నిలువెత్తు నయాగరా కవి-విద్యార్థి గారి మంచు మైదానం” పై సమీక్ష
అంత గొప్ప మనిషి నన్ను వారి “మంచు మైదానం”పై సమీక్ష రాయమన్నారు. నేను ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాను. నేను తను మెచ్చే రీతిలో రాయగలనా…. ఏమో? ఇది నాకు పరీక్షే! అయినా ప్రయత్నిస్తాను అనుకున్నాను.
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే కొందరు మహానుభావులు నిగర్వులై ,నిరాడంబరులై ఉంటారు. ఆ కోవకు చెందినవారే “శ్రీ వేలూరి రాములు “గారు “విద్యార్థి” కలం పేరుతో సుపరిచితులై నిత్య నూతన విద్యార్థిగా సార్ధక నామధేయులుగా పేరుగాంచిన ఓరుగల్లు సాహిత్య కళామతల్లి ముద్దుబిడ్డ “విఆర్ విద్యార్థి గారు”.
ఈ కవి గారి మాటల్లోనే చెప్పాలంటే పరిచిత ప్రపంచాన్ని ఒక అపరిచిత లోకంలోకి పరివర్తన చెందించి శాంతిని ప్రేమించే ఒక ఖండాంతర కవి… భరతమాత ముద్దుబిడ్డగా సైనికుడిగా కారణజన్మనెత్తి రెండుసార్లు ప్రత్యక్షయుద్ధంలో పాల్గొని తన ఋణం తీర్చుకున్నారు. కానీ తన మనసంతా యుద్ధమేలేని ప్రపంచాన్ని కాంక్షించుతూ
“విశ్వమానవ సంక్షేమం -వినాశ బుద్ధి సంహరణం” కావాలనేదే ఈ కవి ఆకాంక్ష.
అందుకే విద్యార్థిగారిలో ప్రకృతి ప్రేమికుడు విశ్వకవి “రవీంద్రుడు” కనిపిస్తాడు. తన అపరిచిత ప్రపంచంలోకి భావుకుడై మనుషుల మనసులను కలియతిప్పిస్తాడు. వారిలో జీవిత తత్వాన్ని మేల్కొల్పి భావ స్రవంతిలో అలౌకిక అనుభూతులను నింపి ప్రకృతి ఒడిలో సేదతీరేలా చేసే పరిశుద్ధకవి విద్యార్థి గారు.

విద్యార్థి గారు 15 సంవత్సరాలు సైనికునిగా పనిచేసి, స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత 23 సంవత్సరాలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (నిట్) ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్స్ లో నేషనల్ ఫిజికల్ లాబరేటరీ వారి పరిశోధన ప్రాజెక్టులో పనిచేశారు. అందుకే సైన్సును సాహిత్యంతో ముడిపెట్టి ఎన్ని అద్భుతమైన కవితలల్లారో ఈ “మంచు మైదానం”లో…..
“నాసా” శీర్షికన రాసిన కవితలో నాసా ను వర్ణించిన తీరు అత్యద్భుతం…
"నువ్వు అనంత విశ్వానికి
ముఖద్వారానివి
మానవ యశస్సువి
నవ నవోన్మేష మేధస్సువి" అంటూ ప్రారంభించి కవిత కొనసాగిన తీరు మనల్ని నాసాకు తీసుకువెళ్తుంది…
ముఖద్వారానివి
మానవ యశస్సువి
నవ నవోన్మేష మేధస్సువి"
"జులై పదహారు నాడే
నీ దర్శన భాగ్యం
నీతో
కరచాలనభవ్యం
అద్భుతం ఈ క్షణం
అనూహ్యం ఈఅనుభవం"....
అంటూ తాము నాసాను పలకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఎంతో అనుభూతికి లోనవుతూనే….
నీ దర్శన భాగ్యం
నీతో
కరచాలనభవ్యం
అద్భుతం ఈ క్షణం
అనూహ్యం ఈఅనుభవం"....
