కాలం మారి
వస్తుదాడిలో
నలుగుతున్న సమాజం
కమురువాసన
కొడుతుంటే
ఊరిలో
ఒకడుంటాడు
సాక్ష్యంగా
వాడికి దారి వదలండి.
గొంతును చింపి
వీధికి అంటిస్తాడు.
ఏ ఒక్కరూ ఆఖరు కాకూడదన్న
అతని నమ్మకమే
ఈ భూమికి…
మనిషికి,
మనసుకు ఊపిరి.
ఎవరూ ఆఖరు కారు
ఇంకొకరిలో మొదటిగా ఉంటారు.
