మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

కథాపంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M February 28, 2022
written by Dr. Lakshmanacharyulu M

పూజ

పోద్దార్ కుటుంబం ఇద్దరు సోదరులతో విడిపోయింది. మృణాల్ అన్న, సత్యజీతం తమ్ముడు వీరి మధ్య పంపకాలకు, భాగాలకు లోను కాని వాడు వారి కుటుంబాలకు గత 40 సంవత్సరాలుగా సేవచేస్తున్న నౌకరు ధర్మా ఒక్కడే.

ఈ సంవత్సరం రెండు కుటుంబాలవారు ఒకరికొకరు తీసిపోని విధంగా చేస్తున్నారు.

‘దేవీ పూజలు’.

‘అమ్మ అందరికన్నా మిన్న. ఆమెకి అన్న మృణాల్ గారింటిలోనే స్వాగతం చెప్పి పూజ చెయ్యాలి. మీరంతా వంగి ప్రణామాలు చేయండి’ – అని ప్రకటించాడు  పూజారిగారు. వాతావరణంలో ప్రశాంతత ఒక్కసారిగా నెలకొన్నది. ఇంతలో తమ్ముడు సత్యజీతం ఇంట్లోంచి కూడా అలాంటి ప్రకటనే వెలువడింది. అక్కడున్న వాళ్లంతా వంగి దణ్ణాలు పెట్టారు. ధర్మా ఆలోచనలో పడిపోయాడు. తను ఇప్పుడు ఏ దుర్గమ్మకు నమస్కరించాలి? అన్న దుర్గమ్మకా? తమ్ముడి దుర్గమ్మకా? తనకైతే ఇద్దరూ పుత్ర సమానులే….

“అమ్మా! నేనెక్కడ చెయ్యాలి పూజ? ఇక్కడా? అక్కడా?” అరిచాడు ధర్మ.

“ఈ అన్నదమ్ముల ఆస్తులైతే పంచుకున్నారుగాని నిన్నెలా పంచుకుంటారమ్మా? నేనలా చేయను చేయలేను. నేనిద్దరి ఇళ్ళ మధ్యనా నమస్కరిస్తా. నా దుర్గమ్మ ఇక్కడా, అక్కడా అన్నిచోట్లా ఉంది”

ధర్మ వంగి నమస్కరించి, తిరిగి మరి లేవనే లేదు.

ఋణం

డా. నాయక్ తన గదిలో ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో ముణిగి ఉన్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్న రోగి పరిస్థితి విషమగా ఉంది. తరువాత లేచి అటూ ఇటూ తిరగసాగారు. ఇంతలో ఫోన్ ట్రింగ్, ట్రింగ్ అనగానే ఆయన మొహంతో నవ్వు విరిసింది. “హమ్మయ్య” అనుకుని.

‘ఎవరైనా దొరికారా?’ అని అడిగాడు.

‘సారీ సర్? దొరకలేదు, తిరుగుతూనే ఉన్నాం’-

అంతే! డాక్టర్ మొహం మారిపోయింది. మళ్ళీ విషాదం అలముకుంది.

‘ఆశ’కు తగిన బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు.

ఎందుకు దొరకడం లేదో కూడా ఆయనకు తెలుసు.

డా. నాయక్ దేవుణ్ణి నమ్మడు. కాని ఇవాళ ఆయన దేవునికి నమస్కరించాడు తలవంచి.

“ఆశ” కోసమై ఆరాధిస్తున్నాడు. ఇంతలో ఫోన్ మ్రోగింది. వెంటనే అందుకున్నాడు.

“నేను, ఇన్స్ పెక్టర్ ఖన్నా. పేపర్లో మీ ప్రకటన చూసాను. నా దగ్గర ఉన్న ఖైదీల్లో ఒక ఖైదీ రక్తం గ్రూపు మీ “ఆశ’ పేషెంటుతో ‘మ్యాచ్’ అవుతుంది. అతను రక్తం ఇవ్వాలనుకుంటున్నాడు.

ఆఁ అలాగా! తప్పకుండా?

ఆ ఖైదీ పేరు?

“కిషన్”

డాక్టర్ నాయక్ గారి కళ్ళనుండి కన్నీళ్ళు జలజలా రాలాయి. వాటి మధ్యనుంచే ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు.

ఇంతకీ…

ఆ కిషన్ అనేవాడే ‘ఆశ’ తండ్రిని హత్యచేసి, దానికే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు.

అద్దాల ఇల్లు

శ్రీరాంసేవకంగారి మూడ్ ఇవ్వాళ అస్సలు బాగా లేదు. ఆయన భార్య హాస్పిటల్ లో ఉన్నది. గత ఐదు రోజులుగా ఆయన ఆందోళనగానే ఉన్నాడు. ఇవ్వాళ ఆరోగ్యం కొంచెం బాగానే ఉన్నా ఇవ్వాళే మరి రాంసేవక్ గారి మనసు చాలా క్రుంగిపోయి ఉంది.

ఆయన మనసు పాడైపోడానికి కారణం సుస్పష్టమే. ఈ హాస్పిటల్ ఆయన లాంటివారికి తగినది కాదు. ఆయన నాతో – “చూడండి, ఈ హాస్పిటల్ ఎలా ఉందో? శ్రద్ధగా గమనించండి. అసలు ఇది హాస్పిటలేనా? బాత్ రూంలు మురికిగా ఉన్నాయ్. ఎక్కడ చూసినా బ్యాండేజీలు, గుడ్డలు, మందుల ప్యాకెట్లు – చెత్త, చెదారం ఎంతైనా సిగ్గు పడాల్సిన విషయం ఇది.”

ఆయన మాటలో నిజం ఉందని నాకూ అనిపించి ఆయనతో ఏకీభవించసాగాను. మేమిద్దరం అప్పుడు హాస్పిటల్ వరండాలో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉండగా నాకు హఠాత్తుగా నిజంగానే అక్కడక్కడ చెత్త – చెదారం కనబడ్డాయి.

తర్వాత నేను రామసేవక్ గారిని గమనించసాగాను. ఆయన తన జేబులోంచి ఒక బీడి తీసి వెలిగించాడు. దాని బూడిద నేల మీద దులిపాడు. అంతకుముందే ఆయన నోట్లో తాంబూలం (పాన్) ఉంది. మధ్య మధ్య తుఫుక్కున నేలమీద ఉమ్ముతూనే గచ్చుని రంగు మయం చేస్తున్నారు. తర్వాత ఎంతో నిబ్బరంగా నా భుజంపై చెయ్యేసి – “ఈ హాస్పిటల్ లోని మురికి, చెత్తల గురించి నేను చెప్తున్నా కదూ! అసలు మనందరం కలిసి దీన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

భాషా జ్ఞానం

ఒక రోజున నేను సైకిల్ మీద ఇప్పటికి వస్తున్నా. దారిలో ఓ మూల ఓ పెద్ద గుంపు కనబడగా నేను కూడా ఆగిపోయి కుతూహలఁగా వాళ్ళ మాటలు వినసాగాను.

అక్కడ ఒకాయన జనం మధ్య నిలబడి ఏవో పళ్ళు అమ్ముతూ ఉన్నాడు. పళ్ళన్నీ చకచకా, చూసూ్త ఉండగానే పెద్ద సంఖ్యలో అమ్ముడుపోసాగాయి.

ఆ వ్యక్తి తన తియ్యని మాటల ధోరణిలో ఒక మరాఠి మహిళతో – నమస్తే అమ్మా! “ఇదేఫలం చాంగలే భేట్ తాత్ ఫారచ్ స్వస్త్” అని అన్నాడు.

అలాగే, ఒక సర్దార్జీతో – ‘సత్ శ్రీ అకాల్!  ఏ చంగే ఫల్ నే, సస్తేనే” అని అన్నాడు.

అంతలోనే అక్కడికొక సూట్ బూట్ లో వచ్చిన పెద్దమనిషితో – గుడ్ మార్నింగ్ సర్! నైస్ ఫ్రూట్స్ హియర్, వెరీ చీప్!”

ఇలా చాలాసేపు అమ్మకాలు కొనసాగాయి. గుంపు కొంత చెదిరిపోగా – ఆ మనిషి చూపు నాపైన పడింది. వెంటనే బెంగాలీలో – “నమొష్కార్ మోశాయ్! ఎ ఖానౌ భాలో ఫౌల్ ఆచే – భూబ్ హే శౌస్తా!”

నేను కొన్ని పళ్లు కొన్నా ఆ మనిషి భుజంపై చెయ్యివేసి – ‘ఎన్ని భాషలొచ్చు నీకు భయ్యా” అని అడిగా.

కన్నార్పకుండా ఆ వ్యక్తి – ‘మన దేశంలో మాట్లాడే భాషలన్నీ సుమారుగా నా కొచ్చు అని అనగా – నేనాశ్చర్యపోయి ‘అన్నీనా?’ అని అన్నా. ఆయన నవ్వి – సుమారుగా ప్రతిభాషలోనూ ‘నమస్కారం. ఇక్కడ అన్ని రకాల పళ్లూ చాలా చౌకగా దొరుకుతాయి” అనే మాటల్ని మాత్రం నేర్చుకున్నా”.

“దీనివల్ల ఏమిటి లాభం?” నేనడిగాను.

చందు అనే పేరున్న ఆయన – “బాబుగారూ! నేనిలా వాళ్ళ భాషలో చెప్తే వాళ్ళు ఆనందం పొందుతారు. ఇలా చెయ్యడంతో వాళ్ళ మనసులో నాకు ముందుగా చోటు దొరుకుతుంది. తర్వాత వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను నా పళ్ళు తూస్తూ ఉంటా” నన్నాడాయన.

సరిపోని సమయం

మంచం మీద పడి ఉన్న ఆ పెద్ద మనిషి పరిస్థితి పాపం! దయనీయంగానే, విషమంగానే ఉంది. బుగ్గలు పీక్కుపోయి ఉన్నాయి. పెద్ద బొజ్జ. ఆయనకి గుండెజబ్బు. అలాగే పోర్టల్ సిరహోసిసంతో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఇటువంటి దుస్థితిలో కూడా ఆయనకు ఫోనుమీద ఫోను అలా వస్తూనే ఉన్నది. అస్సలు తీరిక లేకుండా, ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి వ్యాపార సంబంధమైన వ్యవహారాలపై ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.

ఇంటికొచ్చిన డాక్టర్ – “మీకింత తీరిక లేకుండా ఉంది కద! మరి ఈ జబ్బెలా వచ్చింది మీకు? నిజానికి ఇది ఎక్కువగా అతిగా త్రాగే వాళ్ళకే వస్తుంది”. ఏం చెప్పమంటారు? డాక్టర్! తీరిక లేనందువల్లే నేను తిండి తినలేను. ఏదో ఇలా మద్యపానం చేస్తూ కాలం గడుపుతా త్రాగడానికైతే నాకు తక్కువ టైం పడుతుంది సార్!” అన్నాడు.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి – 5

by Krishna Kumari Yagnambhatt February 28, 2022
written by Krishna Kumari Yagnambhatt

క్షేత్రయ్య సంగీత్ రచన నభూతో న భవిష్యతి. పద రచనకు సంబంధించినంత వరకు ఈతనికి ముందు సాహిత్యానికి ఉన్న స్థానం, విశిష్టత సంగీతానికి లేదు. ఒక్కొక్క రాగం, అది పలికే తీరు, ఆ స్వరాల కున్న శక్తి, ఆ స్వర సమూహంవల్ల కలిగే మధురిమ, ఆ స్వరచిత్రం వల్ల ఏర్పడే ఆనందం, మన కళ్లముందు తిరుగాడే ఛాయా చిత్రం లాగా ఒక సమగ్ర స్వరూపమును అందిస్తుంది క్షేత్రయ్య సంగీతపు బాణి.

ఏ రాగం ఉపయోగంచడం వలన ఒక రచన మనోజ్ఞంగా భాసిస్తుందో, ఏ రాగం ఉపయోగంచడం వలన ఆ రచన మరింతగా భావభరితం అవుతుందో బహుశః క్షేత్రయ్యకు తెలిసినట్లు ఇంకొక పద కవికి తెలియదు అన్నది అతిశయోక్తి కాదు. రస నిర్వహణకు కావలసిన అంగ నిరూపణలో సున్నితమైన, సుకుమారమైన భేదాలను కల్పించడమే గాక వాటిని చిత్రించడానికి కావలసిన భాష, సంగీత రచన ఇతనికి కరతలామలకం. ఏ స్వర సంగతుల వలన రాగంలో భావోద్రేకం కలగడానికి వీలు అవుతుందో తెలిసిన ప్రౌఢ కవి కాబట్టే దానికి తగిన సాహిత్యం కూడా అప్రయత్నంగా రాగ భావంలోని ఆవేశంతోపాటు కలిసి సుకుమారమైన తీగలుగా సాగి సువాసన భరిత పుష్పాలను రసికులకు అందించింది.

ఆయా రసభావాల తీవ్రత లోని వ్యత్యాసాలు, అక్కడ ఉపయోగించిన రాగ వైవిధ్య ప్రయోగ జ్ఞానం కల ఈతని పాండిత్యం శ్లాఘనీయం. ప్రత్యేకించి విషాద భరిత సమయంలో ఉపయోగించిన పున్నా గవరాళి, కాంభోజి, నాద నామక్రియ, ముఖారి, నవరోజు వంటి రాగాలలోని అతి సూక్ష్మ ప్రయోగాలు, విన్నప్పుడు ఆర్ద్రతతో కూడిన గుండె చిత్తడి కావడంతోపాటు కంట తడి కాకమానదు. సంగీతం ముఖ్యంగా మనసుమీద చాలా ప్రభావం చూపుతుంది. అది మనలో ఎందరికో అనుభవమే కదా! ముఖ్యంగా హుస్సేన్, కాంభోజి, తోడి వంటి రాగాలలో క్షేత్రయ్య చూపిన వైవిధ్యం ఇంతవరకు ఇంకొక వాగ్గేయకారుడు చూపలేదు అనడం సాహసం కాదు.

హిందుస్థానీ సంగీతంలో ఒక ప్ర్రకియయైన టుమ్రీలలో రాగభావం పలికించడానికి ప్రత్యేక సాధన చేస్తారు. రాగంలోని జీవస్వరం, రాగఛాయ గొంతులో స్పష్టంగా, శ్రావ్యంగా పలకడానికి కృషి చేస్తారు. క్షేత్రయ్య పదాల్లోని సంగీత విశేషాలు గమనిస్తే ఇతనికి హిందుస్థానీ సంగీతంతో పరిచయం ఉందేమో అని సందేహం కల్గుతుంది. ఎందుకంటే పల్లవి నుంచి అనుపల్లవికి, అనుపల్లవి నుంచి చరణానికి, రెండు చరణాల మధ్యన, తిరిగి చరణం నుంచి పల్లవికి సాగిన రాగప్రస్తారం క్రమంగా విస్తరించి కోరక దశ నుంచి వికసించిన పుష్పం లాగా చిత్తరంజకత కల్గిస్తుంది. అందుకే తరువాతి కాలంలోని సంగీతజ్ఞులు ఈతని రాగ సంచారం గమనించి ఆశ్చర్యపోయారు. ఈతని పదాలు రాగ సంచారానికి నిఘంటువు వంటివి అని ప్రశంసించారు.

సంగీత జ్ఞానంతోపాటు తాళ జ్ఞానం ఇతనికి అపారం. అభినయంలో కూడా అందెవేసిన చేయి కాబట్టి ఈతని పదాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా మిశ్రచాపు తాళపు నైపుణ్యం ఇతని పదాలలో విరివిగా కన్పిస్తుంది. అభినయానికి ఈ తాళం చాలా అనుకూలమైంది. మూడు, నాలుగు అక్షరాల కలయిక అయిన ఈ ఏడక్షరాల మిశ్రచాపు

తాళంలోని గతినిగాని, విన్యాసాన్నిగాని, అతి రమ్యంగా ప్రదర్శించాడు. అతి సూక్ష్మ భావాలు కూడా  ఈ తాళం ద్వారా అద్భుతంగా ప్రకటించబడ్డాయి. అభినయానికి మరొక్క విలక్షణతను ఆపాదించాయి. రాగాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి మహత్తర శక్తి ఉంటాయి అనడానికి క్షేత్రయ్య పదాలే సరైన ఉదాహరణలు.

ఈతని పదాలు అతి విలంబ గతిలో ఉండడంవలన కొంత క్లిష్టత ఉండడం సహజం. గాత్రంలో విపరీతమైన నియంత్రణ ఉంటే తప్ప ఈతని పదాలు గానం చేయలేరు. అందుకే ఈతని ధోరణిని తర్వాతి పద కవులకు దాదాపుగా అసాధ్యమైపోయింది. అంతేకాదు, క్షేత్రయ్య పదాలు ఆడిపాడడానికిగాని, చూడడానికి కూడా ఎంతో రసజ్ఞత కావాలి. అది లోపించడంతోపాటు అన్నిటా వేగం పెరిగిన నేటి కాలంలో విలంబ గతిలో సాగే క్షేత్రయ్య పదాలకు ఆదరం తగ్గింది అనుకోవాలి. కాబట్టే ఈతనిని ఏ కవి అనుకరించలేదు. అందుకే నేడు ఈతని పదాలు గానంలోగాని, అభినయంలోగాని కొంత కనుమరుగయ్యాయి.

కేవలం పదకవిగా అపార వైదుష్యం కలవాడిగా మాత్రమే కాక ఇతను కృష్ణభక్తుడు. అందుకే ఈతని పదాలన్నీ మువ్వగోపాల ముద్రతో కన్పిస్తాయి. తాను రచించిన పదాలు పాడుకోవడానికి, అభినయించడానికి అన్న భావన క్షేత్రయ్యలో స్పష్టంగా కన్పిస్తుంది.

ఉదాహరణకు

‘‘బాళితో మువ్వగోపాలునిపై వేడ్క పదమైన పాడుకొంటిమా;

పదము పాడగా వినెవో;,

చిటికెన కొనగోరు చిమ్ముకొంచు పలుమారు చిటిపొటి పదములు చేరి పాడుచు;’’

ఇట్లా ఎన్నోసార్లు అంటాడు.

ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు ఉద్వేగప్రధానాలు, ఈ పదాలు పాడాలన్నా, అభినయించాలన్నా జోడు గుర్రాల స్వారీ వంటిది. అన్నమయ్య పదాలలో భక్తి ప్రధానంకాగా, ఈతను తన పదాలలో భక్తితోపాటు రక్తిని కూడా రంగరించాడు.

చివరగా అతని మాటలలోనే అతని అభిప్రాయం విందాం.

వెన్నెల బైట సంగీతము విననట్టి వేడుకేటి వేడుకే?

