Home కథలు ….క్లౌడ్ 9

….క్లౌడ్ 9

by Prasen Bellamkonda

రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు. “సెండ్.” రజని బొటనవేలు స్క్రీన్‌ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం
తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని ఆ అమ్మాయి నమ్మకం.
“నేను ఇంకేం చేయలేను. రేపు నన్ను బలవంతంగా నిశ్చితార్థానికి తీసుకెళ్తున్నారు. ఇవాళ రాత్రి పన్నెండున్నరకు పాత రైల్వే స్టేషన్‌కి
రా. వెళ్లిపోదాం.”
స్క్రీన్ మీద చిన్న గుండ్రటి చుక్క తిరుగుతోంది.
Sending…
ఆమె పెదవుల మీద చిన్న నవ్వయితే ఉంది కానీ మనసులో ఆందోళన. భయం.

“నెట్ స్లోగా ఉన్నట్టుంది.” అనుకుంటూ ఫోన్‌ గుండెలకు హత్తుకుంది.
అదే సమయం. మరో చోట మరో ఇంట్లో… సిద్ధార్థ్ చివరిసారి తన అప్లికేషన్‌ను చదువుకున్నాడు. ఏడు సంవత్సరాల నిరుద్యోగం.
నాలుగు పోటీ పరీక్షలు. ఐదారు ఇంటర్వ్యూలు. ఈసారి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం. చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు
ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
“Submit.”
స్క్రీన్ మీద Uploading documents అని గిరగిరా తిరుగుతుంటే అతడు కుర్చీలో వెనక్కి వాలిపోయి “హమ్మయ్య” అనుకున్నాడు.
వంద కిలోమీటర్ల దూరంలో రైతు రామయ్య మూడోసారి పంట బీమా క్లెయిమ్ చేస్తున్నాడు. లోపల ఆశ. ఆకాంక్ష.
” ఇప్పుడు అప్‌లోడ్ అవుతోంది బాబాయ్. ఈసారి డబ్బులు తప్పకుండా వస్తాయి.” గ్రామ సచివాలయం ఆపరేటర్ అన్నాడు.
రామయ్య నవ్వాడు.
“ఈసారి రాకపోతే అప్పు ఇచ్చినోడే నా పొలం లాగేసుకుంటాడు.”
నగరంలోని ఓ చిన్న ఆసుపత్రి. ఒక గర్భిణికి రక్తపోటు ప్రమాద స్దాయిలో ఉంది. డాక్టర్ అత్యవసరంగా మెడికల్ రికార్డులు స్పెషాలిటీ హాస్పిటల్‌కి పంపించాడు.
“వెంటనే బెడ్ అలాట్ చేయండి.”
ఫైల్ అప్‌లోడ్ అవుతోంది.
ఇంకెక్కడో… ఒక యువతి. పదకొండేళ్ల వైవాహిక హింస తర్వాత. మొట్టమొదటిసారి ధైర్యం చేసింది. ప్రభుత్వ మహిళా రక్షణ పోర్టల్‌లో కంప్లైంట్ రాసింది. చివర్లో చాలా సేపు చూసింది.
తర్వాత “Submit.”
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఆమె ఒక నిముషం విరామం తీసుకుంది. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందనిఆమె విశ్వాసం.
కళ్లలో నీళ్లు. “ఇక నేను ఒంటరిదాన్ని కాదు ” అనుకుంది రెండరింగ్ అనే అక్షరాలను చూస్తూ.
విదేశీ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ గడువుకు చివరి రోజు. ఒక పేద విద్యార్థి తన జీవితాన్నంతా ఒక PDF ఫైల్‌గా అప్‌లోడ్ చేస్తున్నాడు.
చూపుడు వేలు బటన్ ను తాకడానికి ముందు ఒక నిముషం విరామం తీసుకున్నాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత తన జీవితం మారిపోతుందని అతని ఆశ.
విద్యార్ది కళ్లలో నెరవేరుతున్న కల ఆనవాళ్లు ఇటునుంచి అటు కదులుతున్న బాణం గుర్తులోమెరుస్తున్నాయి.
— ….. …….
జీవితం జరిగిన సంఘటనల చరిత్ర మాత్రమే కాదు. జరగకుండా పోయిన అవకాశాల సమాధి కూడా.
మనం బతికిన జీవితానికే జ్ఞాపకాలు ఉంటాయనుకుంటాం. జరగకుండా పోయిన జీవన శకలాలకూ జ్ఞాపకాలుంటాయి.
అయితే అవి గుర్తుంటాయి కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
రాత్రి పన్నెండున్నర. పాత రైల్వే స్టేషన్. రజని గంటసేపు ఎదురు చూసింది. గడియారం వైపు గేటు వైపు ఎడతెరపి లేకుండా చూస్తూనే ఉంది. ఒకటిన్నరైంది. అతను రాలేదు. రెండైంది. అతను రాలేదు.
చివరికి “భయపడ్డాడు ” అని గొణుక్కుని విషాదంగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.
“పెళ్లి ఫోటోలన్నింటిలో రజని నవ్వుతోంది. కానీ పాత రైల్వే స్టేషన్ దగ్గర అర్థరాత్రి నిలబడ్డ అమ్మాయి ఛాయలు మాత్రం ఏ ఫోటోలోనూ లేవు.”
సిద్ధార్థ్ ప్రతిరోజూ వెబ్‌సైట్ చూస్తున్నాడు. “Application not found ” అంటోందది.
“నేనే ఏదో తప్పు చేశానేమో ” అనిపించిందతనికి . కళ్ల నిండా నిరాశ. తప్పదు మరి. ఇంకో సంవత్సరం అదే యుద్దానికి కొత్తగా సిద్ధమయ్యాడు.
రామయ్య… ప్రతి సోమవారం బ్యాంకుకి వెళ్తూనే ఉన్నాడు. “ఇంకా పడలేదు ” అనేదే శాశ్వత సమాధానం.
చివరకు పొలం అమ్మేశాడు. అప్పిచ్చినవాడు లాక్కున్నాక అమ్మక తప్పని పరిస్తితి.
ఆ మహిళ…
“మీ కంప్లైంట్ మా దగ్గరకు రాలేదు ” అనే సమాధానం వినీ వినీ విసుగేసి మళ్లీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
హింసకు అలవాటు పడడాన్ని అలవాటు చేసుకుంది. దుఖ్కంలో హాయిని వెతుక్కునే కళ నేర్చుకుంది.
ఆ విద్యార్థికి డెడ్‌లైన్ దాటిపోయిందని మెయిల్ వచ్చింది.
మరో సంవత్సరం వేచి చూడాల్సిందే, తప్పదు.
ఆ ఆసుపత్రి బెడ్ ఖాళీగానే ఉండిపోయింది. ఎందుకంటే ఆ రికార్డులు అక్కడికి చేరలేదు.
కాలచక్రాన్ని కొంచెం వెనక్కి తిప్పితే..
నగర శివార్లలో మిల మిలా మెరుస్తున్న వెలుగులలో అతి పెద్ద భవనం. వేలాది కంప్యూటర్లు. ఎయిర్ కండిషనర్లు. నీలి లైట్లు. అక్కడే
అందరి కలలు ఒక్కచోటికి పోగవుతున్నాయి.
ఒక సెక్యూరిటీ గార్డు టీ తాగుతున్నాడు. “ర్యాక్-17 హీట్ ఎక్కువగా ఉంది.” ఒక టెక్నీషియన్ అన్నాడు.

