ఒక ఊళ్లో ఒక బాబు జన్మించాడు. అతనికి ఆకలిగా ఉన్నప్పుడు నోరు ఎట్లా తెచ్చుకోవాలో తెలియకుండేది.
తన తల్లి చేతికి ఏది అందితే అది ప్రేమతో అందించేది. ఒక కప్పు పాలు, ఒక స్పాంజ్ ముక్క, ఆలుగడ్డ సూప్, ఓట్ల జావ, కోడి చారు ఇంకా ఎన్నో ఇటువంటి వస్తువులు పదార్థాలు ఇచ్చేది. నీకు ఏది కావాలో అది తీసుకో అన్నది తల్లి .
తనకు పేరు పెట్టకముందే అతని ముందర ఏది పెడితే అది తినేస్తున్నందుకు అతన్ని ‘తిండిబోతు’ అని పిలవడానికి అందరూ నిశ్చయించారు. కానీ , త్వరలోనే అతనికి తిండి పెట్టకముందే ఏది కనిపిస్తే అది తినడం మొదలుపెట్టాడు. అట్లా తింటున్నాడు కాబట్టి అతణ్ణి ‘అత్యాశపరుడ’ని పిలవడం మొదలుపెట్టారు. ఆ పిల్లవాడి జీర్ణశక్తి ఎంత ఎక్కువ అంటే మొత్తం రొట్టె ముక్కను ఓ రాస్ బెర్రీ ఫలాన్ని మింగినట్టు మింగేవాడు . ఇంకా ఎప్పుడైతే ఒక ముక్క కూడా ఇంట్లో లేనప్పుడు, అతను టేబుల్, చైర్లు వాటినే కాకుండా బెడ్ రూంలో బెడ్ వంటివీ మింగేసేవాడు. తర్వాత తోటలోకి పోయేవాడు. అక్కడ చెర్రీస్ ఇష్టపడి మొత్తం చెట్టుని ఇదో లెక్క అన్నట్టు తినేవాడు. గేటును వెదకకుండా ఫ్రెండ్స్ నే మింగేసి , గ్రామం లోకి చేరి దారిలో కనబడినవన్నీ తింటాడు .
గ్రామస్తులను భయకంపితులను చేశాడు . అతడు ఇంకా చంటి బాబు కాదు . అతను చాలా పెద్ద కడుపుతో ఒక పెద్ద ఆజానుబాహుడు. పక్క ఇంటి ద్వారం నుండి లారా అనే ఒక అమ్మాయి ఏమంటుందంటే….అతను అట్లా పోలేడు అన్నది. తను పాఠశాలకు పోవటానికి ఆలస్యం కాకుండా టైం కు లేచేందుకు గడియారాన్ని కి అలారం కు కీ ఇచ్చింది. అతను ఇక ముందు మనను కూడా తినేస్తాడు. అని ఆమె చెప్పింది వాస్తవమే కూడా! ఆలస్యం కాకుండానే ఆ తిండిబోతు లారా ఇంటిని మొత్తం మింగేసాడు
అదృష్టవశాత్తు మర్నాడు ఉదయాన్నే అలారం మోగింది. ఆ ధ్వనికి ఆ తిండిబోతుకు ఎంత షాక్ అయిందంటే…. తను నోరు తెరిచాడో లేదో ఇంటిని తిరిగి వాంతి చేసాడు. దాని తర్వాత అతడు తన ఎక్కువ ఆకలిని కోల్పోయాడు. కొద్ది కాలానికి అతణ్ణి వాళ్లు ఇంకా తిండిబోతు అనేవాళ్ళు . కానీ చివరకు అతనికి ఆల్బర్ట్ అనే పేరు పెట్టారు. అతను కూడా అందరి వలెనే చిన్న బాలుడైనాడు.
ఒద్దిరాజు మురళీధరంరావు
ఒక రెండు చిట్టెలుకలు వంట సామాను గదిలోకి పోయి, ఒక గూటిలో మీగడ తునక దొరికించుకున్నవి. మనం దీన్ని పంచుకుందాం అని దాని గురించి మాట్లాడుకున్నవి. “నేను పెద్దదాన్ని కాబట్టి నాకు ఎక్కువ భాగం కావాలి” అన్నది పెద్దది.
