“బంజారా భీం జాటోతు దర్గ్యా నాయక్ (వీర కుటుంబం – ధీర చరితం) ” అనే పుస్తకాన్ని జిలుకర వెంకన్న 2017లో తీసుకువచ్చారు. ఈ పుస్తకం వ్యక్తి జీవితాన్ని నమోదు చేసిన సాధారణ జీవితచరిత్ర కాదిది. తెలంగాణ చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన బంజారా, లంబాడా ప్రజల పోరాట చరిత్రను తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన ప్రయత్నం. నిజాం నిరంకుశ పాలన, దొరలు – దేశ్‌ముఖ్‌ల భూస్వామ్య ఆధిపత్యం, వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లు, భూముల ఆక్రమణ, సామాజిక అవమానాలు వంటి అనేక రూపాల దోపిడీకి వ్యతిరేకంగా తండాల ప్రజలు సాగించిన ప్రతిఘటనకు జాటోతు కుటుంబం ఒక సజీవ ప్రతీక. జాటోతు దర్గ్యా నాయక్‌ను ఒక వ్యక్తిగా చూస్తే.. ఈ చరిత్ర యొక్క అసలు విస్తృతి మనకు కనిపించదు. ఆయన వెనుక ఒక కుటుంబం ఉంది. కుటుంబం వెనుక ఒక తండా, ఆ తండా వెనుక భూమి కోసం.. భుక్తి కోసం.. గౌరవం కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ఒక సమాజం ఉంది. ఆ సమాజం వెనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే మహత్తర ప్రజా చరిత్ర ఉంది. ఇది కాదనలేని చారిత్రక సత్యం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సాధారణంగా 1946 నుంచి 1951 వరకు జరిగిన మహత్తర ప్రజా ఉద్యమంగా గుర్తిస్తాం. ఏ చారిత్రక ఉద్యమమూ ఒక నిర్దిష్ట తేదీన అకస్మాత్తుగా పుట్టదు. దాని వెనుక సంవత్సరాలుగా పేరుకుపోయిన సామాజిక అసంతృప్తి ఉంటుంది. భూమిని కోల్పోయిన రైతు ఆవేదన, వెట్టిచాకిరీతో నలిగిన శ్రమజీవి ఆగ్రహం, దొరల గడీల ముందు అవమానించబడిన ప్రజల ఆత్మగౌరవం ఉంటుంది.

పంట పండించిన చేతులకు పంటపై హక్కు లేకపోవడం అనే అన్యాయం కూడా ఉంటుంది. ఈ అనుభవాలన్నీ ఒక దశలో సామూహిక ప్రతిఘటనగా, ఆ తర్వాత రాజకీయ పోరాటంగా, మరింత ముందుకెళితే సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంటాయి.జాటోతు కుటుంబ చరిత్రను ఈ విస్తృత నేపథ్యంతో చదివినప్పుడు దాని అసలు ప్రాధాన్యం తెలుస్తుంది. కమ్యూనిస్టు ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో బలపడటానికి ముందే తమ భూములపై హక్కు కోసం జాటోతు కుటుంబం, తండా ప్రజలు దొరలతో పోరాడినట్లు అందుబాటులో ఉన్న చారిత్రక కథనాలు సూచిస్తున్నాయి. ధర్మాపురం పడమటి తండాలో గిరిజనులకు చెందిన భూములపై భూస్వాముల కన్ను పడటం, వాటిని ఆక్రమించుకునే ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించడం, సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకోవడానికి నిరాకరించడం లాంటివన్నీ భూమి ప్రశ్న ఎంత తీవ్రమైనదో తెలియజేస్తాయి. భూమి వదులుకుంటే బువ్వ లేదు. బువ్వ లేకపోతే బతుకేదెట్లా? అనే జీవన సత్యమే చివరికి పోరాటానికి పునాది అయింది. ఈ పుస్తకం మన ముందుకు ఒక ప్రాథమిక ప్రశ్నను తీసుకొస్తుంది. భూమిని దున్నేది ఎవరు? దానిపై హక్కు ఎవరిది? పంటను పండించేది రైతైతే, ఆ భూమిని దొర తన సొత్తుగా ఎలా ప్రకటించగలిగాడు? తరతరాలుగా సాగు చేసుకుంటున్న తండాల ప్రజల భూమిని భూస్వామ్య శక్తులు ఎలా స్వాధీనం చేసుకున్నాయి? అధికార యంత్రాంగం ఎవరి పక్షాన నిలిచింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితేనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క సామాజిక మూలాలు అర్థమవుతాయి.