నిశిరాత్రి మినుకు మినుకు మనే తారల నడుమ నిండు చందమామ
తన పున్నమి వెన్నెలతో పుడమిని ముద్దాడుతుండగా
ఆ దృశ్యాన్ని గాంచిన నా మనసుకి
ఎందుకో ఆవేళ ఆరుబయట మల్లెపందిరి చెంత
పవళించాలనే కలిగె కోరిక
కొబ్బరిచెట్టు తన కొమ్మలతో వింజమారాలు విసరగా
కొబ్బరాకుల చాటునుండి ఆ నెలరేడు దోబూచులాడుచుండగా
పిల్లగాలికి మల్లెతీగలు నాట్యమాడుతుంటే
మల్లెల సౌరభాలు సుందరలోకంలో విహరింపజేయగా
ఏ నడిరేయికో నిదుర పట్టిన నాకు
దిశానిర్దేశం లేకుండా తెగిన గాలిపటంలా తిరుగుతున్న నాకు
ఉదయభానుడి లేలేత నులివెచ్చని కిరణాలు
నా మోముపై పడగానే చప్పున మెలకువ వచ్చిన నాకు
రంగులు మారుతూ పరుగులెత్తుతున్న రవి
జీవనగమనంలో కర్తవ్యోన్ముఖుడవు కమ్మని
గీతోపదేశం చేస్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం..
కవితలు
ఆక్రోశం లు అన్ని ఇక్కడ పడేసి పోతున్నాడు
కులం మతం కసినంతా గంపలు గంపలు గా
సోషల్ మీడియా ను డంపింగ్ యార్డు చేశాడు
ఆలోచన లేని ఒక పోస్టు ను విసిరి
అగ్గి మంటలు రగిలిస్థాడు ఒకడు
విద్వేషం వైరల్ అయి సమాజం లో విస్ఫోటనం
గ్రామర్ లేని గ్లామర్ తారల ప్రదర్శనలు
పసి హృదయాల్లో కల్మషo పెంచి కలవరింతలు
సంపద తప్ప సంస్కృతి పట్టని సెలబ్రేటి…. ప్రదర్శన
గుండె ను చీల్చు పదాలు విసిరి
అక్కసు అంతా ఫేస్ బుక్ లో అంటిస్థారు
భాష బాధగా విన్నవిoచు కుoటుంది మర్యాద పాటించాలని
వాదాలు ఒక్కొక్కటి అంటు కట్టుతారు
మతo మత్తు కొంచెo కొంచెముగా ఎక్కిస్థారు
వాట్సప్ చేసి హృదయాలను తమ వైపు మళ్లించి
ఒక వర్గం ఇంకో వర్గపు తప్పుల ఎత్తి పోత లు
తమ వారు మాత్రమే పుత్తడి అని తెగ ఫోజ్ లు
జనం మాత్రం అందరి చేతిలో బ్యాలెట్ బాధితులు
నింగి దాకా విద్వేషం నిండ కుండా ఇక
పోస్టు చేసే ముందు పది సార్లు ఆలోచించాలి
మంచి ని అందరికీ పంచె విషయాలు వెల్లి విరియాలి
Learning
‘he’ is only ‘he’
Not either He
Better in comparison
Or HE, the best in all.
he is really He
As he is improved
But now and then
Fails to go on as He.
he himself loses
his stature,despite,
No situation demands.
he is ever graced with
his stature isn’t affected.
his inner sense makes
him feel ashamed of
himself immediately.
Even does him to repent
But he at once learns that
‘he’ is never pardoned.
his learning may retain
him that he is truly He
Who has to become HE.
××××××××××××××××××××××
౼R.M.Prabhulinga Shastry
Dated:-26-06-2023
At:-6:34 am.
