దానములన్నిటికన్న రక్తదానం మిన్న. ఎందుకంటే రక్తదానం వలన ఒక నిండుప్రాణం కాపాడవచ్చు. అట్లాగే అవయవ దానం నుండి కూడా. మిగిలిన ఏ దానములలోనైనా, ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశముండదు. అందుకని అన్ని దానములలో కన్నా ఈ రెండు దానములే శ్రేష్టం. ఈరోజు మనం రక్తదానం గురించి తెలుసుకుందాం.
అసలు రక్తం దేనితో తయారవుతుంది. ఇది ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అనే వాటి కలయికతో కూడి ఉంటుంది. ఎర్ర రక్తకణాలు శరీరావయవాలకు కావాల్సిన ప్రాణవాయువును అందిస్తే, తెల్ల రక్తకణాలు రోగ నిరోధకతను పెంపొందిస్తే, ప్లేట్ లెట్స్ రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్త కణాలు ఎముక మూలుగు లేక మజ్జ (Bone marrow) నుండి తయారవుతాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులైతే, తెల్ల రక్తకణాలు- వాటి రకాన్ని బట్టి జీవితకాలం మారుతుంది. జీవితకాలం దాటిన రక్తకణాలు నాశనమై, కొత్త రక్తకణాలు రక్తంలో చేరుతుంటాయి.
ఏదైనా కారణము వలన శరీరంలో రక్తస్రావమైనా (ఉదాహరణకు స్త్రీలలో వచ్చే నెలసరి, ప్రసవము, పెద్ద ప్రేవుల క్యాన్సర్, కొన్ని రకాలైన నులిపురుగులు… మొదలగు సందర్భాలలో జరిగే రక్తస్రావము), శరీరంలోని రక్త పరిమాణం (5L) తగ్గకుండా శరీరం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్లాస్మా పరిమాణం తగ్గకుండా, కణాల నుండి నీరు రక్తంలో చేరుతుంది. అలాగే బోన్ మేరో ఎక్కువ పనిచేసి రక్తకణాలను అందిస్తుంది. ఆ రకంగా, రక్తం ద్వారా అవయవాలకు అందే ప్రాణవాయువు పరిమాణం తగ్గకుండా జాగ్రత్తపడుతుంది శరీరం. దీనికి కొంత సమయం పడుతుంది.
కాని కొన్ని సందర్భాలలో (రోడ్డు ప్రమాదాలు,శస్త్ర చికిత్సల్లో మరియు ప్రసవ సమయాల్లో కాంప్లికేషన్స్ తలెత్తితే), రక్త పరిమాణము పెంచే సమయం శరీరానికి తగినంత లేకుంటే, రోగి షాక్ లోకి వెళ్లి మరణించే అవకాశాలెక్కువ. అటువంటి సందర్భాలలో, రక్తమార్పిడి రోగి ప్రాణాలను కాపాడుతుంది. అలాగే రక్తకణాలు తొందరగా విచ్ఛిన్నమయ్యే తలసీమియా, హిమోఫిలిక్ రోగుల్లో, రక్త కణాలు సరిగ్గా తయారవ్వని ఎప్లాస్టిక్ ఎనీమియా రోగుల్లో మాటిమాటికీ రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది.
అయితే ఈ రక్తదానం చెయ్యడానికి అర్హులెవరంటే… 18- 65 సంవత్సరాల మధ్య ఉన్న ఆరోగ్యవంతులైన స్త్రీ పురుషులు. హిమోగ్లోబిన్ శాతం స్త్రీలకు 12.5%, పురుషులకు 13% తగ్గకుండా వుండాలి. వారికి ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు. (ముఖ్యంగా హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు కొన్ని రకాలైన సుఖ వ్యాధులు). దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 45 కేజీల కన్నా తక్కువ బరువు ఉన్నవారు, రక్తదానము చేయడానికి అనర్హులు. రక్తదానానికి, రక్తదానానికి మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలి.
రక్తదాత నుండి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరించి, హెచ్ఐవి, హెచ్.బి.వి, హెచ్.సి.వి. మరియు సిఫిలిస్ వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక, ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకులో అలాగే (Whole blood), 4°C వద్ద ఏడు వారాల వరకు నిల్వ ఉంచవచ్చు. లేనిపక్షంలో ఆ రక్తాన్ని, ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ (ఏడు రోజుల వరకు), ప్లాస్మా (ఫ్రేజెన్ ప్లాస్మా: -20°C వద్ద కొన్ని సంవత్సరాలు)… యిలా వేరు చేసి దాయవచ్చు. రక్తహీనత ఉన్నవారికి ప్యాకెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నవారికి (ఉదాహరణకు డెంగ్యూ జ్వరం) వాటిని, ఆటోయిమ్యూన్ డిసీజ్ ఉన్నవారికి ప్లాస్మాను అందిస్తారు. రక్తాన్ని సంగ్రహించాక మాత్రమే పరీక్షలు చేస్తారు. ఒకవేళ పరీక్షల్లో ఏ వ్యాధి అయినా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆ రక్తాన్ని ఉపయోగించరు.
రక్త మార్పిడి చేసేముందు, రోగికి ఆ రక్తం సరిపోతుందా లేదా అనేది బ్లడ్ గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్షలు చేసి నిర్ధారించుకుంటారు వైద్యులు. O, A, B, AB అనే నాలుగు రకాల రక్త గ్రూపులు, వాటిలో Rh పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. “O నెగిటివ్” రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ డోనార్స్” అంటారు. “AB పాజిటివ్” వ్యక్తులకు ఎవరి రక్తాన్నైనా ఇవ్వవచ్చు. వారిని “యూనివర్సల్ రెసిపియంట్స్” అంటారు.
రక్తదానం చేసిన వారికి ఏ రకమైన ఇబ్బందీ, తలెత్తదు. ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాక, మామూలుగా విధులు నిర్వర్తించుకోవచ్చు. ముందే చెప్పుకున్న ప్రకారం, దానం చేసిన రక్తాన్ని దాత శరీరం కొద్ది కాలంలోనే సమకూర్చుకుంటుంది.
ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహించి, రక్తాన్ని సేకరించి, అవసరమైన వారికి అందిస్తూ, మానవ సేవను చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా ఆ సేవలో పాల్గొందాం రండి.
వ్యాసాలు
గీసందెందుకొ మాయింటి మీద జీవ్వడ్డది…
“మస్తు రొజులైతుంది ఒకపారి ఒచ్చిపొ అవ్వ’… అని మా అమ్మ….
ఇల్లంత శీకటి శీకటి ఐతుంది … ఎప్పుడొస్తవవ్వా … మా బాపు…
యేమన్నగాని… గీసారి ఇంటిక్వోవాలని తీర్కజెస్కొన్మరి వొయ్న.
గూటిక్వోతనన్న ముర్పెంల నిద్ర గూడవట్టలే సక్కగ…
ఎప్పట్లెక్కనే పొద్దుగల్లనే లేష్నా…. గిన్ని పాలబోట్లు దాగి బైలెల్లిన.
ఎర్రబసెక్కుడే ఎర్కలేదు మా బాపే తోల్కపోతుండే.. బండి మీద..
యేం శితం జనం….
ఉష్కెవోస్త రాల్నంత మంది..!!! యిండ్లల్ల ఓల్లుంటలేరా అన్పిచ్చింది….
గప్పట్ల చర్చికి వోయ్నప్పుడు జూష్నది యాదికోచ్చింది.
గీ ఫ్రీ బస్సు పుణ్యమేందో గానీ… ” స్త్రీలను గౌరవించాలి ” అన్నమాటకే కర్వైపోయింది…
యెట్లనో గట్ల తిప్పల్వడి మా పల్లెకు జెర్కున్న…. అమ్మయ్య…!!! పానమేంత నిమ్మలమైందో…
అచ్ఛేటప్పట్సంది బస్సు దిగకముందె మా బాపు ఫోన్ల మీద ఫోన్లు జేస్తుండు…. నేనెక్కిచ్కస్తనవ్వా….. ఏం నడుస్తవని…! నేన్జెప్పలే ఇగ,… మస్తు రొజులైంది గట్ల గట్ల శేన్లల్లకెంచి సూస్కుంటొద్దామని ఇక్మత్ జేశ్న…!
……గిది మావూరేనా….!!? పక్కూర్ల దిగిన్న…?!!
గిదేందీ గిట్లుంది…
బండి దిగంగనె శెట్లన్నీ ఆర్తిచ్చినట్లన్పిచ్చు….గిడ కాన్గ శెట్లు, బూర్గుబుడ్ల శెట్లు ఉంటుండే… ఎవ్వి గన్పిస్తలే… కొట్టేశ్నట్టున్రు…. గప్పట్ల ఉస్కుల్కెంచి ఒస్తుంటే గా బూర్గు బుడ్డెలు ఎర్కోని మంచిగ ఎండవెట్టి , ఎల్దుర్తి ల లచ్చింపతి దుకాన్ల అమ్ముతుంటిమి…. షేటాక్కు ఐదు రూపాలిస్తుండే… గవ్వే గల్లగుర్గిలల్ల ఎస్కోని పైసల్ జమాజేసుకుంటుట్టిమి.
…..మస్తెండ గొడుతుంది..బాపుకు జెప్పిన అయిపోవు అన్పిచ్చింది.
“నిండ మున్గినంక సలేంది’…. ఓచ్చిన ఒడ్షిపోయింది.. గీయింత దూరం నడ్వలేనా…
శిన్నగున్నప్పుడు నాకంటె బర్వుండే బ్యాగేస్కొని ఇస్కుల్కు గింత కంటె ఎక్వ దూరమే నడ్షి పోతుంటిమి గిదెంత…!!
గొర్ల కొట్టాలు దాటంగనె….మా మామొల్ల పొలము…,ఆడనే కోల్ల పారముంటుందే మాడి శెట్టుంటుండే….,
పారముంది గని మాడి శెట్టు లేదు.. అయ్య!!..గది గూడ కొట్టేశిన్రా….!!?
మాడితొక్కు ఎట్ల పెట్కుంటున్నరో యెమొమరి.. పిఠాన పిరమునయీడ్కె బైట!!
ఒక్క పిట్ట కానోస్తలే.. కాకులు గూడ లేవు… గూల్లల్ల వన్నయేమో తియ్ ఎండమస్తు కొడ్తుంది…
కుస్తోల్లిండ్లల్లకచ్చిన…. మా తాతోలిల్లొచ్చింది గాళ్లనట్కాంచి మా ఆడకట్టుకు జెర్కున్న ఇగ….
మా శిన్నమ్మ… మయింటిపొంటి అత్తమ్మ అందర్గుసోని బీడీలు జేస్తుండ్రు…
“గిప్పుడే ఆస్తున్నవా… ఎట్లున్నవు.. ” యేమమ్మ గట్ల ఒట్టిశాపోలయినవు… కూడు సక్కగ తింటలేవా’…?? అనుకుంట అడిగిన్రు .. ఇంకిత సేపుంటే మల్లేడ లగ్గం గిగ్గం అనంటరేమొనని జెల్ది ఇంట్లక్వొయ్న!!!!
” మావ్వ రానే ఓచ్చింది… మావ్వ మావ్వ…!!! ఎండలోచ్చినవు…. షెప్పొద్దావ్వా….?!!నేనస్తుంటి గదా….
