Home వ్యాసాలు జీవితంలో ఢక్కా మొక్కీలు తిని ఆవేదనను కవిత రూపంలో వెలువరించిన శ్రీదుబ్బాకుల కృష్ణ స్వామి!

జీవితంలో ఢక్కా మొక్కీలు తిని ఆవేదనను కవిత రూపంలో వెలువరించిన శ్రీదుబ్బాకుల కృష్ణ స్వామి!

by Achyutuni Rajasri

ఆయన లో వేదన మానసిక అశాంతిని సంఘర్షణను “స్మృతిపధంలో పద్మ” అని తన భార్య పేరుతో అచ్చేసిన పుస్తకంలో చూడవచ్చు.దానికికారణం కృష్ణ స్వామి నామాట లో నేటి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల తన భార్య మరణించారని స్పష్టంగా ఢంకా బజాయించి చెప్పారు.బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వారి ధనదాహానికి ఆమె బలైనారు అని ఐదులక్షలుగుంజి ఆపరేషన్ చేశారని ఆయన నిజాయితీగా నిప్పులు చెరిగారు.ఆమె భౌతిక కాయంని ఇంటిముందు ఉంచాక కన్నీటి ధారలో భావాలు పద్యాలుగా వచ్చాయి.బ్యాంకులో నామినీలేకపోతే పడే ఇబ్బందులు,తహశీల్ ఆఫీసుచుట్టూ ప్రదక్షిణాలను దుయ్యబట్టారు.ఆఖరున” కష్టంలేని మరణాన్ని, పరుల యాచించకూడని మరణాన్ని ఇవ్వమని శివుని వేడుకోటం నిజంగా ఆఖరి చరమదశలో అందరం కోరుకోవలసిందే సుమా!
24.6.1954 లోరంగారెడ్డి జిల్లాలోని తల్లారం గ్రామంలో పుట్టారు.తల్లిదండ్రులు రుక్కమ్మ, కొమరయ్యగౌడ్.తాత ఎల్లాగౌడ్ సమాజసేవకుడు,పల్లెవారికి పట్టుగొమ్మ ఆయన.

కృష్ణ స్వామి గారి మాటల్లోనే ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం-
నాకు 1972 లో ఇంటరు రెండవ సంవత్సరం చదువుతుండగా వివాహం జరిగింది. 1973 లో ఇంటరు రెంవసంవత్సరం చదువుతుండగా తీవ్రమైన కరువు వచ్చింది.పశువులకు మేకకరువయింది.మనుషులకుధాన్యం కారు వొచ్చింది.మానసికంగా ఆందోళన ఎక్కవైంది.చదువు మానుకున్నాను.అప్పుడు నాకు చిత్రకళ పై ఆసక్తి పెరిగింది. వ్యవసాయం చేస్తు చిత్రకళ సాధన చేశాను.నాగలి దున్నుతున్నప్పుడు ఎడ్లకు కొందసేపు విశ్రాంతినిచ్చేవాము ( దానని దమ్మకు నిలబెట్టుట ) అంటారు అప్పుడు నానాగలికి కట్టిన ఎడ్లను చిత్రిస్తుండే వాడిని.ఆబొమ్మను చూడగానే అది ఏ ఎద్దు అనేది అందరు వెంటనే గుర్తుపట్టేవారు.అప్పుడు మాతమ్ముడు ఆలూరు హైస్కూలలులో చదువుకునేవాడు.తెలుగుపండిత్ కృష్ణయ్యగౌడు సారు బాగా డ్రాయింగ్ ఏస్తాడని నాకు పరిచయం చేశాడు .ఆయన నాకు వాటర్ కలర్స్ ట్యఃబులు,బ్రష్ ఇచ్చాడు.నాకు అంతవరకు వాటర్ కలర్స్ బ్రష్ లు చూడలేదు వాటితో నేను వ్యవసాయం చేస్తు సమయం దొరికినప్పుడు సాధన చేస్తుండేవాడిని.కొన్నిరోజులు ఉద్యోగానికని హైదరాబాద్ లో మా బంధువుల ఇంట్లో ఉండగా ఫైన్ ఆర్ట్స్ కాలేజ లో ఇంటర్వూ ఇచ్చాను సెలెక్ట్ అయినాను.కాని ఖర్చులకు భయపడి మానుకున్నాను.అప్పుడే ఉద్యోగవేటలో నాకు హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో పుస్తకాలు చదివే అలవాటు అయినది. అదికూడ నాజీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుపు తిప్పింది.మళ్ళీ ఊరికి పోయి వ్యవసాయం చిత్రకళ సాధన మొదలు పెట్టాను. 1976 మార్చిలో షాద్ నగర్లో నారాయణ శంభు డ్రాయింగ్ టీచర్ వద్ద డ్రాయింగు పరిక్ష నిమిత్తం పదిలహరోజులు ట్యూషన్ వెళ్ళాను. అదే సంవత్సరం లో ఆగస్టులో మా ప్రక్క ఊరి ఒక పెద్దభనిషి తన మిత్రునికి ఉత్తరం వ్రాసి నన్ను IZRA లో పెయింటర్ గా చేర్పించాడు.ఇక అప్పటి నుండి 2006వ సంవత్సరం వరకు పెయింటర్ గా పనిచేశాను.డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన కారణంగా మా పెయింటర్ల ఉపాది ఊడిపోయి రోడ్లపాలైనాము .అప్పుడు మళ్ళీ వ్యవసాయంలో కే వెళ్ళిపోయాను.2024 మే 8 వె తేదిన నాభార్య మరణంతో ఊరునుండి హైదరాబాదు మాకొడుకులవద్దకు వచ్చాను..