మట్టికుండల సల్లవడ్డ మంచినీళ్ళ లెక్క …
ఎంత సల్లగుంటదో నా మావ సూపు…
ఎండకాలంల సాయంత్రంపూట పూసిన…
పందిరికింద మల్లెపూల లెక్క ఎంత తెల్లగుంటదో నా మావ మనసు…
పొద్దు పొద్దుగాల్నె ఊరిచెర్ల నిండుగబూసిన…
తామరపూలోలె కళ్ళల్ల నిండిపోతడు నా మావ…
మిట్టమధ్యానం పల్లె పొలిమేర్ల పంటచేలమీంచి ఇసిరే…
సల్లగాలి లెక్క ఎంతహాయిగుంటయో నా మావ ముచ్చట్లు…
రాతిరేల పున్నమి నాటి సెందురునోలే…
ఎన్నెల కురుపిస్తాంటయ్ సక్కని నా మావ నవ్వులు…
ఎన్నెట్ల పూసిన సుక్కలన్నీ ఏరుకొచ్చి…
పున్నమి సీరకు అతుకవెట్టినట్టుంటది నా మావ అందం…
నీ మావ ఎట్లుంటడని అడిగితే కళ్ళల్ల నిండి…
ఒల్లంత పొగరై నేనేసే ప్రతి అడుగు సూపుతది
ఇగో నా మావ ఇట్లుంటడని…
నీళ్ళల్లో అలజడి కలిగి
జలం జ్వలించి జ్వాల పుట్టదా
తొక్కిన కొధ్ధీ మట్టి
గట్టిపడి రాయిలా మారదా!
నాటిన విత్తనం నేలను చీల్చుకొని
గెలుపును సూచించదా
ఒత్తిడిలో కుక్కర్
ఈల పాట పాడదా!
గాయమైన గుండె
హాయిగొలిపే గేయాలు రాయదా
కాలికి కట్టిన గజ్జె
గుండెల్లో శబ్ధం చేయదా!
బాధలు రోదనల నీడలు కారాదు
అవి జీవితానికి దారిచూపే బోధనలు
భయం పిల్లిని చేస్తుంది
ధైర్యం పులిని ఎదిరిస్తుంది!
అడుగులు ముందుకు వేస్తే
దూరం దగ్గరయి పలుకరిస్తుంది
విజయం బాట వేసి పిలుస్తుంది
ఆనందం ఆలింగనం చేసుకుంటుంది!
ఎందరో పుడుతున్నరు
కాలంలో కలిసిపోతున్నరు
కొందరు మాత్రం
చెరిగిపోనంత ప్రభావంతో
చెరపలేనంత ప్రజ్ఞానంతో
కాలం పై తమ ముద్రని
మిగిల్చి పోతరు….
తామే ఓ చరిత్ర అయి
చరిత్రలో నిల్చిపోతరు
కొందరికి పుట్టుకే పండగ
కొందరికి చావే పండగ
రెండింటి మధ్యలోని
సార్థక జీవనమే నిన్నైనా
నన్నైనా చరిత్రలో నిలబెట్టేది
రాముడు దేవుడయ్యాడు
ధర్మ జీవనం వల్లనే
రాణా ప్రతాప్ వీరుడయ్యాడు
కర్మ జీవనం వల్లనే
ఓ శివాజీ… ఓ భగత్ సింగ్
ఒక్కొక్కరిది ఓ త్యాగమయం
ఒక్కొక్కరిది ఒక్కో జీవనముద్ర
చరిత్రలో నిలిచిపోయారు
వారి వారసత్వమే మనదీ
వారి ఆత్మతత్వమే మనదీ
ఆ అమరుల ఆత్మలన్ని
140 కోట్ల నా దేశవాసుల్ని
ఆవహించుగాక..
ఏం చేసాననీ..
ఏం చేయగలననీ…
ఏం చేస్తూ
వచ్చాననీ…..
ఇన్ని సంవత్సరాలుగా
ఎన్నో అద్భుత
సూర్యోదయాలను
భూస్థాపితం చేసాను….
ఎన్ని సాయంకాలాలు
రాలిపోతున్న సంధ్య
పొద్దుల్లో గడిపాను…
ఎన్నో చీకట్లను
వెలుగనుకొని
భ్రమ పడ్డాను…
ఎన్నో దారుల్లో దారి తప్పి
గమ్యం వెతుక్కునే
పనిలో తిరిగాను…
ఏం అడిగానని ..
ఎవరిని వంచించానని..
ఇంకెవరినీ మోసం
చేసాననీ….
