అనగనగా ఒక రాజ్యంలో ఒక ధనికుడు నివసించేవాడు. అతనికి ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురును అతనే పెంచి పెద్ద చేయసాగాడు. కూతురు ఎంతో అందగత్తె మరియు దయా వృదయం గలది. కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె సవతి తల్లి కదా! కూతురు సిండ్రెల్లాను ఏమి బగా చూసేది. కాదు తర్వాత ఆమెకిద్దరు కుమార్తెలు పుట్టారు. సవతి తల్లి ఆమె కుమార్తె లిద్దరూ కూడా సిండ్రెల్లాను ఎప్పుడూ ఏడిపిస్తుండే వారు ఇంటి చాకిరీ అంతా చేయించేవారు. కనీసం ఆమెకు మంచి ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. తండ్రి ఇదంతా చూసి చాలా బాధపడేవాడు. తాను అనవసరంగా రెండో పెళ్ళి చేసుకున్నానని చింతించేవాడు.
ఒకరోజు వ్యాపార పనుల నిమిత్తం తండ్రి పొరుగూరికి వెళ్ళాడు. తండ్రి కూడా లేక పోవడంతో సవతి తల్లి సిండ్రెల్లాను మరింత బాధ పెట్ట సాగింది. కడిగిన పాత్రల్నే మరల కడిగిస్తూ, ఇల్లంతా శుభ్రం చేశాక చెత్త పడేసి మరల శుభ్రం చేయమని చెప్తూ సిండ్రెల్లాను పని మనిషి గా మార్చేశారు. ఎంతో అందంగా ఉండే సిండ్రెల్లాను మసి బొగ్గు లా తయారు చేశారు. వంటలన్నీ వండినా పారబోసేసి మరల వండమని చెపుతూ పొయ్యి దగ్గరే ఉంచేవారు.
ఇలా ఉండగా ఒకరోజు రాజ భటుడు కరపత్రాలతో వీరింటికి వచ్చాడు. “రాజు గారి కోటలో సంబరాలు జరుగుకున్నాయనీ, వాటి కోసం రాజ్యం లోని యువతులందర్ని ఆహ్వానిస్తున్నారని” చెప్పాడు. అంతేకాక తనకు నచ్చిన యువతితో రాజకుమరుడు నృత్యం చేస్తారనీ, ఆమెనే పెళ్ళిచేసుకుంటాడనీ ఆహ్వాన పత్ర సారాంశమనీ చెప్పాడు.
సవతి తల్లి చాలా సంతోషించింది తన కుమార్తెల కోసం మంచి మంచి బట్టలు, టోపీలు, హారాలు ఎన్నో కొన్నది. రాజకుమారుడు తన కూతుళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించింది. అప్పుడు సిండ్రెల్లా వచ్చి “అమ్మా నేను కూడా సంబరాలకు వస్తాను కొత్త దుస్తులు కొనవా నాకు ఈ చినిగిన గౌను తప్ప కొత్తవి లేవుకదా” అన్నది. అప్పుడు ఆమె నవ్వుతూ” పనిమనుషులు రాజభవనానికి రాకుడదు నువ్వు ఇక్కడే ఉండు” అంటూ తన కుమార్తెలతో వెళ్ళిపోయింది.
సిండ్రెల్లా మరేమి చేయలేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. తోటలోని చిలుకలు ఆమెను ఊరడిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవమాత ప్రత్యక్షమయింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చూస్తుండగానే “నువ్వు రాజవనానికి వెళతావా” అని అడిగింది దేవమాత “నేను వెళ్ళాలంటే నాకు సరైన దుస్తులు, వెళ్ళడానికి బండి కూడా లెవు కదా” నిరాశగా అంది సిండ్రెల్లా. వెంటనే దేవదూత తన మంత్రదండంతో సిండ్రెల్లాకు మంచి మెరుపుల బట్టలు, నగలు, గాజు చెప్పులు సృష్టించింది. వారి పెరట్లో ఉన్న ఒక గుమ్మడి కాయను రథంగా మార్చేసింది. అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను గుర్రాలు గా మార్చింది. మరొక ఎలుకను రథ సారధి గానూ, మరొక తొండను ఆమెకు సేవకుడి గానూ మార్చింది.
“ఇప్పుడు నువ్వు రాజభవనానికి వెళ్ళు సిండ్రెల్లా ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్థరాత్రి 12 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలి. ఆ తర్వాత నా మాయ పని చెయ్యదు అన్ని మామూలై పోతాయి” అని చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది.
సిండ్రెల్లా రాజభవనానికి చేరుకుంది. ఆమె అద్భుత సౌందర్యం చూసి అక్కడున్న అందరూ ఆమె తప్పక రాజుకుమారి అయి ఉంటుందని అనుకున్నారు. రాజకుమారుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడై ‘నాతో నాట్యం చెస్తావా’ అని అడిగాడు. సిండ్రెల్లా రాజకుమారుడు నృత్యం చేస్తూ సమయం చూసుకోలేదు హటాత్తుగా సిండ్రెల్లా కు గుర్తువచ్చి ‘నేనిప్పుడే ఇంటికి వెళ్ళాలి’ అని బయటకు నడిచింది. ‘నీపేరు, చిరునామా చెప్పవా’ అంటూ రాజకుమారుడు ఆడుగు తుండగానే ఆమె రథమెక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పాదాలకున్న గాజు చెప్పు అక్కడే పడిపోయింది.
సమయానికి ఇంటికి చేరింది సిండ్రెల్లా. సమయం 12 కాగానే అన్ని మాయమై పోయాయి. రాజ భవనంలో సిండ్రెల్లాను ఎలాగైనా గుర్తించాలని. అనుకున్నారు. ఆమె వదిలిన గాజు చెప్పు సాయంలో సిండ్రెల్లాను గుర్తించాలి అనుకున్నారు. వెంటనే అందరి వద్దకూ వెళ్ళి పరీక్షించారు. అoదులో భాగంగా సిండ్రెల్లా ఇంటికీ వచ్చారు. సవతి తల్లి కుమార్తె లిద్దరూ నాదే ఈ చెప్పు అంటూ ఇద్దరూ చెప్పారు. భటుడితో పాటు రాజకుమారుడూ వచ్చాడు అక్కడకు. చెప్పును తొడుక్కుని చూపమనగా ఒకరికి పట్టనేలేదు, మరొకరికి చాలా పెద్దదైంది. అప్పుడు మసి బట్టలతో దూరంగా నిలుచున్న సిండ్రెల్లానూ చెప్పు తొడుక్కుని చూడమనగా ఆమెకు సరిగ్గా సరిపోయింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై సిండ్రెల్లాకు పూర్వపు దుస్తులను, రూపాన్నీ ఇచ్చింది. రాజు కుమారుడు సిండ్రెల్లాను గుర్తు పట్టాడు ఆమెను తన రథం ఎక్కించుకొని రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు. తన భార్యగా చేసుకున్నాడు సిండ్రెల్లా యువరాణిగా ఎన్నో సుఖాలను పొంది ఆనందంగా జీవించింది.
కథలు
నీలాకాశం భూమి మీదకి ముత్యాలని వెదజల్లుతున్నదా అన్నట్లు, తెల్లని మంచు జల్లులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆ ముత్యాల మధ్యకుండా పైపైకి ఎగురుతున్నది లోహవిహంగం.
“మేడం కెన్ యూ హేవ్ స్నాక్స్” అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ‘ తెలంగాణ గడ్డమీద సందమామయో సందమామయా,’ పాటను కళ్ళుమూసుకుని ఆస్వాదిస్తన్న అనుపమ నుంచి ఏసమాధానం రాకపోవటంతో, తల్లి వైపు చూసింది శ్వేత.
“మమ్మీ,“ తల్లి భుజంమీద చేయి వేసింది
కళ్ళు తెరిచి చూసిన అనుపమ కళ్ళలో చిన్న కన్నీటి పొర. ఇన్ని సంవత్సరాల తర్వాత తను పుట్టిన గడ్డ మీద అడుగు పెట్టాలనే కోరికతో ఇండియా బయలు దేరిన తన తల్లిలోని ఉద్వేగాన్ని గమనించిన శ్వేత,
“కూల్ డౌన్ మమ్మీ,” అంటూ తల్లి చేయిని తన చేతిలోకి తీసుకుంది.
గతకొన్ని నెలలుగా తల్లి పడుతున్న మానసిక సంఘర్షణ, దాని నేపధ్యం అర్ధంచేసుకుంటూనే ఉంది శ్వేత.
* * *
“చాలా గ్రాండ్ గా ఉంది ఫంక్షన్ హాల్. ఆడంబరంగానే చేస్తున్నాడు బావ రజనీ పెండ్లి. పొలాలు అమ్మలేదుగా, మరి మనీ ఎలా ఎడ్జస్ట్ అయిందో?” అడిగింది అనుపమ భర్త సందీప్ ని.
“బావలిద్దరూ ఇచ్చారు. భూమికి మంచి రేటు రాగానే అమ్మి వాళ్ళకిస్తాడంట,” సందీప్ సమాధానం.
“ఎవరో ఒకరు సాయం చేయాలిగా” ఆమె మాట ఆమెకే పేలవంగా అనిపించింది.
అన్న కూతురు, రజనీ పెళ్లి సంబురాన్ని వీడియోకాల్‌లో చూస్తున్నారు, అమెరికాలో ఉన్న సందీప్, అనుపమ, కూతురు శ్వేత.
“చిన్నోడా, నీవు కూడా పెండ్లికి వస్తే మంచిగుండేది. కనీసం అనుపమని, బిడ్డలిద్దర్నీ అయినా అంపకపోతివి,” వీడియోలో సందీప్ తల్లి బాధ.
“ఏంజేయాల్నే మా ఉద్యోగాలు గట్లనే ఉంటయి. బతుకమ్మల నాటికి వాళ్ళొస్తారులే,” సందీప్ హామీ తల్లికి.
ఇలాంటి హామీలు ఎన్నిసార్లు ఇచ్చాడో తెలిసిన ఆమె మాట్లాడలేదు.
“ఏం బిడ్డా,ఎట్లుండ్రు ఎప్పుడొస్తారు మనదేశం?,” అంటూ పెళ్ళికి వచ్చినవాళ్ళు ఒకరొకరే వీడియోలో అడుగుతున్నారు.
వీడియో చూస్తూ, పెళ్లికి వచ్చిన వాళ్ళని, ‘వీళ్ళెవరు, వాళ్ళెవరూ,’ అని శ్వేత అడుగుతుంటే,అందులో కొంతమంది బంధుత్వం గురించి ఎలా చెప్పాలో అనుపమకి అర్ధం కావటం లేదు. కారణం ఆమెకే వాళ్ళెవరో తెలియదు. ముఖ్యంగా ఈతరం పిల్లలు.
ఈసంవత్సరమే ఎం.ఏ. ఆంత్రోపాలజీలో చేరిన శ్వేత మాత్రం వీడియోలోభారతీయ వివాహ క్రతువుని, సాంప్రదాయాలని ఆసక్తిగా చూడసాగింది.
* * *
అనుపమ వాళ్ళ కౌంటీ లోనే ఉండే అనూష ఇంట్లో ఫంక్షన్. డల్లాస్ లో ఉండే అనూష ఆడబిడ్డ చికాగో వచ్చింది ఒడిబియ్యం ఫంక్షనుకి. అనుపమని కూడా పిలిచారు. ఆమెకి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మాయి, శ్వేత క్లాస్ మేట్స్.
“మమ్మీ, ఆంటీ వాళ్ళు కౌంటీలో మనల్ని ఒకళ్ళనే పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు,” అనటంతో వెళ్ళాల్సి వచ్చింది.
ఇండియా నుంచి అనూష అత్తమ్మ మణెమ్మ వచ్చింది. అనుపమ వెళ్ళగానే అనూష, “అత్తమ్మా, వీళ్ళ ఊరు మనూరి దగ్గర కనగల్లు. పాతికేళ్ల సందు ఈడనే ఉంటున్నారు,” పరిచయం చేసింది.
“దా బిడ్డ, కూసో,” అంటూ సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది.
“మీ మామ పేరేంటి,” అడిగింది.
“లింగమయ్య,” చెప్పింది అనుపమ.
“గరిదాసు లింగమయ్య కోడలివా, చెప్పవేం బిడ్డా. మా చిన్నమ్మమ్మ మనుమడేగా లింగమయ్య. ఎంత మంచోడు, కొడుకుల్ని మంచిగా సదివించాలని ఏంత కష్టపడేటోడో. నీ ఆడబిడ్డలిద్దరికీ మంచి సంబంధాలే చేసాడు. నీ బావ పొలాలు చూసుకుంటున్నా, పైసా పైసా జమజేసి మీఆయన్ని పట్నం అంపి సదివించాడు. పరాయి దేశంలో నౌకరీ అని గొప్పగా చెప్పుకునే టోడు. ఏం లాభం, రెండు సార్లు ఒచ్చిండేమో మొత్తం మీద మీ ఆయన. మీ మామ పోయినప్పుడు కూడా చివరి సూపుకి రాలేకపోయే,” మణెమ్మ వాక్ప్రహం అలా సాగుతూనే ఉంది.
అక్కడే ఉన్న మణెమ్మ కూతురు
“అమ్మా, యేందేగది, ఎప్పుడు, ఎట్ల మాట్లాడాలో తెల్వదా. గమ్మునుండు,” అని తల్లిని గదమాయించి,
“సారీ ఆండీ, ఆమె పాతకాలపు మనిషి, ఏమీ అనుకోవద్దు. రండి హాల్లో కూర్చుందాం,” అని చేయి పట్టుకుని తెచ్చి హాల్లో కుర్ఛోబెట్టింది.
ఆ క్షణంలోనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది అనుపమకి. కానీ శ్వేత కోసం తమాయించుకుంది.
ఇల్లంతా సందడిసందడిగా ఉంది. ఫంక్షన్ మొదలయింది. ఒకరితో ఒకరు పరాచికాలు. ఆడపిల్లలు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నారు. టాప్, లెగ్గిన్స్ లో ఉన్న శ్వేత చేత వాళ్ళ ఫ్రెండ్ బలవంతాన తను ఇండియా నుంచి తెప్పించిన చీరె కట్టించింది.
ముత్తయిదువులు అందరూ కలిసి నవ్వుతూ తుళ్ళుతూ పసుపు బియ్యం కలిపారు. పుడకలు, పళ్ళు అన్నీ తెచ్చారు.
“గదేందే, ఆపుడకలు గట్లనేనా సర్దేది,” మణెమ్మ మాటలకి, ఆమె కూతురు బిడ్డ,
“నేగిట్లనే సరుదుతా, సూడబుద్దయితే సూడు, లేదంటే గమ్మునుండు,” అమ్మమ్మతో పరాచికాలు.
ఒడిబియ్యం కార్యక్రమం పూర్తయింది. తర్వాత లంచ్, డ్రింక్స్ సర్వ్ చేసారు.
“ఏమైనా మనూళ్ళో దావత్ మల్లెయితే ఈడుండదు. ఆడయితే మంచిగ కల్లు నింపుతారు గౌవుల్లోళ్ళు. ఈడేందో ఇస్తరు,” మణెమ్మ గొణుగుడు.
కేవలం కనపడి పోదాం అనుకున్న అనుపమకి సమయం తెలియలేదు. శ్వేత అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నది. ఫంక్షన్ ఎలా చేస్తున్నారు, ఎందుకు చేయాలి వివరంగా అడిగి తెలుసుకుంటున్నది.
లంచ్ అయిపోయాక అనుపమ అందరికీ బై చెప్పి బయలుదేరుతుంటే
“ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందా,” అడిగింది అనూష.
“ఇప్పుడిప్పుడే వీలుకాదు. వెకేషన్ చూసుకోవాలి,” అంటూ మణెమ్మ కాళ్ళకి నమస్కారం చేసింది అనుపమ.
“సల్లంగుండు బిడ్డా, నీ తల్లి లాంటి దాన్ని నీవు ఏమనుకోనంటే ఓముచ్చట చెప్పనా. ఎంత ఎత్తుకు యెదిగినా మన దేశాన్ని, మనూరిని యాదుంచుకోవాల. ఊరంటే కన్నతల్లి లెక్కనే కదా బిడ్డా! చెట్టు ఆకాశం అంతా యెత్తు కెళ్ళినా, దాని వేర్లు యాడ పుట్టాయో ఆడనే ఉంటన్నయిగా! ఏర్లు తెంపుకొని చెట్టు పోతన్నదా? రేపు నీ బిడ్డలకి పెండ్లిండ్లు అయి, పిల్లలు పుట్టినాక ఆళ్ళకి మన భాష, మన దేశం, మన పండుగలు అంటే ఏం చెపుతావు,” అంది అనుపమని రెండు చేతులతో లేవనెత్తి దగ్గరికి తీసుకుని.
ఆమె చేతుల్లో తనకి తెలియకుండానే ఒదిగిపోయింది అనుపమ.ఆ స్పర్శ ఆమెకి కన్నతల్లి ని గుర్తు తెచ్చింది. గుండెలోతుల్లోకి దూసుకెళ్ళాయి ఆమె మాటలు.
“మమ్మీ, నాకయితే చాలా మంచిగనిపించింది. అందరూ నావాళ్ళే అనిపించింది,” కార్లో కూర్చోగానే శ్వేత అన్న మాటలకి ‘ఔను’ అన్నట్లు తలూపింది.
“మమ్మీ, అనూష ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ లాగా మనం ఎందుకు ఉండటం లేదు?” మరో ప్రశ్న వేసింది శ్వేత. మౌనంగా డ్రైవ్ చేయసాగింది. ప్రస్తుతం ఆమె ఆలోచనల సుడిగుండంలో ఉన్నది.
* * *
ఫాల్ సీజన్. చెట్లఆకులన్నీ రంగులు మారుతో, ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, మెరూన్ రకరకాల రంగులతో వింతశోభతో బతుకమ్మలని తలపిస్తున్నాయి.
లాంగ్ వీకెండ్ రావటంతో అనూష ఫ్యామిలీ ట్రిప్ కి వెళుతూ, శ్వేతని కూడా తీసికెళ్ళారు. ఏదో ప్రాజెక్ట్ కోసం సందీప్ ఒహాయో వెళ్ళాడు. కొడుకు కార్తీ ఏడాది నుంచీ సియాటిల్ లోనే ఉంటున్నాడు.
టీ కప్పు తీసుకుని కూర్చున్న ఆమెకి రాత్రి తల్లి అంతులేని ఆవేదనతో ఫోన్ లో మాట్లాడిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.
“ఎట్లుండావు బిడ్డా, ఎన్నాళ్ళు గిట్లుంటరు? నీవు, మన్మరాలు ఓతాన, అల్లుడు ఓదేశం, మనవడు ఓతాన. నాకైతే మంచిగ అనిపిస్తలేదు. అదేమంటే ఉజ్జోగం గట్లుంటది అంటావు. ఈపాలన్నా బతుకమ్మ పండక్కి ఈడకొస్తరేమో అనుకుంటి. రాకపోతిరి. ఆముచ్చట తియ్ గానీ, గీడ పొలాలన్నీ అమ్మమని మీబావకి చెప్పిండంటగ అల్లుడు. ఇక ఈ దేశం ముఖం కూడా చూడరా బిడ్డా?”
చాయ్ తాగుతూ, చెట్లనుండి రాలుతున్న రంగురంగుల ఆకులనే చూస్తున్నది.
అనూష వాళ్ళ ఇంటినుంచి వచ్చినప్పటినుండి మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. ఆ రోజు శ్వేత బలవంతం మీద వెళ్ళింది, కానీ ఆ తర్వాత అనూష తనని ఒక మంచి స్నేహితురాలు గా భావించి వారానికోసారి ఫోన్ చేస్తూనే ఉంది. ఆమె స్నేహం తనలో ఏదో తెలియని ప్రకంపనలు కలుగచేస్తున్నది. ఆమెని చూసాకే తన జీవితం చాలా నిస్సారంగా ఉంది అనిపించసాగింది. ముఖ్యంగా ఆ భార్యా భర్తల అనుబంధం, తను ఏం కోల్పోయిందో తెలుపుతున్నది.
మణెమ్మ అన్న ప్రతి మాటా తనలో అలజడి రేపుతోంది.
“మా అనూష బంగారం లెక్కనే. కోడలు కాదు అది, బిడ్డనే. అన్ని బాధ్యతలు మీదేసుకుంటది. ఈడ ఇల్లు కొందామనుకుండ్రు. గయితే నా చిన్న కొడుకు కొడుక్కి ఎం.బీ.బీయస్ లో సీటొచ్చినాది. వాడితాన పైసలు తక్కువైతే, ఈ కొడుకే ఐదులచ్చలు ఇచ్చిండు. ఏరే ఎవరయినా అయితే ఊరుకుంటారా! మా అనూష అసుంటి మడిసి కాదు.”
అనూష మీద కోపం వస్తున్నది. ఆమె మంచితనం తనకి అశాంతిని కలుగు చేస్తున్నది.
సడెన్ గా ఒంటరితనం ఆవహించింది. కావల్సినంత సంపాదన, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక్క తృప్తి తప్ప. జీవితం పరుగుపందెం అయింది. ఆనందం అనేది తన జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియనంత బిజీ. అనుపమకు మొదటిసారి తన బాల్యం, తన ఊరు, తన వాళ్ళు గుర్తురాసాగారు.
మేనత్తలు, పినతండ్రులు, పెత్తండ్రి వాళ్ళ పిల్లలతో తను గడిపిన రోజులు గుర్తురాసాగాయి. తమ్ముడితో కలిసి ఆడిన ఆటలు, స్కూలు స్నేహితులతో గడిపిన రోజులు కళ్ళముందు కదలాడసాగాయి.
తన చిన్న తనంలో, బతుకమ్మ ఎట్లాడేవాళ్ళు. అందరికంటే తమ బతుకమ్మే పెద్దగా ఉండాలని, ఆరుగంటలకే లేచి తను , అత్త కూతురు ఇద్దరూ ఊరిమీద పడి, తంగేడు, బంతి, గునుగు పూలు తెచ్చి, తాంబలంలో పేర్చేవాళ్ళు. చుట్టుపక్కల అందరి బతుకమ్మలు కూడా తెచ్చి తమ ఇంటి ముంగిటనే పెట్టేవాళ్ళు. చుట్టూ తిరుగుతా ఏంపాడేవాళ్ళు! అత్తమ్మకి రాని పాట లేదు.
నడిరేత్రి దాకా ఆడి చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. ఆ ఆనందం ఇప్పుడు ఏది? ఇక్కడ కూడా ఆడుతున్నారు, కానీ అది ఒక ఫార్మల్ సెలబ్రేషన్ గా వెళ్లి వస్తుంది అంతే. ఎందుకు తను ఇంత శిలలా మారింది?
* * *
అనుపమది దేవరకొండ దగ్గర ఒక పల్లెటూరు. తండ్రి వ్యవసాయం చూసూకునేవాడు. రెండెకరాల పొలంలో పాలకూర పండించేవాళ్ళు. తల్లి రెండు బర్రెలని సాకుతూ పాలమ్మి తండ్రికి చేదోడుగా ఉండేది. కష్టమైనా సరే వాళ్ళు, అనుపమని, కొడుకు రాజేశ్ ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించి చదివించారు.
అనుపమ తల్లితండ్రుల తోబుట్టువులు మిగిలిన వారు అందరూ కాస్త కలిగిన కుటుంబాలే. అందరూ ఉద్యోగస్తులు. అనుపమ కుటుంబమే ఆర్ధికంగా వెనుకబడింది. దాంతో మిగిలిన వాళ్ళు వీళ్ళ చదువులకి, ఇతర అవసరాలకు సహాయం చేస్తుండే వాళ్లు. అదే ఊళ్ళో ఉన్న మేనత్త ఆర్ధికంగా చాల ఉన్నతంగా ఉండేది . మామూలు సహాయంతో పాటు ఆమె, అనుపమకి, ఆమె తమ్ముడికి తన పిల్లలు నెలరోజులు వాడి వద్దనుకున్న ఖరీదైన బట్టలు ఇస్తుండేది. సంవత్సరానికి ఒకసారి కొత్తబట్టలు కొని పెట్టేది.
అనుపమ బీ.టెక్. చేయటానికి కూడా ఆమె చాలా సహాయం చేసింది. ఆమె పిల్లలు కూడా వీరి పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు.
అనుపమ చిన్న పిల్లగా ఉన్నప్పుడ ఇవన్నీ బాగానే ఉండేవి. కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి అనుపమ, వాళ్ళు తమ మీద జాలి చూపించటం సహించలేక పోయేది. అది అవమానంగా భావించేది. దానికి తోడు ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు తన ఈడు పిల్లలు కొత్త బట్టలు, నగలు గురించి మాట్లాడుకుంటుంటే తను అందులో భాగస్వామి కాలేకపోయేది. ఒక ఆత్మ న్యూనతా భావం, స్వాభిమానం కలగలిసి ఉండేవి.
బీ.టెక్. కాగానే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావటం ఆమె జీవితంలో ఒక ఆనందకరమైన మలుపు. ఆ తర్వాత సందీప్ తో వివాహం ఆనందకర జీవితానికి మరో మెట్టు అయింది. వివాహానంతరం సందీప్ తో కలిసి అమెరికా ప్రయాణం. తనకి కూడా అక్కడే జాబ్, గ్రీన్ కార్డ్ రావటం బతుకు బంగారు బాటైంది.
అయితే , ఇప్పుడే అనుపమ మనసు చిత్రంగా మారింది. ఒక్కసారి అమెరికా వెళ్ళాక, ఆమె, తనని ఆదరించిన వాళ్ళని తలచుకోవటాని కూడా ఇష్టం పడలేదు. పైగా ఒకలాంటి కసితో సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంది.
ఒకటే పరిస్థితులు ఇద్దరు మనుష్యులు స్వీకరించిన విధానం వేరుగా ఉంది. అనుపమ, తన బంధువులు తనకి చేసిన సహాయం అవమానంగా భావిస్తే, ఆమె తమ్ముడు రాజేష్ మాత్రం వాళ్ళ చేసిన సహాయం గుర్తుపెట్టుకుని, తమ ఉన్నతికి కారణమైన వాళ్ళని ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు.
రెండు కానుపులకి అమ్మనే పిలిపించుకుంది. రెండు ఇళ్లు కొన్నారు.
చూస్తూండగానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. అనుపమలో చాలా మార్పు, భాష, వేషం, తిండి అన్నింటా మార్పే. కాలంతో పాటు బుతువులు మారినంత సహజంగా, తను మారాను అని తనకే తెలియనంత సహజంగా మార్పు. మధ్యలో కేవలం ఐదారు సార్లు ఇండియా వెళ్ళింది. ఉన్న రెండు నెలల్లో షాపింగులకే సగం సమయం గడిచిపోయేది. అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నిరోజులు అత్తమ్మ దగ్గర కొన్ని రోజులు. అంతేమళ్ళీ అమెరికా ఫ్లైట్ ఎక్కడం.