బంజారా చరిత్రను చాలాసార్లు వెనుకబాటుతనం, పేదరికం, సంచార జీవితం, సామాజిక అంచుల వంటి అంశాలకే పరిమితం చేస్తారు. బంజారా సమాజ చరిత్రలో మరో శక్తివంతమైన ముఖం ఉంది. అది ప్రతిఘటన, తమ జీవనాధారాలపై దాడి జరిగినప్పుడు వారు మౌనంగా ఉండలేదు. తమ భూములపై దొరల కన్ను పడినప్పుడు ఎదిరించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. రజాకార్లు, పోలీసు బలగాలు, భూస్వాముల గుండాలు కలిసి దాడి చేసినప్పుడు కూడా తండాల ప్రజలు వెనుకడుగు వేయలేదు. అందువల్ల బంజారా ప్రజలను కేవలం బాధితులుగా చిత్రించే చరిత్రకు ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తుంది. వారిని బాధితులు మాత్రమే అనొద్దు, వారు ప్రతిఘటించిన ప్రజలు. వారు చరిత్రలో చోటు కోసం ఎదురు చూడలేదు. తమ రక్తంతో చరిత్రను నిర్మించారు.జాటోతు ఆమూ – మంగ్లీ దంపతుల ఆరుగురు కుమారులు జోద్య, సోమ్ల, సాంక్రు, దర్గ్యా, ఠాను, దాసు. ఉద్యమంలో పాల్గొన్నారనే వివరాలు ఈ కుటుంబ చరిత్రకు అసాధారణమైన ప్రాధాన్యాన్నిస్తాయి. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉద్యమంలో చేరడం సాధారణంగా కనిపించవచ్చు. ఒకే కుటుంబంలోని ఆరుగురు సోదరులు ఉద్యమం వైపు నిలబడటం ఒక సామాజిక ప్రకంపనకు సంకేతం. వారి జీవితం వ్యక్తిగత ధైర్యానికి మాత్రమే ఉదాహరణ కాదు. కుటుంబం మొత్తాన్ని కదిలించిన రాజకీయ చైతన్యానికి నిదర్శనం. ఠాను నాయక్, దర్గ్యా నాయక్‌లు దళకమాండర్లుగా పనిచేశారు. జాటోతు దర్గ్యా నాయక్ జీవితాన్ని ఈ కుటుంబ చరిత్రలో ప్రత్యేకంగా చూడాలి. కేవలం ఒక గెరిల్లా యోధుడు కాదు. ఒక దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తండా ప్రజల జీవనహక్కుల కోసం నిలిచిన పోరాట తరానికి ప్రతినిధి. దళకమాండర్‌గా ఆయన చేసిన సాహసాలు ప్రజల్లో ధైర్యాన్ని పెంచాయి. తుపాకీ ఎక్కుపెట్టడం, ఒడిసెలతో పోరాడడం వంటి శారీరక ధైర్యం ఒక కోణం మాత్రమే. దాని వెనుక ఉన్న అసలు బలం ప్రజలతో ఉన్న సంబంధం. ప్రజల సమస్యను తన సమస్యగా స్వీకరించగలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజమైన ప్రజా యోధుడిగా ఎదుగుతాడు.ఈ కుటుంబం ఎదుర్కొన్న దమనకాండ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం. దొరల గుండాలు, పోలీసులు, రజాకార్లు తండాలపై దాడులు చేయడం, ఇండ్లను తగులబెట్టడం, పంటలను దోచుకోవడం, కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేయడం వంటి సంఘటనలు కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులు కావు. అవి భూస్వామ్య ఆధిపత్యం తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించిన హింసాత్మక అధికార వ్యవస్థకు నిదర్శనాలు. గడీ అనేది కేవలం ఒక భవనం కాదు. అది భూమిపై అధికారం, ప్రజల శ్రమపై పట్టు, స్థానిక పాలనపై ఆధిపత్యం, పోలీసు – రాజకీయ రక్షణ, భయాన్ని ఆయుధంగా ఉపయోగించే వ్యవస్థకు ప్రతీక.