“ఓచ్చిన గదనే…! నాక్మనూరు దెల్వకనా…
యేమ్మా …?!! అనిగ మామ్మను మా బాపు ను మస్తుగ్గగాలిచ్చకున్న…
యెప్పుడెల్లినవో… బుక్కేడు మెత్కులు ఎస్కున్నవొ లేదో… నీకిష్టమని పప్షార్వెట్టిన ‘
ఇగ ఇంట్లక్వోయి కాల్జెతులు గడ్కొని పప్షార్తొటి ఇన్ని మెత్కులల్లిన…
తిని గట్ల ఒర్గిన .. గప్పుడే నా సప్పుడిని మా పెద్దమ్మొచ్చింది… మా పెద్దయ్యకు… పెద్దమ్మకు..మస్తిష్టం నెను… పానం జేస్తరు నన్ను…
ఇగ సాయింత్రం ఆలు కల్లు తెచ్చుకుండ్రు తాగుతున్నరు సీరియల్ జూస్కుంటా…
“మా పెద్దమ్మంటుంది..
“గిప్పుడు గింత షానిగున్నవు గని.. నువ్వు శిన్నగన్నప్పుడు కప్పను పట్కొని పిస్కుతుంటివి.. బాపులతోనే కల్దుకాన్లకు పోతుంటివి..బజ్జీలు ఇప్పిచ్చేదాకా ఊకుంటుట్వ బిడ్డా….. ఆన్కుంట నౌతుండ్రు….!!
అంబటాళ్లకు లేష్న… మంచిగ… అమ్మగూడ లేపలే…
లేవంగనే బంగ్లమీద్కి వోయి తిర్గుకుంట పండ్లు తోముకుంటున్న …
మెట్లెక్కంగనే… సక్కగ సూస్తే.. మా మల్లన్న గుట్ట కన్పిస్తది… పక్కకే శేన్లు ఉంటయి…
మంచిగ పిట్టల సప్పుడ్కే లేస్తుండే…. గిప్పుడు ఒక్క పిట్టె కానొస్తలే…
బాపు పొలం కాడికి పొయ్యోస్తా అన్నడు…
నెంగూడ ఒస్తానే బాపు అని పొయ్న…
మా బాయికాడికి పోతుంటే రెండు కొబ్బరిశెట్లుంటుండే ఒక్కొపారి గా బొండాలు కొట్కొని పోతుంటిమి… గాడా బీడుంటుండే గిప్పుడాడా నాట్లేశిన్రు…
మా బాయి పక్కకే మా శేను..మాది పొత్తుల బూమి…. మాగమామసకు ఒంటలక్వోతుంటిమి ఆడ్కే …
మాబర్రెలు గట్టేశే కాన్గ
శెట్టుకుయ్యాల కట్కున్నము…అదింక గట్లనే ఉంది….
మా శేన్లల్లకు పోతుంటే మస్తు శెట్లుంటుండే… గవన్నీ లేనేలేవ్…
గప్పట్ల పొలం కాడికి పోవాల్నంటె…మస్తు బుగులైతుండే …పాములు…ముంగీసలు పారం కాడ
కుక్కలుంటుండే… మస్తు పిట్టెలుంటుండే
యేమన్న ఒరిల శిన్న పుర్గు పుట్రున్నా గవ్వే తింటుండే…
గిప్పుడట్ల లేనట్లుంది… …గప్పుడే మా బాపొచ్చిండు…
” యేముందవ్వ మా నాయ్ననలందరున్నప్డే మంచిగుండే…
ఎవుసం నమ్ముకుంటే ఎమస్తుందని.. గందుకే అందర్వోయిండ్రు…
మనమే ఐదిండ్లోల్లమ్ మిగ్లినం…
ఔమరి…. గప్పుడే మంచిగుంటుండే…
మంచిగ సేంద్రియ ఎర్వులెస్కొని పండించుకున్నోళ్లే మంచిగుండే.. పంట మంచిగొస్తుండే…. గిప్పుడన్ని… గా మందు సంచులేనాయే…. ఏమేమో స్ప్రే లు కొట్టవట్టే…..దాన్కి తోడు గీ ఫైజీ నెట్వర్కులంట… అవ్విటి రెడియేషనూ… పిట్టెల పాణం దీశే… ఇగ పంటేడిది పక్కులేడియి…
” రాన్రానూ రాజు గుర్రం గాడ్దైదట ‘ మనం యేమ్ గావాల్నొ మర్శి యెంత ఇల్వైనయి పొడగొట్కుంటున్నమో మనకెర్కైతలే… మనముంగటోల్లు మనకెంత మంచిగ ఆరసత్వపు సొత్తుంచిండ్రో… మనమూ మన తర్వాత తరాన్కుంచుడు మరుస్తున్నం.
ఎంతకైనా ఓల్డ్ ఇస్ గోల్ద్ అన్నట్లు… గప్పుడే మంచిగుంటుండే…!!!
నాంపల్లి సుజాత మచ్చిక…! కవిత
ప్రముఖ కవయిత్రి,నాంపల్లి సుజాత కలం నుండి జాలువారిన హోమ్ మేకర్ కవితా సంపుటిలోని “మచ్చిక…! కవిత పై విశ్లేషణా వ్యాసం.మచ్చిక కవితను ఆసక్తితో చదివాను.నాకు చాలా నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.కుక్కను విశ్వాసం గల జంతువు అంటారు.పల్లెల్లో ప్రతి ఇంట కుక్క ఉంటుంది.ఊర కుక్క పిల్లలు పెడితే ప్రేమగా చూడడం తెచ్చి పెంచుకునే సంస్కారం,ఆనాటి పల్లె వాసుల్లో ఉండేది.ఇప్పుడు ఆ సంస్కారం తగ్గిందేమో అనిపిస్తుంది.పల్లెలోని జనాలు వాళ్ళు అన్నం తినేటప్పుడు ఓ ముద్ద కుక్కకు పెడతారు.కుక్కను కాలభైరవుడు,పరమేశ్వరునిగా భావిస్తారు.కాలం మారింది.ఇప్పుడు పట్టణాల్లో ప్రతి ఇంట తమ రక్షణ కోసం కుక్కను పెంచుతున్నారు.కుక్కను గొలుసు పెట్టి కట్టి ఉంచుతారు.కుక్కలు ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరైనా భయపడతారు.ఇంటి ముందు గేట్ పైన కుక్క ఉంది జాగ్రత్త,బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డ్ తగిలిస్తారు.కుక్క ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి రక్షణ కల్పిస్తుంది అని మనం చెప్ప వచ్చు. పోలీసులు దొంగలను,నేరస్థులను పట్టుకోవడానికి నేరం జరిగిన ప్రదేశానికి శునకంను తీసుకెళ్ళి వదులుతారు.శునకం వాసన చూసి నేరస్థులను పట్టగలదని నమ్మకం ఉంది.పోలీసులు రాత్రివేళలో నగరమంతా తిరుగుతూ పహారా కాయాలి. రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పహారా కాస్తూ ఆ నగరాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది.మారిన పరిస్థతులు పోలీసులు పహారా కాయడం లేదు.మనం విచారించాల్సిన విషయం.ఊర కుక్కలు రాత్రంతా మేల్కొని నగరంలో తిరుగుతూ వాడ వాడ తిరుగుతూ పహారా కాస్తూ నిర్విరామ సేవలు అందిస్తున్నాయి. కుక్కలు ఏ చిన్న అలికిడి అయిన బౌ బౌ మని మొరుగుతాయి.కుక్కల అరుపులకు దొంగలు పారి పోవాల్సిందే.నేరస్థుల పాలిట సింహా స్వప్నంలా కుక్క నిలుస్తుంది.అలాంటి కుక్కపై మచ్చిక పేరుతో చక్కని కవితను సుజాత మనకు అందించారు.ప్రతి ఒక్కరు ఆ మచ్చిక ఏమిటో దాని మతలబు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది.
“ఓ నాలుగు మిగిలిన/మెతుకులను విదిల్చి/ఇక నీ ప్రపంచమంతా/నా చెంతేనని శాసించడమే మచ్చిక…!/అని అంటున్నారు.కవయిత్రి సుజాత భావనలో ఎంతో నిజాయితీ ఉంది. ఇవ్వాళ లోకంలో కుక్కలు పెంచుతున్న తీరును నాలుగు వాక్యాల్లో భావగర్భితంగా తెలియ జేశారు.ఇక నీ ప్రపంచమంతా నా చెంతేనని శాసించడమే మచ్చిక అనే పదానికి అర్థం మరియు మచ్చిక లోని రహస్యాన్ని లోకానికి వెల్లడించారు.

“ఆది మానవుడి స్వార్థపూరిత పుర్రె లోంచి/ పుట్టుకొచ్చిన వ్యూహాత్మక కుట్రే అది…!/అనే దానిలో వాస్తవం దాగి ఉంది.ఆది మానవుడు తాను మనుగడ సాగించడానికి కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నాడు.అందులో కుక్క కూడా ఉంది.ఆది మానవుడు తన రక్షణ కోసం,తన బాగు కోసమే కుక్కను చేరదీశాడు.మచ్చిక చేసుకున్నాడు.ఆది మానవుడు అడవుల్లో తిరుగుతుంటే ఎన్నో క్రూర మృగాల నుండి రక్షణ కోసం కుక్కను పెంచుకున్నాడు.ఆది మానవుడు సంచార జీవితం గడిపే వాడు.ఆది మానవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కుక్కలు కూడా వెళ్ళేవి.ఆది మానవుడికి కుక్కలు తోడుగా ఉండి కాపాడాయి అని మనం చిన్నతనంలో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం.
“బొచ్చు కుక్కకి అంగీ తొడిగి/సంబుర పడుతున్నాడు/ అహ…ఎంతటి దయార్ధ హృదయుడో/నరనరానా జీవ కారుణ్యం/ అనుకుంటాం… కానీ/ఆ మచ్చిక వెనుక ప్రయోజనం/ఎవరికి తెలియదని/షాంపూలు వ్యాక్సిన్స్ బొమ్మ బొమికలు/అతని పరిరక్షణ కోసమే…!/అని అంటున్నారు.మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.నిజంగా జరుగుతున్న విషయాన్ని కవయిత్రి సుజాత మనకు కళ్ళకు కట్టినట్లు తెలియజేస్తున్నారు.మనమందరం అంగీకరించాల్సిన విషయం.
“కాలకృత్యాలు కాలెత్తడాలు/కనురెప్పల కదలికలు/దాని ఇచ్చానుసారమనుకునేరు/వాడి ఆదేశానుగుణంగానే/అని అంటున్నారు.కుక్కను తీసుకొని వెళ్లి దాని కాలకృత్యాలు తీర్చడం, కాలెత్తడాలు కనురెప్ప కదలికలు దాని ఇచ్చానుసారం కాదు.వాడి ఆదేశానుగుణంగానే కుక్క మెదులుతుందని తెలియజేస్తున్నారు.
“ముందస్తు శిక్షణే కాదు/మూతికి శిక్కం కూడా మన ప్రమేయమే…! అని కవయిత్రి తెలియ జేస్తున్నారు.
“అరిచి ఘీ పెట్టి గింజుకున్న…/కుక్క ఎంత అరిచి బౌ బౌ మని మొరిగిన గింజుకున్న … గొలుసుతో కట్టబడి ఉంటుంది.కుక్క గొలుసుతో బంధింపబడి ఉంది.గొలుసు కట్టు దాటి ఆవలి గట్టు బందు వర్గాన్ని ముట్టరాదు అనే వాస్తవాన్ని కవయిత్రి సుజాత మనకు తెలియజేస్తున్నారు.

“గీసిన గిరి దాటి/అర ఇంచు స్వేచ్ఛ ఉండదు/ బంధించి ఉంచిన కుక్కకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది. గీసిన గిరి ఎలా దాటుతుంది.అర ఇంచు స్వేచ్ఛ ఉండదు అనే నిజాన్ని కవయిత్రి సుజాత తెలియజేస్తున్నారు.