పెద్ద పిల్ల శ్వేత, చిన్నాడు కార్తీకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో అనుబంధం కేవలం ఆ కొన్ని రోజులే. మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ లో మాట్లాడేది. సెల్ ఫోన్లు వచ్చినాక ,అమెరికా నుంచి తను ఇచ్చిన సెల్ ఫోన్ లోనే వారానికొకసారి వాళ్ళు మనుమడు మనుమరాలిని చూసి మాట్లాడుతూ మురిసి పోయేవాళ్ళు.
వీక్ డేస్ వర్క్ బిజీ, వీకెండ్స్ పార్టీలతో అదీ తగ్గిపోయింది. కార్తీ అచ్చంగా అమెరికా సంస్కృతికి వారసుడయ్యాడు. తల్లితండ్రులతోనే మాట్లాడలేనంత బిజీ.
శ్వేత మాత్రం తండ్రి ఆలోచన, మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకుంది. అతని ఆశయాలకి అనుగుణంగా నడచు కుంటూనే తల్లిని కూడా ప్రేమించే మెచ్యూరిటీ ఉన్న యువతి శ్వేత. ఇప్పుడు ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నది. కార్తీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్ లో జాయిన్ అయినాడు.
* * *
అనుపమ మనసులో ఆలోచనలు మంచు మేఘాల్లా ముసురుకుంటున్నాయి.
ఏదో కోల్పోయిన భావన. ఏం కోల్పోయాను? అయిన వారి ప్రేమ ఆప్యాయతలు, తన సంసృతి సంప్రదాయాలు, తన భాష, అసలు తన ఉనికినే కోల్పోయింది. మానవత్వం, సేవాభావం అనేవి ఎప్పుడో మర్చిపోయింది. ఇవన్నీ అటుంచితే భర్త ప్రేమకు కూడా దూరమైంది. తను ప్రవర్తనతో అతనికి తన మీద నిర్లిప్త ధోరణి కలిగేటట్లు ప్రవర్తించింది. సొంత కూతురిలా చూస్తూ తనకి మేనత్త చేసిన సాయం ఆమె వేసిన భిక్ష గా భావించిందే కానీ ఆమె ప్రేమను చూడలేక పోయింది. సందీప్ తో తన పెళ్ళికి ఆమె చేసిన సాయం మరువలేనిది.
*. *. *
సందీప్, అనుపమ కొలీగ్స్. సందీప్ ఆమె కంటే రెండేళ్ళు సీనియర్. తను టీం లోకి కొత్తగా వచ్చిన అనుపమ మొదటి చూపులోనే అతనిని ఆకర్షించింది. అందం, వర్క్ పట్ల అంకితభావం సందీప్ ని ఆమెకి దగ్గర చేసాయి. ఆమె తనకి దూరపు బంధువు అని తెలియగానే, పెద్దవాళ్ల ద్వారా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.
అనుపమకు అభ్యంతరం ఏమీ లేదు. అతను ఆర్థికంగా తమకంటే బాగానే ఉన్నాడు. వాళ్ళది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. అతనికి ఇద్దరు అక్కలు, అన్నయ్య. అందరికీ వివాహాలు అయినాయి. సందీప్ అన్న ఇంటర్ తో చదువు ఆపేసి, పొలం పనులు చూసుకుంటున్నాడు. అక్కయ్యలు ఇద్దరూ స్థితిపరులే. కాబట్టి సందీప్ కి ఏ బాదరబందీ లేదు. ఆమెకి కావాల్సింది అదే.
పైసా కట్నం లేకుండా అనుపమని చేసుకున్నాడు సందీప్.
పెళ్ళయిన వెంటనే అమెరికా అవకాశం వచ్చింది సందీప్ కి. అనుపమకి కూడా మూడు నెలల తర్వాత అవకాశం వచ్చింది.
ఉద్యోగం లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇద్దరూ ఉన్నత స్థితికి వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తెలియని దూరం ఏర్పడసాగింది. కొన్ని సంఘటనలకి, మార్పులకి ప్రత్యేకమయిన కారణం అంటూ ఉండదు. కొందరి విషయంలో చిన్న అభిప్రాయభేదాలు , మరికొందరు విషయంలో దారులు వేరు కావటం.
అనుపమకు అందరూ తనని చూసి ఈర్షపడేంత ఎత్తుకు ఆర్ధికంగా ఎదగాలని కోరిక. దానికోసం ఆమె సందీప్ ని కూడా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది. మనకు ఉన్నదానితో అందరికీ సాయం చేయాలనే గుణం సందీప్ ది. దానికి పూర్తి వ్యతిరేకం అనుపమ. పంటలు సరిగా పండక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సందీప్ అన్నకి ఆర్ధిక సాయం చేయటం అనుపమకు ఇష్టం ఉండదు.
తను సంస్కృతి సంప్రదాయాలు, తన బంధువులు గురించి పిల్లలకు చెప్పాలనే తాపత్రయం సందీప్ కి. ఆ మట్టి మనుషుల వాసనే వద్దంటుంది అనుపమ. అరకొర చదువులతో, పల్లెటూరిలో ఉండే వాళ్ళు తమ స్థాయికి తగరు అనే చిన్నచూపు. ఆచారవ్యవహారాలు మూఢనమ్మకాలు అనే భావన.
ఉద్యోగం పేరుతో తమ ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి ఒకేచోట ఉన్నది చాలా తక్కువ. పిల్లలు, అనుపమ ఒకచోట, సందీప్ మరోచోట. ఆ ఎడబాటు మానసికంగా కూడా చాలా దూరం చేసింది.
తండ్రి చనిపోతే తను ఒక్కతే వెళ్లి వచ్చింది. మామగారు పోతే సందీప్ ఒక్కడే వెళ్లి వచ్చాడు. కోడలిగా రావటం నీ బాధ్యత అని సందీప్ ఎంతో చెప్పాడు. కానీ అదే సమయంలో డైరెక్టర్ గా తనకి ప్రమోషన్ వచ్చింది. ఇండియా వెళ్ళలేని పరిస్థితి. చివరికి సందీప్ ఒక్కడే వెళ్ళాడు కానీ చివరిచూపు దక్కలేదు.
అయినవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాకూడా ఏనాడు తను సాయం చేయలేదు. బావకూతురు పెళ్ళి ఖర్చు తమకి పెద్ద సమస్య కాదు. కానీ మాటవరసకు కూడా డబ్బు కావాలా అని అడగలేదు. కానీ వారందరూ తమని ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రతి ఫంక్షన్ లోను తమని కోల్పోతున్న బాధ వాళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అనూషకి తనకీ ఎంతో తేడా! కోట్లు మూలుగుతున్నా ఒకళ్ళకి సాయం చేయాలనే ఆలోచనే రాదు తనకి. కానీ అనూష మరిది కొడుకు కోసం, తన సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆలోచనని ఆనందంగా పక్కున పెట్టింది.
రేపు నిజంగానే తన బిడ్డలకి వారసత్వ సంపద ఏమి ఇస్తుంది తను ? ప్రేమాఆప్యాయతలు, మాతృభూమి మీద ప్రేమ లోపించిన ధనం ఇస్తున్నది.
బావ కూతురు పెళ్ళికి సందీప్ వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అదే రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దాంతో వెళ్ళలేక పోయాడు. అది అతనిలో అశాంతిగా మారి, రోజు రోజుకూ పెరుగుతోంది.
*. *. *
రెండు రోజుల తర్వాత వచ్చారు అనూష వాళ్ళు ట్రిప్ నుంచి. ఆ సరికే తన మనసులోని ఆలోచనలకు ఒక రూపం ఏర్పరచుకుంది అనుపమ.
“సందీప్, నీవు,నేను, శ్వేత డిసెంబర్ లో ఇండియా వెళ్దాం,” టూర్ నుంచి సందీప్ రాగానే చెప్పింది అనుపమ.
“ఏంటి ఇంత సడెన్ గా,”
“అమ్మని, అత్తమ్మని చూసి చాలా ఏళ్ళయింది. చూడాలని ఉంది. అలాగే,మనూర్లో పొలాలు అమ్మొద్దని బావకి చెప్పు. తనకి డబ్బు ఏదైనా అవసరమైతే మనం ఇద్దాం,” అన్న అనుపమ మాటలకి,
కలో నిజమో అర్ధం కాలేదు సందీప్ కి అలాగే చూస్తూ నిలబడ్డాడు.
“సందీప్, ఆకాశానికి ఎదగాలంటే భూమితో తెగతెంపులు చేసుకోకూడదు అనే సత్యం ఇన్నేళ్ళకి గ్రహించాను. నా ప్రవర్తనతో నీవు ఎంత విసిగి పోయి ఉంటావో. పిల్లలు ఇప్పుడు శాశ్వతంగా ఇండియా రావటానికి ఇష్టపడరు. కానీ మనకి అవకాశం ఉంది. కావల్సిన దానికంటే ఎక్కువగానే సంపాదించాం. ఇంకో ఐదేళ్ల తర్వాత మనం ఇండియాలోనే ఉందాం” అంది అనుపమ.
ఆమెని అలాగే చూస్తూ నిలబడ్డాడు. శిల నుంచి శిల్పం గా మారిన భార్యలో తాను మొదటిసారి చూసిన అనుపమ కనపడుతోంది అతనికి .
తను శిల్పంగా మారటానికి కారణం అనూష అని సందీప్ కి ఏదో ఒక రోజు తెలియ చేయాలి అనుకుంది అనుపమ.
* * *
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండయింది ఫ్లైట్. చిన్ననాటి జ్ఞాపకాలు చిరుజల్లులై మనసును తాకుతుండగా, ఉద్వేగంతో తన మాతృభూమి పైపాదం మోపింది అనుపమ.
క్యాబ్ లో కూర్చోగానే, అసంకల్పితంగా ఆమెకి తన అమెరికా లోని తన ఫ్రెండ్ జెన్నీఫర్ గుర్తుకొచ్చింది. ఎప్పటినుంచో అడుగుతున్నది, ‘ఇండియన్ కల్చర్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా, హెల్ప్ చేయవా’ అని.
అప్పుడు బోర్ అనిపించిన సబ్జెక్టు ఇప్పుడు అనుపమకు ఇష్టమైంది.
వెంటనే కాల్ చేసింది, “హాయ్ జెన్నీ, నీ రీసెర్చ్ కి ఇన్ఫర్మేషన్ నేను ఇండియా నుంచి వచ్చాక ఇస్తా.”
విండో కుండా బయటికి చూస్తూ మెల్లిగా హోమ్ చేసుకోసాగింది, ” నాదు జన్మభూమి కంటే నాక మెక్కడుంది,సురలోక మెక్కడుంది,
మధ్యాహ్నం భోజనం చేసి, పుట్టింట్లో నాలుగు రోజులు గడపడానికి వచ్చిన కూతురు భావన తల్లికి అత్తవారింటి విషయాలు చెబుతోంది. సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్నాడు తండ్రి శ్రవణ్. భర్త మంచివాడేనని, అత్తగారు కూడా కలివిడిగానే ఉంటుందని చెబుతూనే ఏవో కంప్లైంట్స్ ఇస్తూ తను ఆమెను ఎంతగానో భరిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. తల్లి రేఖ “అలా కాదమ్మా! మీ అత్తగారిని రెండేళ్లుగా చూస్తున్నాం. మంచి మనిషి. అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టం” అని నచ్చచెప్పడం ఆ అమ్మాయికి నచ్చడం లేదు.
అప్పటిదాకా మౌనంగా వింటున్న శ్రవణ్ “భావనా!” అన్నాడు కొంచెం కఠినంగా. తల్లీ కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి శ్రవణ్ వైపు చూశారు. “భావనా! ఎప్పుడూ ఇతరుల మీద నింద వేయడం సరి కాదు. అల్లుడితో సమానంగా నువ్వూ డ్యూటీకి వెళ్ళిపోతే మీరు వచ్చేవరకు అన్నీ సిద్ధం చేయడం మాట్లాడినంత సులువు అనుకుంటున్నావా? అల్లుడు భరత్ ఒక్కడే కావడం వల్ల నీకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. భర్త లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మీ సుఖం కోసం ఎప్పుడూ ఆరాటపడే మీ అత్తగారిని అనడానికి నీకు నోరెలా వస్తోంది? ఎంతో మంది ఆడవాళ్లు అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దానికి మీ అమ్మ నీ ముందు సజీవ సాక్ష్యం. ఆమె ఎదుర్కొన్నవాటిలో నీ అనుభవం ఆవగింజంత కూడా కాదు. నన్ను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పడిన అనేకమైన కష్టాల్లో నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక దుస్సంఘటన చెప్తాను. ఇప్పటివరకు నీకవేవీ తెలియవు”. అని కళ్ళు మూసుకొని దాని తాలూకు గతంలోకి జారిపోయాడు శ్రవణ్.
*****
ఆ రోజు…మేడ మీద ఒక గదిలో శ్రవణ్ అసహనంగా అటూఇటూ పచార్లు చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి పరీక్షలు ముగించుకొని ఆరోజు మధ్యాహ్నమే పల్లెకు వచ్చాడు. భార్య రేఖ ఎందుకో సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదు. ఆమె ముఖంలోని భావాలను చదవడానికి తనకు కళ్ళులేవుగా! రేఖ గదిలోకివస్తే అడగాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ రాత్రివేళ పనంతా ముగించుకొని కానీ ఆమె పైకిరాదు. కుటుంబ కట్టుబాట్లకు ఎక్కడా లోపం రానీయదామె. అత్త, భర్త, మరుదులు, ఆడపడుచులు అందరూ భోజనం చేశాక పనంతా ఆమే చేసుకోవాలి. ఇంటికి పెద్ద కోడలు కదా! కొంతమందికి అడగకుండానే సంప్రదాయబద్ధంగా కొన్ని బాధ్యతలు వచ్చి చేరతాయి వయసుతో నిమిత్తం లేకుండా..!
గుమ్మం దగ్గర అలికిడి అయింది. అడుగుల సవ్వడినిబట్టి రేఖ అని అర్థమయింది. రెండు నిమిషాలు మౌనం ఇద్దరి మధ్యా… మంచంమీద కూర్చున్నాడు శ్రవణ్. దగ్గరగా వచ్చిన రేఖ అమాంతం అతడిని చుట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊహించని ఈ పరిణామం అతన్ని అయోమయంలో పడేసింది.
చదువు కోసం శ్రవణ్ హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండడం, పరీక్షలు అయింతర్వాత సెలవులకు ఇంటికి రావడం పరిపాటే. ఇంట్లో అందరి మధ్యలో ఒంటరితనం అనుభవిస్తున్న రేఖ భర్త కున్న అంధత్వం వల్ల తమ భవిష్యత్తు కోసం శ్రవణ్ చదువే ఒక ఆలంబన అనే సత్యాన్ని అతని మాటల ద్వారా గ్రహించింది. అందుకే 16 ఏళ్ళ రేఖ అతనికి దూరంగా ఉండడానికి గొప్ప మనసుతో అంగీకరించింది. అత్తగారి సూటిపోటి మాటలను, తన భర్త నిస్సహాయతవల్ల సంసార బాధ్యతను భుజాల మీద మోస్తున్న మరిది పెద్దరికాన్ని భరిస్తూనే, చిన్నవారైన ఇంకొక మరిది, ఇద్దరు ఆడపడుచుల ఆలనాపాలనా చూసుకుంటోంది. ***
ఏడుస్తున్న రేఖను ఓదార్చడం అసాధ్యమైంది శ్రవణ్ కు. జరగకూడనిది ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. ఆమె దుఃఖం కొంత ఉపశమించేదాకా ఆగి “ఏమైంది రేఖా! ఎందుకేడుస్తున్నావ్? నువ్విలా ఏడవడం నేను చూడలేకపోతున్నాను. జరిగిందేమిటో చెప్పు?” లాలనగా అడిగాడు. వెక్కిళ్ళమధ్య రేఖ చెప్పిన విషయం విని శిలలా బిగుసుకుపోయాడు శ్రవణ్.
దీనికంతటికీ తన అసహాయతే కారణమా? అదే అయితే దానికి రేఖను బలి చేయడం ఎందుకు? నరాలు బిగుసుకున్నాయి.
తననుతాను తమాయించుకొని “రేఖా! మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయమే రాగానే నీతో చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. వచ్చినప్పటినుండీ నీ మౌనం నాలో అలజడులను రేపుతూనే ఉంది. నేను చెప్పే వార్త విని నీ మనస్సులో పొంగే సంతోష తరంగాల సవ్వడులను నా గుండెలో పొదువుకుందామనుకున్నా. ఒక్కసారిగా నా ఆశలు మొదట్లోనే పాతర వేయబడ్డాయి. నాలాంటి అంధుడిని కట్టుకున్నందుకు నాతోపాటు నువ్వూ చిత్రవధ అనుభవిస్తున్నావు. ఊరుకో! నీ ఆవేదనను అర్థం చేసుకోవడమే తప్ప ఏమీ చేయలేని వాణ్ణి. కాలం మనకు మంచిరోజులు ఇస్తుందని నా నమ్మకం అన్నాడు. కానీ రేఖ ఉన్న పరిస్థితిలో భర్త ఓదార్పు, ఆయన చెప్పాలనుకున్న శుభవార్త ఇవేవీ ఆమెకు రుచించలేదు.
పేదవారైన రేఖ తల్లిదండ్రులు గత్యంతరం లేక అంధుడైన శ్రవణ్ తో ఆమె పెళ్లి చేశారు. డబ్బున్న ఆ ఇంట్లో కూతురు సుఖపడుతుందని వారు ఆశించారు. పేదరికంతో పాటు శ్రవణ్ అంధత్వం ఆమె ఆశలకు సంకెళ్లు వేసాయి. ఆమెకు పెళ్లిలో శ్రవణ్ వాళ్ళు చేయించిన బంగారు గొలుసు ఇనప్పెట్టెలో ఉంటుంది. అప్పుడప్పుడు శుభకార్యాలకు అత్తగారే తీసి ఇస్తుంటుంది. పెట్టె తాళపుచెవులు ఆమె దగ్గరే ఉంటాయి. ఈ విషయంలో ఆమె ఎవ్వరినీ నమ్మదు. అలాంటిది ఉన్నట్టుండి ఆ గొలుసు పెట్టెలో నుండి మాయమైంది. కుటుంబమంతా తర్జనభర్జనలు జరిపి పేదింటి అమ్మాయి రేఖకు మాత్రమే తీసే అవసరం ఉందని తేల్చారు.
ఇందులో రేఖ తన గొలుసు తనే ఎందుకు దొంగతనం చేస్తుందన్న ఇంగితజ్ఞానం కూడా ఎవ్వరికీ కలుగలేదు. మన కుటుంబాల్లో చాలామందికి కోడలు పరాయిది. ఎంత ఊడిగం చేయించుకున్నా ఇలాంటి విషయాల్లో ఆమెను దోషిగా నిలబెడతారు. రేఖ నుండి విషయాన్ని రాబట్టడానికి ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష, పరోక్ష ప్రయత్నాలు ఎన్నోచేశారు. శ్రవణ్ ఊళ్ళో లేడు కాబట్టి ఇవేవీ అతనికి తెలియవు. మరో దారుణమేంటంటే అజ్ఞానం వెర్రితలలు వేసి మూఢనమ్మకంగా మారి రేపటి రోజున రేఖను దోషిగా నిరూపించడానికి అమ్మలక్కలంతా పథకం తయారుచేసారు. రేఖను శోకదేవతగా మార్చిన సంఘటన ఇదే. *****
సూర్యుడు తన కర్తవ్య పాలనకు ఉపక్రమించాడు. రేఖ ఎప్పటిలాగే చీకటితోనే లేచి యాంత్రికంగా తన పనులు చేసుకోసాగింది. మన దేశంలో చాలమంది మధ్యతరగతి మహిళల బ్రతుకులు ఇట్లాగే తెల్లవారుతాయి కారణాలు ఏవైనా. రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ కళ్ళు ఉబ్బిపోయి ఉన్నా గమనించనట్లే ఉన్నారు ఇంట్లోని వాళ్లందరూ. అదింకా రేఖ మనసును సూటిగా గుచ్చుతోంది. శ్రవణ్ ఆలోచనల నిద్ర లేమితో ఎరుపెక్కిన కళ్ళను నల్లటి కళ్ళద్దాలలో దాస్తున్నాడు. ఇదంతా అన్యాయమని గొంతెత్తి అరవాలని ఉంది. దాని పరిణామాలు తమ భవిష్యత్తు మీద ఎలాంటి ముద్రలు వేస్తాయో తనకు బాగా తెలుసు. తొందరపడటం అన్నిటికీ పరిష్కారం కాదని, తన చదువు ఒక కొలిక్కి వచ్చేంతవరకు ఎన్ని బాధలైనా అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. భర్త ఆలోచనలను ఎరిగిన ఇల్లాలిగా ఎంతో సహనం వహించే రేఖ కొన్ని సందర్భాల్లో భర్త నిష్ప్రయోజకుడని నిందిస్తుంది. ఆమె భావనలో తప్పు లేదు. వ్యతిరేకులైన మనుష్యుల మధ్య ఆమెకున్న ఒకే ఒక ఆలంబన శ్రవణ్.
అంధుడని తెలిసినా ఏ నమ్మకంతో జీవన ప్రయాణంలో తోడుగా ఉంటానని వచ్చిందో ఆ మనసుకే తెలుసు.
ఇల్లంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా తనవాళ్లే మొన్నటివరకు. తన కుటుంబమే. కానీ ఈరోజు అందరూ ఉన్న ఏకాకి రేఖ. చేయని నేరానికి అభియోగం మోపబడిన ముద్దాయి. ఆమె కళ్ళు నిండు తటాకాలయ్యాయి. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. అమ్మలక్కలు ఒక్కొక్కరుగా ఇంటి వసారాలోకి వచ్చి చేరుతున్నారు. రేఖను దోషిగా నిరూపించే ప్రయత్నాల్లో మొదటి ప్రణాళికకు రంగం ఏర్పాటు చేశారు. ఇంట్లో రేఖ, శ్రవణ్ తప్ప మిగిలిన అందరిలో కుతూహలం చోటు చేసుకుంది. శ్రవణ్ కు కూడా రేఖ నిర్దోషి అని పూర్తి నమ్మకం. అందుకే ఒకచోట ఒంటరిగా కూర్చున్నాడు. విద్యాగంధం లేని ఆ పల్లె టూరులో చదువుకున్న తానొక్కడు ఇవి మూఢ నమ్మకాలని ఎలా రుజువు చేయగలడు? అభిమన్యుడై ఎట్లా పోరాడగలడు? సన్నటి కన్నీటి పొర కనిపించని ఆ కళ్ళల్లో.
మొత్తం ఐదుగురు ఆడవాళ్లు వచ్చారు. అందులో అందరికంటే వయసులో పెద్దావిడ శ్రవణ్ తల్లి రాజమ్మను బియ్యం, పసుపు తెమ్మని పురమాయించింది. వాటిని కలుపుతూ కళ్ళు మూసుకొని పెదాలతో ఏవో అర్థం కాని పదాలను వల్లించింది. అందరూ చోద్యం చూస్తున్నారు. “రేఖమ్మా! మళ్లీ అడుగుతున్నా చెప్పు. గొలుసు నువ్వే తీసినవు కదా”? అడిగింది పెద్దరికం.
“లేదు పెద్దమ్మా! మీరెన్ని సార్లు అడిగినా నేను తీయలేదు అంతే. ఆ అవసరం నాకు లేదని మీకు మళ్లీ మళ్లీ చెప్తున్నా” ఆవేదన, ఆక్రోశంతో దుఃఖాన్ని గొంతుకలో ధ్వనింపచేస్తూ రేఖ జవాబు. “ఇక ఇట్లా కాదులే రాజమ్మా! ఎంత అడిగినా నీ కోడలు నిజం చెప్తలేదు. రేపటికల్లా నిజం బట్ట బయలైతది. ఇదుగో, ఈ మంత్రించిన బియ్యాన్ని నీ కోడలును తినమని చెప్పు. పొద్దటికి కడుపుబ్బి, నిజం కక్కుతది” అన్నది పెద్దరికం పొగరుగా తల ఎగరేస్తూ తానేదో సాధించబోతున్నట్టు.
“సరే వదినా” అంటూ రాజమ్మ రేఖతో వాటిని తినమని చేతిలో పెట్టింది. ధారలుగా కారుతున్న కన్నీటిని కొంగుతో
తుడుచుకుంటూ ఉక్రోషంగా చేతిలోకి తీసుకొని వాటిని కసిదీరా నమిలి మింగేసి పరుగెత్తుకొని లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె గుండెలోని బాధతో సంబంధం లేని అమ్మలక్కలు తమవంతు పని పూర్తయిందన్న తృప్తితో కాసేపు అదే విషయాన్ని చర్చించుకుని వెనుదిరిగారు.
మరో ఉదయానికి తెర తీస్తూ చంద్రుడు మబ్బుల్లో కనుమరుగయ్యాడు. రేఖ మామూలుగానే లేచి పనుల్లో నిమగ్నమయింది. సమయం గడుస్తున్న కొద్దీ దుఃఖ తీవ్రత తగ్గడం సహజమే కదా! శ్రవణ్ కు కూడా ఏదో జరుగుతుందనే భయం లేదు. రేఖపై అత్యంత విశ్వాసం కలిగి విద్యావంతుడైన భర్త అతను. కళ్ళు లేకపోవడమనే లోపం తప్ప పరిపూర్ణ సుమనస్కుడతడు. ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా లేచి అనుమానంగా రేఖ వైపు చూడసాగారు. ఎలాంటి తేడా ఆమెలో కనిపించలేదు. గొలుసు దొంగతనం ఆమెనే చేసి ఉంటుందని, ఈ రోజు అది తేటతెల్లమవుతుందని, దాని తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చించుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగింది.
సూర్యుడు తన తాపాన్ని పెంచుకున్నాడు. నిన్నటి పెద్దరికం ఇంట్లోకి వచ్చింది. రాజమ్మతో గుసగుసలు కాసేపు. ఆమెతో మాట్లాడి వెళ్ళిపోయింది. మేడ మీద ఉన్న శ్రవణ్ దగ్గరికి వచ్చి రేఖ జరిగిన విషయం చెప్పింది. ఇద్దరిలో అంతులేని ఆలోచనలు. మళ్ళీ ఏ పథకాన్ని తోడుతున్నారోనని భయం. అది తప్పు చేయడం వల్ల వచ్చింది కాదు. చేయని నేరానికి శిక్ష అనుభవించే బలం మనసులకు లేక కలిగే భయం.
సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు అమ్మలక్కలంతా మళ్లీ సమావేశమయ్యారు. చాలాసేపు చర్చించుకున్నారు. రేఖను పిలిపించారు. రేఖతో పాటు శ్రవణ్ కూడా కిందకు వచ్చాడు అసహనంగా. రాజమ్మ చేటలో బియ్యం తెచ్చింది. పసుపుతో వాటిని కలపమని పెద్దావిడ ఆజ్ఞ జారీ చేసింది. కలిపిన పసుపు బియ్యంలో ఒక్కొక్కరిని పిలుస్తూ రెండు చేతులు పెట్టమంది. రేఖను మాత్రమే పిలిస్తే బాగుండదని ముందుగా ఇద్దరు, ముగ్గురిని పిలిచింది. ఏవో చదువుతూ వాళ్ళు పెట్టిన చేతుల మీద తన చేతులు పెట్టింది. ఒకవేళ వారు దోషులైతే ఆమె చేతి కింద ఉన్న చేతులు వాటంతట అవి కదులుతాయి. ఇదీ ఆ ప్రక్రియ సారాంశం. ఎవరి చేతులూ కదలలేదు. రేఖ వంతు వచ్చింది. రేఖ భయం భయంగా చేతులు పెట్టింది. రేఖ చేతులపై పెద్దావిడ చేతులు. “కదులుతున్నాయ్, కదులుతున్నాయ్” ఆమె కళ్ళలో మెరుపు, గొంతులో ఆనందం. బిత్తరపోయిన రేఖ.
అప్పటిదాకా అన్నిటినీ భరిస్తూ వచ్చిన శ్రవణ్ హృదయంలోని బడబానలం ఒక్కసారి విరుచుకుపడింది. “ఆపండి!” అరిచాడు గట్టిగా. పెద్దరికం ఏదో మాట్లాడబోయింది. “ఇప్పటి వరకు చేసింది చాలు. ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎవరైనా ప్రయత్నిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. అంత చేతకాని వాడిననుకుంటున్నారా? దోషులను నిర్ణయించే సామర్థ్యం మీకుంటే ఇక పోలీసులు, కోర్టులు ఎందుకు? అసలు రేఖను దోషిగా అనుకోవడానికి మీకు మనసెలా ఒప్పింది? మీ మూఢ నమ్మకాలతో అమాయకులను బలి పెట్టొద్దు. వెళ్లండి అందరూ ఇక్కడినుండి” అన్నాడు పెల్లుబికిన ఆవేశంతో. రాజమ్మతో సహా అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కొడుకులో ఇంత ఆవేశం ఆమె కూడా ఎప్పుడూ ఎరగదు. ఈ చర్యను ఆమె ఊహించలేదు. సైగ చేసింది వాళ్లకు వెళ్ళిపొమ్మని. అందరూ జారుకున్నారు మెల్లగా. శ్రవణ్ తన నిస్సహాయతకు తనను తాను నిందించుకుంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. రేఖ మనసు వీణలు మీటింది. తనకు సర్వస్వం అయిన శ్రవణ్ తనకోసం అందరినీ ఎదిరించి తన పక్షాన నిలవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఇక తనకు ఎలాంటి బాధ లేదు అనుకుంది తృప్తిగా. దుఃఖమంతా ఆవిరైపోయినట్టు తోచిందామెకు. మౌనంగా భర్తను అనుసరించింది సంతోషంగా.
*****
ఒక వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. మళ్లీ ఇంట్లో ప్రయత్నాలు మొదలైనట్టు రేఖ ద్వారా అర్థమైంది శ్రవణ్ కు. ఏదైనా భయం లేదనుకున్నాడు. రేఖకు ధైర్యం చెప్పాడు. గొలుసును దొంగిలించింది ఇంకా ఎవరో తేలలేదు కాబట్టి శ్రవణ్ పెద్ద బావ నాలుగూళ్ల అవతల ఎవరో “అంజనం” వేస్తారని దాంట్లో దొంగ బయటపడతాడనే వార్త మోసుకొచ్చాడు. శ్రవణ్ పెద్ద తమ్ముడు, బావ ఇద్దరూ కలిసి ఆ ఊరికి వెళ్లారు. అక్కడ కొమురయ్య అనే వ్యక్తి అంజనం వేస్తాడని తెలిసి అతని ఇంటికి వెళ్లారు. వీళ్ళు చెప్పిన విషయం అంతా విని కొమురయ్య దొంగను పట్టిస్తానని భరోసా ఇచ్చాడు. చేతికి ఏదో లేపనం పూసుకుని కాసేపు మంత్రాలు చదివి, రేఖ దోషి కాదని ఇతరుల వల్లే గొలుసు మాయమైందని తేల్చాడు. రేఖ మీద ఉన్న అభియోగం ఆ రకంగా రూపుమాపబడింది. తర్వాత ఎన్నో ప్రయత్నాలు జరిగి కొన్నాళ్ళకు ఆ ఇంటి పనివాడు తీసాడన్న వాస్తవం తెలియడం, వాడు ఏడుస్తూ రాజమ్మ కాళ్ళ మీద పడి గొలుసును తిరిగి ఇచ్చివేయడం జరిగింది.
రాజమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ శ్రవణ్ ను తప్పించుకొని తిరుగుతున్నారు. అన్నీ అర్థమైనా ఏదీ జరగనట్టే అందరితో మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రవణ్.
****
నెల రోజులు గడిచాయి. శ్రవణ్ వేసవి సెలవులు అయిపోయాయి. ఆరోజు…..వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు ఇంకా. రేఖ చేయి పట్టుకొని శ్రవణ్ నడుస్తున్నాడు. వారికి ముందు ఆ ఇంటి నమ్మినబంటు పనివాడు ఒక చేతిలో పెట్టె ఒక చేతిలో బ్యాగు పట్టుకొని నడుస్తున్నాడు. బస్టాండులో వారిని బస్సెక్కించి చేయి ఊపాడు కన్నీళ్ల మధ్య. తన వారికి దూరమవుతున్నానన్న బెంగ కంటే కన్నఊరికి దూరమవుతున్నానన్న బాధ శ్రవణ్ ని ఎక్కువగా పీడించసాగింది. శ్రవణ్ చేతిని పట్టుకున్న రేఖ, బాధల సుడిగుండం నుండి తీరానికి చేరిన నావలా సంతృప్తిగా నిట్టూర్చింది. ఆవలి తీరపు కష్టాన్ని ఆమె ఊహించగలదు. కానీ చదువుకున్న తన భర్త మీద పూర్తి నమ్మకం. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు.
పరీక్షల తర్వాత సెలవులకు ఇంటికి బయలుదేరేముందు మిత్రుడైన భాస్కర్, తానూ కలిసి తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చింది శ్రవణ్ కు. చదవబోయే పీజీ కోర్సుల నిమిత్తం హాస్టల్ వసతి ఇవ్వడం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం అటువంటి విద్యార్థులకు స్కాలర్ షిప్ ప్రకటించింది. భాస్కర్ కు కూడా హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతోంది. శ్రవణ్ ఇంటి విషయాలు కూడా తనకు బాగా తెలుసు. అందుకని శ్రవణ్ వచ్చేలోపు రూమ్ చూసి పెడతానని, తన చెల్లిని తీసుకువచ్చి ఇక్కడే చదివిస్తానని, రేఖకు కూడా తోడుగా ఉంటుందని చెప్పాడు భాస్కర్.
ఈ విషయమే రాగానే రేఖకు చెప్పి ఆమె ఆనందాన్ని తనదిగా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే జరిగిన పరిణామాలు శ్రవణ్ ను అశాంతికి గురి చేసాయి. రోజులు గడచిన కొద్దీ రూము దొరకకపోతే రేఖను వీళ్ళ మధ్య ఎలా వదిలి వెళ్ళాలో శ్రవణ్ కు అర్థం కాలేదు. రేఖకు చెప్పి ఆమె ఉన్న స్థితిలో నిరాశకు గురి చేయడం నచ్చలేదు. మనసు పొరల్లో దిగులు కమ్ముకోసాగింది. హఠాత్తుగా దేవుడు వరం కురిపించినట్టు వారం రోజుల క్రితం భాస్కర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రూమ్ దొరికిందని, రేఖను తీసుకొని రమ్మని. అప్పుడే రేఖకు చెప్పాడు. ఆ సమయంలో ఆమె అతనికి ఆనందరేఖ అయింది.
అదే రోజు తల్లితో ఆ విషయం చెప్పాడు. ఆమె అవునని, కాదని చెప్పలేదు. మౌనమే ఆమె అంగీకారంగా భావించాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు. జరిగిన సంఘటన వల్ల వాళ్లలో కలిగిన న్యూనతా భావమా? శ్రవణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తిరుగుండదనే నమ్మకమా? తెలియలేదు. ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు శ్రవణ్. లేకుంటే వారిని ఒప్పించడం చాలా కష్టమయ్యేది.
*****
గతంలోకి వెళ్ళిపోయి జరిగిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్న శ్రవణ్ చెప్పడం ఆపి కళ్ళు తెరిచి చూసేసరికి భావన కళ్ళనిండా నీళ్లు. రేఖకు కూడా బాధ తాలూకు గాయం మళ్లీ సలపరించినట్లు కళ్లనుండి నీళ్లు దుమికాయి.
“భావనా! ఆ కాలంలో మూఢవిశ్వాసాలు మనుషులను ఎంతగా బాధించేవో చూడు. ఈ కాలంలో అక్షరాస్యత పెరిగి అవన్నీ దూరమవడం వల్ల మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది మీ అదృష్టం. ఆ సంఘటన తరువాత ఎన్నో కష్టాలను మీ అమ్మ సాహచర్యంలో అధిగమించాను. ఆరోజే నిర్ణయించుకున్నాను భర్తగా రేఖ జీవన రేఖను సంతోష తీరాలపై నిలబెడతానని. ఈరోజు మన ఇంటి సుఖాల వెనుక పట్టరాని దుఃఖపు అగాధాలున్నాయి. అది మర్చిపోకు. మీ తరానికి సహనం లేకపోవడం మనసుల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే కుటుంబ బంధాలు బలపడతాయి తల్లీ!
ఆ తర్వాత నీ ఇష్టం” అన్నాడు ఆవేదనగా.
భావన మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని
“సారీ నాన్నా! నా కళ్ళు తెరిపించారు. మా అత్తగారిని అమ్మలా చూసుకుంటాను. మీ కూతురుగా ఈ తరం వారికి ఆదర్శంగా నిలుస్తాను” అన్నది భావన దృఢంగా.
“ఈ ఫోటోలోని మహిళ పేరు స్వరూప. వయసు 28 సంవత్సరాలు. మతిస్థిమితం బాగాలేక గతవారం తప్పిపోయింది. ఎక్కడైనా కనిపిస్తే కింది నెంబర్లో తెలుపగలరు.. ఇట్లు పంకజ్” వాట్సాప్‌లో ఫార్వాడెడ్గా వచ్చిన ఆ మెసేజ్, అందులోని ఫోటో చూసి హృదయ్ ఒక్కసారిగా షాకయ్యాడు?
ఎదురు సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న అనిత భర్త ముఖంలో టెన్షన్ గమనించింది. పుస్తకం పక్కనబెడుతూ “ఏమైందండీ” అని ప్రశ్నించింది. అదుర్దాగా భార్య ముఖంలోకి చూస్తూ చేతిలో ఫోన్ అనిత ముందుకు చాచాడు హృదయ్.
అనిత ఆ మెసేజ్ చదివింది. “ఈమె మనూరామెనే గదా” అడిగింది అనిత. శూన్యంలోకి చూస్తూ అవునన్నటట్టు తలూపాడు. “అసలే పిచ్చిది. ఎటు వోయిందో ఏమో” అంటున్న భార్య మాట విని ఆమె వైపు ఉరిమినట్టు చూశాడు. “ఓహ్ సారీ అండీ పొరపాటుగా అన్నాను” అపాలజీ చెప్పింది అనిత. హృదయ్‌కి తన చిన్ననాటి స్నేహితులు అందరూ ఎంతో ఇష్టమనే విషయం అనితకు అప్పుడే స్ఫురణకు వచ్చింది.
ఎప్పుడు టైం దొరికినా వాళ్లతో ఆడిన ఆటల గురించి చెప్పడం.. యాదగిరి, సీను, గోపి, నసీమా, లతీఫా, సాయవ్వ, పోషవ్వ, ముజ్జు, సంగవ్వ, లచ్చిమి, రవి, శివుడు, సాదక్, పంకజ్, స్వరూప (బక్క) ఇలా భర్త చెప్పిన చిన్నప్పటి స్నేహితుల పేర్లన్నీ అనితకు బాగా నోటెడ్ అయ్యాయి.
ఆలోచనలో పడిపోయింది కాసేపటివరకు. బక్క గురించి ఆలోచిస్తోంది. ఊరు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు బక్కను కలిసిన రోజులను గుర్తు చేసుకుంది. బక్క రూపం కాసేపు కళ్లల్లో మెదిలింది. బక్క అందరిలాంటి పిల్ల కాదని దిగులు చెందుతోంది. హృదయ్ మథనం కూడా అదే. కాసేపటికి “అనిత” అన్న హృదయ్ పిలుపుతో ఠక్కున వాస్తవంలోకి వచ్చింది అనిత.
భర్త వైపు చూసింది. “ఏం ఆలోచిస్తున్నవు” అడిగాడు. ఏం లేదన్నట్టు తలూపింది. హృదయ్ తన ఫోన్‌తో పంకజ్‌కు కాల్ కలిపాడు.
పంకజ్ ఫోన్ ఎత్తాడు. “బక్క కనిపిస్తలేదురా” అని వలవలా ఏడ్చేస్తున్నాడు.
“ఎన్ని రోజులైందిరా?” కంగారుగా అడిగాడు హృదయ్. “మూడు రోజులైందిరా. దానికి ఎర్వ పర్వ ఏం తెల్వది. ఎటువోయిందో ఏమో. ఇంట్ల అమ్మానాయిన గుండె వల్గుతున్నరు” అని ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు పంకజ్.
“నువ్వేం టెన్షన్ వడకు యాడికి పోదు” హృదయ్ మాట పూర్తి కాకుండానే పంకజ్ అందుకుని “అసలే బయట కరోనా రోగం పార్సుకపోయి ఉన్నది. ముట్టుకుంటే అంటుకుంట అన్నట్టే ఉన్నది. దీనికి ఆ రోగం దెల్వది, మాస్కులు, శానిటైజర్ల గురించి అసలే దెల్వది. సరిగ్గా మాట్లాడలేదు. నత్తి నత్తి మాట్లాడుకుంట ఎటెటు తిర్గుతున్నదో ఏమోరా” గాద్ఘధికమైంది పంకజ్ గొంతు.
“పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినవార”
“ఇచ్చినరా. కరోనా టైంల గా పిచ్చిదాన్ని సరిగ్గా సూస్కోరా అని ఎస్సై ఉల్టా తిట్టిండు. ఇసుంటి టైంల దమాక్ మంచిగ లేనోళ్లను ఇంట్ల కట్టేశి పెట్టాలె అని అన్నడు. ఈ టైంల పోలీసోల్లకు ఇరువై నాలుగ్గంటలు కరోనా డ్యూటీ జేస్తందుకే సరిపోతున్నరు. ఇప్పుడు ఇసుంటి కొత్త కేసులు యాడ వట్టించుకుంటర్ర” విచారించాడు పంకజ్.
హృదయ్ ఏం చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు.
మళ్లీ అతనే అందుకుంటూ..”పోలీసోల్లు ఇప్పుడు ఏం జెయ్యరనే ఇషారతోని సోషల్ మీడియాను నమ్ముకున్న. ఎవరికైన కానస్తే ఫోన్ జేస్తరుగదా” “అవును మంచిపని చేసినవురా. నువ్వు పరేషాన్ అయి అమ్మానాయినలను పరేషాన్ చెయ్యకు సరేనా”
“మంచి మంచోళ్లనే దిక్కులేని సావు సంపుతున్న కరోనా మన బక్కవ్వను ఏం జేస్తదోనని గావర అయితున్నదిర. గదొక్కటే బుగులు నాకు”
“నువ్వు అంతదాక ఆలోశించుకొని మైండు కరాబ్ జేస్కోకు” ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు హృదయ్.
“లాక్డౌన్ ఉండుంటే నాకేం రంది లేకుండేరా. లాక్డౌన్ తెరిశినకాన్నుంచి పాజిటివ్ కేసులు శానా పెరుగుతున్నయి. అదే నా భయం. హైదరాబాదులనే ఉన్న ఆ మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు గూడ పాకింది. మనూర్ల గూడ ఒకోళ్లకు కరోనా అచ్చింది. అచ్చినోడు గాంధీల నవుస్తున్నడు. ఈడ ఇంటిల్లాదులంతా 28 రోజులు హోం క్వారంటైన్ల ఉన్నరు. దీంతోని ఊరంతా తాయిమాయి అయితున్నరు. ఏం పాడు గత్తరోనని కుదెం వెట్టుకున్నరు. ఈ టైం ఎసుంటిదో దానికి తెల్వది. ఇంట్లున్నప్పుడే యాల్లకు బువ్వ తినది. ఇప్పుడు బయట ఏం తింటున్నదో, ఎటేటు తిరుగుతున్నదో. ఈ టైంల మంచిగ తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని మనకు తెలుసు గనీ, దానికేం తెలుసురా? ఆ సాడేసాతోని పేరు తలుసుంట అది ఇంకింత పిచ్చిపిచ్చి జెయ్యవట్టిందిర” వణుకుతోంది పంకజ్ స్వరం.
సాడేసాతోడు అనగానే ‘కిరణ్’ అనే పేరు ద్యోతకమైంది హృదయ్‌కి. “పెండ్లి ఏమంట అయిందో కిరణూ కిరణూ.. ఇదే దాని నోటి నుంచి అచ్చిన పేరు. ఇది పిచ్చిదని, ఎత్తుపండ్లు ఉన్నయని, ఒంటె పెదవులు ఉన్నయని, మాట్లాడ్తె నోట్లెకెల్లి సొల్లు కారుతున్నది, తుంపిర్లు వడ్తున్నయని, చెవులకెల్లి చీము కారుతున్నదని.. ఇట్ల శానా వంకలన్ని తీశి దీనితోని సంసారం జెయ్యనంటే చెయ్యా అంటున్నడు ఆడు. ఎడ్డిదాన్ని అంటగట్టినమని ఉల్టా మామీద కేసు వెడ్తా అంటున్నడురా. అల్ల అని దాన్ని ఈడ నూకిపెట్టి ఆడు మిర్యాలగూడకు ఎల్లిపోయిండు. సంసారం చెయ్ బావా అని వాని కాల్లు మొక్కుతమా. పోని అని ఊకున్నం కనీ, ఇది వాన్ని మచ్చంవోయిన మరుస్తలేదు. పన్నా లేశినా కిరణ్ తప్పిచ్చి దాని నాల్కె మీద వేరే పేరే ఉంటలేదు. దీనిది నిజంగనే పిచ్చి ప్రేమరా. ఆడు దీన్ని ఇడసవెట్టి రేపు ఇంకోదాన్ని ఏలుకుంటడు. మా అమ్మా నాయినలు చెప్తే ఇనకుంట దాని లగ్గం చేశిర్రు. ఇయాల్లరేపు లోపం ఉన్న ఆడపిల్లలను ఎవడు పెండ్లి చేసుకుంటడు చెప్పు?”
“అవున్రా బక్క లగ్గం జేశి తప్పు జేశిర్రు. అట్లనే ఉంటుండె” హృదయ్ అన్నాడు.
“లోకం బాధకు అమ్మా నాయినలు దాని బొండిగె కోశిర్రు. పిల్ల పెయిమీదికి 28 ఏండ్లు అచ్చినయి. ఇంటి మీద బెలుగు లెక్కట ఇంకా ఆ పిల్లను ఎన్నొద్దులు ఉంచుకుంటరు. ఆమెకు తగ్గ పొలగాన్ని లెంకి అటు ఎత్తి ఇయ్యుర్రి అని మా మేనమామలు, పెద్దమ్మలు గూడ జోరీగల లెక్క పోరిర్రు. ఆల్ల బాధ పడలేక ఎత్తిచ్చినట్టు అయింది” వాపోయాడు పంకజ్.
“అయిందేదో అయిపోయిందిరా. తలరాత ఎట్ల రాసుంటే అట్లనే అయితది. విధిరాతను ఎవరం మార్చలేం గదా” సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు హృదయ్.
ఇంతలో పంకజ్ మరింత వెక్కడం వినిపించింది. “అరేయ్ పంకజ్ ఊకె ఏడ్వకురా. నువ్వు భయపడుతున్నంత ఏంగాదు. నేను గూడ వాట్సాప్ గ్రూపులల్ల, ఫేస్‌బుక్‌ల షేర్ జేస్త సరేనా. వీలైతే టీవీల గూడ వార్త ఏపిద్దాం. నువ్వు అంతలోపు ఎసుంటి పిచ్చి పిచ్చి ఆలోచన్లు వెట్టుకోకుంట ధైర్యంగ ఉండు. నిన్నిట్ల జూస్తె ఇంట్ల అందరు పరేషాన్ అయితరు. ఇంటికి పెద్దోనివి నువ్వఉ ఏం గుండెవల్గకు” అన్నాడు హృదయ్.
వెక్కుతూనే “థాంక్స్ రా ఉంటమరీ” “సరే.. బాయ్” అని ఫోన్ కట్ చేసి అనితను చూస్తూ నిట్టూర్చాడు. వాళ్ల డిస్కషన్ మొత్తం విన్న అనిత ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది.
ఇంతలో హృదయ్ నెర్వస్‌గా అంటున్నాడు. “ముందు నుయ్యి వెనుక గొయ్యి లెక్కటుంది మన పరిస్థితి. హైదరాబాద్‌ల కేసులు శితాం బుక్ అయితున్నయి. ఏమన్న బయటకు వోయి ట్రై జేద్దామంటే కరోనా భయం ఉన్నది” హృదయ్ గొంతులో జీర.
“అనవసరంగా ఆ పిల్ల పెండ్లి చేశిర్రు. నాకు పెండ్లి చెయ్యుర్రని ఎల్లాడినట్టే చేశిర్రు. చెయ్యకపోయినా గట్లనే ఉండేది. అసుంటోల్లు చాలా సెన్సిటివ్ ఉంటరు” అంటున్న అనిత వైపు చూస్తూ అవునన్నట్టు తలాడించాడు.
“ఎంత మంచిది పాపం. ఎటు వోయిందో.. ఏమేం గోస వడుతున్నదో. కరోనాల గూడ కొందరు కావురాలు వట్టిన బాడ్కావ్గాళ్లు పాపాలకు పాల్పడుతున్నరు. ఎడ్డిది, గొడ్డుది అంటలేరు. అదే టెన్షన్ అయితున్నది” అంటున్న భర్త భుజం మీద చేయి వేసింది అనిత.
“ఇప్పటిదాకా మీ దోస్తుకు ధైర్యం జెప్పి ఇప్పుడు నువ్వే ఇట్ల గావరైతే ఎట్ల? ఏంగాదు అనవసరంగ ఆలోచించకు” అంది భుజాన్ని నొక్కుతూ.
“ఎంటనే ఊరికి పోవాలనిపిస్తున్నది. కనీ పోలేం. పోంగ తొవ్వల కరోనా యాడ అంటుకుంటదోనని భయం. వర్క్ ఫ్రం హోమ్తోని మెసలకుంట పని అయితున్నది. ఇంత పని జేశినా సగం జీతమే ఇస్తున్నది కంపెనీ. ఇట్ల దేశంల ప్రతీ కంపెనీ దివాళా తీశింది. ఇంటి కిరాయోల్లు ఆగరు, కర్సులు మోపవుడు ఆగయి. ఎసుంటి దినాలు అచ్చినయి. ఇట్ల అయితదని ఊహించలేం. అవునూ పోరలేరి?” ఇంట్లో అటూ ఇటూ చూస్తూ అడిగాడు హృదయ్.
“ఇస్కుల్లు లేక దినాం ఆటనే అయింది వాళ్లకు. కింద ఆడుకుంటున్నరు” తాపీగా అంది అనిత.
“గేటుకు తాళం ఏశిర్రు గదా” “ఆ వేసే ఉంచిన. ఈ కరోనాతోని పాపం పోరగాళ్లను గూడ జైల్ల పెట్టినట్టు అయిపోతున్నది. ఈ అపార్ట్మెంట్ల కిందికి మీదికి ఆడుకుంటున్నరు అంతే” నిట్టూరుస్తూ అంది.
ఇంక మరో మాటకు ఆస్కారం లేకుండా తన ఫోన్లోంచి బక్క మెసేజ్ ఫార్వాడ్ చేశాడు. తన ఫోన్లోని అన్నీ గ్రూపుల్లో పెట్టాడు. అలాగే ఎఫ్బీ, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో కూడా ఫార్వాడ్ చేశాడు.
కొంతమంది తన హైదరాబాద్ స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పాడు.
* * *
బక్క అసలు పేరు స్వరూప. చిన్నప్పుడు కాస్త సన్నగా ఉందని వాళ్లమ్మ ‘బక్కవ్వ’ అని పిలుచుకునేది.
దీంతో అదే నిక్ నేమ్ అయిపోయింది. బక్కవ్వను కాస్త తోటి పిల్లలందరూ కలిసి ‘బక్క’ అని పిలవడం మొదలుపెట్టారు.
బక్కకు ముందు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లున్నారు. పంకజ్ బక్కవ్వకు పెద్ద తమ్ముడు. పంకజ్ టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు కూడా చెబుతున్నాడు. బక్క వాళ్ల నాన్న అంగళ్లు తిరుగుతూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం అమ్ముతుంటాడు. వాళ్లమ్మ ఇంట్లో చిన్నగా కిరాణా కొట్టు పెట్టుకుంది. పుట్టడమే బక్క మతి స్థిమితం లేకుండా పుట్టింది.
అలాగనీ మరీ మతిస్థిమితం లేనిదేమీ కాదు. తను మాట్లాడే మాటల్లో స్పష్టత లేకపోయినా అర్థమయ్యేవి. ఇతరులు చెప్పింది కూడా అర్థం చేసుకునేది.
ఇల్లు, వాడకట్టు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అందరి పిల్లల్లాగ బట్టలు సరిగ్గా వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటివి చేసేది కాదు. వాళ్లమ్మే అవన్నీ చేసేది.
అంతా బాగానే సాగుతున్న వారిని ఇరుగుపొరుగు వారు, బంధువులు బక్క పెళ్లి ప్రస్తావన తెచ్చి వారి కుటుంబంలో అశాంతికి కారణం అయ్యారు.
మిర్యాలగూడలో కిరాణా కొట్టు ఉంది మంచి అబ్బాయని కిరణ్‌ను చూశారు. కిరణ్ కూడా పెద్ద అందగాడేమీ కాదు. అతనికి పోలియోతో ఒక కాలు కుంటిగా ఉంది.
దీంతో అతనికి పిల్లను ఇచ్చేవారు కరువయ్యారు. ముప్ఫై ఐదేళ్ల వయసొచ్చింది. తనకింక ఈ జన్మకు పెళ్లి కాదని దిగులు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బక్క సంబంధం అతనికి వరంలా అనిపించింది.
బక్కను చూడగానే ఆతృతగా సంబంధం ఖాయం చేసుకుందాం అన్నాడు. ఈ జన్మకు తమ బిడ్డకు పెళ్లే కాదనుకున్న బక్క అమ్మానాన్నలకు ఈ సంబంధం ఖాయం అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అటు కిరణ్ అమ్మానాన్నలు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్లు అడిగినదాంట్లో కొసరుతూ తమతో అయినంతలో పెళ్లి చేశారు. పెళ్లయ్యాక రెండు నెలలు సజావుగానే ఉన్నారు.
