కె.బి. సి. అంటే, కౌన్ బనేగా కరోడ్పతి అనే టెలివిజన్ క్విజ్ గేమ్ షో ఇప్పటికీ 26 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమైన ఈ కె.బి. సి. కి హోస్టుగా అమితాబచ్చన్ వ్యవహరించారు. 3 జులై 2000 తొలి ప్రసారం వచ్చింది. మధ్యలో కొన్నాళ్లు షారుక్ ఖాన్ హోస్టుగా వ్యవహరించినా , ఆ తర్వాత నిన్న మొన్నటి వరకు అన్ని సీజన్లోనూ అమితాబచ్చన్ విజయవంతంగా నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమమై దాదాపు రెండు గంటలు ఇలా ప్రతిరోజు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు పదకొండు గంటల వరకు ప్రసారమవుతుంది. విజ్ఞాన, వినోద వల్లరి ఇది.
ఈ అద్భుతమైన టీవీ షో అమితాబచ్చన్ జీవితంలో ఒక అంతర్భాగమైందా? లేకుంటే విజ్ఞానాన్ని ఆస్వాదించాలి అనుకునే విద్యావంతులకు, మానసికోల్లాసాన్ని కలిగించేలా వాళ్ళ జీవితాలలో, ప్రేక్షకుల జీవితాలలో అంతర్భాగమైందా? తెలియనంతగా ఎదిగిపోయింది. ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నది.
ఆడియన్స్ పోల్ అని, డబులు డిప్ అని, ఫిఫ్టీ ఫిఫ్టీ అని, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఫ్యూచర్ అని ఇలా ఏవేవో పేర్లతో ఆసక్తికరంగా సాగే నాలుగు జవాబుల ఒక్క ప్రశ్న కొన్ని గుండెలకు స్పందన అవుతున్నది, విజ్ఞాన భరితమవుతున్నది. కార్యక్రమం మధ్యలో ధనం తో వచ్చే లాభాలు అందుతుంటాయి. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జ్ఞాన ధార ఏదైతే ఉందో ఇది భారతదేశానికి కీర్తి తీసుకువచ్చేలాగా పెద్ద కలలను కనే వాళ్ళకి వాళ్ళ ఆకాంక్షలను తీర్చుకునేలాగా ఈ షో జరుగుతున్నది. మీరు పల్లవానికే పరుగులు తీస్తుంది అనే ఉదాహరణ చెప్పుకునేలా!
భిన్న భిన్న రంగాలకు చెందిన పోటీదారులను ఎంతో నైపుణ్యంతో వాళ్ల దగ్గర నుండి జవాబులను రాబడుతూ పోటీదారులతో సంభాషణలు చేస్తూ అందరి ఆశయాలు ఇవే అన్నంతగా గొప్ప స్ఫూర్తినిస్తూ నిర్వహిస్తున్నారు. కోటి రూపాయల ఈ కోరికల వృక్షం “హూ వాంట్స్ టు బి ఎ మిలీనియర్” అంటూ సీజన్ల మీద సీజన్లు గా నడిపిస్తూ జనరల్ నాలెడ్జ్ ఇష్టపడే ప్రేక్షకులకు వేడుకలు చేస్తున్నది.
అమితాబచ్చన్ గంభీరమైన గొంతుతో సందర్భోచితంగా సలహాలనిస్తూ… హాస్య జల్లులను కురిపిస్తూ… నడిపే వినోదభరిత, విజ్ఞాన భరిత కార్యక్రమం ఇది.
One of my ‘Favourite’ show అనుకునేలా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ జ్ఞాన విజ్ఞాన ప్రశ్నోత్తర మాలిక లోతులలోకి వెళితే కదా చాలా తెలిసేది?
“న చోరహార్యం న చ రాజహార్యం న
బాతృభాజ్యం న చ భారకారి
వ్యయేకృతే వర్ధతే ఏవ నిత్యం
విద్యాధనం సర్వధన ప్రధానం ” అన్నారు పెద్దలు! అంటే మనందరికీ తెలిసిన భావమే దీన్నే పద్య రూపంలో చూస్తే
“దొరలు దోచలేరు దొంగలెత్తుక పోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనము విద్యాధనంబు రా
లలిత సుగుణజాల తెలుగు బాల!” అని కూడా మనకు తెలుసు!