” కొద్దిసేపట్లో వెళ్లి చూస్తా ” అననైతే అన్నాడు కానీ అతను వెళ్లలేదు.
రాత్రి 10:41. మొదట చిన్న పొగ. తర్వాత చిన్న మంట. ఒక వైర్. ఒక స్పార్క్. ఒక అలారం. ప్రమాద హెచ్చరిక ఒక నిమిషంలో.
మరో ర్యాక్. ఇంకో ర్యాక్. సర్వర్లు. స్టోరేజ్. బ్యాకప్. పొగతో నిండిపోయాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ అయింది.
కొంత డేటా బతికిందేమో తెలియదు. కొంత డేటా శాశ్వతంగా మాయమయింది. ఏవి పోయాయో ఏవి ఉన్నాయో అప్పుడు ఎవరికీ
తెలియదు.
ఆ అగ్నిప్రమాదం గురించి పేపర్లో ఒక్క చిన్న వార్త వచ్చింది.
“ప్రైవేట్ డేటా సెంటర్‌లో మంటలు. సేవలకు స్వల్ప అంతరాయం.”
అంతే. ఆ వార్త చదివిన వాళ్లలో చాలా మంది తమ జీవితంలోని ఆ ఒక్క రోజు కూడా అదే మంటల్లో కాలిపోయిందని తెలుసుకోలేదు.
తెలిసే అవకాశం లేదు.