ఆ తర్వాత కోడలు పిచ్చిదని అత్తామామలు, పిచ్చిదాన్ని నాకు అంటగట్టారని కిరణ్ పోరడం మొదలుపెట్టారు. “దానికి వంటావార్పు వచ్చు. మాటలు జర తొతరతొతర వోతయి. ఇంటి మట్టుకు అన్ని పనులు సగవెడ్తది” అని బక్క వాళ్ల అమ్మానాన్నలు ఎంత సర్ది చెప్పినా కిరణ్ వినిపించుకోలేదు.
చివరికి వదిలేస్తానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో బక్క వాళ్ల అమ్మానాన్నలు మహిళా మండలిలో ఫిర్యాదు చేశారు. వారొచ్చి చెప్పారు, చివరికి పోలీసులతో కూడా కౌన్సెలింగ్ ఇప్పించారు.
అయినా అతని తీరులో మార్పులేదు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభ దశలో ఉన్నాయి. బక్కకు ఏవో కబూర్లు చెప్పి రాత్రి ఇంటిదాక దిగబెట్టి అటునుంచి అటే బస్సెక్కి తన ఊరు వెళ్లిపోయాడు కిరణ్.
భర్త మళ్లీ వస్తాడనే ధ్యానంలో ఉండిపోయింది బక్క. కిరణ్ చేసిన పనికి మండిపోయిన పంకజ్, కిరణ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోంది.
వదిలించుకున్నాడని నిర్ధారించుకున్నారు. ఇంతలో దేశంలో, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రం పక్షం రోజుల సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
ఇది అయిపోయాకే కిరణ్‌తో మాట్లాడదామని భావించాడు పంకజ్. వైరస్ తీవ్రత, కరోనా మరణాలు రేటు పుంజుకోవడంతో లాక్డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈ మధ్యలో బక్క కిరణ్‌ను తలుచుకోని రోజు లేదు.
ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని నచ్చజెప్పుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వికృత రూపం దాల్చి కరాళనృత్యం చేస్తోంది. ఎందరో బలి అవుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నారు.
ఎటుచూసినా కరోనా హాహాకారాలే. లాక్డౌన్ వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు వలస కార్మికులు కూడా ఆకలికి అల్లాడుతున్నారు. పనుల్లేక తమ సొంతూళ్లకు కాలినడకన, సైకిళ్ల మీద వందలు, వేల కిలోమీటర్లు వెళుతున్న గుండెలు కలిచివేసే సంఘటనలు ఎన్నో.
చైనావాడి నిర్వాకంతో ప్రపంచం మొత్తం పరేషాన్ అవుతోంది. ఇలా మూణ్నెల్ల కాలం గడిచిపోయింది. ‘ఇక లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిందే.. లేదంటే మరింత సంక్షోభంలో కూరుకుపోతాం’ అని భావించాయి ప్రభుత్వాలు.
లాక్‌డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఈ క్రమంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన ప్రజలు తమతమ స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. దీంతో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగింది. రోజుకు వందలు నుంచి వేలకు వేలు కేసులు నమోదవుతున్నాయి.
ఎటు వెళ్లాలన్నా ఎవర్ని ముట్టుకోవాలన్నా ఒక రకమైన భయం అందరిలో. బక్క, కిరణ్ నామస్మరణను ఇంకా పెంచింది. ఆ పేరే ఆమె నోటివెంట జపమైంది. ‘కిరణ్.. కిరణ్..,’ అంటూ అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఇంట్లో కట్టేశారు.
అయినా తాడు తెంపుకొని ఎదురైన బస్సులో ఎక్కి వెళ్లిపోతోంది. ఒకసారి మెదక్‌లో, ఒకసారి నర్సాపూర్‌కు వెళ్లి పట్టుకొచ్చాడు పంకజ్. స్థానిక డాక్టర్‌కి చూపిస్తే “క్రాక్ అయిపోయింది. తీసుకెళ్లి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించండి” అని చెప్పాడు.
నిద్ర కోసం ఏవో మాత్రలు రాసిచ్చాడు. అలా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న క్రమంలో ఓరోజు రాత్రి హైదరాబాద్ బస్సెక్కింది. తన భర్తతో ఎలా వచ్చిందో కాస్త గుర్తు పెట్టుకున్నట్టుంది. అలాగే వెళ్లిపోదామని భావించి బస్సెక్కింది.
- + +
పక్షం రోజులు అవుతోంది బక్క తప్పిపోయి. నిత్యం సోషల్ మీడియాలో పంకజ్, హృదయ్ ఆ పోస్టును షేర్ చేస్తూనే ఉన్నారు.
ఇంతలో హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్ మట్టుకు మళ్లీ లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అప్పటికే సోషల్ మీడియాలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందనీ.. ఊళ్లకు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోండనే వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
హృదయ్ తన పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాడు. తనకేమైనా, పిల్లలకు ఏమైనా తట్టుకోలేడు. అసలే మధ్య తరగతి జీవితాలు. కరోనా సోకితే గాంధీలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిందే.
అనిత కూడా ఊరెళ్లిపోదామని అంటోంది. వెళ్లడమే బెటర్ అనుకుంటుండగా బక్క గురించి తెలిసి ఆగిపోయాడు. బక్క ఆచూకీ తెలిశాక ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో ఓరోజు శంషాబాద్‌లో ఉండే మితృడు రాజు అనుకోకుండా ఫోన్ చేసి బక్క శంషాబాద్ బస్టాండ్‌లో కనిపించిందని చెప్పాడు. వెంటనే రమ్మన్నాడు.
ఆతృతగా హృదయ్ ఫోన్ కట్ చేసి బయలుదేరడానికి హడావిడి పడుతున్నాడు. అనిత వెంటనే చేతులకు గ్లౌజులు, ఫేస్ మాస్క్, గాగుల్స్, శానిటైజర్ సీసా తెచ్చి హృదయ్‌కి అందించింది. అవన్నీ తీసుకుని ఇంట్లో కాలు బయట పెడుతుండగా పిల్లలిద్దరూ “డాడీ మేమూ వస్తాం” అని హృదయ్ కాళ్లను అల్లుకుపోయారు. “డాడీ ఇప్పుడే అస్తరు. మీరు ఉండుర్రి” అంటూ అనిత వాళ్లిద్దరినీ పట్టుకుంది. హృదయ్ ఒక్క ఉదుటున బయటపడ్డాడు.
బైక్ కిక్ కొట్టాడంటే శంషాబాద్ చేరేవరకు ఎక్కడా ఆగలేదు. శంషాబాద్ బస్టాండ్ వద్దకు వెళ్లి బక్కను చూసి షాకయ్యాడు హృదయ్. జుట్టంతా చింపిరైంది. ఒంటిమీద దుస్తులు మైలబారి, చిరిగిపోయాయి. ఆ స్థితిలో బక్కను చూసి హృదయ్ మనసు తరుక్కుపోతోంది.
ఇంతలో పోలీస్ జీపు, అంబులెన్స్ వాహనాలు వచ్చాయి. హృదయ్ ఉండబట్టలేకపోయాడు మాస్క్ తొలగించి “బక్కా” అని గట్టిగా అరిచాడు. హృదయ్ పిలుపు విని తలతిప్పి చూసింది బక్క. హృదయ్‌ని గుర్తుపట్టిన బక్క ముఖంలో ఆనంద చారికలు.
“అరేయ్ చిన్నా” అని ఏడుపందుకుంది. ‘చిన్నా’ హృదయ్ నిక్ నేమ్. హృదయ్ దగ్గరకు పరుగెత్తుకు వస్తున్న ఆమె చేతిని నిండా పీపీఈ కిట్ ధరించిన అంబులెన్స్ సిబ్బంది గట్టిగా పట్టుకుంది.
“చిన్నా చిన్నా” అని ఏడుస్తూ దగ్గుతోంది బక్క. “వదలండి సర్ తను మా ఫ్రెండ్ వాళ్ల సిస్టర్. మెదక్ దగ్గర గోపాల్పేట్ ఊరు తనది” గట్టిగా అరుస్తూ చెప్పాడు హృదయ్. “ఓకే బట్ ఆమెకు కరోనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే తాను చచ్చింది గాక ఇతరులను చంపుతుంది” మాస్కులో ఉన్న ఎస్సై అన్నాడు.
హృదయ్ ఖిన్నుడయ్యాడు. “ఈ ఏరియాలో గత వారం నుంచి కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈమె వల్ల కేసులు పెరుగుతున్నాయని ఇక్కడి స్థానికులు మాకు సమాచారం అందించారు. అందుకే గాంధీకి తీసుకెళ్తున్నాం. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఏమైనా ఉంటే చెబుతాం” అన్నాడు ఎస్సై.
“సర్ తనకు మామూలు సర్ది, దగ్గు కావచ్చు. గోలీలేసుకుంటే తక్కైపోతది” కంగారుగా హృదయ్ అన్నాడు. “అవన్నీ పరీక్షలు చేస్తేనే కదా తెలిసేది తప్పుకో” హృదయ్‌ని పక్కకు నెట్టాడు ఎస్సై. అంబులెన్స్ సిబ్బందికి రాజు, హృదయ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు.
‘‘ఈవారం నుంచి స్వరూప ఈ బస్టాండ్లనే ఉంటున్నదట. ఆకలైతే ఇండ్ల పొర్త వోయి అడుక్కచ్చుకొని తింటున్నదట. రాత్రింబగళ్లు కిరణ్ పేరే తల్సుకున్నదని ఇక్కడోల్లు చెప్పిర్రు. ఈ నాలుగైదు రోజుల సంది దగ్గుతుంది, తుమ్ముతుందట. ఇక్కడోళ్లందర్కి ఆమెకు కరోనా అచ్చిందని అనుమానం కలిగి పోలీసోళ్లకు ఫోన్ చేశిర్రంట. ఇసుంటి గోస పగోనికి గూడ రావొద్దుర” అంటున్న రాజు ముఖంలోకి చూస్తున్న హృదయ్ ముఖంలో దుఖ్ఖం పొంగుకొచ్చింది.
‘చిన్నా చిన్నా’ అంటూ ధీనంగా ఏడుస్తున్న బక్కను అంబులెన్స్‌లో వేసుకుని వెళ్లిపోయారు. వెంటనే పంకజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నానని పంకజ్ చెప్పాడు.
* * *
పంకజ్, హృదయ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ధ్యాసంతా గాంధీలో ఉన్న బక్క మీదే పెట్టాడు. తినడం లేదు. పదేపదే గాంధీకి వెళ్లొద్దాం అంటున్నాడు. అక్కడ ఎవర్నీ రానివ్వడం లేదని హృదయ్ చెబుతున్నాడు.
“బక్కవ్వకు నిజంగనే కరోనా అచ్చిందంటవార” ఈ ప్రశ్న ఇప్పటికి వందసార్లు అడిగుంటాడు పంకజ్. “ఎహె రాదుర బై. అచ్చినా మన బక్కవ్వ దులిపేస్తది” ధీమాగా చెప్పాడు హృదయ్.
“ఏమోరా భయమైతున్నది. ఎటెటు తిరిగిందో.. ఎట్ల గడిపిందో తలుసుకుంటే దుఖ్ఖం ఆగుతలేదు” అని వలవలా ఏడుపందుకున్నాడు.
“అన్న నువ్వు అనవసరంగ ఆలోచించి మైండు కరాబ్ జేస్కోకు ఊకో” అని అనిత అంది.
ఇద్దరికి భోజనం వడ్డించింది. పంకజ్ కరుచుకుంటూ తిన్నాడు. పక్షం రోజుల తర్వాత గాంధీ నుంచి హృదయ్ ఫోన్‌కు కాల్ వచ్చింది. “స్వరూపకు నెగెటివ్ అని వచ్చింది. వచ్చి తీసుకుపోండి” ఆమాట వినగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది హృదయ్‌కి.
అదే మాట పంకజ్కి చెప్పగానే “పోదాం పా” అని కంగారు పెడుతున్నాడు. ఇద్దరూ ఆటోలో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యేవారిని వెనుక గేటు నుంచి పంపిస్తున్నారని చెబితే ఆ వైపే వెళ్లారు.
అక్కడ రిసెప్షన్ సీట్లో కూర్చున్న ఓ డాక్టర్ వీళ్లిద్దర్నీ పిలిచాడు. “సారీ టు సే.. మీ స్వరూపకు కోవిడ్ లక్షణాలు ఏమీ లేవు. అసింప్టమాటిక్ ఉండే. అంటే ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌గా వస్తుంది. కానీ, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. ఈ వారం రోజులు తనను స్పెషల్ వార్డులో మంచానికి కట్టేసి ట్రీట్మెంట్ చేశాం. ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్ ఇచ్చాం” అని చెప్పారు.
ఇంతలో బక్క లోపలి నుంచి వస్తోంది. బలహీనంగా వస్తున్న బక్కను చూడగానే పంకజ్‌కు ఉద్విగ్నంతో కన్నీళ్లు ఆగలేవు.
“బక్కవ్వ” అన్నాడు. ఆ మాట విని తలెత్తి పంకజ్‌ను చూసి “తమ్మూ” అని ఉద్వేగంతో పరుగెత్తుకుంటూ వస్తోంది బక్క. దగ్గరికొచ్చి పంకజ్‌ను గట్టిగా పట్టుకొని వెక్కుతోంది. ఇంతలో ఏమైందో అకస్మాత్తుగా “కిరణ్.. కిరణ్” అని లీలగా అంటోంది.
ఆ పేరు వినగానే పంకజ్ పళ్లు పటపటా నూరుతున్నాడు. “అగో కిరణ్.. కిరణ్” అని గట్టిగా అరుస్తూ గేటు వైపు పరుగులు తీసింది. పంకజ్, హృదయ్‌కి ఏం అర్థం కాకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. డిశ్చార్జ్ అయి బయటకు వెళుతున్న పేషెంట్లను తప్పించుకుంటూ బక్క ఏకధాటిగా పరుగెత్తుతోంది.
ఆమె వెనకాల పంకజ్, హృదయ్ పరుగులు తీశారు. ఆ గుంపులో నిండా శాలువా కప్పుకుని నీరసంగా నడుస్తున్న వ్యక్తిని అనుసరిస్తోంది బక్క. పంకజ్, హృదయ్‌లకు ఏం అర్థం కావడంలేదు.
శాలువా కప్పుకున్న వ్యక్తి భుజం మీద చేయి వేసి తన వైపు లాగింది ‘కిరణ్ కిరణ్’ అంటూనే. ఆ కుదుపులకు అతను తూలుతూ బక్క వైపు తిరిగాడు. బక్క అనుమానమే నిజమైంది. అతను కిరణే. బలహీనంగా, నీరసంగా ఉన్నాడు.
కిరణ్‌ను చూసి పంకజ్, హృదయ్‌లు షాక్ అయ్యారు. తూలుతున్న కిరణ్‌ను గట్టిగా పట్టుకుంది బక్క. బక్క ముఖంలో ఎక్కడలేని ఆనందం తాండవిస్తోంది.
ఇన్ని రోజులు తను దేనికోసమైతే ప్రాణం పెట్టి ఎదురుచూస్తుందో అదే తన ముందు ఉండేసరికి బక్క ఆనందం నింగినంటింది. బక్కను చూసిన కిరణ్‌లో మునుపటి అసహ్యం, ఏవగింపు ఎక్కడా కనిపించడం లేవు. బహుశా అతనూ బక్క కోసం ఎదురు చూస్తున్నట్టే అతని కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. “సరూపా” అని గట్టిగా అరిచి బక్కను అలుముకుని పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.
అక్కడున్న వారంతా వీళ్లను చూస్తూ “కరోనా తగ్గిందనే సంబురంల ఉన్నట్టున్నరు” అని అనుకున్నట్టు వెళ్లిపోతున్నారు.
వాళ్లని హృదయ్, పంకజ్ అలా నిల్చుని చూస్తున్నారు. “ఇప్పుడు బక్క ప్రపంచం కిరణే. బావను మంచిగ జూస్కుంటే అక్కను మంచిగ సూస్కున్నట్టే” అంటున్న హృదయ్ వైపు నిర్లిప్తంగా చూశాడు పంకజ్.
ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి రివ్వున వీస్తోంది. కాసేపటికి వాళ్లను అనుసరించారు పంకజ్, హృదయ్. పంకజ్‌ను చూడగానే కిరణ్ మరింత భావోద్వేగంతో వెళ్లి కౌగిలించుకుని
“నన్ను క్షమించు పంకజ్. నేను తప్పు జేశిన. సరూపను అరార గోస వెట్టిన. ఆ పాపం ఊకెనే పోలేదు. అమ్మానాయినలకు కరోనా అచ్చి సచ్చిపోయిర్రు. ఆల్ల శవాలు గూడ ఇయ్యలేదు. ఏడ బొంద వెట్టిర్రో గూడ తెల్వది. నాకు గూడ కరోనా అచ్చింది. ఈ గాంధీలనే ఉండి కోలుకున్న. ఇయ్యాల్ల డిశ్చార్జ్ చేశిర్రు. అనవసరంగ మంచిగైన.. నేను గూడ ఈ రోగంతోని పోయుంటే బాగుండేది. మాకు కరోనా అచ్చిందని ఏ సుట్టపోల్లు గూడ పల్కరిచ్చే పాపాన పోలేదు. ఒంటిగాన్ని అయిపోయిన” అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు.
అదంతా విని కిరణ్ మీదున్న కోపం మొత్తం పోయింది పంకజ్‌లో.. జాలి కలుగుతోంది. “అయిందేదో అయిపోయింది బావా బాధపడకు. నీకు మేము లేమా” అన్నాడు గాద్ఘధిక స్వరంతో.
బక్కకు తన అత్తామామలు చనిపోయారని అర్థమై ఏడుస్తోంది. “నా పెండ్లాం పిచ్చిదని దాన్ని సతాయించిన. కనీ అది నిజంగనే పిచ్చిది. నేనంటే దానికి పిచ్చి ప్రేమ. నన్ను సంటి పొలగాని లెక్కట సూసుకుంటది. దాని స్వచ్ఛమైన ప్రేమను నేను అర్థం జేస్కోలేకపోయిన.
ఇంతగానం పెండ్లాం ప్రేమ ఈ ప్రపంచంల ఏ మొగోన్కి గూడ దొరకదేమో” అంటున్న కిరణ్ కళ్లు ఏరుధారలయ్యాయి. “సై మాట చెప్పినవ్ బావా. ఈడినుంచి నీకంతా మంచే జరుగుతది. కరోనా నీలో మార్పు తీసుకచ్చింది. పా ఇగ ఇంటికి వోదాం. మిర్యాలగూడల ఒక్కోనివి యాడుంటవు. గోపాల్పేట్లనే దుకాణం పెట్టుకొని ఉందువు పా ఆడనే” హృదయ్ మాటలకు కళ్లు తుడుచుకుంటూ గుండెలో ఆత్మస్థైర్యాన్ని ప్రోది చేసుకుంటూ.. బక్క వైపు ఎనలేని ప్రేమతో చూస్తూ ముందుకు నడిచాడు కిరణ్.
కిరణ్ మీద నుంచి దృష్టి మరల్చని బక్కవ్వ అతని అడుగులో అడుగు వేసింది.
”ఈరోజు బాగా అలసిపోయాను రమా! వేడి వేడి టీ తాగాలి” అంటూనే నాగయ్యను పిలిచి రెండు కప్పులు టీ చేసుకురమ్మన్నారామె.” నాగయ్య టీ తెచ్చి టేబిల్మీద పెట్టి నిలబడ్డాడు. అతనిని పంపించేసి ఒక కప్పు తన చేతిలోకి తీసుకుని ”నువ్వు కూడా తాగు రమా!”అని పురమాయించింది. ఆ అమ్మాయి సంకోచిస్తుండటంతో, ”ఫర్వాలేదు. నువ్వూ బాగా అలసిపోయా”వనడంతో ఆమె భయం భయంగా రెండవ కప్పు తీసుకుని కొంచెం దూరంగా నిలబడి సిప్చేయసాగింది. ”కూర్చొని తాగు రమా!” ”ఫర్వాలేదు మేడమ్!” ”ఇది ఆఫీస్‌కాదు. ఇల్లమ్మా!” ”అయినా ఇది మీ అధికార నివాసమే కదా మేడమ్!” దాంతో ఆమె నవ్వేసి ఊర్కొన్నారు.
ఆ మరుసటిరోజు సాయంకాలం కూడా దినమంతా టూర్లతో ఆమె బాగా అలసిపోయారు.
”రమా! రేపు నాకు బయట ప్రోగ్రామ్లేమీ లేవు. నువ్వు సెలవు తీసుకో. ఉండు ఒక్క నిమిషం”. నాగయ్యను పిలిచి ”ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వసతి చూపించు” అని ఆజ్ఞాపించారామె. రమకేమీ అర్థం కాలేదు. నాగయ్య ఆమెకు రెండు గదుల వసతిని చూపించి, ”ఈరోజే కలెక్టర్మేడం ఆదేశంతో ఇదంతా శుభ్రం చేశారు. నివాసయోగ్యంగా మార్చారు” అని వివరించాడు. ఆశ్చర్యంతో రమ తిరిగి రాగానే, ”రమా! రేపు నీకు సెలవు ఇచ్చాను గదా! నీ సామానులన్నీ సర్దుకుని సాయంకాలానికల్లా ఇక్కడికి షిఫ్ట్అయిపో!” అని మేడమ్ఆదేశించారు.
”మేడమ్!”ఆ అమ్మాయికిదంతా నమ్మశక్యంగా లేదు.
”ఏం బాగాలేదా? ఇక్కడయితే నువ్వు మీ అమ్మను కూడా పిలిపించుకోవచ్చు!” ”అది కాదు మేడమ్!”
”అయితే ఇంకేమీ చెప్పకు. నేను చెప్పినట్లు చెయ్యి”.
ఒక్కసారిగా ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. కృతజ్ఞతా భావంతో ఆమె కలెక్టరమ్మ కాళ్ళకు దండం పెట్టబోయింది. వెనుకకు జరిగి ఆమె దాన్ని వారించింది. దినమంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండి సాయంకాలం 8 గంటలకు తన నివాసానికి చేరుకొన్నారు ఉషారాణిగారు. విశ్రాంతికోసం కుర్చీలో వాలిపోయి టీకి ఆర్డరిచ్చారు. వేడివేడి టీ ఘుమఘుమలు ఆస్వాదిస్తూ రమను పిలుచుకురమ్మని నాగయ్యను పంపారు. ఆ అమ్మాయి ముఖంలో సంతోషం, హుషారు గమనించాడు నాగయ్య.
”ఎలా ఉంది రమా! ఇక్కడ?” ”మేడమ్మీకు కృతజ్ఞతలు ఎట్లా చెప్పుకోవాలో తెలియటం లేదు. మా అమ్మకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో!”
”ఆమె నిక్కడకు రప్పించుకో!” ”దానికి కొద్దిరోజులు పడుతుంది మేడమ్!”
”సరే, నీ ఇష్టం. ఈ రోజు నువ్వు ఇక్కడే తిను. నేను వాళ్ళకు ముందే చెప్పాను.” ”నేను వంట చేసుకుంటాను మేడమ్!” ”రేపటి నుండి చేసుకుందువులే!” అని చెప్పేసి ఆమె తన గదిలోకెళ్ళిపోయారు.
ఒక సాయంకాలం రమకు నాగయ్య ఎదురుపడ్డాడు. ”నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా!” అన్నాడు. ”ఎందుకు నాగన్నా?”
”మేడమ్‌కు నీ మీద మంచి అభిప్రాయమేర్పడింది. అందుకే నిన్ను చేరదీశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకస్తులకు ఆమె అన్నివిధాలా సహాయం చేస్తారు. ఎప్పుడూ మిడిసిపడకూడదు. తోటి ఉద్యోగుల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. అసూయపడతారు. ఇబ్బందులు కల్పిస్తారు” అంటూ ఎవరి ఎదుట ఎట్లా ఉండాలో మెళకువలు చెప్పాడు. రమ జీవితంలో ఈ సలహా మార్గదర్శనంలా పనిచేసింది.
రెండవ శనివారం, ఆ తర్వాత ఆదివారం ఆఫీసు పనులన్నింటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు ఉషారాణి. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్టు ముగించుకుని కూర్చొన్నారు. ఆమె ఏదో చిరాకుగా ఉన్నట్లు గమనించి అక్కడే నిలబడి ఉన్నాడు నాగయ్య. అతనివైపు చూస్తూ, ”ఈ అమ్మాయి కేదో సహాయం చేయాలని చూస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నది! ఆమె నడవడిని కాస్త గమనిస్తూండు” అన్నారు.
”ఏ విషయంలో అమ్మా?” ”తను నాకు చాలా దగ్గరని, ఏదైనా పని కావాలంటే చేయిస్తానని చెప్తున్నదట”. ”అలా ఎప్పుడూ జరుగదు అమ్మగారూ! ఆమెకు మీరు ప్రత్యక్షదైవం. మీ ఫోటో పెట్టుకుని పూజ చేస్తుంది”. ”మరి అతను ఎందుకలా చెప్పాడు?” ”ఎవరు అమ్మగారూ?” ”వెంకట్రావు”. ”అతనికి చాలా దురలవాట్లున్నాయి. ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని తిరిగి చెల్లించడు. ఈ అమ్మాయిని కూడా వేయి రూపాయలు కావాలని అడిగితే ఇవ్వలేదు. అందుకే ఆమె మీద చాడీలు చెప్పి ఉంటాడు. ఆమె చాలా మంచి పిల్ల అమ్మగారూ!” ”ఒకసారి ఆమెను నా దగ్గరకు పంపించు”.
”నమస్తే మేడమ్!” అంటూ చిరునవ్వుతో కలెక్టర్‌గారి ఎదుట నిలబడింది రమ. కొద్దిసేపటి తర్వాత, ”ఎక్కడికైనా వెళ్ళాలా మేడమ్? ఇప్పుడే డ్రెస్‌వేసుకుని వస్తా” అంటూ వెనుకకు తిరిగింది. ”అవసరం లేదు రమా! అయినా నువ్వు ఆఫీసు పనుల మీద వెళ్ళినప్పుడే యూనిఫాం ధరించు. వేరే అప్పుడు మామూలు దుస్తుల్లో రావచ్చు”. ”అలాగే మేడం”. ”ఇప్పుడు వెళ్ళు. నీ పనులు చూసుకో. సాయంకాలం అయిదు గంటలకు రా! నేను లాన్లో కూర్చుంటా”, అని రమను పంపించి ఆమె నిండుగా ఊపిరి పీల్చుకున్నారు.
రమ వచ్చి మేడమ్కాళ్ళ దగ్గర కూర్చున్నది. తన పక్కన కుర్చీ చూపించి అక్కడ కూర్చోమంటే ఆమె ఒప్పుకోలేదు. ”మేడమ్! మీరెప్పుడూ ఇలా అనకండి. ముఖ్యంగా ఇతరుల ముందర”. కాసేపు మౌనంగా ఉండి ఆమె మేడమ్కళ్ళలోకి చూసింది.
