Home వ్యాసాలు క్రైంచిత్రాలగీతాలలో — కావ్యవిలువలు.

క్రైంచిత్రాలగీతాలలో — కావ్యవిలువలు.

by Dr. V.V. RamaRao

 పాటకు పల్లవి ప్రాణమైతే  సినిమాకు మాత్రం పాటే ఆరో ప్రాణం. మాటలు లేని‌ సినిమాలను చూడగలమేమోగాని  పాటలులేని  సినిమాలను ఊహించలేం. అందుకే కథ, ఇతి వృత్తమేదైనా సరే ,ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో పాటలుం డాల్సిందే! ఆ పాటలు కూడా చక్కని భావుకత తో సాహితీవిలువలతో రూపొందడం వలన సినీగీతం కూడా విశ్వవిద్యాలయాలో ఒక పరిశోధనాంశమ వడం శుభ పరి ణామం.అంతేకాదు తెలుగు పాట ఆస్కార్ పురస్కారం అందుకొని అంతర్జాతీయ వేదికపైన నర్తించడం  మరో ముందడుగే!

సాధారణంగా పౌరాణిక,జానపద,సాంఘిక,చారిత్రక చిత్రా లలో ఎక్కువ శాతం పాటల సాహిత్యం  ప్రామాణికంగానే ఉంటుంది. అయితే పగ ,ప్రతీ కారం; దొమ్మి,దోపిడి మొద లైన నేరపూరిత(క్రైం) ఉత్కంఠమైన( సస్పెన్స్) సినిమాల లోని పాటలు ఆటవిడుపుగా ఉండటం కోసమే చేర్చడం ఆన

వాయితి. ఇవి ఎక్కువ వాంప్ లేదా క్లబ్ డాన్సర్స్ పైననే చిత్రీ కరిస్తుంటారు.

జేమ్స్ బాండ్  చిత్రాలలో చాలా వరకు కథను కారు ఛేజింగ్ లతో వేగంగా నడుపుతుంటారు కాబట్టి పాటలు స్పీడ్ బ్రేకర్లు గా భావించే నిర్మాత దర్శకులు కూడా ఉం టారు. అయితే మన తెలుగు చిత్రాలకు సంబంధించినంత వరకు గౌతమ

బుద్ధుని గాథ తో తీసిన సినిమా లో సైతం డ్యుయెట్స్ ఉంచి  తేనే వసూళ్ళ వుతాయని భావించి ఔచిత్య అనౌచిత్యాల జోలికి వెళ్ళకుండా పాటను పల్లకిలో ఊరేగిస్తారు.

కొంతమంది సాహితీ అభిరుచిగల నిర్మాతలు దర్శ కులు  మాత్రం క్రైం చిత్రాలలో సైతం కల కాలం  విన దగిన  పాట లు రాయించి, మంచి సంగీతాన్ని జోడించి పాటకు పట్టం కట్టారు. 

 కావ్యవిలువలంటే ..

“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే

శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేశయుజే.” కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మిత మైన ప్రభోధం కొరకు –అని మమ్మటుడు “కావ్య ప్రకాశం “లో కావ్య ప్రయోజనాలుగా‌ పేర్కొన్న అంశాలే ఆ ధునికకాలంలో స్థూలంగా సాహితీవిలువలు గా పరిగణించవచ్చని విమర్శ కుల మాట.

గీతం కూడా సాహితీ ప్రక్రియే కాబట్టి సినీ గీతాలు కూడా విలువలు కలిగివుంటాయి.. అయితే , పక్కా కమర్షియల్ మాస్ మసాల విభాగంలోకి వచ్చే క్రైం సినిమాలలో సైతం   సంగీత సాహిత్య విలువలతో కూడిన  పాటలుండటం విశేషం.