“ఒక్కసారి…/గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో/
కలిసి జీవిస్తున్నట్టు/నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది…!/అని అంటున్నారు.కుక్కను ఒక్కసారి గొర్రెల మందలోనో,బర్రెల గుంపులోనో, జీవిస్తున్న వాటికి స్వేచ్ఛ ఉంటుంది.గొర్రెల కాపరి, పశువుల కాపరి వాటిని చక్కగా మేపుతాడు. గొలుసుతో కట్టి వేయబడి ఉన్న కుక్కను నిన్ను నీవు ఊహించుకో తేలిపోతుంది.నీ స్వేచ్ఛ ఏమిటో నీకు తెలుస్తుంది అనే నిజాన్ని కవయిత్రి సుజాత చక్కగా తెలియజేశారు.
“మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా/ మనం తప్ప వాటికి గతి లేదా/ ఆలోచించండి…!?/ అని అంటున్నారు.మొదట వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళామా ఆది మానవుడి చరిత్ర చదివితే తెలుస్తుంది.మన రక్షణ కోసమే కుక్కను మచ్చిక చేసుకున్నాం.కుక్కకు మనం తప్ప వాటికి గతి లేదా? ఆలోచించండి అని కవయిత్రి సుజాత మనలో ఆలోచన తరంగాలను రేకెత్తిస్తున్నారు.మనకే కుక్క అవసరం ఉంది.మనమే కుక్కను పెంచుకుంటున్నాం.కుక్క లేకుంటే మనకే గతి లేదు అని తెలియజేయడానికి మనలను కవయిత్రి సుజాత వాటి లోకంలోకి వెళ్లి ఆలోచించమని తెలియజేస్తున్నారు.భావం చక్కగా ఉంది.
“విడ్డూరమంటే ఇదే/సాటి మనిషిని చీదరించుకుని/ వీటిని ఆదరించడం వెనుక అంతర్యం/ఎవరికి తెలియనిది../ ముమ్మాటికిది/ముదిరిన స్వార్థ చింతన…!/అని అంటున్నారు.విడ్డూరం అంటే అర్థం మూర్ఖం.మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు,సాటి మనిషిని ఆదరించని వాళ్ళు,మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు.కుక్కల్ని ఆదరించడం వెనుక ఆంతర్యం తెలియనిది కాదు.ముదిరిన స్వార్థ చింతన అని చక్కగా తెలియజేస్తున్నారు.కుక్కల్ని ఆదరించినట్లే సాటి మనుషులను కూడా ఆదరించాలి.కుక్కల్ని ప్రేమించినట్లే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి అని సందేశాత్మకంగా మచ్చిక కవిత ద్వారా నాంపల్లి సుజాత తెలియజేశారు.కవయిత్రి సుజాతను అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు
విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
ప్రతినిత్యం రహదారులు రక్తంతో ఓలలాడుతున్నాయిఅనేక దుర్ఘటనలలో 4.80మంది ప్రాణాలు కోల్పోయారు 4.62లక్షల మంది గాయాల పాలైనారు.రహదారి భద్రతపై ప్రభుత్వాలు అంతబాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. 4.62లక్షల మందిని గాయాల పాలుఅయ్యారు. 2022 తో పోలిస్తే మృతులు 2.6 క్షతగాత్రులు 4.4 %పెరుగుదల జరిగింది.మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత నడివయస్కులే రోడ్లపై రక్త దాహానికి ఎక్కువగా గురవుతున్నారు.దానివలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.అతివేగానికి తోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు లైసెన్సులజారీలో అక్రమాలు వాహన చోదకులబాధ్యతారాహిత్యం భద్రతాప్రమాణాల అమలులో నిర్లక్ష్యం తదితరాలతో రహదారులపై నిత్యం నెత్తుటేల్లుపారుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలుఏయిర్ బెలూన్ వంటిసౌకర్యాలుఅందుబాటులోకి వచ్చాయి.అయినా ప్రమాదాల్లో మృత్యువు పాలు అవుతున్నారు.మనదేశంలో జాతీయ రహదారులు2% అయినామరణాల్లో అధిక వాటా వాటిదే.ఇతర దేశాల్లో సైకిళ్ళుమోటార్ వాహనాలు పాదాచారులకువేరు వేరు మార్గాలున్నాయి.రోడ్ల నిర్మాణంలో మేలిమిప్రమాణాలుపాటించడం ట్రాఫిక్ నిబంధనలుఅక్కడ అమలు చేయడం ఒక కారణం. మన రవాణ చూసినట్టు అయితే పుట్ పాత్ లపైనాద్విచక్ర వాహనాలు నడపడం ట్రాఫిక్ పోలీసులు చలానాల విషయంపైశ్రద్ధ వహించడం బ్లాక్ స్పాట్ల సరి చేతలు. డ్రైవర్లు పని వత్తిడితోమద్యం మత్తులో బండితోలడంతో రక్తం చిందినరహదారులు అవుతున్నాయి.

ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు. 108 పోను చేసి అంబులెన్సులు వచ్చేసరికిఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు.రోడ్డు ప్రమాద బాధితుల అపన్న హస్తంఅందించడంపైప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనపైతగు చర్యలు తీసుకోని బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దాలి.డ్రైవింగ్ పాఠశాలలువిరివిగా ఏర్పాటు చేయాలి.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్నిఢీ కొట్టి కారుపై పడిన మృతదేహంతో 18 కీ.మీ.ప్రయాణించిన వైనంచక్కగా చదువుకొని వృద్ధిలోకి రావలసినచిన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు.జాతీయ నేరగణాంకసంస్థలెక్కల ప్రకారం 2022 లో మద్యం డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన వారి కారణంగా దాదాపు మూడువేల ప్రాణ దీపాలు ఆరిపోయాయి ఆరు వేల మంది క్షతగాత్రులయ్యారు.హైదరాబాద్ లోని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో లక్షల మందికి పైగా కేసులునమోదయ్యాయి. వారిని 5 వేల మందికి జైలుకు పంపారు. ఆ దండనకు ఏ మాత్రం వెరవనిచాలా మందిమళ్లీ మళ్లీ తప్పులుచేస్తున్నారు.ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్ఫై వేల మందివాహనదారులతో ఒక సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81%ఒప్పుకున్నారు. బయటకు వెల్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో లిక్కర్ విక్రయాలను నిషేదించాలన్నసుప్రీం కోర్ట్ రోడ్లపైనరమేధం ఆగాలంటే తాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి సరి అయిన శిక్షలు విధించాలి. మధ్యం మత్తులో అనేక మంది అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాలను గుల్ల చేయడం సామాజిక అశాంతికి కారణమవుతున్న మద్యం తాగి వాహనం నడపడమే కారణమవుతుంది.
రహదారిపై మరణమృదంగంజాతి గుండెల విసేలా అనునిత్యం మార్మోగుతుంది.దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు 19 మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదలతో తీవ్రతకళ్ళకు కట్టినట్టుకనబడుతుంది. మృతుల్లో 18-45 ఏళ్ళ మధ్య వారే 69%. వరకు వున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన రహదారిభద్రతపై దృష్టి పెట్టి 2030 నాటికల్లారోడ్డు ప్రమాదాల్నిమృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. 2030నాటికి రోడ్ల నిర్మాణం వేగ నియంత్రణ కచ్చితంగా నిబంధనలు అమలుకుప్రాధాన్యం వేగ నియంత్రణణుతగ్గించే ప్రయత్నంలో చైనాఅద్భుత ఫలితాలు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకతగ్గితే అంతకుమించి భారతదేశంలో పెరిగి నిశ్చేష్ట పరుస్తోంది.వాహన వేగాన్ని 51%తగ్గించగలిగిన ప్రమాద మరణాలు 30% దాక నియంత్రించగల వీలుందని తెలిసినా ఎడెనమిదిసెకండ్లలోనేవందల కిలోమీటర్ల వేగంఅందుకనే శకటాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ ల్ని తప్పక వాడాలి. అమెరికాలో 98% జర్మనీ 89% చైనా 65%భారతదేశంలో 12 నుండి 13 మాత్రం వాడుతున్నారు. రహా దారి భద్రంగాఉండాలంటే వచ్చే పది సంవత్సరాలలో 10,900కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని దాని వలన స్థూల దేశీయుత్పత్తి 3.7 %ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తుంది. రహాదారిపై మేట వేసిన నెత్తుటి సంక్షోభాన్నిరూపుమాపినపుడేసంక్షేమ రాజ్యా ప్రాణ ప్రతిష్టల భావన కలుగుతుంది.
2016లో దేశవ్యాప్తంగా రహదారులు రక్తదాహానికి 16 వేలమంది పాదాచారులు 2022లో 32 వేలకు పైగా బలి అయ్యారు. 90% పాదాచారులు గాయాలపాలు అయ్యారు అత్యధికులు పేద మధ్యతరగతి ప్రజలే ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టేస్తున్నాయి 9వేల కి.మీ పైగా రహాదారులు విస్తరించి వుంటే 10% బాటలపైనే పుట్ పాత్ లు వున్నాయి. పుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు స్కై వాక్ లు ఏర్పాటు చేయాలి భద్రత అవగాహన చేయాలి రోడ్ల నాణ్యతనుమెరుగుపరచాలి
ప్రముఖ తెలుగు కవి ,రచయిత, సంగీతజ్ఞుడు, ఆంధ్ర ప్రదేశ్ ‘రాష్ట్ర గీత’ కర్త ఐన శ్రీ శంకరం బాడి సుందరాచారి గారు తిరుపతిలో ఆగస్టు 10న,1914లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కమలమ్మ, రాజగోపాలా చారి గార్లు.
వీరి సహధర్మచారిణి శ్రీమతి వేదమ్మాళ్ గారు.
తమిళులైనా తెలుగు భాషపై మక్కువతో ఎన్నో రచనలు చేశారు. థియోసాఫికల్ సొసైటీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ,చిన్నచితకా ఉద్యోగాలు చేసిన వీరు ఉద్యోగార్థమై మద్రాస్ ‘ఆంధ్ర పత్రిక’ ఆఫీసుకు వెళ్ళినప్పుడు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ‘మీకు తెలుగు వచ్చా’? అని అడిగినప్పుడు ‘మీకు తెలుగు రాదా’ అని ఎదురు ప్రశ్న వేయడంతో పంతులుగారు అవాక్కయ్యారట .ఈ పత్రికలో ఉన్నప్పుడు ఒక ప్రముఖునిపై పద్యం రాయమన్నపుడు తాను వ్యక్తులపై రాయలేనని ఉద్యోగం వదులుకున్న ఆత్మాభిమాని.
ప్రేమ వివాహం చేసుకున్న వీరి శ్రీమతి వేదమ్మాళ్ గారు
మనోవ్యాధితో గతించడం, ఐదేండ్ల కూతురు కూడా మరణించడం వారి జీవితంలో బాధించే అంశాలు. పద్య కవిత్వం అంటే ఎంతో ఇష్టం వీరికి ,అందులోను ఛందోబద్ధమైన తేటగీతి పద్యాలు మరీఇష్టమంటారు.
ఒక సందర్భంలో, నా పేరు కూడా తేటగీతిలో ఇమిడిపోయిందంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే రాసారాయన.