జాటోతు సోమ్లా త్యాగం ఈ దమనకాండ యొక్క క్రూరత్వాన్ని బహిర్గతం చేస్తుంది. అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం.. విస్నూరు దేశ్‌ముఖ్ కుమారుడుబాబు దొర (జగన్ మోహన్ రెడ్డి) ముఠా జాటోతు కుటుంబంపై దాడి చేసి సోమ్లాతో పాటు మరికొందరిని పట్టుకొని, వారి చేతనే కట్టెలు తెప్పించి, చితి పేర్చి సజీవంగా దహనం చేసింది. తరువాత తండాలోని ఇళ్లను కూడా తగులబెట్టారు. ఈ సంఘటనను కేవలం వీరమరణ గాథగా చదవడం సరిపోదు. ఒక కుటుంబాన్ని, ఒక తండాను, ఒక ఉద్యమాన్ని భయపెట్టడానికి అధికార శక్తులు ఎంతటి హింసకు దిగజారాయో అర్థం చేసుకోవాలి.అదే సమయంలో ఈ దమనకాండ మరో విషయాన్ని కూడా నిరూపిస్తుంది. భయం సృష్టించడం ద్వారా ప్రజా ప్రతిఘటనను శాశ్వతంగా అణచివేయలేరు. తండా తగులబడవచ్చు. కానీ, ప్రతిఘటన తగులబడదు. ఇళ్లు కాలిపోవచ్చు. కానీ, భూమి కోసం పోరాడే సంకల్పం కాలిపోదు. ఒక యోధుడిని చంపవచ్చు. కానీ, అతని పోరాటం ప్రజల జ్ఞాపకాల్లో బతుకుతుంది. జాటోతు కుటుంబం చరిత్రలో ఇదే మనకు కనిపిస్తుంది.ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కేవలం “నిజాం వ్యతిరేక పోరాటం”గా నిర్వచించడం ఎంత అసంపూర్ణమో తెలుస్తుంది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేక పోరాటం దాని ఒక భాగం. దాని సామాజిక గుండెకాయలో భూమి ప్రశ్న ఉంది. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకత ఉంది. వెట్టిచాకిరీ విముక్తి ఉంది. పేద రైతు, వ్యవసాయ కూలీ, గిరిజన రైతు గౌరవం కోసం పోరాటం ఉంది. అందుచేత బంజారా తండాల పోరాటాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వెలుపల ఉన్న ఒక ప్రత్యేక గాథగా కాకుండా, ఆ మహత్తర ఉద్యమం యొక్క అంతర్భాగంగా చూడాలి.దర్గ్యా నాయక్‌తో పాటు ఆయన సోదరుడు ఠాను నాయక్ కూడా పోరాటంలో కీలక పాత్ర పోషించడం ఈ కుటుంబ చరిత్రను మరింత ప్రత్యేకం చేస్తుంది. ఠాను నాయక్ 1950 మార్చి 20న మొండ్రాయి సమీపంలోని నీలిబండ తండా వద్ద పోలీసులకు చిక్కి, దొరల గడిలో బంధించబడి, చిత్రహింసలకు గురై వీరమరణం పొందాడు. ఆ ఘటనకు ముందు ఆయన దళం భూస్వాములపై, పోలీసు క్యాంపులపై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఈ పోరాట చరిత్రలో దర్గ్యా నాయక్ సోదరుడిగా మాత్రమే కాదు, అదే కుటుంబం నుంచి వచ్చిన మరో దళ నాయకుడిగా నిలుస్తాడు.దర్గ్యా నాయక్ జీవితంలో మరో విశిష్టత ఏమిటంటే, ఆయన కేవలం గతాన్ని గుర్తు చేసే పేరు కాదు. పోరాట చరిత్రకు జీవించి ఉన్న సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి. 