శిలాలోలిత“అమరత్వం” కవితపై విశ్లేషణా వ్యాసం

శిలాలోలిత కలం పేరుతో తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ కవయిత్రి,తెలుగు భాషా ఉపన్యాసకురాలు,డాక్టర్ పి.లక్ష్మి గారు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో 1958 జులై 12న జన్మించారు.వీరి తల్లిదండ్రులు పి.మంగమణి,రాంరెడ్డి.వీరి తండ్రి పురిటిపాటి రాంరెడ్డి హిందీ ఉపాధ్యాయుడిగా హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.తండ్రి ఉద్యోగరీత్యా వీరి బాల్యం నింబోలిఅడ్డా,మలక్ పేట ప్రాంతాల్లో గడిచింది.వీరు ప్రాథమిక విద్యను శంషాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు.వీరు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1985లో ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం ద్వారా దూరవిద్యా విధానంలో రాజనీతి శాస్త్రంలో బి.ఏ. డిగ్రీ పొందారు.1987లో హైదరాబాద్ లోని కోఠీ ఉమెన్స్ కాలేజి నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందారు. 1988లో మాసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కళాశాలలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు.వీరు1989లో తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్ నుంచి ఎం.ఫిల్. పట్టా పొందారు.”కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు గారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. అనంతరం,హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సీతాకల్యాణి పర్యవేక్షణలో “కవయిత్రుల కవితా మార్గం” అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి, 1998లో పిహెచ్ డి పట్టా పొందారు. కవయిత్రి శిలాలోలిత గారి వివాహం కవి యాకూబ్ గారితో తేదీ మే 10,1991న జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు: 1.సందీప్ 2. సాహిర్ భారతి. కవయిత్రి శిలాలోలిత తెలుగు ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.అనంతరం తెలుగు భాషా ఉపన్యాసకురాలిగా సేవలందించి,2016లో పదవీ విరమణ చేశారు.ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోని చైతన్యపురిలో గల తమ స్వగృహంలో నివసిస్తున్నారు.వీరు హైస్కూలు చదువుతున్న రోజుల్లోనే సాహిత్య రచనకు బీజం పడింది.అప్పటి నుంచే కవిత్వం రాస్తున్నారు.అయితే,వీరి కవిత్వం తొలిసారిగా 1985లో “ఆంద్రజ్యోతి” దినపత్రికలో ప్రచురితమైంది.
కవయిత్రి శిలాలోలిత ప్రచురించిన పుస్తకాల వివరాలు