చిన్నెలు మెరయించి చిరునవ్వు నవ్వని చిత్తమేటి చిత్తమె?

సన్ను తాంగిరో! కనుసైగ సేయని యట్టి పదములేటి పదములే?

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణ కలనం -6

by mayuukha February 28, 2022
written by mayuukha

******
ఆధారములు
”””””””””””””””””
అడ్డం
¤¤¤¤
01. పూజలో దేవుడికి ఉపాహారం (7)
05. నోరుమండే కోడికూత (3)
07. పాదాలు వదలి పైన దూకిన నది. (2)
08. చేతి నాలుగువ్రేళ్ళ వెడల్పు కొలత (2)
09. కిలకిల పకపక (2)
11. శివవాద్యం (4)
14. పొలంలోనికి నీటిని చేర్చే నడవ (3)
15. యాగం, షడంగములలో ఒకటి (3)
17. ఆహ్వానం (3)
18. దైత్యులు (5)
21. వేదిక యుద్ధభూమి రంగూన్ (2)
23. మాకు చెందినవి (2)
25. పాడేది (2)
26. తాపసులు చేసేది (2)
28. పుట్టుక సాధ్యం (3)
30. నాయుడుబావ మరదలు (2)
31. పాలకడలి కుండలో మందరగిరి (2)
32. ఒక శూన్యంలేని నమస్కారం మోము (3)
33. ప్రవృత్తిలో బతుకుతెరువు (2)
34. ముక్కుపొడి (2)
36. మట్టి త్రవ్వే పనిముట్టు (3)
38. స్త్రీ (2)
39. నరుని శంఖం (4)
40. హద్దు (2)
42. వేదాంగాలలో ఒకటి చెప్పబడనిది (3)
43. చదువుతోపాటుగా కావలసినది (3)

నిలువు
¤¤¤¤
01. గీతాచార్యుడు ‘అది నేనే’ అన్న నెల (7)
02. రెండు పావులు (2)
03. విరగడలో గొడవ (3)
04. అలసి బాధపడు (3)
05. నవదంపతులు ప్రారంభించేది (5)
06. వాకిట రంగులతో వేసే తీగ (4)
10. సంధ్యాకాలం (2)
12. ప్రతి మనిషిలో వేగంగా పయనించేది (3)
13. వణకుట (4)
16. వృషభవాహనం (2)
19. కాకర రుచి (2)
20. పిట్టలదొర హస్తభూషణం (3)
22. గాంధారి కళ్ళకు కట్టకున్న వాటిలో సగం (2)
24. అరవైలో రెండో ఏడు (3)
27. శివుని తలపించే హర్యక్షం (3)
29. లక్షలో పదోవంతు (5)
31. చేతితోక ఆయుధం (2)
33. చీకటి కొండ (2)
34. నమస్కారం (2)
35. మకరందం (3)
37. నిప్పును కప్పేది (3)
38. మజ్జిగ (3)
41. గిట్ట డెక్క (2)
**************

పద’కిరణ’ కలనం – 6

గడులు నింపుటకు కొన్ని సూచనలు.

1. సున్నను, ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
2. పొల్లు అక్షరాలు .. న్, క్ ..ల వంటివి అవసరమైతే ముందున్న అక్షరంతో కలిపి ఒకే గడిలో వ్రాయాలి.
3. మీరు గడులు నింపి సరిచూసుకున్న తరువాత..
ఆ సమాధానములను అడ్డం, నిలువు లకు వేరువేరుగా ఆయా సంఖ్యలతో పట్టిక గా వ్రాసి మన ‘మయూఖ’ పత్రికకు మెయిల్ చేయండి.
అన్నీ సరియైన సమాధానములు పంపిన వారందరూ విజేతలే.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మాతృభాష

by G.Shantha Reddy February 28, 2022
written by G.Shantha Reddy

ఆ.వె. మూడు లింగములను ముద్దుగా కలుపుతూ
ఉద్భవించె తెలుగు ఉజ్వలముగ
భాషలను గెలిచెడు భావంబు కలిగిన
ఉచితమైన భాష ఉర్విలోన!

ఆ.వె. కోరుచు తినిపించె గోరు ముద్దలుపెట్టి
అమ్మ నేర్పె జగతి కాంధ్ర భాష
వర్ణమాల తోడ వయ్యారములు చూపు
కన్నతల్లి లాంటి వెన్నభాష!

ఆ.వె. కవుల కలములందు కలకాలమును నిల్చు
నవరసమ్ములు పాడు నాందిభాష
మదిని దోచు తెలుగు మాధుర్య రసధుని
మానవీయ భాష మాతృభాష!

ఆ.వె. నన్నయార్య జయము ననువదించిన భాష
వెలుగులిచ్చినట్టి తెలుగు భాష
తిక్కనెర్రనలకు తీపి చూపిన భాష
కాకునూరి యప్ప గ్రంథభాష!

ఆ.వె. ఇంటి ఇంటిలోన నింగ్లీషు చదువాయె
అమ్మ నాన్న పిలుపు లాగమాయె
అచ్చతెనుగు పలుకు లాంతర్యమును మల్చు
ఇంపు లేని యాంగ్ల ఇచ్చ వీడు!

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

” రథసప్తమి – సూర్యారాధన”

by కావ్యసుధ (హరిశంకర్) February 28, 2022
written by కావ్యసుధ (హరిశంకర్)

రచన :”సాహితీ సేవారత్న అవార్డు గ్రహీత”
శ్రీ. ” కావ్యసుధ”

సూర్యుడు జగత్తుకు కన్ను సూర్యకాంతియే అన్నికాంతులకు మూలం. సూర్యుడు త్రిమూర్త్యాత్మక పరమాత్ముడు. సూర్యకిరణజన్యసంయోగం చేతనే జీవులు పుడుతున్నాయి. పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. సూర్యుడు ఈ విశ్వానికి ఆత్మ అని వేదం. కనుక సూర్యభగవానుని ఆరాధన అత్యంత ప్రాచీనమైంది. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశ సంజాతుడు. నిత్యమూ సూర్యారాధన చేసేవాడు. ఆదిత్యహృదయపఠనం చేతనే రావణసంహారం కూడా చేయగలిగాడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక, సూర్యుడు మనకు చేసే ఉపకారాలకు కృతజ్ఞతాసూచకంగా సూర్యనమస్కారం చేయడం – సనాతన భారతీయ సంప్రదాయం.

వేదాల్లోనే సూర్యదేవునికి సంబంధించిన అరుణమంత్రాలున్నాయి. మన మీనాడు చూస్తున్నసూర్యగోళం లాంటివి ఈ విశ్వంతరాళంలో మొత్తం పన్నెండున్నాయి. వాటినే ద్వాదశాదిత్యమండలా లంటారు. శ్రీమన్నా రాయణుడు సూర్యమండలమధ్యవర్తి, దివ్యతేజోవిరాజితుడు. సూర్యగమనం ఉత్తరాయణం – మకర సంక్రాంతితో ప్రారంభమైనా మాఘశుద్ధ సప్తమినుండి పూర్తిగా ఉత్తరదిశగా జరుగుతుంది. ఇది పుణ్యకాలం
ఉత్తర మనే పదానికి జీవులను ఊర్ధ్వముఖుల్ని చేసి, తరింపజేసే దని ఆధ్యాత్మికార్ధం. కనుక రథసప్తమ కంటిముందు కన్పించే ప్రత్యక్షదేవుడైన సూర్యభగవానుని పండుగ. సూర్యుడు జ్యోతిశ్శాస్త్రంరీత్యా నేత్రకారకుడు. అంటే కంటిచూపు, కంటి ఆరోగ్యం మొదలైన వన్నీ సూర్యాసుగ్రహించేశ చక్కగా శోభిస్తాయి. అంతేగాక “ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్ ” ఆరోగ్యం సూర్యభగవానునిద్వారా పొందా అని శాస్త్రం. కనుక సూర్యుడు మనజీవితశోభకు, మానసికపురోగతికి, అవయవపటిష్టతకు, పాడిపంటలకు, | బుద్ధి వికాసానికి అన్ని విధాలా అనుకూలించే ప్రత్యక్షదైవం!

ఇంత ఉపకారం మనకు సూర్యుడు చేసినప్పుడు మనం చేయగలిగింది కృతజ్ఞతాసూచకంగా “సూర్యదేవ నమస్తుభ్యం!” అంటూ నమస్కరించడమే! కనుకనే నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని నమస్కారవిధానం సూర్యగ్రహానికి మాత్రమే ఉండడం సూర్యునివిశిష్టతకు సంకేతం. సృష్టి జరిపేవాడు గనుకనే “సవిత ” అని పేరు. గాయత్రీమంత్రం సూర్యతేజస్సంబంధ మైనదే! ఆ సూర్యుణ్ణి శ్రేష్టతముడుగా తెలుసుకోవడం, మన బుద్ధిని చక్కగా నడిపించ మని అతణ్ణి ప్రార్ధించడం గాయత్రీమంత్రంలోని ఆశయం. కనుక ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మన సంప్రదాయం!
అయితే, అంతటి దివ్యతేజోరాశికి మనం చేయగలసేవ కృతజ్ఞతలు తెల్పడం తప్ప, మరొకటి ఏముంటుంది? ఇందుకే మనప్రాచీనులు రథసప్తమిని సూర్యభగవానుని పర్వదినంగా భావించి భౌతిక, ఆధ్యాత్మికపరంగా సూర్యుణ్ణి ఆరాధించి, త్రికరణశుద్ధిగా సూర్యునికి నమస్కరించి, ఆ నమస్కారంద్వారా సూర్యకిరణాలలోని దివ్యతేజస్సునూ, చైతన్యశక్తినీ మనం పొందాలి అనే సంప్రదాయాన్ని నెలకొల్పారు. కనుక సూర్యుడు కేవలగ్రహమే కాదు సాక్షాల్దేవుడు!

నమస్కారం వినయవిధేయతలకూ, కృతజ్ఞతాగుణానికి సూచకం. మనం త్రికాలాల్లో సూర్యుడికి ఒక్క నమస్కారం చేయడంవల్లే ఆయన దయామూర్తి అయి మనఆరోగ్యాన్నీ, ఐశ్వర్యాన్ని సంరక్షిస్తున్నాడు. అల్పసంతోషులైన దేవతలలో సూర్యుడు ప్రథముడు నమస్కారానికే ఇంత విలువ ఉంటే ఇక సూర్యమం పాసన, సూర్యస్తోత్రపారాయణం, అరుణమంత్రపారాయణం మొదలగునవి ఎంతశక్తిమంతాలో, మను జీవితాలపై ఎంత ఉత్తమప్రభావాన్ని రూపుతాయో ఊహించవచ్చు. మయూరుడు సూర్యాసుగ్రహంచేతనే రోగం నుండి ఆరోగ్యవంతుడై కృతజ్ఞతాసూచకంగా ఒక శతకం సూర్యునిపై రచించి, లోకాని కందించాడు. ఇలా ఎందరో మనపురాణాల్లో సూర్యుణ్ణి ఆరాధించి మణులు, అక్షయపాత్రలు, భోగభాగ్యాలు సంపాదించి, తాము తరించడమే గాక, లోకాన్ని కూడా తరింపజేశారు. కనుక ప్రతిమానవుడూ కృతజ్ఞతా గుణాన్ని అలవరచుకుని, తమకు ఉపకారం చేసిన, చేస్తున్న మహాత్ములందరికీ హృదయపూర్వకంగా ప్రతి దినమూ ఉదయం తూర్పుముఖంగా నిలబడి సూర్యుణ్ణి చూస్తూ నమస్కరిస్తే ఆ సమస్కారం అందరికీ చెందుతుంది.
విశ్వ నేత్రుడైన సూర్యుని గతి వల్లే రుతుకాల ధర్మాలు ఏర్పడి కాలం ముందుకు సాగిపోతోంది అందుకే ప్రకృతికి ఆధిదైవంగా భావించి సూర్యుని ఆరాధించు కుంటున్నాము. ఉదయభానుడి లేలేత కిరణాలు మన కనులారా వీక్షిస్తే చాలు మన శరీరంలో రసాయన ప్రక్రియ జరిగి రుగ్మతల్ని దూరమవుతాయని, దేహసంబంధితంగా చేసిన పాపాలు సైతం నాశనమైపోతాయని తెలుస్తోంది. సూర్యారాధన వల్ల ముక్తి పొందిన కథలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి.

సూర్యకాంతి ప్రాణుల్లో ప్రాణవాయువు గానూ భూమ్యాకాశాలకు దీప్తిని కలుగజేస్తుంది. ఏక చక్రం కలిగి ఏడు అశ్వాలు పూంచిన మకరధ్వజం అనే రథానికి తొడలు లేని అనూరుని రథసారధిగా పెట్టుకొని రాత్రి పగలు పయనిస్తూ జీవకోటిని కాపాడుతున్నాడు సూర్యుడు.
పుష్య మాసము లో సూర్యునికి “భగుడు ” అని పేరు ఈమాసములో ప్రాణుల శరీరంలో నుండి వారిని రక్షిస్తుంటాడు. మాఘ మాసములో “పూషుడు” అనే పేరుతో ప్రాణులు భుజించే ఆహారములో ఉండి వారికి పుష్టిని కలిగిస్తుంటాడు. పాల్గుణ మాసంలో “క్రతువు” పేరుతో గాలిలో ఉండి ప్రాణులకు అవసరమైన శ్వాసక్రియ కలిగిస్తూవుంటాడు.
సప్తాశ్వరధ మారూఢం
ప్రచండం కశ్యపాత్మజమ్! శ్వేతపద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహమ్!

శ్రీ సూర్యనారాయణుడు మనకందరికీ ప్రత్యక్షదైవం సూర్యుడు.ఏకచక్ర
రధారూడుడు.
ఈ చక్రమే కాలచక్రం,ఆ చక్రానికి ఆరు ఆకులు, రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు, ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము , హరికేశము, విశ్వకర్మ , విశ్వవ్యచ , సంపద్వసు , స్వర్వడ్వసు అనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.
“ఉదయమే బ్రహ్మణ్రూపం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరం ”
భగవానుడు ఉదయం బ్రహ్మ స్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి యొక్క దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలం విష్ణురూపంలో బాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరించజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడైన సూర్యభగవానుని ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్థాన్, పూషా, వర్ణస్య, అంశుమాన్, భగ, త్వష్ణా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి, సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఇట్టి ఈ పన్నెండు నామాలు స్మరిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని, దారిద్ర్యం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
“నమస్కార ప్రియ
భాను: ” అన్నారు. సూర్యుడు నమస్కార ప్రియుడు ఉదయం పూట నూర్య నమస్కారాల చేయాలన్న సంప్రదాయం ఆరోగ్యరిత్యా ఏర్పాటు చేసినదే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అన్నారు. సూర్యకిరణాలు ఆరోగ్య ప్రదమైనవి*. శ్రీ సూర్యారాధన వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ‘సకల కార్య సిద్ధి జరుగుతుంది.
సౌర మానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి. కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాస శుద్ద సమస్తమి నాడు వచ్చే ‘రథసప్తమిని సూర్య వ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో శుద్ధసప్తమి”, సూర్యసప్తమి’, ‘అచలా సప్తమి’, ‘మహాసప్తమి’, సప్త సప్త సప్తమి’ కానీ… ఇలా ఎన్నో పేర్లతో పిలువబడడమేగాక, సూర్యారాధనకు సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భాసిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా, ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.ఈ సప్తమి నాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’అని అంటారు.
సూర్యుడు మాఘ శుక్ల పక్షమి అశ్వనీ నక్షతం భానువారం
(ఆదివారం) సప్తమి తిథిన దక్షప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప
మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి కశ్యపులకు
పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య, ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంతకాలము భర్తగా దూరంగా ఉన్న సమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.

రథసప్తమికి ముందు రోజు రాత్రి షష్టిన ఉపవాసము చేసి సూర్యుని పూజించాలి. మరునాడు సప్తమినాటి ప్రాతఃకాలములో స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి మట్టి ప్రమిదలలో ఏ దేనిలోనైనా సరే నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీప చేతులను తల పై పెట్టుకుని నదీజలాల్లో గాని, పారే జలాల్లో గాని వదిలితే పుణ్యం వృద్ధి చెందుతుందని ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని తెలుస్తోంది.
సూర్య ప్రీత్యర్థం పాపహరణం కోసం రథసప్తమి రోజున చేసే స్నానం ఎంతో శుభప్రదమైనందున ఈరోజు ఉషోదయాన్నే నిద్రలేచి శూచియే ఈ సంకల్పం చేసుకోవాలి.
అన్ని జన్మలలో మనోవాక్కాయ కర్మలతో తెలిసీ తెలియక చేసిన ఏడు జన్మల పాపాలు, రోగాలు, శోకం మొదలైనవి ఓ రథసప్తమి నిన్నుస్తుతిస్తూ చేసే స్నానం వల్ల నశించునుగాక అని భావం.
“సప్త సప్తివహాప్రీత ! సప్తలోక ప్రదీపన! సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకర”అని సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం ఇస్తే అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు.

ఇలా చేయలేని వారు మరోపద్ధతిని కూడా చేయవచ్చును..

రథసప్తమి నాడు ప్రాతః కాలంలో స్నానానికి ముందు నువ్వుల పిండిని శరీరానికి రుద్దుకొని, ఏడు జిల్లేడు ( ఆర్క పత్రం) ఆకులుగానీ,రేగు ఆకులుగానీ, చిక్కుడు ఆకులను తలపైన, భుజాలపైన, చేతులపైన పెట్టుకొని స్నానం చేయడం ద్వారా సూర్య శక్తిని స్వీకరించే లక్షణం గల జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులలోని తపశ్శక్తి మన శరీరానికి తగిలి నందు వల్ల ఒంట్లోని రోగాలు తొలగిపోయి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని అంటారు.
కొన్ని ప్రాంతాల్లో ధనుర్మాసంలో నెలంతా ఇంటి ముంగిట్లో పెట్టిన ఎండిన గొల్బిమ్మలను ఇంటి ఆరుబయట వెలిగించి వాటిపై ఆవును పాలను మరిగించి సూర్యకాంతిలో పాయాసాన్ని వండి సూర్యునికి వివేదన చేస్తే, సూర్య భగవానుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం కలుగుతుంది.సత్ సంతానం కావలసిన వారికి సంతానం కూడా కలుగుతుంది.