మహాత్మా గాంధీ హత్యోదంతం పై కలతచెంది’ బలిదానం’ కావ్యం రాశారు. ‘సుందర రామాయణం’ ‘సుందర భారతం’ పేరుతో రెండు కావ్యాల్ని, తిరుపతి వేంటేశ్వర స్వామి మకుటంతో ‘ శ్రీనివాస శతకాన్ని’ , ‘బుద్దగీతి’ పేరుతో బుద్ధుని చరిత్రను, ఠాగూర్ ‘గీతాంజలి’ లోని మూలభావాన్ని తీసుకొని చేసిన స్వతంత్రానువాదం ఎన్నో ప్రశంసలు పొందింది. భావగీతాలు, జానపద గీతాలు, సినిమా పాటలు రాశారు. 1942లో ‘దీనబంధు’ సినిమా కోసం రాసిన పాట ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కారణాంతరాల వల్ల సినిమాలో చేర్చలేదట.
ఈ పాట శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది అంటారు. ‘బుద్ధ చరిత్ర’ లోని కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి నెహ్రూ గారి మన్ననలు పొందారట .
ఈ కవి శ్రేష్ఠునిపై కొందరు ప్రముఖ కవి దిగ్గజాల అభిప్రాయాలు :
శ్రీపాద కృష్ణమూర్తి గారు: మృదువైన పదాల శైలి, కల్పనాచాతుర్యంతో కవిత్వాన్ని అత్యంత ఆదరణీయంగా మలిచారంటారు.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు :
సంస్కృత పదాలను వీడి , సరళమైన తెలుగులో పలుకుబడులు, కవితాత్మలకు సౌకుమార్యం కలగలిసి వీరి కవిత్వం
ఆదరణ పొందింది అంటారు.
గడియారం వేంకట శాస్త్రి గారు : ఎత్తుగడలు ,అలంకార, చమత్కారాల మేళవింపులతో సరళ భాషలో ,సహజ
భావ శృతులలో సాగే కవితాధార అంటారు .
రాయప్రోలు సుబ్బారావు గారు : వీరిశైలి తేటతెలుగులో సాగుతూ సుదూరంగా ధ్వనిస్తుంటుంది అంటారు .
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు : తెలుగుదనపు తీపి రుచుల ఊట వీరి తేటగీతి కవిత్వం అంటూ శ్లాఘిస్తూనే, ఒకానొక సందర్భంలో భయంకర రూపంలో ఉండే ‘తాటకి’ మీ తేటగీతిలో ఇముడుతుందా అని ప్రశ్నిస్తే ,
నల్లకొండల నుగ్గుగా నలగ కొట్టి నడుగులు పిడుగులగుచు… అరుదెంచె అంటూ తాటకిని తేటతెలుగలో వర్ణించినపుడు శర్మగారు అచ్చెరువొందారట.
ఇలా చెప్తూపోతే వారి సాహితీ స్రవంతి గలగలలై పారుతూ సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న సందర్భాలు కోకొల్లలు.
1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది .చారిగారిని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు’ ప్రసన్న కవి’ బిరుదుతో గౌరవించారు.
ఆయనకు జనబాహుళ్యంలో ‘భావకవి ‘ ‘సుకవి’ ‘ అహంభావకవి’ అని కూడా పేర్లు.
అచ్చ తెలుగులో , తెలుగువారి జీవన విధానాల్లోని సమస్త ఘట్టాలను,సాంప్రదాయాలను
భావసౌందర్య స్ఫోరకంగా, అతి రసవత్తరంగా, మాటలు ,పాటల రూపంలో వివరించి అందరినీ ఆకట్టుకోవడంలో అత్యంత ఘనులు .
నిరాడంబరత ,అసమానతలు ఎరుగని నిక్కచ్చితనం, ఆధ్యాత్మిక చింతన కలిగి ,అనన్య ప్రతిభాపాటవాలుగల ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదట .
ఎంత మేధావులైనా మనసు ముందు మోకరిల్లే వారేనని, కష్టాలు కడగండ్లకు అతీతులు కారనడానికి వీరే సాక్ష్యం . చరమాంకంలో ఐనవారు లేక ఒంటరితనంతో నిస్తేజంగా మారిన ఈ సాహితీదిగ్గజానికి ‘ప్రపంచ సాహితీపొత్తం’లో సరైన పుటలేదనే భావన ఎంతోమందిలోఉంది.
సాహితీ సేవలో అలసిసోలిన ఈ కవికోకిల ఏప్రిల్ 8,1977న, తిరుపతిలో ఇష్టదైమైన వెంకన్న పాదాల చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగు తల్లి మెడలో మల్లెపూదండను అతిఅందంగా కూర్చి అలంకరించిన ఘనుడిగా తెలుగుచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ అసామాన్య కవిశ్రేష్ఠుడికి అక్షర నిరాజనాలతో…
(శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ…)
సునీత గంగవరపు బ్రతుకు పుస్తకం కవిత
ప్రముఖ కవయిత్రి,సునీత గంగవరపు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.కవితలు,కథలు,రాస్తున్నారు.వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులతో కూడా అప్పుడప్పుడు కథలు, కవితలు రాయిస్తూ సాహిత్య సృజన పట్ల మెళుకువలు నేర్పిస్తున్నారు.సునీత గంగవరపు కలం నుండి జాలువారిన “బ్రతుకు పుస్తకం’ కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితను ఆసక్తితో చదివాను. నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.బ్రతుకు పుస్తకం ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.పుస్తకాలకి రెక్కలు ఉండవు.కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది.ఆ రెక్కలు జ్ఞానాన్ని,ఆలోచనా శక్తిని,సృజనాత్మకతా నైపుణ్యాన్ని,లోక పరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం.ఏ పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.
“బ్రతుకు పుస్తక పుటల నుండి/ఎన్ని అనుభూతుల రంగులో…/ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…!/ అంటున్నారు.బ్రతుకు అంటే జీవితపు కొనసాగింపు. బ్రతుకు అంటే జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.పుట అనగా పుస్తకంలోని కాగితమునకు ఒకవైపు భాగం.పుట అంటే కాగితం, పేజీ,అర్థాలు.అనుభూతి అంటే స్పర్శ చేత తెలుసుకొను,తాకి తెలుసుకొను,అనుభవం ద్వారా తెలుసుకొనడం..
“ఎన్ని అనుభూతుల రంగులో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అనుభూతులు,బాధ, దుఃఖం,ఆలోచన,ఆవేదన,ప్రేమ,అభిమానం, అనుమానం,స్నేహం లాంటి ఎన్నో రంగులు పులుముకుంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకపు పుటల్లో అనుభవాల పరంపర అంటే అనుభవాల అంతరాయం లేని,కొనసాగింపు అని అర్థమవుతుంది.
“కలలతోనే… కన్నీళ్ళతోనే/నిండిన పేజీలు/ అంటున్నారు.బ్రతుకు పుస్తకపు పుటల్లో కలలతో నిండిన పేజీలు ఉంటాయి.కలలను సాకారం చేసుకునేది ఎందరు అంటే ఇదమిద్దంగా చెప్పలేము. కలలు కల్లలు అయిన వాళ్లు కూడా ఉంటారు. బ్రతుకు పుస్తకం పుటల్లో కన్నీళ్ళతో నిండిన పేజీలు ఉంటాయి.కన్నీళ్లు కావాలని ఎవరు కోరుకోరు. తనకు తాను తెలియక ఆగాధంలో కూరుకు పోవడంతో కన్నీళ్లు వస్తాయి.తెలిసి అగాధంలో పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. స్వయంకృతాపరాధాలతో చేసిన కొన్ని పనులు, మనిషిని కన్నీళ్ళకు గురిచేస్తాయి. .

“అక్షరాల కందని దుఃఖ సంకేతాలు/అంటున్నారు.
కొన్ని ఉద్విగ్న క్షణాల్లో తెలిసి తెలియక మోసపోయిన అభాగ్యులు కూడా కొందరు ఉంటారు.జీవితంలో అక్షరాల కందని దుఃఖ సంకేతాలు ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు. “పేజీలన్నీ ఒకేలా ఉండవు/అంటున్నారు. నిజమే…బ్రతుకు పుస్తకం చాలా పెద్దది.బ్రతుకు పుస్తకం పుటల్లో ఎన్నో పేజీలు ఉంటాయి.పుస్తకం లోని పేజీలన్నీ ఒకేలా ఉండవు,వేరు వేరుగా ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“వేటికవి సొంత రంగుల్ని పులుముకుంటాయి/ అంటున్నారు.జీవితం భిన్న స్వభావాల పార్శ్వం. బతుకు పుస్తకపు పుటలు సొంతరంగులని అద్దుకుంటాయి అనడంలో వాస్తవం దాగి ఉంది.
“నిగూఢతను ఆర్ద్రంగా పొదువుకుంటాయి/ అంటున్నారు.నిగూఢత అంటే రహస్యం.ఆర్ద్రం అంటే మెత్తదనం.బ్రతుకు పుస్తకం పుటల్లో రహస్యాలు కూడా మెత్తదనంతో దాచుకుంటాయి అని తెలియజేస్తున్నారు.
“కొన్ని పేజీల్లో మెరుపులు ఉంటాయి/అంటున్నారు.
నిజంగానే బ్రతుకు పుస్తకం పేజీల్లో మెరుపులు ఉండి ప్రకాశిస్తుంటాయి.వర్షించే ముందు ఉరుములు, మెరుపులు,గాలి దుమ్ము, దుమారం,వీస్తుంటాయి. మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్ ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.విద్యుత్తు ఉన్నదని నిరూపించేది.ఇవి ఎక్కువ ఉరుములతో కూడిన వర్షంలో పడే సమయంలో కనిపిస్తాయి.మెరుపులు అత్యంత వేగంగా పయనిస్తాయి.మెరుపు రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వచ్చే ప్రకాశవంతమైన మెరుపు.
“అవి దిగులు మేఘాలను కరిగించి/పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి/అంటున్నారు.జీవితంలో మెరుపులు ఉండాలి.మెరుపులు ఉంటేనే అవి దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి.పారవశ్యము అంటే ఆత్మ ద్వారా ఒకరి శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం, దైవత్వం ద్వారా మానవుని స్వాధీనం చేసుకోవడం. మట్టిని గురించి మనం మాట్లాడుతాం.మట్టిని చూడగానే ఏదో పులకరింత,మరేదో పారవశ్యం అంటాం.జీవితంలో సుఖదుఃఖాలు,శీతోష్ణాలు ఉంటాయి.బ్రతుకు పుస్తకం పుటల్లో వాటిని సమం చేసుకుంటేనే దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని చేరుకుంటాయి.
“అక్కడక్కడ సునామీలు ఉంటాయి/రాయక తప్పని చేదు సారాంశాలుంటాయి/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అక్కడక్కడ సునామీలు తుఫానులు కూడా ఉంటాయి.సునామీ తుఫాను 2004 డిసెంబర్ 26 న హిందూ మహాసముద్రం, సుమత్ర, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామి 14 దేశాల్లో సుమారు
2,30,000 మందిని పొట్టన పెట్టుకుంది.అక్కడక్కడ
ఎదిరింప శక్యం కాని కష్టాలు,కడగండ్లు,సునామీలు
ఉంటాయి.రాయకుండా ఉండలేని,ఆత్మీయులకైన చెప్పుకోలేని,చేదైన సంఘటనల వివరాలుంటాయి. జీవితమన్నప్పుడు ఎలాంటి వారికైనా ఇవి అనుభవానికి రాక తప్పదు.
