాధించగలిగింది.
వ్యాపారం లో ఎంత బిజీగా ఉన్నా శ్రీను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు సుజాత. మంచి కాలేజీలో ఇంటర్ చదివాడు.
ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ చదువుతున్నా తన ఆశయం అది కాదని తెలుసు కనుక డిగ్రీలో చేరాడు శ్రీను. చదువులో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. పీజీ చదువుకుంటూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.
తల్లి కష్టం, మనసు అర్థం చేసుకున్నాడో ఏమో చిన్ననాటి నుంచి తల్లి కలనే తన కలగా చేసుకుని కలెక్టర్ అవడం కోసమే చదివాడు. గత రెండు ప్రయత్నాలు విఫలం అయినప్పుడు కుంగిపోకుండా ముచ్చటగా మూడో ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.
ఈ సంతోషానికి అవధులు ఉన్నాయా? అసలు ఇది నిజమేనా? తను కలగంటోందా? చేతి మీద గిల్లుకుంది సుజాత. ‘అబ్బా!’ నొప్పి తెలుస్తోంది. అయితే ఇది నిజమే అన్నమాట.
వెంటనే ఈ ఆనందాన్ని తన తల్లిదండ్రుల తోటి, అన్నా వదినల తోటి పంచుకోవాలి. తన స్టాఫ్ అందరికీ శ్రీను వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి.
“అమ్మా, నేను కలెక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంక ఏ మాత్రం కష్టపడొద్దు.నాతోటే ఉండాలి. ఈ ఆంటీలందరికీ నేను ప్రభుత్వ రుణాలు వచ్చేలా చేసి సొంత వ్యాపారాలు చేసుకునేలా చేస్తాను,” అని చెప్పే శ్రీను అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. ఆలోచిస్తూ సోఫాలోంచి లేచింది తన పుత్రోత్సాహాన్ని అందరితో పంచుకోవడం కోసం సుజాత.
రచన : కట్టెకోల విద్యుల్లత
6302805571
మొదటి కాకతీ రుద్రుని కళాపోషణకి, కళారాధనకి శాశ్వత ఉదాహరణగా నిలిచిపోయిన మహామంటపము ఉన్నరామప్ప గుడికి మేమందరము వెళ్ళాము సెలవలు మొదలవగానే. ఆ కట్టడం నిర్మాణం ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం వరకు మేమందరము అక్కడే గడిపాము. ఆ తరువాత రోజున నాతో వచ్చిన వాళ్ళందరూ వేరే ప్రదేశాలు చూడటానికి వెళ్లారు.
నేను ఆరోజు కూడా అక్కడే ఉండిపోయాను. మరోసారి మనసారా ఆ మహామండపంలోనే గడపాలనిపించింది. అందుకు ఒక ప్రత్యేక కారణం కూడా ఉన్నది. తెలుగు దినపత్రిక లో నాడు నేడు అనే శీర్షికలో ఒక్కపుడు అదే రోజున సంఘటనలను గుర్తుచేసే అంశాలు ప్రచురించబడతాయి. ఆ రోజున కూడా నేను దినపత్రిక తిరగ వేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని నాలుగు-అయిదు శతాబ్దాలకి చెందిన బుద్దుడి శిల్పాలను డైనమిట్స్ ని ఉపయోగించి పేల్చివేయబడ్డాయి అన్న వార్త చదివినప్పుడు మనసు కలచివేసింది. విదేశీ దాడులనుంచి మన శిల్పసంపదను కాపాడుకోవడం కోసం కొన్ని దేవత మూర్తులను ఉన్న చోటునుంచి తరలించి దాచారని, అలాగే కదల్పలేని పెద్ద శిల్పాలను మట్టి కుప్పలలో దాచి ఉంచారని చరిత్ర పాఠాలలో చదివినప్పుడు నిజమేనా అనిపించింది. కానీ ఈ సంపద ఒకసారి చేయిజారిపోతే తిరిగి పొందడం అసాధ్యం.
ఈ శిల్పాలు మానవ మేధస్సుకి ప్రతీకలు. అలాటి శిల్ప సంపద మానవాళి పురోగతికి సాక్షులుగా ఎంత కాలమైనా నిలిచిఉంటాయి. కేవలం మానవ మస్తిష్కంలో చేరిన ద్వేషం అనే చీడ పురుగు యొక్క అతి భయంకరమైన రూపమే ఈ చర్య. మన ఈ అపూర్వ మైన శిల్ప సంపదను కాపాడుకోగలమా అనిపించింది. అందుకే నా మనసు తీరా ఆ దేవాలయ ప్రాంగణంలో ఇంకొద్దిసేపు గడపాలని అక్కడికి చేరుకున్నాను.
ఆ తరువాత రుద్రేశ్వరుని కోసమై నిర్మించిన ఆలయ వేయిస్తంభాల మంటపం చేరుకున్నాను. ఆ వేయిస్తంభాల మధ్యన తిరుగుతూ మంటపం మధ్యకి చేరుకున్నాను. ఎంతో చల్లగా హాయిగా అనిపించింది. అక్కడ స్థాపించబడిన శిలా శాసనం దగ్గర నిలబడి ఆ ఆలయ నిర్మాణ తీరుని గురించి తెలుసుకున్నాను. ఆ ఆలయ నిర్మాణానానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో కూడా తెలియాడేటంత తేలికయినవని చదివి అబ్బుర పడ్డాను. మానవ శాస్త్రీయ సాంకేతిక నిపుణతకి ఈ నిర్మాణం ఒక మైలురాయి అనిపించింది. అలా ఎన్నో శిల్పాలను తనివితీరా చూస్తూ వాటితోనే మమేకమైన నేను ఎంత సేపు అక్కడే ఉన్నానో తెలియలేదు. అప్పటికి సందర్శకులు కూడా తగ్గిపోయారు. ఆ మండపం మధ్య భాగంలోని నక్షత్ర ఆకారములో ఉన్న అష్టదళ పద్మం ని చూస్తూ ఒక విధమైన ధ్యానస్థితి లోకి వేళ్లానేమో. గాఢమైన సుషుప్తి.
***********************************
అంతా చీకటి. ఎక్కడి నుంచో సన్నని వెలుతురు. అక్కడి నుంచి నన్నెవరో పిలుస్తున్నట్లనిపించింది. ఆ వెలుగు రుద్రేశ్వరుని ఆలయం లోనున్న దీపం నుండి అని అర్ధమయింది. ఎవరు కనిపించలేదు. కానీ ఒక మధురమైన స్వరం నన్ను పిలుస్తున్నట్లనిపించి అటువైపుగా నడిచాను. అది రుద్రేశ్వరుని కోసం నిర్మించబడిన గర్భాలయం. ఎవరో అక్కడ నిల్చున్నట్లనిపించి అక్కడకి చేరుకున్నాను. గర్భాలయద్వారం కిరువైపులా వింజామరులు వీచుతున్న సుందర నారీమణుల అద్భుతమైన శిల్పాలు. అవి శిల్పాలు – కాదు శిల్పాలుగా చెక్కబడిన శిలలు. ఆలా అనుకుంటూ వెళ్ళడానికి తిరిగాను .
“ఓయీ!సందర్శకుడా!. ఇంత దూరం వచ్చి మాతోటి మాట్లాడకుండా పోతావేమిటీ?”అని నాతో అన్నట్లనిపించి వెనక్కి తిరిగాను. ఆశ్చర్యం ముప్పిరిగొనగా గర్భాలయం ముఖ ద్వారం దగ్గరికి చేరుకున్నాను. నా ఎదురుగ ముఖమండపద్వారానికి ఇరువైపులా నిలుచుని ఉన్న శిల్పసుందరీమణులు. వారిలోంచి ఒక శిల్పకాంత నాతో మాట్లాడుతున్నది.
“నీకు నన్ను చూస్తే ఆశ్చర్యమనిపిస్తున్నది కదూ! శిలలు మాట్లాడటమేమిటీ అని అనుకొంటున్నావా? శిలలపై సప్త స్వరాలూ పలికించిన మేధావి మా చేత మాట్లాడించలేడా! ఆ శిల్పకారుడి కళానైపుణ్యానికి కదలి, కరిగి ఆత్మరూపమై సుందర మానవాకృతిలోకి పరిణామం చెందిన మదనికను. నా కధ ఆలకించుదువా?” అని మదనిక చిరుదరహాసంతో అడిగింది. వశీకరించబడినట్లు నేను ఆమె చెప్పబోయే కధని వినడానికి ఆమె ముందు మోకరిల్లాను.
“కాకతీరుద్రుని సామంతుడు రుద్రాసేనాని కాకతీయ కళావైభవానిక ప్రతీకగ ఈ ఆలయ మంటప నిర్మాణము చేపట్టడం జరిగింది. ఎందరో తపస్యుల పూజాఫలం ఈ మంటపము. ఆ సమయంలో ఎందరో మహా శిల్పులు రుద్రసేనాని సభలో ఆసీనులై ఉన్నారు. జయ సేనాని ఆచార్యులందరికి వారి హొదానుసారంగా నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ముఖ మండప నిర్మాణం ఎవరికి అప్పగించాలి అన్న యోచనలో ఉన్న రుద్రేశ్వరునికి ఎదురుగ మధ్యవయస్కుడైన శిల్పి వచ్చి నిలుచున్నాడు. జయసేనాని అతన్ని పరికించి చూసాడు. సూక్ష్మ దృష్టి గల విశాల నేత్రాలతో, శిలలతో బంతులాడినట్లుండిన భుజస్కంధాలతో, ఉలితో ప్రబంధ రచనలు చేసినట్లు కాయలు కాచిన చేతులతో అతను కనిపించాడు.
పట్టుపీతాంబరం మోకాలి పైవరకు మడిచి, పైన ఏ ఆచ్చాదనా లేక కేవలం గాయత్రి మంత్రం సంప్రోక్షణతో పవిత్రమైన జంధ్యం ధరించి, నుదుటి పైన విభూతి , ఫాలభాగం మధ్యలో దేవి కుంకుమ తో బ్రహ్మ కై తపస్సు చేసిన తపస్విలా , అర్ధాంతరంగా తపస్సును చాలించి వచ్చిన రాజర్షి విశ్వామిత్రునిలా కనిపించాడు ఆయన.
“తమరి పేరు?”
“విరించి”.
“తమరి అనుభవం?” మళ్ళీ ప్రశ్నించాడు.
“తమరు అవకాశమిస్తే శిల్పాకృతిలో చూపిస్తాను.” ఎంతో ఆత్మ విశ్వాసం ఆయన స్వరంలో కనిపించింది.
“మంచిది. తమరికి ముఖ మండప నిర్మాణ విధిని అప్పగిస్తాను. తమరి ప్రజ్ఞ పాటవాలు నిరూపించుకోండి. ఉత్తమమైన పనికి రాజ బహుమానం. నష్టమైనచో రాజ దండన. ఈ రెండింటికి సిద్దమేనా ?”
తలాడించాడు విరించి అంగీకారంతో. జయసేనాని అనుజ్ఞ పత్రం ఇచ్చి సభాభవనం నుండి రుద్రాసేనాని తో సహా నిష్క్రమించాడు.
విరించి తృప్తిగ ఇల్లు చేరుకొన్నాడు. తన సతి భారతి కి జరిగినదంతా చెప్పాడు. రేపటి నుండి తను ధ్యాన నిమగ్నుడవుతానని, ఎలాంటి అవరోధం కలిగించకూడదని ఆమెకు చాల నిష్కర్షగా చెప్పాడు. ఆ రాత్రి అంతా విరించి హృదయం పరిపరి విధాల ఆలోచనలతో నిండి పోయి నిదురకు దూరమైంది.
**********************************************
ప్రాతః కాలం కలకూజితారావాలతో మనోజ్ఞమైన రవికిరణ శోభలతో ప్రకాశించింది. పెరటి లో ఉన్న మోటుబావి లో కి దిగి కాసేపు ఈత కొట్టి, పైకి చేరి సూర్యనమస్కారములను ఆచరించి దేవుని మందిరంలో మృగాసనం పై పద్మాసనాసీనుడై గాయత్రీ మంత్రోచ్ఛారణ మొదలు పెట్టాడు విరించి.
“ఓమ్ భూర్భువఃస్వాహా ; ఓంతత్స వితర్వరేణ్యం ;
భర్గో దేవస్య ధీమహి ; దీయో యోనః ప్రచోదయాత్.”
జ్యోతి ధ్యానం తో ప్రారంభమైన విరించి ఓంకారం మనసులోమెదులుతుండగా తిన్నగా కనులు మూసుకున్నాడు. తాను చూస్తున్న జ్యోతి కిరణాలూ శరీరమంతా వ్యాపించాయి. అంతర్లీనంగా విరించిలో దివ్యమైన కాంతి ప్రజ్వరిల్లుతున్నది. ఆయన భృకుటి విశాలమైంది. అంతర్మధనం ఆగిపోయింది. అన్వేషణ మొదలయింది.
కుండలిని స్థానంలో ప్రారంభమైన ఆ కాంతి పుంజం నాభి స్థానం, ఉదర స్థానం, హృదయస్థానం, కంఠ స్థానము , అధర స్థానము దాటి భృమధ్య స్థానం చేరుకున్నది. అక్కడ కేంద్రీకృతమైనది.
మిరిమిట్లు గొలిపే దివ్య కాంతి. తెల్లని హిమవత్ పర్వత శ్రేణి, కైలాసగిరి. ప్రధమగాణ పరివేష్టితుడై లయకారుడు,మృత్యుంజయడు, గంగ-గౌరి సమాలంకృతుడు, యోగీశ్వరుడు యోగముద్రను వీడి నాట్య ముద్ర లోకి వచ్చాడు. సృష్టిని లయించి, తిరిగి సృష్టికి ఆధారమైన పంచభూతాల అధినాధుడు నర్తిస్తున్నాడు. రౌద్రం మూర్తీభవించిన వేళ లయం చేస్తాడు, కారుణ్యంతో కనికరించి సృష్టి ని కాపాడే ఆ దేవదేవుడు వాయు రూపుడై, జ్యోతిస్వరూపుడై ,సైకతరూపుడై , మనోరూపుడై, జలరూపుడై , సమస్థ సృష్టికి ప్రాణనాధుడై నర్తించే శివుని పదఘటనలలో లీనపైపోతుంది ఈ సృష్టి. అతడే రుద్రేశ్వరుడు . ఆ స్వామి అలసిన వేళ వీవన లేచే సుందరి సామాన్యురాలు కాదు. ఆయన శిరస్సునే పీఠం చేసుకున్న గంగాభవాని,అర్ధభాగంలో ఇమిడిఉన్న ఈశ్వరి, ఫాలనేత్రం లో విరాజిల్లే దివ్యజ్యోతి గాయత్రీ, సౌందర్య లహరే ఆ దేవా దేవునికి వింజామారలు పట్టాలి. అలాంటి దివ్య సుందరమూర్తులే రుద్రేశ్వరుని ద్వారానికి అలంకారాలుగా నిలవాలి. విరించి ధ్యానం ఫలించింది. దివ్య సుందర రూపం గోచరించింది. అద్భుతమైన స్త్రీ మూర్తి వింజామర ను పట్టి ఎదుట నిలిచింది. విరించిలోని శిల్పి మేల్కొన్నాడు. ఆ దివ్య సుందరి ఆకార లక్షణాకృతి మనసుతోనే బేరీజువేసాడు.
“ధన్యోస్మి” అని కనులు తెరిచాడు.
**************************************************
అప్పటికి సరిగ్గా మూడురోజులయింది సేనాని ఆమోదం పొంది.
విరించి వడివడిగా ధ్యానాసనం నుండి లేచాడు. అలౌకికమైన ఆనందం ఆయన ముఖంలో తాండవిస్తుంది. ఆయన సతి భారతి భర్తను పలకరించలేదు. ఆమెకు తెలుసు తన పలకరింపు ఆయన తపస్సు ను భగ్నపరుస్తుందని.
వడివడిగా విరించి వంటి మీదన ఉన్న ధోవళి తోనే మండపానిర్మాణ స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే కొందరు శిల్పాచార్యులు పనులు ప్రారంభించారు. మావటివాళ్ళు నల్లరాతి గండ్ర శిలలను ఏనుగుల సాయం తో అక్కడకి చేరుస్తున్నారు. విరించి శ్రేష్టమైన పది అడుగుల పొడవు, నాలుగుఅడుగుల వెడల్పు ఉన్ననల్ల రాయిని ఎంచుకున్నాడు. గాయత్రి,గణపతి మంత్రోఛ్ఛారణతో ఆ శిలని సంప్రోక్షణ చేసాడు. పసుపురాసి కుంకుమ అద్దాడు. ఆ శిల కెదురుగా పద్మాసనంలో కూర్చొని తమ వంశ మూలపురుషులను తలచి, విశ్వకర్మ ను ధ్యానించి ఉలి చేతపట్టాడు.
“ఓయీ సందర్శకుడా వింటున్నావా ! నా ఈ ఆకృతి రావడానికి కొన్ని నెలలు పట్టింది. తల్లి గర్భంలో పిండస్థ దశలో ఉన్న శిశువు నవమాసానికి స్పష్టమైన ఆకృతిని పొంది , తల్లి ప్రసవవేదనతో అతి రహస్యమైన యోని మార్గంగుండా ఈ ప్రపంచంలోకి వస్తుందో, అలాగే నేను ఆవిర్భవించాను. ఒక గండ శిలాకారంలో ఉన్న నేను,కంటికి కనిపించని మేధాశక్తి తో శిల్పిహృదయాంతరాలలో ఎదుగుతూ ఈ సుందర రూపంతో పృధ్వి పైకి వచ్చాను.
వయ్యారంగా సుందరసుమనోహరముగా అలవోకగా వింజామారను ఎత్తి నిలుచుని ఉన్న నా ఈ భంగిమ కి రుద్రేశ్వరుడు సహితం అచ్చరువొంది తన నాట్యం నిలిపి, నా వింజామర గాలికి సేద తీరునేమో అన్నంత అద్భుతంగ నన్ను మలిచాడు నా జనకుడు విరించి. ఆలా అనేకానేక సుందర శిల్పలకు ప్రాణం పోసి తాను చరితార్థుడైనాడు.
“ఓయీ విను! మీరు చంచల మనస్కులు. మేము నిశ్చలంగా ఉంటాము. మా మనసులు అకల్మష క్షేత్రాలు. మేము శాశ్వతం. మాకు మరణం లేదు. ప్రకృతి ఉత్పాతాలను ఎన్నింటినో దాటుకొని జరిగిన కొన్ని శతాబ్దముల చరిత్రకు సాక్షులం. నేటివరకు మానవ జిజ్ఞాసకు, మేధస్సు పరిణామానికి షట్ సాక్షిభూతమై నిలిచిఉన్నాం. పృథ్వి నిలిచి ఉన్నంత వరకు ఈ ప్రకృతి విలయతాండవం మమ్ములనేమి నేమి చేయలేదు.ఒక్క మానవుని వికృత ధోరణి తప్ప. పరిణామక్రమములో వెర్రితలలు వేస్తున్న మానవ వికాసానికి బలికావలసి వస్తున్నది. మతద్వేషాలతో మమ్ములను అందవిహీనంగా చేసారు. స్వార్ధంతో మమ్ములను విఫణి వీధులలో చేర్చారు. అయినా మీ మనసుకు తృప్తి కలగండంలేదు. కొన్ని వేల మంది కళాకారుల తపోఫలమైన మా మీద కూడా మీరు దాడిచేస్తున్నారు. మమ్ములను చూస్తే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా! విను! ఈ మానవాళి శాంతి అనే పదంకూడా వినపడని ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఆ అశాంతి లో శాంతి కోసం మమ్మల్ని వెదుకుతూ తిరిగి మా చెంతకే చేరుకుంటారు. ఇదే ఈ శిలాసుందరి మదనిక ఇచ్చే శాపము-వరము”, అని ఆ మదనిక చిరుధరహాసం తో మౌనం గ నన్ను శాసిస్తున్నట్లు నిలిచిపోయింది.
**************************************
ఒక్కసారిగా ఉల్లికి పడి లేచాను. నా చుట్టూ పరికించాను. నిశబ్దంగా జరిగిన , జరుగుతున్న , జరుగబోవు చరిత్రకు పంచభూతాలతో పాటుగా షట్ట్ సాక్షిభూతులుగ నిలిచి ఉన్న ఆ శిల్ప కళాఖండాలు కనిపించాయి. శిల్పసుందరి మదనిక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. శాపంలాంటి వరమా లేక వరంలాంటి శాపమా ఇది? రాబోయేతరాలే నిర్ణయించాలి.
చంద్రమ్మ పోలీసు స్టేషన్ మెట్టుపైన నిలబడి “సార్” అని పిలిచింది . చేతిలో రక్తం అంటుకుని ఉన్న కొడవలిని గట్టిగా పట్టుకుని, కంటినిండా ఉబికి వస్తున్న నీరును కొంగుతో తుడుస్తున్నది. జమేదార్ ధర్మరాజు ఫోన్ లో ఎదో మాట్లాడు తున్నాడు అందువల్ల తన ముందుకు ఎవరో వచ్చి అడిగేది తెలుసుకోకుండా రైటర్ వైపు వేలు చూపతూ అటుగా పంపాడు. చంద్రమ్మ అటుగా వెళ్లి రైటర్ నగేష్ ముందు నిలబడి అంది “సార్ , రాసుకోండి”
“చెప్పు ఏమిటి సంగతి, రాస్తవా , నేనే రాయాల్నా” అన్నాడు నగేష్, తల ఎత్త కుండానే.
“రాసుకోండి సార్, నా పేరు చంద్రమ్మ, నా భర్త పేరు సూర్యుడు. మాది రామన్నగూడెం.” ఆగింది.
“ చెప్పుకు౦ట పో, రాస్తున్నా, ఆగకు ”
“ నేను ఒకణ్ణి కొడవలి తో పొడిచిన, ఇదే కొడవలి”..