ఖగోళ శాస్త్రరీత్యా భూగోళ సంచారం వల్ల సూర్యభగవానునికి దక్షిణాయణమనీ, ఉత్తరాయణమనీ రెండు ప్రయాణ మార్గాలు ఏర్పడ్డాయని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. దక్షిణాయన సంచారం నుండి మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు ప్రయాణం చేయడానికి దిశ మారుస్తాడని , ఈ రథసప్తమి రోజున తన రథాన్ని పూర్తిగా ఉత్తరం దిక్కు తిప్పి ప్రయాణిస్తాడని చెప్పబడుతుంది. సూర్యుడు తన స్వర్ణ రథమును గమత్మంతునికి సోదరుడైన అనూరుని సారథ్యంలో ఉత్తరాయన దిక్కునకు మళ్ళించే పవిత్రదినం ‘రథసప్తమి’ వైవస్వత మన్వంతరం కూడా ‘ “రథసప్తమి ‘ రోజున ప్రారంభమైనట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది..

శుక్ల సప్తమి ఆదివారం కలసి వస్తే దానిని విజయ సప్తమి అంటారు. ఆరోజున సూర్యుని ఆరాధించి దాన ధర్మాలు చేసినవారికి పుణ్య ఫలం లభిస్తుంది. ఆవునెయ్యితో కాని నువ్వుల నూనెతో గానీ ,దీపం పెట్టి ఆదిత్యుని పూజించి ‘ఆదిత్య హృదయం’ పఠిస్తే నేత్రవ్యాధులు రావు
పవిత్రమైన “రథసప్తమి” పండుగరోజు దేశమంతటా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని కోణార్క్, తమిళనాడులోని మా కోయిల్ ,తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా విశేషంగా సూర్యారాధనలు జరుగుతాయి. ఈ రోజున సూర్యుణ్ణి ఉపాసించితే గ్రహబాధలు పోగొట్టుకుంటారు.

సప్తమినాడు సూర్యుని ఆరాధించినవారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. సుప్రసిద్ధమైన అరసవిల్లి దేవాలయంలో శాస్త్రోక్తముగా సంకల్ప పూర్వకముగా అభిషేకం చేసి, సహస్ర నామ అష్టోత్తర శతనామ పూజ చేసిన కార్యసిద్ధి కలుగుతుంది.

విశ్వేశం విశ్వాధారం !
మహాతేజ ప్రదీపనమ్ తం !! సూర్యం ప్రణమామ్యహమ్ !!
మహా పాపహరం దేవం!!!

భక్తి ముక్తి నిచ్చి పోషించు దైవమై
ఆపదలను బాపి అనుదినమ్ము
బ్రోచు వాడ వనుచు పూనిన భక్తితో
సూర్యదేవుని మదిని స్తుతి నొనర్తు.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అష్టాంగ యోగము

by Bandi Usha February 28, 2022
written by Bandi Usha

ఇంద్రియాలు మనసుని బాహ్య ప్రపంచంవైపు లాగుతూ ఉంటాయి. దీనిని నిరోధించటమే మనో నిగ్రహం. యోగము అంటే మనసుని నిగ్రహించుకొని అంతర్ముఖ ప్రయాణం చేయటమే. మనసు తన సహజస్థితిని చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తునే ఉంటుంది. అది యోగ సాధన ద్వారా సుస్థిరమవుతుంది.

యోగములన్నిటిలో పతంజలి మహర్షి యోగ శాస్త్రములోనే “రాజయోగము” ఉత్తమమైనదిగా పేర్కొనబడింది. పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని

  1. సమాధిపాదం, 2. సాధనపాదం (సాధన పాదం), 3. విభూతి పాదం, 4. కైవల్య పాదం

అవి నాలుగు భాగాలుగా విభజించారు. ఇందులో మొత్తం 196 యోగసూత్రాలు ఉన్నాయి. వీటి సాధనకు అష్టాంగ మార్గం సూచించారు.

సమాధి పాదం : “శ్రద్ధా వీర్యస్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకితరేషామ్”

శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానం ద్వారా అంతఃకరణ ప్రవృత్తులను నిరోధిస్తూ సమదృష్టిని కలిగించే ఒక మానసిక స్థితి సమాధి. ఇది అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. ఇందులో 51 సూత్రములతో సమాధి తత్త్వము వివరించబడినది. చిత్తవృత్తులను నిరోధిస్తూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందడాన్ని సమూలంగా ఈ పాదంలో తెలియచేయబడింది.

సాధనా పాదం : “సమాధి భావనార్థః క్లేశతను కరుణార్థశ్చ”

క్రియాయోగం ఆచరించడం ద్వారా ఇంద్రియాలను సంపూర్ణంగా జయించవచ్చు. తద్వారా పంచ క్లేశములు (తిరిగి) నశించి సమాధి స్థితి పొందవచ్చు.

ఈ పాదంలో నివృత్తి మార్గాలు అయిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములు వివరించబడినవి. 55 సూత్రాలతో ఉన్న పాదం సాధనా పాదం.

విభూతి పాదం : “దేశబంధశ్చితస్య ధారణా తత్ర ప్రత్యయైక తానతా ధ్యానమ్”

చిత్తమును ఒకే  ఒక స్థానంలో ఉంచటం ధారణ. ఏకాగ్రతతో దృష్టి నిలపటం ధ్యానం. ఇందులో ధారణ, ధ్యాన, సమాధులనే కాకుండా అష్టసిద్ధులను వివరించటం జరిగింది. 56 సూత్రాలతో ఉన్న పాదం విభూతి పాదం.

కైవల్య పాదం : “పురుషార్థ శూన్యానామ్ గుణానామ్ ప్రతి ప్రసవః కైవల్యమ్ స్వరూప ప్రతిష్ఠానా చిత్తశక్తిరితి”

ప్రాపంచిక విషయ ప్రభావాల నుండి విడివడి భగవత్పరమైన ఆత్మలో లయమవటమే సమాధి. అంతిమ లక్ష్యమైన మోక్షమును సాధించుటకు మార్గము చెప్పబడినది. ఈ కైవల్య పాదం 34 సూత్రాలతో వివరించటం జరిగింది.

ఇందుకోసం పతంజలి మహర్షి అష్టాంగ మార్గాన్ని సూచించారు. ఇది సామాన్యులు సైతం యోగ సాధన చేయటానికి అనువుగా విభజించారు.

అష్టాంగ యోగములోని అష్టాంగ మార్గాలు

“యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోష్టావంగాని”

ఇప్పుడు ఒక్కో మార్గం గురించి తెలుసుకుందాం.

యమ : అష్టాంగ మార్గంలో మొదటిది అయిన యమములో ఐదు విషయాలు ఉన్నాయి. అవి

“అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధే వైరత్యాగః” అహింసా ప్రవృత్తిని పాటించిన దాని సమీపంలో వైరభావాలు ఉండవు.   “సత్యప్రతిష్టాయాం క్రియా ఫలాశ్రయత్వమ్” సత్యవంతమైన కర్మలు సత్ఫలితాలనిస్తాయి.

“అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వ రత్నోప స్థానమ్” చోర బుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.

“బృహచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః” బ్రహ్మచర్యంతో శారీరక, మానసిక ధారుడ్యం కలుగుతుంది.

“అపరిగ్రహ స్థైర్యే జన్మకథంతా సంబోధః” పరుల సొమ్ము స్థిర చిత్తంతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతంను తెలుసుకోగలడు –

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ ఐదింటిని ప్రతి వ్యక్తి తప్పక ఆచరించవలసిన విధులు.

నియమః “శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః”

పరిశుభ్రత, ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతుని యందు చిత్తము లయము చేయటం యమములోని నియమాలు.

“శౌచాత్స్యాంగ జుగుప్సా పరైర సంసర్గః మానసిక, శారీరక పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇతరులతో సంపర్కం విషయంలో వైముఖ్యం లభిస్తాయి.

“సంతోషాతను తమ సుఖలాభః” నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందం లభిస్తుంది.

“కాయేంద్రియ సిద్ధిర శుద్ధిక్షయాత్తపసః” తపో నిష్ట శరీరాన్ని ఇంద్రియాలను అంటి ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తుంది.

“స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగః” స్వాధ్యాయము వలన ఇష్టదేవతలను చేరగలరు. ఇందుకోసం జ్ఞానదీప్తులైన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం.

“సమాధి సిద్ధి రీశ్వర ప్రణిధానాత్” సర్వమూ ఈశ్వర స్వరూపమే అన్న భావనతో ఈశ్వరుని యందు చిత్తము లగ్నము చేయటం వలన సమాధి సిద్ధిస్తుంది.

ఈ ఐదు నియమాలతో మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా భగవంతుని స్మరించటమే ఈశ్వర ప్రణిదానము.

ఆసనం : “స్థిరం సుఖం ఆసనం” సాధకుడు తన దేహానికి, మనసుకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆరోగ్యంను, నిలకడ చేయనిదే ఆసనం. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆసనము వేయటం వలన శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

ప్రాణాయామము: “తస్మిన్ సతి శ్వాస, ప్రశ్వాస మోర్గతి విచ్చేదః ప్రాణాయామః”

ప్రాణము అనగా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు. ప్రాణాయామము అనగా ప్రాణశక్తిని పొడిగించటం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను క్రమబద్దీకరించటమే ప్రాణాయామము. అనగా పూరక, కుంభక, రేచక మరియు శూన్యకముపై పట్టు సాధించటం. పూరకమనగా గాలిని పీల్చుట కుంభకమనగా గాలిని నిలిపి ఉంచుట రేచకమనగా గాలిని వదులుట

శూన్యకమనగా గాలిని తీసుకోకుండా ఉండగలగటం.

ప్రత్యాహారం : “స్వస్య విషయా సంప్రయోగే చిత్త స్వరూపాను కార ఇవేంద్రియాణాం ప్రత్యాహార”

మనసు చంచలమైనది. బుద్ధి దానిని ప్రోత్సహిస్తుంటుంది. మానవుని వివేచనా శక్తి ఇంద్రియాలకు లోనైతే వినాశనమే. మనసును ఇతర ఆలోచనల నుంచి మరల్చి ఆత్మవైపు ప్రయాణం చేయటమే ప్రత్యాహారం. అనగా ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహారం.

ధారణ: “దారణా సుచ యోగ్యతా మసినః” చిత్తం ఆలోచనా రహితం అయ్యాక అంతరేంద్రియాలు ఉత్తేజితం అవుతాయి. ఆ సమయాన అంతర్ముఖంగా గోచరించే దృశ్యాలను అంతర్ముఖంగా గోచరించే దృశ్యాలను గమనించడం ధారణ. మనసు నిశ్చల స్థితిలో ఏకాగ్రతను పొందెడి స్థితి ధారణ. దీనిని ఆచరించడం ద్వారా తగిన సామర్థ్యం, యోగ్యత పొందగలము.

ధ్యానము : “ధ్యాన హేయాస్తద్వ్యతయః” క్లేశములను ధ్యానంలో వివ్తింపజేయాలి. ధారణలో స్థాయి పెరిగి ధ్యానం కొనసాగుతున్నప్పుడు సూక్ష్మశరీరం విడివడుతుంది. అప్పుడు రాగద్వేషాలు, అహంకారం మొదలగు క్లేశములు ఉండవు. ఎందుకంటే ఏ పాత్రలో నీళ్ళుపోస్తే ఆ ఆకారం వచ్చినట్లు మనము ఏ విషయంపై ధారణ చేస్తామో అదే సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు ఆటంకము లేకుండా సాగివచ్చు స్థితియే ధ్యానము.

సమాధి : “తస్యాది నిరోధే సర్వన్నిరోధాన్నిర్చిజస్సమాధిః”

ధారణ, ధ్యానం ఉన్నత స్థాయిలో కొనసాగినపుడు పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. దానిని నిరోధించిన తరువాత అంతిమ లక్ష్యమైన సమాధి స్థితిని చేరగలము. ధ్యానము యొక్క స్థితిలో సమాధిని పొందగలము. అప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు శరీరము, ఇంద్రియాలు ఏ విధంగానైతే విశ్రాంతి పొందునో మేల్కొన్నప్పుడు కూడా అదేవిధంగా విశ్రాంతి పొందును. “నేను” అనే భావన విడనాడి అనిర్వచనీయమైన, అనంతమైన ఆనందానుభూతి పొందడమే సమాధి.”

 

 

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌

by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు February 28, 2022
written by శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు

లోకానీకావనౌకం సకల భువనభు క్సత్ర సంత్రాణ తంత్రం

కారుణ్యార్ణోధినాధం ఘనరవవిలస న్నూపురాసాదపాదం

తాటంకద్యోత కర్ణం విషగళసుషమా తాండవానంద కందం

వందే యాదక్షమాభృత్‌ కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సమ్తలోకాలను సంరక్షించే ఆశ్రయముÑ సకల భువనా(లోకా)లను లయమొందించేవాడు, నిరంతరము పోషించి రక్షించేవాడుÑ కరుణ అనే సముద్రానికి ప్రభువైన (అధిపతిjైున) వాడుÑ విశేషమైన శబ్దాలను వెలువరించే ప్రకాశిస్తూన్న అందెలను అలంకరించుకున్న పాదము(లు) కలవాడుÑ తాటంకముల (చెవికమ్మల) చేత అందమును సంతరించుకుని ప్రకాశిస్తున్న చెవులు కలవాడుÑ శ్రీకంఠుని పరమశోభాకరమైన తాండవనాట్య సమయంలో కలిగే ఆనందానికి మూల(కారణ)మైనవాడు అయిన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకం అంటే ఇంద్రియగోచరమైన ఈ సమస్త చరాచర స్థావర జంగ మాత్మకమైన, ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిలయమైన, సంపూర్ణ సృష్టి అని చెప్పవచ్చు. సాధారణ మానవుడికి ఇంద్రియ గోచరమైన ఈ లోకం అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా పిలవబడుతున్నది. ఋషివరేణ్యుల జ్ఞానచక్షువులకు ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు కనిపిస్తుంటాయి.  వాటినే అనేక కోటి బ్రహ్మాండాలని జ్ఞానులు చెప్తుంటారు. (లోకGఅనీకGఅవనGఓకంR) అటువంటి లోకానీకములను, అనేక కోటి బ్రహ్మాండాలను (అవనR) రక్షించటానికి (ఓకంR) చక్కని, ఏకైక ఆశ్రమైనవాడుÑ (సకలGభువనR) సమస్త లోకాలను (భుక్‌R) భుజించటం అంటే మహాప్రళయకాలంలో తనలో లీనం చేసుకునేవాడు విష్ణుమూర్తి! అంతేనా? (సత్రR) ఆ లోకాలన్నిటినీ పోషించి, శరణమిచ్చి, రక్షణ కల్పించి, వాటికి తానే ఆశ్రయంగా నిలిచినవాడు. సత్రం అంటే  తగిన దక్షిణ లిచ్చి సతతము అన్నదానం చేయటం అని కూడ అర్థం! పూర్వం ఋషులు సత్రయాగం చేశారని పురాణాల్లో పేర్కొన్న దీ యాగాన్నే!, ఇంకా (సంత్రాణR) చక్కగా రక్షించటం అనే (తంత్రంR) కుటుంబ భరణ వ్యాపారాన్ని, పనిని, చేసేవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు.

సృష్టి, స్థితి, లయ కార్యాలకు మూలమైనవాడు విష్ణుమూర్తియే కదా!Ñ తనను ఆశ్రయించిన, ఆపన్నులైన భక్తజనులను, విపత్తుల నుండి కాపాడి (కారుణ్యGఅర్ణోధినాధంR) దయతో బ్రోచే కరుణాసముద్రానికి అధినాథుడుÑ (ఘనGరవGవిలసత్‌G నూపురGఆసాదGపాదంR) విశేషంగా మంజులనాదాన్ని వెలువరిస్తూ, మిక్కిలి సౌందర్యవంతములైన అందెలచేత (మంజీరాలచేత) అలంకరింపబడిన పాదాలు కలిగినవాడుÑ (తాటంకGద్యోతGకర్ణంR) శోభాయమానములైన చెవికమ్మలచేత ప్రకాశిస్తూన్న చెవులు కలిగినవాడుÑ (విషగళGసుషమాGతాండవGఆనందGకందంR) విషగళుడు శంకరుడు. సకలలోక శుభంకరుడైన శంకరుడు దివసావనాన సమయంలో అంటే సాయంసంధ్యా సమయంలో తాండవ నృత్యం చేస్తూ

ఉంటాడంటారు. (విషగళR) హాలాహల విషాన్ని తన కంఠసీమలో నిలుపుకుని శ్రీకంఠుడనే నామధేయాన్ని సార్థక పరచుకున్నవాడు శివుడు! అందుకే ఆయన శివుడు R మంగళకరుడైనాడు. శివుడు మనోజ్ఞమైన తాండవ నృత్యాన్ని చేస్తూంటే కలిగే ఆనందం ఇంతటిదని చెప్పడానికి వీలు కాదు! దాన్ని ఆనంద తాండవమంటారు. అదే బ్రహ్మానందం కంటే అతీతమైనది. అటువంటి ఆనందం కలగటానికీ, కలిగించటానికీ మూలమైనవాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు. శ్రీ యాదగిరిపై నెలకొని తన పటుభుజబలంతో విక్రమిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామిని కవి తన సుధామధుర కవితారస ధారాపూరంతో నమస్కరిస్తున్నాడు.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`12

మాకందామంద సానంద మృదుమధు సుధాగాధ మాధుర్యసూక్తిం

అస్తోకాభ్యస్త కస్తూరిక మలయజ సంలిప్త దీప్త స్వరూపం

దేహత్విడ్ధూత మిత్రం స్ఫురదురు స్రగ్ధారణం ముక్తకాయం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: మామిడి పండ్ల (రసం) వలె అత్యధికమై, ఆనందభరితమై, మృదువుగానూ మధురంగానూ ఉండే అమృతాయమానములైన ` అగాధములై, మధురములైన సూక్తుల చేత అలరారేవాడుÑ విశేషముగా కలుపబడిన కస్తూరి మరియు గంధములను శరీరముపై లేపనము చేయడము వలన ప్రకాశిస్తున్న స్వరూపం కలవాడుÑ తన దేహకాంతి చేత తిరస్కరింపబడిన సూర్యుడు కలవాడుÑ ప్రకాశవంతమైన గొప్ప మాలికను ధరించినవాడుÑ శరీరబంధము లేనటువంటివాడు యాదాద్రిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలపరాక్రమాలను ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: పండ్లల్లో మామిడి పండు చాలా విశిష్టమైనది. దాని రంగు`రుచి`వాసన అంటే ఇష్టపడని వాళ్ళెవ్వరూ

ఉండరు. అటువంటి మామిడి పండ్ల రసంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి (విష్ణుమూర్తి) అవతారగాథల్ని ఉపమిస్తున్నాడు కవి. (మాకందR) మామిడిచెట్టు, దీనినే రసాలము అని కూడా అంటారు. మామిడి పండ్ల రసం వలె (అమందR) అత్యధికమైన ఆనందంతో కూడినవీ ` అంటే మిక్కిలి ఆనందాన్ని కలిగించేవీ (Rసానంద), (మృదు మధుR) మృదుత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా అత్యంత మధురంగానూ ఉండేవీ, (సుధాGఅగాధR) అమృతపానం వలె గాఢమైన పరమానందాన్ని కలిగించేవి విష్ణుమూర్తి కథలు! ఆ కథలలో హరి చరిత్రను వర్ణించిన (మాధుర్యR) మధురరసభరితమైన (సుGఉక్తింR) మంచి మాటలు కలవాడు! అంటే అంతటి మృదు మధురమైన సూక్తుల చేత (మంచి మాటల చేత) హరిగాథలు వర్ణింపబడినవి. విష్ణుమూర్తి యొక్క (సూక్తిR) మాటలు కూడా అంతటి మాధుర్యం కలిగినవి అని కూడా చెప్పవచ్చు!