“ఒక్కో చోట/సూర్యకిరణాల ప్రసరణలుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ఒక్కోచోట సూర్యకిరణాల ప్రసరణలు ఉండి జీవితంలో కాంతిని,క్రాంతిని తెస్తాయి అని కవయిత్రి చక్కగా వివరించారు.
“ఆకాశమంత ఆక్రమించిన/నక్షత్రాల సన్నని గుసగుసలు కొన్ని/పుస్తకాన్ని నిండారా పరిమళభరితం చేస్తుంటాయి/అంటున్నారు.
అనంతమైన ఆకాశం నక్షత్రాలతో కూడి ఉంటుంది. బ్రతుకు పుస్తకం పుటల్లో కూడా ఆకాశమంత ఆక్రమించిన నక్షత్రాల గుసగుసలు కొన్ని పుస్తకాన్ని పరిమళభరితం చేస్తుంటాయని తెలియజేస్తున్నారు.
“ఇంకొన్ని పేజీలు ఏమిటో/ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి/అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో కొన్ని పేజీలు రాయకుండా ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి.నిజంగానే…. బ్రతుకులో శూన్యత, స్తబ్దత ఆవరించినప్పుడు ఎవరికి చెప్పుకోలేని ఖాళీతనం మనసును ఆక్రమించుకుంటుంది.
“ఏమి రాసినా…ఎంత రాసినా/కాగితపు గుండెలపై యిమడలేని/నిర్లిప్తతలోంచి దిగాలుగా జారి పోతుంటాయి/అంటున్నారు.
ఏమి రాశాము…, ఎంత రాశాము అన్నది ముఖ్యం కాదు.మన భావోద్వేగాలను పంచుకోవడానికి ఆప్యాయతలు పెన వేసుకోవడానికి తగిన వాతావరణం లేనపుడు జీవితం నిర్లిప్తతలోకి జారిపోతుందని కవయిత్రి సునీత చక్కగా వ్యక్తీకరించారు.
“ప్రేమ స్పర్శ లేని ప్రేమ లేఖలా/అస్పష్టతను అలుముకుని/దిక్కుతోచక దిక్కులు చూస్తుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ప్రేమ తాలూకు స్పర్శ లాంటి అనుభూతి లేని ప్రేమ లేఖల్లో ఏం ఉంటుంది?ప్రేమలేఖల్లో అస్పష్టతతో నిండి ఉంటుంది.అస్పష్టతతో నిండి ఉన్న జీవితాలు గడిపే వారు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలతో దిక్కుతోచక దిక్కులు చూస్తుంటారు.జీవన యానంలో అనేకమైన అనుభవాలు ఎదురవుతాయి.దుఃఖం కలిగినప్పుడు దాని ఛాయా నలుపు రంగు.సుఖసంతోషాలతో కూడిన పచ్చదనం.అన్యాయం,అత్యాచారం ఎదుర్కొన్నప్పుడు కలిగిన కోపపు ఎరుపు రంగు. అద్భుతమైన విచిత్ర దృశ్యం కనిపిస్తే విరగబడి నవ్విన తెలుపు రంగు.ఈ విధంగా బ్రతుకు పుస్తకం పేజీల నిండా అనుభవాల రంగులు దర్శనమిస్తాయని కవయిత్రి సునీత వివరించడం చక్కగా ఉంది.సునీత కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను..
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వలసలు పోయి జీవించడం వాటివల్ల ఆయా ప్రదేశాల స్థానిక ప్రజలు, విద్య- ఉద్యోగావకాశాలు కోల్పోయి, భాష -ఆచార వ్యవహారాల అస్తిత్వం కోల్పోయి, అవమానింపబడి ఎంతో హీనమైన జీవితం గడుపుతూ… మళ్ళీ ఆ అవకాశాలు తమ స్వంతం చేసుకుని మెరుగైన జీవితం జీవించాలన్న కోరిక ఉండడం సహజమే కదా!
ఆ కోవలోనే మహిళలు వారి ప్రతిభలను ఎక్కడా ప్రదర్శించుకునే అవకాశాలే లేక వివక్షకు గురైన సంఘటనలెన్నెన్నో… అవకాశాలు లేవు కానీ ప్రతిభకు లోటులేదని చెప్పడానికి ఆ కాలంలోనే పత్రికలలో మహిళలకు ప్రత్యేక కాలమ్స్ నడిపారు.
ఇటీవల ఒక మహిళ తమ సంతానం అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్న వారి ఆశలు అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు అడియాసలుచేస్తే.. తమ పిల్లలు తిరిగి మన దేశం
రావడం చాలా బాధాకరమని చెప్పి బాధపడింది.
ఈ సంఘటన విన్నాక మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది. “ఎప్పుడైనా అవసరం ఒక మార్గాన్ని ఎన్నుకుంటుందని అది అణచివేతలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే చర్య రచనా రూపంలో కానీ, తిరుగుబాటు రూపంలోనైనా కానీ వారిలోని అసహనం వెళ్లగక్కవచ్చు, సాధించవచ్చు” అని, ఒక పత్రిక స్థాపనకు దారితీసిన వైనం చెప్పారు.
1901 లో మద్రాసులో కమలా సత్యనాథన్ అనే ఒక మహిళ *ఇండియన్ లేడీస్ మ్యాగ్జిన్* అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకీయం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా పాత్రికేయురాలు అనీ, ఈ పత్రికలో ఆమె చర్చించని విషయం అంటూ లేదనీ, మా సోదరి దయామతీ దేవి కూడా చెప్పేవారు.
ఉత్తేజపూరితమైన సంపాదకీయాలు రాస్తూ, స్త్రీలకు ప్రేరణ కలిగించేదనీ, అంతవరకూ వారు ఇల్లే సర్వస్వం అనుకున్నవారు ఓహో! ఇలా కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చా? అనే
ఆలోచన కలిగించే విధంగా ఆయా సంపాదకీయాలుండేవట. అంటే మహిళల అస్తిత్వం కోసం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడం కోసం మహిళలకు ఆ పత్రికలో పెద్దపీటనే వేసింది కమలా సత్యనాథన్.
ఎందుకంటే? తరతరాలుగా సంస్కృతీ వారధులు మహిళలే కనుక ముఖ్యంగా ఆనాడు వలసరాజ్య నిబంధనల వల్ల ఎక్కువ నష్టపోయింది కూడా స్త్రీలే కావడం! పితృ స్వామ్య వ్యవస్థలో అణగారి పోతున్న అతివల పక్షాన వారి హక్కులు- బాధ్యతలు తెలుపుతూ సమాజంలో ఎదగాలన్న ఆశను కలిగించింది ఆ పత్రిక.
అందుకోసం స్త్రీలకు విద్య యొక్క ఆవశ్యకతను తెలుపుతూ, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ, తోటల పెంపకం, కుటీర పరిశ్రమలు, కుట్లు- అల్లికలు, ఇలా స్త్రీ సంబంధమైన అన్ని అంశాల్లో నిష్ణాతులను పరిచయం చేస్తూ, ప్రేరణా మూర్తులను సామాన్య గృహిణులకు పరిచయం చేస్తూ జ్ఞాన ప్రసరణలు చేసిన మాన్వి కమలా
సత్యనాథన్.
ఆ కాలంలో ఆడవారు మంచి భావకులై రచనలు చేసే సత్తా ఉన్నా… ఏ పత్రికలోనైనా ప్రచురించుకోవాలంటే… ఎవరేమనుకుంటారో?? అని సంఘంలో ఒక బెరుకు- బిడియంతో ఉన్న కాలంలో మహిళలతో నాటకాలు, కథలు, పనులలో శ్రమను మరచిపోయే పాటలను, సీరియళ్లు రాయించి, ప్రచురించి సంపాదకత్వం వహించిన కమలా సత్యనాథన్ అభినందనీయురాలు.
ఆ కాలంలోనే కాదు! ఏ కాలంలో నైనా కుటుంబాలు యావత్తు ఆడవారి సేవల మీద ఆధారపడి నడిచేవే… కనుక సక్రమంగా పనులు చేయాలంటే ఆడవారికి ఆరోగ్యం ముఖ్యమని భావించి, ఆరోగ్య సంబంధ రచనలు అచ్చు వేసేవారు.
పత్రికలో ఒకటి రెండు కాలమ్స్ కేవలం మానవీయ విలువల ప్రచురణకే కేటాయించేవారు. ఆ కాలంలో సాధికారత సాధించిన మహిళామణులు రమాబాయి,
సొరాబ్జీ, జోసెఫ్ లాంటి గొప్ప మహిళలు చేపట్టిన పనులను- అందులో వారు సాధించిన విజయాలను వరుసగా ఆ పత్రికలో ప్రచురించేవారు.
అయితే పత్రిక ఆర్థిక ఇబ్బందులతో పాటు ఎన్నో కారణాలు వల్ల కొంతకాలం పత్రికను ఆపాల్సి వచ్చింది. ఇంకొందరు ఏమంటారంటే? అప్పుడప్పుడే జాతీయ ఉద్యమాలు ఊపందుకుంటున్న ఆ తరుణంలో ఆ ఉద్యమాలను ప్రోత్సహిస్తూ పత్రికలో ఏ రచనలు రాలేదనీ, అందుకే పాఠకులు ఆదరణ చూపలేదని అంటారు. కానీ దేనికైనా ఒక పరిధి ఉంటుంది కదా? ఆ కాలంలో రాజకీయాల జోలికి వెళ్లేంత సాహసం స్త్రీలకు లేదేమో? అని నేను అనుకుంటాను.
అంతే కాదు రాజకీయాలలో ప్రవేశించమని మహిళలకు పిలుపు ఇవ్వలేదని ఒక అపవాదు కూడా ఉన్నది. ఆమె మహిళలను కుటుంబ పరిధి దాటిపోనివ్వని సనాతన వాదురాలనే ఒక అపప్రథను ఎదుర్కొంది. అందుకు ఆమె
సంపాదకీయాలు అలానే ఉండేవని మా సోదరి చెప్పేది.
ఏదేమైనా ఆర్థిక ఒడి దొడుకులతో పాటు ఇతర కారణాలతో కష్టమైనప్పుడు ఆమె వ్యాపార ప్రకటనలు ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర సేకరించి పత్రికలో ప్రచురించి ఆ విధంగా ఆర్థికంగా ఆసరా తీసుకున్నారు.
1901 లో స్థాపించిన పత్రిక 1918 వరకు మాసపత్రికగాను, 1927 నుండి 1938 వరకు ద్వైమాసిక పత్రిక గాను నడిపారు. తర్వాత ఆమె కూతురు పద్మినీ సత్యనాథన్ పత్రిక పగ్గాలు చేతబట్టి, సహసంపాదకురాలిగా సేన్ గుప్తాను నియమించి; తాను ప్రచురణ నిర్వహణ చేస్తూ పత్రిక ను నడిపింది.
ఇక్కడ పత్రిక ఎందుకు ఆగిపోయిందన్న ప్రస్తావన కాదు ముఖ్యం… వలసవాదుల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడల్లా ప్రజల పక్షాన పత్రికలు గొంతెత్తేవి అనేది ముఖ్య విషయం. అలా వెనక్కి వెనక్కి పయనిస్తే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
గుజరాత్ లోనూ జాతీయోద్యమం ( అప్పటికా పేరు లేదు ) కానీ వలసవాదుల అణచివేతను తట్టుకోలేక స్త్రీలను చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో *స్త్రీ బోధ్* మహిళా పత్రిక 1857లో స్థాపించటం జరిగింది.
అలాగే కేరళలోనూ మలయాళ పత్రిక
*కేరళ సుగుణ బోధిని* అని తిరువనంతపురం నుండి మరో పత్రిక వెలువడింది.