తలెత్తి చంద్రమ్మను చూసాడు నగేష్. ఆయన ముఖంలో రంగులు మారాయి, ఒక్కసారిగా గావుకేక వేసాడు “ సార్ , జమేదార్ సాబ్ , తొందరగా రాండి, ఈమె ఏం చుప్పుతున్నదో నాకు తెలుస్తలేదు, …అయ్యోఎస్సై రాండి “
కంగారుగా చూసాడు ధర్మరాజు, వెంటనే రైటర్ నాగేద్ష్ వద్దకు పరిగెత్తాడు. మూడు నిమిషాలు చూస్తేగాని తెలియలేదు పరిస్థితి. “ నీపేరు చంద్రమ్మ కదా , ఇది వరకు రెండుమూడు సార్లు స్టేషన్‌కు వచ్చినావు”
“అవును సారు” అంది చంద్రమ్మ “ కాని మీరు నన్ను పట్టించుకోలేదు కదా”
“సరేకాని, ఇదేంది నీ అవతారం, శివం ఎత్తుతున్నావు, ఆ కోడవలెంది , రక్తం ఏందీ, మేకనో గొర్రెనో కొసినావా, లేకుంటే ఏకంగా మనిషినే కోసినావా ఏందీ”
“అవును సారు మనిషినే కోసినా” “నా మీద కేసు రాసుకోండి”
ఎగాదిగా చూసాడు ధర్మరాజు “ నిజంగానా, అయితే ఎవ్వరిని కోసినావు, ఎందుకు సంపినావు ..
నగేషు రాసుకోరా. …ఒరేయ్ వెంకన్నా ఎస్సై గారికి ఫోన్ చేసి చెప్పు” “ నువ్వు చెప్పు తల్లి”
చెప్పుతూ పోతున్నది చంద్రమ్మా.
“ అయ్యా. నాపేరు చంద్రమ్మ నా పెనిమిటి పేరు సూరీడు , మా ఊరు రామన్నగూడెం, మా పెండ్లి అయ్యి నాలుగు ఏండ్లు దాటింది , ఇంకా పిల్లలు కాలేడు. రెండు ఎకరాల తరిపోలం వున్నా అది చేసుకుంటూ కూలికి పొతం, మా మామ సచ్చిపోయిండు, అత్త ముసల్ది “
“ ఈ విషయాలు ఎందుకు గాని, అసలు విషయం చెప్పు, చంపినా విషయం ”
“ అట్లనే సార్, ఎప్పటిలాగానే నేను బావికాడ గొడ్లకు మేతేస్తున్నా, సూరీడు పొలంల కలుపు తీస్తున్నాడు,
అప్పుడు వచ్చిండు వాడు దస్తగిరి, మీకు తెలుసుగదా వాడు, మీ టేశను కాడికి వస్తడు వారానికోపారి సంతకం పెడతాడు చోర్ సాలేగాడు,ఎవ్వరినో చంపినా కేసులో సిచ్చపడి జేలుకు పోయిండు చూడు వాడే, వాని కండ్లు ఎప్పుడు నామీదనే, వానికి బుద్ది చెప్పమని మీ తెశానుకు మూడు సార్ల వచ్చిన అందుకే, కాని మీరు వానికి బుద్ది చెప్పలే , మీరు చూడకున్నా భగవంతుడు ఎటు చూస్తాడు వానికి ఎదో హత్య కేసులో జైల్లో వేసిన్రు, ఇప్పుడు వాడు జైలు నుంచి మూడు నెలల కోసం బయటకు వచ్చిండట గదా ..అదేదో అంటరుగదా, ఎందబ్బా అది …”
“అదేలే దాన్నిపెరోల్ అంటరు, అవును వాడు మా స్టేషన్ లో దినం విడిచి దినం వచ్చి హాజారు ఇయ్యాలి గదా , వాడు వస్తున్నడారా , ఒరేయ్ వెంకటేశు.,” “ లేదు సార్, వారం దాటింది, ఏందిరా అంటే , నువ్వూరుకో , నేను పెద్ద సారుకు చెపుకున్న తీ అంటున్నాడు” అక్కడి నుండే చెప్పాడు వెంకటేశు.
“సరేతియ్యి, ఆయనే చూసుకుంటాడు మంచో చెడో, మనకేంది, నువ్వు చెప్పు చంద్రమ్మా”
“ అదే సారు , వాడు మూడు రోజులనుండి నా వెనుకాల తిరుగుతున్నాడు, ఏందిరా అంటే నువ్వు నాతోటి గా ఎస్సై సారు కాడికి రావాలే, నువ్వు వస్తేనే వాడు నా పెరోలు అయినంక నా మంచి ప్రవర్తన మీద సంతకం చేస్తాడట, అందుకే నువ్వు రావాలి, కాని లొల్లి పెట్టి మీరిద్దరు చెర్ల పడి సావుండ్రి అని తిట్టి పంపిన, కాని నిన్న మర్ల వచ్చిండు బాయికాడికి, ఎంత కాదన్నా వింటలేడు , పెద్దలోల్లి జరిగింది, దాంతో వానికి పట్టుదల పెరిగింది, కోపంతో ఊగిపోతూ నన్ను బిగ్గరగా ఒడిసి పట్టుకున్నడు, కిందికి తోసి ..తోసి నువ్వు రాకున్న ఏంటిది నేనే నిన్ను.. అంటూ నా చీరను లాగుతున్నాడు .. నాకు దిక్కు తోచలేదు, మా సూరిగాడు దూరంగా వున్నాడు నా అరుపులు వానికి వినపడ్త లేవు, ఇంక వీడు నా మానం చెడగోట్టుడు కాయం అనుకున్నా, నా చేతులు బూ౦ మీద ఏదైనా ఆదారం కోసం వెతుకులాడినయి. అప్పుపు తగిలింది నా కొడవలి, అందుకుని ఒక్క వేటు వేసిన, అంతే పక్కకు ఒరిగిండు.నేను లేచి చూసిన, వాడు బాదతో మెలికలు తిరుగుతున్నాడు. అంతా రకుతం వరద , నా పెనిమిటి సూరీడు వచ్చిండు , వచ్చి ముక్కు తాన వేలుపెట్టి చూసి “ఊపిరి ఆడ్తలేదు గదా, సచ్చినట్టు అనిపిస్తాంది, అంతేనా సూడు నువ్వు కూడా , నాకు బయం అయితాంది చంద్రమ్మ , ఇప్పుడెట్లా, తొందర పడ్డవే చంద్రమ్మ, నేనోచ్చే దాంక ఆగక పోయినావా”
“ ఆహా , ఇంకాతయితే వాడు నా మానం మీద దాడి చేసేవాడు. మంచి పని అయింది ముండా కొడుకు సచ్చిండు. నువ్వు ఇక్కడే వుండు నేను పొలిసు టేషన్ కు చెప్పుతా, నాకు ఏం బయం లేదు, సరేనా”
“నేను కూడా వస్తా నీతోటి , సచ్చినోడి తోటి నాకేం పని, పదా”
ఇద్దరం కలిసి వచ్చినాము , వాడు బయట కూకున్నాడు , అన్ని ఇగురంగా చెప్పిన , ఇంక మీ ఇష్టం సారు, నన్ను కాపాడుతరో జైళ్ళ పెడుతరో మీ దయ,”
ధర్మరాజు నిశ్చేస్టుడు అయాడు, ఈ కాలంలో కూడా ఇంత నిజాయితా !!! చదువుకున్న వారు, నాగరికుల మనుకునేవారు, చట్టం తెలిసినవారు కూడా ఇలా ఉంటారా నిజాయితిగా, చంద్రమ్మ నువ్వు గోప్పదానివి…
“కాని చంద్రమ్మ, ఆ టైముల నీకు కొడవలి దొరుకక పోతే ఏం చేసేదానివి, వాడు నిన్ను …”
“అవును సారు నాకు దేవుడు దారి చూపిండు, లేక పోతే నా మానం పోవును తర్వాత నా పాణం కూడా పోవు, అయినా సార్ , నా మనం కన్నా పానం ఎక్కువగా కాదు. మానం పోయి ఇంకా బతికుంటే నేను చచ్చే దాక “దీన్నే వాడు ఆ దస్తగిరి మానం తీసుకున్నాడు ఛీ,ఛీ’ అని దెప్పి పొడిచి చంపేవారు జనం. అంతకన్నా నేను జైళ్ళ వున్నా మంచిదే , మానం కాపాడుకున్నా పిల్లా అంటరు గదా, పోగుడ్తరు కూడా “ …
“వెంకన్నా ఎస్సై గారికి ఫోన్ కలిసిందా, లేదా , లేకున్నా మనమే పోదాం , అఫ్జల్ గానికి ఫోన్ చెయ్యి జీపు కావాలని, డిజలు పోయించుకుంటామని చెప్పు లేకపోతే వాడు నానడు, గులుగుతడు, వెంటనే రమ్మని చెప్పు,
“ ఒరే రైటరు నువ్వుకూడా రారా , పంచనామా రాయాలి గదా , నలుగురు రండి, నాగేషు నువ్వు వుండు ఇక్కడ స్టేషన్ల, సార్ వస్తే సైట్ కు రమ్మను, నేను కూడా చెప్పుతలే, అట్లనే సుదర్శన్ చంద్రమ్మను సెల్ లో పెట్టు. ఆమె తెచ్చిన కొడవలిని ఎవిడెన్స్ కవర్ లో పెట్టి లేబుల్ పయిన వివరాలు రాసి అతికించు , స్టేషన్ భంద్రం సుమా”
జీపు రాగానే అందరు వెళ్ళిపోయారు వారి వెంట సూరీడు కూడా వెళ్ళాడు . ఒంటరిగా లాకప్ లో చంద్రమ్మ కూర్చుని వున్నది .
***** *****
జీపు రామన్నగూడెం చేరుకునే సరికి సాయంత్రం నాలుగయింది, దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి సూరీడు భావి వద్దకు చేరుకున్నారు , “బాడి ఎక్కడ ఉన్నదయ్య చూపించు సూరీడు” అన్నాడు ధర్మరాజు .
శవాన్ని చూస్తూ “ఈయన ఐ.డి కార్డు గాని ఉన్నదో చూడురా నాగేషు”.
“వున్నది సార్ ,చెంచల్ గూడా జైలు వారి కార్డు వున్నది”.
దాన్ని పరిశీలించి చూసి వాడు దస్తగిరి చెంచల్ గూడా ఖైదీ అని నిర్ధారించు కున్నాడు. చుట్టుతా పరిశీలించి నోట్ చేసుకున్నాక శవ పంచనామా జరిపించి, బాడీని ఆటోప్సి కొరకు ఎం.జి .ఎం హాస్పిటల్ కు ఒక ట్రాక్టర్ లో పంపించాడు. తాను చేసిన పని అంతా వివరంగా ఎస్సై కి ఫోన్ చేసి చెప్పాడు కూడా …
“మంచి పని చేసినావు రాజు, చెయ్యాల్సిన పనులన్నీ పూర్తి చేసినావు , నేను రేపు ఉదయం రాగానే వివరాలు చూస్తాను, సరేనా”
***** ** *****
పోలీసు స్టేషన్ లోని సెల్లో ఒంటరిగా దిగులుగా కూర్చున్న చంద్రిక మనసు పరిపరి విధాల పోతున్నది.
గతం అంతా కళ్ళ ముందు కదలాడుతున్నది. సూరీడు తనను పెండ్లి చేసుకునాడానికి పడ్డ పాట్లు నవ్వు తెప్పింఛి నాయి తనకి. నిజానికి తన వెంటపడిన మగాడే లేదు అప్పటివరకు. ఎవ్వరుకూడా తన వైపు చూసే దైర్యం చెయ్యలేదు. తనంటే అంత హడలు అందరికి. కాని సూరీడు మాత్రం తనను దొంగ చాటుగా చూసేవాడు . ఒకనాడు మాత్రం ఎదురుపడి అడిగాడు “ నీకు ఒక మాట చెప్పొచ్చా , నువ్వు ఏమననంటే చెప్పుతా అదిగూడా”
రెండుమూడు సార్లు చూసింది వాడ్ని, మెతక మనిషి అనుకున్నది. “ఏందీ చెప్పు తొందరగా , వెనుకాతల నాకు పని వున్నది” “మరి నువ్వు నన్ను తిట్టొద్దు కొట్టొద్దు,” నాయి ఆగిండు కాసేపు నేను ఏమి చుపుతాననోనని, కాని తాను కన్నుబొమ్మలు ఎగిరేసింది, నవ్వును ఆపుకుంటూ…”నువ్వు శాన బాగుంటావు చంద్రమ్మ, నిజం మా అమ్మ మీద ఒట్టు” అంటూ దూరమా జరిగాడు తాను ఎక్కడ కొడతానో అని..ఏమి అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ దొంగ చూపులే తరవాత తమని కలిపింది. సూరీడి పెద్ద అందగాడేమి కాదుగాని మంచి మనిషి ప్రాణం ఇచ్చే మనిషి, పైగా వాడికి ఎవ్వరు లేరు ఒక్క మంచాన పడ్డ తల్లి తప్ప. ఒకసారి ఆ ముసల్ది తన చేతులు పట్టుకుని అడిగింది. “ అవ్వా చంద్రమ్మ, నువ్వు మాఒడ్ని కట్టుకుంటే నేను ఏ దిగులు లేకుండా సచ్చిపోత, ఎట్లైనా నువ్వు ఊ అనాలే చంద్రమ్మ, మావోడు శాన మంచోడు, నీకు ఎట్లాంటి కష్టం పెట్టడు. వాడి అమాయకానికి నువ్వైతేనే సరిపోతది.” నాకుగూడా అనిపించింది వీడితే నాకు సరి. తమకు నాలుగేండ్లు అయింది లగ్గం అయ్యి కాని ఇంకా పిల్లలు కలుగలే.. తనను ఆ దస్తగిరి గాడు నన్ను చెడగొట్ట బోతుంటే సూరీని ఆగం చూడాలే, వానితో కొట్లాడలేక పోతున్నాడు నన్ను కాపాడలేక పోతున్నాడు. అక్కడ గడ్డిని కోసే కొడవలి దొరికింది వానికి దాని అందుకుని దస్తగిరి మీదికి ఉరికిండు నరకడానికి. కాని వాడు ఒక్క తోపు తోసిండు, ఎగిరి పడ్డాడు దూరంగా, కాని తన చేతిలోని కొడవలిని తనవైపు విసిరివేసాడు, దాని అందుకొని దస్తగిరి ని ఒక్క వేటు వేసింది . వాడు కుప్ప కూలాడు .వెంటనే వాడ్ని వదిలిన్చుని దూరంగా జరిగింది, వాడు చచ్చాడో లేదో కూడా చూడకుండా దూర౦గాఎక్కువ పరిగెత్తారు. కొంత సేద తీరిన తరవాత సూరీడు అన్నాడు “వాడు నిన్ను సంపెస్తాడని అనుకున్నానే చంద్రి ..చాలా భయం వేసింది.. కాని ఒక్క మాట అడుగుతాను చంద్రమ్మా… నువ్వు ఒకవేళ వాని కోరిక తీరుస్తే ఇంత జరిగేది కాదేమో కదా ..” సూరీని చెంప చెళ్ళుమని మోగింది” ఏందిరా మొగడా,నా మానం పోయినంక నేను ఎట్లాగు సచ్చిపోత, తర్వాత నువ్వు మల్ల లగ్గం చేసుకోవచ్చునని అనుకుంటున్నావా, అట్ల జరగదు.నా మానం కన్నా నా ప్రాణం ఎక్కువ కాదు.కాని నేను చచ్చే ముందు వాడి పాణం తీద్దును.”అన్నది చంద్రమ్మ. అలా వాదించుకుని ఒక నిర్ణయానికి వచ్చిఇదంతా పోలీసులకు చెప్పడమే మంచిదని అనుకున్నారు. మొదట సూరీడే తాను చంపినానని చెప్తానని అన్నాడు. కాని తనే వద్దని వారించి ఆపింది. తన మానం కాపాడుకోసం తను చంపినా అంటే శిక్ష తక్కువైతది అని నచ్చచెప్పి పోలీసు స్టేషన్ కు కోడవలి పట్టుకుని వచ్చింది.
***** ***** *****
తనను ఎవరో పిలుస్తున్నరని కండ్లు తెరిచి చూసింది . ఎదురుగా ధర్మరాజు కూర్చుని వున్నాడు, సూరీడు పక్కనే చేతులు కట్టుకుని నిలబడివున్నాడు. ఆమెకు మంచి నీరు తెప్పించి ఇచ్చాడు ధర్మరాజు . నీళ్ళు తాగి అడిగింది “ఎం జరిగింది అన్నా, వాడు చచ్చిండా, అయితే ఇంకేంది నన్ను జేల్లో పెట్టండి” “ సూరీడు నువ్వు ఇంటికి పోరా అత్తమ్మ ఎదురు చూస్తది మనకోసం, అన్నం తిన్నాడో లేదో ఇంకా”…
“అప్పుడే ఎట్ల పెడతం జైల్లో .. కేసు కావాలి, కోర్టుకు పోవాలి అక్కడ నిన్ను ఎన్నేండ్లు జిల్లా పెట్టాల్నో జడ్జిగారు చెప్తారు. “
“మరి అట్లయితే” ఆగి అడిగిండు సూరీడు “నేను మా చెంద్రిని ఇంటికి తీస్కోని పోవచ్చా”
“అట్లెట్ల పోతావ్, ఆమె ఖూని కేసుల మెయిన్ అక్యూజ్ద్ , ఇంటికి పోడానికి రూల్స్ ఒప్పుకోవు,
“ఎందుకు సార్ ,మేమే వచ్చి లోన్గిపోయినంగదా , మమ్మల్ని మీరేమైనా పట్టుకున్నారా, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తం ‘, ఇంకేంది సారూ ..”
“ అట్ల కుదురదురా సూరీడు, నువ్వు లొంగి పోతే నీకు శిక్ష కొంచం తగ్గుతది అంతే గాని ఇప్పుడు పంపడం కుదురదు. నువ్వు పోతేపో, మల్లరా, అప్పటికి ఎస్సై గారు కూడా వస్తాడు ఆయనతో మాట్లాడి చెప్పుత “
కండ్లతోనే వెళ్తున్నట్టు చంద్రమ్మ కు చెప్పి బయటకు నడిచాడు సూరీడు ..
రాత్రి ధర్మరాజు చంద్రమ్మ తినడానికని హోటల్ నుండి టిఫిన్ తెప్పించాడు, చంద్రమ్మ తినాలని లేదని చెప్పినా ధర్మరాజు అన్నాడు “చెంద్రమ్మా, ఇంకా నీవు బతుకాలంటే ఈ తిండి అలవాటు చేసుకోవాలి తప్పదు, కష్టమైనా ఇష్టం లేకున్నా తినాలె”… తల ఊపి టిఫిన్ తిని నీళ్ళు తాగి పడుకుంది తన బతుకు ఎటునుండి ఎటు మారబోతున్నదో ఆలోచిస్తూ …
***** ****** *****
తెల్లవారి ఎనమిది వరకే సమస్యల పరిష్కారం కొరకు వచ్చినవారి తో స్టేషన్ నిండిపోయింది. ఎస్సై గారు చంద్రమ్మను ప్రశ్నించలేదు. చార్జ్ షీట్ రాయాలి. కేసు కోర్టుకు ఎప్పుడు పంపాలో అడగాలి. ఇంతకి ఈ ఎస్సై కుంతల్ రావు మహాశయుడు నిన్నటినుండి జాడ లేడు. ఫోన్లో కూడా దొరుకుతలేడు. వీడు వచ్చినప్పటినుండి స్టేషన్ పరువు పోతున్నది. పైసలు గుంజుదేకాడు, అమ్మాయిల సోకు కూడా ఎక్కువే. వీడు ఎప్పుడో ఎందుల్నో ఇరుకుతడు గాని అప్పుడే ఈ లోకం బాగుపడదు. ఆలోచిస్తూనే కానిస్టేబుల్ ని పిలిచాడు “ వెంకన్నా..ఎస్సై గారు వస్తనన్నడా, ఫోన్ చేసిండా” “ఇప్పుడే ఫోన్ చేసిండు, గంటల వస్తనన్నడు,, సాయంత్రం క్రయిం మీటింగు ఉన్నడట,
కేసు లిస్టు తయారు చేసి పెట్టమన్నడు”
“అదేదో రైటర్‌ను చూడమను, నిన్నటి డేడ్ బాడి అటోప్సి చేసి౦డ్రా , రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారో అడిగి ఎం జి ఎం కు పోయి నువ్వే పట్టుకురా”
ఇంతలో ఎస్సై వచ్చిండు బుల్లెట్టు మీద. వస్తూనే “రాజు రావయ్యా, నిన్నటి కేసు ఫైల్ పట్టుకుని” అన్నాడు
“గుడ్ మార్నింగ్ సార్, నిన్నటినుండి మీరు లేరు, మీ గైడెన్స్ లేకుండానే ఈ హత్యా కేసు పూర్తి చేసిన, ఒకసారి చూస్తే….సార్ మీ చేతికి ఏమైంది అంత పెద్ద గాయం. కట్టు కట్టిచ్చిన్రు కూడా …”
“ఎదో గాయం అయింది లే అన్ని చెప్పాల్నా నీకు… కేసు చెప్పు ముందు”
“ఈ రోజు చంద్రమ్మ ను కోర్టు కు తీసుకొని పోయి ఆమెను నాలుగు రోజులకు పోలీసు కస్టడి అడ్గుత”
“ఇంకా కస్టడీ ఎందుకు ? కన్ఫెషన్ కేసేకదా, మర్డర్ వెపన్ తో లొంగి పోయింది, స్టేట్ మెంట్ అంతా వీడియో రికార్డ్ చేసినవ గదా, అన్నిటిని కోర్టుల ప్రొడ్యూస్ చెయ్యి, ఒక కేసు తొందరగా క్లోజ్ చేసినందుకు మనకు రివార్డ్ వస్తది కదా, కొద్దిగా సోచాయించు రాజు”
“కాని సర్,ఇందుల ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా, మానను తప్ప పడతారేమో కోర్టు వారు”
“నీకు అన్ని అనుమానాలే వస్తే రాజు, నిజ౦ గా ఆ కాలపు ధర్మరాజువె, నేను PP తో మాట్లాడుతా, నువ్వు తీస్కోని పో, ఒకసారి నేను చంద్రి తో మాట్లాడుతా పదా, అట్లనే నాకు కన్ఫెషన్ వీడియో చూపు”
వీడియో చూసి నాక సెల్ లో ఉన్న చంద్రమ్మ ను చూసినాడు.