(అస్తోకGఅభ్యస్తR) విశేషముగా శ్రేష్ఠములైన అంగరాగాలను (సుగంధభరితములైన పూతలను దేవతలు, రాజులు మొదలైనవారు అనాదిగా వాడటం మన సంప్రదాయం. ప్రత్యేకంగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు! ‘‘కస్తూరీ తిలకం లలాటఫలకే…. సర్వాంగే హరిచందనం చ కలయన్‌…..’’ అంటూ శ్రీకృష్ణపరమాత్మను వర్ణించారు కదా! (కస్తూరికG మలయజR) కస్తూరి మృగం నాభి నుండి ‘కస్తూరి’ అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఇది పరిమళభరితమైనదే కాకుండా ఎన్నో రకాల రోగాలను దూరం చేయగల ఔషధ ద్రవ్యం కూడా! మలయజం అంటే మలయపర్వతంపై విశేషంగా పెరిగే శ్రీగంధపు చెట్టు. అందుకే మలయపర్వతం వైపు నుండి శ్రీగంధ వృక్షాల మీదుగా వీచే గాలిని ‘మలయపవనా’ లని సుగంధ భరితమైన గాలిగా వర్ణిస్తారు. అటువంటి శ్రేష్ఠములైన కస్తూరినీ, శ్రీగంధాన్నీ కలిపి (సంలిప్తR) చక్కగా శరీరానికి లేపనంగా వాడటం వలన (దీప్తGస్వరూపంR) దేదీప్యమానంగా వెలిగే శరీరం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహ స్వామి.

(దేహ త్విట్‌GధూతGమిత్రంR) తన దివ్యదేహం నుండి వెలువడే కాంతి (ప్రకాశం) సూర్యకాంతిని కూడ తిరస్కరించే విధంగా ఉన్నదట! చక్కగా సౌందర్యవంతమైన గొప్ప మాల (వనమాల) ధరించాడు స్వామి.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముక్తకాయుడు. శరీరం అశాశ్వతమైనది. శరీరధారులెవ్వరూ స్థిరంగా ఉండరు. ఏదో ఒకనాడు శరీరత్యాగం చేయక తప్పదు. అవతారమూర్తి అయిన లక్ష్మీ నరసింహుడు అటువంటి అస్థిరమైన శరీరాన్ని (కాయాన్ని) ధరించినవాడు కాదు. శరీరాకృతితో కనిపించేది అతని అపరిమిత తేజోమూర్తి మాత్రమే! అందుకే ఆయన ముక్తకాయుడు! శ్రీ యాదగిరిపై నెలకొని తన అవక్ర పరాక్రమంతో భుజబల ప్రదర్శన చేస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని తన అజరామరమైన కవితా పుష్పాలచేత అర్చించి నమస్కరిస్తున్నాడు కవి.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`13

శ్రీదం మోదం దవాదం నతజనవిహితం చిత్స్రవంతీనగాహం

దారిద్య్రార్తి ప్రవిచ్ఛేదన ఘనకరుణాధీన చేతోంబుజాతం

మేశం కాశప్రకాశం మితవచన మఘక్లేశనాశావకాశం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: సంపదలను ఇచ్చేవాడు, తన భక్తులకు సంతోషాన్నీ ` ఆనందాన్ని ప్రసాదించేవాడు, దావాగ్నిని మ్రింగినవాడు, తనను ఆశ్రయించిన భక్తజనులకు విశేషమైన హితాన్ని (మేలును) చేకూర్చేవాడు, తన భక్తులైన సాధకులకు కలిగిన జ్ఞాన (చైతన్య) ప్రవాహాన్ని అడ్డుకునే అజ్ఞానం అనే పర్వతాలను సంహరించేవాడు, దారిద్య్రం వలన కలిగే బాధలను ఛేదించగల గొప్ప కరుణ అనే గుణానికి లొంగిన హృదయపద్మం కలవాడు, లక్ష్మీదేవికి భర్త, రెల్లుపూవువలె తెల్లనైన విశేష ప్రకాశం కలవాడు, మితంగా మాట్లాడేవాడు, పాపం అనే దుఃఖాన్ని నాశనం చేయగలవాడు అయిన యాదగిరిపై నెలకొని తన బలిష్ఠములైన భుజముల బలాన్ని ప్రదర్శిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లక్ష్మీనాథుడైన విష్ణుమూర్తి స్థితి కారకుడు. సమస్త సృష్టికీ అవసరమైనవాటిని అన్నిటినీ సమకూర్చి రక్షించేది  ఆయనే! అందుకే విష్ణువు (శ్రీదంR) శ్రీని ` ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు. అంతేకాదు! (మోదంR) ఆయన అన్నిటికంటే మిక్కిలి గొప్పవైన సంతోషాన్నీ ` ఆనందాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆనందమే మోక్షం కదా! శ్రీహరి మోక్షస్వరూపి! ముక్తి కంటే భక్తులకు కోరుకోవలసింది ఇంకేముంటుంది? (దవాదంR) దవం అన్నా దావం అన్నా కార్చిచ్చు అని అర్థం. శ్రీకృష్ణావతారంలో ఒక రాక్షసుడు కార్చిచ్చు రూపంలో తనను సంహరించటానికి వస్తుంటే ఆ దావాగ్నిని మ్రింగివేశాడు బాలకృష్ణుడు. అందుకే విష్ణువు దవాదుడు అయినాడు!

విష్ణుమూర్తి భక్తజన పరాధీనుడు! అందుకే (నతజనGవిహితంR) తనను ఆశ్రయించిన భక్తులకు మిక్కిలి హితకరమైన వాటిని మాత్రమే ఆచరిస్తాడాయన! భక్తులు, సాధకులు శ్రీహరి సేవకోసం, ఆయన సాన్నిధ్యం కోసం, ఆయన దర్శనం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ‘‘జ్ఞానా దేవ హి కైవల్యం’’ అని వేదాంతులు సిద్ధాంతీకరించారు. జ్ఞానసాధనా మార్గంలో ఎన్నో ఆటంకాల్నీ, సమస్యల్నీ నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు సాధకులు. కాని వారి ప్రయత్నాల్ని విరమించరు. వారికి భగవత్తత్త్వాన్ని తెలుసుకునే ‘జ్ఞానం’ ఉదయించి (చిత్‌Gస్రవంతీR) జ్ఞాన ప్రవాహంగా మారి భగవంతుని వైపు ప్రవహిస్తుంటే మధ్యలో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవటానికి (నగR) విఘ్నాల (అజ్ఞానం, మోహం, అరిషడ్వర్గాలు) మొదలైన రూపాలలో (నగాR) పర్వతాల వలె ఎదురుపడి నిరోధిస్తుంటాయి. ఆ విఘ్న పర్వతాల్ని (హంR) నిర్మూలించేవాడు, రాకుండా ఆజ్ఞాపించేవాడు విష్ణుమూర్తి.

‘‘యస్యానుగ్రహ మిచ్ఛామి తస్య విత్తం హరా మ్యహం’’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. భక్తుల హృదయాలను పరీక్షించటం కోసం కష్టాలను కల్పించి, వాటిని ఎదిరించి నిలువగల శక్తిని ఇచ్చి, వారికి కావలసిన బుద్ధి పరిపక్వతను కలిగించేవాడూ విష్ణుమూర్తే కదా! చివరికి అడుగడుగునా తన భక్తులకు కలిగిన (దారిద్య్రGఆర్తిR) ఎన్నో రకాల దారిద్య్ర బాధలను, కష్టాలను (ప్రవిచ్ఛేదనR) నాశం చేసి రక్షిస్తాడు. అంతటి (ఘనGకరుణాధీనR) గొప్ప కరుణకు వశమైన (చేతఃGఅంబుజాతంR) హృదయ కమలం కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహుడు! ఆయన (మాGఈశంR) శ్రీలక్ష్మికి ప్రభువు, ప్రాణవల్లభుడు! (కాశGప్రకాశంR) రెల్లుపూవు తెల్లగా, నిర్మలంగా ఉంటుంది. ఆవిధంగానే స్వామి కూడా స్వచ్ఛమైన గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన (మితGవచనంR) చాలా పరిమితంగా మాట్లాడేవాడు. చేయవలసిన పనిని నిరాఘాటంగా సకాలంలో చేసేవాడు. భక్తజనులకు కలిగే (అఘR) తెలిసికాని, తెలియక కాని చేసిన పాపాల వలన కలిగే (క్లేశR) దుఃఖాలను, కష్టాలను (నాశR) నశింపజేయటంలో (అవకాశంR) చొరవను తీసుకునేవాడు. యాదాద్రిపై నెలకొని తన బలీయములైన భుజబలపరాక్రమాల్ని ప్రదర్శించే అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కవిగారు తన మృదుమధుర మంజుల వచః ప్రసూన మాలికతో అర్చించి, నమస్కరిస్తున్నారు.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`14

బ్రహ్మాండోత్తేజమూర్తిం త్రిభువన జనన త్రాణ సంహారమూర్తిం

దేవేంద్రాగణ్యమూర్తిం దివిజ గరుడ గంధర్వ దుర్భేద్యమూర్తిం

శ్రేయ స్సంధానమూర్తిం భృశ విశద యశోవ్యాప్త దిక్చక్రమూర్తిం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: ఈ భూగోళానికంతటికీ తన కాంతిచేత వెలుగును అందించే దివ్యమూర్తీÑ మూడు లోకములను (సమస్త సృష్టినీ) పుట్టించి, పెంచి, చివరికి తనలో లయం చేసుకునే మూర్తీÑ దేవేంద్రాదుల చేత కూడ లెక్కించడానికి అశక్యమైన మూర్తీÑ దేవతలు, గరుడగంధర్వాదుల చేత కూడ భేదింపనలవి కాని మూర్తీÑ సకల చరాచర సృష్టికీ శ్రేయస్సు (మేలు)ను కలిగించే మూర్తీÑ తన మేర మీరిన, నిర్మలమైన యశస్సును (కీర్తిని) దశదిశలా వ్యాపింపజేసిన మూర్తీ అయిన ` యాదాద్రిపై వెలసి తన పటుతరమైన భుజబలాన్నీ, విక్రమాన్నీ ప్రదర్శిస్తున్న ` శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: స్థావర ` జంగమాత్మకమైన ఈ సమస్త సృష్టిలోను (బ్రహ్మాండమంతటా) చైతన్య స్వరూపిjైు ఉండేవాడు పరమాత్మ. ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజ స్స్వరూపులై సమస్త సృష్టినీ వెలిగిస్తున్నారు. అటువంటి సూర్య చంద్రాదులకు శక్తిదాతjైు, వారిని కర్తవ్యోన్ముఖులుగా చేసేవాడు పరమాత్మ. తైత్తిరీయోపనిషత్తు`ఆనందవల్లిలో ఇదే విషయం ఈవిధంగా ప్రస్తావించబడిరది. ‘‘భీషాస్మా ద్వాతః పవతే, భీషోదేతి సూర్యః, భీషాస్మా దగ్ని శ్చేంద్రశ్చ, మృత్యు ర్ధావతి పంచమ ఇతి’’. ఈ బ్రహ్మము యొక్క భయము వలననే వాయువు వీచుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు. ఇతని భయము వలననే అగ్నియు, ఇంద్రుడును తమ తమ విధులను నిర్వర్తించుచున్నారు. ఐదవవాడగు మృత్యువు (యముడు) కూడ ఈ పరమాత్మ భయము వలననే స్వకార్యమును నిర్వర్తించుచున్నాడు. సృష్టిలోని సమస్త శక్తులకు చైతన్య ప్రదాత పరమాత్మ (విష్ణువు) కాబట్టి అతనికి ఆ నియామక శక్తి లభించింది. (బ్రహ్మాండGఉత్తేజGమూర్తి(ం)R) ఈ బ్రహ్మాండానికంతకూ ప్రేరేపక శక్తిగా, ఉద్దీపక మూర్తిగా నిలుస్తున్నాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి (త్రిభువనGజననGత్రాణGసంహారGమూర్తి(ం)R) ఈ మూడు లోకాలనూ తన సంకల్ప బలంతో సృష్టిస్తాడు. వాటిని పోషించి, రక్షించి, పుష్టిని చేకూరుస్తాడు. కాలం తీరి, శరీరం త్యాగం చేయవలసిన సమయంలో వాటిని సంహరించి తనలో లీనం చేసుకుంటాడు. సృష్టి`స్థితి`లయ కార్యాలను చేసే దివ్యమూర్తి లక్ష్మీనృసింహుడు!

శత్రు సంహారం కోసం అవతరించిన స్వామి (దేవేంద్రGఅగణ్యGమూర్తి(ం)R) దేవతలకందరికీ ప్రభువైన ఇంద్రుడికి కూడ గణింపశక్యం కానటువంటి సర్వశక్త్యతీత శక్తి మూర్తి! అందుకే (దివిజGగరుడGగంధర్వGదుర్భేద్యGమూర్తి(ం)R) దేవతలకు, గరుడ గంధర్వాదులకు కూడ ఎదిరించి, భేదింపశక్యం కానటువంటి శరీరము (స్వరూపము) కలిగిన వాడాయన! తనను శరణుపొంది, ఆశ్రయించిన భక్తజనులకు నిరంతరమూ ఆయన (శ్రేయస్‌GసంధానGమూర్తి(ం)R) సకలవిధ శ్రేయస్సులనూ, శుభాలనూ కలిగించగల కరుణామయమూర్తి! (భృశGవిశదGయశోGవ్యాప్తGదిక్‌Gచక్రG మూర్తి(ం)R) మేరమీరిన, అత్యంత నిర్మలమైన ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. అటువంటి నిర్మల యశశ్శరీరము కలిగినవాడు శ్రీలక్ష్మీనరసింహస్వామి.

సర్వాతీతమైన, అనంత శక్తిమంతమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మాండానికి ఉత్తేజాన్ని కలిగిస్తూ, సృష్టి`స్థితి` లయకారకుడై, దేవేంద్రాది సమస్త దేవగణాలకు కూడా దుర్భేద్యమూర్తిjైు`అందరికీ సేవింపబడుతూ, అందరిచే సకల శ్రేయస్సులనూ కలిగిస్తూ, తన నిర్మలకీర్తి దశదిశలా వ్యాపించగా ‘‘శ్రీలక్ష్మీ నరసింహుని’’గా యాదాద్రిపై వెలసి, తన బలిష్ఠ భుజబల పరాక్రమాలను ప్రదర్శిస్తూ, భక్తుల మ్రొక్కులందుకుంటున్నాడు. అటువంటి స్వామిని సుందర పద బంధ పాదారవిందాలచే అర్చించి, నమస్కరిస్తున్నాడు కవి.

 

శ్రీ యాదాద్రీశ వైభవమ్‌`15

శోచిష్కేశ ప్రతాప ప్రశమిత మహిమాహస్కరం విష్కిరాశ్వం

భిన్నాభిన్న ప్రసన్నాఖిల కలుషచయం స్విన్న సంఛన్న గండం

ప్రాశస్త్య స్తుత్య వస్త్వంబరమణి కనక ప్రీణిత క్షోణిదేవం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహమ్‌ !

తాత్పర్యం: అగ్నిహోత్రుని వలె భరింపరాని తన గొప్ప ప్రతాపము చేత కిరణములనే గుఱ్ఱాలను చెదరగొట్టి సూర్యుని కాంతి మహిమ (గొప్పదనము)ను చల్లార్చిన (తగ్గించిన) వాడు, భిన్నాభిన్నములైన (భేదింపదగిన మరియు భేదింపరాని) సమస్తపాప సమూహములను తన దయచేత అణచినవాడు, చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవాడు, శ్రేష్ఠములైన మరియు మెచ్చుకోదగిన వస్తువులు, వస్త్రములు, మణులు, బంగారము మొదలైన వానిచేత సంతోషపెట్టబడిన బ్రాహ్మణు(డు)లు కలవాడు, శ్రీ యాదాద్రిపై వెలసి తన బలిష్ఠములైన భుజముల పరాక్రమము చేత ప్రకాశించుచున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: శోచిస్‌ అంటే వెలుగు, ప్రకాశము, కాంతి, జ్వాల మొదలైన అర్థాలున్నాయి. అగ్నికి తన కాంతిమంతములైన జ్వాలలే కేశము (శిరస్సుపై పెరిగే వెంట్రుక) లని చెప్పబడ్డాయి. అందుకే అగ్నికి ‘శోచిష్కేశుడు’ అన్న పేరు కలిగింది. అగ్నికి సర్వభక్షకుడు అన్న పేరు కూడ ఉంది. అగ్నిహోత్రుడు దహింపలేనటువంటి వస్తువు సృష్టిలో లేదు. అతని కాంతి (వేడి) ని ఎవరూ భరించలేరు. కాని జీవులు చేసిన పాపాల సమూహాలను కాని, భక్తజనుల బాధల్ని కాని దహించగల శక్తి మాత్రం ఆ అగ్నిహోత్రుడికి కూడ లేదు. సృష్టిలో సర్వశక్తిమంతుడు శ్రీహరి మాత్రమే! ‘హరి ర్హరతి పాపాని’ అని కదా ఋషివచనం! అంతటి గొప్ప శక్తిశాలి అయిన శ్రీహరి తన అఖండమైన (శోచిష్కేశGప్రతాపR) (ప్రళయకాల) అగ్నిహోత్రముతో సమానమైన తన ప్రతాపము చేత (ప్రశమితGమహిమాGఅహస్కరంR) లోకాలకన్నిటికీ వెలుగునిచ్చే సూర్యుని గొప్పదనాన్ని (అత్యంత ప్రకాశాన్ని) తగ్గింపజేశాడు. సూర్యుని కిరణాలనే అశ్వాలుగా పేర్కొంటారు. అందుకే సప్తాశ్వుడు (సప్తసప్తి ర్మరీచిమాన్‌) అన్నపేరు సూర్యుడికి కలిగింది. సూర్యకిరణంలో (కాంతిలో) ఏడు రంగులున్నాయని విజ్ఞానశాస్త్రవేత్తలు నిరూపించారు. (విష్కిరGఅశ్వంR) అటువంటి సూర్యకిరణాలను (గుఱ్ఱాలను) తన ప్రతాపం చేత చెదరగొట్టినవాడు విష్ణుమూర్తి!