"ఓహో! నాసా!
ఈ నీ అంగుళిలో
పొదిగిన చంద్రశిలను తాకబోతూ
చకితుణ్ణయ్యాను
ఆశ్చర్యం!"
అంటూ తన కలలో చంద్రమండలంపై వాలినప్పుడు దర్శించిన చంద్రశిలా శకలాలు, జాడలు, దారులు, వెలుగులు ,నీడలన్నీ దృశ్య వాహినియై కళ్ళ ముందు కదులుతున్నాయంటూ అక్కడ నిల్చొని మహావిశ్వపు దూరకోణాలను కనుగొన్నారు ఆనాడు….
అంతేనా నాసా ముందు కరిగిపోయే దూరాల గురించి అనంత లోకాలు నాసా వాకిట ప్రతీక్షిస్తూ సుదూరలోకవాసుల్ని కలుసుకోవడం అసాధ్యమేమీ కాదని ….ఒకరి మంచి చెడ్డలు మరొకరు తెలుసుకునే రోజుకు దూరమేమీ లేదని ఆనందపడతారు.
చివరలో కవి గారు ఇచ్చిన ముగింపు అతని ఔన్నత్యానికి ప్రతీక తన కావ్యమెప్పుడూ ఆశించేది “విశ్వ మానవ సంక్షేమం- వినాశ బుద్ధి సంహరణం” అంటూ ముగిస్తారు. ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణ అవసరం లేదనుకుంటా విద్యార్థి గారు విశ్వమానవ సంక్షేమాన్ని కాంక్షించే “విశ్వకవి” అని చెప్పడానికి…
“జియాన్ కేనియన్”కవితలో అమెరికాలోని “ఉటా(Utah)” రాష్ట్రంలో ఉన్న “జియాన్ నేషనల్ పార్క్” లోని ఎర్రటి రాళ్లు డీప్ కెన్యాలు(Deep conyons), మరియు హైకింగ్ మార్గాలకు ప్రసిద్ధి చెందిన ముఖ్యంగా ది నారోస్ (The Norrows) మరియు ఏంజెల్స్ లాండింగ్ ( Angels Landing) వంటి మార్గాలకు ప్రత్యేకత కలిగిన ప్రసిద్ధి చెందిన ఈ పార్కు గురించి వర్ణించిన తీరు ఓ వినూత్న అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తుంది.
"ఎడారిలో ఒక ఉదయం
రోడ్డున బడిపోతున్నాం
కొండ దిగువన
సైనిక స్థావరం
లేస్తున్నాయి గాండ్రిస్తూ
యుద్ధ విమానాల పెద్దపులులు
దిక్కులను బెదిరిస్తూ"....
అంటూ మొదలైన ఎత్తుగడతో కాక్టస్ పూలు కవి గారి వైపు చూసి కాంప్లిమెంట్ గా నవ్వుతున్నట్లు ఊహ ఒక తీయని భావన.
ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ముందు పోదు నిప్పుల వాగు, ఎదురు రాని చుక్కల నది, పట్టపగలు సిరా అలికిన ఆకాశం ,పొదలు గమ్మిన ఆగాధం అంటూ సాగుతూ అక్కడి కొండలు గుట్టలు కనుమలు లోయల గురించి మనోహరంగా వర్ణిస్తూ….
రోడ్డున బడిపోతున్నాం
కొండ దిగువన
సైనిక స్థావరం
లేస్తున్నాయి గాండ్రిస్తూ
యుద్ధ విమానాల పెద్దపులులు
దిక్కులను బెదిరిస్తూ"....
"లోయ కడుపులో
వంకర టింకరగా పరిగెడుతూ
వర్జిన్ నది
దూరంగా
నిశ్శబ్దం నిండిన
ఏంజెల్ కేనియన్
అక్కడ దేవకన్యలు దిగివచ్చి
నాట్యం చేస్తున్నారేమో"....