“నువ్వు కోర్టుకు తయ్యరుకా రాజు, నేను చంద్రమ్మ తో మాట్లాడుతా”
“వాడు దస్తగిరి కోరిక త్ఘీరుస్తే, ఒక పాణం నిలబడేది , నీకు ఈ కర్మ పట్టేది కాదు.ఎంత పని చేసినవ చంద్రమ్మ, ఇప్పుడు చూడు నీ పెనిమిటి ఏమైయితడో. అసలే అమాయకుడు, అందుల మీ అత్త మంచంల”
ఉగ్రంగా చూసింది ఎస్సై వైపు చంద్రమ్మ” వాడు నీ పేరే తీసిండు, అది చూస్కో మొదలు”
ఎస్సై ముఖం లో మార్పు గమనించాడు ధర్మరాజు, ఎర్రబడ్డది , కాని తేరుకుని ,
“ వాడు మా స్టేషన్ కు హాజరు ఇయ్యాలగద , అందుకే అనుంటడు, ఆ విషయం నీకేందుకులే గాని, నువ్వు ఇచ్చిన స్టేటుమెంటు కొంచం మార్చాల, నేను ధర్మరాజు కు చెప్తా మల్ల మార్చమని, లేకపోతే కేసు నడవదు”
“నేను చెప్పడానికి ఇంకా ఏమి మిగలలేదు. నన్ను కొట్టినా వేరే చెప్పనుగాక చెప్పను”
“నువ్వు ఎట్లా చెప్పవో నేను చూస్తా. చిన్న కిష్టయ్య కు ఎన్నముద్దలు ఎంత ఇష్టమో కొట్టుడు నాకు అంత ఇష్టం, ఆ దేవుడినే చూపిస్తా” అంటూ సెల్ తలుపు మూసాడు కుంతల రావు ..
***** ***** *****
కోర్టు ఆవరణ లో PP ఆఫీసు లో ధర్మరాజు తెచ్చిన ఫైల్ చూస్తున్నాడు విశ్వేశ్వర్ రావు.
“ఇందులో ఆటోప్సి రిపోర్ట్ లేకుండానే కేసు ఎలా రిజిస్టర్ చేస్తారు రాజు గారు , మీకు తెలియంది ఏముంది అంత తొందర ఏముంది, పైగా జడ్జి గారు కూడా ప్రోసీజురల్ ఫాల్ట్ చేసినందుకు చీవాట్లు వేస్తారు కూడా”
“ఇందులో కన్ఫెషన్ వున్నదని చెప్పి తొందర పడుతున్నారు మా ఎస్సై గారు “
“ సరే రిజిస్త్రిలో ఇవ్వండి చూద్దాం, ఈ రోజు బెంచి పైకి రావాలని చెప్పండి, అట్లనే పేషీ లో కలువండి”
రిజిస్ట్రి లో కేసు ఫైల్ చేసి కోర్టులో పిలుపుకై ఎదురుచూస్తూ కూర్చున్నారు. సాయంత్రం ఐదింటికి పిలిచారు. ఎస్సై కుంతల్ రావు కూడా వచ్చాడు. PP విశ్వేశ్వర్ రావు కేసు గూర్చి చెప్పడానికి లేచి అన్నాడు
“ యువర్ ఆనర్, ఇదొక బ్రూటల్ మర్డర్ కేసు. తన కొడవలి హతున్ని హత్యచేసి రక్తం తో తడిసిన కొడవలి తో పోలీసు స్టేషన్ లో లొంగిపోయింది. హత్యా తనే చేసినట్టు కన్ఫేస్ కూడా చేసింది, కేసు వివరాలకు వెళ్తే రామవరం గ్రామానికి చెందిన చంద్రమ్మ …”
“PP గారు ఈ రోజు కేసులు ఎక్కువగా విన్నాను, ఇక ఓపిక లేదు, నిన్దితురాలిని ఐదు రోజుల పోలీస్ కస్టడి కి ఇస్తున్న… ఈ నెల పదహారు నాడు పోస్ట్ చేస్తున్న.. సరేనా …” అన్నారు జడ్జిగారు … చేసేదేమిలేక తలూపారు అంతా . చంద్రమ్మను తీసుకుని తిరిగి స్టేషన్ కు తీసుకుని బయలుదేరారు..
ఆ రాత్రి ఏడు గంటలకు ఎస్సై ఇంటికి వెళ్ళగానే చంద్రమ్మ వద్దకు వెళ్ళాడు ధర్మరాజు ..
“చంద్రమ్మా” ఆప్యాయంగా పిలిచాడు. “పొద్దున్న నేను వెళ్ళినాక ఆ ఎస్సై నిన్ను ఏమని అడిగిండు.దెబ్బలు కొట్టినట్టున్నడు గదా, నాకు వివరంగా చెప్పు , నేను నీకున్న చెల్లెమ్మా, నీకు నా చేతనయిన సాయం చేస్తా, వాడి మాటలు నమ్మకు ఉత్త బ్రోకర్ గాడు”
“లేదన్నా, మీతోటి నేను చెప్పిన బయానా కాకుండా తను మార్చి ఇస్తా దాన్ని తిర్గి చెప్పాలన్నాడు, నేను కాదన్న, నేను చెప్ప౦దే సరిగ్గున్నాడని చెప్పిన, దాంతో కోపం వచ్చి బాగా కొట్టిండు, ఇగో ఇవ్వన్ని చూడు ఎట్లా కమిలినవో, అన్నా నేను ఇక్కడ ఉండనుగాక ఉండ నన్ను పంపించు అన్నా నీ కాళ్ళు మొక్కుతా”
“అట్ల వీలుకాదు గాని చెల్లె, నీమీద దెబ్బ పడకుంట నేను చూసుకుంట గాని, నువ్వు నీ బాయికాడ జరిగింది పురాంగా నాకు చెప్పలే, ఇంకేదో వున్నది, నీకు యాదిలేదో లేక దాస్తున్నవో అనిపిస్తున్నది, నువ్వు బాగా యాది చేస్కో, ఇగో నిన్న నువ్వు చెప్పిన విడియో ఇస్తున్న, దాని మర్లమర్ల చూడు,, నాకు రేపు చెప్పు సరేనా, అన్నం పంపిస్తా తిని గమ్మున నిద్రపో రాత్రికి భయం లేకుండా”..
అన్నం తిన్నాక వీడియోను చాలా సార్లు చూసింది చంద్రమ్మ, అంత సరిగ్గానే చెప్పినట్టు అనిపిస్తున్నది. ఆలోచిస్తూ మాగన్నుగా నిద్రపోయింది.
***** ****** *****
పొద్దున్నే సజ్జ రొట్టె తీసుకుని స్టేషన్ కు వచ్చాడు సూరీడు. “ ఈ రొట్టెలు తిను చంద్రి, రాత్రి ఏం తిన్నవో ఎప్పుడు తిన్నవో, ఎల్లిపాయకారంల ఉల్లిగడ్డ దంచి వేసి తెచ్చిన నీకు ఇష్టమని. తిను .”
“ తింటాగాని సూరి, అత్త ఎట్లున్నది ? నోట్లకు ఏమైనా పోతా౦ దా, పాపం అత్తమ్మ బెంగ తోని ఉండొచ్చు,
సరేగాని సూరి, నిన్నొకటి అడుగుత, ఆ రోజు జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెప్పినగదా, ఇంకేమైనా చెప్పడం మర్చినవా యాడికి చేసుకొని చెప్పు అంటున్నాడు రాజన్న. నువ్వుకూడా ఈ విడియో చూసి చెప్పు నేనేమైన చెప్పడం మర్చిన్నా “ ఫోన్ తీసి విడియో చూపింది, సూరీడు ఆ వీడియో లో చంద్రి చెప్పింది రెండు సార్లు చూసినా ఏమి గుర్తుకురాలేదు. మరొకసారి చూద్దామని చూస్తుండగా ఎదో గుర్తుకువచ్చి “ చంద్రి, ఇందుల ఆ మస్తాన్ గాడు నీతో అన్నాడు గదా ఆ ఎస్సై గాడు నీపైన మనసుపడ్డాడు అందుకే నిన్ను వాడి దగ్గరకు తీసుకొని పోడానికి వచ్చిన అని చెప్పిండు గదా, ఆడేది నువ్వు చెప్పలేడుగాదా “
“అవునురా సూరీడు మంచిగా యాదిచేసినావ్. రాజన్న రాంగానే ఇదే చెప్పుత” అని రొట్టి తిన్నది చంద్రమ్మ .
***** ***** *****
కోర్టులో కాల్ వర్క్ నడుస్తున్నది, ఆరోజు ఏ ఏ కేసులను విచారిస్తారో కోర్టు ఆరంభానికి ముందే కేసులను పిలిచి చెప్పుతాడు బెంచ్ క్లర్క్, కేసుకు సబంధించిన వాదులు ప్రతివాదులు వారి లాయర్లు హాజరు పలుకుతారు. రాణి వారి కేసుకు తదుపరి తేదీలను ఇస్తాఋ. ఆతర్వాత పదకొండు గంటలకు జడ్జిగారు కేసులను వినడానికి వస్తారు. ఇదంతా చంద్రమ్మకు చెపుతున్నాడు ధర్మరాజు . సైలెన్స్ హెచ్చరికతో పాటు జడ్జిగారు వచ్చి ఆసీనులయ్యారు.
“కేస్ నెంబర్ 5 ఆఫ్ 23 , చంద్రమ్మ వర్సెస్ స్టేట్ , ఎస్సై ఆఫ్ పోలిస్ నల్లబెల్లి “,కేసును పిలిచాడు క్లార్క్.
చంద్రమ్మ ను బోనులో నిలబెట్టి జడ్జిగారికి సాల్యూట్ చేసాడు. “PP గారు ప్రొసీడ్ “ అన్నారు జడ్జి గారు.
“యువర్ ఆనర్, ఇదొక దారుణమయిన హత్యా కేసు, రామన్నగూడెం కు చెందిన చంరమ్మ అనే ఈ ముద్దాయి తనవద్దకు వచ్చిన హతుడయిన దస్తగిరిని తన వద్ద వున్నా కొడవలి తో దారుణంగా నరికి చంపింది, ఆ తరవాత హత్యాఆయుధం అయిన కొడవలి తో సహా లొంగిపోయింది, తానే హత్య చేసినట్టు తన కఫెషన స్టేట్ మెంట్ ఇచ్చింది. దాన్ని పోలీసు వారు వీడియో రికార్డింగ్ కూడా చేసినారు. కాబట్టి యువర్ ఆనర్ ఇందులో వాద ప్రతి వాదనలకు కూడా ఎలాంటి అవకాశం లేదు, అందువలన కోర్టు వారిని ఈ కేసులో ముద్దాయికి IPCసెక్షన్ 302 క్రింది స్త్రీ అని కూడా చూడకుండా తగిన శిక్ష విధించాలని మనవి చేస్తున్నాము”
“విన్నావా చంద్రమ్మ, పోలీసువారు నీ పైన మోపిన అభియోగాలు, సరిగ్గా విన్నావా, ఇందులో నీవు చెప్పుకునే విషయాలు నిర్భయంగా చెప్పుకో, మేము సావధానంగా వింటాము, నీవు ఏ పరిస్థితులలో హతుడిని చంపవాసి వచ్చిందో చెప్పు. నీ యెడల అతడు ఏదైనా అసభ్యం గా మేఇలిగాడా లేక ఇంకేదైనా కారణమా చెప్పుతల్లి. నీవు ఒప్పుకుంటేనే శిక్ష వేస్తాము, చెప్పమ్మా “
చంద్రమ్మ కళ్ళ నుండి జలజలా కన్నీరు కారుతున్నాయి, దూరంనుండి సూరీడు కూడా కండ్లు తుడుచుకుంటూ “ఏడువకే చంద్రి “ అంటున్నాడు ..కోర్టు హాలు అంతా కలకలం అయింది. జడ్జి గారు కూడా వారి అన్యోన్యతకు అబ్బురపడ్డాడు ..
“చూడమ్మా, నీ తరఫున వాదించ డానికి ఎవరైనా వున్నారా , లేకున్నా మేమే ఎవరినైనా వాదించమని చెప్పుతాము”.. లేదన్నట్టు తల ఊపింది చంద్రమ్మ, “మాకు ఎవ్వరు వద్దు, వాడి చావుకు నేనే కారణం, నేనే చంపాను, నేను నేరం చేసాను కాబట్టి నాకు శిక్ష వెయ్యండి.”
“నేను ఇదివరకే విన్నవించాను గదా యువర్ ఆనర్” లేచి అన్నాడు PP “ఇందులో శిక్ష ఒక్కటే మిగిలింది,ఇందులో ఎస్సై గారు కూడా వివరాలు అన్నింటిని సేకరించారు కూడా, మీరు జడ్జిమే౦టు కు ఒక తేది ఇవ్వండి చాలు” ..
“ఏమండి కేసు మొదటి రోజే జడ్జిమెంటు వరకు తెచ్చి మీరు ఘన కీర్తి పొందాలని ఆశ పడుతున్నారా ,
అలా జరుగదు లెండి, ఇది చరిత్ర శ్రుష్టించే కేసు కాదు, నిజాలుకూడా వెల్లడి కావాలి కదా, ఇందులో అడ్వొకేట్ ని నియమిస్తాము”
“అంత అవసరం లేదు యువర్ ఆనర్” అంటూ చెప్పబోయాడు PP,
“యువర్ ఆనర్,” అంటూ వచ్చాడు ఒక అడ్వొకేట్ “నేను ఇందులో హతుడి తరఫున వాదించడానికి అనుమతి కోరుతున్నాను”
“హతుడి తరఫున వాదించడానికి PP వున్నాడు కదా “
“ PP పోలీసులతో కుమ్మక్కు అయినాడు యువర్. మీరు ఒప్పుకునక పోతే నన్ను డిఫెన్స్ తరఫున వాదనలు చేయడానికైన అంగీకరించడానికి మనవి చేస్తున్నాను”
“ యూ మె వర్క్ ఫర్ డిఫెన్స్, మీరు ప్రిపేర్ కావడానికి పది రోజుల వ్యవధి ఇస్తాను.”
“ కేసు FIR కాపి,కన్ఫెషన్ సిడి, శవ పంచనామా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపి ఇవ్వమని పోలీసు వారిని ఆదేశించండి యువర్ ఆనర్”
“యువర్ ఆనర్,ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా వెయ్యలేదు, రేపు లేదా ఎల్లుండి ఆయనకు అంద చేస్తాము “ అన్నాడు ఎస్సై కుంతాల్ రావు.
“ వ్వాట్? మెడికల్ ఎక్జామినేషన్ రిపోర్ట్ లేకుండే కేసు మా ముందుకు తెచ్చారా, ఎలా, వి౦టా మనుకున్నారు? Bench, please issue Memo to SP calling his explanation for violation of procedure… ఎస్సై గారు దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి, ఇందులో నాకు ఎదో దుర్వాసన వస్తున్నది. ముద్దాయిని పోలీసు కస్టడి నుండి జుడీషియల్ కష్టడి కి మార్చండి, ఇందులో ఎలాంటి హరాస్ మెంట్ వుండగూడదు, కేసు పది రోజుల కొరకు వాయిదా వేస్తున్నాము”….
అందరు బయటకు వచ్చినారు …
“ రాజుగారు, కోర్ట్ ఆర్డర్ తీసుకున్నాక సాయంత్రం చంద్రమ్మను జిల్లా జైలు కు అప్పగించి రండి “
అంటూ వెళ్ళిపోయాడు కుంతాల్ రావ్.
“ అమ్మా చంద్రమ్మ నిన్ను చూస్తుంటే నా స్వంత బిడ్డను చూస్తున్నట్టు అనిపిస్తున్నది. నువ్వు ఈ తప్పు చెయ్యలేదని నా మనసు చెప్పుతున్నది, ఏమైనా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను, ఏదేమైనా నీ కేసు లో వాదనలు వినిపించడానికి ఆ కుర్ర లాయరు సరిగ్గా సరిపోతాడని అనుకుంటా, అది అదృష్టం గా అనుకుంటున్నా”
“ నమస్తే హెడ్డు గారు, నా పేరు సాగర్…దయాసాగర్ అడ్వొకేట్, మీకు వ్యతిరేకం గా చంద్రమ్మ తరఫున వాదించడానికి కోర్టువారు ఆమోదించినారు మీకు తెలుసుగదా ..మీ ఎస్సై గారు పోయినారుకుంటా(నవ్వుతు) అదే ఇంటికి .. రండి అలా కోర్టు క్యాంటీన్ లో లంచ్ చేస్తూ మాట్లాడుకుందాము, పర్లేదు బిల్లు నేనే ఇస్తాను ..
“ అయ్యో అదేమీ లేదు లాయర్ గారు, నేను పోలీసుల్లో పనిచేస్తున్నా, చేతి తడుపులు నాకు లేవండి, సర్కారు ఇచ్చే జీతం నాకు చాలు, అయినా బిల్లు నేనుకూడా ఇయ్యగలను. పోదాంపదండి..”
“ లంచ్ టైం కదా ఏకంగా భోజనం చేద్దాం, .. చేస్తూ మాట్లాడుకోవచ్చు కూడా ..”అన్నాడు సాగర్ “ ఇతను నీ భారతనా చంద్రమ్మా”.. తలూపింది చంద్రమ్మ, నమస్కారం చేసాడు సూరీడు..
“సూరీడు, రేపొకసారి మీ ఊరికి పోదాం, మీ పొలం హత్యా అయిన చోటును ఒకసారి చూడాలి”
“నేను పూర్తిగా చూసాను, ఇంకా ఏమి లేదక్కడా, అయినా నేను కూడా వస్తాను మీతోటి” రాజు .
“ చెప్పండి చంద్రమ్మ, హతుడు అదే ఆ మస్తాన్ మీ వద్దకు ఎందుకు వచ్చాడు, ఏదైనా అడిగాడా, వాడు ముందే మీకు తెలుసా, ఏదైనా బంధువా? లేక ఏదైనా పగ వున్నదా, ఉత్తగనే వాడు రాదు కదా”
“నేను మొత్తం చెప్పిన సారూ, వానితో నేను ఎన్నడు కనీసం మాట్లాడలేదు, దూరం నుండి రెండు మూడు సార్లు చూసిన్నేమో గుర్తుకూడా లేదు, పోనియండి సారూ, నేనే చంపినా అని ఒప్పుకున్నా గదా ఇంకెందుకు ఈ ఇంకోరిలు, ఎదో సిచ్చ వేసెయ్యండి, నా నరాలు తెగి పోతున్నాయి, చచ్చిపోయేటట్లు ఉన్నా”
“సాగర్ ఇక్కడా, నేనుండగా నీకు ఏమి జరుగదు.. నాది అభయం, చెల్లె దిగులు పడకు”..
“ సాగర్ గారు, నేను మీకు అంతా చెప్పుత వివరంగా, ఇప్పుడు చంద్రమ్మను జిల్లా జైలుకు తీసుకుని పోవాలె, పోదాం పదండి”…ఆ రోజు సాయంత్రం సూరీడు వెంటరాగా ధర్మరాజు చంద్రమ్మను జిల్లా జైలు లో జైలర్ గారికి అప్పగించి వచ్చారు .
“చంద్రమ్మా, ఇక్కడ నీకు ఎలాంటి వత్తిడు వుండదు, జైలర్ చాలా మంచి వాడు. అండర్ ట్రయల్ ఖైదీలను బాగానే చూస్తారు, అసిస్టెంటు జైలర్ కూడా నాకు మంచి దోస్తు. పోతుపోతు ఆయనకు చెప్పిపోతాను, నీకు ఫోన్ కావాలన్నా ఇస్తాడు. సరేనా, ఇంకా కేసు గురించి మదిలో పెట్టుకోకు, ఆ సాగర్ ఎదో ఒకటి చేస్తాడు నాకు నమ్మకం ఉన్నది. ఇక మేము వెళ్తాం”
***** ****** *****
ఉదయమే ధర్మరాజు గారింటికి వచ్చాడు దయాసాగర్. “ రాజు గారు, రామన్నగూడెం వెళ్దామా, మీరు వస్తానని అన్నరు గదా, రెడినా, నా కారులో పోదాం”
“కారైతే పొలం దానుక పోదు లాయర్ గారు, ఉండండి మా శంకర్ కు ఫోన్ చేసి జీపు తేమ్మంటాను, అదైతే అక్కడిదానుక పోవచ్చు”
దారిలో కేసు వివరాలు అన్ని చెప్పాడు. “ కాని నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు లాయర్ గారు, ఆ చక్చిపొయిన్క మస్తాన్ గాడు మా ఎస్సై పేరు తీసిండట, చంద్రమ్మ కావాలని అన్నాడట, ఇందులో ఎంత నిజం ఉన్నదో నాకైతే తెల్యదు, మా ఎస్సై గాడ్డు కూడా లోఫరే”
“చంద్రమ్మ చెప్పిందంటే అది నిజమే కావచ్చు, అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండానే మిమ్ము కేసు ఫైల్ చేయ్యమన్నాడు, రిపోర్ట్ రానివ్వండి తెలుస్తది” .