సినిమా చరిత్రలో 1962లో వచ్చిన డాక్టర్ నో ది ఫస్ట్ ‘ తొలి జేమ్స్ బాండ్ సినిమా. 1958లో ఇదే పేరున ఇయాన్

ఫ్లెమింగ్ రాసిన నవలాధారంగా వచ్చిన చిత్రమిది. Terence Young డైరెక్ట్ చేయగా..Harry Saltzman, Albert R. Broccoliలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ నటించారు. హాలీవుడ్

జేమ్స్ బాండ్ స్ఫూర్తి తో తెలుగులోనూ అపరాధ పరిశోధన చిత్రాలు మొదలయ్యాయి.

తెలుగులో సస్పెన్స్ చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్‌ గా మారిన తొలి తెలుగు  చిత్రం లక్షాధికారి(1963)  లో పాటలన్నీ ఆపాత మధురాలే. వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్.టి.రా మారావు, కృష్ణకుమారి లతో తమ్మారెడ్డి  కృష్ణమూర్తి నిర్మిం చిన  ఈ చిత్రం చివరి దాక కూడా విలన్ ఎవరో తెలి యక పోవడం ప్రేక్షకులను  సస్పెన్సులో ఉంచు తుంది.ఈ సిని మాలో కొసరాజు, ఆరుద్ర, సి.నారా యణరెడ్డి పాటలు రాశారు.ఈ ఏడు పాటలలో డా.సి.నారాయణ రెడ్డి గారు రాసిన “మబ్బులో ఏ ముంది మనసులో ఏముంది” all time hit  గా జనాదరణ పొందింది

 మబ్బులో ఏముంది…

 నా మనసులో ఏముంది?

మబ్బులో కన్నీరు..

 నీ మనసులో పన్నిరు.

 సాహిత్యం మొత్తం ప్రశ్న –సమాధానం లో సాగటం ఒక విశె‌షం. ప్రకృతిలోని అంశాలను  నాయిక ప్రశ్నిస్తే అవే అంశాలతో  నాయకుడు జవాబివ్వడం ఓ చమత్కారం .ఇలా రాయడమో  శిల్పం! ప్రతి చరణం అంత్యప్రాసతో

నిర్మించడం గజల్ రచనా విధానాన్ని తలపిస్తుంది. చివరి చరణంలో “ఆత్రేయుడి“(చంద్రుడు) ముద్ర కనిపిస్తుంది. టి.చలపతిరావు మధ్యమావతి రాగంఆధారంగా  జానపద శైలిలో స్వరపరచగా ఘంటసాల సుశీల పాడిన ఈ గీతం స్వరమధురిమకు ,లయచతురిమకు నిదర్శనం.

విజయ సంస్థ వారు 1965 లో తీసిన ‘సి.ఐ.డి.’ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలే! పింగళి రాసిన పాటలకు ఘంట సాల సంగీతం అందిం చారు. ఈ చిత్రంలోని “నా సరి నీవని“, “నిను తలచిన నిముషమున” పాటలు ఎంతో జనా దరణ పొందాయి. పింగళి సాహిత్యంలో శబ్దాలంకారిక సౌందర్యంతో పాటు అలతి పొలతి పదాలతో కూర్చిన విధం

హృద్యం! సి.ఐ.డి .పక్కా  క్రైం చిత్రం కాదు.

.ఉస్తాదోంకె ఉస్తాద్ (1963) హిందీ చిత్రానికి రీమేక్ గా ఎస్.డి. లాల్ దర్శకత్వంలోతీసిన“మొనగాళ్ళకు మొనగా డు (1966) సినిమాలో మూలచిత్రంలోని రఫీ పాడిన” సౌ బార్ జనమ్ లేగే“బాణీని యథా తథంగా తీసుకొని  పి.బి. శ్రీనివాస్ తో పాడించిన ” “నేనున్నది నీలోనే..నీవున్నది నా లోనే” గీతం విలువైనదే.

