Home కవితలు ఉరుకురుకి వస్తుంది ఉగాది పండగ!

ఉరుకురుకి వస్తుంది ఉగాది పండగ!

by Akkinepalli Venugopal Rao

ఉరకలువేసే ఉప్పెనలాగా ఉగాదివస్తుందుత్సాహంగా

గడపగడపలో మంగళకరమౌ మామిడాకులు పూలమాలలతొ
వత్సరానికే మొదటి పర్వమై
సత్సంపదలతొ చాల కాన్కలతొ !ఉరకలు ।

కొత్తబట్టలు కుట్టించుకుని
చెత్తభావాలు నట్టే ట కలిపి
ఆరు రుచులిచ్చు పచ్చడి తోడ
అంతులేని ఆనందాలివ్వగ !ఉరకలు !

మూఢనమ్మకం మూలన వేస్తూ
చీడపీడలను ఛేదన చేస్తూ
ఐకమత్యమే మన నినాదమై
లోకహితాలే ఘన నివాళులై
మంచి విద్యలే మనలక్ష్యాలని
మన సంస్కృతులే మహి విజయాలని !ఉరకలు!

పరాభవలోన ప్రపంచ మందున
అరాచకాలే అసలు వద్దనుచు
దురహంకారము దూరమవ్వగా
నరసంహారము నాపగోరెడు
మేధావులను మేల్కొన జేయుచు
సుధా లహరులను వసుధన నింపుచు!! !ఉరకలు !

You may also like

Leave a Comment