Home కవితలు 75 వసంతాల ‘‘మయూఖ’’ భారత ‘‘అమృతోత్సవ’’ పతాక

75 వసంతాల ‘‘మయూఖ’’ భారత ‘‘అమృతోత్సవ’’ పతాక

by Krishna Vaddepalli

నా దేశం వేద పునీత ` భగవద్గీత

నా జెండా శాంతి, అహింసల ‘ఎజెండా’ !

భరతుడు, రాముడు, కృష్ణుడు పరిపాలించిన

గౌతమ, ఆది శంకరాదులు ప్రవచించిన

గంగా, గోదావరి, కావేరి ప్రవహించిన

పావన జీవనక్షేత్రం ` నా దేశం,

విశ్వశాంతి సందేశం ` నా దేశం!

పురుషోత్తమ, చంద్రగుప్తుల ప్రతిఘటనల మార్గం

శివాజీ, ఝాన్సీల స్వాతంత్య్ర ఖడ్గం

సిపాయీల తిరుగుబాటుతత్వం

గాంధీజీ, నేతాజీ నేతల స్వాతంత్య్ర మనస్తత్వం

నా జెండా జవసత్వం !

హిమవన్నగం తలమానికంగా

వింధ్య గిరీంద్రం ఒడ్డాణంగా

కన్యాకుమారి పాదపీఠంగా

అలరారే భారతావని నా దేశం,

పాడిపంటల తులతూగే శ్రీకోశం ` నా దేశం!

హరిత భరిత సస్యశ్యామలం ఆకుపచ్చగా

త్యాగచరిత అరుణవర్ణం లేత ఎరుపుగా

శాంతి ` అహింసల సంకేతం స్వచ్ఛమైన తెలుపుగా

కలగలిసి ఎగిరే మువ్వన్నెల నా జెండా,

పులకిత భారతి మెడలో విరిసే పూదండా !

సాధించుకున్న స్వాతంత్య్ర విజ్ఞానంతో

నా దేశం నాకంలా వర్ధిల్లాలి,

నా జెండా ధర్మచక్రంగా విలసిల్లాలి.

You may also like

1 comment

తిరుమల జగన్నాథాచార్య, వేములవాడ June 23, 2021 - 10:31 am

అద్భుతంగా ఉంది సార్ దేశ ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు

Reply

Leave a Comment