ఏదో ఒక బాధ నుంచి
పదం పుట్టి ఆ పదం
వాక్యమై వియోగ
కవితలుగా
అవతరించాయి తప్ప…
వివరించినా అర్థం కాని
వారంతా పిచ్చివాడన్నారు..
లోకమంతా పిచ్చిని నా ఇంటి
పేరు చేసింది!
ఏం కావాలనీ ….
ఏం కోరాననీ…
చచ్చిపోతే…
మెడలో వేయడానికి
ఆరు మూరల పూల దండ…
చచ్చిపోతే…
మీద కప్పడానికి…
కొన్ని పుస్తకాలు…
నేను రాసుకున్న
కొన్ని పిచ్చి కవితల
కాగితాలు…
చచ్చిపోతే…
పూడ్చడానికి
ఆరు అడుగుల నేల తప్ప…
మాటలో మతలబులెన్నో!
మర్మాలు ఇంకెన్నో కదా!
మాట మలయ మారుతంలా హాయినిస్తుంది
చందన లేపనంలా చల్లనైనది
ఆత్మబంధువు పలకరింపులా సాంత్వనమిస్తుంది
మాట చిన్నదే !మది గాయం పెద్దది చేస్తుంది
అదే మాట గాయాన్ని మాన్పే దివ్య ఔషధమౌతుంది
అలజడితో నిశ్శబ్ద తరంగమౌతుంది
మదిని కాల్చే అగ్ని కణమౌతుంది
కసిరేపి పాతాళానికి తొక్కేస్తుంది
మారణ హోమానికి పరాకాష్ఠౌతుంది
ఒక్క మాట జీవితాన్నే మార్చేస్తుంది
మార్పుకు మూల హేతువౌతుంది
మనసు పదిల పరిచే ప్రయత్నమౌతుంది
మానవత్వానికి మరో రూపమౌతుంది
ప్రేరణతో విశ్వవిజేతను చేస్తుంది
పెదవి దాటితే మరలి రాదు
మదిని కాల్చితే మరపురాదు
–గీతాంజలి కవిత.(13.1.2023)
ఇప్పుడా నువ్వు వచ్చేది ??నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక?
నాకు తెలుసు ఇక ఇప్పుడు నువ్వు వస్తావని…
నా వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ ఇప్పుడైనా వస్తానంటావా? సరే.. రా..
నేను లేని ఖాళీ ఇంటి ముందు నిలబడి…
ఒకప్పుడు నీ కోసం ఎదురుచూసిన ఈ శూన్యపు ఇంటిని గాజు కళ్ళతో చూస్కో..
నా ఇంటి నిశ్శబ్దంలో ..నేను నీకు చెప్పాలనుకున్నవి వినిపిస్తే.. ఇప్పటికైనా విను..
కన్నీళ్లేమైనా రాలితే… రాలనివ్వు !
విషాదపు చీకటి నిండిన గదుల్లో వెలుతురు మిణుగురులు ఏమైనా మెరిస్తే పట్టుకో కొన్ని.
ఇక వెళ్లిపో..అక్కడ నేను లేను
నీకు ఇక దొరకను…!
నేనున్నప్పుడు ఇన్నాళ్లూ రాకుండా ఉన్న నువ్వు..
ఖాళీ ఇంటి ముందు కూడా ఉండకుండా వెళ్లిపో..
రాకింక !
మనిషిగా మారానంటావా..
నేను వెలిగించాల్సిన దీపం ఇంకా చీకటిని తాగుతూ ఉందంటావా.. ఉండనివ్వు !
నేను రాకపోతేనేం .. లేకపోతేనేం.. ? దీపం దానంతట అదే వెలుగుతుంది.
వెళ్లు….!
నన్నిక రమ్మనకు !
నువ్వూ రాకు !
నువ్వు లేని ఇల్లేమీ చిన్నబోదు.
నన్ను బాధపెట్టిన నిన్ను ఇల్లేనాడు ప్రేమించలేదు..క్షమించలేదు కూడా !
నువ్వు నాతో లేనప్పుడు ఇల్లే మనిషిగా మారి నాతో కబుర్లు చెప్పేది..వెచ్చగా కౌగలించుకుని ఓదార్చేది !