…….

మరుసటి రోజు డాటా సెంటర్ లో కాలిపోయిన ర్యాక్‌లను క్రేన్‌తో బయటకు తీస్తున్నారు. గాలిలో ఇంకా కాలిన ప్లాస్టిక్ వాసనే ఉంది.
ఒక ఇంజనీర్ కాలిపోయిన హార్డ్‌డిస్క్‌ను చేతిలో అటూ ఇటూ తిప్పి చూస్తూ అన్నాడు.
“వింతగా ఉంది కదా…” పక్కనున్న మరో ఇంజనీర్ తలెత్తి చూశాడు.
“ఏమిటి?”
“ఇది మనకు ఒక హార్డ్‌డిస్క్ మాత్రమే.” కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.
“కానీ ఎవరికో ఇది ఇంటి నుంచి పారిపోవాలని పంపిన చివరి మెసేజ్ అయుండొచ్చు.”
“అది ఎవరికో ఉద్యోగ దరఖాస్తు అయుండొచ్చు.” ఇంకో కాలిపోయిన సర్వర్ వైపు చూపించాడు.
మరో ర్యాక్. “అది రైతు బీమా క్లెయిమ్ అయుండొచ్చు.”
“లేదా…” అని రెండో ఇంజనీర్ మెల్లగా అన్నాడు.
“…ఆసుపత్రికి చేరాల్సిన ఒక మెడికల్ ఫైల్.”
ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డారు. బూడిదలో బూట్ల చప్పుళ్లు వినిపించాయి. కొద్దిసేపటి తర్వాత ఇంజనీర్ నవ్వాడు.
“మనం సర్వర్లు కాలిపోయాయని రిపోర్ట్ రాస్తాం.”
రెండో ఇంజనీర్ తల అడ్డంగా ఊపాడు. “లేదు.”
“మరి?”
“ఇది అగ్నిప్రమాదం కాదు.”
“మరి?”
“ఆశల దహనం.” ఇంజనీర్ ఏమీ మాట్లాడలేదు. కాలిపోయిన కేబుల్‌ను కాలితో పక్కకు జరిపాడు.
“చిన్నప్పుడు మా ఊర్లో పోస్ట్‌బాక్స్‌కి ఎవరో నిప్పు పెట్టారు. అప్పుడూ ఎన్ని ఆశలు కాలిపోయాయో ఎవరికీ తెలియదు.”
అతడు బూడిదను చేతిలోకి తీసుకున్నాడు. ” అప్పుడు మనుషులు ఆశలను కవర్లలో పెట్టి పంపేవాళ్లు “
చేతిలో బూడిదను నెమ్మదిగా జార్చాడు.
“ఇప్పుడు ఫైళ్లలో పెట్టి క్లౌడ్‌లో పెడుతున్నారు.” కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
“ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా …గమ్యానికి చేరని సందేశాలు మాత్రం చావడం లేదు.”
రెండో ఇంజనీర్ చిరునవ్వు నవ్వాడు.
“సందేశాలు మారాయి. మధ్యవర్తులు మారారు. సర్వర్లు మారాయి. కానీ… ఇద్దరూ బూడిదను చూస్తూ ఒకేసారి అన్నారు.
“ఎదురుచూపు మాత్రం మారలేదు.”
మళ్లీ నిశ్శబ్దం. కొద్దిసేపటికి మొదటి ఇంజనీర్ అడిగాడు.
“ఈ బూడిదలో ఎంత డేటా ఉండి ఉంటుంది?” రెండో ఇంజనీర్ తల ఊపాడు.
“డేటా కాదు. జరగకుండా అదృశ్యమైన అనుభవాలు.”
“అర్థం కాలేదు.”
“కొన్ని ప్రేమలు కలవలేదు. కొన్ని ఉద్యోగాలు రాలేదు. కొన్ని ఫిర్యాదులు వినిపించలేదు. కొన్ని అప్పులు తీరలేదు. కొన్ని ప్రాణాలు
ఆసుపత్రికి చేరలేదు. అవి విడివిడిగా జరిగిన దురదృష్టాల్లా కనిపిస్తాయి. కానీ…” అతడు బూడిద కుప్పలోంచి కనపడుతున్న ఒక
నల్లటి చిప్‌ను తీసి పట్టుకున్నాడు.
“బహుశా… అవన్నీ ఒకే రాత్రి ఇక్కడే చనిపోయాయి.”
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. బయట చెత్త ట్రక్కు హారన్ వినిపించింది. కార్మికులు కాలిపోయిన ర్యాక్‌లను ట్రక్కులోకి
విసురుతున్నారు.
ఇంజనీర్ ట్రక్కు వైపు చూస్తూ మెల్లగా అన్నాడు “వాళ్లు పారేస్తోంది ఇనుమునే అనుకుంటున్నారు, కానీ కాదు, అది జీవించలేకపోయిన
జీవితాల చరిత్ర.”
ఒక ఇంజనీర్ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత బూడిదనే చూస్తూ మెల్లగా అన్నాడు.
“మనం బతికిన జీవితానికి రికార్డులు ఉంటాయి. మరి బతకలేకపోయిన జీవితాలకు?”
రెండోవాడు ఆకాశం వైపు చూశాడు. “వాటిని క్లౌడ్ కూడా నిల్వచేయదు.”
…….. ……… ……….