” ఓహో ! అదేం కుదరదు” అని అన్నది చిన్నది. “నాకే ఎక్కువ భాగం కావాలి. ఎందుకంటే నేను తిని నీ అంత ఎదగాది ” అని .
ఇలా అనుకుంటూ కాసేపు అవి వాదులాడుకొని మరుసటి రోజు నిశ్చయించుకుందామని పక్కకు పెట్టేసాయి .
మరుసటి రోజు ఉదయం కలిసి పెద్దది చిన్నదానితో “నువ్వు అన్నదే కరెక్ట్. నీవు అనుకున్నట్టే మీగడ తునకను పంచుకుందాం”అని .
అట్లా అనగానే” ఓహో అట్లా కాదు” అని అంది చిన్నది.” ఓ నువ్వన్నదే కరెక్టు” అని పెద్దది. “ఓ నువ్వు అన్నదే కరెక్ట్ “అని చిన్నది ఇలా వాదలాడుకొని చివరకు మర్నాడు తిందాం లే అని ఆ రాత్రి దాన్ని పక్కకు పెట్టి పడుకున్నాయి.
మరుసటి రోజు వంట సామాను గదిలో మళ్ళీ కలిశాయి. ఈసారి రెండు ఒకేసారి” నాకు తెలుసు” అని అన్నవి. ఈ మీగడ తునకను సమానంగా మన మధ్య పంచుకుందాం అని అనుకున్నాయి. కానీ రెండూ కూడా మీగడ తునకను చూసే వరకు అది పాచిపోయింది. పెద్ద ఎలుక అన్నది “మనం దాని గురించి అంతగా విచారించకపోనుంటిమి, దాచిపెడితే పాచిపోయింది!”.
గ్యాస్ కోయినేకు ఐదుగురు పిల్లలు. వాస్తవంగా పిల్లలేనని గ్యాస్ కోయినే అనేవాడు. చాలావరకు ఐదు పిల్ల మొసళ్ళ వలె ఉన్నారు. ఆమె అన్నది నిజమే. ఆ ఐదుగురు ఉదయం నుండి రాత్రి వరకు కోట్లాడుతూ తలలు పడిపోయేంత అరుపులు అరుస్తూ తగిలించుకున్న దెబ్బలు చూపించేందుకు కన్నీరుతో ఒకరి తరువాత ఒకరు ఇల్లు చేరేవారు. చేతులీడ్చుకుంటూ గ్యాస్ కోయినె భార్య ఇలా అయితే మేము ఉండలేము అన్నది. నాకు ఒక్కక్షణం శాంతి దొరకడం లేదు. నేను త్వరలో నా బలహీనమైన నరాలు కోల్పోతాను. మిస్టర్ గ్యాస్ కోయినె ఆమె అన్నది అంగీకరించాడు. అది ఆమె బాధను ఎప్పటికన్న ఎక్కువ చేసింది. తల ఊపుకుంటూ కూర్చోకు. ఏదో ఒకటి చెయ్యి అని అతని మీద అరిచింది. కానీ అతను ఏమి చేయాలో తోచక, ఏదో ఒకటి చేయాలని ఆలోచించాలి. ఎందుకంటే పిల్లల అల్లరి, గులిగే భార్యను భరించలేకపోయాడు.
ఆ రోజు అతను పిల్లలులేని మిత్రుడిని కలవడం జరిగింది. అతను ఏదో ఉద్యోగం కోసం చూస్తున్నాడు. వెంటనే, గ్యాస్ కోయినేకు ఒక ఆలోచన వచ్చింది. ఆ టౌన్ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు కట్టించి, దాంట్లో కనీసం ఒక సగం రోజు ఊరి వారి పిల్లలను ఉంచి, తన మిత్రుడు వాళ్ళను చూసుకుంటూ ఉండొచ్చు కదా? వాళ్లకు చిరాకు కలగకుండా తన మిత్రుడు వాళ్ళకు ఏదో ఒకటి బోధించ వచ్చు గదా. చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం చేయవచ్చు కదా. అది ఆ పిల్లలకు చాలా ఉపయోగకరం కూడా. ఆ రకంగా అదే మొదటి పాఠశాలగా ఆరంభించారు. ఆ టౌన్ పిల్లలకు మొదటి ఉపాధ్యాయుడు దొరికాడు. ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది. ప్రత్యేకంగా ఆ ఐదుగురు గ్యాస్ కోయినె దయ్యాలవంటి పిల్లల అల్లరితో.