”మేడమ్! మీరు ఉదాసీనంగా కనబడుతున్నారు. మీ కళ్ళల్లో విషాదం అగుపడుతున్నది. ఎందుకు మేడమ్?” అకస్మాత్తుగా ఆమె కళ్ళు వర్షించసాగాయి.
”సారీ మేడం! నన్ను క్షమించండి”. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చాలాసేపు నిమురుతూ ముభావంగా ఉండిపోయారు ఉషారాణి. అప్పుడు తేరుకుని కళ్ళు తుడుచుకుని, ”రమా! ఈరోజు పదేపదే నా చెల్లె గుర్తొస్తున్నది” అన్నారు.
”ఆమెకేమయింది మేడమ్?”
”అది ఈ ప్రపంచంలో లేదిప్పుడు. అమ్మను, నన్నూ శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది”. ”అదెలా జరిగింది మేడమ్?”
”ఇంకా టీనేజరే. పందొమ్మిదేళ్ళు కూడా నిండలేదు. అది ప్రేమలోపడి మోసపోయింది. దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నది.” అది విని రమకు దుఃఖం పొంగివచ్చింది.
”ఎందుకు రమా! నువ్వెందుకింతగా ఏడుస్తున్నావు?” ”ఏం చేయను మేడమ్? అక్క విషాదగాథ విని తట్టుకోలేకపోయాను. బహుశా నాకూ ఇలాగే జరిగి ఉండేదేమో! అక్క బాధ స్వయాన నా బాధే అనిపించింది” మేడమ్ప్రశ్నార్థకంగా చూసేసరికి తనకు సంభవించిన ఘటనను ఇలా వివరించింది: ”కొంచెం అటూ ఇటూ అక్క వయసులోనే ఒక అబ్బాయి నా వెంట బడ్డాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాడు. ఓ రోజు నా దారి కెదురు తిరిగాడు. చీవాట్లు పెట్టినా, బతిమాలినా వినలేదు. ఆ తర్వాత రోజు నా వెంట వెంట నడుస్తూ అతని మోటర్‌సైకిల్‌తో నాకు డాష్ఇచ్చాడు. పక్కనే ఉన్న రాయి మీద పడటంతో నా ఎడమ తొడ ఎముక ఫ్రాక్చర్అయింది. మంచానపడి ఆర్నెల్ల దాకా నడవలేకపోయాను. ఒక సంవత్సరం చదువు కోల్పోయాను. మా కాలేజీ ప్రిన్సిపాల్, నా వెనకటి క్లాసు టీచర్నాకు అండగా నిలిచారు. నా ఫీజులు మాఫీ చేశారు. నా ట్రీట్మెంట్ఖర్చులు భరించారు. ఆ పుణ్యాత్ముల మేలు ఈ జన్మలో మరువలేను మేడమ్!”
”నిన్ను చూసినప్పుడల్లా నా చెల్లె గుర్తొస్తున్నది. ఒక్కొక్కప్పుడు దాన్నే చూస్తున్నానా అనిపిస్తుంది. నీకేమనిపిస్తున్నది? ‘మీ చెల్లెనే అనుకోండి‘ అని నీ మనసులోనూ అనుకోలేదా నువ్వు?” రమ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
తేరుకోగానే, ”మేడమ్! మీరు బాగా అలసిపోయారు. మీ కోసం టీ చేసి తీసుకొస్తాను” అని వెళ్ళిపోయింది రమ. తన గుండెలమీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లున్నది ఉషారాణి గారికి. ఆ తర్వాత తీరిక దొరికినప్పుడల్లా సాయంకాలాల్లో లాన్లో కూర్చొని సేదదీరడం, రమను అక్కడికి పిలిపించుకోవడం పరిపాటయింది. రమ ఆమె పాదాల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేది. ఇద్దరూ టీ తాగుతూ చాలాసేపు ఎంజాయ్చేసేవారు. నాగయ్య ఇదంతా గమనిస్తున్నాడు. అమ్మగారు సంతోషంగా, హుషారుగా ఉండడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది.
ఓరోజు ఉషారాణిగారి మనసు ఏదో భావుకతలో విహరిస్తూన్నది. ”మేడమ్!” ఆ పిలుపు ఆమెను ఈ లోకంలోకి దింపింది.
”రమా! నువ్వు నన్ను ‘అక్కా!‘ అని పిలువచ్చు గదా!” కొంచెం సవరించుకుని ”కనీసం ఇంట్లోనైనా” అన్నారు.
”మేడమ్! నా మనసులో మిమ్మల్ని అక్కగానే ఆరాధిస్తాను. కాని ఇంటా, బయటా ‘మేడం‘ అనే పిలుస్తాను. లేదంటే ఎప్పుడైనా పొరపాటు జరగవచ్చు. నన్ను క్షమించండి. మీరు నన్ను చెల్లెగా భావించటమే నాకు పదివేలు. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న మీ చేత గుర్తించబడటమే నా అదృష్టము. అమ్మా నాన్నలు ఏం పుణ్యం చేసుకున్నారో నాకు ఇంత గొప్ప వరం దొరికింది. ‘సదా మీ నమ్మకానికి, విశ్వాసానికి పాత్రురాలనై ఉండాలి‘ అని కోరుకుంటాను” అని ఆమె పాదాలను తాకి కళ్ళకద్దుకున్నది.
క్రమంగా కలెక్టర్మేడమ్, రమ మధ్య విశ్వాసం పెరిగి ఆత్మీయతా బంధం దృఢపడసాగింది. టూర్లలో అప్పుడప్పుడు క్యాంప్క్లర్క్ను తీసుకెళ్ళడం మానేసారు. మేడమ్వెంట ఒక తెలివైన అటెండర్, రమ మాత్రమే ఉండేవారు. ఆమెనే మేడమ్కవసరమైన కాగితాలను, ఫైళ్ళను అందించేవారు.
అది మార్చి నెల. ఓ శనివారం రోజు. కలెక్టర్మేడమ్ఓ ప్రముఖ మహిళా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి బాగా లేటయింది. రమను తనతోపాటే భోంచేయమన్నారు. అవసరమైనవన్నీ టేబిల్‌పైన అమర్చిన తర్వాత అందరినీ పంపించి వేశారు. డ్రెస్మార్చుకుని వచ్చింది రమ. ఆ అమ్మాయి, తను మాత్రమే ఉన్నారు టేబిల్దగ్గర. మొదట ఒప్పుకోకపోయినా మేడమ్‌తో పాటు కూర్చుని ఒకే టేబుల్మీద తినక తప్పలేదు రమకు. ”రమా! దేనికదే, ఉద్యోగ ధర్మం వేరు. ఇంట్లో పద్ధతి వేరు. ఇక్కడ నువ్వు నాకు చెల్లెలివే” ”ఎవరైనా చూస్తే బాగుండదు మేడమ్!”
”ఇప్పుడు ఎవరూ లేరులే. దాన్ని వదిలెయ్యి. ఈ రోజు నీకేమి నచ్చిందో చెప్పు”.
”వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్బాగున్నది. మీ స్పీచ్ఎంతో ఉత్తేజకరంగా ఉండే. అమ్మాయిల నృత్య ప్రదర్శన కూడా బాగా నచ్చింది”. మేడమ్ఓసారి రమ వంక చూసి, ”నాకైతే నువ్వే ఆకర్షణగా నిలిచావనిపించింది. ఫుల్యూనిఫాంలో డైరీ చేతబట్టి ఠీవిగా నా వెంట నడుస్తుంటే, అమ్మాయిలంతా నన్ను కాకుండా నిన్నే కుతూహలంగా చూస్తున్నారు. అందుకే నా స్పీచ్‌లో సైతం పరోక్షంగా నీ రోల్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాను.”
రమ కొంచెం సిగ్గుపడింది. ”అది చెల్లె మీద మీకున్న అనురాగం మేడమ్! మీరెక్కడ, నేనెక్కడ?’మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోగలనా?’ అని అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. నాకాశక్తి నివ్వమని ఎప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాను!” అమ్మాయి గొంతు గద్గదమైంది. మేడమ్సున్నితంగా ఆమె చేతిని నొక్కింది.
ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్ముగించుకుని లాన్లో కూర్చొన్నారు మేడమ్. వెంటనే రమకు కబురుపెట్టారు. ఆమె వచ్చి మేడమ్పక్కనే గడ్డి మీద కూర్చున్నది.
”రమా! ఏమైనా తిన్నావా లేదా?” ”తిన్నాను మేడమ్!”
”అయితే లంచ్గురించి విచారించకు. నా దగ్గరే నాతోపాటే చేద్దువు. లోపలికెళ్ళి రెండు టీలు పట్టించుకురా!”
టీ సిప్‌చేస్తూ, ”నీ గురించి, నీ కుటుంబం గురించి చెప్పు రమా!” అంటూ ఆమె వైపు కుతూహలంగా చూశారు మేడమ్.
”మాది ఓ అతిసాధారణ నిరుపేద కుటుంబం. దానికి విశేషాలే ముంటాయి మేడమ్!”
ఆ సాదా కుటుంబాల నుంచే నీ లాంటి, నాలాంటివాళ్ళు ఎదిగి వస్తారు. అందుకే అడుగుతున్నాను చెప్పు”
”ఇంకా నాకు సరైన ప్రాపంచిక స్పృహ రాకముందే, నా ఏడవ ఏట నాన్న మరణించాడు. అప్పటినుంచి మా కష్టాలు ఎక్కువయ్యాయి. అమ్మకు కుట్టుపని వచ్చు. ఆమె రాత్రింబవళ్ళు గుడ్డలు కుట్టేది. దానికి వాళ్ళిచ్చే కొద్దిపాటి కూలీ డబ్బులతో కష్టంగా ఇల్లు గడిచేది. నాన్నపోగానే నన్ను బడికి పంపడం మానేస్తుండొచ్చని భయమేసింది. ఓనాడు స్కూల్లో చెట్టుకింద కూర్చొని ఏడుస్తున్నాను. అది మా క్లాసు టీచర్గమనించారు. నన్ను చేరదీసి విషయం తెలుసుకొన్నారు. ఓదార్చి సాయంకాలం నాతో పాటు ఇంటికి వచ్చి అమ్మను కలిసారు. నన్ను ఎప్పటివలె బడికి పంపాలని అమ్మకు చెప్పారు. ఫీజూ, ఇతర ఖర్చులు తాను భరిస్తానన్నారు. అప్పటినుండి పదవక్లాసు వరకు నా ఫీజులు, యూనిఫాం, అన్నింటి బాధ్యత ఆమే తీసుకున్నారు. పదవక్లాసులో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఆ టీచరే స్వయంగా ఇంటర్మీడియట్కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి అడ్మిషన్ఇప్పించారు. ఫీజు మాఫీ చేయించారు. నాకు ఆక్సిడెంట్అయినప్పుడు ప్రిన్సిపాల్‌గారు, టీచర్ఇద్దరూ నన్ను ఆదుకున్నారు. ఎక్కడున్నారో? వారికి నా ప్రణామాలు” అని చేతులెత్తి దండం పెట్టింది.
ఇంటర్తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను. కాని నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి రెండు ఇళ్ళల్లో పిల్లలకు ట్యూషన్చెప్పే పని దొరికింది. ఆర్నెల్లలోనే అది మానేయాల్సి వచ్చింది. అక్కడ చురకత్తుల్లాంటి కొందరి కళ్ళు నా శరీరానికి తూట్లు పొడిచేవి. కాని అప్పుడే అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. అస్తమా జబ్బుతో ఆమె పూర్తిగా నీరసించిపోయింది. అదే సమయంలో మా మేనమామ అమ్మను చూడడానికి వచ్చారు. అతను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించారు. ఉదయం 8 నుండి 12 గంటల వరకు, పగలు 2 నుండి 6 వరకు తీరిక లేకుండా పనిచేయాల్సి వచ్చేది. ఆ ఉద్యోగం ఆర్నెల్లు చేశాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆమె మళ్ళీ బట్టలు కుట్టడం ప్రారంభించింది. అదే సమయంలో మామయ్య మళ్ళీ వచ్చాడు. ఎట్లైనా నాకు డ్రైవింగ్నేర్పించమని ప్రాధేయపడ్డాను. ఆయన నా మొరను ఆలకించి తనతోపాటు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. అక్కడ తనకు తెలిసిన ఒక వెహికిల్ఇన్స్పెక్టర్దగ్గరకు నన్ను తీసుకెళ్ళారు. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ”నీలో తెలివితేటలు, పట్టుదల ఉన్నాయి. ఇది చాలా టఫ్‌జాబ్. అమ్మాయిల కనుకూలమైన రంగాలు ఎన్నో ఉండగా ఇదే ఎందుకెంచుకున్నావమ్మా?” అంటూ ఆశ్చర్యంగా అడిగారు. నేను చెప్పిన జవాబులు, నా మొండి పట్టుదల చూసి నవ్వారు. వెంటనే ఒక ట్రైనింగ్ఇనిస్టిట్యూట్కు ఫోన్‌చేసి కారు డ్రైవింగ్‌లో నాకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అక్కడ రెండు నెలలు శిక్షణ తీసుకుని సర్టిఫికెట్సంపాదించాను. మిడ్సైజ్కార్లు గూడా అవలీలగా నడిపే నేర్పును స్వంతం చేసుకున్నాను. తిరిగి వెళ్ళి ఇన్స్పెక్టర్గారికి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన స్వయంగా నా డ్రైవింగ్స్కిల్స్పరీక్షించి ఒక టెస్టిమోనియల్ఇచ్చారు. అది మీరు చూశారు మేడమ్!”.
”ఔను. శభాష్!” అంటూ ఆమె రమ భుజం తట్టింది.
”మీ మామయ్య చాలా సంతోషించి ఉంటారు?”
”ఔను మేడమ్! ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్చేసేవారు. ఆయన భార్య అందుకు వ్యతిరేకం. శిక్షణ వాళ్ళ ఊళ్ళోనే కాబట్టి నా తిండి, ఉండటం వాళ్ళ ఇంట్లోనే. ఆమె రోజూ నా ఉత్సాహాన్ని నీరు కార్చేది. వెక్కిరింపులు, వెటకారాలు చేసేది. అసభ్యంగా అవమానకరంగా మాట్లాడేది. ఎన్ని చేసినా ఎదురు చెప్పకుండా నేను అన్నింటినీ సహించాను. ఆ అనుభవం నాకు చాలా నేర్పింది.”
”వెరీగుడ్రమా! పన్నెండయింది కదా. నేను స్నానం చేసి ఫ్రెష్‌అయి వస్తా. లంచ్చేద్దాం. తర్వాత సాయంకాలం మళ్ళీ కలుద్దాం!”
”అలాగే, థాంక్స్‌మేడమ్!”
”డోంట్బీ సో ఫార్మల్రమా!” అని ఆమె లేచారు.
* * * *
”ఈ లాన్లో సేదదీరుతూ టీ సిప్‌చేస్తూ, నువ్వు నా పక్కన కూర్చుని చెప్పే మాటలు వింటూ నేను ఈ ప్రపంచాన్నే మరచిపోతున్నాను. మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పరిసరాల ప్రభావమా? నీ ఆత్మీయతా? మరింకేదైనానా? తెలియటం లేదు. ఇంత కొద్దిసమయంలో నాకింత దగ్గర ఎలా అయ్యావు రమా? నా హృదయాన్ని గెలుచుకున్నావు నువ్వు”.
”మేడమ్!” నిజంగానే తను మరో లోకం నుండి మాట్లాడుతున్నట్టే ఉంది. ‘భావుక ప్రపంచం!‘
ఆ పిలుపుతో తేరుకుని, ”చెప్పు రమా! ఈ ఉద్యోగంలోకెలా వచ్చావు? నా దగ్గర కెలా చేరావు?”
”కారు నడపాలి. పెద్ద కార్లు నడపాలి అనే కోరిక ఓ క్రేజ్లాగా నన్ను వెంటాడింది. ట్రావెల్ఏజెన్సీలకు వెళ్ళాను. వాళ్లందరూ రిజెక్ట్చేశారు. ఎవరో చెప్తే ఎంప్లాయిమెంట్ఎక్సేంజ్లో పేరు నమోదు చేసుకున్నా. ఆర్నెల్లు ఖాళీగానే ఉన్నా. త్వరగా ఉద్యోగంలో చేరి అమ్మ మీద ఆర్థికభారం తగ్గించాలనే ఆరాటం ఎక్కువయింది. అలాంటి స్థితిలో ఒక మహానుభావుడు సలహా ఇచ్చాడు: ”ఈ జిల్లా కలెక్టర్‌గారు చాలా మంచివారు. వారి దగ్గరకు వెళ్ళు. ఏదో ఒకటి చూపిస్తారు.” ‘అబ్బో! కలెక్టర్‌గారే‘ అని బెదిరిపోయాను. ‘నువ్వు ప్రయత్నించు. నీ వివరాలతో చీటీ పంపు. మేడమ్తప్పక నీకు ఇంటర్వ్యూ ఇస్తారు వెళ్ళు‘ అని ప్రోత్సహించాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. కాని ఈ రోజు నేను మీ సన్నిధిలో కూర్చోవడానికి అతనే కారకుడు”.
”నీ పట్టుదల, నీ ఆత్మవిశ్వాసమే అలా అనుకూల పరిస్థితులను కల్పించాయిరమా! నువ్వు ఇంకా పైకి ఎదగాలి. ఎల్లప్పుడూ నీకు నా ఆశీస్సులుంటాయి.”
”థాంక్స్‌మేడమ్!” అని ఆమె పాదాలను స్పృశించింది రమ.
”అలా చేయకు రమా!”
”లేదు మేడమ్! మీరు నాకు అన్నీను. యజమాని, శ్రేయోభిలాషి, గురువు, నా ఆదర్శము”.
చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దమేలింది. దాన్ని ఛేదిస్తూ, ”మేడమ్! అమ్మగారిని ఇక్కడకు రప్పించండి” అని రమ విన్నవించింది.
”ఆమె రారు రమా! ఆమెకీ ప్రపంచంలో ఆసక్తిలేదు. ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు. ఇదివరకటి ప్రయత్నాలన్నీ విఫలమయినవి. కనీసం అక్కడి పరిసరాలు ఆమెకు సుపరిచితము. వాటికి అలవాటు పడి ఉన్నారు. ఇక్కడ మళ్ళా అంతా కొత్త. ఇక్కడ ఆమెకు టైమెవరు ఇస్తారు?”
”నేనున్నానుగా మేడమ్! నేనిస్తాను అమ్మగారికి టైం. నా మాట వినండి. నన్ను తీసుకెళ్ళండి. అమ్మగారిని ఇక్కడకు రావడానికి ఒప్పించే బాద్యత నాది మేడమ్!” ఉషారాణి కాశ్చర్యం వేసింది. ‘ఏమి ఆత్మవిశ్వాసమీ పిల్లది!‘
”మేడమ్!” ”ఊఁ!” ”రిలాక్సవ్వండి. బయట పరిసరాలను గమనించండి. ఆ పచ్చని చేల వైపు చూడండి. అల్లరి చేస్తూ అటూ ఇటూ చక్కర్లు కొట్టే పకక్షులను పరికించండి. వాటి చలాకితనం చూడండి. మీ హృదయం తేలిక పడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది.”
”కవిత్వం చెప్తున్నావు రమా!” ”అమ్మగారిని చూడడానికి వెళ్తుంటే నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉన్నది.”
”నువ్వు ఇన్సిస్ట్చేయకపోతే నేను అమ్మను చూడటానికి ఇంత త్వరగా వెళ్ళకపోయేదాన్ని. ఆఫీస్పనుల ఒత్తిడితో అమ్మను చూడాలనే ధ్యాసే ఉండడం లేదు నాకు.”
”దగ్గరలో కూడా లేరు కదా మేడమ్!” ”ఔను!”
”అందుకే అమ్మగారిని ఒప్పించి మన దగ్గరకే తీసుకొద్దాం మేడమ్!” ‘Kudos to your confidence!‘ మనసులోనే అనుకొన్నారు ఉషారాణిగారు.
”అమ్మాయిగారు వచ్చారు చూడండి” అని రంగయ్య చెప్పడంతో సరస్వతమ్మగారు ఆనందంతో కుర్చీలోంచి లేచి ముందుకు నడిచారు. తల్లిని అమాంతం కౌగిలించుకున్నారు ఉషారాణి. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి రమవైపు చూపిస్తూ ”ఈ అమ్మాయే పట్టుబట్టి నిన్ను చూడాలని ఈ రోజు నన్ను తీసుకువచ్చింది” అని చెప్పారు.
రమ ఆమె పాదాలకు నమస్కరించి ఆమె చెంతనే నేలమీద కూర్చొన్నది. ”నాకు చాలా సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని మొదటిసారి చూడడం కద అమ్మాగారూ!” సరస్వతమ్మ ఆమె బుగ్గలు నిమిరారు. చుబుకమెత్తి కళ్ళలోకి చూసారు. ‘అమాయకప్పిల్ల!‘ మధ్యాహ్నం లంచ్‌తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి తల్లి తన గదిలోకి వెళ్ళగానే మేడమ్మరో గదిలోకెళ్ళారు. ఆమె బాగా అలసి ఉన్నారు. అమ్మగారు మెలకువతోనే ఉన్నారు. రమ నిదానంగా వెళ్ళి ఆమె కాళ్ళ వద్ద కూర్చుని మృదువుగా మసాజ్చేయసాగింది. పాదాలు, పిక్కలకు. తర్వాత పక్కటెముకలు, వీపు, నడుము భాగాలను సున్నితంగా రుద్దింది. దాదాపు గంటసేపు అలా చేసింతర్వాత ఆ అమ్మాయి చేతులను తన చేతుల్లోకి తీసుకుని దగ్గరకు రమ్మని సంజ్ఞచేశారు వృద్ధమాత. నుదుటిమీద ఓ ముద్దుపెట్టి ఆశీర్వదించింది. ఆ యువ హృదయం ఉద్వేగానికి లోనయ్యింది. రెండు కన్నీటిచుక్కలు ఆమె నయనాల నుండి రాలిపడినయి. కృతజ్ఞతతో ”అమ్మగారూ!” అన్నది. ‘ఎక్కడి తను! ఎక్కడ అమ్మగారు! ఎంత అదృష్టవంతురాలు తను!‘ కాసేపటికి తమాయించుకుని, ”అమ్మగారూ! మిమ్మల్నొకటడుగనా?” అన్నది. ”అడుగు”.”మరి కాదనకూడదు.” ఆలోచనలో పడ్డారామె. ”నేను అసాధ్యమైనదేదీ అడగను అమ్మగారూ!” బతిమాలుతున్న స్వరంతో విన్నవించింది.
”సరే చెప్పు”. ”మీరు మేడమ్దగ్గరకొచ్చి ఉండండి. నేనక్కడే ఉంటాను! రోజూ పనయిపోగానే మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసుకుంటాను. మేడమ్చాలా మంచివారు. నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉచితంగా వసతి కల్పించారు. తన బంగళా ఆవరణలోనే. నన్ను సేవకురాలిగా చూడరు. చాలా ప్రేమతో ప్రవర్తిస్తారు.”
”ఆ విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డా!” ”అట్లాగే అమ్మగారూ!” అని తన వినతికి జవాబు కోసం ఎదురుచూస్తున్నది రమ.
”రమా! నాకు కొంచెం టైం ఇవ్వు. చెప్తాను. అప్పుడు నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్దువు”. ”అమ్మగారూ!” అని లేచి గంతేసింది రమ.
మరుసటిరోజు తిరుగు ప్రయాణంలో, ”ఏమయింది రమా?” ఉషారాణిగారు ఆమెను పరీక్షించ దలచి అడిగారు. ”ఫలితం కోసం కొంచెం ఓపిక పట్టాలిగా మేడమ్!” మేడం స్పందించకపోవడంతో, ధైర్యం చేసి తనే ప్రతిపాదించింది. ”దయచేసి కొద్దిరోజుల తర్వాత నన్ను మరోసారి పంపండి. అమ్మగారిని తప్పక తీసుకొస్తా”. ”సరే”.
నెలరోజులు కావచ్చింది. రొటీన్పనులు, మీటింగ్‌లు, టూర్లతో కలెక్టర్‌గారికి తీరికలేదు. ఒక శనివారం సాయంకాలం. అదను చూసి రమ అడిగింది. ”మేడమ్! నాకు రెండు రోజుల సెలవు, కారు కూడా ఇస్తే అమ్మగారిని తీసుకొస్తా. దారిలో ఒక చోట డాక్‌బంగ్లాలో అమ్మగారు విశ్రమించటానికి ఏర్పాటు కూడా చేయించండి”.
”అమ్మగారు రాకపోతే?” ”వస్తారు మేడమ్”.
”తీసుకురాకపోతే ఖర్చులు నీ జీతం నుంచి కోస్తా. సరేనా?” ”మేడమ్! మీ ఆజ్ఞ ఏదైనా నాకు శిరోధార్యం.”
* * * *
ఊరు చేరుకోగానే సరాసరి అమ్మగారి దగ్గరికి చేరి ఆమె పాదాలకు నమస్కరించి ఆ పాదాల చెంతే కూర్చున్నది రమ. తన రెండుచేతులను ఆమె తొడలమీద వేసి తలను మోకాళ్ళ మీద ఆనించింది. ఆ పిల్ల తలను ఆప్యాయంగా నిమురుతూ, ”ఏంటి రమా! ఆందోళనగా ఉన్నావెందుకు?” అని అడిగారు సరస్వతమ్మగారు.
”అమ్మగారూ! ఈసారి మీరు తప్పక రావాలి. మేడమ్‌కు నేను మాట ఇచ్చాను. మీరు రాకపోతే మేడమ్నామీద చర్య తీసుకొంటారు. నా జీతంలో కోత పెడ్తారు.”
సరస్వతమ్మ హృదయం కరిగింది. ”ఏడ్వకు, వస్తాను. రేపు ఉదయమే బయల్దేరుదాం. నిశ్చింతగా ఉండు” అని రమను ఓదార్చారామె. మరుసటిరోజు ఉదయమే బయల్దేరి అనుకొన్న ప్రకారం మధ్యలో ఒక డాక్‌బంగ్లాలో ఆగి బ్రేక్ఫాస్ట్చేసి సేదదీరారు. తిరిగి ప్రయాణం సాగించి మధ్యాహ్నం రెండుగంటలకు క్షేమంగా తమ బంగళాకు చేరుకొన్నారు.