   1966లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం కృష్ణ జయ లలిత హీరో హీరోయిన్లుగా, డూండీ నిర్మించిన తొలి తెలుగు గూఢచారి చిత్రం “గూఢ చారి116′ లోని పాటలన్నీ హిట్ అయ్యాయి.సి.నా.రె.రాసిన“ఎర్రాబుగ్గలమీద మనసైతే” పాటను జానపద శైలి లో రాశారు. ఆరుద్ర రాసిన  “పడి లేచే కెరటం చూడు! పడుచుపిల్ల బింకం చూడు!” గీతం లో

“వెన్నెల విరిసే వేళా… వన్నెలు మెరిసే వేళా చందమామ పరుగులు చూడు… చల్లగాలి ఆరడి చూడు/పరులెవరూలేని చోటా… పరు వాలు పూచే చోటా తరుగుతున్న కాలం చూడు ,పెరుగు తున్న ఆశలు చూడు..ఇలా “చూడు” అనే క్రియా పదాన్ని అంత్యపదంగా వేసి ఏమేమి చూడాలో ఎలా చూడాలో ఆరుద్ర కలం చూపించింది.ఇదే చిత్రంలో సి.నా .రె రాసిన  “నువ్వు నా ముందుంటే” పాట కలర్ లో చిత్రీకరిం చబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.గూఢచారి116 వాణిజ్యపరంగా, సంగీత సాహిత్య పరంగా భారీ విజయం సాధించి, అనంత రం వెలువడిన తెలుగు గూఢచారి సినిమా సీక్వెల్స్ గూడచారి 116 (1966), జేమ్స్ బాండ్ 777 (1971), ఏజెంట్ గోపి (1978), రహస్య గూడాచారి (1981) మరియు గూడచారి 117 (1989)సినిమాలకు  మార్గం వేసింది.

ఎస్.డి.లాల్ దర్శకత్వంలొ రామకృష్ణ,గీతాంజలి హీరో యిన్ లుగా తీసిన ” హంతకులొస్తున్నారు జాగ్రత్త“(1966) చిత్రంలోని పాటలను సి‌.నా.రే లలితభావాలతో రాయగా విజయ కృష్ణమూర్తి ఆపాత మధురంగా మలచారు. ఈ సినిమాలో

పల్లవించిన భావాలు  పరిమళించెను ఈనాడు“

అమ్మాయీ నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి“

“మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు, “దిగి రావ య్యా ఓ

దేవా ”  మొదలగు పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

    1967  లో ఎ.వి.ఎం వారు ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శ క త్వంలో తీసిన ‘అవేకళ్ళు“తెలుగులో   విడుదలైన తొలి హారర్, సస్పెన్స్ కలర్ చిత్రం. కృష్ణ, కాంచన హీరో హీరో యిన్లు గా నటించిన ఈ సినిమాలో కొసరాజు, రాసిన“డుం డుం గంగిరెద్దు దాసరోడొచ్చాడు,/మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భలే భయమన్నది” మొదలైన పాటలు ప్రజాదరణ  పొందాయి.

      1968 నుంచి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలు ఒక దశాబ్ద కాలం వరకు  వెల్లువలా వచ్చాయి.

ఈ సినిమాలెంత ఊపందుకున్నాయంటే చివరికీ కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యమిచ్ఛి నటించే అక్కినేని నాగేశ్వ ర రావు సైతం రివాల్వర్ ధరించి జమీందార్ ‘,’బందిపో టు దొంగలు‘,’ అదృష్టవంతు లు‘ మొదలైన సినిమాల్లో హీరో చితంగా నటిం చేంత వరకు.ఎన్.టి.రామారావు సైతం పౌ రాణిక పాత్రల కు స్వస్తి చెప్పి ‘నేనే మొనగాణ్ణి‘ ‘భలే త మ్ముడు: మొదలయిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించి చివరివరకు కొనసాగించారు.