జీవులకు పాప`పుణ్యాలను కలుగజేసేవి వారు చేసే కర్మలే. జీవులు చేసే పాపాలు అనేకాలు. కొన్ని పరిహారం చేసుకోదగినవి (భిన్నాలు), కొన్ని (అభిన్నాలు) పరిహారం లేనివి. సాధారణ పాపాలు పరిహరించగలిగినవి. మహా (పంచమహా) పాతకాలు పరిహారం లేనివి. (భిన్నGఅభిన్నGప్రసన్నGఅఖిలGకలుషGచయంR) పంచమహాపాతకాలతో సహా సమస్తములైన భిన్నాభిన్న పాపసమూహాలను కూడ శమింప (పరిహరింప) జేయగల దయాళువు విష్ణుమూర్తి!

పరమభక్తుడు, బాలుడు అయిన ప్రహ్లాదుణ్ణి రక్షించటం కోసం నరసింహాకారంతో స్తంభం నుండి ఆవిర్భవించాడు విష్ణుమూర్తి. దానవ రాజైన హిరణ్యకశిపువును వధించిన సందర్భంలో ఆ స్వామివారు (స్విన్నGసంఛన్నGగండంR) చెమటచేత కప్పబడిన చెక్కిళ్ళు కలవారిగా దర్శనమిచ్చారు. స్వేదం శ్రమకు చిహ్నం! భక్త రక్షణ దీక్షాదక్షుడైన స్వామి ఎంతటి శ్రమనైన భరించటానికి వెనుకాడడని తన చెమర్చిన చెక్కిళ్ళ చేత లోకానికి తెలియజేస్తున్నాడు.

భక్తపాలనం వరదుని నిత్యకృత్యం! అనన్యచిత్తులైన తన భక్తులు తనను అడిగినా అడుగకున్నా వారి కోరికలన్నిటినీ తీరుస్తాడు స్వామి! కుచేలుడు శ్రీకృష్ణుని భక్తుడు, మిత్రడు. ఆయన తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణపరమాత్మను దర్శించాలని ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుని చేత సన్మానింపబడ్డాడు. కుచేలుడు అడగకపోయినా సరే శ్రీకృష్ణుడు అతనికి సమస్తమూ అనుగ్రహించాడు. (ప్రాశస్త్యGస్తుత్యGవస్తుGఅంబరGమణిGకనకR) ప్రశస్తములైన అందరిచేత స్తుతింపదగిన వస్తువుల్ని, విలువైన వస్త్రాలను, మణి మాణిక్యాలను, స్వర్ణరాశులు మొదలైన వాటిని అనుగ్రహించి, (ప్రీణితGక్షోణిదేవంR) భూసురుడైన కుచేలుణ్ణి, సంతోషింపజేశాడు. అదీ భక్తపరతంత్రుడైన విష్ణుమూర్తి గొప్పదనం, కరుణాపూరిత హృదయం! అటువంటి శ్రీలక్ష్మీ నృసింహస్వామి శ్రీ యాదాద్రిపై నెలకొని తన ప్రచండ భుజ పరాక్రమం చేత ప్రకాశిస్తూ అందరి పూజలు అందుకుంటున్నాడు. అటువంటి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి తన అక్షర ప్రసూనార్చన చేత నమస్కరిస్తున్నాడు కవి.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా రూపాలు