* * * *
అమ్మగారు బంగళాలో బాగా అడ్జస్టయ్యారు. ప్రేమతో కూడిన కూతురు పలుకులు, రమ రోజూ తన దగ్గరకొచ్చి ఇష్టంగా తనకు సేవ చేయడం ఇవన్నీ కలిసి తన జీవితంలో మార్పు వస్తున్నట్లు తోచిందామెకు. ‘ఇది మాటల పిల్లకాదు. స్వచ్ఛమైన హృదయం గలది‘ అని రమ పట్ల ఆమెకు నిశ్చితాభిప్రాయమేర్పడింది. తెలియకుండానే ఆ అమ్మాయి తనకు ఎంతో ఆత్మీయురాలనిపిస్తున్నది. అది తన తొడమీద చేయివేసి మోకాళ్ళమీద తల ఆనించి మరో చేత్తో తన పాదాలను, కాళ్ళను మృదువుగా నలుపుతుంటే తన కూతురు కృష్ణతేజను తలపిస్తున్నది.‘
మేడమ్‌దగ్గర ఒకరోజు పర్మిషన్తీసుకొని తమ ఊరికెళ్ళి మరుసటిరోజే తిరిగివచ్చింది రమ. ఆ రోజు ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వుకు బదులు చిరాకు గమనించారు మేడమ్. సాయంకాలం ఆమెను తన దగ్గరకు పిలుచుకుని కారణమడిగారు.
”నాకు తెలియకుండానే మావాళ్ళు నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏకంగా ఓ సంబంధం ఖాయం చేసుకొచ్చాడట మా మామయ్య. ఆయన భార్య తరఫు వాళ్లయి వుంటారు. మామయ్య ఆమె ఒత్తిడికి లొంగి అలా చేసి ఉంటారు. నేను ససేమిరా కాదని వచ్చేశాను మేడమ్.” రమ తన ఆవేదననంతా వెలిబుచ్చింది.
”అంత మాత్రానికే అప్సెట్అయితే ఎలా రమా! సమస్యల నెదుర్కొనడం నేర్చుకో. నన్ను చూస్తున్నావుగా! రోజూ ఎన్ని ఒత్తిళ్ళు. ధైర్యంగా, స్థిరచిత్తంతో ఎదుర్కొనకపోతే దెబ్బతింటాం.” కొంచెంసేపాగి, ”ఒకసారి మీ అమ్మనిక్కడకు పిలువు” అని ఆదేశించారు మేడమ్.
వారం రోజుల్లో ఒక ఆదివారంనాడు ఊరినుండి రమ వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమెను పిలిచి మేడమ్చెప్పారు: ”చూడమ్మా! రమ కష్టపడి పైకి వస్తూన్నది. ఆమె ఇంకా ఎదగాలి. ఆమె ఇష్టం లేకుండా పెళ్ళి ప్రయత్నాలు చేయకండి. ఆమె మీరు గర్వపడేలా చేస్తుంది. మీ ఆశలు, ఆకాంక్షలు ఆమెకు తెలుసు. మరో విషయం. ఊళ్ళో మీరు ఒంటరిగా ఉండడమెందుకు? ఇక్కడికి వచ్చి రమ దగ్గర ఉండండి…”
”సరే మేడమ్! దాని కిష్టం లేని పనేమీ చేయం. ఇక నేను ఇక్కడికి వచ్చి ఉండడం గురించి, కొద్ది రోజుల తర్వాతే అది సాధ్యపడుతుంది”అని చెప్పి మేడమ్‌దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయిందామె.
* * * *
కలెక్టర్మేడమ్దగ్గర ఉద్యోగంలో చేరి రమకు మూడేళ్ళు కావస్తున్నది. మేడమ్కామె స్వంత ఇంటిమనిషి లాగయిపోయింది. అమ్మగారి హృదయంలో నైతే ఆమె పోయిన కూతురు స్థానం నాక్రమించింది. అయినా ఆ అమ్మాయి అణకువలోగాని, విశ్వాసంలోగాని కించిత్తు మార్పు రాలేదు. పదిమంది ఎదుట చాలా జాగ్రత్తగా మసలుకొంటుంది. అంతరంగంలోని భావం బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారే కాని మేడం హృదయంలోను రమ తన పోయిన చెల్లె స్థానాన్ని పూరించింది.
రాత్రిళ్ళు రమ అమ్మగారి గదిలోనే పడుకోవాలి. ఒక్కరాత్రి ఆమె లేకపోతే ఆ రాత్రి అమ్మగారి నిద్ర మాయమైపోతుంది. తన పక్కనే ఓ మంచం వేయించారామె. రమ ఆ మంచాన్ని పక్కకు జరిపి అమ్మగారి మంచం పక్కన నేలమీదనే పరుపు పరచుకుని పడుకుంటుంది.
ఓనాటి రాత్రి రమ అమ్మగారి కాళ్ళకు మసాజ్చేస్తున్నది. ”అమ్మా! రమా! ఇలా దగ్గరకు రా” అని ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని అడిగారు: ”నీకు ఇంకా చదువుకోవాలని ఉంటే నేను నిన్ను చదివిస్తాను. లేదా ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా చెప్పు!”
”అమ్మగారూ! చిన్నప్పటినుండి నేను కలలు కనేదాన్ని. కార్లు నడపాలని, పెద్ద పెద్ద కార్లు నడపాలని ఉబలాటపడేదాన్ని. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే వాటిని అలా చూస్తూనే ఉండిపోయేదాన్ని. ఎప్పటికైనా వాటిలాగా నేనూ ఎగరాలని ఉవ్విళ్ళూరేదాన్ని.” ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ, ”పైలట్కావాలనుకుంటున్నావా?” అని అడిగారు అమ్మగారు. ఔనన్నట్లుగా తలూపిందా అమ్మాయి. ”నేను అక్కకు చెప్పి దాని కోసం ఏర్పాటు చేయిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు”. ”ఎవరు, మేడమ్తోనా అమ్మగారూ?” ఔనని చిరునవ్వుతోనే చెప్పారామె.
అమ్మగారి కోరిక మేరకు కలెక్టర్మేడమ్రాజధానిలో ఉన్న ఒక ఏవియేషన్అకాడమీ వారితో మాట్లాడి సెలెక్షన్కోసం రమను పంపించారు. అన్ని అర్హతలు సరిపోవడంతో ఆమెను మెడికల్ఎక్జామినేషన్కు రెఫర్చేశారు. అక్కడా ఆమె అర్హత సాధించింది. పద్దెనిమిది నెలల C.P.L కోర్సులో చేరి విజయవంతంగా పూర్తిచేసింది. ఆ వెంటనే వచ్చి నేరుగా అమ్మగారి కాళ్ళ మీద వాలిపోయింది. ”నా బిడ్డ రేపో, ఎల్లుండో రెక్కలు కట్టుకొని గాలిలో ఎగిరిపోతుంది. దానితో పాటు నేనూ ఎగిరిపోతా”.
”అమ్మా!” కలెక్టర్మేడమ్నవ్వాపుకోలేకపోయారు.
రమ వెనుకకు తిరిగి ఆమెకు పాదాభివందనం చేసి ”మేడమ్! నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇది కలయా! నిజమా! మీ ఋణం ఎలా తీర్చుకోగలను చెప్పండి!” ఆమె గొంతు జీరబోయింది.
”ఇప్పుడైనా ‘అక్కా!‘ అని పిలువు”. చిరునవ్వులు చిందిస్తూ ”మీరు నాకు ఎప్పుడూ ‘మేడమే!” అంటూ సెల్యూట్చేసింది రమ.
మరుసటిరోజు సాయంత్రం కలెక్టరాఫీసులో అభినందన సభ ఏర్పాటుచేశారు. కలెక్టర్ఉషారాణి మేడమ్అధ్యక్షత వహించారు. సభకు జిల్లాలోని ఆఫీసర్లు, ఉద్యోగులే కాకుండా పురప్రముఖులనూ ఆహ్వానించారు. అందరూ రమను ఘనంగా సత్కరించి, అభినందించారు. ఆమె తన మెడ నలంకరించిన దండలన్నింటినీ తీసి వినమ్రంగా అమ్మగారి పాదాల చెంత పరిచి సాష్టాంగప్రణామం చేసింది. అమ్మగారు ఆ బిడ్డను ఎత్తి ఆలింగనం చేసుకుని కరతాళ ధ్వనుల మధ్య ఆశీర్వదించారు. తనకు బహూకరించిన అభినందన పత్రాలను ఆ అమ్మాయి కలెక్టర్మేడమ్దోసిట్లో ఉంచి ఆమె పాదాలకు నమస్కరించింది. రమను ఎత్తి నిండుసభలో ఆమెను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి కలెక్టర్‌గారు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సభికులందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
ఈ వార్త జిల్లాలో, జిల్లా బయటా ప్రచండ మారుతంలా వ్యాపించింది. స్కూళ్ళలో, కాలేజీల్లో యువతీ యువకులు సంబరాలు చేసుకొన్నారు. ఎవరిని కదిలించినా ‘పైలట్‌రమ‘ పేరే వినిపిస్తూన్నది. ‘మారుమూల గ్రామ మహిళా పైలట్!‘
m m m
మాధవిపురం (మద్దికెర) లోఅక్షరాలునేర్చుకున్నమొదటిబాలిక. ఇంకాచదువుకుంటాఅన్నమాటనిగొంతుఆపేసి, 12 ఏళ్ళకేపసుపుతాడువేసేసుకుని,మంగళంపాడేసుకుంది. పుస్తకాలటకెక్కాయి. ట్రంకుపెట్టెకిందికిదిగిఅత్తారింటికినడిపించింది. అత్తారింట్లోతనకికలిసొచ్చినదేమిటంటే , తనకన్నామూడేళ్ళుపెద్దవాడైనాసవితికొడుకుతోసహఆరుమందిసంతానం. 40 ఏళ్ళమొగుడు. మరోఆరేళ్ళకుతనపంటపండిమరొముగ్గురుసంతానంవారిలోఆఖరివాడుమానాన్న. 18ఏళ్లవయసుకిమూడుపువ్వులుఆరుకాయలుగాతొమ్మిదిసంతానంఆమెతోముడిపడిపోయింది.
మాఅవ్వజీవనప్రస్థానం 1910 నుండి 1980 వరకుఅంటేశ్రీశ్రీపుట్టినప్పటినించిశంకరాభరణంసినిమావిజయోత్సవాలవరకు.అందులోచివరిపదేళ్ళభాగంలోనేనేనున్నా. అందులోప్రత్యక్ష్యంగాచూసినేనుపదిలపరుచుకున్నదిచివరిఐదేళ్ళజ్ఞాపకాలు.అప్పటికితనుసర్వస్వతంత్రురాలావడంతోతనసహజశైలిని , తనఅనుభవాలుపోతపోసుకున్నవ్యక్తిత్వపరిమాళలనుఆస్వాదించగలిగాను. ఇంట్లోమాపిల్లలకందరికితనేశ్రీరామరక్ష. మాస్నేహితులకుమాత్రంహడల్. వాళ్ళోస్తేమేంవాళ్ళతోబయటికెళ్ళితనతోఉండమనివాళ్ళనిఎక్కవగాఇంటికిరానిచ్చేదికాదు.పనిపాటలేదాఅనివాళ్ళనిపంపించేసేది.
50 ఏళ్ళువంటింటిగుమ్మానికిదిండుపెట్టుకునిపడుకుని, గడిపినా, రెండుప్రపంచయుద్థాలు, మనస్వాతంత్రపోరాటాలాగూర్చిమాకర్థమవ్వాల్సినరీతిలోబాగాచెప్పేది. రతన్‌టాటా , టాటాసన్స్గ్రూప్చైర్మన్గాస్వచ్చందంగావైదొలగినట్లు, తన 65 తనవంటింటిఅధికారాలన్నిమాఅమ్మకుఅప్పగించింది.మొదట్లోమాఅమ్మచేసేవంటల్లోఎవరైనాఉప్పుతక్కువైందిఅంటెతక్కువేసిమంచిపనిచేసిందికావాలంటేకలుపుకోవచ్చుకదాఅనేది. అదేఉప్పుఎక్కువైనరోజుతనతప్పేంలేదుఈసారికొన్నఉప్పులోనేఉప్పుఎక్కువైందని, రాళ్ళఉప్పుఅమ్మేబండివాడుపళ్ళికించినపుడేతనకిఅనుమానమొచ్చిందని, ఇకరేపట్నించిఈఉప్పుకితగ్గట్టువండుతుందిలేఅనిమాఅమ్మకుభలేసపోర్ట్గామాట్లాడేది.
మాఅవ్వతనజీవితంంలోచూసినవిమూడేసినిమాలుఒకటిశ్రీవెంకటేశ్వరమహాత్మ్యంరెండవదిలవకుశమూడవదిభక్తప్రహ్లద. మిగతాఏసినిమాలుచూడకపోయినఅమెభక్తప్రహ్లదకన్నాగొప్పసినిమాలేదు, ఇకరాదనేదిఆమెగట్టినమ్మకం..అమెదృష్టిలోఎన్టిఆర్కన్నారోజారమణిగొప్పనటుడు.నిఙమేనండిరోజారమణిఓనటీమణిఅనిఆమెనిఒప్పించడంకష్టం.
నేనుఇంట్లోఅందరికన్నాచిన్నఅవ్వడంతోనన్నెప్పుడుతనపక్కనేపడుకోపెట్టుకునేది, రోజూకథలు , కబుర్లుఎన్నోచెప్పేది. హోమ్వర్క్లుగట్రాలుఅన్నిసాయంత్రమేచెయ్యించేది, రాత్రిఏడింటికిభోజనం , ఎనిమిదింటివరకుమాఅవ్వతోకథాకాలక్షేపం, తరువాతముసుగెట్ట్టేయ్యడం.అప్పుడప్పుడు 10 గంటలప్రాంతంలోఘంటసాల, సుశీలపాటలురేడియోలోమంద్రస్థాయిలోవినిపించేవి.
1979 లోఓరోజు.
మానాన్నగారుతనస్నేహితులుకొందరినిభోజనాలకుపిలిచారు. ఆయనేమెనుకూడాస్వయంగారాసిచ్చారు. కొంతవరకుమాఅవ్వసలహాలమేరకువంటావార్పుతరువాతఅన్నసంతర్పణపూర్తిఅయ్యింది.వంటలన్నిఅద్భుతంగాఉన్నాయ్యన్నారు, కానికొంచెంతక్కువయ్యాయి.. చాలమందిమరిమరివడ్డించమన్నారు, కానిసర్దడంసాథ్యమవలేదు. మానాన్నగారికితలకొట్టేసినట్టయింది..అందరువెళ్ళిపోయాకఅమ్మనుఅవ్వనుబాగాచివాట్లేసారు, మాఅవ్యకిమాట్లాడేదానికిపెద్దగాఅవకాశం దొరకలేదు.
ఆనాటిరాత్రిమాఅవ్వఎక్కువగామాట్లాడలేదు, చాలదీర్ఘాలోచనలోఉండిపోయింది. ఎప్పుడోఅర్ధరాత్రినాచెంపమీదకొన్నికన్నీటిబొట్లురాలాయి.
తరువాతరోజుమాఅవ్వనాకు 1930 కాలంనాటిఆకలిరాజ్యంగురించిచెప్పింది. కొన్నినెలలతరబడిఇంట్లోడబ్బులుఉండేవికావట. వంటసామాగ్రికొనేదానికిచాలకష్టంగాఉండేదట. ఇంట్లోఉండేవాళ్ళుకాకావచ్చిపోయేబంధువులుబాగాఉండేవాళ్ళట.ఓపడి(1.3 Kg) బియ్యంరోజుకిసరిపోయేదికాస్తఓపూటకుకూడాతక్కువయ్యేది. దానితోమాఅవ్వేకష్టపడిఎలాగోఅందరికిసర్దివడ్ఢిచ్చేది, ఆలాతనకుపొదుపుగావండడంబాగాఅలవాటుఅయ్యిందట. దానివల్లతనకుమానాన్నతోమాటలుపడవలసివచ్చిందనికొంతబాధపడిఇకమానాన్నగారిసలహామేరకు, ఇంట్లోభోజనాలవిషయంలోతనింకతలదూర్చనని, తనకిష్టమైనపనులుచేసుకొంటానని, తనకునచ్చినపుస్తకాలుకొన్నితెచ్చిపెట్టమనినాకుచెప్పింది.ఆలామాఅవ్వనన్నుమొదటిసారిగాతెచ్చివ్వమనిఅడిగినపుస్తకంగురజాడవారికన్యాశుల్కం. ఓరోజురాత్రిఆపుస్తకంగురిoచిచెబుతూ. తనలాంటివాళ్ళకోసమేఈపుస్తకంరాసారనిచెప్పేది.
తరువాతచలంరాసినపువ్వుపూసింది, కన్నీటికాలువ, మునిమాణిక్యంనరసింహరావురాసినకాంతంకథలుఇలాఎన్నోపుస్తకాలుమాఇంటిదగ్గరలోఉన్నగ్రంధాలయంనుండితెచ్చిచ్చేవాళ్ళం. ఆపుస్తకాలగురించిమాఅమ్మతో, పిల్లలతోచాలగొప్పగాచెప్పేది. నాకంతఅర్థమయ్యేదికాదు.
ఆలాకొన్నాళ్లతరువాతఓరోజునన్నుదగ్గరికిపిలిచిఒరేయినీకుమీస్కూల్లోఎదోబాగాచదివావనిమొదటబహుమతివచ్చిందటగా, మీఅమ్మఅందరికిచెప్పిఆనందపడుతోంది. నీవునాకుఇంకఈకథలపుస్తకాల్నిచదివివినిపించరా, రోజుకొన్నిపేజీలు, అర్థమయ్యిందాఅనిఆజ్ఞాపించింది.ఆలాకొన్నాళ్ళకునేనుచదవాల్సివచ్చినపుస్తకంగురజాడగారువ్రాసినముత్యాలసరాలు, అందులోనుండిఓరోజుకన్యక, చదివినతరువాతమాఅవ్వకంటనీరు, నాకుకూడాఎదోతెలియనిఓబాధ
ఆరోజుపూర్ణమ్మచదవాల్సివచ్చింది. ఇంట్లోఎవరులేరుఅందరుదసరాపేరంటాలకువెళ్లారు. నేనుఅవ్వమాత్రమేవున్నాము.నేనుచదవడంమొదలుపెట్టాను..
కాసులకులోనైతల్లితండ్రి
నెనరున్యాయంవిడనాడి
పుత్తడిబొమ్మనుపూర్ణమ్మనుఒక
ముదుసలికిచ్చిముడివేసిరి
పెనిమిటికాంచిననిమిషమున
కన్నులక్రమ్మెనుకన్నీరు
చదివినవెంటనేఓసారిఅప్రయత్నంగాకన్నెత్తిఅవ్వనుచూసాను
తనముఖంప్రశాంతతకన్నాచాలనిర్వేదంగాకనిపించింది.
నాచేయిపట్టుకునికొంచెందగ్గరగాతీసుకుంది, తనుమాట్లాడలేదు
కానీనాకర్థమయ్యింది.నేనుతరువాతభాగంచదవాలని
అటపాటలోతోటికన్నియలు
మొగుడుతాతయనికేలించ
పూర్ణమ్మదుర్గనుచేరిదుఃఖించే
నాకుతెలియకుండానేఆగిపోయాను. మాఅవ్వచేయిఆలాగేనన్నుపట్టుకుంది, మాఅవ్వభావాలూఅన్నినాకుఅర్థమయ్యాయి, పూర్ణమ్మలాతనమనుసులోఆదుర్గమ్మనుచేరిరోజుఇన్నేళ్లుదుఃఖించిందిమాఅవ్వ.
ఇప్పుడునాక్కూడాఇంకాచదవాలనిపించింది. కానీమాటగొంతుపెగలిరాదనిఅక్షణంతెలియలేదు. కానీచదవసాగాను
అన్నతమ్ములకప్పుడుపలికెను
అన్నల్లారాతమ్ముళ్ళరా
అమ్మనుఅయ్యనుకాయండి
నలుగురికూచొనినవ్వేవేళ
నన్నొకపరితలవండి
మీమీకన్నబిడ్డలనొకతెకు
ప్రేమనునాపేరివ్వండి
ఇకమాటపెగల్లేదు, కంట్లోనీళ్లుయధేచ్చాగాబలబలరాలాయి.మాఅవ్వఒడిలోతలదూర్చుకున్నాను, ఆమెచేతులునాతలనిమురుతుండగా, ఆలాఎంతసమయంగడిచిందోతెలియలేనేలేదు. ఆమెకంట్లోఇంకిపోయినకన్నీరు, నాకంటప్రవహించిందేమో!
ఆతరువాతనన్నెప్పుడుఏకథకానీ, కవితకానీచదవమనలేదు.
మంచిసాహిత్యంమనసునికదిలిస్తుందని, అటువంటిసాహిత్యంపైనాఆసక్తికిబీజంవేసిందిమాత్రంమాఅవ్వే.
ముగింపు :
తనకెదురైనఅన్నిఅవాంతరాలను, తనకున్నవిచక్షణతోతనకనుకూలంగామార్చుకున్నమాఅవ్వమాకెప్పటికీస్ఫూర్తిదాయకమే. జీవితాన్నిపూర్ణమ్మలాత్యజించలేదు, మరేపోరాటాలుచెయ్యలేదు. తనతోముడిపడ్డకుటుంబాలకుఆలంబనగానిలబడింది. అదిఅప్పటికాలంలోకట్టుబాటైన, ఓరకంగామంచిబాటే.
అద్భుతమైన బంగ్లా అది..
చూపరులను అక్కడే కట్టిపడేస్తుంది. మొత్తం విద్యుద్దీపాలతో అలంకరించబడి ఆరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది.. ఆ వెలుగులు చుట్టుపక్కల అంతా పాకి పున్నమి వెన్నెల విరబూసినట్టుగా ఉంది. ప్రత్యేకంగా తయారు చేయబడిన కళా నైపుణ్యంతో భవనం నిండా ఎటు చూసినా ఐశ్వర్యం తొణికిసలాడుతున్నది. మామిడి తోరణాలు, పూల దండలు, దీప శిఖలు అడుగడుగునా దర్శనమిస్తూ భక్తిభావాన్ని గుబాళిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలి పర్యవేక్షణ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది అన్ని చోట్లా….అవును శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి మరి !
ఇంటి యజమాని విద్యాధర్ అమితమైన భక్తి కలవాడు. వాళ్ళ నాన్నగారు రాజారావు హయాం నుండి ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దానిలో ఎటువంటి లోపం లేకుండా ప్రతీ సంవత్సరం అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఆ ఉత్సవాలను చూడడానికి జనాలు ఉవ్విళ్లూరుతారంటే అతిశయోక్తి కాదు. మొదటినుండీ బాగా ఆస్తిపరులు కావడం మూలంగా విద్యాధర్ ఎలాంటి లోటు లేకుండా గారాబంగా పెరిగినప్పటికీ దానికి ఏమాత్రం తీసిపోకుండా వస్త్రవ్యాపారంలో పెట్టుబడి పెట్టి తమ ఆస్తిని రెండింతలు పెంచాడు.
విద్యాధర్ కి ఇద్దరు కొడుకులు..తండ్రి క్రమశిక్షణలో ఆరితేరి
ఆయన వ్యాపారంలో భాగస్వాములై తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. పెద్ద కొడుకు వినయ్ కి గత ఏడాది వివాహం జరిగింది.చిన్న కొడుకు వినోద్ కి మేనరికం ఉంది. ఆ అమ్మాయి ఎమ్ బిఎ లో చేరడం వల్ల అది పూర్తయ్యాక వివాహం అనుకున్నారు. ఇక
కోడలు వచ్చాక జరుగుతున్న మొదటి నవరాత్రులు కాబట్టి చుట్టపక్కాలకు, స్నేహితులకు ఆత్మీయులందరికీ ఆహ్వానం పలికాడు. ఎవరి వీలును బట్టి వాళ్ళను రావాల్సిందిగా ఫోన్లు చేసి మరీ చెప్పాడు. ఉదయం 6 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు, ప్రసాదాలు పంచడం, ఆ తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు…తిరిగి సాయంకాలం ప్రదోష పూజలు, భజనలు, ప్రసాదాలు, అల్పాహార విందు. ఈ రకంగా ప్రణాళిక సిద్ధం చేయబడింది..దీంతో పాటు ప్రతినిత్యం పేదవారికి చేసే అన్నదానం
మరీ ప్రత్యేకం. వస్ట్రవ్యాపారి కావడం వల్ల వస్త్రదానం కూడా ఇంకో ప్రత్యేకత. ఈ విషయంలో కొడుకులిద్దరూ ఎటువంటి అడ్డు చెప్పరు. పైగా ఎంతో శ్రద్ధగా, నియమంగా పూజల్లో పాల్గొంటారు.
విద్యాధర్ ఇంటి పక్కన దాదాపు అర ఎకరం ఖాళీ జాగా ఉంటుంది. ప్రత్యేకంగా నవరాత్రుల కోసమే దాన్ని ఖాళీగా ఉంచుతారు. ఆరోజు ఉదయం వేదోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో వైపు హోమాలు జరుగుతున్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు. భక్తి ప్రపత్తులతో సంబరాలు జరుగుతున్నాయి. విద్యాధర్ భార్య శ్రీవాణి భర్తకు తగ్గ ఇల్లాలు. చక్కని చీరకట్టు, నుదుట ఎర్రని కుంకుమబొట్టు, కంటి చివరలను కలుపుతూ సన్నని కాటుక రేఖ, పెదవులపై చెరగని చిరునవ్వు, వయసు తేడాలు లేకుండా అందరితో ఆత్మీయ పలకరింపు, హుందాతనం ఆమెకు పెట్టని ఆభరణాలు. పరోపకారం ఆమెకు ప్రాణం. మానవతకు నిలువెత్తు నిదర్శనం అన్నట్టుంటుంది. ఆమెను చూస్తే ఎవరికైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విద్యతో పాటు వినయం ఆమె సొత్తు. భర్తకున్న భక్తిలో ఆమెకు ఒక పాలు ఎక్కువే అని చెప్పాలి. అందుకే పనులు చేసేవాళ్ళు ఎంతమంది వున్నా అన్ని విషయాలను దగ్గరుండి స్వయంగా చూసుకుంటుంది.
వంటశాలలో విరామం లేకుండా నైవేద్యాలు, ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. ఆ ఇంటి వంట మనిషి మల్లి అన్యమనస్కంగా, అసహనంగా పని చేస్తోంది ఆరోజు. మనసు మనసులో లేదు ఆమెకు. కాలుగాలిన పిల్లిలా వంటశాలనుండి హాలులోకి ఇటూ అటూ తిరుగుతోంది. రోజూ ఇంట్లో ఉండే పనివాళ్లు నలుగురు, మల్లితో పాటు వుండే మరో వంట మనిషి కాకుండా మరో నలుగురు వంటవాళ్లను, నలుగురు పనివాళ్లను ఈ పదిరోజుల కోసం పిలిపించారు. ఇంత హడావిడిలో మల్లి ధ్యాసంతా ఇంటి మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ జనారణ్యంలోంచి బయటపడతానా అన్నట్టు తొందరగా టైం గడిస్తే బాగుండు అనుకుంటూ మధ్యమధ్యలో గోడ మీదున్న వాచీ కేసి చూస్తోంది. తొందరగా కదలని ముల్లు మీద విసుక్కుంటోంది కూడా. గత కొద్దిరోజులుగా తన ఇంటి వ్యవహారం ఆమెను కుదురుగా ఉండనీయడం లేదు.