భావి వద్దకు చేరగానే సూరీడుని రకరకాలుగా ప్రశ్నించారు వివరాలు రాబట్టేందుకు. చివరకు సీన్ రి-కన్స్ట్రక్షన్ చేసారు, అక్కడికి మస్తాన్ ఎప్పుడు వచ్చింది, అప్పుడు వారు ఏమి చేస్తున్నది, ప్రతి అంశాన్ని క్షుణ్ణం గా పరిశీలించారు. తేలిన విషయం ఏమిటంటే, చంద్రమ్మ తన కొడవి అందుకుని మస్తాన్ మెడమించి వీపు మీదుగా బలంగా గాయం చేసింది, వెంటనే వాడు కిందికి ఒరిగాడు. చంద్రమ్మ సూరీడు లు భయం తో వాణ్ని అక్కడే వదిలేసి దూరంగా పారిపోయినారు. అప్పుడు వాడు మరణించినాడా లేదా చూడలేదు, అందువలన వారికి తెలియదు, తరవాత వారిద్దరూ చర్చిచుకుని పోలీసు స్టేషన్ వెళ్లి సరెండర్ అయినారు. ఆ తరువాత పోలీసు పార్టి వచ్చి మస్తాన్ శవాన్ని తీసుకెళ్ళారు. అందువల్ల ఆ మధ్య కాలం లో ఏమి జరిగిందో వారికి తెలియదు, అవకాశం కూడా లేదు.
సాగర్ , ధర్మరాజు లు మొత్తం పరిసరాలను క్షుణ్ణంగా వెతుకుతున్నారు ఏదైనా దొరకక పోతుందా అని. శ్రమ ఫలించింది. అక్కడ వారికి ఒక పెద్దబండి చక్రానికి పెట్టె శీల దొరికింది. దాన్ని చిన్నగా చేతి రుమాలుతో తీసుకుని చూసారు “ రాజు గారు దీనికి రక్తం అంటుకుని వున్నది గమనించండి, ఇది ఇక్కడ ఎందు ఉన్నది, ఆలోచించాలి.దీని ఒక కవర్లో వేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి, దీనికి అంటిన రక్తం నమూనాలు చంద్రమ్మతోగాని లేక మస్తాన్ తో గాని మ్యాచ్ అవుతున్నాయో కనుక్కోండి. కాని ఒక్క విషయం గుర్తుంచ్కోండి ఈ విషయం మీ ఎస్సై గారికి అస్సలు చెప్పొద్దూ,ఆయనకు ఇది తెలియవద్దు కూడా, మీరే ఈ రహస్య్యాన్ని మేనేజ్ చెయ్యాలి, సరేనా, ఇక వెళ్దాము” …
***** ****** *****
మరుసటి రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాని ఒక కాపి డిఫెన్స్ లాయర్ సాగర్ కు ఇచ్చి కోర్టులో కేసు ఫైల్ తో జమచేసాడు. రిపోర్ట్ చూసిన ఎస్సై కుంతల్ రావ్ నిర్వేదంగా నవ్వి “వీటి కాపీలను PP గారికి,ఆ డిఫెన్స్ లాయర్ కు ఇచ్చావా రాజు, లేదంటే అసలే చార్జ్ మేమో ఇస్తున్నారు ఇక మనకు సస్పెన్షన్ కూడా చేస్తారు.”
“అన్ని ఇచ్చేసిన సర్, రేపు కోర్టులో మల్ల హియరింగ్ ఉన్నది, మీరు ఒస్తుండ్రు గదా”
“రాక చస్తానా, వస్తా”
****** ***** ****
కోర్టు హాలు కిటకిటలడుతున్నది. అందరుకూడా నిజాయితి తో సరెండర్ అయిన చంద్రమ్మను చూడడానికి వచ్చినవారే, అందరి మొహం ఆమెకు జడ్జిగారు ఎంత శిక్ష వేస్తారో చూద్దామని వచ్చినవారే.
“సైలెన్స్, జడ్జిగారు వస్తున్నారు” అంటూ జమేదార్ అనౌన్స్ చేసాడు. “మీరు మొదలుపెట్టండి PP గారు”
అన్నారు “సంబందించిన పోలీసు వారు వచ్సినారా” అన్నారు.
PP గారు తలూపుతూ “ యువర్ ఆనర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ వారు ఫైల్ చేసినారు, దాన్ని మీ సమక్షమున పెట్టబడింది, దయచేసి చూడండి”
“ చూస్తాను…చంద్రమ్మ నీవు ఇంకా నీ నిర్ణయం మీదనే వున్నావా, నేరం చేసినావని ఒప్పుకుంటున్నావా, డిఫెన్స్ అడ్వొకేట్ ఎక్కడా వచ్చినాడా, పిలువండి”
అడ్వొకేట్ దయాసాగర్ హాజర్ హయ్ .. అరిచాడు కోర్టు జవాను. పరిగెత్తుతూ వచ్చాడు సాగర్,
“ మన్నించండి యువర్ ఆనర్, కొద్దిగా అలిస్యం అయింది”
“సరే కానివ్వండి, ఈ కేసుకు సంభందించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీవద్ద”
“వున్నాయి సర్, దయచేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను”
“ఇందులో ఏమున్నది, కత్తిగాయాల్తో మృతుడు మరణించినట్లు వున్నది అంతే గదా PP గారు”
PP గారు లేచి “అందులో విశేషాలు ఏమి లేవు, డిఫెన్స్ వారికి ఏమి కనిపించిందో మరి” అన్నాడు.
“యువర్ ఆనర్, పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం మృతుని పైన రెండు విధములయిన కత్తి గాయాలు వున్నట్టు అందులో ఒకటి కొడవలి తోటి మరొకటి ఒక షార్ప్ ఆయుధం తోటి వున్నదని పెర్కొన్నరు”
“ అందులో విశేషం ఏమి వున్నది, అదొక గాయమే కదా,” అన్నాడు PP
“సరిగా చూడండి PP గారు, అందులో కొడవలి తో చేసిన గాయం తో మరణం జరుగలేదని, రెండో గాయం తో మాత్రమే జరిగిందని పేర్కొన్నారు.”
“ఇందులో మాత్రం ఏమి విశేషం వున్నది, మృతుని మరణమే గదా”
“ లేదు యువర్ ఆనర్, కొడవలి గాయం తరవాత చేసిన గాయం తో మాత్రమే మరణం సంభవించిందని ఆటోప్సి నివేదిక చెపుతుంది, మా నిందితురాలు చంద్రమ్మ కొడవలి తో మాత్రమే పోలీసులముండు సరెండర్ అయింది, మీరు అనుమతి ఇస్తే నేను చంద్రమ్మను కొన్నిప్రశ్నలు అడుగుతాను” “సరే అడుగండి”
“చంద్రమ్మా,మీరు మస్తాన్ ను కొడవలితో నరికి చంపినాని చెప్పినారు గదా, మీరు ఒక్క కొడవలి తో మాత్రమే హతున్ని గాయ పర్చినారా లేక మీవద్ద ఇంకో ఆయుధం ఇనుప కడ్డి గాని కత్తి గాని వేరే ఇటువంటి ఆయుధం గాని వుంటే దానితో కూడా మాస్తాన్ ను పొడిచి పోలీసుల ముందు ఒక్క కోడలి తో మాత్రమే లోన్గిపోయినార , అంతా వివరించండి”
“లేదు సార్, నావద్ద ఒక్క కొడవలి మాత్రమే వున్నది, అదికూడా మా అయన సూరి గడ్డి కోస్తూ నావైపు విసిరేసిండు. అదోక్కదానితో నే కోసిన, వేరే ఏది లేదు, వుంటే దాన్ని కూడా పోలీసులకు ఇచ్చేదాన్ని, ఇందుల నా తప్పు ఎం లేదు , నన్ను చమించండి”
“ యువర్ ఆనర్, ఆ అమాయకురాలి మాటలు వినండి, నిజాయితి చూడండి, ఈ కాలం లో కూడా ఇలాంటి వారు అరుదుగా వుంటారు …ఇక అసలు విషయం ఏమిటంటే చంద్రమ్మ చేసిన కొడవలి గాయం వల్ల మరణమ౦ జరుగలేదు, ఆ తరువాత చేసిన బలమైన గాయం తో మాత్రమే మరణం సంభవించింది. అనగా చంద్రమ్మ ఈ హత్యా చేయ్యనేలేదు, ఆమె చేసింది ఒక తీవ్రమైన గాయం మాత్రమే.” అంటూ కాసేపు ఆగాడు సాగర్.కోర్టు హాల్ అంతా నిశ్శబ్దం.. ..”యువర్ ఆనర్ మీరు అనుమతి ఇస్తే ఈ కేసులోని investigativeofficer అయిన ఎస్సి గారిని కొన్ని ప్రశ్నలు అడుగదల్చుకున్నా” “yesproceed” అనడం తో ఎస్సై కుంతాల్ రావు బోనులోకి వచ్చాడు.
“ఎస్సై కుంతాల్ రావు గారు మీరు ఈకేసులో విచారణ జరిపినారుకదా , నా కొన్ని ప్రశ్నలకు జవాబివ్వండి”
“Iobjectsir,”అన్నాడు “ ఎస్సై గారు ఇందులో విచారణ జరుపలేదు,ASI ధర్మరాజు గారు ఇందులు ముఖ్య విచారణాధికారి, మీ ప్రశ్నలు వారిని అడగండి”
“మరేమీ పర్వాలేదు PP గారు, అయినా ఎస్సై గారిని అడుగుతాను, వారికి తెలిసింది చెప్పుతాడు,సరేనా ”
“ఎస్సై గారు, మీరు ఈ కేసు విచారణ చెయ్యలేదంటే, మీరు డ్యూటీలో లేరా, సెలవులో వ్ఫున్నారా, వుంటే ఆ రోజు మీరు ఎక్కడ వున్నారు ? వివరాలు చెప్పగలరా”
“నేను సెలవులో లేను గాని, ఇంట్లోనే వున్నాను. నా చేతికి ఒక గాయం కావడం వల్ల నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఇంటికే వచ్చి డ్రెస్సింగ్ చేశాడు, గాయం వల్ల బాధ పెరుగుతుండడం వలన ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటూ మా స్టేషన్ వారితో వివరాలు తీసుకుంటూ, తగు సూచనలు ఇస్తూ వచ్చాను, ఈ హత్యాకేసు కూడా నాకు ఫోన్ లో చెప్పడం తో మా హెడ్ ధర్మరాజు ను శవ పంచానామాకు పంపాను. అంతే యువర్ ఆనర్”
“ సరే సరే , మీ చేతికి ఈ గాయం ఎలా అయ్యిందో చెప్పుతారా”
“ఈ కేసులో ఆ విషయం అంత అవసరమైనదా,. గాయం అయింది ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు, మీకు అభ్యంతరం ఏమిటి” అన్నాడు PP.
“ఏమో ఏ పుట్టలో ఏ పాము దాగున్నదో ఎలా తెలుస్తుంది, విష నాగులను పట్టడమే మన పని కదా, మీకు తెలియని వ్యవహారమా PP గారు, నన్ను ప్రశ్నలు వెయ్యద్దని అంటారా PP గారు, సరే అలాగైతే జవాబు చెప్పకున్నా మీ సెల్ ఫోన్ ఇస్తారా చూసిస్తాను” కలవరపడ్డాడు కుంతాల్ రావ్,
“ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ ను మీరు ఎలా అడుగుతారు? అది సాధ్యమేనా”
“యువర్ ఆనర్, నేను కోర్తువారిని విన్నవించుకుంటున్నాను, ఎస్సై కుంతాల్ రావ్ గారి ఫోన్ తీసుకుని analysis కు పంపాలని కోరుతున్నాను., హత్యా జరిగిన రోజు అతని లొకేషన్ గూగల్ టేకౌట్ చెయ్యాలని, అతనితో సెల్ లో మాట్ల్లదినవారి కాంటాక్ట్ లిస్టు తీయాలని కోరోతున్నాను.”
“డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసును ఎటు లోకాలకు తీసుకేల్ల్తున్నారో నాకు అర్ధం కావడం లేదు” అన్నారు జడ్జి గారు,
“ నాకు అదే అనిపిస్తున్నది యువర్ ఆనర్, తన ముద్దాయిని కాపాడుకోవడానికి తప్పుదారులు వెతుకుతున్నారులాగున్నది”
“లేదండి , పక్కాగా అవసరం వున్నది.ఈ కోసులో కొత్త కోణం చూడబోతున్నాము, అన్నట్టు యువర్ ఆనర్, మొరొక విన్నపము, ఈ ఎస్సై కుంతాల్ రావు గారి బ్లడ్ స్యాంపుల్ తీసి DNA రిపోర్ట్ కు పంపాలని కోరుతున్నాను. ఇవన్ని మీరు ఒప్పుకోవాలి సర్”
“ నాకు కూడా ఇందులో ఎదో విషయం దాగున్నట్టు అనిపిస్తున్నది. సరే అలాగే కానివ్వండి, benchtotakeactionasaskedbydefence”,అని ఆర్డర్ ఇస్తూ కేసును వాయిదా వేశాడు.
కేసును తదుపరి వారానికి గాను పోస్ట్ చేస్తూ అద్జర్న్ చేసారు జడ్జి గారు ..
“చంద్రమ్మా నిన్ను ఈ కేసులో హత్యానేరం క్రింద ఎటువంటి శిక్ష పడకుండా చూస్తాను నాది హామీ, అన్నట్టు రాజు గారు ఎలావుంది కేసులో ట్విస్టు మీకు నచ్చిందా”
“అదరగోట్టారు సాగర్ గారు,మా ఎస్సై గారికి దిమ్మదిరిగి మిందు బ్లాంక్ అయ్యింది. ఇంకా కోలుకోలేడు జీవితంల“
“ మీరు FSL రిపోర్ట్ తీసుకోవడమే ఆలిస్యం, కేసును ఇంకా ముందుకు తీసుకేల్లుత రాజు గారు”
“సరే సాగర్ గారు రిపోర్ట్ తీసుకోగానే మీకు ఫోన్ చేస్తాను”
***** ***** *****
PP గారి ఆఫీసులో ఎస్సై కుంతాల్ రావు తో మాట్లాడుతున్నాడు PP .
“ఎస్సై గారు ఇందులో మీ ఇన్వాల్వ్ మెంటు ఉంటె చెప్పండి, మీరు బాగానే ఇందులో ఇరికేట్టున్నారు,”
“అలాంటిదేమీ లేదు, ఆ డిఫెన్స్ లాయరు ఎదో జిమ్మిక్కు చేద్దామని చూస్తున్నాడు. మీ మాటలను కూడా పట్టించుకోకుండా ఆ జడ్జిగారు బ్లడ్ స్యాంపుల్ తీసుకొమ్మని ఆర్డర్ వేశాడు, నాకేమి భయం లేదు”
“నీకు లేని భయం మాకెందుకు గాని, ఏదైనా వుంటే ఆర్గ్యుమెంట్ లో మార్పు చేసుకుందామని చూస్తున్నా”…” వుంటే చెప్పండి నిజాయితిగా, మనం చంద్రమ్మ లాంటి చదువులేని ని చూసి అయినా మారాలి”
***** ****** *****
“ చెప్పండి రాజు గారు, విశేషాలు, నిజంగా మీరు ధర్మరాజే, ఇలాంటి వారు పోలీసుల్లో అరుదుగా వుంటారు.”
“విషయాలు చాలా వున్నాయి, FSL రిపోర్ట్ వచ్చింది , విషయం ఏమిటంటే ఆ శీల పైన రెండు రకాల రక్త మరకలు వున్నాయి, వాటిపైన వెలి ముద్దర్లు కూడా వున్నాయి, వాటి DNA రిపోర్ట్ కూడా వచ్చింది, తర్వాత కర్తవ్యం ఏందీ సాగర్ గారు, మొత్తానికి కథను రసవత్తరంగా సాగిస్తున్నారు”
“రేపు కోర్టులో చూస్తారుగా, అన్నట్టు రేపు మీ ఎస్సై గారు కోర్టుకు వస్తున్నారా లేదా”
“ ఏమో సాగర్ గారు, ఆయన రెండు రోజులుగా స్టేషన్ కు రావడం లేదు”
****** ****** *****
కేసు పిలువగానే జడ్జిగారు అడిగారు “PP గారు మీరు రెడినా. మీ ఎస్సై గారు ఎక్కడా, డిఫెన్స్ మీరు ఆర్గ్యు చేస్తారా మొదలు “
“ ఎస్ యువర్ ఆనర్, నేను మొదట నిందితుని భర్త అయిన సూరీడు ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను”
సూరీడు బోనులోకి రాగానే అడిగాడు “ సూరీడు, హత్య జరిగిన రోజు మీ పొలం దగ్గర ఏదైనా జీపుగాని ఎదైనక బండిని చూసావా” “ లేదు సార్” అన్నాడు సూరి.
సాగర్ ఒక ఫోటో చూపుతూ “ఇటువంటి బులెట్ మోటార్ సైకిల్ కనపడిందా, అది కూడా చూడలేదా”
“లేదు సార్ ఇట్లాంటి బండి మా పొలానికి కొంత దూరంల మర్రి చెట్టు కింద చూసిన, కాని అది ఎవ్వలదో నాకు ఎరుకలే,” సరే వెళ్ళమని చంద్రమ్మను అదే ప్రశ్న అడిగాడు, “ నేను కూడా చూసిన ఇసువంటి బండిని మా పొలం కాదా, వాడు మస్తాన్ దానిమీద వచ్చి౦డనుకున్న”
“యువర్ ఆనర్, ఈ ఫోటో ఎస్సై కుంతల్ రావు గారి బులెట్ బండి ఫోటో, ఆయన సెల్ ఫోన్ గూగుల్ లొకేషన్ సెర్చ్ ప్రకారం కుంతల్ రావ్ గారు అక్కడనే వున్నారు, మస్తాన్, ఈయన కలిసే అక్కడికి వెళ్ళారు.”
“ఇక అసలు కథలోకి వస్తాను, ఈ ఎస్సైగారు ఒక పెద్ద ఉమనైజర్, దానికి బ్రాండ్ అంబాసిడర్, ఈ విషయం లో అనేక ఆరోపణలు వెళ్ళాయి, విచారణ కూడా జరిగి వార్నింగ్ కూడా ఇచ్చినారు, కండీషన్ మీద ఈయన ఎస్సైగా కంటిన్యూ అవుతున్నారు, హతుడు మస్తాన్ ఒకానొక కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, నేలరోజులకోరకు పెరోల్ పైన బయటకు వచ్చాడు, రెండు రోజులకు ఒజ్కసారి స్టేషన్ లో హాజర్ అయ్యి సంతకం పెట్టాలి. తిరిగి జైలుకు వెళ్ళే రోజున పోలీసు స్టేషన్ వారిచ్చిన క్లీన్ సర్టిఫికేట్ తో వెళ్ళాలి,. అది ఇవ్వడానికి మెలిక పెట్టాడు ఎస్సై. తాను మస్తాన్ ఊళ్ళో చూసిన చంద్రమ్మ మీద మనసు పడింది, తనవద్ద కు ఆమెను తెస్తేనే సర్టిఫికేటు అని తేల్చి చెప్పాడు కుంతల్ రావు. అందుకోసం మస్తాన్ ఎన్నోవిదాల ప్రయత్నాలు చేసాడు, కుదరలేదు.ఆమె ఒప్పుకొనలేదు.
చివరికి మస్తాన్ జైలుకు వెళ్ళే తేది వచ్చింది, మస్తాన్ మరియు కుంతల్ రావు ఒక పథకం వేసుకున్నారు, ఆరోజు ఎలాగైనా చంద్రమ్మను తెస్తానని చెప్పి ఇద్దరు కల్సి బులెట్ బండి పైన చంద్రమ్మ పొలం వద్దకు వెళ్ళారు, అఆక్కడ మర్రి చెట్టు వద్ద ఎస్సై ని వుంచి మస్తాన్ చంద్రమ్మ వద్దకు వెళ్ళాడు, అడిగాడు, బ్రతిమి లాడాడు, తుదకు కాళ్ళు కూడా పట్టుకున్నాడు, చివరకు చంపుతానని అన్నాడు , ససేమిరా అన్నది చంద్రమ్మ, అహం తో ఊగి పోయాడు మస్తాన్. తానొక గుండా, హత్యా కేసులో జైలుకు వెళ్ళిన ఖైది అయినా ఒక ఆడదాని చేతులో ఓడడమా, అని ఆమెను లోన్గదీసుకోవాలని ఆమెతో పోట్లాట మొదలుపెట్టాడు. తాను ఆమెను అనుభవించి కాని మిగితా పని ఆమె కుతుక నోరు మూసి లొంగ దీసుకున్దామని చూసాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న సూరీడు పరిగెత్తుకొచ్చి ఆమె వైపు తన కొడవలి విశ్రాడు, అంతే మస్తాన్ మెడనుండి వీపు దాక బలమయిన కొడవలి గాయం, వాడు చంద్రమ్మను వదిలి కింద పడి అరుస్తునాడు, రెండు నిమిషాలలో కన్నులు మూసుకుని అచేతనంయ్యాడు వాడు చచ్చాడని అనుకుని చంద్రమ్మ సూరీడు అక్కడి నుండి పారిపోయారు, దిద మీకు కొంతవరకు చంద్రమ్మ కన్ఫెషన్ వల్ల తెలిసిన కథ, కాని ఇంకా వుంది” అని ఆగాడు సాగర్ “ యువర్ ఆనర్, ఇక్కడే ఇంటరెస్టింగ్ స్టోరి మొదలు,”
ఆగి ఒక గాసులోని మంచి నీరు తాగి “ యువర్ ఆనర్, చంరమ్మ సూరీడు అక్కడినుండి వెళ్ళేవరకు మస్తాన్ చావలేది, వాని చూడడానికి ఎస్సై కుంతల్ రావు వచ్చాడు, శ్వాస చూసాడు, కళ్ళు తెరిచ్ చూసాడు మస్తాన్, తనను బతికించమని దండం పెట్టాడు. కాని ఇదంతా తనకు చుట్టుకునే లాగ వుందని అనుకున్నాడు. తనపేరు బయటకు వస్తే తన సస్పెన్షన్ ఖాయం అనుకున్నాడు. ఎట్లాగూ చంరమ్మ నరికిన్దిగాడా ఆమె పైనే కేసు నడుస్తునది భావించాడు, ఎలా చంపాలా అని చూస్తుంటే అక్కడ మొద్దు బండి చక్రానికి పెట్టీ శీల దొరికింది. బానీ లాగుతుంటే అతని చేతికి గాయమై రక్తం కారింది. అదే శీలతో మస్తాన్ గొంతులోను పొట్టలోని పొడిచి చంపి అక్కడి నుండి నింపాది వెళ్ళాడు, ఇదీ జరిగిన కథ యువర్ ఆనర్. హత్యా స్థలం కొద్ది దూరంలో ఒక కుప్పలో దొరికిన హత్యాయుధం బండి శీల ఎక్జిబిట్ గా సమర్పిస్తున్నాను, దాని పైన గల రక్తం మర్కల అనాలిసిస్ FSL రిపోర్ట్ DNA రిపోర్ట్ సమర్పిస్తున్నాను, అది కుంతల్ రావు బ్లడ్ స్యాంపుల్ DNA మ్యాచ్ అయింది, మస్తాన్ DNA తో కూడా న్యాచ్ అయింది. యువర్ ఆనర్ ఇప్పుడు కేసు క్లేయర్ అతింది, నిందితురాలు చంద్రమ్మ నిర్దోషి అని , ఆమె చేసిన కొడవలి గాయం కేవలం తన ఆత్మ రక్షణ, తన ప్రాణం కన్నా విలువైన మానం కాపాడుకోసం చేసిన స్ట్రగుల్ లో జరిగిన గాయం అని భావించి క్షమించమని ప్రార్థిస్తూ ఆమెను విడుదల చెయ్యమని వేదికున్తున్నాను “
నమస్కరిస్తూ కూర్చున్నాడు డిఫెన్స్ లాయర్ దయాసాగర్ ..