నేను లేక పోతేనే.. ఇల్లు ఏడుస్తుంది.
దానికదే కథలు చెప్పుకుంటుంది.
గది గదినీ పలకరిస్తుంది.
తనలో తాను ఆరాటంగా తిరుగుతూ నా గాయాల్ని తడుముతుంది.
ఏకాంతపు రాత్రుళ్లల్లో నేను మైమరచి విన్న గులాం అలీ గజల్స్ నీ…నా రఫీ పాటల్ని..నూర్జహాన్ గమకాల్ని తానూ యాద్ చేసుకుంటూ ఇల్లు కన్నీరు పెడుతుంది…
నన్ను తలచుకుంటూ… విరహ వేదనలో కాలిపోతుంటుంది.
నా పాదాల స్పర్శ కోసం నేలను ముధ్ధాడుతూ ఉంటుంది.
నన్ను అక్కడ లేకుండా చేసిన నీపై ఆగ్రహంతో రగిలిపోతుంటుంది.
నా కన్నీళ్ళతో మరకలైన దిండు గలీబుని ప్రేమగా నిమురుతుంది.
నేను రాసిన కథలు.,కవితలూ నువ్వు వినలేదేమో కానీ… ఇల్లు విన్నది.
నేను వెళ్లాక ఇల్లు గడపమీద కూర్చుని తీరిగ్గా నా కవితల పుస్తకాన్ని తిరగేస్తూ కన్నీళ్లు కారుస్తుంది.
కిటికీలతో..గదులతో.,తలుపులతో., పరువులతో..పరదాలతో.,
వంటింటి గిన్నెలతో ..ఆరిపోయిన పొయ్యితో..అలమరలోని పుస్తకాలతో.. టేబుల్ పైని నా కాగితాలతో ..కలంతో..నా చాయ్ కప్పుతో..
హేంగర్లకు వేలాడుతూ గాలికి కదిలే నా చీరలతో..నన్ను నేను చూసుకున్న నిలువెత్తు అధ్ధంతో..
అధ్ధం మీది నా కళ్ళ కాటుక మరకలతో.. గోడమీది నా బొమ్మతో..
ఇంటిని అల్లుకున్న పూల తీగలతో.. పెరటిలోని గువ్వలతో .,ఇంటి డాబాతో.,
డాబా పైని వెన్నెలతో చుక్కలతో…వాకిట్లోని ముగ్గుతో…ముగ్గుపై వాలిన ఎండతో… రాత్రి రాలిన పున్నాగ పూలతో .. కథలు చెబుతుంది ఇల్లు.
ఎవరివి అనుకున్నావు…
నీ–నా కథలే..!
అర్థాంతరంగా ఆగిపోయిన మన కథలు!
ఏమనుకున్నావు మరి…ఇల్లొక స్టోరీ టెల్లర్ !
దిగులు పడకు.. నువ్వు లేకపోతే ఇల్లేమీ చిన్నబోదు.. ఇల్లు కథలే కాదు పాటలు కూడా పాడుతుంది…
పాడకుండా గొంతులో నిలిచిపోయిన పాటలే అందుకుంటుంది ఇల్లు.
నేను రాసిన కవితలనే పాడుతుంది….
అవును ఇల్లు పాడుతుంది
అందుకే ఇల్లు .. నువ్వు నాకు చేసిన గాయాల్ని పాడే గాయకురాలు !
ఇల్లొక సంగీతం !
ఇల్లు కథలు రాస్తుంది
ఇల్లొక పుస్తకం అవుతుంది.
ఇల్లొక కలం అవుతుంది.
ఇల్లొక రచయిత్రిగా మారిపోతుంది
అడిగి చూడు…ఇల్లు మాట్లాడుతుంది.
అచ్చం నా లాగా !
అవును నేను ఇల్లుగా మారాక
ఇల్లు నేనుగా పరివర్తన చెందాక..
ఇల్లూ.. నేనూ ఒకటే అయ్యాక..