మల్లి భర్త చంద్రం. వ్యవసాయ పనుల్లో కూలీగా వెళ్తుంటాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల తర్వాత
ఆపరేషన్ చేయించుకుంటానంటే వారసుడుగా ఒక మగ నలుసు కావాలని చంద్రం తల్లి భీష్మించుకుంది. తల్లి నోటికి భయపడి చంద్రం ఏమీ చేయలేక “ఎట్లా పోషిస్తామన్న” మల్లిని సముదాయించాడు. మూడవసారి కూడా ఆడపిల్ల పుట్టడం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బిడ్డ పుట్టిన కొన్నాళ్ళకే చంద్రం తల్లి మరణించింది. ముగ్గురూ చిన్నపిల్లలు కావడం వల్ల వారి ఆలనా పాలనా వీళ్ళకు చాలా కష్టమయ్యేది. పెద్దపిల్ల పుట్టిన ఆరు నెలలకు విద్యాధర్ ఇంట్లో వంటకు కుదిరింది మల్లి. సహజంగా నెమ్మదస్తురాలు, ఒళ్ళు దాచుకోని తత్వం గల మల్లి వాళ్ళింట్లో మనిషిగా మెలగసాగింది. విద్యాధర్ కుటుంబమంతా మల్లి పట్ల ఎంతో ఆత్మీయత కనబరిచేవారు. తరువాతి రెండు కాన్పుల సమయంలో కొంతకాలం పనికి వెళ్ళకున్నా శ్రీవాణి ఆదరణతో జీతం అందుకుంది మల్లి. మూడో కాన్పు వద్దని, ఆడపిల్లయినా, మగ పిల్లవాడు అయినా ఈ రోజుల్లో ఒకటేనని శ్రీవాణి ఎంతో నచ్చచెప్పింది. అయినా వినక ముసలావిడ పంతం నెగ్గించుకుంది.
*
చంద్రానికి పదిహేను రోజుల క్రితం జ్వరం తగులుకొంది. దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రం నుండి ఏవో మాత్రలు తీసుకువచ్చి వాడడంతో కొంత నెమ్మదించింది. వెంటనే చిన్నదానికి జ్వరం అంటుకొంది. మందులు వేస్తుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. నిన్నంతా పిల్ల ఏమీ తినలేదు. పెద్ద డాక్టరుకు చూపిద్దామంటే డబ్బు లేదు. అమ్మగారిని అడిగితే ఇస్తుంది. కానీ ఇప్పటికే ఆమెకు తన కుటుంబం చాలా ఋణపడి ఉంది. ఇంకా కూడా అడగడానికి తనకు నోరు రావట్లేదు. “గోరు చుట్టుపై రోకలి పోటు” అన్నట్టు చాలా రోజుల తర్వాత పనికి వెళ్లిన చంద్రం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడని కొంతకాలం యజమాని పనికి రావద్దన్నాడని పక్కింటి కనకయ్య ఇంటికి తీసుకొచ్చాడు. పనికి వెళ్లలేదు కాబట్టి కూలీ డబ్బులు లేవు. మల్లికి ఏమీ పాలుపోవడం లేదు. ఇక్కడి నుండి ఆహారం ఏదో ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు పెట్టగలుగుతుంది కానీ వైద్యం ఎలా చేయించ గలుగుతుంది? ఇక్కడున్న పరిస్థితిలో వారం నుండి ఇంటికి తొందరగా పోవడం కూడా అవడం లేదు.. ఇవాళ తెల్లవారుజామున వచ్చినప్పటినుండీ పని తెమలలేదు. వచ్చే ముందు చంటిది వద్దని మారాం చేయడం, వదిలించుకుని వస్తుంటే దీనంగా చూడడం కళ్ళల్లో కదలాడుతోంది. చంద్రం చూసుకుంటాడనుకుంటే అతని ఆరోగ్యం కూడా బాగా లేదాయె!! పోనీ ఇంతమంది పనివాళ్లు వున్నారు కాబట్టి విషయం చెప్పి కాస్త ముందు వెళ్లిపోతానని అమ్మగారికి చెప్పాలన్నా అటు పూజలు, ఇటు అతిథులతో శ్రీవాణి ఒక క్షణం కూడా తీరికగా ఉన్నట్టు అనిపించలేదు.
అమ్మవారి నామస్మరణతో, భజనలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. నిస్సహాయంగా చూస్తూ ఉంది మల్లి. రాత్రి తొమ్మిది గంటలు దాటింది.. జనం పలుచబడ్డారు. అందరికీ వీడ్కోలు పలికి అలసిన ముఖాలతో ఇంట్లోకి వచ్చారు కుటుంబ సభ్యులు. మెల్లిగా శ్రీవాణితో “అమ్మా! నేను ఇంటికి వెళ్లనా?” అని అడిగింది సందేహంగా మల్లి. “తిని వెళుదువు గానీ” అన్నది శ్రీవాణి. “లేదమ్మా వెళ్ళాలి” అంది ఉబికి వస్తున్న కంటి నీటిని బయట పడకుండా గద్గద స్వరంతో.. “చెప్పేది నీకే..నీవు తిని ఇంట్లో వాళ్లకు కూడా పట్టుకెళ్ళు” అన్నది శ్రీవాణి ఆదేశిస్తూ..చేసేది లేక గుడ్లలో నీరు కుక్కుకుంటూ
ఏదో తిన్నాననిపించి ఇంటికి బయలు దేరింది. ఇల్లు చాలా దగ్గరే. వెళ్లేసరికి చిన్నది నవ్వుతూ తండ్రితో ఆడుతూ కనిపించింది. చంద్రం కూడా ఉత్సాహంగా కనిపించాడు. ఏమీ అర్థం కాలేదు మల్లికి. మల్లిని చూడగానే చంటిదాన్ని పక్కకు దింపి “మల్లీ! శ్రీవాణమ్మ ఒక మనిషిని పంపి డాక్టరును ఇంటికి పిలిపించిందే.. ఆయన మన ఇంట్లనే నన్ను, పాపను చూసి మందులు రాసిచ్చి ఆయనతో ఏదో చెప్పిండు. ఆయన వెళ్లి మందులు, కొన్ని పండ్లను కూడా తెచ్చి ఇచ్చిండు. అట్లనే అమ్మ ఇచ్చిందని, ఖర్చులకు వాడుకొమ్మని 500 రూపాయలు చేతుల వెట్టిండు. ఆయమ్మను బగవంతుడు సల్లగ సూడాల” అని చెప్పుకుంటూ పైకి చూస్తూ చేతులు జోడించాడు.
అయోమయంగా చూస్తూ జరిగిందేమిటో అర్థం కాక మౌనంగా తలూపి తను తెచ్చింది వాళ్లకు పెట్టింది. ఆ నలుగురూ ఆదమరచి నిద్రపోయారు. ఏం జరిగిందో తెలియక పరిపరి విధాల ఆలోచనలతో మల్లికి రాత్రంతా జాగారమే అయ్యిండి. పొద్దున్నే లేచి పనిలోకి వెళ్లిన మల్లి శ్రీవాణి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె దుఃఖమంతా తీరేదాక మల్లిని పొదివి పట్టుకున్న శ్రీవాణి మల్లికి విషయం అర్థమయ్యేలా చెప్పసాగింది. “మల్లీ! కొద్దిరోజులుగా నీవు బాధలో ఉండడం నేను గమనించాను. చంద్రానికి జ్వరమని చెప్పావు. కానీ ఏదో తెలియని బాధ నీ మనసులో ఉన్నట్టు నాకర్థమైంది. నాకు చెప్పడానికి సందేహిస్తున్న విషయం పసిగట్టాను. ఈ నవరాత్రి బిజీలో అంతగా పట్టించుకోలేదు. కానీ నిన్న అమ్మవారికి నవరాత్రులు మొదలైనా నువ్వు సంతోషంగా లేవు. లేకుంటే మా అందరికంటే ఎక్కువ నువ్వే హడావుడి చేసేదానివి. అందుకే నువ్వు చెప్పకపోయినా మీ ఇంటికి మనిషిని పంపి విషయం తెలుసుకుని
డాక్టరును పంపించి మందులు ఇప్పించాను. నువ్వు మా ఇంట్లో దానివి. నీకు కష్టం వస్తే ఊరుకుంటానా చెప్పు? అలా ఊరుకుంటే నేను చేసే పూజలకు అర్థం లేదు. మనిషిని మనిషిగా చూడని పూజను ఆ భగవంతుడు కూడా స్వీకరించడు. ఎన్ని ఆడంబరాలకు పోయినా మానవత్వమే మనిషికి అసలైన అలంకారం. ఇంకెప్పుడూ నా దగ్గర నీకు మొహమాటం ఉండొద్దు” అని చెప్పింది. “ఇంకా చూస్తావేం! నాకో కప్పు కాఫీ ఇచ్చి పని మొదలుపెట్టు” అంటూ నవ్వింది.
‘అలాగే అమ్మా!’ అని శివరాత్రి లాంటి తమ బతుకుల్లో నవరాత్రి ఉత్సవం నింపిన శ్రీవాణిని కళ్ళప్పగించి చూస్తూ ” తల్లీ! వచ్చే జన్మలోనైనా ఈ అమ్మ రుణం తీర్చుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వమంటూ” ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ కొంగును లాగి బొడ్లో దోపి, రెండవరోజు దేవీ నవరాత్రోత్సవ నైవేద్యం చేయడం కోసం ఉద్యుక్తురాలైంది మల్లి కొత్త ఉత్సాహంతో, ప్రశాంత చిత్తంతో….
చాలా సంవత్సరాల తరువాత మా వూరు వెళ్ళాను. అక్కడకి వేళ్ళ గానే రెండు రోజులకే నాకు దగ్గరగా ఉన్న కొత్తపట్నం సముద్రానికి వెళ్లాలనిపించింది. ఆ మర్నాడే ఒక ఆటో తీసుకొని కొత్తపట్నం బయలుదేరాను. వూరు చాల మారిపోయింది. బస్టాండ్ దగ్గర కనకాంబరాలు తమలపా కులు అమ్మే అమ్మాయిలు చాల తక్కువ కనిపించారు . కొత్తపట్నం ఎప్పుడు వెళ్లిన ఇదివేరుకు బస్సు కిటికీ నుంచే కనకాంబరాలు , మల్లెపూలు తమలపాకులు కొన్ను క్కునే వాళ్ళం. చాల తాజాగా ఉండేవి. బస్సు దిగిన తరువాత ఒక 5 కిలోమీటర్లు దూరం కాలినడకన సముద్రం వడ్డుకు నడవాల్సి వచ్ఛేది. ఒక బస్సు మాత్రమే వడ్డు వరుకు వెళ్ళేది . ఇప్పుడు ఆటో లు కూడా వెళుతున్నాయి. దారిలో చాలా అప్పార్ట్మెంట్స్ కనిపించాయి. కొత్తపట్నం వూరు దాటి సముంద్రం వైపు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే కూర్చుని అట్లువేస్తున్న ఒకామెను చూసి, ఆటో ఆపమని అన్నాను. ఇలా రోడ్ పక్కన అట్లుఅమ్మేవాళ్లు మధ్యలో ఎక్కడ కనిపించలేదు.
ఆటో అబ్బాయి నన్ను చూసి, “ఇక్కడ వద్దులెండి మేడం! అట్లు అంత బాగుండవు. పంతులు మెస్ దగ్గరలోనే ఉన్నది . అక్కడ ఆపుతా, అక్కడ తినండి. అన్ని వేడి వేడిగా బాగుంటాయి ”అని చెప్పాడు.
నేనేమి మాట్లాడలేదు. ఎందుకంటే నేనెప్పుడో నా చిన్ననాటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. మా అమ్మ , ఆమ్మా , మాస్టారు గారి భార్య , ఆవిడా ఆడపడుచు రాఘవమ్మ గారు , ఇలా చాల మంది మా ఊరినుండి కలిసి ఆ, కా , మా , వై ( ఆషాఢం , కార్తీకం, మాఘం , వైశాఖం ) సముద్ర స్నానాల కు కొత్తపట్నం వెళుతుండేవారు. నేనెప్పుడూ వాళ్ళ మధ్యలో బుడంకాయ్య్లలే వెంటబడి వెళ్లేదాన్ని. వద్దంటే నానా గొడవ చేసేదాన్ని. ఆ గొడవ కంటే నన్ను వాళ్ళతో తీసుకెళ్లడమే మంచిదని మా ఆమ్మ అనుకోనేది .
కార్తీక పౌర్ణమి నాడు సముద్రస్నానాలకి వెళ్ళినప్పుడు, ఉదయాన్నే అయిదు, ఆరు గంటలకే సముద్రం చేరుకొని తొమ్మిది గంటల దాక సముద్రస్నానాలు చేస్తూ, ఇసుకలో ఆడుకొంటూ అలలవెంటే పరిగెడుతూ, గవ్వలు , నక్షత్ర చేపలను ఏరుకుంటూ గడిపేసేదాన్ని . పెద్దవాళ్ళ పూజలు అయ్యాక, వెనక్కి బయలుదేరేవాళ్ళం. నేను చిన్నదాన్నని మా ఆమ్మ నాకు ఇలాగె రోడ్డు పక్కనే అట్లు పొసే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అట్లు పెట్టించేది. ఎందుకో మరి నాకు ఆ అట్లు మా అమ్మ చేసిన అట్లకంటే కూడా చాలా రుచిగా అనిపించేవి.
అదే మాట మా అమ్మతో అనే దాన్ని. “అమ్మ ! పుల్లమ్మత్త అట్లు చాల బాగుంటాయి! నువ్వు కూడా ఆలా చేయరాదు! “అని. మా అమ్మ , అన్నయ్య పెద్దగా నవ్వేసేవారు. “ఆకలివేస్తే గడ్డయినా రుచిగానే ఉంటుంది” అని అన్నయ్య మొట్టికాయవేసేవాడు.
పంతులు మెస్ వచ్చింది . “మేడం! టిఫిన్ చేస్తారా!”అన్న పిలుపుతో ఈ లోకాం లోకి వచ్చిపడ్డాను మళ్ళీ.
“అలాగే అట్లు నువ్వు కూడా తిను” అని అన్నాను వాడితో.
వాడు “ఒక ప్లేటు పూరి కూర, ఒకప్లేటు అట్లు అంటూ నాకూడ ఆర్దర్రిచ్ఛేసాడు.
మళ్ళి సముద్రం వైపుకి ఆటో నడిచింది. నేను ఎంతసేపు కూర్చుంటే అంతసేపటిదాకా వెయిటింగ్ ఛార్జ్ ఇస్తానని వాడికి చెప్పాను సముద్రం తో కాసేపు అలా గడపాలనే . వాడు ఆనందంగా తలూపాడు.
కొత్తపట్నం సముద్రం వద్దకి చేరుకున్నాను. ఆటో అబ్బాయి అవసరమైనప్పుడు తన మొబైల్ కి కాల్ చేయమని చెప్పి , తుఫాన్ షెల్టర్ దగ్గరగా ఆటోని ఆపు కొని కూర్చున్నాడు.
********* ******* ****** ********
సముద్రం అలాగే ఉంది . నా చిన్నప్పటి లా గే. అదే చెలియలికట్ట , అదే దూకుడు, అదే ఘోష , కాలంతో పని లేనట్లు ఎగసిపడే అలలు , తామే కాలమని చెబుతున్నట్లనిపిస్తుంది . అలల ను తాకుతూ తీరం వెంబడే నడవటం మొదలు పెట్టాను. ప్రతి అలా నన్ను సృసిస్తూ నన్నుపలకరిస్తున్నట్లున్నది.ఇంకొంచం లోపలకు వెళ్ళాను పెద్ద అల ఒకటి నన్ను బలంగా తాకింది. నా కాలికింద మట్టిని లాగేస్తూ నన్ను ఆలింగనం చేసుకోవాలని చేతులు చాచినట్లనిపించింది. నేను అలల ఊపుకి పడిపోయాను. మళ్ళి లేచి నిలబడ్డాను. ఈసారి అలల తాకిడికి నిలదొక్కుకొని మళ్ళీ నిలబడ్డాను… అలలు పడుతున్నాయి , తిరిగిలేస్తున్నాయి అనంత కాలంలో అలుపెరుగని బాటసారిలా.ఇదే ఒక జీవన సత్యమనిపించింది
నాలో నేనే నవ్వు కున్నాను. అప్పటికే సగం తడిశాను. కాసిని నీళ్లు తలమీద చల్లుకొని తీరంవైపుకి నడిచాను. సముద్రం వడ్డున అంత సందడి లేదు. అది పుష్య మాసం. సముద్రస్నాలకు జనాలు అంతగా రారు. అక్కడక్కడా కొందరు జాలరి పిల్లలు ఆడుకొంటున్నారు.
నేను వాళ్ళ వైపుకి నడిచాను. “పిల్లలు! ఈ రోజు బడికి వెళ్ళలేద? “అని అడిగాను.
“లేదండి!”ఆ పిలుపులో ఎదో కొత్త నాగరికత కనిపించింది.
“మా టీచరు సెలవు పెట్టింది . ఈ రోజు మాకు పాటా లు జరగవు” .
“ఎందుకని?”
“మా జాలరి పల్లె కు రెండు కిలోమీర్ల దూరంలో ఒక బడి ఉంది. అక్కడ మాకు ఒకే టీచర్ ఉంటుంది. మేమంతా అక్కడికే వెళతాము.”
“అలాగ, మరి ఈ రోజంతా ఎం చేస్తారు”. సన్నగా పొడవుగా ఉన్న ఒక పిల్లా డు “మేమంతా సముద్రం పైకి పోతాము. ఇయాల అటు-పోతూ వస్తది. సముద్రం ముందుకి వెన్నకి జరుగుద్ది.” నాకు వివరం ఇచ్చాడు.
“ సముద్రం జరుగుద్ది”. ఈ మాటలు నేను ఎప్పుడో విన్నట్లనిపించింది. సముద్రపు హోరు నాకేదో గుర్తుచేస్తున్నట్లనిపించింది. కొద్దీ దూరం లో ఆ ఇసుకలో కూర్చుండిపోయాను. ఎన్నోవిషయాలు మనం గుర్తుంచుకోము. కొన్ని విషయాలు జ్ఞాపకాలుగా మన మనసులో ఎక్కడో నిక్షిప్తమై పోతాయి . అవి మనకు సంతోషం కలిగించవచ్చు…. కొన్ని బాధను మిగల్చవచ్చు.
అటుగా వేళ్ళు తున్న ఒక చిన్న పిల్లాడిని పిలిచాను ,”ఒరేయ్ ! బుడ్డోడా ! ఇట్రా !”
వాడు లగెత్తుకుంటూ వచ్చాడు. “నా పేరు బుడ్డోడు కాదండీ! నా పేరు రాగులండి!”
“రాగుల !”ఎక్కడో విన్నట్లున్నది.
“అవునండి . అది మాతాత పేరండి ! మా అయ్య నాకు ఆ పేరు పెట్టాడండి!” వాడేదో చెపుతున్నాడు. రాగులు నాకు గుర్తు కొచ్చాడు.
************ ************* *************
తెడ్డు తిప్పి తిప్పి బలంగా తయారైన భుజాలు , పిక్కల పైదాకా వేసుకున్న ఆకుపచ్చ ని క్కరు, ఎర్ర రంగు నెట్ బనీనువేసుకొని పోతపోసిన నల్లటి శిలా విగ్రహంలా ఉండే ఆటు పోటు తెలిసిన జాలరి రాగులు. సముద్రానికి వచ్చే వాళ్ళదగ్గర డబ్బులు తీసుకొని ఆలా కాసేపు సముద్రం పైదాకా తన పడవలో తిప్పుకొస్తుంటాడు. నేను కాలేజీ చదువుకొచ్చ్చినప్పటి నుంచి ఆలా సముద్రానికి పిక్నిక్ కు వెళ్లడం బాగా అలవాటు. అంతే కాదు ఎన్ ఎస్ ఎస్ ఆక్టివిటీస్ లో భాగంగా మేము జాలరి పల్లెలకు వెళ్లి వాళ్లకు విటమిన్ బిళ్ళలు , చిన్న పిల్లలకు వాక్సిన్లు ఇస్తూండేవాళ్ళం. అప్పుడు సరదాగా ఎవరైనా జాలరి కి డబ్బులిచ్చి పడవలో సముద్రం పైన అలలు పుట్టేదాకా వెళ్లి వెన్నక్కి వచ్చే వాళ్ళం.
కానీ రాగులు ఆలా కాదు. వాడికి ధైర్యమెక్కువ. వాడు చాల దూరం సముద్రం లోపలిదాకా తీసుకెళతాడు. ఆరోజు నేను ఒక్క దాన్నే పడవ ఎక్కాను. నాకు చాలా చాలా దూరం సముద్రం లోకి వేళ్ళలనిపిచింది. “రాగులు! నాకు ఇంకా పైదాకా సముద్రంలోకి వేళ్ళా లని ఉంది.
తీసుకెళతావా”. అని అడిగాను.
“ అమ్మాయ్ గారు ! నడిమింట సూరీడు నెత్తిమీదున్నప్పుడు సముద్రం శానా ఊపుమీదుంటాది. ముందుకి వెన్నకి జరుగుతాఉంటాది . శానా జాగరతగా కూకోవాలా పడవలో. లేదంటే, నేను నిన్ను మోసుకు రావాల్సి వస్తది.”
“ఏం పరవాలేదు. వెళ్దాం పద” అన్నాను . రాగులు పడవను నీళ్లలోకి తోసి నన్ను కూర్చోమన్నాడు. తరువాత నడుస్తూనే పడవను నడుములు పైదాకా అలలు వచ్చే వరకు తోసుకెళ్లి , ఒక్క ఉదుటున పడవలోకి ఏగిరి కూర్చొని , అతి వేగంగా తెడ్డు తిప్పడం మొదలు పెట్టాడు . వాడు పడవను నడుస్తూ తోసి నప్పుడు నాకు భయమనిపించలేదు. తెడ్డు వేస్తున్నప్పుడు పడవ అలలతో పోటీపడుతున్నట్లనిపించింది. చాల మెలుకువగా రాగులు పడవ ని తిప్పుతున్నాడు. అంతే వేగంగా పడవని తోస్తు పడవ మీదే సవారీ అన్నట్లు పెద్ద పెద్ద అలలు మీద మీద కు వస్తున్నట్లనిపించింది. నాలో భయం మొదలయింది. గట్టిగ కళ్ళు మూసుకున్నాను.
“ఏంటి భయమేస్తుందా ?” అని రాగులు విశాలంగా నవ్వాడు. “లేదు” అని బింకంగా అన్నానే గాని, వెన్నులో ఎక్కడో జలదరింపు వస్తున్నది. రాగులు పడవ మధ్యలో నిలబడి తెడ్డు వేస్తున్నాడు.
“నేను నీ వైపుకి వచ్చి కూర్చొన ” అని అడిగాను.
వాడు చాల తేలికగా “రామ్మా!” అని అన్నాడు.
నాకు భయం పోగట్టడానికి రాగులు కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు.
“అమ్మాయి గోరు! ఈ సముద్రం ఉండాదే , మహా గొప్పది. మడిసికి ఎప్పుడు పరిచ్ఛలు పెడతా ఉంటది. ఇలా మొదట్లోనే భయపెడతాది! ముందుకి వేళ్ళా మను కో అన్ని వింతలే. ఒక కొత్త పెపంచకము . అక్కడ అంత జలమే, ఇంకేమి అగుపడదు. అప్పుడనిపిస్తది ఈ సముద్రం మద్దెలో నువోక్కదానివే అని, భయమాడకు. ఈ తల్లేమీ చేయదు. అది గో ఆడ సూడు దూరంగా నీలాకాశం భూమి ని తాకుతున్నట్లనిపించటం లేదు. ఇదిగిదిదో ఇటు చూడు, దూరంగా, సముద్రపు కొంగల గుంపు ఎగురుతున్నాది . ఇవే మాకు అప్పుడప్పుడు దా రి చూపెడుతుంటాయి. నీటిలోకి సూడు. నీకేమి కనబడదులే! కానీ అప్పుడప్పుడు సొర మీను లు ఎగసి పడతా ఉంటాయి. సముద్రానికి మన పైన పెమ . అప్పుడు మన దగ్గరకి జరుగుద్ది పున్నమి నాడు, అమావాసనాడు సముద్రం పోటేట్టు త్తాది. నాతో కలిసి పడవలో వస్తుంటది. నాకట్ట శాన సార్లు అనిపించింది. మన మనసు తోటి సూడా ల ఈ సముద్రాన్ని”.
వాడి మాటలు నాకు ధైర్యానిచ్చాయి .
సముద్రాన్నే చూస్తున్నాను. అంతా నీరే. అంతటా నీరే . విశాలంగా ఉన్న సముద్రం. ఎన్నో రహస్యాలను తన అనంత మైన లోతులలో దాచి . మనషి యొక్క అస్థిత్వాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. మనిషేంత చిన్నవాడు. అణువులో అణువంత కూడా కాదనిపించింది. ఈ సముద్రానికి కోపమొస్తే , “ఆమ్మో! ఇంకేమైనా ఉన్నదా! మనిషేక్కడ మిగులుతాడు!”
“ఈ అనంతమైన జలాలలో నేను మాత్రమే కాదు, రాగులు కూడా ఉన్నాడు.
కానీ వాడు ఈ సముద్రం బిడ్డ. సముద్రం తో ఒక అవినాభావ సంభందం వాడికి ఉన్నట్లనిపించింది ”.
“అమ్మాయి గారు ! అట్టా సూడండి! సముద్రం రంగులు మారుస్తది . పొద్దున్నే నీలంగా స్వచంగా బాల సూరీడుతో ఆడుకుంటున్నట్లుంటది. మధ్యలో తెల్లగా మెరిసిపోతుంటాది. సూరీడ్ని సూస్తా . మిట్టమద్యాన్నం వేళా ఎన్నో రంగులు , నెమలి లాగా కనిపిస్తాది . అలలు ఎగసిపడుతూ ఉంటాయి ఆ సూరీడి కోసం నర్తిస్తాది. సాయం సంధ్య వేళ ఎర్రగామారుద్దీ కోపంగా, సూరీడ్నికోపంగా చూస్తున్నట్లుంటది. రాత్రి వేళ తారలన్నీ ఈ సముద్రం తో కబుర్లు సెప్పాలంటూ నేలమీదకు వచ్చినట్లుంటది. సెందురుడే మో అలిగి దాక్కున్నట్లుంటది అమవాస దినాన”.
చాల భావుకతతో రాగులు మాట్లాడుతున్నాడు.
“ఈ ప్రకృతిసౌందర్యాన్ని ఆస్వాదించడంలో కారెవరు అనర్హులు. భావుకత ఏ ఒక్కరి సొత్తు” కాదనిపించింది
అప్పటికే చాలా దూరం వచ్చేసాము. నిర్మలంగా ఏ కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రం మధ్యలో ఉన్నాను. ” వెన్నకి వెళదామా “ అన్నాను .