వేన్ రైట్సు అనే అతనికి ఒక కోళ్ళగుంపుతో పాటు ఒక హాట్ స్టర్ అనే పుంజు మరియు గ్లోవర్సు అనే అతనికి కోళ్ళ గుంపుతో పాటు గర్వం కల ఒక పుంజు వుండెను. కోళ్ళు తిరిగే రెండు జాగల మధ్య ఒక పెద్ద చెత్తకుప్ప వున్నది. చాలాకాలం వరకు రెండు పుంజులకు ఆ చెత్తకుప్ప గురించి ఏమీ తెలియలేదు. కానీ అవి వాటి పెట్టలను దూరం దూరం తీసుకపోయినావో ఒకరోజు ఆ రెండు చెత్తకుప్పపైన కలవడం జరిగింది. ఆ రెండు ఒక దాని ముందు రెండవది కోపంగా ముక్కు ముందరికి అంటూ రెక్కలు ఆడించాయి. ఆ పెట్టలు వాని యజమానులు ఎట్లు సదురుకుంటారో ఎదిరి చూసాయి. ఈ చెత్తకుప్ప వేన్ రైట్సుకు చాలాకాలం నుండి చెందియున్నదని హాట్ స్టర్ గట్టిగా అంది. మేము ఇక్కడ మేత మేయుటకు అర్హులం అంది. కానీ గర్వం కలది తిప్పికొట్టింది. అది శుద్ధ అబద్ధం. ఆ చెత్తకుప్ప గ్లోవర్సుకు చెందినదని, ఇది మాది అని గట్టిగా అంది. చాపమొహం దానా ఇది మాది అని అరిచింది హాట్ స్టర్. ‘ఇది మాది, బలిసిన తలదానా!’ అని ప్రౌడ్ కోంచ్ నోరు మూయించింది. ఒకవేళ నీ గుంపును వెంటనే, ఇక్కడినుండి తీసుకపోకపోతే కోపంగ హాట్ స్టర్ నీ కంటి గుడ్లు పీకేస్తా నంది. నీ గుంపును ఇక్కడినుండి వెంటనే తీసుకపోకపోతే నీ రెక్కలను పీకేస్తాను మరియు నీవు మొండి శరీరంతో నడవగలవు అని ప్రౌడ్ కోంచ్ నోరు మూయించింది. ఈ తీరుగ అవి నోటికి వచ్చినట్లు ఒకదాని మీద ఒకటి అవమాకరమైన తిట్లు మరియు భయంకరమైన బెదిరింపులు చేసుకున్నాయి. ఇది ఒక గంట తరువాత మరో గంట సాగింది. ఈ రెండు పుంజులు అలసిపోయి చుట్టూ చూశాయి. అప్పుడు అక్కడ చెత్తకుప్ప మొదట్లో వేన్ రైట్సు మరియు గ్లోవర్ల పెట్టలు పక్కపక్కనే కలిసి గింజలు సంతోషంగా ఏరుకుని తింటున్నాయి. అప్పుడు ఆ పుంజులు సిగ్గుపడి తలలు వంచుకొని అక్కడినుండి ఇంటివైపు వెళ్ళాయి. వాటిలో ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో తెలుసుకోండి.
”కలిసి ఉంటే కలదు సుఖం”.
మన చుట్టూ ఉన్న సమాజంలో అనేకమైన సంఘటనలు మనలో ఎన్నో అలజడులను సృష్టించి మనసును కకావికలం చేస్తాయి. కవులు, రచయితలు ఆ భావోద్వేగాలను తమ రచనల ద్వారా బహిర్గతం చేస్తారు. ఆ విధంగా వెలువడినదే ధూళిపాళ అరుణ రచించిన “మిగిలేవి గురుతులే” కథా సంపుటి. ఇందులోని కథలన్నీ వాస్తవ జీవన చిత్రణలే. తనకళ్ళ ముందు కుటుంబాలలో జరిగిన అనేక వెతలను ఆమె కథలుగా మలచింది. అవన్నీ యథార్థ గాథలే. స్వతహాగా కవయిత్రి కూడా కావడం వల్ల కొంత కవితా శైలి కూడా కనిపించి పాఠకుల హృదయాలను హత్తుకుంటుంది.