 కృష్ణ నటజీవితాన్ని మలుపుతిప్పినవి క్రైం యాక్షన్, చిత్రా లే! హాలీవుడ్ నటులైన సీన్ కానరి,రోజర్ మూరె, వలె టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా పేరు గాంచా డు.

        కృష్ణ కాంచన నటించిన ‘నేనంటే నేనె‘ చిత్రం

(1968) లోని యస్.పి.కోదండపాణి సంగీతంలో పాటలన్నీ హిట్టయినవే.సి.నా.రె రాసిన “ఒకే ఒక గులాబికై వాలిన

తుమ్మెద లెన్నెన్నో  ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నె న్నో.”కొత్త అభివ్యక్తు లతో ఉన్పది. కొసరాజు జానపదం  ‘అంబవో శక్తి వహో” తో పాటు  కాంచన ను ఆటపట్టిస్తు కృష్ణ పాడే  ‘ఓ చిన్నదాన నన్ను విడిచి’  టీజింగ్ సాంగ్  సూపర్  హిట్ అయింది .ఈ పాటలో “గుంతలకిడి గుమ్మా’ (గానం–ఎస్.పి.బాలు) ప్రయోగం తమిళ చిత్రం ‘నాన్’లో ఉండటం విశేషం. ఈ సినిమా లోనే కాంచన, విలన్ కృష్ణంరాజును కవ్విస్తూపాడే గీతం ‘నువ్వే నువ్వే నన్ను చేరుకోవా’ గీతంలో సి.నా.రె.పద చిత్రాలు భావకవితాసాంద్రమైనవి.

ఒక చరణం లో

“సెలఏరులాగ వస్తా..అల లాగ నినుపొంగిస్తా

చెలరేగి పొంగిస్తా..ఆ..చిన్నారి రాజా

మబ్బులపానుపు కావాల..మల్లెలదిండులు కావాల? ” అని రాశారు.

    అక్కినేని నాగేశ్వరరావు,జమున నటించిన

బందిపోటు దొంగలు (1968)చిత్రానికి పెండ్యాల ఆపాత మధురమైన సంగీతం అందించి సాహిత్యానికి పీట వేశారు. కె ఎస్ ప్రకాశ్ రావు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కథా చిత్రంలో సి.నా.రె.రాసిన ” విన్నానులే ప్రియ‘ గీతంలో

“కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు

“చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల” వంటి  అలంకారిక అభివ్యక్తులు

అలరిస్తాయి. ఇదే చిత్రంలో దాశరథి రాసిన

“విరిసిన వెన్నెలవో?పలికిన కోయిలవో” లలిత

పదాల పోహళింపుతొ వండిన ‘పొంగళి!

           ‌‌ అక్కినేని నటించిన మరో క్రైం చిత్రం అదృ ష్టవం తులు(1969) సూపర్ హిట్టయింది.

ఇందులో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య,”చింతచెట్టు చిగురు చూడు, మొదలైన  పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.అయితే పెళ్ళయిన కొత్త జంట కోసం  “కోడికూసే జాముదాక తోడురారా చందురూడ” పాటలో ఆత్రేయ “చంద్రుడిని కళలు తెలిసిన చందురూడ అని, మత్తు తెలిసిన చందూరుడా తీపి చూపుల చందురూడ” అని రకరకాలుగా సంబోంధించారు.

            ఎన్.టి.ఆర్. ద్విపాత్రా భినయం చేసిన “భలేతమ్ముడు‘చిత్రం హిందీలోని “చీనా టౌన్“కు రీమేక్. ఇందులో తొలిసారి మహమ్మద్ రఫి

అన్ని పాటలు పాడించడం విశేషం. చాలా పాటలు హిందీ బాణీలను అనుసరించినప్పటికీ

‘నేడే ఈనాడే ” ఈ పాటను స్వతంత్రించి  మధు రంగా  స్వరపరచారు టి.వి.రాజు. ఇందులో

ఒక చరణంలో.

