రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. ఈ రామాయణాన్ని మనకు పరిచయం చేసిన కవిపుంగవుడు వాల్మీకి . రామ నామ మహిమ వల్లనే అటవీకుడగు వాల్మీకి రామాయణ గ్రంధాన్ని జగతికి అందించాడు. మనం నిత్య జీవితంలో కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం, చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధుమిత్రు సమేతంగా హతమార్చి విభీషణుకు పట్టం కట్టి సీతా సమేతముగా అయోధ్యగా చేరుకున్నాడు. భారతదేశంలో భాషలు వేరైనా రామాయణము తెలియని మనిషి ఉండడు.
మన దేశంలో పిల్లలకు చిన్నతనము నుండి రామాయణం గురించి కథలుగా చెబుతారు పెద్దలు. రాముడు సర్వ లక్షణ సంపన్నుడని ఆయన గుణ గ ణాలను వర్ణిస్తూ ఆయనలా నడుచుకోమని చెబుతారు. ఆఖరికి నిద్రపుచ్చేటప్పుడు కూడా ” రామాలాలి మేఘశ్యామా లాలీ ” అనే జోల పాట పాడి నిద్ర పుచ్చుతారు . వయసు మళ్ళినవారు రామకోటి రాయడం, నిత్యం రామ నామ స్మరణ చేయడం వలన మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. అంతలా రాముడు మన జీవితాలతో ముడివేసుకుపోయాడు. ఎంతో కష్టపడి అయోధ్యలో రామ మందిరం కట్టుకోవడం మన హిందువుల రామ భక్తికి నిదర్శనం. సీతమ్మ నడవడిక కూడా ఎంతో ఆదర్శ దాయకం మహిళలకు. రామ, లక్ష్మణ భరత,శత్రుఘ్నుల సోదర భావము ఎంతో ఆదర్శనీయమైనది. ఇద్దరు అన్నదమ్ములు కలివిడిగా ఉంటే రామలక్ష్మణుల్లా ఉన్నారు రా అంటారు. రాముడు ఎంత గొప్పవాడైనా’ సీతాపతి “అని పిలవబడటం ఆ రోజుల్లోనే ఆడవారికి ఎంత గౌరవం ఇచ్చారో తెలుస్తుంది
అందుకే రామాయణం ఆపాల గోపాలానికి ఆదర్శం.
V. Kameshwari
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను తల్లి
నేనే ప్రపంచమై బ్రతికిన ఓ అనురాగమయీ
ఇది
నవమాసాలు మోసి.
పుట్టు నొప్పులు భరించి
నాకు జన్మనిచ్చిన మాతృ మూ ర్తీ…
లాలీ లాలీ అనే జోల పాటలు పాడి
చందమామను చూపి గోరుముద్దలు పెట్టి
ఒకటి రెండు అంటూ….అంకెలు నేర్పి
చిట్టి పద్యాలు పలికించి
తొలి అడుగులలో తడబాట్లనూ
బతుకు బాటలో పొరపాట్లను
సరిదిద్ది
మమ్ము పరిపూర్ణులుగ చేసే
ఆది గురువయ్యావు
ఓ అమృత వల్లి
నీ మనసు ఆకాశమంత
ఓర్పు భూదేవిని మించి
త్యాగంలో తరువుకు సరిసాటి
అమ్మ!
నీవు నిత్యం శ్రమించే గుప్త కార్మికురాలివి
నేను నీకు ఇవ్వ గలిగేది మనసారా
“పాదాభివందనం”మాత్రమే.