2024లో ఆయన మరణించే సమయానికి 107 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఆయన జాటోతు ఆమూ – మంగ్లీ దంపతుల కుమారుడు, రైతాంగ సాయుధ పోరాట అమరుడు ఠాను నాయక్‌కు తమ్ముడు, ఆరుగురు సోదరులలో ఉద్యమానంతరం మిగిలిన వ్యక్తి. అందువల్ల ఆయన జీవితం ఒక వ్యక్తి జీవితాన్ని మించి, ఒక శతాబ్దపు తెలంగాణ సామాజిక – రాజకీయ మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుంది.ఒక శతాబ్దం జీవించిన ఒక మనిషి జీవితంలో నిజాం పాలనను చూసిన బాల్యం ఉంటుంది. దొరల గడీలను చూసిన యౌవనం ఉంటుంది. రైతాంగ పోరాటాన్ని చూసిన రాజకీయ చైతన్యం ఉంటుంది. జైలు, నిర్బంధం, అణచివేతల జ్ఞాపకాలు ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతి భారతదేశాన్ని చూసిన అనుభవం ఉంది. గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులను చూసిన వృద్ధాప్యం ఉంది. అందువల్ల దర్గ్యా నాయక్ సాక్ష్యం ఒక వ్యక్తిగత జ్ఞాపకం కాదు. అది ఒక శతాబ్దపు సామాజిక పరివర్తనకు జీవ సాక్ష్యం.ఈ పుస్తకాన్ని మరింత లోతుగా చదవాలంటే మౌఖిక చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. తండాలోని వృద్ధులు, కుటుంబ సభ్యులు, ఉద్యమంలో పాల్గొన్న వారసులు, స్థానిక ప్రజలు చెప్పిన కథనాలు అధికారిక పత్రాల్లో కనిపించని చరిత్రను వెలుగులోకి తీసుకురాగలవు. అయితే మౌఖిక జ్ఞాపకాలను పత్రాధారాలతో పోల్చడం కూడా అంతే అవసరం. ప్రభుత్వ నివేదికలు, కోర్టు రికార్డులు, జైలు పత్రాలు, పాత వార్తాపత్రికలు, భూమి పత్రాలు, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన చారిత్రక పత్రాలు, ఇతర పోరాట యోధుల స్మృతులు వంటి ఆధారాలతో పోల్చినప్పుడు దర్గ్యా నాయక్ కుటుంబ చరిత్ర మరింత పటిష్టమైన ప్రజా చరిత్రగా రూపుదిద్దుకుంటుంది. ఈ కుటుంబ చరిత్రలో మహిళల పాత్రను మరింత వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పురుషులు దళాల్లో చేరి తుపాకులు పట్టిన కథలు మనకు ఎక్కువగా గుర్తుంటాయి. కానీ, తండాలో మిగిలిన మహిళలు ఉద్యమానికి ఆహారం, ఆశ్రయం, సమాచారం, రహస్య సంబంధాలు, కుటుంబ రక్షణ వంటి అనేక బాధ్యతలు నిర్వహించారు. రజాకార్లు, పోలీసులు, భూస్వాముల దాడులను ఎదుర్కొన్న మహిళల ధైర్యం కూడా రైతాంగ పోరాట చరిత్రలో సమాన స్థానం పొందాలి. ఒక “వీర కుటుంబం” చరిత్రను సంపూర్ణం చేయాలంటే పురుషుల వీరత్వంతో పాటు మహిళల మౌన శ్రమ, బాధ, ప్రతిఘటన, త్యాగాలను కూడా నమోదు చేయాలి.జాటోతు దర్గ్యా నాయక్ చరిత్రను వర్గ దృష్టితో చదివితే మరో లోతైన విషయం బయటపడుతుంది. బంజారా గుర్తింపు, రైతు జీవితం, భూమి ప్రశ్న, సామాజిక అణచివేత.. ఇవి విడివిడిగా ఉన్న సమస్యలు కావు. ఒకే మనిషి జీవితంలో ఇవన్నీ పరస్పరం ముడిపడి ఉంటాయి. ఈ పోరాటాన్ని కేవలం “గిరిజన సమస్య”గా చూడటం అసంపూర్ణం. అలాగే కేవలం “రైతు సమస్య”గా చూడటం కూడా సరిపోదు. భూమిని సాగు చేసిన బంజారా రైతు అనుభవంలో వర్గ దోపిడీతో పాటు సామాజిక అంచున నెట్టివేయబడిన అనుభవం కూడా ఉంది. ఈ రెండు పరిమాణాలను కలిపి చదివినప్పుడే జాటోతు దర్గ్యా నాయక్ చరిత్రకు పూర్తి రాజకీయ అర్థం వస్తుంది.