పుస్తకం పైన కవర్ పేజీ ఎంతో రంధితో కూడుకున్నదిగా కనిపించి చివర పేజీలో ‘హమ్మయ్య! పుస్తకం పూర్తయింది’ అన్నట్టు నవ్వు ముఖం కనిపిస్తుంది. ఇందులోని 15 కథలూ వాస్తవాన్నిచూపిస్తూ ఆసక్తికరంగా ఉండి పాఠకులను చదివింప జేస్తాయి. కథల్లో అక్కడక్కడా కొన్ని వాక్యాలు తెలుగు భాషలో చెక్కబడినవా? అన్నట్టు తోస్తాయి. నేను కథల విశ్లేషణ జోలికి వెళ్లకుండా నాకు నచ్చిన అలాంటి కొన్ని వాక్యాలను ఉదాహరిస్తాను.

“మునుముందుకు నడవడమే మనిషి కర్తవ్యం”
మనిషి జీవితానికి ఎన్నో సవాళ్లు, ఎదురీతలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతూనే ఉండాలన్న కర్తవ్యబోధ ఇక్కడ కనిపిస్తుంది.
“బలహీనంగా ఉన్నంతవరకు సమాజం అణచి వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది”
ప్రస్తుత కాలంలో బలమున్న వాడిదే పైచేయిగా ఉండడం మనం గమనిస్తున్నాం. అదే బలహీనుడైతే సమాజం అణచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇది సమాజస్వరూపం.
“రక్షించవలసిన తండ్రే కాటేస్తే సమాజం ఏం చేస్తుంది? నీడనివ్వని చెట్టువల్ల ప్రయోజనం ఏమిటి?”
వీరేశ్ కూతురు మీద చేసిన అఘాయిత్యాన్ని వివరిస్తూ రచయిత్రి చెప్పిన పాఠకులను ఆలోచింపజేస్తాయి.
కనుల నీరు పెట్టిస్తాయి.
“కంటిలో నుండి ఊట బావి లాగా నీరు ఊరుతూనే ఉంది”
“కళ్ళు నిండు తటాకాలయ్యాయి”
“నిద్ర ఎక్కడో ముఖం చాటేసింది”
“కన్నీటికి కన్ను నిరంతర ఆవాసమైంది”
ఇలాంటి కవితాత్మక వాక్యాలు అరుణలోని కవయిత్రిని మనముందు నిలబెడతాయి.
“నాపై వేలాడదీసిన కాలసూచి రాత్రి రెండుగంటలు దాటినట్టు చూపిస్తోంది”
గోడమీద గడియారాన్ని గురించి అన్యాపదేశంగా రాసిన ఈవాక్యం రచయిత్రి రచనా ప్రతిభను తెలియజేస్తుంది.
“కొన్ని తొందరపాటు నిర్ణయాలు, కొన్ని ఆలస్యపు నిర్ణయాలు జీవితాంతం శిక్షను విధిస్తాయి”
జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి తొందరపడటం, మరొక్కసారి సమయానికి సరైన విధంగా తీసుకోకపోవడం. ఈ రెండూ ప్రమాదమే. వాటివల్ల జరిగే అనర్థం ఒక్కోసారి యావజ్జీవితం అనుభవించాల్సి ఉంటుంది. ఎంతో
అనుభవం గడిస్తేనే ఇలాంటి వాక్యాలు రాయడం సాధ్యమవుతుంది.
మరో కథలో….
“ఏ శిల్పానికైనా ప్రాణం కళ్ళే కదా! గీయడంలో కొద్ది తేడా అయినా అందమంతా చెడిపోతుంది”
వినాయక విగ్రహాలను చేసే కుటుంబాన్ని గురించిన ఈ కథలో విగ్రహాన్ని ఎంత బాగా తయారుచేసినా కళ్ళను చిత్రించడంలో ఏమాత్రం తేడా వచ్చినా బొమ్మ అందం చెడిపోతుందని చెప్పడం ఆమెకున్న అవగాహనను తెలియజేస్తుంది.
అదే కథలో….
“హృదయపు త్రాసు కూతురి వైపు మొగ్గింది”
“తనకన్నా బిడ్డ జీవితమే ముఖ్యమనుకున్న తల్లి గుండె బలహీనమై కొట్టుకోవడం చేతగాక ఆగిపోయింది”
అనే వాక్యాలు మాతృత్వపు త్యాగానికి అద్దం పడతాయి.
ఇంకో కథలో….