ఆరోజు ఉదయం ఐదు గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నిద్ర లేచిన వాసంతి అరచేతులు చూసుకొని మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకొని హాలు లోకి రాబోయింది. అప్పుడే తన గదిలోంచి రాబోయిన అత్తగారు కనిపించింది . వాసంతి కి ఎక్కడ లేని కోపం వచ్చి ” ఏమిటి అత్తయ్య గారు… ప్రొద్దుటే ఎవరికీ ఎదురుపడకూడదని తెలియదా.ఈరోజు ఏమి దాపరించబోతుందో ఏమో ” అని అనుకుంటూ వంటింట్లోకి దారితీసింది. అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు. కోడలు లేవగానే కాఫీ కి ఇబ్బంది ఉండొద్దని! వాసంతి తయారయి ఆఫీసుకు వెళ్లబోతుంటే గడప కొ ట్టుకొని పడబోయి , ఆపుకుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్లు ఇమ్మని అడిగి ” ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా, మొదలయ్యాయి అశుభాలు. మీకు ఆ మాత్రం ఇం గి త జ్ఞానం లేదా ” అంటూ అరచింది. “రోజు నీవు లేచేటప్పటికి పొద్దుపోతుందని, ఆఫీసుకు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా, క్షమించమ్మా ” అంది దీనంగా అత్తగారు. ఇది రోజు జరిగే తతంగమే కదా అని వాసంతి విసుక్కుంటూ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళింది.
“ఏమిటో కొడుకుకేమో వేరే ఊర్లో ఉద్యోగం, నా బ్రతుకు ఇలా ఉంది” అని మనసులో బాధపడ్డారు. చాలా మంది అత్తగార్ల లాగానే ఈ అత్తగారు కూడా!కాలంఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకరోజు వాసంతి తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తల్లి ఎందుకో ఏడుస్తోంది. వాసంతి కంగారుగా ” అమ్మ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ బాగున్నారా? విషయం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ” గట్టిగా కోపంగా అరిచింది. దానికి ఆవిడ ” వసు ఏమని చెప్పను! మీ అక్క వనజ ఆత్మహత్యకు పాల్పడిందట ఉరి వేసుకుని. ఇప్పుడే కబురు తెలిసింది. నేను మీ నాన్న తట్టుకోలేకపోతున్నాం. నువ్వు వస్తే ఒకసారి మనం కలిసి అక్కడికి వెళ్దాం. దాని పిల్లలు ఎలా ఉన్నారో అని మీ నాన్న తెగ ఇది అయిపోతున్నారు అంది. దానికి వాసంతి ” అక్క ఎందుకు అంత అగత్యానికి పాలు పడింది. అసలే బావ లేరు. పిల్లల ముఖమైనా చూసి ఉండాలి కదా” అని అంది. దానికి వాసంతి తల్లి ” ఏమి చెప్పనమ్మా మీ బావ పోయిన తర్వాత అక్కడ మీ అక్క అగచాట్లు చెప్పలేము. కూర్చుంటే తప్పునుంచుంటే తప్పు.దాని అత్తగారట,”నీ దురదృష్టం వల్లే నా కొడుకు పోయాడు, ఈ పాడు ముఖాన్ని చూడలేక మేము చస్తున్నాం. తెల్లారి నీ మొహం చూడకపోతే మాకు గడవటం లేదు. మా మనుమలను చూచి నిన్ను భరిస్తున్నాను కానీ నీ మొహం చూసి కాదు” అంటూ నిత్యం దానిని సూటి పోటి మాటలతో దెప్పి పొడిచేది. దానికి విసిగి వేసారి ప్రాణాలు తీసుకోవడానికి ఒడిగట్టింది.” అని చెప్పి బాధపడింది.
తల్లి మాటలు విన్న వాసంతి లో వివేకం ఒక్కసారి మేల్కొది. తను అత్తగారిని చూసే పద్ధతి కి పశ్చాత్తాపం కూడా కలిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అత్తగారు ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే ఉంది . పిదపకాలపు మనిషి కనక ఎంతో ఓరిమి తో ఉంది. అక్క విద్యావంతురాలు . కానీ ఆవేశపరురాలు. ఆత్మాభిమానం ఉండాలే కాని మితిమీరకూడదు అక్క లాగా. అంత దాకా ఎందుకు! నేను ఒక ఆడదాన్నే కదా! విద్యావంతురాలని కూడా. ఎందుకు నాలో ఈ ఆలోచన రాహిత్యం ఏర్పడింది?”” ఆడదే ఆడదానికి శత్రువు” అన్న మాటను ఖండిస్తాను ఈ రోజు నుండి. ఆడదానికి ఆడదే ఆసరా అని చాటి చెబుతాను. చేసి చూపెడతాను ” అని అనుకుంది వాసంతి.