అంటూ అనుభూతి చెందుతూ… నవ్య శివం/ఈ శ్వేత ధాత్రి/భువన లోకంలోనే ఉందా అని/క్షణం పాటు అనుమానం…. అంటూ చక్కని ముగింపునిస్తారు. ఈ విధంగా మనల్ని తన భావన చతురతతో ఎక్కడో దూర తీరాల్లో ఉన్న అందమైన శ్వేత ధాత్రి చుట్టూ తిప్పుతారు. ఈ విస్మయ ధాత్రిలో ఎన్నో వింతలతో నిండి ఉన్న ఈ వసుధలో లోతు తెలియని లోయల్లోకి జారవిడుస్తారు. లెక్కించలేని శిఖరాలను ఎక్కిస్తారు. వెలుగుల బురుజులను, నీడల చెరువులను చూపిస్తారు. అంతేనా ఉషోదయాన పసిడిగనులలో… సంధ్య వెలుగులో తామ్రవనాలలో తిప్పుతారు…
“ఈ కేనియన్ మోము మీద
పొగ మంచు ముసుగు వాలినప్పుడు
‘చర్రు’న ఊరికే శంపాలత వలె
లోయ గర్భాన ‘కొలరాడో’ నది”…..
అంటూ సాగే కవితలో మన చూపుల సీతాకోకచిలుకలను నది అంచుల నుండి లోయల్లోకి దూకిస్తారు. లోయల్నుండి శిఖరాల పైకి ఎగబాకిస్తారు. ఇలా ‘గ్రాండ్ కేనియన్’ తో మాట్లాడి వచ్చాను. సృష్టి రహస్యాలెన్నో తెలుసుకొచ్చాను …అంటూ ఆ అద్భుత మనో బృందాలను మనకు పరిచయం చేశారు.
తన అనంత భావన వీచికలను రువ్వి మన మనసులలో చల్లని వింజామరలను వీయించే భావకవి విద్యార్థి గారు.
“నెవాడ “రాష్ట్రంలో నున్న “లాస్ వేగస్” పై రాసిన కవితలో ..
దేశ దేశ సంపన్నులకు విడిది ఇది/గరీబోడు కాళ్ళు మోపే స్థలం కాదంటూనే…. నిదురించని సొగసులాడి /ఈ నగరం సెలవులేని క్యాలెండర్ అంటారు…. ఎంత నిగూఢ భావన ‘కేసినో’ ల గలగలలు/ క్లబ్బులలో గుసగుసలు/ఈ గాలిలోనే చంచలించు లాహిరులు….మత్తు గమ్ము ఆవిరుల గురించి గమ్మత్తుగా వర్ణించిన వైనం కన్నుల మెరిపిస్తాయి. ఒకింత ఆలోచనలో పడవేస్తాయి. ఎందుకంటే గరీబోడు కాళ్ళు మోపే స్థలం కాదనడంలో అక్కడి వైచిత్రి ఎంత విలాసవంతమైనదో చెప్పకనే చెప్పినా తీరుకు చిత్రిక ఇది….
ఇక “నయాగరా” గురించి వర్ణించిన తీరు ఎంత నయగారంగా ఉంటుందో…. మన మనసులలో చలచల్లని అక్షర తుంపర్ల పుప్పొడి జల్లి శరజ్జల పాత శబ్ద పతంగ విహారం చేయిస్తారు విద్యార్థి గారు…
"అది ఎన్ని యుగాల మాట
ఒకానొక
జాగృత సంధ్యలో
ఏ నక్షత్రం కన్నబిడ్డో
ఈ భువన గోళం "
అంటూ సాగే “నయాగరా” కవితలో ఈ భూమి నక్షత్రం నుంచి తెంచుకున్న అంత్రగాయం మాని మబ్బు పొరలు విడిపోయి తాను పర్వతాలుగా, లోయలుగా స్థిర రూపం దాల్చిన పిమ్మట కలిసిన సృష్టి మనస్సు ధ్రువ శిరస్సును వెచ్చగా దీవించుతూ స్పృశించి ఒక వినూత్న జలధరమును అవతరింప చేసిందంట…. విద్యార్థి గారి వర్ణన ఎంత హృద్యంగా మనోసంద్రంలో అద్భుతమైన అలల సవ్వడులు చేస్తుందో….