“ PP మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా..లేవా అయితే సరే. ముందుగా ఈ కేసును ఇంత త్వరగా పూర్తి చేసి ఒక నిజమయిన నేరస్తుణ్ణి వెలుగు లోకి తెచ్చినండుకుఅకు మరియు ఒక ఆడ కూతురు మాన ప్రాణాన్ని కాపాడుకేందుకు చేసిన సాహసాన్ని చూపినందుకు డిఫెన్స్ లాయర్ దయాసాగర్ ను అభినందిస్తూ , నిందితురాలు చంద్రమ్మ పై ఎలాంటి ఆరోపణలు మోపకుండా బేషరతుగా విడుదల చెస్థున్నాను. అభినందనలు చంద్రమ్మా నీ దిర్యం గొప్పది నీ విలువలు గొప్పవి. ఇక ఎస్సి కుంతాల్ రావు పైన హత్యానేరం అభియోగిస్తూ వేరే కేసును విచారించి ఫైల్ చెయ్యాలని పోలీసు డిపార్ట్ మెంట్ వారిని కోరుతున్నాను. కేస్ క్లోస్డ్ “..
చంద్రమ్మ ఆనడానికి అవధులు లేవు. సూరీడు సాగర్ కాళ్ళ పైన పడ్డాడు అభిమానం తో “మీ ఫీజు ఎలా త్ర్చుకోవాలో”.. ఆగాడు ..అప్య్యాయంగా హత్తుకున్నాడు .” నాకు ఈ శంతోశాని మిగాలనియ్యవా, నేను అప్పుడే చెప్పాను, చంద్రమ్మ నా సోదరి అని ..” “ నిజమైన ధర్మరాజు గారు మళ్ళీ మరొక్కసారి కలుద్దాము. మీ కుంతల్ రావుని జాగ్రత్తగా పట్టి ఇవ్వండి. మస్తాన్ ప్లేస్ లో జైలు కు వెళ్తాడు… “ ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. కథ సుఖాంతం …
ఆ రోజు వినాయక చవితి… ఎటు చూసినా ప్రతి ఇల్లు మామిడితోరణాలతో అలంకరించబడి పండుగ సంబరాల్లో కళకళలాడుతూ నవ్వుల పూలను పూయిస్తోంది. మోహన్ తెల్లవారు జామునే ఇంట్లోంచి బయటపడ్డాడు. గత నెల రోజులుగా వాళ్ళు ఉండే కాలనీలో వినాయక విగ్రహాన్ని పెట్టే ఏర్పాట్లలో తల మునకలుగా వున్నాడు. దానికి ప్రధాన సూత్రధారి మోహనే. విగ్రహాన్ని సెలెక్ట్ చేయడం దగ్గర్నించీ పూజకు పురోహితుని మాట్లాడడం, మంటపాన్ని వేయించడం, ఎలక్ట్రికల్ పనులు, రికార్డు, మైకులు, టెంట్లు, బ్యాండు…ఇవే కాక పూజకు కావలసిన పూలు, పండ్ల వరకు ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నాడు. అది ఎంతో తృప్తి తనకు.
అది తనకు కేవలం తృప్తి కోసం చేస్తున్నాడనుకోవడం కూడా పొరపాటే. ఎవరూ గ్రహించలేని స్వార్థం కూడా ఇందులో ఉంది. వార్డుమెంబరు రాజేశ్ అండ తనకు ఉండడం వల్ల అతడు కార్పొరేటర్ అయితే తనకు చాలా ప్రాముఖ్యత పెరుగుతుందని, తద్వారా రాజకీయాల్లో కాలు మోపి భవిష్యత్తులో తిరుగులేని నాయకుడు అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకోసం పక్క వీధిలో తమకు వ్యతిరేకులైన గ్రూప్ వారు ఏర్పాట్లు చేస్తున్న వినాయక ఉత్సవాలకు రెట్టింపు ఆర్భాటంగా చేయాలని సంకల్పించాడు. దానికి తన అయిదుగురు స్నేహితులు వత్తాసు పలకడం అతని నమ్మకాన్ని, బలాన్ని మరింత పెంచింది. అందుకే అవతలి వారు చేస్తున్న దానికి “అంతకు మించి” అన్నట్లు వుండేలాగా అక్కడి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ( ఆ గ్రూపు లోని ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపి ) వినాయకుడి విగ్రహం సెలక్షన్ నుండి ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ నలుగురి చూపు తన మీద పడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.
అలా ఇంటి నుండి బయలుదేరి మంటపం దగ్గరికి వెళ్ళిన మోహన్ అక్కడ తడకలు బిగిస్తున్న పని వాళ్లకు ఇంకా కొన్ని సూచనలు చేసి, స్నేహితులతో కలిసి దుకాణానికి వెళ్ళి, విగ్రహాన్ని తీసుకు వచ్చాడు. పూజారి రాగానే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రత్యేక అతిథిగా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వార్డు మెంబరు హడావిడిగా రావడం పోవడం కూడా జరిగింది. వీధిలో చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్లడం చూసి తన ధ్యేయం తప్పకుండా నెరవేరుతుందన్న ఆత్మ విశ్వాసంతో ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నాడు మోహన్.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు పోటీలు పడి రకరకాల నైవేద్యాలు తెస్తున్నారు. సాయంత్రం కాగానే పిల్లలు, యువతీయువకులు ఆటా పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అంతో ఇంతో హుండీలో డబ్బులు కూడా చేరుతున్నాయి. నిరుటి కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారని ప్రశంసలూ అందుతున్నాయి. ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మోహన్ ఆలోచనలన్నీ రాబోయే తన అదృష్టంపై సాగుతున్నాయి. ఈసారి తను స్నేహితులతో కలిసి వసూలు చేసిన చందాలు, ఖర్చులు లెక్క వేసుకుంటే రేపటి నిమజ్జనం తర్వాత కనీసం 25 వేలు అయినా మిగిలేలా ఉన్నాయి. అనుకున్న దానికంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం, ధూప దీప నైవేద్యాలన్నీ వారు భక్తిగా సమర్పించుకోవడం ద్వారా ఆ ఖర్చంతా తగ్గింది. ఇంకా హుండీ ఉండనే ఉంది. సుమారుగా పదివేల వరకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్నేహితులతో 5 వేలు ఖర్చు పెట్టి ఎంత ఘనంగా మందు పార్టీ చేసుకున్నా 30 వేలు తన సొంతం అవుతాయి. ఈ విషయంలో మిత్రులు తనను ప్రశ్నించే అధికారం లేదు. వాళ్ళను దేంట్లో కూడా భాగస్వాములను చేయకుండా ముందే జాగ్రత్త పడ్డాడు మరి. తన మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కొంత కష్టపడ్డారు అంతే. రాజేశ్ తో తిరిగే సమయంలో అవసరాన్ని బట్టి కొంత ఖర్చు పెట్టవలసి వస్తే ఈ డబ్బు ఉపయోగపడుతుంది. తద్వారా తనపై అతని దృష్టి మరలిపోకుండా చేసుకుంటాడు. ఏది ఏమైనా తాను అనుకున్నది సాధించి తీరుతాడు. ఉద్యోగం చేయడం సుతరాము ఇష్టం లేదు తనకు. రోజు రోజుకూ ఉద్యోగం వెతుక్కోమంటున్న అమ్మా నాన్నల నస భరించలేక పోతున్నాడు. కొంతకాలం ఓపిక పడితే నా ఆలోచనే సరియైనదని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా వరుసగా మోహన్ ఆలోచనలు ఆగని ప్రవాహంలా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు అన్నీ చూసుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి బయలుదేరాడు మోహన్. తాను వెళ్లే దారిలో రోడ్డు మరమ్మత్తు కోసం తవ్వడం మూలాన పక్క సందులోకి బండి పోనిచ్చాడు మోహన్. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యానికి లోనయి, బండి ఆపకుండా వుండలేకపోయాడు. పక్కకు బండిని పార్క్ చేసి చేతులు కట్టుకొని అలాగే నిలబడి పోయాడు. ఒక చిన్న వేదిక పైన కూర్చుండబెట్టిన చిన్ని గణపతి ముందు కూర్చొని కొంతమంది పిల్లలు భక్తిగా
భజన చేస్తున్నారు. వారితో పాటు మరికొంతమంది పెద్దలు కూడా పారవశ్యంలో మునిగి గణనాథుని సేవలో నిమగ్నమయ్యారు. ఎంతటి తన్మయత్వం? ఈ ఎనిమిది రోజుల్లో ఏనాడైనా తను భజనలో పాల్గొన్నాడా? భక్తిగా
పూజించాడా? తన హంగూ, ఆర్భాటాలు, ఇతరుల దృష్టి పడడానికి పడుతున్న తపన, రాజకీయాల కోసం కంటున్న కలలు, దానికోసం వినాయక ఉత్సవాల పేరిట సమకూర్చుకుంటున్న డబ్బు ఇవన్నీ మదిలో మెదిలాయి. “అన్నా హారతి తీసుకోండి” అన్న మాట వినబడి అటుదిక్కు చూశాడు. ఒక పిల్లవాడు హారతి పళ్లెంతో తన ముందు నిలబడి ఉన్నాడు. హారతి కళ్ళకు అద్దుకున్నాడు. ఇంతలో “ఇదిగో ప్రసాదం అన్నా” అంటూ మరో పిల్లవాడు వేయించిన శనగలు చేతిలో పెట్టాడు. అప్రయత్నంగా భక్తిగా కళ్ళుమూసుకొని నోట్లో వేసుకున్నాడు. పెద్దవాళ్ళంతా వెళ్లిపోయారు. మోహన్ అక్కడే నిలబడి చూస్తున్నాడు. బహుశా 15 ఏళ్ళ లోపు వుంటారేమో అందరూ.. మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అన్నీ సర్దుకుంటూ నిమజ్జనానికి ఏం చేయాలో చర్చించుకుంటున్నారు. రేపటి ఏర్పాట్లలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూసుకోవాలని, గణేశుని భజనలతో కొలుస్తూ ఊరేగించాలని, అందరికీ ప్రసాదం అందేలా జాగ్రత్త వహించాలని వాళ్ళ చర్చల సారాంశం. దానికి ఎవరెవరు ఏం చేయాలో , ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. చివరగా స్వామికి దండం పెట్టి వేడుక జయప్రదంగా జరగడానికి అనుగ్రహాన్ని ఇవ్వమని కోరుకొని వెళ్లిపోయారు. అంతా గమనిస్తున్న మోహన్ శరీరంలో ఒక్కసారిగా నీరసం ఆవహించింది. మెదడు మొద్దుబారి పోయింది. మనసులో తెలియని వెలితి ప్రవేశించింది. ఎలాగోలా ఇల్లు చేరుకున్నాడు. నిద్ర పట్టడం లేదు. పదే పదే ఆ పిల్లల మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
తెల్లవారి ఉదయమే కలత నిద్రతో ఎర్రబడిన కళ్ళతో లేచాడు మోహన్ . బయటకు వెళ్ళడానికి అన్యమనస్కంగానే తయారవుతున్నాడు. ఇదంతా సోఫాలో కూర్చుని గమనిస్తున్న తండ్రి ‘నాయనా మోహన్!’ అని పిలిచాడు. ఇదే ఇంకో సందర్భంలో అయితే ఒంటి కాలు మీద లేచేవాడే. కానీ ఎందుకో తండ్రి వైపు అడుగులు వేసి చిన్న పిల్లాడిలా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. “ఏమయింది నాన్నా? ఈరోజు నీలో ఎందుకో హుషారు కనిపించడం లేదు. తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నట్లు నీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోగలను. అసలేం జరిగింది?” అంటూ లాలనగా అడిగాడు. అమాంతం తండ్రి ఒడిలో తల పెట్టుకొని నిన్నటి విషయం చెప్పి, అది తనను ఎంతగా మనస్తాపానికి గురి చేస్తున్నదో చెప్పాడు.
తండ్రి ఓదార్పుగా మోహన్ తలను ప్రేమగా నిమురుతూ “మోహన్! ఒక్కగానొక్క కొడుకువని గారాబంతో నిన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా పెంచాం. అతికష్టం మీద ఇంజనీరింగ్ పాస్ అయి ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే ఎన్ని సార్లు నీకు హితబోధ చేయడానికి ప్రయత్నించినా మా మాట పెడచెవిని పెట్టావు. మా పెంపకం లోపమని అనుకుని నేను, మీ అమ్మ బాధ పడని క్షణం లేదు. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నీకు ఎలాంటి లోటు రాదు. మరి ఆ తర్వాత? ఒక్క విషయం చెప్పనా? మనం స్వచ్ఛమైన భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క క్షణం భగవంతుని తల్చుకున్నా చాలు..ఆ పరంధాముని అనుగ్రహాన్ని పొందవచ్చు. హంగులూ, ఆర్భాటాలు, రాజకీయపు పోకడలు, స్వార్థ చింతనలు, మోసపూరిత భావాలు ఇవన్నీ మనిషికి అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ శాశ్వతంగా ప్రశాంతతను దూరం చేస్తాయి. ‘భక్తి’ అనే భావన మనసుకు సంబంధించినది. పదిమందిలో నిరూపించుకునేది కాదు. అందరిలో గొప్పలు ప్రదర్శించడానికీ కాదు. నిష్కల్మషమైన మనసు, నిస్వార్థ భావన, భగవంతుని పట్ల అనురక్తి..ఇవన్నీ ఆ పిల్లల్లో నువ్వు ప్రత్యక్షంగా చూశావు. ఇది ఒకరు నేర్పితే వచ్చేది కూడా కాదు. అది మనిషి అంతర్గత పొరల్లో నుండి ఉబికి వచ్చే భావన. నీవు ఎన్నో చోట్ల ఈ వేడుకలను ప్రతీ సంవత్సరం చూస్తూనే ఉన్నావు. ఇవేమీ నీకు కొత్త కాదు. కానీ నిన్న
వాళ్ళను చూసిన తర్వాత ఇంతగా చలించడానికి, ఆవేదనకు గురి కావడానికి కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. నీకే బోధ పడుతుంది” అన్నాడు. వంటింట్లోంచి వీళ్ళ మాటలను వింటున్న తల్లి సుశీలమ్మ
కంటి నిండా నీళ్లు.
ఎన్నడూ లేని విధంగా తండ్రి మాటలను శ్రద్ధగా వింటున్న మోహన్ నిట్టూర్చి చెప్పులు వేసుకొని నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. మంటపం దగ్గరికి
వెళ్ళాడు. అప్పుడే పూజారి వచ్చి విగ్రహాన్ని ఉద్వాసన చేయించే పనిలో నిమగ్నమయ్యాడు. పూజ జరుగుతున్నంతసేపు కదలకుండా పరిపరి విధాల ఆలోచిస్తూ కూర్చున్న మోహన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకిస్తూ లేచి నిలుచున్నాడు. చేతులు జోడించి గణనాథుని వైపు చూశాడు. ఆ స్వామి తన నిర్ణయాన్ని సమర్థిస్తూ అనుగ్రహ పూర్వకంగా నవ్వుతున్నట్లు అనిపించింది. దిగులు అంతా మాయమైంది. నూతన ఉత్సాహంతో నిమజ్జనాన్ని ఎలాంటి లోటు జరుగకుండా పూర్తి చేశాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. పవిత్రమైన మనసుతో తృప్తిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం సరిగ్గా తొమ్మిదిగంటలు. నీట్ గా తయారైన మోహన్ క్యాష్ బ్యాగుతో తన గది నుండి
బయటకు వచ్చాడు. తల్లి దండ్రుల పాదాలకు నమస్కరించి, నవరాత్రుల ఖర్చులు పోనూ మిగతా డబ్బును అనాథ శరణాలయానికి ఇవ్వడానికి వెళ్తున్నట్లు అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించ బోతున్నట్లు చెప్పి హుషారుగా ముందుకు నడిచాడు. ఆనందం నిండిన కళ్ళతో కొడుకు వైపు మురిపెంగా చూస్తూ ఆశీర్వదించారు సుశీల దంపతులు.
అమాయకత్వానికి మరో పేరు చంద్రమోహన్. అందరూ తెలివి తక్కువ వాడని అవహేళన చేసినా ముఖం చిట్లించుకునే రకం తప్ప ఎదురు జవాబు చెప్పడు. అమాయకత్వానికి తోడు చదువు కూడా అబ్బలేదు. మూడు సార్లు దండ యాత్రల తర్వాత పదవ తరగతి సర్టిఫికెట్ చేతికి దక్కింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో అంతటితో చదువు ఆపేసాడు. రెండు గదుల పోర్షన్ లో ముందు గదిలో తల్లి చిన్న కిరాణా కొట్టు నడిపించేది. వెనుక గదిలోనే కుటుంబమంతా నివాసం. చదువు మీద పెద్దగా శ్రద్ధ లేకపోవటంతో అప్పుడప్పుడు తల్లికి తోడుగా కిరాణా కొట్టులో కూర్చునే వాడు. యుక్త వయసు రాగానే ఆర్ధికంగా అంతంత మాత్రమే ఉండే మేనమామ బాలనర్సు కూతురు రమ్యతో ఇరు కుటుంబాల వారు వివాహం జరిపించారు. రమ్య కూడా పదవ తరగతితో చదువు ఆపేసింది. పెళ్ళైన కొంత కాలానికే చంద్రమోహన్ తల్లి కాలం చేసింది. కిరాణా కొట్టును రమ్య చూసుకోసాగింది. తెలివైంది కావటంతో ఆర్ధిక ఇబ్బందులను దాటుకుంటూ కొద్ది సంవత్సరాల్లోనే వ్యాపారాన్ని ఓ మోస్తరుగా వృద్ధి చేసింది. కాలం గడుస్తుంటే చంద్రమోహన్ దంపతులు కొడుకు, కూతురుకు జన్మ నిచ్చారు.
ఇంటికి ఆనుకొని ఉన్న స్వంత ఖాళీ జాగాలో కూడబెట్టిన పైస పైసాతో చంద్రమోహన్ తండ్రి తన హయాంలోనే మూడు గదుల పోర్షన్ ను కట్టించి జనార్ధన్ కు కిరాయికి ఇచ్చాడు. దాదాపు ఇరవై సంవత్సరాల నుండి జనార్ధన్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆ ఇంట్లో చేరినప్పటి నుండి అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఆ ఇల్లు తమకు అచ్చి వచ్చినట్టుగా జనార్ధన్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అదే ఇంట్లో ఉంటూ కూతురు రాణి వివాహం భారీగా కట్నం ఇచ్చి ఘనంగా జరిపించాడు. కొడుకు రాకేష్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మరో రెండు సంవత్సరాల్లో విదేశాలకు పంపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంత సంపాదించి కూడా ఇరుకైన మూడు గదుల ఇంట్లోంచి మారాలనే ఆలోచన ఏనాడు కలుగలేదు. జనార్ధన్ ప్రస్తుత స్థాయికి ఆ ఇల్లు ఏమాత్రం సరిపడదు. చనువుగా ఉండే బంధువులు, స్నేహితులు కలుగజేసుకొని విశాలమైన ఇల్లుకు మారవచ్చు కదా అంటే, “ఇప్పుడు నేనుండేది నా స్వంత ఇల్లే, దీన్ని వదిలి వేరే ఎక్కడో ఎందుకుండాలి” అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చేవాడు. ఆ సమాధానం లోని అంతరార్ధం పసిగట్టలేని వాళ్లు సైలెంటుగా ఉండేవారు. మనిషి మానసిక స్థితి ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో నివాసముంటూ నెలనెలా విద్యుత్ చార్జీలు కడుతున్నందుకు ఇంటిపై అన్ని హక్కులు తనకు దక్కుతాయనే భావనతో ఉన్నాడు జనార్ధన్.
పిల్లల వయస్సు పెరుగుతుండటంతో కుటుంబమంతా ఒక్క రూములో సర్దుకోవటం రమ్యకు ఇబ్బందిగా అనిపించసాగింది. పిల్లలు చదువుకోవాలన్నా, రాత్రులు నిద్రపోవాలన్నా సతమతం అవుతున్నారు. అదే విషయం భర్తతో చెప్పింది. అమాయకంగా ముఖం పెట్టి
“ఇల్లు సరిపోకుంటే నన్నేం చేయమంటావు” అన్నాడు చంద్రమోహన్.