అత్తగారి గదిలోకి వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పి, “ఇప్పటిదాకా జరిగినదానికి చింతిస్తున్నాను. నన్ను మీ కూతురుగా భావించండి ” అని అం ది.జరిగినదంతా అత్తగారికి వివరించి నేను ఇప్పుడు అమ్మ గారి ఇంటికి వెళ్తున్నా నని, మీరు టైం కి ముందు లేసుకొని జాగ్రత్తగా ఉండండి, పనిమనిషి తో కూడా చెప్పి ఉంచుతాను, మీ అబ్బాయికి కూడా ఫోన్ చేసి చెప్తాను” అంటూ ఆటో ఎక్కింది. తల నిండా అక్క ఆలోచనలే ” వీలైతే అక్క పిల్లల్ని తెచ్చుకుంటే బావుంటుందేమో ” అనే చిరు ఆశ కూడ మొలకెత్తింది.
శ్రీరామనవమి సందర్భంగా
రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధు,
మిత్ర, పుత్ర పరివారంతో సహా సంహరించాడు. విభీషణని కి రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం చేశాడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇదంతా క్లుప్తంగా చెప్పిన రామ కథ. కానీ దీనిని మన పెద్దలు”కొట్టే, కట్టే, తెచ్చే” అనే మూడు మాటలతో చెప్పుకునేవారు. అలా అంటే రామాయణం అంతా జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడైనా ఎవరైనా పని సులువుగా చేసుకొస్తే ఈ మాటే వాడతారుపట్టాభిషేకం విధాలా మనకి. రాముడు మంచి బాలుడు అంటాం బుద్ధిమంతుడైన పిల్లాడిని చూసి . మంచి పరిపాలన చూసి రామరాజ్యం అంటాం. దంపతులను చూసి సీతారాముల ఉన్నారంట. పురుషుడు రాముని వలె ఏకపత్నీవృతుడు అయి ఉండాలంటా. సహనశీలుని రాముడు అంత సహనం కలవాడు అంటాం. ఎవరైనా కష్టాలు పడుతుంటే రాముని కష్టాల కంటే గొప్పవా అంటాం.
ఇక్ష్వాకులను గురించి వశిష్ట విశ్వామిత్రులు ఇలా అన్నారు” సదృశ్య ధర్మ సంబంధః సదృశవరూప సంపదా “అని. వేలాదిమంది బలాఢ్యులు ఎంతో కష్టపడి తీసుకువచ్చిన శివధనస్సును ఎక్కుపెట్టే సమయంలో వాల్మీకి రాముని గురించి ” పశ్యతాంనృ సహస్రానాం బహు నామ్ రఘునంద నః., ఆరోప వత్స ధర్మాత్మ సలీలమిమ దద్దను హు “. నీ పరాక్రమాన్ని చూపించు అనేటట్టుగా.
జనకమహారాజు తన కూతురిని చూపించి ” ప్రతి వ్రత మహాభాగ ఛాయావాను గత సదా ‘” అని చెప్పి కన్యాదానం చేశాడు. అందుకే సీత ఆయనను వెన్నంటి ఎప్పుడూ ఉంది. ఇప్పటికి కూడా ఉంటోంది.
లక్ష్మణుడి విషయానికొస్తే తల్లి సుమిత్ర రామునితో అడవికి వెళ్లడానికి అంగీక రిస్తూ ” రామ దశరథం విద్ధిమామ్ విద్ధి జనకాత్మజామ్ అయోధ్య మండలి విద్ధి గచ్చ తార యధా సుఖం “అంది. సుమిత్ర ఎంతటి ఔదార్యరాలో తెలుస్తోంది.