"మహా సరస్సులు
అమృత జలాన్ని స్రవిస్తూ
వరదలు వరదలుగా సోన
వడివడిగా సుడులు తిరుగుతూ
హేషిస్తూ ఘూర్ణిల్లుతూ
చంక్రమించే అశ్వీయమై
అనూహ్యమైన అగాధాల్లోకి
నయగారంగా దూకుతూ
మహికంధరలో మణిహారమై
ప్రపంచ వింతల్లో ఒక వింతై"......
అంటూ సాగే కవితలో మొదట భూమి పుట్టుక ఆ తర్వాత భూమిపైన ఉన్న ప్రకృతిలోని మార్పులు ఆ తరువాత నయాగరా పుట్టుక గురించిన చక్కని వర్ణనతో కొనసాగించుతూ నయాగరా జలపాతంలో మనల్ని ముంచెత్తుతారు….
"పగలు చూస్తే
ప్రాణం పోసుకున్న
ముత్యాల గుంపులు చిందుతూ
రెక్కలు మొలచిన
వజ్ర సమూహమై డోలుతూ
నక్షత్ర ప్రవాహమై
మిరిమిట్లు గొల్పుతూ
అగాధాల దరులకు
లావణ్యం పులుముకుంటూ
ఇంద్రధనస్సులు పుష్పిస్తూ
మేఘ సందోహాలు లేస్తూ"....
అంటూ సాగే కవితలో ఆయన స్పృశించిన తీరు శిశిర జలపాతాన్ని ఒలికిస్తుంది …
హిమశిలాపాత/శబ్దపతంగమై/విను వీధుల్లో ఎగిరిపోయే నయాగరా అప్పుడప్పుడు తన గత వైభవాలను తలుచుకొని చిన్నబోతుందంట…. చింతపడుతోందంట….
"ఆ రోజుల్లో
ఎంత స్వేచ్ఛగా క్రేళ్ళు వారేదట!
అరణ్యాలు తాను
పెనవేసుకు పోయేవట
వృక్షజాలం జంతుజాలం
అన్నీ తనతోనే తనలోనే
తన ఒడ్డున కూర్చుని
భూమి పుత్రులు
ఎంత గొప్పగా
చెమట పాటలు పాడే వారట!
తనతో ఎన్ని ఊసులు పంచుకునే వారట!"
కానీ ఇప్పుడు తన చుట్టూ ఊపిరాడనంతగా అల్లుకుపోయిన నాగరికతల కంచెలు, రహదారుల వలలు, వాహన భూతాలు తన అందాలను బంధించబడినట్టు తన స్వేచ్ఛను హరించి తన చుట్టూ నవీన నాగరికత మితిమీరిన పోకడలతో వికృత నాట్యం చేస్తున్నట్టు నయాగరా వేదన చెందుతున్నట్టుగా వర్ణించిన తీరు నిజంగా సాదృశ్యమానం…
"ఆ రోజుల్లో
స్వచ్ఛమైన ప్రకృతి
ఒళ్ళు విదిల్చి నర్తించే
కల్పన పద కింకిణి తాను
ఇప్పుడు
వికృత ప్రతికల్పన
తనని కబలిస్తోంది"....