“అది కాదయ్యా, జనార్ధన్ సారు వాళ్లను ఖాళీ చేయించి ఆ పోర్షన్ కూడా మనమే ఉంచుకుందాం” అన్నది రమ్య. “అయితే నువ్వే అడుగు జనార్ధన్ సారును” అన్నాడు. మరుసటి రోజే సమయం చూసుకొని రమ్య జనార్ధన్ ఇంటికి వెళ్లి, తన పిల్లలు పెరుగుతున్నారని, ఒక్క రూంలో సర్దుకోలేక పోతున్నామని, ఇల్లు ఖాళీ చేస్తే ఆ పోర్షన్ ను కూడా తామే ఉంచుకుంటామని వేడికోలుగా చెప్పింది.
“ఇల్లు నేను ఖాళీ చెయ్యటమేమిటి, గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇందులో మాకు యాజమాన్య హక్కు ఏర్పడింది, ఇది ఇప్పుడు నా స్వంత ఇల్లు, మమ్మల్ని ఖాళీ చేయించే హక్కు మీకు లేదు ” జవాబిచ్చాడు జనార్ధన్.
“అదెలా సార్, ఈ ఇంటిని మా మామయ్య తన స్వంత జాగాలో స్వంత డబ్బులతో కట్టించాడు. మీరు కిరాయికి ఉన్నంత మాత్రాన హక్కు ఏర్పడిందని ఎలా చెబుతారు. మా పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు. మాకూ అవసరాలు ఉంటాయి సార్. దయచేసి ఖాళీ చేయండి” అంటూ ఈ సారి గట్టిగానే చెప్పింది రమ్య.
“కుదరదమ్మా, కరెంటు బిల్లు, నీటి పన్ను నేనే కట్టుకుంటున్నాను. ఇంట్లో చేరినప్పటినుండి అన్ని రిపేర్లు నేనే చేయించుకుంటున్నాను. పన్నెండు సంవత్సరాల పాటు అద్దెకు ఉంటే చట్ట ప్రకారం ఇంటి మీద హక్కులు ఏర్పడతాయి. మీకు తెలియదేమో నేను చెప్తున్నాను. అర్ధం చేసుకో. మీరు ఎంత అరచి గీపెట్టినా ఇల్లు ఎప్పుడో నా స్వంతమైంది, కావాలంటే కోర్టును ఆశ్రయించు” అంటూ రమ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంటి లోపలికి వెళ్లి పోయాడు జనార్ధన్.
కళ్ళ నుండి కారిన నీళ్లను చీర కొంగుతో తుడుచు కుంటూ దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది రమ్య. జరిగిన విషయం తెలిపింది భర్తకు. న్యాయాన్యాయాలు ఏమిటో బోధపడలేదు చంద్రమోహన్ కు.
“నిజంగానే ఇల్లు జనార్ధన్ స్వంతం అవుతుందా? మరి ఇప్పుడు మనమేం చేద్దాం రమ్యా? ” ప్రశ్నించాడు చంద్రమోహన్.
జనార్ధన్ చెప్పిన విషయం పదే పదే మెదడును తొలిచేస్తుండటం మూలాన రమ్యకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. చంద్రమోహన్ కు మాత్రం ఎటువంటి ఆలోచన లేదు. మరుసటి దినం లాయర్ చక్రవర్తి రోజు మాదిరే తన కిరాణా కొట్టు ముందు నుండి నల్లకోటు వేసుకొని బైకుపై వెళ్ళటం రమ్య గమనించింది. కొన్నాళ్ల క్రితం చక్రవర్తి పేరు విన్నది. ఆయనతో తనకు ఇప్పుడు అవసరం ఏర్పడింది. తనకు వరుసకు సోదరుడైన రామచంద్రం పొలం విషయంలో పెట్టిన కేసులో చక్రవర్తి బాగా సహాయం చేశాడని, మంచి పేరున్న లాయరని విన్నది. ఇంటి విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికొచ్చింది రమ్య. వెంటనే రామచంద్రంకు ఫోను చేసింది “అన్నా బాగున్నారా ” అంటూ. బాగున్నామని రామచంద్రం జవాబిచ్చాడు.
“అన్నా, నా ఇద్దరు పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారు నీకు తెలుసు కదా. ఇప్పుడు మేముండే చిన్న గదిలో సర్దుకోవటం కష్టంగా ఉంది. మా మామయ్య కట్టించిన పక్క పోర్షన్ లో కిరాయికి ఉండే జనార్ధన్ సార్ ఖాళీ చేస్తే అది కూడా మేమే ఉంచుకుందామని ఖాళీ చెయ్యమన్నాను. నా పెళ్ళికి ముందు నుండే ఆయన ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయింది. ఇరవై ఏళ్ల నుండి ఉంటున్నాను కాబట్టి తనకు ఇంటిమీద యాజమాన్య హక్కులు ఏర్పడినాయని ఖాళీ చేసేది లేదని ఖరాఖండిగా అంటున్నాడు జనార్దన్ సారు. ఈ విషయంలో లాయర్ చక్రవర్తిని సంప్రదిస్తే ఏదైనా సలహా ఇస్తాడని అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ అన్నా “.
“మంచిదే. చక్రవర్తి సారు న్యాయం కోసం కొట్లాడే మనిషి. తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ రోజు సాయంత్రం నేను నీ కొట్టు దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి ఆయన దగ్గరకు వెళ్దాం” అంటూ ఫోను పెట్టాడు రామచంద్రం.
చెప్పినట్టే అదేరోజు సాయంత్రం రామచంద్రం రమ్య కిరాణా కొట్టు దగ్గరకు వచ్చాడు. ఇద్దరు కలిసి లాయర్ చక్రవర్తి ఆఫీసుకు వెళ్లారు. రామచంద్రం రమ్యను చక్రవర్తికి పరిచయం చేశాడు. తనకు, జనార్ధన్ కు మధ్య జరిగిన విషయాన్ని ఏడుస్తూ రమ్య చక్రవర్తికి విశదీకరించింది. “లాయరు గారూ, మా మామయ్య కష్టార్జితమైన ఇల్లును మేము పోగొట్టుకున్నట్లేనా, దీనికి పరిష్కారం ఏమిటి ” అడిగింది.
“లేదమ్మా, మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఇల్లు కిరాయిదారైన జనార్ధన్ కు ఎప్పటికీ స్వంతం కాదు. ఎన్నేళ్లు ఉన్నా అతడు కేవలం కిరాయిదారు మాత్రమే. మీరు అమ్మితే తప్ప అతడు ఇంటిపై యాజమాన్య హక్కులు పొందలేడు. యాజమాన్య హక్కు ఉండదనే విషయం తెలిసి కూడా మిమ్మల్ని మోసం చేసి అమ్మకం పత్రం రాయించుకోవాలనే దురుద్దేశంతో అన్నాడో లేక తెలియక అన్నాడో కానీ నీవు చెప్పిన విషయాలను బట్టి అతడికి ఇల్లు ఖాళీ చేయాలనే ఆలోచన లేదనిపిస్తుంది.” వివరించాడు చక్రవర్తి.
“లాయర్ గారూ, ఎట్లైనా చేసి మీరు ఇల్లు రమ్య కుటుంబానికి దక్కేలా చేయండి. ముందే ఆమె భర్త అమాయకుడు. ఈమె కూడా పెద్దగా చదువుకోలేదు. చిల్లర కొట్టు తప్ప వేరే ఏ ఆదాయం లేదు. ఇద్దరు పిల్లలు, భర్తతో సంసారాన్ని నెట్టుకొస్తుంది.” జోక్యం చేసుకుంటూ అన్నాడు రామచంద్రం.
“నీకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా సహాయం చేస్తాను. కాకపోతే ఇదంతా వారం పది రోజుల్లో తేలే ముచ్చట కాదు. కొంచెం ఓపిక పడితే ఓ మూడు నాలుగు నెలల్లో ఒక కొలిక్కి వచ్చేట్లు ప్రయత్నం చేస్తాను. ఈ రోజే ముందుగా ఈ నెలాఖరుకల్లా ఇల్లు ఖాళీ చేయాల్సిందని జనార్దన్ కు నోటీసు పంపిస్తాను. అతని జవాబును బట్టి తదుపరి నిర్ణయం తీసుకుందాం “.
లాయర్ చక్రవర్తి వెంటనే నోటీసు తయారు చేయించి జనార్ధన్ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశాలిచ్చాడు. నెల రోజుల పిదప కలువమని రమ్యకు చెప్పాడు. సరిగ్గా నెల రోజుల అనంతరం చంద్రమోహన్, రమ్య చక్రవర్తిని కలిశారు. తను పంపిన రిజిస్టర్డ్ నోటీసు జనార్ధన్ అందుకున్నట్లు, అతడి నుండి ఎటువంటి జవాబు రాలేదని చక్రవర్తి చెప్పాడు.
“కోర్టులో కేసు వేస్తే తీర్పు రావటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. పైగా కోర్టు ఫీజుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా లోక్ అదాలత్ లో దరఖాస్తు ఇద్దాం. పైసా ఖర్చు ఉండదు. తీర్పు కూడా త్వరగా వస్తుంది.” అంటూ సలహా ఇచ్చాడు చక్రవర్తి. కంప్యూటర్ మీద దరఖాస్తు తయారు చేయించి, చంద్ర మోహన్, రమ్యల సంతకాలు తీసుకొని మరుసటి రోజే లోక్ అదాలత్ న్యాయాధికారికి సమర్పించాడు చక్రవర్తి. దరఖాస్తును పరిశీలించిన న్యాయాధికారి అది సక్రమంగా ఉన్నందున జనార్ధన్ కు నోటీసు పంపిస్తూ లోక్ అదాలత్ బెంచి ముందు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకనుగుణంగా జనార్ధన్ ముగ్గురు సభ్యులతో కూడిన లోక్ అదాలత్ బెంచి ఎదుట నిర్ణీత తేదీ నాడు హాజరయ్యాడు. తను ఇరవై సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నట్టు, కాబట్టి యాజమాన్య హక్కులు తనకు సంక్రమించినట్లు వాదన వినిపించాడు. వాదనతో పాటు కరెంటు బిల్లులు, నీటి పన్ను తనే కడుతున్నట్లు సాక్ష్యంగా సమర్పించాడు.
“జనార్ధన్, నీవు ఒక విషయం గమనించాలి, కరెంట్ బిల్లులు, నీటి పన్ను కట్టినంత మాత్రాన నీకు యాజమాన్య హక్కులు సంక్రమించవు. ఏ చట్టం కూడా ఆ విధంగా చెప్పలేదు. ఎన్నేళ్లయినా కేవలం కిరాయిదారుగా మాత్రమే ఉంటావు. నీవు ఇరవై ఏళ్లుగా ఉంటున్నావు, నీ కూతురు వివాహం చేశావు, ఎదిగిన కొడుకు ఉన్నాడు, నీ వ్యాపారం బాగానే వృద్ధి చెందిందనేది వాస్తవం. చంద్రమోహన్ అమాయకుడు. దంపతులిద్దరు చిల్లరకొట్టు నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఒకే ఒక్క గదిలో జీవితం వెళ్ళదీస్తున్నారు. ఇప్పటి పరిస్థితిలో కొంచెం విశాలమైన ఇంట్లో ఉండాలనుకోవటం నిస్సందేహంగా వారికున్న హక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిపై వారికి సర్వాధికారాలు ఉంటాయి. చంద్రమోహన్ కోర్టులో కేసు వేస్తే నీవు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని తీర్పు రావటమే కాకుండా అతడికి అయిన ఖర్చులన్నీ నువ్వే తిరిగి కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇద్దరికీ పైసా ఖర్చు ఉండదు. కావాలంటే ఖాళీ చెయ్యటానికి కొంత గడువు నీవు కోరటంలో తప్పేమి లేదు. ఒక గంట సమయం తర్వాత ఈ కేసును మళ్ళీ పిలుస్తాం. ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని చెప్పు ” అంటూ బెంచి లోని న్యాయాధికారి సలహా ఇచ్చాడు.
ఒక గంట తర్వాత కేసును పిలవటం జరిగింది. బెంచి లోని సభ్యులు జనార్ధన్ ను ఏమి నిర్ణయం తీసుకున్నావని ప్రశ్నించారు. “సార్, ఇల్లు ఖాళీ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాకపోతే ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు నాకు అందుబాటులో ఉండదు కదా. కనీసంగా ఒక మూడు నెలల గడువిస్తే ఈలోగా వేరొక ఇల్లు చూసుకుంటాను” జవాబిచ్చాడు జనార్ధన్.
చంద్రమోహన్, లాయర్ చక్రవర్తి కూడ జనార్ధన్ ప్రతిపాదించిన గడువుకు ఒప్పుకున్నారు. సమస్య సులువుగా పరిష్కారమైనందుకు లోక్ అదాలత్ న్యాయాధికారి, ఇతర సభ్యులు హర్షం వెలిబుచ్చారు. జనార్ధన్ మూడు నెలల్లోగా ఇంటిని ఖాళీ చేయాల్సిందని, అప్పటిదాకా ఒప్పుకున్న అద్దె చెల్లించాలని, కరెంటు, వాటర్ బిల్లులు చివరిదాకా చెల్లించాలని, ఇంటిని ప్రస్తుతమున్న స్థితిలో చంద్రమోహన్ దంపతులకు అందజేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చంద్రమోహన్ కోర్టు సహాయం కోరవచ్చని లోక్ అదాలత్ బెంచి తుది తీర్పు ఇచ్చింది. అదే విధంగా ఈ మూడు నెలలపాటు చంద్రమోహన్ దంపతులు జనార్ధన్ ను ఏ విధమైన అక్రమ పద్ధతుల్లో జబర్దస్తీగా ఖాళీ చేయించే ప్రయత్నం చేయరాదని కూడ నిబంధన విధించింది. ఆమోద యోగ్యమైన అంగీకారానికి సుముఖత తెలియజేసి సత్వర పరిష్కారానికి తోడ్పడినందుకు లోక్ అదాలత్ బెంచి అభినందనలు తెలియజేస్తూ, అశోక చక్రంలో ఉండే 24 ఆకులకు భావాలుగా భావించబడే వివేకం, నైతికత, న్యాయం ఇరు వర్గాల వారు పాటించి ధర్మాన్ని గెలిపించారని, ఇది ఎవరి గెలుపో, ఓటమో అని భావించ రాదని, చంద్రమోహన్, జనార్ధన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ తీసుకోవాలని కోరుతూ తీర్పు ప్రతులు ఇరువురికి అందజేసింది.
**
చూస్తుండగానే మూడు నెలల గడువు ముగిసింది. జనార్దన్ ఇల్లు ఖాళీ చేసే రోజు రానే వచ్చింది. ఇన్నేళ్లుగా తమదిగా భావించిన కిరాయి ఇల్లును వదిలి మరో కిరాయి ఇంటికి వెళ్ళాల్సి వస్తున్నందుకు జనార్ధన్, అతని భార్య, కొడుకు ఏదో కోల్పోతున్న వారిలా దిగులుతో ఉన్నారు. సామాన్లు తీసుకుపోవటానికి లారీ వచ్చింది. కూలీలు సామాన్లను లారీ మీదకు ఎక్కించారు. హడావిడిని గమనించి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని “ఇల్లు ఖాళీ చేస్తున్నారా జనార్ధన్ గారూ” అంటూ పలకరించారు. “ఏమి బతుకులో ఏమో, దేవుడు నోటీసు పంపిస్తే ఒళ్ళు ఖాళీ చెయ్యాలి, కోర్టు నోటీసు పంపిస్తే ఇల్లు ఖాళీ చెయ్యాల్సిందే, మనిషి బతుకే కిరాయి బతుకు” నిర్వేదంగా జనార్ధన్ అంటుండగా లారీ భారంగా కదిలింది మరో చోటుకు.
*****
ఎల్బీనగర్ లోని ఓ మొబైల్ షాప్ నడుపుకుంటున్న, చంద్రపురి కాలనీ అపార్ట్ మెంట్ లో వుంటున్న మహేశ్ మనసు మంటలై మండిపోతున్నది.. అంతకంతకూ అవమానభారంతో అతడి ఆంతర్యం ఉడికిపోతున్నది. తన ఫ్లాట్ కెదురుగా వున్న ఆ ఇంటి ఓనర్, గవర్నమెంట్ టీచర్ అయిన రామచంద్ర పైన ఆ కోపం ఉప్పెనలా పొంగిపొర్లుతున్నది. రెండు నెలలుగా తరచూ రాత్రిపూట తాను ఫ్రండ్స్ తో కూడి సరదాగా తన ఫ్లాట్ లో పేకాడుతున్న సంగతి తెలిసి అతడు అభ్యంతరం తెలిపినా తాను వినక ఆట కొనసాగించేసరికి, ఆయన సోమ్మేదో పోయినట్టు పోలీసులకు సమాచారమిచ్చి తమనరెస్టుచేయించి అందరిలో అవమానంపాలు చేశాడు. కొంత పెనాలిటీతో మరికొంత రాజకీయ ప్రాబల్యంతో బయట పడగలిగాడు కానీ.. కాలనీలో మాత్రం అప్పట్నుండీ చుట్టుపక్కలందరూ, తెలిసినవాళ్లింకొందరు తననదోలా చూడడం, అవహేళన చేయడం భరించలేకపోతున్నాడు. ‘మొగుడు కొట్టినప్పుడు లేని బాధ తోడికోడలు నవ్వినందుకు కలిగింది’ అన్నట్టుగా, మునుపు తాను పేకాడుతాడని వీళ్లకు తెలిసినా ఎవరూ పట్టించుకోలేదుగానీ.. పోలీసులరెస్టుచేయడంతో అందరికీ అలుసైపోయాడు తాను. చట్టాలు శాసనాలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఊదరగొట్టే ఆ రామచంద్రగాడివల్లనే ఇదంతా జరిగింది. ఏదో చేసి వాడిని కూడా జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేయాలి. వాడి కూతుర్నెత్తుకెళ్లి చంపిపారెయ్యాలి.
అంతకుమించి మరో శిక్ష లేదు వాడికి.. అనుకొంటూ
కసిగా పిడికిళ్లు బిగించాడు.
పదేళ్ల ఆ పిల్ల శ్రధ్ద తనకు బాగానే పరిచయం. తోటి పిల్లలతో కలిసి అంకుల్ అంకుల్ అంటూ తనతో కేరమ్స్, ఛెస్ ఆడడానికొచ్చేది. ఆన్ లైన్ క్లాసులప్పుడు ఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెట్ రైట్ చేయించుకొని, థ్యాంక్స్ చెబుతూ “మంచి అంకుల్ మీరు” అంటూ వెళ్లేది. తానంటే ఆపిల్లకెంతో అభిమానం. ఏదో చెప్పి తనవెంట ఎక్కడికి రమ్మన్నా వస్తుంది. ఆ నిర్మానుష్య ప్రాంతానికి దాన్ని తీసుకెళ్లి, ఆపిల్ల గొంతునులిమి ఆ బ్రిడ్జ్ కింద పడేస్తే సరి.. అని.. ఆ ప్లేస్ కూడా నిర్ణయించుకొని, అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఆ ఇంటివైపే ఓ కన్నేసి వుంచాడు మహేశ్ . ఆ వారంలోనే ఆ సమయం రానే వచ్చింది. తల్లీ తండ్రీ ఏదో ఫంక్షన్ కు వెళ్లడం, స్కూల్ కి సెలవు కావడంతో ఆ అమ్మాయి శ్రధ్ధ ఒక్కతే ఇంట్లో వుండిపోవడం గమనించి, ఏవో మాయమాటలతో శ్రధ్దను తనవెంట తీసుకెళ్లడానికి వెంటనే ఆ ఇంటికి బయల్దేరాడు ప్రతీకారేచ్చతో మహేశ్ .
ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికడుగు పెట్టబోయాడు మహేశ్ . అంతలోనే హటాత్తుగా, ఊహించని రీతిగా ”భౌ” అన్న పెద్ద శబ్దంతో మీదికి దూకబోయినట్టనిపించిన కుక్కను చూసి అదిరిపడి , గేటు చివరిమెట్టు తట్టుకొని బోక్కబోర్లా పడిపోవడం, చీరుకుపోయివున్న కుక్కగిన్నె అంచు బలంగా నుదుటికి తగిలి గాయమవడం క్షణంలో జరిగిపోయింది.
ఆ శబ్దానికి మెరుపులా బయటికి పరుగెత్తుకొచ్చిన శ్రధ్ద “అయ్యో అంకుల్ ” అంటూ వెంటనే అతడిని సమీపించించింది.
“అరెరె.. మీకు దెబ్బ తగిలింది.. రక్తం వస్తోంది” అంటూ తన అరచేత్తో ఆ రక్తాన్ని అదిమిపట్టి వుంచింది కాసేపు.
“ఇలా జరిగినందుకు సారీ అంకుల్ .. లోపలికి రండి” అంటూ అతడు లేవడానికి తన శాయశక్తులా సాయంచేసింది. అతడి చేతిని పట్టుకొంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చుండబెట్టింది.
వెట్ వైబ్ తో గాయాన్ని తుడిచి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ గాయానికి బాండేజ్ వేసింది. “అంకుల్.. ఇలాంటి అవసరాల కోసమే నాన్న ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నింట్లో వుంచుతాడు!” అని చెబుతూ, మంచినీళ్లందించింది. పాలు వేడిచేసి పసుపువేసి తీసుకొచ్చింది.”పసుపుపాలు మంచిదంట.. ఇన్ ఫెక్షన్ కానివ్వదంట..తాగండి!” అంటూ అతడి నోటికందించడంతో, నోట మాట రాక శిలాప్రతిమలా మారిపోయాడు మహేశ్ . మరుక్షణం ఒక అనిర్వచనీయభావంతో ఆ చిన్నారి వైపు చూశాడు.
