Home కథలు కల’యిక’

కల’యిక’

by Dr.Geetha Vani

హోటల్ గది కిటికీలో నుండి తదేకంగా చూస్తుంది రాణి. ఆగకుండా సాగుతున్న వాహనాలు గుండ్రం గుండ్రంగా ఉన్న రింగురోడ్లు వంతెనలు ఫ్లైవోవర్లు ఎవరికి వారే తిరిగి చూడకుండా పరుగెడుతున్నజనాలు. అబ్బో చాలా గమ్మత్తుగా ఉంది ప్రపంచం. ఆ గమ్మత్తైన జగత్తులో తన జీవితం మహా గమ్మత్తుగా తోచింది రాణికి. తను ఎక్కడుంది? ఎందుకుంది? ఏంచేస్తుంది? ఆ ప్రశ్నలు నిరంతరం వెంబడించేవే అయినా ఆ రోజు చాలా కొత్తగా ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఎంత హాయిగా గడిచిపోయింది సంవత్సరం. ఎలా గడిచిందో తెలియనే లేదు. గతకాలపు జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటూ ఒక సంవత్సర కాలపు బంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజుతో గడపాలని ఎంత ఆశతో రెక్కలు కట్టుకుని వాలింది తను.

కానీ ఊహించని విధంగా పరిణామాలు. అసలు పక్కనే ఉన్నా మనుషులెవరో తెలియనంత వ్యత్యాసాలు. ఫోన్ లు, వాట్సాప్ లు, హాంగ్ అవుట్ లు, స్కైప్ లు చివరికి జీమెయిల్స్ ఎన్ని మార్గాల కమ్యూనికేషన్ లు ఉన్నా అన్నీ ఒకేసారి మాయమైపోయాయి. అసలు మనుషులను గుర్తించలేనంతగా మైమరపు ఆవహించిందా అన్నంత మొండితనం. ఆ పరిస్థితిలో తను ఏంచేస్తుంది. ఎక్కడికి పోతుంది. ఎవరితో చెప్పుకుంటుంది. తన పరిస్థితి తనకే విచిత్రంగా తోచింది రాణికి.

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఎంతో మధురంగా పలకరించాడు రాజు. హలో రాణిగారు అంటూ ఆ పిలుపులోని ఆత్మీయతకే ప్రాణం లేచి వచ్చింది తనకు. ఎన్నో కబుర్లు ఎన్నెన్నో ఊసులు మరెన్నో ఊహా ప్రపంచాలు ఇద్దరి మధ్య గూడు కట్టుకున్నాయి. మొదటి పలకరింపు ఎన్ని సంవత్సరాల అనుబంధమో అన్నంత ఆత్మీయంగా ఉంటే మొదటి స్పర్శ అంతకంటే దగ్గరితనాన్ని చవిచూపించింది. దాంతో ఇద్దరూ ప్రేమపాశంతో పెనవేసుకున్నారు చెట్టాపట్టాలేసుకుని తిరిగేసారు. తమ ఊహా ప్రపంచాన్ని నిజం చేసుకున్నారు.

రాణితో మాట్లాడకుండా రాజుకు గంట గడవదు. రాజును చూడకుండా రాణికి పొద్దు పొడవదు. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా ఒకరితో ఒకరి ప్రయాణం సంవత్సర కాలం. అయితే కాలం చేసే గాయం కూడా అంతే గమ్మత్తుగా ఉంటుంది మరి. ఈ సంవత్సర కాలంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి, వాటితో పాటు ప్రవర్తనలు మారాయి. అవి, నేటి తన పరిస్థితికి దారితీసాయి. విధి ఆడే వింత నాటకంలో మరోసారి తాను బలైపోయింది. పరిస్థితులతో పాటు మనమూ మారాలి అంటాడు రాజు. కాలంతో పాటు పరిస్థితులు మారొచ్చు కానీ పరిస్థితులు బంధాలను మార్చలేవు అంటుంది తను. ఇద్దరి మధ్య ఉన్న ఆ అభిప్రాయ భేదమే నేటి రాజు మొండితనానికి కారణం.    

ఏడాది గడిచిన తమ బంధానికి మరింత ప్రేరణ కలిగించాలని, రాజు పుట్టినరోజున దగ్గరుండి అతనికి ఆనందాన్ని పంచాలనీ ఎంత సంతోషంగా వచ్చింది తను. ఎయిర్ పోర్టులో రాజు కోసం చూసిన తనకు ఊహించని షాక్.

రాజు ఎయిర్ పోర్టుకు రాలేదు సరికదా, ఎన్ని ఫోన్ లు చేసిన జవాబు లేదు. పబ్లిక్ ఫోన్ లో చేసినా వినిపించుకోలేదు చివరికి వేరే వాళ్ల ఫోన్ తో చేసిన మెసేజ్ కు,  టాక్సీ తీసుకుని నువ్వు వెళ్లు నేను రాలేను అంటూ సమాధానం. దిక్కు తోచలేదు తనకు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇక గత్యంతరం లేక టాక్సీ తీసుకుని హోటలుకు వచ్చేసింది. హోటలు ఫోన్ తన ఫోన్ ఎన్ని ఫోన్ లతో చేసినా పలుకు లేదు. అన్నీ బ్లాక్ చేయడం రాజుకు తెలిసిన సులువైన మార్గం.

ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరికోసం ఎదురు చూస్తుందో తెలియదు. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో కిటికీలో నుండి ఎదురు చూస్తూ తన అర్ధంలేని జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటుంది. అక్కడ ఎయిర్ పోర్టులోనే, రాజు తనను దూరం నుండి చూసి తన జీవితం వేరే వాళ్లతో ముడిపడిపోయింది కాబట్టి తనను కలవకూడదు అనుకొని వెళ్లిపోయాడని తెలియని రాణి ఎదురు చూస్తూనే ఉండిపోయింది. నాటి కలయికను తలుచుకుంటూ నేటి కలయికను కోరుకుంటున్న రాణి కోరిక కల’యిక’ గానే మిగిలిపోయింది.

You may also like

1 comment

web page October 5, 2026 - 9:48 pm

Free vintage eroticaDante devil may cry nude naked fan artCarman electra sex tspeSperm cryobankSexy
chubby black girl takes dickVintage coffeepotWomen fucking stallionsAnal sex on psa testsLick cum from hairy pussy xnxx Talking about sex in chineseAsian nude thumbnail womanEmployment
for adult with learning disabilityWicked bottomChange brain transgender hypnosisVictoria secret nudistsJessica lynn nude galleriesAndy samberg gay moviesDelilah titsCelebrity fake free male nude https://newxxx.jumpandread.com/
Hairy vaginas picsAdult gallery hardcore
image opeIowa state university lingerieSecond life sex
scenesDick cavett booneville eleventh dayTeen bendy sexFree
hentai masturbation xnxx Persian teens nakedNipple pussyToon for you
sexWhat cause facial molesSmall tits free asian picsDairy causes adult acneCharleston club gay scDressed and fucked as a womanAdult cartoons
tvVintage calendar frameForum adult bbs linktoy unsortedThick vaginal discharge before menstrual
timeNatalie heck black dickSpankwire fucked hard bent overPatty cake sucking cockDragon ballz porn gameChristians anal sexGene eiselstein dumb assFacial cheerleaderBest doctor for breast cancer

Reply

Leave a Comment