1992 లో *తూర్పు పనోరమా* అనే పత్రిక మహిళాసారధ్యంలో స్థాపించబడింది. ఇది మొట్టమొదటి ఈశాన్య భారతదేశం నుండి వెలువడిన ఆంగ్ల పత్రిక. ఆ కాలంలో ఆ ప్రాంతంలో విధి వంచితులైన , క్రూర వైధవ్య దుఃఖ పీడితులైన, వారిని తొక్కివేసే సామాజిక నిర్బంధాలు, ఇక్కడ పేదనా, బడుగు వర్గాలా? అనే తేడాలేదు… వివిధ వర్గాలలోని స్త్రీలు జీవితపు సుడిగుండంలో చిక్కుకుని, అర్ధాంతరంగా అసువులు బాసిన అతివల యధార్థ గాథలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వారి ఆక్రోశమూ, తీరని కోరికల నేపథ్యమూ, ఆస్తి
హక్కులు లేక దీనావస్థలో పడిన వైనమూ, ఇలా ఎన్నెన్నో సమస్యలను చర్చించిందా పత్రిక.
ఎవరు ఏ పత్రిక స్థాపించినా స్త్రీలను సంతోషంగా ఉంచడమని, సమాన హక్కులతో జీవించమని చెప్పడమే…. ధ్యేయం… అలాగే అదే సమయంలో వారిని ఉత్తమ గృహిణులుగా ఉండాలనే సమాజ దృష్టి… ఎవరైనా కాస్త వారి హక్కుల కోసం పోరాడితే వారిని తెగించిన ఆడవారిగానే ఆ కాలంలో పరిగణించారు. అది దాదాపు 1930 వరకు నడిచింది. స్త్రీలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నదని తెలియకుండా పురుష సంపాదకత్వంలో వచ్చిన పత్రికలు కొంచెం జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు. అందుకే ఈ మహిళా పత్రికల స్థాపన జరిగిందేమో?
తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు మహిళల పక్షాన నిలిచిన పత్రికలు మహిళా సంపాదకీయం చేస్తూ విలువైన సందేశాలను ఇచ్చి, ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా… స్వతంత్రంగా మన భావాలు వెలిబుచ్చుకొనే తోవ చూపిన మహిళ పత్రిక స్థాపకులకు, మహిళా సంపాదకులకు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ…
వాసి జ్యోత్స్న రచించిన నువ్వూ – నేను కవిత
కవయిత్రి,వాసి జ్యోత్స్న కలం నుండి జాలువారిన నువ్వూ – నేను కవిత పై విశ్లేషణా వ్యాసం.ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు నువ్వు – నేను అనే మాటలు సంభాషణలో తరచుగా వాడుతారు. వ్యక్తిగతంగా తన గురించి చెప్పడానికి నేను అనే పదాన్ని ఉపయోగిస్తారు.నువ్వు మరియు నేను,ఇది సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని సూచిస్తుంది.అత్యంత ఆత్మీయులు కలిసినప్పుడు ఎలా పలకరిస్తారో చూడండి.నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను?నువ్వు చెప్పు నేను వినాలని ఉంది.ఇది ఒకరికొకరు పలకరించుకునే విధానాన్ని తెలుపుతుంది.కవయిత్రి జ్యోత్స్న రాసిన నువ్వూ – నేను కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతుల లోకంలోకి వెళ్లి విహరించండి.
“నీ దగ్గరున్నంతవరకే/ఏ విషయమైనా రహస్యం/అంటున్నారు.గుప్పిట దాచి ఉంచినది రహస్యం.ఎవరికి తెలియకుండా గుప్తంగా ఉంచిన విషయం రహస్యం.ఒకరి విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉండటం రహస్యం.ఎవరికీ తెలియని విషయం రహస్యం.నువ్వు – నేను ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది.ఒకరు చెప్పిన విషయం మరొకరు గోప్యంగా ఉంచితేనే అది రహస్యంగా ఉంటుంది.
“నీ పెదవి దాటి మరో/చెవిన చేరిన తక్షణం/ప్రతి పదం హాస్యమే../అంటున్నారు.ఈ కవితా పంక్తులలో
ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి. ఒకరి పెదవి దాటి మరొకరి చెవికి వెళ్లిన వెంటనే రహస్యం రట్టు అవుతుంది.అసలు రహస్యం యొక్క గౌరవం,విలువ తగ్గిపోతుంది.ఇద్దరి మధ్య రహస్యంగా ఉండాల్సిన విషయం బయటపడితే అది హాస్యాస్పదంగా మారిపోతుంది అనే భావన కవితలో వ్యక్తం అవుతున్నది.రహస్యం విషయం యొక్క గోప్యతను నొక్కి చెబుతుంది.మనం ఒకరికి చెప్పిన విషయం రహస్యంగానే ఉండాలి.అట్టి విషయం వారు ఇంకొకరికి చెబితే ఆ రహస్యానికి విలువ ఉండదు.మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన రహస్యం.దానిని ఇతరులు సాధారణ విషయంగా తీసుకుంటారు.ఈ కవిత రహస్యాన్ని ఇతరులకు తెలియకుండా కాపాడాలనే సందేశాన్ని ఇస్తుంది.
“నీ.. నా .. జీవితాలలో/ప్రతి క్షణం విలువైనది/ వలువల్లా చీల్చుకు తినే/బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/ అంటున్నారు.నీ జీవితం,నా జీవితం మరియు ఎవరి జీవితం అయినప్పటికీ ప్రతి క్షణం విలువైనది.మన జీవితాల్లో ప్రతి క్షణం అమూల్యమైనది.గడిచి పోయిన సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు.కాబట్టి సమయం విలువను గుర్తించాలి. సమాజంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనుషులు ఉత్తమమైన విలువలను కోల్పోతున్నారు. ఆత్మీయత, నమ్మకం,నైతికత వంటి విలువలు తగ్గిపోయాయి.పైకి కనిపించే మాయాజాలం వల్ల మనుషులు వలపుల ఆకర్షణలకులోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“బండరాయంటి గుండెల/మధ్యలో బ్రతుకీడుస్తున్నాం/మన గుండె భావోద్వేగాలకు స్పందించాలి.కానీ,ఇప్పుడు సున్నితంగా ఉండాల్సిన గుండె కఠినంగా బండరాయిలా మారిపోయింది. మనిషి తాను అనుభవించే బాధలు,గాయాలు తట్టుకోలేకపోతున్నాడు.జీవిత పోరాటాల వల్ల మనిషి మనసు కఠినంగా మారింది.ఇవ్వాళ మనిషి బ్రతుకు ఒక విధమైన భారంగా మారింది.మనిషి జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని కవిత ఎత్తి చూపుతుంది.విలువలు కోల్పోయిన సమాజంలో జీవిస్తున్నాం.మనుషులు బాహ్య ఆకర్షణల వలలో చిక్కినారు.మనుషులు నిజమైన అనుబంధాలను మర్చిపోయారు.సున్నితంగా ఉండాల్సిన మనిషి హృదయం బండరాయిలా మారిపోయింది.మనిషి లోపల తీవ్రమైన ఒత్తిడి,శూన్యతను ప్రతిబింబిస్తుంది.ఇందులోని భావం సమకాలీన జీవన శైలికి అద్దం పడుతుంది.మనిషి హృదయం బండబారిపోయినప్పటికీ తాను బ్రతకడానికి ప్రయత్నిస్తూ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“నువ్వూ – నేను నవ్వుకుంటూ/నమ్మకంగా సాగిపోవాలే తప్ప/నువ్వెంతంటే నేనెంతని/నిత్యం ఘర్షణలతో ప్రాముఖ్యమైన/సమయాన్ని సామర్థ్యాన్ని/వృథా చేసుకోకూడదు/అంటున్నారు. నువ్వు నేను నవ్వుకుంటూ నమ్మకంగా సాగిపోవాలి. మన మధ్య స్నేహం,ప్రేమ,అనుబంధం కొనసాగాలి. మనం ఒకరి పట్ల ఒకరు నమ్మకంతోనే ఉండాలి. ఆత్మీయతతో మెలగాలి.ఆనందంగా ఉండాలి.మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అవి మన బంధాన్ని ప్రభావితం చేయకూడదు.మనం ఇద్దరం నువ్వెంతంటే నువ్వెంతని నిత్యం ఘర్షణలకు తావు ఇవ్వరాదు.గర్వం వల్ల వచ్చే సమస్యలను గురించి చెబుతుంది.అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.నువ్వు గొప్ప,నేను గొప్ప అనే భావనతో మెలగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితంలో సమయం అమూల్యమైనది.మన సామర్థ్యాన్ని,శక్తిని అనవసరమైన గొడవలకు వినియోగించ రాదు.అందు వల్ల మన విలువైన సమయం వృథా అవుతుంది.మనం ఇరువురం పరస్పరం అర్థం చేసుకుని కలిసి మెలిసి పురోగమించాలి.మనలో నెలకొన్న అనవసరమైన అహంభావాన్ని వదిలి పెట్టాలి.ఇరువురు నమ్మకంతో కలిసిమెలిసి అన్యోన్యతలతో జీవించాలని సూచిస్తుంది.మనలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే పోటీ తత్వం వద్దు.మన ఇద్దరం గర్వాన్ని విడిచి పెట్టాలి.మన ఇద్దరం గర్వంతో ఉంటే కీడు సంభవిస్తుంది.గర్వం వల్ల మేలు జరగదు.మన జీవితంలో విలువైన సమయాన్ని అప్రయోజనమైన విభేదాలతో,వివాదాలతో వృథా చేసుకోకూడదు. మనం ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి మెలిసి ఉండాలి.మనం నవ్వుతూ ఆనందంగా ముందుకు సాగాలి అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
“వికృత చేష్టలతో/ప్రకృతి ప్రకోపించేలా/ఆకృత్యాలకు పాల్పడుతూ/అనునిత్యం నలిగిపోతూ/ఆవేదనలతో కుంగిపోతూ/మానవత్వాన్ని మింగేయొద్దు/ అంటున్నారు.వికృత చేష్టలు అంటే మనిషి చేస్తున్న అనైతిక పనులు,హింస మరియు పర్యావరణాన్ని హానికరంగా మార్చే చర్యలు.మనుషుల తప్పిదాల వల్ల ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. భూకంపాలు,వరదలు,వాతావరణ మార్పులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనుషులు చేస్తున్న ఆకృత్యాలకు అందరు అనునిత్యం నలిగిపోతున్నారు.మనుషులు దుష్టమైన పనులు చేసి ఇతరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మనుషులు తప్పు దోవలో నడిచి తోటి వారిని ఆవేదనలకు గురి చేస్తున్నారు.మనిషి మనస్సు నిరాశగా మారి పోయింది.మానవులు సృష్టించిన దుష్ప్రభావాల వల్ల చివరికి మనమే బాధపడుతున్నాం.ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మానవత్వాన్ని మర్చిపోవద్దు.ప్రేమ, సహాయము,నైతికత వంటి విలువలను కోల్పోకూడదు.మనలో మానవత్వం వెల్లి విరియాలి.స్వార్థపూరితుడై మనిషి మనిషిని మింగి వేయకూడదు.సమాజంలోని అనైతికతను, ప్రకృతి వినాశనాన్ని మరియు మానవ సంబంధాల్లో పెరుగుతున్న అసహనాన్ని,అశాంతిని కవిత ఎత్తిచూపుతుంది.మనలోని అహంకారం, స్వార్థపూరిత వికృత చర్యలు చివరికి మనకే నష్టం తెచ్చిపెడతాయి.కాబట్టి మానవత్వానికి పెద్ద పీట వేసి సమాజానికి మేలు చేసే విధంగా నడుచుకోవాలి అని కవయిత్రి జ్యోత్స్న ఈ కవితలో సందేశాన్ని అందిస్తున్నారు.కవయిత్రి జ్యోత్స్న మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ బి.దామోదర్ రావు రచించిన నా కవిత సమత కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషోపన్యాసకుడు, డాక్టర్ బి. దామోదర్ రావు కలం నుండి జాలువారిన నా కవిత సమత పై విశ్లేషణా వ్యాసం.