ఈ పుస్తకం మన చరిత్ర రచనా విధానాన్నే ప్రశ్నిస్తుంది. చరిత్రను ఎవరు రాస్తారు? చరిత్రలో ఎవరి పేర్లు నిలుస్తాయి? గడీల్లో కూర్చున్న దొరల పేర్లు మాత్రమేనా? లేక ఆ గడీలను ఎదిరించిన తండా ప్రజల పేర్లు కూడా ఉండాలా? ప్రభుత్వ పత్రాల్లో నమోదైన కేసులు మాత్రమేనా? లేక ఆ కేసుల వెనుక ఉన్న ప్రజల బాధ, ప్రతిఘటన, ఆశయాలు కూడా చరిత్రలో భాగమా?జాటోతు దర్గ్యా నాయక్ కథ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. చరిత్రను కేవలం పాలకుల దృష్టితో రాయలేం. పొలాన్ని దున్నిన చేతుల నుంచి, తండాలో జీవించిన ప్రజల నుంచి, గడిని ఎదిరించిన యోధుల నుంచి, జైలులో సంవత్సరాలు గడిపిన ఖైదీల నుంచి, తమ కుటుంబ సభ్యులను పోరాటానికి పంపి త్యాగం చేసిన మహిళల నుంచి కూడా చరిత్రను రాయాలి.అందుకే “బంజారా భీం జాటోతు దర్గ్యా నాయక్ (వీర కుటుంబం – ధీర చరితం) ” ఒక జీవితచరిత్ర కంటే ఎక్కువ. అది ఒక కుటుంబ చరిత్ర. కుటుంబ చరిత్రను దాటి ఒక తండా చరిత్ర. తండా చరిత్రను దాటి ఒక బంజారా ప్రజా చరిత్ర. ఆ ప్రజా చరిత్రను దాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని ఒక మరుగునపడిన అధ్యాయం.జాటోతు దర్గ్యా నాయక్‌ను గుర్తుచేసుకోవడం అంటే కేవలం ఒక వృద్ధ యోధుడిని స్మరించడం కాదు. ఆయనతో పాటు నిలిచిన ఆరుగురు సోదరుల త్యాగాన్ని గుర్తుచేసుకోవడం. జాటోతు ఆమూ- మంగ్లీ కుటుంబం చూపిన ధైర్యాన్ని గుర్తుచేసుకోవడం. దొరల గడీలకు ఎదురొడ్డి తమ భూమిని తిరిగి దున్నిన తండా ప్రజల సంకల్పాన్ని గుర్తుచేసుకోవడం. సోమ్లా వంటి యోధుల అమరత్వాన్ని గుర్తుచేసుకోవడం. ఠాను నాయక్ వంటి దళ కమాండర్ల సాహసాన్ని గుర్తుచేసుకోవడం. మరీ ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన బంజారా ప్రజల సామూహిక చరిత్రను గుర్తుచేసుకోవడం.తండా తగులబడినా చరిత్ర తగలదు. గడి కూలిపోయినా ప్రజా జ్ఞాపకం కూలదు. యోధుడి శరీరం నేలలో కలిసినా అతని పోరాట ఆశయం ప్రజల్లో జీవిస్తుంది. అందుకే జాటోతు దర్గ్యా నాయక్ పేరు ఒక కుటుంబపు జ్ఞాపకంగా మాత్రమే కాకుండా తెలంగాణ నేలపై భూమి, భుక్తి, గౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడిన బంజారా ప్రజల సామూహిక చరిత్రలో నిలవాలి.చరిత్రను దొరల గడీల నుంచి మాత్రమే చదివితే దొరల పేర్లు కనిపిస్తాయి. తండాల గుడిసెల నుంచి చదివితే దర్గ్యా నాయక్ వంటి ప్రజా వీరుల పేర్లు వినిపిస్తాయి. అధికారపు పత్రాల నుంచి మాత్రమే చదివితే కేసులు, శిక్షలు, అరెస్టులు కనిపిస్తాయి. ప్రజల జ్ఞాపకాల నుంచి చదివితే ఆ శిక్షల వెనుక ఉన్న త్యాగం, ఆ అరెస్టుల వెనుక ఉన్న ఆశయం, ఆ రక్తం వెనుక ఉన్న భూమి ప్రశ్న కనిపిస్తుంది.జాటోతు దర్గ్యా నాయక్ చరిత్ర అందుకే గతాన్ని స్మరించే కథ కాదు. వర్తమానాన్ని ప్రశ్నించే చరిత్ర. భూమిని దున్నే చేతులకు భూమిపై హక్కు ఉందా? శ్రమించే మనిషికి గౌరవం ఉందా? అట్టడుగు ప్రజలకు రాజకీయ స్వరం ఉందా? చరిత్రలో వారికి సముచిత స్థానం దక్కిందా? అనే ప్రశ్నలను అది మన ముందుంచుతుంది.తండా నుంచి లేచిన ఆ స్వరం గడీల గోడలను దాటి చరిత్ర మధ్యలోకి రావాలి. జాటోతు దర్గ్యా నాయక్ పేరు ఒక వ్యక్తి పేరుగా మాత్రమే కాకుండా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం, సామాజిక గౌరవం కోసం పోరాడిన బంజారా ప్రజల సమిష్టి సంకల్పానికి ప్రతీకగా నిలవాలి. అదే ఈ గ్రంథం యొక్క చారిత్రక విలువ. అదే జాటోతు దర్గ్యా నాయక్ వీరత్వానికి నిజమైన నివాళి.-