“జీవితమంతా పోరాడిన ఆమె మరణం కోసం పోరాడలేదు”
ఒక స్త్రీ జీవితమంతా కష్టాలలో మునిగి,
అకాల మరణంతో హఠాత్తుగా చనిపోవడాన్ని గురించి చెప్పిన వాక్యమిది. ఏ అనారోగ్యం, వార్ధక్యం మీద పడకుండానే ఆమె సునాయాసంగా మరణించడం ఒక విధంగా ఆమె పాలిట వరమే. కనీసం మరణ సమయంలోనైనా ఎలాంటి బాధ ఆమె పొందకపోవడం
ఒక రకంగా అదృష్టమే.
“లోకంలో ప్రతి మనిషికి సలహా చెప్పడమంత సులువు మరేదీ ఉండదేమో?”
ఇది అందరికీ అనుభవమే. చాలామంది వాళ్ళు ఆచరించని ఎన్నో విషయాలను ఇతరులకు సలహాలుగా ఇస్తుంటారు. లోకం పోకడ ఇది.
ఈ విధంగా ఈ కథా సంపుటిలో సమాజానికి, వ్యక్తులకు అన్వయించగలిగే ఎన్నో వాక్యాలను ధూళిపాళ అరుణ గారి కలం నుండి చూడగలం. ఇలాంటి రచనలు ఆమె ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.
హిల్దా అనే యువ వయసులో ఉన్న అమ్మాయి, అంత తెలివైనది కాదు. ఇంకా దానికితోడు అత్యాశాపరురాలు. ఒకరోజు తన మేనత్త తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. తన వద్ద నీకోసం వివాహ డ్రెస్సు ఉంది. అదేగాక ఇంకో అదనపు డ్రెస్సు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నేను రెండు పెట్టెల్లో ఒక్కో వస్తువు పెట్టాను. దానిలో ఏదో ఒకటి నీవు ఎంచుకోవాలి. మొదటి పెట్టెలో ఈకలతో చేసిన బహుమతి. రెండవ దానిలో లోహంతో చేసినది. ఒకటి ఖరీదయినది, రెండవది కాదు. తూకంలో రెండూ ఒకేలా ఉంటాయి. జాగ్రత్తగా విచారించు నీకు ఏది కావాలో. అది నిర్ణయించేందుకు హిల్దాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆమెకు ఈకల కన్న లోహము విలువైనదని మరియు బరువైనదని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఎక్కువ విచారించకుండా ఆమె రెండవ పెట్టెను ముట్టుకుంది. ఆమె మేనత్త రెండు పెట్టెల మూతలు తెరిచింది. ఒకదానిలో ఏ పెండ్లికొడుకైనా ఇష్టపడే మెత్తని ఈకలు ఉన్నాయి. రెండవ దానిలో ఒక పాత రంద్రాలు పడిన చారు గిన్నె ఉన్నది. హిల్దా తొందరపడ్డది మరియు అప్పటినుండి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త పడటం చేస్తుంది. ఆమె వివాహం జరిగాక ఆమె మేనత్త ఎలాగూ ఆ మెత్తని దిండు ఆమెకే ఇచ్చింది.
ఏ పనికైనా తొందరపడటం మంచిది కాదు.
ఒకరోజు ఉదయం ఒక అమాయకపు పిల్లి ఒక ఇంట్లో వంట సామాను గది ముందర ఒక ఎలుకను పట్టుకుంది. పిల్లి తన పెద్ద పంజాలో దాన్ని పట్టుకున్నప్పుడు ఎలుక అంది ”నీవు నన్ను తినే ముందు నన్ను నా తిండి తిననీయవా?” అని. ముఖ్యమైన విషయం, అమాయకపు పిల్లి తన పండ్లు చూపుతూ అదా నా తిండి అంది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడలేవా? అని ఎలుక పలికింది. ఇంత అందమైన ప్రాణిని చంపేయడం దారుణం కాదా? ఆ పిల్లి తన చేజిక్కిన ఆహారాన్ని కిందా, మీదా చూచి అది చాలా అందంగా ఉందనుకుంది. ఆ ఎలుక అమాయకపు పిల్లిని ఇష్టపడుతున్నట్లు నటించింది కూడా. మోసపూరితంగా అది మనిద్దరం ఒకే సైజులో లేకపోవడం ఎంత దారుణం అంది. మనిద్దరం ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటుందని ఆ ప్రయత్నం మొదలు పెట్టుమని ఎలుక, పిల్లికి సలహా ఇచ్చింది.