అంటూ నయాగరా వాపోతుందంట ఇక ఇక్కడ విద్యార్థి గారు…
"ఎప్పుడైనా
నయాగరా స్మృతి ప్లవమెక్కి
బయలుదేరానా
నాలుగు సరోవరాల్లో
జల లతనై లేస్తాను
అమృత ప్రవాహంగా సాగి
నక్షత్ర పాతమై దూకి
నయాగరా నదిగా ఉరికి
'ఒంటారియో' సరస్సులో పొరలి
'సెయింట్ లారెన్స్' రుషికుల్యగా నడిచి
అట్లాంటిక్ మహా సాగరంలో కలుస్తాను
భువన కోశపు సకల శకలాల
పాదాలకు ప్రణమిల్లుతాను
పులకిస్తాను
పునీతుణ్ణవుతాను"-
అంటూ ఇచ్చిన ముగింపుకు అమృత భావ జల ధారలో తడిసి పులకించి పునీతులమై ఆ నిలువెత్తు నయాగరా కవి కలానికి ప్రణమిల్లక మానము….
ఇక “కాన్వాసుపై ఆమె” కవనం ‘విస్కాన్షిన్’ రాష్ట్రంలోని ‘వాకేషా’లో “ఫారెస్ట్ హిల్” పై కూర్చుని రాశారు… ఆ కావ్య కన్యకను ఎంత అబ్బురంగా ప్రేమించారో…. ఎంత అద్భుతంగా స్వాగతించారో ఈ కవనంలో…
నయాగరా స్మృతి ప్లవమెక్కి
బయలుదేరానా
నాలుగు సరోవరాల్లో
జల లతనై లేస్తాను
అమృత ప్రవాహంగా సాగి
నక్షత్ర పాతమై దూకి
నయాగరా నదిగా ఉరికి
'ఒంటారియో' సరస్సులో పొరలి
'సెయింట్ లారెన్స్' రుషికుల్యగా నడిచి
అట్లాంటిక్ మహా సాగరంలో కలుస్తాను
భువన కోశపు సకల శకలాల
పాదాలకు ప్రణమిల్లుతాను
పులకిస్తాను
పునీతుణ్ణవుతాను"-
"ఆకురాలు కాలం గదా!
అడవంతా నగ్నంగా
చెట్లన్ని పొరకలై
పాడుబడ్డ దీకాడు"-
అంటూ మొదలైన ఎత్తుగడ కవితను నడిపించిన తీరు ఎంత చక్కని భావాల హరివిల్లో…..
అడవంతా నగ్నంగా
చెట్లన్ని పొరకలై
పాడుబడ్డ దీకాడు"-
"అది పట్టపగలు
పసిడిబింబం ఒకటి
హరితాన్ని ధరించిన వసంతమై
ఆ లోయల బడి
ఈ కొండ వైపు వస్తోంది
కొండ మీద
నిరీక్షిస్తున్న నేను
ఆమె రాకను గుర్తించాను
సంభ్రమాశ్చర్యాల
జలదరింపులు నాలో"
అంటూ ఆమె తన కోసంగాక ఇంకేవరికోసం వస్తోంది….నా నిరీక్షణ ఆమె కోసంగాక ఇంకెవరి కోసం…. అంటారు…ఆ కావ్య కన్యక ఆంతర్యం తెలిసిన జాగరుకుడు ఈ కవిగాక ఇంకెవరు…. ఆ స్పృహ వేరెవరికుంటుంది చెప్పండి…. ఆ వనసుందరి ఈ అపూర్వ స్నేహితుడి పరిశ్వంగంలో పులకించి…. తన మంచు వంటి హృదయంలో కొత్త రంగు కాన్వాసుగా మారి…. చెప్పలేని ఉద్విగ్నతకు లోనై…. విశ్వపు అంచుల దాకా వీరి ప్రేమ విస్తరించి…. ఖగోళపు గుహలు ధ్వనించేంత దూరం… ఒక హాసమై వికసించాలి… అదే కవి గారి కోరిక అందుకే…..
"అడవంతా మంచుతో
వెండి పందిళ్ళల్లుకుంటుంది
దూరంగా
మంచు పొదల మాటున
అల్లుకున్న గూటిలో
వెచ్చగా విశ్రమిస్తున్న గువ్వొకటి
నా నిరీక్షణను
ఆమె ఆగమనాన్ని
తన భాషలో
అభినందిస్తోంది".....