విద్య గురువు అని, విద్య విదేశీ బంధువని, విద్యకు సాటి ధనం ఈ ఇలలోనే లేదు అనీ మనకు తెలుసు
విద్య నేర్చుకుంటే ఇన్ని విధాల లాభాలు ఉంటాయి అని తెలిసి కూడా విద్యను సంపూర్ణంగా మనసారా నేర్చుకోరు. చదువులోని సారాన్ని గ్రహించరు. కానీ, ఎవరైతే చదువులోని, విజ్ఞానంలోని సారాన్ని సంపూర్ణంగా గ్రహిస్తారో వాళ్ళు విజయపథంలో విహరిస్తారు అని చెప్పడానికి మనకు ఈ కె.బి.సి. ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అయితే అవకాశం అనేది అందరికి ఉంటుంది కోరికల పతాకగా మరికొందరికి ఉంటుంది. కంప్యూటర్, ఫోను ఇవన్నీ ఎవరు ఇన్వెంట్ చేశారు ఎవరు కనుక్కున్నారు అనేవే కాదు! ప్రకృతిలో ఉన్న లోహాలను మూలకాలను రకరకాల పద్ధతుల్లో కలపడంతో ఎలా తయారు చేయగలిగారు అనేవీ లోకం తెలుసుకోలేని సమయంలో వాస్కోడిగామా ఇండియాను కనుగొన్నాను అని చెప్పడం, కొలంబస్ అమెరికాను డిస్కవర్ చేశాడు అని చెప్పడం అనేవి నిజంగానే ప్రపంచానికి మార్గదర్శకమే కదా! కానీ ఇవేకాకుండా….
మనదేశంలో విద్యా విజ్ఞానాలు విలసిల్లిన విధానాన్ని చూసి పరదేశీయులు ‘ఔరా ఇంతటి జ్ఞాన సంపన్నులా భారతీయులు’ ! అని ముక్కున వేలు వేసుకొని మనల్ని అనుసరిస్తున్నటువంటి విషయాలు కూడా మనకు తెలుసు .
సాధారణ జ్ఞానం అనేది మనిషి మేధస్సుకు ఒక ముఖ్యమైన భాగం జీవితానుభవాల నుంచి వచ్చే జ్ఞానం. దాన్నే మనం ”ఇంగిత జ్ఞానం” అని కూడా అంటాం. ఇందులో శారీరక ,మానసిక, సాంస్కృతిక జ్ఞానమంతా ఒక్కచోట ఏడ్చికూర్చి పెట్టినటువంటి సాధారణ జ్ఞానం అయితే అధ్యయనం చాలా ఎక్కువ చేస్తే అన్ని రంగాలలో కూడా అంటే రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం వంటి లలిత కళలలోనూ శాస్త్రీయ విశాలాంశాల పైనా, భౌగోళిక అంశాల పైనా రకరకాల ప్రశ్నలను సంధిస్తారు. కేబీసీలో వీటికి తగిన జవాబులను చెప్పినట్లయితే ఒక్కో ప్రశ్నకు తగిన మూల్యం జమ చేస్తూ పోతారు. ఏ ప్రశ్నకు అయితే జవాబు రాదో అప్పుడు ఓడిపోయి వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి లోబడే పోటీదారులు వచ్చిన మొత్తాన్ని తీసుకొని వెళ్తారు.
సౌర కుటుంబమును జీవశాస్త్ర సంబంధమైనవనో భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర విశేషాలను విజ్ఞాన శాస్త్రాలుగా చెప్పుకునే మనం అనంతమైన ఈ జ్ఞాన సముద్రంలో ఒక రేణువు వంటి వాళ్ళం అని కె.బి.సి. చూస్తే అర్థమవుతుంది . మనిషి శరీరంలో అతి చిన్న ఎముక ఏది అనగానే ఒక్కసారిగా సాంకేతిక నామం గుర్తుకే రాదు చెవిలో ఉండే స్టెపిన్ అనే ఎముక అతి చిన్న ఎముక అని చదువుకోని వాళ్ళ పరిస్థితి వేరు. చదువుకున్న వాళ్ళకి కూడా ఇటువంటివి వెంటనె స్ఫురణకు రాదు !