“నా కవిత నందనవనంలో సుందర ప్రతిమ కాదు/ అంటున్నారు.నందనవనం అనగా పూలతో అలరారుతూ ఆనందాన్ని పంచే వనం.నందనవనం పిల్లలు ఆడుకునే అందమైన పూల చెట్లతో ఆహ్లాదాన్ని కలిగించు ప్రదేశం.దేవలోకంలోని వనం నందనవనం.సత్యభామ కోసం కృష్ణుడు స్వర్గమునకు పోయి నందనవనం నందలి పారిజాత వృక్షమును భూమికి తెచ్చినట్లు పురాణాల్లో ఉంది.కవి తాను రాసే కవిత అందమైన ప్రతిమను వర్ణించడం కాదు.తాను రాసే కవిత శ్రామికుని నిజమైన శ్రమ జీవిత సత్యాలపై ఆధారపడి ఉంది.నా కవిత భావ ప్రపంచానికి చెందినది కాదు అని కవి స్పష్టం చేస్తున్నాడు.కవి తాను రాసిన కవిత కేవలం అలంకారమైన సౌందర్యానికి బదులు జీవన పాఠాన్ని ప్రతిబింబించే ప్రకృతిని చూపిస్తుందని తెలుపుతున్నారు.
“శ్రమైక జీవుల కర్మజల బిందువు/అంటున్నారు.శ్రామికుల శ్రమ,కష్టం,అంకితభావం,జీవితానికి ప్రాణం అని కవితలో చెప్పబడింది.మానవ జీవితం శ్రమ పూర్వకమైనదిగా ఉండాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది.శ్రామికుని శ్రమతో నిండిన జీవితం మాత్రమే నిజమైన జీవిత లక్ష్యం అని ప్రతిపాదిస్తుంది.
“శాంతి,సమతల సింధువు/అంటున్నారు. న్యాయం,శాంతి,సమానత్వం అద్భుతమైన సముద్రం లాంటివి. శాంతి,న్యాయం సమాజంలో అత్యంత ముఖ్యమైనవి. శాంతి,సమానత్వం సముద్రంలా విస్తరించాలి.శాంతి,సమానత్వం అందరికీ అందుబాటులో ఉండాలి అనేది కవి ఆకాంక్షగా వ్యక్తం అవుతుంది.
“అన్యాయానికి,అవినీతికి బలిగా మారిన/దైన్య జీవాల,హృదిని హత్తుకుని ఓదార్చే/అంటున్నారు. సమాజంలో అన్యాయం, అవినీతి పెచ్చు పెరిగి పోయింది.సమాజంలో అన్యాయం,అవినీతి కారణంగా బాధపడుతున్న ప్రజల కోసం చింతిస్తూ వారి బాధలను అర్థం చేసుకుని వారికి ఓదార్పును ఇవ్వడం కవితలోని ముఖ్యమైన భావంగా తోస్తుంది.
“శాంతి మాత/న్యాయనేత/సౌమ్య చరిత/ అంటున్నారు.శాంతి,న్యాయం,దయ అనే సుగుణాలు,విలువలతో నడిచే వ్యక్తుల గొప్పతనాన్ని కొనియాడాలి.సమాజంలో గొప్ప నాయకుల విధానాలు,వ్యవహారాలు అందరికీ ఆచరణీయం.అట్లాంటి వారిని ఆదర్శంగా చూపిస్తుంది.ఈ ప్రపంచాన్ని న్యాయం,శాంతి ప్రేమతో నింపే మాతృ రూపం లాంటి నాయకత్వం అవసరం అని ప్రతిపాదించారు.శ్రామికులు,దయనీయ జీవులు,సమత మరియు శాంతి అనేవి ఈ కవితలోని ప్రధాన అంశాలు.అవి నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.ఈ కవి తన మనసులోని ఆవేదనను తెలుపుతూ సమాజంలో ఉండాల్సిన సమభావాన్ని చక్కగా వ్యక్తపరిచారు.ఈ కవితా పంక్తులలో ఆత్మ స్ఫూర్తి,న్యాయం, సమానత్వం,శాంతి వంటి అంశాలపై దృష్టిని సారించారు.ఇందులో శ్రామికుల జీవితాలు వారు పడుతున్న కష్టాలు,కన్నీళ్ళు,వేదనలు,న్యాయం, సమానత్వం వంటి అంశాలను కవి దామోదర్ రావు చాలా చక్కగా ప్రస్తావించారుఈ కవిత చదవగానే పాఠకులకు ఒక విధమైన గొప్ప భావం మరియు ఆనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. “పొగడ్తల పొగడ దండలై/పెత్తందారి గుండెల పై వాలేది కాదు/ అంటున్నారు.ఈ పంక్తిలో కవి తన కవిత పొగడ్తల పొగడ దండల కోసం నిర్దేశించింది కాదు.తన కవిత అధికారం లేదా ప్రతిష్ఠ కోసం రాయబడింది కాదని కవి తన కవిత్వం యొక్క లక్ష్యాన్ని వివరించారు.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడినది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
“నిత్యం,మిత్తి సన్నిధిలో/తైలం లేని వత్తిలా వాడిన జీవితాల/అంటున్నారు.ఈ కవితా పంక్తిలో తన కవిత సాధారణ ప్రజల జీవితాలకు వారి కష్టాలకు దగ్గరగా ఉంది అని చెప్పబడింది.తన కవిత నిత్యం మృత్యువు సన్నిధిలో నూనె లేని వత్తి వలె కొడిగట్టిన జీవితాలు గల శ్రామికులతో మమేకం కావడాన్ని చూపిస్తుంది.ఇక్కడ తైలం లేని వత్తి అనేది శ్రమజీవుల అస్తిత్వానికి ప్రతీక.శ్రమజీవులు కార్మికులు,కర్షకులు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతగానో కష్టపడుతున్నారు.అయినప్పటికీ వారికి కడుపు నిండా తిండి దొరకడం లేదు.శ్రామికులు ఆకలితో అలమటిస్తూ అభాగ్య జీవితం గడపడం మనం ఎరిగినదే.శ్రమజీవుల జీవితాల్లో ఎలాంటి మార్పు గాన రావడం లేదు.శ్రమజీవులకు సమాజంలో తగిన స్థానం అందడం లేదు. శ్రమజీవులు తమ జీవితాలలో వెలుగును పొంద లేక పోతున్నారు అని కవి అంటున్నారు.తైలం లేని వత్తి అనే ఉపమానాన్ని ఉపయోగించి కష్టాలు పడుతున్న సామాన్యుల జీవితాల కఠోర స్థితిని కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు.తైలం లేని వత్తి వలె ఇక్కట్లు ఎదుర్కొంటున్న సామాన్యుల జీవితాలు వెలుగు లేకుండా చీకట్లలో మగ్గడం దారుణం అని గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.
“ఆదుకునేది,అందుకునేది/అంటున్నారు.కవి కవితా లక్ష్యం అణగారిన శ్రమజీవులకు ఆదరణను అందించడం,ఆశ్రయాన్ని కల్పించడం.వారి బాధలను అర్థం చేసుకొని వారికి జీవితంలో కొంత వెలుగును ప్రసాదించే విధంగా ఉంది.కవి తన భావాలను ఆవేదనతో,నిజాయితీగా వ్యక్తపరిచారు.ఇది కేవలం కవిత కాదు ఒక న్యాయం కోసం పిలుపు ఇచ్చినట్టుగా తోస్తుంది.తాను రాసే కవిత కేవలం యశస్సు కోసం రాయబడింది కాదు అని,అధికారం గల వారి ప్రాపకం కొరకు మరియు వారి దృష్టిని ఆకర్షించడానికి కాదు అని చెప్పిన తీరు బాగుంది.
“నా కవిత/తారల వయ్యారి చిందులు/తామరల సొగసు పసందులు/వర్ణించేది,వరించేది,అసలే కాదు/చెమటోడ్చి, సాధించి,శక్తిని సృజించి/చేవతో జీవించే/కార్మిక,కర్షక సోదరుల కళ్యాణం కోరేది/నా కవిత సమత/అంటున్నారు.ఈ కవితా పంక్తుల్లో కవి సమాజంపై తనకు ఉన్న గాఢమైన చైతన్యాన్ని సామాజిక సమత్వం పట్ల తన ఆరాధనను వెల్లడిస్తున్నాడు.ఇందులో రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఒకటి ప్రకృతిలోని సౌందర్యం,రెండు కార్మికులు,కర్షకులు వంటి సాధారణ ప్రజల వేదనను ప్రతిబింబించిన తీరు.తన కవిత నక్షత్రాల సొగసుల నాట్యాలను వర్ణించేది కాదు.తామరల అందచందాల పసందులను చిత్రించేది కాదు.ప్రకృతిలోని సౌందర్యం నా కవితా వస్తువు అసలే కాదు.నిత్యం కష్టపడి చెమటను చిందించి సృజించిన సంపదతో బలంగా జీవించేటటువంటి కార్మిక,కర్షక సోదరుల బాగును కోరేది నా కవిత.సమాజంలోని ప్రకృతి సౌందర్యాన్ని గాక కార్మికుల,కర్షకుల శ్రమకు మాత్రమే కవి ప్రాధాన్యతను ఇస్తున్నాడు.
“చెమటోడ్చి సాధించి,శక్తిని సృజించి,చేవతో జీవించే అనే కవితా పంక్తులు కార్మికుల కర్షకుల కష్ట సాధనను కృషిని ప్రతిబింబిస్తున్నాయి.కవిత ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇవి కేవలం ప్రకృతి అందాలను ఆరాధించమని చెప్పడం మాత్రమే కాదు.కార్మికుల,కర్షకుల సంక్షేమం కోసం పని చేయాలి అనే గొప్ప సందేశాన్ని సూచిస్తుంది. కవితలో సమతా భావం వ్యక్తమవుతుంది.కవి సమాజంలో సమానత్వం,న్యాయం మరియు ఐకమత్యం కోసం ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది. కవిత ప్రకృతి మరియు సమాజానికి మధ్య సమతుల్యతను గురించి తెలుపుతుంది.ప్రకృతి అంశాలు ఎంత ముఖ్యమో కార్మికుల,కర్షకుల శ్రమను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. కవి సందేశం మన అందరికీ స్ఫూర్తిదాయకం.ప్రకృతిని కాపాడుకోవాలి మరియు శ్రమజీవులకు తోడ్పాటును అందించాలి అని కవి డాక్టర్ బి. దామోదర్ రావు నా కవిత సమత అనే కవిత ద్వారా ప్రబోధిస్తున్నాడు.