by Sabbani Laxminarayana February 28, 2022
written by Sabbani Laxminarayana
(హైకూలు, నానీలు, నానోలు,రెక్కలు, ఏకవాక్య కవితలు)
ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవితది అగ్రస్థానం. అది గురజాడ నుండి, శ్రీ శ్రీ నుండి, శేషేంద్ర నుండి, తిలక్ నుండి, సినారె నుండి, ఆరుద్ర నుండి, కుందూర్తి నుండి నేటి ఆధునిక కవి వరకు కాలముతో పాటు ముందుకు సాగుతూ సుసంపంనమవుతూ వచ్చింది. కాల క్రమములో నవ్యతను, నాణ్యతను, గాడతను, క్లుప్తతను సంతరించుకొని కూడా ముందుకు నడిచింది. తన రూప నిర్మాణాన్ని కూడా మార్పుచేసుకుంటూ వచ్చ్చింది. నాటి మహాభారతం పద్యంలో 18 పర్వాలైతే , నేటి ఆధునిక వచన కవిత 18 లైన్లే అన్నారు పెద్దలు. అలాంటి వచన కవిత కాల క్రమములో మినీ కవిత్వమై కూడా వర్దిల్లింది
 తెలుగు కవిత్వ సీమలో మినీకవిత్వం 1980 లలో విశిష్ట స్థానం పొంది వర్ధిల్లింది, ప్రచారం పొందుతూ ముందుకు సాగింది. 1980 లలో విజయవాడ నుండి “ యువ స్వరాలు “ అనే ఒక సంకలనం వస్తుండేది నెల నెల యువ కవుల మినీ కవితలతో. అద్దేపల్లి రామ మోహన రావు , శీరిష్ కుమార్ లాంటి పెద్దల ఆధ్వర్యములో సాంస్కృతి సమాఖ్య ద్వారా . ఆంధ్ర జ్యోతి లాంటి వార పత్రికలో ఏమ్విఎల్ ఆది గా గల కవుల మినీ కవితలు వస్తుండేవి. యువ కవి అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవి చిత్రకారుడు, చైతన్య వంతమైన మినీ కవితలు రాసి వాటికి బొమ్మలు కూడా వేసి మినీ కవితల చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలిశెట్టి ప్రభాకర్ మినీ కవితలు ‘సిటీ లైఫ్ ‘ పేరున రోజుకొక్కటి ఆంద్ర జ్యోతి దిన పత్రికలో వచ్చి విశేషంగా ప్రజాదరణ పొందినాయి. మచిలీ పట్నం నుండి డా. రావి రంగారావు గారు విశేషముగా కృషి చేసినారు మీనీ కవిత వ్యాప్తి కోసం, వారు స్వయంగా మినీ కవితపై పరిశోధన చేసి “మినీ కవిత శిల్ప సమీక్ష “ అనే పుస్తకం కూడా రాసినారు. మచిలీపట్టణం, విజయ వాడ పట్టణాలలో మినీకవితపై పలుమార్లు వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థులు ఎందరూ మినీ కవితలు రాయడానికి దోహద కారిగా నిలిచి నారు. వారు స్వయంగా ఎన్నో మినీ కవితలు రాసి సంకలనాలు వేసినారు. ఎందరో సంకలనాలు వేయడానికి తోడ్పడినారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో తన మినీ కవితల సంకలనం పుస్తకం కూడా తెచ్చినారు. ఇక మినీ కవిత అంటే స్పష్టత, సూటిదనం,సంక్షిప్తత, సరళత, వ్యంగ్యం మినీకవితలలో కనిపించే విశిష్ట లక్షణాలు అన్నారు పెద్దలు. కవితకు శీర్షిక తప్పకుండా ఉంటున్నట్లు మినీ కవితకి కూడా ఒక శీర్షిక తప్పకుండా ఉంటుంది. మినీ కవిత ఎన్ని లైన్లలో ఉండచ్చు అంటే ఓ అయిదారు లైన్లు లేదా పది లైన్ల లోపు ఉంటె అది మినీ కవిత. శ్రీశ్రీ నుండి, కాళోజి నుంచి ఆదునిక కవుల వరకు అప్పుడప్పుడు అందరు మినీ కవితలు రాసినవారే. మచ్చుకు కొన్ని ఉదాహరణలు
 మినీ కవితల్లోంచి వివిధ కవులవి. ఆః!
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
        నిర్దాక్షిణ్యంగా వీరే… -శ్రీ శ్రీ
                             జెపి
                                   పుటుక నీది
                                    చావు నీది
                                    బతుకంతా దేశానిది .- కాళోజి
                    కరెన్సీ నోటు
                    ‘గుండెల్లో
                    కొత్తగా దిగబడే
                     కాగితపు కత్తి
                     కరెన్సీ నోటు’ -అలిశెట్టి వేట లేళ్ళను, కుందేళ్ళను పులులు వేటాడేవి
లేళ్ళను, కుందేళ్ళను,పులులను మనిషి వేటాడేవాడు నేడు లేళ్ళు లేవు, పులులు లేవు బతుకే అడవైపోయి
మనిషిని మనిషే వేటాడుతున్నాడు -సబ్బని
అమెరికా పిల్లలు
ఒక లక్ష్యంతో
వదిలిన బాణాలు
మన పిల్లలు…
అంతే…
అవి తిరిగి రావు. – డా. రావి రంగారావు పాదాల
ఇలా మినీ కవితలను చూసాక, మూడు పాదాల కవితలు , నాలుగుపాదాల కవితలు, అయిదు పాదాల కవితలు, ఆరు పాదాల కవితలు మినీ కవితల్లో కనిపిస్తాయి. ఇలా మినీ కవితల మార్గములో వాటి లక్షణాలను పుణికి పుచ్చుకొని వచ్చినవే ఈ మూడు లైన్లలో ఉన్న హైకూ, నాలుగు లైన్లలో ఉన్న నానీ, నానో, ఆరు లైన్లో ఉన్నా రెక్క మరియు ఒకే వాక్యములో ఉన్న ఏక వాక్య కవిత .
వాటి గురించి విపులంగా చూస్తే ముందుగా హైకూల గురించి
హైకులు :
హైకూ జపనీస్ కవిత ప్రక్రియ, 17 వ శతాబ్ధం నుండి జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగు కవిత్వం లోకి దిగుమతి అయింది. ఈ సాహితీ ప్రక్రియకు జపానులో ఆద్యులు- బాషో (1644-1694), యోసాబుసాన్ (1716-1784), ఇస్సా (1763-1825)- అన్న ముగ్గురు కవులు హైకూకు అపారమైన కీర్తిప్రతిష్ఠలను తీసుకువచ్చారు. హైకూలో మూడు పాదాలలో పదిహేడు ‘మాత్రలు ‘ ( సిలబుల్స్) ఉంటాయి. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి, 5-7-5 మాత్రల చొప్పున . ప్రకృతి పరిశీలనతో , జీవితానుభవాన్ని జోడిస్తూ రసానుభూతిని కలిగిస్తూ, గుణాత్మకంగా ఉంటూ ముచ్చటగా మూడు చిన్న పంక్తుల్లో వెలువడే ప్రక్రియ హైకూ.
ఇస్మాయిల్‌, గాలి నాసరరెడ్డి, పెన్నా శివరామకృష్ణ లాంటి వారు జపాన్‌ భాషలోని ఛందస్సును పాటిస్తూనే హైకులను రచించారు. గాలి నాసర రెడ్డి తొలిసారిగా హైకులను 1990లో ప్రచురించాడు. 1991లో ఇస్మాయిల్‌ ‘వానాకాలం హైకులు’ వెలువరించాడు. అనుభూతి ప్రధానంగా సాగే హైకు రచనను తరువాతి కవులు ఆకలింప చేసుకున్నారు . పెన్నా శివరామకృష్ణ గారు హైకు సంప్రదాయాన్ని పాటిస్తూ హైకులు రచించారు. ఆత్మానుభూతిని, సౌందర్యానుభూతిని కలిగించే హైకులను పెన్నా రచించి, వాటినన్నింటిని ‘రహస్య ద్వారం’ పేరిట వెలువరించాడు. తర్వాతా ‘ “చినుకుల చిత్రాలు” (2000), “సులోచనాలు” (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ గారు వెలువరించారు. ప్రపంచ దేశాల హైకూలను తెలుగులోనికి అనువదించి “దేశదేశాల హైకూ” అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ గారు ప్రచురించారు.. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. అనకాపల్లికి చెందినా తలతోటి పృథ్వీరాజ్ ‘ ఇండియన్ హైకూ క్లబ్ ‘ ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి హైకూ సంకలనాలు వేస్తూ , హైకూ సంకలనాలు వేసిన వారికి అవార్డులు కూడా ప్రదానం చేశారు. .ఇంకా రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ రచించిన ‘హైకూ సారస్వతం’ పుస్తకం, .డా||అద్దేపల్లి రామమోహన్‌రావు, బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, వరలక్ష్మి, సబ్బని లక్ష్మీనారాయణ, మాకినీడి సూర్యభాస్కర్‌, రామచంద్రారెడ్డి, పి.శ్రీనివాస్‌గౌడ్‌, డా||పత్తిపాక మోహన్‌,, శిఖా ఆకాష్‌, బొల్లముంత వెంకటరమణారావు, చిమ్మపూడి శ్రీరామమూర్తి, డా||భీంపల్లి శ్రీకాంత్‌,డా||శోభారాణి, దాట్ల దేవదానం రాజు, జిసనారా, పెరుగు రామకృష్ణ, డా||కె.జి.వేణు, పి.అమరజ్యోతి, పులిపాటి పరమేశ్వరి తదితరులు హైకులు రాశారు. కొందరు హైకూ సంపుటాలను uవెలువరించారు. కొన్ని హైకూలు పరిశీలిస్తే :
సమీక్షకుడు
పచ్చిపాల మీగడ
వెతికే అత్త – పెన్నా శివరామకృష్ణ.
మంచి పోలికతో, ప్రకృతి పరిసరాల పరిశీలనతో చెప్పేది హైకూ. ఇక్కడ విమర్శకుడు అనేవాడు పాల లోంచి మీగడ తీసే వాడు, ఇంకా తప్పులు వెతికే అత్త లాంటి వాడు అని అర్థం. “మూసిన కన్ను
 నాలోని లోకానికి
 రహస్యద్వారం” — పెన్నా శివరామకృష్ణ .
గొప్ప అంతర్ దృష్తి ఉంది ఈ హైకులో ఆత్మ పరిశీలన చేసుకుంటే .” వాగు ప్రవాహానికి
అన్నీ కొట్టుకపోతున్నాయి
చంద్రుడు తప్పించి “- తలతోటి పృథ్విరాజ్.
 ప్రకృతి పరిశీలన, సౌందర్యాత్మకత ఇమిడి ఉంది ఈ హైకూలో . “కాలం సిగలో
కొత్తగ పువ్వు
తెలంగానము “. – సబ్బని . ఇందులో సౌందర్య భావన ఉంది, సామాజిక అంశం కూడా ఇమిడి ఉంది. 2. నానీలు :
నాలుగు పాదాలలో ఉన్న లఘు కవితారూపం ‘నానీ. నానీల సృష్టి కర్త .డా.ఎన్.గోపి.
1997 సంవత్సరంలో ‘వార్త’పత్రికలో ఎబికే ప్రసాద్ ఎడిటర్ గా ఉన్నపుడు, గోపిగారి నానీలు సీరియల్ గా వచ్చినాయి. అవన్నీ తరువాత ‘నానీలు’ పేరిట పుస్తకరూపంలో వచ్చినాయి.
నానీలను గురించి గోపిగారి మాటలలోనే :
1.ఒకానొక మానసికస్థితిలో అలవోకగ మొదలైన నానీలు అలా ఏడాదిపాటు అలుపులేకుండా వెలువడ్డాయి
2.నానీలు చిన్నపద్యాలు,మరీచిన్నవిగాదు
3.నానీలు అతిబిగింపు,అనవసరమైన సడలింపూ లేకుండా రూపొందిన 20—25అక్షరాల విస్తీర్ణం గల చట్రం.
20అక్షరాలకి తగ్గవు,25అక్షరాలకి మించవు.
4.నానీలు అంటే నావీ నీవి వెరసి మనవి అనర్థం.
అదేవిధంగ నానీలు శతకపద్యాల్లా ముక్తకాలు. నానీలకు మినీకవితలో లా శీర్షికవుండదు. దీంతోపాటు నానీల నిర్మాణవైవిధ్యం గురించి వారే ఇలా అన్నారు
1.మొత్తం నానీ పద్యానికి నాలుగుపాదాలుంటాయి
2.రెండుపాదాలు కలసి ఒక భావాంశంగా, నాల్గుపాదాలు కలసి రెండు భావాంశాలుగ వింగడించుకోవాలి.
3.ఈ రెండు భావాంశాలు ఒకదానితో ఒకటి వైరుధ్యంగాను
సాదృశ్యంతోనూ అల్లుకోవచ్చు.రెండుభావాంశాలు సమన్వయం సాధించాలి
4.నానీలు లఘురూపమైనా కవితాప్రక్రియన్నమాట మరువరాదు.
ఈ నియమాలతో,గోపిగారు నానీలు తొలిసంపుటంలో 365 అందించారు.. నానీలకు విశేషంగా పాఠకులేర్పడ్డారు.పెద్దకవులనుంచి నవయువ కవులదాక నానీలకు ఆకర్షితులయ్యారు. నానీల గాలి తెలుగునేల అన్నిదిక్కులా విస్తరించింది. తెలంగాణ నుంచి అత్యధిక నానీలసంపుటాలు వచ్చాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలోంచే 60 నుండి 70 వరకు నానీల సంపుటాలు వచ్చినాయి. బొంబాయి నుంచి అంబల్లజనార్థన్ ,సంగెవేనీ వంటివారు బొంబాయి నానీలు , వలస నానీలు అని పుస్తకాలు వేశారు.
గోపిగారు మళ్లీ మరో 365 నానీలతో రెండవసంపుటి తీసుకొచ్చినారు. ఇందులోని నానీలన్నీ ‘సుప్రభాతం’ పత్రికలో ధారావాహికంగ వచ్చాయి. అలా వారు, ‘నానీలనాన్న’గ పేరు గడించి నానీ కవులకు పీఠికల ద్వారా నిర్మాణ మర్మాలను అందిస్తూ,ముందుకు నడుస్తున్నారు.
1997 లో మొదలైన నానీల యాత్ర 2017 నాటికి రెండు దశాబ్దాల మార్గములో పయనించింది . .ఈ రెండు దశాల్దాల్లో ౩౦౦ లకు పైగా నానీల సంకలనాలు వచ్చినాయి. .మానవసంబంధాలు,ప్రకృతిచిత్రణలు, సామాజికాంశాలు, ప్రాంతీయ చైతన్యం, ప్రపంచీకరణ, జీవిత తాత్వికాంశాలు ఇలా అనేక అంశాలు నానీలలో కవిత్వీకరించబడ్డాయి. .
వేలకొలదినానీలు అన్నిపత్రికలలో వచ్చినాయి. నానీలపై విశ్లేషణాత్మక వ్యాసాలు, వ్యాస సంకలనాలు వచ్చాయి.’నానీకవులడైరక్టరీ’ వచ్చింది. ‘నానీలపై ఎంఫిల్ , పిహెచ్ డిలు జరిగాయి,జరుగుతున్నాయి. ‘నవ్యకవితారూపం నానీ వివేచన’ అనేది చింతకింది శ్రీనివాసరావు గారి ముద్రితమైన సిద్ధాంతగ్రంథం. కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ వారిచే 2008 జూనియర్ ఫెలోషిప్ పొందిన పరిశోధనవ్యాసం చలపాకప్రకాష్ రాసారు. అది ‘అత్యాధునిక కవితారూపప్రక్రియ నానీ’, .ఇలా నానీలు పాఠకుల,పరిశోధకుల, విమర్శకుల మన్ననల్ని అందుకున్నవి.
ఈ రెండు దశాబ్దాలకాలంలో నానీలు విస్తృతమైన సమాజచిత్రణ చేస్తూ, సమకాలీన ఉద్యమాలకి కూడా తమవంతు ఉడతా భక్తిగా సాయాన్ని అందించాయి.
“బొంబాయి నానీలు,తెలంగాణ నానీలు,మానేరు నానీలు, వలస నానీలు,, చార్మినారు
నానీలు,నల్గొండనానీలు,విశాఖనానీలు, గుంటూరు నానీలు , డిల్లీ నానీలు,హైదరాబాదు నానీలు,కడపనానీలు, కళింగ నానీలు,అమెరికా నానీలు, , న్యూజిలాండ్ నానీలు, సీమ నానీలు,నెల్లూరు నానీలు మొదలైనవన్నీ ప్రాంతీయ స్పృహతోనూ, విశేషాలతోనూ వెలువడ్డాయి. .
అదే విధంగా నానీలు ముక్తకాలు అయినప్పటికీ కొందరు కవులు , ఏక వస్తువుతో నానీలు రాసినారు, “సాహిత్య నానీలు, నానీల్లో సినారె, సునామీ నానీలు, దళిత నానీలు,నీటి నానీలు,నేతన్న నానీలు,నానీల నాన్నపై నానీలు, అనాథ నానీలు, కవిత్వ నానీలు, తెలంగాణ నానీలు
రైతు నానీలు,బడి నానీలు,బంజారా నానీలు మొదలగునవి .ఇవేగాకుండ, సబ్బని శారద – లక్ష్మీనారాయణ దంపతులు కలిసి పుస్తకం వేసిన. ” దంపతి నానీలు” ప్రత్యేకమైనవి .
ఇంకా, “,అడవి కూనలు,వెలుగు పూలు,చిటికెలు,బుడ్డ పర్కలు,నెమలీకలు, మట్టి ముత్యాలు, గులకరాళ్లు,బత్తీసలు,చిగిరింతలు, ముంజలు,పల్లెపుంతలు,చెమట చుక్కలు, పిచ్చుక గూళ్ళు, మెరికెలు,నడిచే నక్షత్రాలు,బుర్క పిట్టలు,గోరు కొయ్యలు, రైలు కిటికీలు….ఇట్లాంటి నానీల సంకలనాలు ఎన్నో వెలువడ్డాయి.
కాల క్రమములో గోపి గారి నానీలు 12 భారతీయ భాషల్లోకి అనువాదం కూడా అయ్యాయి.
ఉదాహరణకు కొన్ని నానీలు ::
నాగిశెట్టి తాతయ్యనాయుడు నానీ
“పెదవులకు
రంగుతో పనేముంది?
చిరునవ్వును
పులుముకున్నాక ! “
సబ్బనినాని “హృదయం
మేఘావృతం అయ్యింది
ఇక కవితల జల్లులు
కురుస్తయేమో “
౩. నానోలు :
‘నానోలు’ తెలుగు లఘు కవిత్వంలో ఉన్న రూపాల్లోకి సూక్ష్మమైన కవిత్వం.. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం, ఆ పదం సరళమైన సమాసం లేదా సంధి అయినా సరే, ఇది ఈ ప్రక్రియ వ్యాకరణం అన్నారు నానోల రూప శిల్పి ఈగ హనుమాన్ గారు.
అనగా నాలుగు స్వతంత్రమైన పదాలతో, పాదానికొక్క పదముతో నాలుగు పాదాలలో ఇమిడి ఉండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మాతి సూక్ష్మ కవిత నానో.
నానో అంటే భౌతిక శాస్త్ర పరిభాషలో అతి చిన్న శూక్ష్మాతి సూక్ష్మమైన కవిత. పొడవును కొలువడానికి ప్రమాణం మీటర్ గా తీసుకుంటారు, దాని తరువాత చిన్న కొలత , సె.మీ., మి.మీ., తర్వత మైక్రో మీటర్ , ఇంకా అతి చిన్న కొలతప్రమాణం నానో మీటర్ అంటే 10 (-9 ), 10 to the power of minus 9 . ఇది పొడవును కొలవడములో అతి సూక్ష్మమైన కొలత. ఈగ హన్మాన్ గారు యువ ఇంజనియర్, సైన్స్ విద్యార్ధి పైగా కవి, అతడు అలోచించి కవిత్వం ఉంది, మినీ కవిత్వం ఉంది ఇంకా సూక్క్ష్మాతి సూక్ష్మంగా అతి తక్కువ పదాలతో కవిత్వం రాయవచ్చు కదా అనే ఆలోచనతో నానో కవిత్వాన్ని సృష్టించారు. ఇది వారి మెదడుకు పుట్టిన బిడ్డ. ఎవరినో కావాలని అనుకరించి రాసింది, సృష్టించింది కాదు. నాలుగు పదాలతో నాలుగు పాదాలలో ఒక కవితకు రూపం ఇవ్వాలనే తపన లోంచి ఈ నానోలు పుట్టినాయి. నానోలు రాయడానికి అక్షర నియమాలు అని ఏమీ లేవు, శీర్షిక కూడా ఉండదు అన్నీ నానోల పేరు కిందే వస్తాయి. పదాలు విడివిడిగా ఉన్నా అంతర్లీనంగా ఒక భావ సమైక్యతను కలిగి ఉండడం అనేది నానోల లక్షణము. నానో కవిత్వానికి కూడా వస్తువు విశ్వ వ్యాప్తం కాదేది కవిత కనర్హం అన్నట్లుగా. ఇంకా ఏక వస్తువు అంశాముతో కూడా నానో సంకలనాలు వచ్చినాయి. అందుకు సబ్బని లక్ష్మీ నారాయణ “తెలంగాణ నానోలు”, “సాహిత్య నానోలు” ఉదాహరణలు.
 ఈగ హనుమాన్ గారు మొదటగా వేసిన నానోల పుస్తకం: నానోలు కవిత్వం X 10 (-9) ( Naanolu Kavithvam X 10(-9) 10 to the power of minus nine ) అనే పేరుతో 2005 వ సంవత్సరం లో వచ్చింది.
ఈగ హనుమాన్ గారు మార్గములో విశేషంగా నానోలు రాసిన వారు ఉన్నారు. ఇంటర్నెట్లో నానోల బ్లాగులు కూడా ఉన్నాయి. ఫేస్బుక్ లో నానోల గ్రూప్లు కూడా ఉన్నాయి. అత్యధికంగా న్నానోలు రాసిన కవిగా శ్రీ నూతక్కి రాఘవేందర్ రావు గారి గురించి చెప్పాలి,వారు 10,౦౦౦ వరకు నానోలు రాసినారు. బొమ్మరాతి ఎల్లయ్య గారు మంచి నానోలు రాసి పుస్తకం కూడా వేసినారు. సబ్బని లక్ష్మీనారాయణ గారు తెలంగాణ అంశముతో ‘తెలంగాణ నానోలు’( 2009), సాహిత్యకారులపై “ సాహిత్య నానోలు”( 2016), మరియు “అక్షరాణువులు” ( 2017)అనే నానోల సంకలనాలు వెలువరించారు. నానోల పై వారి కృషికి గుర్తింపుగా, 2016 వ సంవత్సరములో వారికి, “ఆంధ్ర సారస్వత సమితి” మచిలీపట్నం వారు నానోల పురస్కారం అందించినారు. గతములో బొమ్మరాతి ఎల్లయ్య గారు, నూతక్కి రాఘవేందర్ రావు గారు నానోల పురస్కారం పొంది ఉన్నారు.
ఇంకా పోతగాని సత్యనారాయణ, గరికపాటి మణిందర్, కాకరపర్తి పద్మజ, ఎస్. ఆర్. పృథ్వీ ,కొట్టి రామారావు, ఆర్.వి.ఎస్..ఎస్. శ్రీనివాస్, బొబ్బిలి జోసెఫ్, భీంపల్లి శ్రీకాంత్, వల్లభాపురం జనార్ధన, బిట్రా నాగ మల్లేశ్వర రావు, మాధవరావు కురుప్రోలు, రాజ శేకర్, వాల్మికి వడ్దేమాని, రాధికా కేశవ దాస్, తొడుపునూరి లక్ష్మీ నారాయణ, ఆదిగా గల వందమంది కవులకు పైగా నానోలు రాసున్నారు విశేషంగా పత్రికల్లోను, అంతర్జాలం లోను.
నానోలు అని రాసే వాళ్ళు ఒక్క విషయాన్ని గమనించాలి, ఒక వాక్యాన్ని నాలుగు పదాలుగా విడగొట్టి చెపితే అది నానో కాదు. నానో చదివినపుడు అది వాక్యములా స్పురించకూడదు. అది నానో అవునో కాదో గుర్తించడానికి ఇది మంచి లక్షణం.
ఉదా:’ చదువు/ అందరిది /ఉద్యోగం /కొందరిది ‘ అన్నాడు ఓ కవి కాని నాలుగు స్వతంత్ర అర్ధవంతమైన పదాలతో లోతైన భావముతో నానో రాయాలి అని కవికి తెలిసి ఉండాలి. కాని ఇందులో పెద్ద జీవిత సత్యమో, తాత్త్విక బావననో, కవిత్వ సౌందర్యమో, ధ్వనో కనబడే విశేషం ఏమీ లేదు కవిత్వం అని చెప్పడానికి. కవిత్వం అని చెప్పినపుడు కొంత పోలికతో చెప్పాలి, అర్ధవంతమైన భావనతో,సౌందర్యాత్మకంగా మంచి శిల్పంతో చెప్పాలి . అలా చెప్పినపుడే మంచి నానోలు పండుతాయి.
నానోను నానో పరిభాషలో, నా భాషలో చెప్పాలంటే
“నవ్యత / నాణ్యత/ గాఢత / నానో “ అనవచ్చు.
“అక్షరం
తపస్సు
కవిత్వం
అమృతం”- సబ్బని
      …
“మనిషి
మనసు
నిర్మలం
ఆరోగ్యం”
పై నానోలను గమనిస్తే పదాలు మద్య ఒక అంతర్లీనత, ఒక సంబంధం , ఒక భావన, ఒక పరిశీలన కనిపిస్తుంది.
కాకరపర్తి పద్మజ గారు
“జీవితం
పలక
కాలం
బలపం “
వాల్మీకి వడ్డెమాని :
“పక్షి
శోకం
వాల్మికి
శ్లోకం “
“కవిత / సూక్ష్మం / భావం / అనంతం”- సబ్బని
నానో స్వరూపాన్ని చూపే నానో ఇది.
వస్తువు ఏదైనా, తీసుకున్న అంశం ఏదైనా దానిని ప్రతిభావంతమైన నానోగా మలిచే సామర్థ్యం ఉండాలి కవికి
నానోలు పుట్టి ఒక పుష్కర కాలం దాటింది. అది చాలా మంది యువ కవులను విశేషంగా ఆకర్షించి నానో కవిత్వం రాయిస్తుంది.
4. రెక్కలు :
రెక్కల గురించి చెపుతే అది అంతా ఆశామాషిగా రాసే కవిత్వం కాదు. కవితలకి రెక్కలస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీ లోకములో. భావస్పోరకంగా, చిక్కగా, తాత్వికంగా, బతుకు లోతుల్లోంచి అనుభవ సత్యాలను వెలువరించే కవితా ప్రక్రియ రెక్కలు. వాల్మీకి రాసినా, బర్త్రుహరి రాసినా, వేమన రాసినా ఊర్కే రాయలేదు. బతుకు మూలాల్లోంచి జీవన సారాన్నిమధించి రాసారు. అలా రెక్కలను సృష్టించాలనుకొంటే అంత జీవితావగాహన, బతుకు మర్మము ఎరిగి ఉండాలి. అలా రెక్కలను అధ్బుతంగా సృష్టించిన వారు సుగమ్ బాబు గారు. 2౦౦౩ సంవత్సములో” రెక్కలు – వచనాలు “ వారు తొలుత ప్రచురించారు. సుగం బాబు గారు వచనాలు అని రాసి వాటిని పక్షుల్లా ఎగిరే చిన్న కవితలని, వాటిని రెక్కలు అని పేర్కొంటూ పుస్తకం ప్రచురించారు. రెక్కలు ఆరు పాదాలలో ఉండే చిన్న కవితలు. మొదటి నాలుగు పాదాలలో విషయాన్ని చెప్పి, ఆ నాలుగు పాదాల సారాన్నంత చివరి రెండుపాదాలలో ఇమిడ్చి చాలా లోతుగా కవితను పూర్తిచేయడం. వారు వందల సంఖ్యలో అద్భుతమైన రెక్కలు రాసినారు. సుగమ్‌ బాబు రాసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌గారు ఆంగ్లంలోకి అనువదించారు “వింగ్స్ “అనే పేర. తర్వాత కాలంలో మోపిదేవి రాధ కృష్ణ గారి ‘కాంతి కెరటాలు’ రెక్కల పుస్తకం వచ్చింది. సుగం బాబు గారు, మోపిదేవి గారు రాసిన రెక్కల స్పూర్తితో సబ్బని లక్ష్మీనారాయణ తెలంగాణ కావ్య వస్తువుతో “ తెలంగాణ రెక్కలు” అనే పుస్తకాన్ని రాసి, సినారె, సుగంబాబు గార్ల ముందుమాటతో 2010 సంవత్సరములో ప్రచురించారు. చీరాలకు చెందిన శ్రీనివాస గౌడ్‌ ‘వెలుతురు వెలయాలు’ రెక్కలు పుస్తకం వెలువరించారు. పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011) లో ప్రచురించారు. , మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- సంపుటం ప్రచురించారు. సుగంబాబు గారి స్పూర్తితో కాలక్రమములో కైలాసపతిరావు, పద్మకళ,మల్లవరపు చిన్నయ, ద్యావర నరేందర్ రెడ్డి, రుద్రారం శ్రీనివాస రెడ్డి, నందవరం కేశవ రెడ్డి, వంగర పరమేశ్వేర్ రావు , దుగ్గిరాల సోమేశ్వెర్ రావు ఆది గాగల 150 మంది కవులు రెక్కల కవిత్వం రాస్తున్నారు.
ఏక వస్తువు ప్రదానంగా కొద్ది కాలములో రెక్కల పుస్తకాలు రానున్నాయి. అవి: చాణక్య నీతి – పి. వీరా రెడ్డి, రెక్కల్లో గీతాంజలి – డి. హనుమంతరావు, రెక్కల్లో గీతామృతం – డా. కేతవరపు రాజేశ్వరి. రెక్కల పందిరిలో భజగోవిందం – మోపిదేవి రాధా కృష్ణ. ఇవన్నీరెక్కల్లో ప్రయోగాత్మకంగా రాయబడే మంచి పుస్తకాలు.
జీవితాన్ని తపస్సులా భావించిన వారు మాత్రమే అద్భుతమైన రెక్కలు రాయగలరేమో. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బుద్ధుడి జీవనసారం “ ధమ్మపదం”. లోని విషయాలను రెక్కల్లో సులభంగా , హృద్యంగా మన కందించారు సుగమ్ బాబు గారు, రెక్కల రూప శిల్పి . అలానే వివేకనందుని జీవితం పై కూడా రెక్కలను రాసి పుస్తకం వేశారు వారే.
సుగంబాబు గారి ‘దమ్మ పథం ‘‘ లోని కొన్ని రెక్కలను పరిశీలిస్తే చాలా లోతైన తార్కిక భావనలు అవి. బుద్ధుడి జ్ఞ్యానబోధనలను సులభంగా అర్ధవంతంగా మనకు రెక్కల్లో అందించారు సుగమ్ బాబు గారు.
 ‘ పగతో శత్రువు
 చేసే పని కన్నా
 దారితప్పిన మనసు
 చేసే కీడు అధికం –
అయినవారి కన్నా
మంచిబుద్ధి మిన్న’ అంటారు.
ఇంకా కొన్ని రెక్కల్లో :
‘సువాసన పంచె ‘
అందమైన పూలపై
 వాలి తుమ్మెద
 మకరందం గ్రోలినట్లు –
 గ్రామాల్లో బతకాలి
 భిక్షువు ‘ అంటారు
 ‘ గాలికి
 కదలదు కొండ
 నిందాస్తులకు
 జంకడు జ్ఞ్యాని-
నిర్మల కాసారం
మేధావి చిత్తం ! ‘అంటారు
.ఆ రెక్కల కవిత మార్గములో ఇటీవలి కాలములో వెలువడిన మంచి రెక్కల పుస్తకం మోపిదేవి రాధ కృష్ణ గారి ‘కాంతి కెరటాలు’ ఒకటి.
ఏదయినా అనుభవించి పలువరించమన్నాడు మహాకవి శ్రీ శ్రీ. అలా అనుభవించి పలువరించినవే మోపిదేవి రాధ కృష్ణ గారి రెక్కలు.
ఆ రెక్కల్లో కొన్ని:
‘ వ్యసనాలు
మనిషిని
పీక్కు
తింటాయి
…
జీవితం
బలి పశువు.’ అంటారు.
బతుకును తిర్చిదిద్ధుకొనే, లేదా ధ్వంసం చేసుకొనే వీలు ఎవరికి వారి చేతుల్లోనే ఉంది అనే సత్యం ఉంది పై రెక్కలో .
ఇంకో రెక్కలో,
‘ గొప్పగా ఎదిగానని
ఇగోను
పెంచుకుంటే
మూర్ఖత్వమే—
వ్యక్తిత్వమే
రత్న కిరీటం’ ఇది అక్షరాలా సత్యం మేము గొప్పవాళ్ళమని విర్రవీగే మనుషులకు, వర్తిస్తుంది వ్యక్తిత్వం ఉండాలని చెపుతూ ఈ రెక్క .
ఇంకో రెక్కలో,
‘ స్వయంకృషితో
పొందిన
ఆనందం
వర్ణనాతీతం
తేనెటీగల శ్రమే
తేనే’ ఎంత గొప్ప మాట ఇది. బతుకు ఎవరికి వారు తిర్చిదిద్దుకోనేది, స్వయంకృషితో అందుకొనేది.
బతుకు ఒక మధువనం, మంచివాళ్ళ సృష్టి లోకహితానికి.. రామాయణమైనా, మహాభారతమైనా, ఖలీల్ జిబ్రాన్ కవితలైనా, వేమన పద్యాలైనా, బర్త్రుహరి సుభాషితాలైనా గొప్ప సందేశాలు కదా! ఇలా చెప్పుకుంటూపోతే రెక్కల్లో జీవిత సత్యాలను ఆవిష్కరించారు వారు.
‘ ఈ
మట్టిపై
మమకారం ఉన్న
ప్రతి ఒక్కరిని
ఆదరించే అమ్మ
తెలంగాణ !’ – అంటాడు సబ్బని
ఇలా రెక్కలు సుసంపన్నమైన చిరు లఘు కవితలు ఆధునిక తెలుగు కవిత్వములో, తిరుగు లేని సత్యం . రెక్కలు రాసి పండించిన వారు ధన్యులు నిజంగా. తెలుగులోకి రెక్కల ప్రక్రియను ప్రవేశపెట్టిన సుగంబాబు గారు ఆదరణీ యుడు సర్వదా.
5. ఏకవాక్య కవితలు
  క్లుప్తత, గాఢత కవిత్వానికి కావలసిన ప్రధాన లక్షణాలు. గాఢత అధికమవుతూ, క్లుప్తత ఎంత పెరిగితే – అంత కవిత్వం స్థాయి ప్రతిఫలిస్తుంది. అలా “మినీ కవిత్వం” సాహిత్య ప్రక్రియలలో తన ప్రత్యేకతను చాటుకొంటూ వచ్చింది . ఆ క్రమం లోనే “హైకూలు”, ” నానీలు”, “రెక్కలు”, ” ఏక వాక్య కవితలు” వంటి మినీ కవితా ప్రక్రియలు అశేష ప్రజాదరణకు నోచుకున్నాయి .
ఈ సందర్భంగా మహాకవి కీ. శే. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఒక మాట చెప్పుకుందాం. ” విశిష్టమైన భావం,విశిష్టమైన భాష తన రక్తములో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు”- శేషేంద్ర ఇక 14 వ శతాబ్దపు ప్రాచీన ఆలంకారికుడు విశ్వనాథుని – “వాక్యం రసాత్మకం కావ్యం” అన్న నిర్వచనం స్ఫూర్తితో 1998 – 2000 సంవత్సరాల ప్రాంతంలో, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా డా. ఆచార్య ఫణీంద్ర గారు, “ఏక వాక్య కవితల” ను రచించి ప్రవేశ పెట్టడం జరిగింది. 2002 సంవత్సరంలో వారి “ఏక వాక్య కవితలు” విజయవాడలోని “ఎక్స్ రే” సంస్థ పురస్కారం పొంది, తొలి గుర్తింపును పొందాయి. 2004 లో అవి “వాక్యం రసాత్మకం” పేరిట గ్రంథ రూపం దాల్చాయి. పండిత పామరులను విశేషంగా ఆకర్షించిన ఆ “ఏక వాక్య కవితలు” 2009 లో ఆంగ్లంలోకి “Single Sentence Delights” అన్న గ్రంథ రూపంలో అనువదింపబడి, ప్రముఖుల ప్రశంసల నందుకొన్నాయి. ఈ ఏక వాక్య కవితలు వెలువడడానికి. కొన్ని దశాబ్దాల క్రితమే (సుమారుగా 90 ఏళ్ల క్రితం ) విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఈ ఏకవాక్యకవితలకు అంకురార్పణ చేసారు, “Stray Birds” అనే ఆంగ్ల సంకలనం ద్వారా. ఇటీవలి కాలములో కేతవరపు రాజ్య శ్రీ గారు ఆ పుస్తకాన్ని ” వెన్నెల పక్షులు ” పేర తెలుగు లోకి అనువదించి పుస్తకం వెలువరించారు.
ఆ తర్వాతి కాలంలో ఎందరో యువ కవులు, కవయిత్రులు “ఏక వాక్య కవితల” ను రచించడం ప్రారంభించారు. అంతర్జాలంలో “ఏక వాక్యం”, ” ఏక్ తార” వంటి “ఫేస్ బుక్” గ్రూపుల ద్వారా వందల్లాది మంది వేలాది “ఏక వాక్య కవితల” ను సృజించారు. సృజిస్తున్నారు. ముఖ్యంగా యువకవి R.V.V.S. శ్రీనివాస్ గారు మూడు వేలకు పైగా “ఏక వాక్య కవితల” ను రచించి, “శ్రీవాక్యం”, “శ్రీవాక్యం – 2” పేరిట రెండు గ్రంథాలను వెలువరించారు. “సిరిమల్లెలు” పేరిట రచయిత్రి “సిరి వడ్డే” గారు, “పూల పిట్ట” పేరిట శ్రీమతి “స్వర్ణలతా నాయుడు” గారు తమ “ఏక వాక్య కవితల” గ్రంథాలను పాఠక లోకానికి అందించారు. వివిధ కవులు, కవయిత్రుల “ఏక వాక్య కవితల” ను సంకలన పరచిన గ్రంథాలు కూడ ఒకటి, రెండు వెలువడ్డాయి.
అదే వరుసలో 2017 సంవత్సరము ఎప్రిల్ మాసం లో – శ్రీ “సబ్బని లక్ష్మీనారాయణ” గారు “ప్రేమ స్వరాలు” పేరిట తమ “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని మరియు మే మాసములో “ అక్షర సౌరభాలు “ అనే మరో “ఏక వాక్య కవితల” పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. .
“నీ ఒక్క చూపులో వెయ్యి కృతజ్ఞతలు, వెయ్యి స్వాగతాలు” “బతుకు పుస్తకంలో అపురూపంగా నువ్వొక నెమలీకలా!”
“నీ కళ్ళలోకి సూటిగా చూశాను – రెండు భూప్రపంచాలు!”
“నువ్వు ప్రవహిస్తున్న నదివి – నది అంచులను ముద్దాడుతున్న తీరాన్ని నేను!” మొదలైన “ఏక వాక్య కవితలు” సబ్బని ప్రేమ స్వరాలు ” లోనివి
చివరగా : కవిత్వం ఎప్పటికి కాలక్షేపానికి రాయబడకూడదు. కవిత్వానికి కొంత ప్రయోజనం ఉంటుంది. కవిత్వానికి నిర్మాణ శిల్పం ఉంటుంది. ఆ విషయాలు తెలిసి ఉండాలి కవులకు.
లేకుంటే కవిత్వం రాయడం ఈజీ అని బ్రమసి పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలుగు లైన్లలో రాస్తే నానీ, మూడు లైన్లలో రాస్తే హైకూ , నాలుగు పదాలతో రాస్తే నానో, ఆరు లైన్లలో రాస్తే రెక్కలు, ఒక్క వాక్యంలో
రాస్తే అది ఏకవాక్య కవిత అని అనుకోని రాసే క్రమములో కవులు ఉంటే వాళ్ళు మంచి కవిత్వాన్ని రాయలేరు, తెలుగు కవిత్వ సీమను సుసంపన్నం చేయలేరు. కవిత్వం అర్ధవంతమైన ,ఒక స్వతసిద్ధమైన ధార.
సుప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ చెప్పినట్లు, కవిత్వం ఒక ఆల్కెమి దాని రహస్యం కవికే తెలుసు ,” పెద్దనకు తెలుసు, శ్రీశ్రీ కి తెలుసు శ్రీనాథుడికి తెలుసు అన్నట్లు”,. కవులు ఈ రహస్యాన్ని గుర్తెరిగి కవిత్వ రచన చెయ్యాలి , అవి హైకూలైనా, నానీలైన, నానోలైనా, రెక్కలైనా, ఏకవాక్య కవితలైన, వచనకవితలైనా, దీర్ఘకవితలైనా అప్పుడే అవి కవిత్వమై వ్సర్ధిల్లుతాయి జనులను అలరిస్తాయి, ఆనంద పరుస్తాయి, జనులచే కొనియాడబడుతాయి.
February 28, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కరొనా ఎఫెక్టు