అంటూ సంబరపడతారు కవి గారు… మరి అంతే కదా తనతో ఈ ఎడబాటు ఇప్పటిదా…..
వెండి పందిళ్ళల్లుకుంటుంది
దూరంగా
మంచు పొదల మాటున
అల్లుకున్న గూటిలో
వెచ్చగా విశ్రమిస్తున్న గువ్వొకటి
నా నిరీక్షణను
ఆమె ఆగమనాన్ని
తన భాషలో
అభినందిస్తోంది".....
"ఎన్నేళ్ల ఎడబాటు
అప్పుడెప్పుడో
చిన్నతనంలో గదా
ఎక్కడో
వేల మైళ్ళ దూరంలో
హిమాలయాలలో
ఒక నిశీధి వీధుల్లో
నిశ్శబ్దమై నడుస్తున్నప్పుడు గదా
తప్పిపోయాం
ఇదిగో
మళ్ళీ ఇప్పుడు
ఇన్నాళ్ళకు కల్సుకుంటున్నాం
వచ్చేసింది ఆమె
నన్నావహిస్తోంది
ఇప్పుడిక
నేను నేనుగా
ఆమె ఆమెగా
ఉండడం కుదరదు”….
అప్పుడెప్పుడో
చిన్నతనంలో గదా
ఎక్కడో
వేల మైళ్ళ దూరంలో
హిమాలయాలలో
ఒక నిశీధి వీధుల్లో
నిశ్శబ్దమై నడుస్తున్నప్పుడు గదా
తప్పిపోయాం
ఇదిగో
అంటారు. అంతే కదా మరి ఆమె కోసం ఎన్నేళ్ళ నిరీక్షణ తనది ….ఆమె రాక కోసం తన హృది సాగర రూపమెత్తి… అలల చూపులతో…. ఉవ్వెత్తు కెరటాలుగా ఎగిసిపడుతోంది… ఆమె ఆప్యాయంగా వచ్చి తనలో కలిసిపోయాక …తన మనో కాన్వాసు పై ఆమె కొలువుదీరాక… తను తానుగా… ఆమె ఆమెగా ఉండడం ఎలా కుదురుతుంది కుదరదు కదా….
“ధీ సంజీవని” అనే కవితలో విద్యార్థి గారు ‘ఉత్తర అమెరికా’లోని “నార్త్ కరోలినా” రాష్ట్రంలో “గ్రాండ్ ఫాదర్ మౌంటెన్” మీద ” శ్రీధర్ కాజీపేట”అని వరంగల్ కు చెందిన ఇంజనీర్ గారు పరిచయమైనప్పుడు వారు అనుభూతి చెందిన తీరు చక్కని కవిత రూపంలో మన ముందుంచారు…
"మిత్రమా మనం
ఒకింత బతుకు తెరువు కోసం
అమృతం కురిసే రాత్రుల్ని
చెమటోడ్చే పగళ్ళలో
పోగొట్టుకున్నాం"....
అంటూ ఆరంభించి…
ఒక అర్థగోళాన్ని విడిచి/
మరో అర్థగోళానికి వలస పోయాం”….
అంటూ మన మాటకు మనం పరాయిలమై పోయామంటూ…. మన పాటకు మనం బదిరులమయ్యామంటూ…. మన సంస్కృతి మనకు పరిచయం లేనిదిగా అయిపోయిందంటూ….
వాపోతూనే ‘స్మోకీ’ పర్వత పంక్తులు… ‘బ్లూ రిడ్జ్’ పర్వత శ్రేణులు… గ్రాండ్ ఫాదర్ మౌంటెన్…. మరియు ఆరువేల అడుగుల పొడుగరి అయిన “తాత పర్వతం”గురించి చక్కని వర్ణనలు చేస్తూ సాగుతూ……
"ఒకరి నెరగకుండా ఒకరం
రెండు మేఘస్పర్శలమై
తాత ముఖాన్ని తాకుతూ
ఎదురుపడ్డాం".....