నేనా ఇల్లు విడిచి పెట్టిపోయినా
ఇల్లు.. నేనుగా నిలబడి ..నిట్ట నిలువు చూపుల కన్నులతో…నీతో మాట్లాడుతుంది.
నిన్ను నాలాగే ప్రశ్నిస్తుంది
హెచ్చరిస్తుంది.
నిన్ను లోపలికి రానిస్తుందనుకుంటున్నావా…
ఈ ఇల్లు నీ ఉనికికి మాత్రమే కాదు నా దుఃఖానికే చిరునామా !
నేను లేని ఇంట్లో ఉంటే ఉండు..పోతే పో !
ఇల్లు అలానే అక్కడే ఉంటుంది…
ఎందుకంటే ఇల్లు
నన్ను పువ్వు నుంచి కత్తిగా మార్చిన కార్ఖానా !
ఇల్లొక చరిత్ర !!
ఇల్లొక స్టోరీ టెల్లర్ !!
విరామమెరుగక వీస్తున్నది
విద్యుత్ వీవన
ఊష్మకంలో వెట్టిచాకిరిచేస్తూ
వీవనలెన్ని వీచినా
తరగని వేసవితాపం
తనువంతా స్వేదం
నిదాఘమ నిద్ర కోసం
కృత్రిమకృత్యాలెన్నయినా
ఆ సూరీడి ఎదుట
వెలవెలబోయే దివిటేలేగా
మదిలోన ఎదలోన
భానుడి భగభగల ఊష్ణసంవహనం
రహదారులన్నీ
నిర్మానుష్య నిస్సవ్వడి క్షేత్రాలు
సవ్వడి పెరిగి
శీతలత్వాన్ని స్పృశిస్తూ ప్రశ్నిస్తూ
చినబోయిన శీతల యంత్రాలు
పర్యావరణ మిత్రకు
పరిపరి ప్రశ్నలు
పెను సవాళ్లు
పెచ్చుమీరుతున్న
సంబంధ బాంధవ్యాల నిష్పత్తుల క్షీణత
జలచక్రంలో
తరిగిన తరువులు
కొండలు గుట్టలు చెరువుల
అదృశ్యదృశ్యం
నీరింకని సిమెంటు రోడ్లు
అడుగడుగున
వర్షాగమనంలో
మట్టి వాసనలకు దూరమైన బతుకులు
నీరింకని చెమ్మలేని చేతల చైతన్యం
నవనాగరికత పేరున
పన్నీరు తన్నీరు
కాలుష్యపు కాసారంలో
కన్నీరై కడగండ్లు
వాతావరణంలో నీటితేమ లేని
పొడిబారిన తడిలేని వడగాడ్పులు
ఉష్ణోగ్రతల ఉక్కిరి బిక్కిరిలో
జీవజాలం
శీతల పవనపుంజాల వేటలో
అతలాకుతలం!
బొగ్గుబావుల్లో
వేసవి నిప్పుల కొలిమికి
స్నేహం స్వేదంతో
మలయసమీరాల వీవనలు
కర్బన ఉద్గారాలతో
కర్పరాలను దాటేస్తూ
వేడి చెలిమెల గ్రీష్మతాపం
బాష్పోత్సేకానికి
బహుదూరపు బాటసారిలా
విశృంఖలంగా వృక్ష హననం
ఎడారుల్లా మారుతున్న
కారడవులు కార్చిచ్చు
కదనోత్సాహాంతో!
శిక్షణలు క్రమశిక్షణలు
మరచిన మనిషి అవసరానికి
ప్రకృతి బలిపశువు
ప్రకృతి విశృంఖల విధ్వంసం
లయకారకం వినాశకరం
విరించి విరచితం
వాతావరణ సమతుల్యత
అసమగ్రం అసమంజసం
డబ్బుమైకంలో మద్యం మత్తులో
ఆడంబరాల ఆలంబనలో గ్రీష్మం
వీవనలెన్ని విరామమెరుగక ఊగినా
తగ్గని శరీర తాపం
మనిషి మనసు మారితేనే
ఆదర్శ వాతావరణం
ఆదర్శ సమాజం
లేదంటే నరక కూపంగా
నవసమాజం ప్రగతిని ప్రశ్నిస్తూ!