గంటా మనోహర్ రెడ్డి రచించిన “అమ్మా నువ్వెవరు ? కవిత
ప్రముఖ కవి,విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి,కలం నుండి జాలువారిన ఘంటా పథం కవితా సంపుటిలోని అమ్మా నువ్వెవరు?కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితా సంపుటి 1981 సంవత్సరంలో ముద్రించబడింది.ఈ కవిత భారతదేశం స్వాతంత్ర్యం పొంది ముప్ఫయి సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన ఆనాటి సామాజిక,సాంఘిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం కూడా దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.భారత దేశానికి పట్టిన దుర్గతిని,ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలను,సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని తన గాఢమైన భావాలతో వ్యక్తపరుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కవితలో కవి దేశమాతను నువ్వెవరివమ్మా?అని ప్రశ్నించడం దానికి భారత మాత సమాధానం చెబుతూ నేనో నష్టజాతకురాల్ని,స్వాతంత్ర్య భారతిని అని దిగులుతో చెప్పడం వేదన కలిగిస్తుంది.కవి మనోహర్ రెడ్డి రాసిన అమ్మా నువ్వెవరు?కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.”కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు/అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్లు/మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన నీ ఒళ్ళు/ఇంతకూ ఎవరమ్మా నువ్వు?అని అంటున్నారు.ఒక భావోద్వేగంతో రూపు దాల్చిన కవితను చదువుతుంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న అమ్మ గురించి చెప్పినట్లు అనిపిస్తోంది.అమ్మ శరీరంలోని అవయవాలు అన్ని బాధలకు గురి అయి ఉన్నాయి.అమ్మ కళ్ళు కళ తప్పి పోయినట్లుగా ఉన్నాయి.అందంతో నిగనిగలాడే అమ్మ చెక్కిళ్ళు పేలవంగా,కాంతి విహీనంగా కనిపిస్తున్నాయి.ఆకలి,అనారోగ్యంతో అమ్మకు ఎడతెగకుండా వెక్కిళ్లు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన అమ్మకు ముప్పై ఏళ్ల వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు ఆవరించాయి.కవితలోని భావాలు అమ్మ జీవితంలోని కష్టాలను,శారీరకంగా,మానసికంగా, సామాజికంగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.ఎవరమ్మా నువ్వు?అని అడుగుతున్నాడు.దేశ మాత అయిన తల్లిని మాత్రమే కాదు.ఆ కష్టాలను అనుభవించే ప్రతి మహిళను ప్రతినిధిగా చూపుతున్నట్లుగా తోస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి?ఇందుకు సమాజం యొక్క పాత్ర ఏమిటి?అని తెలియజేయాలన్న లక్ష్యంతో కవిత రాయబడినట్లుగా తోస్తుంది.కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు అనేది ఆమె శారీరక,మానసిక దుస్థితిని ప్రతిబింబిస్తోంది.అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్ల ద్వారా ఆమె భావోద్వేగాలను గుండె నిండా పొంగిపొరలే బాధను వ్యక్తం చేస్తున్నారు.మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన ఒళ్ళు అంటే చిన్న వయసులోనే ఆవిడ జీవితం అనేకమైన కష్టాల సుడిగుండంలో చిక్కి కృంగి పోయిందని భావిస్తున్నారు.ఇంతకు ఎవరమ్మా నువ్వు?అని కవి ప్రశ్నించడం ద్వారా ఆమె జీవిత కథ,బాధలకు కారణాలు ఏమిటి?తెలుసుకోవాలనే ఆసక్తి గోచరమవుతుంది.ఇది కష్టాలలో ఉన్న మహిళల జీవన స్థితిగతులపై దృష్టి సారించి వారి బాధలను గుర్తించాలని హృదయగతమైన భావాలకు ప్రతీకగా నిలుస్తుంది.“వెయ్యేళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని/అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు/ అంటున్నారు.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడివడినది.అరాచకపు పరాయి పాలన నుండి ఆగస్టు15,1947 రోజున భారతదేశం విముక్తి పొందింది.బ్రిటిష్ వారు మన దేశ సంపదను అక్రమంగా దోచుకుని వెళ్ళినారు.బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధించినప్పటికీ దేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం బాధను కలిగిస్తుంది. భారతదేశం ఇప్పటికీ ఆర్థికంగా,సామాజికంగా దోపిడీకి గురి అయి విలవిలలాడుతున్నది.కవి దేశ మాతను ఉద్దేశించి వెయ్యేళ్ల దుర్బర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.”చీకట్లోంచి చీకట్లోకే పరుగులు తీస్తున్న పిచ్చిదానిలా ఉన్నావు/ అంటున్నారు.దేశం అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలలో అవినీతి చోటుచేసుకున్నది.అవి సత్ఫలితాలను అందివ్వడం లేదు.దేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి విలవిలలాడి పోతున్నది.ఇది దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతి పాలనకు తార్కాణంగా నిలుస్తుంది.ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శను సంధించినట్టుగా తోస్తుంది.“నాడు నయాగరా జలపాతంలా కళకళలాడే నువ్వు/ నేడెందుకో సహారా ఎడారిలా వెలవెలబోతున్నావు/ అంటున్నారు.ఒకప్పుడు దేశం ఎంతో సమృద్ధిగా కళకళలాడేది.ఎంతో వైభవంగా అలరారిన దేశం మనది.ప్రకృతి అందాలకు పర్యాయపదంలా ఉండేది.మన దేశం పాడి పంటలతో విలసిల్లింది. ఒకప్పుడు రత్న గర్భగా పేరు పొందిన దేశం మనది. నేడు దేశం దుర్భర దారిద్ర్యం,పేదల ఆకలి కేకలు, అన్నార్తుల అలమటింపులు,నిరాశా నిస్పృహలు ఎల్లెడలా అలుముకున్నాయి అని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.”గత కాలపు వైభవాల శిథిల శిల్ప సంకేతంలా ఉన్నావు/అంటున్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.నేడు మన దేశం శిథిల శిల్పాల గుర్తుల రూపంలో మాత్రమే మిగిలి ఉంది.స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు అనే వాస్తవాన్ని కవితా పంక్తి తెలియజేస్తున్నది.“కుత్సిత రాజకీయ విన్యాసాన్ని తలచుకొని/అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/అంటున్నారు.కేవలం కుత్సిత రాజకీయ గందరగోళాల మధ్య చిక్కుకొని దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నది.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కాన రావడం లేదు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.కాని ఎందుకో దేశం అభివృద్ధి కుంటుపడింది అని కవి భావాల ద్వారా వ్యక్తం చేస్తున్న తీరు బాగుంది.“చచ్చిన శవంలా ఉన్నావు/అంటున్నారు.ప్రస్తుతం భారతదేశం శవం వలె చలనం లేని ఉద్దీపన రహిత పరిస్థితిలో ఉంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఇది ప్రజల వైపల్య భయాన్ని ప్రతిబింబిస్తుంది.”శవానికి భయం గొలిపేలా ఉన్నావు/ అంటున్నారు.శవం వలె నీ పరిస్థితి భయంకరంగా ఉంది.విపరీతంగా,అసహజంగా, భయాందోళనతో కూడిన అసహనాన్ని సూచిస్తుంది. చనిపోయిన వ్యక్తి భయానికి లోను కాడు.కానీ చనిపోయిన వ్యక్తికే భయాన్ని కలిగించేలా ఉన్నావు అని చెప్పడం బాగుంది.భయాన్ని సృష్టించడానికి చాలా తీవ్రంగా అశాంతిని కలిగించడాన్ని సూచిస్తుంది.ప్రజల చర్యలు మరియు ప్రవర్తన సహజ సిద్ధంగా ఉండక పోవడం వల్ల వారిని చూసి చనిపోయిన శవానికే భయం గొలిపేలా ఉంది అని చెప్పడం జరిగింది.వ్యంగ్యభరితమైన సమాజపు భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ కవిత ఉంది. ”భవిష్యత్తంటేనే ఎందుకో భయంతో కంపించి పోతున్నావు/అంటున్నారు.భవిష్యత్తు పట్ల ఆశ ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది.మనిషి భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది.ప్రజల్లో భవిష్యత్తు పట్ల ఎడతెగని భయం,తీవ్రమైన నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.”ఎండిన పెదిమెలతో ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు/ అంటున్నారు.దేశంలో నివసిస్తున్న ప్రజలు నిరాశ నిస్పృహలకులోనై తమ బాధలను చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని,వారి బాధలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందనే భావన వ్యక్తం అవుతున్నది.”నీ బాధలకు నిష్కృతి లేదని అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/“ఇకనైనా చెప్పు తల్లీ – నువ్వెవరివమ్మా?/అంటున్నారు.ఆవేదనతో,ఆక్రోశంతో బాధపడుతున్న ఆమెను కవి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎవరో అనేది తెలుసుకోవడమే కాకుండా మనసులో దాగి ఉన్న బాధకు మూలాన్ని కూడా తెలుసుకోవాలనే సంకల్పం వ్యక్తమవుతున్నది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు వాటి మూలాలు ఏమిటో తెలుసుకొని పరిష్కారం చూపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.బాధితురాలైన ఆమె గుండెల్లో నిండి ఉన్న బాధను,ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాడు.ఆమె ఎదుర్కొంటున్న బాధకు ముగింపు లేకుండా కొనసాగుతున్న పరిస్థితి ఎంతటి క్లేశాన్ని కలిగిస్తుందో గ్రహించవచ్చు.

ఆమె బాధలకు కారణమేమిటో చెప్పాలని కోరుతున్నాడు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అసమానతలను గూర్చి ప్రశ్నిస్తున్నాడు.ఈ ప్రశ్న దేశమాత ఆత్మను ఉద్దేశిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయని కవి ఆవేదన చెందుతున్నాడు.“కష్ట జీవుల నికృష్ట జీవితాలను కలం కుంచెతో/కాగితపు కాన్వాసు పైన కమనీయంగా చిత్రించాలని/వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ఓ కవీ,నేనెవర్నో నీకు తెలీదా?/నేనొక నష్టజాతకురాల్ని నా దురదృష్ట నామధేయం/ స్వాతంత్ర్య భారతి/అంటున్నారు.దేశమాత తనను నష్టజాతకురాలిగా భావిస్తూ స్వాతంత్ర్యం తనకు కలిగించిన వాస్తవ పరిస్థితులపై బాధ పడుతున్నట్లు కవి చెబుతున్నాడు.ఈ కవితను భారతదేశంలోని సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై గాఢమైన ఆవేదనతో కూడిన ఆత్మ విమర్శగా భావించవచ్చు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అని కవి తీరని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు.ఇది కేవలం ఒక కవిత మాత్రమే కాదు.భారతదేశంలోని ప్రజల హృదయాల్లో నెలకొన్న ఆక్రోశానికి ప్రతీక.భారత దేశంలోని గడచిన సామాజిక, రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై విమర్శల సమాహారంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అయినప్పటికీ దేశమాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది.కవి 43 సంవత్సరాల కింద కవిత రాసినప్పటికీ ఇప్పటికీ దేశమాత పరిస్థితి దుర్భరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుంది.ఈ కవిత దేశమాత విలాపంగా చెప్పవచ్చు.కవి మనోహర్ రెడ్డిగారు ఘంటారావం అనే శీర్షికతో వాట్స్ అప్ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కవితను అందిస్తూ తెలుగులో ఘంటారావం అనే ఒక కొత్త కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరు నిర్విఘ్నంగా నేటి వరకు ఘంటారావంలో -1651 కవితలు రాసినారు. వీరు రచిస్తున్న ఘంటారావం కవితలు సుజల స్రవంతిలా నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.వీరు ఘంటారావం శీర్షికన 1008 కవితలతో కవితా సంపుటిని తేది 16 – 11 – 2023 నాడు ఆవిష్కరించడం జరిగింది.వీరు ధారావాహికంగా ఘంటారావం కవితలను అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను.కవి మనోహర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