మనిషి శరీరంలో అతిపెద్ద అవయం అవయవం ఏది అనగానే చట్టక్కున చర్మం అని చెప్పేస్తామా? లేదు. అవయవం అంటే , కాలా? చెయ్యా? కడుపా? అని ఆలోచిస్తాం. ఇక్కడే మన ఐక్యూ ఎంత ఉంది అని చెప్పడానికి అంటే intelligence quotient , ఇంటిలిజెన్స్ క్యోషెంట్ ఎంత ఉంది అని చెప్పడానికి రుజువు. ఇటువంటి క్విజ్ కాంపిటీషన్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి.
మనిషి మేదస్సు స్థాయి ఎంత? ఆలోచన సామర్థ్యం ఎంత? సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఎంత ? అని అంచనా వేసి చెప్పగలిగే సంఖ్యనే ఈ ఐక్యూ, IQ . అంటే ఉదాహరణకు సగటుకు ఒక వంద ను పరిగణనలోకి తీసుకుంటే, లెక్కకు తీసుకుంటే 90 నుండి 110 మధ్య ఈ స్థాయి ఎంతనో చెబుతారు 130 సంఖ్యా కన్నా ఎక్కువ స్కోరు ఎవరైతే సాధిస్తారో వాళ్ళని గిఫ్టెడ్ పర్సన్ గా చెబుతారు.
ఈ ఐక్యూ అనేది వాళ్ళ రీజనింగ్, reasoning అంటే వాళ్ల తార్కిక బుద్ధి… తార్కిక ఆలోచన శక్తి.. జ్ఞాపకశక్తి అనేవి భాషా పరిజ్ఞాన విషయం గానూ, ఇచ్చిన సమస్య పరిష్కార విషయం గాను ఎంత వేగంగా చెబుతారో దాన్ని అంచనా వేసి చెప్పడం అనేది ముఖ్యమైంది.
క్రికెట్ బ్యాట్ పట్టుకొని బంతిని కొట్టి స్కోరు సాధించిన విధంగా చెప్పొచ్చు.
ప్రపంచాన్ని మార్చి వేయడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని అంటాం. ముందున్న సమస్యను జయించడానికి మనిషిని సిద్ధం చేసేది విద్యనే అని అంటాం. ఒక పుస్తకం ప్రపంచాన్నే మార్చగలదు అని చెబుతారు. జ్ఞానం పెట్టే పెట్టుబడి అత్యంత విలువైన పెట్టుబడి అనీ అంటారు.
విద్య అనే వృక్షం వేళ్ళు పాతుకున్నది అంటే వేలు వేలుగా పండ్లు తీయతీయగా అందిస్తుంది ఎందుకన్నారు విద్య లేనివాడు వింత పశువు అని?
“విద్యా దదాతి వినయం/ వినయం విధేయ పాత్రతాం/ పాత్రత్వత్ ధనం/ తత్ సుఖం విద్య” వినయాన్నిస్తుంది వినయంతో…. అర్హత లభిస్తుంది అర్హతతో ధనం సమకూర్తుంది .ఈ ధనం ద్వారా ధర్మం నిలుస్తుంది. అంటే, ధనం ఉన్నప్పుడు దానధర్మాలు చేయగలిగే, మంచి పనులు చేయగలిగే వెసులుబాటు ఉంటుంది.
ఈ ధర్మం వలన సుఖం లభిస్తుంది . అంటే, మనశ్శాంతి, ఆనందం తోబాటు నిజమైన తృప్తి ఇతరులను పైకి తెచ్చాము ఇతరులకు సేవ చేసాము మంచిది చేసాము అనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వానికి కావలసిన చక్కని ఆలోచననూ అందిస్తుంది. ఇటువంటి జ్ఞానం, చదువు లేని మనిషి నీ జంతువుతో పోల్చడం ఎందుకు అంటే ఆలోచన శక్తి మాట్లాడగలిగే విచక్షణా జ్ఞానం ఇవన్నీ మనుషులకు మాత్రమే ఉంటాయి జంతువులకు ఉండవు అయితే ఇక్కడ చెప్పే విద్య కేవలం పాఠశాలలో కళాశాలలో చదువుకునే చదువుల ద్వారా మాత్రమే కాదు చక్కని ప్రవర్తన మంచి సంస్కారం ఇతరుల దగ్గర నడుచుకునే విధానం లోకజ్ఞాన సంపద ఇటువంటివి. మంచి చెడు ఆలోచించే గుణం ఉన్నా నైతికత లేకపోతే పశువుతో సమానమే అనే ఉద్దేశంతో మనవాళ్లు “విద్యావిహీనః పశుః” అని అన్నారు. సమాజం పూజించేది విద్యా ధనాన్ని ! మనిషిలో ఉండే నిజమైన మానసిక సౌందర్యాన్ని…. ధనం డబ్బు కంటే ముఖ్యమైన సంపాదన జ్ఞానం అని. ఇటువంటి జ్ఞానం పైన ఒక కార్యక్రమం టెలివిజన్ ద్వారా రావడం అందరూ ఇళ్లల్లో, అందరి గుండెల్లో నిలిచిపోవడం నిజంగా గొప్ప విషయం.