పరిశోధనా గ్రంధాలు:
1.“కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు” – పరిశోధనా గ్రంధం,1993.
2.“తెలుగు కవయిత్రుల కవితా మార్గం” – పరిశోధనా గ్రంధం, 2005.
కవితా సంపుటాలు:
* “పంజరాన్నీ నేనే, పక్షిని నేనే” కవితా సంపుటి,1999.
* “ఎంతెంత దూరం” – కవితా సంపుటి.2005.
* “గాజు నది” కవితా సంపుటి, 2013.
* “నేను ఇక్కడ భూమిని” – కవితా సంపుటి,2022.
* “ నారి సారించి” – వ్యాససంకలనం, 2006.
* “వర్తమాన లేఖ” – కవయిత్రులకు లేఖలు, 2018.
ఇంగ్లీష్ అనువాదం:
కవయిత్రి శిలాలోలిత గారి ఎంపిక చేసిన కవితలను “ The Inner Courtyard” పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీతారాణి గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.ఈ పుస్తకం అమెజాన్ బుక్స్ ద్వారా ఆన్ లైన్ ప్రచురణగా వెలువడింది.
ప్రశంసా గ్రంధం:
కవయిత్రి శిలాలోలిత కవిత్వంపై ప్రముఖ కవి సౌభాగ్య గారు “పరిణత కవయిత్రి శిలాలోలిత” పేరుతో ప్రశంసా గ్రంధాన్ని వెలువరించారు.
కవయిత్రి శిలాలోలిత గారు అందుకున్న పురస్కారాలు
1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం.
2. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం.
3. రమ్య భారతి పురస్కారం.
4. హృదయభారతి పురస్కారం
5. ద్వానా శాస్త్రి ఉత్తమ పరిశోధనా పురస్కారం.
6. గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉత్తమ కవితా పురస్కారం.
7. ఖమ్మం సాహితీ మాణిక్యం పురస్కారం.
8. వెంకటసుబ్బు పురస్కారం.
9. తోపుడు బండి స్ఫూర్తి పురస్కారం.
ఆకాశవాణి జాతీయ కవి
2008 సంవత్సరంలో తెలుగు భాష నుంచి “ఆకాశవాణి జాతీయ కవి” గా ఎన్నుకోబడి,భువనేశ్వర్ లో తన కవిత “లోగిలి బయట” ను వినిపించారు.
కవయిత్రి శిలాలోలిత గారు “విజేత”, “భూమిక”, “మానవి”, “ విశాలాక్షి ”, వంటి సాహిత్య పత్రికలతో పాటు “నెచ్చెలి” ఆన్ లైన్ పత్రికలో కాలమిస్టు గా నిరంతరం సృజనాత్మక రచనలు సాగిస్తున్నారు.వివిధ సాహిత్య ప్రక్రియల్లో తమదైన ముద్రను వేస్తూ,సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్నారు.
అనేక పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించిన కవయిత్రి,సాహిత్య సంపాదకత్వంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.స్త్రీవాద సాహిత్యానికి వేదికగా నిలిచిన “భూమిక” సాహిత్య పత్రికకు కొంతకాలం సహసంపాదకులుగా బాధ్యతలు నిర్వహించి,సాహిత్య రంగంలో తన సేవలను అందించారు.
కవయిత్రి శిలాలోలిత కలం నుంచి జాలువారిన “అమరత్వం”కవిత ఆధునిక కవిత్వ ధోరణులకు అద్దం పట్టే ఒక విశిష్టమైన రచన.మానవ జీవన సంఘర్షణను,ఆశావహ దృక్పథాన్ని, స్వేచ్ఛా కాంక్షను ఈ కవిత అత్యంత గాఢంగా,హృద్యంగా ఆవిష్కరించింది. ఈ కవితలో “అమరత్వం” అనేది భౌతిక మరణం లేకపోవడాన్ని సూచించే భావన కాదు ; ఒక ఆశయం ఎన్నటికీ అంతరించకుండా కొనసాగడం,చైతన్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం,మానవ సంకల్పం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే – అదే నిజమైన “అమరత్వం” అనే తాత్విక సత్యాన్ని కవయిత్రి ప్రతిపాదించారు. వ్యక్తి భౌతిక ఉనికి కాలగర్భంలో కలిసిపోయినా,వారి ఆశయం,ఆలోచనలు, పోరాట తత్వం సమాజంలో నిరంతరం ప్రభావాన్ని చూపుతూ సజీవ చైతన్యంగా నిలుస్తాయనే భావన ఈ కవితకు అంతర్లీన ప్రాణశక్తిగా నిలుస్తుంది.
ఈ తాత్విక భావనను వ్యక్తీకరించేందుకు ప్రకృతి దృశ్యాలను కేవలం వర్ణన వస్తువులుగా కాకుండా,మానవ జీవన అనుభవాలకు ప్రతీకలుగా మలచడంలో కవయిత్రి విశిష్టమైన శిల్పచాతుర్యాన్ని ప్రదర్శించారు.చీకటి నుంచి వెలుగు వైపు, బంధనం నుంచి స్వేచ్ఛ వైపు సాగే జీవన ప్రయాణాన్ని ప్రకృతి ప్రతీకలతో మేళవిస్తూ, మానవ అస్తిత్వంలోని సంఘర్షణను, మార్పు పట్ల ఉన్న ఆకాంక్షను కవయిత్రి సృజనాత్మకంగా ఆవిష్కరించారు. “అమరత్వం” అనే శీర్షికే కవితలోని ప్రధాన భావసారాన్ని ప్రతిబింబిస్తుంది.జీవితం ఒక వ్యక్తి భౌతిక ఉనికితోనే ముగిసిపోదు.మనిషి కలలు,ఆశలు,ఆశయాలు,పోరాటాలు, స్వేచ్ఛ కోసం సాగే నిరంతర ప్రయాణం కాలప్రవాహంలో కొనసాగుతూనే ఉంటాయి.ఈ నిరంతర చైతన్యమే మానవ జీవనానికి అసలైన సార్థకతను ప్రసాదిస్తుందని కవయిత్రి సూచించారు.
ఈ కవితలో జీవితం,స్వేచ్ఛ,ఆశ, చైతన్యం,కవిత్వం వంటి అనేక అంతర్లీన అంశాలు ప్రతీకాత్మక చిత్రాల ద్వారా వ్యక్తమయ్యాయి.ప్రకృతి దృశ్యాలను మానవ జీవనానుభవాలతో సమన్వయపరుస్తూ,బాధలు,నిరాశలు, బంధనాల నడుమ కూడా ఆశకు, చైతన్యానికి,విముక్తికి మార్గం ఉంటుందనే ఆశావాహ విశ్వాసాన్ని కవయిత్రి వ్యక్తం చేశారు.
కవితలోని ప్రతి పంక్తి ఒక భావచిత్రంగా రూపుదిద్దుకొని పాఠకుని అంతరంగంలో ప్రత్యేకమైన స్పందనను రేకెత్తిస్తుంది. అవి మానవ అంతరంగంలోని సంఘర్షణలకు ప్రతిబింబాలుగా నిలిచి, మనిషి సాగించే అంతరంగ ప్రయాణాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తాయి.ఈ విధంగా “అమరత్వం” కవిత వ్యక్తి జీవితం నుంచి విశ్వమానవ చైతన్యం వైపు విస్తరించే తాత్విక ప్రయాణంగా,ఆశయం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది.


1 comment
Nude hd model directoriesFrench old threesomeNude teen italian girl video freeGay alcoholics anonymous meetings athens georgiaWatch leighton meester fuckingApplewood centre for
adult learning mississaugaInitiation sexual xnxx Ararat australia gayTeen girls
drill team photo galleryClub anadi gayHottie usa milfBlack volcom bikiniCuckold black cockComo italy escorts https://xxxxvideos.cc/ Is craigslist sex for realNaked
male dwarfDiva sex tapeFree streaming big cockSex scene julia
stilesFree amateur mature interracial sexDisney adult toon videosWatersports bondageSpankwire porno download xnxx Free reliable pornAmateur blowjob swallow
hidden camera closetWomen watching masturbationPosters and prints clearance
framed art clearance vintageMoe vintage recessed lightPunishment sex pornHardcore gone bad redheadFuck ny
daughter