” మదిలో విరిసే మమతల మాలలు

 చెలిమికి కానుక చేసెదనూ

 ఆరని వలపుల హారతి వెలుగుల

 కలకాలం నిను కొలిచెదనూ” అని నాయిక తెలి యజేసిన విధానం కావ్య పరిభాషే.

       కృష్ణ,విజయనిర్మల నటించిన“టక్కరిదొంగ

చక్కనిచుక్క” కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కౌబాయ్ తరహా చిత్రం.ఇందులో కృష్ణ

ద్విపాత్రాభినయం చేశాడు. సత్యం మ్యుజికల్

హిట్ చేసిన ఈ సినిమాలో దాశరథి రాసిన

” కలలు గనే కమ్మని వయ్యారి” సినారె రాసిన

” నీ నడకలు చూస్తే మనసవుతుఃది ” పాటలు

క్లాస్ ను మాస్ ను అలరించాయి. .

కె.ఎస్.ఆర్.దాస్ 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా  నిల బెట్టడంతోపాటు తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా ను హిందీలో ” రాణి మేరా నామ్‌” పేరుతో పున ర్నించారు. రౌడీరాణిలో శ్రీశ్రీ రాసిన అంత ర్నాటక గేయం” మన దేశంలో ఉన్నారు మహానుభావులు” వస్తువు పరంగా ఎంతో విలువైంది. ఆ తరువాత కె.ఎస్‌.ఆర్.దాస్ దర్శకత్వంలో పద్మాలయా పతా కంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ‘మెక్‌న్నాస్ గోల్డ్’ చిత్రం ఆధారంగా రూపొందించిన ‘మోసగా ళ్లకు మోసగాడు’ దేశానికి మొట్ట మొదటికౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టిం చారు. దర్శకునిగా దాస్‌ కి, హీరోగా కృష్ణకు ఎనలేని కీర్తిని అందించటం.. వీరి కాంబినేషన్ ఓ స్పెషాలిటీగా పేరుపొందటం విశేషం. అనంతర కాలంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.  ఈ చిత్రానికి ఆరుద్ర కథ మాటలు పాటలు రాశారు. పాటలలో ప్రధానంగా

“కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే

కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే

పాట చెప్పుకోదగ్గది.

తొలివలపే మధురసము..

మన బతుకే పరవశము

పూలతోటలై నా అందాలు పూచేనులే

తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే..అని ఒక

చరణంలో

రాగబంధమై పెనవేసుకున్నానులే

మూగకోరిక నే తెలుసుకున్నానులే అని మరో చరణంలో రాశారు.ఆదినారాయణరావు

పాశ్చాత్యబాణీలతో  చక్కగా అందించి హిట్

చేశారు.తరువాత కెఎస్‌ఆర్ దాస్ –కృష్ణ  కాంబినేషన్‌లో పలు యాక్షన్ చిత్రాలు, దొంగలకు దొంగ, దొంగలకు సవాల్ వంటి కౌబాయ్ చిత్రాలు రూపొందాయి

1969లో ఐ ఎన్ మూర్తి దర్శకత్వంలో నిర్మించిన  –జగత్ కిలాడీలు. ఈ చిత్రానికి ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చారు. దేవులపల్లి కృ‌ష్ణశాస్త్రి రాసిన పాటలు “ఎగీరేపావురమా”  మరియు “వేళ చూస్తే సంజే వేళ ” పాటలు క్రైం సినిమాల పై గౌరవాన్ని పెంచేవిధంగా ఉన్నాయి.తరువాత తీసిన  జగత్ జెట్టీలు (1970), జగత్ జంత్రీలు (1971) చిత్రాలలోని పాటలు

కూడా ఎన్నదగినవే..చలం నిర్మించిన “బుల్లెమ్మ బుల్లోడు” లో ని పాటలన్నీ విలువలున్నవే.ముఖ్యంగా దాశరథి గారు రాసిన “అమ్మ అన్నది ఒక కమ్మని మాట” అమ్మ ఔన్నత్యాన్ని తెలియజేసింది. ఇందులో ” దేవుడే లేడను మనిషున్నాడు..అమ్మే లేదనువాడు అసలే లేడు” అన్న పంక్తి ఆక్షరలక్షల విలువ చేస్తుంది. ఇదే సినిమాలో రాజశ్రీ రాసిన ” కురిసింది వానా నాగుండెలోన నీ చూపులే జల్లుగా” పాట ఈనాటికి జనరంజకంగా నిలిచింది.