“అంకుల్ .. కాంపౌండ్ లో కుక్క వుందని మీకు తెలీదు కదూ? మా ఫ్రెండ్ వాళ్లు ఊరెళ్లిపోతూ, మాకు బాగా అలవాటుందని రెండ్రోజులకోసం మా ఇంట్లోనే ఒదిలి వెళ్లారు. సో సారీ అంకుల్ ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మి” అంటూ అపాలజీగా తన చేతులు పట్టుకొన్న శ్రధ్దను చూస్తూ చలించిపోయిన మహేశ్ కళ్లలో నీళ్లు ధారకట్టాయి.
“దెబ్బ బాగా నొప్పిగా వుందా? రేపటికల్లా తగ్గిపోతుంది లెండి.. ఏడవకండి అంకుల్ !” అంటూ పువ్వంటి తన చేతి స్పర్శతో ఆ గాయాన్ని సున్నితంగా తడిమింది శ్రధ్ద.
అమాయకమైన ఆ బాలిక స్వఛ్చమైన ప్రేమకు పూర్తిగా కదిలిపోయిందతడి హృదయం.
అమ్మలా ఆరిందాలా ఆప్యాయత పంచుతూ, తన చిన్న చిన్న చేతులతో ఓడాక్టర్ లా ఓ నర్స్ లా తనకు సేవలందించిన ఆ బాలిక శ్రధ్దకు ముగ్ధుడైపోయిన మహేశ్ అణువణువునా పశ్చాత్తాపం చోటుచేసుకొంది.
కాటేయవచ్చిన పాముకే పాలుపోసి ఆదరించిన ఆ పసితత్వంముందు పశుత్వం తలవంచింది.
‘ఇంత చిన్న అమ్మాయితనంలో సైతం అధ్బుతమైన అమ్మతనాన్ని ఆస్వాదించగలిగాను. పగ ప్రతీకారాలతో అమ్మాయినే కాదు అమ్మాయిలోని అమ్మనే అంతం చేయబోయిన దుర్మార్గుణ్ణి తల్లీ నేను! నీ పసితనపు అమాయకత్వంతో, ఆ అమాయకపు అమృతత్వంతో నాలోని విషపు భావాలను హరించివేశావమ్మా.. నాకే కాదు నాలాంటి ఎందరికో నీ అమ్మతనంలోని కమ్మదనాన్ని చవి చూపించి కల్మషాలెన్నో కడిగేయడానికై నిండు నూరేళ్లు జీవించు చిన్నారితల్లీ!’ అని మనసులోనే దీవిస్తూ, శ్రధ్ద తలనిమిరాడు. ఆపై “నన్ను మన్నించు తల్లీ” అన్న మనో భావనతో ఆ పదేళ్ల అమ్మాయి పాదాలపై తన శిరసునుంచి మౌనంగా క్షమాభిక్ష వేడుకున్నాడు.
“అయ్యో అంకుల్ మీరు నాకన్నా పెద్దవారు. అలా చేయకూడదు” అంటూ తనను వాటేసుకున్న శ్రధ్దను పదిలంగా, పవిత్రంగా, ప్రాణంగా పట్టుకొని ఆ చిన్నారితల్లిని గుండెలకు హత్తుకొని కన్నీటితో అభిషేకించాడు.
‘పదేళ్ల పాపలో కూడా వందేళ్ల సంస్కారాన్ని నింపి మరీ పెంచిన మీ మహోన్నత వ్యక్తిత్వానికి వేనవేల జోహార్లు రామచంద్రగారూ!’ అనుకొంటూ అతడికి అజ్ఞాత వందనాలర్పిస్తూ ఆ ఇంటి నుండి వెనుదిరిగాడు మహేశ్ .
*
కె.వీణారెడ్డి.
”టీచర్ టీచర్! ఇందాకటిసంది యాదగిరి క్లాసుల ఒర్రుతుండు టీచర్” అయిదో క్లాసు పిల్లలిద్దరు పరుగుపరుగున అరుంధతి దగ్గరికి వచ్చారు.
అప్పుడే అదే క్లాసునుండి బెల్ అయిందని స్టాఫ్ రూముకి వచ్చిన అరుంధతి గుండె దడ దడ లాడుతుండగా పరుగున మళ్ళీ ఆ క్లాసుకి వెళ్ళింది. టీచర్ రాగానే క్లాసంతా గప్ చిప్ అయిపోయారు. అరుంధతి క్లాసంతా కలయచూసింది. మామూలుగానే ఉంది. తనని పిల్చుకొచ్చిన పిల్లల్ని ”యాదగిరి ఎవరు?” అని అడిగింది అరుంధతి.
వాళ్లు చూపిన వైపు చూస్తే ఒక పిల్లాడు లేచి నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.
అంతలో ఆ పీరియడు టీచరు సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి ”ఇంకా క్లాసులో పాఠం కాలేదా అరుంధతీ?” అంటూ వచ్చింది.
తానెందుకు పరుగున మళ్ళీ రావాల్సివచ్చిందో చెపుతూ ”యాదగిరి ఒర్రుతుండని పిల్లలు పిలుస్తే వచ్చాను” అని చెప్పి గుమ్మం బైటికి వచ్చి ‘ఒర్రటం అంటే?’ రహస్యంగా మెల్లగా అడిగింది అరుంధతి.
సావిత్రి నవ్వి ”అరవటం…” అంది.
”హమ్మయ్య, ఇంకేమిటో అనుకున్నాను” అరుంధతి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది.
వివాహం అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టిన అరుంధతి ఇంకా అక్కడి తెలుగు నుడికారానికి అలవాటుపడలేదు.
స్టాఫ్ రూముకి వచ్చి పుస్తకాలు దిద్దటానికి తీసి ఆలోచనలో పడింది.
అరుంధతికి అకస్మాత్తుగా చిన్నప్పటి స్కూల్లోని హిందీ టీచరు గుర్తుకొచ్చారు. మిగతా సబ్జెక్టుల మీదున్న శ్రద్ధ రెండో భాషగా ఉన్న హిందీ భాష మీద పెట్టటం లేదని విద్యార్థులని కోప్పడుతూ ఉండేవారు.
ఒకరోజు ఆమె కోపం తారాస్థాయికి చేరి ”మీరు పెద్దయ్యాకో, పెళ్ళయ్యాకో ఏ బొంబాయో, ఢిల్లీయో వెళ్తే అక్కడ భాష రాక యిబ్బంది పడతారు, కాస్త శ్రద్ధ పెట్టి నేర్చుకోండి” అని క్లాసులోని అందర్నీ తిట్టారు.
దానికి ఆడపిల్లలందరూ ‘అంతదూరం వెళ్ళే అవకాశం కానీ, అవసరం కానీ మాకురాదు’ అని చిన్నగా అనుకుంటూ నవ్వుకున్నారు.
అది గుర్తొచ్చిన అరుంధతి, స్టాఫ్ రూములోని టీచర్లతో చెపుతూ ”ఆవిడ అన్నట్లే నేనొచ్చి హైదరాబాదులో పడడమే కాకుండా, ఈ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తధాస్తు దేవతలు ”తథాస్తు తథాస్తు’ అన్నట్లున్నారు” అంటూ నవ్వింది. అక్కడున్న టీచర్లు కూడా అరుంధతి మాటలకు పడీ పడి నవ్వారు.
ఉపాధ్యాయ శిక్షణ అనంతరం మొట్టమొదట చేరిన స్కూలు ఇది. అందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు. అంతేకాక విద్యార్థులు చాలావరకూ శ్రామిక, కార్మిక వర్గానికి చెందినవారు. దాంతో అరుంధతికి భాష ప్రధాన సమస్య అయిపోయింది.
కొత్తగా చేరటంవలన అన్నీ ప్రాథమిక తరగతులు కేటాయించటం మూలాన క్లాసులో తాను చెప్తున్న పాఠం పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అని బెంగ పట్టుకునేది.
అరుంధతితోబాటే ఉద్యోగంలో చేరిన సావిత్రి ఆమెకు కొంత సహాయకారిగా ఉంటూ ఉండేది.
ఒకరోజు అరుంధతి మూడో తరగతి క్లాసుకి వెళ్ళింది. క్లాసుకి క్రమం తప్పకుండా వచ్చే రాజు ఆ రోజు రాకపోవటం చూసి క్లాసులో పిల్లల్ని ప్రశ్నించింది ”రాజు రాలేదెందుకని”.
అంతలో మెల్లగా నడుచుకొంటూ, చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకొంటూ వచ్చాడు రాజు.
”ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని గద్దించింది అరుంధతి.
రాజు తలదించుకొని ”మా నాయన పన్లో పోయిండని అమ్మ నన్ను ఇంట్లనే ఉండి చెల్లిని జర చూస్తుండమని, ఇస్కూలుకి ఎళ్లొద్దని అంది టీచర్. నేనే ఇస్కూలు పోతానని వచ్చేసిన” అన్నాడు మధ్యమధ్యలో వెక్కిళ్ళు పెడుతూనే.
”అయ్యో, ఎందుకు వచ్చావు. ఇంట్లో ఉండకపోయావా” కంగారుగా అంటూ ఏంచేయాలో తోచక పక్క క్లాసులోనే ఉన్న సావిత్రిని పిలిచింది ”సావిత్రీ! రాజు వాళ్ళ నాన్న పోయాడని, వాళ్ళమ్మ ఇంట్లో ఉండమంటే వచ్చేసానని చెపుతున్నాడు రాజు. ఏం చెయ్యాలి” అంది.
సావిత్రి కూడా వచ్చి రాజుని ప్రశ్నించింది ”ఏందిరా మీ నాన్నకేమయింది?” అని.
”ఏంకాలే టీచర్. మా నాయన పన్లోకి పోయిండు. మాయమ్మ ఏడకో పోవాల్నంట. ఇస్కూలు మాని చెల్లిని చూసుకోమనె. ఇస్కూలుకి పోతనంటే మాయమ్మ తిట్టింది” అన్నాడు రాజు.
సావిత్రి నవ్వుతూ ”ఇలా ప్రతీదానికీ కంగారు పడ్తావేంటి అరుంధతీ! రాజు నాన్న పనిచేయడానికి వెళ్ళాడట” అంది.
”అంతేనా! ఇంకా నేను ఇక్కడి యాసకు అలవాటుపడలేదు. అందుకే కంగారుపడ్డాను” అంటూ సిగ్గుపడింది అరుంధతి.
అప్పటినుండి విద్యార్థులు మాట్లాడుతున్నంతసేపూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించసాగింది అరుంధతి.
పాఠం చెపుతున్నపుడుకూడా వాళ్ళని పదే పదే పాఠానికి చెందిన ప్రశ్నలు వేసి, వాళ్లు తన మాటల్ని అర్థం చేసుకొనేవరకూ ఆగి జవాబుల్ని వినేది.
వింటున్నకొద్దీ తెలుగులోని ఆ ప్రాంతీయ యాస సొబగు అరుంధతికి అర్థం కాసాగింది. అంతేకాదు తానుకూడా విద్యార్థులతో వాళ్ళ యాసలోనే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూనే హిందీ ఉర్దూ పదాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవటం మొదలుపెట్టింది.
విద్యార్థులుకూడా తన ప్రాంత యాస పదాలు వారికి కొత్తగా అనిపించి పదే పదే అర్థంకాక ప్రశ్నించేవారు. మొదట్లో ఎంత స్పష్టంగా వివరించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకపోవటం చికాకై విసుక్కొనే అరుంధతి, రాను రాను స్వీయ అనుభవంతో తనను తాను మెరుగుపరచుకొంది.
వాళ్ళ ప్రాంతీయతను తాను మరోలా అర్థం చేసుకొన్నట్లే తన ప్రాంత యాసా వారికీ వింతగా తోస్తుందనేది అనుభవ పూర్వకంగా అర్థమైంది అరుంధతికి.
ఆ నెల జీతం అందుకుని తన సహ ఉపాధ్యాయినిలు ఫాతీమా, సావిత్రిలతో కలిసి షాపింగుకు వెళ్ళింది అరుంధతి.
కొత్తగా వెలసిన ఆ పెద్ద షాపు ఆశ్చర్యంగా అనిపించింది అరుంధతికి. అందులో తానులు తానులుగా ఉన్న వివిధ డిజైన్లను చూసి వాటిని చీరలుగా తీసుకుంటే ఎలా ఉంటుందని స్నేహితురాళ్ళు ముగ్గురూ అనుకున్నారు.
అది విని సేల్స్ గర్ల్ అవే తానులతో కుట్టిన డిజైనర్ డ్రస్సులను తీసి చూపించింది. దాంతో లంగా వోణీలు, చీరలు, చుడీదార్లు కూడా డిజైన్ చేసుకోవచ్చు అనే అంశం ఆ ముగ్గురికీ చాలా నచ్చింది.
వెంటనే సావిత్రి తనకోసం చీరకి సరిపడినంత కొలిపించి తీసుకుంది. అరుంధతి తమ ఊరులో ఉన్న చెల్లెలికి లంగా వోణీకోసం కత్తిరింపించి తన చెల్లెలు కూడా తనంత పొడుగు ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న టైలరుకి కొలతలు ఇచ్చింది. ఆ రంగు డిజైను నచ్చిన ఫాతీమా తనకికూడా అదే తానునుండి పంజాబీ డ్రస్సుకి సరిపడా ఇవ్వమని కొని అదే టైలరుకి కుట్టించటానికి యిచ్చింది.
అందరం ఒక తాను నుండే విభిన్న దుస్తులుగా రూపొందించటానికై అనుకోకుండా తీసుకోవడం గమనించి ప్రాంతాలు, భాషలు, యాసలు వేరైనా అందరం ఒక తాను ముక్కలమే అనుకుంది అరుంధతి. ఈ ఏకతా సూత్రాన్ని విద్యార్థులకు నేర్పవలసిన వారమూ మేమే అని మనసారా తలంచుకొంది.
ఆ అనుభూతిని దాచుకోలేక స్నేహితురాళ్ళ ముందు బయటపెట్టింది అరుంధతి. ‘అవును నేనూ అదే అనుకున్నాను’ అని ఫాతీమా, సావిత్రీ అనేసరికి ఆత్మీయంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకుని నిండుగా నవ్వుకున్నారు.
(తెలుగు విద్యార్థి సౌజన్యంతో)
మీ మనవడికి జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి, తన తలకి బలంగా దెబ్బ తగలడం వలన, ఏక్షణమైన తను అతిగా బాధపడితే ప్రమాదం వెన్నంటే ఉన్నట్లుగా మీరు భావించాలి, అతడు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి, తను అడిగింది కాదనకూడదు, తనకు మతిమరుపు కూడా రావచ్చు, ఇంకొకటి తన తలలో రక్తం గడ్డ కట్టుకొని ఉన్నది, దానివలన మీరు చెప్పింది వింటాడని నమ్మకం కూడా లేదు, ప్రేమతోనే తన పక్కనే ఉంటూ చూసుకోవాలి, నేను ఇచ్చిన ఈ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడాలి.
డాక్టర్ ఒకవేళ్ళ తను మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వెయ్యడానికి ప్రయత్నం చేస్తే, తను వేసుకోకపోతే అప్పుడు ఎలా?
మీరు చెప్పింది నిజమే ఎందుకంటే తనకు ఏమీ జరగలేదు అని, తనకు ఎటువంటి సమస్య లేదని, మొండికేసి కూర్చుంటారడు, ఒక్కోసారి ఎదుటిమనిషి వేసుకుంటే వీళ్ళు కూడా వేసుకుంటారు, అలా గాని మీ మనవడు నువ్వు వేసుకుంటే నేను వేసుకుంటా అనికూడా అనగలడు!
అలా అంటే సమస్య లేదు డాక్టర్, నా మనవడు కోసం కచ్చితంగా నేను మాత్రలు వేసుకుంటాను, అందులో సందేహం లేదు.
ఐతే మాకు ఎటువంటి సమస్య లేదు, మీరు ఖచ్చితంగా మీ మనవడితో ఈ టాబ్లెట్స్ వేయించాలి, మీరు పనిలో పడి మరచిపోకూడదు, మీరు మరచిపోతే చాలా కష్టం.
నేను అసలు మరచిపోను డాక్టర్.
ఇతడితో ఒకమనిషి ఎప్పుడూ ఉండాలి, ఇతని తల్లిదండ్రులు ఉంటారా ప్రక్కన.
లేదు డాక్టర్, వాళ్ళు పనిలో పడి మరచిపోతే కష్టం, ఇద్దరు ఆఫీసుకి వెల్లుతారు, కనుక నేను నా మనవడికి తోడుగా ఉంటాను. ఇంకొక సందేహం ఒకవెళ్ళ కాలేజీకి వెల్లుతా అంటే అప్పుడు ఎలా డాక్టర్.
ఇప్పుడే అనకపోవచ్చు, ఒకవేళ్ళ అంటే మాత్రం, మీ మనవడుని తొందరగా కొలుకుంటాడు అని మాత్రం చెప్పగలను.
డాక్టర్ గారికి దణ్ణం పెట్టి, మనవడుని తీసుకొని ఇంటికి బయలుదేరినాడు కోటయ్య.
అసలే వయసు మళ్ళిన వాడిని, ఒకపక్క తల్లిదండ్రులు కూడా దగ్గరలో లేరు, నాకు గుర్తుండటమే అంతంత మాత్రం, అలాంటిది ఇప్పుడు నా మనవడు ఇలా ఉంటే, నేను వాడికి సరైన సమయంలో ఈ టాబ్లెట్స్ ఎలా వెయ్యాలి, వాడిని ఆనందంగా ఎలా ఉంచాలి, తల అంతా ఆలోచనలతో పిచ్చేక్కిపోతుంది, చిన్నతనం నుండే కష్టాలు కన్నీళ్లు అలవాటు అయ్యినాయి కనుక, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, చుట్టూ జనం ఉన్నా సరే, ఒంటరిగా బ్రతికినా, ఏ రోజు కన్నీరు రాలేదు, తాత చనిపోయే క్షణాల్లోనే అత్తయ్య కూతురుతో తాత కోసం, నాన్న పెళ్లి చేయడం, అసలు పెళ్లంటే ఏమిటో తెలియని వయసులోనే పెళ్లి చేయడం, తాతయ్య కంటే ముందే అమ్మానాన్నలు మరణించడం, ఆ దిగులుతో తాత కూడా మరణించడం, నాయనమ్మ అన్నీ తానై చూసుకుంది, కొద్దిరోజులకు ఆమె కాలం చెయ్యడంతో, ఇద్దరమే జీవితంతో పోరాటం మొదలుపెట్టినాము, ఆ రోజు నుండి ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అని అడగలేదు, నేను ఏది చెబితే అదే కరెక్ట్ అనేది, ఆవేశంగా మాట్లాడితే శాంతంగా సమాధానం చెప్పేది, కోపంలో కొట్టితే చిరునవ్వు నవ్వేది, అలిగితే బ్రతిమిలాడేది, ఎన్నో కష్టాలు ఓర్చుకొని జీవితాన్ని సరైన మార్గంలో నడిపించిన దేవత నా భార్య, కొడుకు పుట్టాడు, వాడి భవిష్యత్ కోసం పాకులాటలు, వాడి జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టేటందుకు ఎన్నో సమస్యలు, ఐనా వాడిని ఉన్నత చదువులు చదివించి, ఓ మంచి కుటుంబంలో అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయించడం జరిగింది, తరువాత వీడు పుట్టాడు, వీడిని చూసిన తర్వాత నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, నన్ను భర్తలా కంటే కన్న బిడ్డలా చూసుకున్న నా ఇంటి దేవత నన్ను వదిలివెళ్లిపోయిన తరువాత నేను ఒంటరిగా మిగిలిపోయాను, అప్పుడు నా బాధను తొలిగించింది నా మనవడు, వీడు నన్ను తాత అని పిలవడం కంటే ఎప్పుడూ బ్రో అంటూ పిలిచేవాడు, వాడు నన్ను బ్రో అంటూ, నాకు ప్యాంటు షర్ట్, తలకు రంగు వేసేవాడు, బ్రో అలా బయటకు వెల్లుదాం అనేవాడు, అలా నన్ను ఎప్పుడూ నవ్వించే నా చిట్టి తండ్రి, ఈ రోజు ఇలా ఉండటం ఎంతో బాధగా ఉంది, ఇంతలో సార్ ఇంటికి వచ్చాము అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు కోటయ్య, తన మనవడుని తీసుకొని లోపలికి వెళ్ళాడు.
వయసు రీత్యా మతిమరుపు రావడం సహజం, కనుక తన మనవడికి టాబ్లెట్స్ టైంకి వెయ్యాలి కనుక, బయటకు వెళ్లి ఎలక్ట్రిక్ షాపులో ఒక పరికరాన్ని తీసుకొచ్చాడు, దానికి ఒక సమయం కేటాయిస్తే, ఆ సమయానికి టాబ్లెట్ వేయాలి, టాబ్లెట్ వేయాలి అని చెప్పుతుంది, అప్పుడు టాబ్లెట్ వేయవచ్చు అని ఆ పరికరాన్ని తీసుకొచ్చి పెట్టాడు కోటయ్య, తన మనవడి పేరు రాము.
డాక్టర్ చెప్పినట్లుగానే రాము నువ్వు వేసుకుంటేనే నేను వేసుకుంటాను అని చెప్పడంతో కోటయ్య కూడా టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తూ ఉన్నాడు, రాము ఏది చేయమంటే కోటయ్య అది చేస్తూ ఉండేవాడు, కొద్దిగా కోలుకున్న రాము బ్రో కాలేజీకి పోదామా అన్నాడు ఒకరోజు, సరే రెండు రోజుల్లో వెల్లుదాం అని చెప్పాడు. అదే రోజు డాక్టర్ ని కలిసి డాక్టర్ రాము నన్ను కాలేజీకి రమ్మంటున్నాడు ఎలా అని అడగడంతో ఆలోచనలో పడ్డాడు డాక్టర్ గారు.