భరతుని విషయానికొస్తే కైకేయి అంది”త్వత్ కృతే మయ సర్వమేతం విధం కృతమ్.'” ఇదంతా నీ అభ్యుదయం కోసమే చేశానంది. అప్పుడు భరతుడు ” బలమైన ఎద్దు మెడపై ఉంచవలసిన కాడిని లేగ దూడ మెడ పై పెడితే మొయ్యగలదా? రాజ్య భారం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అది వహించడం రాముడే చెల్లు అన్నాను “. రాముని దగ్గరికి వెళ్లి రామపాదకులు తెచ్చుకుని వాటికి రాజ్యభిషేకం చేసి రాజ్యాన్ని పాలించసాగాడు. అంటే ధర్మాన్ని ఎంత ఎలా పాటించాడో చూడండి.
సీతా రాముని గురించి ఏముందో ఏముందో”” దధ్యాన్న ప్రతి గృ హిణి యాన్న బ్రుయాత్ కించిత ప్రియం అపి జీవిత వేతోర్వా రామః సత్య పరాక్రమః ” అతడు సత్య పరాక్రమడు. ఎవరికైనా ఇవ్వడమే తప్ప ఎవరి నుండి తీసుకోడు. ప్రాణం పోయినా ఎవరితోనూ అప్రయంగా మాట్లాడడు
రామ రావణ యుద్ధంలో ఇంద్రుడు వస్తే పోయిన వారిని బతికించమని ఇలా అడిగాడు”” మమ హే తో పరాక్రా నా ఏ గతా యమ సాధనమ్, తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరః “” ఎంత దయాద్ర హృదయుడో ఈ రాముడు కదా.
ఒకసారి లక్ష్మణుడితో”‘” ధర్మాన్ని పాటించడం వలన అర్థ కామాలు వెంటనే లభించకపోవచ్చు. అటువంటి అప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి. అర్ధాన్నే ప్రధానంగా చూసేవారిని లోకం ద్వేషిస్తుంది. కామమే ప్రధానంగా ప్రవర్తించే వాడికి గౌరవం ఉండదు.”’ అంటాడు. ఋజు స్వభావాన్ని ఎలా విశదీకరించాడో కదా. “” ఆత్మా నామ్ మనుషo మన్యే రామం దశరదాత్మజం ”” అన్నాడే కానీ నేను భగవంతుని ఎప్పుడూ చెప్పుకోలేదు శ్రీకృష్ణుని వలె.
సుగ్రీవుణ్ణి మా నలుగురికి నువ్వు ఐదవ సోదరుడివి అని చెప్పాడు. . ఆఖరికి హనుమంతుడిని “” తేజోధృతి యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయః, పౌరుషం విక్రమో బుద్ధిర్ యాస్మిన్నే తాని సర్వదా.” అని పొగిడాడు అంటే ఎవరికి ఎప్పుడు తేజస్సు, నేర్పు, ధైర్యం, యశస్సు సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి కలవాడు. రాముని యొక్క వినయానికి ఇదొక నిదర్శనం.
“” ఏ మమే తత్పురా వృత్తా మా ఖ్యా మ్ భద్ర మస్తవః ప్రవ్యహరత విస్ర బ్ద ం బలం విష్ణు ప్రవర్ధితాం “” అని వాల్మీకి చివర రామ కథకి ప ల శృతి కూడా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే”” ప్రజలారా! ఈ రామాయణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ కథను దృఢ విశ్వాసంతో చెప్పండి. మీకు క్షేమం కలుగుతుంది. ఆ మహావిష్ణువు యొక్క బలం తేజస్సు వృద్ధి చెందుగాక!.
కనుక మనందరం రామ మార్గంలో నడుస్తూ ఈ కష్టమైన కలియుగంలో కాస్త ద్వాపరయుగంలోని రామరాజ్యాన్ని అనుసరిదాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ” పుంసాం మోహన రూపాయ ” అయిన ఆ రామచంద్రునికి మంగళాలు పలుకుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు.x