by swarnalatha February 28, 2022
written by swarnalatha

తాతగారూ! మాకు ఓ ఒక మంచి కధ చెప్పరూ!
సరేరా పిల్లలూ !మనకు మంచి అవకాశముఈ లాక్ డౌన్ సెలవులు. రండి.డిస్టెన్స్ పాటిస్తూ అందరూవచ్చి కూర్చోండి..
సరే తాతగారూ అంటూ బిల బిలా వచ్చి చేరారు పిల్లలు..
అనగా అనగా ఓ రాజు
తాతగారూ’! తాతగారూ! మాకు ఆ రాజుల కథలు వద్దు .
మీకు ఎలాంటి కథలు కావాలి?
మాకు జంతువుల కథలు కావాలి
.సరే సరే.
ఓ వీధిలో కుక్క ఎంతో ఠీవిగా చెవులను నిక్క పొడుచుకొని తోకను నిటారుగ ఎత్తి రోడ్డు అంతా తనదే
అన్నట్టుగ నడవసాగింది.
.అటుగావస్తున్న పిల్లి దాని ,పిల్లలు నవ్వుకోసాగాయి.
ఏమిమిత్రమా నవ్వు కొనుచున్నారు?
లేదుమిత్రమా మీ రాచఠీవి చూచి ముచ్చటపడుతున్నాము.
అవును మిత్రమా, మా బతుకులనుచూచి ఏమి కుక్క బతుకురా అనిఅనుకొనేదాన్ని.ఈకరోనా అనే వైరసు వల్ల మనుష్యులంతా ఇంటి కే పరిమితమైనారుమనకు మంచిగా స్వేచ్చ దొరికింది .లేచింది మొదలు స్కూళ్ళ బస్సులు ,కార్లు అనేక రకమైన వాహనాలు వాటి నుండి వచ్చేపొల్యూషన్ తో ఉక్కిరిబిక్కిరై ఎన్నో కష్టాలు పడ్డాం . ఎప్పుడుఏ ట్రక్కు వచ్చి మననుఎక్కించుకు పోయి ప్రాణాలకు హాని తలపెడతారోనని ఎక్కడెక్కడో తప్పించుక తిరగాల్స వచ్చేది .ఇప్పుడు హాయిగా ఉంది .
మిత్రమా అల్పాహారం అయినదా?
లేదుమిత్రమా !ఇదివరకు పనుల తొందరలలో మనుష్యులు చాలా తినుబండారాలను వదలివేసేవారు ప్రస్తుతం వారికి పని పాటా లేక తినడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు
గిన్నెలు కంచాలు శుభ్రంగా నాకి పెడుతున్నారు. పాలు ,పెరుగు, పుష్కలంగా దొరికేవికాఫిలు ,టీలు పెరుగు ,అన్నాలు ఎక్కువగ తింటున్నారు మన పిల్లలు ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు.
అటుగా వచ్చిన ఎలుక ఛీ ,ఛీ ఇక మన బ్రతుకులు మారవా ?ఎంగిలి మెతుకులు తిని బతకాల్సిందేనా? ఈ కరోనా వైరసు ఎవరెవరికి ఉందొ మన కేం తెలుసు .నేనుఇప్పుడే రైతుబజారువద్ద నుండి వస్తున్నాను .అక్కడ ఒక్క మనిషి కూడా లేడు.కుప్పలు కుప్పలు గా కూరగాయలు రకరకాలైన పండ్లు ఉన్నవి.మనమందరంకలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ తినివద్దాం రండి.ఇంతలో ఓ కోతి నవ్వుతూ అక్కడికి చేరింది
ఏం కోతిబావా అలా నవ్వుతున్నావు?
ఏం లేదు కుక్కబావా !ఈ మనుష్యులు ఎంతో బిజీ బిజీ గా తిరిగేవాళ్లు కదా ఈ లాక్డవును తో ఇండ్ల లోనే ఉండి ఉండి నాలాగ గంతులు వేసుకుంటూ నీ లా భౌ భౌ అని పిల్లిలా మ్యావ్ మ్యావ్ అనిఅరుస్తారేమో న ని అలా వారిని ఊహిం చు కుంటే చాలా నవ్వువస్తుంది అనిఅదే పనిగా నవ్వసాగింది
చాలు చాలు బావా! ఊరుకో! నీ కోతి బుద్ది పోనిచ్చుకోవుకదా!
ఎలుక “నాకు ఓ సందేహము “అంది .
అడుగు అడుగు అంటూ ముక్తకంఠముతోఆతృుతగా అడిగాయి జంతువులన్ని.
ఈ మనుష్యులంతా వేల సంఖ్యలలో చనిపోతుంటే మనంఇలా స్వేచ్ఛగా తింటూ తిరుగుతుంటే వారికంటె మనవారి సంఖ్యపెరిగిపోతుందికదా ?
కరక్టేకదా !మనను ఎలా కిరాతకంగా చంపుతున్నారు ?చెట్లను ఎలా నరుకుతున్నారు.? చెరువులను ఎలాఆక్రమిస్తున్నారు ?డబ్బుకొరకు ఎన్నెన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. పూర్వము కోడికూతలు ,ఆకాశంలో పక్షుల కిలకిలలు,కోకిలలకుహూకుహూలు ,నెమళ్ళనాట్యాలతోఎంతోహయిగా ఉండేవి.
ఆ రోజులుమచ్చుకైన కానరావు ఇప్పుడు.పాపంపెరిగిపోతుందని చెప్పసాగింది కుక్క.
మరిమనకు ఇలాంటి రోగం రాదా మామా?ముక్తఖంఠం తో అడిగారు.
“మానవులు వారిలో వారే ఒకరి. నొకరు చంపుకుంటారు మనంఅలాకాదు వేరేజాతి జంతువులను చంపుతాము. “వారికి డబ్బు పై మమకారం ఎక్కువైఎదుటివారి నాశనాన్న కోరుతారు ఎలాగంటే చైనా వారు అమెరికావారిని నాశనం చేసే ప్రయత్నం లో వారు నాశనంఅయినారుమిగతా అన్ని దేశాలనుా అపారంగా నష్టపరిచారు.
మనకు అలాంటి పరిస్తితి రాదు.
వారికి సుఖాలపై మక్కువ ఎక్కువ కారులో నుండి కాలుక్రిందపెట్టరు. ఏ సి గదులనుండి బైటకు రారు మనకుఅవి అవసరము లేదు మనము ఎంత దూరమైనా కాలి నడకతోనే వెళ్ళగలుగుతాము
ఆరు బయట నద్రిస్తాము ఆకలి అయినప్పుడు మాత్రమే దొరికిన కొంచము ఆహారం తోనేతృప్తి గా ఉండగలుగుతాము.మాంసము తింటే క రోన వస్తుందని తెలిసిందిగా మనం ఒకరినివొకరం చంపి తినటాలు మానుదాంకలసి మెలసి ఉందాం.మనకు రమ్మన్నా రాదు కరోనా.
ఇదిఅంతా విన్న చిన్న పిల్లిపిల్ల తల్లి చాటుగా దాక్కొని అమ్మా అమ్మా ఈ కుక్క మామ చెప్పినదంత నిజమేనా మనను దూరంనుండి చూస్తేనే భయంకరంగా అరుస్తూ వెంబడించేది ఎలుకలు మనను చూస్తేనే ఆమడదూరం పరిగెత్తేవి ఇలాఏలా కలుస్తాము ?
అటుగావస్తున్న ఏనుగు తన మూతికి మాస్కుధరించినది చూసి ఈ జంతువులు అన్నీ ఆశ్చర్యం గా ఏమిటి మామాఇది ?
ఏమీలేదు స్నేహితులారా!ఇప్పుడే తెలిసిన వార్త అమెరికా జూ లో ఓ పులికి కరోనాలక్షణాలుబయటపడ్డాయనట. మానవుల లాగా అశ్రద్ద చేయకుండ మనమందరం ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని మన రాజుగారైన సింహం గారి ఆజ్ఞ .జంతువుకు జంతువు దూరంగా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలన్నది ఎక్కువగ తిరగరాదని వీటిని పాటించని జంతువును కఠినంగా దండిస్తారనితెలుపమన్నారు. భయంభయంగా సరే సరే అని ఎవరి దారినవారు వెళ్ళిపోయారు.
పిల్లలూ ఈ కథ వలన నీతి.ఎదుటి వారి పై అసూయ పడకూడదు .ఎవ్వరి నాశనాన్ని కోరకూడదు.కుక్క ఎంత గర్వం గా మాకు రోగము రాదు అందిచివరకు తోక ముడిచింది.
ఏపనిఐనా సరియైన సమయంలోనే చెయ్యాలి లేకుంటె మంచి ఫలితం దొరకదు.
ఇదేనీతి