కొన్ని నెలల తర్వాత…
ఆ కాలిపోయిన సర్వర్ల బూడిద కలిపిన మట్టిలో కొన్ని మొక్కలు మొలిచాయి. వాటి వేర్లలో ఏముందో ఎవరికీ తెలియదు.
బహుశా…ఒక ప్రేమలేఖ. ఒక ఉద్యోగం. ఒక రైతు పొలం. ఒక పుట్టని శిశువు. ఒక స్త్రీ ధైర్యం. ఒక విద్యార్థి కల.
అందరూ వాటిని సాధారఃణ చెట్లనే అనుకున్నారు. కానీ ప్రతి వసంతంలో అవి పచ్చగా మారినప్పుడల్లా,
గమ్యాన్ని చేరలేకపోయిన సందేశాలన్నీ ఇంకా పూర్తిగా చనిపోలేదని ప్రకృతి ఒక్కసారైనా గుర్తు చేసేది.

రైటర్స్ నోట్
……………

ఈ కథ చదవగానే సాంకేతికంగా ఇలా జరగదు అనిపించడం ఖాయం. కానీ ఈ కథ ఆలోచన రావడానికి కారణం అవునా ఇలా కూడా జరుగుతుందా అనిపించిన ఈ సంఘటనే . ఇది ఎక్కడో చదివినపుడు ఈ వస్తువు మెరిసింది. ఇదిగో ఇది చదివితే ఈ కథ ఎలా
సాధ్యమో అర్దమవుతుంది.

The OVHcloud data center fire in Strasbourg, France, March 2021. One of Europe’s biggest
cloud providers had an entire building (SBG2) burn
down. Companies and individuals

who hosted email servers there without offsite backups permanently lost mail — including

messages that had arrived but hadn’t been read yet, and messages in transit that were
queued on those servers. Some small businesses lost years of correspondence overnight.

That’s a documented, verifiable event.
How the “in transit” loss works technically: when a mail can’t be delivered instantly, it sits

in a queue on an intermediate server, retrying for typically 24–72 hours. If that server is
destroyed (fire, flood, disk failure) while the mail is queued, the message is simply gone —
and the “delivery failed” notice that should go back to the sender is also generated by that
same dead server, so no notification ever arrives. Both ends stay silent.

మార్చి 2021లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన OVHcloud డేటా సెంటర్ అగ్నిప్రమాదం. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ.

యూరప్‌లోని అతిపెద్ద క్లౌడ్ సేవల సంస్థల్లో ఒకటైన OVHcloudకు చెందిన SBG2 అనే మొత్తం డేటా సెంటర్ భవనం పూర్తిగా
దగ్ధమైంది.
ఆ డేటా సెంటర్‌లోనే తమ ఈ-మెయిల్ సర్వర్లను హోస్ట్ చేసుకుని, వాటికి వేరే ప్రాంతంలో (offsite) బ్యాకప్‌లు ఏర్పాటు చేయని
సంస్థలు, వ్యక్తులు తమ ఈ-మెయిళ్లను శాశ్వతంగా కోల్పోయారు. అందులో ఇప్పటికే సర్వర్‌కు చేరుకున్నప్పటికీ ఇంకా చదవని
మెయిళ్లు కూడా ఉన్నాయి. అలాగే, గమ్యస్థానానికి చేరే ప్రయత్నంలో ఆ సర్వర్ల క్యూలో (queue) వేచి ఉన్న “ప్రయాణంలో ఉన్న”
(in transit) ఈ-మెయిళ్లు కూడా పూర్తిగా అదృశ్యమయ్యాయి. కొన్ని చిన్న వ్యాపార సంస్థలు ఏళ్ల తరబడి సాగిన తమ వ్యాపార
ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ ఒక్క రాత్రిలోనే కోల్పోయాయి. ఇది నమోదైన, ధ్రువీకరించదగిన వాస్తవ సంఘటన.