1 కవిత్వం నాకు రావడానికి కారణం వాజిపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో 13 రోజుల్లో పడిపోవడం ఒక కారణం .
2 యన్ టి రామారావు గారిపై వైస్రాయి హోటల్ ఆవరణలో చెప్పులు విసరడం ఆయనను పదవీచ్యుతుని చేయడం బాధ కలిగించింది .
3 నేను మాకు తెలిసిన వారికి బ్యానర్లు వ్రాసిఇచ్చి డబ్బులడిగితే తిట్టడం మూడవ కారణం అప్పుడు నాలో బాధ ఏక్కవై వారిపై ఆశువుగా ఆటవెలదులలో పద్యాలలో నాభావాన్ని వ్యక్తపరుచు కున్నాను.కాని అనుకోకుండా ఎనభై శాతం ఛందస్సు కలిసిందని నాకు తెలిసిన టీచర్ కు చూపిస్తే చెప్పాడు.అప్పటికి నాకు ఛందస్సు రాదు.ఆయన ఛందస్సు పుస్తకం తెచ్చుకోమని సూచించారు.అది తీసుకొని ఒక్కొక్క ఛందస్సు నేర్చుకొని వ్రాయడం ప్రారంబించాను.అది 2001 వె సంవ్తసరం.అప్పుడు నేను శాకాహారం పై పద్యాలు వ్రాయడం ప్రారంబించి తొలిపుస్తకం విడుదల చేశాను. దానికి మంచి స్పందన రావడంలో ఇక వరుసగా వ్రాయడం మానలేదు.

మీరు నాచిత్రలనుఇచూడాలంటే ఫేస్ బుక్ లో ,లేదా నా వాట్సప్ స్టేటస్ లో, లేదా నా పర్సనల్ గ్రూపు ఉంది దుబ్బాకుల కళాసాహితి అందులో నాచిత్రాలు.మా పెద్దకుమారుడు వేసిన చిత్రాలు,నా సాహిత్యం,చూడవచ్చు అందులో చూసినా చూడకున్నా 24 గంటలలో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి.అందులో వేరేవారు పోస్టులు పెట్టరు.మీరు దేనినైన ఎన్నుకోవచ్చు.

పెద్దకుమారుడు చిత్రకారుడు జే యన్ టి యు లో డిప్లొమా చేశాడు.కాని దానిక సంబంధం లేని రాజేంద్రనగర్ మున్సిపల్ లో పనిచేస్తున్నాడు.చిన్నకుమారుడు ఆబిడ్స్ చెర్మాస్ లో చేస్తున్నాడు . ఇద్దరి కుమార్తెల వివాహాలు అయిపోయాయి.ఇద్దరు కుమారుల వివాహాలు అయిపోయాయి.అందరికి పిల్లలు అయినారు.

ఇక కృష్ణ స్వామిగారికి టైలరింగ్,మట్టి సిమెంట్ విగ్రహాల తయారీ,లాంగ్ సర్వే లో ప్రవేశం ఉంది.ఇక సమాజసేవకునిగా గ్రామంలో శివాలయనిర్మాణం, 1983,1984,1985లో శివరాత్రి మరునాడు కట్నంలేని పెళ్లిళ్లు చేశారు.
ఇక ఈయనకొచ్చిన పురస్కారాలు కోకొల్లలు.కృష్ణ సందేశం ని రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారుఎన్నుకొనితెలుగురాష్ట్రాల గ్రంథాలయాలకు పంపిణీ చేశారు.2012లో ప్రపంచ తెలుగుమహాసభల్లో ఉత్తమ కవిగా సన్మానం, స్వర్గీయ వెంకట్రావు పంతులుగారి ధార్మిక సాహితీ పురస్కారం ,హంపీపీఠాధిపతులు విద్యారణ్యభారతీస్వామివారు పీఠంతరుఫున భక్తిమందారాలు అచ్చేయించి ఆవిష్కరించారు.చిన్న జీయర్ స్వామి తిరుప్పావై విద్యాసంపుటికి మంగళాశాసనాలు వ్రాశారు.2014లోతెలంగాణ ఆవిర్భావ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సన్మానించారు.చేవెళ్ల మండల ఎం.ఎల్.ఎ. లాలె యాదయ్య గారు 10,116 నగదుతో సత్కరించారు.2016లోరవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి పద్యకవుల సమ్మేళనంలో పాల్గొన్నారు.పటేల్ శాంతమ్మ సాహిత్య పురస్కారం,డా.కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళాపీఠంవారి సన్మానం…ఇలా ఎన్నో,ఎన్నెన్నో!

ముద్రిత రచనలు _ శాకాహార శతకం కృష్ణ గీత, కృష్ణ సందేశం,శ్రీశివానందలహరి సౌందర్య లహరి తిరుప్పావై మొదలైనవి.

ఇటు సాహిత్యం కవితారచన అటు చిత్ర లేఖనంలో అందెవేసిన చెయ్యి ఓ అపురూప మణిదీపం

You may also like

Leave a Comment