కొద్దీ సేపటికి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి, చూడండి కోటయ్యగారు నేను రాము వెళ్లే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాను, మీరు కూడా కాలేజీకి వెళ్ళవచ్చు అన్నాడు.
డాక్టర్ నేను ఈ వయసులో కాలేజీకి వెళ్లడం ఏమిటి ఆశ్చర్యంతో అన్నాడు.
తప్పు ఏముంది, మీ మనవడికి తోడుగా వెళుతున్నారు అనుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఒకవేళ్ళ తను ఒక్కడే కాలేజీకి వెళ్ళితే, మధ్యలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పుడు బాధపడేది ఎవరు ఒక్కసారి ఆలోచించండి?
మీరు చెప్పింది నిజమే కానీ, ఇంట్లో అంటే ఎదో అలా నెట్టుకొని వస్తున్నాను, ఇప్పుడు కాలేజీకి అంటేనే కొంచెం ఆలోచించవలసి వస్తుంది దిగులుగా అన్నాడు.
ఇక్కడ ఆలోచించవలసింది ఒక్కటే, నీ మనవడు కోసం నువ్వు ఏమి చెయ్యగలవో అవి చెయ్యండి, ఆలోచనతో మీరు ఆందోళన పడి, మీ మనవడ్ని ఆందోళనకు గురిచేయకండి. మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీ మనవడు అంతే సంతోషంగా ఉంటాడు మీరు కొంచెం ఆందోళన చెందినా, మీ ముఖంలో కొంచెం విచారణ కనిపించినా మీ మనవడు ఎంతో బాధ అనుభవించవలసి రావచ్చు. ఒక డాక్టర్ గా కాదు, సాటి మనిషిగా చెబుతున్నా, మీరు ఇప్పటివరకు చూపిన శ్రద్ధ వల్లనే తాను మాములు మనిషి అవ్వుతున్నాడు అర్ధం చేసుకో అన్నాడు.
క్షమించండి డాక్టర్ నా మనవడు కోసం నేను ప్రాణాలు అయినా ఇస్తాను, నేను వెల్లుతాను కాలేజీకి అన్నాడు.
హాయ్ బ్రో ఎక్కడికి వెళ్లావు, ఈ రోజు మనం షాపింగ్ చెయ్యాలి, అంతే కాకుండా స్మార్టుగా తయారు అవ్వాలి, రేపటి నుండి కాలేజీకి వెళ్ళాలి అన్నాడు రాము.
అలాగే రాము వెల్లుదాం అన్నాడు కోటయ్య.
షాపింగ్ చేశారు, హెయిర్ కటింగ్ చేయించుకున్నారు ఇద్దరు, హెయిర్ కి ఇద్దరు ఒకే విధంగా కలర్ వేయించుకున్నారు, మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నారు, అలా హోటల్ లో భోజనం చేసి ఇంటికి సాయంత్రం వచ్చారు.
ఇద్దరు ప్యాంటు షర్ట్స్ వేసుకొని, బైక్ మీద కాలేజీకి వెళ్లినారు, ఇక రోజూ కాలేజ్, వారం వారం సినిమాలు, ఒక్కటే ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లినా మై బ్రదర్ అని పరిచయం చేయడం మొదలుపెట్టాడు రాము, కోటయ్య కూడా మౌనంగా తలఊపేవాడు. కోటయ్య పేరుని రాకీ గా మార్చివేశాడు. రాము ఎప్పుడూ నవ్వుతూ ఉండటంతో, రాకీ కూడా అంతే నవ్వుతూ ఉండేవాడు, కాలేజీలో అల్లరి బాగా చేసేవాడు రాకీ, రాము కూడా సపోర్ట్ చేసేవాడు, ఒక్కోసారి వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే కవలపిల్లలుగా ఉండేవారు, ఏ విషయానైన చాలా తేలికగా తీసుకునేవాడు రాకీ.
అలా రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి..
ఒకరోజు రాము వాళ్ళ అమ్మానాన్నలు వచ్చారు, ఇంట్లో రాము లేడు, రాకీ ఒక్కడే ఉన్నాడు, రాకీ వాళ్ళను చూసి కొంచెం సంశయించినాడు, చూడు బాబు మా అబ్బాయి రాము ఎక్కడా అని ఆడిగినాడు,
రాము బయటకు వెళ్ళాడు అని చెప్పాడు..
ఇంతకీ నువ్వు ఎవరు? సందేహంతో అడిగింది రాము అమ్మ.
నేను రాము స్నేహితుడిని అని చెప్పినాడు రాకీ, తల పక్కకు తిప్పుకోని.
అనుమానంతో రాము తండ్రి వచ్చి రాకీ ముఖంలోకి చూశాడు, అంతే పట్టరాని కోపంతో ఊగిపోయాడు.
నాకు తెలుసు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పులేదని, వాడికి ముందునుండే చెబుతున్నాను, ఈ ముసలోడిని ఇంట్లోకి రానివ్వవద్దు అని, ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి నా దగ్గరలేడు, నేను తాతను చూడక చాలారోజుల అయ్యింది అని చెప్పేవాడు, ఈయన గారిని ఏకంగా ఇంట్లోనే పెట్టాడు, ఐనా మనం అన్ని సార్లు వచ్చినా కనిపించలేదు అంటే, మనం వస్తున్నాము అని తెలుసుకొని ఆ సమయానికి ఎక్కడో ఉంచేవాడు అనుకుంటా! ఏమి బ్రతుకు మీది సిగ్గు శరం ఏమీ లేదా, మీ వయస్సు ఎక్కడ, వాడి వయస్సు ఎక్కడ, మీరు వాడి బట్టలు వేసుకొని, ఈ వయస్సులో తైతక్కలు అడుతున్నారా, మీరు వాడి స్నేహితుడు అని చెప్పుకొని తిరుగుతున్నారా, అసలు మిమ్మల్ని ఎలా తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు అన్నాడు రాము తండ్రి.
అది కాదురా, రాముకి యాక్సిడెంట్ అయ్యితే, డాక్టర్ రాముకి ప్రమాదం అని చెబితే, వాడు ఏది చెబితే అది చేశానురా, నాకు ఇలా ఉండాలి ఏమీ లేదురా అన్నాడు కొడుకుతో కోటయ్య.
ఛీ నోరుముయ్యి, వాడికి యాక్సిడెంట్ జరిగింది అని ఎందుకు నాన్న అబద్దాలు మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు మిమ్మల్ని బయటకు పంపించి వెయ్యాలి అనే ఉండేది, నా కొడుకుకి యాక్సిడెంట్ అని చెప్పినప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు, ఐనా ఇంట్లో ఉన్న ఇద్దరం నువ్వు మాకు వద్దు, మా ఇంట్లో ఉండొద్దు, అని నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా, కుక్కలా ఇంట్లో ఉండటానికి సిగ్గులేదు.
వస్తున్న కన్నీరు తూడ్చుకుంటూ, మాట తడబాటులో కూడా, నిజంగా వా..డి.. కి యాక్సిడెంట్ జరిగింది, అందుకే వాడిని కాపాడుకుంటూ ఉన్నానురా!
వాడిని చూసుకోవడానికి చిటికేస్తే వెయ్యి మంది క్యూలో ఉంటారు, ముసలివాడి సేవకావలసి వచ్చిందా, ఐనా నిన్న కాదు వాడిని అనాలి, అమ్మ పోయినప్పుడే నువ్వు పోతే పోయేది, ఎదో దేశంలో ముసలివాళ్ళని కాల్చి చంపుతారు అంట, నాకు అవకాశం రాలేదు కానీ నిన్ను కూడా కాల్చి చంపేవాడిని, ఆరోజు నువ్వు నా భార్య మీద చెయ్యివేసినప్పుడే!
నీ పెళ్ళాం మాట నమ్ముతున్నావు గాని, కన్న తండ్రి మాట నమ్మడం లేదా, కోడలు కూతురితో సమానంరా, అని కోపంతో చెయ్యొ ఎత్తాడు రాము తండ్రి పైన.
నా భర్త పైనే చెయ్యొ ఎత్తుతావా అంటూ కోపంతో చెంప మీద కొట్టి గట్టిగా క్రిందకు నెట్టింది, రాము తల్లి.
క్రిందపడగానే తలకి గట్టిగా దెబ్బ తగలడం, ఇంతలో హార్ట్ ఎటాక్ రావడంతో కొట్టుకుంటున్న కోటయ్యను పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు ఇద్దరు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి జరిగింది అంతా చూసి, వెంటనే రాముకి ఫోన్ చేసి చెప్పింది, రాము అంబులెన్స్ కి ఫోన్ చేసి, ఇంటికి వచ్చి తాతయ్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాడు.
కొద్దిసేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పాడు డాక్టర్ గారు.
హమ్మయ్య అనుకొంటూ ఉండగానే రాము తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. రావడం రావడంతోనే ఆవేశంగా..
రాము ఏమి చేస్తున్నావు ఇక్కడ, వాడు చస్తే చావనియ్యాలసింది పోయి ఎందుకు తీసుకొచ్చావురా అన్నది కోపంతో రాము తల్లి.
చూడు మమ్మి నువ్వు మాట్లాడటానికి అసలు అనర్హురాలివి, అదీ తాతయ్య గురించి మాట్లాడే అదికారం కూడా నీకు లేదు, ఇంకొక్క మాట తాత గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త!
ఎరా అమ్మని తిట్టే గొప్పోడివా అన్నాడు రాము తండ్రి.
కొద్దిసేపటికి రాము స్నేహితులు వచ్చారు.
ఏమైంది రాము ఏంటి ఇదంతా, రాకీ కి ఎదో జరిగింది అని తెలిసింది, అసలు రాకీ ఎవరు? మీ అమ్మానాన్నలతో ఈ గొడవలు ఏమిటి? నువ్వు అమ్మానాన్నలను తిట్టడం ఏమిటి? అసలు ఒక్కముక్క అర్ధం కావడం లేదు అసలు ఏమి జరిగింది అన్నారు స్నేహితులు.
నేను చెబుతాను అన్నాడు డాక్టర్.
రాము వాళ్ళ తాతయ్య మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రాకీ. రాకీ అసలు పేరు కోటయ్య. కోటయ్య భార్య చనిపోయిన తరువాత, కోటయ్యను కొట్టడంతో తలలో రక్తం గట్టకట్టుకొనిపోయింది, అలా దెబ్బలతో ఉన్నవాడిని రోడ్డు మీద వదిలివేశారు రాము తల్లిదండ్రులు. ఇక అప్పటి నుండి ఆ ఇంట్లో ఉండకుండా దూరంగా కిరాయికి ఉంటూ ఉన్నారు, విషయం తెలిసి తాతయ్య కోసం ఎన్నో చోట్ల తిరిగినాడు, పదిహేనురోజులు తరువాత రోడ్డు మీద ఆడుకుంటూ కనిపించిన తాతయ్యను తీసుకొని మా ఆసుపత్రిలో జాయిన్ చేయించినాడు. అప్పుడే ట్రీట్మెంట్ చేయకపోవడంతో సమస్య పెద్దది అయ్యింది కోటయ్యకు.
రెండు నెలల తరువాత మాములుగా అయ్యాడు కోటయ్య, తాతయ్యను తీసుకొని పాత ఇంట్లో ఉంటూ, తాతను అమ్మానాన్నలకు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, అనుకోకుండా అమ్మానాన్నలు అమెరికా వెళ్లవసివచ్చింది, సుమారు ఆరునెలల అక్కడే ఉంటారు అని తెలుసుకున్నాడు, కోటయ్యకు జ్ఞాపకశక్తి లేకుండా పోతుంది, ఏదీ గుర్తు ఉండటం లేదు ఒక్క రాము తప్ప అన్నీ మరచిపోతున్నాడు. ఇదే విషయం నా దగ్గర ప్రస్తావించాడు రాము, అంతే కాకుండా టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు అని చెప్పడం, తలలో ఉన్న ఆ గడ్డ కట్టిన రక్తం వలన ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు అని తెలియడంతో, ఇక క్రొత్త ట్రీట్మెంట్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను, తాతయ్య నాకోసం ఏమైనా చేస్తాడు అని చెప్పడంతో, నాకు ఒక ఆలోచన వచ్చింది అదే రాముకి యాక్సిడెంట్ అయ్యింది అని మేము కోటయ్యకి చెప్పడం, అప్పటి నుండి రాము కోసం కోటయ్య టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది, ఇక్కడ విషయం ఏమిటంటే తాతయ్య కోసం రాము టాబ్లెట్స్ వేసుకోవడం, రాము తాతయ్యను కాలేజీకి తీసుకెళుతా అన్నాడు, సమస్యలు వస్తాయి అంటే నేను చేసుకుంటా అని చెప్పాడు.
అనుకున్నట్లుగానే రాము కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినాడు, కోటయ్యే నాదగ్గరకు వచ్చేటట్లు చేశాడు, ఆరోజు నేను రాముతో మాట్లాడి విషయం నిర్దారణ చేసుకున్న తరువాతే, నేనే యాజమాన్యంతో మాట్లాడినాను అని చెప్పినాను, ఎక్కడ తాతయ్య దూరం అవ్వుతాడో అని అనుక్షణం తన పక్కనే ఉన్నాడు, ఈ వయసులో మనవడి కోసం తాత, తాత కోసం మనవడు, ఎంతో కష్టపడ్డారు. ఇలాంటి తాత మనవడిని ఎక్కడా చూడలేదు, మీకు నిజం చెప్పనా, తన తలలో గడ్డ కట్టిన రక్తం వల్ల, నేను ఆరునెలలు కంటే బ్రతకడు అని చెప్పాను, కానీ రెండుసంవత్సరాలుగా ఆ తాతను ఆనందంగా ఉంచి తన ఆయుస్సు పెంచాడు అని స్నేహితులకు వివరించాడు డాక్టర్.
స్నేహితులు రాముని గట్టిగా కౌగిలించుకున్నారు.
వెనుకనే కన్నీరు తుడుచుకుంటూ నిలబడ్డాడు కోటయ్య.
తాతయ్యను చూసి వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు రాము.
ఎందుకురా.. నాన్న నేనంటే అంత పిచ్చి అంటూ బోరున ఏడ్చాడు కోటయ్య.
తాతయ్య ఏడుస్తుంటే రాము కూడా బోరు బోరున ఏడ్చాడు.
అంతే అచేతనంగా అలా కుప్పకూలిపోయాడు కోటయ్య..
వెనువెంటనే స్పందించిన డాక్టర్, ఆపరీషన్ థియేటర్ కి తీసుకెళ్లారు, అందరూ రాముని ఓదార్చుతున్నారు.
కొన్ని గంటల తరువాత డాక్టర్ గారు బయటకు వచ్చారు, రాము ఇక తాతయ్యకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆపరీషన్ సక్సెస్ అయ్యింది అన్నాడు, అంతే రాము డాక్టర్ గారి కాళ్లకు దణ్ణం పెట్టాడు, రాముని పైకి తీసుకొని కౌగిలించుకున్నాడు డాక్టర్. మీ తాతయ్య నీకోసమే బ్రతికినాడు అన్నాడు.
ఇరవై నాలుగు గంటల తరువాత.. తాతయ్యతో మాట్లాడినాడు రాము.
ఆసుపత్రిలో C C కెమెరాలో రికార్డు అయ్యిన వీడియోలు వైరల్ అయ్యినాయి, రాముని అందరూ మెచ్చుకున్నారు, రాము తల్లిదండ్రులు పనిచేసే కంపనిలో నుండి తీసివేశారు, కారణం వీడియోలు వైరల్ అయ్యినవి వారివే కావడం.
మరల రాము, మన కోటయ్య సారి సారి… రాకీ కలసి ఎంతో ఆనందంగా ఉన్నారు, త్వరలో రాముకి పెళ్లి చెయ్యాలి అని రాకీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఈ విషయం తెలిసిన రాము రాకీ కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.
వీరిద్దరూ కాలేజీకి వెళ్లడం, సినిమాలకు వెళ్లడం సర్వసాధారణం అయ్యింది. కానీ రాకీ కి సిక్స్ ప్యాక్ తీసుకొని రావాలని రాము రాకీని జిమ్ కి తీసుకెళుతున్నాడు. రోజూ రాకీ చేత బరువులు మొయిస్తూ ఉన్నాడు, రాము కోరితే జిమ్ముకే కాదు, నరకానికైనా వస్తాడు రాకీ.
రాకీకి బైకు నేర్పించాడు, చదువు నేర్పించాడు, ఒక్కటా రెండా, ఎవ్వరూ గురించలేని విధంగా మార్చి చూపించాడు రాము.
జరుగుతున్న పరిణామాలు చూస్తూ, ఈ పోటీ ప్రపంచంలో పడి పరిగెడుతూ ఉన్న వాళ్ళు, ఒక్కసారి ఇంట్లో ఉన్న మీ ముసలి తల్లిదండ్రులను కూడా చూసుకోండి, మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము, కన్నతల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం కొడుకులుగా మన బాధ్యత అని గుర్తించాలి, ఇలాంటి కొడుకు కోడలిగా మీరు ఉండకూడదని నా ప్రార్ధన. అందరికీ రాములాంటి మనవడు దొరకడు కనుక పిల్లలే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి అని, చూసుకుంటారు అని ఆశిస్తున్నాను.
ఇది నా స్వీయ రచన.. అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.
అమ్మా!
ఏమిటి బాబు.
నేను చిన్నప్పటినుండి చూస్తున్నాను. నాన్న మా కోసం ఎంతో కష్టపడు తున్నారు. ఒక పనికి పోతే ఆ పనికి వచ్చే డబ్బులు సరిపోయే పరిస్థితి లేకపోతే ఇంకో పని చేసి ఏరాత్రికో వస్తుంటారు అన్నాడు 20 ఏళ్ల అబ్దుల్ రహీం తన తల్లితో ఎంతో బాధపడుతూ.
అవును బాబు, అప్పో సప్పోచేసి మనందరినీ సాకుతూ ఈ ఇల్లుకూడా కట్టారు. అంటూ ఎంతో సంతృప్తితో సమాధానమిచ్చింది తల్లి సారాబి.
అవును ఇల్లు కట్టడం. మా ముగ్గురికి చదువులు చెప్పిస్తూ ఉన్నారు ఇదంతా ఎలా సాధ్యమైందమ్మ అంటూ ఆశ్చర్యంగా అడుగాడు అబ్దుల్ రహీం.
ఇదంతా సేవా బ్యాంకు వల్ల సాధ్యమైంది నాన్న, లేకపోతే ఈ ఇల్లు కట్టే వాళ్ళమో కాదో! అంటూ సేవా బ్యాంకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ చెప్పింది తల్లి సారాబి.
అవునమ్మా సేవా బ్యాంకు వారికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించినా తక్కువేనమ్మ. వడ్డీ లేకుండా వారు మనకు అప్పు ఇవ్వడం, సమయానుకూలంగా నాన్నగారు కష్టపడి ప్రతి వారం వారం సేవా బ్యాంకు అప్పు తీర్చడం నిజంగా గ్రేట్ అమ్మ. అన్నాడు తన తండ్రి పై గర్వపడుతూ అబ్దుల్ రహీం.
ఇంకా తన మాటను కొనసాగిస్తూ రమేష్ అంకుల్ గారికి కూడా సేవా బ్యాంకులబ్యాంకులో చేర్పించి తను జమానత్ గా ఉండి డబ్బులు ఇప్పించడం వల్ల రమేష్ అంకుల్ గారు కూడా ఇల్లు కట్టుకున్నారు కదమ్మా ! నాన్న కులమతాలు చూడకుండా సహాయం చేయడం సేవా బ్యాంకు వారు కూడా కులమతాలు పట్టించుకోకుండా బీదవారికి సహాయం చేస్తూ వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ సేవా చేస్తున్న బ్యాంకు వారికి నేను కూడా నా తరఫునుండి కృతజ్ఞతలు తెలుపుతున్నమ్మా అన్నాడు సంతృప్తి చెందిన మనసుతో అబ్దుల్ రహీం.
నిజమే నాన్న, మీ ముగ్గురి చదువులకు కూడా ఆయన డబ్బులు సంపాదిస్తూ సమకూరుస్తున్నారు. ఎంతో కష్టపడతారు. ఎంతో నిజాయితీతో, ధర్మసమ్మతంగా సంపాదిస్తారు. సత్యం మాట్లాడుతారు. న్యాయంగా మసులుకుంటారు. ఈ మంచి గుణాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని అంది తల్లి సారాబి నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి తన భర్త క్షేమంగా ఉండాలని అల్లాహ్ ను ప్రార్థిస్తూ.
ఒకరోజు అందరూ కలిసి బంధువుల ఇంటికి దావత్ కోసం వెళ్లారు. రాత్రి అక్కడే ఉండిపోవలసి వచ్చింది.
ఉదయం 10 కావస్తుండగా పొరుగువారు ఫోన్ చేసి మీ ఇల్లు బుల్డోజర్ తో కూల్చి వేస్తున్నారు అని ఎంతో బాధతో చెప్పారు.
ఆ వార్త వినగానే నాన్నకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోయి అనంత లోకాలకు వెళ్లిపోయారు. మేము మా బంధువులంతా శోక సముద్రంలో మునిగిపోయాము. అటు ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది.
భూమి కొన్న కాగితాలు ఉన్నాయి. ఇల్లు కట్టిన ఖర్చుల వివరాలు రాసిపెట్టి ఉన్నాయి. అయినా కూల్చివేశారు.
సారాబి తన భర్తను తలుచుకుంటూ పిల్లల భవిష్యత్తు ను గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరవుతోంది.
ఇటు అబ్దుల్ రహీం తన చదువు గురించి, తన చెల్లెళ్ళ చదువు గురించి, ఇల్లు గురించి ఎంతో బాధపడుతూ, నిరాశ నిస్సృహలకు లోనయి ఇవి మా తెల్లారి నా బతుకులు అనుకుంటూ చదువు మానేసి సంపాదనకై బయలుదేరాడు అబ్దుల్ రహీం.