అప్పటి నుండి ఎలుక వెనుక గదిలో ఒక మెత్తని దిండుపై హాయిగా కూర్చుండిపోయింది. ఆ అమాయకపు పిల్లి ఎలుకకు తినేందుకు ఎన్నో మంచి మంచి తినుబండారాలు తెచ్చి ఇస్తూ పోయింది. ఆ పిల్లి సన్నబడేందుకు తిండి బాగా తగ్గించింది. చివరకు తిండి తక్కువై పిల్లి అనారోగ్యం పాలయ్యింది, బాగా బక్కచిక్కింది. అందువలన ఎలుకే స్వయంగా వెళ్ళి ఆహారం సంపాదించుకొని తింటూ బాగా లావై తినే వస్తువుల గది తలుపుకింది బొరియలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఇంటి యజమానురాలు దాన్ని పట్టుకుని బోన్లో వేసింది. ఎప్పుడైతే పిల్లి కొంత బాగైందో బోన్లో ఉన్నదాన్ని చూసేందుకు వచ్చింది. పుస్సీ, నన్ను దయతో బయటికి తీయవా అని ఎలుక బ్రతిమాలింది. నువ్వు బోన్లో వున్నందుకు, అదృష్టవంతురాలివనుకో అని కోపంగా అంది పిల్లి. నీవు బాగా బలిసావు, నేను బాగా చిక్కిపోయాను. నీవు ఒకవేళ బయట ఉంటే తప్పకుండా నిన్ను మింగేసేదాన్ని.
రాజు వాలెన్ టైన్ తన శవయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తుండే వాడు. వాస్తవానికి అతనికి చనిపోవాలని లేదు, కానీ ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలని ఆశ పడుతున్నాడు. అతను వాస్తవంగా చనిపోయాక ఏమి జరుగుతుందో తను ఏమీ చూడలేనని గ్రహించాడు. ఒకవేళ నేను చనిపోతే ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలంటే నేను బ్రతికుండగానే నా శవయాత్రను ఏర్పాటు చేయాలి. అందుకు అతను చనిపోయినట్లు ప్రకటించాడు. సిటీ మొత్తం ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని, వెయ్యి నల్ల జెండాలు దారి పొడుగునా ఏర్పాటు చేయాలని, తనకు శవపేటికలో పడుకో బెట్టాలని ఆజ్ఞాపించాడు. అది ఎవరు తెలుసుకోకుండా తను మాత్రమే ప్రజలు బాధపడటం చూడాలని అనుకున్నాడు.
అది కేవలం ముఖ్యమంత్రికే చెప్పి శవయాత్ర తీయుటకు ఆదేశించాడు. శవయాత్ర మొదలయ్యింది. కానీ ఇది ఏమిటి? వాలెన్ టైన్ చనిపోతే ఒక్క చుక్క కన్నీరు కూడా, ఏమాత్రం బాధ కూడా ప్రజల్లో చూడలేదు. ప్రజలు వారివారి దినచర్యల గురించి మాట్లాడుకుంటున్నారు. శవం వెంట నడిచేవారు, దారి ప్రక్కన నిలబడ్డవారు కూడా. ప్రజలు ఎన్నోసార్లు వీడు పోవడం మంచిదయింది, పీడ విరగడయిందని అనుకోవడం విన్నాడు రాజు. వచ్చేవాడు ఇంతకన్న చెడ్డవాడు కాకూడదని ఊహించసాగారు. ఇంతకన్న చెడ్డవాడు ఉండడు. వీరితో ఇంకా కొందరు కలిశారు. శవపేటికలో పడి వుండి తడి చెమటల్లో మునిగిపోయాడు రాజు. కాబట్టి అతను ఈ ప్రపంచాన్ని బాధలో ఉంచి మరణించ దలచలేదు. దానికి వ్యతిరేకంగా తన ప్రజలు తను చనిపోతేనే సంతోషిస్తారని ఎప్పుడైతే అతను ఇది గ్రహించాడో వాలెన్ టైన్ వాస్తవంగా చనిపోవాలని అనుకున్నాడు.