February 28, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

సమాజానికి మేలుకొలుపు పాడిన శతకం

by కూకట్ల తిరుపతి February 28, 2022
written by కూకట్ల తిరుపతి

స్వేచ్ఛా కవి వేణుశ్రీగారి పద్యం కేవలం పద్యం మాత్రమే కాదు. కారు చీకట్లను చీల్చే మయూఖం. ప్రకృతిని పరవశింప జేసే మయూరం. ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. చురుక్కుమనే వాతలు. మేలుకొలుపు గీతలు. సశాస్త్రీయతను చాటే చేతలు. అశాస్త్రీయతకు తోచే కోతలు. ఆలోచనల కలల అల్లికలు. అద్భుతమైన ఆవిష్కరణ జ్యోతులతో సుదర్శనం వేణుగోపాలాచార్య గారి పద్యం ధగద్ధగాయమానంగా మెరుస్తూ ఉంటుంది. ఆయన పద్యానికి అస్థిత్వం ఉంటుంది. పల్లె సొగసును ఆరబోస్తుంది. పట్నం పోకడను పట్టి చూపుతుంది. ప్రపంచీకరణ పీడను ఎత్తి చూపుతుంది. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొడుతుంది. తాడిత పీడితుల ఎతై వలపోస్తుంది. పండిత పామర జనాన్ని పలకరిస్తుంది. ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. సమసమాజాన్ని కాంక్షిస్తుంది. నవ సమాజాన్ని నిర్మిస్తుంది. ఆయన జీవభాషా పటిమతో, భావ సంపదతో, శైలీ విన్యాసంతో పద్యాల పంటను పండించారు. వాసిలో వాటిని శతకంగా రాశి పోశారు. ఈ మట్టివాసన గలిగిన పద్యాలను ఆస్వాదిద్దాం. ఇప్పటికే వేణుశ్రీగారు వరేణ్య శతకం, ఓ ప్రచేతసా శతకంలను అందించారు. ఇందులో వరేణ్య శతకం ద్వితీయ ముద్రణ పొందింది. వేణుశ్రీగారి మనుమల పేర్లు వరేణ్య, ప్రచేత్, కైరవ్. వారిని సంబోధిస్తూ సామాజిక శతకాలు రాయడం హర్షణీయం. ఇప్పటి పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు అర్థవంతమైన పేర్లను పెట్టుకోవడం లేదు. తన కొడుకులకు, మనుమలకు వేణుశ్రీగారు చక్కటి పేర్లు పెట్టారు. స్వేచ్ఛ-1, ప్రజాభారతం, స్వేచ్ఛ-2 వచన కవితా సంపుటాలను అచ్చేశారు. విస్తృతమైన రచనానుభవంతో రాసిన కైరవ శతకంలోకి వెళదాం.
“వ్యవసాయదారుల వ్యథలింక తీరునా/ పాలకులెందరో వచ్చినారు/ స్వాతంత్ర్య మొచ్చియు చాలేండ్లు గడిచిన/ ఎవరొచ్చినా యింకా ఇడుముల బడి/ఉండుటే నూతన ఊబి చట్టాలతో/రైతుల బతుకులు రచ్చకెక్కి/చేటు కాల్గునటంచు చెప్పిన వినకుండ/కాలయాపన చేసి గడుపుటేల/కంపెనీ వస్తు ధరలను కంపెనీలె/నిర్ణయించి లాభాలకై నియమముండ/పంట పండించి రైతులె పైక మింత/యనియు చెప్పేటి చట్టాలు యవతరించ/రైతు సేద్యానికింకను రక్షణుండు/తాత మాటలు కైరవా!తరగని నిధి” అంటూ దేశానికి అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్రా! అని అఘోరిస్తున్న తీరును కవి వేణుశ్రీ గారు కళ్ళకు కట్టించారు. గత డెబ్భై యేండ్లుగా ప్రభుత్వాలు ఐదేండ్ల కొకసారి మారుతూనే ఉన్నాయి. ఎవరొచ్చినా సైరికుల బతుకులు మాత్రం ఎప్పటి చిప్ప ఎనుగులో పడ్డట్టుగానే ఉన్నాయి. పరిశ్రమల్లో తయారయ్యే వస్తువులకు ఆ కంపెనీదారుడే ధరలు నిర్ణయిస్తాడు. లాభాలు ఆర్జిస్తాడు. ఇక్కడ రైతు పండించిన పంటలకు మాత్రం రైతుకు ధరలను నికరం చేసే అధికారం లేకపోవడం గమనార్హం. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు తిరిగిరావు. అప్పుల కుప్పలు తీరయి.  ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరనైనా కట్టుదిట్టంగా అమలు కాదు. ధాన్యాన్ని కాజేసే దళారులే దర్జాగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య మూడు నూతన సాగు చట్టాలను తేవడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది రైతుల పరిస్థితి. చట్టాలతో కార్పొరేటులకు రెడ్ కార్పెట్ పరువడం. రైతుల బతుకులను రచ్చకీడ్చడం దారుణాతిదారుణం. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ గ్రామంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపడం పాలకుల నియంతృత్వ ధోరణికి నిదర్శనం. కర్షకుల మెడలకు ఊరితాళ్ళగా పరిణమించిన పెట్టుబడిదారీ పద్ధతులను ధిక్కరించిన ఉద్యమకారుల గొంతులు నొక్కుతున్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులను అరికట్టడంలో ప్రభుత్వం బొత్తిగా విఫలమవుతున్నది. దళారీ వ్యవస్థలో దోపిడీ యధేచ్ఛగా కొనసాగుతున్నది. అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలా పరిణమించింది నేటి వ్యవసాయ రంగ పరిస్థితి. మనది వ్యవసాయిక దేశమని, అన్నపూర్ణయని సగర్వంగా చెప్పుకుంటాం. దేశ జనాభాలో సుమారు ఎనభై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నట్టుగా కనిపించవు. ఇటీవలి కాలంలో స్వాతంత్య్ర భారతానికి అమృతోత్సవాలను కనుల పండుగగా నిర్వహించుకోవడం సంతోషదాయకమే. కానీ అన్నదాతల ఆత్మహత్యలను ఎందుకు అరికట్టలేక పోతున్నామో పాలకులు ఆలోచించాలి. ఇకనైనా రైతు సంక్షేమ పథకాల ప్రచార పటాటోపాన్ని పక్కన పెట్టి, సంక్షోభంలో కూరుకుపోయిన సేద్యాన్ని సంక్షేమ బాట పట్టించడానికి, చిత్తశుద్ధితో పాటు పడాల్సిన అవసరముంది. దాని కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి, వ్యవసాయాన్ని, వ్యవసాయదారులను ఆదుకోవలసిన ఆవశ్యకతను వేణుశ్రీగారు నొక్కి చెప్పారు.

“ప్రతిపార్టి కొకటైన పత్రికుండెను కదా/మీడియా మాత్రము మితము గుండి/ఒకదాని వార్తలు నొకటిగుండవు సుమా/ ఎవరి రాతలు వారె ఎచ్చులుండు/కల్పనా చాతురీ కట్టు కథల తోడ/ వరుస కథనముల వదులు చుండి/జనులయోమయములో చతికిలబడుచుండ/చేయు పత్రికలును చెడును చేయ/ఎట్టి రాజకీయములివి ఎరుగ కుండ/ప్రజల బాగోలింతయు పట్టకుండ/పార్టి వ్రాతలు వ్రాయుట పాడియగునె/చదువరాయను నేర్చిన సారమిదియ/పత్రికల వారి నీతిని పలక తరమ/తాత మాటలు కైరవా! తరగని నిధి”. పత్రికల డొల్లాతనాన్ని తెలుపుతున్న పద్యమిది. మనం పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేటుగా భావిస్తాము. పత్రికలు సక్రమంగా కృషి చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పత్రికల ప్రతి అక్షరం ప్రజా పక్షం కావాలి. ప్రజల గొంతుకై ప్రశ్నించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ అవినీతిని, అధికారుల లంచగొండితనాన్ని ఎండగట్టాలి. కుంభకోణాలను బయటపెట్టాలి. ప్రజాధనపు దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాటుపడాలి. అనునిత్యం జనాలను జాగృతం చేయాలి. “పత్రికొకటి యున్న పదివేల సైన్యము/పత్రికొక్కటున్న మిత్ర కోటి/ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న” అని నార్ల వేంకటేశ్వర రావు పత్రికల గురించి గొప్పగ చెప్పారు.  ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పత్రికల పాత్ర అమేయమైనది. నేటి పత్రికలు పార్టీవ్రత్యంతో పనిచేయడం అత్యంత విచారకరం. ఏదో ఒక పార్టీకి బోయిలాగా వ్యవహరిస్తున్నాయి. ఆయా పార్టీల దిన పత్రికలుగా మారాయి. వ్యాపార వ్యామోహంతో ఆస్తులను కూడగట్టుకుంటున్నాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా దొందు దొందుగానే వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజా సంక్షేమం జరిగేలా చూడడంలో పూర్తిగా విస్మరించాయి. విష పుత్రికల్లాంటి పత్రికలు రాజకీయ పార్టీల కొమ్ము కాయడం వలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. అనేక రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనం కోసం, ప్రచారం కోసం పత్రికలను, పబ్బం గడుపుకోవడానికి, టీవీ చానళ్లను, యూట్యూబ్ చానళ్లను స్థాపించుకుంటున్న స్వార్థపూరిత వైఖరులను మనం చూస్తున్నాము. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య మనుగడకు గొడ్డలిపెట్టు వంటింటి. ఇది నియంతృత్వ పాలనకు పాదులు వేస్తుంది. కాబట్టి పత్రికారంగం ఇప్పటికైన కను తెరువాలి. తన ప్రాధాన్యతను గుర్తెరుగాలి. నిష్పక్షపాతంగా నడుచుకోవాలని, కవిగా వేణుశ్రీగారు కోరుతున్నారు.
“గ్యాసు మొద్దు ధరయు గగనమెక్కుచు నుండె/పెట్రోలు ధరలింక పెరిగిపోయే/పేదమధ్య జనము విలవిలలాడిరి/పాలన రాబడి పక్క చేరు/పాలించు వారికి ప్రజల బాధల గాంచ/పట్టదు వాళ్లకు ప్రభుత సంస్థ/లన్నిటి ప్రైవేటు లాబీయింగులలోన/పెద్దలాప్తులకీయ పెద్దనిధుల/పెట్టి లాభాల చూపక పెరుగు సంస్థ/కార్మికోద్యోగ హక్కులు కాలరాసి/ప్రభుత జీతాల గొడవలు పడకనుండ/జనులునింక ప్రభుత్వ భజనల చేయు/తాత మాటలు కైరవా! తరగని నిధి” నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. దినదినం పెట్రోలు,డీజిల్,గ్యాసు ధరలు అధికమవుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పేదలు పప్పు, ఉప్పులను కొని తినలేని స్థితిలో ఉన్నారు. ఆర్ధాకలితో బతుకులు వెల్లదీస్తున్నారు. ఎల్లియెల్లక బలవంతంగా బతుకు బండి సాగుతున్నది. ఆకలి చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కానీ అసలే తగ్గడం లేదు. చిరుద్యోగుల బతుకులు చిందరవందరగానే తయారయ్యాయి. బీదల చేతికి పనిచ్చి, ఆదాయాన్ని పెంచే ప్రయత్నం జరగడం లేదు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నాయి. గరీబులకు కనీస అవసరాల కల్పన కల్పనగానే మిగిలిపోయింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ముసుగులో కొనసాగుతున్న అవకతవకలను వేణుశ్రీ గారు నిష్కర్షగా ఎండగట్టినారు.
“కూట్లోని రాయిని కూర్చొని తీయక/ఏట్లోని రాళ్ళన్ని యేరదననె/తనపిల్ల లాంగ్లపు తరగతుల్లో వేసి… ” ఇందులో మాతృభాషను పరిరక్షించుకోవాలని, వేదికలనెక్కి ఉపన్యాసాలను ఊదరగొట్టు వారి ఊసరవెల్లి నైజాన్ని బయటపెట్టారు. తాను ఆచరించక ఇతరులకు ఆచరించుమని చెప్పే వారితోనే మాతృభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. “ఏమి రాజద్రోహమేరి రాజులిచట… ఎదురు చెప్పరాదంచును యిట్టిచట్ట/మింక వాడు టెవరికింక మేలు జరుగు…” ప్రభుత్వ ఆగడాలను, అరాచకాలను ప్రశ్నించేవారిపై రాజద్రోహం కేసులు పెట్టి, చెరసాలలో తోయడాన్ని ఖండించారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాల రాయడాన్ని కవి నిరసించారు. ఆంగ్లేయుల కాలంలో చేసిన బూజు పట్టిన చట్టాలను తొలగించవలసిన అవసరముంది. “కమ్మరి కొలిమియు కుమ్మరి సారెయు… కొత్త కొలువుల హామియు ఉత్తదాయె” ప్రపంచీకరణ పడగ నీడలో చేతి వృత్తులు కనుమరుగవుతున్న తీరుకు కలత చెందుతారు. తరతరాలుగా కులవృత్తులపై ఆధారపడిన వారికి చేతి నిండా పని లేదు. కడుపు నిండా తిండి లేదు. ప్రభుత్వం ఉపాధిని కల్పించడం లేదు. ఇలా అర్ధాంతరంగా అంతరిస్తున్న జీవితాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “అలనాటి ఆత్మీయ అనురాగమేమాయె… మనుసు విప్పి మాట్లాడేటి మనుషులేరి” అంటూ నాటికీ నేటికీ తేడాను చెబుతారు. దినదిన ప్రవర్థమానంగా మానవులలో స్వార్థ బుద్ధి పెరుగుతున్నది. మమతానురాగాలు తగ్గుతున్నవి. ఈ ధోరణి మెరుగైన సమాజ నిర్మాణానికి అవరోధంగా నిలుస్తుంది. ఈ కపట బుద్ధిని బద్ధలు కొట్టాలంటారు కవి. “మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర/బీరప్ప పండగ కురుమగొల్ల… పండుగల సంబరాలన్ని బాగ జరుగు” కవి చిన్నతనంలో చూసిన జాతరలను, చేసిన కొలుపులను, ఆడిన ఆటలను చక్కగా అక్షర బద్ధం చేశారు. సిర్రగోనె, కోనేటి ఈతలు, సోపతిగాళ్లతో కలిసి తిరిగినవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతపు బాల్యంలో ప్రమాదకర ఆటలు తిష్టవేయడం శోచనీయం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవరోధం కలుగుతున్నది. నులక మంచాలు, బొంతలు, గంపలు, గుమ్ములు, కొట్టెలు, కుండలు, కూర కంచుడు, రొట్టెపెంక, చేద బొక్కెన, ఈత చీపురు మొదలుకొని ఆనాటి అనేక వస్తువులను పద్యాలలో చక్కగా పొదిగారు. “గత్తర పోయెను కలరాయు పోయెను… ” పోచమ్మ పొక్కులు, ప్లేగు, మలేరియా, అతిసార మొదలైన భయంకరమైన అసంఖ్యాక వ్యాధులను జయించాము. కరోనా, ఒమెక్రాన్లను సైతం త్వరితగతిననే గెలుస్తామనే ధీమాను వెల్లడి చేశారు. ఇలా ప్రతి పద్యం ఊటంకించదగినదే. వ్యాఖ్యానించవలసినదే. కానీ అన్నం ఉడికిందా? లేదా? అని తెసుకోవడానికి ఒకటి రెండూ మెతుకులను పిసికి చూస్తాము. అలాగే ఇక్కడ మచ్చుకు కొన్ని పద్యాలను మాత్రమే తీసుకున్నాను. వేణుశ్రీగారు తన జీవితానుభవాలనన్నింటిని మేళవించి, శతకాన్ని షడ్రసోపేతంగా, రుచికరంగా వండి వార్చినారు.
కైరవ శతకంలో 121 పద్యాలున్నాయి. అన్నీ ముక్తక లక్షణాన్ని కలిగి ఉన్నాయి. “తాత మాటలు కైరవా! తరగని నిధి” మకుటం కూడా బాగా కుదిరింది. వస్తువైవిధ్యమున్నది.
వెంట్రుకలు, ముక్కు, కనులు, చర్మం, చెవులు, నాలుక, దంతాలు, మచ్చలు, శరీరం వస్తువులుగా రాసిన పద్యాలు చమత్కారంగా ఉన్నాయి. అవినీతి తిమింగళాలు, పుట్టలోని పాముల వంటి వ్యక్తులు, పల్లె పండుగలు, కయ్యాల కాపురాలు, అంధ విశ్వాసాలు, మద్యపాన వ్యసనం, బంధాలు, బంధుత్వాలను సమర్థవంతంగా పద్యాలు చేశారు. లాక్షణికులు చెప్పిన కావ్య నాయికలు, నాయకుల లక్షణాలను పద్యాలలో ఇమిడ్చడం అద్భుతంగా ఉంది. ఇటీవల జరిగిన కోడిపుంజు కాలికి కట్టిన కత్తి గాటుకు మనిషి బలైన ఘటన పుంజు అరెస్టు, న్యాయ దంతుల నరికివేత, అసలు దయ్యాలు, ఆడపిల్లలపై దాడులు మొదలైన సంఘటనలపై పద్యాల అల్లిక ఆలోచనాత్మకంగా ఉంది. ప్రాచీన నీచ పాత్రలను నేటి దూర్తులకు ప్రతీకలుగా వాడడం బాగుంది. ఇది కవికి ప్రాచీన, అర్వాచీన సాహిత్యాలపై గల పట్టును తెలియజేస్తుంది. కవికి జీవితానుభవంతో వచ్చిన పరిణతిని, పరిపక్వతను ఈ శతకం తెలియజేస్తుంది. సాధారణ సన్నివేశాలను, ఇతివృత్తాలను సందేశాత్మక పద్యాలుగా తీర్చిదిద్దడంలో కవి కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు.
“మాయలునేర్వని మనుషులు కావాలి/మోసము చేయని దోసమెరగ/నట్టి జనుల జీవన విధానమును రాగ/ఆధిపత్యము లేని అవని యందు/భేద భావము లేని బీద బిక్కియు లేని/నవలోకమందున నవ్య జనము/పాలన లేనట్టి పద్ధతితో నుండు/కోర్టులు పోలీస్ల గొడవ లేక/ జనులు సుఖసౌఖ్యముల కల్గి జతను కట్టె/జగము కావాలె నాకును జవము యుండి/బలము హెచ్చుతగ్గులు లేని భావజాల/పసిడి లోకమందు జనము బతుకవలెను/తాత మాటలు కైరవా! తరగని నిధి” కులమతాలకు అతీతంగా, మనుషులందరు కలిసిమెలిసి బతికే రోజులు రావాలి. ఆధిపత్య భావజాలం, అహంకార ధోరణులు అంతమవ్వాలి. హెచ్చుతగ్గులు పోవాలి. కోర్టు తగాదాలు, పోలీసు గొడవలు ఉండకూడదు. మాయలు లేని, మోసాలెరుగని, దోషరహితమైన జీవన విధానం కావాలి. సమాజంలో సుఖ, సంతోషాలు వెల్లి విరియాలి. మనుషులు మనుషులుగా మెలగాలి. ఓ కైరవా! ఈ తాత మాటలు నీకు తరగని నిధి లాంటివి. ఇవి నీ జీతమంతా పనికి వస్తాయి. నిన్ను వేలిపట్టి నడిపిస్తాయి. నీ వంటి పిల్లలందరూ అనుసరించదగినవి. నిత్య జీవితంలో ఆచరించదగినవి. సమాజానికి మేలుకొలుపులా పనికి వస్తాయి. కైరవ శతక ఫలశృతిని కాంక్షిస్తున్నట్టుగా కవి ఈ పద్యాన్ని అందించారు. నేటి సమాజానికి దర్పణం పట్టిన ఈ శతకాన్ని అందరూ చదవాలని కోరుకుంటున్నాను. దీనిని అన్ని పాఠశాల గ్రంథాలయాల్లో పెట్టి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. సమస్యాపరిష్కారాలు కలిగిన శతకాన్ని వెలువరించిన వేణుశ్రీ గారికి శుభాకాంక్షలు.

February 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us