2 comments
Porn overload tubeInternational escort servicesCerita eroticTila tequila in lingerieCortisol and sex
driveShape of breast cancer lumpsFree thumbs of
naked gay menTits that sagWoman fucking in stockingElephant tusk naked woman xnxx Hopper bottom companyAoki nudeAmateur
ass pictureSpanked by girlfriend momJuicy pregnant pussyFree sex in clubHe
fingering my wife’s ass https://xnxx4.cc/search/chinese Faye valentine interracialRenamo hentaiPennsylvania maturesA woman with 4 breastsKansas city nude girls picsFucking my wife’s best friend tubesMom has lesbain sex with young girlFree mobile teen pornTeen amateur cum compilation xnxx Porn twin torrentReplens
vaginal moisturizerSex appeal sells clothingPornstar cecilyFree nude
mature female pictureScrawny teenErotic fiction stories
bondage braces headgearFemdom wife slave husband storiesCollin farells
sex tapeVaginal ph test stripAdult adhd supoprt group nhInterracial house wifePic girls masturbates
Big nigger assVintage teen streamsProstitute fuckingBlack pussy lesabian freeBottom feeder
definitionCum drinking hoesHidden free gay webcamsGay partners
searchHerpes facial rash xnxx Teen bollywood actors sexyBingo vibratorLeslie
zen my first sex teacherGang bang di pagi rayaGirl catches guy
watching her masturbateThis is a stick up pornFree women’s erotic booksTanya danielle beach nudeSexy
monkey comment myspace https://xxxcams.cc/de Straight
men giving blowjob for moneyBritish sex crime gangMilf blowjob
14Free sex and violence videosSex old young trailersJett
black festive fuckingAnime xxx sailor moon2006 bikini
china miss xnxx Veronica graze nude picsSearch where can i
see women completely nakedUsing condom multiple orgasmsSex and triadBig boobs massageFree adult story and picMiddle east penis cut off photosHer
ass is on fireLesbian and bisexual group of bostonGay art
museumMaddox porn starSocial problems of lesbiansRaven riley anal beadsBodypainting fuckReeker bottomCousin sex
pornPornstar blog daisy marieBusty femdom strapon tgp mistress galleriesFree shemales sex picsCollege students fucking
teachers