రాజు వాలెన్ టైన్ ఎంతో విచారపడినప్పటికీ శవ పేటికలో మరణించలేదు. మొదట్లో అతనికి చాలా కోపం వచ్చింది. తనను దూషించిన వారందరినీ చంపించాలనుకున్నాడు. కానీ అప్పుడు రాజ్యంలో పనులు చేసేవారు ఉండరు కదా! అతను ఆలోచించే కొద్ది అతనే చెడ్డవాడని తెలుసుకుని మారాలను కున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రితో తను మంచిగా పరిపాలించడం మొదటినుండి నేర్చుకోవాలని చెప్పాడు. కానీ ఎలా? అది చాలా సులభం, నవ్వాడు ముఖ్యమంత్రి. మీరు చేయవలసింది మారు వేషంలో ఆ ప్రజల్లోకి వెళ్ళండి, వారితో కలిసి పని చేయండి, వారు అనేది వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో? రాజు ఏమి తప్పు చేసేవాడో వారు చెప్పినది మరిచిపోనట్లయితే నీవు తిరిగి వచ్చాక చాలా తెలివిగా పరిపాలించగలవు. వారు నన్ను గుర్తించకపోతే ఎలా? అని రాజు అడిగాడు. మీరు విచారించకండి! వారు ఎల్లప్పుడు మీ కిరీటం, మీ మెత్తని పొడుగాటి కోటును మాత్రమే చూశారు. మీ ముఖాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేరు అని ముఖ్యమంత్రి నమ్మ బలికాడు. కానీ ఈ మధ్యన ఎవరు పాలిస్తారు? అని రాజు అడిగాడు. రాజు లేకుండా దేశం ఉండలేదు కదా! ఓహో, అవును అది సాధ్యమే, ముఖ్యమంత్రి హేళనగా నవ్వాడు. ఇదో సమస్యా అని. మీరు వచ్చేంతవరకు ప్రజల విచారం (దుఃఖం) ప్రకటిస్తాను. ఒకవేళ ఏమైనా నిర్ణయించవలసి వస్తే నేను ఎప్పుడూ చిన్న శబ్దం చేసి మిమ్మల్ని అడుగుతాను. అందుకు వాలెన్ టైన్ అంగీకరించి, పాలించడం నేర్చుకోవడానికి వెళ్ళాడు.
ఓ ముసలి వాసిల్ తన వలలో ఏమి పడిందో చూద్దామని సముద్ర ఒడ్డుకు వెళ్ళాడు. ఎప్పుడైతే అతను తన వలను పరిచిండో, దాంట్ల ఒక బంగారు చేపను చూసాడు, దాన్ని పట్టుకున్న వెంటనే ఆ చేప అంది, ఒకవేళ నీవు నన్ను మరల సముద్రములో వదిలిపెడితే నీ కోరికలన్ని తీరుస్తాను అని. ముసలి వాసిల్ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, చాలా మంచిది, నీవు సముద్రములోకి వెళ్ళు. కాని ఏమి వరం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. అందుకు నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడగాలి. అతను ఇంటికి వెళ్లి భార్యతో జరిగినదంతా చెప్పిండు. ఆ ముసలి ఆడది అతడ్ని బాగా తిట్టింది. వెంటనే వెళ్ళి నేను వేసుకోవడానికి మంచి కొత్త బట్టలు అడుగమంది. నా వద్ద కేవలం చిరిగిపోయిన పాత బ్లౌజు మాత్రమే ఉంది. ఆ ముసలతను కొత్త బట్టలతో ఇల్లు చేరాడో వెంటనే తిరిగి పంపిస్తూ తనను బంగారు బండిలో ఎక్కించి తిప్పు, ఎందుకనగా ఇంతకుముందు ఎన్నడూ బండిలో ఎక్కలేదు. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు.
ఇప్పుడు ఆమె సముద్రపు ఒడ్డున ఒక అందమైన మేడ కావాలని కోరింది, దాని చుట్టు విశాలమైన అందమైన తోటలు, చాలామంది నౌకర్లు ఉండాలని అంది. కాని అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివరకు ఆమెకు విచిత్రమైన భావన కలిగింది. ఆ బంగారు చేప వచ్చి ఆమెకు సేవ చేయాలని తలచింది. ఆ చేప ఇది విని వెంటనే ఆగ్రహించి ఇచ్చిన బహుమతులన్ని తిరిగి తీసేసుకుంది. ఆ ముసలామె తన పాడుబడిన గుడిసె ముందు, తన పాత చిరిగిపోయిన బ్లౌజు వేసుకొని వలను బాగు చేసుకుంటూ మరల నిలబడింది. ఇప్పుడు నీవు మొదట ఎక్కడ ఉన్నావో అక్కడనే ఉన్నావు.