ఈ క్విజ్ లో ఉండేది జ్ఞాన పరీక్ష దానివలన వినోదము ఇవన్నీ రావాలి అంటే అభ్యాసనం . ఈ ప్రశ్నలు జవాబులు కార్యక్రమం అంటేనే మేధోపరమైన ఆట అని అంటాం. పోటీలలో పాల్గొనే వ్యక్తుల సామర్థ్యాలు నైపుణ్యాలు కొలవడానికి సంక్షిప్తమైనటువంటి మదింపుగా నిర్వహించేదే క్విజ్. ఇటువంటి జ్ఞానానికి సంబంధించిన ఈ కెబిసి పోటీని వినోదంగా కూడా ఆస్వాదిస్తున్నారు . ప్రేక్షకులలో ఇప్పటివరకు చాలామంది కోటి రూపాయలను సాధించుకున్నారు. వాళ్లందరినీ అసాధారణమైన వ్యక్తులుగా అభివందించవచ్చు. ఇచ్చిన ప్రశ్నను చక్కగా గమనించడానికి వాళ్లు ఇంటి దగ్గర శ్రద్ధగా చేసిన అధ్యయనం కారణమవుతుంది. పరీక్ష, పరిశీలన అనే రెండిటిలో ఆరితేరిన వాళ్లు. అలాంటి వాళ్ళే మేధోపరమైన పందెంలో అందరికన్నా ముందుంటారు.
విజ్ఞానదాయకమైన విశేషమైన ప్రశ్నలను సాధించి గెలుపొందిన వాళ్లకు భారీ నగదు బహుమతులు అందిస్తున్న ఈ కౌన్ బనేగా కరోడ్పతి ప్రస్తుతం ‘ఏడు కోట్ల’ రూపాయల వరకు గెలుచుకోవచ్చు అని ఎంతో పక్కాడ్బందీగా నడుపుతున్నారు.
సమయపాలన, సంగీత ప్రధానమైన నడక తో సాగే ఈ కె.బి. సి. ముఖ్యంగా హిందీ భాషలో ఉన్నది. తప్పనిసరిగా ఇంగ్లీష్ కూడా ప్రయోగిస్తుంటారు. అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమాలు సజావుగా నడవాలి అంటే వ్యాపార ప్రకటనలు వేస్తారు అని! స్పాన్సర్స్ ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు నడపగలుగుతారు. ఇక్కడితో ఆగిందా ? ఊహు….
” మీలో ఎవరు కోటీశ్వరుడు” అంటూ స్టార్ మా టీవీ లో కొన్నాళ్ళు తెలుగులో కూడా అక్కినేని నాగార్జున
వ్యాఖ్యాతగా నడిపారు. నిజానికి ఇది అలాగే కొనసాగిస్తే ఎంతో బాగుండేది. “హూ వన్స్ టు బి ఎ మిలియన్ “అంటూ రూపొందించిన ప్రముఖ తెలుగు టెలివిజన్ గేమ్ షో నిర్వహణలో పోస్ట్ గా అక్కినేని నాగార్జున సంచలనాత్మక సమర్పకుడిగా వ్యవహరించింన విషయం అందరికీ తెలిసిందే. మనుషులను ఆశావహజీవులం కదా ? ముందు ముందు వస్తుందేమో! ప్రస్తుతమైతే హిందీలో వచ్చే అమితాబచ్చన్” కౌన్ బనేగా కరోడ్పతి”, “కేబిసి” చూసి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఎంతో మంచిది.