   హిందీ లో విజయవంతమైన ” ఇంత కామ్” సినిమాను వి.రామచంద్రారావు దర్శకత్వంలో శారద,హరనాథ్, లతో తీసిన “పగ‌బట్టిన పడుచు“చిత్రంలోని పాటలన్నిటిని సంగీత దర్శకుడు ఎం.రంగారావు మ్యూజికల్ హిట్ చేశారు.ఒక పాట మినహా మిగతాపాటలన్నీ హిందీ బాణీల ననుసరించి చేసినవే,కానీ సి.నా.రే.పాటలను‌ భావుకతతో రాశారు.ఈ సినిమాలో “రా రాదా“(ఆ జానే జా ఆ మేరాఏ హుస్న్ జవా– ఇంత కామ్ ) “ఏనీడలో ఏమున్నదో“(మెహఫిల్ సోయీ ..ఐసా కోయీ– ఇంతకామ్).  )

“ఏవో మౌనరాగాలు,ఏవో మధుర భావాలు” &

“చిరునవ్వు వెల ఎంత మరుమల్లె పూవంత “

యుగళగీతం సాహితీ పరిమళభరితాలు. జానకి పాడిన “ఓయబ్బో నిషాలో ఉన్నానని ఉలికిపడు తు ఉన్నావా” ( కైసె రహు చుప్ కె‌మైనే పీహె క్యా హై– ఇంతకామ్)  పాటను  శారద చిత్తుగా తాగి మత్తుగా అభినయిస్తుంది.

1971 లోనే కె.వి.నందనరావు దర్శకత్వంలో

యస్ వి ఆర్ టైటిల్ పాత్రగా తీసిన ‘రౌడీ రంగడు” చిత్రం లో “కనకమేడల ” కలం నుంచి వెలువడిన

“మౌనముగా కూకుండి చూసేవు..కొంటెతనమా‘

గీతం  పరిగణించదగ్గదే. సంగీతం. ,బి.గోపాలం సంగీతంలో  ఘంటసాల ఎంతో హుశారుగా పాడారు.

         జానపద చిత్ర దర్శక బ్రహ్మ బి.విఠలాచార్య నిర్మాతగా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తీసిన “సి.ఐ.డి.రాజు ‘ సిని మా లో డా.సి.నా.రె.రాసిన పాటలలో “నేనే లే ! పిలుపు నాదేలే !” మరియు  “మనసైన ఈనాటి రేయీ.” పాటలను ఎంతో ఆపాత మధురం గా స్వరపరచారు సత్యం.

1972 లో ఇన్స్ పెక్టర్ భార్యలోని “రాధను నేనైతే”  ,కిలాడి బుల్లోడు లోని “నిన్ను చూసీ ఈ లోకం చూస్తే అన్ని వైపులా అందాలే” మొదలైన పాటలలోభావచిత్రాలున్నవే..

ముఖ్యంగా సస్పెన్స్ చిత్రం  గూడుపు ఠాణి (1972)లో దాశరథి గారి “తనివి తీరలేదే పాట‘ సార్వకాలికమైన గీతం గా వర్ణించ బడింది. ” ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామె” వంటి అలంకారిక ఆభివ్యక్తి అలరిస్తుంది.