“In Transit” లో ఉన్న ఈ-మెయిల్ ఎలా శాశ్వతంగా పోతుంది?

సాంకేతిక వివరణ

ఒక ఈ-మెయిల్‌ను వెంటనే గమ్యస్థానానికి అందించడం సాధ్యం కాకపోతే, అది మధ్యలో ఉన్న ఒక SMTP సర్వర్‌లోని క్యూ
(queue) లో తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. అక్కడి నుంచి సాధారణంగా 24 నుంచి 72 గంటల పాటు మళ్లీ మళ్లీ పంపే
ప్రయత్నం (retry) చేస్తుంది. అయితే ఆ సమయంలోనే ఆ సర్వర్ అగ్నిప్రమాదం, వరద, డిస్క్ వైఫల్యం లేదా మరే ఇతర
విపత్తుతో పూర్తిగా నాశనమైతే, ఆ క్యూలో ఉన్న ఈ-మెయిల్ కూడా శాశ్వతంగా అంతరించిపోతుంది.
అంతేకాదు, ఆ మెయిల్ పంపలేకపోయామని పంపిన వ్యక్తికి వెళ్లాల్సిన “Delivery Failed” (డెలివరీ విఫలమైంది) అనే
నోటిఫికేషన్ కూడా అదే సర్వర్ నుంచే ఉత్పత్తి చేయబడాలి. కానీ ఆ సర్వరే నాశనమైపోవడంతో ఆ హెచ్చరిక కూడా ఎప్పటికీ
పంపబడదు.
ఫలితంగా
పంపిన వ్యక్తికి తన మెయిల్ చేరలేదన్న సమాచారం అందదు.
స్వీకరించాల్సిన వ్యక్తికి ఆ మెయిల్ ఎప్పటికీ అందదు.
రెండు వైపులా సంపూర్ణ నిశ్శబ్దం.
ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ ఉనికిలోనే లేనట్టుగా కాలంలో కలిసిపోతుంది.

You may also like

3 comments

phpaldopanalo September 20, 2026 - 3:58 pm

The withdrawals are surprisingly fast. I got my winnings in my wallet in no time. Great job to the phpaldopanalo team.

Reply
Lenard Hvizdos September 24, 2026 - 9:21 am

Greetings from Florida! I’m bored to tears at work so I decided to check out your website on my iphone during lunch break. I love the info you present here and can’t wait to take a look when I get home. I’m shocked at how quick your blog loaded on my cell phone .. I’m not even using WIFI, just 3G .. Anyways, great site!

Reply
web page September 24, 2026 - 5:46 pm

Ntasha sex and the cityMost stretched assBitch girl naughty slut whoreThumb
arthropasty surgery recovery timeJena haze likjes to fuckGay martiage should be between a maan and a womanAfrican nude 124Stephen dorfman nudeSezual harassmemt casrs aagainst autozone incTit pullin xndx Anim bondageVoyerr teen thumb moviesAveta nqked cosmicMasturbation iin femaleChew asiwn beaver passwordHalloween sex party picturesCriss cross breastLawrence county oh sexx offenders https://xxxxlulu.com/ Ms kai sex videosDiscression escorts
hull4 11 redhead modelIs miley cyrus lesbianTeen sex documentaryTentacle thruat ssex storiesMy ex etting fucked
atSemale latex tgpFree adult online videos xnxx Dana plato free pornNaked close ups
oof teenage chicksEngavement in commuynity based adulpt
educationHigh heel shors sexSleep creep porn clips freePorn tube old young lesbosAlyson stoner nwked picsPorn sar kelly couchSandi hatfield
porn videosTestosterone replacement therapy for transgenderFree passwods
for footjob footjobTwo guys and a girl anal

Reply

Leave a Comment