అంటూ సాగిన కవితలో వారి పరిచయం కరచాలనంతో కదిలించివేసి …ఆలింగన ఆప్యాయతలను అందుకున్న “ఊరి వాసన” మహిమను వర్ణించిన తీరు అద్భుతం…
అప్పుడు ఆ తాత కొండ మెట్టుగుట్టపై వనభోజనానికి వచ్చినట్లు…. మన ఊళ్లో మనం తిరుగుతున్నట్లు… అనిపించిందంటూ అనంతమైన అనుభూతిని పొందిన వారి మైత్రి వారధి ఎల్లప్పుడూ ఒక” ధీ సంజీవని” గానే మిగిలిపోతుంది.
వన్నె తెచ్చే తెలుగు పదాల పోహళింపులతో కళ్ళకు కట్టినట్లు అలతి అలతి పదాలతో కవితను నడిపిన యానం బహుదా ఆనందనీయం..
ఆనవాళ్లు, ప్రాణహిత, నిరంతరం ,వరణం, ఉషా ప్రసవం ,తేజోమయం వంటి ఎన్నో అద్భుతమైన కవితలు విద్యార్థి గారే మనల్ని వేలు పట్టుకొని ఆ ప్రాంతాలను తిప్పుతున్నట్లు అనుభూతి చెందకమానము….
ఇంత చక్కని కవితలల్లి తమ సరాగాలతో…. సమీరాలతో… జీవన గీతాలతో… మన మనసులలో కవనవర్షపు బిందువులను కురిపిస్తారు విద్యార్థి గారు….
యూరప్ లోని పశ్చిమ శిలపై పయనిస్తూ విద్యార్థి గారు అనుభవించిన వినూత్న “స్పర్శ” మాటల్లో చెప్పలేనిది….
"మన కింద
భూమి మీద
ఇటు లేచిన
మణిహారాల పందిళ్లు
అటు మొలచిన
వెండి గుడారాల గుంపులు
పరుచుకున్న పగడాల దీవులు
అన్నిటిని చుట్టి నీలి మైదానాలు".....
ఇలా సాగే కవితలో వారు మరో ప్రపంచంలోకి రూపాంతరం చెందుతున్న తీరు అమృతాన్ని స్రవిస్తోంది… మానవ జీవితంలో కొంత వ్యవధి దొరికిన తర్వాత మనసులో వచ్చే మార్పును ఎండగట్టిన తీరుకు వందనాలు తెలుపవలసిందే…..
"ఎగిరే పక్షిని పడగొట్టి
కాల్చుకు తినడం
వేటగాడి నైజం
భయపడితే పక్షి
నక్షత్రమై వెలిగేదెప్పుడు
ఆకాశాన్ని సముద్రంగా
మార్చేది ఎప్పుడు"....
అంటూ సాగే ఈ కవిత
ఏమూల/ ఏ యుద్ధం పొంచి ఉన్నదో/ఏ ప్రభుత్వం/దేనికి ఎరవేసి కూర్చున్నదో/ఎవడు/మన సమస్తత్వాన్ని దోచుకోవడానికి సమాయత్తమవుతున్నాడో/ ఎలా తెల్సు….. అంటూ సాగే కవిత ముగిసిపోని యుద్ధంలా మనకు కనిపిస్తుంది…. ఈ యుద్ధంలో మనము సిపాయిలం కావచ్చు…. కానీ ఈ విన్నుత్న స్పర్శానుభూతిని మాత్రం మనం కోల్పోకూడదు… ప్రియతమా! అంటూ విద్యార్థి గారు తన భావ కవన ప్రియురాలితో ముచ్చట్లాడడం చూస్తే ముచ్చటేస్తుంది…..
కాల్చుకు తినడం
వేటగాడి నైజం
భయపడితే పక్షి
నక్షత్రమై వెలిగేదెప్పుడు
ఆకాశాన్ని సముద్రంగా
మార్చేది ఎప్పుడు"....
