Home కవితలు పలవరింత…

ప్రతిమలుపులో

దుఃఖాలను ఒంపుకున్న మనసు….

జీవితం సరళ రేఖయని ఎలా చెప్పను!

భ్రమలతో నిండుకున్న బతుకు

ముఖంపై ఆనందపు తెరలను ఎలా కప్పుకోను!

నిర్దయతో నిండుకున్న సమాజం

గాయాల సమూహాలను ఎలా విప్పుకోను!

ఎండిన గులాబీ రేకులతో ఈ తోట

వసంతాలనెలా పరిచయం చేయను!

శిథిలమైన పాత గోడలాంటి దేహం కప్పుకున్న శిశిరపు నీడలకు

చంద్రుడి వెన్నెల తప్ప ఇంకేమి చూపించగలను

You may also like

1 comment

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ April 19, 2022 - 3:48 pm

కవిత బాగుంది సార్.

Reply

Leave a Comment