“అట్టాగే” అంటూ రాగులు పడవను వెన్నక్కి తిప్పాడు. ప్రశాంతగా ఉన్న సముద్రం, అలల మధ్యకొచ్చేసరికి తన నైజం చూపిస్తున్నట్లనిపించింది. అప్పటికే మధ్యాన్నం దాటిపోయింది. సముద్రానికి పోటు పెరిగింది. పెద్ధ పెద్ద అలలు పడవను ఊపేస్తున్నాయి. ఒక పెద్ద అల వచ్చి పడవమీద పడింది. పడవ కిందకు జారిపోయింది. రాగులి చేయ్యి కండరాలు బిగుసుకున్నాయి. అతి బలంగా తెడ్డు వేయడం మొదలు పెట్టాడు. అలలు నన్ను, పడవను పూర్తిగా తడిపేశాయి. “భయపడమా కమ్మాయి! ఇది మాకు అలవాటే. నీకు కొత్త కదా. కూసంత భయమేస్తది”. అంటూ చాకచక్యంగా పడవను తీరానికి చేర్చాడు .
రాగులికి కొచం ఎక్కువ డబ్బులే ఇచ్చాను. దానికే వాడెంతో తృప్తిగా “ఎప్పుడైనా సముద్రం కాడ కొస్తే నన్ను తలుచుకోండి అమ్మాయి గారు. వచ్చేస్తా. మీమ్మల్ని సముద్రమంత తిప్పుకొచ్చేస్తా”. అంటూ చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు.
************** *********** ********** ***************
“మేడం మీకు గవ్వలు కావాలా?”అంటూ రాగులు అడగడం వినిపించింది .
“మీరె క్కడ ఉంటారు”, అడిగాను ఆ చిన్న రాగుల్ని. వాడు దూరంగా ఉన్న వెదురు తోటల ఆవల ఉన్న కొన్ని పాకలు చూపించాడు.
“నేను నీతో వస్తాను మీ తాతను చూపిస్తావా?” అన్నాను. వాడు కాస్త అయిష్టంగా తలూపాడు .
“మరి గవ్వలు కొనుకుంటావా , నా కాడ శాన ఉన్నాయి గుడిసెలో”.
“ అలాగే పద “ అంటూ వాడి గుడిసెల వైపు నడిచాను. దారిలో పక్కాగా తమలపాకు తోటలు కనిపించాయి. పాకల దగ్గరికి చేరే కొద్దీ ఎండు చేపల వాసనా కూడా ఘాటుగా రావడం మొదలెట్టింది. నాకు కొంచం తల తిరిగినట్లనిపించింది .
ఒక పాక బయట బాగా పాత బడిన పడవ ఒకటి పెట్ట్టున్నది. అందులో బాగా ముసలివాడల్లే కనిపిస్తున్న ఒక వ్యక్తి కూర్చొని చుట్ట తాగున్నాడు.
“ఎరా రాగులు, అప్పుడే వచ్చావేంటి , గవ్వలు ఏరుకోడం అయిపో యినాదా లేదా ?” మల్లి పోతావ” అంటూ అడుగుతున్నాడు.
“ఈ మేడం గారెవరో మన పాక సూడాలంటేను తీసు కొచ్చ” అంటూ, ఆగ కుండా పాక లోకి లగెత్తాడు.
“మన పాకల్లో ఏముంటాయి “ అనుకొంటూ “ఎవరు?” అంటూ కాస్త కష్టంగా తల తిప్పి నా వేపు చూసాడు. వయసు మీద పడి , పడవ ను నడిపే శక్తీ లేక అలాగే ఆ పడవ లో కూర్చొని సముద్రానికి కబుర్లు చెబుతున్నట్లున్నాడు రాగులు. నేను గుర్తుపట్టినట్లు “మీరు రాగులే కదూ?” అన్నాను.
“అవును . నువెవ్వరు? ?
“చాల ఏళ్లనాటి మాట, మీతో సముద్రం మధ్యలోకి వచ్చానునేను”.
రాగులు తడబడి పోయాడు, తబ్బిబైనాడు.
“గుర్తు కోచ్ఛినాది నువ్వు కాలేజీ అమ్మాయివి కదూ. చాల పెద్దదానివయి పోయావు.”
“అవును రాగులు. నువ్వు కూడా తాతవైపోయావు”
“అమ్మాయి గారు సముద్రం తోనే ఉండే వాళ్ళం , మా వయస్సు, మా ఆయుస్సు అంతా సముద్రం లాగేసుకొని, సముద్రమైతే అలాగే ఉండి పోతది. మేము ఈ సముద్రం కాడే ఇలాగె రాలి పోతాము. “
చిన్న రాగులు కొన్ని గవ్వలు నా ఒళ్లోపోసి, పరిగెత్తుకుంటూ పోయాడు, పోతు అరిచి చెప్పాడు
”పది రూపాయలు మా తాతకు ఇవ్వండి”.
కొద్దీ సేపు అలాగే ఆ పడవ లో రాగులు పక్కనే కూర్చొని రాగుల్నే చూస్తూ అనుకున్నాను“భావుకత ఉన్న రాగులు వయసుతోపాటూ సముద్రం ఇచ్చిన అనుభవంతో పాటు “వేదాంతిలాగా మారాడని”
వేళ్ళు తున్న నన్నుచూసి రాగులు మనసారా నవ్వుకొంటూ “ ఇయ్యాల సముద్రమే నా కాడ కొచ్చింది” అన్నాడు. నేను వెన్నక్కి చూసాను చిరునవ్వుతో.
ధూర చాలా అందమైనది తెలివైనది కూడా.. కానీ మొహమాటస్తురాలు భయం కలది..
వీటి వలన మొహం ఎప్పుడు పొగరుగా ఉన్నట్లు కనిపించేది.. ఎవరైనా పలకరిస్తే మొహమాటం కొద్ది ఏమి సమాధానం చెప్పేది కాదు అది చూసి అందరూ గర్వం అనుకునేవారు ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి సింధూర పెరిగి పెద్దదవుతుంది…
ఒకసారి సింధూర అక్కతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.. వాళ్ళందరూ చిన్నప్పటినుండి తెలిసిన వాళ్లే కాబట్టి వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది.. వాళ్లు సింధూరం చూసి నవ్వలేదు వాళ్ళ అక్క మంజీరను చూసి అందరూ పలకరించారు . ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు..
” ఏంటి నేను వాళ్లను పలకరించాను కదా అయినా వాళ్ళు నాతో మాట్లాడటం లేదు ఏంటి” అని బాధపడిపోయింది సింధూర.
ఆ చుట్టాల వాళ్ళింట్లో చాలామంది ఉన్నారు..ప్రతి ఒక్కరూ మంజీరను పలకరిస్తున్నారు.. మంజీర కూడా గలగలా వాళ్ళతో మాట్లాడుతుంది ..చూడని వాళ్ళని కూడా పిలిచి మరీ పలకరిస్తుంది కానీ సింధూరకు అలా చేతకాదు.. ఒక మూల అలాగే కూర్చుంది విసుగు రాసాగింది….
ఆ తర్వాత వాళ్లు వాళ్ల ఊరికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి…
” అమ్మా! అందరూ అక్కనే పలకరిస్తున్నారు అక్కతోనే మాట్లాడుతున్నారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాతో ఎవరూ మాట్లాడటం లేదు నేను వాళ్ళను చూసి నవ్వాను కూడా అయినా కూడా నన్ను చూసి వాళ్లు ఏ మాత్రం స్పందించలేదు” అని ఏడ్చింది సింధూర.
వాళ్ళ అమ్మ సింధూరను దగ్గరికి తీసుకొని..
” వాళ్లకు నువ్వైనా అక్కయినా ఒకటే కానీ అక్క అందరిని చూసి నవ్వుతుంది పలకరిస్తుంది అందుకనే వాళ్లందరూ అక్కతో మాట్లాడతారు” అన్నది సింధూర వాళ్ళ అమ్మ.
” నేను కూడా వాళ్లను చూసి పలకరింపుగా నవ్వాను అయినా వాళ్ళు నన్ను చూసి మాట్లాడలేదు” అన్నది సింధూర.
” నువ్వు నవ్వాను అనుకున్నావు కానీ నవ్వలేదు ఎప్పుడు మొహం చిటపటలాడినట్లే పెట్టుకుంటావు అందుకనే ఎవ్వరు నిన్ను మాట్లాడించడానికి జంకుతారు నిన్ను చూసి నీకు గర్వం అనుకుంటారు” అన్నది సింధూర వాళ్ళ అమ్మ.
కొంచెం ఆలోచనలో పడింది సింధూర.. అలా తిరుగుతున్న కొద్ది అక్కను పలకరించేవాడు కానీ తనతో మాట్లాడే వాళ్ళు తక్కువ అయ్యారు..
స్కూలుకు వెళ్లిన తర్వాత కొంచెం తనకు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో హ్యాపీగానే మాట్లాడేది కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మొహం చెల్లేది కాదు.. గదిలోపలికి వెళ్లి కూర్చునేది.
స్నేహితులు మాత్రం సింధూరతో బాగా చదువుగానే ఉండేవాడు “నువ్వు ఎంతో అందంగా ఉన్నావే “అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు.
కానీ నేను బంధువులకి ఎందుకు నచ్చడం లేదు వాళ్ళు ఎవరూ నన్ను నువ్వు బాగున్నావు అని ఎప్పుడూ అనరు అన్నిట్లో అక్కనే మెచ్చుకుంటారు అని బాధపడేది.
కొన్నాళ్ళకు పదవ తరగతి లోకి వచ్చింది. సింధూరను చూసిన వాళ్ళు ఆమెతో నేరుగా మాట్లాడటానికి జంకె వాళ్లు మగ పిల్లలైతే చాలా భయపడేవాళ్లు అది ఆమెకు ఒక విధంగా మంచిదే అయింది కానీ పరోక్షంగా పేరు లేకుండా ఉత్తరాలు రాసేవాళ్ళు. అది ఇంకా చిరాకు వచ్చేది సింధూరకి.
ఇవన్నీటిని దాటుకుని సింధూర కాలేజీకి వచ్చింది అప్పుడు తాను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండాల్సి వచ్చింది.. కూపస్త మండుకంలా ఉండే సింధూర కొంచెం బయట ప్రపంచంలోకి వచ్చింది. కొత్త మనుషులు కనపడసాగారు.
అయినా కూడా బంధువుల ఇంట్లో ఒక మూల కూర్చునేది మాట్లాడకుండా..
అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మహిళ వరసకు పిన్ని అవుతుంది ..
” అక్కడ ఒక్కదానివి ఎందుకు కూర్చుంటావు ఇలా రా నాతో మాట్లాడుదువు గాని “అని వంటింట్లోకి పిలిచేది
వాళ్ళ ఇంట్లో కూడా వచ్చి పోయే బంధువులకు తక్కువేమీ కాదు. ఇంకా అందరి చూస్తే మొహమాటంగా భయంగా ఉండేది.. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పిన్నితో మాత్రం మొహమాటం పోయి చాలా చనువుతో మెలగసాగింది… ఆమె కూడా ఎన్నో విషయాలు సింధూరతో పంచుకునేది వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది కానీ మళ్ళీ కొత్తవారితో అదే బెరకు.
తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో వేరే ఇంట్లో ఉండసాగింది అమ్మ ఎక్కువగా ఊరికి వెళ్లేది కానీ నాన్న ఉండేవారు అక్కడ. ఆ పక్కనున్న వాళ్ళు చాలా బాగా మాట్లాడించేవారు..
” ఎంతో బాగుంటావ్ సింధూర నువ్వు” అనేవాళ్ళు.
అప్పుడు సింధూరపు వాళ్లు తనని ఎగతాళి చేస్తున్నారేమో నేను బాగుండడం ఏంటి! చిన్నప్పుడు బంధువులలో ఎవరు నన్నుఇలా అనేవాళ్ళు కాదు అని ఆలోచించేది.
తర్వాత పక్కన ఒక కుటుంబంతో స్నేహం ఏర్పడింది ఆమె పేరు వసంత ఆమెను అక్కా అని పిలుస్తూ ఎంతో చనువుగా ఉండేది సింధూర..
వాళ్ళ ఇంటి ముందు ఎవరైనా వెళుతుంటే “అక్కా! ఆ అమ్మాయి ఎంత బాగుందో కదా “అనేది.
అప్పుడు వసంత సింధూరతో అనేది..
” సింధూరా! నువ్వు ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అంటావు కదా నువ్వు ఎంత బాగుంటావో నీకు తెలుసా” అని అన్నది.
” నిజమా అక్కా! నేను బాగుంటానా! అందరూ అంటుంటే ఈ మధ్య ఎగతాళి చేస్తున్నారేమో అనుకున్నా” అన్నది సింధూర.
” నువ్వు అందంగా ఉంటావు తెలివిగల దానివి కానీ ఒక్కటే తక్కువ అది ఏంటంటే నీ మొహంలో నవ్వు కొత్తవారిని చూడగానే బిగుసుకొని పోతావు.. దగ్గర వాళ్లతో చాలా బాగుంటావు చూడు ఇప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావ్ ఎంత బాగా అనిపిస్తున్నావో” అన్నది వసంత.
” అచ్చం మా అమ్మ కూడా నీలాగే చెప్పింది అక్కా!” అన్నది సింధూర.
అప్పటినుండి ఎవరైనా కనిపిస్తే నవ్వడం నేర్చుకుంది పలకరించడం కూడా అలవాటు చేసుకుంది అప్పటినుండి ఆమె మొహం తీరే మారిపోయింది ఎంతోమంది ఎంత బాగా నవ్వుతావు నీ మొహం లో ఎంత కళ ఉంది అనే వాళ్ళు.. అప్పటినుండి అనుకుంది “ఒక నవ్వు లేకుంటే మనిషి మొహం మాడిపోయినట్లే ఉంటుంది కదా “అని..
ఆ తర్వాత పెళ్లి అయ్యి బాధ్యతలు లోబందీ అయిపోయింది అప్పుడు కూడా తన నవ్వు మాత్రం చెరగనీయలేదు.. ఎన్ని సమస్యలు వచ్చినా అందరితో మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండడం నేర్చుకుంది ఆమె అందం ద్విగుణకృతమైంది..
అలా వయసు పెరుగుతూనే ఉంది వృద్ధాప్యం కూడా వచ్చింది కానీ అందరూ ఈ “వయసులో కూడా ఇంత బాగా ఎలా ఉన్నావ్” అని అడుగుతుంటే తనకు తనే ఆశ్చర్యం అనిపించేది చిన్నప్పుడు తనను ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఈయలేదు ..వయసు పెరిగిన కొద్దీ బాగున్నావు అని అంటున్నారు అంటే అది తన ముఖంలోని చిరునవ్వు మాత్రమే కారణం.
మనిషి ఎంత అందంగా ఉన్నా ముఖంలో స్వచ్ఛమైన నవ్వు లేకపోతే వెలవెలబోతుంది కళాహీనంగా ఉంటుంది అది తెలుసుకున్న సింధూర ఆ నవ్వును తన నుండి దూరం చేసుకోలేదు.
“శ్వేతా ,ఏమిటే ఇంట్లో హడావుడి? ఇవాళ నీ పెళ్లి చూపులా ?అయినా ఈ రోజుల్లో కూడా ఇలా ఇంట్లో పెళ్లిచూపులు ఏవిటి? హాయిగా నువ్వు,ఆ అబ్బాయి ఎక్కడైనా బయట కలుసుకుంటే సరిపోతుంది కదా?”అడిగింది వర్ష చక్కగా ముస్తాబవుతున్న తన స్నేహితురాలిని .
“నువ్వు చెప్పింది నిజమే వర్షా. శరణ్ కూడా అదే అడిగాడు నన్ను ఫోన్లో, ‘ఇప్పుడు మా అమ్మ వాళ్ళూ , నేనూ అందరం కట్టు కట్టుకొని మీ ఇంటికి రావడం అవసరమా’అని. ‘అవసరమే’ అని చెప్పాను నేను,” జవాబు ఇచ్చింది శ్వేత.
“అదే, ఎందుకు? నువ్వు ఏదైనా బాగా ఆలోచించే చేస్తావనుకో, దీని వెనుక నీ ఆలోచన ఏమిటా అని ,”కుతూహలంగా అడిగింది వర్ష.
“నిజమేనే నువ్వు చెప్పింది. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను మాత్రమే వెళ్లి తనను బయట ఎక్కడైనా కలిస్తే కేవలం అతని భాహ్యరూపాన్ని చూడగలను,ఎందుకంటే ఏ రెస్టారెంట్ లోనే ఉన్నప్పుడు మనం చాలా వరకు,
మీ అలవాట్లు ఏంటి? ఇష్టాలు ఏంటి ?అని మాట్లాడుకున్నా అందులో ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయో తెలియదు. అదే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మొత్తంగా వాళ్ళ కుటుంబం ఆలోచనా విధానం కాస్తైనా మనకు తెలుస్తుంది అనిపించింది.పెళ్లంటే కేవలం ఒక వ్యక్తి కాదు కదా! రెండు కుటుంబాల కలయిక అవ్వాలి కదా!”చెప్పింది శ్వేత.
“అందుకేనే నువ్వంటే నాకు ఇంత ఇష్టం. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి, దాని మంచి, చెడు విశ్లేషిస్తావు. మంచి నిర్ణయం తీసుకుంటావు,” స్నేహితురాలిని పొగడకుండా ఉండలేకపోయింది వర్ష.
” సరే, సరే, నువ్వు భజన ఆపు. వాళ్ళు వచ్చినట్లున్నారు. ఈ అనుభవం నాకూ కొత్తగానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో,” ఫ్రెండ్ నోటికి తాళం వేసింది శ్వేత.
**************
“రండి, రండి, మీ అమ్మాయీ, అల్లుడూ రాలేదా?” శరణ్ కుటుంబాన్ని ఆహ్వానించారు శ్వేతా తండ్రి దశరథ్.
” లేదండీ ఆదివారమే అయినా మా అమ్మాయికి అసలు తీరికే ఉండదు. వారం మొత్తంలో మిగిలిపోయిన పనులన్నీ ఈ రోజే కదా చేసుకునేది,”సమాధానం ఇచ్చింది శరణ్ తల్లి సంధ్య.
అందరూ మాట్లాడుకుంటున్నారు. టీలు టిఫిన్లు కార్యక్రమం అంతా సినిమాలో చూపించినట్లు ప్రశాంతంగా గడిచిపోయింది. ఇందులో శ్వేత చెప్పిన ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోవడం ఎక్కడ ఉంది ?అందరూ నటించేస్తూనే ఉన్నారే, అనుకుంది మనసులో వర్ష.
శ్వేతా, శరణ్ విడిగా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఇక భోజనాల సమయం అయింది. శ్వేతా వాళ్ళ అమ్మ రవళితో పాటు తనూ వంటగదిలోకి వెళ్లి భోజనాలు ఏర్పాట్లు అన్నీ దశరథ్ గారు కూడా చేస్తుంటే కాస్త ఆశ్చర్యంగా చూశాడు శరణ్.
” వంటలన్నీ చాలా బాగున్నాయి. శ్వేతా నీకు వంట వచ్చా? మా వాడు మంచి భోజనం ప్రియుడు అసలే,” అంది సంధ్య.
“ఆ, మా శ్వేతకే అన్న మాటేమిటి? మా అబ్బాయి ధీరజ్ కూడా వంట చేయడం బ్రహ్మాండంగా చేస్తాడు. అంతెందుకు దశరథ్ కి కూడా చాలా వంటలు వచ్చు,” చెప్పింది రవళి గర్వంగా.
“ఏంటి ఇంట్లో మగవాళ్ళందరి చేతా వంట చేయిస్తానని గర్వంగా చెబుతున్నారు? మా ఇంట్లో మగవాళ్ళకి కూర్చున్న చోటికి మంచినీళ్లు కూడా అందించాలి తెలుసా?” అదేదో చాలా గొప్ప విషయం అయినట్లుగా చెప్పింది సంధ్య.
ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తేరుకుని నెమ్మదిగా అడిగింది రవళి,”అదేమిటి వదినగారూ? మీరు నాలాగే ఉద్యోగం చేస్తున్నారని విన్నాను?”
“ఔనండీ,నేను బ్యాంకు మేనేజర్ గా చేస్తున్నాను. అయితే మాత్రం? ఇంటి బాధ్యత అనేది ఆడవారిదే కదా? నేను ఇంటా,బయటా అన్ని పనులు సమర్థవంతంగా చేసుకోగలను. మా అమ్మాయికి కూడా అదే నేర్పించాను. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐనా, ఇంట్లో పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది. ఇక మిగిలిపోయిన పనులు వారాంతంలో చేసుకుంటుంది. అయినా,అందుకే కదా మన ఆడవాళ్ళని ‘మల్టీ టాలెంటెడ్ మహారాణి, అని పొగిడేది,” చాలా గర్వంగా జవాబు ఇచ్చింది సంధ్య.
” ఎవరండీ అన్నదా మాట? అయినా అదేమన్నా గొప్ప బిరుదు అనుకుంటున్నారా? ఆ ముళ్ళ కిరీటం మన తలపై పెట్టి మగవాళ్ళు ఎంచక్కా మనల్ని (ఆడవాళ్ళని) వెర్రి వాళ్ళని చేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్లంతా దానిని మోస్తూ, ఎన్ని తరాలైనా మార్పు లేకుండా ఆడవాళ్లకు తప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు” ఆవేశంగా మాట్లాడుతోంది రవళి.
“మమ్మీ, ఎందుకంత ఆవేశం?” తల్లిని ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించింది శ్వేత.
” అలా చెప్పమ్మా, మా ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది, మీ అమ్మ అంత కోపంగా సమాధానం చెప్పడానికి?” భార్యకి వత్తాసు పలక పోయాడు శరణ్ తండ్రి వినోద్.
“ఆవేశం కాదులే బుజ్జీ, ఇది ఆవేదన. రెండు తరాల ముందు వరకు ఆడవాళ్లు ఇంట్లోనే ఉండేవారు. భర్త సంపాదించి తెస్తే ఇంట్లో అన్ని పనులు చూసుకునేవారు. పైగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఇంట్లో ఉండే ఆడవాళ్ళంతా కలిసి పని చేసుకునేవారు. అప్పుడు ఎవరికీ ఎక్కువ శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు? ఆర్థిక అవసరాల మూలానో సమానత కోసమో ఆడవాళ్లు మగవారితో సమానంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు, ఇంట్లో పనిని సమానంగా పంచుకోవాలి కదా ఈ మగవాళ్ళు,” అందరికీసి చూసింది రవళి.
“మీ ఇంట్లో లాగా అందరి ఇళ్లల్లో అలవాటు ఉండదు కదా ఆంటీ?” అడిగాడు శరణ్ .
“ఔను బాబూ,నిజమే. ఏ పనైనా, ఏ అలవాటైనా, ఎక్కడో అక్కడ మొదలవ్వాలి కదా? ఈరోజు అలవాటు లేదు కనుక రేపు చేసుకోను అంటే కుదరదు కదా? మన జీవితంలో చాలా అలవాట్లు వయసుతో పాటు మార్చుకుంటూ ఉంటాం. ఇదీ అలాగే. ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు మొదలుపెట్టాలి కదా!” సర్ది చెప్పబోయాడు దశరథ్
“ఔను శరణ్, నువ్వు చెప్పేది నిజమే. అలాగే అంకుల్ చెప్పేది కూడా నిజమే. అలవాటు ఎక్కడో చోట మొదలుపెట్టాలి కదా! ఇందులో తప్పంతా మగవారిదే అని చెప్పలేను. మీ అమ్మ లాంటి,అక్క లాంటి ఆడవారిలో పరివర్తన రావాలి ముందు. ఆవిడా, నేనూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళమే. కానీ ఈ మల్టీ టాస్కింగ్ అనే భ్రమలో ఉండిపోయి ఆవిడ చూడు నాకన్నా ఓ పది సంవత్సరాలు పెద్దదానిలా ఉన్నారు.బుజ్జి చెప్పింది ఆవిడకి బీపీ, డయాబెటిస్ అన్నీ ఉన్నాయి అని. అవన్నీ ఇంత త్వరగా ఎందుకు వచ్చాయి ?కావలసిన దానికన్నా ఎక్కువ స్ట్రెస్ టెన్షను తీసుకోవడం వల్లనే కదా?మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మీ అమ్మ ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటే మీ నాన్నగారు కూర్చొని ఆర్డర్లు పాస్ చేస్తూ ఉండడం చూస్తూ పెరిగిన మీరు అలాగే తయారై ఉంటారు కదా?”రవళి మాటలకు ఆలోచనలో పడ్డాడు శరణ్.
“ఔనాంటీ మీరు చెప్పింది అక్షరాల నిజం. మా స్నేహితులలో కూడా చాలామంది ఇళ్లల్లో అమ్మలు మాత్రమే వంటగదిలో ఉండి, నాన్నలు ,మిగతా కుటుంబ సభ్యులూ అదీ తమకు సంబంధం లేని అంశంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల అదే సహజం, ధర్మం అని అనుకున్నాను కానీ దీని గురించి ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు. కనీసం మా తరం నుంచి అయినా మగవారిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది అని ఇప్పుడే అర్థం అవుతోంది. ఈరోజు నుంచి మా ఇంట్లో అమ్మకు వంటగదిలో, ఇంటి పనుల్లో తప్పకుండా సాయం చేయడం అలవాటు చేసుకుంటాను. అంతేకాదు, మా బావగారికి కూడా ఈ విషయంలో కాస్త అవగాహన కలిగించి, మా అక్క కూడా మా అమ్మలా త్వరగా అనారోగ్యం కొని తెచ్చుకోకుండా చూస్తాను,”మనస్ఫూర్తిగా చెప్పాడు శరణ్.
“నిజమేరా శరణ్, రవళి గారు చెప్పినట్లు ఇందులో నా తప్పు కూడా చాలా ఉంది. నేనే కాదు నాలాంటి చాలామంది ఆడవాళ్ళలో ముందు పరివర్తన రావాలి. కుటుంబ ఆర్థిక భారాన్ని ఆడవాళ్ళం పంచుకుంటున్నప్పుడు పనిభారాన్ని కూడా అలాగే పంచుకోవాలి. అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి. అలా కనీసం మా పిల్లలనైనా సిద్ధం చేయకపోతే ముందు ముందు కాలంలో వివాహాలు నిలబడవు. ఈరోజు కాదు,ఈ క్షణం నుంచే నేను మారుతున్నాను. శరణ్ భోజనాలు అయిపోగానే మేము, పెద్దవాళ్ళంతా రెస్ట్ తీసుకుంటాము. టేబుల్ అంతా నీట్ గా సర్దేందుకు శ్వేతకి నువ్వు సాయం చెయ్యి. నాకు కాబోయే కోడల్ని కష్టపెట్టకు అర్థమైందా?” సీరియస్ గా అంటున్న సంధ్యని చూస్తూ సరదాగా నవ్వేసుకున్నారు అందరూ.
“చాలా బాగుంది శ్వేతా .నువ్వు చెప్పినట్లు ఈ పెళ్లిచూపుల తతంగం వల్ల ఈరోజు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్,” చెప్పింది వర్ష.