Home కవితలు పరాభవ నామ సంవత్సరం

పరాభవ నామ సంవత్సరం

స్వీయ రచన

పరాభవ నామ సంవత్సరం
ప్రభవించిన ప్రభాత కిరణం
ప్రపంచానికి ప్రశాంతాభరణం
ప్రసిద్ధమై వెలిగే కనకపుష్యరాగం!!

పరాభవనామ సంవత్సరం
పరుగున వచ్చిందని పరభృతం
పట్టలేని ఉత్సాహంతో, గూడెం, నగరం
ప్రజల శ్రమైక జీవన సౌందర్య గీతం
పరవశంతో చేస్తోంది సుమధుర గానం!!

ప్రకృతి రమణీయంగా పచ్చల హారంతో
సుదృక్కులా వలపుల కలశంతో
అమృత భాండంతో అరుదెంచింది
వికృత భావాలను విరిచి విసిరేసి!!

పరాభవమంటే, పరాభవాల పంకం కాదని
సరాగాలు సంరంభమని, వరాల వరదుడని
బరువులు బాధ్యతల కారాగారం కాదని
వరబడి దరిచేరకుండా వర్షం ప్రసాదిస్తుందని

సమస్త ప్రజానీకంలో ఆపాదమస్తకం
సుమ సమానమైనట్టి సౌకుమార్యం
తలిరి టాకుల ముగ్ధ మనోహర సౌందర్యం
కలిగించి,కలిమిచెలియై కష్టనష్టాల హననం !!

కావించి, కాల నియమాలననుసరించి
త్రికాలాల త్రిగుణాల సంసేవితయై
ఆరు రుతువులు ఆరు రుచులతో సంభావించి
హరిహరాదుల దయను ప్రసాదించి!!

కలివిడిగా తలలు నిమిరి ఊరడించి
తల్లి లా సాకె ఆ పేరును, పెద్దలు పూర్వీకులు
పరాభవ నామ సంవత్సరం అని ఎందుకు పెట్టారో?
తెలియదు కానీ తనను స్మరించిన చాలు
ఈప్సితాలను ఈడేర్చు ఈశ్వరుడు ఈకాలం !!

మిత్రులు హితులు శ్రేయోభిలాషులకు
పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

You may also like

2 comments

Kesharaju venkata Prabhakar Rao October 2, 2026 - 11:03 am

నా కవితను ప్రచురణ చేసిన మయూఖ అధిపతికి ధన్యవాదాలు

Reply
Kesharaju venkata Prabhakar Rao October 2, 2026 - 11:06 am

Very nice and useful magazine

Reply

Leave a Comment