గిడుతూరి సూర్యం దర్శకత్వంలో  తీసిన ” పంజ రంలో పసిపాప‘(1973)క్రైం చిత్రం లో గోన విజయ రత్నం రాసిన ” కలం నుంచి వెలువడిన “ఓపచ్చని సంసారం మన చక్కని అనుబంధం” గీతాన్ని ఎస్.హన్మంత రావు హిందీ బాణి “ఓ నీలే‌గగన్ కే తలే“(మహేంద్ర కపూర్– హమ్ రాజ్)

ఆధారంగా స్వరపరచారు.ఇదే సిన్మాను హిందీలో ” హిమ్మత్

వాలి” పేరున డబ్బింగ్ చేయగా మన్నా డే , వాణీజయరాం తో “మస్తి లుఠాయే హమ్” అని పాడించటం విశేషం

1973-74 లో గుండెలు తీసిన మొనగాడు,నిప్పు

లాంటి మనిషి, (1975 )నుంచి క్రైం &యాక్షన్ చిత్రాల జోరు అకస్మాత్తుగా తగ్గింది .

కాంతారావు నిర్మించిన గుండెలు తీసిన మొనగాడు క్రైం థ్రిల్లర్ చిత్రం.. ఇందులో ” ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ” పాట( గానం: బాలు,రమోల ) మంచి మెలోడి పాట..

.1975 లో 66 సినిమాలు విడుదలకాగా ఎన్.టి.ఆర్ .నటించిన ‘ఎదురులేని మనిషి‘,చిత్రం మాత్రమే క్రైం చిత్రం. గా వచ్చింది.వైజయంతి మూ వీస్ వారి తొలి చిత్రమిది. హిందీ లో దేవానంద్ నటించిన “జానీ మేరా నామ్“చిత్రానికి రీ –మేక్ ఇది. అయితే ఈ చిత్రం తోనే  ద్వంద్వార్థం తో ధ్వనించే సాహిత్యం నుంచి సరాసరి అశ్లీలభావ  గీతాలకు నాందీ పలికిందని చెప్పాలి. ” కసిగా ఉంది కలువక కలువక కలిసినందుకు కస్సు మంటుంది” అని ఆత్రేయ కలం విజృంభించింది.అంతకు పూర్వం క్రైం చిత్రాలలో కేవలం హలం, జ్యోతిలక్ష్మి ,ప్రభృతులపై  డాన్స్ కోసం చిత్రించే  క్లబ్ సాంగ్స్ లో మాత్రమే‌ కాస్త‘మసాల ‘వుండేది.

ఎన్.టి.ఆర్ నటించిన ఎదురులేని మనిషి, చిత్రం లో హీరో హీరోయిన్ల  యుగళగీతాలను సైతం ద్వంద్వార్థాలతో  తో రాయడంతో ఇక ఆ తరువాత  వచ్చిన సినిమాలలో పచ్చి శృంగార గీతాల రచన అనివార్యమైనది. దాంతో ” చిలక

కొట్టుడు” పాటలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.1976 లో వచ్చిన ‘నేరం నాది కాదు ఆకలిది‘(హిం ది చిత్రం“రోఠి“) రీమేక్  లోని ” మంచిని సమాధి చేస్తారా ” వంటి పాటలు కథాపరంగా  కాస్త ఫరవాలేదని పించాయి.1976 లోనే హిందీలో విజయవంత మైన “ఫకీరా” చిత్రాన్ని తెలుగులో కృష్ణ జయప్రద లతో ‘దొంగలకు దొంగ” పేరిట పునర్ని ర్మిం చారు. ఇందులో “ఎవరేమన్ననూ తోడురాకున్న ను ఒంటరి గాను పోరా !” ఫకీరా చల్ చలా చల్“పాట బాణీని అను సరించి రాసినది.ఈ సినిమాలో నే దాశరథి రాసిన “ఈరాతిరి ..ఓ చందమామ ..ఎట్లా గడిచేది అయ్యో రామ” పాట, ఆరోజుల్లోమధుర గీతంగా రవళించింది.