ఒకవేళ నీవు అతిగా కోరాలని ప్రయత్నిస్తే, చివరకు నీవు ఏమి లేకుండా మిగిలిపోతావు.
”అతి ఆశ కొంపకు చేటు”
ఒక బీద విధవరాలు, ఒక పినాసి జమీందారు ప్రక్క ప్రక్క ఇండ్లలో వుండేవారు. జమీందారు దురాశా పరుడు. కాబట్టి ప్రక్క ఆమె సేబు పండ్లను తనకు సరిపోను లేని వాడివలె తెంపుకునేవాడు. ప్రక్క వారి చెట్టు కొమ్మ తన గోడను తగులుతున్నది కావున అది తనదేనని గట్టిగా వాదించేవాడు. తనకు ఒక మంచిరోజు వస్తుందని నమ్మకంగా అనుకుంది ఆ ఆడమనిషి, ఆ పీనాసి ముసలతనికి వచ్చేది వస్తుంది.
ఒకరోజు ఆమె పొయ్యిల కట్టెల కొరకు అడవికి పోయింది. వెంట ఆమె ఒక రొట్టె ముక్కను తీసుక వెళ్ళింది. దారిలో ఆమె ఒక బిచ్చగాడిని చూచింది. అతను ఆ రోజు అప్పటివరకు ఏమి తిన లేదని గ్రహించి, తన రొట్టె మాడిన భాగం తప్ప మిగతా మొత్తం రొట్టె ఆ బిచ్చగాడికి ఇచ్చింది. ఆమె దానికి బదులు అతని నుండి ఏమి ఆశించలేదు. కాని ఆ ముసలతను ఆమెకు దగ్గరిలోని ఒక చెలుకను చూపించాడు. ఒక క్షణం ముందు అక్కడ ఏమి లేని చోట రెండు ఆలుగడ్డలను చూసింది. ఒక చిన్న మాడు ముక్క తను వుంచుకొని మొత్తం రొట్టె తనకు ఇచ్చినందుకు బదులు వాటిని తీసుకొమ్మని అతడు చెప్పాడు. అవి తీసుకొని, కొన్ని పొయ్యిల కట్టెలు తీసుకొని ఇల్లు చేరింది.
మరునాడు ఉదయం ఆమె ఒక అసమాన్యమైన మెరుపుతో లేచింది. ఆమె స్టౌ ప్రక్కన కట్టెల మోపు సూర్యరశ్మిలో చుట్టబడినట్లు చూచింది. ఆమె దానిలోనికి చూసింది. అక్కడ ఆమెకు ఒక్కొక్క ఆలుగడ్డ బంగారంగా మారింది, కనిపించింది.
ఆ పిసినారి భూస్వామి అటు పోవుకుంటూ బెల్ కొట్టకుండా ఆ బీదామె ఇంట్లోకి వెళ్ళాడు. ఆ బీదామె జరిగినదంతా దాపురం లేకుండా చెప్పింది. వెంటనే ఆ భూస్వామి గీరల బండి, ఐదు రొట్టెలతో అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ముసలతనితో కలిశాడు. అప్పుడు అక్కడ జరిగినదంతా ఏమైందో మీకు తెలిసే ఉంటుంది. ఆ ముసలతను ఈ భూస్వామికి ప్రక్కన ఉన్న చెలుక చూపించాడు. ఆ చెలుకలని ఆలుగడ్డలను భూస్వామి బస్తానిండా నింపుకొని ఇల్లు చేరాడు. తన జొన్నల గదిలో ఆలుగ్డలను పోశాడు. కానీ మరునాడు తను లేచి చూసి బహు చెడ్డ షాక్ తిన్నాడు. ఒక్కొక్క ఆలుగడ్డ నుండి డజన్ డజన్ ఎలుకలు తయారై కొట్టంలో వున్న మొత్తం జొన్నలను తినేశాయి. అతనికి బంగారం రాలేదు, ఉన్న జొన్నలు ఎలుకల పాలయినాయి. అందుకే అంటారు, అతి ఆశ కొంపకు చేటు అని.