1978 లో కేడీ నంబర్‌ వన్‌,ఏజెంట్‌ గోపి,, మొద లైన సినిమాలు వచ్చాయి. క్రైం చిత్రాలు ఎంత తెలుగు నాట ఎంత ప్రత్యేక గుర్తింపు పొందాయం టే చివరికి  కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు  సైతం ఈ ప్రభంజనంలో పడి శోభన్ బాబు ,జయసుధ లతో  తీసిన “కాలాంతకులు“(1978) చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.ఈ సినిమాలో ” కొండా కోన పిలిచింది, కొమ్మా రెమ్మా పిలిచింది” అనే యుగళ గీతం సాహితీ విలువలున్నదే!

     1979 సం లోనే కృష్ణ, రజనీకాంత్ నటించిన ‘ ‘ఇద్దరూ అసాధ్యులే సినిమా లోని “చినుకు చినుకు పడుతూవుంటే ” ప్రజాదరణ పొందిన వాన పాటలలో అగ్రగామిగా నిలిచింది.అలాగే  అన్నదమ్ముల సవాల్ ‘లోని నీరూపమే నామది” పాట చెప్పుకోదగ్గ మధురగీతం.

యస్.పి.బాలసుబ్రహ్మణ్యం  తొలిసారి సంగీతం అందించిన  చిత్రం‘కెప్టెన్ కృష్ణ(1979) సినిమా లోని “కల కాలం ఇలా సాగనీ… నీలో నన్నే చూడనీ” పాట మన మనసుల్ని తడిమి తడిపేసే‌ గీతం.ఈ పాట వింటే ఏదో సాంఘిక చిత్రంలోని ప్రణయ గీతమేమో నని అనుకొంటాం. కానీ ఈ పాట  కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించిన  సినిమా లోనిదంటే కాస్త ఆశ్చర్యం కలుగు తుంది.

1980 నుంచి ఎక్కువగా హిందీ లో హిట్ అయిన

డాన్, అమర్ అక్బర్ ఆంథోని మొదలగు చిత్రాల ను రీమేక్ తీశారు. కానీ తెలుగు చిత్రాలు మ్యూజి కల్ హిట్ కాలేక పోయాయి. కోడి రామకృష్ణ దర్శ కత్వం లో మెగా స్టార్ చిరంజీవి తొలిసారి గూఢ చారి పాత్ర పోషించిన  ” గూఢచారి నం 1 ‘ (1983)లో పాటలంతా విజయవంతం కాలేదు . 1984 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ‘ చిత్రం తో కథాంశంలో ఫాక్షనిజం మొదలైంది. సినిమాలలో  సిఐడి.డిటెక్టివ్ పాత్రలు విలన్ రహస్య స్థావరాలు  తగ్గిపోయాయి..సమరసింహారెడ్డి,ఇంద్ర, ఒక్కడు ప్రేమించుకొందాం రా! , మొదలైన సినిమాలు ఇందుకు ఉదాహరణలు.

                     నాడు క్రైం సినిమాలైనా పాటలు ఆపాత మధురంగా  ఆసక్తిగా ఉండేవి.నేడు భక్తి చిత్ర గీతాలలోను విలువల కోసం జల్లెడ పట్టాల్సి వస్తుంది. 

నిజానికి ఇదొక సిద్ధాంత వ్యాసానికి సంబంధించిన అంశం.

ప్రస్తుత వ్యాసం విహంగవీక్షణంగా పరిశీలించి రేఖామాత్రంగా స్ప్రశించిన వ్యాసం!

ఏది ఏమైనప్పటికి ఉత్తమ సాహిత్యాభిరుచి గల నిర్మాతలు ,దర్శకులుంటే  క్రైం ,జేమ్స్ బాండ్,డిటె

క్టివ్ సినిమా పాటలు సైతం ప్రజాదరణకు పాత్ర

మవుతాయన్నది అక్షరసత్యం..

                     ****0****

You may also like

Leave a Comment